Balineni srinivas Reddy
-
జగన్ గురించి మాట్లాడే స్థాయి బాలినేనికి ఉందా?: చుండూరి రవిబాబు
-
వాసన్నా.. జగన్ ఇచ్చిన స్వేచ్చను ఓసారి గుర్తు తెచ్చుకోండి: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: సెకీతో ఒప్పందంపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రకటనలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాలినేని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదంటూ చెవిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం తిరుపతిలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘.. ఎమ్మెల్సీ పదవి కోసం బాలిరెడ్డి దిగజారిపోయారు. ఆరోపణలు మాని విద్యుత్ ఒప్పందాలపై వాస్తవాలు చెప్పాలి. బాలినేని సంతకంతోనే సెకి ఒప్పందం జరిగింది. కానీ, పార్టీ మెప్పు కోసమే బాలినేని అబద్ధాలు ఆడుతున్నారు. ఎవరినో మెప్పించడం కోసం బాలినేని నాయకుడిపై మాట్లాడుతున్నారు. .. వాసన్న మాటలు చూస్తే జాలి వేస్తుంది. సెకి తో ఒప్పందం పై గొప్పగా చెప్పాల్సింది పోయి.. రెండుసార్లు మంత్రిగా పనిచేశా.. రెండు సార్లు సంతకాలు చేశా.. ఫార్వర్డ్ చేశాను అని చెప్పడం బాధాకరం. పాలసీ గురించి మాట్లాడితే అదే మాట్లాడతాను. వ్యక్తిత్వ హననం చేసేందుకు మీరు ప్రయత్నిస్తే మేము వాస్తవాలు మాట్లాడతాం.. మీ నియోజకవర్గం కొండెపి కదా.. ఒంగోలు నుంచి ఎందుకు పోటీ చేశారు?. మీ నాయకుడు(పవన్ కల్యాణ్) పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకెళ్లారని, చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్లారని బాలినేనిని చెవిరెడ్డి ప్రశ్నించారు. ఒంగోలు ప్రజలతో నాకు అనుబంధం ఉంది. ఒంగోలు లో మీకంటే(బాలినేని) నాకు ఎక్కువ ఓట్లు వేశారు ప్రజలు. ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు లో 52 వేల ఓట్లు అదనంగా వచ్చాయి. ఒంగోలు ప్రజలుతో నాకు అనుబంధం ఏర్పడింది, అండగా నిలుస్తాం. నేను విద్యార్ధి దశ నుంచి వైఎస్ కుటుంబంతో ఉన్నాను. గత 36 సంవత్సరాలగా వైఎస్సార్ కుటుంబంతోనే ఉన్నాను. నేను ఏ పార్టీ మారలేదు. మరోజెండా పట్టుకోలేదు... వాసన్నా.. జగన్ ఇచ్చిన స్వేచ్చను బాలినేని ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీరు స్పెషల్ ఫ్లైట్‌లో విదేశాలకు ఇతర పార్టీలు నేతలతో రష్యా కు వెళ్లారు. కూటమి నేతలు ఇతర పార్టీ నాయకులతో స్పెషల్ ఫ్లైట్ లో డిల్లి కు వెళ్తే చంద్రబాబు దిగే లోపే పదవి ఊడగొడతారు. అయినా కూడా మీరు జగన్‌ను ఎన్నోసార్లు ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా జగన్ భరించారు. ఇప్పుడు కూటమితో జతకట్టి జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ ఎదుర్కొంటారని గుర్తుంచుకోండి. వాసన్నా.. మీకు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ ఏదో ఒకరోజు మీకు గుర్తుకు వస్తుంది’’ అని చెవిరెడ్డి అన్నారు. -
రాజకీయ స్వార్థంతోనే బాలినేని వ్యాఖ్యలు : చెవిరెడ్డి
సాక్షి,ప్రకాశం జిల్లా : విద్యుత్ కొనుగోలుకు ఒప్పందంపై జనసేన నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకితో జరిగిన ఒప్పందంపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. బాలినేని భ్రమలో ఉన్నారు. ఎమ్మెల్సీ కోసం రూ.9 కోట్లు కప్పం కట్టాడని ప్రచారం జరుగుతోంది. అబద్ధాలు ఎలా మాట్లాడాలో బాలినేనిని చూసి నేర్చుకోవాలి. సెకి ఒప్పందం రాష్ట్రానికి ప్రయోజనం. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.4.50కు ఒప్పందం జరిగితే.. వైఎస్సార్సీపీ హయాంలో రూ.2.48కే ఒప్పందం జరిగింది. గత టీడీపీ హయాంతో పోల్చుకుంటే 50 శాతం తక్కువే.రాజకీయ స్వార్థంతోనే బాలినేని వ్యాఖ్యలు. ఎనర్జి కమిటీ ఫైల్‌పై బాలినేని సంతకం పెట్టలేదా?.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బాలినేనికి ఉన్న స్వేచ్ఛ ఎవరికీ లేదు.బాబు అపాయింట్మెంట్ కోసమే బాలినేని ఇలా మాట్లాడుతున్నారేమో? బాలినేని మనస్తత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. -
మాకు కావాల్సింది మాక్ పోలింగ్ కాదు.. అవసరమైతే సుప్రీంకు వెళ్తా : బాలినేని
ప్రకాశం,సాక్షి: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల వెరిఫికేషన్ వేళ.. ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో తన రిట్ పిటిషన్ విచారణ జరుగుతుండగానే... అధికారులు రీ చెక్ చేస్తుండడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం.. అభ్యర్ధుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదే. హైర్టులో న్యాయం జరక్కపోతే సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈసీని ఫలితాల్ని రీ వెరిఫికేషన్ చేయాలని కోరినట్లు తెలిపారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. కేవలం మాక్ పోలింగ్ చేస్తుండడంతో అభ్యంతరం చెప్పామని అన్నారు. ఈవీఎంల్లో అవకతవకలు.. ఈసీకి బాలినేని ఫిర్యాదుసార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని 12 బూత్‌లలో ఈవీఎంల వెరిఫికేషన్, వీవీప్యాట్ల లెక్కింపు చేసి.. ఫలితాలతో సరిపోల్చాల్సిందిగా ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించేందుకు ఈసీ అధికారులు కేంద్రానికి తరలి వచ్చాయి. ఇవాళ రీ చెకింగ్ సందర్భంగా ఆయన తరపున ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్లు సైతం లెక్కపెట్టాలని ఎన్నికల అధికారుల్ని కోరారు. అయితే.. అలా కుదరదని అధికారులు చెప్పడంతో బాలినేని ప్రతినిధులు బయటకు వచ్చేశారు. దీంతో.. వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. -
ఒంగోలులో ప్రజాస్వామ్యం ఉందా? : బాలినేని
సాక్షి,ప్రకాశంజిల్లా: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజల్లో మంచి పెరు తెచ్చుకోవాలని, కొవ్వెక్కి మాట్లాడొద్దని హితవు పలికారు.‘ఎమ్మెల్యే ఉసిగొల్పితే..గుప్తా అనే వ్యక్తి చొక్కా విప్పి కొట్లాటకి దూకుతున్నాడు. ఎమ్మెల్యే నా కొవ్వు దించుతా అని మాట్లాడుతున్నాడు. ఆయన తన నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.చేతనైతే నిరూపించు. నేను తెగించి ఉన్నా.. దేనికైనా సిద్ధమే. ఒంగోలులో అసలు ప్రజాస్వామ్యం ఉందా. కొంతమంది చొక్కాలు విప్పి విర్రవీగుతున్నారు. నన్ను కావాలని ఇరిటేట్ చేస్తున్నారు. విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. ఎమ్మెల్యే అవాకులు చెవాకులు పేలుతున్నాడు. నాకు 1973లోనే కారు ఉంది. ఎమ్మెల్యే జనార్దన్ అధికార మదంతో ఉన్నాడు’అని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రశాంతంగా ఓటు వెయ్యండి మంచి చేసే వారికే ఓటు వెయ్యండి
-
టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్
-
మీ అమూల్యమైన ఓటుతో ఆయన్ను గెలిపించండి: దిల్ రాజు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియతో పాటుగా ఎన్నికల ప్రచారం కూడా పీక్స్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే సినిమా నటులు విశాల్, భాను చందర్, కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు వంటి స్టార్స్ అందరూ వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు తెలుపుతూ మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొనసాగుతారని చెప్పారు. ఏపీలో సీఎం జగన్ చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ వారందరు కూడా పలు వ్యాఖ్యలు చేశారు.టాలీవుడ్ దిగ్గజ నిర్మాతగా కొనసాగుతున్న 'దిల్ రాజు' తాజాగా ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా ఎన్నికలో బరిలో ఉన్న తన మిత్రుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డిని గెలిపించాలని కోరుతూ దిల్ రాజు ఇలా చెప్పుకొచ్చారు. 'బాలినేని శ్రీనివాసుల రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఎన్నో మంచి పనులు ఒంగోలు కోసం చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ గారి కేబినెట్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ నేతృత్వంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తూ ఇప్పటి వరకు ఐదుసార్లు ఒంగోలు నుంచి బాలినేని గెలిచారు. అనేక అభివృద్ధి పనులతో ఒంగోలు పట్టణాన్ని ముందంజలో ఉంచారు.ఇప్పుడు ఆరోసారి ఒంగోలు నుంచి ఎన్నికల బరిలో బాలినేని ఉన్నారు. ఆయన్ను తప్పకుండా అక్కడి ప్రజలు గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. కొద్దిరోజుల క్రితం బాలినేని శ్రీనివాసుల రెడ్డి గారి మీద ఒక డాక్యుమెంటరీని తీశాను. అందులో ఆయన రాజకీయ ప్రస్థానంతో పాటు ఒంగోలు కోసం ఆయన ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అందరూ తెలుసుకోవచ్చు. ఆ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ నందు అందుబాటులో ఉంది. మీ అమూల్యమైన ఓటు బాలినేని శ్రీనివాసులుకు వేస్తారని ప్రార్థిస్తున్నాను. అని ఆయన కోరారు. దిల్ రాజు మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది. Ace Producer #DilRaju Supports YCP ongole Mla Candidate #BalineniSrinivasReddy pic.twitter.com/d6mtAKZxHH— cinee worldd (@Cinee_Worldd) April 24, 2024 -
బాలినేని శ్రీనివాస్ రెడ్డి నామినేషన్
-
టీడీపీ నేత జనార్దన్ తీరుపై బాలినేని ఆగ్రహం
-
ఒంగోలులో సీఎం జగన్ పర్యటన..ఏర్పాట్లను పరిశీలించిన బాలినేని
-
ఎల్లో మీడియాకి బాలినేని మాస్ వార్నింగ్
-
వైఎస్ఆర్ సీపీ, జనసేన ఫ్లెక్సీల వివాదంపై మాజీ మంత్రి బాలినేని స్పందన
-
ఈనాడుపై పరువు నష్టం దావా వేస్తా: బాలినేని ఫైర్
సాక్షి, ప్రకాశం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి సీరియస్ అయ్యారు. పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తే సహించేంది లేదన్నారు. అసత్యాలు రాస్తున్న ఈనాడుపై పరువు నష్టం దావా వేస్తాను అంటూ ఫైరయ్యారు. కాగా, బాలినేని శ్రీనివాస్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మైత్రి మూవీస్‌లో నేను పెట్టుబడి పెట్టినట్టు పవన్ కల్యాణ్ నిరూపించగలరా?. మైత్రిలో పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా. నాపై ఆరోపణలు నిరూపించకుంటే మీ నేతలపై చర్యలు తీసుకుంటారా?. పవన్.. మీ పార్టీ నాయకులను అదుపులో పెట్టుకోకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కొంటారు. ఎవడో ఎక్కడో స్టేట్మెంట్ ఇస్తే ఇక్కడ ఈనాడు దుర్మార్గపు రాతలు రాస్తోంది. పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తే సహించేంది లేదన్నారు. అసత్యాలు రాస్తున్న ఈనాడుపై పరువు నష్టం దావా వేస్తాను అంటూ ఫైరయ్యారు. వీరసింహారెడ్డి ఆడియో ఫంక్షన్‌కి ఒంగోలులో పర్మిషన్ ఇప్పిస్తే ఆ సినిమాకి నేను పెట్టుబడి పెట్టానని ప్రచారం చేశారు. టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ రాజుపాలెంలో భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదా?. జనార్థన్ నీ బాగోతం మొత్తం నాకు తెలుసు. దాన్ని బయటపెడతాను అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. -
విశాఖ ఫారెస్ట్ భూముల వివాదంపై స్పందించిన మాజీమంత్రి బాలినేని వియ్యంకుడు
సాక్షి,ప్రకాశం: విశాఖ ఫారెస్ట్ భూముల వివాదంపై మాజీమంత్రి బాలినేని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి స్పందించారు. తాను 2004లో కొనుగోలు చేసిన అనంతరం లేఅవుట్‌కు అనుమతుల కోసం అప్లై చేయగా 2009లో అప్రోవుల్కు అనుమతులు వచ్చాయన్నారు. 2011లో నా కూతురుని బాలినేని కుమారుడికి ఇచ్చానని, అప్రోవల్ వచ్చేనాటికి బాలినేనికి తమకు ఎటువంటి బంధుత్వం లేదని స్పష్టం చేశారు. పోలిటికల్ సఫరర్స్ భూములను కొనుగోలు చేయవలసిన నీచమనస్థత్వం తమది కాదని, ఫారెస్ట్, పొలిటికల్ సఫరర్స్ భూములు ఆక్రమించారనే ఆరోపణలు అవాస్తవమని కొట్టి పారేశారు. దీనిపై ఎటువంటి విచారణకైన సిద్దమేనని చెప్పారు. తాను ఒక్క సెంట్ ఆక్రమించానని నిరూపించినా ఆ ల్యాండ్ మెత్తాన్ని ప్రభుత్వానికి రాసిస్తానన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బాలినేనితో రాజకీయ విభేదాలు ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలి.. అంతేకాని దానికి నా వ్యాపార ప్రాజెక్టులతో ముడిపెట్టడం మంచి పద్దతి కాదని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఇటువంటి ఆరోపణలు చేస్తే చట్టపరంగా తేల్చుకుంటానని స్పష్టం చేశారు. -
ముందే మాట్లాడుకుని పార్టీపై నిందలా?
నెల్లూరు (సెంట్రల్)/ఒంగోలు సబర్బన్: తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు ముందుగానే చంద్రబాబుతో మాట్లాడుకుని వైఎస్సార్సీపీపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నిందలు వేయడం సరికాదని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. టీడీపీ వాళ్లతో మాట్లాడకుండా ఉంటే.. 2024లో రూరల్ నుంచి టీడీపీ తరఫున పోటీచేస్తామని ఏ విధంగా చెప్పగలవని ప్రశ్నించారు. పార్టీ మారాలనుకుంటే వెళ్లవచ్చని, కానీ సొంత పార్టీపై నిందలు వేసి వెళ్లడం సరికాదని చెప్పారు. ఆయన మంగళవారం నెల్లూరులోను, ఒంగోలులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మూడురోజులుగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటున్నారని చెప్పారు. కానీ రుజువులు చూపడం లేదన్నారు. ఏ ఆధారం లేకుండా నిందలు వేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. మరో పార్టీ నాయకుడితో ఫోన్లో మాట్లాడుకుని, అది బయటకు రాగానే ఫోన్ ట్యాపింగ్ అంటారా? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తూ, మీడియాకు లీకులిస్తున్న కోటంరెడ్డి.. ట్యాపింగ్ జరుగుతోందని ఎప్పుడైనా సీఎం వైఎస్ జగన్‌కు చెప్పారా అని అడిగారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దయవల్ల రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. ఎవరు ఉన్నా లేకున్నా పార్టీ స్ట్రాంగ్‌గా ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీలో పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
నాడు కక్కుర్తి.. నేడు హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ పాలి‘ట్రిక్స్’
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య.. ఆ పార్టీ అధినేత దగ్గర నుంచి పార్టీ నాయకుల వరకూ ఒకటే తీరు. నాడేమో కాసుల కోసం కక్కుర్తి పడి..కావల్సిన వారికి కాంట్రాక్ట్ అప్పజెప్పి..పనులు వేగంగా జరుగుతున్నాయని ఆర్భాటంగా ప్రచారాలు చేసుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా వారి తీరు మారలేదు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. తాజాగా కొత్తపట్నం వంతెనపై క్షుద్ర రాజకీయానికి తెరతీశారు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్..బకింగ్‌హామ్ కెనాల్ సాక్షిగా ఆయన చేస్తున్న డ్రామా పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షి, ఒంగోలు: ఒంగోలు నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతలకు కడుపుమంట పుడుతోంది. అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. నాడు కమీషన్లకు కక్కుర్తిపడి సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి బకింగ్ హాం కెనాల్ బ్రిడ్జి కాంట్రాక్టు పనులు అప్పగించారు.. పనులు వేగంగా జరుగుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు... ఇతని రాజకీయ డ్రామాలు తెలుసుకున్న ప్రజలు 2019లో జరిగిన ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టారు.. దీంతో నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులను అడుగడుగునా అడ్డుకునే కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ప్రజలపై ఉన్న కోపమో, బాలినేనిపై అక్కసో తెలియదు గానీ పేదల ఇళ్లు దగ్గర నుంచి ఎన్నో పనులకు అడ్డుపడుతూనే ఉన్నారు. కరోనా కారణంగా సుమారు రెండేళ్లపాటు ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో జనార్దన్ హైదరాబాద్‌కు, బెంగళూరుకు పరిమితమయ్యారు తప్ప, వారి ఇబ్బందిని పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే సమయంలో ఎమ్మెల్యే బాలినేని మాత్రం నిత్యం ప్రజలతో ఉంటూ జీజీహెచ్‌లో వంద పడకలు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఆక్సిజన్, మందులు, భోజనం ఉచితంగా అందించడమే కాక, నగర ప్రజలందరికీ నిత్యవసర వస్తువులు అందిస్తూ వారితో మమేకమయ్యారు. దీన్ని జీర్ణించుకోలేక దామచర్ల జనార్దన్ అండ్ కో బాలినేనిపై ఎన్నో కుట్రలు, కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా నేడు ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులోని బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి వద్ద ధర్నా అంటూ మరో రాజకీయ డ్రామాకు తెరతీశారు. అసలు బ్రిడ్జి నిర్మాణం విషయానికొస్తే జనార్దన్ జేబులు నింపుకోవడానికే దీన్ని ఉపయోగించుకున్నారు తప్ప, ఏనాడు చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు లేవని కొత్తపట్నంతోపాటు, ఒంగోలు నియోజకవర్గ ప్రజలు మండి పడుతున్న పరిస్థితి. బ్రిడ్జి పనులు చేస్తున్నది తాను అప్పగించి.. తమ సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్ అయినప్పటికీ బాలినేనిపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ విఫలమయ్యారు. తాజాగా మరోసారి బ్రిడ్జి వద్ద ధర్నా అంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్ ప్రస్తుతం సైతం పనులు చేస్తున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టర్ వద్ద కమీషన్లకు దామచర్ల జనార్దన్ కక్కుర్తి పడ్డా..బాలినేని మాత్రం బ్రిడ్జి వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతూ వచ్చారు తప్ప, కాంట్రాక్టర్‌ను ఎక్కడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అయితే రాజకీయ కుట్రలో భాగంగా పనులు నత్తనడకన జరుగుతున్నాయని గ్రహించిన బాలినేని పనులు వేగవంతం చేయాలని, లేదంటే చర్యలు తప్పవంటూ కాంట్రాక్టర్‌ను హెచ్చరించడంతో అప్పటి నుంచి పనుల్లో వేగం పెరిగింది. దీన్ని గమనించిన జనార్దన్ త్వరలో పనులు పూర్తవుతాయని తెలుసుకుని రాజకీయ డ్రామాకు తెరతీశారు. బ్రిడ్జి వద్ద ఆందోళన చేపట్టి తన ఆందోళన కారణంగానే పనులు వేగవంతంగా జరుగుతున్నాయనే కలరింగ్ ఇచ్చుకునే కుయుక్తులకు పథక రచన చేస్తున్నారు. చదవండి: (పరిశ్రమలకు స్వర్గధామం ఆ జిల్లా.. మూడేళ్లలోనే రూ.300 కోట్లతో 990 పరిశ్రమలు) కరోనా కారణంగా సుమారు రెండేళ్లపాటు సక్రమంగా పనులు జరగలేదని తెలిసినా బ్రిడ్జిని రాజకీయంగా తన రాజకీయ డ్రామాకు వాడుకునే ప్రయత్నం చేస్తుండటంపై ప్రజలు సైతం ఛీ కొడుతున్నారు. సొంత పార్టీలో ఉన్న అసమ్మతిని పోగొట్టుకునేందుకు ఏవో ఉద్యమాలు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆపార్టీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తుండటం గమనార్హం. బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేసి ఈనెల 20వ తేదీన ట్రయల్‌రన్ నిర్వహించేందుకు ఆర్అండ్బీ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈనెల 20 తరువాత వాహనాల రాకపోకలను బ్రిడ్జిపై అనుమతించి చిన్న చిన్న పనులు మిగిలి ఉంటే వాటిని అతి త్వరలోనే పూర్తి చేస్తామంటూ అధికారులు చెబుతుండటం విశేషం. బ్రిడ్జి పనులు పూర్తయ్యే సమయంలో జనార్దన్ చేస్తున్న రాజకీయ డ్రామాలు ప్రజలందరికీ తెలుసని, చీప్ పాలిటిక్స్ చేస్తూ జనార్దన్ ప్రజల్లో మరింత చులకనవుతారని గుర్తించాలని పలువురు హెచ్చరిస్తున్నారు. కరోనాతో ఒంగోలు నియోజకవర్గ ప్రజలు అల్లాడుతున్నా వారి ప్రాణాలు పోతున్నా కనీసం స్పందించని జనార్దన్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నట్లు చూపించే కుయుక్తులకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి ఆటంకాలు కలిగించకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలని ప్రజలు హితవు పలుకుతున్నారు. కమీషన్లు దండుకొని రాజకీయ డ్రామాలా.. ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులోని బకింగ్‌హాం కెనాల్‌పై వంతెన నిర్మాణం విషయంలో కాంట్రాక్టర్ వద్ద మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు దామచర్ల జనార్దన్ కమీషన్లు దండుకొని రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారు. 2016లో మంజూరైన బ్రిడ్జి పనులు టీడీపీ ప్రభుత్వంలో మూడున్నర సంవత్సరాలపాటు కమీషన్ల కోసం కాలయాపన చేస్తూ నిర్మాణ పనులను నిర్వీర్యం చేశాడు. కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన నిధులతో ప్రారంభమైన పనులు, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమును రద్దు చేసిన సంగతి తెలిసి కూడా జనార్దన్ ప్రజలను మభ్యపెట్టే పనులు చేపట్టడం ఏదో సానుభూతి పొందాలని తప్ప ప్రజలకు మేలు చేద్దామని కాదు. నిర్మాణ పనులు పూర్తవుతున్న బ్రిడ్జి వద్దకు వెళ్లి ఏదో నిరసన వ్యక్తం చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. ఆయన హడావుడి చేసినందు వల్ల పనులు వేగంగా జరిగాయని బిల్డప్ ఇచ్చుకోవాలని చూస్తున్నాడు. అయితే నియోజకవర్గ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ట్రయల్ రన్ పూర్తి చేసి అనంతరం బ్రిడ్జిపై నుంచే వాహనాల రాకపోకలు కొనసాగిస్తాం. – బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే, ఒంగోలు -
టీడీపీ నేతలపై కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నేతలపై కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నేతల నిర్వాకం వల్లే 8 మంది అమాయకులు బలి అయ్యారని మండిపడ్డారు. ప్రచార ఆర్భాటంతో రోడ్డుపై ఫ్లెక్సీలు కట్టారు. టీడీపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టి ప్రమాదానికి కారణమయ్యారు. చేసింది తప్పని తెలుసుకోకుండా పిచ్చిప్రేలాపణలు చేస్తే జనం బుద్ధి చెబుతారని మహీధర్‌రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు బాధ్యత వహించాలి: డిప్యూటీ సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చితోనే 8 మంది చనిపోయారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. తక్కువ జనాన్ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. కందుకూరు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి' అని మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. కందుకూరు ఘటన బాధాకరం: బాలినేని చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఇరుకు సందులో సభ పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు ఘటనలో 8 మంది చనిపోవడం బాధాకరమైన విషయం అన్నారు. -
'ఆ కుటుంబం వద్ద రూ.5కోట్లు తీసుకున్న ఘనుడు దామచర్ల జనార్ధన్'
సాక్షి, ప్రకాశం: భూ ఆక్రమణలపై టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. రెండు కుటుంబాల మధ్య భూవివాదంలో ఓ కుటుంబం వద్ద రూ.5కోట్లు తీసుకున్న ఘనుడు దామచర్ల జనార్ధన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో రూ.5కోట్లు తీసుకోలేదని దామచర్ల ప్రమాణం చేయగలారా? అంటూ ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసి రూ.100కోట్లు కొట్టేసిన చరిత్ర ఆయనది అంటూ ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో దామచర్ల జనార్ధన్ అవినీతి బాగోతాలపై ఈడీకి ఫిర్యాదు చేస్తామని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. చదవండి: (కట్టుకథలు..విషపురాతలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ కథనాలు) -
సీఎం జగనే ప్రాణం పోశారు..
ఒంగోలు: కరోనా బాధితులకు వైద్యం చేస్తూ.. తానూ కరోనా బారినపడి మృత్యువు అంచుకు చేరిన ఓ వైద్యుడిని అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకుని ప్రాణం పోశారు. తనకు ప్రాణదానం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ వైద్యుడు కృతజ్ఞతలు చెబుతూ మళ్లీ విధులకు సిద్ధమయ్యాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తొలిసారిగా కారంచేడులో కరోనా కేసులు వెలుగుచూశాయి. ఆ సమయంలో కారంచేడు ప్రభుత్వ వైద్యశాల వైద్యుడిగా భాస్కర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య డాక్టర్ భాగ్యలక్ష్మి ఒంగోలు రిమ్స్‌లో రేడియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. తొలినాళ్లలో 2020 ఏప్రిల్ 24న భాస్కర్ కరోనా సోకింది. తొలుత ఆయన గుంటూరు జనరల్ ఆస్పత్రిలో, తర్వాత విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా తగ్గకపోవడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే రూ.50 లక్షల దాకా ఖర్చుచేశారు. సంపాదించిన డబ్బులతో పాటు అప్పు తెచ్చినా వైద్యానికి సరిపోలేదు. అపోలో వైద్యులు అతనికి ఊపిరితిత్తులు మార్పిడి చేయాలని, దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఆ సమయంలోనే రిమ్స్ ఒంగోలు రీజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి, ఒంగోలు క్యాన్సర్ హాస్పిటల్ ఆంకాలజీ వైద్యుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి సాయంతో అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి సాయం చేయాలని కోరారు. వైద్యుడి విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి బాలినేని తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఆ మేరకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించారు. దీంతో డాక్టర్ భాస్కర్ ఆరోగ్యం కుదుటపడింది. ఇటీవలే కోలుకున్నారు. డాక్టర్ దంపతులు ఆదివారం ఎమ్మెల్యే బాలినేనిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనకు పునర్జన్మ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కల్పించాలని డాక్టర్ భాస్కర్ కోరారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపాకవిధుల్లో చేరాలనుకుంటున్నట్లు చెప్పారు. దీనికి స్పందించిన బాలినేని.. సీఎంను కలిసే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. -
ఇంటింటా ఆనందం
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రతి ఇంటివద్ద ప్రజలు ఆనందంతో స్వాగతం చెబుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఆదివారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే తామంతా నడుస్తామని ప్రజాప్రతినిధులతో ప్రజలు చెప్పారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. -
ఒంగోలు జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు
ఒంగోలు అర్బన్: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో మెరుగైన వైద్య సేవలందిస్తామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వ వైద్య కళాశాలలో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధిసొసైటీ (హెచ్‌డీసీ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న బాలినేని మాట్లాడుతూ జీజీహెచ్‌లో కోవిడ్ అనంతరం ఓపీలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. రోగులకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి మందుల కొరత లేదని తెలిపారు. అయితే కొన్ని పత్రికలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, ఇది సరికాదని హితవు పలికారు. జీజీహెచ్‌లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందిస్తామన్నారు. పేదలకు వైద్యం అందించే జీజీహెచ్‌పై అసత్య ప్రచారాలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజలకు ఆసుపత్రిపై నమ్మకం కలిగేలా ఉన్నవి ఉన్నట్లు తెలియపచాలన్నారు. కోవిడ్ సమయంలో జీజీహెచ్ అందించిన వైద్య సేవలు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. కోవిడ్ సేవలు అభినందనీయమన్నారు. ఈ నెల 30వ తేదీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీతో ఒంగోలులో ప్రత్యేకంగా వైద్య శాఖపై సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. డిమాండ్ తగినట్లుగా వైద్య సేవలు: కలెక్టర్ జీజీహెచ్‌లో డిమాండ్‌కు తగినట్లుగా మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే బాలినేనితో కలిసి హెచ్‌డీఎస్ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రోగుల నమోదు నుంచి మందుల లభ్యత, రక్త నిల్వలు, వైద్య సిబ్బంది ఇతర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ ఉధృతి తగ్గినందున ఓపీలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. నెలకు రూ.12వేల నుంచి రూ.20వేల వరకు పెరిగాయన్నారు. నెలలో సుమారు 2 వేల మైనర్ ఆపరేషన్లు, 350 వరకు మేజర్ ఆపరేషన్లు జరగుతున్నాయన్నారు. హైరిస్క్ కేసులు మాత్రమే గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో మందుల కొరత లేదని, అవసరమైన మందులు 48 గంటల్లో సెంట్రల్ డ్రగ్‌స్టోర్ నుండి జీజీహెచ్‌కు అందుతున్నాయన్నారు. ఏవైనా కొన్ని మందులు అందుబాటులో లేకుంటే వాటిని హెచ్‌డీఎస్ నిధులతో ప్రైవేట్ కొనుగోలు చేసి రోగులకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. మందులు కాని రక్తం కాని రోగులకు భారం కాకుండా ఎటువంటి ఆర్థిక భారం లేకుండా పూర్తి స్థాయిలో వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వైద్యులను అనుమతి లేకుండా గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ రవి, ఓఎంసీ కమిషనర్ వెంకటేశ్వరరావు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ) భారీ విరాళాన్ని అందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం కంపెనీ ప్రతినిధులు కలిసి రూ.కోటి ఐదు లక్షల డీడీని అందించారు. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న సమర్థవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని ఈ సందర్భంగా జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఛైర్మన్ ఆర్.వీరమణి సీఎంకు వివరించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఆర్.గుణశేఖరన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రెవేట్ లిమిటెడ్ (జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ) రూ. 1,05,00,000 విరాళం. కోవిడ్ – 19 నివారణకు తీసుకున్న సమర్ధవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని సీఎంకి వివరించిన కంపెనీ చైర్మన్ ఆర్. వీరమణి. pic.twitter.com/V5kW0YADcc — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 16, 2022 చదవండి: (3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే: సీఎం జగన్) -
నిశ్చితార్థానికి హాజరైన వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు
సాక్షి, ప్రకాశం(చీమకుర్తి): వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు దుంపా రమణమ్మ కుమారుడు దుంపా ఇంద్రసేనారెడ్డి, దివ్యజ్యోతిల నిశ్చయ తాంబూలాల వేడుకను శనివారం ఒంగోలులోని విష్ణుప్రియ ఫంక్షన్ హాలులో వైభవంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి దంపతులు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, యువనేత బాలినేని ప్రణీత్‌రెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్లు ఇనగంటి పిచ్చిరెడ్డి, మారం వెంకారెడ్డి, పలు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ స్థానిక నాయకులు, జిల్లాలోని పలువురు అధికారులు హాజరై ఇంద్రసేనారెడ్డి, దివ్యజ్యోతి జంటను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: (డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో కల్వర్టును ఢీకొన్న కారు.. వరుడు సహా..) -
మాజీ మంత్రి బాలినేని మచ్చలేని నాయకుడు: శ్రీధర్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు: ప్రకాశం జిల్లాలో మాజీమంత్రి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి మచ్చలేని నాయకుడిగా చలామణి అవుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీకి పర్యాయ పదం బాలినేని అని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్టపాలు చేస్తే మంత్రి పదవిని సైతం త్యజించి, వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారని వివరించారు. నైతిక విలువలతో కూడిన రాజకీయం చేశారని, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొందరు వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ, జనసేన పార్టీల నాయకులు అనైతిక ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రీజనల్ కో–ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా సొంత పార్టీ నేతులు ఎవరూ ప్రయత్నించకూడదని హితవు పలికారు. మాజీమంత్రి బాలినేని ఎదుర్కొంటున్న సమస్యలను తాను కూడా చవిచూస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: (YSRCP Plenary 2022: కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు) వైఎస్సార్సీపీ పెట్టక మునుపు నుంచి పార్టీ కోసం కష్టం చేసిన వ్యక్తుల్లో తాను ఒక్కడేనని వివరించారు. మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచి సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడాలనే తపన ఉండాలని, కానీ కొంత మంది ముఖ్య నేతలు రూరల్ నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని నేతలు తనను బలహీన పర్చాలని చూస్తున్నారని వెల్లడించారు. రూరల్ ప్రజానీకం, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ బలహీన పర్చలేరని స్పష్టం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్‌ను తాను ఒకప్పటి రాజకీయ సహచరుడిగానే చూస్తున్నానని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ ప్రత్యర్థిగా, రాజకీయ పోటీదారుడిగా చూడలేదని వివరించారు. చదవండి: (మా నాయకుడన్న ఆ మాటకు మేమంతా కట్టుబడి ఉన్నాం: కొడాలి నాని) -
ఆ కుటుంబానికి రాజకీయాల్లో ఎలాంటి మచ్చలేదు: బాలినేని
సాక్షి, నెల్లూరు: మేకపాటి కుటుంబానికి రాజకీయాల్లో ఎలాంటి మచ్చ లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆ కుటుంబం ఎంతో కృషి చేసిందన్నారు. ఈ మేరకు బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మకూరు అభ్యర్థి ఎంపికకు సంబంధించి రాజమోహన్‌రెడ్డి నిర్ణయానికి సీఎం జగన్ వదిలేశారు. లక్ష ఓట్ల మెజారిటీ తీసుకువచ్చి గౌతమ్‌కు ఘనమైన నివాళి ఇస్తాము. రెండేళ్లు మరింత కృషి చేసి 2024 ఎన్నికల్లో మరింత మెజారిటీ సాధిస్తామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కాగా, జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. చదవండి: (ఆత్మకూరు ఉప ఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన విక్రమ్‌రెడ్డి) -
జనసేనకు ఝలక్.. వైఎస్సార్సీపీలో చేరిన మాదాసు గంగాధరం
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): ‘చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకూలంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఇది నిజం కాదని ఒక్కమాట చెబితే ప్రకటన ఇద్దామని తాను గతంలో పవన్‌కు ఎన్నిసార్లు సూచించినా కనీసం పట్టించుకోలేదు.’ అని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మాజీ చైర్మన్ గంగాధరం అన్నారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో మాదాసు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును పట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప, తనకు తానుగా ఏమి చేసుకోలేరని విమర్శించారు. ఆయన్ను నమ్ముకుని కొంతమంది ఉద్యోగాలను కూడా వదులుకుని బయటకు వచ్చారన్నారు. కానీ వారిని నట్టేట ముంచాడన్నారు. నాదెండ్ల మనోహర్ కూడా పవన్‌ను తప్పదోవ పట్టించేలా మాట్లాడుతూ బాస్‌కు జనం వస్తున్నారులే, గ్రామస్థాయిలో అవసరం లేదనే విధంగా చెప్పుకొచ్చేవారని గుర్తుచేశారు. పార్టీని బలోపేతం చేద్దామని గతంలో పవన్‌కు సూచించినా కనీసం పట్టించుకోలేదన్నారు. కొంతమంది రాసిన వాటిని పట్టుకుని ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తూ బురదజల్లే ప్రయత్నాలు పవన్ చేయడం తనకు నచ్చలేదన్నారు. అందుకే కొద్దినెలలుగా జనసేనకి దూరంగా ఉంటున్నానని చెప్పారు. సీఎం ఆదేశాల ప్రకారం నడుచుకుంటా బాలినేని, పెద్దిరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గతంలోనే తనను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారని మాదాసు తెలిపారు. ఇప్పటికే తన కుమారుడు మాదాసు పవన్ వైఎస్సార్సీపీలో ఉన్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు ఏ బాధ్యత అప్పగించినా, ఏ పదవి ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానన్నారు. చదవండి: (నారాయణ చరిత్ర: ట్యూషన్ మాస్టర్‌గా మొదలై..) -
రేపల్లె ఘటన బాధితురాల్ని పరామర్శించిన మంత్రి సురేష్, బాలినేని
సాక్షి, ఒంగోలు: రేపల్లెలో మహిళపై అత్యాచారం దురదృష్టకర ఘటన అని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్‌లో బుధవారం వారు బాధితురాలిని పరామర్శించారు. టీడీపీ నేతలు తమాషాలు చేస్తే చర్యకు ప్రతి చర్య ఉంటుందని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రతిపక్షాలు ఇలాంటి ఘటనల్లోనూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడటం తగదన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. బాధితురాల్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్, టీజేఆర్ సుధాకర్ బాబు ఉన్నారు. చదవండి: (ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు: మంత్రి కాకాణి) -
నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఒంగోలు పర్యటనలో భాగంగా నూతన దంపతులను ఆశీర్వదించారు. మధ్యాహ్నం 1.20 గంటలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం సభ ముగిసిన అనంతరం సీఎం నేరుగా స్థానిక బందరు రోడ్డులోని రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ నివాసానికి చేరుకున్నారు. రవిశంకర్, ప్రియదర్శిని, వారి కుమారుడు సాయినాథ్‌లు సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. నూతన దంపతులు కంది విష్ణుమోహన్, స్నేహలను సీఎం ఆశీర్వదించారు. రవిశంకర్ కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. స్నేహ తల్లిదండ్రులైన బొత్స లక్ష్మణ్‌రావు, కన్నమ్మదేవిలను, మంత్రి బొత్స సత్యన్నారాయణను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మున్సిపల్ శాఖామంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, పోతుల సునీత, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, మద్దిశెట్టి వేణుగోపాల్, అన్నా వెంకట రాంబాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, కె.నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబూరావు, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బాచిన చెంచుగరటయ్య, శాప్‌నెట్ చైర్మన్ బాచిన కృష్ణచైతన్య, బాలినేని ప్రణీత్‌రెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత, ప్రముఖ వ్యాపార వేత్త శిద్దా హనుమంతరావు తదితరులు పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు. అక్కడ నుంచి బయల్దేరి 1.53 గంటలకు హెలిపాడ్‌కు చేరుకున్నారు. 1.59 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు నుంచి తాడేపల్లికి హెలికాప్టర్లో బయల్దేరి వెళ్లారు. చదవండి: (Jeevitha Rajasekhar: సినీ నటి జీవితకు అరెస్ట్ వారెంట్) -
బాలినేని కుమారుడి గిఫ్ట్‌కు సీఎం జగన్ ఫిదా
సాక్షి, ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలులో మూడో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ నిధులను విడుదల చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కొడుకు ప్రణీత్ రెడ్డి సీఎం జగన్‌కు దూసుకెళ్తున్న బుల్(ప్రభుత్వం అభివృద్దిలో దూసుకుపోతోంది అన్నట్టుగా)ను బహుమతిగా అందజేశారు. ఈ బహుమతికి సీఎం జగన్ ఫిదా అయ్యారు. కాగా, అంతకుముందు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ మహిళల పక్షపాతి.. అన్నింటా మహిళలే ప్రధానం అని భావిస్తారు. మేనిఫెస్ట్‌లో ఇచ్చిన వాగ్ధానాలను 90 శాతం వరకు సీఎం జగన్ నెరవేర్చారు. సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. ఇది చదవండి: దుష్టచతుష్టయం కడుపు మంటతో ఉంది: సీఎం జగన్ -
వాసన్న చొరవ.. నాలుగేళ్ల నిరీక్షణకు తెర..!
సాక్షి, ఒంగోలు: రేయింబవళ్లు కష్టపడి చదివి సాధించిన ఉద్యోగం ఓ చిన్న సాంకేతిక కారణంతో ఆ యువతికి అందకుండా పోయింది. కోర్టు ఆదేశించినా అధికారులు పోస్టు మంజూరు చేయలేదు. ఈ క్రమంలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ప్రత్యేక చొరవ తీసుకొని పోస్టు మంజూరు చేయించడంతో ఆ యువతి ఉద్యోగంలో చేరింది. వివరాల్లోకి వెళితే..జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామం యానాది సామాజిక వర్గానికి చెందిన పొట్లూరి హనుమంతరావు, లలితమ్మలకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మాయి అంజలి డీఈడీ పూర్తి చేసిం 2018లో డీఎస్సీ రాయగా మంచి మార్కులతో 3726 ర్యాంకు సాధించింది. ఈ డీఎస్సీలో ఎస్టీ యానాది ఉప కులానికి 8 తెలుగు మీడియం పోస్టులను కేటాయించారు. ఈ క్రమంలో 2020లో డీఎస్పీ 2018 పోస్టులకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలంటూ విద్యాశాఖ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మెసేజ్‌లు పంపింది. అయితే ఫోన్ ప్రాబ్లం కారణంగా ఆ సమాచారాన్ని అంజలి అందుకోలేకపోయింది. దీంతో ఈమె కంటే ఎక్కువ ర్యాంకులు వచ్చిన అదే సామాజికవర్గానికి చెందిన మరో ఇద్దరు మహిళలు ఉద్యోగాలు సాధించారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న అంజలి అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. చదవండి👉🏾: (మంచి విజన్ ఉన్న యువ సీఎం జగన్: కుమార మంగళం బిర్లా) పూర్వాపరాలను పరిశీలించిన డివిజన్ బెంచ్ అంజలికి పోస్టు కేటాయించాలని, ఒకవేళ పోస్టు ఏదీ ఖాళీగా లేకపోతే సూపర్‌న్యూమరీ పోస్టు అయినా కేటాయించాలంటూ పాఠశాల విద్యాశాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే పాతికేళ్ల క్రితమే సూపర్ న్యూమరీ పోస్టులకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. దీంతో ఆమె విషయాన్ని పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి అభ్యర్థించింది. బాలినేని ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రికి స్వయంగా లేఖ రాసి పర్యవేక్షించారు. దీంతో అంజలికి గత నెల 10న సూపర్ న్యూమరీ పోస్టు మంజూరైంది. ఆమెకు గుడ్లూరు మండలం చేవూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పోస్టు కేటాయిస్తూ ఉత్తర్వులు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి.జగన్నాథరావు ఉత్తర్వులు జారీ చేశారు. తన ఉద్యోగం పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని పోస్టు మంజూరు చేయించిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. -
ఒంగోలు ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: సీఎం కాన్వాయ్ కోసమంటూ తిరుమలకు వెళ్తున్న భక్తుల కారును బలవంతంగా స్వాధీనం (సీజ్) చేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఒంగోలు అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ అడుసుమల్లి సంధ్య, హోంగార్డు పి.తిరుపాల్ రెడ్డి ఇందుకు బాధ్యులుగా నిర్ధారించి, వారిపై చర్యలు తీసుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ కుటుంబం ప్రైవేటు ట్రావెల్స్ కారులో తిరుమలకు బయల్దేరింది. బుధవారం రాత్రి టిఫిన్ కోసం ఒంగోలులో ఆగారు. అక్కడికి వచ్చిన ఒంగోలు రవాణా శాఖ అధికారులు సీఎం కాన్వాయ్ కోసమంటూ వారి కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాంతో రవాణా శాఖ ఉన్నతాధికారులు గురువారం ఉదయం ఈ ఉదంతంపై విచారించారు. ఒంగోలు అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ అడుసుమల్లి సంధ్య, హోంగార్డు పి.తిరుపాల్‌రెడ్డి ఇందుకు బాధ్యులుగా నిర్ధారించారు. అసిస్టెంట్ ఎంవీఐని సస్పెండ్ చేస్తూ రవాణా శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డు తిరుపాల్ రెడ్డిని పోలీసు శాఖకు సరెండ్ చేసి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘తిరుమల వెళ్తున్న భక్తులపట్ల ఒంగోలు రవాణా శాఖ అధికారులు వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణిస్తున్నాం. సీఎం కాన్వాయ్ కోసమని ప్రైవేటు వాహనాలు తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు. ఒంగోలు అసిస్టెంట్ ఎంవీఐ అడుసుమల్లి సంధ్య, హోంగార్డు వ్యవహరించిన తీరు ఏమాత్రం సరికాదు. భక్తులకు ఇబ్బంది కలిగించిన ఉదంతంలో వారిద్దరూ బాధ్యులని విచారణలో వెల్లడైంది. వారిపై చర్యలు తీసుకున్నాం’ అని రవాణా శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నాం : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు: తిరుమలకు వెళ్తున్న భక్తుల కారును స్వాధీనం చేసుకోవడం దురదృష్టకర ఘటన అని, ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నామని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం సభా వేదిక, ఏబీయం కాలేజీ ఆవరణలో హెలిపాడ్ వద్ద ఏర్పాట్లను మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాంతో కలిసి బాలినేని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని అధికారులను ఆదేశించామన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. -
ప్రతి గ్రామానికీ గుడి, బడి, ఆసుపత్రి అవసరం: ఆర్.నారాయణమూర్తి
సాక్షి, కాకినాడ సిటీ: ప్రతి గ్రామానికీ గుడి, బడి, ఆసుపత్రి అవసరమని సినీ నటుడు, దర్శక నిర్మా త ఆర్.నారాయణమూర్తి అన్నారు. స్వస్థలమైన రౌతులపూడి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన శివాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఊరిలో గుడి ఉంటే మనిషి పాపభీతితో తప్పులు చేయకుండా ఉంటాడని, బడి ఉంటే చదువు ద్వారా జ్ఞానం, వికా సం వస్తాయని చెప్పారు. ఆసుపత్రి ఉంటే అనారోగ్య సమస్య వచ్చినవారు కుదుట పడతారన్నారు. శివాలయం పునఃప్రతిష్ఠకు వేలాదిగా ఊరి జనంతో పాటు చుట్టుపక్కల ప్రజలు, భక్తులు తరలిరావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. శివాలయం పునర్నిర్మాణం అంశాన్ని ఆలయ కమిటీ తన దృష్టికి తీసుకు రాగా.. గత ప్రభుత్వంలో దేవదాయ శాఖ ఆధ్వర్యాన రూ.55 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మాజీ అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజస్తంభం ఏర్పాటుకు తన శాఖ నుంచి ఎటువంటి అడ్డంకులూ లేకుండా అనుమతులు ఇచ్చారని చెప్పారు. గ్రామ పెద్దలు పైలా సాంబశివ, అరిగర్ల రామకృష్ణ, ఈరంకి ప్రభాకరరావు, యిటంశెట్టి భాస్కరరావు, వాసిరెడ్డి కృష్ణమూర్తి, నాగబాబు, ఊరిలోని ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు చందాలు ఇచ్చి ఆలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించారని నారాయణమూర్తి కొనియాడారు. చదవండి: (24 గంటలలోపే.. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు) -
Balineni Srinivas Reddy: జగనన్న మాటే.. వాసన్న బాట
తమ అభిమాన నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర మంత్రిమండలిలో చోటు దక్కకపోవడంతో జిల్లాలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. బాలినేని వారిస్తున్నా.. ప్రకాశం జిల్లాతోపాటు, బాపట్ల జిల్లా పరిధిలోని పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గం పలువురు నేతలు పదవులను త్యజించేందుకు సిద్ధమయ్యారు. ‘‘పదవులు ముఖ్యం కాదు..అధినేత మాటే శిరోధార్యం..జిల్లాలో పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు పాటు పడదాం..’’ అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఆయన సీఎంతో భేటీ అయిన తర్వాత క్యాడర్‌కు సర్ది చెప్పారు. 'సాక్షి, ఒంగోలు: ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టున్న జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. నాయకులు, క్యాడర్ అహర్నిశలు పార్టీ అభ్యున్నతికి పాటు పడ్డారు. సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ అన్నింటా పార్టీ సత్తాచాటింది. జెడ్పీ ఎన్నికల్లో అయితే ప్రతిపక్షాలకు ఒక్కటంటే ఒక్కస్థానం కూడా లేకుండా పోయింది. ఇంత కీలకంగా ఉన్న జిల్లా నుంచి జగన్మోహన్రెడ్డి తొలి మంత్రి మండలిలో బాలినేని శ్రీనివాసరెడ్డి చోటు దక్కించుకున్నారు. మంత్రిగా జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారు. ఎన్నో కీలక ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు కృషిచేశారు. మరో వైపు పార్టీ పటిష్టానికి సైతం తన వంతు కృషి చేశారు. అందరికీ అందుబాటులో ఉంటూ వచ్చారు. బాలినేనికి రెండో విడత రాష్ట్ర క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఖాయమని అభిమానులంతా భావించారు. అయితే సామాజిక సర్దుబాటుల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని నేతలు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. బాలినేని వారిస్తున్నా వినకుండా తమ పదవులకు రాజీనామా చేసేందుకు ముందుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో రాస్తారోకోలు చేశారు. పార్టీ అధినాయకులు బాలినేనితో దఫ..దఫాలుగా చర్చలు జరుపుతున్న సమయంలో వీరు మరింత ఆందోళనకు గురయ్యారు. చలో విజయవాడ అంటూ పరుగుపెట్టారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కరణం బలరామకృష్ణమూర్తి, నాగార్జునరెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరెడ్డి, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య, శాప్‌నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య, ఇతర కీలక నేతలు విజయవాడలో బాలినేనిని కలిశారు. సుదీర్ఘ చర్చలు జరిపారు. చదవండి: (పదవి పోయినందుకు ఎలాంటి బాధ లేదు..) అంతా టీ కప్పులో తుపానులా.. అయితే ఇదంతా టీ కప్పులో తుపానులా అంతా సర్దుమణిగిపోయింది. సోమవారం సాయంత్రం సీఎం జగన్మోహన్రెడ్డితో బాలినేని సుదీర్ఘ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, అధినేత ఆదేశాలే శిరోధార్యమన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ క్యాడర్ సంయమనం పాటించాలంటూ పిలుపునిచ్చారు. ‘‘అభిమాన నేత అనగానే ఎవరికైనా సహజంగానే భావోద్వేగాలు ఉంటుంటాయి. ఆ కోణంలోనుంచే తమలో ఆందోళన నెలకొందని, అంతే తప్ప తాము పార్టీకి వ్యతిరేకం కామంటూ’’నేతలు స్పష్టం చేశారు. సీఎం జగన్ పిలుపు మేరకు పార్టీ అభ్యున్నతికి పాటు పడతామని ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత స్పష్టం చేశారు. మంత్రి పదవి కన్నా 2024లో పార్టీ గెలుపే మనకు ముఖ్యమని వాసన్న స్పష్టం చేశారని, ఈ నేపథ్యంలో ఆయన ఆదేశాలతో తాను, కార్పొరేటర్లు అంతా మా రాజీనామాలను ఉపసంహరించుకుంటున్నామని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు జెడ్పీటీసీ భవనం శ్రీలక్ష్మి, చినగంజాం జెడ్పీటీసీ ఆసోది భాగ్యలక్ష్మి, ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి, కారంచేడు జెడ్పీటీసీ యార్లగడ్డ రజనీ, ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు, సంతమాగులూరు ఎంపీపీ అట్లా చిన వెంకటరెడ్డి, ప్రకాశం జిల్లా మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, చీమకుర్తి జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, ఒంగోలు ఎంపీపీ పల్లపోలు మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ చుండూరి కోమలేశ్వరి తదితరులు తమ రాజీనామా నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. జగన్న మాటంటే తమకు వేదవాక్కు అని, ఆయన మాటను జవదాటే ప్రశ్నేలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నా, వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నా తమకు ఎంతో ఇష్టమని, అంతా ఒకటే కుటుంబ సభ్యులమని పేర్కొన్నారు. -
టీ అమ్మిన చేతులతో నాడిపట్టేలా..
సాక్షి, ఒంగోలు: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం..కన్నబిడ్డలను కష్టపడి చదివించుకుంటూ జీవనం సాగిస్తోంది. బిడ్డలకు కూడా కష్టం అంటే ఏమిటో తెలియజేస్తోంది. ఆ బిడ్డలు తల్లిదండ్రుల కష్టాన్ని చూసి చదువులో రాణించటం మొదలు పెట్టారు. ఆ కష్టం కాస్తా ఫలించింది. కుమారుడు మెడిసిన్‌కు సంబంధించి నీట్ ఎంట్రన్స్ పరీక్షలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి ఆ తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని నింపాడు. దీంతో ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. స్థానిక ధారావారితోటలో నివాసం ఉంటూ..ప్రకాశం భవన్ ముందు టీకొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న దాసరి పిచ్చయ్య, మాధవిల కుమారుడు దాసరి వంశీకృష్ణ ఈ అరుదైన ఘనత సాధించాడు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన వంశీకృష్ణ చదువుకుంటూనే టీ కొట్టులో కూడా పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. చివరకు మొన్నటి మెడిసిన్ నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాడు. కౌన్సిలింగ్లో విశాఖపట్నంలోని గాయత్రీ విద్యాపీఠం మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. పిచ్చయ్య ఎస్సీ కార్పొరేషన్లో రూ.లక్ష రుణం తీసుకొని జీవనం సాగిస్తూ తన కుమారుడు, కుమార్తెలను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. కుమార్తె వైష్ణవి కూడా బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. వైష్ణవి చదువుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన ద్వారా ఆర్థిక సహకారం అందుతోంది. ప్రత్యేకంగా అభినందించిన మంత్రి బాలినేని ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన దాసరి వంశీకృష్ణను రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు చంద్రయ్య నగర్లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం వచ్చిన మంత్రి బాలినేని ఎంబీబీఎస్ సీటు సాధించిన వంశీకృష్ణను వెన్ను తట్టి ప్రోత్సహించారు. సాధారణ టీకొట్టు నడుపుకుంటున్న వ్యక్తి కుమారుడు ఎంబీబీఎస్ సీటు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడని అభినందించారు. యువత కష్టపడి చదువుకోవాలని బాలినేని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దాసరి వంశీకృష్ణ పడిన కష్టం గురించి మంత్రికి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తూతిక విశ్వనాథ్ శ్రీనివాస్ వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద టీ అమ్ముకుంటూ కష్టపడి చదువుకొని ఎంబీబీఎస్ సీటు సాధించాడని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న అమ్మ ఒడి పథకం ద్వారా వంశీకృష్ణ చెల్లెలు వైష్ణవి చదువుకుందని, అదేవిధంగా బీటెక్‌లో చేరాక జగనన్న విద్యా దీవెన పథకం కూడా వచ్చిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విశాఖపట్నంలో ఎంబీబీఎస్ సీటు వచ్చిన ఆర్డర్‌ను మంత్రి బాలినేని చేతుల మీదుగా వంశీకృష్ణకు అందజేశారు. -
ఆక్వా రైతులను వాళ్ళు మోసం చేశారు.. సీఎం జగన్ ఆదుకున్నారు
-
జీవవైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత
సాక్షి, అమరావతి: ప్రతి జిల్లాలో ఒక బయోడైవర్సిటీ పార్కు, మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ శా ఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పా రు. జల సంబంధిత జీవవైవిధ్యం, అంతరించే జంతుజాలం పరిరక్షణ ప్రణాళిక కోసం ఏపీ బయోడైవర్సిటీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాకినాడ, కడప, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, అమరావతి, కర్నూల్చుy వాటి అభివృద్ధికి ప్రణాళికలు ఆమోదించామని, ఇందుకు అవసరమైన భూమి గుర్తించే పనిజరుగుతోందని చెప్పారు. ఒక్కో పార్కుకు రూ.1.5 కోట్లు, మ్యూజియానికి రూ.50 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. మానవాళి మనుగడకు జీవవైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యతని చెప్పారు. అడవుల్లోని మొక్కలు, సముద్రపు జీవుల ద్వారానే మనకు మందులు సరఫరా అవుతున్నాయన్నారు. బయో డైవర్సిటీ బోర్డు సభ్య కార్యదర్శి, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ డాక్టర్ డి.నళినీమోహన్ మాట్లాడుతూ ఏపీ జీవవైవిధ్య కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. -
అంబేడ్కర్ స్థాయిని తగ్గిస్తారా?
ఒంగోలు: చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అభిమానులైన ప్రతి ఒక్కరికీ ఆగ్రహాన్ని కలిగించేలా ఉన్నాయని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయినా.. ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచేలా చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జాతీయ స్థాయి నాయకుడైతే జిల్లాకు ఎలా పేరు పెడతారంటూనే.. మరోవైపు అంబేడ్కర్ పేరుతో జిల్లా నామకరణం జరగాలని డిమాండ్ చేయడం దారుణమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాత అని, అటువంటి నాయకుడి పేరును జిల్లాకు పెట్టాలంటూనే ఎన్టీఆర్ పేరును జిల్లా స్థాయిలో పెట్టడమేంటంటూ చంద్రబాబు ప్రశ్నించడాన్ని ప్రజలు గమనించాలన్నారు. అంబేడ్కర్, ఎన్టీఆర్లలో ఎవరు గొప్పవారో విజులు గమనించాలని సూచించారు. జిల్లాల విభజనకు 99 శాతం మద్దతు జిల్లాల విభజన ప్రక్రియకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చని, అయితే 99 శాతం మంది ప్రజలు హర్షిస్తున్నారని మంత్రి బాలినేని చెప్పారు. టీడీపీ నాయకులు మాత్రం దీనిపైనా రాజకీయం చేయడం, నాటకాలు ఆడడం, కుట్రలు పన్నడం చేస్తున్నారని, ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు కోర్టుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. అయితే కందుకూరులో రెవెన్యూ డివిజన్ తొలగించడంతో పాటు.. ఆ నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడంపై ప్రజలు అసంతృప్తికి గురవుతున్న విషయాన్ని సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్టు మంత్రి చెప్పారు. సోము వీర్రాజు ఒక రోజు టీడీపీని, మరుసటి రోజు వైఎస్సార్సీపీని, ఇంకో రోజు సొంత పార్టీని సైతం విమర్శిస్తారని, అలాంటి వ్యక్తి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. -
యుద్ధ ప్రాతిపదికన డిజిటల్ లైబ్రరీలు పూర్తి చేయాలి: సీఎం జగన్
-
యుద్ధ ప్రాతిపదికన డిజిటల్ లైబ్రరీలు
సాక్షి, అమరావతి: యుద్ధ ప్రాతిపదికన వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది జూన్ నాటికి తొలి దశ డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణ పనుల పురోగతిపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్‌టాప్, యూపీఎస్, ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు డెస్క్‌టాప్ టేబుల్స్, సిస్టం చెయిర్స్, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఐరన్ ర్యాక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. డిజిటల్ లైబ్రరీల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఫేజ్–1 లో మిగిలిపోయిన డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలను ఫేజ్ 2లో కవర్ అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసినట్లవుతుందని, ఇంకా మొదలు కాని చోట్ల పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించిన పనులపై మరింత ధ్యాస పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతోనే వర్క్ ఫ్రం హోం సులువవుతుందని పేర్కొన్నారు. ఫేజ్ –1లో 4,530 గ్రామాల్లో ఏర్పాటవుతున్న డిజిటల్ లైబ్రరీలకు అవసరమైన నెట్ కనెక్టివిటీ ఫిబ్రవరి 2022 నాటికి పూర్తవుతుందని అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవు: సీఎస్ సమీర్ శర్మ -
ఉచిత విద్యుత్‌తో రైతుల ఇంట సంక్రాంతి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకంతో రైతుల ఇంట నిజమైన సంక్రాంతి వెలుగులు నింపుతోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలంగా విశ్వసిస్తారని తెలిపారు. దీనిలో భాగంగా ప్రవేశపెట్టిన వ్యవసాయానికి వైఎస్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, ముఖ్యంగా వ్యవసాయానికి విద్యుత్‌పై ఇంధన శాఖ అధికారులతో మంత్రి గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ‘రాష్ట్రంలో 18.37 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఏటా 12 వేల మిలియన్ యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.8,400 కోట్లు ఖర్చు చేస్తోంది. పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన 3–ఫేజ్ విద్యుత్ సరఫరాకు 6,663 వ్యవసాయ ఫీడర్లను మెరుగుపరచడానికి రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం యూనిట్ రూ.4.39కు కొంటున్నాం. రానున్న 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌ను కొనసాగించడానికి వ్యయాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) సౌర విద్యుత్‌ను యూనిట్ రూ.2.49కే ఇస్తోంది. దీనివల్ల ఏటా దాదాపు రూ.3,230 కోట్లు ఆదా అవుతుంది’ అని మంత్రి చెప్పారు. ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ చెప్పారు. -
AP: విద్యుత్ ఉద్యోగులకు త్వరలో శుభవార్త
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులు డీఏ విషయంలో త్వరలోనే శుభవార్త వింటారని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) ద్వితీయ వార్షికోత్సవం, విద్యుత్ సంస్థల నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను విజయవాడలో మంగళవారం మంత్రి ఆవిష్కరించారు. 13 జిల్లాల నుంచి ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో, మూడు డిస్కంలు, నెడ్‌క్యాప్, ఏపీఎస్ఈసీఎం, ఏపీసీడ్కో విభాగాల ఉద్యోగులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బాలినేని ప్రసంగిస్తూ..పే రివిజన్ కమిటీతో జీతాలు తగ్గుతా యని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఉద్యోగులెవరూ పట్టించుకోవలసిన అవసరం లే దని స్పష్టం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇ బ్బందులను పరిగణనలోకి తీసుకుని వారికి న్యాయం జరిగేలా సానుకూల నిర్ణయం తీసుకుంటా మని మంత్రి భరోసా ఇచ్చారు. చదవండి: (పోలీసుల అదుపులో స్మగ్లర్ చంద్రబాబు?) బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను చవకగా కొనుగోలు చేసి రూ.2,500 కోట్లు ఆదా చేయగలిగిన విద్యుత్ రంగాన్ని క్షేత్రస్థాయి నుంచి పటిష్టపర్చడంలో భా గంగా రికార్డు స్థాయిలో ఒకేసారి సుమారు 7,329 మంది లైన్ మెన్లను, 213 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను నియమించామన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ..ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి రెండేళ్లలో రూ.28,166 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. సీఎండీ జె పద్మజనార్ధన రెడ్డి, ఏపీ జెన్కో ఎండీ బి. శ్రీధర్, జేఎండీలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు బీపీ.. ఇక్కడకెందుకు తీసుకొచ్చారయ్యా అంటూ అసహనం!
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాలు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై విపక్షాలు, పచ్చ మీడియా ప్రచారం చేస్తోన్న అసత్యాలపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. నెల్లూరులో చంద్రబాబుకు ఎదురైన చేదు అనుభవం గురించి అసెంబ్లీలో వెల్లడించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు నెల్లూరు పర్యటనకు వచ్చారు. సెంటర్‌కు వచ్చిన చంద్రబాబు.. ప్రజలను ఉద్దేశించి.. ‘‘ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా అందాయా’’ అని ప్రశ్నించారు. అందుకు జనాలు అందాయి అని తెలిపారు. ఈ సమాధానం విన్న చంద్రబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు.. ఇక్కడకెందుకు తీసుకొచ్చారయ్యా అంటూ టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు’’ అని బాలినేని తెలిపారు. (చదవండి: నాయకుడు అనేవాడు డ్రామాలు చేయకూడదు: సీఎం జగన్) ‘‘ఒక్క నెల్లూరులోనే కాదు.. అన్ని ప్రాంతాల్లో.. పూర్తిగా 100 శాతం బాధితులకు అన్ని సహాయక చర్యలు అందాయి. ప్రభుత్వ చర్యలు చూసి చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావడం లేదు. అసెంబ్లీలో తనకు ఏమో జరిగిందని.. ఓదార్చాలని జనాలు కోరుతున్నారు. మరో వైపు కొంతమంది తెలుగు దేశం నాయకులు.. సోమశిల ప్రాజెక్ట్ దెబ్బతిన్నది.. ముంపుకు గురవుతారని జనాలు భయందోళనకు గురి చేస్తున్నారు’’ అని బాలినేని విమర్శించారు. (చదవండి: పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు: సీఎం జగన్) ‘‘వరద సహాయక చర్యలు పారదర్శకంగా సాగుతున్నాయి. వరద బాధితులను కాపాడబోయి.. ప్రాణాలు కోల్పోయిన ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల పరిహారాన్ని అందించింది’’ అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. చదవండి: వరద బాధితులను రక్షిస్తూ.. ఆశల దీపం ఆరిపోయింది -
చంద్రబాబు ఫ్రస్టేషన్లో ఉన్నాడు: మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం: వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు నాయుడు వైఎస్ కుటుంబ సభ్యులపై అనవసర వ్యాఖ్యలు చేశారని మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులను ఎవ్వరూ కించపరుస్తూ మాట్లాడలేదు. అసెంబ్లీలో మంత్రులు మాధవ రెడ్డి, రంగా హత్యల గురించి చర్చించాలని అన్నారే తప్ప.. మరి ఏ ఇతర వ్యాఖ్యలు చేయలేదు. భువనేశ్వరి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మేము ఒప్పకోం.. భువనేశ్వరీ మాకు సోదరి లాంటిది. అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా మాట్లాడితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూస్తూ ఊరుకోడు. మహిళలపై తమకు అపారమైన గౌరవం ఉంది. వైఎస్ షర్మిల గురించి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే వాటిని చూసి టీడీపీ నేతలు నవ్వుకున్నారు. అసెంబ్లీలో జరిగింది అంతా ఒక డ్రామాలా ఉంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల ఓటమితో చంద్రబాబు ఫ్రస్టేషన్లో ఉన్నాడ'ని మంత్రి బాలినేని అన్నారు. చదవండి: (కరీమున్నిసా భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం జగన్) -
చంద్రబాబు పగటి కలలు కంటున్నాడు: మంత్రి బాలినేని
సాక్షి, అమరావతి: చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పంలో ఓటమితో చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసినట్లే అని మండిపడ్డారు. అమరావతి రైతుల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ పాదయాత్ర చేస్తుందన్నారు. దమ్ముంటే టీడీపీ జెండా పట్టుకుని పాదయాత్ర చేయొచ్చుకదా? అని మంత్రి బాలినేని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనకు ప్రజల పూర్తి మద్దతుందని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. -
‘కుప్పంలో విజయానికి లోకేష్ ఐదు వేలు పంచడం సిగ్గుచేటు’
సాక్షి, నెల్లూరు: కుప్పంలో కూడా టీడీపీకి ఓటమి భయంపట్టుకుందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ.. టీడీపీ స్థాయి దిగజారిందని.. కుప్పంలో విజయం సాధించడానికి లోకేష్ ఐదువేలు పంచటం సిగ్గుచేటని విమర్శించారు. సొంత నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయలేని బాబు.. రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. కుప్పంని మున్సిపాలిటీ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రభంజనం కొనసాగుతుందని మంత్రి బాలినేని పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలలో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగిస్తుందని మంత్రి బాలినేని తెలిపారు. -
చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభి బూతులు: మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం: చంద్రబాబు జీవితమంతా కుట్రల మయమని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభి బూతులు మాట్లాడారని అన్నారు. చంద్రబాబు దీక్ష అంటేనే ఒక దొంగ దీక్ష... అని మంత్రి బాలినేని విమర్శించారు. ఏపీలో కుట్రలో కుతంత్రాలు చేస్తామంటే ఊరుకోబోమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పట్టాభి అసభ్య పదజాలాన్ని చంద్రబాబు వెనకేసుకోస్తారా? అని ప్రశ్నించారు. గతంలో.. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి టీడీపీ నేతలు రథాలు తగలబెట్టించారని బాలినేని ఎద్దేవా చేశారు. చదవండి: TDP Leader Pattabhi Arrested: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్ -
సంక్షోభాన్ని అధిగమిస్తాం : మంత్రి బాలినేని
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగం గతంలోనూ అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్నడూ వెనకడుగు వేయలేదని, బొగ్గు సంక్షోభం తాత్కాలికమేనని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రభుత్వ సహకారంతో, వినియోగదారుల మద్దతుతో ఈ సంక్షోభాన్ని తప్పకుండా అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులు, వినియోగదారులు, విద్యుత్ రంగ ఉద్యోగులు, సిబ్బందికి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తీవ్ర బొగ్గు కొరత ఉన్నప్పటికీ తక్కువ అంతరాయాలతో, కొంత లోడ్ రిలీఫ్ చర్యలతో వినియోగదారులకు విద్యుత్‌ను నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తున్న ఇంధన శాఖ అధికారులను మంత్రి అభినందించారు. -
మంత్రి బాలినేని చొరవ.. రోజూ నీళ్లొచ్చేలా మెగా ప్లాన్
గుక్కెడు నీటి కోసం ఒంగోలు నగర ప్రజలు నానా తంటాలు పడాల్సిందే. నాలుగు రోజులకు ఒకసారి ఇచ్చే మంచినీటి కోసం ఎదురుచూపులే. శివారు కాలనీల్లో మంచినీటి ట్యాంకర్లు వస్తే తప్ప నీరందని దుస్థితి. పట్టణం ఆవిర్భావం నుంచి ఉన్న ఈ సమస్యకు చెక్ పెట్టేలా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో మెగా తాగునీటి ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. రూ.409 కోట్లు ఖర్చయ్యే ఈ పథకాన్ని సీఎం జగన్ మంజూరు చేయడంతో నగరవాసుల క‘న్నీటి’ కష్టాలకు తెరపడనుంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరంలో మంచినీటి సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. జిల్లా కేంద్రం నలుదిశలా విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగా నీటి అవసరాలూ పెరుగుతున్నాయి. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నగరంలోని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించారు. ముందుచూపుతో భారీ రక్షిత మంచినీటి పథకం ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. మెగా మంచినీటి ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేశారు. నగర పాలక సంస్థ అధికారులతో మొత్తం రూ.409 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయించారు. రెండు రోజుల క్రితం ఒంగోలుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. వెంటనే స్పందించిన సీఎం పథకం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నగర ప్రజల దశాబ్దాల సమస్య తీరనుంది. ఇదీ ప్రణాళిక... ఈ పథకం పూర్తయితే నాలుగైదు రోజులకు వచ్చే మంచినీటికి æఇక చెక్ పడ్డట్టే. ప్రతి మనిషికి 135 లీటర్ల చొప్పున నగర ప్రజలందరికీ ప్రతిరోజూ రక్షిత మంచినీటిని అందించవచ్చు. ప్రస్తుతం నగరంలో దాదాపు 3 లక్షలకు పైగా జనాభా నివశిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒంగోలు నగరంలో 2,65,746 మంది ఉన్నారు. నగరంలో విలీనమైన గ్రామాలకు సైతం ఈ ప్రాజెక్టు ద్వారా సంవృద్ధిగా నీటిని సరఫరా చేసేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం నగరానికి రామతీర్థం నుంచే సాగర్ నీళ్లు వస్తున్నాయి. నగరంలోని రెండు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులతో పాటు రంగారాయుడు చెరువు నుంచి ప్రస్తుతం తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సరఫరా వ్యవస్థకు భిన్నంగా నగరానికి రామతీర్థం నుంచే నీటిని సరఫరా చేయటానికి మాస్టర్ ప్లాన్ వేశారు. అందులో భాగంగా నగరం వరకు నీటిని సరఫరా చేయటానికి మొత్తం రూ.107 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందుకు పైప్‌లైన్ వ్యవస్థను రూపొందించనున్నారు. రామతీర్థం రిజర్వాయర్‌లో 18 మీటర్ల వ్యాసార్థంతో ఇన్‌టేక్ వెల్‌తో పాటు పంపు హౌస్‌ను నిర్మించనున్నారు. రిజర్వాయర్‌లోనే ఇన్‌టేక్ వెల్ కోసం కాపర్ డ్యాంను నిర్మిస్తారు. అక్కడే సర్వీసు బ్రిడ్జితో పాటు, 150 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఆరు పంప్ సెట్లతో పాటు నీటిని పంపింగ్ చేయటానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నారు. అక్కడి వరకు దాదాపు రూ.5.50 కోట్ల వరకు వెచ్చించనున్నారు. చీమకుర్తి విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి ఇన్‌టేక్ వెల్ వరకు దాదాపు 16 కిలో మీటర్ల మేర విద్యుత్ లైన్‌ను ప్రత్యేకంగా వేయనున్నారు. డ్యాం వద్ద నుంచి ఇన్‌టేక్ వెల్ వరకు అప్రోచ్ రోడ్డు, 900 కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక ట్యాంకును కూడా ఏర్పాటు చేయటానికి ప్రతిపాదనల్లో పొందుపరిచారు. అక్కడ నుంచి ఒంగోలు వరకు నీటిని సరఫరా చేయటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లకు సంబంధించి మొత్తం రూ.107 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. రీ మోడల్‌కు రూ.302 కోట్లు నగరంలోని మంచినీటి వ్యవస్థను మొత్తాన్ని రీ మోడల్ చేయటానికి దాదాపు రూ.302 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇంటింటికీ మంచినీరు సరఫరా చేసేందుకు మొత్తం 28 జోన్లుగా విభజించారు. కొత్తగా నగరంలో కలిసిన నగర శివారు గ్రామాలు, విలీన గ్రామాలన్నింటినీ కలుపుకొని ఈ నూతన విధానానికి రూపకల్పన చేశారు. ఈ మెగా మంచినీటి ప్రాజెక్టు కోసం 28 జోన్లలో కొత్తగా 12 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించ తలపెట్టారు. ఒంగోలు నగరం నలుదిశలా వీటిని ఏర్పాటు చేయాలి. ఒక్కో ట్యాంకు 500 కిలో లీటర్ల సామర్ధ్యం నుంచి 700 కిలో లీటర్ల సామర్ధ్యం వరకు ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న పాత ట్యాంకుల నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని వాటిని వాడాలా, వద్దా అన్న దానిపై కూడా లోతుగా అధ్యయనం చేశారు. భవిష్యత్తులో నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయాల్సి వచ్చినా మంచినీటి పైప్‌లైన్ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉన్న మంచినీటి పైప్‌లైన్ వ్యవస్థ మొత్తం రీ మోడల్ దిశగా ప్రణాళికలు రూపొందించారు. అమృత్ పథకానికి రూ.70 కోట్లు గ్రాంట్‌గా తెప్పించిన మంత్రి బాలినేని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ‘‘అమృత్’’ పథకాన్ని టీడీపీ పాలకులు మధ్యలోనే వదిలేశారు. నిధులు లేవని గుండ్లకమ్మ నుంచి ఏర్పాటు చేసిన పథకం పనులు నిలిచిపోయాయి. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కమీషన్ల కక్కుర్తితో ఈ పథకం మధ్యలోనే నిలిచిపోయింది. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన బాలినేని అమృత్ పథకం పూర్తి చేయటానికి ప్రభుత్వం నుంచి రూ.70 కోట్లు గ్రాంట్‌గా తెప్పించారు. దీంతో ఆగిపోయిన పథకం పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ పథకంలో నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించనున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు అడిగిన వెంటనే ఒంగోలు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సిద్ధం చేసిన మెగా మంచినీటి పథకాన్ని స్వయంగా సీఎం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించటం ఎంతో సంతోషంగా ఉంది. ఒంగోలు నగర ప్రజలు ఎంతో అదృష్టవంతులు. ఈ పథకంతో నగర రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయి. ఇప్పటి వరకు ప్రజలు మంచినీటి కోసం పడుతున్న కష్టాలు తీరనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జీవితాంతం ఒంగోలు నగర ప్రజలతో పాటు రుణపడి ఉంటా. – బాలినేని శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర మంత్రి -
ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థుల హవా
ఒంగోలు మెట్రో: రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జేయూకేటీ) సెట్– 2021 పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. తొలి ఆరు ర్యాంకులు వారే సొంతం చేసుకున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఆర్జేయూకేటీ వైస్ చాన్సలర్ కేసీ రెడ్డి నేతృత్వంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సురేష్, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీల్లో ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఆగస్టు 18న నోటిఫికేషన్ వెలువరించి, సెప్టెంబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించారు. పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 73,548 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలో 470, తెలంగాణలో 8 కేంద్రాల్లో పరీక్షను సెప్టెంబర్ 26న నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 71,207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా, నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మొత్తం 4400 సీట్లు ఉండగా, ఒక్కో సీటుకు 18 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. పరీక్ష నిర్వహించిన పది రోజుల్లోనే పరీక్షల ఫలితాలు విడుదల చేసి అధికారులు రికార్డు సృష్టించారు. త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు. ఆటోమొబైల్ ఇంజనీర్ కావడమే లక్ష్యం రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలోని కళాశాలలో చదవాలనుకుంటున్నా. ఆటోమొబైల్ ఇంజనీర్ కావడమే నా ముందున్న లక్ష్యం. – మద్దన గుణశేఖర్, 1వ ర్యాంక్ కలెక్టర్‌గా చూడాలని అమ్మానాన్న కోరిక 2వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. మాది వ్యవసాయ కుటుంబం. నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది అమ్మనాన్న కోరిక. వారి కలను సాకారం చేసే దిశగా లక్ష్యం వైపు అడుగులు వేస్తా. – కూశెట్టి శ్రీచక్రధరణి, 2వ ర్యాంక్ ఇంజనీరింగ్ చేస్తూ సివిల్స్‌కు సిద్ధమవుతా ఇంజనీరింగ్ (సీఈసీ) చదువుతూ సివిల్స్‌కు సిద్ధమవుతా. తండ్రి చనిపోయారు. తల్లి విభిన్న ప్రతిభావంతురాలు. తాతయ్యతో పాటు చిన్నాన్న మురళీ, మామయ్య కృష్ణారావులు చదువులో మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇష్టంగా చదవడంతోనే పదో తరగతిలో 10/10 పాయింట్లు సాధించా. ఆర్జీయూకేటీ సెట్–21లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. – మన్నెపూరి చంద్రిక, 3వ ర్యాంకు -
అక్టోబర్ 7న ఒంగోలుకు సీఎం జగన్
సాక్షి, ఒంగోలు: వైఎస్సార్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈనెల 7వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు రానున్నారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో ముందుగా పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానాన్ని మంత్రి బాలినేని, తలశిల రఘురాం, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ వకుల్ జిందాల్, కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్ సోమవారం పరిశీలించారు. అనంతరం క్రీడా మైదానంలో సీఎం కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో వారు చర్చించారు. క్రీడా మైదానంలో దక్షిణ భాగంలో ముఖ్యమంత్రి సభావేదిక ఉండాలన్నారు. 23 నెలల తరువాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు వస్తుండడంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించాలన్నారు. పీవీఆర్ గ్రౌండ్‌ను పరిశీలిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పక్కన సీఎం కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ వకుల్ జిందాల్, కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్ మహిళల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని విజయవంతం చేయాలన్నారు. ఉదయం 9 గంటలకు మహిళలు పీవీఆర్ ఉన్నత పాఠశాలలో ఉండేలా చూడాలన్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి 20 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో హెలిపాడ్ ఏర్పాట్లు, వేదిక వద్దకు సీఎం వచ్చే రూటుకు ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు మార్గానికి అడ్డు రాకుండా సీఎంకు అభివాదం చేసేందుకు వీలుగా బ్యారికేడ్ల ఏర్పాటుకు సంబంధించి పలు సూచనలు చేశారు. హెలిపాడ్ నుంచి సభా ప్రాంగణానికి వచ్చే ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా రెండో విడతలో మహిళలకు నగదు పంపిణీ కార్యక్రమం ఒంగోలులో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జిల్లాకు వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నందున విజయవంతం చేసే బాధ్యత మహిళలపై ఉందన్నారు. కేవలం రెండు రోజుల సమయంలో సభా ఏర్పాట్ల విషయంపై కొందరు అనుమానం వ్యక్తం చేయగా ‘ఒంగోలులో వాసన్న ఉన్నాడు కదా చూసుకుంటాడు’ అని సీఎం జగన్మోహన్రెడ్డి అన్నట్లు తలశిల తెలిపారు. కోవిడ్ రెండు టీకాలు వేయించుకుంటేనే అనుమతి: కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ రెండు టీకాలు వేయించుకున్న వారినే కార్యక్రమానికి అనుమతిస్తామన్నారు. ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేయాలని, నగరంలో విద్యుత్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీలు నియమించాలని, కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రికి వివరించారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు రైతు భరోసా కేంద్రాల్లోను సీఎం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్, ఎస్పీ మలికాగర్గ్, జేసీలు జేవీ మురళి, కె.కృష్ణవేణి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డీఆర్వో ఎస్.సరళావందనం, లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, డీఆర్డీఏ పీడీ బాబూరావు, మెప్మా పీడీ టి.రవికుమార్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటన ఇలా సీఎం పర్యటన షెడ్యూల్‌ను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మీడియాకు విడుదల చేశారు. ఉదయం 9.55 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద నుంచి హెలికాప్టర్లో బయల్దేరతారు. 10.35 గంటలకు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీలో హెలికాప్టర్ దిగుతారు. 10.45 గంటలకు హెలిపాడ్ నుంచి బయల్దేరి 11 గంటలకు సభాస్థలి అయిన ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. పది నిముషాలపాటు స్టాల్స్‌ను పరిశీలిస్తారు. 11.15 గంటలకు జ్యోతి ప్రజ్వలన, డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. 11.25 గంటలకు మంత్రుల ప్రసంగాలు, 11.40 నుంచి 12 గంటల వరకు లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం, అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం ఉంటుంది. 12.30 గంటలకు వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తారు. 12.40 గంటలకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్‌తో కార్యక్రమం ముగుస్తుంది. 12.45 గంటలకు సభాస్థలి వద్ద నుంచి కారులో హెలిపాడ్‌కు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటారు. 1.05 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి 1.50 గంటకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారు. -
పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఒంటరిగా పోటీ చేయాలి: బాలినేని
సాక్షి, ప్రకాశం: పవన్ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే ఒంటరిగా పోటీ చేయాలని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో పవన్‌ను ప్రజలు రెండు చోట్ల ఓడించారని అన్నారు. టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. -
బాబు నోరు తెరిస్తే అబద్ధాలే..
ఒంగోలు అర్బన్: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి ఐదుసార్లు విద్యుత్ చార్జీలు పెంచామని చంద్రబాబు అండ్ కో అనడం సిగ్గుచేటని రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఒంగోలులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలపై రూ.9 వేల కోట్లు భారం వేసినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని.. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే చంద్రబాబుది నోరా లేక తాటిమట్టా అని మండిపడ్డారు. 2014 నుంచి 2019 వరకు అదనంగా ఖర్చయిన విద్యుత్‌కు సంబంధించి చెల్లించాల్సిన బిల్లులు గత టీడీపీ ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. దానిని చెల్లించాల్సి రావడంతో ఆ భారం కొంతమేర ప్రజలపై పడిందన్నారు. అంతేతప్ప తమ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచలేదని, పెంచబోదని స్పష్టంచేశారు. ఈ భారం కూడా కేవలం 7, 8 నెలలే ఉంటుంన్నారు. బాబు రహస్యంగా మారిషస్ వెళ్లలేదా? ఎవరికీ తెలియకుండా రెండు నెలల క్రితం చంద్రబాబు ప్రత్యేక విమానంలో మారిషస్ వెళ్లలేదా అని ప్రశ్నించారు. తన రష్యా పర్యటన రహస్యమేమీ కాదని.. స్నేహితుని జన్మదినానికి ఆయనే ప్రత్యేక విమానం ఏర్పాటుచేస్తే మిత్రులంతా కలిసి వెళ్లామన్నారు. తాను క్యాసినోలకు వెళ్లానని విమర్శించే వారు రష్యా కమ్యూనిస్టు దేశమని, అలాంటివి ఉండవని తెలుసుకోవాలన్నారు. -
ఈ–వెహికల్స్‌కు 400 చార్జింగ్ స్టేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వాహనాల(ఈ– వెహికల్స్) వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ దిశగా అవసరమైన ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు సిద్దంగా ఉందన్నారు. కరెంటుతో నడిచే వాహనాల వినియోగం (ఈ–మొబిలిటీ), వాటికి అవసరమైన చార్జింగ్ స్టేషన్లపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘గో–ఎలక్ట్రిక్’ ప్రచార కార్యక్రమాన్ని మంత్రి గురువారం ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిదశలో 400 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీజిల్, పెట్రోల్ వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యాన్ని అడ్డుకునేందుకు విద్యుత్ వాహనాలు ప్రత్యామ్నాయమని చెప్పారు. ఈ–వెహికల్స్ నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉంటుందని, ప్రజల సౌకర్యార్థం జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మాట్లాడుతూ దేశంలో 2023 నాటికి కరెంటుతో నడిచే మూడు చక్రాల వాహనాలు, 2025 నాటికి కరెంటుతో నడిచే ద్విచక్ర వాహనాలను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని చెప్పారు. నెడ్‌క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 400 చార్జర్ల ఏర్పాటు కోసం ఎన్టీపీసీ, ఆర్ఐ ఈఎల్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఫేమ్–2 స్కీం కింద రాష్ట్రవ్యాప్తంగా 73 చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వాహనాలను, విడిభాగాలను పరీక్షించేందుకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంస్థ సహకారంతో రూ.250 కోట్లతో వాహనాలను పరీక్షించేందుకు టెస్టింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేదల ఆరోగ్యం కోసం ఖర్చుకు వెనుకాడం
ఒంగోలు టౌన్: పేదల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. కరోనా బారినపడిన వారంతా ఆరోగ్యంగా ఇంటికి వెళ్లాలన్నదే తన ముందున్న బాధ్యత అని పేర్కొన్నారు. సొంత నిధులు రూ.35 లక్షలతో ఒంగోలు జీజీహెచ్‌లో బాలినేని కోవిడ్ కేర్ సెంటర్ కింద ఆక్సిజన్‌తో కూడిన 100 పడకలతో ఏర్పాటుచేసిన జర్మన్ షెడ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీజీహెచ్ పైఅంతస్తులో ఏర్పాటు చేయనున్న 100 పడకలకు అవసరమైన ఆక్సిజన్ వంటివి అమర్చేందుకు తన సొంత నిధులు రూ.15 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. బాలినేని ఉచిత కోవిడ్ కేర్ సెంటర్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌తో ఏర్పాటు చేసిన బెడ్స్ తన కుటుంబంలోనూ కరోనా వచ్చిందన్నారు. తమ కుటుంబమంతా ఆలోచించి కరోనా బాధితులకు సేవచేసేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పేదలకు సేవచేసేందుకు జిల్లాలో కోటీశ్వరులు ముందుకు రావాలన్నారు. పేదలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ఉచితంగా ఇస్తానని, ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఆదుకుంటానని చెప్పారు. ఇందుకోసం తన కార్యాలయంలో ఐదుగురిని నియమించినట్లు తెలిపారు. కరోనా వైద్యం విషయంలో సమస్యలు వస్తే తన దృష్టికి లేదా, కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మంత్రి వెంట కలెక్టర్ పోల భాస్కర్, జేసీ చేతన్, నగర మేయర్ సుజాత ఉన్నారు. -
ప్రతి పల్లెకు ఇంటర్నెట్తో ‘వర్క్ ఫ్రమ్ హోం’: సీఎం జగన్
తాడేపల్లి: ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ ఏర్పాటు, అమ్మఒడి పథకంలో భాగంగా ఆప్షన్‌గా ఇవ్వాల్సిన ల్యాప్‌టాప్‌లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేశారు. మంత్రి బాలినేని, ఏపీ ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. అన్ని గ్రామాలకు అపరిమితంగా ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉండాలని, సీఎంఏ స్పీడ్ కనెక్షన్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. అన్ని గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు ఉండాలని చెప్పారు. స్వగ్రామంలోనే వర్క్ ఫ్రం హోం సదుపాయం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లోనూ ఇంటర్నెట్ కనెక్షన్లు ఉండాలని తెలిపారు. నిర్ణీత వ్యవధిలోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి 9న ల్యాప్‌టాప్‌లు అందించాలి అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌లు కోరుకున్నవారందరికీ జనవరి 9వ తేదీన అందించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ల్యాప్‌టాప్‌లతో పాటు గ్యారెంటీ, వారంటీ కార్డులివ్వాలని తెలిపారు. ల్యాప్‌టాప్ చెడిపోతే సర్వీస్ సెంటర్‌కు పంపి వారంలో తిరిగి ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటివరకు 307 మండలాల్లోని 3,642 గ్రామాల్లో 14,671 కిలో మీటర్ల మేర ఏరియల్ కేబుల్ వేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఎం.గిరిజాశంకర్ సీఎంకు వివరించారు. మరోవైపు 690 చదరపు అడుగుల విస్తీర్ణంతో వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు నిర్మిస్తున్నట్లు, ఒక్కో లైబ్రరీకి రూ.16 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ప్రతి లైబ్రరీలో 20 సీట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశానికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, ఏపీ ఫైబర్‌నెట్ సంస్థ ఎండీ మధుసూధన్‌రెడ్డి, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
గురుమూర్తి గెలుపును సీఎం జగన్‌కు గిఫ్ట్‌గా ఇవ్వాలి
నెల్లూరు: వైఎస్సార్సీపీ తిరుపతి లోక్‌సభ అభ్యర్థి గురుమూర్తి ఉన్నతమైన వ్యక్తి అని, అఖండ మెజారిటీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా నెల్లూరులో సోమవారం మంత్రులు ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గురుమూర్తిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఋణం తీర్చుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి పార్టీలకతీతంగా పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంట నడుద్దామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. మేనిఫెస్టోని కనుమరుగు చేసిన వ్యక్తి చంద్రబాబు అని, అదే మేనిఫెస్టోలోని హామీలు నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీకి వస్తున్న అదరణచూసే చంద్రబాబు జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల నుంచి పారిపోయాడు అని తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకొని జగన్ ఋణం తీర్చుకోవాలని సూచించారు. భారీ మెజార్టీతో గెలిపించాలి: మంత్రి బాలినేని ఏడాదిన్నర పాలనలో ఊహించని సంక్షేమాన్ని ఇచ్చి సీఎం జగన్ పేదల పెన్నిధిగా నిలిచారని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల పక్షపాతి అని కొనియాడారు. ఉప ఎన్నికలో హేమాహేమీలు నిలిచారని, ఎంపీగా, కేంద్రమంత్రిగా ప్రజా సంక్షేమాన్ని పనబాక గాలికి వొదిలేసారని గుర్తుచేశారు. ఇప్పుడు టీడీపీలో చేరి ఓట్లకు వస్తున్నారని చెప్పారు. సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో మెజారిటీ పెంచేందుకు ఆనం చేస్తున్న శ్రమ, కృషి అభినందనీయమని తెలిపారు. గురుమూర్తి గుణమంతుడు: డిప్యూటీ సీఎం గురుమూర్తి మంచి గుణమంతుడని, ఆ గుణాన్ని గమనించే ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ నిలిపారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. అతడిని అనూహ్య మెజారిటీతో గెలిపించి సంక్షేమ సారథి జగన్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. పచ్చమీడియాలో రాష్ట్రం అప్పులపాలైందని తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం వచ్చింది అని చెప్పారు. జగన్‌కి వస్తున్న జనాదరణ చూసి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు త్వరలో టీడీపీని బీజేపీలో విలీనం చేసేస్తాడని జోస్యం చెప్పారు. -
'రాసలీలలు చేసే లోకేష్‌కు విమర్శించే హక్కు లేదు'
సాక్షి, ప్రకాశం: విదేశాల్లో రాసలీలలు చేసే లోకేష్‌కు తనను విమర్శించే హక్కు లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. ''లోకేష్ ఒక దరిద్రుడు.. చంద్రబాబు ఒక నీచుడు. చంద్రబాబు, లోకేష్ ఇక్కడ దోచుకుని విదేశాల్లో దాచుకుంటున్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్ నాపై మాట్లాడటం సిగ్గుచేటు. ప్రత్తిపాటితో కలిసి లోకేష్ పేకాట క్లబ్ నడిపిన విషయం ప్రజలకు తెలుసు. నేను కులాలు చూడలేదు.. కమ్మవారికి కూడా కార్పొరేషన్లో టికెట్ ఇచ్చా. టీడీపీ వారు వ్యక్తిగత సమస్యలపై నా వద్దకు వస్తే పరిష్కరించా. ఒంగోలు అభివృద్ధిపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. గతంలో ఒంగోలును అభివృద్ధి చేశా.. ఇప్పుడూ చేస్తున్నా. టీడీపీ ఇన్ఛార్జ్ దామచర్ల జనార్ధన్ బాగోతం అందరికీ తెలుసు. నాకు సంస్కారం ఉంది కాబట్టి.. వ్యక్తిగత విమర్శలు చేయను. దామచర్ల జనార్ధన్ అప్పులు ఎగ్గొడితే.. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా సమయంలో ఒంగోలులో రూ.కోటి సొంత డబ్బు ఖర్చు చేశా. రోడ్లు మీద రోడ్లు వేసి టీడీపీ నేతలు దోచుకున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తే.. కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారు. కుప్పంలో చంద్రబాబుకు పట్టిన గతే.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రిపీట్ అవుతుంది'' అంటూ పేర్కొన్నారు. చదవండి: ఇక టీడీపీ చాప్టర్ క్లోజ్: విజయసాయిరెడ్డి లెక్కలు తప్పులైతే ముక్కు నేలకు రాస్తా.. -
ముక్కోటి ఏకాదశి: తిరుమలలో ప్రముఖులు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం అభిషేకం అనంతరం ఆలయ ఆర్చకులు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఉదయం నాలుగు గంటలకు దర్శనం ప్రారంభం అవ్వగా.. సామాన్య భక్తులు, వీఐపీలు దర్శనాల కోసం క్యూకట్టారు. శుక్రవారం కావడంతో అభిషేకం అనంతరం దర్శనాలు మొదలయ్యాయి. దీంతో తిరుమల క్షేత్రం వైకుంఠాన్ని తలపిస్తోంది. కాగా వైకుంఠ ఏకాదశి పర్వ దినాన పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇందు మల్హోత్రా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్ రావు దర్శించుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, అవంతి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీలు వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిధున్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాదవ్, మోపిదేవి వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ ఆదిత్యనాధ్, జస్టిన్ సీవీ నాగార్జున్ రెడ్డి, ఏపీ హైకోర్టు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, తెంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, హైకోర్టు న్యాయమూర్తి వెంకటరమణ, జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ హైకోర్టు జస్టిస్ అమర్ నాథ్ గౌడ్, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, తెలంగాణ కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్, సర్కార్ వారి పాట చిత్రం డైరెక్టర్ పరుశురామ్, తదితరులు శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. సునీల్ దియోధర్ మాట్లాడుతూ... వైకుంఠ ఏకాదశికి టీటీడీ అద్భుతమైన దర్శన ఏర్పాట్లు చేసిందన్నారు. దేవాలయాల నిర్వహణలో టీటీడీ దేశంలోని అన్నీ ఆలయాలకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ అద్భుతమైన దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీఐపీలు క్రమ శిక్షణతో శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. అనుకున్న సమయం కంటే ముందుగానే సర్వ దర్శనం ప్రారంభిస్తున్నామన్నారు. భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు ఈ సందర్భంగా ఆలయ అదనపు ఈవో మాట్లాడుతూ.. సాధారణ భక్తులకు గంటన్నర ముందే వైకుంఠద్వార దర్శనం కల్పించినట్లు తెలిపారు. ఉ. 9 గంటలకు అనుకున్నామని కానీ 7.30 గంటలకే ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. పరిస్థితిని అంచనా వేసి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏర్పట్లు చేసినట్లు, సర్వదర్శనం టిక్కెట్ల పెంచినట్లు పేర్కొన్నారు. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతున్నామన్నారు. ప్రముఖులు సహకరించడంతో సాధారణ భక్తులకు ఎక్కువ సమయం లభించిందన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రెండు వేలు, దాతలకు రెండు వేలు, వీఐపీలకు మూడు వేల మందికి టికెట్లు కేటాయించామన్నారు. -
ఆన్లైన్లో ‘అమ్మఒడి’ లబ్ధిదారుల ప్రాథమిక జాబితా
ఒంగోలు అర్బన్: జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను ఆన్లైన్లో విడుదల చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. సోమవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలసి ఆయన ఈ జాబితాను ఆన్లైన్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శనకు ఉంచుతామని, వీటిపై అభ్యంతరాలను పరిశీలించి ఈ నెల 30వ తేదీన తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఎవరికైనా అర్హత ఉండి జాబితాలో పేరు లేకుంటే తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పెరిగిన లబ్ధిదారుల సంఖ్య రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 72,74,674 మంది, 11, 12 తరగతులకు సంబంధిం«చి 10,97,580 మంది విద్యార్థులు అమ్మ ఒడి పథకానికి ఎంపికయ్యారని మంత్రి సురేశ్ తెలిపారు. 61,317 పాఠశాలలు, 3,116 కాలేజీలకు చెందిన మొత్తం 83,72,254 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. జనవరి 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు అమ్మ ఒడి నగదు జమవుతుందన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది లబ్ధిపొందే విద్యార్థుల సంఖ్య పెరిగిందని వివరించారు. -
ఉచిత విద్యుత్ కోసం మెగా సౌర విద్యుత్ ప్లాంట్
సాక్షి, అమరావతి: రాబోయే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం మేరకే 10 వేల మెగావాట్ల భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తి చేసుకుని, టెండర్ల దశకు చేరిందని తెలిపారు. మెగా సోలార్ ప్రాజెక్టు పురోగతిని గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ చైర్మన్ సాయిప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేసినట్టు ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ విద్యుత్‌పై చేసే సబ్సిడీ 2015–16లో రూ.3,156 కోట్లు ఉంటే, 2020–21 నాటికి ఇది రూ.8,354 కోట్లకు చేరిందని ఇంధన శాఖ పేర్కొంది. ప్రస్తుతం డిస్కమ్‌లు విద్యుత్ కొనుగోలుకు యూనిట్‌కు రూ.4.68 చెల్లిస్తున్నాయని, అదే సమయంలో సౌర విద్యుత్ ధర రూ.2.43 నుంచి రూ.3.02 వరకు ఉందని తెలిపింది. రాష్ట్రంలో మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే రానున్న 30 ఏళ్ల కాలంలో రాష్ట్రం రూ.48,800 కోట్లకు పైగా ఆదా చేయవచ్చునని ఏపీజీఈసీఎల్ అధికారులు అంచనా వేసినట్టు పేర్కొన్నారు. సౌర విద్యుత్ ప్రాజెక్టు యూనిట్లను అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. సాంకేతిక ప్రమాణాల ఆధారంగా సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రజాశక్తి భవనాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శుక్రవారం రోజున సీఎం కంప్యూటర్ బటన్ నొక్కి ప్రజాశక్తి దినపత్రిక కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి దినపత్రిక యాజమాన్యం, సిబ్బందికి సీఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పి అభినందించారు. కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్) జీవీడీ కృష్ణమోహన్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. మధుతో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (ప్రజల అజెండాయే.. సీఎం జగన్ అజెండా) -
చంద్రబాబుకు బాలినేని సవాల్!
సాక్షి, విజయవాడ: ఉచిత విద్యుత్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, రైతులకు అన్యాయం జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేదంటే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్ తీసుకొచ్చిందే వైఎస్సార్ అని అన్నారు. పగటిపూట 9 గంటల పాటు సీఎం జగన్ ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారని తెలిపారు. రైతుల ఉచిత విద్యుత్ కోసం రూ. 1700 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి రైతుకి ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఉచిత విద్యుత్ వ్యతిరేకి అని మండిపడ్డారు. తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాలన్న విషయాన్ని రైతులు మర్చిపోలేదని చెప్పారు. విద్యుత్ బకాయిలు పెంచి రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు. కేంద్రం సూచించిన నిబంధనలను రైతులకు మేలు చేసేలా మార్చామని తెలిపారు. సీఎంగా జగన్ ఉన్నంతవరకు ఉచిత విద్యుత్ అందిస్తామని బాలినేని చెప్పారు. చదవండి: అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్ -
క్షమాపణలు చెప్పకపోతే.. చట్టపరమైన చర్యలు
ఒంగోలు: తమిళనాడులో పట్టుబడ్డ డబ్బుతో తనకు సంబంధం లేదని చెప్పినా కూడా తప్పుడు ట్వీట్లు పదే పదే చేసిన వారు, వాటిని ప్రసారం చేసిన చానళ్లు తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. జూలై 14న తమిళనాడు ఎలపూరు చెక్‌పోస్టు వద్ద ఓ కారులో పట్టుబడిన నగదును పోలీసులు ఐటీ అధికారులకు అప్పజెప్పిన సంగతి విదితమే. అయితే ఆ కారుపై ఆంధ్రప్రదేశ్ ఎంఎల్ఏ స్టిక్కర్ ఉండటంతో తమిళ, కొన్ని తెలుగు మీడియా వారు డబ్బుతో తనకు సంబంధం ఉందనుకున్నారని, ఆ విషయాన్ని ఖండిస్తూ పూర్తిస్థాయి విచారణకు తాను సిద్ధం అని అన్ని మీడియాలకు సందేశాన్ని పంపానని మంత్రి పేర్కొన్నారు. కానీ టీవీ 5 చానల్, టీడీపీ నేతలు తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేశారన్నారు. నారా లోకేష్ తనపై తప్పుడు ట్వీట్లు చేస్తే.. వాటిని టీవీ 5 పదేపదే ప్రచారం చేసిందన్నారు. లాయర్ నోటీసులను లోకేష్, బోండా ఉమా, బొల్లినేని రాజగోపాల్‌నాయుడు, రవీంద్రనాథ్, సాంబశివరావు, కొమ్మారెడ్డి పట్టాభిరాం, న్యూస్18, టీవీ5 చానళ్లకు పంపించారు. -
నారా లోకేష్‌కు లీగల్ నోటీసు
సాక్షి, ప్రకాశం: తనపై తప్పుడు ప్రచారం చేసిన మీడియా చానళ్లు, టీడీపీ నాయకులకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం లీగల్ నోటిసులు పంపారు. తమిళనాడులో తనకుసంబంధించిన డబ్బు దొరికిందంటూ టీవీ5, న్యూస్18 మీడియాల్లో ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనపై లేనిది కల్పించి తప్పుడు వార్తలను ప్రచారం చేయింటారంటూ మంత్రి బాలినేని టీడీపీ నాయకులైన నారా లోకేష్, బొండా ఉమా, కొమ్మరెడ్డి పట్టాభిలతో పాటు టీవీ5, న్యూస్-18 ఛానళ్లకు ఆయన లీగల్ నోటీసులు పంపి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. కాగా, తమిళనాడులో గత నెలలో పోలీసులకు పట్టుబడ్డ 5 కోట్ల రూపాయల నగదు మంత్రి బాలినేనిదేనని టీడీపీ నాయకులు, కొన్ని మీడియా చానళ్లు అసత్య ప్రచారం చేశాయి. పట్టుబడ్డ 5 కోట్ల రూపాయాలు తమవేనని ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు ప్రకటించినా పట్టించుకోకుండా పదేపదే టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి బాలినేని న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. (ఎవరికీ సంబంధం లేదు.. ఆ 5 కోట్లు మావే) -
మంత్రి బాలినేని శ్రీనివాస్‌కు కరోనా..
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం కేసులు 1,76,333కి చేరాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. కొన్ని రోజుల నుంచి స్వల్ప జ్వరంలో బాధపడుతున్న మంత్రి బాలినేని.. కరోనా పరీక్షలు చేయించుకోగా మొదట్లో నెగిటివ్ వచ్చింది. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని తన స్వగృహంలో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే జ్వరం వస్తూ పోతూ ఉండటంతో మంగళవారం మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్న బాలినేనికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన వెంటనే నగరంలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్) కాగా ప్రస్తుతం బాలినేని ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన పీఆర్వో తెలిపారు. ‘నేను ఆరోగ్యంగా ఉన్నాను. అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాను. త్వరలోనే ఇంటికి చేరుకుంటాను’. అని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మంత్రి సందేశం పంపారు. -
'బాలినేని సవాల్‌ను స్వీకరించే దమ్ము టీడీపీకి లేదు'
సాక్షి, ప్రకాశం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని టీడీపీ నేతలు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ అన్నారు. ఏడాది పాలనపై ఆరోపించడానికి ఏమీ లేక మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై టీడీపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడో తమిళనాడులో కారులో నగదు దొరికితే దానిని మంత్రి బాలినేనికి అంటగట్టడం సిగ్గుచేటు. (ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ) ఆ డబ్బుకు సంబంధించిన సదురు వ్యాపారి అది తమదేనని ప్రకటించినా ఆరోపణలు కొనసాగించడం పచ్చనేతల దిగజారుడు తనానికి నిదర్శనం. తన తప్పు నిరూపిస్తే మంత్రి పదవిని వదులుకుంటానన్న బాలినేని సవాల్‌ను స్వీకరించే దమ్ము టీడీపీ నేతలకు లేదు. లోకేష్‌లాగా బాలినేని దొడ్డిదారిలో మంత్రి కాలేదు. అయిదు సార్లు ప్రజల మద్దతుతో ఎన్నికయ్యారని బుర్రా మధుసూధన్ యాదవ్ పేర్కొన్నారు. (చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్‌లతో డ్రామాలు ఆపాలి) -
ఎవరికీ సంబంధం లేదు.. ఆ 5 కోట్లు మావే
సాక్షి, చెన్నై : తమిళనాడులో పట్టుబడ్డ 5 కోట్ల రూపాయాలు మావేనని ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బుతో ఏ రాజకీయ నాయకుడికీ సంబంధం లేదన్నారు. లాక్డౌన్ కారణంగా ఆ నగదు ఇంట్లోనే ఉంచామని, బంగారం కొనేందుకు చెన్నై వెళ్తుండగా వాహనం పోలీసులకు పట్టుబడిందని గురువారం వివరించారు. కాగా 5 కోట్ల నగదుతో వెళ్తున్న ఓ వాహనాన్ని చెన్నై పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తూ.. ఆ వాహనం వైఎస్సార్సీపీకి చెందిన నాయకులదంటూ నిందలు వేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ ఆరోపణలపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. చెన్నై పోలీసులకు చిక్కిన ఆ ఐదు కోట్ల రూపాయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, కుట్రపూరితంగానే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కారు దొరికిన సమయంలో తాను మంత్రిమండలి సమావేశంలో ఉన్నానని, ఆ విషయం తనకు సమావేశం అయిపోయే వరకూ తెలీదని మంత్రి బాలినేని అన్నారు. పోలీసులకు దొరికిన డబ్బు తనదని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకుంటానని సవాలు విసిరారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేత బొండా ఉమా క్షమాపనలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘లోకేష్ కూడా ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా జీవితంలో ప్రజలు తిరస్కరించారు. జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలిచావా లోకేష్? నా గురించి, నా రాజకీయ జీవితం గురించి మీ టీడీపీ నాయకులే చెప్తారు నేను మచ్చలేని వ్యక్తిని. ఆ విషయం తెలుసుకొని మాట్లాడాలి. కారుపై ఉన్న జీరాక్స్ స్టిక్కర్ గురించి ఎస్పీకి ఫిర్యాదు చేశాం.’ అని పేర్కొన్నారు. -
‘ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తాం’
సాక్షి, ప్రకాశం: జిల్లా కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన మాపాలన - మీ సూచన కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి పలు సూచనలు,సలహాలు, ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరును అడిగి తెలిసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో అందరూ సంతృప్తిగా ఉన్నారన్నారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్యను అందించాలని సీఎం గట్టి సంకల్పంతో ఉన్నారు. 98 శాతం తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ మీడియంకే మొగ్గు చూపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తాం. తొలి ఏడాది నుంచే ముఖ్యమంత్రి విద్యరంగంలో ఎన్నో గొప్ప పథకాలను అమలు చేస్తున్నారు అని బాలినేని అన్నారు. (సీఎం జగన్ పండుగలా దిగివచ్చారు) -
‘కరోనా ప్రభావం తగ్గడంతోనే బాబొచ్చారు’
సాక్షి, ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చంద్రబాబు పాలనలో దళితులకు అన్యాయం జరిగితే సీఎం వైఎస్ జగన్ పాలనలో దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ఏడాది కాలంలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. అది జీర్ణించు కోలేక ప్రతిపక్ష పార్టీలు అనవసర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన ఒంగోలులో సోమవారం మీడియాతో మాట్లాడారు. కరోనా కష్ట సమయంలో వలంటీర్లు అందించిన సేవలు అభినందనీయమని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కొనియాడారు. కోర్టు తీర్పులు, మీడియాను అడ్డు పెట్టుకొని ప్రతిపక్ష టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ టూర్ ఎంచుకున్నారని విమర్శించారు. కరోనా సోకుతుందనే భయంతో ఇన్ని రోజులు హైదరాబాద్‌లోనే ఉన్న చంద్రబాబు ఇప్పడు ప్రజల వద్దకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గడంతో బాబు మళ్లీ ఏపీ బాట పట్టారని ఎద్దేవా చేశారు. ఆయనను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: రెండు నెలల తర్వాత ఏపీకి చంద్రబాబు) -
విద్యుత్ చార్జీలు పెంచలేదు: బాలినేని
సాక్షి, ప్రకాశం : .ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. శ్లాబుల ధరలు ఎక్కడ పెంచలేదని, గతంలో ఏదైతే విద్యుత్ చార్జీలు ఉన్నాయే వాటినే ప్రస్తుతం అమలు పరుస్తున్నామని మంత్రి స్పస్టం చేశారు. శుక్రవారం మంత్రి బాలినేని మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు ఎక్కవ రావడంతో ప్రస్తుతం ప్రజల్లో అపోహలు నెలకొన్నాయన్నారు. మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా జరగడం వల్ల బిల్లులు పెరిగాయని, దీనిపై అధికారులు ప్రజల్లో అవగాహన పెంచాలని పేర్కొన్నారు (విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం: బుగ్గన) మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ...మాచవరం మృతుల సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి పరమార్శించేందుకు మంత్రులను పంపించి 5లక్షల ఎక్స్ గ్రేషియాను 10 లక్షలకు పెంచారని తెలిపారు. భాదిత కుటుంబాల్లో బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగం కల్పించాలని దళిత సంఘాలు కోరాయని, .దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తిమ్మసముద్రంలో చెరువులో పడ్డ బాలున్ని కాపాడబోయి మృతి చెందిన ముగ్గురు మహిళల కుటుంబాలను కూడా ఆదుకుంటాని మంత్రి పేర్కొన్నారు. (‘విద్యుత్ చార్జీలు పెరిగాయన్నది అవాస్తవం’) -
కష్టకాలంలో ‘పవర్’ రికార్డ్
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లలో ఏపీ విద్యుత్ సంస్థలు మరో రికార్డు సృష్టించాయి. ఏప్రిల్‌లో బహిరంగ మార్కెట్లో చౌకగా విద్యుత్ కొనుగోలు చేసి రూ.132 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశాయి. నిర్ధేశిత లక్ష్యం సాధించిన ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబును ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి అభినందించారు. విద్యుత్ శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం... ► లాక్డౌన్ ప్రకటించిన వెంటనే చౌక విద్యుత్ కొనుగోళ్లపై ఇంధన శాఖ దృష్టి పెట్టింది. వాణిజ్య, పారిశ్రామిక వినియోగం తగ్గిన నేపథ్యంలో విద్యుత్ కొనుగోలులో కొంతైనా ఆదా చేయాలని భావించగా.. దీనికోసం ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు నేతృత్వంలో అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ► మార్కెట్ పరిస్థితుల్ని అంచనా వేస్తూ అధికారులు పీపీఏలున్న విద్యుత్, మార్కెట్లో లభించే విద్యుత్ ధరలను పోల్చుకుంటూ.. ఏది తక్కువగా ఉంటే దాన్నే కొనుగోలు చేశారు. ► ఏప్రిల్‌లో 824.88 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేశారు. ముందెన్నడూ లేనివిధంగా యూనిట్‌కు రూ.2.16 నుంచి రూ.2.66 మాత్రమే చెల్లించారు. ఏపీ ఈఆర్సీ అనుమతించిన ధర కంటే రూ.1.60 (యూనిట్‌కు) తక్కువకే కొన్నారు. దీనివల్ల ఒక్క ఏప్రిల్ నెలలోనే రూ.132 కోట్లు ఆదా చేయగలిగారు. ► చౌక విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని నిలిపేశారు. దీంతో థర్మల్ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు పెరిగాయి. నేడు సీఎం సమీక్ష సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విద్యుత్ శాఖపై బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ కోసం చేపడుతున్న 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై ఈ సమీక్షలో చర్చించే వీలుంది. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టుల పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించే అవకాశం ఉందని ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి. విద్యుత్ బిల్లుల చెల్లింపులు తగ్గిపోవడం.. వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ డిమాండ్ పడిపోవడం తదితర పరిణామాలపై సీఎం ఆరా తీసే వీలుంది. ఇదే కృషి కొనసాగాలి కష్టకాలంలో రూ.132 కోట్ల ప్రజాధనం ఆదా చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థను గట్టెక్కించడానికి ఇదే రకమైన కృషి జరగాలి. – బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి -
ప్రకాశం జిల్లాలో సున్నా వడ్డీ ప్రారంభం
-
ఆందోళన వద్దు: మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం: చీరాలో వెలుగు చూసిన రెండు కరోనా పాజిటివ్ కేసుల వ్యక్తులు 280 మంది బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఆ బృందంలోని 200 మందిని గుర్తించి ఐసోలేషన్, క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించమన్నారు. (పారిశుధ్య కార్మికులకు కరోనా ఎఫెక్ట్!) కాగా ప్రస్తుతం వారి రిపోర్టులు రావాల్సి ఉందని, వీరి కోసం ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇక మిగతా వారిని కూడా గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీకి వెల్లోచ్చిన బృందంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూడటం.. వీరివెంట అధిక సంఖ్యలో ప్రజలు ఉండటంతో కొంత భయానక వాతావారణం నెలకొందన్నారు. దీనిపై ప్రజలు ఎవ్వరూ కూడా ఆందోళన పడొద్దని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిచాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అధికారులు, వైద్యులు చెప్పిన సూచనలు తూచ తప్పకుండా పాటించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు కఠిన తరం అయినప్పటికీ పాటించక తప్పదని మంత్రి సూచించారు. (ఇంటికెళ్లాలని ఉంది: కనికా కపూర్) -
చంద్రబాబు కనుసన్నల్లో రమేష్ కుమార్..
సాక్షి, ఒంగోలు: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా ఒక కుట్ర అని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదని, ఎన్నికల కమిషన్ నిర్ణయం వల్ల 14వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని మంత్రి బాలినేని అన్నారు. (ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా) ఎన్నికల కమిషనర్ ...చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నారనే అనుమానాలు బలపడ్డాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి సీఎం జగన్ ...ఎన్నికల కమిషనర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని కోరారు. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహించే వ్యక్తిని కమిషనర్‌గా నియమించాలని మంత్రి బాలినేని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. (రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్ ఆగ్రహం) -
మహిళల భద్రతే సీఎం జగన్ మోదటి ప్రాధాన్యత
-
ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో బీచ్ ఫెస్టివల్
-
చంద్రబాబు.. ఎక్కడ దాక్కున్నారు
-
ఇంతటి అవినీతి పచ్చ మీడియాకు కనిపించలేదా..?
-
‘బాబు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు..’
సాక్షి, నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఇప్పడు నిజమవుతున్నాయని మాజీ ఆర్థికశాఖ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గత వారం రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన జిల్లాలో మాట్లాడుతూ.. అవినీతి కేసుల్లో విచారణను తప్పించుకునేందుకే కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. నిత్యం మీడియా సమావేశాలు పెట్టి హడావిడి చేసే చంద్రబాబు.. ఎక్కడ దాక్కున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాజీ కార్యదర్శికి అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చామని ప్రశ్నించారు. మాజీ కార్యదర్శి శ్రీనివాస్‌తోపాటు టీడీపీ నేతల వెనక ఎవరున్నారో అందరికీ తెలుసని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. (‘ఇది ఉల్లిపాయపై పొర మాత్రమే’) మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం: చంద్రబాబు అండ్ కో రూ. 2 వేల కోట్లు దోపిడి చేసి టీడీపీ నేతలు కిక్కురుమనడం లేదని విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. టీటికి మాటికి పిచ్చి రాతలు రాసే ఆంధ్రజ్యోతి, ఈనాడుకి రూ.2 వేల కోట్ల స్కాం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. స్కాం వివరాలు బయటపడ్డాక చంద్రబాబు, లోకేష్ నోర్లు మూత పడ్డాయా అని నిలదీశారు. ఒక్క సీఏ దగ్గరే రెండు వేల కోట్ల స్కాం బయటపడితే.. ఇక చంద్రబాబు అవినీతి ఎన్ని వేల కోట్లు ఉంటుందన్నారు. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. స్కాంలో బాబు పాత్ర కూడా ఉందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకుని బాబు అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. (రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం!) ఎమ్మెల్యే కిలారి రోశయ్య గుంటూరు : చంద్రబాబు అవినీతి బండారం బట్టబయలైందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య విమర్శించారు. నిప్పు అని చెప్పుకునే బాబు ఇప్పుడేం చెప్తారని ఎద్దేవా చేశారు. సీబీఐ, ఈడీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పరిపాలన అందించాలని ప్రజలు అయిదేళ్లు బాబుకు అధికారం అందిస్తే ఆయన రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం : వానపాము లాంటివారిపైన ఐటీ దాడులు జరిగితేనే రెండువేల కోట్లు బయటపడ్డాయంటే.. అనకొండ లాంటి చంద్రబాబు మీద విచారణ జరిపితే లక్షల కోట్లు బయటపడతాయని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృసారాణీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమరావతి గ్రాఫిక్స్ చూపించి చంద్రబాబు లక్షల కోట్లు ప్రజాధనం లూటీ చేశారని తాము చెప్పింది నిజమవుతుందని అన్నారు. డొల్ల కంపెనీలు సృష్టి, అక్రమ మార్గంలో రాష్ట్ర ప్రజల సొమ్ము విదేశాలకు తరలింపులో చంద్రబాబు పాత్రే కీలకమని విమర్శించారు. చదవండి : పెళ్లితో ఒక్కటైన ఇద్దరమ్మాయిలు -
చీరాల ఇన్చార్జి ఆమంచే.. స్పష్టం చేసిన బాలినేని
సాక్షి, ఒంగోలు: చీరాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహనేనని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇక మీదట కూడా ఆయనే కొనసాగుతారని స్పష్టం చేశారు. మంగళవారం మంత్రి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలన్నీ ఆమంచి నేతృత్వంలోనే జరుగుతాయని చెప్పారు. ఇందులో ఎటువంటి అపోహలకూ తావు లేదని పునరుద్ఘాటించారు. ఆమంచి నాయకత్వంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని బాలినేని పిలుపునిచ్చారు. -
అది చంద్రబాబు, పవన్‌కే సాధ్యం: బాలినేని
సాక్షి, ఒంగోలు : పార్టీలు మారడం, పొత్తు పెట్టుకోవడం ఒక్క చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కే సాధ్యమవుతుందని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. మొన్నటి వరకు వామపక్ష పార్టీలతో కలిసి బీజేపీని తిట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఆయనకే చెల్లుతందని మండిపడ్డారు. ఎవరు ఎనన్ని పొత్తులు పెట్టుకున్నా తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జంకే పరిస్థితే లేదని అన్నారు. తమ పార్టీ ఏకపక్షంగానే ఉంటుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడు ఒకటే స్టాండ్ మీద వున్నారని తెలిపారు. -
వికేంద్రీకరణే మేలు.. ఎలుగెత్తిన గళాలు
‘అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావాలా.. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందటం మీకు ఇష్టం లేదా.. పాలనా వికేంద్రీకరణతో అభివృద్ధికి బాటలు పడుతుంటే అడ్డుకుంటారా.. మీ స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధి అంతా అమరావతికే పరిమితం కావాలా..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలు విరుచుకుపడ్డారు. పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమన్న శివరామకృష్ణన్, బీఎన్ రావు కమిటీలు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు మేలు కలుగుతుందని నినదిస్తూ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అంతా ఒక్కటై కదం తొక్కారు. శనివారం పలుచోట్ల ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ఒంగోలు సిటీ: వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, శివరామకృష్ణన్, బీఎన్ రావు కమిటీలతోపాటు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలను అమలు చేయాలని కోరుతూ ఒంగోలు ప్రజలు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు భారీ ఎత్తున తరలివచ్చారు. ర్యాలీకి సంఘీభావం తెలిపిన రాష్ట్ర ఇంధన, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాజధానిని అమరావతికే పరిమితం చేయాలంటూ రైతులను, ప్రజలను రెచ్చగొట్టి కపట నాటకాలు ఆడుతున్న చంద్రబాబు వాటికి ఇకనైనా తెరదించాలని సూచించారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య పాల్గొన్నారు. కదం తొక్కిన గిరిజనులు పాయకరావుపేట/పాడేరు: విశాఖ జిల్లా పాయకరావుపేట, పాడేరులో శనివారం భారీ ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యే బాబూరావు మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక కేంద్రం ఏర్పాటును స్వాగతించాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా అందరి పైనా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, పాడేరు మండలం వనుగుపల్లిలోనూ గిరిజనులు భారీ ర్యాలీ జరిపారు. ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్బ నరసింగరావు పాల్గొన్నారు. ఆస్తుల్ని కాపాడుకునేందుకే చంద్రబాబు రాద్ధాంతం మదనపల్లె/నగరి (చిత్తూరు జిల్లా): అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా మదనపల్లె, నగరిలో మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. వారికి ఎమ్మెల్యే నవాజ్‌బాషా, సినీ దర్శకులు, ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమరావతిలో రైతులను మోసగించి కొన్న భూములు, ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం వైఎస్ జగన్ ఆలోచనను స్వాగతిస్తున్నామన్నారు. సెల్వమణి మాట్లాడుతూ గతంలో రాజధాని పేరిట మద్రాసు, హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయిందన్నారు. పాలన వికేంద్రీకరణతోనే అన్ని జిల్లాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి హిందూపురం: పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని మహిళలు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు నినదించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మద్దతు ప్రకటించి మాట్లాడుతూ వికేంద్రీకరణ చేస్తేనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని నిపుణుల కమిటీలు, విశ్లేషకులు చెబుతున్నారని, ఆ దిశగానే ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని వివరించారు. అమరావతిలో టీడీపీ నేతలు సాగించిన రియల్ బాగోతం త్వరలోనే బట్టబయలవుతుందన్నారు. ‘సీమ ద్రోహులను అడుగుపెట్టనివ్వం’ కర్నూలు (సెంట్రల్): అమరావతి పేరుతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎవరైనా యాత్రలంటూ రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటామని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, రాయలసీమ పోరాట సమితి అధ్యక్షుడు రవికుమార్ హెచ్చరించారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలంటూ కర్నూలు కలెక్టరేట్లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. లక్షల కోట్లు దోచుకుని జోలె పడతారా.. శ్రీకాకుళం: శ్రీకాకుళం, టెక్కలి, శ్రీకాకుళం, జి.సిగడాం తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు. శ్రీకాకుళంలో మాజీ ఎంపీ కిల్లి కృపారాణి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు గడిచినా ఉత్తరాంధ్ర నేటికీ వెనుకబడి ఉందన్నారు. రూ.లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు రాజధాని పేరుతో జోలెపట్టి భిక్షాటన చేయడం సిగ్గు చేటన్నారు. ర్యాలీల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ పాల్గొని మద్దతు తెలిపారు. సమతుల అభివృద్ధి కోరుతూ.. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: నిపుణుల కమిటీల సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు సమతుల అభివృద్ధి చెందేలా వికేంద్రీకరణ చేపట్టాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లాలో శనివారం భారీ ర్యాలీలు నిర్వహించారు. కాకినాడలో ప్రదర్శనకు ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం ప్రకటించారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని బాలాంత్రం గ్రామం, కాకినాడ భానుగుడి సెంటర్, అనపర్తి తదితర ప్రాంతాల్లో ర్యాలీలు కొనసాగాయి. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. సాగర తీరంలో కదం తొక్కిన విద్యార్థులు బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని విద్యార్థులు నినదించారు. హార్బర్ ఇంటర్నేషనల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు సాగర తీరంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి పాల్గొని మద్దతు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల రాజధానులతో పోటీపడే స్థాయి మన రాష్ట్రంలో విశాఖపట్నానికి మాత్రమే ఉందని ఆమె పేర్కొన్నారు. మేధావుల నిర్ణయం మేరకే వికేంద్రీకరణ సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, తణుకు, అత్తిలి, ఇరగవరం ప్రాంతాల్లో శనివారం ప్రదర్శనలు జరిగాయి. కొవ్వూరులో కార్యక్రమానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హాజరై మద్దతు తెలిపారు. తణుకు, ఇరగవరంలో నిర్వహించిన ర్యాలీల్లో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. పరిపాలనా రాజధానిగా విశాఖ అనువైనది విజయనగరం: విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిర్వహించిన చర్చాగోష్టిలో మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖ అనువైనదని వక్తలు పేర్కొన్నారు. పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లో జరిగిన ర్యాలీలకు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మద్దతు ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్య వేదిక విజయనగరం కోట జంక్షన్లో ర్యాలీ నిర్వహించింది. మూడు రాజధానుల విషయంలో అడుగులు ముందుకే..: మంత్రి కొడాలి నాని గుడివాడ: చంద్రబాబు, ఎల్లో మీడియా డాంబికాలకు భయపడే ప్రసక్తే లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. స్థానిక కే కన్వెన్షన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాలన వికేంద్రీకరణ విషయంలో మూడు కమిటీల అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని, ఇక అడుగులు ముందుకే పడతాయని స్పష్టం చేశారు. రైతులు చర్చలకు సిద్ధమైతే తాను స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి నష్టం జరగకుండా చూస్తానన్నారు. విభజన సమయంలో రాష్ట్రం రూ.90 వేల కోట్ల అప్పుల్లో ఉందని, చంద్రబాబు పాలనలో మరో రూ.2.50 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. రాజధాని పేరుతో చంద్రబాబు ఒక కులాన్ని, వర్గాన్ని, డబ్బా మీడియాను వెనకేసుకుని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారం ఉంది కదా అని అభివృద్ధిని అమరావతికే పరిమితం చేసి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకొచ్చాక అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయాల్సిన పరిస్థితి సీఎం వైఎస్ జగన్‌పై పడిందన్నారు. సమావేశంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమంగా అభివృద్ధి చెందుతాయి. రాజధాని ఒక ప్రాంతంలోనే ఉంటే అభివృద్ధి మొత్తం ఆ ప్రాంతానికే పరిమితమవుతుంది. లక్షల కోట్ల రూపాయలు ఒక్కచోటే పోస్తే మిగిలిన ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయి. ప్రభుత్వ నిర్ణయానికి ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ఉంటుంది. – చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, ఏపీ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సీమ అభివృద్ధిని చంద్రబాబు పట్టించుకోలేదు పాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం. చంద్రబాబు హయాంలో సీమ అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోలేదు. రాజధానికి అమరావతి ప్రాంతం అనుకూలంకాదని పలువురు నిపుణులు చెప్పినా.. పెడచెవిన పెట్టారు. అక్కడే రాజధాని ఏర్పాటు చేసి.. నేడు కొందరికి మద్దతు తెలపడం శోచనీయం. పాలనా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటిస్తే.. చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. –బొజ్జ దశరథరామిరెడ్డి, జాతీయ రైతు సంఘాల సమాఖ్య కార్యదర్శి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపుతూ చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టారు. కక్ష పూరిత చర్యలతో మరోసారి ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడడం చంద్రబాబు రాజనీతికి నిదర్శనం. పాలన వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. సీమ వాసిగా ఉండి తన 15 ఏళ్ల పాలనలో సీమ అభివృద్ధికి ఏనాడూ చర్యలు తీసుకోని బాబు.. నేడు రాయలసీమలో రాజధానులపై ర్యాలీ చేయడం విడ్డూరం. –డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాల అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణతో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలు వచ్చే అవకాశం ఉండదు. పరిపాలనా వికేంద్రీకరణను వేళ్ల మీద లెక్కించే కొందరే వ్యతిరేకిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు, అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వారే ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మద్దతిస్తోంది. – చల్లా జయశంకరరెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు సీఎం నిర్ణయం అభినందనీయం రాష్ట్రంలో మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకోవడంతో పాటు హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం హర్షణీయం. విశాఖలో సుమారు రెండు లక్షల మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.. వీరిలో ఎవరికైనా హైకోర్టులో అప్పీల్ చేయాల్సి వస్తే ఇక్కడ హైకోర్టు బెంచ్ అవసరం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పరిపాలనా వికేంద్రీకరణకు పూనుకోవడం అభినందనీయం. – ప్రభుత్వ నిర్ణయానికి సంఘీభావ సభలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు పెంటకోట చంద్రరావు -
ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు : మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడేటప్పడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని టీడీపీ అధినేత చంద్రబాబుపై విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. మూడు రాజధానులకు మద్దతుగా ఒంగోలులో శనివారం మంత్రి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ.. అయిదేళ్లలో చంద్రబాబు చేసిందేమి లేదని విమర్శించారు. చంద్రబాబు ఒక చేతకాని వాడని, ఆయన కొడుకు లోకేశ్ శుద్ధ పప్పు అని మండిపడ్డారు. అమరావతిలో సచివాలయానికి వెళ్లడానికి రోడ్డు కూడా వేయలేని చేతకాని వాడు చంద్రబాబు అని, వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేశ్‌కు లేదని దుయ్యబట్టారు. రాజధానిని గ్రాఫిక్స్‌లో చూపించడం తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలన్న ఉద్దేశంలోనే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకు వచ్చారని, దీన్ని ప్రజలు అభినందిస్తున్నారని అన్నారు. -
‘అయిదేళ్లలో రూ. 5 వేల కోట్ల అప్పు’
సాక్షి, ప్రకాశం : మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పచ్చ చొక్కాల నేతలకు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. మార్టూరు బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. అయిదు సంవత్సరాల్లో చంద్రబాబు రూ.5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను మోసగించారని విమర్శించారు. అలాగే ఉగాది నాటికి డ్వాక్రా రుణాలను మొత్తం మాఫీ చేస్తామని అన్నారు. రాజధాని పేరులో వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన చంద్రబాబు తన అనుచరులకు ధారాదత్తం చేశారని మత్స్యశాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణ దుయ్యబట్టారు. లక్ష కోట్ల రుపాయలు ఒకే ప్రాంతంలో పెట్టే కంటే అభివృద్ధిని వికేంద్రికరణ చేయడంతో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. దిశ చట్టాన్ని ఏపీ అమలు చేస్తూ నిందితలకు 21 రోజుల్లో శిక్ష పడే చట్టాన్ని తెచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. -
నష్టాల్లో ఉన్నా విద్యుత్ టారిఫ్‌లను పెంచం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విద్యుత్ శాఖ నష్టాల్లో ఉన్నా విద్యుత్ టారిఫ్‌ను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విజయవాడ ఐదో నంబర్ రూట్లో పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) ప్రధాన కార్యాలయాన్ని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, గద్దె రామ్మోహన్‌లతో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎనిమిది జిల్లాలకు కలిపి తిరుపతి కేంద్రంగా ఉండేదని చెప్పారు. విద్యుత్తు రంగంలో సంస్కరణల్లో భాగంగా సెంట్రల్ పవర్ డి్రస్టిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను మూడు జిల్లాలకు కలిపి ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వ చర్యల వల్ల విద్యుత్ శాఖ రూ.70 వేల కోట్ల నష్టాల్లో ఉందన్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా వినియోగదారులపై భారం మోపవద్దని సీఎం స్పష్టం చేశారని చెప్పారు. ఆరు నెలల్లో ఎన్నో విద్యుత్ సంస్కరణలు.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆరు నెలల పాలనలో ఎన్నో విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చారని చెప్పారు. ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నెడ్ క్యాప్ ఎండీ రమణారెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాధరావు మాట్లాడుతూ.. పారిశ్రామికంగా గుంటూరు, కృష్ణా జిల్లాలు, వ్యవసాయం, ఆక్వా రంగాల్లో ప్రకాశం జిల్లా ముందున్నాయన్నారు. -
ఒప్పందాలు రద్దు కాలేవు: బాలినేని
సాక్షి, అమరావతి: సంప్రదాయేతర ఇంధన కంపెనీలు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్లబోతున్నాయని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముప్పులాంటిదంటూ వచ్చిన కథనాలు దుష్ప్రచారమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలును నిలిపివేయలేదని వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు నిర్దేశించిన విధంగా ఈఆర్సీ ఇచ్చే నిర్ణయాలను అమలు చేస్తూ చట్టప్రకారం ముందుకు సాగుతాం. ప్రభుత్వం కేవలం సంప్రదాయేతర ఇంధనాన్ని సమకూర్చే సంస్థలకే కాదు. ఇతర కరెంటు కంపెనీలకూ బకాయిలు పడింది. గడిచిన 16, 18 నెలలుగా రూ.18 వేల కోట్లపైబడి బకాయిలు ఉన్నాయి. తాను ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వానికి పాపాలు అంటగడుతూ గురివింద మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు విద్యుత్‌రంగం గురించి మాట్లాడే అర్హత కోల్పోయారు. ఈ అప్పులు తీర్చడానికి రాయితీలతో కూడిన రుణాలు మంజూరుచేయాలన్న ప్రతిపాదనను కేంద్రం పరిశీలన చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతి రహిత, పారదర్శక విధానాలను తీసుకువస్తున్నారు ఆయన నిర్ణయాలతో విద్యుత్ రంగానికి పునరుజ్జీవం వస్తుంద’ని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు’
సాక్షి, విజయవాడ : 2020 నాటికి అన్ని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలిస్తామని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, నగరపాలకసంస్ధ సంయుక్త భాగస్వామ్యంతో మంగళవారం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ వ్యర్థాల నుంచి ఇటుకలు, టైల్స్ తయారు చేయడాన్ని మంత్రి బాలినేని పరిశీలించారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ కంపెనీలకు తరలించే వాహనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం శుభపరిణామమన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేంధించేలా చర్యలు చేపట్టినట్లు, 110 మున్సిపాలిటీల్లో ఈ విధానం తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ నిషేధించాలన్న కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని, 44 మున్సిపాలిటీల్లో మెటీరియల్ రికవరీ సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలో 7 చోట్ల కంపోస్ట్ పాయింట్స్ ఏర్పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో గత కొన్నేళ్లుగా డంపింగ్ యార్డు సమస్యగా మారిందని స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. నగరంలో ప్రతిరోజు 500 టన్నుల చెత్త ఉత్పత్తి అయి ఈ యార్డుకు చేరుతుందని, పనికిరానీ వ్యర్థాలను సిమెంట్ కంపెనీలకు పంపడం ద్వారా కొంత వరకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి మార్చడం లో గత ప్రభుత్వం విఫలమైందని, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, నగర పాలక సంస్థ, అల్ట్రాటెక్ సిమెంట్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. గుంటూరు, పాతపాడు ప్రాంతలకు డంపింగ్ యార్డు తరలించేలా చర్యలు చేపడుతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నగరంలో 7 చోట్ల కంపోస్ట్ పాయింట్స్ ఏర్పాటు చేశామని వీఎంసీ కమిషనర్ ప్రసన్న కుమార్ వెల్లడించారు. 250 టన్నుల పొడి చెత్తను ఎరువుగా మార్చే ప్రక్రియ చేపట్టామని, అల్ట్రాటెక్ సిమెంట్ వారు 50 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను ఫ్యూయల్ గా వినియోగించుకునేలా ఒప్పందం కుదిరిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ప్రసాద్ పాల్గొన్నారు. -
బాబూ నీ మనవడు చదివేదెక్కడ?
సాక్షి, ఒంగోలు : ‘చంద్రబాబు నాయుడూ నీ మనవడు ఏ స్కూల్లో చదువుతున్నాడు? పవన్‌కల్యాణ్ నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మీవాళ్లంతా ఇంగ్లిష్ మీడియంలో చదవొచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద పిల్లలకు మాత్రం ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడితే గగ్గోలు పెడతారా’ అని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వారిరువురిని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మన బడి నాడు–నేడు కార్యక్రమాన్ని గురువారం స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడాన్ని ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తుండటంపట్ల బాలినేని సభావేదికగా ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులంతా బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖకు బడ్జెట్లో 33 వేల కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని బాలినేని గుర్తు చేశారు. పేదవాళ్ల పిల్లలు కూడా ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలన్న ఉద్ధేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో దశల వారీగా ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తున్నట్లు తెలిపారు. పై చదువులు చదవాలంటే ఇంగ్లీష్ మీడియం అవసరమని గుర్తించిన ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలల్లో దానిని దశలవారీగా అమలు చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జనరంజకంగా పరిపాలన చేస్తే తాను సినిమాలు చేస్తానని పవన్‌కల్యాణ్ ప్రకటించారని, ఆయన సినిమా షూటింగ్‌కు సిద్ధం అవుతున్నారంటే జగన్ జనరంజక పాలన అందించినట్లు ఆయన చెప్పకనే చెప్పారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన నాయకులు బకాసురులుగా దోచుకుంటే అప్పుడు పవన్‌కల్యాణ్‌కు కనిపించలేదా అని బాలినేని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఇసుక పాలసపై స్పష్టమైన విధానంతో ఉన్నారని, ఒక్క ఇసుక లారీ కూడా అక్రమంగా బయటకు పోకుండా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. -
‘ఇచ్చిన మాట ప్రకారం పవన్ సినిమా చేస్తున్నాడు’
సాక్షి, ప్రకాశం : ఇసుక సమస్యపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసింది లాంగ్ మార్చ్ కాదు రాంగ్ మార్చ్ అని మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే అప్పుడు పవన్ కల్యాణ్ చోద్యం చూశాడని విమర్శించారు. చంద్రబాబు అడుగుజాడల్లో నడిచే పవన్‌కు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇంకా అర్థం కావట్లేదన్నారు. విశాఖ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచిగా పరిపాలిస్తే తాను సినిమాలు చేసుకుంటానంటూ పవన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసిన బాలినేని, జగన్ పాలన బాగుంది కాబట్టే ఆయన ఇప్పుడు సినిమా మొదలు పెడుతున్నాడని వ్యాఖ్యానించారు. -
ఆ వార్తలను ఖండిస్తున్నా: బాలినేని
సాక్షి, ఒంగోలు : చిన్నగంజాంలో ఇసుక అక్రమ తరలింపు విషయంలో తన కుమారుడిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఇసుక అక్రమ తరలింపు విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని.. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్లనే పీపీఏలపై కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇక వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అదే విధంగా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని మంత్రి తెలిపారు. అది వారే నిర్ణయించుకోవాలి.. పర్చూరు విషయంలో కుటుంబం మొత్తం ఒకే పార్టీలో ఉంటే బాగుంటుందని సీఎం వైఎస్ జగన్.... దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సూచించినట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం దగ్గుబాటిదేనని.. ఆయనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. రానున్న వారం రోజుల్లో పర్చూరు విషయంలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. కాగా ఇటీవలి ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. -
జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాలినేని
సాక్షి, నెల్లూరు : నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా విద్యుత్‌శాఖ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమించారు. మొన్నటి వరకు హోంమంత్రి మేకతోటి సుచరిత జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. ఆమె స్థానంలో జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌ను కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించారు. -
వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభించిన బాలినేని
-
విద్యార్థులందరూ బాగా చదువుకోవాలనే...
సాక్షి, ఒంగోలు : బడికి వెళ్లే విద్యార్థిని, విద్యార్థులందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని మున్సిపల్ హైస్కూల్లో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కంటిచూపు పరీక్షలు నిర్వహించారు. తమ పిల్లలకు బడికి పంపిస్తున్న ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం ద్వారా రూ. 15వేలు ఇచ్చేందుకు కార్యచరణను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి సీఎం జగన్ ఆదేశాలు
సాక్షి, అమరావతి : కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకై... సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీ, పర్యావరణ శాఖలపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో రాష్ట్రంలో అడవుల పెంపకం, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలపై సీఎం జగన్ సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..‘‘పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. లక్ష టన్నుల వ్యర్థాలు ఫార్మా కంపెనీ నుంచి వస్తే అందులో సుమారు 30 శాతం మాత్రమే శుద్దిచేస్తున్నారు. మిగతా 70 శాతం వాతావరణంలోకి వదిలేస్తున్నారన్న సమాచారం అందింది. హేచరీ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో గతంలో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హేచరీ జోన్‌గా ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలకు ఎలా అనుమతి ఇచ్చారో అర్థంకావడం లేదు. ఫార్మా కంపెనీల కోసం ఇప్పటికే మనం ఫార్మాసిటీలను ఏర్పాటు చేశాం. అక్కడే వాటిని పెట్టుకునేలా వారికి అనుతులు ఇవ్వాలి’’ అని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ‘‘ఏపీ నుంచి పెద్ద ఎత్తున సముద్రపు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. పరిశ్రమలు ఏమైనా వస్తున్నాయంటే రెడ్ కార్పెట్ వేస్తాం కాని, వాటినుంచి ఎలాంటి కాలుష్యం వస్తుందనే దానిపై మనం ఆలోచించం. వాతావరణానికి, పర్యావరణానికి ఎలాంటి భంగం కలుగుతుందనే దానిపై దృష్టిపెట్టడం లేదు. ఎన్నివేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మాత్రమే ఆలోచిస్తాం. ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ బోర్డు, సంబంధిత వ్యవస్థల్లో ప్రక్షాళన జరగాలి’ అని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ పట్ల సమగ్ర అవగాహన, పరిజ్ఞానం, అంకిత భావం ఉన్నవారు ఈ వ్యవస్థల్లో ఉండాలని,ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా ఆలోచించి. ఉత్తమ విధానాలను అనుసరించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ వేస్తుందని స్పష్టం చేశారు. పర్యావరణాన్ని, ప్రకృతిని సంరక్షించుకోకపోతే మన తర్వాత తరాలు బతకడం కష్టమవుతుందని, ఈ ఆలోచనలు చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని ఆగ్రహించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో దేశానికి తాము మార్గదర్శకంగా నిలవాలని, వివిధ దేశాల్లో అత్యుత్తమ విధానాలను అనుసరిస్తున్నపద్ధతులను అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు. నెలరోజుల్లోగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై అత్యుత్తమ విధానాలను సూచిస్తూ ప్రతిపాదనలు తయారు చేయాలని, దీనికిబిల్లులు రూపొందించండని సీఎం జగన్ సూచించారు. అంతేగాక విశాఖపట్నం కాలుష్యంతో అల్లాడుతోందని, కాలుష్యనియంత్రణ చేయకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని అధికారులను సీఎం జగన్ హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణకు, విశాఖ నగరంలో కాలుష్య నియంత్రణకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. వేస్ట్ మేనేజ్మెంట్, మురుగునీటి పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. మురుగునీటిని శుద్దిచేసిన తర్వాతే విడిచిపెట్టాలని, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్‌పై ఫ్రెంచి ప్రతినిధి బృందంతో తాను చర్చించినట్లు సీఎం తెలిపారు. పంట కాల్వలను కాపాడుకోవాలని, అవి కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉభయగోదావరి జిల్లాల్లో పూర్తిస్థాయిలో కాల్వలను పరిరక్షించాలన్నారు. మిషన్ గోదావరి తరహాలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం చేపట్టాలని, దీనిపై సరైన ప్రతిపాదనలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా పరిశ్రమలనుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేయాలని, ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇ– వేస్ట్‌కోసం కాల్ సెంటర్‌ను ఏర్పాట చేయాలని, దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ వాలంటీర్లందరికీ మొక్కలు పంపిణీ చేయాలని, చెట్లను పెంచడంలో అధికారులు వారి సహకారం తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ప్రతి ఇంటికీ నాలుగు మొక్కలు ఇవ్వాలని, కాల్వ గట్లమీద మొక్కలను వీలైనంత పెంచాలని వివరించారు. అనంతపురం, కడప ప్రాంతాల్లో అడవులను పెంచడానికి దృష్టిపెట్టాలని, ఆ ప్రాంత ప్రస్తుత నైసర్గిక స్వరూపాన్ని మార్చాలని ఆదేశించారు. అటవీశాఖ వద్ద ఉన్న ఎర్రచందనాన్ని ఏక మొత్తంగా అమ్మే పద్దతులు కాకుండా విడతల వారీగా అమ్మితే ప్రభుత్వానికి మేలు జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంటే మంచిదని, చైనా, జపాన్ సంస్థలతో చర్చలు జరపాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
అవును.. అవి దొంగ పట్టాలే!
సాక్షి, ఒంగోలు: స్వార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు అడ్డదారిలో పట్టాలు పొందేందుకు యత్నించారన్న వాదన ఇప్పుడు నిజమేనని రుజువైంది. నాడు అధికార టీడీపీ ఒత్తిడికి తలొగ్గి పోలీసు అధికారులు సైతం ఆక్రమణలను అడ్డుకున్న మహిళలపై తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసులు కూడా నమోదు చేశారు. నాడు వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అండగా నిలిచి నిలదీయడంతో బాధితులు కాస్త ఊపిరి పీల్చుకోగలిగారు. నేడు ఎన్ఎస్పీ అధికారులు ఆ భూమి తమదేనని, ఆ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించాలంటూ ఒంగోలు తహసీల్దారుకు విజ్ఞప్తి చేయడం, ఈమేరకు 20 మందిని ఆక్రమణదారులుగా పేర్కొంటూ తహసీల్దారు చిరంజీవి నోటీసులు జారీ చేయడంతో నాడు చూపించిన పట్టాలన్నీ దొంగ పట్టాలే అన్నది స్పష్టమైంది. అడ్డదారిలో ఆక్రమణకు యత్నం.. ఇళ్ల పట్టాలు అంటే నివాసం ఉండేందుకు జాగాలేని వారికి ఇచ్చేవి. ఇందుకు వారికి తెల్లరేషన్ కార్డు తప్పనిసరి. కానీ, సొంత కారు ఉన్న వారు, మెడలో బంగారు కాసులతో దిగినవారు భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు. ఒంగోలు సౌత్ బైపాస్‌లోని ఎన్ఎస్పి స్థలంతోపాటు సమీపంలోని రైతుల పొలాలను సైతం దున్నేయడం ప్రారంభించారు. తమ భూమిలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించిన వారిని తెలుగు మహిళలు దురుసుగా ప్రవర్తించారు. తమ భూమిని ఆక్రమించుకోవడం ఏమిటన్న ఓ ముస్లిం కుటుంబాన్ని అయితే కేశవరాజుకుంట రోడ్డెక్కే వరకు తరిమి తరిమి కొట్టారు. తాము గతంలోనే కొనుగోలు చేశామంటూ వారు వేడుకున్నా మాకు నాటి ఎమ్మెల్యే ఇచ్చారంటూ హెచ్చరికలు చేశారు. వీరికి మద్దతు పలికిన ఓ పోలీసు అధికారి తన సిబ్బందిని పంపించి జనాన్ని బలవంతంగా అక్కడి నుంచి పంపేందుకు యత్నించడంతో వివాదం మరింత జఠిలంగా మారింది. సంతకాలు కూడా లేకుండానే పట్టాలు జారీ ఇదిలా ఉంటే పట్టాలు చూపించాలంటూ కొందరు అడ్డం తిరగడంతో కొందరు తెలుగు మహిళలు పట్టాలు చూపించారు. తీరా వాటిలో కొన్ని పట్టాలలో తహసీల్దారు స్టాంపు ఉన్నచోట సంతకాలు ఉంటే, మరికొన్ని పట్టాలలో కనీసం తహసీల్దారు సంతకం కూడా లేకపోవడం గమనార్హం. దీంతో అసలు పట్టాలు రెవెన్యూ అధికారులే ఇచ్చారా లేదా అంటే అప్పటి తహసీల్దారు విచారణ చేస్తున్నా...పరిశీలిస్తున్నా అంటూ చెప్పడమే తప్ప తేల్చలేకపోయారు. ఇదే సమయంలో అసలు విషయం బహిర్గతమైంది. భూమి వృథాగా ఉందని, దానిని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ ఎన్ఎస్పి ఈఈ రవి అప్పట్లో తహసీల్దారు కార్యాలయానికి లేఖ రాశారు. కానీ ఆ భూమి కన్వర్షన్ కాలేదు. దీంతో ఆ భూమి తమ ఆధీనంలో ఉన్నట్లుగా ఎన్ఎస్పి అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎన్ఎస్పి స్థలానికి రెవెన్యూ అధికారులు పట్టాలు ఎలా జారీ చేశారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై పలువురు తాలూకా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఆ భూమిలోకి ఎవరూ వెళ్లరాదంటూ పోలీసులు ఆదేశించినా పోలీసులు అక్కడ ఉండగానే కొందరు భూమిలో నిర్మాణాలు ప్రారంభించారు. నిర్మాణాలను అడ్డుకోబోయిన స్థానిక మహిళలపై ఏకంగా పోలీసులు తమ విధులను అడ్డుకున్నారంటూ కేసులు నమోదు చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. రంగంలోకి దిగిన బాలినేని విషయం రచ్చరచ్చగా మారుతుండడం, చివరకు మహిళలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నామంటూ ప్రకటించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. అప్పటి వరకు అధికారులే సమస్యను పరిష్కరిస్తారని భావించిన ఆయన పరిస్థితి శ్రుతిమించుతుందని భావించి నేరుగా కాలనీకి వెళ్లారు. ఎన్ఎస్పి స్థలంలో అధికార పార్టీ నేతలకు పట్టాలు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ఎన్ఎస్పి భూమిలో ప్రైవేటు వ్యక్తులు వచ్చి ప్లాట్లుగా మార్చి పొజిషన్ చూపిస్తే వాటికి మీరు సహకరిస్తారా అంటూ నిలదీయడంతో పోలీసులు ఒకడుగు వెనక్కు తగ్గారు. దీంతో పోలీసులు ఆ భూమిలోకి ఎవరూ వెళ్లడానికి వీల్లేదంటూ హెచ్చరికలు జారీచేయడం, మరో వైపు అప్పటి జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ భూమికి సంబంధించి విచారణ చేయిస్తున్నట్లు ప్రకటించడం, ఎన్నికలు ముగిసి ప్రభుత్వం కూడా మారడంతో వివాదం కొంతమేర సద్దుమణిగింది. 20మందికి నోటీసులు జారీ అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ పూర్తి చేసిన ఎన్ఎస్పి అధికారులు మొత్తం 4.37 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిందని, ఆ భూమి తమదే అని గుర్తించారు. ఆ భూమిలోని ఆక్రమణలు తొలగించి తమ భూమికి రక్షణ కల్పించాలంటూ ఎన్ఎస్పి అధికారులు తాజాగా ఒంగోలు మండల తహసీల్దారుకు లేఖ రాశారు. తమ విచారణలో తమ భూమిలో 20మంది పట్టాలు వేసుకున్నట్లుగా గుర్తించామని పేర్కొంటూ వారి పేర్లు జత చేశారు. దీంతో వారందరికీ ఒంగోలు మండల తహసీల్దారు చిరంజీవి మంగళవారం నోటీసులు జారీ చేశారు. అక్టోబరు 1వ తేదీలోగా ఆక్రమణలను ఎందుకు తొలగించరాదో సమాధానం చెప్పాలంటూ నోటీసులలో పేర్కొన్నారు. దీంతో వారి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. -
వరికి నీరిచ్చి తీరుతాం..
సాక్షి, ఒంగోలు సిటీ: ఈ సీజన్లో వరి సాగుకు నీరిచ్చి తీరతామని రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జిల్లా రైతులు ధైర్యంగా వరి నాట్లు వేసుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ వరి రైతులకు ఈ సీజన్లో తగినంత నీరు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని, జిల్లాలో మాగాణి పంటలకు నీరు ఇవ్వనున్నామని చెప్పారు. ఈ ఏడాది ప్రాజెక్టులకు ఎగువ నుంచి వరద నీరు సమృద్ధిగా చేరిందని వివరించారు. రైతులు వరి పండించుకొనేందుకు వీలుగా ఈ సీజన్లో నీటిని విడుదల చేయడానికి సీఎం ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఆమోదం తెలిపారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు అదనంగా 12 టీఎంసీల నీరు ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. ఆమేరకు సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే వరికి నీరు రాదని, ఈ సీజన్లో మెట్ట పంటలకు మాత్రమే నీరు విడుదల చేస్తారని రైతులను పక్కదారి పట్టిస్తున్నారని, ఇలాంటి వదంతులను నమ్మొద్దని బాలినేని కోరారు. -
‘18.5 లక్షల రైతు కుటుంబాలకు ఉచిత విద్యుత్’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 18.5 లక్షల రైతు కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవంతరాలు లేకుండా చూడాలని అధికారులను మంత్రి బాలినేని శ్రీనివాస్ ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ ప్లీడర్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకాలపై అధికారులు తక్షణమే స్పందించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని హెచ్చరించారు. -
వైరల్ ఫీవర్‌తో బాలిక మృతి
ఒంగోలు సెంట్రల్: ఒంగోలులో వైరల్ ఫీవర్‌తో ఓ బాలిక బుధవారం మృతి చెందింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బాలిక కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు. అందిన వివరాల ప్రకారం.. ఒంగోలు సంతపేట 14వ డివిజన్ పరిధి ఆంజనేయస్వామి గుడి పక్కన నివసించే రెబ్బ రమేష్ కుమార్తె సిరి చందన (6) కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. తల్లిదండ్రులు కుమార్తెను సుందరయ్య భవన్ రోడ్డులోని చిన్న పిల్లల వైద్యశాలలో చేర్పించారు. వైరల్ ఇన్ఫెక్షన్గా గుర్తించిన అక్కడి వైద్యులు పాపకు చికిత్స అందించారు. ఇంతలో పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు విషయాన్ని మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. మంత్రి మాట్లాడుతూ జ్వరాలు ప్రబలకుండా నగరంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.వినోద్‌కుమార్‌ను ఆదేశించారు. వైద్య శిబిరాలు సంతపేటలో వైరల్ జ్వరాలు ప్రబలడంతో అక్కడ గురువారం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ మాధవీలత, డాక్టర్ లక్ష్మీపాపారావులు తమ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి, జ్వరబాధితులను గుర్తించి వారికి వైద్య చికిత్సలు అందించారు. -
ఏపీకి కంపా నిధులు
సాక్షి, ఢిల్లీ : ఏపీలో అటవీ అభివృద్ధి కోసం కేంద్రం రూ.1734 కోట్లను విడుదల చేసిందని ఏపీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఢిల్లీలోని పర్యావరణ భవన్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆధ్వర్యంలో రాష్ట్రాల పర్యావరణ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ నుంచి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. సమావేశానంతరం బాలినేని మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుంకుంటామన్నారు. ఎర్ర చందనం అమ్మకానికి అనుమతి ఇవ్వాలని కోరగా ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారని వెల్లడించారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారనీ, అమ్మకాలకు అనుమతినిస్తే స్మగ్లింగ్‌ను నివారించవచ్చని మంత్రి తెలిపారు. -
ఎంతటి వారైనా శిక్షపడేలా చూస్తాం
సాక్షి, ప్రకాశం : ఆరుగురు మృగాళ్ల చేతిలో లైంగిక వేధింపులకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఆదివారం రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన ఆయన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితులు మానవత్వం లేకుండా వ్యవహరించడం అత్యంత దారుణమన్నారు. దీనిపై హోంశాఖతో కూడా మాట్లాడానని, నిందితులు ఎంతటివారైనా కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు. ఇప్పటికే దీనిపై జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు తెలిపారు. కాగా ఈ అత్యాచార ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి సుచరిత విచారణ జరిపారు. విచారణ వేగవంతంగా చేపట్టాలని ప్రకాశం జిల్లా ఎస్పీని ఆదేశించారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
‘ఆ దాడుల్లో మృతిచెందిన వారికి రూ. 5 లక్షలు’
సాక్షి, అమరావతి : అటవీశాఖ ఉన్నతాధికారులతో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది 25 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అటవీ విస్తీర్ణంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఎర్రచందనం అమ్మకాల ద్వారా ఇప్పటివరకూ రూ. 1688 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఎర్రచందనం పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని..5 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి కేంద్రం అనుమతి కోరామని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో పెరిగిపోతున్న కాలుష్య నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. ఇక వన్యప్రాణుల దాడుల్లో మృతి చెందిన వారికి రూ. ఐదు లక్షల పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. పావురాల గుట్టలో ఉన్న వైఎస్సార్ స్మృతి వనాన్ని రూ. 25 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. -
ఏపీ మంత్రుల బాధ్యతల స్వీకరణ
-
‘వైఎస్ జగన్.. వైఎస్సార్ పాలనను గుర్తు చేస్తున్నారు’
సాక్షి, అమరావతి : దివంగత నేత వైఎస్సార్ పాలనను ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేస్తున్నారని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గురువారం సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత సమర్థవంతమైన పాలనను అందిస్తున్నారని, అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. మంత్రి వర్గంలో అన్ని వర్గాలవారికి సముచిత స్థానం కల్పించారన్నారు. ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం ఓ చరిత్ర అని తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ అత్యంత కీలకమైనవని, అందరినీ కలుపుకుని పనిచేస్తానని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ రోడ్డుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అవంతి శ్రీనివాస్ అన్నారు. పర్యాటక శాఖమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలను తెలిపారు. రాబోయే రోజుల్లో టూరిజాన్ని అభివృద్ది చేస్తానని హామి ఇచ్చారు. అతిథి దేవోభవ అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. 13జిల్లాలో ఉన్న టూరిజం స్పాట్లను అభివృద్ది చేస్తామని తెలిపారు. సింగిల్ విండో పద్దతిలో అనుమతులిస్తామని వివరించారు. ఏపీ టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్‌ను నియమిస్తామన్నారు. ఏపీకి వచ్చే టూరిస్టులకు అన్ని విధాలుగా భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. రేవు పార్టీలు, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఎర్రచందనం అక్రమరవాణా అరికడతాం.. విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎర్రచందనం అక్రమరవాణాను అరికడతామన్నారు. పగటి పూట రైతులకు విద్యుత్ సరఫరా చేసే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆక్వా రైతులకు ఇచ్చే విద్యుత్ రాయితీలను పొడగిస్తున్నామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లను ఉచితంగా ఇస్తామని హామి ఇచ్చారు. ఐదువేల ఎర్ర చందనం వేలం వేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. విద్యుత్ టారిఫ్‌లు, పీపీఏలను సమీక్షిస్తామని అన్నారు. కేంద్రం సమీక్షించవద్దన్న విషయాన్ని సీఎం జగన్.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. తప్పులుంటే సమీక్షిస్తామని ప్రధానికి సీఎం వివరించినట్లు తెలిపారు. ఫిట్నెస్ లేకుంటే.. బస్సులు సీజ్ బస్సుల ఫిట్నెస్ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారని, ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తామని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. గురువారం సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులకు ఇవాళ సాయంత్రం వరకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఇదొక సూచనలాంటి హెచ్చరిక అని, సాయంత్రంలోగా ఫిట్నెస్ సర్టిఫికేట్‌ను తీసుకోకుంటే.. బస్సులను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఫిట్నెస్ లేకుండా బస్సులను నడుపుతామంటే సహించేంది లేదని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిట్నెస్ లేని బస్సల వివరాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి, పార్టీకి మంచిపేరు తెచ్చేలా పనిచేస్తా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై ఎంతో నమ్మకం ఉంచి మంత్రి బాధ్యతలు అప్పగించారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలో గ్రామీణ, పంచాయతీ రాజ్, మైనింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌కు, ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని అన్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చే ఎన్నికలకు వెళ్తామని అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాధ్యతలు చేపట్టిన ధర్మాన, అవంతి, బాలినేని
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ధర్మాన కృష్ణప్రసాద్, అవంతి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణప్రసాద్, పర్యాటక శాఖ మంత్రిగా అవంతి శ్రీనివాస్, విద్యుత్ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి ధర్మాన తెలిపారు. గతంలో వైఎస్సార్ దగ్గర పనిచేయడం.. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ దగ్గర మంత్రిగా పనిచేయడం ఆనందంగా ఉందని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. -
మెరుగైన విద్యుత్ అందిస్తాం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అన్ని వర్గాల వారికి మెరుగైన విద్యుత్‌ను అందిస్తామని విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కొన్ని సంస్థల నుంచి విద్యుత్ శాఖకు రూ.1000 కోట్లకు పైగా రావాల్సిన బకాయిలు త్వరలోనే వసూలు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన చోట్ల 33/11కేవీ తో పాటు 132/33 కేవీ సబ్స్టేషన్లను నిర్మించి విద్యుత్ కొరత లేకుండా చూస్తామని బాలినేని చెప్పారు. తీర ప్రాంతాల్లో పాత విద్యుత్ లైన్లను మార్చి కొత్త లైన్లను ఏర్పాటు చేస్తామన్నారు. రొయ్యల చెరువులు, ఉప్పుకొటార్లు ఉన్న ప్రాంతాల్లో తరచూ లైన్లు దెబ్బతింటూ విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతోందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పాతలైన్లను మార్చే ప్రయత్నం చేయలేదన్నారు. ప్రజలకు సక్రమంగా విద్యుత్ అందించేందుకు పాతలైన్లను మార్చివేస్తామని మంత్రి చెప్పారు. ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న 10 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. పశ్చిమ ప్రాంతంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అవసరమైన చోట్ల మరిన్ని సబ్స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బాలినేనితెలిపారు. ఎన్ని కోట్లు ఖర్చైనా రాష్ట్ర వ్యాప్తంగా హై ఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (హెచ్‌వీడీఎస్)ను పూర్తి చేసి రైతులకు మెరుగైన విద్యుత్‌ను అందిస్తామన్నారు. ప్రకాశం జిల్లాలో రూ.200 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్న హెచ్‌వీడీఎస్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. రైతులకు ఇవ్వాల్సిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వెంటనే మంజూరు చేస్తామని బాలినేని చెప్పారు. రైతులతో పాటు అన్ని వర్గాలపై అదనపు విద్యుత్ చార్జీల భారం లేకుండా చూస్తామన్నారు. అన్ని రకాల పరిశ్రమలకు సకాలంలో విద్యుత్ సర్వీసులు ఇచ్చి విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో పవన విద్యుత్‌కు ప్రాధాన్యత ఇచ్చి మరిన్ని చోట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు మంత్రి బాలినేని చెప్పారు. ఎర్రచందనాన్ని కాపాడుతాం: రాష్ట్రంలోని నల్లమల, శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనాన్ని కాపాడుతామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు ఎర్రచందనాన్ని అక్రమంగా నరికి పెద్ద ఎత్తున స్మగ్లింగ్‌కు పాల్పడ్డారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన సంపదైన ఎర్రచందనాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆయన చెప్పారు. ఎర్రచందనాన్ని కాపాడేందుకు మరింత కట్టుదిట్టంగా చర్యలు చేపడతామన్నారు. అటవీ శాఖ అధికారులతో పాటు టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను మరింత బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటవీశాఖలో ఖాళీగా ఉన్న 3 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అటవీ ప్రాంతాల్లో పనిచేసేందుకు తక్కువ వయసున్న వారిని నియమిస్తామన్నారు. ఎర్రచందనం ప్లాంటేషన్లు ఏర్పాటు చేస్తామని బాలినేని చెప్పారు. ఉన్న ఎర్రచందనాన్ని గ్లోబల్ టెండర్స్ ద్వారా అమ్మకానికి పెట్టి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుతామన్నారు. స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ శాఖాధికారులు చందనాన్ని కాపాడే విధంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అడవుల అభివృద్ధితో పర్యావరణాన్ని కాపాడుతాం : అడవులను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని బాలినేని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మొక్కల పెంపకం, అటవీ అభివృద్ధి కాగితాల్లో లెక్కలకే పరిమితమైందని విమర్శించారు. ఇప్పుడు అలా కాకుండా లక్ష్యాలు నిర్దేశించుకుని అడవులను సంరక్షిస్తామన్నారు. అటవీ శివారు ప్రాంతాల్లో మొక్కల ప్లాంటేషన్లు, పశుగ్రాసాలు, వంటచెరకు పెంచి ప్రజలు ముఖ్యంగా గిరిజనులు అడవుల్లోకి వెళ్లి చెట్లు నరకకుండా చర్యలు చేపడతామని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. దీంతో పాటుగా వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి బాలినేని తెలిపారు. అడవుల పరిరక్షణతో వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి చెప్పారు. పశ్చిమ ప్రాంత వరప్రదాయిని అయిన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేసి జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తామని చెప్పారు. ఇవే కాక జిల్లాకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని అన్నారు. -
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
-
విశ్వసనీయతకు పట్టం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సీఎం వైఎస్ జగన్ క్యాబినెట్లో ప్రకాశం జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయపథాన నడిపిన పార్టీ ఒంగోలు పార్లమెంట్అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి అందరూ అనుకున్నట్లుగానే వైఎస్ జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి వరించగా, యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌కు సైతం క్యాబినెట్లో చోటుదక్కింది. బాలినేని, సురేష్‌లు శనివారం వెలగపూడి లోని సచివాలయం ప్రాంగణంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జగన్ క్యాబినెట్లో మంత్రులుగా ఎన్నికైనట్లు పార్టీకి చెందిన ముఖ్య నేతలు బాలినేని, సురేష్‌లకు శుక్రవారం రాత్రి ఫోన్ ద్వారా తెలిపారు. బాలినేనికి మంత్రి పదవి వచ్చిందని తెలియగానే వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతోపాటు కొత్తపట్నం మండలంలో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు ఏర్పాటు చేసుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకోగా సురేష్‌కు మంత్రి పదవి దక్కడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జిల్లాకు చెందిన ఇద్దరికి జగన్ క్యాబినెట్ లో చోటుదక్కడంతో పార్టీ శ్రేణులు జిల్లాలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. నేతలు కార్యకర్తలు రెట్టించిన ఆనందంలో కేకులు, స్వీట్లు పంచడంతోపాటు బాణ సంచా పేల్చారు. శనివారం జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి బాలినేని అభిమానులతో పాటు సురేష్ అభిమానులు పార్టీ నేతలు విజయవాడకు తరలి వెళ్లారు. బాలినేని రెండవసారి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగా సురేష్‌కు తొలిసారి మంత్రి పదవి దక్కింది. ఎన్నికల సమయంలోనే వైఎస్ జగన్.. బాలినేనికి మంత్రి పదవి ప్రకటించారు. చెప్పినట్లుగానే పదవి ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ తో బాలినేనికి బంధుత్వం ఉన్నా అంతకంటే మిన్నగా జగన్‌తో కలిసి నడిచారు. ఆయనకు తలలో నాలుకలా ఉంటూ పార్టీ అభివృద్దికి కృషి చేశారు. వైఎస్ రెండవసారి సీఎం అయ్యాక బాలినేనికి మంత్రి పదవి లభించింది. వైఎస్ మరణానంతరం కొద్దికాలం రోశయ్య క్యాబినెట్లో మంత్రిగా చేశారు బాలినేని. ఆ తరువాత కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మంత్రి పదవిని తృణప్రాయంగా భావించి రాజీనామా చేసిన బాలినేని..జగన్ తో కలిసి నడిచారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా.. 12–12–1964 లో టంగుటూరు మండలం కొణిజేడులో బాలినేని వెంకటేశ్వరరెడ్డి, రమాదేవి దంపతులకు జన్మించిన బాలినేని బీకాం చదివారు. కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేశారు. రాష్ట్ర కార్యదర్శిగాను, యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగాను బాధ్యతలు నిర్వహించారు. 1999లో తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం లభించింది. టీడీపీ అభ్యర్థి యక్కల తులసీరావుపై 1999లో, శిద్దా రాఘవరావుపై 2004లో, ఈదర హరిబాబుపై 2009లో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. వైఎస్సార్ రెండో క్యాబినెట్లో చోటుదక్కింది. దీంతో ఆయన 2009 మే 29న భూగర్భగనుల శాఖ, చేనేత జౌళిశాఖ, చిన్న తరహా పరిశ్రమల శాఖామంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009 సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్లో ప్రయాణిస్తూ దుర్మరణం చెందడంతో ఆ తరువాత బాలినేని మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్.జగన్‌తో కలిసి నడిచారు. విశ్వసనీయతకు మారుపేరు రాజకీయంగా తనకు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేను, మంత్రిగాను హోదా కల్పించిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం పట్ల ఆదినుంచి బాలినేని విశ్వాసం కనబరుస్తూ వచ్చారు. ఒక వైపు మంత్రి పదవిలో ఉన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ దశలో ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ఎవరు పాల్గొనరాదంటూ అప్పటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా ఆంక్షలు విధించినా ఖాతరు చేయలేదు. వైఎస్సార్ తరువాత ముఖ్యమంత్రిగా రోశయ్య బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కూడా బాలినేని మంత్రిగానే ఉన్నప్పటికీ ఓదార్పు యాత్రలో పాల్గొనకూడదంటూ ఆంక్షలు పెరిగిపోయాయి. ఓదార్పుయాత్ర చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న బాలినేని 2010లో తన మంత్రి పదవికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో ఒక్కసారి మాత్రమే టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌రావు చేతిలో ఓటమి చెందిన ఆయన తిరిగి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్‌రావుపై 22 వేల పైచిలుకు ఓట్లతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఐఆర్ఎస్ నుంచి.. మంత్రి దాకా సురేష్ పయనం.. ఐఆర్ఎస్ ఉద్యోగం చేస్తున్న డాక్టర్ ఆదిమూలపు సురేష్ 2009లో దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పిలుపు మేరకు తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఆ సమయంలో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా యర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం ఏర్పడింది. ఈ తరుణంలో సురేష్‌కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇచ్చి వైఎస్సార్ ప్రోత్సహించారు. తొలిసారిగా పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి పాలపర్తి డేవిడ్‌రాజుపై దాదాపు 13,565 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వైఎస్సార్ మృతి చెందిన తరువాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సురేష్‌కు టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి విజయకుమార్‌పై 12 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ టికెట్‌పై పోటీచేసి గెలుపొందిన పాలపర్తి డేవిడ్‌రాజు పార్టీ ఫిరాయించడంతో సురేష్ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఆయన గతంలో వచ్చిన మెజార్టీని అధిగమించి 31,096 ఓట్ల మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. తాజాగా వైఎస్ జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. -
పిలిస్తే పలికే వాసన్న.. ఎదురైనా పట్టించుకోని దామచర్ల
సాక్షి, ఒంగోలు సిటీ: రాష్ట్ర రాజకీయాలకు ఒంగోలు కేంద్ర బిందువు. ఇక్కడి ఫలితాలు పార్టీల భవితవ్యాలను తేల్చుతాయన్నది ఒక విశ్వాసం. గతంలో జరిగిన పరిణామాలు.. వివిధ సందర్భాలు దీనిని బలపరుస్తున్నాయి. ఇంత ప్రాధాన్యం గల ఒంగోలు అసెంబ్లీ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ పోటీలో ఉన్నారు. నాలుగు పర్యాయాలు బాలినేని ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఐదేళ్లే దామచర్ల శాసనసభ్యునిగా పని చేశారు. రాజకీయాల్లో సీనియర్‌గా అనుభవజ్ఞునిగా బాలినేనికి మంచి పేరుంది. గత ఎన్నికల్లో దామచర్లకు ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చినా ప్రజారంజకంగా పాలన చేయలేకపోయారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. అభ్యర్థుల గుణగణాలు బాలినేని శ్రీనివాసరెడ్డి ♦ సౌమ్యుడు..మితభాషి. ♦ చిన్నవారినైనా..ఎంతటి వారినైనా ఒకే విధంగా గౌరవిస్తారు. ♦ నిత్యం చిరునవ్వు ఆయన పెదవిపైనే ఉంటుంది. కల్మషం లేని వ్యక్తి ♦ తనకు హాని చేసిన వారినైనా పెద్దమనసుతో క్షమిస్తారు. ♦ ఎంత కష్టం వచ్చినా నమ్మిన వారి కోసం నిలబడే వ్యక్తిత్వం ♦ అనారోగ్యం, కుటుంబ సమస్యలున్నాయంటే తన జేబులో ఎంత ఉన్నా ఇచ్చే దానగుణం ♦ దైవాన్ని అధికంగా నమ్ముతారు. అంతకన్నా ఎక్కువగా అభిమానులకు బాసటగా నిలుస్తారు. ♦ వాసన్న అంటే ఇట్టే పలికే గుణం ఆయన సొంతం అభిమానుల అభిమతం ఇది. ♦ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ♦ అవినీతి రహితుడిగా, అభివృద్ధి ప్రదాతగా ప్రజల నుంచి మన్ననలు ♦ జిల్లాలోని సమస్యలపై సంపూర్ణ అవగాహన దామచర్ల జనార్దన్ ♦ గర్విష్టి, రాచరిక పాలన సాగిస్తారన్న విమర్శ ♦ మనస్సులో ఒకటి పెట్టుకొని వేరొకటి మాట్లాడుతుంటారు. ♦ ఆయన మాటల్లో అర్థాలు నిగూఢంగా ఉంటాయి. ♦ ఖర్చు పెట్టే ప్రతి పైసా తిరిగి వసూలు చేయడం ఆయన నైజం. ♦ తను, తనవారన్న స్వార్థం ♦ దామచర్ల అందించే సహాయం రాజకీయ నాయకులు అందించే తరహాలోనే ఉంటుందన్న విమర్శలు ♦ నియోజకవర్గం, జిల్లా ప్రజలు రైతులు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన అంతంతమాత్రమే ♦ గంటల కొద్ది సమయాన్ని వృథా చేస్తారన్న అభియోగం ♦ ఎవరైనా, ఎంతటి వారైనా దామచర్ల ఇంటికి వస్తే వీధి గుమ్మం వద్దే చెప్పులు విడిచి రావాలి ♦ సామాన్యులకు అందుబాటులో ఉండరన్న విమర్శ ♦ ఐదేళ్ల పాలనలోనే ఎన్నో అవినీతి ఆరోపణలు ♦ సీనియర్ నేతలను గౌరవించరన్న అభియోగం ♦ తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యం ♦ తన స్వార్థం కోసం అధికారుల బలిచేస్తారన్న ప్రచారం -
అవినీతి రహిత అభివృద్ధి చేసి చూపిస్తా
సాక్షి, ఒంగోలు సిటీ: ఒంగోలు కార్పొరేషన్ అయిన తర్వాత ప్రజలు ఆశించినంతగా అభివృద్ధికి నోచుకోలేదు. కొత్తపట్నం, ఒంగోలు మండలాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎక్కడ ఏ సమస్యలు ఎలాంటివి ఉన్నాయో అన్నీ తెలుసు. సమస్యలను గుర్తించాను. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఒంగోలు నియోజకవర్గాన్ని బహుముఖంగా అభివృద్ధి చేయాల్సి ఉందని ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సాక్షి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. జనాభా పెరుగుతున్న కొద్ది వారి అవసరాలు బాగా పెరిగాయని, ప్రజల పాలకుల వద్ద నుంచి అభివృద్ధిని, అవినీతి రహిత పాలన ఆశిస్తున్నారు. ఈ రెండు చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నానన్నారు. బహుముఖ అభివృద్ధి ఒంగోలు నగరం జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ ఏర్పడాల్సిన స్థాయిలో హంగులు ఏర్పడలేదు. పాత ఒంగోలుతో పాటు కొత్తగా ఏర్పడిన శివారు కాలనీలు, నగరంలో కలిసిన గ్రామాల్లో ప్రజలు తాగేందుకు నీరు, రహదారుల విస్తరణ, మురుగునీటి పారుదలకు మెరుగైన సౌర్యాలు, మౌలికంగా అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఒంగోలు పరిపాలనా కేంద్రం కావడంతో ఇక్కడికి ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. వారికి ఏ కాస్త ఇబ్బంది కలగకుండా, ప్రజలు సౌకర్యవంతంగా జీవించేందుకు వీలుగా బహుముఖంగా అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. గతంలో ఇక్కడ ప్రజలతో మమేకమై ప్రతిపక్షంలోనూ, స్వపక్షంలోనూ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అనుభవంతో అన్ని విధాల అభివృద్ధికి చర్యలు తీసుకంటా. తాగునీటికి శాశ్వత పరిష్కారం ఒంగోలు ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. ఇప్పుడు రెండు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులు ఉన్నా వీటి నిల్వ సామర్థ్యం సరిపోవడం లేదు. ప్రజల అవసరాలు బాగా పెరిగాయి. శివారు కాలనీలకు ఓవర్‌హెడ్ ట్యాంకులు కావాలి. మూడో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు కావాలి. ఇందుకు ఒంగోలుకు సమీపంలోనే భూసేకరణ చేసి స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి చర్యలు తీసుకుంటా. పైపులైన్లు బాగా దెబ్బతిన్నాయి. కొన్నిలైన్లు సిమెంట్ రోడ్ల కిందకి పోయి లీకేజీలు వచ్చినప్పుడు మరమ్మతులకు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. పైపులైన్ల వ్యవస్థను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటాను. గుండ్లకమ్మ నుంచి నీటిని తీసుకొని నగర ప్రజలకు తాగునీటి సమస్యలను శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు చర్యలు ఒంగోలుకు ఎప్పటి నుంచో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కల సాకారం కాలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రూ.110 కోట్ల తాత్కాలిక అంచనాలతో అప్పట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి ప్రతిపాదనలు ఇచ్చాను. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబుకు కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్టుకు వినతిపత్రాలను ఇచ్చారు. అయితే ఈ ప్రతిపాదనలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు వ్యవ అంచనాలు బాగా పెరిగాయి. సుమారు రూ.500 కోట్లకుపైగా అంచనాలు పెరిగాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ రావడం ద్వారా ఒంగోలును నిత్యం ఇబ్బంది పెడుతున్న మురుగు ముంపు బారి నుంచి రక్షణ పొందడమే కాకుండా పారిశుధ్య సమస్య తీరుతుంది. దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు వీలు కలుగుతుంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. సొంతింటి కల నెరవేరుస్తా నగరంలో సుమారు 60 వేల కుటుంబాలు ఉన్నాయి. కొత్తపట్నం, ఒంగోలు మండలాల్లో ఇల్లు లేని కుటుంబాలు అనేకం ఉన్నాయి. నగరంలో సుమారు పాతికవేల మందికిపైగా సొంత ఇల్లు లేని వారు ఉన్నారు. వీరిలో అర్హులైన వారందరికి పార్టీలతో సంబంధం లేకుండా సొంతింటి కల నేర్చాలన్నదే లక్ష్యం. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఉచితంగా ఇల్లు ఇస్తామన్న హామీని అమలు చేస్తామని..ఇందులో సొంతిల్లు లేని వారందరినీ ఇంటి యజమానులను చేస్తాం. శివారుకాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తాం.. ఒంగోలు కార్పొరేషన్ కావడానికి శివారు గ్రామాలు కలిశాయి. శివారు కాలనీలు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. తాగునీరు, మెరుగైన కరెంటు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఇలా వారికి ఏ సదుపాయం సక్రమంగా లేదు. ఒంగోలు కార్పొరేషన్లో కలిసిన గ్రామాలను నగరానికి అనుసంధానం చేస్తూ నగరాభివృద్ధికి చర్యలు తీసుకుంటా. గ్రామాలను అనుసంధానం చేస్తూ అభివృద్ధి చేయడం ద్వారా కార్పొరేషన్ అభివృద్ధి వేగవంతంగా ఉంటుందని వివరించారు. పోతురాజు కాలువ ఆధునికీకరణ ఒంగోలు నగరానికి మురుగునీటి అవుట్లెట్ లేకపోవడమే పెద్ద సమస్య. నగరంలో మురుగునీరు బయటకు వెళ్లడానికి సరైన వసతి లేదు. నగరానికి పెరిగిన అవసరానికి అనుగుణంగా మురుగునీటి అవుట్లెట్ లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ద్వారా కొంత సమస్య తీరినా పోతురాజు కాలువ ఆధునికీకరణ పనులు చేపడితే గానీ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో పోతురాజు కాలువ ఆధునికీరణకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతిపాదనలు ఇచ్చాను. ఇంత వరకు టీడీపీలోనూ ఈ ప్రతిపాదనలు ముందుకు పోలేదు. పోతురాజు కాలువ ఆధునీకరణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. నిరుపేదలందరికీ నివేశన స్థలాలు నగరంలో ఇప్పటికే పది వేల మందికిపైగా ఇంటి నివేశన స్థలాలను ఇచ్చాను. సుమారు 600 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిలో పట్టాలిచ్చాను. తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు పొజిషన్ చూపించకుండా, కొన్ని పట్టాలను రద్దు చేసింది. ఇంకా 15 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నగరంతోపాటు శివారుకాలనీలు, కొత్తపట్నం, ఒంగోలు గ్రామీణంలోని నిరుపేదలకు ఇంటి నివేశన స్థలాలను పెద్ద ఎత్తున ఇవ్వాలన్నది సంకల్పం. ఇందు కోసం భూసేకరణకు చర్యలు తీసుకొనైనా నిరుపేదల కల నెరవేరుస్తాను. సామర్థ్యానికి తగ్గట్లుగా డంపింగ్ యార్డు ఒంగోలుకు నిత్యం వస్తున్న చెత్తను డంపింగ్ చేసుకోవడానికి డంపింగ్‌యార్డు సమస్య తీవ్రంగా ఉంది. గుత్తికొండవారిపాలెం వద్ద ఉన్న డంపింగ్‌యార్డు సమస్యను తీర్చకుంది. నగరానికి దూరంగా కొత్తగా అవసరానికి తగ్గట్లు, తగిన సామర్థ్యం ఉన్న డంపింగ్‌యార్డులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాను. ప్రధానంగా అవినీతిరహిత పాలన అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాను. ఒంగోలు అసెంబ్లీలో ఎలాంటి సమస్యలున్నాయో అన్నీ తెలుసునని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే..జగన్ సీఎం అయిన వెంటనే ఆదర్శ ఒంగోలుగా తీర్చిదిద్దుతా. -
టీడీపీది అరాచక పాలన
ఒంగోలు సిటీ: టీడీపీ అరాచక పాలన చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక ఆరో డివిజన్లో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా నవరత్నాలపై ఇంటింటికీ ప్రచారం చేశారు. డివిజన్ అధ్యక్షుడు జమ్ము శ్రీకాంత్ ఆధ్వర్యంలో నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. బాలినేని మాట్లాడుతూ అయిదేళ్లు టీడీపీ అరాచక పాలన చేసిందని వివరించారు. ప్రతి ఇంట్లో చంద్రబాబు అరాచక పాలన గురించి చర్చించాలన్నారు. ఈ ఎన్నికల్లో గతంలో చేసిన తప్పునే మళ్లీ చేయకుండా బాబు దుర్మార్గాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గత ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీల అమలుపై చర్చించాలని అన్నారు. బీసీలను ఎలా దగా చేశారో ప్రతి కుటుంబం ఆలోచించాలని తెలిపారు. మన ఆధార్ డేటాతో సహా వ్యక్తిగత సమాచారాన్ని తమ తాబేదారు కంపెనీలకు అమ్ము కోవడానికి చంద్రబాబు ఎవరని ప్రతిచోటా చర్చ జరగాలన్నారు. వైఎస్సార్ సీపీకి ఎన్నికల్లో మద్దతు పలకాలని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఒక అవకాశం ఇవ్వమన్నారు. రాష్టంతోపాటు ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందని అన్నారు. నేడు మన పిల్లల్ని చదివించుకోవడానికి ఎందుకు అప్పుల పాలవుతున్నామో ప్రతి ఇంటా చర్చ జరగాలని అన్నారు. రోగం వస్తే ఆస్తులను తెగనమ్ముకోవాల్సిన దుస్థితిపై లోతుగా చర్చించి ఓటు వేయాలన్నారు. పొదుపు మహిళల రుణాలను మాఫీ చేయలేదని వివరించారు. పసుపు–కుంకుమ పేరుతో మూడు వేలు ఇచ్చి సరిపెట్టారన్నారు. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. ప్రతి పొదుపు మహిళ ఆలోచించాలని కోరారు. నేడు పింఛన్ రూ.2 వేలు ఇస్తున్నారంటే జగన్ వల్లే కదా అని గుర్తించాలన్నారు. జగన్ సీఎం అయితే పింఛన్ రూ.3 వేలు ఇస్తారని అన్నారు. బీసీలకు ప్రత్యేకించి జగన్ డిక్లరేషన్ ఇచ్చారన్నారు. నామినేటెడ్ పదవుల్లో యాభైశా తం బీసీలకే నని అన్నారు. నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తామని అన్నారు. ఓటర్లు చెక్ చేసుకోండి ఓటర్లు మీ ఓటు ఉందో లేదో జాబితాలో చూసుకోండన్నారు. 1950 ఎన్నికల సంఘం టోల్‌ప్రీ ద్వారా వివరాలను తెలుసుకోండని అన్నారు. ఓటు లేని వారు ఉంటే ఈ నాలుగు రోజుల్లో ఈసీఐ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్తగా ఓటరుగా నమోదు కావాలని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గుర్రం వెంకయ్య, వెలనాటి మాధవ. యనమల నాగరాజు, కొఠారి రామచంద్రరావు, ఎందేటి రంగారావు, ఎందేటి వెంకట్రావు, పటాపంజుల శ్రీను, కటారి సంజీవ్, పందరబోయిన పున్నారావు, సాయి,పూరిమిట్ల హర్నాద్, పులుగు అక్కిరెడ్డి, ఆంజనేయులు, కుప్పం ప్రసాద్, బట్టు శ్రీను, కావటి రవి, జలీల్, మహిళా నాయకులు మల్లమ్మ, కృష్ణవేణి, బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
కమ్మపాలెంలో వైఎస్సార్ సీపీ అనుమతించేది లేదు
-
కమ్మపాలెంలో వైఎస్సార్ సీపీని అనుమతించం...
సాక్షి, ఒంగోలు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమ కేసులు బనాయిస్తే... మరోవైపు ప్రకాశం జిల్లా ఒంగోలు కమ్మపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు. కమ్మపాలెంలో వైఎస్సార్ సీపీ అనుమతించేది లేదంటూ టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ వర్గీయులు కాలనీ ఎంట్రన్స్ వద్ద బైఠాయించి, అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వస్తున్న వైఎస్సార్ సీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఒంగోలు కోర్టు సెంటర్లో అడ్డుకున్నారు. పోలీసుల చర్యను ఆయన తీవ్రంగా నిరసించారు. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను కుల రాజకీయాలకు దూరం అని ప్రచారం చేసుకుంటుండగా.. టీడీపీ నేతలు ఏకంగా ‘కమ్మపాలెం’లో ప్రతిపక్ష పార్టీకి అనుమతే లేదంటూ ఆందోళనకు దిగటం విడ్డూరం. కొనసాగుతున్న ఉద్రిక్తత తమ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే వరకు కదిలేది లేదని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. అనుచరుల వాహనంలోనే ఆయన బైఠాయించారు. ఇరు పార్టీల నాయకులు రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తత పరిస్ధితులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ సీపీ కార్యకర్త ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. -
టీడీపీని భూస్థాపితం చేద్దాం
ఒంగోలు సిటీ: అన్యాయాలకు, అరాచకాలకు, అవినీతికి తెలుగుదేశం పాలన నిలయమైందని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ పాలనను భూస్థాపితం చేద్దామని పిలుపునిచ్చారు. ఆదివారం ఒంగోలు 14వ డివిజన్లోరావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమంలో నవరత్నాలపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ చంద్రబాబు ఓట్ల కొనుగోలు రాజకీయాలను చేస్తున్నారని విమర్శించారు. దండిగా డబ్బును వదిలి అడ్డదారుల్లో ఓట్లను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆదమరిస్తే మళ్లీ ఐదేళ్లు చంద్రబాబు అరాచకాలు, అవినీతి, అన్యాయాలు, మోసాలను భరించాల్సి వస్తుందని వివరించారు. ఓటర్లు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు శాశ్వత విశ్రాంతి ఇద్దాం.. మోసాలకు చిరునామా అయిన చంద్రబాబును ఈ ఎన్నికల ద్వారా శాశ్వత విశ్రాంతి ఇవ్వాలని బాలినేని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానిని పూర్తిగా అమలు చేయలేదన్నారు. గత ఎన్నికల్లో 600 హామీలను ఇచ్చి ప్రజల ఓట్లను కొల్లగొట్టారని, ఎన్నికలయ్యాక డిజిటల్ అభివృద్ధి చూపిస్తూ ప్రజల్ని మోసగించారని అన్నారు. ఎక్కడా అభివృద్ధి ఛాయలు లేవన్నారు. అంతా ఆర్భాటపు ప్రచారంతో, జనం డబ్బు దుబారాతో నాలుగున్నర ఏళ్ల కాలాన్ని గడిపారని విమర్శించారు. యథారాజా తథాప్రజ అన్నట్లుగా చంద్రబాబు అరాయించుకోని అవినీతిని ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు అందిపుచ్చుకున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు. ఓటుతో నిజాయితీని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు తెలిసిన రాజకీయాలు ఓట్లను కొనుగోలు చేయడమే అన్నారు. మానవత్వంలేని ఇలాంటి టీడీపీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వసనీయ రాజకీయాలకు జీవం పోయాలన్నారు. ఎన్నికల్లో తాయిలను ఇచ్చి ఓట్లను దోచుకోవాలని జనం డబ్బుతో పథకాలను ప్రకటిస్తున్నారని అన్నారు. ఇందులో ఏ ఒక్కదానిని పూర్తిగా ఇచ్చే పరిస్థితి ఉండదని అన్నారు. వైఎస్సార్ సీపీలోనే బీసీలకు ప్రాధాన్యం.. ఎన్నికల్లో ఓటర్లను పక్కదారి పట్టిస్తున్నారని ఈ కుట్రను గుర్తించాలని బాలినేని చెప్పారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. ఎవరు నిజంగా అభివృద్ధి కాముకులో తెలుసుకొని ఓట్లు వేయాలన్నారు. నాలుగున్నర ఏళ్ల పాటు అమరావతి అంటూ ప్రజల్ని భ్రమల్లో ఉంచారన్నారు. తాబేదార్లకు చౌకగా భూములను కట్టబెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టారన్నారు. సంక్షేమ పథకాలంటూ ఊదరగొడ్తున్నారన్నారు. ప్రజల్ని రకరకాలుగా మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తరిమేందుకు ప్రజలు కదలాలని అన్నారు. టీడీపీ కులాలను రెచ్చగొడ్తుందన్నారు. ఎన్నికల్లో ప్రయోనం పొందాలని కుట్రలను పన్నుతుందని అన్నారు. వైఎస్సార్సీపీ ఒక్కటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు తగిన రాజకీయ ప్రాధాన్యం ఇవ్వనుందని అన్నారు. బీసీ డిక్లరేషన్ ద్వారా వెనుకబడిన వర్గాలకు ఆర్ధికంగా చేయూతనివ్వడానికి, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడానికి చేస్తున్న కృషిని ప్రస్తావించారు. రాజకీయాలంటే ఈసడించుకొనేట్లు చేసిన టీడీపీని నామరూపాల్లేకుండా చేసి విశ్వసనీయతను బతికించాలని కోరారు. ఒంగోలు నగరంలో జరిగిన అభివృద్ధిలో ఎవరి పాత్ర ఏమిటనేది ఆలోచించి ఓటెయ్యాలని అన్నారు. డివిజన్లోని గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు. 14వ డివిజన్ అధ్యక్షుడు చావలి శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు, డివిజన్ నాయకులు ఎండీ ఇమ్రాన్, శ్రీకాంత్, ఉంగరాల శ్రీను, టి.వెంకటేష్, గోళ్ల బలికుమార్, కొంపల్లి విష్ణు, వరదా నాని, టి.సుధ, వాసు, నిర్మల, పీడీసీసీబీ మాజీ ఛైర్మన్ ఈదర మోహన్‌బాబు, నాయకులు వై.వెంకటేశ్వరరావు, కేవీ రమణారెడ్డి, పులుగు అక్కిరెడ్డి, కటారి శ«ంకర్, గంటా రామానాయుడు, అంజిరెడ్డి, సునీల్, మహిళా నాయకులు గంగాడ సుజాత, బైరెడ్డి అరుణ, పోకల అనురాధ, పల్లా అనురాధ, బి.రమణమ్మ, బడుగు ఇందిర, కావూరి సుశీల పాల్గొన్నారు. -
యాదవులు విశ్వాసానికి మారుపేరు
ఒంగోలు సిటీ: యాదవులు విశ్వాసానికి మారుపేరని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ఆదివారం స్థానిక గోపాలనగరంలో యాదవ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. కొఠారి రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో బాలినేని మాట్లాడుతూ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో యాదవులను నిలిపి గెలిపిస్తున్న చరిత్ర వైఎస్సార్ సీపీదని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో జిల్లాలో యాదవులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. తమ పార్టీ కనిగిరి అసెంబ్లీ స్థానంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి సీటు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అన్ని వేళలా యాదవులకు అండగా ఉంటానని బాలినేని భరోసా ఇచ్చారు. రూరల్ మండల జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్ వంటి స్థానాలకు కూడా బీసీలకే అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల్లోని యాదవులతో పాటు అన్ని కులాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా నాలుగు దఫాలుగా ఎన్నికైనా అధికారంలో ఉంది కేవలం ఐదేళ్లేనని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సహకారంతో ఒంగోలుకు రిమ్స్, రామతీర్థం జలాశయం, గుండ్లకమ్మ ప్రాజెక్టుతో పాటు తాగునీటి కోసం పైపులైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించామని గుర్తు చేశారు. ఒంగోలు కార్పొరేషన్‌ను తెచ్చినందున నిధులు దండిగా వచ్చాయన్నారు. ఒంగోలులో తాగు నీటికి రూ.19.5 కోట్లతో సమగ్ర తాగునీటి పథకాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. తన హయాంలోనే నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ చేసినందున నేడు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని బాలినేని పేర్కొన్నారు. రెండేళ్ల కిందట జగన్ పింఛన్ రూ.2 వేలు ఇస్తామని ప్రకటించారని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు ఇప్పుడు అదే రూ.2 వేలు ఇస్తున్నారని చెప్పారు. డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేయకుండా కేవలం రూ.10 వేలతో సరిపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో తెలుసుకోవాలని సూచించారు. ఎన్నికల వేళ తాయిలాలు ఇచ్చే వాళ్లు కావాలో, నిజాయితీ పాలన అందిచే వారు కావాలో మహిళలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు దుర్మార్గపు ప్రభుత్వానికి చరమగీతం పాడాలని బాలినేని పిలుపు ఇచ్చారు. రూ.500 కోట్లకు మోసం గృహ నిర్మాణంలో రూ.500 కోట్ల మోసం జరిగిందని బాలినేని ఆరోపించారు. జీ ప్లస్–3 గృహాల్లో తెలుగుదేశం ప్రభుత్వం మతలబును ప్రస్తావించారు. ఒంగోలు నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాలకు జరిగిన భూసేకరణలోనూ అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు పేదలకు గృహ నిర్మాణం మాటున స్తిరాస్థి వ్యాపారం చేశారని మండిపడ్డారు. ఇల్లు కట్టిస్తామని నెలకు రూ.2 వేలు కట్టించుకొని మొత్తం కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారటని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో ఎంతో మోసం దాగుంతో లబ్ధిదారులు గుర్తించాలన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలు, అర్హులకు ఉచితంగా ఇళ్లు ఇస్తారని చెప్పారు. ఇళ్లు తీసుకున్న రోజునే వారు బ్యాంకు రుణాలు తీసుకోవచ్ఛన్నారు. వైఎస్సార్ కుటుంబం ప్రజలకు మాట ఇస్తే దాని కోసం కట్టుబడి ఉంటుందన్నారు. వెనక్కి తగ్గేదిలేదన్నారు. జగన్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని నిజాయితీగా ప్రకటించిన విషయాన్ని బాలినేని ప్రస్తావించారు. అబద్ధాలతో కాలం గడిపే చంద్రబాబుకు ఓటేస్తే రానున్న రోజుల్లో ప్రజలు మరింత పేదరికంలో మగ్గిపోతారన్నారు. మార్చి తర్వాత డ్వాక్రా మహిళలకు ఇవ్వనున్న చెక్కులు చెల్లవన్నారు. ఎన్నికల కోడ్‌ను అడ్డు పెట్టి చంద్రబాబు తన అనుయాయుల ద్వారా కోర్టులో కేసు వేయించి మహిళలను నిట్టనిలువునా మోసగిస్తారన్నారు. వైఎస్సార్ సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని బాలినేని పిలుపు ఇచ్చారు. బాలినేనికి గొర్రెపిల్ల బహూకరణ మాజీ మంత్రి బాలినేనికి కండే రమణాయాదవ్ ఆధ్వర్యంలో యాదవులు గొర్రె పిల్లను బహూకరించారు. పటాపంజుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ ప్రతినిధులు బాలినేనిని గజమాలతో సన్మానించారు. అంతకు ముందు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. యాదవ యువకులు ద్విచక్ర వాహనాలతో బాలినేనిని వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. మార్గంమధ్యలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేళతాళాలతో ఘనంగా బాలినేనికి స్వాగతం పలికారు. యాదవ సంఘం నాయకులు కటారి శంకర్ యాదవ్, కర్నేటి ప్రసాద్, ఎంఎం కొండయ్య యాదవ్, బొట్ల రామారావు, బొట్ల సుబ్బారావు, యనమల నాగరాజు, ఎందేటి వెంకట్రావు, పల్లపోతుల మోహన్‌రావు, చావలి శివప్రసాద్, కటారి ప్రసాద్, జాజుల కృష్ణ, మట్టే రాఘవ, పటాపంజుల అశోక్, గుర్రం వెంకయ్య, ఎందేటి రంగారావు, కొణికి ఆదిలక్ష్మి, రావులపల్లి ధనలక్ష్మి, దుర్గామల్లేశ్వరి పాల్గొన్నారు. -
చంద్రబాబుకు అంత దమ్ముందా?
దర్శి: నవరత్నాలతో సహా ఇచ్చిన హామీలకు తాను కట్టుబడి ఉంటానని, అమలు చేయలేకపోతే రాజీనామా చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుగానే స్పష్టంగా ప్రకటించారని, అబద్దపు హామీలతో అందరినీ వంచించే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విధంగా ప్రకటించే దమ్ముందా? అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు పాలించడం చేతకాక జగన్ పథకాలైన ఫించన్, డ్వాక్రా రుణాల మాఫీ వంటి వాటిని కాపీ కొట్టి ఎన్నికల ముందు నెరవేరుస్తానని హమీలు ఇవ్వడం సిగ్గు చేటన్నారు. శుక్రవారం దర్శి పట్టణంలోని తాలూకా క్లబ్ సమావేశం హాలులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యకర్తల పరిచయ కార్యక్రమం జరిగింది. ముందుగా పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ మద్దిశెట్టి వేణుగోపాల్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిలు బాలినేని శ్రీనివాసరెడ్డితో కలసి వచ్చి గడియార స్తంభం సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేలాది మంది నాయకులు, కార్యకర్తల జగన్నినాదాలతో దర్శి పట్టణం దద్దరిల్లింది. పరిచయ కార్యక్రమ సభలో బాలినేని మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ఏడాదికిపైగా కష్టపడి పాదయాత్ర చేశారని అందులో సగం కష్టమైనా పడి ప్రతి కార్యకర్త వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. తాను ఈసారి పోటీ చేయనని బూచేపల్లి చెప్పడంతో ఆయన అభీష్టం మేరకే దర్శి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్గా, పార్టీ అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్‌ను జగన్మోహన్రెడ్డి నియమించారన్నారు. అందరూ కలసి అత్యధిక మెజార్టీతో మద్దిశెట్టిని గెలిపించాలని కోరారు. మద్దిశెట్టిని గెలిపించి తీరుతా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యరిగా పోటీ చేస్తున్న మద్దిశెట్టి వేణుగోపాల్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతానని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి చెప్పారు. తనకు వైఎస్సార్ సీపీలో టిక్కెట్ ఇవ్వలేదన్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. తన తండ్రి అనారోగ్య కారణాల వలన ఏడాదిన్నర క్రితమే తాను ఈసారి పోటీ చేయలేనని, మంచి అభ్యర్ధిని నియమిస్తే గెలుపించి తీసుకొస్తానని తాను చెప్పినట్టు గుర్తుచేశారు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని జగన్ మోహన్‌రెడ్డి చెప్పారని కార్యకర్తలు అందరూ మద్దిశెట్టిని ఆదరించాలని కోరారు. మద్దిశెట్టికి ఓటేస్తే తనకు ఓటేసి నట్లేనన్నారు. మంత్రి శిద్దా రాఘవరావుకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెబుతున్నా.. మద్దిశెట్టిని గెలిపించే బాధ్యత బూచేపల్లి కుటుంబం తీసుకుంటుందన్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఓటమి ఖాయం అని అన్నారు. సాగర్ జలాలు విడుదలైనా రైతులకు నీరివ్వకుండా వారిని నట్టేట ముంచిన మీకు మంత్రి పదవి అవసరమా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా నియోజకవర్గంలోని ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. అందరినీ కలుపుకుపోతా: మద్దిశెట్టి జగన్మోహన్రెడ్డి తనను పోటీ చేయాలని అడిగినప్పుడు శివప్రసాద్‌రెడ్డి తనతో ఉంటేనే పోటీ చేస్తానని తాను స్పష్టంగా చెప్పానని మద్దిశెట్టి వేణుగోపాల్ తెలిపారు. తామిద్దరం ఒక మాటపై నిలబడి, కలసి కట్టుగా పని చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామని, పార్టీని గెలిపించి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. దర్శిలో బలమైన రెండు సామాజిక వర్గాలు కలసి పోటీ చేస్తున్నాయని ఈ సారి గెలుపు ఇక్కడ ప్రత్యర్ధులు పోటీ చేయాలంటేనే బయపడేలా ఉండాలన్నారు. ఆది నుంచి పార్టీలో ఉన్నవారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మద్దిశెట్టి శ్రీధర్, దర్శి, దొనకొండ, ముండ్లమూరు, మండలాల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, సూదిదేవర అంజయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిలు ఐవీ సుబ్బారెడ్డి, కుమ్మిత అంజిరెడ్డి, పోశం మధుసూదన రెడ్డి, సుంకరబ్రహ్మరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
చంద్రబాబూ నీ మోసాలు కట్టిపెట్టు
ఒంగోలు సిటీ: ఎన్నికల్లో ప్రజల్ని మరో సారి మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. స్థానిక 13వ డివిజన్లో బుధవారం రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డివిజన్ అధ్యక్షుడు ఎం.రాజేష్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పంది రత్నరాజు ఆ«ధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు అధ్యక్షత వహించారు. బాలినేని మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో మరోసారి జనాలను మోసం చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలు ప్రారంభించాడన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంత వరకు అమలు చేయలేదన్నారు. తీరా ఎన్నికలు రాగానే నానా రకాల ప్రలోభాలకు తెరలేపారన్నారు. కొత్తగా ప్రజలపై హామీలను ఇవ్వడానికి నిసిగ్గుగా వ్యవహరిస్తున్నారన్నారు. కాపులను మోసగిస్తున్న బాబు.. కాపులను బీసీల్లో చేరుస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇంత వరకు నెరవేర్చకుండానే మరో సారి 5 శాతం రిజర్వేషన్ పేరుతో దగా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్రం ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న వివిధ కులాల్లోని వారిని ఆదుకునేందుకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా కాపుల ఓట్లను కొల్లగొట్టేందుకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో బీసీల్లోని వివిధ కులాలకు ఇచ్చిన హామీలనే ఇంత వరకు నెరవేర్చలేదన్నారు. తాను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఒంగోలులోని బీసీలకు ఆరామక్షేత్రాలు, వారి కమ్యూనిటీ అవసరాలకు లబ్ధి చేకూర్చామన్నారు. మంజునాథ కమిషన్ రిపోర్టు ఇవ్వలేదు కాపులను బీసీల్లో చేర్చడానికి మంజునాథ కమిషన్ ఇంత వరకు నివేదిక ఇవ్వలేదన్నారు. నివేదిక రాకుండానే కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం మోసం కాదా అని ప్రశ్నించారు. న్యాయపరమైన చిక్కులు, ఇబ్బందుల గురించి తెలిసినా ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పొత్తుల విషయంలో చంద్రబాబు ఎవ్వరితోనైనా నిసిగ్గుగా ముందుకు వస్తారని ధ్వజమెత్తారు. అవినీతికి అడ్డాగా.. రాష్ట్రాన్ని అవినీతి అడ్డాగా మార్చేశారని చంద్రబాబును బాలినేని విమర్శించారు. ప్రతి టెండర్లోనూ రూ. కోట్లు కొల్లగొట్టారన్నారు. ఈ ఎన్నికల్లో అవినీతి సొమ్మును ఎగజల్లేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి తనకు అనుకూలంగా మలుచుకున్నారన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. తెలుగుదేశం మునిగిపోయే పడవ లాంటిదని, అందులో ప్రయాణించే వారికి ప్రమాదం తప్పదన్నారు. జగన్‌పై హత్యాయత్నం కుట్ర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఎన్ఐఏ విచారణలో బయట పడుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, దామరాజు క్రాంతికుమార్, చిన్నపరెడ్డి, కోడూరి కిషోర్, యనమల నాగరాజు, నల్లమల్లి బాలు, జలీల్, దేవరపల్లి అంజిరెడ్డి,ఐ.వి.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే అయితే..?
ఒంగోలు: ‘‘ఎమ్మెల్యే అయితే పేదలకు కాకుండా ఆయన అనుచరులకు, కార్యకర్తలకు భూములు పంచుతారా? ఆ విధంగా పట్టాలు ఇచ్చే అధికారం ఎమ్మెల్యేకు ఎవరిచ్చారు? అలా ఇవ్వవచ్చని చట్టంలో ఎక్కడైనా ఉందా?’’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. ఒంగోలు కేశవరాజుకుంటలో గత పది రోజులుగా వివాదాస్పంగా ఉన్న ఎన్ఎస్పీ భూములను ఆదివారం ఉదయం బాలినేని పరిశీలించారు. ఈ సందర్భంగా కేవవరాజుకుంట, చినమల్లేశ్వర కాలనీ వాసులు పెద్ద ఎత్తున వచ్చి బాలినేని వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. వాసన్నా...అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటూ వాపోయారు. అక్రమాలను అడ్డుకుంటున్న తమ కాలనీ వాసులపై తప్పుడు కేసులు పెడుతున్నారని, పోలీసుల సమక్షంలోనే నిర్మాణాలు జరుగుతున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను భూముల వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నన్న పోలీసులు.. ఎమ్మెల్యే అనుచరులకు మాత్రం దగ్గరుండిసహకరిస్తున్నారని ఆరోపించారు. తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు మహిళలతో వ్యవహరిస్తున్న తీరు, ఆయన వాడుతున్న పదజాలం తీవ్ర అభ్యంతరకరంగా ఉందంటూ పలువురు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. అసభ్య పదజాలంతో మాట్లాడటాన్ని తట్టుకోలేక తాము పోలీస్ జీపును ఆపితే కేసులు నమోదు చేసి వేధింపులకు దిగారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ తీరుపై ఇప్పటికే ఒంగోలు డీఎస్పీ, ఎస్పీ, ఐజీతోపాటు జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామని మాల మహానాడు అధ్యక్షుడు బిళ్లా వసంతరావు బాలినేని దృష్టికి తెచ్చారు. దీంతో కేసుల విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడతానని, భయపడాల్సిన అవసరం లేదంటూ బాలినేని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కబ్జాలు చేయడం టీడీపీ నేతలకు ఆనవాయితీగా మారింది పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే దౌర్జన్యంగా వ్యవహరిస్తుండడం దారుణమని బాలినేని విమర్శించారు. ప్రభుత్వ స్థలాలను కబ్జాచేయడం అధికార పార్టీ నాయకులకు ఆనవాయితీగా మారిందని, దీనిని అడ్డుకుంటామన్నారు. ఎన్ఎస్పీ స్థలంలో తహసీల్దార్ పట్టాలు ఎలా కేటాయిస్తారని, అలా ఇచ్చేందుకు ఆయనకు హక్కు ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. కొన్ని పట్టాలపై సంతకాలు లేవని, మరికొన్నిటిపై సంతకాలు చేశారని.. అవి అధికారులు పెట్టినవేనని అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆయన అనుచరులు, కార్యకర్తలకు పట్టాలు ఇవ్వచ్చని చట్టంలో ఎక్కడైనా ఉందా అని నిలదీశారు. ఎన్ఎస్పీ నుంచి భూమి కన్వర్షన్ కాకుండా పట్టాలు ఇచ్చేందుకు అవకాశమే లేదని, ఆ స్థలం ఆక్రమణకు గురికాకుండా అడ్డుకుంటామన్నారు. దొంగ పట్టాలు సృష్టించిన వారికి పోలీసులు కాపలా కాయడం సరికాదని హితవు పలికారు. బాధితులపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, భూముల పట్టాలపై సంతకాలు ఎవరు చేశారో విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలినేని వెంట వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కఠారి శంకర్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్, రాష్ట్ర అదనపు కార్యదర్శి వేమూరి సూర్యనారాయణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూళిపూడి ప్రసాద్‌నాయుడు, ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పంది రత్నరాజు తదితరులు ఉన్నారు. -
రాష్ట్రంలో సంక్షేమం చతికిల పడింది
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చతికిలపడిందని, ప్రచారార్భాటం తప్ప చంద్రబాబు ప్రజల గోడు పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో వరుస కరువులతో ప్రజలు అల్లాడిపోతున్నా ఉపశమన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సాగర్‌లో నీరున్నా ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదన్నారు. పశ్చిమ ప్రకాశంలో గుక్కెడు మంచినీరు కూడా అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. రైతులు, రైతు కూలీలు వలసలు వెళ్లాల్సిన దుర్భిక్ష పరిస్థితి జిల్లాలో నెలకొందని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. వలసలు నివారించాల్సిన ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుకు పట్టడం లేదన్నారు. జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఇచ్చిన హామీలనే మళ్లీ ఇవ్వడం తప్ప నాలుగున్నరేళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క హామీ నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. తీరా ఎన్నికలొచ్చాకా దొనకొండ, కనిగిరి నిమ్జ్, రామాయపట్నం పోర్టులు చంద్రబాబుకు గుర్తొచ్చాయన్నారు. మూడేళ్ల క్రితం జిల్లాకు ట్రిపుల్ ఐటీ మంజూరైతే ఇప్పటి జిల్లాలో ట్రిపుల్ ఐటీని నడపలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని బాలినేని విమర్శించారు. తీరా ఎన్నికలొచ్చాక బాబుకు జిల్లాకు ఇచ్చిన హామీలు గుర్తుకొచ్చాయని ఎద్దేవా చేశారు. ఈ సర్కారుకు రైతులపై ప్రేమలేదు.. సుబాబుల్, జామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని, వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను ప్రభుత్వం గాలికొదిలిందని బాలినేని విమర్శించిరు. రైతులంటే చంద్రబాబుకు ఏ మాత్రం ప్రేమ లేదని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్ సీపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందన్నారు. జిల్లాలో వైఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలు జనం మదిలోకి వెళ్లాయన్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. -
బాబు నోట.. అక్కడో మాట ఇక్కడో మాట!
ఒంగోలు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి, రంగులు మార్చే ఊసరవెల్లి సైతం సిగ్గు పడుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మన రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సమర్థించుకుంటున్న చంద్రబాబు తెలంగాణలో అమ్ముడుపోయినటీడీపీ ఎమ్మెల్యేలను మాత్రం చిత్తుచిత్తుగా ఓడించాలంటూ పిలుపు ఇవ్వడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఒంగోలు నగరం కర్నూల్‌రోడ్డులోని 44వ డివిజన్లో శుక్రవారం వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన బాలినేని అనంతరం డివిజన్ పరిధిలోని మారుతీనగర్‌లో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టబోయే ప్రజాసంక్షేమ కార్యక్రమాలను వివరించారు. నవరత్నాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా బాలినేని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరును ఎండగట్టారు. నిన్న మొన్నటి వరకు బీజేపీతో జతకట్టి కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోసిన చంద్రబాబు నేడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. కాంగ్రెస్ సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఏర్పాటైన తెలుగుదేశం పార్టీని చివరకు చంద్రబాబు కాంగ్రెస్‌లో విలీనం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. ఇటువంటి చంద్రబాబు మనకు ముఖ్యమంత్రి కావడం మనం చేసుకున్న దురదృష్టమన్నారు. మరో మారు ఇటువంటి దురదృష్టకర ఘటనకు తావులేకుండా నిత్యం జనం మధ్యన ఉంటూ జనం సమస్యలే ఊపిరిగా జీవిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకునేందుకు ప్రతి అక్కా.. చెల్లెమ్మలు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర «అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, 44వ డివిజన్ అధ్యక్షుడు గోపిరెడ్డి గోపాల్‌రెడ్డి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. -
బాబూ..ఓట్ల డ్రామాలు ఆపు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నాలుగున్నరేళ్ల పాలనలో జిల్లాలోని వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను పట్టించుకోని చంద్రబాబు ఓట్ల కోసం పెన్నా –గోదావరి అనుసంధానమంటూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నానికి దిగారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన “సాక్షి’ తో మాట్లాడారు. ఎన్నికలు వచ్చాక బాబుకు చింతలపూడి ఎత్తిపోతల పథకం గుర్తుకు వచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించి అక్కడి నుంచి సాగర్ కాలువకు నీరు తరలిస్తానని చంద్రబాబు ప్రకటించడంపై ఆయన మండిపడ్డారు. గడచిన నాలుగేళ్లలో బాబు రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తిచేశారా..అని బాలినేని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని రైతాంగాన్ని వంచించేందుకే పెన్నా–గోదావరి అనుసంధానం తెరపైకి తెచ్చారన్నారు. కొత్త ప్రాజెక్టు నీళ్ల సంగతి దేవుడెరుగు సాగర్‌లో ఉన్న నీటిని ప్రభుత్వం ఆయకట్టుకు ఇవ్వడం లేదన్నారు. నాలుగేళ్లుగా జిల్లాలో కరువు పరిస్థితులు ఉన్నాయన్నారు. గత ఏడాది, ఈ ఏడాది సాగర్‌లో నీళ్లున్నా ప్రభుత్వం ఆయకట్టుకు నీళ్లిచ్చిన పాపాన పోలేదన్నారు. ఈ ఏడాది సగం ఆయకట్టుకు కూడా నీళ్లివ్వని విషయం రైతులతోపాటు అధికార పార్టీ నేతలకు కూడా తెలుసన్నారు. బాబు పాలనలో జిల్లాలోని వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను పట్టించుకోలేదని బాలినేని విమర్శించారు. వెలిగొండ పూర్తిచేసి ఉంటే జిల్లాలో కరువు పరిస్థితులు ఉండేవి కావన్నారు. గుడ్లకమ్మ ప్రాజెక్టు కింద మిగిలి ఉన్న ఐదు శాతం పనులను కూడా ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. వైఎస్ హయాంలో జరిగిన పనులు తప్ప బాబు పాలనలో పనులు ముందుకు సాగలేదన్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలు పెంచుకొన్నారు తప్ప పనులు చేయలేదని బాలినేని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి రైతుల గోడు పట్టలేదన్నారు. ఈ విషయం జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయకుండా తీరా ఎన్నికల సమయంలో పెన్నా–గోదావరి అనుసంధానం చేసి 2019 నాటికే సాగర్ ఆయకట్టుకు నీళ్లిస్తామని చెప్పడం మరోమారు రైతాంగాన్ని వంచించడమేనని బాలినేని ధ్వజమెత్తారు. దశాబ్దాల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టులను పట్టించుకోని బాబు అసలే మొదలు పెట్టని ప్రాజెక్టు ద్వారా నీళ్లిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 53 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించబోతున్నట్లు చెబుతున్న చింతలపూడి ఎత్తిపోతల ద్వారా చింతలపూడి కింద 4.90 లక్షల ఎకరాలు, సాగర్ కుడికాలువ పరిధిలో 9.6 లక్షల ఎకరాలకు నీటిని ఎలా అందిస్తారని బాలినేని ప్రశ్నించారు. మొత్తం ఆయకట్టుకు నీళ్లివ్వాలంటే కనీసం 130 టీఎంసీల నీరు అవసరమౌతుందన్నారు. ఓట్ల కోసం మరోమారు చంద్రబాబు జనాన్ని వంచించే ప్రయత్నానికి దిగారని బాలినేని విమర్శించారు. బాబు ఎన్ని కుట్రలు చేసినా జనం నమ్మరన్నారు. జనం మద్దతు వైఎస్సార్ సీపీ కేనన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ప్రాజెక్టులను ఏడాది లోపే పూర్తిచేస్తామన్నారు. -
ప్రాణాధారం కోసం పోరుబాట
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ సర్కారుపై వైఎస్సార్ సీపీ సమరశంఖం పూరిస్తోంది. ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పోరుబాట పడుతోంది. ప్రాజెక్టు నిర్మాణం తక్షణం పూర్తి చేయాలన్న డిమాండ్‌తో ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రకు సిద్ధమైంది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు పాదయాత్ర కనిగిరి నుంచి ప్రారంభం కానుంది. పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ యాత్రను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం కనిగిరి పామూరు బస్టాండు సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆతర్వాత యాత్ర కనిగిరిలో ప్రారంభమై మధ్యాహ్న విరామానికి మార్కెట్ యార్డు సమీపానికి చేరుకుంటుంది. భోజన విరామ అనంతరం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభమై 6 కిలోమీటర్లు సాగి తొలిరోజు సాయంత్రానికి హాజీపురం క్రాస్ వద్దకు చేరుకుంటుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి నేతల రాక.. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి, ఆదిమూలం సురేష్‌తో పాటు పార్టీ సమన్వయకర్తలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారు. వీరితోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అనీల్‌కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డిలతో పాటు పలువురు నేతలు హాజరు కానున్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పట్ల చంద్రబాబు సర్కారు వైఫల్యంతో పాటు ప్రాజెక్టు సత్వర పూర్తి అవసరాన్ని యాత్ర సందర్భంగా నేతలు ప్రజలకు తెలియచెప్పనున్నారు. నాలుగేళ్లు నాన్చి ఇప్పడు హడావుడి.. శ్రీశైలం జలాశయం నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు 43.58 టీఎంసీలకృష్ణా వరద నీటిని మళ్లించాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, దర్శి, కనిగిరి నియోజకవర్గాల పరి«ధిలోని 23 మండలాలలో 3,36,100 ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందాల్సి ఉంది. దీంతో పాటు వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో 27,200 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో 84వేల ఎకరాలకు సైతం సాగు నీరు అందాల్సి ఉంది. పై మూడు జిల్లాలో పరిధిలో 15.25 లక్షల మందికి ఈ ప్రాజెక్టు ద్వారా సురక్షిత తాగునీరు అందించాల్సి ఉంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబు సర్కారు గాలికొదిలింది. పేరుకు 1996లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినా ఆ ఏడాది కేవలం రూ.9.66 లక్షలు మాత్రమే కేటాయించి బాబు చేతులు దులుపుకున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టుకు రూ.1500 కోట్లకు పైగా కేటాయించి ప్రాజెక్టు పనులు వేగవంతం చేశారు. తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి ఏడాదే పనులు పూర్తి చేసి వెలిగొండ ద్వారా నీరిస్తానంటూ హమీ ఇచ్చినా నాలుగేళ్ల పాలనలో అది నెరవేరలేదు. కాంట్రాక్టర్ల వివాదంతో మూడు నెలలుగా వెలిగొండ పనులు పూర్తిగా నిలిచి పోయాయి. ఆర్భాటమే తప్ప ఆచరణ లేదు.. వెలిగొండ పూర్తి కోసం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్రకు సిద్ధం కావడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు పనులు మొదలు పెడతామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసినా అది ఆచరణకు నోచుకోలేదు. ఏడాది పాటు ఎడతెగకుండా పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించినా టన్నెల్–1 పనులు పూర్తయి ఫేజ్–1 ద్వారా నీరు వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వెలిగొండ ద్వారా నీరిస్తామంటూ చంద్రబాబు మరోమారు పశ్చిమ ప్రాంత వాసులను వంచించే ప్రయత్నానికి దిగారు. పశ్చిమ ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టే ప్రాణాధారం. సాగు, తాగునీరు ఆ ప్రాజెక్టు వల్లే సాధ్యం. కనిగిరి, కొండేపి, కందుకూరు, మార్కాపురం ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీరే ప్రజలకు దిక్కు. ఫ్లోరైడ్ నుంచి బయట పడేందుకు ప్రజలు వాడుతున్న మందులవల్లే కిడ్నీలు పాడై జనం పిట్టల్లా ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం వెలిగొండను పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని జిల్లా వాసులకు ముఖ్యంగా పశ్చిమ ప్రాంత వాసులకు తెలియచెప్పడంతో పాటు తక్షణం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే వైఎస్సార్ సీపీ ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రకు సిద్ధమైంది. 207 కిలోమీటర్లు 15 రోజులకు పైగా ఈ యాత్ర కొనసాగనుంది. యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ వద్ద యాత్ర ముగియనుంది. వరుస కరువులతో అల్లాడిపోతున్న జిల్లా వాసుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి మరింత ఒత్తిడి పెంచేందుకు చేపట్టిన పాదయాత్రకు అందరూ మద్దతు పలికి విజయవంతం చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. -
ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఊసరవెళ్లి రాజకీయాలు
-
ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి:బాలినేని
-
'రోజా అంటే చంద్రబాబుకు భయం'
ఒంగోలు (ప్రకాశం) : ఎమ్మెల్యే రోజాను చూస్తే సీఎం చంద్రబాబునాయుడుకు వణుకు పుడుతోందని మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అందుకే రోజాను అసెంబ్లీకి రానీయకుండా మరోసారి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒళ్లు బలిసి మాట్లాడుతున్నారని బాలినేని ధ్వజమెత్తారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే సహించేది లేదన్నారు. జేసీ బ్రదర్స్ పద్దతి మార్చుకోకపోతే జనం తరిమికొడతారని బాలినేని నిప్పులు చెరిగారు. -
'నోట్ల రద్దుతో సామాన్యులకే ఇబ్బంది'
ఒంగోలు : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సామాన్యులనే ఇబ్బందులకు గురిచేసిందని మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లాలో శనివారం ఆయన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...నల్ల కుబేరులు దర్జాగా కోట్లలో డబ్బును మార్చుకుంటున్నారన్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. సామాన్య ప్రజలను నట్టేట ముంచిన విజయ్ మాల్యాకు రుణం మాఫీ చేయడం చోద్యమని బాలినేని అన్నారు. -
‘వైఎస్ జగన్ సభకు యువత పోటెత్తారు’
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తుందని వైఎస్ఆర్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హోదాతోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని బాలినేని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటుంటే చంద్రబాబు మాత్రం ప్రత్యేక ప్యాకేజిలు తీసుకుని ప్రజలను మోసం చేస్తున్నాడని బాలినేని విమర్శించారు. ఒంగోలు ఇస్లాంపేటలో సోమవారం జరిగిన గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ విశాఖలో వైఎస్ జగన్ సభకు యువత పోటెత్తారన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ ఎంత బలంగా ఉందో, సభకు వచ్చినవారిని చూస్తే తెలుస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని బాలినేని సూచించారు. -
వెల్లువెత్తిన ప్రజాదరణ
♦ సమస్యల పరిష్కారం జగనన్నతోనే సాధ్యం ♦ రాజన్న పాలన కోసం వైఎస్సార్ సీపీకి అందరూ మద్ధతు పలకాలి ♦ ఒంగోలు పర్యటనలో పిలుపునిచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ♦ గడప గడపకు వైఎస్సార్ సీపీకి విశేష స్పందన నేతల దృష్టికి ప్రజా సమస్యలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అరుుతే రాజన్న పాలన మళ్లీ వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డిలు పేర్కొన్నారు. ప్రజలంతా వైఎస్సార్ సీపీకి మద్దతు పలకాలని కోరారు. గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఐదో రోజు బాలినేని, సుబ్బారెడ్డి కలిసి ఒంగోలు నగరంలో పర్యటించారు. 6వ డివిజన్ పరిధిలోని నీలాయిపాలెం, గోపాల్నగర్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బాలినేని కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజలంతా వైఎస్సార్ సీపీకి మద్దతు పలకాలని కోరారు. జగన్ ముఖ్యమంత్రి అయితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. చీరాల నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ వేటపాలెం మండలం దేశాయిపేటలో పర్యటించి, ప్రజా బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేశారు. కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ పీసీపల్లి మండలం లక్ష్మక్కపల్లి పంచాయతీ పరిధిలో పర్యటించారు. పర్చూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ కారంచేడు మండలం ఆదిపూడిలోను, కొండపి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడులో నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. చంద్రబాబు పాలన అవినీతిమయం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు అర్బన్ : చంద్రబాబు పాలన అవినీతిమయంగా తయారయిందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. మంగళవారం ఒంగోలులో నిర్వహించిన గడగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో ఆయన బాలినేనితో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రజా బ్యాలెట్‌ని పంపిణీ చేస్తూ చంద్రబాబు రెండేళ్ల పాలన వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. టీడీపీ నాయకులకు రాజధాని భూములను కట్టబెడుతున్నారని మండిపడ్డారు. 30 వేల ఎకరాలు రైతుల నుంచి బలవంతగా లాక్కున్నారని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని, నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం గాలికొదిలేసి ప్రజాధనంతో విదేశీ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. స్మార్ట్ పల్స్ సర్వే ప్రభుత్వం ఎందుకు చేస్తుందో పరిశీలించి, ఆ అంశంపై ప్రస్తావిస్తామన్నారు. ప్రజలు చంద్రబాబు పాలనపై విసుగుచెంది ఉన్నారని, గడగ గడపకు కార్యక్రమానికి భారీ ప్రజాస్పందన రావడం సంతోషకరమని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనపై ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తున్నామని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం వస్తుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. -
అమర్నాథ్లో మనోళ్ల పాట్లు
-
అమర్నాథ్లో మనోళ్ల పాట్లు
- కశ్మీర్లో చిక్కుకుపోయిన వందలాది తెలంగాణ యాత్రికులు - అల్లర్ల నేపథ్యంలో లాడ్జీలు, సైనిక గుడారాల్లో తలదాచుకుంటున్న వైనం - అందరినీ క్షేమంగా రప్పిస్తాం: మంత్రి లక్ష్మారెడ్డి - తగిన సాయం అందించండి: కశ్మీర్ ఏడీపీతో ఇన్చార్జి డీజీపీ సాక్షి నెట్వర్క్ : తెలంగాణ నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లినవారు కశ్మీర్లో చిక్కుకొని నానా అవస్థలు పడుతున్నారు. కశ్మీర్లో చెలరేగిన అల్లర్లతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పలుచోట్ల ఆందోళనకారులు యాత్రికుల బస్సులు, బస కేంద్రాలపై దాడులు చేస్తున్నారు. కొందరు లాడ్జిల్లో, మరికొందరు ఆర్మీ గుడారాల్లో తలదాచుకుంటున్నారు. వీరిలో మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు చెందిన 150 మంది, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 80 మంది ఉన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి వెళ్లిన మరో 500 మంది పహల్గాం, బాల్తాల్ మిలటరీ బేస్ క్యాంప్‌లో ఉన్నారు. బస్సుపై అల్లరి మూకల దాడి మెదక్ జిల్లా గజ్వేల్, వర్గల్ మండలాలతో పాటు రంగారెడ్డి జిల్లా అల్వాల్, హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్, మలక్‌పేట ప్రాంతాలకు చెందిన 105 మంది గత నెల 29న అమర్నాథ్ యాత్రకు బయలుదేరారు. వీరిలో రంగారెడ్డి జిల్లా కండ్లకోయ హనుమాన్ పీఠాధిపతి, అఖిలభారత హనుమత్దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామిజీ కూడా ఉన్నారు. ఈ నెల 6న వీరు అమర్నాథ్కు వెళ్లి, 8న తిరుగు పయనమయ్యారు. మూడు బస్సుల్లో విడిపోగా, 30 మందితో ఒక బస్సు శ్రీనగర్ లాల్‌చౌక్ చేరుకుంది. సరిగ్గా అప్పుడే అక్కడ విధ్వంసం సాగుతోంది. దీంతో యాత్రికులు ఓ లాడ్జిలో ఆశ్రయం పొందారు. కాసేపటికే అల్లరిమూకలు అక్కడికి వచ్చి బస్సు అద్దాలు పగులగొట్టి యాత్రికులపై దాడికి యత్నించారు. మిగతా రెండు బస్సుల్లోని యాత్రికులు బాల్టాక్ ప్రాంతంలో నిలిచిపోయారు. ఎఫ్‌సీఐ గోదాం, హోటళ్లలో తలదాచుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వెళ్లిన 80 మంది యాత్రికులు బాల్టాక్‌లో బేస్‌క్యాంపుల్లో ఆశ్రయం పొందుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 500 మంది పహల్గాం, బాల్తాల్ మిలటరీ బేస్ క్యాంప్ లో తలదాచుకుంటున్నారు. తాము సురక్షితంగానే ఉన్నట్టు వీరు సమాచారం అందించారు. చర్యలు తీసుకుంటాం: లక్ష్మారెడ్డి, మంత్రి అమర్నాథ్ యాత్రికులను క్షేమంగా ఇంటికి చేర్చే విధంగా చర్యలు తీసుకుంటాం. యాత్రికుల క్షేమ సమాచారాన్ని విచారించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నాం. ఈ మేరకు హోంమంత్రి తో మాట్లాడి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. కశ్మీర్ ఏడీపీతో మాట్లాడిన ఇన్చార్జి డీజీ కశ్మీర్లో చిక్కుకున్న తెలుగువారికి సహాయం అందించాల్సిందిగా తెలంగాణ ఇన్చార్జి డీజీపీ అంజనీకుమార్ అక్కడి శాంతిభద్రతల ఏడీపీ ఎస్ఎం సహాయ్ను కోరారు.ఆదివారం ఫోన్ చేసి అక్కడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యాత్రికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఏదైనా వ్యాధులతో బాధపడేవారికి తక్షణం మందులు అందేలా చూడాలన్నారు. 3 రోజులుగా బేస్‌క్యాంప్‌లోనే! బల్తాల్, శ్రీనగర్ బస్టాండ్‌లో చిక్కుకున్న 365 మంది ఏపీవాసులు సాక్షి, ఒంగోలు/బుచ్చిరెడ్డిపాళెం/నల్లజర్ల/ విశాఖపట్నం: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన 365 మందికిపైగా యాత్రికులు తిరుగుప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్మూకశ్మీర్ సరిహద్దులో జరుగుతున్న కాల్పుల నేపథ్యంలో బల్తాల్‌లోని బేస్‌క్యాంప్ వద్దనే రక్షణ ద ళాలు వీరి వాహనాలను అడ్డుకున్నాయి. పరిస్థితి సద్దుమణిగిన తరువాత పంపుతామని అక్కడి అధికారులు చెప్పడంతో మూడు రోజులుగా అక్కడే ఉండిపోయారు. మౌలిక వసతులు లేక యాత్రికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అక్కడ చిక్కుబడిపోయినవారిలో ప్రకాశం జిల్లాకు చెందిన 118 మంది, పశ్చిమగోదావరి 80 మంది, గుంటూరు 40 మంది, నెల్లూరు జిల్లా నుంచి 47, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 80 మంది ఉన్నారు. యాత్రికులతో ఫోన్లో మాట్లాడిన వైవీ, బాలినేని అమర్నాథ్లో ఇరుక్కుపోయిన ఒంగోలు ప్రాంతానికి చెందిన యాత్రికులతో ఆదివారం ఉదయం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫోన్ లో మాట్లాడారు. అనంతరం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జమ్మూ డీజీపీ రాజేంద్రకుమార్‌తో సైతం మాట్లాడారు. యాత్రికులను పూర్తి రక్షణతో స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. యూత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీ భవన్ అధికారి శ్రీకాంత్‌ను ఆదేశించారు. మాజీ మంత్రి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా యాత్రికులతో మాట్లాడారు. వారిని స్వస్థలాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. -
‘ప్రకాశం’ వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా బాలినేని
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
సమీక్షలను విజయవంతం చేయండి
ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమ, మంగళవారాల్లో నిర్వహించే జిల్లాలోని 12 నియోజకవర్గాల సమీక్ష సమావేశాలకు పార్టీకి చెందిన అన్ని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, సహకార సంఘాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులంతా హాజరుకావాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి కోరారు. ముందుగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని బచ్చల బాలయ్య కల్యాణ మండపాన్ని బాలినేని, ముత్తుముల అశోక్‌రెడ్డితో పాటు యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, పలువురు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల సమీక్షలతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపైనా చర్చిస్తామన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకుగాను తమ పార్టీ నిత్యం ప్రజలతో మమేకం అవుతుందని అందులో భాగంగానే డిసెంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనభేరీ కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారన్నారు. రుణమాఫీ చేస్తానంటూ ఎన్నికల సమయంలో ప్రకటించిన చంద్రబాబు నేడు అందుకు భిన్నంగా రైతుల పట్ల వివక్ష కొనసాగిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో పెన్షన్లు కోల్పోయిన వృద్ధులు, వితంతువులకు అండగా నిలిచేందుకు సైతం తమ పార్టీ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో చంద్రబాబు గద్దె ఎక్కాడని..నేడు జనం అంతా గుర్తించారన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, ఇలా అన్ని వర్గాల వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై రెండు రోజులపాటు జరిగే నియోజకవర్గాల సమీక్షలో చర్చిస్తామన్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులతోపాటు పార్టీని జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు కూడా దృష్టి సారిస్తామన్నారు. పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు, పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. సమీక్షలు ఇలా: వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు ఒంగోలుకు చేరుకుంటారు. ఒంటి గంట నుంచి 2.30 వరకు కందుకూరు, 3 నుంచి 5.30 గంటల వరకు అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాలు, 6 నుంచి 8.30 వరకు చీరాల, పర్చూరు సమీక్షలు ఉంటాయి. 24వ తేదీ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఒంగోలు, గం.11.30 నుంచి గం.1.30 వరకు వై.పాలెం, గిద్దలూరు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు మార్కాపురం, కనిగిరి, సాయంత్రం 5 నుంచి 7.30 గంటల వరకు దర్శి, కొండపి నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. వీరివెంట వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, వివిధ విభాగాల నాయకులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కఠారి శంకర్, డీఎస్ క్రాంతికుమార్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, బడుగు ఇందిర, బొప్పరాజు కొండలు, సింగరాజు వెంకట్రావు, పురిణి ప్రభావతి తోటపల్లి సోమేశేఖర్, కత్తినేని రామకృష్ణారెడ్డి తదితరులున్నారు. నగరం నిండా భారీగా ఫ్లెక్సీలు: ఎన్నికల అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు తొలిసారి వస్తున్న సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. సమీక్ష జరిగే రైల్వేస్టేషన్ రోడ్డుతోపాటు దక్షిణ బైపాస్ నుంచి కర్నూల్‌రోడ్డు బైపాస్ వరకు, అదే విధంగా చర్చి సెంటర్ నుంచి వీఐపీ రోడ్డు వరకు పలు మార్గాల్లో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. -
బాలినేనికి ఆత్మీయ స్వాగతం పలికిన అభిమానులు
ఒంగోలు అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి శనివారం ఉదయం ఒంగోలులో ఘన స్వాగతం పలికారు. ఉదయం 5 గంటలకే పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒంగోలు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రైలు రాగానే..బాలినేని నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు పెద్దపెట్టున నినదించారు. బాలినేని ఇంటి వరకు కార్యకర్తలు ర్యాలీగా వెన్నంటి వచ్చారు. నివాసం వద్ద అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో బాలినేని ముచ్చటించారు. తమ పార్టీ ప్రతిపక్ష హోదాలో ప్రజాపక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని స్పష్టం చేశారు. బాలినేనికి స్వాగతం పలికిన వారిలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజుతో పాటు జిల్లా నాయకులు ఉన్నారు. -
పేదలకు ఉచిత వైద్యసేవలు వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
ఒంగోలు అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందుబాటులోకి రావాలంటే జగన్ నాయకత్వంలో వైఎస్సార్ సీపీతోనే సాధ్యమని ఆ పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన నివాసంలో మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ యాదాల అశోక్ ఆధ్వర్యంలో వివిధ మండలాల సభ్యులతో జిల్లా వైద్య విభాగం కమిటీని ఎంపిక చేశారు. బాలినేని చేతుల మీదుగా ఎంపికైన వారికి నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల ఆరోగ్య రక్షణ కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది మందికి శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయించి వారి ప్రాణాలు కాపాడితే తర్వాత పాలకులు ఆ పథకాన్ని పేదలకు దూరం చేశారని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో వైద్యసేవలందించేలా..అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా రూపొందించిన 108, 104ని కూడా నడపలేని దుస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. కుర్చీలు కాపాడుకోవాలనే తపన తప్ప ప్రజా సంక్షేమం పట్టని వాళ్లకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. డాక్టర్ యాదాల అశోక్ మాట్లాడుతూ వైద్యవిభాగం వైఎస్సార్ సీపీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తుందన్నారు. జిల్లా వైద్య విభాగ కమిటీకి నూతనంగా ఎంపికైన వారిలో ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ శంకర్‌రెడ్డి (చీరాల), కార్యదర్శులుగా డాక్టర్ ఎస్ఎమ్. బాషా (దర్శి), డాక్టర్ రమ (ఒంగోలు), సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ రత్నభారతి (సంతనూతలపాడు), డాక్టర్ రంగారెడ్డి (గిద్దలూరు), డాక్టర్ రఘునాథరెడ్డి (మార్కాపురం), కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ ధనుంజయ్ (కనిగిరి), డాక్టర్ కిషోర్ (కందుకూరు), డాక్టర్ ఆశోక్‌రెడ్డి (శింగరాయకొండ), డాక్టర్ జేసుదాసు (ఒంగోలు), డాక్టర్ వెంకట్రావు (చీరాలు), డాక్టర్ చక్రవర్తి (ఒంగోలు), డాక్టర్ చెంచయ్య (మార్కాపురం) ఉన్నారు. వీరంతా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేస్తారని తెలిపారు. -
జననీరాజనం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నుంచి జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలకు ఘన స్వాగతం లభించింది. ఉలవపాడు వద్ద అభిమానులు ఆమెకు ఆహ్వానం పలికారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో ఆమెకు ఎదురేగి స్వాగతం పలికారు. ఆమె అక్కడే మధ్యాహ్న భోజనం ముగించుకుని ఒంగోలు మీదుగా చీమకుర్తి చేరుకున్నారు. మార్గమధ్యంలో సింగరాయకొండ వద్ద ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు తన అనుచరులతో షర్మిలకు స్వాగతం పలికారు. దారిపొడువునా ఆమె కోసం ప్రజలు గంటల తరబడి వేచి ఉన్నారు. ఒంగోలు బైపాస్‌రోడ్డు వద్ద కూడా పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడి షర్మిలకు జేజేలు పలికారు. చీమకుర్తిలో వేలాది మంది షర్మిల రాకకోసం మధ్యాహ్నం నుంచే రోడ్లపై బారులు తీరారు. ఆమె రాగానే బాణసంచా కాల్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం అశేష జనవాహినిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. దివంగత నేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన సంక్షేమ పథకాల గురించి, ఆయన హయాంలో ధరలు పెంచకుండా ప్రజలను ఏ విధంగా ఆదుకున్నారో ఆమె పూసగుచ్చారు. అనంతరం చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలను తూర్పారబట్టారు. తొలుత మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్ సీఎం అయితే వైఎస్ఆర్ పాలన మళ్లీ వచ్చినట్లేనన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జగన్ తరఫున ఆయన సోదరి షర్మిల మన వద్దకు వచ్చారని చెప్పారు. వచ్చే అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బాలినేని పిలుపునిచ్చారు. ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డికి షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సభలో చీమకుర్తి మాజీ ఎంపీపీ బూచేపల్లి వెంకాయమ్మ, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ వరకూటి అమృతపాణి, అంగలకుర్తి రవి పాల్గొన్నారు. అక్కడి నుంచి షర్మిల పొదిలి మీదుగా కనిగిరి చేరుకున్నారు. పొదిలిలో కూడా ఆమెకు వేలాది మంది స్వాగతం పలికారు. కనిగిరిలో వైఎస్ఆర్ విగ్రహం నుంచి రోడ్డుకిరు వైపులా జనం భారీ ఎత్తున చేరుకుని ఆమెకు జేజేలు పలికారు. కనిగిరిలో పార్టీ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి నాయకత్వంలో బహిరంగ సభ నిర్వహించారు. రానున్న మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని షర్మిల కోరగా ప్రజలు చప్పట్లతో తమ సమ్మతి తెలిపారు. ఈ సభలో పార్టీ సమన్వయకర్త కాటం అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. షర్మిల పర్యటన పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో జరిగింది. బహిరంగ సభలకు ముందు వంగపండు ఉష బృందం పాటలు ఓటర్లను ఆలోచింపజేశాయి. -
జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
నాగులుప్పలపాడు, న్యూస్‌లైన్: వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. నాగులుప్పలపాడులో సోమవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అన్నీ ఫ్రీగా ఇస్తానని చెప్పే ఆల్‌ఫ్రీ బాబు మాటలను జనం నమ్మే స్థితిలో లేరని అన్నారు. కిలో బియ్యాన్ని * 5 చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. విశ్వసనీయత లేని నాయకులను జనం నమ్మరని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలంటే అది జగన్ వల్లే సాధ్యమవుతుందని అన్నారు. గ్రామస్థాయి నాయకుల నుంచి తాను పెంచిన వారే కనీస మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టడంలో ముఖ్యపాత్ర వహించిన చంద్రబాబును జనం విశ్వసించరన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడే వ్యక్తి ఒక్క జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. మారెళ్ల బంగారుబాబు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరడం అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భంగా మండలంలోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 300 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. మండల పార్టీ కన్వీనర్ దివి పున్నారావు అధ్యక్షత వహించిన కార్యక్రమం లో రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల సుధాకర్, బీసీ సెల్ అధ్యక్షుడు శంకర్, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు అంగలకుర్తి రవి, డా. అమృతపాణి, జిల్లా నాయకులు ఇనగంటి పిచ్చిరెడ్డి, పల్లెర్ల పుల్లారెడ్డి, చుండూరి రవి, గుమ్మడి సాయిబాబా, మాజీ ఎంపీపీ కోనంకి ఆదిలక్ష్మి, మండల నాయకులు మాలె వెంకట్రామిరెడ్డి, అన్నెం వెంకట్రామి రెడ్డి, ఇస్తర్ల అంజయ్య, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆస్పత్రి అభివృద్ధికి కృషి
ఒంగోలు, న్యూస్‌లైన్: వైద్య సేవలు మరింత విస్తృతం చేయాలని మాతాశిశు వైద్యశాల కమిటీ చైర్మన్ బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. సోమవారం ఒంగోలులోని మాతాశిశు వైద్యశాలలో నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఆస్పత్రి సీ గ్రేడ్‌లో ఉండేదని, కానీ ప్రస్తుతం ఏ గ్రేడ్‌కు చేరిందని తెలిపారు. మాతా శిశువులకు సంబంధించి ప్రతి రోజూ 200కుపైగా ఓపీలు వస్తున్నట్లు తెలిపారు. ప్రసవాలు నెలకు 150 నుంచి 176కి పెరిగాయన్నారు. ఎక్స్‌రే తీయించాల్సి వచ్చినప్పుడు రిమ్స్‌ను ఆశ్రయించాల్సి వస్తుందని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా పోర్టబుల్ ఎక్స్‌రే యూనిట్‌కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. 3.5 లక్షల నిధులతో కొనుగోలు చేసేందుకు బాలినేని అనుమతి మంజూరు చేశారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లకు హాజరైన సిబ్బందికి 1.31 లక్షల ప్రోత్సాహం ఇచ్చామన్నారు. ప్రస్తుతమున్న 80 పడకలను వంద పడకలుగా మార్చేందుకు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. సూపరింటెండెంట్ ఎస్ ఉషారాణి మాట్లాడుతూ ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉన్నట్లు తెలిపారు. 2013 ఏప్రిల్ నుంచి 2014 జనవరి వరకు ఆరోగ్యశ్రీ ఆపరేషన్ల కోసం పిలిపించిన ప్రైవేటు మత్తు డాక్టర్లకు *2.21 లక్షలు చెల్లించినట్లు వివరించారు. ఈ విషయాన్ని రిమ్స్ డెరైక్టర్ దృష్టికీ తీసుకెళ్లామని తెలిపారు. తాజా రిక్రూట్మెంట్లో కనీసం అనస్తీషియా పీజీ డాక్టర్నైనా ఇవ్వాలని కోరారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, అన్ని సమస్యలు తీరతాయని బాలినేని వారికి భరోసా ఇచ్చారు. -
సమైక్య ముసుగులో కిరణ్ దోపిడీ!
వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం ధ్వజం స్వతంత్రంగా విచారణకు సిద్ధం కావాలని సవాల్ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాద ముసుగులో ‘దోపిడీవాదం’ కొనసాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం ఆరోపించింది. గతేడాది జూలై 30న రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత కిరణ్ పాలనను గాలికొదిలేసి పగలు, రాత్రి ఫైళ్లపై రెండు చేతులతో సంతకాలు చేస్తూ దోపిడీవాదాన్ని కొనసాగిస్తున్నారని మండిపడింది. కిరణ్ దోపిడీకి పాల్పడకుంటే తక్షణం స్వతంత్రంగా విచారణకు ముందుకు రావాలని సవాల్ చేసింది. లేదంటే సమైక్యవాద ముసుగులో దోపిడీకి పాల్పడుతున్నట్లు కిరణ్ ఒప్పుకోవాలని సూచించింది. వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనాయకుడు ధర్మాన కృష్ణదాస్, కార్యదర్శి టి.బాలరాజు, విప్ బాలినేని శ్రీనివాసరెడ్డిలు ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం కిరణ్ గత జూలై 30 నుంచి నేటి వరకు చేసిన సంతకాలు, విడుదల చేసిన జీవోలను వెల్లడించాలని సమాచారహక్కు చట్టం కింద వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. భూ బదలాయింపులు, భూ కేటాయింపులు, గుత్తేదార్లకు అప్పనంగా ధారాదత్తం చేసిన ప్రజాధనం, ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖలో తీసుకున్న నిర్ణయాలపై సమాచారం కోరినట్లు చెప్పారు. ఈ వివరాలు అందాక కిరణ్ చేసిన దోపిడీపై చట్టపరంగా పోరాడి ప్రజాకోర్టులో ఆయన్ను దోషిగా నిలబెడతామని ప్రకటించారు. సీఎం కిరణ్ దోపిడీకి పాల్పడకుంటే ఈ 7 నెలల కాలంలో చేసిన కార్యక్రమాల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రా న్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిస్తే సీఎం కిరణ్ దానిని వక్రీకరిస్తూ సీపీఐ నాయకుల వద్ద నిరాధారమైన నిందలను మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు బురద చల్లి లబ్ధి కోసం ప్రయత్నిస్తున్న మాదిరిగానే వారి రహస్య మిత్రుడైన కిరణ్ కూడా అదే దారిలో నడుస్తున్నట్లుందని చెప్పారు. టీడీపీ స్క్రిప్టును పక్కాగా అమలు చేస్తూ కిరణ్ అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. జగన్‌పై చేసిన ఆరోపణలకు కిరణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. -
'అక్కినేని జీవితం.. ఒక పాఠం.. ఒక చరిత్ర'
హైదరాబాద్: అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దార్శినికుడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి అక్కినేనికి ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 70 ఏళ్లుగా తెలుగు ప్రజలను అక్కినేని రంజింపచేశారని గుర్తు చేశారు. అక్కినేని మరణం తెలుగుజాతికి విషాదమని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. అనేక మందికి ఆయన జీవితం ఆదర్శనీయమన్నారు. అక్కినేని జీవితం, ఒక పాఠం, ఒక చరిత్ర అని కీర్తించారు. -
బాబూ నీతిమంతుడవైతేనే అవినీతిపై మాట్లాడు
మద్దిపాడు, న్యూస్‌లైన్: చంద్రబాబూ నీవు నీతిమంతుడివైతే అవినీతి గురించి మాట్లాడవచ్చని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మద్దిపాడుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మోరుబోయిన సంజీవరావు సుమారు 300 మంది కార్యకర్తలతో వైఎస్సార్ సీపీలో చేరుతున్న సందర్భంగా స్థానిక కళా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీబీఐ ఎంక్వయిరీ తప్పించుకునేందుకు సుప్రీం కోర్టుకు వెళ్లిన చంద్రబాబు అవినీతిని పారదోలతానంటూ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. పంచాయతీ, సొసైటీ ఎన్నికల్లో తెలుగు-కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఆవిర్భవించిందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు చంద్రబాబు లేఖ ఇచ్చి రాష్ట్రానికి రూ. 4 లక్షల కోట్లు ఇస్తే..తాను నిజాయితీగా పాలిస్తాననడం ఆయన అవివేకానికి తార్కాణమని దుయ్యబట్టారు. రాష్ట్రం విడిపోయేందుకు చంద్రబాబే కారణమన్నారు. బీజేపీతో కలిసిపోతే సీట్లు సంపాదించుకోవచ్చని చంద్రబాబు ఆలోచిస్తున్నారని, అదే చంద్రబాబు 2004లో బీజేపీతో పొత్తు వల్లే తమ పుట్టి మునిగిందని గగ్గోలు పెట్టారని అన్నారు. దమ్ముంటే తెలుగుదేశం పార్టీ పొత్తులు లేకుండా గెలిచి చూపాలని ఆయన సవాల్ విసిరారు. పదేళ్ల పాటు అధికారానికి దూరం కావడంతో చంద్రబాబు పిచ్చి ఎక్కినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రం విడిపోతే నీటి కోసం యుద్ధాలు పెరుగుతాయని, సమస్యలు తీవ్రమవుతాయని అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రానికి దిశా నిర్దేశం చేయగలిగిన వ్యక్తి కేవలం జగన్ మాత్రమేనని అన్నారు. బలహీనవర్గాలకు ఎప్పుడూ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య మాట్లాడుతూ మంచి పటిష్టమైన పథకాలను అమలు చేయగలిగిన జగన్ సీఎం కావాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ సమన్వయకర్త అమృతపాణి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలు పెట్టగలిగిన సమర్థవంతమైన పార్టీ వైఎస్సార్ సీపీయేనన్నారు. సమన్వయకర్త అంగలకుర్తి రవి మాట్లాడుతూ కార్యకర్తలు సైనికుల్లా పని చేసి వైఎస్సార్ సీపీని అధికారంలో తేవాలని కోరారు. మరో జిల్లా నాయకుడు చుండూరి రవి మాట్లాడుతూ చంద్రబాబు ఒంటెత్తు పోకడలతో తమను ఇబ్బంది పెట్టేవాడని, ఆయన ఇబ్బందులను తట్టుకోలేకనే తాము ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలోకి వచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి మందా వందనం (చిన్న) చేరారు. కార్యక్రమంలో జిల్లా బీసీసెల్ కన్వీనర్ కఠారి శంకర్, మహిళా విభాగం కన్వీనర్ కావూరి సుశీల, చీమకుర్తి మండల కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు రొండ్లా నారపరెడ్డి, లింగారామకృష్ణారెడ్డి, బెజవాడ పూర్ణచంద్రరావు, ఎస్డీ.మజీద్, జిల్లెళ్లమూడి రమాదేవి, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ ఆర్. రమణమ్మ, వెల్లంపల్లి మాజీ సర్పంచ్ జయమ్మ, మరో మాజీ సర్పంచ్ పురాలశెట్టి చిన్న, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బొమ్మల శ్రీనివాసులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పల్లకి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం బాలినేని నూతన సంవత్సర కేక్ కట్ చేశారు. బాలినేని మండల ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రజల కోసమే జగన్ పోరాటం
ఒంగోలు, న్యూస్‌లైన్: ప్రజల సంక్షేమం కోసం అలుపెరగకుండా పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్ఆర్సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక మంగమూరు డొంకలోని అతిథి గృహంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి సేవా భావాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజలతో మమేకమై.. వారి సమస్యలు తెలుసుకోవాలని తెలిపారు. స్వార్థ రాజకీయాలతో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న యత్నాలను అడ్డుకుంటూ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటం చారిత్రాత్మకమైనదన్నారు. ఒక లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆయన తన తండ్రి ఆశయాలను, ఆయన అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు చేర్చుతారని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారన్నారు. అనంతరం కేక్‌ను కట్ చేసి పంచిపెట్టారు. వచ్చే ఏడాది సీఎం జగన్ కేక్‌ను కట్ చేద్దాం: ఎల్లసిరి గోపాలరెడ్డి జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని బాపట్ల పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడు ఎల్లసిరి గోపాలరెడ్డి పిలుపునిచ్చారు. జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్‌ను కట్‌చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది సీఎం జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాలన్నారు. పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధికారప్రతినిధి నరాల రమణారెడ్డి మున్సిపల్ పారిశుధ్య మహిళా కార్మికులకు చీరెలు పంపిణీ చేశారు. స్థానిక కరువది వారి వీధిలో ఉన్న వృద్ధాశ్రమంలో మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల చీరెలు పంపిణీ చేశారు. స్థానిక మాతాశిశు వైద్యశాలలో రోగులకు కుప్పం ప్రసాద్ పండ్లు పంపిణీ చేశారు. గిద్దలూరుకు చెందిన ఐవీ రెడ్డి వర్గీయులు జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక బ్రోచర్లను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో జిల్లా అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కొఠారి రామచంద్రరావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ(బుజ్జి), గ్రామీణ పరిశ్రమలు, ఉపాధి విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సూరాపాండు రంగారెడ్డి, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, వివిధ విభాగాల నగర కన్వీనర్లు యరజర్ల రమేష్, బొప్పరాజు కొండలు, నెరుసుల రాము, ముదివర్తి బాబూరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్వీ రమణయ్య, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, తోటపల్లి సోమశేఖర్, జాజుల కృష్ణ, స్వరూప్, గోపాలరెడ్డి, రాయని వెంకట్రావు, ఓబుల్‌రెడ్డి, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి, మీరావలి, అంకయ్య, కండే రమణయాదవ్, మాజీ కౌన్సిలర్లు గోపీ, వెలనాటి మాధవ్, వర్థు శేషయ్య, కావూరిసుశీల, పోకల అనూరాధ, గంగాడ సుజాత, బడుగు ఇందిర, బత్తుల ప్రమీల, లక్ష్మి, ప్రభావతి, సింగరాజు వెంకట్రావు, మేకల అంజిరెడ్డి పాల్గొన్నారు. -
వెల్లివిరిసిన సేవాభావం
ఒంగోలు, న్యూస్‌లైన్ : బాలల దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ వైద్య విభాగం ఆధ్వర్యంలో నగరంలోని కేంద్రీయ విద్యాలయలో గురువారం నిర్వహించిన బాలల వైద్య శిబిరం విజయవంతమైంది. కేంద్రీయ విద్యాలయతో పాటు నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు వైద్య శిబిరానికి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన 50 మంది వైద్యులు తమ సేవలందించారు. దృష్టి, దంత, వినికిడి తదితర పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఉచితంగా ఔషధాలు అందించారు. వైద్య శిబిరాన్ని వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తొలుత వాయిద్యాలు, పుష్పాలతో బాలినేనికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి, జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బాలలనుద్దేశించి బాలినేని మాట్లాడారు. అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యమని, అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఇటీవల వరదల తాకిడికి జిల్లాలోని అన్ని ప్రాంతాలూ తీవ్రంగా నష్టపోయాయని, ఊహించని విధంగా అనేక కాలనీలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలో నీట మునిగిన కాలనీల్లోని బాలలు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలన్న సంకల్పంతో వైఎస్సార్సీపీ వైద్య విభాగం బాలల దినోత్సవం రోజు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించడం శుభపరిణామమన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రికాగానే ఆయన డాక్టర్ కనుక ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదల ఆరోగ్యానికి ఎనలేని భరోసా కల్పించారని కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తోందని చెప్పారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా బాలల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమంటూ నిర్వాహకులను బాలినేని ప్రోత్సహించారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ నెహ్రూ జయంతి రోజు బాలల కోసం వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే బాలి నేనికి కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ సీహెచ్ ప్రసాదరావు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం జిల్లా కన్వీనర్ డాక్టర్ యాదాల అశోక్‌బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకూ తమ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమా లు నిర్వహించినట్లు చెప్పారు. బాలల వైద్య శిబిరానికి తమ విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ శివభరత్‌రెడ్డి కూడా హాజరయ్యారంటూ ఆయన్ను బాలల కు పరిచయం చేశారు. వివిధ కార్పొరేట్ వైద్యశాలల్లో పని చేస్తున్న సుమారు 50 మంది వైద్యులు మెడికల్ క్యాంపునకు విచ్చేశారని, బాలలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆశోక్‌బాబు కోరారు. అనంతరం తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల అవసరార్థం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.దీన్ని బాలినేని ప్రారంభించగా ఒంగోలు రెడ్‌క్రాస్ సిబ్బంది వచ్చి రక్తాన్ని సేకరించారు. కేంద్రీయ విద్యాలయంలో తన నిధులతో ఏర్పాటు చేసిన అదనపు తరగతి గదులను బాలినేని ప్రారంభించారు. కార్యక్రమంలో మాంటిస్సోరి, కేంద్రీయ విద్యాలయం, కేరళ మో డల్ స్కూల్, అపెక్స్ పాఠశాలల విద్యార్థులతో పాటు వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నరాల రమణారెడ్డి, కొఠారి రామచంద్రరావు, తాటితోటి నరశింగరావు, పార్టీ సంతనూతలపాడు నియోజవకర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, డాక్టర్ వరికూటి అమృతపాణి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, సేవాదళ్ జిల్లా కన్వీనర్ ఆవుల చంద్రశేఖరరెడ్డి, సేవాదళ్ జిల్లా అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ షేక్ ఖాజా, ట్రేడ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు రమాదేవి, మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, నాయకులు సింగరాజు వెంకట్రావు, బడుగు ఇందిర, తోటపల్లి సోమశేఖర్, మీరావలి, ఎస్వీ రమణయ్య, ఏపీటీసీఏ రాష్ట్ర నాయకులు మాంటిస్సోరి ప్రకాశ్‌బాబు, కేరళ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ పాల్గొన్నారు. -
వాడీవేడిగా
ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లా అభివృద్ధిపై అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధిలేదని జిల్లా ఇన్చార్జి మంత్రి సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా సమీక్ష మండలి(డీఆర్సీ) సమావేశం వాడీవేడిగా జరిగింది.‘జిల్లాలో ఏం జరుగుతుందో తెలియడంలేదు. నిధులు ఎలా మంజూరు చేయించుకోవాలో తెలియదు. వచ్చిన వాటిని ఎలా ఖర్చు చేయాలో మీకు అర్థం కాదు’ అని మంత్రి ధ్వజమెత్తారు. సభ్యుల ప్రశ్నలతో సమావేశం ఉత్కంఠగా సాగింది. ఒక పూట భోజనం పెడితే సరిపోతుందా? గత నెలలో సంభవించిన వరదల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల గురించి అధికారులు పట్టించుకోలేదని వైఎస్సార్సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. సంకువానిగుంట గ్రామస్తులు ఆరురోజులపాటు నడుం లోతు నీళ్లల్లో ఉన్నారని.. వారంతా దళితులేనని తెలిపారు. వారి బాగోగులు పట్టించుకోకుండా ఒక్కరోజు భోజనం పెడితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు బాధితులకు ఎలాంటి పరిహారం అందలేదన్నారు. తామే పడవలో వెళ్లి బాధితులకు ఆహారం అందించాల్సి వచ్చిందని తెలిపారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలి.. బాధితులను ఆదుకోవాలని తాను కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం సరిగా చర్యలు తీసుకోలేదని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రాంత సమస్య పరిష్కరించాలంటే వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. దీనిపై ఒంగోలు ఆర్డీఓ మాట్లాడుతూ రోడ్లు కోతకు గురికావడంతో ఆ ప్రాంతానికి వెళ్లలేకపోయామని.. ఇప్పుడు పంపిణీ చేయిస్తామనడంతో సభ్యులతో పాటు మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయంత్రం లోగా ఆ గ్రామంలో బియ్యం, కిరోసిన్ పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వమే శనగలు కొనుగోలు చేయాలి జిల్లాలోని కోల్డుస్టోరేజీల్లో పేరుకుపోయిన శనగలను ప్రభుత్వమే వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ప్రతిపాదించారు. శనగ రైతులపై బ్యాంకర్ల ఒత్తిడి తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ప్రాంతంలో 44 వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని చీరాల ఎమ్మెల్యే ఆమంచి తెలిపారు. నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ కేంద్రం భవనాన్ని కూల్చివేసి అందులోని సామగ్రిని అమ్ముకున్నారని ఆరోపించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఐసీడీఎస్ సమస్యలను ప్రస్తావించారు. విద్యాశాఖలో పదోన్నతులు కల్పించాలని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసరెడ్డి కోరారు. జిల్లాలో 18 హెచ్ఎం పోస్టులు.. 150 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. హాస్టళ్ల నిర్మాణాలు ఎక్కడ? సింగరాయకొండ, తిమ్మసముద్రంలో చేపట్టిన బీసీ హాస్టళ్ల నిర్మాణాలు గత నాలుగైదు సంవత్సరాలుగా అర్ధాంతరంగా నిలిచిపోయాయని కొండపి, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు జీవీ శేషు, బీఎన్ విజయ్‌కుమార్‌లు సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ విషయం తమకు సంబంధంలేదంటూ బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రకటించడంతో.. మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ కూడా ఎవ రో తెలియకుండానే పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు. విచారణ చేపట్టి.. కారకులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టులపై రచ్చ.. పాలేటిపల్లి, మల్లవరం రిజర్వాయర్లు, కొరిశపాడు చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం, వెలిగొండ ప్రాజెక్టుల పురోగతిపై అధికారుల వివరణ ఎవరినీ సంతృప్తి పరచలేదు. వెలిగొండ టన్నెల్ నిర్మాణం కేవలం 46 శాతం పూర్తయితే.. నిర్మాణం మొత్తం ఎప్పటికి పూర్తవుతుందని ఎస్ఈని ప్రశ్నించారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని తమ భూములు స్వాధీనం చేసుకొని కాలువలు తవ్వుతున్నారని.. కానీ ఇప్పటికీ నష్టపరిహారం పంపిణీ చేయలేదన్నారు. ప్రాజెక్టు వ్యవహారాలపై ఇంజినీరింగ్, నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, జాతీయరహదారుల శాఖల తో మరోసారి సమావేశం కావాలని తీర్మానించా రు. రిమ్స్ నిర్మాణాల్లో జాప్యం జరిగితే కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని కోరారు. బ్యాంకర్లు సహకరించడంలేదు.. బ్యాంకర్ల వల్ల రైతుల నష్టపరిహారం పంపిణీ జాప్యమవుతోందని వ్యవసాయశాఖ జేడీ దొరసాని తెలిపారు. నీలం తుపాను పరిహారంగా జిల్లాకు రూ 5.12 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటికి రూ 2.38 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎస్బీఐ, ఎస్బీహెచ్ అధికారులు రైతుల అకౌంట్లలో నగదు జమ చేయడానికి సహకరించడంలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లీడ్‌బ్యాంకు మేనేజర్ వివరణ ఇస్తూ సోమవారమే అకౌంట్లకు జమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సమైక్య శంఖారావం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
ఒంగోలు, న్యూస్‌లైన్:సమైక్య శంఖారావం వాల్‌పోస్టర్‌ను వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉదయం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం సమైక్యంగా ఉండాలన్నదే జగన్మోహన్రెడ్డి ధ్యేయమన్నారు. అందులో భాగంగానే సమైక్యవాదాన్ని ఢిల్లీ నేతలకు వినిపించేందుకుగాను హైదరాబాదులో ఈ సమైక్య శంఖారావాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సమైక్య రాష్ట్రాన్ని కేవలం సీమాంధ్రులే కోరుకుంటున్నారని భావించడం సరికాదన్నారు. తెలంగాణ జిల్లాల్లో సైతం సమైక్యంగా ఉండడం వల్ల కలిగే ఫలితాలు, విడిపోతే ఎదురయ్యే సమస్యలు తెలుసుకున్న అనేకమంది నేడు సమైక్యరాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్నారు. ఈనెల 26న హైదరాబాదులోని లాల్‌బహదూర్ స్టేడియంలో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావానికి అన్ని ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 శాతం మంది సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని , ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్న నేతలకు చెప్పేందుకే సమైక్య శంఖారావాన్ని తమ పార్టీ పూరించిందన్నారు. మాట్లాడితే కుమ్మక్కని వైఎస్సార్సీపీ మీద ఆరోపించడం కాదని, గత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ ఏవిధంగా కుమ్మక్కయింది ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ఈనెల 26న నిర్వహించే సమైక్య శంఖారావానికి జిల్లాలోని ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ పరంగా నియోజకవర్గానికి 5 వేల నుంచి 10 వేల మంది సమైక్యవాదులు హైదరాబాదుకు తరలివస్తారని భావిస్తున్నామని బాలినేని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నరాల రమణారెడ్డి, కొఠారి రామచంద్రరావు, టి.నరశింగరావు, సూరా సామిరంగారెడ్డి, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి, బీసీ విభాగం జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, వైఎస్సార్సీపీ నాయకులు సింగరాజు వెంకట్రావు, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, వివిధ విభాగాల నగర కన్వీనర్లు నెరుసుల రాము, ముదివర్తి బాబూరావు, బొప్పరాజు కొండలు, కావూరి సుశీల, యరజర్ల రమేష్, స్టీరింగ్ కమిటీ సభ్యులు గోవర్థన్, ఎస్వీ రమణయ్య, జాజుల కృష్ణ, రాయని వెంకట్రావు, మీరావలి, తోటపల్లి సోమశేఖర్, మాజీ కౌన్సెలర్ వెలనాటి మాధవరావు, ఒంగోలు మండల కన్వీనర్ రాయపాటి అంకయ్య, కొత్తపట్నం నాయకులు లంకపోతు అంజిరెడ్డి, వీఆర్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యాంధ్రే లక్ష్యం
ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణే వైఎస్సార్ సీపీ లక్ష్యమని పార్టీ ఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక ప్రకాశం భవనం వద్ద వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన రిలే దీక్ష శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీస్తూ సీడబ్ల్యూసీ ప్రకటన వచ్చిందని తెలిసిన వెంటనే తమ పార్టీ ఎమ్మెల్యేలు 16 మందీ రాజీనామాలు చేశామన్నారు. ఈ దశలో కొంతమంది రాజీనామాలు చేయడం మీకు సరదాగా మారిందంటూ ఎగతాళి చేశారన్నారు. కానీ రాష్ట్రం విడిపోతే తీవ్రమైన సమస్యలుంటాయని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని చెప్పినా వారు ససేమిరా అన్నారన్నారు. నేడు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం కావడంతో పలుచోట్ల తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నాయకులు రాజీనామాల పేరుతో నాటకాలాడుతున్నారని (స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేయకుండా) విమర్శించారు. ఒక వైపు ఉద్యోగులు, ఎన్జీఓలు, ఆర్టీసీ కార్మికులు జీతాలను వదులుకొని సైతం పోరాటం చేస్తుంటే పదవులు వదులుకోలేకపోతున్న ప్రజాప్రతినిధుల తీరు గర్హనీయమన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్రపై తమ చిత్తశుద్ధిని స్పష్టం చేశారన్నారు. తన కుమారుడ్ని ప్రధానమంత్రిని చేయాలనే ఏకైక ఉద్దేశంతోనే సోనియా గాంధీ ఓట్లు, సీట్లు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విభజన ప్రకటన చేసిందన్నారు. కనీసం తెలంగాణలో అయినా కొన్ని సీట్లు వ స్తే చాలనే దుర్మార్గమైన కుట్రే దీనికి కారణమని విమర్శించారు. అసత్యప్రకటనలు మానండి... ‘సచివాలయ ఉద్యోగుల సంఘం ధర్నా కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించేందుకు ఢిల్లీ వెళితే పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఒక హోటల్లో రాహుల్‌గాంధీతో చర్చలు జరిపారని టీడీపీ నాయకులు మాట్లాడారు. అలాగే నా భార్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రుల భార్యలతో కలిసి ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసిందని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. ఇవన్నీ అవాస్తవాలు. అవి నిజమ ని నిరూపిస్తే నేనే కాదు...జగన్మోహన్రెడ్డి సైతం రాజీనామాలు ఉపసంహరించుకుంటాం. లేకపోతే తప్పుడు ప్రకటనలు చేసిన మీ సంగతేంటి?’... అని టీడీపీ, ఆంధ్రజ్యోతి పత్రికపై బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. తప్పుడు ప్రకటనలు మాని సమైక్యాంధ్ర ఉద్యమంలో 64 రోజుల నుంచి ప్రజలు పడుతున్న బాధలపై దృష్టి సారించాలని హితవు పలికారు. సీఎం ధిక్కార స్వరమంతా అధిష్టానం కనుసన్నల్లోనే.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై వినిపిస్తున్న ధిక్కార స్వరమంతా ఆ పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే సాగుతోందని బాలినేని విమర్శించారు. సీడబ్ల్యూసీలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసినప్పుడే ఆ నిర్ణయాన్ని సీఎం ధిక్కరించి రాజీ నామా చేస్తానని హెచ్చరించి ఉంటే తామంతా సీఎం చర్యలపై హర్షాన్ని వెలిబుచ్చేవారమన్నారు. కానీ అందుకు విరుద్ధంగా నాడు మిన్నకుండి, నేడు అధిష్టానాన్ని ధిక్కరించినట్లు నటిస్తున్నారని విమర్శించారు. కొత్త పార్టీ పెట్టి కనీసం కొన్ని సీట్లయినా గెలుచుకొని ఎన్నికల తరువాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే దుర్మార్గమైన కుట్రే సీఎం ధిక్కార స్వరానికి కారణమని ఆరోపించా రు. విభజన ప్రకటన వెలువడిన పదిరోజుల తరువాత విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడిన సీఎం కిరణ్ సీడబ్ల్యూసీ నిర్ణయం జరిగేనాడే ఎందుకు వ్యతిరేకించలేదో ప్రజలు నిలదీయాలన్నారు. యూటర్న్ తీసుకుంటే బాబును విమర్శించం: రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే రూ. 4 లక్షల కోట్లు ఇస్తే కొత్త రాజధాని నిర్మించుకుంటామని ప్రకటించిన చంద్రబాబు నేడు సమైక్యాంధ్రకు అనుకూలంగా యూటర్న్ తీసుకుంటే తాము ఆయన్ను విమర్శించబోమన్నారు. తమకు రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్యమని, సమైక్యాంధ్ర ప్రకటన వస్తే చాలన్నారు. సమైక్యాంధ్రుల శక్తి తెలియకే చంద్రబాబు నాడు కొత్త రాజధానికి నిధులివ్వాలని అడిగారని, ప్రతి జిల్లాలోనూ రాజ ధాని వస్తుందంటూ తప్పడు ప్రకటనల ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చేలా చేయడం దారుణమన్నారు. రాష్ట్రం విడిపోతే కుప్పం మొదలు శ్రీకాకుళం వరకు తాగునీటి ఇక్కట్లు తప్పవన్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన తప్పిదం వల్లే నేడు ఆల్మట్టి సమస్య నెలకొందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, రాష్ట్రం విడిపోతే వారికి ఉద్యోగావకాశాలు సీమాంధ్రలో మృగ్యమే అన్నారు. చంద్రబాబు రాష్ట్ర విభజన ప్రకటనను సమర్థించుకోవాలని చూడడం మానుకొని, ఆత్మగౌరవ యాత్రలకు బదులుగా యూటర్న్ తీసుకొని సమైక్యాంధ్ర ప్రకటనతో ప్రజల్లోకి రావాలని బాలినేని పిలుపునిచ్చారు. పొత్తుకు మేము నై... దమ్ముంటే టీడీపీ ప్రకటించాలి: కాంగ్రెస్, బీజేపీలతో సహా తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బాలినేని స్పష్టం చేశారు. దమ్ముంటే టీడీపీ కూడా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని ప్రకటించాలని సవాల్ విసిరారు. డీల్ వల్లే జగన్మోహన్రెడ్డికి బెయిల్ వచ్చిందంటూ కాంగ్రెస్, టీడీపీల్లోని కొంతమంది నేతలు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఇది వైఎస్సార్ సీపీని బలహీన పరచాలనే ఏకైక ఉద్దేశంతో జరుగుతున్న బలమైన కుట్రగా పేర్కొన్నారు. గుజరాత్‌లోని గోధ్రాలో అల్లర్లు జరిగిన సమయంలో బీజేపీకి మద్దతు ప్రకటించి చారిత్రాత్మక తప్పిదం చేశామని నాడు ప్రకటించిన చంద్రబాబు నేడు మళ్లీ మోడీకి ఆదరణ ఉందని, దానిని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో అదే పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు యత్నించడం దుర్మార్గమైన చర్యన్నారు. -
మహాత్ముని మార్గమే ఆదర్శం
మహాత్మాగాంధీ అనుసరించిన మార్గమే తమకు ఆదర్శమని వైఎస్సార్సీ ఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఆయన స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీరోడ్డులోని గాంధీ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించారు. అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడుతూ మహాత్ముడు శాంతి, అహింసే ఆయుధాలుగా బ్రిటీష్‌వారితో పోరాడి స్వాతంత్య్రం తీసుకువచ్చారన్నారు. అవే ఆయుధాలుగా సమైక్యాంధ్రను సాధించేందుకు తమ పార్టీ కూడా దృష్టి సారించిందని చెప్పారు. సమైక్యాంధ్రను సాధించేందుకు కృషిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా బాలినేని ధన్యవాదాలు ప్రకటించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 13 జిల్లాల్లో వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులంతా నిరాహార దీక్షల్లో కూర్చుంటున్నారని, వారికి సంఘీభావంగా మరికొంత మంది కూడా దీక్షల్లో పాల్గొంటున్నారన్నారు. రాష్ట్రం సమైక్యంగా లేకపోతే ప్రజలు పడే పాట్లు దృష్టిలో ఉంచుకునే తమ పార్టీ పోరాటం చేస్తోందని, అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీ చేస్తున్న సమైక్యాంధ్ర పోరాటానికి సంఘీభావం ప్రకటించేందుకు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కదిలిరావాలని పిలుపునిచ్చారు. బాలినేని వెంట వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, అద్దంకి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, వివిధ విభాగాల కన్వీనర్లు వేమూరి సూర్యనారాయణ, కేవీ రమణారెడ్డి, కఠారి శంకర్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, సింగరాజు వెంకట్రావు, నెరుసుల రాము, ముదివర్తి బాబూరావు, బొప్పరాజు కొండలు, యరజర్ల రమేష్, ఒంగోలు మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ రాయపాటి అంకయ్య, ఉలిచి వైఎస్సార్ సీపీ నాయకులు మండువ సుబ్బారావు, లంకపోతు అంజిరెడ్డి, మీరావలి, కృష్ణారెడ్డి, గోవర్థన్, గంగాడ సుజాత, పురిణి ప్రభావతి, జయంతి, సుబ్బులు, బడుగు ఇందిర, రాయని వెంకట్రావు, వల్లెపు మురళి, లక్ష్మి, వర్థు శేషయ్య, బేతంపూడి రాజేశ్వరి, లంకపోతు అంజిరెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, తోటపల్లి సోమశేఖర్ పాల్గొన్నారు. -
సమైక్యాంధ్రకు మద్దతుగా శాంతియుతంగా వైఎస్సార్ సీపీ పోరాటం
ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం జిల్లాల వారీగా వైఎస్సార్ సీపీ చేపడుతున్న కార్యక్రమాలు ఉధృతరూపం దాల్చుతున్నాయి. ఉద్యమాన్ని మహోద్యమంగా రూపుదిద్దేందుకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ నెలరోజులపాటు షెడ్యూలు ప్రకటించింది. నేటి నుంచి ప్రారంభమవుతున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. శాంతియుత మార్గంలో... శాంతియుత మార్గంలో మహాత్మాగాంధీ అడుగు జాడల్లో ఆయన జయంతి రోజైన అక్టోబరు రెండో తేదీన సమైక్యాంధ్రకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్షలకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. పార్టీకి చెందిన నియోజకవర్గ సమన్వయకర్తలు తమ నియోజకవర్గ కేంద్రాల్లోనే దీక్షలు చేపట్టనున్నారు. వారితోపాటు వివిధ విభాగాల కన్వీనర్లుకూడా దీక్షలో కూర్చుంటారు. ఒంగోలులో బాలినేని: జిల్లా కేంద్రమైన ఒంగోలులో నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి దీక్ష చేపట్టనున్నారు. బుధవారం ఉదయం పదిగంటలకు ఆయన ప్రకాశం భవనం ముందు ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్ష చే స్తారు. ఆయనతోపాటు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టనున్నారు. వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త జూపూడి ప్రభాకర్‌రావు కొండపిలో దీక్షలో పాల్గొననున్నారు.ఇప్పటికే ఆయన కొండపి నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులతో సమీక్షించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేదిశగా దృష్టి సారించారు. అద్దంకిలో తాజా మాజీ ఎమ్మెల్యే, అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ దీక్ష చేపడతారు. పార్టీ జిల్లా కన్వీనర్, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నూకసాని బాలాజీ, మరో సమన్వయకర్త ఉన్నం వీరాస్వామితో కలిసి కందుకూరులో దీక్ష చే స్తారు. గిద్దలూరు నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్తలైన ముత్తుముల అశోక్‌రెడ్డి, వై.వెంకటేశ్వరరావులు దీక్షలో కూర్చుంటారు. కనిగిరిలో మాజీ మంత్రి ముక్కుకాశిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాటం అరుణమ్మ, మార్కాపురంలో ఉడుముల శ్రీనివాసరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, వై.పాలెంలో మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, సంతనూతలపాడులో అంగలకుర్తి రవి, డాక్టర్ వరికూటి అమృతపాణి, పర్చూరులో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరశింహారావు, చీరాలలో మాజీ మంత్రి పాలేటి రామారావు, సజ్జాహేమలత, అవ్వారు ముసలయ్య, యడం చినరోశయ్య దీక్షల్లో కూర్చుంటారు. అయితే నియోజకవర్గ సమన్వయకర్తల్లో తూమాటి మాధవరావు(కందుకూరు), జంకే వెంకటరెడ్డి(మార్కాపురం)లు అనారోగ్య కారణాల వల్ల దీక్షలు చేపట్టడం లేదు. దర్శి నియోజకవర్గ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాదరెడ్డి గురువారం నుంచి దీక్ష చేయనున్నారు. -
బాబు ఆస్తుల ప్రకటన బూటకం: బాలినేని శ్రీనివాసరెడ్డి
ఒంగోలు, న్యూస్‌లైన్ : చంద్రబాబు ఆస్తుల ప్రకటన బూటకమని వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు తన ఆస్తులను ఇప్పుడు ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ఆయన ప్రకటించిన వివరాలు చూసి జనం నవ్వుకుంటున్నారు. తన మొత్తం ఆస్తి విలువ రూ.42 కోట్లని బాబు పేర్కొనడం ఏదోవిధంగా తాను నిజాయితీపరుడినని చెప్పుకోవడానికే. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటి విలువ రూ.23 లక్షలని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మేము రూ.2 కోట్లు ఇస్తాం. చంద్రబాబు ఆ ఇంటిని మాకు రాసిస్తారా? అని సవాలు చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ఆస్తులను ప్రకటిస్తూనే ఉంటారు. అయితే ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు ఆస్తుల విలువను ప్రకటించడం ద్వారా కూడా లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఆస్తుల ప్రకటన చేశారు. నిజాయితీపరుడినని తనకుతాను చెప్పుకోవడం కాదని, జనం చెప్పుకోవాలనే విషయాన్ని సైతం మరిచిపోయిన టీడీపీ అధినేతను చూస్తే ప్రతి ఒక్కరికీ నవ్వు వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఎంత ఖర్చుపెట్టారో ప్రతి ఒక్కరికీ తెలుసు. అటువంటి వ్యక్తి తప్పుడు లెక్కలతో జనాన్ని మోసం చేయాలని చూసినంత మాత్రాన అది నిజమని నమ్మే జనం మాత్రం లేరు. చంద్రబాబు నిజాయితీపరుడినని నిరూపించుకోవాలంటే సీబీఐ ఎంక్వయిరీకి సిద్ధం కావాలి. అప్పుడే జనం విశ్వసిస్తారు. చంద్రబాబు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సీబీఐ విచారణ కోరితే ఆయన కోర్టు స్టే తెచ్చుకోవడాన్ని పరిశీలిస్తే ఆయన నిజాయితీ ఏమిటో అందరికీ అర్థం అవుతుంది’’ అని ఆయన అన్నారు. ఆ లెక్కలన్నీ బూటకం: నల్లపురెడ్డి చంద్రబాబు ప్రకటించిన ఆస్తుల లెక్కలన్నీ పచ్చి బూటకమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. మెడికల్, డెంటల్, ఇంజనీరింగ్ కాలేజీలు, పలు హోటళ్లు, కార్ల కంపెనీల్లో వాటాలను బినామీ పేర్లతో చంద్రబాబు ఉంచారని తెలిపారు. రాష్ట్రంలోనేగాక ఇతర రాష్ట్రాలలోను, బయటి దేశాల్లోనూ బినామీ పేర్లతో బాబుకు వ్యాపారాలున్నాయని చెప్పారు. ఈ మేరకు నల్లపురెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయానికి సంబంధించిన స్థలం ఎవరి పేరు మీద ఉన్నదో బాబు చెప్పాలన్నారు. -
టీడీపీ.. నాలుగేళ్లుగా ఎవరితో పోరాడుతోంది?
హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్ సీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరోమారు మండిపడ్డారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడ్డ టీడీపీ నాలుగేళ్లుగా ఎవరితో పోరాటం చేస్తోందని ప్రశ్నించారు. ఈ మేరకు బహిరంగ లేఖను రాసిన బాలినేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు. ప్రజాసమస్యలపై కాంగ్రెస్ మీద చేసిన పోరాటాలెన్నో బాబు లెక్కచెప్పాలని ఆ లేఖలో సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబూ...ఏ డీల్ ప్రకారం మీరు నాలుగేళ్లుగా కాంగ్రెస్ కు మద్దతిచ్చారన్నారు. ఏ డీల్ ప్రకారం అవిశ్వాసం పెట్టకుండా కాంగ్రెస్ సర్కార్‌ను కాపాడతున్నారని, ఏ డీల్ ప్రకారం చిదంబరం, రేణుకా, అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ లతో మంతనాలు జరుపుతున్నారన్నారని 2008లో ఇచ్చిన లేఖను ఏ డీల్ ప్రకారం వెనక్కు తీసుకోవడం లేదని బాలినేని ప్రశ్నల వర్షం కురిపించారు. జనంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని ఎదుర్కొనే ధైర్యం మీకుందా? అని చంద్రబాబును నిలదీశారు. ఈరోజు కాంగ్రెస్ లేకుండా బతకగలిగే పరిస్థితి మీకుందా?, కాంగ్రెస్ తో కుమ్మక్కుకాకుండా ఒక్క అసెంబ్లీ సీటైనా తెచ్చుకునే పరిస్థితి మీకుందా? అని ఆ లేఖలో అడిగారు. అదే ఉంటే ఢిల్లీ రాజకీయాలు ఎందుకు చేస్తారని, కాంగ్రెస్ తో కుమ్మకు కుట్రలకు పాల్పడతారని లేఖలో పేర్కొన్నారు. -
ప్రజల పక్షాన నిలిచిన ఏకైక నేత జగన్
ఒంగోలు : రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడిన ఏకైన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని ఆపార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ కేంద్రమంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే విభజన ఆగిపోతుందని అన్నారు. రాజీనామా చేయని నేతలను తరిమికొట్టాలని బాలినేని పిలుపునిచ్చారు. చంద్రబాబు రాజీనామా చేయకపోవటం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. పార్టీలకతీతంగా ఉద్యమం చేయాలని బాలినేని ఈ సందర్బంగా కోరారు. మరోవైపు ఢిల్లీ పాలకులు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చుకునేంత వరకూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆపేదే లేదని జిల్లా ప్రజలు స్పష్టం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా రోడ్లపైకి వచ్చి సమైక్యాంధ్ర నినాదాలను మార్మోగిస్తున్నారు. ఉద్యమం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నప్పటికీ ఏమాత్రం జోరు తగ్గలేదు. పైగా రోజుకో రకంగా హోరెత్తిపోతోంది. అన్నిరంగాల ప్రజలు వినూత్న కార్యక్రమాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో మంగళవారం భారీ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినదించారు.