
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియతో పాటుగా ఎన్నికల ప్రచారం కూడా పీక్స్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే సినిమా నటులు విశాల్, భాను చందర్, కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు వంటి స్టార్స్ అందరూ వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు తెలుపుతూ మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొనసాగుతారని చెప్పారు. ఏపీలో సీఎం జగన్ చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ వారందరు కూడా పలు వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ దిగ్గజ నిర్మాతగా కొనసాగుతున్న 'దిల్ రాజు' తాజాగా ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా ఎన్నికలో బరిలో ఉన్న తన మిత్రుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డిని గెలిపించాలని కోరుతూ దిల్ రాజు ఇలా చెప్పుకొచ్చారు. 'బాలినేని శ్రీనివాసుల రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఎన్నో మంచి పనులు ఒంగోలు కోసం చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ గారి కేబినెట్‌లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ నేతృత్వంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తూ ఇప్పటి వరకు ఐదుసార్లు ఒంగోలు నుంచి బాలినేని గెలిచారు. అనేక అభివృద్ధి పనులతో ఒంగోలు పట్టణాన్ని ముందంజలో ఉంచారు.
ఇప్పుడు ఆరోసారి ఒంగోలు నుంచి ఎన్నికల బరిలో బాలినేని ఉన్నారు. ఆయన్ను తప్పకుండా అక్కడి ప్రజలు గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. కొద్దిరోజుల క్రితం బాలినేని శ్రీనివాసుల రెడ్డి గారి మీద ఒక డాక్యుమెంటరీని తీశాను. అందులో ఆయన రాజకీయ ప్రస్థానంతో పాటు ఒంగోలు కోసం ఆయన ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అందరూ తెలుసుకోవచ్చు. ఆ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ నందు అందుబాటులో ఉంది. మీ అమూల్యమైన ఓటు బాలినేని శ్రీనివాసులుకు వేస్తారని ప్రార్థిస్తున్నాను. అని ఆయన కోరారు. దిల్ రాజు మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది.
Ace Producer #DilRaju Supports YCP ongole Mla Candidate #BalineniSrinivasReddy pic.twitter.com/d6mtAKZxHH
— cinee worldd (@Cinee_Worldd) April 24, 2024