prakasam
-
YSRCP సోషల్ మీడియాపై పోలీసుల ఓవరాక్షన్.. హైకోర్టు దెబ్బకు సీన్ రివర్స్
-
458 మందిని రక్షించిన ప్రకాశం జిల్లా పోలీసులు
-
చంద్రబాబు అబద్ధాలు, మోసాలు పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు
-
‘వర్చువల్ విచారణకు హాజరవుతానని వర్మ ముందే చెప్పారు’
దర్శకుడు రాంగోపాల్ వర్మపై నమోదైన కేసులో ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు చేరి ‘అరెస్ట్’ పేరిట హడాడివి చేశారు. అయితే.. వర్మ తాను ఫిజికల్‌గా హాజరయ్యేందుకు సమయం కోరిన విషయాన్ని ఆయన లాయర్ బాల మీడియాకు వివరించారు. ‘‘విచారణకు రెండు వారాల సమయం కోరాం. ఈలోపు వర్చువల్‌గా విచారణకు తాను హాజరవుతానని వర్మ ఇదివరకే చెప్పారు. ఫిజికల్‌గా విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలన్నారు అని న్యాయవాది తెలిపారు. అయితే.. ఇప్పటివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ అందించలేదని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. తమకు ఇచ్చిన నోటీసుల్లోనూ ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలిపారు. ఆర్జీవీ తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని.. అందువల్లే డిజిటల్ విచారణకు హాజరవుతామని పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని న్యాయవాది స్పష్టం చేశారు. అయితే.. ఈలోపే ఏపీ ప్రకాశం జిల్లా పోలీసులు ఇవాళ హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటికి వచ్చారు. ఆయన కోసం వేచిచేస్తూ.. మీడియాలో హడావిడి ప్రదర్శించాక అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. -
ప్రకాశం జిల్లా కామెపల్లిలో తాగుబోతు వీరంగం
-
ఆ రెండు బోట్ల వెనుక కుట్రకోణం
-
ప్రమాదంలో విజయవాడ.. విరిగిన ప్రకాశం బ్యారేజీ దిమ్మ
-
కారు బీభత్సం
వైఎస్సార్ సీపీలోకి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మార్కాపురం: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కంభం వెంకట రమణారావు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి వైఎస్సార్ సీపీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే అన్నా రాంబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీటీడీ, జనసేన పొత్తుతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారన్నారు. అన్నా రాంబాబుతో పాటు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గెలుపుకు కృషిచేస్తానని తెలిపారు. ఆయనతోపాటు మాజీ టీడీపీ కౌన్సిలర్లు నందిగం శ్రీనివాసులు, జలుకూరి సత్యవతీతోపాటు వేముల పెద్దరంగడు, పారుమంచాల చిన్నకృష్ణయ్య, దండూరి కోటయ్య, సయ్యద్ ముజీబ్, ఎస్కే కరీముల్లా, ఎస్కే గౌస్ మొహిద్దీన్, గంగిరెడ్డితోపాటు 9,10 వ బ్లాక్ టీడీపీ బ్లాక్ నాయకులు వైఎస్సార్ సీపీ లో చేరారు. కార్యక్రమంలో రఘుపతి శివ, పెంచికల కాశయ్య, నజీర్, ఉప్పు బాబు, మొగిలి ఇస్మాయిల్ బేగ్, బెల్లంకొండ గోపి పాల్గొన్నారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే రాంబాబు పార్టీలోనికి ఆహ్వానించారు. ఏ సమస్య వచ్చినా కార్యకర్తలు తన దృష్టికి తేవాలని, వెంటనే పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.గిద్దలూరు రూరల్: అతివేగంగా వస్తున్న కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మమూడు బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన నంద్యాల రోడ్డులోని స్వదేశీ రెస్టారెంట్ సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల నుంచి గిద్దలూరు వైపుగా వస్తున్న కారు రెస్టారెంట్ వద్ద ఆగి ఉన్న మూడు బైక్‌లను, వ్యక్తిని, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కేఎస్పల్లెకు చెందిన గాలిరెడ్డి (63) రెస్టారెంట్ వద్ద తన బైక్ పక్కన నిలబడి ఉండగా కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కారు నడుపుతున్న రాజేష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కారు ఢీకొట్టడంతో బైక్‌లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయాలైన రాజేష్‌ను చికిత్స నిమిత్తం గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఒకరు మృతి, మూడు బైక్‌లు ధ్వంసం -
బస్సు దిగి ప్రజలతో మమేకం
-
తుది దశకు ‘వెలిగొండ’
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు సిద్ధమైంది. ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారు. ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేయించిన సీఎం జగన్.. రెండో సొరంగంలో శనివారం సాయంత్రానికి 18.465 కి.మీ.ల పొడవున తవ్వకం పనులు పూర్తి చేయించారు. మరో 335 మీటర్ల పనులే మిగిలాయి. రోజుకు 8 మీటర్ల చొప్పున పనులు చేయిస్తున్నామని.. డిసెంబర్‌లోగా పూర్తవుతాయని సీఈ మురళీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. వెలిగొండ రెండు సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు తరలించనున్నారు. ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం జగన్ చిత్తశుద్ధితో అడుగులేస్తున్నారు. వైఎస్సార్ హయాంలో పనుల వరద శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులు తరలించి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్‌లో నిల్వ చేసి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4.37,300(తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తి తీర్చాలన్న లక్ష్యంతో వైఎస్సార్ 2004, అక్టోబర్ 27న దీనికి శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చు చేసి.. నల్లమలసాగర్‌తో పాటు సొరంగాల్లో సింహభాగం పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసేలా 23 కి.మీ. పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ చానల్ పనులు చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులు చేపట్టారు. ఖజానాను లూటీ చేసిన చంద్రబాబు ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్‌సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండం నుంచి గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే.. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్ల కోసమే ఖర్చు చేశారు. విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకూ రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఎలాంటి ప్రగతి కనిపించకపోవడమే చంద్రబాబు దోపిడీకి నిదర్శనం. జీవో–22(ధరల సర్దుబాటు), జీవో 63(çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.650 కోట్లకు పైగా దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి.. టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లు ఇచ్చి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. 2018, 2019 నాటికి పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిస్తూ వచ్చిన చంద్రబాబు.. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి, వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి.. కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికొదిలేశారు. శరవేగంగా పూర్తి చేయించిన సీఎం జగన్ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చిత్తశుద్ధితో అడుగులేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో దాదాపు రెండేళ్లు కరోనాతో పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే, మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీ. పనులను 2019, నవంబర్‌లో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులనూ అదే ఏడాది పూర్తి చేయించారు. రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వాటిని రద్దు చేసిన సీఎం జగన్.. వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించి టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్ల తక్కువకు పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ సొరంగం పనులు అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందుంచారు. రెండో సొరంగంలో టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడమే కష్టంగా మారింది. దీంతో గతేడాది మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ., 16.555 కి.మీ., 14.5 కి.మీ., 13.5 కి.మీ., 12.5 కి.మీ. వద్ద సొరంగాలు తవ్వి.. అక్కడ మనుషులతో పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే 7.363 కి.మీ. పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా పూర్తి చేయించింది. మిగిలిన 335 మీటర్ల పనులు డిసెంబర్‌లోగా పూర్తికానున్నాయి. ప్రాజెక్టు పనులకు ఇప్పటిదాకా రూ.700 కోట్లకు పైగా వ్యయం చేసి.. ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తి చేసేలా అధికారులకు సీఎం జగన్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. -
‘వెనుకబడిన వర్గాలకు అండగా సీఎం జగన్’
సాక్షి, ప్రకాశం: వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే వెనకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని, అందుకు తామే ప్రత్యక్ష సాక్ష్యాలని వైఎస్సార్సీపీ నేతలు ముక్తకంఠంతో చెబుతున్నారు. బుధవారం కనిగిరిలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర.. సాయంత్రానికి పామూరు బస్టాండ్ వద్దకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ నేతలు ఒక్కొక్కరుగా ప్రసంగించారు. సామాజిక న్యాయం అమలు చేసిన నాయకుడు వైఎస్ జగన్. ఆయన పాలనలోనే వెనకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సామాజిక వర్గాలకు సీఎం జగన్ పాలనలో దక్కిన ప్రాధాన్యత, పదవులు,జరిగిన మంచి గురించి వివరించారు వాళ్లు. రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం పాటించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేశానికి ఆయనొక రోల్ మోడల్. వెనుకబడిన వర్గానికి చెందిన 7 మందికి నాతో సహా రాజ్యసభకి ఆయన పంపారు. కేబినెట్,ఎమ్మెల్సీ ల కేటాయింపు లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు సింహ భాగం ఇచ్చారు. ఫీజు రీయంబర్స్మెంట్ అనేది బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒక వరం. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మకండి. బీసీలకు రక్షణ చట్టం తెస్తా అని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారు. జగన్నన్న పాలనలో మనం బాగున్నాం. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం అంటే గతం లో ఎన్నికల హామీలు మాత్రమే. కానీ, ఇప్పుడది ఆచరణలో కనిపిస్తోంది. సామాజిక సాధికారతకు సజీవ సాక్ష్యం మేమే. మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు పెట్టి.. మహిళా సాధికారిత సాధించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అవినీతి రహితంగా, పేదల ప్రభుత్వంగా సమర్థవంతమైన పాలనను వైఎస్సార్సీపీ అందిస్తోంది. కాబట్టి.టీడీపీ మాయ మాటలు వినొద్దు.. యెల్లో మీడియా వార్తలు అసలు పట్టించుకోవద్దు. అంతకు ముందు.. కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. నందన మారెళ్ల సెంటర్ నుండి బస్సుయాత్ర ప్రారంభమై.. పామూరు బస్టాండ్ వద్దకు చేరుకుంది. ఈ యాత్రలో వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మస్తాన్ రావు, ఆంజాద్ బాషా, మేరుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
రాధ హత్య కేసులో షాకింగ్ విషయాలు.. సినిమా ట్విస్టులు తలపించే రీతిలో..
కనిగిరి రూరల్(ప్రకాశం జిల్లా): వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు వద్ద వివాహిత దారుణ హత్యకు గురైన కేసు కీలక మలుపు తిరిగింది. కోట రాధ (35)ను ఆమె భర్త మోహన్‌రెడ్డి హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రాధకు ఆమె చిన్ననాటి స్నేహితుడు కాశిరెడ్డితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త మోహన్‌రెడ్డి పథకం ప్రకారం ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకు చెందిన కె.రాధకు నల్గొండ జిల్లా కోదాడకు చెందిన కోట మోహన్‌రెడ్డితో 2013లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. రాధ గృహిణి కాగా.. మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోనే ఉంటున్న రాధ చిన్ననాటి స్నేహితుడు కాశయ్య అలియాస్ కాశిరెడ్డి కుటుంబ సభ్యులతో దగ్గరయ్యాడు. ఆ క్రమంలోనే కాశిరెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీ పేరిట రాధ నుంచి సుమారు రూ.16 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అతనికి రాధ తన భర్త మోహన్‌రెడ్డి నుంచి కూడా రూ.35 లక్షల వరకు ఇప్పించింది. కొంతకాలానికి కాశిరెడ్డి అప్పులపాలై పరారయ్యాడు. అప్పు తీర్చకుండా సుమారు రెండేళ్ల నుంచి కాశిరెడ్డి తిప్పుతుండటంతో భార్యభర్తల మధ్య వివాదం ప్రారంభమైంది. ఈ క్రమంలో భార్య రాధపై మోహన్‌రెడ్డికి అనుమానం కలిగింది. ఒకవైపు ఆర్థికపరమైన అంశం, మరోవైపు అనుమానం రెండు మోహన్‌రెడ్డిలో తీవ్ర ద్వేషాన్ని పెంచాయి. దీంతో భార్యను ఎలాగైనా అంతమొందించేందుకు పథకం రచించినట్టు తెలిసింది. ఫోన్లు.. సిమ్ కార్డ్‌లు కొని.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పేరిట ఓ ఫోన్, సిమ్‌కార్డ్ కొనుగోలు చేసిన భర్త మోహన్‌రెడ్డి.. ఆ వ్యక్తి పేరు ట్రూ కాలర్‌లో వచ్చేలా నమోదు చేశా డు. ఆ నంబర్‌తో సొంత భార్యతోనే చాటింగ్ చేయగా.. మోహన్‌రెడ్డి అనుమానానికి మరింత బలం చేకూరిందని సమాచారం. దీంతో ఎలాగైనా భార్య ను చంపాలని మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఈ నెల 11న జిల్లెళ్లపాడులో జాతర ఉండటంతో రాధ పుట్టింటికి భర్త మోహన్‌రెడ్డి, పిల్లలు వచ్చారు. భార్యాపిల్లల్ని ఇక్కడే వదిలేసి మోహన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత 13, 14 తేదీల్లో భార్యకు వేరే వ్యక్తి పేరిట మెసేజ్ పెట్టాడు. తిరిగి 17న కనిగిరికి ఒంటరిగా వస్తే రూ.2 లక్షలు ఇస్తానని నమ్మబలికాడు. దీంతో రాధ కనిగిరి వచ్చింది. ఈ క్రమంలో వేరే వ్యక్తి మాదిరిగా ఫోన్లో మాట్లాడుతూ.. మెసేజ్, ఫోన్ చాటింగ్‌లు కూడా చేశాడు. పామూరు బస్టాండ్‌లో ఎదురుచూస్తున్న రా«ధకు నగదు ఇస్తానని చెప్పిన వ్యక్తి, అతని మనుషులకు బదులు కారులో భర్త కన్పించాడు. చదవండి: విశాఖలో షాకింగ్ ఘటన.. ప్రియురాలు వేరొకరిని ఇష్టపడుతుందని.. దీంతో ఒక్కసారిగా అవాక్కైన రాధ భర్త మోహన్‌రెడ్డి పిలవడంతో కారులో ఎక్కినట్టు సీసీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ఇదే కారు పాతకూచిపుడిపల్లి సమీపంలో కొంతసేపు ఆగినట్లు సీసీ ఫుటేజీల్లో నమోదైనట్టు సమాచారం. ఆ తర్వాత కారులో టిడ్కో గృహాల సముదాయం వద్దకు రాధను తీసుకెళ్లి చున్నీతో గొంతు నులిమి కొట్టి చంపినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కారులోనే ఆమె మృతదేహాన్ని జిల్లెళ్లపాడు క్రాస్‌రోడ్డులో పడేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా శనివారం ఉదయం భర్త మోహన్‌రెడ్డిని పోలీసులు దాచేపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కొట్టి చంపేశారయ్యా! నా కూతురుని భయంకరంగా కొట్టి చంపారయ్యా. మా అల్లుడు మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఫోన్ చేసి నీకేమైనా క్లూ దొరికిందా మామా అని అడిగాడు. ఈ కేసు గురించి ఏమనుకుంటున్నారని అడిగితే.. నాకు సమాచారం లేదని చెప్పాను. రాధ చనిపోయిందని అల్లుడికి ఫోన్ చేసినప్పుడు తాను వచ్చేదాకా ఆమె ఫోన్ తీయవద్దన్నాడు. మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చాడు. హత్య చేసింది వీడని మాకెట్లా తెలుస్తుంది. ఇప్పటివరకు గండ్లోపల్లికి చెందిన వ్యక్తిపై అనుమానం ఉండేది. అతడికి మా అమ్మాయి రూ.18 లక్షలు ఇచ్చింది. అల్లుడు రూ.33 లక్షలు ఇచ్చాడు. పెళ్లప్పుడు 38 ఎకరాల పొలం, 25 సవర్ల బంగారం, రూ.10 లక్షలు కట్నం ఇచ్చాం. నా కూతుర్ని చంపిన వాళ్లకు ఉరిశిక్ష పడాలి. – సుధాకర్‌రెడ్డి, రాధ తండ్రి -
రాధ హత్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, ప్రకాశం: సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధ హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. పోలీసుల అనుమానం రాధ భర్త మోహన్‌రెడ్డిపైకి మళ్లింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి పోలీసులు విచారిస్తున్నారు. స్నేహితుడు కాశిరెడ్డికి రాధ దంపతులు రూ.80 లక్షలు అప్పు ఇచ్చారు. అయితే కాశిరెడ్డి తిరిగి డబ్బు ఇవ్వకపోవడంతో ఆ భార్యాభర్తల నడుమ విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ విడిపోయేదాకా వెళ్లారని పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. రాధ పేరు మీద భారీ(కోటిన్నర రూపాయలు) ఇన్సూరెన్స్ ఒకటి ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అన్ని కలుపుకుని పక్కా ప్లాన్ ప్రకారమే భర్త ఈ హత్య చేయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇన్సూరెన్స్ సొమ్ముపై ఆశతో పాటు వివాహేతర సంబంధం కూడా రాధ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సీఎస్ పురం పోలీస్ స్టేషన్‌కు తరలించి.. మోహన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ప్రకాశం (Prakasam) జిల్లా వెలిగండ్ల మండలంలో జిల్లెళ్లపాడులో ఈ నెల 17వ తేదీన ఈ హత్య జరిగింది. రాధను హత్య చేయడానికి ఆర్థిక కారణాలా? లేదంటే ఇతర అంశాలేమైనా ముడిపడి ఉన్నాయా?.. ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు కూపీ లాగుతున్నారు. ఆమెను హత్య చేసిందెవరు? చేయించింది ఎవరు? అనేది తేలాల్సి ఉంది. -
4,39,068 మంది లబ్దిదారులకు రూ.658.60 కోట్ల సాయం
-
పరిశ్రమల ప్రకాశం
పారిశ్రామిక ప్రగతితో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాయితీలు ఇస్తోంది. ఫలితంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే జిల్లాలో రూ.152 కోట్లతో 201 పరిశ్రమలు కొత్తగా ఏర్పడ్డాయి. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో పాటు సీడీపీల ద్వారా పరిశ్రమలకు తోడ్పాటునిస్తోంది. అదే సమయంలో ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్‌హబ్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఒంగోలు అర్బన్: జిల్లాలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుతో పాటు సీడీపీ (క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్)లతో జిల్లా ప్రకాశించనుంది. ఆ మేరకు కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టి క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కలి్పంచేలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలో యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం కల్పించేలా ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన యువతకు ఉపాధి కలి్పంచేలా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా జిల్లాలో 2022–23 సంవత్సరంలో రూ.152 కోట్లతో 201 పరిశ్రమలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో సుమారు 1600 మందికి ఉపాధి లభించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కోట్లాది రూపాయల రాయితీలు ఇచ్చింది. అంతేకాకుండా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. అంతేకాకుండా సీడీపీల ద్వారా పరిశ్రమలకు తోడ్పాటునిస్తోంది. పరిశ్రమలకు చేయూత: జిల్లాలో ఇప్పటికే 25 భారీ పరిశ్రమలు, 2899 ఎంఎస్ఎంఈ (చిన్న, మధ్య తరహా) పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో భారీ పరిశ్రమల్లో సుమారు 8 వేల మంది, ఎంఎస్ఎంఈల్లో 35 వేల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ పరిశ్రమలు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తోంది. 2019 నుంచి జిల్లాలో 1406 పరిశ్రమలకు రాయితీ కింద రూ.171.07 కోట్లు అందజేసింది. 2019–20లో 242 పరిశ్రమలకు రూ.23.76 కోట్లు, 2020–21లో 220 పరిశ్రమలకు రూ.48.26 కోట్లు, 2021–22లో 375 పరిశ్రమలకు రూ.33.6 కోట్లు, 2022–23లో ఇప్పటి వరకు 569 పరిశ్రమలకు రూ.65.98 కోట్లు రాయితీ ఇచ్చింది. ఎంఎస్ఎంఈ పార్కులతో కొత్త పరిశ్రమలు: జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ వేగవంతంగా చర్యలు ప్రారంభించారు. 99.27 ఎకరాల్లో రూ.201.22 కోట్ల వ్యయంతో ఎంఎస్ఎంఈ పార్కులు సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దొనకొండ మండలం రాగముక్కలపల్లి, పామూరు మండలం మాలకొండాపురం వద్ద ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ పార్కులు సిద్ధమైతే వీటిలో సుమారు 20 వేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సీడీపీలతో పరిశ్రమలకు అండగా... క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (సీడీపీ)లతో పరిశ్రమలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేలా ఏర్పాటు చేయనున్నారు. రూ.30 కోట్ల వ్యయంతో చీమకుర్తి, గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్ వద్ద రెండు సీడీపీలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశారు. చీమకుర్తిలో ఏర్పాటు చేసే సీడీపీ గ్రానైట్ పరిశ్రమలకు, గ్రోత్‌సెంటర్‌లో ఏర్పాటు చేసే సీడీపీ నిర్మాణ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు వెన్నుదన్నుగా ఉండనున్నాయి. 15 ఏళ్లకు ప్రణాళికలు జిల్లాలో ఉన్న వనరుల మేరకు భారీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు కొత్తగా నెలకొల్పేందుకు యువతను ప్రోత్సహించడం అవసరమైన నైపుణ్య శిక్షణలు ఇవ్వడం, ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి అండగా ఉండటం వంటి చర్యలపై రాబోయే 15 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలను కలెక్టర్ సిద్ధం చేస్తున్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో కొత్తగా పరిÔశ్రమలు నెలకొల్పేలా పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో యువత ముందుకు రావాలి పరిశ్రమలు స్థాపించేందుకు యువత వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు రావాలి. అలా వచ్చిన యువతకు పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తాం. తద్వారా వాళ్లు ఎదగడంతో పాటు ఎంతోమందికి ఉపాధి కలి్పంచవచ్చు. అదేవిధంగా జిల్లా, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన అన్నీ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా పరిశ్రమల స్థాపనకు చేయూతనిస్తోంది. రాయితీలు అందిస్తోంది. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా పరిశ్రమలకు అవసరమైన వాటిలో నైపుణ్య శిక్షణ ఇస్తూ జిల్లాలోనే యువతకు ఉపాధి కలి్పంచడంతో పాటు పరిశ్రమలకు మ్యాన్‌పవర్ ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకున్నాం. – ఏఎస్ దినే‹Ùకుమార్, కలెక్టర్ -
ఒంగోలును తాకిన ‘స్వాతి కిరణం’
పాపం పుణ్యం తెలియని ఓ అమాయకుడు నాటి మూఢ నమ్మకాలకు బలవుతున్న ఓ వితంతువు మెడలో తాళి కడతాడు. అదీ సీతారాముల కల్యాణోత్సవంలో, రాముల వారు కట్టాల్సిన తాళిని. ఈ ఒక్క సీన్ స్వాతిముత్యం కథలోని ఆత్మని ఘాడంగా ఎలివేట్ చేస్తుంది.. తాను సంగీత సామ్రాట్‌ని అని విర్రవీగే గురువు ఆత్మాభిమానాన్ని గౌరవించేందుకు పదేళ్ల బాలుడు ఆత్మత్యాగం చేస్తాడు. ఇది స్వాతికిరణం అనే మహాకావ్యంలో పేద తల్లిదండ్రులు.. గురువు భార్య పడే ఆవేదన ప్రేక్షకుల గుండెల్ని పిండి చేసి.. కన్నీటి ధారలు కారుస్తుంది.. ఒకటా రెండా ఇలాంటి సున్నితమైన అంశాలతో కళాఖండాలు సృష్టించిన కళా తపస్వి భౌతికంగా దూరమైనా.. ఎప్పటికీ సినీ వినీలాకాశంలో ధ్రువతారగా మెరుస్తూనే ఉంటారు. సినీ దర్శకుడు కె. విశ్వనాథ్‌కు ఒంగోలుతో ఎనిలేని బంధం ఉంది. అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో స్వర్ణకంకణ సన్మాన కార్యక్రమంలో.. ( ఫైల్) ఒంగోలు టౌన్: తెలుగు సినీ రుచిని ప్రపంచానికి చూపించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతితో ఒంగోలులోని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగి పోయారు. అయితే ఆ మహా రుషి ఒంగోలులో పర్యటించడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయనతో తమకున్న పరిచయాన్ని, అనుబంధాన్ని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. నలభై సంత్సరాల క్రితం 1980 ఫిబ్రవరి 2న ఆయన దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విడుదలైన రోజునే ఆయన నిష్కృమించడం కాకతాళీయం. శ్రీనళిని ప్రియ నృత్య నికేతన్ వార్షికోత్సవంలో పాల్గొన్న మహా దర్శకుడు ( ఫైల్) కాగా నాడు శంకరాభరణం సినిమా విడుదలైన సందర్భంగా నటీనటులతో కలిసి విశ్వనాథ్ తొలిసారిగా ఒంగోలు వచ్చారు. పాతికేళ్ల తరువాత 2015 జూలై 4న ఒంగోలులోని శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్వాహకులు హోటల్ సరోవర్‌లో వసతి సౌకర్యం కలి్పంచారు. కానీ ఎంతో నిష్టగా ఉండే ఆయన హోటల్ భోజనం తినేందుకు ఇష్టపడలేదు. అన్నవరప్పాడులోని పోతురాజు కాలనీలో నివాసం ఉండే నృత్య కళాశాల నిర్వాహకురాలు యస్వీ శివకుమారి ఇంటికి వెళ్లి భోజనం చేశారు. మరుసటి రోజు గుంటూరులో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున రెండో రోజు కూడా ఆయన ఒంగోలులోనే గడిపారు. విశ్వనాథ్ అంతటి విఖ్యాత దర్శకుడు తమ ఇంటికి రావడం అదృష్టం అని, ఆయన మృతిని జీరి్ణంచుకోలేక పోతున్నామని శివకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2016లో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కినేని కళాపరిషత్ నిర్వాహకులు కల్లంగుంట కృష్ణయ్య ఆధ్వర్యంలో స్వర్ణకంకణంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఒంగోలుకు వచ్చారు. ఆ సందర్భంగా నగరంలోని ముంగమూరు రోడ్డులో గూడ రామ్మోహన్ నిర్వహిస్తున్న శ్రీ ఆదిశంకరా వేద పాఠశాలను సందర్శించారు. అక్కడి వేద విద్యార్థులతో వేదాలు, బ్రాహ్మణత్వం గురించి చర్చించారు. వేద విద్యార్థులకు వ్రస్తాలను బహూకరించారు. బ్రాహ్మణుడినై పుట్టి వేద విద్యను అభ్యసించలేక పోయాను అంటూ పండితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు రామ్మోహన్ గుర్తు చేసుకున్నారు. ఇలా ఒంగోలులోని కళాకారులతో, సంస్థలతో ఆయనకు అనుబంధం ఉంది. ‘రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు’ అన్న మహాకవి గుర్రం జాషువ వాక్యాలు విశ్వనాథ్ విషయంలో అక్షరాలా నిజమయ్యాయి. ఒంగోలు ముంగమూరు రోడ్డులోని డాక్టర్ దారా రామయ్య శా్రస్తికి విశ్వనాథ్‌తో చిరకాల స్నేహం ఉందని ఆయన కూతురు, చిత్రకారిణి సి.హెచ్.శ్రీలక్ష్మి చెప్పారు. తాను గీసిన కృష్ణం వందే జగద్గురు చిత్రానికి వచ్చిన మిరాకిల్ బుక్ ఆఫ్ ఇండియా అవార్డు, తెలుగు బుక్ ఆఫ్ అవార్డులను విశ్వనాథ్ చేతుల మీదుగా తీసుకున్నానని చెప్పారు. సంప్రదాయ సంకెళ్లు తెంచిన విశ్వనాథుడు ఒంగోలు టౌన్: కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతికి రంగభూమి కళాకారుల సంఘం ఘనంగా నివాళి అరి్పంచింది. స్థానిక సీవీఎన్ రీడింగ్ రూంలో విశ్వనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళరి్పంచారు. సామాజిక సందేశంతో నిర్మించిన ఆయన సినిమాలు తెలుగు ప్రజల సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాయని పడమటి గాలి ఫేం పాటిబండ్ల ఆనందరావు అన్నారు. సంప్రదాయ సంకెళ్లను తెంచిన సాంస్కృతిక విప్లవకారుడు విశ్వనాథ్ మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి చెందిన కవులు, కళాకారులు ప్రసాద్, ఏ.ప్రసాద్, వాకా సంజీవరెడ్డి, గుర్రం కృష్ణ, తాళ్లూరి శ్రీదేవి, చల్లా నాగేశ్వరమ్మ, నల్లమల్లి పాండురంగనాథం, ఎస్కే బాబు, పొన్నూరి వెంకట శ్రీనివాసులు, కె.రాఘవులు తదితరులు విశ్వనాథ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్ఫూర్తినిచ్చిన విశ్వనాథ్ సినిమాలు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విశ్వనాథ్ సినిమాలను చూస్తూ పెరిగా. మానవ సంబంధాలు, నైతిక పునాదులపై ఆయన సినిమాలు చర్చించేవి. సమాజం పట్ల బాధ్యతను తెలిపే ఆ సినిమాల ప్రభావంతో విదేశాల్లో ఉద్యోగాన్ని వదిలి ఒంగోలులో నృత్య కళాశాలను ఏర్పాటు చేశా. ఎంతోమంది చిన్నారులకు కూచిపూడిలో శిక్షణ ఇస్తున్నా. మా కళాశాల ప్రథమ వార్షికోత్సవానికి ఆయన ఒంగోలుకు రావడం, తండ్రిలా మా ఇంటికి భోజనం చేయడం ఎన్నటికీ మరిచిపోలేను. ఆయన మరణం కళాకారులకు తీరని లోటు. – యస్వీ శివకుమారి, శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్, ఒంగోలు మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నా సినిమాలు చూస్తే పిల్లలు పాడైపోతారని పెద్దలు మందలించే వారు. అలాంటి పరిస్థితి నుంచి స్వయంగా పెద్దలే తమ పిల్లలను విశ్వనాథ్ సినిమాలు చూడమని ప్రోత్సాహించేలా ఆయన కళాఖండాలు రూపొందించారు. విశ్వనాథ్ మృతి తెలుగు సినిమా రంగానికే కాదు, తెలుగు ప్రజలందరికీ తీరని లోటు. ఆయన వారసత్యాన్ని కొనసాగించే దర్శకులు నేడు ఒక్కరు కూడా కనిపించకపోవడం విచారకరం. – కల్లకుంట కృష్ణయ్య, అక్కినేని కళాపరిషత్, ఒంగోలు -
అలల సాగరంపై బతుకు విన్యాసం.. కడలి పుత్రుల జీవనం విలక్షణం
కడలే వారికి అమ్మ ఒడి. అలల సవ్వడులు వారికి జోలపాట. సాగరంలో వేటే జీవనంగా సాగుతున్న మత్స్యకారుల జీవనశైలి అంతా విభిన్నం. ఇల్లు వదిలి సముద్రంలోకి వెళ్లి.. తిరిగొచ్చే వరకు అనుక్షణం ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ నిత్యం ఆటుపోటుల మధ్య సాగే వీరి జీవనం ఓ సమరం. గంగమ్మ చెంత మత్స్యకారుల దిన చర్య అర్ధరాత్రి నుంచే ఆరంభమవుతుంది. నడి సంద్రం సాక్షిగా వీరు సాగించే జీవన తెరను ఒక్కసారి తెరిస్తే ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తాయి. వీరు వినియోగించే వల దగ్గర నుంచి సాగరంలో సాగించే వేట వరకూ అన్నీ విభిన్నం..విలక్షణమే.. ఇంకెందుకాలస్యం సముద్ర తీరానికి పోదాంపదండి... సింగరాయకొండ మండలం పాకల సముద్రతీరం. ఇక్కడ చిన్నా..పెద్దా, ఆడ..మగా అనే తేడా లేకుండా అందరూ వేట పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొంత మంది తెల్లవారుజామునే వేటకు వెళితే.. మరికొంత మంది రేపటి కోసం వలలను సిద్ధం చేస్తూ కనిపించారు. మరికొందరు పడవలను శుభ్రం చేస్తున్నారు. వేటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగొచ్చిన విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులు భోజనాలతో తీరానికి వస్తారు. అక్కడే అందరూ కలిసి భోజనాలు చేస్తారు. ఇక్కడ జీవనం సాగిస్తున్న గంగపుత్రులను పలకరిస్తే వారి బతుకుల్లో విలక్షణత కనిపించింది. కడలిలో వందల కిలోమీటర్లు రోజుల తరబడి వీరు చేస్తున్న సాహసం తెలుస్తుంది. చేపల వేటే జీవనంగా మార్చుకున్న గంగపుత్రులకు వేట విరామ సమయమే విశ్రాంతి. ఎగిసిపడే కెరటాలను అవలీలగా దాటి కడలిని సునాయాసంగా ఈదే మత్స్యకారుల బతుకు ప్రకృతి విపత్తుల మధ్య పెనుసవాలే.. అంతా విలక్షణం... అందరిదీ ఒక్కటే మాట..బాట. ఒక్క మాటలో చెప్పాలంటే.. పెద్దకాపు తీసుకున్న నిర్ణయమే శాసనం. తప్పొప్పులు జరిగితే.. పరిష్కరించేందుకు వీరు పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కేది ఉండదు. కట్టుబాటును ఎవరూ ధిక్కరించరు. పెద్ద కాపు, నడింకాపు, చిన్నకాపు.. ఇలా ఊరిలో ముగ్గురిని గ్రామ పెద్దలుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. వీరు చెప్పిందే ఆ ఊరందరికీ వేదం. చేసిన తప్పులకు వీరు వేసే శిక్ష వారిలో మార్పు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ఊరంతా అనుసరించాల్సిందే. వల..వలకూ ప్రత్యేకమే... మత్స్య సంపదను వేటాడటానికి రకరకాల వలలు వినియోగిస్తారు. చేపలు, రొయ్యలు, పీతలు ఒక్కొక్కదానికి ఒక్కో వలను వేటకు వాడతారు. ఏ వల కొనుగోలు చేయాలన్నా రూ.లక్షల్లోనే మరి. వేట సరిగ్గా సాగితే అది పెద్దలెక్కలోదేమీ కాదు. సంప్రదాయ మత్స్యకారులు వాడే వలలు పులసల వల, నరంవల, బాడీవల, సన్నకన్నుల వల, ఐలావల, రింగుల వల, కొనాము వల. వీటిల్లో అత్యంత ఖరీదైంది ‘ఐలా వల’. దీని ఖరీదు దాదాపు రూ.రెండు లక్షలు ఉంటుంది. అంటే ఒక్కో వల అతి తక్కువ పొడవు అంటే ఒక కిలో మీటరు. ఇక పొడవు పెరిగే కొద్దీ ధర పెరుగుతూ ఉంటుంది. దీనితో సముద్రం ఒడ్డున ఉండి మరీ వేట సాగిస్తారు. ఈ వలను సముద్రంలో రెండుమూడు పడవల్లో వేసుకుని ఎంత పొడవు ఉంటే అంత దూరంలో సముద్రంలో వదులుకుంటూ వెళ్తారు. ఒడ్డున ఉండి మత్స్యకారులు ఒక చివర పట్టుకుని ఉంటే.. రెండో చివర మరో పక్కన ఒడ్డునే ఉండి మరికొంతమంది మత్స్యకారులు పట్టుకుంటారు. సముద్రంలో వదిలిన వలను రెండు అంచులు పట్టుకుని లాగుతారు. ఐలా, రింగుల, కొనాము వలను లాగడానికి దాదాపు 50 మందికిపైగా మత్స్యకారులు కావాలి. కాకినాడ నుంచి ప్రత్యేకంగా మత్స్యకారులను తీసుకొచ్చి వేటకు వెళ్తారు. సుదూర ప్రాంతం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ వలల యజమానికి అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. మత్స్య సంపద పడితే ఊపిరి పీల్చుకుంటాడు. లేకుంటే మళ్లీ రెండో ప్రయత్నమే మరి. పీతలు, చిన్నచేపలు, రొయ్యల కోసం ముందు రోజు లంగరు వేసి తర్వాత రోజు ఉదయాన్నే సముద్రంలోకి వెళ్లి మత్స్యసంపద తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చిన మత్స్య సంపదను ఊర్లో ఉన్న వ్యాపారులకు ఇస్తారు. వారు సరుకును బట్టి ప్రత్యేక వాహనాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఒడిస్సా పంపిస్తుంటారు. పడవలోనే వంటా వార్పూ... సుదూర ప్రాంతాలకు వేట కోసం వెళ్లేవారు ముందుగానే పడవలో వంట సరుకులు తీసుకువెళ్తారు. అందులోనే వంటా వార్పూ. తమ వెంట తీసుకెళ్లిన పప్పులు, కూరగాయలతోనే కాకుండా సముద్రంలో లభించే చేపలు, రొయ్యలను సైతం వండుకుని తింటారు. అంతేకాదు వీరికి ప్రత్యేక భాష ఉంటుంది. తమిళం కలిపి వీరు మాట్లాడుతుంటారు. ఎంతో మార్పు... రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మత్స్యకారుల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. వేట విరామ సమయంలో గత ప్రభుత్వాలు అరకొరగా.. అదీ ఏడాదికి రూ.4 వేలు ఆర్థిక సాయం, 20 కేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకునేవి. ప్రస్తుతం వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. వేట బోట్లకు డీజిల్ సబ్సిడీని గణనీయంగా పెంచారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే రూ.10 లక్షల పరిహారం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా రూ.3.30 లక్షల విలువైన బోటు, మోటార్లు, వలలు రాయితీపై అందిస్తోంది. మెకనైజ్డ్ బోట్ల పంపిణీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న అమ్మఒడితో పిల్లలు చదువుకు వెళ్తున్నారు. విరామ సమయంలో... వేట విరామ సమయంలో కూడా మత్స్యకారులు అందుబాటులో ఉన్న ఆక్వా కల్చర్‌కు, వ్యవసాయ, ఉపాధి పనుల్లో కూలీలుగా వెళ్తారు. మరికొందరు రొయ్యల చెరువుల్లో రొయ్యలు పట్టడం, ప్యాకింగ్ చేయడం, ఇతరత్రా పనులకు వెళ్తారు. ఆయా పనులు దొరకని పక్షంలో ఆటలతో కాలక్షేపం చేస్తుంటారు. చాకిరీ ఎక్కువ.. ఆదాయం తక్కువ ఉదయం ఆరు గంటలకు చేపల వేటకు బోటులో ఇద్దరం వెళ్లాం. ప్రస్తుతం పీతలు మాత్రమే పడ్డాయి. పీతలు పెద్దసైజు అయితే కేజీ రూ.150 ఉండగా, చిన్న సైజు కేజీ రూ.60 మాత్రమే. పీతలు పడితే చాకిరీ ఎక్కువ.. ఆదాయం తక్కువ. – అల్లారి లక్ష్మణ్, పోతయ్యగారిపట్టపుపాలెం, పాకల శాపంగా తమిళనాడు బోట్లు... చేపల వేట ప్రస్తుతం ఆశాజనకంగా లేదు. సముద్రంలో చాలా దూరం వెళ్లి వలలు వేస్తేనే చేపలు లభిస్తున్నాయి. ఈలోగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన కడలూరు జాలర్లు సోనా బోట్లతో నిబంధనలు అతిక్రమించి తీరానికి సమీపంలో చేపల వేట చేయడంతో లక్షలాది రూపాయల విలువ గల వలలు ధ్వంసమై తీవ్రంగా నష్టపోతున్నాం. చెన్నై బోట్లు తీరంలో వేటాడకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి. – ప్రళయ కావేరి రోశయ్య, పోతయ్యగారిపట్టపుపాలెం, పాకల రోజూ రూ.200 సంపాదన ఇంటింటికి తిరిగి చేపలు అమ్ముకుంటూ జీవిస్తాను. చేపల వేట సాగించి తీరానికి వచ్చిన బోట్ల మత్స్యకారులకు బఠానీలు వంటి తినుబండారాలు ఇచ్చి వారి వద్ద నుంచి చేపలు తీసుకెళ్లి అమ్ముకుంటాను. రోజుకు 150 నుంచి 200 రూపాయలు సంపాదిస్తాను. నాకు వృద్ధాప్య పింఛన్ రూ.2,750 వస్తుంది. – వాటిపల్లి పోలేరమ్మ, పోతయ్యగారిపట్టపుపాలెం, పాకల చదవండి: ఇది ఖైదీల బంక్..! రోజుకు రూ.5 లక్షల అమ్మకాలు.. -
ఒంగోలు సిటీ.. ఇదిగో అభివృద్ధి
అభివృద్ధి.. సంక్షేమం రెండు కళ్లుగా సాగుతున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒంగోలు నగరం రూపురేఖలు మారుతున్నాయి. నగర పాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మౌలిక వసతులు కల్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడున్నరేళ్లలో రూ.137.79 కోట్లు వెచ్చించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నగరంలోని ప్రతి ఇంటింటికీ తిరుగుతూ డివిజన్లలోని సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నారు. నూతన నగర పాలకమండలి ఏర్పడిన తరువాత రెండో బడ్జెట్ నేడు ప్రవేశపెట్టనున్నారు. ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరం సమగ్ర అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. ఏడాదికి ఏడాదికి పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని విస్తరిస్తున్న నగరాన్ని పరిగణలోకి తీసుకొని ప్రజల అవసరాలు తీర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్తు తరాలకు కూడా మౌలిక వసతుల కల్పనలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. నగర ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఒంగోలు నగరంలో బాలినేని మార్క్ అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చేయటమే లక్ష్యంగా యంత్రాంగాన్ని ఉరుకులు.. పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలు నగర జనాభా 3,01,572 మందికి చేరింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు బాలినేని ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో వేలాది మంది అర్హులైన పేదలు, మధ్య తరగతి వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు ఇంటింటికీ వెళుతున్న బాలినేనికి స్వయంగా లబ్ధిదారులు ‘ఇది మీరు ఇచ్చిన ఇల్లే వాసన్నా’ అంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు. 11వ డివిజన్లో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లకు శంకుస్థాపన చేస్తున్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని, పక్కన మేయర్ గంగాడ (ఫైల్) కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒంగోలు నగరంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణాలు చేపడుతున్నారు. నగరంలో మొత్తం 50 డివిజన్లలో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టేందుకు 1013 పనులు మంజూరు చేశారు. అందుకుగాను రూ.101.67 కోట్ల సాధారణ నిధుల నుంచి ఖర్చు చేయటానికి పూనుకున్నారు. వాటిలో ఇప్పటికే 641 పనులు పూర్తయ్యాయి. మరో 71 పనులు కొనసాగుతున్నాయి. 301 పనులు ప్రారంభించాల్సి ఉంది. 2019 నుంచి 2022 వరకు షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ ప్లాన్ కింద మొత్తం రూ.కోటి వెచ్చించి 12 పనులు చేపట్టి పూర్తి చేశారు. ఎంపీ లాడ్స్ కింద రూ.20 లక్షలు వెచ్చించి నాలుగు పనులు పూర్తి చేశారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి 14వ ఫైనాన్స్ కింద మంచినీటి సరఫరా పనులతో పాటు మొత్తం 3 పనులకు రూ.6.84 కోట్లు వెచ్చించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను 15వ ఆర్థిక సంఘంలో భాగంగా మొత్తం 29 పనులు చేపట్టారు. అందుకుగాను రూ.16.87 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో 6 పనులు పూర్తి కాగా మరో 14 పనులు ప్రారంభించాల్సి ఉంది. ఒంగోలు నగరంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి నూతనంగా ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు మంజూరయ్యాయి. ఒక్కో అర్బన్ హెల్త్ సెంటర్‌కు ప్రభుత్వం రూ.80 లక్షల చొప్పున మంజూరు చేసింది. వాటిలో కొన్ని పూర్తికాగా కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మరో నాలుగు పాత అర్బన్ హెల్త్ సెంటర్లను ఒక్కో దానిని రూ.10 లక్షలు వెచ్చించి ఆధునికీకరించారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద ఆరు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.1.58 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 20 పనులు మంజూరు చేసింది. అందుకోసం ఒక్కో డివిజన్‌కు రూ.20 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఇప్పటికే 11 పనులు ప్రారంభించి జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధుల్లో భాగంగా మూడు పనులకు గాను రూ.22.95 లక్షలు మంజూరు చేశారు. వాటిలో రెండు పనులు జరుగుతున్నాయి. మరొక పనిని ప్రారంభించాల్సి ఉంది. జగనన్న హరిత నగరాల్లో భాగంగా ఒంగోలు నగరంలో మొక్కలు నాటడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు రూ.2.62 కోట్లు కేటాయించారు. పచ్చదనాన్ని పెంపొందించే ప్రణాళికలు ప్రారంభించారు. గుండ్లకమ్మ నుంచి ఏర్పాటు చేసిన మంచినీటి పథకం అమృత్ మొదటి విడత పనులు రూ.75 కోట్లతో కొనసాగుతున్నాయి. రూ.209 కోట్లతో అంచనా బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వైనం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం జరగనున్న ఒంగోలు నగర పాలక సంస్థ పాలక మండలి రూ.209 కోట్లతో అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన కౌన్సిల్ సమావేశ మందిరంలో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పాలక మండలి ఏర్పాటైన తరువాత ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. ఆదాయం, రాబడులు, జీతాలు, ఒంగోలు నగర పాలక సంస్థ నిర్వహ ణ, అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు అన్నీ కలుపుకొని రూ.196 కోట్ల ఖర్చు లు పోను రూ.13 కోట్ల మిగులుతో కౌన్సిల్ ఆమోదించనుంది. మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు ఒంగోలు నగరంలో మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాను. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపడుతున్నాం. నగర శివారు ప్రాంతాల్లోనూ ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాం. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్‌ను రూపొందించాం. కౌన్సిల్ సమావేశంలో చర్చ అనంతరం ఆమోదింపజేసుకొని ముందుకు సాగుతాం. – ఎం.వెంకటేశ్వరరావు, కమిషనర్, ఒంగోలు నగర పాలక సంస్థ -
ప్రకాశం: చంద్రబాబు కందుకూరు సభలో విషాదం
సాక్షి, ప్రకాశం: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కందుకూరులో జరిగిన సభలో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో మురుగు కాలువలో పడి మరణించిన వాళ్ల సంఖ్య ఏడుగురికి చేరినట్లు తెలుస్తోంది. పామూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఆ టైంలో ఆయన ప్రసంగిస్తుండగా.. తొక్కిసలాట జరిగిందని, ఈ క్రమంలోనే వాళ్లు కాలువలో పడడంతో వాళ్లు మరణించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మృతుల్ని గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం చినకొండయ్య, కందుకూరు పట్టణం గుర్రంవారి పాలెంకు చెందిన కాకుమాని రాజాగా గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట అనంతరం ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మారుమోగిపోయింది. -
ప్రకాశం: పసికందును బలిగొన్న వానరం
సాక్షి, ప్రకాశం: జిల్లాలో శుక్రవారం ఘోరం జరిగింది. పసిబిడ్డను ఓ కోతి బలి తీసుకుంది. ఆరుబయట నిద్రపోతున్న ఓ చిన్నారిని ఈడ్చుకెళ్లి కిందపడేసింది వానరం. ఈ క్రమంలో తలకు తీవ్రగాయం కావడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. పెదచర్లోపల్లి మండలం మురుగుమ్మిలో ఈ ఘటన జరిగింది. రవీంద్ర-సుమతీ దంపతులు స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు. రెండు నెలల కిందటే బిడ్డకు జన్మనిచ్చింది సుమతీ. ఈ క్రమంలో ఎప్పటిలాగే.. పసికందును ఆరుబయట మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనులు చేసుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ కోతి.. పసికందును మంచం మీద నుంచి ఈడ్చుకెళ్లింది. గట్టిగా కిందపడేయడం.. అదే సమయంలో అక్కడే ఉన్న వ్యవసాయ సామాగ్రి ఆ పసికందుపై పడడంతో అక్కడికక్కడే కన్నుమూసింది. అలికిడికి అక్కడికి వచ్చిన తల్లి.. రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరు అయ్యింది. పసికందు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పెళ్లయిన రెండు నెలలకే నవ దంపతులు మృతి..
ప్రకాశం: కోటి ఆశలతో ఏడు అడుగులు, వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన జంట వారి ఆశలు తీరకుండానే రోడ్డు ప్రమాదం కబళించింది. బాపట్ల జిల్లా జే పంగులూరు మండల పరిధిలోని రామకూరు గ్రామానికి చెందిన నవ దంపతులు మిన్నికంటి పవన్‌కుమార్ (30), మిన్నికంటి కళ్యాణి (25) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అందిన సమాచారం ప్రకారం రామకూరు గ్రామానికి చెందిన మిన్నికంటి సిద్దయ్య, పద్మావతికి కుమారుడు పవన్ కుమార్‌తో పాటు ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఆరేళ్ల క్రితమే వివాహం చేశారు. ఇంజినీరింగ్ చేసిన పవన్ కుమార్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వల్ల ఇంటి వద్దే ఉండి పనిచేస్తున్నాడు. గత ఆగస్టు నెలలో పవన్ కుమార్‌కి నరసరావుపేట దగ్గరలోని వడ్లమూడి గ్రామానికి చెందిన కళ్యాణితో వివాహమైంది. వీరి పెళ్లిని తల్లిదండ్రులు ఎంతో వైభవంగా చేసి మురిసిపోయారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో దంపతులు ఇద్దరూ టూవీలర్‌పై బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద ఉన్న హోటల్లో పుల్కా తిని, అనంతరం టీ స్టాల్లో టీ తాగి తిరిగి టూవీలర్ పై రామకూర వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటున్నారు. వెనక నుంచి వచ్చిన ప్రైవేటు ట్రావెల్ బస్సు టూవీలర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా, భార్య కళ్యాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. సెంటర్‌కు వెళ్లి టిఫిన్ చేసి వస్తామని చెప్పి వెళ్లిన కుమారుడు, కోడలు తిరిగి రాని లోకాలకు వెళ్లారని తెలిసే సరికి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. దంపతుల మరణ వార్త వినగానే గ్రామం అంతా శోక సంద్రంలో మునిగిపోయింది. -
మహనీయులకు మరణం ఉండదు: సీఎం జగన్
సాక్షి, ప్రకాశం: మంచి చేస్తే మనిషికి మరణం ఉండదని, ప్రతీ గుండెలోనూ సజీవంగా నిలిచే ఉంటారనడానికి నిదర్శనం ఇవాళ జరిగిన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమమే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చీమకుర్తిలో మహానేత వైఎస్సార్, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ అనంతరం.. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పేదల సంక్షేమం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వైఎస్సార్. రైతుల సంక్షేమం, ఉచిత విద్యుత్, ఫీజు రీయంబర్స్మెంట్, ఆరోగ్యం.. ఇలా ఎంతో మంచి చేశారాయన. ఆయన ఒక అడుగు వేస్తే.. వైఎస్సార్ బిడ్డగా తాను నాలుగు అడుగులు ముందుకు వేస్తానని సీఎం జగన్ మరోసారి వేదిక సాక్షిగా ప్రకటించారు. ఇచ్చినమాట ప్రకారం.. 95 శాతం మేనిఫెస్టో హామీలను ఇప్పటికే నెరవేర్చామని, దేవుడి దయ.. ప్రజల ఆశీస్సులతో మరింత మంచి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. మహానేతతో పాటు ఆయనతో అడుగులు వేసిన నేత బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహం కూడా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్న సీఎం జగన్.. వచ్చే ఏప్రిల్ 14న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉంటుందని ప్రకటించారు. గాంధీ, అంబేద్కర్, పూలే, అల్లూరి, ప్రకాశం, మహానేత వైఎస్సార్.. ఇలా మహనీయులను కలకాలం ప్రజలు గుర్తుంచుకుంటారు. ఎందుకంటే వీళ్లకు భౌతికంగా మరణం ఉన్నా.. వీళ్లు చేసిన మంచికి, భావాలకు మరణం ఉండదు అనేది వాస్తవమని సీఎం జగన్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం.. చిన్నచిన్న పరిశ్రమలకు మేలు జరిగేలా నిర్ణయాలు అమలు చేయబోతున్నామని సీఎం జగన్ చీమకుర్తి సభా వేదికగా ప్రకటించారు. చిన్న గ్రానైట్ పరిశ్రమలకు కరెంట్ ఛార్జీల్లో రూ.2 తగ్గింపు ఉంటుందన్న సీఎం జగన్ ప్రకటించారు. గ్రానైట్ పరిశ్రమకు కొత్త స్లాబ్ సిస్టమ్ తీసుకురాబోతున్నట్లు తెలిపారాయన. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కోరినట్లు.. ఒంగోలులో శిథిలావస్థలో ఉన్న కొత్త జిల్లా పరిషత్ కార్యాలయం కోసం రూ. 20 కోట్ల మంజూరు చేయడంతో పాటు తుళ్లూరు మండలంలోని శివరాంపురంలో ఉన్న మొగిలిగుండ్ల చెరువును మినీ రిజర్వాయర్ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి రిజర్వాయర్‌గా మారుస్తున్నట్లు ఆదేశాలు జారీ చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఇదీ చదవండి: సంక్షేమం తలుపు తడుతోంది (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తిరుపతి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
వేకువజామున రెండు గంటలు. అంతా చిమ్మ చీకటి. కంభం రైల్వేస్టేషన్ సమీపంలో ఫ్లైఓవర్‌పై ఒక్క కుదుపు. ముందు వెళ్తున్న లారీ వేగం తగ్గి నెమ్మదించింది. వెనుకనే వస్తున్న కారు అదుపు తప్పి వేగంగా లారీని ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఏమి జరిగిందో తెలిసే లోపు అందరి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. తమ ఇష్టదైవం మొక్కు తీర్చుకునేందుకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబళించింది. కుమారుడు.. కుటుంబ సభ్యులు, బంధువులు కళ్లెదుటే విగతజీవులుగా మారడం ఆయా కుటుంబాలను పెను విషాదంలోకి నెట్టింది. కంభం: ఉన్నత చదువు కోసం యూకే వెళ్లిన తన కుమారుడి మొక్కు తీర్చేందుకు కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి వెళ్తున్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన అనంతపురం–అమరావతి రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన జోలకంటి హనిమిరెడ్డి, జోలకంటి గురవమ్మలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీనివాసరెడ్డి హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటుండగా చిన్న కుమారుడు జోలకంటి నాగిరెడ్డి (23) గుంటూరులో బీటెక్ పూర్తి చేసి పది నెలల క్రితం ఎంఎస్ చదివేందుకు యూకే వెళ్లాడు. పది రోజుల క్రితం ఇంటికి వచ్చిన తన కుమారుడి తిరుపతి మొక్కు తీర్చేందుకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో రెండు కార్లలో బయలు దేరారు. ఒక కారులో నాగిరెడ్డి డ్రైవింగ్ చేస్తుండగా ఆ కారులో అతని తాత, అమ్మమ్మ, ఇద్దరు చిన్న అమ్మమ్మలు కూర్చున్నారు. మరో కారులో నాగిరెడ్డి తల్లిదండ్రులు, సోదరుడు, మరో 8 మంది అతని బంధువులు ఉన్నారు. కారు కంభం సమీపంలో ఫ్లైవోవర్ వద్ద అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టడంతో కారు మొత్తం నుజ్జునుజ్జయిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న జోలకంటి నాగిరెడ్డి (23), చిలకల పెద్ద హనిమారెడ్డి (70), అతని భార్య ఆదిలక్ష్మమ్మ (60), ఆదిలక్ష్మమ్మ సోదరి పల్లె అనంత రామమ్మ (50), మరో సోదరి భూమిరెడ్డి గురువమ్మ (60)లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు చిలకల పెద్ద హనిమారెడ్డికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పల్లె అనంతరామమ్మకు భర్త, ఒక కుమార్తె ఉన్నారు. గురువమ్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుల కుటుంబాలు వ్యవసాయం చేసుకుని జీవించే వారు. పల్లె అనంతరామమ్మ బొల్లపల్లి మండలం దేమిడిచర్లలో నివాసం ఉంటుండగా, మిగిలిన వారందరూ సిరిగిరిపాడులో నివాసం ఉంటున్నారు. కష్టాలు తీరుస్తాడనుకుంటే కడుపుకోత మిగిల్చాడు వ్యవసాయం, పొలం పనులు చేసుకుంటూ తన చిన్నకుమారుడిని ఉన్నత చదువు కోసం విదేశాలకు పంపించగా త్వరలో వచ్చి కుటుంబ సమస్యలన్నీ తీరుస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు నాగిరెడ్డి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోయాడు. నాగిరెడ్డి తల్లిదండ్రులు కుమారుడిని బీటెక్ వరకు గుంటూరులో చదివించుకున్నారు. కుమారుడు చదువులో రాణిస్తుండటంతో సుమారు రూ.15 లక్షల వరకు అప్పు చేసి మరీ విదేశాలకు పంపించి చదివిస్తున్నట్లు బంధువులు తెలిపారు. త్వరలో చదువు ముగించుకొని తిరిగి వచ్చి చేసిన అప్పులు తీర్చడంతో పాటు కుటుంబానికి అండగా ఉంటాడని అనుకుంటున్న ఆ కుటుంబానికి విషాదం మిగిలింది. తల్లిదండ్రులతో పాటు కుమారుడు మృతి జోలకంటి నాగిరెడ్డి తల్లి గురవమ్మ ఈ ప్రమాదంలో కుమారుడితో పాటు, ఆమె తల్లిదండ్రులు చిలకల పెద్ద హనిమారెడ్డి, తల్లి ఆదిలక్ష్మమ్మ, చిన్నమ్మలు పల్లె అనంత రామమ్మ, భూమిరెడ్డి గురవమ్మలను కోల్పోయింది. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం తరలింపు: సంఘటనా స్థలం నుంచి మృతదేహాలను హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన సీఐ యం.రాజేష్, ఎస్సై నాగమల్లేశ్వరరావు మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు స్వగ్రామం తీసుకెళ్లారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ముర్రా.. మేడిన్ ఆంధ్రా -
ఎలుకల మందు తిని వివాహిత ఆత్మహత్య
ప్రకాశం: ఎలుకల మందు తిని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మర్రిపూడి నడిగడ్డకు చెందిన ఆకుమళ్ల తిరుమలయ్య కుమార్తె వెంకటేశ్వరి(22)ని మూడేళ్ల క్రితం బేస్తవారిపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రమణయ్యతో వివాహమైంది. అయితే కొద్ది రోజుల్లోనే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి నిత్యం గొడవలు జరుగుతుండటంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వెంకటేశ్వరి పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన వెంకటేశ్వరి ఈ నెల 21న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తినింది. కుటుంబసభ్యులు గమనించి ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై అంకమ్మరావు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. మృతురాలి తండ్రి తిరుమలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని తహసీల్దార్ జి.విజయలక్షి్మ, వీఆర్ఓ శామ్యేలు పరిశీలించారు. -
కమ్మనైన గోరుముద్ద
జగనన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు కమ్మనైన భోజనం అందిస్తున్నారు.. రోజుకు ఒక మెనూ అమలు చేస్తూ రుచికరమైన భోజనం విద్యార్థులకు పెడుతున్నారు. నాడు–నేడులో భాగంగా పాఠశాలలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏటికేడు విద్యార్థుల శాతం పెరుగుతోంది. నగరంలోని పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో దృశ్యాలివి.. -
రామాయపట్నం పోర్టుతో యువతకు ఉపాధి: సీఎం జగన్
నెల్లూరు రామాయపట్నం పోర్ట్ భూమి పూజ కార్యక్రమం అప్డేట్స్ 13:10PM ► రామాయపట్నం పర్యటన ముగించుకొని తాడేపల్లి బయలు దేరిన సీఎం వైఎస్ జగన్. 12:40PM ► స్థానిక ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి చేసిన విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్. హామీలను నెరవేరుస్తానని వెల్లడి. 12:38PM ► పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు, లోన్లు ఇచ్చిన బ్యాంకులకు కృతజ్ఞతలు: సీఎం జగన్. 12:33PM ► రామాయపట్నం పోర్టు రావడం వల్ల ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది: సీఎం జగన్ ► రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది: సీఎం జగన్ ► ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. రవాణా ఖర్చుకూడా గణనీయంగా తగ్గుతుంది. ► ప్రత్యక్షంగా వేల మందికి.. పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. 12:10PM పోర్టు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన నిర్వాసితులు. పోర్టు కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. 12:00PM చంద్రబాబు వేసింది పోర్టు పునాదా?: మంత్రి గుడివాడ దేశంలోనే రెండో అతిపెద్ద తీరం కలిగిన రాష్ట్రం మనది.. రామాయపట్నం పోర్టు భూమి పూజ.. చరిత్రలో నిలిచిపోయే రోజు అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు గతంలో చంద్రబాబు హయాంలో శంకుస్థాపన అంటూ డ్రామాలాడారు. అదసలు పునాదా? అని ప్రశ్నించారు. అనుమతులు లేకున్నా చేసిన పనిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ అధినేతకు చురకలు అంటించారు మంత్రి గుడివాడ. సీఎం జగన్ సారథ్యంలో.. ప్రజల సంక్షేమంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతోందని పేర్కొన్నారు. 11:47AM గ్రామస్తులకు హృదయపూర్వక వందనాలు ► కందుకూరు నిజయోకవర్గ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది అని స్థానిక ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి అభివర్ణించారు. దశాబ్ద కాలంగా మాటలతో, శిలాఫలకాలతో కాలం గడిపిన నేతలను చూశాం. ఇప్పుడు.. ఆ కలను నిజం చేసే నాయకుడిని చూస్తున్నాం అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు. పోర్టు మాత్రమే కాకుండా.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా తరలి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం, చేవూరు, రావూరు, సాల్పేట గ్రామస్తులకు హృదయ పూర్వక వందనాలు తెలియజేశారు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి. నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం చేకూర్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారంటూ ఆయన మరోమారు స్పష్టం చేశారు. 11:35AM ► రామాయపట్నం పోర్ట్ కార్యక్రమం వేదికగా.. ఏపీ మారిటైం విజన్ స్టేట్మెంట్ను ఆవిష్కరించిన సీఎం జగన్. భవిష్యత్ తరాలకు ఉద్యోగాల వంటిదని అధికారుల వర్ణన. 11:21AM ► రామాయపట్నం ఓడరేవుపై స్పెషల్ ఏవీ ప్రదర్శన.. పలు విశేషాలు. 11:18AM ► రామాయపట్నం స్కూల్ పిల్లలతో కలిసి వందేమాతర గీతాలాపనలో సీఎం జగన్, ఇతరులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలతో ఫొటో దిగారు. ► కేవలం ఏపీకి మాత్రమే కాదు.. పక్కనున్న రాష్ట్రాలకు.. మొత్తం దేశం అభివృద్ధికి ఉపయోగపడనుంది. ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు వ్యాపార, వాణిజ్య సేవలు సులభతరం కానున్నాయి. 11:16AM ► జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించిన సీఎం జగన్. ► మంత్రులు, స్థానిక నేతలు, అధికారులతో కలిసి పోర్టు ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించిన సీఎం జగన్. 36 నెలల్లోనే తొలిదశ పనులు ► రామాయపట్నం పోర్టు తొలిదశ పనులను 36 నెలల్లోనే పూర్తి చేయిచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ► ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు హైవేకి కేవలం నాలుగున్న కిలోమీటర్ల దూరంలోనే పోర్టు. 11:06AM ► ప్రగతి తీరంగా.. రామాయపట్నం పోర్టు పనుల ప్రారంభంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాసుల కల నెరవేరనుంది. 10:53AM ► రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్ రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. 10:30AM ► నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు హెలిప్యాడ్‌కు చేరుకొన్న సీఎం వైఎస్ జగన్. స్వాగతం పలికిన మంత్రులు ,ఎమ్మెల్యేలు, అధికారులు. 9:43 AM ► రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్. సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు ఉన్నారు. ► రామాయపట్నం పోర్టుతో ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు రానుంది. ► సహాయ, పునరావాసానికి రూ. 175.04 కోట్ల వ్యయం భరించనుంది ప్రభుత్వం. ► రెండు దశల్లో రూ.10,640 కోట్లతో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి రామాయపట్నం చేరుకుంటారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించి.. మధ్యాహ్నాం తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. ► పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. రెండు దశల్లో 19 బెర్త్‌లతో.. రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన కీలక పర్యావరణ అనుమతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే తెచ్చింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏరియా అనుమతులతో పాటు అటవీ అనుమతులను కూడా సాధించింది. ► రామాయపట్నం ఓడ రేవును మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్‌లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తొలిదశలో నాలుగు బెర్త్‌లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచింది. ► రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి. ► ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి. రామాయపట్నం పోర్టుతో ప్రయోజనాలు ► వెనకబడ్డ ప్రాంతంలో అభివృద్ధికి ఊతం కానుంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో పోర్టు నిర్మాణం జరగనుంది. ► పోర్టు తొలిదశ పనులు 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 3736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు చేపట్టనున్నారు. ► రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద ప్రాజెక్టును రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించనుంది. ► తొలిదశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం. ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతి. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం ► రెండో దశలో 138.54 మిలియన్ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం. ► ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ, రవాణా సేవల్లో కీలకం కానున్న రామాయపట్నం పోర్టు. ► తెలంగాణ, ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సుభతరం. ► రూ.3500 కోట్లతో మొత్తంగా 9 షిఫింగ్ హార్బర్ల నిర్మాణం. ► ఫేజ్–1లో 4 హార్బర్ల నిర్మాణం.జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలిదశలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ► రెండో దశ కింద మొత్తం 5 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. బుడగట్ల పాలెం, పూడిమడక, బియ్యపు తిప్ప, వాడరేవు, కొత్తపట్నంల్లో రెండోదశలో షిఫింగ్ హార్బర్ల విస్తృతంగా ఉపాధి అవకాశాలు. పెరగనున్న ఆర్థికవ్యవస్థ. ► వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ► చంద్రబాబు ఉత్తుత్తి పునాది రాయి గత ఎన్నికలకు ముందు 2019 జనవరి 9వ తేదీన భూ సేకరణ చేయకుండా, పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రామాయపట్నం పోర్టుకు ఉత్తుత్తి పునాది రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. కానీ, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఓడరేవులను చేపట్టడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ► ఓడరేవుల నిర్మాణం ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రామాయపట్నానికి అవసరమైన 255.34 ఎకరాల సేకరణను ప్రభుత్వం చేపట్టింది. మరోపక్క ఓడరేవు నిర్మాణంతో నిర్వాసితులయ్యే పరిసర గ్రామాల ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను ప్రారంభించి రూ.175.04 కోట్లు వ్యయం చేస్తోంది. ► రామాయపట్నం ఓడ రేవు కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఓడరేవుకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేయడంతో పాటు కీలకమైన పర్యావరణ, అటవీ అనుమతులన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే సాధించింది. అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భూమి పూజ చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. -
పండుగలా వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీలు
సాక్షి, అనకాపల్లి/సాక్షి ప్రతినిధి ఒంగోలు/సాక్షి రాయచోటి: వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి ప్లీనరీలు బుధవారం అనకాపల్లి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల ఉత్సాహం నడుమ పండుగ వాతావరణంలో ప్లీనరీలు జరిగాయి. వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో పెందుర్తిలో నిర్వహించిన ప్లీనరీలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి విశాఖ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, ప్లీనరీ పరిశీలకుడు చొక్కాకుల వెంకట్రావ్, పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు పేర్నమిట్టలో నిర్వహించిన ప్లీనరీకి టీటీడీ బోర్డు సభ్యుడు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ అధ్యక్షత వహించగా.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ ప్లీనరీ పరిశీలకుడు తూమాటి మాధవరావు, ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, అన్నా వెంకటరాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో నిర్వహించిన ప్లీనరీలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నవాజ్‌బాషా, ప్లీనరీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖానమ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. హోంమంత్రి తానేటి వనిత కాన్వాయ్‌పై దాడికి యత్నించారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచారం బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారు అద్దాలు పగులగొట్టేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. టీడీపీ కార్యకర్తల ఆందోళనలతో రహదారిపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హోంమంత్రి కాన్వాయ్ పై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. చదవండి: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం 17 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు కాన్వాయ్‌పై దాడి ఘటనలో 17 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
గుర్రంతో డ్యాన్స్ చేయించిన బాలయ్య.. వీడియో వైరల్
నందమూరి బాలకృష్ణ కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకల్లో సందడి చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా బాలయ్య భార్య వసుంధరతో కలిసి తన సోదరి పూరందేశ్వరి ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ప్రకాశంలో జిల్లాలోని కారంచేడులో భోగి సంబరాలు జరుపుకున్న బాలయ్య ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా బాలయ్య గుర్రం ఎక్కి హంగామా చేశారు. అంతేగాక గుర్రంతో కలిసి ఆయన స్టెప్పులు వేయించారు. కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో లోకేశ్వరి, ఉమామహేశ్వరి సహా బంధువులు పాల్గొన్నారు. ఈ ఏడాది భోగి పండగను తన అక్క ఇంట్లో జరుపుకోవడం కోసం బాలకృష్ణ తన భార్య తో కలిసి గురువారం ప్రకాశం జిల్లా కారంచేడుకు చేరుకున్నారు. ఇక బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన బంధువులు గురువారం కారంచేడుకు చేరుకున్నారు. బాలకృష్ణను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీ సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఇంటిలోపలకు ఎవరిని అనుమతించలేదు. -
మూవీ టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయం మంచిదే: టీఎఫ్‌పీసీ అధ్యక్షుడు
సాక్షి, ఒంగోలు: పెద్ద హీరోలు, నిర్మాతల ధన దాహంతో తెలుగు సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. ప్రేక్షకులపై అధిక భారాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా–అందరికీ అందుబాటులో సినిమా టికెట్లు’ అనే అంశం మీద ఒంగోలు వీకేబీ ఫంక్షన్ హాల్లో బుధవారం చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సినీ పెద్దలు కొందరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లను లీజుకు తీసుకుని సాధారణ థియేటర్లకు సైతం మలీ్టప్లెక్స్ కలరింగ్ ఇచ్చి అడ్డగోలుగా రేట్లు పెంచి ప్రేక్షకులను దోచుకుంటున్నారని ఆరోపించారు. షోలను నియంత్రించడం, ఆన్లైన్లో టికెట్ల విక్రయం లాంటి ప్రభుత్వ నిర్ణయాలను ప్రేక్షకులు సంతోషంగా స్వాగతిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హర్షిస్తోందన్నారు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనను పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించారు. చిత్ర నిర్మాత సి.ప్రవీణ్‌కుమార్, సినీ ప్రదర్శకులు అయినాబత్తిన ఘనశ్యాం, షాజహాన్, ఎండీ సాహుల్, సూపర్‌బజార్ చైర్మన్ తాతా బద్రి, షౌకత్ ఆలీ, వరదా నాగేశ్వరరావు, పావులూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాశం: చీమకుర్తిలో పావురానికి రబ్బర్ ట్యాగ్
-
పావురం కలకలం.. కాలికి జియోట్యాగ్.. గూఢచర్యం కోసమేనా?
సాక్షి, ప్రకాశం: చీమకుర్తి మండలంలోని నెహ్రూనగర్‌లో రబ్బరు ట్యాగ్‌తో కూడిన పావురం కలకలం రేపింది. స్థానికంగా ఉన్నఅపార్ట్‌మెంట్‌లో నాగరాజు అనే యువకుడు పావురాన్ని గమనించాడు. దాని పాదానికి చైనా అక్షరాలతో రబ్బర్‌ట్యాగ్‌ను గుర్తించాడు. దానికి అడ్డంగా 2019, నిలువుగా 2207 కోడ్స్ ఉన్నాయి. అయితే, అతని ఇంట్లో తరచుగా పావురాలు వస్తుంటాయి. ఈ క్రమంలో.. నాగరాజు ఒక పావురం కాలికి కొత్తగా ఏదో ట్యాగ్ ఉండటాన్ని గమనించాడు. వెంటనే స్థానిక వీఆర్వో, పోలీసులకు సమాచారం అందించాడు. వీఆర్వో సంఘటన స్థలానికి చేరుకుని పావురాన్ని పరిశీలించారు. కాగా, గతంలో కూడా ఒడిస్సా రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. కేంద్రపడ జిల్లా మార్ సగై పీఎస్ పరిధిలో దశరథ్‌పుర్, పూరి జిల్లా హరికృష్ణాపూర్‌లోకూడా ఇదే తరహా పావురాలు పట్టుబడ్డాయి. ఇక్కడ పట్టుబడ్డ పావురాల కాలికి వీహెచ్ ఎఫ్ వైజాగ్ 19742021 ముద్రించి ఉన్నాయి. గత సోమవారం పూరి జిల్లాలో లభించిన పావురం. ఒక పాదానికి చైనా అక్షరాలతో కూడిన అల్యూమినియం, మరో కాలికి 37 కోడ్ అంకెలతో కూడిన ట్యాగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. చదవండి: గుట్టుగా వ్యభిచారం.. ఇల్లు అద్దెకు తీసుకుని.. -
ఆర్టీసీ బస్సుకు నిప్పంటించిన యువకుడు!
సాక్షి, కనిగిరి(ప్రకాశం): ఆర్టీసీ బస్సుకు ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్లో గురువారం జరిగింది. వివరాలు.. వెలిగండ్ల మండలం మొగళ్లూరుకు చెందిన ఏడుకొండలు అనే యువకుడు పామూరు బస్టాండ్ సెంటర్లో కనిగిరి నుంచి పామూరు వెళ్లే ఆర్టీసీ బస్సుకు పెట్రోల్ పోసి నిప్పటించాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలు అదుపు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఏడుకొండలును అదుపులోకి తీసుకున్నారు. అనుకోని ఘటనతో బస్సులో ఉన్న 28 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై ఎస్ఐ రామిరెడ్డిని వివరణ కోరగా.. విచారణలో యువకుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, త్వరలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, వాటి ధరలు తగ్గిస్తుందని.. ఇలా పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడని తెలిపారు. అతనికి మతిస్థిమితం సరిగా లేనట్లు అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఎస్ఐ చెప్పారు. -
స్వాతంత్ర్యం రాకపూర్వం నుంచి నేటికీ నిరంతర అన్నదానం..
సాక్షి, వేటపాలెం(ప్రకాశం): గొల్లపూడి రాధాకృష్ణయ్య దాతృత్వం.. ముందుచూపు. 88 ఏళ్లగా పేదవిద్యార్ధుల ఆకలి తీరుస్తుంది. స్వాతంత్య్రంరాక పూర్వమే ప్రారంభించిన హాస్టల్ నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కష్టపడి చదువు కొనే విద్యార్ధులకు కులమతాలకు అతీతంగా పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పానికి భవిష్యత్‌లోను డోకాలేని విదంగా శాశ్వత నిధి ఏర్పాటు చేసిన రాధాకృష్ణయ్యకు విద్యార్ధులు నిత్యం జ్యోహార్లు అర్పిస్తుంటారు. వేటపాలెంలో 1921 సంవత్సరంలో ఏర్పాటు చేసిన రావుసాహెబ్ బండ్ల బాపయ్య శెట్టి పాఠశాలకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్ధులు వస్తుండేవారు. రవాణా సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేక భోజనం కోసం ఇబ్బందులు పడుతుండేవారు. దీన్ని గొల్లపూడి రాధాకృష్ణయ్య గమనించారు. పేద విద్యార్ధులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దుస్తులు వ్యాపారం నిర్వహించే ఈయన మద్రాసులోని షావుకారు పేటలో ఉన్న హిందూ థీయోసాఫికల్ స్కూల్ ప్రధానోపాద్యాయుడు రంగస్వామి అయ్యర్ ప్రేరణతో 1933 సంవత్సరంలో మొదటి సారిగా వేటపాలెంలో బిబిహెచ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు బోజనం సౌకర్యం కల్పించారు. మొదటి హాస్టల్ నిర్వహణకు తన వ్యాపారం నుంచి నిధులు సమకూర్చేవారు. కానీ తన అనంతరం కూడా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఆలోచన ట్రష్టును ఏర్పాటు చేసేలా చేసింది. శాశ్వత భవనం, పర్నిచర్‌తో పాటు మూలనిధిని కూడా ఏర్పాటు చేయడంతో పాటు 88 సంవత్సరాలుగా విద్యార్ధులు కడుపు నిండా బోజనం తింటున్నారు. రాధాకృష్ణయ్య అనంతరం ఆయన దత్తపుత్రుడు గొల్లపూడి సీతారం 1977లో హాస్టల్ నిర్వహణ బాద్యతలను చేపట్టి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. భోజనం ఎవరికి పెడతారంటే... ప్రతి ఏడాది బండ్ల బాపయ్య శెట్టి కళాశాల్లో అడ్మిషన్లు జరుగుతాయి. కళాశాల్లో చేరిన విద్యార్థులకు హాస్టల్ నిర్వాహకులు ఒక పద్యం నేర్పిస్తారు. ఈ పద్యం తప్పుపోకుండా చెప్పిన పేద విద్యార్థులను గుర్తించి వారికి బోజనం కోసం టోకేన్లు అందిస్తారు. ఈ టోకెన్ పొందిన విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం పాఠశాలకు వచ్చే ముందు వారు పొందిన టోకెన్లను హాష్టల్ వద్ద ఏర్పాటు చేసిన బాక్సులో వేసిరావాల్సి ఉంటుంది. టోకెన్లు ఆదారంగా హాస్టల్లో బోజనం తయారుచేస్తారు. ప్రతి రోజు 6 నుంచి ఇంటర్మీడియట్ చదువుకోనే 100 నుంచి 150 మంది విద్యార్థులు హాష్టల్లో భోజనం చేస్తుంటారు. బోజనానికి ముందుగా ప్రార్ధన చేయాల్సి ఉంటుంది. -
రూ.5.60 కోట్లకు మహిళ టోకరా
చినగంజాం: చీటీల పేరుతో ఓ మహిళ తమను మోసం చేసిందంటూ ఆంధ్రప్రదేశ్‌లోని చినగంజాం మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన పలువురు బాధితులు శనివారం చినగంజాం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. సుమారు 40 మందికి పైగా బాధితులు కుటుంబ సభ్యులతో సహా పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీస్ అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సోపిరాల గ్రామానికి చెందిన మహిళ సుమారు రూ.5.60 కోట్ల నగదు తమకు చెల్లించాల్సి ఉందని న్యాయం చేయాలని కోరారు. సీఐ పీ సుబ్బారావు, ఎస్ఐ పీ అంకమ్మరావులు అందించిన సమాచారం ప్రకారం మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన పోలకం ఝాన్సీ లక్ష్మి... 25 ఏళ్ల నుంచి గ్రామంలో చీటీపాటలు నిర్వహిస్తోంది. చీటీపాటలపై వచ్చే కమీషన్‌తో పాటు, రొక్కంగా మరి కొంత సొమ్ము వడ్డీకి తీసుకొని, వారికి వడ్డీ కడుతోంది. అయితే గత ఏడాది నుంచి వడ్డీలు చెల్లించక, అందరి చీటీ పాటలు తానే పాడుకొని సుమారు రూ.5.60 కోట్ల నగదు వసూలు చేసిందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. చదవండి: అథ్లెట్ ద్యుతి చంద్ ఫిర్యాదు.. ‘ఫోకస్ ప్లస్’ ఎడిటర్ అరెస్టు చీటీ పాడిన లబి్ధదారులకు సైతం డబ్బులు చెల్లించక కొంతకాలంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. బాధితులకు ఎటువంటి తేదీ, ఇతర వివరాలు నమోదు చేయకుండా ఖాళీగా ఉన్న ప్రామిసరీ నోటుపై కేవలం సంతకాలు చేసి ఇచ్చి వారికి నమ్మకం కలిగేలా చేసింది. ఒక్కొక్క బాధితునికి సుమారు రూ.10 లక్షలకు పైగా నగదు ఇవ్వకుండా ఇంటి చుట్టూ తిప్పుకుంటోంది. కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురవుతున్న చీటీ సభ్యులు తమ నగదు గురించి అడుగగా ఆమె తమ కుమార్తెకు, కుమారునికి నగదు ఇచ్చినట్లు, వీరితో పాటు తమ బంధువులకు నగదు ఇచ్చినట్లు బాధితుల వద్ద ఒప్పుకొని వాయిదాల పద్ధతిలో బాకీ తీరుస్తానని నమ్మబలుకుతూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో తనకు సంబంధించిన గృహం, ఇతర ఆస్తులను బంధువుల పేరుతో రిజి్రస్టేషన్ చేయించడంతో అనుమానం వచ్చిన బాధితులు శనివారం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితుల గోడు విన్న ఇంకొల్లు సీఐ పీ సుబ్బారావు నిందితురాలిని విచారించిన అనంతరం కేసు నమోదు చేశామని, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. చదవండి: రూ. కోట్ల విలువైన భూమికి స్కెచ్.. బీజేపీ నేత అరెస్టు -
చిన్నారి మృతిపై ఆరోపణలు అవాస్తవం: కలెక్టర్
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో రాజుపాలెం పాఠశాలలో చిన్నారి మృతిపై ఆరోపణలు అవాస్తవమని జిల్లా కలెక్టర్ అన్నారు. స్కూల్ లేని ఆదివారం రోజు ఘటన జరినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థి ఆడుకోవడానికి అక్కడకి వెళ్లినట్లు తెలిపారు. ఆ స్కూల్ భవనం వినియోగంలోనే లేదన్నారు. నాడు-నేడు కింద ఆ స్కూల్‌ను తీసుకోలేదని కలెక్టర్ వెల్లడించారు. పాడైపోయిన భవనాలను గుర్తించి కూల్చివేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. చదవండి: పసికందును ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని మహిళ -
ప్రకాశం: బొలేరో నుంచి జారిపడి నలుగురు మృతి
ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలేరో వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి చెందారు. కొనకలమిట్ల మండలం గార్లదిన్నె వద్ద బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెదదోర్నల నుంచి పొదిలి మండలం, అక్క చెరువుకు పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బొలేరో వాహనంలో 12 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. బొలెరో గూడ్స్ వాహనం వెనుక డోర్ ఊడిపోవడంతో రోడ్ మీద పడి నలుగురు మృతి చెందారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చదవండి: రక్షా బంధన్ రోజునే అక్కాతమ్ముడి మృతి.. -
ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో.. పెళ్లి దుస్తుల్లోనే..
పొదిలి/దర్శి టౌన్: అది పొదిలిలోని ఆంజనేయ స్వామి ఆలయం. వివాహ వేడుక సందర్భంగా సోమవారం ఆలయ ఆవరణ మొత్తం వధూవరుల బంధువులు, అతిథులతో సందడిగా ఉంది. కళ్యాణ ఘట్టం పూర్తి చేసేందుకు వేద పండితుడు మంత్రాలు ఉచ్ఛరిస్తున్నాడు. కాసేపు ఆగితే పెళ్లి తంతు ముగిసేది! ఇంతలో పిలవని పేరంటానికి వచ్చిన చుట్టాల్లా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ‘‘పోలీసులు ఎందుకొచ్చారబ్బా..’’ అని అంతా సంశయించేలోపే పెళ్లి కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. దర్శి ఎస్సై చంద్రశేఖర్ కథనం మేరకు.. దర్శి మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన రవీంద్రబాబు అనే యువకుడు బేల్దారి పనులకు వెళ్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మేనమామ కూతురు సరస్వతిని ప్రేమించాడు. వీరి పెళ్లి విషయమై రెండు కుటుంబాల మధ్య ఇటీవల సంప్రదింపులు నడిచాయి. చదవండి: యువతలో ఇడియట్స్ అయితే డిగ్రీ చదువుతున్న కూతురికి బేల్దారి పనికి వెళ్లే రవీంద్రతో వివాహం చేసేందుకు యువతి తల్లిదండ్రులు ఇష్టపడలేదు. దీంతో యువకుడి తల్లిదండ్రులు పొదిలి మండలం మాదాలవారిపాలెం గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు. సోమవారం పొదిలిలోని ఆంజనేయస్వామి ఆలయంలో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21వ తేదీన తనకు తాళి కట్టిన యువకుడు పొదిలిలో మరొకరిని వివాహం చేసుకుంటున్నాడని, తనను మోసం చేస్తున్నాడని సరస్వతి దర్శి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. పొదిలి ఎస్సై శ్రీహరితో కలిసి వివాహం జరుగుతున్న ఆలయం వద్దకు వెళ్లారు. పరిస్థితిని పెళ్లి కుమార్తె తరఫు వారికి వివరించారు. అనంతరం రవీంద్రను పెళ్లి దుస్తుల్లోనే దర్శి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దర్శి ఎస్సై తెలిపారు. చదవండి: దుప్పిని మింగిన కొండచిలువ -
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని.. భార్య, కుమార్తెపై పెట్రోల్ పోసి
కందుకూరు రూరల్: మానసిక దివ్యాంగురాలైన కుమార్తెను 27 ఏళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేశారు. భర్త చెడు వ్యసనాలకు బానిసైనా కూలీనాలి చేసుకొని కుమార్తెతో జీవనం సాగిస్తోందా తల్లి. భార్యపై అనుమానానికి తోడు మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఆ భర్త మృగాడిగా మారాడు. 30 ఏళ్లు కలిసి జీవించిన భార్యను, మానసిక దివ్యాంగురాలైన కుమార్తెను మానవత్వం మరిచి పెట్రోలు పోసి తగులబెట్టాడు. చికిత్స పొందుతూ కుమార్తె ప్రాణాలు వదలగా, భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరెడ్డికి అదే గ్రామానికి చెందిన సుశీలతో 30ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుమార్తె ప్రియాంక (27) మానసిక దివ్యాంగురాలు. శ్రీనివాసులరెడ్డి బేల్దారి పనులు చేస్తుంటాడు. సుశీల గ్రామంలో కూలి పనులకు వెళ్తుంటుంది. బిడ్డ పుట్టిన కొంత కాలం నుంచి భార్య, భర్త మధ్య గొడవలు జరుగుతుండేవి. భార్యపై అనుమానం కూడా తలెత్తింది. గొడవల కారణంగా శ్రీనివాసరెడ్డి కొన్నాళ్లు భార్య, కూతురిని వదిలి హైదరాబాద్, బెంగళూరు వెళ్లి బేల్దారి పనులు చేసుకుంటుండేవాడు. తిరిగి వచ్చినప్పుడుల్లా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని ఘర్షణలకు దిగేవాడు. ఈ నేపథ్యంలో భార్య, భర్తల మధ్య గొడవలు పడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. ఇలా తాగుడుకు అలవాటు పడిన శ్రీనివాసరెడ్డి డబ్బుల కోసం, భార్యపై అనుమానంతో భార్యను, కూతురిని ఇంట్లో పెట్టి తలుపువేసి వెళ్తుంటాడు. ఈ విధంగానే శనివారం కూడా చేశాడు. తిరిగి రాత్రి భార్యతో గొడవపడి డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని లుంగీతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో వారించి చుట్టు పక్కల వారు సర్దిచెప్పారు. ఈ గొడవలు రోజు ఉండేవేనని తల్లీ కూతుళ్లు ఇంటి ముందు దోమతెర వేసుకొని నిద్రిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి నిద్రపోయేందుకు మిద్దె మీదకు వెళ్లాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆదివారం తెల్లవారు జామున మిద్దెమీద నుంచి తల్లీ కూతుళ్లపై పోశాడు. నిద్రలో ఉన్న తల్లి ఏదో కారుతుందని మేల్కొనే లోపు మంటలు వచ్చాయి. పెద్దగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి ఆర్పారు. ఏం జరుగుతుందో తెలియని కూతురు శరీరం 80 శాతం కాలిపోయింది. తల్లి శరీరం 30 శాతం కాలింది. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి కుమార్తె ప్రియాంక మృతి చెందింది. కాలిన గాయాలతో తల్లి చికిత్స పొందుతోంది. -
చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం.. డబ్బు కోసం కన్నబిడ్డనే కిడ్నాప్!
కందుకూరు: వ్యసనాలకు బానిసై డబ్బు కోసం కన్నబిడ్డనే ఎత్తుకెళ్లి బెదిరింపులకు దిగాడు ఓ తండ్రి. డబ్బు ఇవ్వకపోతే బిడ్డను చంపి తాను చస్తానని కుటుంబ సభ్యులను బెదిరించాడు. వారు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కసాయి తండ్రి బారి నుంచి బాలుడిని కాపాడి తల్లికి అప్పగించారు. ఈ సంఘటన పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. కందుకూరు పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కండె శ్రీనివాసులు ఆ వివరాలు వెల్లడించారు. చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన పల్నాటి రామకృష్ణారెడ్డి, ఉమ దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల వయసున్న బాలుడు శర్వాన్రెడ్డి ఉన్నాడు. రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో చెరువుకొమ్ముపాలెం వచ్చి ఇంటి వద్దే ఉండి విధులు (వర్క్ ఫ్రమ్ హోం) నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మద్యం, జూదం, వ్యభిచారం వంటి వ్యసనాలకు రామకృష్ణారెడ్డి బానిసయ్యాడు. దాదాపు రూ.20 లక్షలకుపైగా అప్పు చేశాడు. అప్పు తీరే మార్గం లేకపోవడంతో డబ్బు కోసం గత నెల 28వ తేదీ తన మూడేళ్ల బాలుడు శర్వాన్రెడ్డిని బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ.20 లక్షలు డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే బాలుడికి మందు పోసి చంపుతానని, తాను కూడా అదే మందు తాగి చనిపోతానని బెదిరింపులకు దిగాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు రామకృష్ణారెడ్డి ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో గత నెల 30వ తేదీ పొన్నలూరు పోలీస్‌స్టేషన్‌లో భార్య ఉమ ఫిర్యాదు చేసింది. ఈ విషయం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ దృష్టికి వెళ్లడంతో ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కందుకూరు పట్టణంలోనే స్వర్ణ ప్యాలెస్ లాడ్జిలో రామకృష్ణారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. కందుకూరు డీఎస్పీకి సమాచారం ఇచ్చారు. దీంతో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీరామ్, పొన్నలూరు ఎస్సై రమేష్‌బాబు లాడ్జికి చేరుకుని మద్యం తాగి మత్తుగా పడుకుని ఉన్న రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రి పక్కనే ఉన్న శర్వాన్రెడ్డిని తల్లి ఉమకు అప్పగించారు. రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
రైతులకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి: బాలినేని శ్రీనివాసరెడ్డి
సాక్షి,ఒంగోలు అర్బన్: రైతులు సంతోషంగా ఉంటే ప్రజలంతా సంతోషంగా ఉంటారని భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను అన్నీ రకాలుగా ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం భవనంలో శుక్రవారం నిర్వహించిన వ్యవసాయ సలహామండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. చట్ట ప్రకారం రాష్ట్రానికి అందాల్సిన నీటి వాటా అందడంలేదని, అక్రమంగా తెలంగాణకు తీసుకుపోతుంటే ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు ఎందుకు సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించడని అన్నారు. ఓటుకు నోటు కేసు తిరగతోడతారని చంద్రబాబుకు భయం అన్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఆయన హయాంలో రైతులకు ఏం చేశారో, నీటి వాటాలపై తెలంగాణ వైఖరిపై మాట్లాడాలని సవాల్ విసిరారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ప్రకాశం జిల్లా గురించి మాట్లాడితే రాయలసీమలో వ్యతిరేకత వస్తుందని, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలతో జిల్లా ఎడారిగా మారుతుందని మాట్లాడించారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, రైతులకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు. జిల్లాలో రైతుల గురించి కాని, నీటి సరఫరా గురించి కాని మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హైదరాబాదులో బాబుని కలిసి స్క్రిప్ట్ తీసుకొచ్చి మీడియా ముందు చదివారన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ధైర్యం ఉంటే మీడియా సమావేశం పెట్టి మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అన్నీ జిల్లాలు సమానమేనని, అన్నీ జిల్లాలకు సమ న్యాయం జరుగుతుందని చెప్పారు. నీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించి నీటి పంపకాల్లో న్యాయం చేస్తే మంచిదన్నారు. నీటి పంపకాల్లో రాష్ట్రానికి న్యాయం జరగాలన్నారు. ప్రాంతీయ వాదం రెచ్చగొడుతున్న చంద్రబాబు: మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాయలసీమ, ప్రకాశం ప్రాంతాలకు మధ్య చంద్రబాబు ప్రాంతీయ వాదం రెచ్చగొడుతున్నారని అన్నారు. చట్ట బద్ధంగా రాష్ట్రానికి అందాల్సిన నీటిలో ఒక్క చుక్క కూడా ఎక్కువ అవసరం లేదని, అదేవిధంగా ఒక్క చుక్క తగ్గినా ఊరుకునేది లేదన్నారు. రాయలసీమ ప్రజలకు నీరు ఇవ్వకూడదా... రాయలసీమ రైతులకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదా చంద్రబాబు చెప్పాలన్నారు. జిల్లా ఎడారి అవుతుందని మాట్లాడించడం అన్యాయమన్నారు. ఆయన హయాంలో జిల్లాకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది చివరకు మొదటి టన్నెల్ ప్రారంభించి నీటి విడుదల చేస్తామన్నారు. రెండో టన్నెల్ పనులతో పాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజి, పునరావాస కాలనీల పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. మంత్రులతో పాటు వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి ఉన్నారు. -
ఎన్జీటీని ఆశ్రయించిన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం రైతులు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం రైతులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ని ఆశ్రయించారు. పర్యావరణ అనుమతులు వచ్చే వరకు తాగునీటి ప్రాజెక్ట్‌గానే ఉంచాలని కోరారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. -
కడుపుకోత మిగిల్చి వెళ్తారా.. మాకు దిక్కెవరు..
స్నేహం గుండె బలం.. మనసుకు ధైర్యం.. త్యాగానికి ప్రతిఫలం.. జీవితం తుది ఘడియలోనూ దాని విలువ ఆణిముత్యం. ముగ్గురు స్నేహితులు ఇప్పుడు అమరులయ్యారు. బతికుండగానే కాదు చావు కూడా మమ్మల్ని వేరు చేయలేదని నిరూపించారు. వారి పేర్లు స్నేహానికి గుర్తుగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి. చీరాల టౌన్: ఎదురు చూపులు నిరాశను మిగిల్చాయి. బతికి వస్తారునుకున్న కన్నవారి నమ్మకం మోడిబారింది. ముగ్గురు స్నేహితులు మృతదేహాలను చూసిన గవినివారిపాలెం శోకసంద్రంలో మునిగిపోయింది. మూడురోజల క్రితం యువకులు బాపట్ల కొత్త ఓడరేవు తీరంలో గల్లంతు కాగా సురేష్ (23) మృతదేహం శనివారం సాయంత్రం బాపట్ల తీరానికి కొట్టుకొచ్చింది. ఆర్మీ జవాన్ రామకృష్ణ (24), వల్లు బ్రహ్మయ్య (23) మృతదేహాలు ఆదివారం బాపట్ల రూరల్ పరిధిలోని కొత్త ఓడరేవు తీరానికి చేరాయి. బాపట్ల రూరల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. మిన్నంటిన రోదనలు ప్రాణ మిత్రులు రామకృష్ణ, బ్రహ్మయ్య, సురేష్‌ల మరణం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం గవినివారిపాలెంకు తీసుకువచ్చారు. ఆర్మీ జవాను రామకృష్ణకు నెల క్రితమే వివాహం జరగ్గా సెలవుల అనంతరం ఆదివారం విధుల్లో చేరాల్సి ఉంది. కానీ విగతజీవిగా పడి ఉండటంతో తనను ఒంటరి చేసి వెళ్లిపోయావా అంటూ రామకృష్ణ భార్య గాయత్రి గుండెలవిసేలా రోదించింది. అండగా ఉంటాడనుకున్న కుమారులు అర్ధాంతరంగా చనిపోవడంతో ఇక తమకు దిక్కెవరు.. మాకు కడుపుకోత మిగిల్చి వెళ్తారా...అంటూ బ్రహ్మయ్య, సురేష్ కుటుంబ సుభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాలు దెబ్బతినడంతో అంత్రక్రియలను త్వరగా పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. అండగా ఉంటాం ముగ్గురు ఒకేసారి తనువు చాలించడం బాధాకరమని శాసన సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. బాపట్ల ఏరియా వైద్యశాల వద్ద మృతదేహాలను పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడవద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీమంత్రి పాలేటి రామారావు, నాయకులు నివాళులర్పించారు. -
గ్రానైట్ అక్రమార్కులపై విజిలెన్స్ పంజా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ హయాంలో గ్రానైట్ అక్రమ రవాణా అడ్డూ అదుపూ లేకుండా సాగిపోయింది. అప్పట్లో ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ క్వారీల నిర్వాహకులు, వ్యాపారులు అక్రమాలకు తెరలేపగా.. టీడీపీ నాయకులు యథేచ్ఛగా అక్రమ దందా నిర్వహించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ గనులను అడ్డగోలుగా దోచేశారు. క్వారీల నిర్వాహకులు, లీజుదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.కోట్లకొద్దీ రాయల్టీని ఎగ్గొట్టారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించటంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా అక్రమాలను వెలుగులోకి తీశారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. 155 క్వారీల్లో అక్రమాలు ఇప్పటివరకు జరిపిన విచారణలో 155 గ్రానైట్ క్వారీల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు తేలింది. వీటి నిర్వాహకులకు రూ.3,527 కోట్లు జరిమానా విధించేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు గ్రానైట్ ఫ్యాక్టరీలు, పాలిషింగ్ యూనిట్లపైనా విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. వీరినుంచి కూడా జీఎస్టీ, రాయల్టీ రూపంలో మరో రూ.2 వేల కోట్లు జరిమానా విధించేందుకు సన్నద్ధం కాగా.. గ్రానైట్ క్వారీ లీజుదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విజిలెన్స్ విచారణకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించిన వారిపై 100 పైగా కేసులు నమోదు చేయించి ఆట కట్టించారు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ఎగ్గొట్టడం వెనుక ప్రకాశం జిల్లాలోని భూగర్భ గనుల శాఖ (మైనింగ్) అధికారుల పాత్ర కూడా ఉంది. దాదాపు రాయల్టీ రూపంలో రూ.వెయ్యి కోట్లకు పైగా ఎగ్గొట్టినట్టు విజిలెన్స్ లెక్కలను బట్టి అర్థమవుతోంది. అక్రమాలకు చెక్ పెడతాం ఎవరైనా గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడితే సహించేది లేదు. క్వారీల్లోంచి బయటకు తీసిన ప్రతి రాయి రవాణా చేసేప్పుడు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. ప్రభుత్వ ఆదాయానికి ఏ ఒక్కరైనా గండి కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. గ్రానైట్ రవాణాపై ఎప్పటికప్పుడు విజిలెన్స్ నిఘా ఉంటుంది. – కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, ఏఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చదవండి: గోదావరి డెల్టాలకు పోల‘వరం’ -
కోడలిని వేధించిన పాపం..!
గిద్దలూరు: తండ్రిని కడతేర్చిన కుమారుడిని అరెస్టు చేసినట్లు సీఐ ఎండీ ఫిరోజ్ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. మండలంలోని దంతెరపల్లెలో ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి మోడి భాస్కర్‌ను హత్య చేసింది అతని కన్న కొడుకు రంగప్రసాద్..అని తేలింది. హత్యకు గురైన భాస్కర్ కొంతకాలంగా కుమారుడి భార్యను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్త దృష్టికి తీసుకెళ్లడంతో రంగప్రసాద్ తండ్రిని పలు మార్లు హెచ్చరించినా ఆయన ప్రవర్తనలో మార్పురాలేదు. ఆగ్రహించిన కుమారుడు తన తండ్రి నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికాడు. బలమైన గాయం కావడంతో భాస్కర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కుమారుడు తన తండ్రి కరోనాతో మరణించాడని గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేశాడు. గ్రామంలో పోలేరమ్మ ఉత్సవాలు ఉన్నాయని, మృతదేహం గ్రామంలో ఉండకూదంటూ తన సమీప బంధువుల సహకారంతో రాత్రికి రాత్రి మృతదేహాన్ని దహనం చేసే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దహనం అవుతున్న మృతదేహాన్ని మధ్యలో ఆపేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా హత్యగా తేలడంతో కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు విచారించగా భాస్కర్‌ను ఆయన కుమారుడు రంగప్రసాద్ హతమార్చినట్లు తేలింది. రంగప్రసాద్‌తో పాటు మృతదేహాన్ని దహన సంస్కారాలు చేసేందుకు సహకరించిన వెంకటాపురం గ్రామానికి చెందిన మోడి రంగనాథం, రంగస్వామి, ఆదిగంగయ్యలను కె.బయనపల్లె క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండు విధించారు. చదవండి: హైవేలో లారీ పార్క్ చేస్తే అంతే..! -
రూ.16 కోట్ల ఇంజక్షన్.. గుండెల్ని పిండేసే కథ
చిత్రంలో పచ్చటి పచ్చికపై ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను చూస్తే ముచ్చటేస్తుంది కదా.! కానీ ఆ నవ్వుల వెనుక గుండెల్ని పిండేసే వ్యథ దాగి ఉంది. తప్పటడుగులు కూడా వేయలేని ఆ చిన్నారుల పరిస్థితిని తలుచుకుంటూ వారి తల్లిదండ్రులు మౌనంగా రోదిస్తున్నారు. ‘ఈ బాధ ఇంకెన్నాళ్లు.. అందరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం’ అని నిర్ణయించుకున్నారు. కానీ వారిలో ఎక్కడో ఓ ఆశ.. పిల్లలకు వైద్యం చేయించాలన్న తపన.. ఆత్మహత్య ఆలోచనను విరమించుకునేలా చేశాయి. సాక్షి, ఒంగోలు: ఒంగోలుకు చెందిన దండే వినయ్‌కుమార్ బిల్డర్, ఇంటీరియర్ డెకరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన భార్య వేదవతితో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్ మకాం మార్చారు. అక్కడ వీరికి లాసిత్ అయ్యన్ జన్మించాడు. ఆరు నెలలు గడిచినా కదలిక లేదు. పెద్దల సూచనతో ఏడాది వరకు వేచి చూశారు. కనీసం పక్కకు కూడా పొర్లకపోతుండటంతో ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. అయినా ఫలితం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని రెయిన్ బో ఆస్పత్రిలో జెనెటిక్ పరీక్షలు చేయించగా స్పైనల్ మస్క్యులర్ ఏట్రోఫీ(ఎస్ఎంఏ)–టైప్ 2గా నిర్ధారణ అయింది. ప్రపంచంలో ఎక్కడా మందు లేదని వైద్యులు స్పష్టం చేశారు. బతికినన్నాళ్లు చూసుకోవడమే తప్ప మరో మార్గం లేదని చెప్పడంతో హతాశులయ్యారు. రెండో కుమారుడికీ అదే జబ్బు వినయ్, వేదవతి దంపతులకు మరో కుమారుడు మోక్షిత్ జన్మించగా ఆ చిన్నారికీ ఎస్ఎంఏ టైప్–2 సోకింది. మోక్షిత్ పరిస్థితి తన అన్న కంటే కొంత ఫర్వాలేదు. కొద్దిసేపు కూర్చోగలడు. ఈ చిన్నారులిద్దరూ ఆరోగ్యంగా కనిపిస్తారు కానీ ఏదైనా వస్తువు ఇస్తే చేయి చాచి అందుకోలేరు. కూర్చున్న కాసేపటికే నేలమీద వాలిపోతారు. అసలే బలహీనమైన కండరాలు.. రోజురోజుకూ శక్తి క్షీణిస్తుండటంతో ఆ పిల్లల వ్యధ వర్ణణాతీతం. బిడ్డల్ని బతికించుకోవాలన్న తాపత్రయంలో ఎస్ఎంఏపై వినయ్‌కుమార్ ఎంతో స్టడీ చేశాడు. దేశవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న 400 మందితో ‘‘క్యూర్ ఎస్ఎంఏ ఇండియా’’ అనే సంస్థను స్థాపించి సమాచారం పంచుకుంటున్నారు. అన్నీ అమ్మే.. చిన్నారులిద్దరూ పాఠశాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తల్లి వేదవతే విద్యాబుద్ధులు నేర్పుతోంది. వారి తెలివితేటలకు అబ్బురపడుతూ మానసిక క్షోభను మరిచిపోతోంది. ఆరు, ఏడేళ్ల వయసున్న వీరు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడడమే కాదు, జనరల్ నాలెడ్జ్‌పైనా పట్టు సాధించారు. వివిధ అంశాల గురించి వివరంగా చెప్పగల నేర్పు వీరి సొంతం. 2017లో మందులు అందుబాటులోకి.. 2017 డిసెంబర్లో అమెరికాకు చెందిన బయోజిన్ కంపెనీ స్పిన్రజా అనే మెడిసిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. తొలి ఏడాది ఐదు ఇంజక్షన్లకు అయ్యే ఖర్చు రూ.5 కోట్లు కాగా.. ఎస్ఎంఏ బాధితులు జీవించినంత కాలం ఇంజక్షన్లు వేసేందుకు మరో రూ.3 కోట్లు వెచ్చించాలి. కొద్దికాలం క్రితం రోచె అనే కంపెనీ రిస్డీ ప్లామ్ అనే ఓరల్ డ్రగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. రోజు ఒక్కో సాచెట్ పిల్లవాడికి ఇవ్వాలి. దీని ఖరీదు రూ.80 వేలు. కానీ జీవితకాలం ఈ సాచెట్లు ఇస్తూనే ఉండాలి. ఇదిలా ఉండగా అవాక్సిస్ కంపెనీ జోల్జెన్ ఎస్ఎంఏ అనే ఇంజక్షన్ అందుబాటోకి తెచ్చింది. ఒక్కసారి ఈ ఇంజక్షన్ చేస్తే వ్యాధి నయమవుతుందని చెబుతున్నారు. దీని ఖరీదు ఏకంగా రూ.16 కోట్లు. అదృష్టవశాత్తు అమెరికాలోని డైరెక్ట్ రిలీఫ్ ఫండ్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఎస్ఎంఏ సోకిన 360 మందిని గుర్తించి జీవితాంతం ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకు వచ్చింది. అందులో మోక్షిత్ ఒకడు. దీంతో త్వరలోనే ఆ చిన్నారి కోలుకుంటాడనే నమ్మకం కలిగింది. సాయం చేసే దాతలు 7799373777, 8977274151ను సంప్రదించవచ్చు. లేదా ఐడీబీఐ బ్యాంక్ అకౌంట్ నం.0738104000057169, ఒంగోలు బ్రాంచ్, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఐబీకేఎల్ 0000738కు నగదు అందించాలని చిన్నారుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం చేసి ఆదుకోండి నా బిడ్డల ఆరోగ్యం బాగుండుంటే నేనే పది మందికి అండగా ఉండేవాడిని. కానీ ఇటువంటి అరుదైన జబ్బులకు వైద్యం చేయించాలంటే కష్టసాధ్యం. నా ఆస్తి మొత్తం అమ్ముకున్నా తొలి ఏడాది ఒక ఇంజెక్షన్ కూడా వేయించలేను. అందుకే ఇటీవల క్రౌడ్ ఫండింగ్‌కు సంబంధించి ఇంపాక్ట్ గురూలో యోగేష్ గుప్తాకు లభించిన ఆదరణ చూసి ఆన్లైన్లో అప్రోచ్ అయ్యాను. వారు పరిశీలించి ఫండింగ్ సేకరించడం మొదలుపెట్టారు. ఒంగోలుకు చెందిన ఆసిఫ్, అన్వేష్ స్మైల్ ఎగైన్ అనే సంస్థను స్థాపించి సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే మేము ఒక సంస్థ ద్వారా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలిశాం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల స్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – దండే వినయ్ కుమార్, వేదవతి చదవండి: విషాదం: రూ.16 కోట్ల ఇంజక్షన్.. ఆ పాప ఇక లేదు 62,400 మంది దాతలు.. రూ.16 కోట్లు.. బాలుడికి పునర్జన్మ -
ప్రకాశం: హైవే కిల్లర్ మున్నాకు ఉరిశిక్ష
-
తల్లితో ప్రియుడి సహజీవనం.. కుమార్తెను కోరిక తీర్చాలని..
సాక్షి, అద్దంకి రూరల్: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆమె ఇంట్లో లేని సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ శారీరకంగా వేధిస్తున్నాడని గురువారం అద్దంకి పట్టణానికి చెందిన 9వ తరగతి చదువున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేశారు. ఎస్ఐ కథనం ప్రకారం.. అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్లో నివాసం ఉంటున్న వీట్టెం మల్లికార్జునరావు, అరుణలకు 15 ఏళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు మనస్పర్థల కారణంగా రెండేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి కుమార్తె తల్లి వద్దే ఉంటోంది. తల్లితో వివాహేతర సంబంధం ఉన్న వలబూని జానకిరామయ్య కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. రెండు నెలల నుంచి జానకిరామయ్య బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ శారీరకంగా హింసిస్తున్నాడు. తల్లి ఇంట్లోలేని సమయంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడం, ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు తన కోరిక తీర్చాలని బలవంతం చేసేవాడు. ఈ విషయం తల్లికి చెప్పగా ఆమె కూడా జానకిరామయ్యకే మద్దతు పలుకుతూ నిన్ను అతనికిచ్చి పెళ్లి చెస్తానని అంటోందని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి అరుణ, జానకిరామయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు వయసుకొచ్చిన కుమార్తె ఉన్న తల్లి.. వేరొకరితో సహజీవనం చేయడమే కాకుండా.. అతడ్నే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. బాలికను వేధించిన కామాంధుడు జానకిరామయ్యతో పాటు తల్లిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. చదవండి: పెళ్లి కాకుండానే గర్భం.. టీచర్ మృతి.. చెత్తకుండీలో బిడ్డ! -
ఫేస్బుక్ ప్రేమ... పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని..
సాక్షి, ఒంగోలు: తొమ్మిది నెలల క్రితం ఇద్దరు యువతీ యువకుల మధ్య ఫేస్బుక్ పరిచయం ప్రేమగా మారింది. ఆ వ్యవహారం పెద్దల దృష్టికి వెళ్లక ముందే కులాంతర వివాహానికి అంగీకరించరేమో అనే ఆందోళన మొదలైంది. ఇరవయ్యేళ్లు కూడా నిండని ఆ యువ జంట రైలు పట్టాలపై నలిగి తనువు చాలించింది. నాలుగు రోజుల కిందట ఒంగోలు శివారు పెళ్లూరు సమీపంలో ఇదే తీరులో జరిగిన ఘటన మరువక ముందే అక్కడికి సమీపంలో మంగళవారం మరో జంట దేహాలు పట్టాలపై ఛిద్రమయ్యాయి. ఎన్నో ఆశలతో బిడ్డలను చదివిస్తున్న రెండు నిరుపేద కుంటుంబాల్లో తీరని శోకం మిగిలింది. ఒంగోలు శివారు కొప్పోలుకు చెందిన భవనం వెంకటేశ్వరరెడ్డి, సుజాత దంపతులు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరి రెండో కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డి రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కొడుకు స్మార్ట్ ఫోన్ కావాలని గోల చేస్తుండటంతో మూడు నెలల కిందట సుజాత కష్టం చేసి దాచిన రూ.12 వేలతో కొనిచ్చింది. ఈ క్రమంలో ఎక్కువ సమయం ఫోన్‌తో సమయం గడుపుతున్న అతడికి ఒంగోలు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందు ఫేస్బుక్లో పరిచయం అయింది. వెలిగండ్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన నాగినేని ఇందు కుటుంబం వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటోంది. ఆమె తండ్రి నాగినేని పుల్లయ్య ఏడాది కిందట మరణించడంతో తల్లి, సోదరుడితో కలిసి ఉంటోంది. స్థానిక శ్రీహర్షిణి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇంట్లోని ఒక భాగాన్ని అద్దెకు ఇవ్వడంతో వచ్చే కొద్దిపాటి సొమ్ము, తల్లికి వచ్చే పింఛనే ఆ కటుంబానికి జీవనాధారం. కొద్ది రోజుల కిందట ఓ యువతి తన కుమారుడికి తరచూ ఫోన్ చేస్తుండటం గమనించిన సుజాత కంగారు పడింది. ఈ వ్యవహారం తల్లికి తెలియడంతో విష్ణువర్దన్‌రెడ్డి ఆ ఫోన్‌ను కాస్తా పగలగొట్టాడు. కానీ స్నేహితుడి మొబైల్ నుంచి ఇందుతో టచ్‌లో ఉన్నాడు. సోమవారం రాత్రి ఇంటి సమీపంలోని బడ్డీ కొట్టుకు వెళ్లి పెరుగు పాకెట్ తెస్తానని వెళ్లిన ఇందు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక వెదుకుతున్నారు. హాల్ టికెట్ ఆధారంగా గుర్తింపు.. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం సమీపంలోని ఐఓసీ పెట్రోలు బంకు వెనుక రైల్వే ట్రాక్‌పై యువ జంట ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. సీఐ ఎండ్లూరి రామారావు సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మొండెం నుంచి తల వేరు అయిన స్థితిలో యువతి, పూర్తిగా ఛిద్రమైన యువకుడి మృతదేహంతో ఆ ప్రదేశం భీతావహంగా కనిపించింది. ఘటనా స్థలానికి సమీపంలో లభించిన హాల్ టికెట్ ఆధారంగా యువకుడు రైజ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిగా గుర్తించిన పోలీసులు కాలేజికి వచ్చి వివరాలు సేకరించారు. మృతుడు కొప్పోలుకు చెందిన భవనం విష్ణువర్దన్‌రెడ్డి (19)గా నిర్ధారించారు. అతడి స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం మృతురాలు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందు(18) అని, వీరిద్దరికీ 9 నెలల కిందట ఫేస్బుక్లో పరిచయం అయినట్టు వెల్లడైంది. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల పెద్దల దృష్టికి రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఇందు ఎక్కడి వెళ్లిందో తెలియక వెతుకుతూనే ఉన్నామని విష్ణువర్దన్‌రెడ్డితో ప్రేమలో ఉందనే విషయం తమకు తెలియదని ఆమె బంధువులు తెలిపారు. కులాంతర వివాహానికి అడ్డంకులు వస్తాయనే భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తూ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
సచివాలయం మహిళా పోలీస్ ఆత్మహత్య!?
సాక్షి, చీరాల: చీరాల మున్సిపాలిటీలోని 16వ వార్డు సచివాలయం మహిళా పోలీసు ముత్యాల భార్గవి (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి బంధువులు తమ కుమార్తెను అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను అల్లుడు చిత్రహింసలకు గురి చేసి హత్య చేసి ఉంటాడని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన గురువారం చీరాల సాల్మన్ సెంటర్లో వెలుగు చూసింది. చీరాల ఒన్‌టౌన్ సీఐ రాజమోహన్ కథనం ప్రకారం.. పట్టణంలోని 16వ వార్డు సచివాలయంలో ముత్యాల భార్గవి మహిళా పోలీసుగా పనిచేస్తోంది. ఆమెకు భర్త రాంబాబు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం రాత్రి ఏం జరిగిందో ఏమోగానీ ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసి మృతురాలి భర్త రాంబాబును విచారణ చేస్తున్నామని, విచారణ అనంతరం వివరాలు తెలుస్తాయని, ఈ మేరకు భార్గవి మృతదేహాన్ని శవ పరీక్ష కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. తమ కుమార్తె భార్గవిని అల్లుడు రాంబాబు మద్యం తాగి తరుచూ వేధింపులకు గురిచేస్తుండేవాడని, ఈ విషయం పలుమార్లు తమకు చెప్పుకుని బాధపడిందని, కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కన్న తల్లి విగత జీవిగా పడి ఉండటంతో పిల్లలు భోరున విలపిస్తున్నారు. సాల్మన్ సెంటర్‌తో పాటు మృతురాలు పనిచేసే సచివాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
'రాసలీలలు చేసే లోకేష్‌కు విమర్శించే హక్కు లేదు'
సాక్షి, ప్రకాశం: విదేశాల్లో రాసలీలలు చేసే లోకేష్‌కు తనను విమర్శించే హక్కు లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. ''లోకేష్ ఒక దరిద్రుడు.. చంద్రబాబు ఒక నీచుడు. చంద్రబాబు, లోకేష్ ఇక్కడ దోచుకుని విదేశాల్లో దాచుకుంటున్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్ నాపై మాట్లాడటం సిగ్గుచేటు. ప్రత్తిపాటితో కలిసి లోకేష్ పేకాట క్లబ్ నడిపిన విషయం ప్రజలకు తెలుసు. నేను కులాలు చూడలేదు.. కమ్మవారికి కూడా కార్పొరేషన్లో టికెట్ ఇచ్చా. టీడీపీ వారు వ్యక్తిగత సమస్యలపై నా వద్దకు వస్తే పరిష్కరించా. ఒంగోలు అభివృద్ధిపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. గతంలో ఒంగోలును అభివృద్ధి చేశా.. ఇప్పుడూ చేస్తున్నా. టీడీపీ ఇన్ఛార్జ్ దామచర్ల జనార్ధన్ బాగోతం అందరికీ తెలుసు. నాకు సంస్కారం ఉంది కాబట్టి.. వ్యక్తిగత విమర్శలు చేయను. దామచర్ల జనార్ధన్ అప్పులు ఎగ్గొడితే.. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా సమయంలో ఒంగోలులో రూ.కోటి సొంత డబ్బు ఖర్చు చేశా. రోడ్లు మీద రోడ్లు వేసి టీడీపీ నేతలు దోచుకున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తే.. కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారు. కుప్పంలో చంద్రబాబుకు పట్టిన గతే.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రిపీట్ అవుతుంది'' అంటూ పేర్కొన్నారు. చదవండి: ఇక టీడీపీ చాప్టర్ క్లోజ్: విజయసాయిరెడ్డి లెక్కలు తప్పులైతే ముక్కు నేలకు రాస్తా.. -
పంచాయితీ బరిలో అక్కా, చెల్లెళ్ల ఢీ
సాక్షి, కారంచేడు(ప్రకాశం) : ఒకే ఊరిలో పుట్టి పెరిగారు. అక్కడే ఇద్దరూ ఇంటర్ వరకు చదువుకున్నారు. అదే ఊరికి చెందిన ఒకే ఇంటి పేరున్న వారిని వివాహమాడారు. ఇప్పుడు అదే గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో సర్పంచ్ అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలోని కుంకలమర్రు గ్రామంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో గ్రామంలోని ఇరు వర్గాల వారు ఇద్దరు అక్కా, చెల్లెళ్లను ఎంపిక చేశారు. ఒక వర్గానికి చెందిన వారు అక్క ఈదర రాజకుమారిని రంగంలో ఉంచితే, మరో వర్గం వారు ఆమె చెల్లెలు ఈదర సౌందర్యను బరిలోకి దించారు. ఇంత వరకు ఇద్దరి కుటుంబాల మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేకపోయినప్పటికీ. .ఇప్పుడు ఇద్దరు తమ, తమ గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. చదవండి: ఓసారి ఊరొచ్చి పోప్పా.. కావాలంటే కారు పంపిస్తా! బొడ్డు అంకయ్య, బొడ్డు నరసింహం అన్నదమ్ములే ప్రత్యర్థులు.. మిట్టపాలెం(కొండపి): ప్రకాశం జిల్లా కొండపి మండలం మిట్టపాలెంలో సర్పంచ్ స్థానానికి అన్నదమ్ములు పోటీపడుతున్నారు. గ్రామంలో 793 ఓట్లుండగా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవి 380 దాకా ఉంటాయి. సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అవడంతో ఆదివారం అన్నదమ్ములు బొడ్డు నరసింహం, బొడ్డు అంకయ్యలు నామినేషన్లు వేశారు. 87 ఏళ్ల వయస్సులో పోటీ మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని శేరేపాలెం గ్రామానికి చెందిన మాణిక్యాలరావు 1993లో వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2001–2006 వరకు సర్పంచ్‌గా పనిచేశారు. 87 ఏళ్ల వయస్సులోనూ మరోసారి సర్పంచ్‌గా గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన భార్య లక్ష్మీదేవి 1995 నుంచి 2001 వరకు సర్పంచ్‌గా, 2001 నుంచి 2006 వరకు జెడ్పీటీసీ సభ్యురాలిగా చేశారు. -
తొలి దెబ్బ అదిరింది
సాక్షి, ఒంగోలు: పల్లె పోరులో రెండు కీలక ఘట్టాలు గురువారం ముగిశాయి. జిల్లాలో మొదటి దశ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ, రెండో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలు పూర్తయ్యాయి. మొదటి విడతలో 13 మండలాల పరిధిలోని 227 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణలు పూర్తయ్యాయి. ఇందులో 35 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, 762 వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ధ్రువీకరించారు. గ్రామాల్లో ఎన్నికలు జరగడం కంటే ఏకగ్రీవాల వల్లే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి 35 గ్రామాల ప్రజలు శాంతి వైపు అడుగులు వేశారు. అభివృద్ధికి తోడ్పాటునందిస్తారనుకున్న వారిని సర్పంచ్‌గా తామే ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. ఎన్నికల నిర్వహణ ఖర్చు మిగల్చడంతో పాటు ఏకగ్రీవాలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు అందుకుని గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపాలని నిశ్చయించుకున్నారు. ⇔ ఇందులో భాగంగా పర్చూరు నియోజకవర్గంలో 15 గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లు ఎన్నుకోగా, సంతనూతలపాడులో 13 గ్రామాల్లో, ఒంగోలులో 3 గ్రామాల్లో, టంగుటూరు మండలంలో 3 గ్రామాలతో పాటు వేటపాలెం మండలంలో ఎన్నిక జరుగుతున్న ఒక్క గ్రామంలో సైతం సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ⇔ మొదటి విడతలో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యే సమయానికి 35 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 192 గ్రామాల్లో ఈ నెల 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం పోటీలో నిలిచిన అభ్యర్ధులకు గుర్తులను కేటాయించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ⇔ మరోవైపు రెండో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సైతం గురువారంతో ముగిసింది. చాలా గ్రామాల్లో ఈ దశలో సైతం ఏకగ్రీవాల దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక గ్రామాల్లో ఒకే ఒక్క అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నెల 8వ తేదీన జరిగే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో మరికొన్ని గ్రామాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని అడ్డు పెట్టుకుని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకుని గ్రామాల్లో చిచ్చు రేపాలనే కుట్రను భగ్నం చేస్తూ అనేక గ్రామాల ప్రజలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఏకగ్రీవాల వైపు అడుగులు వేయడం శుభపరిణామం. జిల్లాలో ఏకగ్రీవమైన 35 గ్రామ పంచాయతీల్లో 31 చోట్ల వైఎస్సార్ సీపీ అభిమానులు సర్పంచ్‌లుగా ఏకగ్రీవం కాగా 4 చోట్ల మాత్రమే టీడీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బద్దలైన టీడీపీ కంచు కోటలు.. దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటలుగా ఉన్న అనేక గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నిక అవడంతో టీడీపీ కోటలు బద్దలయ్యాయి. గతంలో ఎన్నడూ ఏకగ్రీవం కాని అనేక గ్రామాలు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకోవడం చూస్తుంటే గ్రామాభివృద్ధి కంటే ఎన్నికలు ముఖ్యం కాదనే విషయం ఆయా గ్రామాల ప్రజలు స్పష్టం చేసినట్లయింది. ముఖ్యంగా యద్దనపూడి మండలం దరిశి గ్రామం పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్వగ్రామం. ఆయన కుటుంబ సభ్యులకు అక్కడే ఓటు ఉంది. అయినప్పటికీ అక్కడ వైఎస్సార్ సీపీ అభిమాని అయిన బీసీ మహిళను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాడు తీవ్ర పోటీ.. నేడు ఏకగ్రీవాలు.. ⇔ యద్దనపూడి మండలంలోని వింజనంపాడు గ్రామం సైతం టీడీపీకి కంచుకోటగా మొదటి నుంచి ఉండేది. అక్కడ సైతం వైఎస్సార్ సీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పర్చూరు మండలం ఇనగల్లు గ్రామం ఫ్యాక్షన్‌తో రగిలిపోయేది. ఎన్నికలు వచ్చాయంటే గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి. ఎన్నికలు వస్తే ఎప్పుడు ఏమవుతుందోనని గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి. గ్రామం ఏర్పడి దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఏకగ్రీవం అయిన పరిస్థి లేదు. అయితే తొలిసారిగా ఇక్కడ వైఎస్సార్ సీపీ అభిమాని ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికవడం చెప్పుకోదగ్గ విషయం. ⇔ పర్చూరు నియోజకవర్గంలోని ఏలూరివారిపాలెం, చినరావిపాడు, టంగుటూరు మండలం అనంతవరం, అల్లూరు, ఒంగోలు మండలం కరవది, వలేటివారిపాలెం, ఉలిచి, నాగులుప్పలపాడు మండలం కొత్తకోట గ్రామాలు సైతం దశాబ్దాలుగా ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొంటూ వస్తోంది. వీటిలో అనేక గ్రామాల్లో టీడీపీ అభిమానులే సర్పంచ్‌లుగా గెలుస్తూ వస్తున్నారు. అయితే మొదటిసారి వైఎస్సార్ సీపీ అభిమానులు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. చీరాల నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతున్న ఒకే ఒక్క గ్రామమైన వేటపాలెం మండలం రామన్నపేట గ్రామం గత 40 ఏళ్లుగా టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఎన్నిసార్లు ఎన్నిక జరిగినా టీడీపీ అభిమానులే సర్పంచ్‌లుగా ఎన్నికవుతూ వచ్చారు. మొదటిసారిగా రామన్నపేట సర్పంచ్‌గా వైఎస్సార్ సీపీ అభిమాని ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంచలనం కలిగించింది. కారంచేడు మండలం యర్రంవారిపాలెం గ్రామ పంచాయతీగా ఏర్పడిన వద్ద నుంచి ఒక్కసారి కూడా ఎన్నిక జరగని పరిస్థితి. అక్కడ గ్రామ పెద్దలే ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకుని గ్రామాభివృద్ధికి పాటుపడుతూ వస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం ఈ సారి కూడా అక్కడ సర్పంచ్ అభ్యరి్థని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప మార్పులు
సాక్షి,విజయవాడ: పంచాయితీ ఎన్నికలలో స్వల్ప మార్పులు చేసినట్లు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లా కలెక్టర్ల వినతి మేరకు ఎన్నికలు జరగాల్సిన పంచాయితీలలో మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు డివిజన్ లో 20 మండలాలకు గాను 15కు మాత్రమే తొలిదశలో ఎన్నికలు నిర్వహించనుండగా.. మిగిలిన ఐదు మండలాలకు రెండవ దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. పంగులూరు, కోరిశపాడు, ఎస్.మాగులూరు, అద్దంకి, బల్లికురవ మండలాలలో పంచాయితీలకి ఫిబ్రవరి 9కి బదులు 13వ తేదీన రెండవ దఫాలో ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం మండలానికి 3వ దఫాకు బదులుగా 2వ దఫాలోనే ఎన్నికలు నిర్వహించనుండగా.. ఏలూరు డివిజనులోని నాలుగు మండలాలకు నాల్గవ దఫా బదులుగా మూడవ దఫాలోనే ఎన్నికలు జరపనున్నారు. చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం,టి.నర్సాపురం మండలాలలోని పంచాయితీలకి ఫిబ్రవరి 21 బదులు ఫిబ్రవరి 17న మూడవ దఫాలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా పశ్చిమలో మిగిలిన మండలాలకు మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం నాల్గవ దఫాలో ఎన్నికలు జరపనున్నట్లు ఎస్ఈసీ పేర్కొంది. -
టీడీపీ ఎమ్మెల్యే ధనదాహం.. కార్మికుడు బలి
టీడీపీ ఎమ్మెల్యే ధనదాహానికి ఓ నిండు ప్రాణం బలైంది.. నిబంధనలకు విరుద్ధంగా జరిపిన బ్లాస్టింగ్ ఓ కార్మికుడి ప్రాణాలు బలిగొంది. అక్రమాలు జరిగాయంటూ సీజ్ చేసిన గ్రానైట్ క్వారీలో వక్రమార్గంలో తవ్వకాలు జరిపారు. పక్కనే ఉన్న మరో క్వారీ నుంచి మూతపడ్డ క్వారీకి దారి వేసి మరీ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. బినామి పేర్లతో గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తూ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడి రూ.వందల కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. సీజ్ చేసిన క్వారీలో నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రానికి వచ్చి కష్టం చేసుకుంటున్న అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బల్లికురవ మండలంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనతో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అక్రమ దందా వెలుగు చూసింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోని రాగానే ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వాటిల్లో జరుగుతున్న అక్రమాలను నిగ్గు తేల్చారు. ఇందులో భాగంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తన కుటుంబ సభ్యుల పేరుతో, తన అనుయాయుల పేర్లతో నడుపుతున్న క్వారీల్లో భారీస్థాయిలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించి వందల కోట్ల రూపాయల పెనాల్టీలు విధించారు. తన గనుల్లో తవ్విన గ్రానైట్‌కు సంబంధించి జీఎస్టీ, రాయల్టీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా తన జేబులు నింపుకున్న వైనం విజిలెన్స్ విచారణలో బయటపడింది. అయినా ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడంతో అధికారులు గొట్టిపాటికి చెందిన క్వారీలను సీజ్ చేశారు. అయితే అక్రమాలకు అలవాటు పడ్డ ఎమ్మెల్యే సీజ్ చేసిన క్వారీల్లో సైతం రాత్రిపూట దొంగతనంగా తవ్వకాలు జరుపుతూ పక్కనే ఉన్న తన బినామీలకు చెందిన క్వారీల్లో నుంచి గ్రానైట్‌ను అక్రమ రవాణా చేస్తూ భారీస్థాయి దోపిడీకి పాల్పడుతున్నారు. మూతపడ్డ క్వారీలో ఆదివారం జరిగిన బ్లాస్టింగ్‌లో కార్మికుడు మృతి చెందిన ఘటనతో గొట్టిపాటి అక్రమాలు బట్టబయలయ్యాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కనుసన్నల్లో గ్రానైట్ మాఫియా నడుస్తుందనే విషయం జిల్లాలో అందరికీ తెలిసిందే. శ్రీ రాఘవవేంద్ర గ్రానైట్స్ క్వారీ టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తన కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తూ అక్రమ తవ్వకాలకు తెరతీశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని గాని, జీఎస్టీని గాని చెల్లించకుండా అసలు బిల్లులే లేకుండా గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడిన వైనం విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలైంది. తాను చేసిన అక్రమ వ్యవహారాలను కప్పి పుచ్చుకునేందుకు తనను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్నారంటూ మొసలి కన్నీరు కారుస్తూ తిరుగుతున్నారు.(చదవండి: ఇబ్బంది లేకుండా 'ఇసుక') అంతటితో ఆగకుండా మూతపడ్డ క్వారీల్లో సైతం దొంగతనంగా తవ్వకాలు జరుపుతూ అక్రమ దందాకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. మూతపడ్డ గంగాభవాని క్వారీలోనే సుమారు 100 మంది కూలీలకు షెల్టర్ ఏర్పాటు చేసి ఉంచుతున్నారంటే అక్రమ దందా ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం తన క్వారీలో నిబంధనలకు విరుద్దంగా బ్లాస్టింగ్లు చేయడంతో తమిళనాడుకు చెందిన ఎం.అర్ముగం (40) అనే కార్మికుని తలపై బండ రాళ్లు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో క్వారీలోకి వెళ్లి చూసిన పోలీసు, మైనింగ్ అధికారులకు కళ్లు చెదిరే వాస్తవాలు కనిపించాయి. మూతపడిన ఎమ్మెల్యే గొట్టిపాటి క్వారీలో కూలీలను ఉంచిన గదులు గత 8 నెలల క్రితం మూతపడిన గంగాభవాని క్వారీలో సైతం అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు బయటపడింది. పక్కనే తన బినామీకి చెందిన సాయి రాఘవేంద్ర క్వారీలో నుంచి దారి వేసుకుని యథేచ్చగా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో అంతా అవాక్కయ్యారు. ప్రభుత్వం తమను వేధిస్తుందంటూ బయట ప్రచారాలు చేస్తూ చీకట్లో మాత్రం అక్రమ దందా నిర్వహించడం ఆ ఎమ్మెల్యే నైజాన్ని తేటతెల్లం చేస్తోంది. అక్రమ గ్రానైట్ దందా మాట అటుంచితే నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు చేసి ఓ కూలీ ప్రాణాలను బలిగొన్న వైనంపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి జరుగుతున్న అక్రమ తవ్వకాలపై మైనింగ్, విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. గొట్టిపాటి గ్రానైట్ దందాపై చర్యలు తీసుకోవడంతో పాటు, మైనింగ్ మాఫియా దాష్టీకానికి బలైన కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు. ఈర్లకొండలో క్వారీ పరిశీలన బల్లికురవ: ఈర్లకొండ ఇంపీరియల్ క్వారీలో కార్మికుడు మృతి చెందిన నేపథ్యంలో సోమవారం డీఎస్పీ క్వారీని పరిశీలించారు. ఈ క్వారీకి ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న శ్రీరాఘవేంద్ర, గిరిరాజ్ క్వారీల్లో ఆదివారం సాయంత్రం బ్లాస్టింగ్ చేపట్టగా అక్కడ నుంచి రాయి ఎగిరిపడి ఆర్ముగం తలపై పడి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే చనిపోయినట్టు డీఎస్పీ దృష్టికి తెచ్చారు. విచారణ తదుపరి మైనింగ్ అధికారులకు నివేదించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. క్వారీ పరిశీలనలో అద్దంకి సీఐ ఆంజనేయరెడ్డి, ఎస్ఐ శివనాంచారయ్య పాల్గొన్నారు. మృతుని సోదరుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుతో ఆర్ముగం భౌతికకాయాన్ని పోస్టుమార్టూమ్ నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 30 లక్షల పరిహారానికి డిమాండ్.. గ్రానైట్ క్వారీల్లో వేళాపాళలేని బ్లాస్టింగ్లు రాళ్లు దొర్లిపడి తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని పట్టించుకోవాల్సిన మైన్స్ అండ్ సేప్టీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని క్వారీ వర్కర్ల యూనియన్ గౌరవాధ్యక్షుడు, సీఐటీ యూ నాయకుడు కాలం సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇంపీరియల్ క్వారీలో రాయిపడి చనిపోయిన ఆర్ముగం భౌతిక కాయానికి నివాళులతో కుటుంబ సభ్యులను ఓదార్చారు. బ్రతుకు దెరువుకు వలసవచ్చి విగత జీవిగా మా రిన ఆర్ముగం కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని సుబ్బారావు డిమాండ్ చేశారు. క్వారీల్లో ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు ముందు జాగ్రత్త చర్య లు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లీజులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కారి్మక సంఘం అధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
చంద్రబాబు కారణంగా వ్యవస్థ భ్రష్టుపడుతుంది
ఒంగోలు: చంద్రబాబు కారణంగానే వ్యవస్థ భ్రష్టుపడుతుందని , ప్రజల కోసం మనమా లేక మనకోసం ప్రజలా అనే పరిస్థితి నేడు నెలకొందని ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఆదివారం ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సాహిత్య కార్యక్రమానికి హాజరైన ఆమె కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎంతో మంచిగా ఉండే వారని, తనకు అతని గురించి బాగా తెలుసన్నారు. కానీ నేడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి చంద్రబాబు చేతిలో పావుగా మారడం బాధాకరమని, ఈ సమయంలో నిమ్మగడ్డ తెలివి తేటలు ఏమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో ఏళ్లపాటు సంపాదించుకున్న మంచి పేరు మొత్తం ప్రస్తుతం కోల్పోతున్నారని, ఇప్పటికైనా మంచి వ్యవస్థకు నాంది పలికేందుకు చంద్రబాబు కబంద హస్తాల నుంచి బయటకు రావాలని నిమ్మగడ్డకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితులు ఉండవని, ఆయన అనుకున్నదే నిజం చేయాలనుకుంటారన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు అవినీతి, అక్రమాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీచ రాజకీయాలు చంద్రబాబు నైజం అన్నారు. భారత దేశం లౌకిక రాజ్యం అని, సర్వమతాలు సమానమే అన్నారు. చంద్రబాబు నీచ, క్షుద్ర రాజకీయాలకు నిదర్శనంగా దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగారని , ఒక వైపు హిందువును అంటూనే మరో వైపు హిందూ విగ్రహాలను ధ్వంసం చేయమని ఎవరైనా చెబుతారా , అలా చెబితే వారు హిందూ ద్రోహి అవుతారు తప్ప హిందువు కారన్నారు. ఇటువంటి వ్యక్తులను బీజేపీ సైతం దూరంగా ఉంచడం మంచిదని ఆ పారీ్టకి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. మరో వైపు జగన్మోహన్రెడ్డి కుటుంబ వ్యవహారాల గురించి రాసిన వారు చంద్రబాబు , భువనేశ్వరి పలుక్కోవడం లేదు, చంద్రబాబుకు భోజనం కూడా పెట్టడం లేదు అంటే దీనిని ఆయన నిరూపించుకుంటారా అని ప్రశ్నించారు. ఏ కుటుంబం గురించి అయినా విమర్శించడం సరికాదన్నారు. -
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, ప్రకాశం : వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ముందు ఆగి ఉన్న లారీని ఢీకొని నలుగురు దుర్మరణం చెందిన ఘటన మార్టూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగింది. తిరుపతి వెంకన్న దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న రెండు జంటలు ఈ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాయి. పోలీసులు, 108 సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసే రేకందారు కనక మహాలక్ష్మి (58), బలిజ సత్యనారాయణ(63) భార్యభర్తలు. అదే కోర్టులో అడ్వొకేట్‌గా పనిచేసే వీరి సమీప బంధువు పర్వతనేని విజయలక్ష్మి (58), ఉయ్యూరు రవీంద్రనాథ్ చౌదరి అలియాస్ చినబాబు (60)లు దంపతులు. ఈ రెండు కుటుంబాలు ఏలూరు పట్టణంలోని ఫతేబాద్ కాలనీ అగ్రిగోల్డ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాయి. చినబాబుకు గతంలో భార్య మరణించగా గత సంవత్సరం ఆగస్టు 5వ తేదీన విజయలక్ష్మితో వివాహమైంది. ఈ రెండు కుటుంబాలతో పాటు కనక మహాలక్ష్మి మేనల్లుడు అయిన ఎం.సందీప్‌తో కలిసి మొత్తం ఐదుగురు నాలుగు రోజుల క్రితం కారులో వెంకన్న దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. తిరిగి ఏలూరు ప్రయాణం కాగా చినబాబు డ్రైవింగ్ చేస్తున్నాడు. కారు గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో స్థానిక అంబేడ్కర్ కాలనీ ఎదురు జాతీయ రహదారిపై రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు లారీ 50 మీటర్లకు పైగా ముందుకు దూసుకెళ్లి.. వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారును సైతం తనతో లాక్కొని వెళ్లిందంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చెమటోడ్చిన అధికారులు ప్రమాదం జరిగిన వెంటనే ఎస్ఐ శివకుమార్, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ రమణ, నారాయణలతో కలిసి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కారులో ఉన్న ఐదుగురులో నలుగురు మృతి చెందగా ఐదో వ్యక్తి సందీప్ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. హైవే అధికారుల క్రేన్ ద్వారా లారీ నుంచి కారును విడగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. అనంతరం భారీ క్రేన్ సహాయంతో లారీ నుంచి కారును విడగొడుతూ కారు వెనుక సీట్లో సందీప్‌ను అతి కష్టం మీద బయటకు రప్పించారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన 108 వాహనంలో సందీప్‌కు ఆక్సిజన్ అమర్చి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. లారీ నుంచి విడిపించిన కారు డోర్లు ఎంతకు రాకపోవడంతో ఎస్ఐ, ఏఎస్ఐలు స్వయంగా గునపాలతో కారు డోర్లు ధ్వంసం చేసి సుమారు రెండు గంటల పాటు శ్రమించి ఛిద్రమైన నలుగురు మృతదేహాలను వెలికితీశారు. వేళకాని వేళ.. స్థానికులు అందుబాటులో లేకపోవడంతో పోలీసు అధికారులే అన్నీ తామై వ్యవహరించారు. మూడున్నర గంటల సమయంలో ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్, ఐదున్నర గంటలకు చీరాల డీఎస్పీ శ్రీకాంత్, మధ్యాహ్నం ఒంటి గంటకు ఏఎస్పీ రవిచంద్ర చీరాల మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ అమర్ నాయక్‌లు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి ఎస్ఐ శివకుమార్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సాయంత్రం 5 గంటలు సమయంలో నలుగురు మృతదేహాలకు మార్టూరు ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి పోస్టుమార్టం నిర్వహించగా అధికారులు మృతదేహాలను బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ( యూపీలో మరో నిర్భయ) గురువారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా మార్టూరుకు సమీపంలోని జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని వారి కారు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులోనే మృతదేహలు చిక్కుకుపోవడంతో పోలీసులు, హైవే సిబ్బంది శ్రమించి బయటకు తీశారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. -
మా మంచి సైన్సు మాస్టార్
ఆయనో సైన్సు ఉపాధ్యాయుడు..ఉదయాన్నే పాఠశాలకు వచ్చి పిల్లలకు నాలుగు పాఠాలు చెప్పి తన పని అయిపోయిందనుకోలేదు. పిల్లల చేతిరాత శిక్షణ మొదలుకొని మూఢ నమ్మకాలపై అవగాహన, సమ్మర్ క్యాంపులు, సమాజంలోని రుగ్మతలపై నాటిక రచనలు, ప్రదర్శనలు, క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉత్తమ ప్రశంసలతో పాటు అవార్డులు అందుకుంటూ తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కొండపి: కొండపికి చెందిన లక్కంతోటి వరప్రసాద్ రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం మర్రిపూడి మండలం తంగెళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్సు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయునిగా కేవలం పుస్తకాల్లో పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఆయన కృషి చేస్తున్నారు. చేతిరాత..మన తలరాత.. చేతిరాత బాగుంటే మన తలరాత బాగుంటుందంటారు పెద్దలు. అందుకే వరప్రసాద్ విద్యార్థుల చేతిరాతపై ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఇప్పటి వరకు చేతిరాత సక్రమంగా లేని 3 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని రాతను తీర్చిదిద్దారు. తాను పనిచేసిన పాఠశాలల్లోనే కాకుండా ఇతర పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు సైతం సమ్మర్ క్యాంపులు పెట్టి మరీ శిక్షణ ఇస్తున్నారు. నాటికల ద్వారా చైతన్యపరుస్తూ సమాజంలో ఉన్న రుగ్మతలను బట్టబయలు చేసేలా ప్రజలకు కనువిప్పు కలిగేలా ఎయిడ్స్‌పై సమరం అంటూ నీ జీవితం–నీచేతిలోనే.. నాటికను రచించి పాఠశాల విద్యార్థులతో హైదరాబాద్ శ్రీసత్యసాయి ఆడిటోరియంలో ఎయిడ్స్‌డే సందర్భంగా 2006 డిసెంబర్లో ప్రదర్శించారు. ఈ నాటికకు రచయితగా, డైరెక్టర్‌గా ప్రసాద్ యూనిసెఫ్ ప్రశంసాపత్రం అందుకున్నారు. బేటిబచావో– బేటిపడావో కార్యక్రమంలో భాగంగా చదవనిద్దాం– ఎదగనిద్దాం అంటూ బాలికల విద్య గురించి ప్రకాశంజిల్లాలో ప్రథమస్థానం సాధించి, గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రసంశాపత్రం అందుకున్నారు. బాలకార్మిక వ్యవస్థపై పోలీస్ బాబాయ్ శీర్షికన ఎన్టీఆర్ కళాపరిషత్‌లో 2010–11లో పిల్లలచేత వేయించిన నాటికకు రచయిత, దర్శకత్వం తదితర విభాగాల్లో మొత్తం 11 అవార్డులు అందుకున్నారు. అదే విధంగా వివిధ దినపత్రికల్లో ఆదివారం మ్యాగజైనన్లలో రచయితగా ఎన్నో కథనాలు ప్రచురితమయ్యాయి. క్రీడలకు ప్రోత్సాహం.. ప్రసాద్ చదువుకునే రోజుల్లో జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడుగా ఆంధ్రజట్టుకు ప్రాతినిధ్యం వహించి 1995లో బంగారు పతకం సాధించారు. క్రీడల పట్ల మక్కువతో ఏటా తాను పనిచేస్తున్న పాఠశాలల్లోని క్రీడాకారులకు రూ.15 వేలు ఖర్చు చేసి క్రీడా దుస్తులు అందిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నోట్‌పుస్తకాలు అందిస్తూ వారి విద్యార్థిభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ తోటి ఉపాధ్యాయులకు ప్రసాద్ ఆదర్శంగా నిలుస్తున్నారు. మ్యాజిక్ వెనుక లాజిక్.. సమాజంలో పట్టిపీడిస్తున్న మూఢ నమ్మకాలు ఎన్నో. ఈ మూఢ నమ్మకాలకు విద్యార్థులను దూరం చేసేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. చిన్నప్పటి నుండే చిన్నారుల్లో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగించేలా మ్యాజిక్ వెనుక లాజిక్ అంటు సైన్సు ప్రయోగాల ద్వారా విద్యార్థులకు విషయాలపై అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం తీసుకు వస్తున్నారు. -
మైనారిటీ తీరకముందే యువత పెడదొవపడుతుంది
సాక్షి, ప్రకాశం: మైనారిటీ తీరకముందే యువత ప్రేమ మోజులో పడి పెడవదోవ పడుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మా అన్నారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న రాజమహేంద్రవరం ప్రభుత్వ కళశాల తరగతి గదిలో విద్యార్థులు పెళ్లి చేసుకున్న సంఘటన చూసి షాకయ్యానన్నారు. మైనర్ బాలిక, బాలుడు తీరు తప్పైనప్పటికి బాలికకు ప్రభుత్వం నుండి రక్షణ కల్పించి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. బాలికతో పాటు ఇంటి నుంచి వెలివేసిన తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. సమాజంలో మహిళలపై జరిగే అరాచకాలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు.. మోసాలపై వార్డు గ్రామ, మండల.. పట్టణ స్థాయి వరకు పరిస్థితులను పరిశీలించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. మహిళలకు అండగా ఉన్న చట్టాలపై గ్రామీణ స్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామని వాసిరెడ్డి పద్మా తెలిపారు. -
నడిసంద్రంలో బిక్కుబిక్కుమంటూ..
చీరాల టౌన్ : నడిసంద్రం.. ఇంజిన్ పాడైపోయిన బోటు.. కనుచూపు మేరలో మరో బోటు లేదు.. అంతలో పెనుగాలులు, ఎడతెరపి లేని వాన.. దిక్కుతోచని స్థితితో ఆ ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలపై ఆశ వదులుకున్నారు. ఆ స్థితిలో వారిని తెరచాపే తీరానికి చేర్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు శుక్రవారం ప్రకాశం జిల్లా చీరాల వాడరేవుకు చేరుకున్నారు. ఈ నెల 7వ తేదీన కాకినాడ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు పేర్ల రాంబాబు, మైలిపల్లి సింగరాజు, గుంటి దుర్గ, గరికిన యల్లాజీ, గుంటి పోలయ్య, పేర్ల తాతారావు, కారె సింహాద్రిలు తమ బోటుతో కొత్తపాలెంలోని ఆయిల్ రిగ్ వద్ద లంగరు వేసి వేటాడుతున్నారు. ( మహోగ్ర వేణి ) ఈ నెల 10న వాయుగుండం కారణంగా గాలివాన ఎక్కువవడంతో వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా ఇంజిన్ పనిచేయలేదు. ఆ సమయంలో బోటుకు ఉన్న తెరచాప సాయంతో ప్రయాణాన్ని మొదలెట్టారు. తిండి గింజలు అయిపోవడంతో రెండ్రోజులు మంచినీళ్లు మాత్రమే తాగారు. ఆ దశలో వారిని నిజాంపట్నం–బాపట్ల తీర ప్రాంతంలోని మత్స్యకారులు గుర్తించి మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెరైన్ పోలీసులు వెంటనే స్పందించి వారిని చీరాల వాడరేవు ఒడ్డుకు చేర్చారు. -
దర్శిలో కిడ్నాపైన పసికందు క్షేమం
సాక్షి, ప్రకాశం: నెల రోజుల వయసున్న శిశువు కిడ్నాప్‌కు గురై, ఆ వెంటనే తల్లి ఒడిని చేరిన ఘటన ప్రకాశం జిల్లాలోని దర్శిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దొనకొండ మండలం పోలేపల్లికి చెందిన మరియమ్మకు నెల రోజుల వయసున్న బిడ్డ ఉంది. ఆ పాపపై కన్నేసిన ఓ గుర్తు తెలియని మహిళ తనను అంగన్వాడీ టీచర్‌గా మరియమ్మకు పరిచయం చేసుకుంది. ప్రభుత్వం నుంచి మహిళలకు డబ్బు వస్తుందని నమ్మించి, ఫొటోలు దిగేందుకు దర్శి రావాలని ఆమెను నమ్మించింది. (చదవండి: చిన్నారి అంజి కిడ్నాప్ కథ విషాదాంతం!) ఓ నలుగురు మహిళలను దర్శికి తీసుకొచ్చింది. అనంతరం ఫొటో స్టూడియో దగ్గర మహిళలను ఉంచి బిడ్డను తీసుకుని పరారైంది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు మరియమ్మ పోలీసులను ఆశ్రయించింది. కిలాడీ మహిళ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు నూజెండ్ల మండలం ఉప్పలపాడులో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర నుంచి బిడ్డను స్వాధీనం చేసుకుని తల్లికి అప్పగించారు. (చదవండి: తల్లి చూస్తుండగానే.. కూతురి కిడ్నాప్) -
ఏపీ: ముంచెత్తుతున్న భారీ వర్షాలు
సాక్షి, కర్నూలు/ప్రకాశం/గుంటూరు: ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లుతోంది. వాగులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంట నష్టంతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్యధికంగా బండి ఆత్మకూరు మండలం లో 180.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మహానంది - గాజులపల్లి మధ్య పాలేరు వాగు వంతెనపై నుండి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నంద్యాల - భీమవరం మధ్య వక్కిలేరు వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గడివేముల మండలం కోరటమద్ది వద్ద వాగు పొంగిపొర్లడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వైఎస్సార్ జిల్లా: పెద్దముడియం మండలంలో కుందూ ప్రవాహం పెరుగుతుంది. లోతట్టు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు దండోరా వేయించారు. నెమలిదిన్నె, బలపనగుడూరు, చిన్నముడియం, సిరిపాల దిన్నే, గర్శలూరు, ఉప్పలురు, పెద్దముడియం గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. పోరుమామిళ్ళ, కలసపాడు, కాశినాయన, బి.కోడూరు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. పోరుమామిళ్ళ మండలంలో నాగలకుంట్ల, బూరగమానుపల్లె చెరువులు పూర్తిగా నిండుకున్నాయి. గోపవరం మండలం మడకల వారిపల్లె రాచెరువుకు భారీగా వర్షపు నీరు చేరింది. ఐదేళ్ల తర్వాత చెరువుకు నీరు చేరడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రొంపిచర్ల మండలం మునమాక, తుంగపాడు వద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నరసరావుపేట వైపు రాకపోకలు బంద్ అయ్యాయి. తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద కొట్టేళ్ల వాగు పొంగడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ప్రకాశం జిల్లా: నాగులుప్పలపాడు మండలం చదలవాడ చెరువుకు గండి పడటంతో చీరాల - ఒంగోలు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గిద్దలూరులో శ్రీనివాస థియేటర్ వద్ద ఇళ్ల లోకి చేరిన వరద నీరు చేరడంతో ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. రాచెర్ల మండలంలో గుండ్లకమ్మ ఉగ్రరూప దాల్చింది. గిద్దలూరు-ఆకవీడుకు రాకపోకలు బంద్ అయ్యాయి. బెస్తవారిపేట మండలంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. బాసినేపల్లి వద్ద వాగు పొంగడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లా: జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాడిపత్రి, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల్లో కుండపోత వర్షం పడుతుంది. డోనేకల్ వాగు పొంగిపొర్లడంతో గుంతకల్లు-బళ్లారి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తూర్పుగోదావరి: ఎగువన గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి వరద నీరువచ్చి చేరుతుంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుండి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద కూడా వరద నీటిమట్టం 5 లక్షల క్యూసెక్కుల వరకు ఉండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కు మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వర్షాల ప్రభావం పెద్దగా లేకపోయినా గోదావరి కాస్త పెరిగితే లంక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అయితే ఐదు లక్షల క్యూసెక్కుల కు మించి వరదనీరు పెద్దగా వచ్చే అవకాశం లేదని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
పరీక్ష రాస్తుండగా పేపర్ లాగేశారు
ఒంగోలు మెట్రో: పీజీ పరీక్షలు వారం రోజులు ముందుకు జరిపి నిర్వాకం ప్రదర్శించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధికారులు ఇప్పుడు ఏకంగా డిగ్రీ పరీక్షలు రాస్తుండగానే రద్దు చేసి మరో సంచలనానికి కారణమయ్యారు. కరోనా కష్టకాలంలో అసలే రవాణా సదుపాయాలు లేక నానా తిప్పలూ పడి కేంద్రాలకు చేరుకుని పరీక్ష రాస్తున్న విద్యార్థులను విశ్వవిద్యాలయ అధికారుల తీరు కన్నీరు పెట్టించింది. ఏకాగ్రతతో పరీక్ష రాస్తున్న సమయంలో కేంద్రాల నిర్వాహకులు ఓఎంఆర్ షీట్లు లాగేసుకుంటుంటే చేష్టలుడిగి చూడటం విద్యార్థుల వంతైంది. యూనివర్సిటీ పరీక్షాధికారుల తప్పిదం వల్ల జిల్లాలో వేలాది మంది డిగ్రీ కోర్సుల విద్యార్థులు తీవ్ర అవస్ధలు పడ్డారు. దాదాపు ఆరు నెలల తర్వాత జరుగుతున్న పరీక్షలనైనా ప్రణాళికాబద్దంగా నిర్వహించాల్సిన అధికారులు తీవ్ర అలసత్వంతో నిర్వహిస్తూ పరీక్షల ప్రక్రియనే అపహాస్యం చేశారంటూ విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. (అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు) పశ్చిమ ప్రకాశంలో గంట గడిచాక.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు కరోనా కారణంగా ఆగిపోగా, తిరిగి సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 8వరకు నిర్వహించాల్సిన పరీక్షలను సెప్టెంబర్ 7 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు రీ–షెడ్యూల్ చేశారు. గత వారంలో డిగ్రీ మూడో సంవత్సర విద్యార్థులకు గత వారం పరీక్షలు పూర్తయ్యాయి. డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు పరీక్షలు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో సెప్టెంబర్ 15 సోమవారం బీకాం విద్యార్థులకు ఎనలిటికల్ స్కిల్స్, బీఎస్సీ విద్యార్థులకు కెమిస్ట్రీ పరీక్ష నిర్వస్తున్నారు. జిల్లాలో చీరాల, కంభం, అద్దంకి, కందుకూరు, మార్కాపురం, దర్శి, గిద్దలూరు, ఒంగోలు తదితర పదికి పైగా కేంద్రాల్లో వేలాదిమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కరోనా కారణంగా రవాణా సదుపాయాలు లేక నానా తిప్పలు పడి కేంద్రాలకు చేరుకుని పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో ఎంపిక చేసిన అన్ని పరీక్షల కేంద్రాల్లో విద్యార్థులు యథాతధంగా పరీక్ష రాస్తుండగా, ఆయా కేంద్రాల నిర్వాహకులు పరీక్ష రద్దయిందంటూ జవాబు పత్రాలు లాక్కుంటుండటంతో విద్యార్థులు అవాక్కయ్యారు. కంభం, గిద్దలూరు, మార్కాపురం తదితర కేంద్రాల్లో విద్యార్థులు సగానికి పైబడి పరీక్షను పూర్తి చేశారు. ఇక ఒంగోలులోని పలు కేంద్రాల్లో విద్యార్థులు గంటకు పైగా పరీక్ష రాసేశారు. ఒంగోలులో నోడల్ కాలేజీ నుంచి పరీక్ష రద్దయిందంటూ సమాచారం వచ్చిందని పేపర్లు లాగేసుకున్నారు. దీంతో విస్తుపోవటం విద్యార్థుల వంతయింది. మారని అధికారుల తీరు.. జిల్లాలోని డిగ్రీ, పీజీ విద్యార్థులపై విశ్వవిద్యాలయ అధికారుల తీరు మారటం లేదు. విద్యార్థులకు, కాలేజీల యాజమాన్యాలకు ఉపయుక్తంగా ఒంగోలులో ఒక పరిపాలనా కార్యాలయం పెట్టమని, ఎప్పటికప్పుడు తగిన విధంగా సమాచారం ఇవ్వమని దశాబ్దాలుగా జిల్లా విద్యార్థులు, యాజమాన్యాలు ఎంత మెరపెట్టుకుంటున్నప్పటికీ, నాగార్జున విశ్వవిద్యాలయ అధికారులు పట్టించుకోవటం లేదు. ఈ క్రమంలో ఆయా కేంద్రాల్లో ఎంపిక చేసిన నోడల్ కాలేజీలు సైతం యూనివర్సిటీకే లేదు. తమకెందుకు బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇక డిగ్రీ విద్యను పట్టించుకోవాల్సిన రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఎప్పుడో చుట్టపుచూపుగా తప్ప జిల్లాకు వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో జిల్లాలో డిగ్రీ, పీజీ విద్యలో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రస్తుత పరీక్షల నిర్వహణలో అయితే పరీక్షల పరిశీకులు, స్క్వాడ్ మెంబర్లుగా ప్రభుత్వ, ఎయిడెడ్ లెక్చరర్లుని నియమించాల్సిన అధికారులు తమకు తెల్సిన ఒకరిద్దరు ప్రవేటు లెక్చరర్లను నియమించి చేతులు దులుపుకున్నారు. కనిపించని సమన్వయం.. జిల్లాలో 200 డిగ్రీ కళాశాలలు, 60కి పైగా పీజీ కళాశాలలు, మరో 60 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. దాదాపు ప్రతియేటా పాతిక వేలమందికి పైగా విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలల్లో చదువుతున్నారు. వీరి కోర్సుల నిర్వహణ, పరీక్షలు, మూల్యాంకనం తదితర అంశాల్లో జిల్లాకు చెందిన అధ్యాపకుల, యాజమాన్యాల సమన్వయం లేకుండానే నిర్వహిస్తున్నారు. ఈసారి యూనివర్సిటీ పాలకమండలి సభ్యులలో జిల్లా నుంచి కనీసం ఒక్కరిని కూడా నియమించలేదు. తద్వా రా జిల్లాలోని డిగ్రీ, పీజీ, బీఈడీ విద్య నిర్వహణ, పరిపాలన విషయాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అధికారులు కనీసం సవతితల్లి ప్రేమనైనా చూపడం లేదు. దీంతో విద్యా ర్థులు, కాలేజీల నిర్వాహకుల అవస్థలు వర్ణనాతీతం. ఇటువంటి నిర్లక్ష్యంలో భాగంగానే సోమవారం పరీక్షను గంట ముందు రద్దు చేసి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పాలు చేశారు. (శ్రీసిటీని సందర్శించిన జపాన్ కాన్సుల్ జనరల్) 18న మళ్లీ పరీక్ష నిర్వహిస్తాం గుంటూరులో వర్షం కారణంగా సెప్టెంబర్ 15 సోమవారం రద్దు చేసిన పరీక్షను సెప్టెంబర్ 18న నిర్వహిస్తామని విశ్వవిద్యాలయ పరీక్షల అదనపు నియంత్రణ అధికారి ఎ.వెంకటేశ్వర్లు, పరీక్షల సమన్వయకర్త కె.మధుబాబు తెలిపారు. ఇక రీ–షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్న పరీక్షలను యథాతధంగా నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. – ఎఎన్యూ పరీక్షల విభాగం -
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు రూ. 1,863 కోట్లు: మంత్రి
సాక్షి, ప్రకాశం: మహిళలు, చిన్నారుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సలో మంత్రి ఒంగోలు నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించి, మహిళలకు చిన్నారులకు పోషకాహారాన్ని అందించారు. అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వం మహిళలు, చిన్నారులకు పోషకాహారం అందించేందుకు కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఇప్పుడు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 1,863 కోట్ల రూపాయల ఖర్చు చేస్తోందని వెల్లడించారు. మహిళలకు సంబంధించి ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే అన్నారు. ఈ నెల 11వ తేదీన డ్వాక్రా మహిళలకు ఆసరా పథకాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ పథకం కింద 6, 200 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళలకు అందజేయనున్నామని మంత్రి తెలిపారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం కింద జిల్లాలోని దోర్నాల, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాల పరిధిలోని 248 అంగన్వాడి కేంద్రాల ద్వారా 3, 980 మంది తల్లులు, 14, 650 మంది చిన్నారులు ప్రయోజనం పొందనున్నారన్నారు. అంతేగాక సంపూర్ణ పోషణ పథకం కింద జిల్లాలోని 53 మండలాల్లో 3,996 అంగన్ వాడీ కేంద్రాల ద్వారా 46 వేల మంది తల్లులు, 7 నెలల నుండి 6 ఏళ్ళ లోపు ఉన్న లక్షా ఇరవై వేల మంది చిన్నారులు లబ్ధి పొందునున్నారన్నారు మంత్రి పేర్కొన్నారు. -
దారుణం: మందలించాడని రిటైర్డ్ ఏఎస్ఐ మర్డర్
సాక్షి, ప్రకాశం: చీరాల మండలం తోటవారిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. గొడవ చేయొద్దని మందలించినందుకు రిటైర్డ్ ఏఎస్ఐ దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. రౌడీ షీటర్ సురేంద్ర మద్యం మత్తులో స్థానికంగా ఇళ్ల వద్ద రోజూ గొడవ చేస్తున్నాడు. అక్కడే నివాసముండే రిటైర్డ్ ఏఎస్ఐ సుద్దనగుంట నాగేశ్వరరావు గొడవ చేయొద్దని సురేంద్రను మందలించాడు. దీంతో గత అర్ధరాత్రి ఇంట్లో చొరబడి నాగేశ్వరరావుపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో నాగేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలోఉన్న నిందితుడు సురేంద్ర కోసం ముమ్మరం గాలింపు చేపట్టారు. (చదవండి: రౌడీషీటర్ షానూర్‌పై హత్యాయత్నం) -
నారా లోకేష్‌కు లీగల్ నోటీసు
సాక్షి, ప్రకాశం: తనపై తప్పుడు ప్రచారం చేసిన మీడియా చానళ్లు, టీడీపీ నాయకులకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం లీగల్ నోటిసులు పంపారు. తమిళనాడులో తనకుసంబంధించిన డబ్బు దొరికిందంటూ టీవీ5, న్యూస్18 మీడియాల్లో ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనపై లేనిది కల్పించి తప్పుడు వార్తలను ప్రచారం చేయింటారంటూ మంత్రి బాలినేని టీడీపీ నాయకులైన నారా లోకేష్, బొండా ఉమా, కొమ్మరెడ్డి పట్టాభిలతో పాటు టీవీ5, న్యూస్-18 ఛానళ్లకు ఆయన లీగల్ నోటీసులు పంపి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. కాగా, తమిళనాడులో గత నెలలో పోలీసులకు పట్టుబడ్డ 5 కోట్ల రూపాయల నగదు మంత్రి బాలినేనిదేనని టీడీపీ నాయకులు, కొన్ని మీడియా చానళ్లు అసత్య ప్రచారం చేశాయి. పట్టుబడ్డ 5 కోట్ల రూపాయాలు తమవేనని ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు ప్రకటించినా పట్టించుకోకుండా పదేపదే టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి బాలినేని న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. (ఎవరికీ సంబంధం లేదు.. ఆ 5 కోట్లు మావే) -
మూన్నాళ్ల ముచ్చటే!
పెద్దదోర్నాల: జాతీయ రహదారులు దేశంలోని వేల కిలోమీటర్ల దూరంలోని ప్రధాన నగరాలను కలిపే రాచబాటలు. కాలాన్ని, ఇంధనాన్ని ఆదా చేసే మార్గాలు. రోజూ వందలాది వాహనాలు ఈ మార్గాల గుండా ప్రయాణికులను, సరుకులను తరలిస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యతను కలిగిన జాతీయ రహదారులను నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా నిర్మించడం అధికారుల అలసత్వానికి పడుతోంది. కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. మండల పరిధిలోని రోళ్లపెంట నుంచి పెద్దదోర్నాల వరకు చేపట్టిన రోడ్ల నిర్మాణ పనుల్లో అడుగుడుగునా అధికారులు, కాంట్రాక్టుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. ఈ మార్గంలో ఇటీవల వేసిన రోడ్డు కొద్ది రోజులకే జారి పోయింది. రాయలసీమ, కోస్తా జిల్లాలను కలిపే ప్రధానమైన రహదారిని అధికారుల పర్యవేక్షణ లేకుండా నాసి రకంగా నిర్మించడంపై వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు గాలికి.. మండల పరిధిలోని కర్నూలు రహదారిలో ఉన్న రోళ్లపెంట నుంచి శ్రీశైలం రోడ్డులోని శిఖరం మీదుగా హనుమాన్ జంక్షన్ వరకు ఆయా రోడ్లు విజయవాడ పరిధిలో ఉండేవి. అయితే ఇటీవల ఆ రోడ్లను అనంతపురం పరిధిలోకి చేర్చటంతో అధికారుల పర్యవేక్షణ నామమాత్రమైంది. రోళ్లపెంట నుంచి పెద్దదోర్నాల వరకు రెండు భాగాలుగా సుమారు 34 కోట్ల రూపాయలతో ని«ర్మిస్తున్న రహదారులు నాసిరకంగా ఉన్నాయి. సాధారణంగా కొత్త రోడ్డు వేసే క్రమంలో పాత రోడ్డును డోజరుతో పెకిలించి ఆపై కొత్త రోడ్డును నిర్మించాల్సి ఉంటుంది. అలా చేయటం వల్ల కొత్త రోడ్డుకు గ్రిప్ ఉంటుంది. కాంట్రాక్టర్లు పాత రోడ్డును పెద్దగా కదిలించకుండా ఆపైన కొత్త రోడ్డు వేశారు. దీంతో రోడ్డు వేసిన కొద్ది రోజులకే అడుగుడుగునా జారిపోయి పాత రోడ్డు దర్శనం ఇస్తుండటంతో అధికారులు తలలు పట్టుకున్నారు. దీంతో హుటా హుటిన మండల పరిధిలోని యడవల్లి వరకు పలు ప్రాంతాలలో నాసిరకంగా ఉన్న రోడ్డును తొలగించి కొత్త రోడ్డును వేసేందుకు రంగం సిద్ధం చేశారు. తొలగించిన రోడ్డు కాకుండా మరి కొన్ని ప్రాంతాలలో రోడ్డు జారి పోవడంతో పాత రోడ్డే దర్శనం ఇస్తుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్ల నిర్మాణ పనులను మరింత నాణ్యతా ప్రమాణాలు జోడించి చేపట్టాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. -
భార్య, కుమార్తెను హతమార్చి.. కిరాతకం..!
ప్రకాశం,యర్రగొండపాలెం: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కట్టుకున్న భార్యను, కన్న కూతురిని కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన యర్రగొండపాలెంలోని అంబేడ్కర్ నగర్లో సోమవారం జరిగింది. ఈ హత్యలు ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరగ్గా అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులకు సమాచారం అందింది. స్థానిక ఒక ప్రైవేట్ డెయిరీలో పాలపట్టే వ్యాన్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్న కె.ముసలయ్య తన భార్య రేష్మ(21), కుమార్తె సమీర(3)లను హత్యచేసి ఆత్మహత్య కింద చిత్రీకరించేందుకు ఫ్యాన్‌కు చీర కట్టి ఉరివేసుకున్నారని నమ్మించేందుకు ప్రయత్నం చేశాడు. ముందుగా కుక్కర్ ప్లగ్ తీగతో గొంతుకు బిగించి హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపించారు. హత్య చేసిన తరువాత రేష్మ ఎడమ చేతి మణికట్టును కత్తితో కోసి రక్తపు మరకలు కింద పడకుండా జాగ్రత్త పడినట్లు వారు ఆరోపించారు. (భర్తను ఇంట్లో పూడ్చి.. ప్రియునితో సహజీవనం) ఆడపిల్ల పుట్టిందని వేధించేవాడు.. కొమరోలు మండలంలోని గుండ్రెడ్డిపల్లెకు చెందిన రేష్మను పుల్లలచెరువుకు చెందిన కె.ముసలయ్యకు ఇచ్చి 2016లో వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.80 వేలు, ఆ తర్వాత రూ.20 వేలు ఇచ్చామని మృతురాలి తండ్రి డి.హుస్సేనయ్య తెలిపాడు. వివాహం జరిగిన ఏడాదిన్నర తరువాత ఆడపిల్ల పుట్టిందని అప్పటి నుంచి తన కూతురిని తీవ్రంగా వేధించేవాడని మృతురాలి తల్లి జరీనా వాపోయింది. నిత్యం తాగివచ్చి గొడవ పడుతుండేవాడని, ఈ విషయాన్ని తన కుమార్తె ఎవ్వరికీ చెప్పకుండా గుట్టుగా కాపురం చేసుకుంటుందని ఆమె తెలిపింది. అయితే ముసలయ్య అక్రమ సంబంధం గురించి అడిగినందుకు రేష్మను అతికిరాతకంగా హత్యచేశాడని, అడ్డువస్తుందని ముక్కుపచ్చలారని పసికందును కూడా గొంతుకు తీగబిగించి హత్య చేశాడని వాపోయింది. మీ కుమార్తె గొడవ పడుతుందని ఆదివారం రాత్రి 7.15 గంటల ప్రాంతంలో ముసలయ్య ఫోను చేశాడని, అందుకు తాను సర్ది చెప్పినట్లు మృతురాలి తండ్రి హుసేనయ్య తెలిపాడు. కాసేపు ఆగిన తరువాత నా కుమార్తె రేష్మకు ఫోను చేసి మాట్లాడానని, మాట్లాడుతున్న సమయంలో అర్థంతరంగా ఆగి పోయిందని ఆయన తెలిపాడు. రాత్రి 10గంటలు దాటిన తరువాత నీ కుమార్తె ఉరివేసుకొని మరణించిందని ఫోను ద్వారా తెలిపాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంట్లో మధ్యాహ్నం 4 గంటల నుంచి కేకలు వినిపిస్తున్నాయని, భార్యభర్తలు గొడవ పడుతున్నారని తాము అనుకున్నామని పరిసర ప్రాంతాలకు చెందిన వారు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మార్కాపురం డీఎస్పీ తల్లి, కుమార్తె హత్యకు గురైన విషయం తెలిసిన వెంటనే మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి హుటాహుటిన యర్రగొండపాలెం చేరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గురయిన రేష్మ తల్లిదండ్రులు, బంధువులను ఆయన విచారించారు. తహసీల్దార్ కె.నెహ్రూబాబు శవ పంచనామా కార్యక్రమాలను చేయించారు. ఈ కేసును సీఐ పి.దేవప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్సై పి.ముక్కంటి దర్యాప్తు చేస్తున్నారు. -
జీవితంపై విరక్తితో ఆత్మహత్య
మోపాల్: మోపాల్‌కు చెందిన జనగాం సందీప్‌రెడ్డి (27) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు మోపాల్ ఎస్‌హెచ్‌వో పూర్ణేశ్వర్ శుక్రవారం తెలిపారు. ఆయన కథ నం ప్రకారం.. సందీప్‌రెడ్డికి మూడేళ్ల క్రితం డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన ప్రవళికతో వివాహం అయింది. వీరికి ఒక కుమార్తె ఉంది. సందీప్‌రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా కుటుంబంలో చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులతో మానసిక వేదనకు గురవుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది గురువారం ఉదయం పొలం వద్ద పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన అనంతరం వాంతులు చేసుకోవడంతో పురుగుల మందు వాసన వచ్చింది. కుటుంబ సభ్యులు గమనించి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి భూదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. -
యువతిని మోసగించిన ఆర్మీ క్లర్క్
వెలిగండ్ల: యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఆర్మీ క్లర్క్‌పై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజ్‌కుమార్ కథనం ప్రకారం.. మొగళ్లూరుకు చెందిన గంగవరపు ప్రవళ్లిక అదే గ్రామానికి చెందిన పూనూరి ప్రతాప్‌లు నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రతాప్ ఆర్మీలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. తల్లికి కుమారుడి ప్రేమ వ్యవహారం నచ్చ లేదు. ఈ నెలలో తెలంగాణకు చెందిన మరో యువతితో అతడికి వివాహం చేశారు. విషయం తెలుసుకున్న ప్రవళ్లిక, ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఈ నెల 8వ తేదీన స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాజ్‌కుమార్ ఇరువర్గాల బంధువులను పిలిపించి విచారించారు. ప్రవళ్లిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు చేస్తే ప్రతాప్‌కు వివాహం జరిగే వరకూ పట్టించుకోలేదని బంధువులు పోలీసుస్టేషన్ ముందు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. -
పోరాడి ఓడింది..!
నాగులుప్పలపాడు: మాచవరం విద్యుత్ ప్రమాద ఘటనలో తీవ్ర గాయాలతో 88 రోజుల కిందట ఒళ్లంతా కాలిన స్థితిలో ఆసుపత్రిలో చేరిన కాకామాను భాగ్యవతి (35) బతకాలని కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు ఫలిస్తాయన్నట్లు గత 10 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కాస్త కోలుకున్నట్లు, తెలివిగా ఉండటంతో అంతా సంతోషం అనుకున్నారు. ఇంతలోనే విధి వక్రించి ఆదివారం మధ్యాహ్నం ఆమె ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. వివరాల్లోకి వెళ్తే.. మే 14వ తేదీన రాపర్ల గ్రామ పొలాల్లో మిర్చి కోతకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ట్రాక్టర్ ఎక్కి వస్తుండగా డొంకకు ఆనుకొని ఉన్న విద్యుత్ స్తంభం ట్రాక్టర్ డోరుకు బలంగా తగిలి కరెంటు తీగలు ట్రాక్టర్‌లోని కూలీలపై పడ్డాయి. ఈ సంఘటనలో 9 మంది అక్కడికక్కడే మరణించడంతో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు కాకుమాను నాగమణి కాలిన గాయాలతో ఉన్నారు. వీరి ఇరువురిని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ట్రాక్టర్ డ్రైవర్ అదే రోజు రాత్రికి మరణించాడు. కాకుమాను భాగ్యవతి మాత్రం ఆ రోజు నుంచి కొన ఊపిరితో కొట్టుకుంటూ చికిత్స పొందుతుంది. అయితే 10 రోజుల కిందట నుంచి కాస్తంత కోలుకున్నట్లు తెలివిగా ఉండటంతో కుటుంబ సభ్యులలో బతుకుతుందేమో అన్న కొంత ఆశ కలిగింది. ఆ ఆశలను నీరుగారుస్తూ ఆదివారం మధ్యాహ్నం ఒంగోలు ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచింది. మృతురాలుకి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడి వయస్సు మూడేళ్లు ఉంటుంది. -
'పర్ఫెక్ట్' కంపెనీ గుట్టురట్టు చేసిన సిట్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :మద్యానికి బానిసైన వారు మద్యం దొరక్క శానిటైజర్ తాగి 16 మంది మృత్యువాత పడ్డారు. కురిచేడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసు దర్యాప్తు ‘‘పర్ఫెక్ట్’’గా సాగుతోంది. ఘటన జరిగి ఐదు రోజులు గడవక ముందే అందుకు కారణమైన పర్ఫెక్ట్ కంపెనీ మూలాలను పోలీసులు గుర్తించారు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు చేస్తూ వెళ్లిన సిట్ బృందం ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తయారు చేస్తున్న నకిలీ శానిటైజర్ గుట్టును రట్టు చేసింది. కనీసం ఈ శానిటైజర్ తయారీ కేంద్రంలో సాంకేతిక నిపుణులు గానీ కనీసం చదువుకున్న వారు గాని లేని పరిస్థితి. గ్రామాల్లో కూలీ పనులు చేసుకునే వారిని ఓ గోడౌన్లో ఉంచి వారి చేత శానిటైజర్ పేరుతో నకిలీవి తయారు చేసి సొమ్ము చేసుకుంటున్న వైనం పోలీసు దర్యాప్తులో బయటపడింది. దీనికి సంబంధించి కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్న సిట్ బృందం అసలైన సూత్రధారులను పట్టేపనిలో పడింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కురిచేడు మండల కేంద్రంలో జూలై 30వ తేదీ గురువారం రాత్రి శానిటైజర్ తాగి ఇద్దరు మరణించారనే వార్త బయటికొచ్చింది. అంతా అప్రమత్తమయ్యే లోపే శుక్రవారం 11 మంది, శనివారం ఇద్దరు, ఆదివారం మరొకరు చొప్పున ఏకంగా 16 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారి ఇళ్ల వద్ద పర్ఫెక్ట్ కంపెనీ శానిటైజర్ బాటిళ్లు గుర్తించిన పోలీసులు అవి ఎవరు అమ్మారనే దానిపై విచారణ జరిపినప్పటికీ కురిచేడులో వాటిని అమ్మిన మెడికల్ షాపులు నిర్వాహకులు అప్పటికే వాటిని దాచేసి తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. బృందం ఐదు రోజుల పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు శానిటైజర్ ఫ్యాక్టరీలకెళ్లి తనిఖీలు నిర్వహించింది. అయితే పర్ఫెక్ట్ కంపెనీ ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. హైదరాబాద్ నగరంలో శానిటైజర్లు అమ్మే మెడికల్ షాపులను క్షుణ్ణంగా తనిఖీలు చేసే క్రమంలో పర్ఫెక్ట్ కంపెనీ శానిటైజర్లను అమ్ముతున్న డిస్ట్రిబ్యూటర్ పాయింట్‌ను కనిపెట్టారు. వీరిని విచారించడంతో పాటు టెక్నాలజీని ఉపయోగించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ గోడౌన్లో అక్రమంగా తయారవుతున్న పర్ఫెక్ట్ కంపెనీ కేంద్రాన్ని పట్టుకున్నారు. అంతా అక్రమమే.. పర్ఫెక్ట్ కంపెనీ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన సిట్ బృందానికి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని చూసి ఒళ్లు జలదరించింది. కనీసం ఒక్క టెక్నికల్ పర్సన్ కూడా లేకుండా చదువులేని గ్రామీణ ప్రాంతాల కూలీలను తీసుకొచ్చి శానిటైజర్ పేరుతో ఏదో ద్రవాన్ని తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. శానిటైజర్లో ఐసోప్రొఫైల్ ఆల్కహాల్, ప్రొఫనాల్ కాకుండా మిథైలిన్ క్లోరైడ్ (డీసీఎం) ను ఉపయోగించి శానిటైజర్ తయారు చేస్తున్నట్లు తేలింది. ఈ మిథైలిన్ క్లోరైడ్ ప్రమాదకరమైనదని దానిని శానిటైజర్లో వాడకూడదని నిపుణుల ద్వారా తెలుసుకున్న పోలీసులు నిర్ఘాంతపోయారు. అక్కడ కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఫ్యాక్టరీ పేరుతో చూపుతున్న అడ్రస్, జీఎస్టీ, ఐఎస్ఓ సర్టిఫికెట్ వంటివి అన్ని తప్పుడు వాటిని సృష్టించి శానిటైజర్ తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరి వద్ద నుంచి కురిచేడులో మెడికల్ షాపు నిర్వాహకులు ఎంతమంది కొనుగోలు చేసి వీటిని అమ్మారనే విషయంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నారు. మెడికల్ షాపు నిర్వాహకులకు విషయం తెలిసినా బయటపడటం లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది తాగడం వల్లే కురిచేడులో అధిక శాతం మరణాలు సంభవించాయని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరినీ వదలం.. – ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశాం. ఇప్పటికే సిట్ అధికారులు పర్ఫెక్ట్ కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీని సీజ్ చేసి అందులో నిషేధిత మిథైలిన్ క్లోరైడ్‌ను కలుపుతున్నట్లుగా గుర్తించాం. ఇది ప్రమాదకరమైన కెమికల్. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఇందులో కురిచేడులోని మెడికల్ షాపు నిర్వాహకులకు ఎంతమందికి సంబంధాలున్నాయనే దానిపై ఆరా తీస్తున్నాం. అది నిజమని తేలితే వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు వెనుకాడం. -
ఆయనకు కాళ్లు, ఒళ్లు పట్టాలి..
బేస్తవారిపేట: రాజ్యాలు పోయాయి.. రాజులు పోయారు..రాచరికం అంతమైంది..కానీ అదే రాచరికపు పోకడలను గుట్టుగా కొనసాగిస్తున్నాడు ఓ ఉన్నతాధికారి. ఉన్నత ఉద్యోగం చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి తనకింది స్థాయి సిబ్బందితో ఊడిగం చేయించుకుంటున్నాడు. రాచరికపు పోకడలను అనుసరిస్తూ తనను తాను రాజులా భావించుకుంటున్నాడు. సిబ్బందితో చెయ్యకూడని పనులు చేయించుకుంటూ హీనాతి హీనంగా చూస్తుండటంతో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఆ అటెండర్లు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తన ప్రవర్తనతో విసుగు చెందిన సిబ్బంది కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇదీ..కథ బేస్తవారిపేట మండలం చింతలపాలెం వద్ద వెలిగొండ ప్రాజెక్ట్ భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఐదుగురు అటెండర్లు ఉన్నారు. ఎస్డీసీ ఎన్.విజయ్‌కుమార్ వారిని హీనంగా చూస్తున్నారు. ప్రభుత్వ నుంచి హౌస్ రెంట్, టీఏ, డీఏ పొందుతూ కార్యాలయంలోనే నివాసం ఉంటున్నాడు. కంభంలో నివాసం ఉండే అటెండర్ అనిల్ ఉదయం ఐదు గంటలకే వేడినీళ్లు, కాఫీ తీసుకురావాలి. అటెండర్లు కాళ్లు పట్టాలి అవసరమైతే ఆయన ఒంటికి మసాజ్ చేయాలి. అంతేకాదు ఆయన దుస్తులను సైతం ఉతికి శుభ్రం చేసి పెట్టాలి. ఇవి చేయకుంటే బూతు పురాణం మొదలు పెడతాడు. ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తుండటంతో ఏడాదిగా అటెండర్లు మనసు చంపుకుని చాకిరీ చేస్తున్నారు. కార్యాలయంలో పనిచేసే ఓ చిరుద్యోగి రోజూ మధ్యాహ్నం భోజనం ఉచితంగా పట్టుకు రావాల్సిందే. కార్యాలయంలోనే నివాసం ఉంటుండటంతో టీవీ ఒకరు, సన్ డైరెక్ట్ ఒకరు తెచ్చి పెట్టే వరకు ఒప్పుకోలేదు. వెహికిల్ అలవెన్స్‌లు తీసుకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ దొర కోసం కోళ్లు పెంచాలి క్యాంపుకు వెళ్లివచ్చేటప్పుడు సదరు ఉన్నతాధికారి రైతుల నుంచి కోళ్లు పట్టుకొస్తాడు. మీరు ఏం పెట్టి పెంచుతారో తనకు తెలియదని, పది రోజుల్లో మంచి సైజు రావాలంటూ ఆయన అటెండర్లను ఆదేశిస్తాడు. కోడిని కార్యాలయంలోనే కట్టేసి పెంచాల్సిన దుస్థితి. బాగా పెరిగిన తర్వాత ఆయన ఇంటికి పంపాల్సిన బాధ్యత కూడా అటెండర్లదే. నెల్లూరు వెళ్లి బాత్రూమ్లు శుభ్రం చేయాల్సిందే అటెండర్‌గా పనిచేసే మురళికి డ్రైవింగ్ కూడా వచ్చు. ఆయన్ను తన కారుకు డ్రైవర్‌గా ఉపయోగించుకుంటున్నాడు. నెల్లూరు, విజయవాడ, కడప ప్రాంతాల్లో తన సొంత అపార్ట్మెంట్లకు మురళిని తీసుకెళ్తాడు. మూడు.. నాలుగు రోజులు అక్కడే ఉండాల్సి రావడంతో కరోనా సమయంలో ఇంట్లో ఉన్న ముసలి తల్లిదండ్రుల ఆలనపాలన చూసుకోలేక మురళి తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. నెల్లూరు అపార్ట్మెంట్లో ఎవరైనా ప్లాట్ ఖాళీ చేస్తే దానిలో టాయిలెట్స్, లెట్రిన్ క్లీన్ చేయాలి. గృహాల్లో బూజు దులపాలి. ఉన్నత ఉద్యోగం చేస్తూ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను సైతం సదరు అధికారి కాజేశాడు. ఫ్యాన్లు, బాత్రూమ్ షింక్‌లు నెల్లూరులోని తన సొంత ఇంటికి చేర్చుకున్నాడు. కలెక్టర్‌కు ఫిర్యాదు వ్యక్తిగత పనులు చేయకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తానని వెలిగొండ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ్‌కుమార్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదును కలెక్టర్, సీఏం కార్యాలయానికి బాధితులు పంపారు. సొంత పనులు చేస్తూ రాత్రి పూట కూడా కాపాలాగా ఉండాల్సిన పరిస్థితి ఉందని, కాళ్లు పట్టించుకోవడం, మరుగుదొడ్లు శుభ్రం చేయించుకోవడం వంటి పనులు చేస్తున్నాడని వారి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
థర్డ్ స్టేజిలోకి ఒంగోలు నగరం
ఒంగోలు టౌన్: ఒంగోలు నగర పాలక సంస్థకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా గుప్పెట్లో ఉంటూ ఏ క్షణాన దాని బారిన పడతమోనని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే నగర పాలక సంస్థకు చెందిన కీలకమైన ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. కింది స్థాయి సిబ్బంది వరకు కరోనా పాకింది. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యం రోడ్లపై ఉంటూ కాలువల్లోని చెత్తా చెదారం తీసే తమలో ఎంతమంది కరోనా బారిన పడ్డారోనంటూ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఒంగోలు నగర పాలక సంస్థపై కరోనా కొరడా ఝులిపించిన నేపథ్యంలో తదుపరి టార్గెట్ తామేనంటూ పారిశుద్ధ్య కార్మికులు హడలిపోతున్నారు. కాలువలు శుభ్రం చేస్తూ, రోడ్లపై ఉన్న చెత్తను తొలగిస్తున్న తాము త్వరగా కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని, అధికారులు తమ గురించి కూడా పట్టించుకొని త్వరితగతిన నిర్ధారణ పరీక్షలు చేయించాలని వారు వేడుకుంటున్నారు. మురిపించి..మురిపించారు ఒంగోలు నగరంలో తొలి కరోనా కేసు నమోదైన మార్చి చివరి వారంలో యంత్రాంగం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్జీఓ కాలనీలో కరోనా కేసు రావడంతో ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ కింద మార్చేశారు. అక్కడ పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వర్తించారు. కరోనా కేసు వచ్చిన ఇంటితో పాటు ఆ కాలనీ మొత్తం కొన్ని రోజులపాటు ఏకధాటిగా శుభ్రం చేస్తూ బ్లీచింగ్ చల్లుతూ వచ్చారు. ఆ తర్వాత కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. పారిశుద్ధ్య కార్మికులకు కనీసం రక్షణ కవచాలు కూడా అందించకుండా పనులు చేయిస్తున్నారంటూ సాక్షి దినపత్రికలో వారి గోడుపై వరుస కథనాలు ప్రచురించారు. స్పందించిన నగర పాలక సంస్థ అప్పటికప్పుడు వారికి రెండు శానిటైజర్లు, రెండు మాస్క్‌లు, చేతులకు గ్లౌజ్‌లు అందించింది. దాంతో వారి పని అయిపోయినట్లుగా నగర పాలక సంస్థ అధికారులు చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం కరోనా ఒంగోలు నగరం మొత్తాన్ని చుట్టు ముట్టేసింది. దాదాపు ప్రతి కాలనీలో పదికి తగ్గకుండా కరోనా కేసులు నమోదై ఉన్నాయి. అదే సమయంలో ఒంగోలు నగర పాలక సంస్థలోని కీలక అధికారులంతా కరోనా బారిన పడ్డారు. కొంతమంది సిబ్బందికి కూడా కరోనా సోకింది. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ హడావుడిగా ప్రత్యేక వాహనాన్ని తెప్పించి కార్యాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించింది. అయితే నిత్యం కరోనా అంచున ఉంటూ విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికుల గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. థర్డ్ స్టేజిలోకి ఒంగోలు నగరం ఒంగోలు నగరంలో కరోనా థర్డ్ స్టేజీలో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. ముందుగా పేర్కొన్న విధంగా కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. కరోనా తొలి దశలో దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపించేవి. ప్రస్తుతం అలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు బయటకు కనిపిస్తున్నా కరోనా ఒక్కసారిగా వారిని పడేస్తోంది. ప్రస్తుతం ఒంగోలులో ఇలాంటి పరిస్థితులు ఉండటంతో ఎవరికి కరోనా ఉందో, ఎవరికి కరోనా లేదో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రోజూ ఉదయం, సాయంత్రం నగరంలోని అన్ని వీధులను చిమ్మడం, కాలువలను శుభ్రం చేసేవారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒంగోలు నగరంలో మొత్తం 786 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. వారిలో 105 మంది రెగ్యులర్ సిబ్బంది ఉండగా 681 మంది కాంట్రాక్టు కింద పనిచేస్తున్నారు. నగరం మొత్తం కరోనా కేసులు నమోదవుతుండటంతో ఈ 786 మంది పారిశుద్ధ్య కార్మికుల్లో ఎంతమంది కరోనా బారిన పడి ఉంటారోనని అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. పారిశుద్ధ్య విభాగాన్ని పర్యవేక్షించే శానిటరీ సూపర్‌వైజరే కరోనా బారిన పడ్డారు. రోజూ తమ డివిజన్‌కు వెళ్లి అక్కడ మస్టర్ వేసిన అనంతరం విధులకు హాజరయ్యే పారిశుద్ధ్య కార్మికుల్లో ఎంతమందికి కరోనా ఉండవచ్చన్న దానిపై చర్చ జరుగుతోంది. పారిశుద్ధ్య కార్మికులకు మూకుమ్మడిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని యంత్రాంగం నిర్ణయించింది. అంతకంటే ముందుగా నగర పాలక సంస్థ కార్యాలయంలోనే కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో అక్కడ మిగిలిన వారికి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. తమను ఎప్పుడు గుర్తించి నిర్ధారణ పరీక్షలు చేయిస్తారోనని పారిశుద్ధ్య కార్మికులు ఎదురు చూస్తున్నారు. -
అటవీ భూమి హాంఫట్..!
తిమ్మపాలెం (పొన్నలూరు): పొన్నలూరు మండలంలోని తిమ్మపాలెం గ్రామంలో చెరుకూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 787, 787/1తో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో సుమారుగా 1708 ఎకరాల ఫారెస్ట్, పశువుల మేత బీడు భూములు విస్తారంగా ఉన్నాయి. వీటిలో సుమారు 700 ఎకరాలు ఆక్రమణకు గురైంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ సానుభూతిపరులు అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలు చూసుకొని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. అప్పటి నుంచి నేటి వరకు అక్రమార్కులు తమ పట్టా భూమికి సమీపంలో ఉన్న అటవీ, పశువుల బీడు భూములను కొంచెం, కొంచెంగా ఆక్రమించుకుంటూ వస్తున్నారు. రోజులుగా అటవీ భూములను ఆక్రమించి గుట్టు చప్పుడు కాకుండా చదును చేసి జామాయిల్, కంది, బత్తాయి, వరి, మినుముతో పాటు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. మొదటిలో కొంత భూమిని మాత్రమే ఆక్రమించుకున్న ఆక్రమణదారులు ఈ వ్యవహారాన్ని ఎవరూ ప్రశ్నించకపోవడంతో ఎకరాల కొద్దీ భూమిని స్వాధీనం చేసుకుని హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. గత ప్రభుత్వం హయాం నుంచి ప్రభుత్వ భూముల ఆక్రమణకు అలవాటుపడిన గ్రామంలోని టీడీపీ నాయకులు నేడు కూడా యథేచ్ఛగా అటవీ భూమిని ఆక్రమించుకుంటున్నారు. టీడీపీ నాయకులు ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిగా చెప్పుకుంటూ తిరిగే ఒక దళారిని ఏర్పాటు చేసుకొని అతని ద్వారా గ్రామస్తులను, రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ తమపని తాము కానిస్తున్నారు. ఆక్రమిత భూమి విలువ ఎకరా రూ.3 లక్షలు: ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమి విలువ నేడు బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.3 లక్షలకు పైగా పలుకుతోంది. ఇలా ఆక్రమణకు గురైన వందల ఎకరాల అటవీ, పశువుల బీడు భూముల విలువ నేడు కోట్లలోనే ఉంది. అలాగే కొందరు అక్రమార్కులు వారు ఆక్రమించిన భూములకు ఎలాంటి పత్రాలు లేకుండానే మరొకరికి అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నారు. దీంతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారికి ఎకరా భూమి రూ.6 వేలు చొప్పున కౌలు కింద ఇస్తున్నారు. ఆక్రమిత భూమికి దొంగ చాటుగా పట్టాలు తెచ్చుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. అక్రమాల వలన కనీసం గ్రామంలోని పశువులు ఈ భూముల్లోకి వెళ్లడానికి దారి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ప్రభుత్వ భూమిని ట్రాక్టర్‌తో దున్నుతుంటే గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదని గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ భూమిని ఆక్రమించుకుంటూ పోవడం వలన పశువులు కూడా అటుగా పోయే మార్గం లేదని టీడీపీ సానుభూతిపరులను నిలదీశారు. మీ చర్యలు వలన గ్రామంలో గొడవలు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. అధికారుల ఆదేశాలు బేఖాతరు.. ఇదిలా ఉంటే తిమ్మపాలెంలో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆక్రమణదారులకు నోటీసులు పంపించారు. అలాగే ప్రభుత్వ భూమిని ఆక్రమించి వ్యవసాయ పనులు చేస్తే ట్రాక్టర్లను సైతం సీజ్ చేస్తామని గ్రామంలో ఇటీవల దండోరా కూడా వేయించి, ప్రభుత్వ భూమిలోకి ఎవరు వెళ్లినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయినా సరే గ్రామంలోని టీడీపీ సానుభూతిపరులు కావాలనే రెవెన్యూ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ హెచ్చరిక బోర్డులను తొలగించి తమ పట్టా భూములకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని ట్రాక్టర్లతో చదును చేసి ఆక్రమించుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తాము అటవీ, పశువుల బీడు భూములను సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేస్తామని, అప్పటి వరకు ప్రభుత్వ భూముల జోలికి వెళ్లవద్దని చెప్పినా వారు వెళ్లిపోయిన తరువాత అక్రమార్కులు తమపని తాము కానిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అటవీ, పశువుల బీడు భూముల ఆక్రమణపై స్పందించి పటిష్ట చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కిలాడీ లేడీ పెళ్లిళ్లు..
-
కట్టె కాల్చడానికీ.. కష్టమొచ్చె!
ప్రకాశం ,ఉలవపాడు: కరోనా...కడచూపులోనూ కన్నీటి కష్టాలు పెడుతోంది. కట్టె కాల్చడానికి దహన సంస్కారాలు చేయడానికి వీలు లేక కుటుంబ సభ్యులు దొంగతనంగా దహనం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం కరోనా సోకిన మృతదేహాలను పూడ్చిపెట్టడం, దహనం చేయడంలో ఇబ్బందులు లేవని అవగాహన కల్పిస్తున్నా నేటికీ అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవి కాదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే శనివారం రాత్రి ఉలవపాడు మండల పరిధిలోని చాగల్లు అటవీ భూమిలో మృతదేహాన్ని దహనం చేసిన సంఘటన. రోడ్డు ప్రమాదంలోమృతి చెందిన తన కుమారుడికి కరోనా ఉందని తెలియడంతో అంత్యక్రియలు చేయడానికి వీలులేక ఆ తండ్రి ఇబ్బందులు పడి గుర్తు తెలియని చోట టైర్లతో తగలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని జాగ్రత్తలతో ఖననం లేదా దహనం చేస్తే చాలని చెబుతున్నా గ్రామాల్లో అడ్డుచెప్పడం ఆగడం లేదు. అంత్యక్రియలకు నిరాకరించడం వల్లే.. గ్రామాల్లో కరోనాతో మృతి చెందిన వారిని రానివ్వకుండా అంత్యక్రియలు చేయకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను కుటుంబ సభ్యులు ఎంచుకుంటున్నారు. దీని వలన కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. గ్రామాల్లో పరిస్థితులు కరోనా వలన చాలా దారుణంగా ఉంటున్నాయి. మృతదేహాలను కనీసం పూడ్చిపెట్టే వీలులేదు. కాల్చడానికి కుదరడం లేదు. మరణం బాధని కలిగిస్తే మరణం తరువాత చేయాల్సిన కార్యక్రమాలు మరింత వేదన మిగులుస్తున్నాయి. అవగాహన తప్పదు... కరోనా మృతదేహాల అంత్యక్రియల విషయంలో ప్రభుత్వం ఎంతో బాధ్యతగా అవగాహన కల్పిస్తోంది. న్యాయశాఖ ఆధ్వర్యంలో పలు సూచనలు తెలియచేస్తున్నారు. కానీ గ్రామాల్లో పరిస్థితి మారడం లేదు. కరోనా మృతదేహాల అంత్యక్రియల విషయంలో మరింత అవగాహన పెరగాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజల్లో భయం ఇలాంటి పరిస్థితి కల్పించేలా చేసింది. ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ మానవత్వం మంటకలవకుండా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. దహనం చేసిన మృతదేహం..కోవిడ్ సోకిన వ్యక్తిదే ఉలవపాడు: మండల పరిధిలోని చాగల్లు గ్రామ అటవీ శాఖ పరిధిలోని జామాయిల్ తోటలో మృతదేహాన్ని శనివారం రాత్రి దహనం చేసిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని ఈ మృతదేహానికి సంబంధించి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. పలు కోణాల్లో విచారించిన పోలీసులు కేసును చేధించారు. సంతనూతలపాడు మండలం మైనంపాడు పంచాయతీ చల్లపాలేనికి చెందిన కరిచేటి శింగయ్య (29) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో మార్చి 23 నుంచి ఇంటి వద్దే ఉంటూ వర్క్‌ఫ్రం హోం చేసుకుంటున్నాడు. ఈ నెల 23న మార్బుల్స్ కొనడానికి ఒంగోలుకు ద్విచక్ర వాహనం పై వెళ్లి తిరిగివస్తుండగా రాత్రి 8 గంటల సమయంలో పేర్నమిట్ట వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొనడంతో మృతి చెందాడు. 24 న పోస్ట్‌మార్టం నిర్వహించిన తరువాత కరోనా పాజిటివ్ ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి అంత్యక్రియలు చేయడానికి గ్రామంలో వెళ్లి అడుగగా గ్రామస్తులు ఒప్పుకోలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో 25న రిమ్స్ బయట ఓ అంబులెన్స్ డ్రైవర్ దహనక్రియలు చేయడానికి రూ.25 వేలు ఇస్తే అన్నీ తాను చూసుకుంటానని చెప్పడంతో రూ.17 వేలకు మాట్లాడుకున్నారు. దహనం చేయడానికి టైర్లు, పెట్రోలు కొనుగోలు చేసుకున్నాడు. చాగల్లు వద్ద అడవిలో మృతదేహాన్ని డ్రైవర్ తీసుకుని వచ్చి దహనం చేశారు. రాత్రి వరకు మంటలు వస్తుండడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సమాచారం సేకరించారు. రిమ్స్‌కు సంబంధించిన వైద్యులు పోస్టుమార్టం చేయడానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఇది పోస్టుమార్టం చేసిన మృతదేహం అని, కరోనా సోకిన వ్యక్తికి చేసిన ప్యాకింగ్ అని తెలిపారు. దీని పై వివరాలు సేకరించడంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. వారి తల్లితండ్రులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిశీలించారు. తమ కుమారుడి మృతదేహంగా గుర్తించారు. అప్పటికే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి సంఘటనా స్థలిలో వివరాలు సేకరించారు. కందుకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో ఎస్సై దేవకుమార్ లు ఒక్కరోజులోనే కేసును ఛేదించారు. వారి తండ్రి వద్ద స్టేట్మెంటును రికార్డు చేసుకున్నారు. గ్రామంలో అంత్యక్రియలు నిరాకరించడంతో ఈ పరిస్థితి వచ్చి దహనం చేసినట్లు పేర్కొన్నాడు. -
తల్లిలాంటి వదినే బాలికను..
నిర్భయ, దిశ వంటి అనేక కఠినమైన చట్టాలు వస్తున్నా మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులపై సైతం కామాంధులు కన్నేస్తున్నారు. మైనర్లని కూడా చూడకుండా వారి జీవితాలను బుగ్గి చేస్తున్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దిశ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయడంతో బాలికలపై జరుగుతున్న అకృత్యాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే జిల్లాలో ముగ్గురు బాలికలపై జరిగిన అఘాయిత్యాలు బయటపడటం కలవరపెడుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు :కంటికి రెప్పలా కాపాడాల్సిన అయిన వారే వారి పాలిట యమపాశాలుగా మారుతున్నారు. రక్షించాల్సిన వారే తమ జీవితాలను ఛిద్రం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోదిస్తున్నారు. విషయం బయటపడితే తమతో పాటు కుటుంబ పరువు పోతుందనే భయంతో పంటి బిగువున బాధను భరిస్తూ నరకయాతన పడుతున్నారు. ఒక పక్క కరోనా మహమ్మారి మానవాళి జీవితాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో అంతకంటే భయంకరమైన కొన్ని మానవ మృగాలు అభం శుభం తెలియని మైనర్ బాలికలపై తమ కామ వాంఛను తీర్చుకుంటూ వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా జరుగుతున్న అమానవీయ ఘటనలు వింటే ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరూ తీవ్ర ఆందోళన, మనోవేదనలకు గురవ్వాల్సిన దుస్థితి దాపురించింది. తమ జీవితాలను బాగు చేయాల్సిన తల్లిదండ్రులు, అన్న వదినలు, అక్కాచెల్లెళ్లు ఇలా పేగుబంధాలనే నమ్మలేని దుర్భర పరిస్థితి నెలకొంది. జిల్లాలో మైనర్ బాలికలపై జరుగుతున్న వరుస దుర్ఘటనలు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ♦ జిల్లాలో గత వారం రోజుల్లో మూడు దుర్ఘటనలు జరిగాయి. వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. తల్లిదండ్రులు మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కావలి సమీపంలోని ముసునూరు ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక వారి వద్ద నుంచి వచ్చి అన్న, వదినల వద్ద ఉంటుంది. అయితే తల్లి తరువాత తల్లిలా భావించే వదినమ్మే ఆ బాలికను డబ్బు కోసం ఓ వ్యభిచార ముఠాకు రూ.27 వేలకు అమ్మివేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికను డబ్బిచ్చి కొన్న వ్యభిచార ముఠా కందుకూరు శివారు ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ బాధ భరించలేక వారి నుంచి తనకు రక్షణ కల్పించమంటూ సదరు బాలిక డయల్ 100 కు ఫోన్ చేయడంతో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు కందుకూరు పోలీసులు బాలికను వ్యభికార కూపం నుంచి రక్షించి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలికతో వ్యభిచారం చేయించే ముఠాతో పాటు ఆమె వదినపై కూడా దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ ఘటన అయిన వారి అండ కోరుకునే బాలికలకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ♦ ఒంగోలు నగరంలో జరిగిన మరో ఘటన అమ్మతనానికే మచ్చ తెచ్చేలా ఉంది. బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళ భర్తతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఏడేళ్లుగా అతనికి దూరంగా ఉంటోంది. కొంతకాలం పాటు కుమార్తెలిద్దరూ తల్లి వద్దే ఉన్నారు. అయితే తల్లి ప్రవర్తన నచ్చని చిన్న కుమార్తె అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. పెద్ద కుమార్తె మాత్రం తల్లివద్దనే ఉంటూ 9వ తరగతి చదువుతోంది. అయితే తల్లి బలరాం కాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పరచుకుని సహజీవనం సాగిస్తోంది. అయితే ఆ కామాంధుడి కన్ను తన కూతురులాంటి మైనర్ బాలికపై పడింది. ఈ క్రమంలో మైనర్ బాలికను బెదిరించి రెండుసార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పగా కామాంధుడిని చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన ఆమె గోల చేయవద్దంటూ కూతురికి నచ్చజెప్పి ఇద్దరికి పెళ్లి చేస్తానంటూ చెప్పింది. అయితే తల్లితో సహజీవనం చేసే వ్యక్తితో తనకు పెళ్లి ఏంటని భావించిన బాలిక బేస్తవారిపేటలోని అమ్మమ్మ ఇంటికి చేరుకుని విషయం తెలియజేసింది. దీంతో బాధితులు దిశ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా కామాంధుడితో పాటు అతనితో సహజీవనం చేస్తున్న బాలిక తల్లిపై సైతం కేసు నమోదైంది. కంటికి రెప్పలా చూడాల్సిన తల్లి కన్న కూతురినే తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని చూసిన ఆమెను విషయం తెలిసిన వారంతా ఛీత్కరించుకుంటున్నారు. ♦ కొత్తపట్నంలో ఆలస్యంగా మరో ఘటన వెలుగు చూసింది. తల్లి చనిపోయి, తండ్రికి చూపు సరిగా కనిపించక ఉన్న బాలికపై ఓ కామాంధుడి కన్ను పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక ప్రస్తుతం ఏడు నెలల గర్భిణిగా ఉంది. అయితే కామాంధుడు చేసిన పాపానికి శాపమై తన కడుపులో బిడ్డగా పెరుగుతున్న విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను మథనపడుతూ మౌనంగా రోదిస్తున్న తరుణంలో దీనిని గమనించిన మేనత్త గట్టిగా ప్రశ్నించడంతో మృగాడి దాష్టీకాన్ని బయటపెట్టింది. దీంతో దిశ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో కామాంధుడిపై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ♦ ఇలా చెప్పుకుంటూ పోతే మైనర్ బాలికలపై వరుసగా లైంగిక దాడులు, అమానవీయ ఘటనలు అనేకం జరుగుతున్నాయి. అయితే గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ బాధితులు ఫిర్యాదు చేసేందుకు బయటికి వచ్చేవారు కాదు. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరగదనే భయంతో పరువు పోతుందనే ఆందోళనతో రహస్యంగా ఉంచేవారు. అయితే దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు మైనర్ బాలిక, మహిళలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి కేసులు నమోదు చేయడంతో పాటు బాధితులకు అండగా నిలుస్తుండటంతో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. -
శ్రుతి లేదు.. భృతి లేదు
చీరాల అర్బన్: ఒక కమ్మని పాటకు శ్రుతి ఎంతో ప్రధానం. లయబద్దంగా సాగే పాటకు శ్రుతి సక్రమంగా ఉంటేనే ఆ పాట శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది. శ్రుతి, లయను సమ్మోహనంగా మిళితం చేసి గానం చేస్తే ఆ పాట సంగీత ప్రియులను రంజింప చేస్తుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న సంగీతాన్ని అందరికీ పంచే కళాకారులు జిల్లాలో ఎందరో ఉన్నారు. అలానే జానపద కళాకారులు, సుమధుర గాత్రంతో రంగస్థలంపై ఏకపాత్రాభియం చేస్తూ నాటకాన్ని రక్తికట్టేంచే వారూ లేకపోలేదు. ఎంతో మంది ప్రముఖులతో సన్మానాలందుకున్న కళాకారులు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. శ్రుతిలయలను నమ్ముకున్న వారు నేడు భృతి కోసం ఎదురు చూస్తున్నారు. సప్త స్వరాలను సమ్మోహనంగా ఆలపించడంతో పాటు సంగీత వాద్యాలను అలవోకగా పలికిస్తూ పలువురికి సంగీత, వాద్య విద్యను చెప్పే కళాకారుల జీవితాల్లో కరోనా కల్లోలం సృష్టించింది. సంగీత వాద్య కళాకారులకు లాక్డౌన్ కారణంగా ఉపాధి కరువైంది. చీరాల, వేటపాలెం మండలాలల్లో ఎంతో మంది సంగీత, రంగస్థల కళాకారులు ఉన్నారు. వీరిలో చాలా మంది సంగీత, వాద్య కళాకారులు కళను నమ్ముకుని జీవిస్తున్నారు. ఒకప్పుడు చీరాలలోని వాణి కళానికేతన్ లో ఎంతో మంది సంగీతాన్ని నేర్చుకున్నారు. ప్రస్తుతం వారందరూ వేర్వేరు ప్రాంతాలలో స్థిరపడి మంచి సంగీత కళాకారులుగా రాణిస్తున్నారు. చీరాలలో వీణ, వయోలిన్‌తో పాటు సంగీతం చెప్పేవారు కళాకారులు ఉన్నారు. ఒకప్పుడు సంగీత కళలకు పెట్టింది పేరుగా ఉన్న చీరాలలో ప్రస్తుతం తక్కువ సంఖ్యలోనే కళాకారులు ఉన్నారు. కొంతమంది ఇంటివద్దనే సంగీతం నేర్పుతుండగా, మరికొందరు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి సంగీతం, వయోలిన్ నేర్పుతున్నారు. అలానే నాదస్వర కళాకారులకు కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. లాక్డౌన్ కారణంగా నాలుగు నెలలుగా శిక్షణ తరగతులు నిర్వహించడంలేదు. కొంతమంది సంగీతం, నాట్యం ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటున్నారు. విజయవాడకు చెందిన నాట్యకళాకారిణి ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు ఆన్లైన్లో నాట్యం నేర్పుతున్నారు. చీరాలకు చెందిన 20 మంది విద్యార్థులు ప్రతిరోజూ ఆన్లైన్లో చూస్తూ నాట్యం నేర్చుకుంటున్నారు. అలానే సంగీతం కూడా అదే మాదిరిగా ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. రంగస్థలంపై రాణించినా..! రంగస్థలంపై ఏకధాటిగా గంటల కొద్ది ప్రదర్శనలు ఇచ్చి ఎందరో ప్రముఖుల చేత సన్మానాలు అందుకున్న కళాకారులు నేడు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. జానపద కళలు, నాటకాలు, ఏకపాత్రాభినయాలు వంటివి చేసి అందరిని మెప్పించినా ప్రస్తుతం వారికి ఆదరణ కరువైంది. జాండ్రపేటలో నివసించే చల్లా రాజేశ్వరి రేడియో ఆర్టిస్ట్. ఆమెను కళాకారిణిగా గుర్తించి ప్రభుత్వం గుర్తింపు కార్డు అందించింది. ఎన్నో స్టేజి ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాలు ఇచ్చినా కళాకారుల పెన్షన్ మాత్రం రావడంలేదని వాపోయింది. ఐదు సంవత్సరాలుగా కళాకారులకు ప్రభుత్వం అందించే నగదు కోసం దరఖాస్తులు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కళాకారులను కూడా కరోనా సమయంలో ఆదుకోవాలని వారు విన్నవించుకుంటున్నారు. అలానే వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇటీవల పట్టణంలోని 26 వార్డులో ఉన్న కళాకారులకు నిత్యవసరాలు, కూరగాయలను పంపిణీ చేశారు. కళలకు జీవం పోసే కళాకారుల జీవనం కరోనా వైరస్ కారణంగా కష్ట పరిస్థితుల్లోకి వెళ్లింది. ఆన్లైన్లో సంగీత పాఠాలు.. చీరాల వైకుంఠపురంలోని బాలసాయినగర్కు చెందిన కొణికి సుష్మ బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. చిన్న వయస్సు నుంచే కర్నాటక సంగీతం నేర్చుకున్న సుష్మ కర్నాటక సంగీతంలో డిప్లమో పొందింది. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దనే ఉంటూ తాను నేర్చుకున్న సంగీతాన్ని ఆన్లైన్ ద్వారా మరికొందరికి నేర్పుతోంది. -
రెండు గోడల మధ్య చిక్కుకున్న చిన్నారి
ఒంగోలు: ఆరేళ్లపాప రెండు గోడల మధ్య ఇరుక్కుపోయి దాదాపు రెండు గంటలకుపైగా తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పాప సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఈ సంఘటన స్థానిక ఇందిరమ్మ కాలనీ మూడో లైనులో గురువారం జరిగింది. లక్కె ముద్దుల కృష్ణ, ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి పక్కపక్కనే ఇళ్లు నిర్మించుకున్నారు. రెండిళ్ల మధ్య సన్నని ఖాళీ వదులుకున్నారు. కనీసం అడుగు గ్యాప్ కూడా లేదు. కృష్ణ ఆరేళ్ల కుమార్తె మీనాక్షి ఆడుకుంటూ ఆ గ్యాప్‌లోకి వెళ్లి ఇరుక్కుపోయింది. కదల లేని స్థితిలో పాప కేకలు విని కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారు వచ్చారు. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. కొంతమంది పాపకు తాడు అందించి బయటకు తీసుకొద్దామని చేసిన యత్నం విఫలమైంది. మరికొంత మంది కర్ర సాయంతో బయటకు తీసేందుకు యత్నించగా అది కూడా విఫలమైంది. పాప తండ్రి అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు. జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావుతో పాటు ఒంగోలు ఫైర్ ఆఫీసర్ వై.వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. లోపలకు వెళ్లేందుకు, బాలికను రక్షించేందుకు పరిస్థితిని అంచనా వేసి గోడలను పగలగొట్టక తప్పదని నిర్ణయించుకున్నారు. పాపకు దెబ్బ తగలకుండా గోడకు తమ వద్ద ఉన్న అధునాతన యంత్రాలతో రంధ్రం చేసి గోడను పాక్షికంగా ధ్వంసం చేశారు. అనంతరం పాపను సురక్షితంగా బయటకు తీశారు. అప్పటి వరకూ జరుగుతున్న తతంగాన్ని ఉగ్గబట్టి చూస్తున్న జనంతో పాటు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.