
ప్రజల పక్షాన నిలిచిన ఏకైక నేత జగన్
రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడిన ఏకైన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని ఆపార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఒంగోలు : రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడిన ఏకైన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని ఆపార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ కేంద్రమంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే విభజన ఆగిపోతుందని అన్నారు. రాజీనామా చేయని నేతలను తరిమికొట్టాలని బాలినేని పిలుపునిచ్చారు. చంద్రబాబు రాజీనామా చేయకపోవటం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. పార్టీలకతీతంగా ఉద్యమం చేయాలని బాలినేని ఈ సందర్బంగా కోరారు.
మరోవైపు ఢిల్లీ పాలకులు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చుకునేంత వరకూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆపేదే లేదని జిల్లా ప్రజలు స్పష్టం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా రోడ్లపైకి వచ్చి సమైక్యాంధ్ర నినాదాలను మార్మోగిస్తున్నారు. ఉద్యమం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నప్పటికీ ఏమాత్రం జోరు తగ్గలేదు. పైగా రోజుకో రకంగా హోరెత్తిపోతోంది. అన్నిరంగాల ప్రజలు వినూత్న కార్యక్రమాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో మంగళవారం భారీ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినదించారు.