ఎంతటి వారైనా శిక్షపడేలా చూస్తాం | Minister Balineni Serious On Molestation On Girl In Prakasam | Sakshi
Sakshi News home page

ఎంతటి వారైనా శిక్షపడేలా చూస్తాం

Published Sun, Jun 23 2019 11:37 AM | Last Updated on Sun, Jun 23 2019 11:54 AM

Minister Balineni Serious On Molestation On Girl In Prakasam - Sakshi

సాక్షి, ప్రకాశం : ఆరుగురు మృగాళ్ల చేతిలో లైంగిక వేధింపులకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్‌ బాలికను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఆదివారం రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన ఆయన  బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితులు మానవత్వం లేకుండా వ్యవహరించడం అత్యంత దారుణమన్నారు. దీనిపై హోంశాఖతో కూడా మాట్లాడానని, నిందితులు ఎంతటివారైనా కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు. ఇప్పటికే దీనిపై జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు తెలిపారు. కాగా ఈ అత్యాచార ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి సుచరిత విచారణ జరిపారు. విచారణ వేగవంతంగా చేపట్టాలని ప్రకాశం జిల్లా ఎస్పీని ఆదేశించారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement