
మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (ఫైల్)
సాక్షి, అమరావతి: చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పంలో ఓటమితో చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసినట్లే అని మండిపడ్డారు. అమరావతి రైతుల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ పాదయాత్ర చేస్తుందన్నారు.
దమ్ముంటే టీడీపీ జెండా పట్టుకుని పాదయాత్ర చేయొచ్చుకదా? అని మంత్రి బాలినేని ప్రశ్నించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ప్రజల పూర్తి మద్దతుందని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.