
జగనన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు కమ్మనైన భోజనం అందిస్తున్నారు.. రోజుకు ఒక మెనూ అమలు చేస్తూ రుచికరమైన భోజనం విద్యార్థులకు పెడుతున్నారు. నాడు–నేడులో భాగంగా పాఠశాలలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏటికేడు విద్యార్థుల శాతం పెరుగుతోంది. నగరంలోని పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో దృశ్యాలివి..