
సాక్షి, నెల్లూరు : నెల్లూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా విద్యుత్‌శాఖ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమించారు. మొన్నటి వరకు హోంమంత్రి మేకతోటి సుచరిత జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నారు. ఆమె స్థానంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌ను కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమించారు.