సాక్షి, అమరావతి: ఏపీలో టీడీపీ రెడ్ బుక్ పాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అలాగే, లా అండ్ ఆర్డర్ కాదు నారా లోకేశ్ ఆర్డర్ కనిపిస్తోందని మండిపడ్డారు. వినుకొండ రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కాగా, వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో రషీద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అనిల్ కుమార్ యాదవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో..‘రషీద్ హత్య ఘటన మనసున్న ప్రతీ ఒక్కరికీ కలచివేస్తోంది. అంత కిరాతమైన దృశ్యాలు ఆ వీడియో కనపిస్తున్నాయి. రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
వినుకొండ టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ ఘటన.. మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది.అంత కిరాతకమైన దృశ్యాలు ఆ వీడియోలో కన్పిస్తున్నాయి. రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.
ఆంధ్ర ప్రదేశ్ ను అత్యాచార ప్రదేశ్…— Dr.Anil Kumar Yadav (@AKYOnline) July 18, 2024
ఆంధ్రప్రదేశ్‌ను అత్యాచారప్రదేశ్‌గా మార్చకండి. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోంది. ఏపీలో లా అండ్ ఆర్డర్ కనిపించడం లేదు. లోకేష్ ఆర్డర్ మాత్రమే కనిపిస్తోంది. నిన్నటి వినుకొండ వంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. వీటి అన్నింటిపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా దృష్టిపెట్టాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో ఆ ఒకటిన్నర నెలలో శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment