healthy food
-
హెల్దీ తిండి.. కొత్త ట్రెండీ
వీలైతే నాలుగు రకాల స్నాక్స్.. కుదిరితే కప్పు కాఫీ.. సాయంత్రమైతే చాలు. విశాఖ వాసి మదిలో మెదిలో మొదటి ఆలోచన ఇదే. చిరుతిండి.. మన జీవితాల్లో భాగమైపోయింది. టీ తాగుతూ స్నాక్స్.. సాయంత్రం సరదాగా స్నాక్స్.. ఇంటికి చుట్టాలొస్తే స్నాక్స్.. చినుకుపడినా.. సమయమేదైనా.. స్నాక్స్ తిందాం మిత్రమా అన్నట్లుగా చిరుతిళ్లపై మనసు మళ్లిస్తున్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో చిరుతిళ్లలోనూ ఆరోగ్యాన్ని వెదుకుతున్నారు. విశాఖ సహా 30 నగరాల్లో స్నాక్స్ విక్రయాలు, ప్రజల ఇష్టాయిష్టాలపై ప్రముఖ స్నాక్స్ తయారీ సంస్థ ఫార్మ్‌లే విడుదల చేసిన ది హెల్దీ స్నాకింగ్–2024 నివేదిక పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. చిరుతిళ్లలో పోషకాల స్నాక్స్ వేరయా.. అవే మాకు ఇష్టమయా అంటూ 73 శాతం మంది చూసి మరీ తింటున్నారంట. మార్కెట్లోకి బెస్ట్ స్నాక్స్ ఏమొచ్చాయో అని ప్రతి 10 మందిలో తొమ్మిది మంది వెతుకుతున్నారని నివేదిక చెబుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చిరుతిళ్లకు గిరాకీ పెరుగుతోంది. టీ, కాఫీ తాగుతున్నప్పుడు వేడి వేడి సమోసా లేదంటే.. బిస్కెట్లు ఉండాల్సిందే. లంచ్, డిన్నర్‌కి మధ్య స్నాక్స్ టైమ్ ఫిక్సయిపోయింది. అందుకే భారతీయులకు చిరుతిండి ఇష్టంగా మారిపోయింది. అయితే ఇటీవల ఆహార పదార్థాల కల్తీపై ఆందోళనల నేపథ్యంలో.. స్నాక్స్ ఎంపికలోనూ జాగ్రత్త పడుతున్నారు. భారతీయులు ఎలాంటి స్నాక్స్ ఇష్టపడుతున్నారనే వివరాలను తెలుసుకునేందుకు ఫార్మ్‌లే దేశవ్యాప్తంగా 30 నగరాల్లో సర్వే చేసింది.ఈ వివరాలతో ది హెల్దీ స్నాకింగ్–2024 అనే నివేదికను విడుదల చేసింది. నగరంలోనూ సర్వే నిర్వహించగా.. ఆకలేస్తే పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి రెండు బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్లు లేదా బేకరీకి వెళ్లి సమోసా తినే రోజులు పోయాయని విశాఖ వాసులు చెప్పారంట.! కొనేది చిన్న ప్యాకెట్ అయినా.. అందులో ఏం ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి? వాటిలో పోషకాల విలువెంత? అవి తింటే వచ్చే అనర్థాలేమైనా ఉన్నాయా? ఇలా ప్రతి విషయంలోనూ మిస్టర్ పర్ఫెక్ట్లమని తెగేసి చెబుతున్నారు. మార్కెట్ ట్రెండ్.. మారిపోయిందండోయ్.. ప్రస్తుతం ఫుడ్ ప్యాకేజీ మార్కెట్‌ని స్నాక్స్ సంస్థలే శాసిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రూ.3.75 ట్రిలియన్ల ఫుడ్ ప్యాకేజీ ఇండస్ట్రీ ఉండగా.. ఇందులో 33.4 శాతం వరకూ స్నాక్స్, స్వీట్స్ పరిశ్రమలు ఆక్రమించేసుకున్నాయి. ఆరోగ్యకరమైన స్నాక్స్‌ని ఇష్టపడుతున్నారని తెలిసి.. వాటి తయారీ పైనే ఆసక్తి చూపిస్తున్నాయి. శరీరంలో తక్కువ కొవ్వు ఉత్పత్తి చేసే పాపింగ్, బేకింగ్, ఎయిర్ఫ్రైయింగ్, వాక్యూమ్ ఫ్రైయింగ్ మొదలైన ప్రాసెస్ విధానంలో తయారు చేసే స్నాక్స్ ఎక్కువగా మార్కెట్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డీప్ ఫ్రై చేసిన స్నాక్స్‌తో పోలిస్తే 75 శాతం కేలరీలను తగ్గిస్తాయనే ఉద్దేశంతో ఎయిర్ ఫ్రయర్ స్నాక్స్‌కే మొగ్గు చూపుతున్నారు.బ్రాండెడ్ స్నాక్స్ కావాలి ఒకప్పుడు స్నాక్స్ ప్యాకెట్ తీసుకుంటే కేవలం ఎక్స్పైరీ డేట్ మాత్రమే చూసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. స్నాక్స్ కొనుగోలు చేసినప్పుడు ఫస్ట్ అవి బ్రాండెడ్ సంస్థలు తయారు చేస్తున్నాయా లేదా అని చూస్తున్నారు. అంతేకాదండోయ్.. ప్రతి 100 మందిలో 73 మంది మాత్రం అందులో పోషకాలు ఏం ఉన్నాయి.? సోడియం కంటెంట్ ఎంత ఉంది.? అవి తినడం వల్ల కొవ్వు శరీరంలో పెరుగుతుందా లేదా.? ఆరోగ్యానికి హానికరమైన ముడిపదార్థాలేమైనా ఉన్నాయా అనేది కచ్చితంగా చెక్ చేస్తున్నారు.మిల్లెట్ల వైపు దృష్టి.. ఇప్పుడిప్పుడే స్నాక్స్ ప్లేస్‌లో మిల్లెట్స్ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సాయంత్రం సమయంలో బిస్కెట్, సమోసా, బజ్జీ, ఆలూ చిప్స్ మొదలైన వాటి స్థానాలను బాదం, పిస్తా, ఖర్జూరం, జీడిపప్పు, తృణధాన్యాలు, మొలకలు ఆక్రమించేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఈ మిల్లెట్స్‌ను ప్యాకేజింగ్ ఫుడ్‌గా మార్చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. 2025 నాటికి మిల్లెట్ స్నాక్స్ 20 శాతానికి చేరుతాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.స్నాక్స్ ప్లేస్‌ను పప్పుగింజలు ఆక్రమించుకుంటున్నాయి ఒకప్పుడు ఇంట్లో స్నాక్స్ తయారు చేసి.. వాటినే తినేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్యాకేజ్డ్ స్నాక్స్ రావడంతో వాటిపైనే మొగ్గు చూపుతున్నారు. ఇవి ఆరోగ్యానికి హానికరమని తెలుసుకున్నారు. దీంతో స్నాక్స్ స్థానాన్ని పప్పుగింజలు ఆక్రమించేసుకున్నాయి. ముఖ్యంగా బాదం, పిస్తా వంటివాటికే ఓటేస్తున్నారు. ప్రోటీన్, కాంప్లెక్స్, కార్బొహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తగినంతగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. యాంటీఆక్సిడెంట్, విటమిన్ ఈ వంటివి ఉండే బాదంను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తృణధాన్యాలు, పప్పుగింజలు పోషకాలు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. అందుకే చిరుతిళ్లలో పప్పుగింజలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. – షీలా కృష్ణస్వామి, పోషకాహార నిపుణురాలు -
హెల్దీ డైట్: సగ్గుబియ్యం పొంగనాలు..
పోషకాలు, కేలరీలు, కార్బోహైడ్రేట్లు, క్యాల్షియం వంటి విటమిన్స్ ఆరోగ్యానికి పుష్కలంగా దొరికే వంటకం ఇది. దీనిని ఏ విధంగా తయారుచేయాలో చూద్దాం..కావలసినవి..సగ్గుబియ్యం – అర కప్పు (గంట సేపు నానబెట్టాలి);పనీర్ తురుము – 75 గ్రాములు;వేరుశనగపప్పుల పొడి– 3 టేబుల్ స్పూన్లు;క్యారట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు;బంగాళదుంప – 1 (ఉడికించి తొక్క తీసి చిదమాలి);జీలకర్ర పొడి– టీ స్పూన్;ధనియాల పొడి– టీ స్పూన్;మిప్రో్పడి– టీ స్పూన్;ఉప్పు– అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;క్యాబేజ్ తరుగు – ము΄్పావు కప్పు;క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు (రెడ్, గ్రీన్ క్యాప్సికమ్);చీజ్ తురుము – 50 గ్రాములు (12 భాగాలు చేసుకోవాలి);నూనె – టీ స్పూన్.తయారీ..– ఒక పాత్రలో క్యాబేజ్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఐదు నిమిషాల సేపు పక్కన ఉంచాలి.– ఆ తర్వాత ఇందులో నూనె, చీజ్ మినహా మిగిలినవన్నీ వేసి బాగా కలిపి పన్నెండు భాగాలుగా చేయాలి.– ఒక్కో భాగంలో చీజ్ స్టఫ్ చేస్తూ గోళీలాగా చేయాలి.– గుంత పొంగనాల పెనం వేడి చేసి ఒక్కో గుంతలో ఒక్కో చుక్క నూనె రుద్ది పొంగనాన్ని పెట్టి మీడియం మంట మీద కాలనివ్వాలి.– ఒకవైపు కాలిన తర్వాత రెండోవైపు కాల్చాలి.పోషకాలు (ఒక్కో పొంగనంలో)..– కేలరీలు 63;– ప్రోటీన్ – 2.5 – 3 గ్రాములు;– కార్బోహైడ్రేట్లు – 8–9 గ్రాములు;– ఫ్యాట్ – 2–3 గ్రాములు;– ఫైబర్– గ్రాము;– క్యాల్షియం – 40–50 గ్రాములు.– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ -
ఇవి తిందాం.. ఉత్సాహంగా ఉందాం!
నాకు అది ఇష్టం, ఇది ఇష్టం లేదు అని అనకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచు తింటుండటం వల్ల ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడంతోపాటు మెరుపులీనే చర్మం, మంచి ఆరోగ్యం మన సొంతం అవుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకూ అవేమిటో చూద్దామా?టొమాటో... దీనిలోని లైకోపిన్ కాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలకి సంబంధించిన అనారోగ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మన చర్మానికి ఎండ తాలూకు ప్రభావాలనుండి రక్షించడంలో మిగతా పోషకాలతో పాటు టమాటోల పాత్ర చెప్పుకోదగినదే.బెర్రీస్... అన్ని రకాల బెర్రీస్... ముఖ్యంగా నేరేడుపండ్లు: వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశం ఉంది. అలాంటి అనారోగ్యలనుంచి బెర్రీస్ కాపాడుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి.యోగర్ట్ లేదా పెరుగు: ప్రోటీన్, కాల్షియం, విటమిన్–బి లను అందిస్తుంది. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్ కలగకుండా పోరాడతాయి. యోగర్ట్ మన శరీర ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకు, నాడీవ్యవస్థకు మేలుచేస్తుంది. క్యాన్సర్, ఎలర్జీలు, అధిక రక్తపోటు, హై–కొలెస్టరాల్ బారిన పడకుండా కాపాడుతుంది.బీన్స్....ప్రోటీన్, పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్, ఫైటోన్యూట్రియెంట్స్. ఇవన్నీ బీన్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వుకు సంబంధించిన చెడు లక్షణాలు ఉండవు. బీన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. షుగర్ లెవల్స్ సమతుల్యంగా ఉండేటట్లు చూస్తూనే సురక్షితమైన, నిలకడ అయిన నెమ్మదిగా ఖర్చయ్యే శక్తిని అందిస్తుంది. కొలెస్టరాల్ లెవెల్స్‌ని కొంతమేరకు తగ్గిస్తాయి. బీన్స్‌తో చేసిన కూరలు తిన్నప్పుడు కడుపు నిండినట్లు ఉంటోంది గాని అధిక క్యాలరీలు లేకపోవడం వలన బరువు పెరిగే సమస్యే ఉందదు.గ్రీన్ టీ... ఇది ఓ సూపర్ డ్రింక్. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చర్మాన్ని అంత త్వరగా ముడతలు పడనివ్వదు. కళ్ళకు మెరుపు అందిస్తుంది. కేటరాక్ట్ ముదరటాన్నీ నెమ్మదింపచేస్తుంది.ఆకుకూరలు... ఆకుకూరలు చాలా రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతాయి. వీటిలో విటమిన్ బి, సి, ఇ, ఫోలేట్, పోటాషియం, పీచుపదార్ధం సమృద్ధిగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి మంచిది. కాల్షియంని శరీరం ఇముడ్చుకోవటానికి తోడ్పతాయి. కేటరాక్ట్‌ను నిరోధించడంలో పాలకూర తోడ్పడుతుంది. అందుకే తిందాం... ఉత్సాహంగా ఉందాం. -
పాప్ కార్న్ ఆరోగ్యానికి మేలు చేస్తుందా..?
-
Sridevi Ashala: స్వానుభవమే పెట్టుబడి
అమ్మ చేతి గోరుముద్దకు ఉన్న రుచి చిన్నారులకే తెలుసు. రుచితో పాటు పోషకాలు నిండుగా ఉంటేనే పిల్లలు బలంగా ఎదుగుతారని స్వయంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని తయారుచేస్తూ అందిస్తున్నారు తెలంగాణలోని భువనగిరి వాసి శ్రీదేవి ఆశల. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో చంటిపిల్లల కోసం టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్ తయారుచేస్తూ బిజినెస్ ఉమన్‌గా రాణిస్తున్నారు. సాప్ట్వేర్ ఉద్యోగినిగా ఉన్న శ్రీదేవి పిల్లల ఆహారం వైపుగా చేసిన ఆలోచనను ఇలా పంచుకున్నారు. ‘‘ఇంజినీరింగ్ పూర్తయ్యాక పెళ్లవడంతోనే ఉద్యోగరీత్యా బెంగళూరుకు వెళ్లిపోయాను. అక్కడి పనివేళలతో పాటు ఉరుకుల పరుగుల మీద ఉండేది జీవితం. వండుకొని తినడానికి టైమ్ ఉండేది కాదు. కెరియర్ను దృష్టిలో పెట్టుకొని ఇన్స్టంట్, ఫాస్ట్ఫుడ్స్ మీద బాగా ఆధారపడేవాళ్లం. కొన్నాళ్లకు నేను ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా సంతోషించాం. మాకు పుట్టబోయే బిడ్డ కోసం చాలా కలలు కన్నాం. కానీ, అబార్షన్ కావడంతో చాలా బాధ అనిపించింది. మా జీవనశైలి సరిగా లేదని డాక్టర్ చెప్పడంతో ఆలోచనల్లో పడ్డాం. పరిశోధన అంతా ఇంట్లోనే.. అప్పటి నుంచి సమతుల ఆహారం గురించి తెలుసుకోవడం, పుస్తకాలు చదవడం, ఇంట్లో ప్లాన్ చేసుకోవడం .. ఇది కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్‌లా చేశాం. సేంద్రీయ ఉత్పత్తులకు పూర్తిగా మారిపోయాం. దీంతో పాటు గర్భవతులకు, చంటిపిల్లలకు కావాల్సిన పోషకాహారం ఇంట్లోనే తయారు చేయడం మొదలుపెట్టాం. బయట కొన్నవాటిలో కూడా ఏయే పదార్థాలలో ఎంత పోషకాహార సమాచారం ఉంటుందో చెక్ చేయడం అలవాటుగా చేసుకున్నాను. అడిగినవారికి తయారీ.. మా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత పాపకు ఇవ్వాల్సిన బేబీ ఫుడ్‌లో ఉండే రసాయనాల పరిమాణం చెక్ చేసినప్పుడు, చూసి ఆశ్చర్యమనిపించింది. నా పాపకు కెమికల్ ఫుడ్ ఎలా తినిపించాలా అని అనుకున్నాను. అందుకే, పాపకు అవసరమైనవన్నీ ఇంట్లోనే తయారుచేసుకునేదాన్ని. మెటర్నిటీ లీవ్ పూర్తయ్యాక ఆఫీసుకు వెళితే నేను ఫిట్‌గా ఉండటం చూసి, మా ఫ్రెండ్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు అని అడిగేవారు. నేను చెప్పే జాగ్రత్తలు విని, మాకూ అలాంటి ఫుడ్ తయారు చేసిమ్మని అడిగేవారు. చుట్టుపక్కల వాళ్లు అడిగినా చేసిచ్చేదాన్ని చిన్నపాప పుట్టిన తర్వాత పిల్లల పోషకాహారంపై దృష్టి పెట్టడం కొంత కష్టంగానే అనిపించింది. ఓ వైపు ఉద్యోగంలో ప్రయాణాలు కూడా ఉండేవి. పిల్లల పోషకాహారంపై ఆసక్తితో పాటు అనుభవం, న్యూట్రిషనిస్టులు, మెంటార్స్ అందరూ నా జాబితాలో ఉన్నారు. దీనినే బిజినెస్‌గా మార్చుకుంటే ఎలా వుంటుంది... అనే ఆలోచన వచ్చింది. వేరే రాష్ట్రం కావడంతో.. సాప్ట్వేర్ ఉద్యోగానికి రిజైన్ చేశాను. నేనూ, మా వారు చిదానందం ఇద్దరం చేసిన పొదుపు మొత్తాలను మేం అనుకున్న యూనిట్‌కు తీసుకున్నాం. అయితే, బెంగళూరులో ఉండేవాళ్లం కాబట్టి, అక్కడే అనుకున్న యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే లైసెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కష్టమయ్యేది. ఒక మహిళ బిజినెస్ పెట్టాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో స్వయంగా ఎదుర్కొన్నాను. షాప్స్‌లో ప్రొడక్ట్స్ ఇవ్వాలనుకుంటే ‘రెండు– మూడు నెలలు చేసి మానేస్తారా.. ఆ తర్వాత పరిస్థితి ఏంటి’ అనేవారు. ప్రొడక్ట్స్ అమ్మడం ఇంత కష్టమా అనిపించింది. కానీ, ఏడాదిన్నరపాటు అక్కడే బిజినెస్ కొనసాగించాను. నెలకు 20 లక్షల టర్నోవర్ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు యూనిట్ షిప్ట్ చేసి ఏడాది అవుతోంది. మొదట మేం అనుకున్న పెట్టుబడి కన్నా ఎక్కువే అయ్యింది. అయినా వదలకుండా నమ్మకంతో వ్యాపారాన్ని ముందంజలోకి తీసుకువచ్చాను. ‘కచ్చితంగా చేసి చూపిస్తాను అనే ఆత్మవిశ్వాసమే’ నా బిజినెస్‌కు పెట్టుబడి అని చెప్పగలను. నేను చూపాలనుకున్నది, చెప్పాలనుకున్నది కరెక్ట్ అయినప్పుడు ఎక్కడా ఆపకూడదు అనే పట్టుదలతో ఉన్నాను. అందుకే రెండున్నరేళ్లుగా ఈ బిజినెస్‌ను రన్ చేస్తున్నాను. ఇందులో మొత్తం 20 మందికి పైగా వర్క్ చేస్తుంటే, ప్రొడక్షన్ యూనిట్లో అంతా తల్లులు ఉండేలా నిర్ణయం తీసుకున్నాను. అమ్మలకు మాత్రమే బాగా తెలుసు పిల్లలకు ఎంత జాగ్రత్తగా, ఎలాంటి ఆహారం, ఎంత ప్రేమగా ఇవ్వాలనేది. ఆ ఆలోచనతోనే యూనిట్లో అమ్మలు ఉండేలా జాగ్రత్త తీసుకున్నాను. పిల్లల వయసును బట్టి రాగి జావ, మొలకెత్తిన గింజలు, మల్టీగ్రెయిన్స్, వెజిటబుల్స్‌తో తయారైన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారుచేస్తాం. నెలకు 20 లక్షలకు పైగా టర్నోవర్ చేస్తున్నాం. ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా విదేశాలకు కూడా మా ప్రొడక్ట్స్ వెళుతుంటాయి. ఒక మహిళ జాబ్ చేయడానికే ధైర్యం కావాలి. ఇక బిజినెస్ అయితే మరింత ధైర్యంతో పాటు ఇంటి నుంచి సహకారం కూడా ఉండాలి. అప్పుడే అనుకున్న వర్క్‌లో బాగా రాణిస్తాం’’ అని వివరించింది శ్రీదేవి. – నిర్మలారెడ్డి -
షాకింగ్! మంచి తిండికి దూరంగా 300,00,00,000 మంది
- కంచర్ల యాదగిరిరెడ్డి తిండి కలిగితే కండగలదోయ్... కండ కలవాడేను మనిషోయ్.. అని మహాకవి ఎప్పుడో చెప్పాడు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొద్దోగొప్పో అందరూ తిండి తినడమైతే తింటున్నారు కానీ, ఈ భూమి మీద సుమారు 300 కోట్ల మంది ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారానికి దూరంగా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ఈ విషయాన్ని స్పష్టం చేయడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 138 దేశాల సమాచారాన్ని ఈ సంస్థ విశ్లేషించింది. తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికల్లా భూమ్మీద ఆకలన్నది లేకుండా చేయాలని ఎఫ్ఏఓ తీర్మానం చేసుకుంది. అయితే ఏటేటా ఆరోగ్యకరమైన తిండికి దూరమవుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడాదిలో11.2 కోట్ల పెరుగుదల తిండి లేని పేదల గురించి తరచూ వార్తలు వస్తుంటాయి కానీ, తిన్న తిండితో ఆరోగ్యంగా ఉండలేని వారి గురించి తెలిసింది తక్కువే. ఈ క్రమంలోనే ఎఫ్ఏఓ ప్రతి దేశంలో ఆరోగ్యకరమైన తిండి తినగలిగిన వాళ్లు ఎంతమంది? అసలు ఆరోగ్యకరమైన తిండి అంటే ఏమిటన్నది తెలుసుకుని వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం 2020లో ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేని వారి సంఖ్య 300 కోట్లు. 2019 గణాంకాలతో పోలిస్తే 11.2 కోట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం ఆహారపు ధరలు పెరగడమేనని సంస్థ చెపుతోంది. ఈ మేరకు ఆదాయం పెరగకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించింది. దీని ప్రభావం ధనిక దేశాలపై కాకుండా, ఆహార ద్రవ్యోల్బణం అదుపు తప్పడం ద్వారా పేద దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుందని తేల్చి చెప్పింది. శక్తి అవసరాలను తీర్చగలగాలి ఒక మనిషి రోజువారీ శక్తి అవసరాలను తీర్చగలిగేదే ఆరోగ్యకరమైన ఆహారమని ఎఫ్ఏఓ నిర్వచిస్తోంది. అలాగే ఆయా దేశాల్లో నిర్వచించుకున్న పౌష్టికాహార మార్గదర్శకాలనూ సంతృప్తి పరచాలి. ఉదాహరణకు భారత్‌లో ప్రతి ఒక్కరు రోజుకు కనీసం 400 గ్రాముల కాయగూరలు, పండ్లు తినడం అవసరమని జాతీయ పోషకాహార సంస్థ పేర్కొంటోంది. చాలామంది ఈ స్థాయిలో వీటిని తీసుకోవడం లేదు. పైగా ఈ మోతాదుల్లో కాయగూరలు, పండ్లు తీసుకునే స్థోమత కూడా కొందరికి ఉండదు. ఒక కుటుంబం రోజువారీ ఆదాయంలో 52% లేదా అంతకంటే ఎక్కువను ఆహారానికి వెచి్చంచాల్సిన పరి స్థితి ఉంటే, దాన్ని స్థోమతకు మించిందిగా ఎఫ్ఏఓ చెపుతోంది. ఆఫ్రికాలోనే సగం దేశాలు సర్వే చేసిన 138 దేశాల్లో కనీసం 52 దేశాల జనాభాలో సగం మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత లేదని ఎఫ్ఏఓ సర్వే వెల్లడించింది. ఇందులో అత్యధికం ఆఫ్రికా ఖండంలో ఉండగా మిగిలినవి ఆసియా, ఓషియానా, ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఉన్నాయి. ఆహార కొరత అన్నది ఆఫ్రికా ఖండంలో ఎప్పుడూ సమస్యే కానీ, సహారా ఎడారి పరిసర దేశాల్లోని జనాభాలో 90 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. కరువు ప్రాంతాల్లో మూడింట ఒక వంతు ఇక్కడే ఉండటం, వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల ఆహార ధరలు భారీగా హెచ్చుతగ్గులకు గురవుతుండటం ఈ పరిస్థితికి కారణమని ఎఫ్ఏఓ విశ్లేషించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని ఇప్పుడు ఆఫ్రికా దేశాలకు గోధుమ దిగుమతులు సగం కంటే ఎక్కువ పడిపోయాయి. ఫలితంగా చాలా దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం అధికమైంది. సమస్యను మరింత జటిలం చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత లేని వారు ఒక్క భారత దేశంలోనే 97.3 కోట్ల మంది ఉన్నట్లు ఎఫ్ఏఓ దగ్గర ఉన్న సమాచారం చెపుతోంది. ఆసియా మొత్తం మీద 189 కోట్లు, ఆఫ్రికాలో సుమారు 100 కోట్ల మంది ఉన్నారు. అమెరికా, ఓషియానాల్లో సుమారు 15.1 కోట్ల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆజర్బైజాన్, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాత్రమే జనాభా మొత్తం పుష్టికరమైన ఆహారాన్ని కొనుక్కోగల స్థితిలో ఉన్నట్లు ఆ సర్వే నివేదిక తెలిపింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాల్లో 95 శాతం ప్రజలు కూడా మంచి స్థితిలోనే ఉన్నారు. పెరుగుతున్న జనాభా కూడా కారణమే ఆరోగ్యకరమైన ఆహారం అందుకునే స్థోమత లేకపోవడానికి పెరుగుతున్న జనాభా కూడా ఒక కారణం. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనుంది. 2050 నాటికి ఇది ఇంకో 35 శాతం పెరగనుంది. అంటే సుమారు 250 కోట్ల మందికి అదనంగా ఆహారం అవసరం. ఈ డిమాండ్‌ను తట్టుకోవాలంటే పంట దిగుబడులు ఇప్పుడున్న స్థాయికి రెట్టింపు కావాలి’అని యునైటెడ్ నేషన్స్ తరఫున అధ్యయనంలో పాల్గొన్న స్టాన్‌ఫర్డ్ వర్సిటీ ఎకనామిక్స్ విభాగం హెడ్ అబ్రమిస్కీ అన్నారు. పెరిగిపోతున్న జనాభాకు తగినంత ఆహారం పండించాలన్నా, పండించిన ఆహారం ప్రజల కడుపులు నింపడం మాత్రమే కాకుండా తగిన పుష్టిని ఇవ్వాలన్నా పలు రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు అవసరమని పేర్కొంటూ యూఎన్‌కు ఆయన ఓ నివేదిక కూడా అందజేశారు. ‘ఆహార వృథాను తగ్గించాలి’ ఆహార వృథాను వీలైనంత వరకూ తగ్గించడం. పండిన పంట వినియోగదారుడి చేతికి చేరేలోపు జరుగుతున్న వృథాను గణనీయంగా తగ్గించడం ద్వారా ఉన్న ఆహారాన్ని ఎక్కువమందికి చేరేలా చేయవచ్చునని ఐరాస ఇటీవల తన సభ్యదేశాలకు సూచించింది. వాతావరణ మార్పులను తట్టుకోగల రీతిలో కొత్త కొత్త వంగడాల సృష్టి, ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే భవిష్యత్తు ఆహార సవాళ్లను ఎదుర్కోగలమని నిపుణులు అంటున్నారు. పరిస్థితిని దిగజార్చిన కోవిడ్ ఆకలి కారణంగా 2018లో ఐదేళ్లు నిండకుండానే మరణించిన పిల్లల సంఖ్య 53 లక్షలు. 2020లో విడుదలైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ విషయం చెపుతోంది. ► ఐక్యరాజ్య సమితి నిర్దేశించినసుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో రెండోది‘జీరో హంగర్’. 2030 నాటికి ఆకలిని చెరిపేసేందుకు చేసుకున్న తీర్మానం ఇది. ► కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ప్రపంచమిప్పుడు ‘జీరో హంగర్’లక్ష్యాన్ని అందుకోలేని స్థితిలో ఉంది. ఒకపక్క వాతావరణ సమస్యలు సవాళ్లు విసురుతుండగా, కోవిడ్ పరిస్థితిని మరింత దిగజార్చింది. సమాజంలోని అసమానతలను ఎక్కువ చేయడం ద్వారా మరింత మంది ఆకలి కోరల్లో చిక్కుకునేలా చేసింది. ►ప్రపంచం మొత్తమ్మీద ఏటా 400 కోట్ల టన్నుల ఆహారం ఉత్పత్తి అవుతుండగా, ఇందులో 33 శాతం వృథా అవుతోంది. దీని విలువ ఏకంగా 60 లక్షల కోట్ల రూపాయలు. అభివృద్ధి చెందిన దేశాల్లో తినే ఆహారం ఎక్కువగా వృథా అవుతుండగా, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో పంటనష్టాలు ఎక్కువ. డిమాండ్‌కు తగ్గ ఆహారం కోసం.. ఆకలిని ఎదుర్కొనేందుకు మన దేశంలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే అనేక పథకాలు ఆచరణలో ఉన్నాయి. వాటిలో కొన్ని.. 1.నేషనల్ న్యూట్రిషన్ మిషన్: పోషణ్ అభియాన్ అని పిలిచే ఈ పథకాన్ని 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో పోషకాహార లోపాలను తగ్గించడం, రక్తహీనత, తక్కువ బరువున్న పిల్లలు పుట్టడాన్ని నివారించడం ఈ పథకం ఉద్దేశం 2. జాతీయ ఆహార భద్రత పథకం: 2007లో నేషనల్ డెవలప్మెంటల్ కౌన్సిల్ ప్రారంభించిన పథకం ఇది. 11వ పంచవర్ష ప్రణాళిక ముగిసే సమయానికి దేశంలో వరి ఉత్పత్తి రెండు కోట్ల టన్నులు అధిమించగా, గోధుమల ఉత్పత్తి 80 లక్షల టన్నులకు చేరుకుంది. కాయధాన్యాల దిగుబడి 20 లక్షల టన్నుల పైచిలుకుకు చేరుకుంది. 12వ పంచవర్ష ప్రణాళికలోనూ లక్ష్యానికి మించి దిగుబడులు సాధించాం. భవిష్యత్తులోనూ డిమాండ్‌కు తగ్గ ఆహారాన్ని పండించేందుకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ పలు వ్యూహాలను సిద్ధం చేసి అమలు చేస్తోంది. 3. రెండేళ్ల లోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాలను తగ్గించేందుకు, ఏడాది పొడవునా మంచి ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా చేసేందుకు ప్రభుత్వం జీరో హంగర్ పేరుతో ఇంకో పథకాన్ని అమలు చేస్తోంది. పోషకాహార లోపాలను అధిగమించేందుకు ఆహారానికి పోషకాలు జోడించడం కూడా ప్రభుత్వ ప్రయత్నాల్లో ఒకటి. -
గణేశ్ చతుర్థి: కుడుము..ఆరోగ్యకరము
వినాయక చతుర్థి వచ్చిందంటే చాలు ప్రతీ ఇంటిలో తొమ్మిది రోజుల పండగే. వినాయక చవితి అంటే పండగే కాదు., ఆరోగ్య జీవనాన్ని ప్రతిబింభించే సంస్కృతి కూడా..! చవితి రోజున దాదాపు 15 రకాల వనమూలికలతో పూజను చేయడం ఆనవాయితీ. అంతేకాదు గణేషునికి ప్రసాదంగా అందించే కుడుములు, ఉండ్రాళ్లు కూడా ఆరోగ్య ప్రధాయిని. విభిన్న ప్రాంతాలకు, సంస్కృతులకు చెందిన కుడుములు ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయని న్యూట్రీషనర్స్, ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ కుడుములు విభిన్న పేర్లతో విభిన్న రాకాలుగా ఉన్నప్పటికీ కొబ్బరి, బెల్లంతో తయారుచేసిన కుడుములను ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. కొంకణ్‌లో బయట రవ్వ కోటింగ్ ఇచ్చి తయారు చేసేవి ములిక్గా ప్రసిద్ది, మోదక్గా పేర్కొనే సంప్రదాయ కుడుములను అరటిపళ్లతో తయారు చేస్తారు. అలాగే కేరళలో మినప్పప్పు, స్పైసెస్తో సాల్టీ స్టీమ్డ్ వెర్షన్‌గా ఉప్పు కొజుకత్తై పేరిట వండి సమర్పిస్తారు. తెలంగాణాలో ఉండ్రాళ్లు, చలివిడి, వడపప్పు వంటి రకాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. హోమ్‌ఫుడ్స్ విక్రయించే చోట ప్రతి సంవత్సరం ఈ ఉండ్రాళ్లలో విభిన్న వెర్షన్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ బాదములు, జీడిపప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా జత చేస్తున్నారు. గోల్డ్‌డ్రాప్ సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ ‘‘బాల గణేషుని కథలో మోదక్ (కుడుములు) పట్ల ఆయన అభిరుచిని గురించి ప్రతి ఇంటిలోనూ, ప్రతి సంవత్సరం కథల రూపంలో చెబుతూనే ఉంటారు. అందువల్లే అవి వయసులకు అతీతంగా ఆకట్టుకుంటున్నాయి ’’ అని అన్నారు. పుష్కలంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్... సాధారణంగా కుడుములను బియ్యం పిండి, శకగపప్పు, మినప్పప్పుతో తయారు చేస్తారు. ఈ మిశ్రమంతో శరీరానికి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా అందుతాయి. ఈ కుడుముల్లోని కొబ్బరి–బెల్లం చూర్ణం అధిక మొత్తంలో కాల్షియంను అందిస్తాయి. కుడుములను స్వీట్, హాట్ రెండు రకాలుగానూ చేసుకోవచ్చు. బియ్యపు పిండితో పాటు మిల్లెట్స్, రాగి పిండితో చేసిన కుడుములు అధిక విటమిన్లు, ఫైబర్ అందిస్తాయి. వీటికి చూర్ణంలో భాగంగా కొత్తిమీర, ఆకుకూరలు, కరివేపాకు పొడి, ముద్దగా చేసిన ఆకుకూరపప్పు, డ్రై కర్రీలను వాడుకోవచ్చు. ఈ కుడుములను పిండితో చేస్తాం కాబట్టి కొద్ది రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచి మూడు రోజుల వరకు తినవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ప్రాచుర్యం పొందుతున్న మోమోస్ ఓ రకంగా కుడుముల లా తయారైనవే. అయితే వాటికన్నా ఇవి ఆరోగ్యకరం. మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతున్న ఆరోగ్య నియమాలు ఎంతో విశిష్టమైనవి. ప్రతీ పండుగకు విభిన్నమైన ఆహార పదార్థాలు, ప్రసాదాలు ఉంటాయి. శరీరానికి అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా అందడానికి ఈ తయారీ విధానం ఉపయోడపడుతుంది. అంతేకాకుండా కొత్త రుచులను అందిస్తాయి. చిన్న పిల్లలు, పెద్దవారు ఎవరైనా వీటిని ఆహారంగా తీసుకోవచ్చు. –జానకి,న్యూట్రీషనిస్ట్ -
కమ్మనైన గోరుముద్ద
జగనన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు కమ్మనైన భోజనం అందిస్తున్నారు.. రోజుకు ఒక మెనూ అమలు చేస్తూ రుచికరమైన భోజనం విద్యార్థులకు పెడుతున్నారు. నాడు–నేడులో భాగంగా పాఠశాలలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏటికేడు విద్యార్థుల శాతం పెరుగుతోంది. నగరంలోని పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో దృశ్యాలివి.. -
మధుమేహం రాకుండా చేసుకోండి ఇలా..!
పడిశం పదిరోగాల పెట్టు అన్నట్లు ఒక్క మధుమేహం చాలు... రకరకాల జబ్బులున్నట్టే. ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తుంది. కుటుంబ చరిత్రలో మధుమేహం ఉన్నవారు, ఊబకాయం ఉన్నవారు, వ్యాయామం చేయని వారు, త్వరగా మధుమేహం బారిన పడతారు. మధుమేహం వచ్చాక బాధపడేకంటే రాకుండా చేసుకోవడం చాలా మేలు. అసలు మధుమేహం మన జీవన శైలిలో ఉన్న లోపాల వలన వస్తుంది. కాబట్టి జీవనశైలిని, మన ఆహారపుటలవాట్లను మార్చుకుంటే మధుమేహం రాకుండా చూసుకోవచ్చు. అలాంటి చిట్కాలు చూద్దాం. ►పిండి పదార్థం ఎక్కువగా ఉన్న బియ్యం, గోధుమ లకు బదులు సిరిధాన్యాలు లేదా చిరుధాన్యాలు తీసుకుంటే చాలావరకు మధుమేహం తగ్గుతుంది. ►పంచదారకు బదులు బెల్లం లేదా తేనె తగు మోతాదులో వాడుకోవాలి. పంచదార పూర్తిగా నిషేధమే. ►ఉప్పును కూడా చాలా తక్కువ గా వాడుకోవాలి. ►పచ్చి కూరలైన కీరా, కారట్, బీట్రూట్, సొర, గుమ్మడి వంటి వాటిని తురిమి పెరుగులో వేసుకుని తింటే మధుమేహం చాలా వరకు నియంత్రణలో ఉంటుంది. ►రోజూ 30–60 నిమిషాలు ప్రాణాయామం, ధ్యానం, నడక వంటివి చేయాలి. ►ఆహారంలో సరైన కార్బోహైడ్రేట్లు (పొట్టు తో కూడిన ఆహారం – తక్కువ పోలిష్ పట్టిన బియ్యం, ఓట్స్, పొట్టు తీయని పప్పులు, పచ్చి కూరగాయలు, ఎక్కువ తీపిలేని పండ్లు తీసుకుంటూ, వ్యాయామం చేస్తే మధుమేహం అదుపులో ఉంటుంది. చదవండి: Urinary Incontinence: దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది! ట్రీట్మెంట్ ఉందా? -
Fish Haleem: ఇంట్లోనే ఫిష్ హలీమ్ తయారీ ఇలా!
Recipes In Telugu- బలవర్థక ఆహారంలో హలీమ్ కూడా ఒకటి. అనేక పోషకాలతో నిండిన హలీమ్‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మరి మసాలా ఘాటు, ఢ్రై ఫ్రూట్స్‌తో ఘుమఘులాడే ఫిష్ హలీమ్‌ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం! ఫిష్ హలీమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బోన్‌లెస్ చేప ముక్కలు – అరకేజీ, గోధుమ రవ్వ – కప్పు(రాత్రంతా నానబెట్టుకోవాలి), పచ్చిశనగపప్పు – పావు కప్పు (మూడుగంటలపాటు నానబెట్టుకోవాలి), పెసరపప్పు – పావు కప్పు (దోరగా వేయించి మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి), మినపప్పు – పావు కప్పు (మూడు గంటపాటు నానబెట్టుకోవాలి), అల్లం పేస్టు – టేబుల్ స్పూను, వెల్లుల్లి పేస్టు – ముప్పావు టేబుల్ స్పూను, పచ్చిమిర్చి – రెండు, బిర్యానీ ఆకు – ఒకటి, ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరుక్కోవాలి) పెరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి – అరటేబుల్ స్పూను, గరం మసాలా – టేబుల్ స్పూను, మిరియాలపొడి – టేబుల్ స్పూను, వేయించిన జీలకర్ర పొడి – పావు టేబుల్ స్పూను, యాలకులు – రెండు, లవంగాలు – రెండు, దాల్చిన చెక్క – ఒకటి, ఉప్పు – రుచికి సరిపడా, నెయ్యి – అరకప్పు, నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు, సన్నని నిమ్మచెక్కలు – రెండు మూడు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, పుదీనా తరుగు – పావు కప్పు, వేయించిన జీడిపప్పు – టేబుల్ స్పూను. తయారీ: ►చేప ముక్కలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, అరటేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టులు, కారం వేసి కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి ∙నానబెట్టిన చేపల్లో ముక్కలు మునిగేన్ని నీళ్లు పోసి ఉడికించి దించేయాలి ∙ఉడికిన చేపముక్కలను ఖీమాలా రుబ్బుకోవాలి. ►పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాలను పేస్టుచేసుకోవాలి. ►కుకర్‌లో పప్పులన్నింటిని వేసి మెత్తగా ఉడికించి, రుబ్బుకోవాలి. ►ఇప్పుడు కుకర్ గిన్నెలో రాత్రంతా నానబెట్టుకున్న గోధుమరవ్వ, రబ్బుకున్న పప్పు మిశ్రమం, పెరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్టు, మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్టు, ►మిరియాలపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాలో వేసి కలుపుకోవాలి. ►ఇప్పుడు మెత్తగా చేసి పెట్టుకున్న చేపమిశ్రమాన్నివేసి రెండు కప్పుల నీళ్లు పోసి అరగంటపాటు సన్నని మంటమీద ఉడికించాలి. ►మందపాటి పాత్రను స్టమీద పెట్టుకుని నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయను సన్నగా తరిగి వేయాలి. ►ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక తీసి, ఉడికిన చేప మిశ్రమంలో వేయాలి. నిమ్మరసం, కొత్తిమీర తరుగు, నెయ్యి, నిమ్మ చెక్కల, జీడిపప్పుతో గార్నిష్ చేస్తే ఫిష్ హలీమ్ రెడీ. చదవండి👉🏾Haleem Recipe In Telugu: రంజాన్ స్పెషల్.. ఎవరైనా సింపుల్‌గా చేసుకోగలిగే మటన్ హలీమ్ -
చద్దన్నం ప్రయోజనాలు ఇవే.. రోజూ తిన్నారంటే..
ఉదయాన్నే తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే బ్రేక్‌ఫాస్ట్ లేదా టిఫిన్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఇడ్లి, దోసె, ఉప్మా, చపాతి. పల్లెటూరి వాతావరణం లో పెరిగిన వాళ్ళు గానీ, పల్లె ప్రజలు కానీ తప్పనిసరిగా ఉదయం చద్ది అన్నం తింటారు.. రాత్రి వండిన అన్నాన్ని తెల్లారి ఆవకాయ..పెరుగు కలుపుకుని లేదా పచ్చిమిరప..ఉల్లిగడ్డ నంజుకుని ఒకప్పుడు తినేవారు. మధ్యాన్నం అన్నం తినేదాకా హుషారుగా పని చేసేవారు. ఎందుకంటే చద్ది అన్నంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా రోజూ చద్దన్నం తింటే రోజంతా ఉత్తేజంగా శక్తివంతంగా ఉంటారని పెద్దవాళ్లు చెబుతారు. చద్ది అన్నంలో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్లు దాదాపుగా 15 రెట్లు అధికంగా ఉంటాయి. పెరుగన్నంలో ఉల్లిపాయ, మిరపకాయని నంచుకుని తింటే..శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది. శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అధిక రక్తపోటు తగ్గి,శరీరం ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది. చదవండి: కీర దోసకాయలు తినేవారు ఈ విషయాలు తెలుసుకున్నారంటే! అంతేకాదు.. రాత్రిపూట మిగిలిన అన్నంలో అది మునిగే వరకు పాలు పోసి తోడేసి పొద్దున్నే అందులో పచ్చి ఉల్లిపాయి ముక్కలు, అల్లం, కరివేపాకు, జీలకర్ర కలుపుకుని తింటే కడుపులో ఉండే అనారోగ్య సమస్యలు తగ్గడంతోపాటు ఎముకలకి మంచి బలం కూడా. చద్దన్నం తింటే మంచిదే అని ఎక్కువసేపు ఉంచకూడదు. వీలయినంత తొందరగా తినేయాలి. చదవండి: Health Tips: తరుచూ పిల్లల్లో చెవినొప్పి.. ఇచా చేస్తే.. -
తరుచూ బీట్ రూట్, క్యారెట్, బంగాళ దుంప, ద్రాక్ష పండ్లు తింటున్నారా.. అయితే
కాలేయం అనేది మన శరీరంలో ముఖ్య అవయవం. దీన్ని ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్ల కారణంగా కాలేయం త్వరగా దెబ్బతింటుంది. అలా కాకుండా లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. దీనివల్ల లివర్ ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం ఇటీవల కాలంలో బాగా అలవాటైంది. జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపడమే కాకుండా ఊబకాయం కూడా వస్తుంది. దీనివల్ల కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇది లివర్ సిర్రోసిస్‌కు దారి తీస్తుంది. లివర్ సిర్రోసిస్ కారణంగా, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి వాటి వినియోగానికి దూరంగా ఉండాలి. లివర్‌ను కాపాడే పదార్థాల విషయానికి వస్తే.. ఓ స్ట్రాంగ్ కాఫీ తాగితే చాలు... ఎంతో రిలాక్స్ అవుతాం. కొన్ని రోజులుగా కాఫీపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు కాఫీని తాగడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తేల్చారు. కాఫీలోని ప్రత్యేక గుణాలు లివర్ క్యాన్సర్ రాకుండా చూస్తాయని తేలింది. కాబట్టి మోతాదు మించని కాఫీ, టీల వల్ల లివర్ ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కాఫీ, టీ అలవాటు లేకపోతే, కొత్తగా అలవాటు చేసుకోనవసరం లేదు. ఉదయమే గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం వల్ల కాలేయం ఆరోగ్యం బాగుంటుంది. చదవండి: చెమట పట్టడం మంచి లక్షణమే.. కానీ శరీర దుర్వాసనను తగ్గించాలంటే.. ద్రాక్షలో ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని కాపాడతాయి. కాబట్టి తరచు ద్రాక్ష పండ్లు తినడం ఎంతో మంచిది. అలాగే వెల్లుల్లి. దీనిని వెల్ ఉల్లి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని హానికర విషాలు తొలగిపోతాయి. కాలేయం ఆరోగ్యం బాగుంటుంది. బీట్ రూట్, క్యారెట్, బంగాళ దుంపల్లో కాలేయ కణాల పునరుత్పత్తికి ఉపయోగపడే ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం బాగుంటుంది. రోజూ వీటిని డైట్లో చేర్చుకుంటే కాలేయ పనితీరు మెరుగవుతుంది. ఆపిల్స్ కూడా కాలేయాన్ని కాపాడతాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాపిల్ తొక్క, లోపలి గుజ్జులోనూ పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇంకా యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తినొచ్చు. శరీరానికి కావాల్సిన ఎన్నో ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. రోజూ ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు బయటికి వెళ్లిపోతాయి. క్యాబేజీ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా మీ డైట్లో భాగం చేసుకోవడం మరచిపోవద్దు. చదవండి: వాష్‌రూమ్ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు.. ఎలా చెప్తే మారతారు మగాళ్లు? గుడ్ ఫ్యాట్స్, ఎన్నో పోషకాలు ఉండే నట్స్ కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ లివర్ని కాపాడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు కూడా లివర్ని కాపాడతాయి. వీటిని తినడం వల్ల గుండెకి మేలు జరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆలివ్ ఆయిల్లో ఎన్నో ఆరోగ్య గుణాలు దాగి ఉంటాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పరిశోధనలలో తేలింది. -
పిల్లలు కాయగూరలు, పండ్లు తినడం లేదా? నూడుల్స్ ఇష్టమా.. అయితే..
చిన్న పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అన్ని పోషకాలు ఉండే సమతులాహారం అవసరం. చాలా మంది పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో వారు తినేలా చేయవచ్చు. ఆకుకూరలు, కాయగూరలు తినడం ఇష్టం లేదనే పిల్లలకు కూరగాయలన్నీ కలగలిపి చేసే... గ్రిల్డ్ వెజిటెబుల్ శాండ్విచ్, వెజిటెబుల్ ఆమ్లెట్ లాంటివి తయారు చేసి ఇవ్వవచ్చు. నూడుల్స్ ఇష్టంగా తినేట్లయితే... అన్ని రకాల కూరల ముక్కలను దాంతో కలిపి వండి ఇవ్వవచ్చు. అన్నంతో లేక నూడుల్స్‌తో గుడ్డు/ఆకుకూరలు/కాయగూరలు కలగలిపి వెజ్‌ఫ్రైడ్ రైస్ /ఫ్రైడ్నూడుల్స్లా కూడా తయారు చేసి తినిపించవచ్చు. మాంసాహారం తినేవారు, చికెన్, మటన్, చేపల కూరలు పెట్టవచ్చు. సాధారణంగా పిల్లలు అవి ఇష్టంగానే తింటారు. అలాగే లెగ్యూమ్స్ (దాల్స్), బాదాం, జీడిపప్పు, వాల్నట్ వంటి నట్స్ ఇవ్వాలి. వాటిలో ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉన్నందున వారికి అవసరమైన అన్ని పోషకాలూ లభిస్తాయి. పండ్లు తినని పిల్లలకు వాటిని ముక్కలు గా కోసి కస్టర్డ్‌తో/ఐస్‌క్రీమ్‌తో కలిపి ఇవ్వడం, ఫ్రూట్ సలాడ్స్ రూపంలో అందించడం లేదా జ్యూస్‌గా తీసి ఇవ్వవచ్చు. పండ్లు తినని పిల్లలు కూడా పండ్ల రసాలను ఇష్టం గా తాగుతారు. ఇక పిల్లలు పాలు తాగకపోతే వారికి మిల్క్‌షేక్ తయారు చేసి ఇవ్వవచ్చు. చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. -
మష్రూమ్స్ మంచూరియా, మష్రూమ్స్ మటన్ కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా..?
ఎప్పుడూ ఒకేలా కాకుండా వంటకాలకు ఏదైనా ప్రత్యేకతను జోడించాలని ఆలోచన వస్తే ఎంపికలో మొదటి స్థానంలో ఉండేవి పుట్టగొడుగులు. వెజ్ అయినా.. నాన్ వెజ్ అయినా విందు పసందుగా మార్చేయాలంటే అన్నింటికీ అండగా నేనన్నానంటూ వచ్చి చేరుతాయి. రుచితో పాటు పోషకాలనూ సమృద్ధిగా అందిస్తాయి. మష్రూమ్స్ మటన్ కావలసినవి: ► మటన్– 500 గ్రాములు; టొమాటో – 250 గ్రాములు; ఉల్లిపాయ – 2 (సన్నగా తరగాలి); బటన్ పుట్టగొడుగులు – 200 గ్రాములు; కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్లు; ► నూనె – 6 టేబుల్ స్పూన్లు; లవంగాలు – 2; ఏలకులు – 2; సాజీర – అర టీ స్పూన్; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ► గరం మసాలా – పావు టీ స్పూన్; బిర్యానీ ఆకులు – 2; మెంతిపొడి – అర టీ స్పూన్; అల్లం పేస్ట్ – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు; ► కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి– టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత తయారీ: ప్రెజర్ పాన్‌లో నూనె వేసి, వేడి చేయాలి. ►లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, సాజీర వేసి, కొన్ని సెకన్ల తర్వాత, ఉల్లిపాయ తరుగు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ► అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి ∙దీంట్లో టమోటా ముక్కలు వేసి, గుజ్జులా అయ్యే వరకు ఉడికించాలి. ► దీంట్లో మటన్ ముక్కలను వేసి, గోధుమ రంగులోకి వచ్చే వరకు ఉడికించాలి. ► తర్వాత పుట్టగొడుగులు, కొబ్బరి పొడి, ఉప్పు వేసి, కప్పు నీళ్లను కలిపి, ప్రెజర్ కుకర్ మూత పెట్టి, 15 నిమిషాలు ఉడికించాలి. ► 10 నిమిషాలు చల్లారేవరకు ఉంచి, ఆ పైన కుక్కర్ మూత తీయాలి. ► ధనియాల పొడి, మసాలా వేసి, 5 నిమిషాలు ఉడికించి, దించాలి. ► కొత్తిమీర తరుగు వేసి, సర్వ్ చేయాలి. చదవండి: (మాంసాహారం డీప్ ఫ్రై లేదా రోస్ట్ చేస్తే.. ‘హెటెరోసైక్లిక్ అరోమాటిక్ అమైన్స్’ వల్ల) మష్రూమ్స్ మంచూరియా కావలసినవి: ►మైదా – అర కప్పు; మష్రూమ్స్ – 250 గ్రాములు; కార్న్‌ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్లు; అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; ►నీళ్లు – కప్పు; ఉప్పు – తగినంత; పంచదార – అర టీ స్పూన్; పచ్చి మిర్చి – 3 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; ►కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్; ఉల్లికాడల తరుగు – టేబుల్ స్పూన్; బెల్ పెప్పర్ – 1 (సన్నగా తరగాలి) సాస్ కోసం: నల్ల మిరియాల పొడి – చిటికెడు; పంచదార – చిటికెడు; సోయా సాస్ – టీస్పూన్ తయారీ: ►పుట్టగొడుగులను కడిగి, తుడిచి, సగానికి కట్ చేయాలి. ఒక గిన్నెలో సాస్ మినహా పై పదార్థాలన్నీ తీసుకోవాలి. ► తగినన్ని నీళ్లు పోసి పిండిని బాగా కలుపుకోవాలి.స్టౌ పై బాణలి పెట్టి, తగినంత నూనె పోసి, వేడి చేయాలి. ► పుట్టగొడుగులను పిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, తీసి, పక్కన పెట్టుకోవాలి. ►అదే నూనెలో, కట్ చేసి పెట్టుకున్న ఉల్లి కాడలను వేసి, నిమిషం సేపు వేయించి, తీసి పక్కనుంచాలి. ►నల్ల మిరియాలు, ఉప్పు, చక్కెర, సోయా సాస్ కలిపి పక్కనుంచాలి. ఈ సాస్‌లో వేయించిన పుట్టగొడుగులను వేసి, అన్నింటికీ సాస్ పట్టేలా బాగా కదిలించాలి. ► తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీరతో అలంకరించి, సర్వ్ చేయాలి. చదవండి: (30 ఏళ్లకే బీపీ, షుగర్.. ఒక్కపూట అన్నానికే పరిమితం.. కోటీశ్వరులు మెచ్చిన తిండి..) -
Sankranthi: సున్నుండలు, పూతరేకులు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!
Sankranti Special Food Items In Andhra: సంక్రాంతి... పండుగ సమీపిస్తోంది. అమ్మ పిండివంటలు చేసేందుకు సిద్ధమవుతోంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని పెంచే వంటకాలను మనకోసం తయారు చేస్తుంది. మరి ఆ పనిలో మనం కూడా మనకు తోచిన సాయం చేయాలి కదా! ఎందుకు ఆలస్యం! ఏటా వచ్చే సంక్రాంతి రుచినే కొత్తగా ఆస్వాదించాలనుకునే వారు సున్నండలు, కజ్జికాయలు, పూతరేకులను ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. సున్నుండలు కావలసినవి: మినప్పప్పు– పావు కేజీ, పెసరపప్పు– పావుకేజీ, బెల్లం– 400గ్రా., ఏలకుల పొడి– ఒక టీ స్పూను, నెయ్యి– 200గ్రా. తయారీ: మందపాటి బాణలిలో నూనె లేకుండా మినప్పప్పు, పెసరపప్పులను దోరగా వేయించుకుని పొడి చేయాలి ∙ఆ పొడిలో బెల్లం పొడి, ఏలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి ∙అన్నీ సమంగా కలిసిన తరువాత కావలసిన సైజులో ఉండలు చేయాలి ∙నెయ్యి వాడకాన్ని తగ్గించాలనుకుంటే నేతిని పిండిలో కలపకుండా చేతికి కాస్త రాసుకుంటూ ఉండలు చేసుకోవాలి. గమనిక: మినప్పప్పు, పెసరపప్పులను విడిగా వేయించుకుంటే మంచిది లేదా ముందుగా మినప్పప్పు వేసి ఒక మోస్తరుగా వేగిన తరువాత పెసరపప్పును వేయాలి. కజ్జికాయలు కావలసినవి: మైదా పిండి లేదా గోధుమ పిండి – ఒక కేజి, నువ్వులు – ఒక కేజి, బెల్లం – 800గ్రా., ఏలకులు– 10 గ్రా., జీడిపప్పు– వందగ్రాములు నెయ్యి లేదా నూనె– వేయించడానికి కావలసినంత. తయారీ: ∙పిండిని చపాతీలకు కలుపుకున్నట్లుగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. మిగిలినవి సిద్ధం చేసుకునే లోపుగా ఇది బాగా నానుతుంది నువ్వులను దోరగా వేయించి చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా గ్రైండ్ చేయాలి. బెల్లాన్ని పొడి చేసి అందులో ఏలకుల పొడి వేసి అన్నీ సమంగా కలిసే వరకు కలపాలి జీడిపప్పును నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి గోధుమ పిండిని చిన్న చిన్న రౌండ్లు చేసుకోవాలి. ఒక్కొక్క రౌండును ప్రెస్సర్‌తో పూరీలా వత్తుకుని దానిని సాంచిలో పరిచి అందులో ఒక స్పూను నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని, ఒక జీడిపప్పును పెట్టి సాంచిని మూత వేయాలి. కజ్జికాయ ఆకారం వస్తుంది సాంచిలో నుంచి తీసి కజ్జికాయను మరుగుతున్న నూనెలో వేసి దోరగా కాలనివ్వాలి ఇవి దాదాపుగా ఇరవై రోజుల వరకు తాజాగా ఉంటాయి ‘సాంచి’ అంటే చెక్కతో చేసిన మౌల్డ్. ఇందులో పూరీని పెట్టి మడత వేస్తే అంచులు నొక్కుకుని పిండి అతుక్కుపోతుంది ∙లోపల పెట్టిన మిశ్రమం బయటకు రాకుండా ఉంటుంది ∙దీనికి బదులుగా వెనుక చక్రం ఉండే స్పూనులు కూడా ఉంటాయి ∙వాటిని కూడా వాడవచ్చు. గమనిక: కజ్జికాయలను నేతిలో వేయిస్తే రుచి పెరుగుతుంది కాని, కజ్జికాయలు త్వరగా మెత్తబడతాయి ∙ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే నూనెతో చేసుకోవడం మంచిది. పూతరేకులు కావలసినవి: చక్కెర లేదా బెల్లం– ఒక కేజి, సగ్గుబియ్యం– ముప్పావు కేజి, జీడిపప్పు– పావుకేజి, బాదంపొడి–100 గ్రా, ఏలకులు– 50గ్రా., నెయ్యి– 100 గ్రా. తయారీ: తెల్లగా, మెత్తగా చూడగానే నోరూరుతూ పూతరేకులు చుట్టడం సులభమే కాని అందుకోసం రేకులను తయారు చేసుకోవడం మాత్రం కొంచెం కష్టమే. ఇందుకు ప్రత్యేకంగా కుండలు దొరుకుతాయి ముందుగా సగ్గుబియ్యాన్ని ఉడికించి చిక్కటి గంజి చేసుకోవాల ∙కుండను మంట మీద బోర్లించి వేడెక్కిన తరువాత సగ్గుబియ్యం గంజిలో ముంచిన క్లాత్‌ను పరిచి తీసేయాలి ∙గంజి కుండకు అంటుకుని వేడికి పలుచని పొరలాగా వస్తుంది ఆ పొర విరిగిపోకుండా అట్లకాడతో జాగ్రత్తగా తీయాలి ఇలా ఎన్ని రేకులు కావాలంటే అన్నింటికీ ఇదే పద్ధతి రేకు ఏ సైజులో కావాలంటే క్లాత్‌ను ఆ సైజులో కట్ చేసుకోవాలి ∙ఇందుకు కాటన్ క్లాత్‌ను వాడాలి ∙చక్కెర, జీడిపప్పు, ఏలకులను పొడి చేసి కలుపుకోవాలి ఇప్పుడు రేకులను రెండు పొరలు తీసుకుని వాటికి నెయ్యిరాసి ఆ పైన చక్కెర లేదా బెల్లం పొడి, జీడిపప్పు, బాదం పొడి మిశ్రమాన్ని పలుచగా వేసి పైన మరొక పొర రేకును వేసి మడత వేయాలి. ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి ఎక్కువ మోతాదులో రేకులను తయారు చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కెర లేదా బెల్లంపొడి మిశ్రమాన్ని వేసి తాజాగా రేకులను చుట్టుకోవచ్చు. -
ఆ.. ఐడియా అక్కచెల్లెళ్ల జీవితాన్నే మార్చేసింది..
సాక్షి, ఎదులాపురం(ఆదిలాబాద్): వారిద్దరు అక్కాచెల్లెలు.. కరోనా సమయంలో పనులు, ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు సొంతంగా వ్యాపారం చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. అప్పుడే వారికి హెల్దీఫుడ్స్ వ్యాపారం చేయాలనే ఆలోచనను ఆచరణలో పెట్టారు. వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించి, ప్రస్తుతం స్థానిక గాంధీపార్క్ సమీపంలో చిన్నషాపు ఏర్పాటు చేసుకున్నారు. వారే ఆదిలాబాద్‌లోని వాల్మీకినగర్, శ్రీరాంకాలనీకి చెందిన కుమ్మరి లక్ష్మి, ఎల్లుల అనిత. లక్ష్మి భర్త కూలీ పని చేస్తుండగా, అనిత భర్త ప్రైవేటుగా ఎలక్ట్రిషియన్‌గా చేస్తుంటాడు. వీరు సొంతంగా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరా నిలుస్తూ, తమదైన శైలిలో ఉపాధి పొందుతున్నారు. కోవిడ్ సమయంలో పాఠశాలలు మూతపడ్డాయి. మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న వీరి తండ్రి గుమ్మల పొచ్చన్న ఉపాధి కోల్పోయాడు. అక్కడే వీరి ఆలోచనలకు అంకురార్పణ జరిగింది. తొలుత తక్కువ మొత్తంలో చపాతి, జొన్న, మునుప వంటి రొట్టెలు, రాగిజావ, అల్లం టీ, గ్రీన్ టీ, ఉడికించిన గుడ్డు వంటివి ఇంట్లోనే చేసి తండ్రి పొచ్చన్న అమ్మకానికి పంపించేవారు. ఆయన స్థానిక గాంధీపార్కు సమీపంలో వీటిని విక్రయించేవాడు. అలా నెలపాటు కొనసాగించగా స్థానికుల నుంచి ఆదరణ లభిస్తుండటంతో చిన్నషెడ్డు వేసుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. లభించే ఫుడ్ ఐటమ్స్ క్యారెజ్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, కిరా, కాకరకాయ, సబ్జి గింజల జ్యూస్‌లు రూ.20 వరకు లభిస్తాయి. అలాగే గ్రీన్, లెమన్, జీర టీలు, ఇతర రకాలు, పాలు, రాగి సంకటి, రాగి జావలు రూ.6 నుంచి రూ.10 వరకు ఉంటాయి. రొట్టెలలో రాగిరొట్టెలు, మినప, జొన్న, సర్వపిండి రొట్టెలు, చపాతీలు రూ.10 నుంచి రూ.15 లభిస్తాయి. రాగి, నువ్వు, మినుప లడ్డూలు, జొన్న గట్కా, మొలకలు, ఉడికించిన గుడ్డులు లభిస్తాయి. రొట్టెలను ఆర్డర్‌పై చేసి ఇస్తున్నారు. చాలా బాగుంటాయి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. నేను అప్పుడప్పుడు ఇక్కడ నుంచి రొట్టెలు, జ్యూస్‌లు పార్సిల్ తీసుకెళ్తాను. – అనిల్, శాంతినగర్, ఆదిలాబాద్ -
మీ పిల్లలు సరిగ్గా తినడం లేదా? ఈ 5 చిట్కాలు పాటిస్తే సరి!
పిల్లలచేత ఆకుకూరలు తినిపించడం ప్రతి తల్లికీ సవాలే! కానీ పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే అన్నిరకాల పోషకాలు అవసరమేకదా! మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం పిల్లలు తమకు తాముగా ఆహారం తీసుకుంటే చేకూరే ప్రయోజనాలు అనేకం. ఈ నైపుణ్యాలు జీవిత ఇతర భాగాల్లోనూ ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించింది. అలాగే తినే విధానం కూడా వారి ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపుతుందట. పిల్లలు ఇష్టంగా ఆహారం తింటే చిన్నతనం నుంచే ఉబకాయానికి చెక్ పెట్టొచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లలు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అలవరచుకోవడానికి నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు మీకోసం.. ఆహారం బాగా నమలాలి ఆహారం బాగా నమిలి తింటే వేగంగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. తద్వారా అవసరానికి మించి తినడాన్ని నిరోధించవచ్చు. ఆరోగ్యకరమైన తిరుతిండ్లు పిల్లలకు చిన్నతనం నుంచే ఆరోగ్యానికి మేలు చేసే చిరుతిండ్లు తినే అలవాటు చేయాలి. ఇది మంచి ఆహార అలవాట్లను నేర్పడానికేకాకుండా జంక్, ఫ్రైడ్ ఫుడ్ తినకుండా నివారించవచ్చు. ఆహార ఎంపికలోనూ భాగస్తులను చేయాలి కిరాణా దుకాణానికి వెళ్లినప్పుడు మీ పిల్లలను కూడా మీతోపాటు తీసుకెళ్లండి. ఆరోగ్యానికి మేలుచేసే వస్తువులను ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో వారికి నేర్పండి. ఈ విధమైన భాగస్వామ్యం వల్ల పిల్లలు ఆహారంపై ఆసక్తిని కనబరిచే అవకాశం ఉంటుంది. పిల్లలు ఇష్టపడేలా వండాలి ప్రతి రోజూ ఒకే విధమైన ఆహారం తింటే మీకేమనిపిస్తుంది? బోర్ కొడుతుంది కదా! అందుకే ఎప్పటికప్పుడు రుచికరంగా ఉండేలా ఫ్రూట్స్, వెజిటబుల్స్‌తో కొత్త వంటకాలు ప్రయోగం చేస్తూ ఉండాలి. అప్పుడే పిల్లలు ఆసక్తిగా, ఇష్టంగా తింటారని నిపుణులు సూచిస్తున్నారు. పంచేద్రియాలు అనుభూతి చెందేలా చూపు, వాసన, రుచి, స్పర్శ, వినికిడి.. ఈ పంచేంద్రియాలు అనుభూతి చెందేలా ఆహారం ఉండాలని ఎప్పుడూ నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఈ చిన్న చిన్న పరిణామాలే పిల్లలకి ఆహారం పట్ల ఆసక్తి పెరుగేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చదవండి: ఏడేళ్ల కొడుక్కి మామ్స్ మనీలెసన్! మీరూ ట్రై చేయండి.. -
అవిసె గింజల పొడి, బాదాం, ఎండు ఖర్జూరంతో రాగి లడ్లు.. నెలకు లక్ష..
సుచేత భండారే 5 వేల రూపాయలతో రెండేళ్ల క్రితం రాగిలడ్లు చేయడం మొదలెట్టింది. ఇవాళ నెలకు లక్ష రూపాయల లడ్లు ఆన్లైన్లో అమ్ముతోంది. సేంద్రియ రాగులు.. అవిసె గింజల పొడి.. బాదాం, ఎండు ఖర్జూరం... వీటితో తయారు చేసే రాగిలడ్ల బలం ముందు జంక్ ఫుడ్ దిగదుడుపు. ‘భూమి నుంచి వచ్చేది తినండి పెనం నుంచి వచ్చేది కాదు’ అంటుంది సుచేత. ఈ లడ్డు లాంటి ఆలోచనను ఎవరైనా ఆచరణలో పెట్టొచ్చు. మీరు ఇంట్లో రాగి లడ్డు చేయాలంటే ఏమేమి ఉపయోగిస్తారు? సుచేత భండారే మాత్రం ఇవి ఉపయోగిస్తుంది. రాగి పిండి, బెల్లం, ఆవు నెయ్యి, అవిసె గింజల పొడి, బాదం పొడి, ఎండు ఖర్జూరం పొడి, ఏలకులు. వీటితో రాగిలడ్డూలు తయారు చేసి 16 లడ్డూలు ఒక మంచి అట్టపెట్టెలో పెడుతుంది. వాటిని ఎక్కడెక్కడి నుంచో రూ.439 రూపాయలు చెల్లించి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆమె ఈ పని కోసం ఏడు మంది గ్రామీణ మహిళలను పనిలోకి తీసుకుంది. అందరూ కలిసి ఇప్పుడు నెలకు దాదాపు 2,500 రాగి లడ్డూలు తయారు చేస్తారు. ఇంకా అటుకుల చిరుతిండి, బొరుగుల చిరుతిండి తయారు చేస్తారు. మొత్తం లక్ష రూపాయల బిజినెస్ జరుగుతుంది. పెద్ద కార్ఖానా లేదు. షాప్ లేదు. రెంట్ లేదు. ఏమీ లేదు. ఆన్లైన్ మీదే అన్నీ పార్శిల్ అయిపోతాయి. ఒకసారి సుచేత లడ్లు తెప్పించుకున్నవారు మళ్లీ మళ్లీ ఆర్డరు పెడుతుంటారు. ఆమె ఆలోచన సుచేత భండారేది పూణె సమీపంలో ఉన్న వడ్నేర్ భైరవ్ అనే గ్రామం. ‘నా బాల్యం అంతా బలవర్థకమైన చిరుతిండ్లతోనే గడిచింది. మా పొలంలో వరి, బంగాళ దుంపలు తప్ప దాదాపు అన్నీ పండించేవాళ్లం. ఇంట్లో నాకు పచ్చి కొబ్బరి, అటుకులు, రాగి లడ్లు, బొరుగులు, సున్ని ఉండలు, మేము పండించిన పండ్లు ఇవి పెట్టేవాళ్లు. బజారులో దొరికేది ఏదీ నేనే తినలేదు. అలాగే స్కూల్ అయిపోయిన వెంటనే మా పొలానికి వెళ్లేదాన్ని. ముఖ్యంగా కోత సమయాల్లో నేను చాలా ఉత్సాహంగా ఉండేదాన్ని. మట్టితో నాకు అప్పుడే అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు అది నా పనిలో కనిపిస్తోంది’ అంటుంది 35 ఏళ్ల సుచేత. వ్యవసాయం మీద ఆసక్తితో అగ్రికల్చర్ బిఎస్సీ చేయాలనుకుంది కాని కుదరక డిగ్రీలో కామర్స్ చదివింది. ఆ తర్వాత కొన్నాళ్లు పూణెలో కాల్ సెంటర్ నడిపింది. ‘నా కాల్‌సెంటర్ బాగా నడుస్తున్నా నేను చేయాల్సిన పని ఇది కాదే అనిపించేది’ అంది సుచేత. ఆలోచన మెరిసింది పూణెలో కాల్ సెంటర్ పని చేస్తున్నప్పుడు సుచేత తరచూ రకరకాల బృందాలతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లేది. ‘ఆ సమయంలో ఇష్షో బుష్షో అనకుండా చలాకీగా నేనొక్కదాన్నే ఉండేదాన్ని. మిగిలినవాళ్లు తొందరగా అలసిపోయేవాళ్లు. చమటలు కక్కేవాళ్లు. నేను హాయిగా ఎంత దూరమైనా నడిచేదాన్ని. ఎందుకిలా అని ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి నేను తిన్న హెల్దీ తిండి అనిపించింది. నీ జీవితంలో జరిగేది నువ్వు ఎలాగూ మార్చలేవు... కానీ నీ కడుపులో పడేదాన్ని మార్చగలవు అనుకున్నాను. వెంటనే ఊరికి వచ్చి రాగి లడ్డూల తయారీ మొదలెట్టాను. ఆరోగ్యకరమైన చిరుతిండ్లు తయారు చేసి అమ్ముదామని నిశ్చయించుకున్నాను. పిల్లలు, స్త్రీలు ముఖ్యంగా వీటిని తినాలి’ అంది సుచేత. 2019లో మొదలు ఇంతా చేసి ఈ ఆలోచన వచ్చి ఎంతో కాలం కాలేదు. రెండేళ్ల క్రితమే. అయితే రసాయనాలు లేని పదార్థాలు వాడాలని సుచేత నిశ్చయించుకుంది. బజారులో రాగులు దొరుకుతాయి. అవి మందులు కొట్టి పండించినవి. కాని తనకు సేంద్రియంగా పండిన రాగులు కావాలి. అందుకు సుచేత కొంతమంది రైతులను సంప్రదించి వారిని సేంద్రియ పద్ధతిలో రాగులు పండించేలా ఒప్పించింది. పండాక మార్కెట్ రేటుకు కొంటామని హామీ ఇచ్చింది. ‘మొదలు రైతులకు నమ్మకం కుదరలేదు. నాక్కూడా శ్రమ అయ్యింది. కాని ఇప్పుడు ఐదారు మంది రైతులు నా కోసం పండిస్తున్నారు’ అంది సుచేత. రాగిలడ్లు మరింత బలవర్థకం కావాలంటే ఏం చేయాలని న్యూట్రిషనిస్ట్లను అడిగింది. వారు అవిసె గింజలను సూచించారు. సరే... బాదం, ఎండు ఖర్జూరం ఎలాగూ బలమే. వాటన్నింటిని కలిపి కొలతలు ఖరారు చేసి తన మార్కుతో 5 వేల రూపాయల పెట్టుబడితో లడ్లు తయారు చేసింది. మొదట బంధువులు, స్నేహితులు.. తర్వాత నోటి మాటగా, సోషల్ మీడియా ద్వారా ఆమె రాగి లడ్లు ఫేమస్ అయ్యాయి. ఎర్త్‌పూర్ణ సంస్థ సిబ్బ్బంది ఎర్త్‌పూర్ణ సుచేత భండారే ఈ బలవర్థకమైన తిండ్లను తయారు చేసేందుకు ‘ఎర్త్‌పూర్ణ’ అనే సంస్థను ప్రారంభించింది. అంటే ‘సంపూర్ణభూమి’ అని అర్థం. ‘భూమి నుంచి తీసుకున్నది తిరిగి భూమికి చేరితేనే భూమి సంపూర్ణంగా ఉంటుంది. సహజమైన పద్ధతిలో పండింది సహజమైన విధంగా ఆరగించి ఆ మిగిలిన వృధాను భూమిలో కలవనిస్తే ఆ భూచక్రం సజావుగా ఉంటుంది. కెమికల్స్ ప్రమేయం ఉన్న ప్రతి పని భూమిని అసంపూర్ణం చేస్తుంది’ అంటుంది సుచేత. పర్యావరణ హితమైన, ఆరోగ్యహితమైన ఆహార ప్రచారానికి పని చేస్తున్న సుచేత స్వలాభం భూమిలాభం కలిగేలా చూస్తున్నారు. ఇది చాలామంది గమనించదగ్గ ఫార్ములానే. చదవండి: Health Tips: వేరు శెనగలు, ఖర్జూరాలు, కిస్మిస్లు తరచుగా తింటే... -
తల్లిపాలు: మొదటి మూడురోజుల్లో వచ్చే పాలలో ఔషధ గుణాలు..
సాక్షి, బన్సీలాల్‌పేట్ (హైదరాబాద్): తల్లిపాలు పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పలువురు వక్తలు అన్నారు. బోయిగూడ మల్టీ ఫంక్షన్హాల్లో సోమవారం తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కె.హేమలత, గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజీ హెచ్ఓడీ డాక్టర్ మహాలక్ష్మి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ బి.విద్యులత, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడారు. తల్లిపాలు బిడ్డ ఎదుగుదల, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి నృత్యరూపకం, నాటకాలు, ఉపన్యాసాల ద్వారా గర్భిణులు, బాలింతలకు వివరించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు పండ్లు, గాజులు, పువ్వులు తదితరాలను అందజేశారు. తల్లిపాలలో ఔషధ గుణాలు.. సనత్‌నగర్: తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం సనత్‌నగర్ అల్లావుద్దీన్ కోఠి–2, బల్కంపేట–ఇందిరాగాంధీ పురం అంగన్వాడీ సెంటర్లలో తల్లిపాల విశిష్టతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయా సెంటర్ల అంగన్వాడీ టీచర్లు హాజరై తల్లులకు, మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రసవం సాధారణంగా జరిగినా, శస్త్ర చికిత్స ద్వారా జరిగినా గంట లోపు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ప్రసవానంతరం మొదటి మూడు రోజుల్లో వచ్చే పాలలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని, బిడ్డకు ఉదర కోశ వ్యాధులు, న్యూమోనియా వంటి వ్యాధులు రాకుండా కాపాడతాయని చెప్పారు. అంగన్వాడీ టీచర్లు ప్రవీణదేవి, శోభారాణి, బబిత, ఏఎన్ఎం అనురాధ పాల్గొన్నారు. -
సక్సెస్ఫుల్ సలాడ్!
మొలకెత్తిన విత్తనాలు, క్యాప్సికమ్, టొమాటో, క్యారట్, బీట్ రూట్ వంటి కొన్ని రకాల పచ్చి కూరగాయల ముక్కలు సన్నగా కట్ చేసి, ఉదయం పూట సలాడ్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదనే అవగాహన చాలామందిలో ఉంటుంది. కానీ, రోజూ అలా సలాడ్ తయారు చేసుకునే తీరిక అందరికీ ఉండదు. ముఖ్యంగా ఉద్యోగస్థులకు.‘సైడ్’ డిష్‌గా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా భావించే ఈ హెల్తీ సలాడ్ స్థిరమైన సంపాదనకు దారి చూపుతుందని భావించింది పూణెలో ఉంటున్న మేఘా బఫ్నా. ఐదేళ్ల క్రితం రూ.3500తో మొదలుపెట్టిన మేఘా హెల్తీ సలాడ్ వ్యాపారం ఇప్పుడు ఆమెకు నెలకు లక్షన్నర రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోంది. ‘నా నైపుణ్యాల పట్ల నాకు చాలా నమ్మకం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో 15 ఏళ్ల పాటు ఉన్నాను. పనిలో ఎంత బిజీగా ఉన్నా బ్రేక్‌ఫాస్ట్ ్టగా నేను తీసుకున్న సలాడ్ నన్ను ఆరోగ్యంగా ఉంచింది. దీన్నే బిజినెస్‌గా మార్చుకుంటే..? అనే ఆలోచన వచ్చినప్పుడు సలాడ్ వ్యాపారి గా మారిపోయాను’ అంటారు మేఘా. అనారోగ్యం తెచ్చిన మార్పు తన జీవితంలో ఎంత ముఖ్యమైనదో వివరిస్తూ ‘9వ తరగతి చదువుతున్న సమయంలో అనారోగ్య కారణంగా ఆపరేషన్ వరకు వెళ్లాను. నా కాళ్లు నా స్వాధీనంలోకి రావడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. పెద్దయ్యాక వచ్చే ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్లు ముందే హెచ్చరించారు. దీంతో ఎప్పుడూ బయట ఆహారం తీసుకోలేదు. కాలేజీ స్థాయి నుంచి ఆఫీసు వరకు.. అన్ని రోజుల్లోనూ నాకు నేనుగా తయారు చేసుకున్న ప్రత్యేక భోజనం ఎప్పుడూ నాతోపాటు ఉంటుంది. మా కొలీగ్స్ కూడా నా సలాడ్ బాక్స్‌ను తిని, మెచ్చుకునేవారు. దీనినే మార్కెట్ చేయమని వారు చెబుతుండేవారు’ అని నాటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటారు మేఘా. తాజా తాజా సలాడ్స్ ‘జంక్ ఫుడ్ ఎక్కడైనా సులభంగా లభిస్తుంది. కానీ, మంచి ఆరోగ్యకరమైన సలాడ్స్ మాత్రం అందుబాటులో లేవు. తాజా సలాడ్స్ లభించకపోవడం అనే సమస్యను నేను పరిష్కరించాలనుకున్నాను. అందుకు మా కుటుంబసభ్యులతోనూ చర్చించాను. అలా 2017లో సలాడ్ బిజినెస్ మొదలుపెట్టాను. ప్రచారం కోసం వాట్సప్, ఫేస్‌బుక్‌లను మాత్రమే ఉపయోగించాను’ అని వివరించే మేఘా మరెక్కడా ప్రమెషన్లు ఇవ్వలేదని, పూర్తిగా సేంద్రియ పదార్థాలతోనే సలాడ్స్ తయారుచేస్తానని చెబుతుంది. కొత్త ఆర్డర్లు.. కొత్త సవాళ్లు మొదటి రోజున 3,500 రూపాయలతో ఆరు ఆర్డర్ల ప్రారంభ పెట్టుబడితో మేఘా సలాడ్ వ్యాపారం మొదలైంది. వచ్చిన ప్రతీ కొత్త ఆర్డర్‌తో, కొత్త సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయి. కార్పోరేట్ ఉద్యోగం చేస్తూనే అదనంగా సలాడ్ వ్యాపారం చేస్తూ వచ్చింది. అందుకు మేఘా రోజూ తెల్లవారుజామున 4 గంటలకు తన పనిని ప్రారంభిస్తుంది. ‘సలాడ్స్ కోసం రోజూ ధాన్యాలు నానబెట్టాలి, తాజా కూరగాయలు కావాలి. అందుకు రోజూ మార్కెట్‌కు వెళతాను. కూరగాయలను శుభ్రం చేసి, కట్ చేసి సలాడ్స్ సిద్ధం చేయాలి. నా కొడుకు స్కూల్‌కు వెళ్లేవరకు నాకు సాయంగా ఉంటాడు. సలాడ్స్ ప్యాక్ చేసి, పనికి బయల్దేరడం.. ఎలా ఉంటుందంటే రోలర్కోస్ట్ పై ప్రయాణం చేస్తున్నట్టుగా నా పని ఆనందంగా పూర్తిచేస్తాను’ అని మేఘా చెబుతుంది. ప్రత్యేకమైన ప్యాకింగ్ ఇప్పుడు మేఘా ప్రతి నెల లక్షన్నర రూపాయలు సలాడ్స్ మీద సంపాదిస్తుంది. ‘ఇది అంత ఆషామాషీగా జరగలేదు. నాలుగేళ్లు సలాడ్ వ్యాపారంలో వచ్చిన అడ్డంకులను ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు ఆర్డర్లు తగ్గిపోవడం, ప్లాస్టిక్ నిషేధం సమయంలో ప్యాకింగ్ విషయంలోనూ సమస్యలు వచ్చాయి. బీపీ, షుగర్ సమస్యలున్న కస్టమర్ల కోసం ప్రత్యేకమైన సలాడ్స్ తయారుచేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ ఉద్యోగులకు మరో తరహాలో సలాడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది’ అని ఈ వ్యాపారంలో ఎదురైన ఇబ్బందులు, వాటిని అధిగమిస్తున్న తీరు తెన్నుల గురించి తెలియజేస్తుంది మేఘా. ‘‘ఇప్పుడు పది మందికి పైగా మహిళలను సలాడ్ తయారీలో ఉద్యోగినులుగా నియమించుకోవడంతో వారాంతాలు కుటుంబంతో గడపడం, ఉదయం కాస్త లేటుగా నిద్రలేవడం వంటివి చేస్తున్నాను’’ అని చిరునవ్వుతో చెబుతుంది మేఘా. వారానికి రూ.620లతో మేఘా దగ్గర సలాడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. -
చికెన్+తోటకూర, మటన్+గోంగూర: పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచండిలా!
సాక్షి, హైదరాబాద్: ఇమ్యూనిటీకి ఎంత ప్రాధాన్యత ఉందో ఇప్పటికే చాలామందికి అర్థమయ్యింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో రోగనిరోధకత పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. కరోనా థర్డ్‌వేవ్, పిల్లలపై దాని ప్రభావం వార్తల నేపథ్యంలో.. ఒకవేళ అది వస్తే ఎదుర్కొనేందుకు పిల్లలను సంసిద్ధుల్ని చేయాల్సిన అవసరం ఉందని, తల్లిదండ్రులు ఇప్పటినుంచే జాగ్రత్త పడితే వారికి ఎలాంటి ముప్పూ వాటిల్లకుండా కాపాడుకోవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారు తీసుకునే అహారంలో తగిన మార్పులు, చేర్పులు చేయాలని, రోగ నిరోధకత పెంచే ఆహారం ఎక్కువగా ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. రోగ నిరోధకశక్తిని పెంపొందించడంలో తినే ఆహారం, ఆటపాటలు, నిద్రించే సమయం కీలకపాత్ర పోషిస్తాయి. పిల్లలు అన్నీ ఇష్టంగా తినరు. అందువల్ల వారు ఇష్టపడే ఆహారంలో అవసరమైనవి కలిపి తినిపించాలి. మాంసకృత్తులు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే ఆహారాలను వండి పెట్టాలి. ఈ వంటకాలు ప్రయత్నించండి ► చికెన్ + తోటకూర/మెంతికూర ► మటన్ + గోంగూర/ ములక్కాయ/తోటకూర ► ఎగ్ ప్యాండర్+ గ్రీన్‌పీస్ మసాలా ► రాజ్మా రైస్+ సోయా చంక్స్ మసాలా ► మింట్ రైస్+ మిక్స్డ్ వెజ్ కర్రీ ► బగారా రైస్+ పాలక్ పనీర్ ► జీరా రైస్+ దాల్ ఫ్రై, కర్డ్ రైతా ► మిల్లెట్ బిసిబిల్లా బాత్ ► మిక్స్డ్ వెజ్ సాంబార్+బీన్స్ ఫ్రై, ► టొమాటో కార్న్, మిక్స్డ్ వెజ్/మష్రూమ్/చికెన్ సూప్ అవగాహన కల్పించాలి కరోనా వైరస్ వ్యాప్తి పట్ల పిల్లల్లో కూడా అవగాహన పెరగాలి. ఏడేళ్లలోపు పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులను అనుసరించడం చూస్తుంటాం. కాస్త వయసు పెరిగిన పిల్లలైతే పెద్దలు చెప్పే విషయాలను అర్థం చేసుకుంటూ ఇతరులను కూడా అనుసరిస్తుంటారు. ప్రస్తుతం కోవిడ్–19 వ్యాప్తి పట్ల పిల్లల్లో కూడా అవగాహన పెంచాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే పద్ధతిగా మాస్కు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం, తిరిగి ఇంటికి చేరుకున్న వెంటనే చేతులు శుభ్రం చేసుకోవడం, బయట ఉపరితలాలు తగలకుండా జాగ్రత్తపడడం వంటివి అలవాటు చేయాలి. వైద్య సహాయం కోసం, జనరల్ వ్యాక్సినేషన్ కోసం పిల్లలు ఆస్పత్రులకు వెళ్తుండడం సహజం. అలాంటప్పుడు పూర్తి రక్షణతోనే వెళ్లాలి. చదవండి: ఓలా ఫౌండేషన్: ఇంటి ముందుకే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు -
రాజ్మా సరిగా ఉడికించకపోయినా, జాజికాయ ఎక్కువ తీసుకున్నా..
‘ఆరోగ్యానికి అవసరమైంది ఏంటో తెలుసా? ఆహారం.. అది మితంగా తింటే ఔషధం.. అమితంగా తింటే విషం.’ అనే మాట అక్షరాల నిజం. ఎందుకంటే.. ఆహార పదార్థాలు ఆరోగ్యాన్నే కాదు.. అనారోగ్యాన్ని కూడా అందించగలవు. అంతేకాదు, కొన్ని సార్లు ప్రాణాలు పోయే ప్రమాదం తెస్తాయి. సాధారణంగా ఆహార పదార్థాలు ఏవైనా శరీరానికి పోషకాలతో పాటు శక్తిని అందిస్తాయి. కానీ మనలో చాలామందికి కొన్ని రకాల ఆహార పదార్ధాలు పడవు. అంటే అవి తిన్నప్పుడు అలెర్జీని కలిగిస్తాయి. ఈ సమస్య ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కానీ కొన్ని పదార్థాలను తింటే దాదాపు అందరిలో ఒకేరకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఆహార పదార్ధాలను సరిగా వండకపోయినా, నిల్వచేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా వాటిని తిన్నప్పుడు వాంతులు, విరేచనాలు, జ్వరంతో పాటు కొన్ని సార్లు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అటువంటి కొన్ని రకాల ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.. సోయా బీన్స్ లేదా రాజ్మా బీన్స్, చిక్కుడు ఆరోగ్యానికి మంచివని మనందరికి తెలిసిన విషయమే. అయితే ఇందులో ఉన్న కొన్ని రకాల గింజలను సరిగ్గా వండకుండా తింటే అనారోగ్యం బారిన పడక తప్పదు. ఎరుపు బీన్స్, సోయాబీన్స్ ఈ కోవలోకి వస్తాయి. ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారత దేశంలో అధికంగా వినియోగించే ఈ బీన్స్‌లో ప్రోటీన్లు, పీచు పదార్థం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలం గా ఉంటాయి. కానీ పచ్చి బీన్స్ లో ’ఫైటోహెమాగ్లుటిన్’ అనే కొవ్వు పదార్థం ఉంటుంది. ఆ కొవ్వు మన శరీరరంలో త్వరగా జీర్ణం కాదు. అందువల్ల దీనిని సరిగా ఉడికించకుండా తింటే కడుపులో నొప్పి, వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. రెడ్ బీన్స్ మాదిరిగానే, సోయాబీన్స్‌లో కూడా ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటితో పాటు వీటిలో సహజ టాక్సిన్‌గా పిలిచే ట్రిప్సిన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకుండా నిరోధిస్తుంది. అందువల్ల ఈ రెండు రకాల బీన్స్‌ను 12 గంటల సేపు నీటిలో నానబెట్టి ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఉడకబెట్టి, ఆ తర్వాత ఆరబెట్టి అప్పుడు వండుకుని తింటే ఏ సమస్యలూ దరిచేరవు. జాజికాయ మసాలా దినుసులలో ప్రముఖంగా వినిపించే పదాల్లో జాజికాయ కూడా ఒకటి. ఈ మసాలా దినుసు ఇండోనేషియాలో ఎక్కువగా దొరుకుతుంది. కొన్ని రకాల వంటకాలలో అదనపు రుచికోసం దీనిని విరివిగా వాడతారు.బంగాళదుంపలు, మాంసం, సాస్‌లు, కూరగాయలు వంటకాలతోపాటు, కొన్ని పానీయాల తయారీలోనూ జాజికాయను వాడతారు. అయితే దీనిని అధిక మొత్తంలో తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు ఎదురవుతాయి. వికారం, నొప్పి, శ్వాస సంబంధ సమస్యలు, మూర్ఛతోపాటు మానసిక సమస్యలకు కూడా దారితీస్తుంది. జాజికాయ తినడం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అరుదుగా ఉన్నప్పటికీ దీనిని మితంగా వాడుకుంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాసు మార్జు చీజ్.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీజ్‌గా దీనికి పేరుంది. ఈ చీజ్‌లో పురుగులు ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. ఈ పురుగులను చూస్తే తినాలన్న ఆసక్తి కొందరికి కలగకపోవచ్చు. కానీ ఇటలీలోని సర్డీనియాలో బాగా ప్రాచుర్య ఉన్న ఈ చీజ్‌ను ఇష్టపడేవారు ఎక్కువ మంది ఉన్నారు. పెకోరినో రొమానో అనే ఇటాలియన్ చీజ్‌కు లార్వాలను కలిపి కాసు మార్జును తయారు చేస్తారు. లోపల ఉండే ఆ చిన్న పురుగులు చీజ్‌ను మెత్తంగా, జిగురులా చేస్తాయి. దాంతో దానిని తినేటపుపడు చీజ్లోపలి మధ్య భాగం దాదాపు ద్రవ పదార్థంలా ఉంటుంది. ఈ పురుగుల వల్ల చీజ్ రుచి బావుంటుంది. అయితే ఈ చీజ్ చాలా అరుదుగా దొరుకుతుంది. యూరోపియన్ యూనియన్ అనుమతిపొందిన ఆహార పదార్థాల జాబితాలో కాజు మార్జును చేర్చలేదు. అందువల్ల దీనిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి లేదు. ఇది తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ లోపల ఉన్న పురుగులు చనిపోతే ఆ చీజ్ చెడిపోయినట్లు. ఏదైనా అనారోగ్యం తో ఉన్నప్పుడు ఈ చీజ్ తింటే వాంతులు, విరోచనాలతోపాటు కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. రుబర్బ్.. బ్రిటిష్ వంటకాలలో రుబర్బ్ కాడలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చాలా బ్రిటీష్ ఫలహారాలు, పానియాలలో వీటిని వినియోగిస్తారు. కానీ రుబర్బ్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రుచికరమైన కాడలతోపాటు వీటిలో ఉండే పచ్చని ఆకుల్లో విషం ఉంటుంది. వీటి ఆకుల్లో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కడుపులోకి వెళ్లిన తరువాత వికారం కలిగించి ఖనిజ లవణాలను జీర్ణం చేసుకునే శక్తిని తగ్గిస్తుంది. ఇంకా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు ఈ పదార్థం దోహదం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాడల్లో కూడా ఆక్సాలిక్ ఆమ్లం ఉన్నప్పటికీ ఆకులతో పోలిస్తే చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఆకులను తింటే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి, అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పప్ఫర్ ఫిష్.. పఫ్ఫర్ ఫిష్..ఇది అత్యంత విషపూరితమైన చేప. దీని శరీరంలో టెట్రోడోటాక్సిన్ ఉంటుంది. ఇది సైనైడ్ కంటే ఎక్కువ ప్రమాదకరమైనది. అయినప్పటికీ ఈ చేపతో చేసే వంటకాలకు కొన్ని దేశాల్లో భారీ డిమాండ్ ఉంది. జపాన్‌లో పఫ్ఫర్ ఫిష్‌తో చేసే పుగు అనే వంటకానికి మంచి ఆదరణ ఉంది. ఈ వంటకం తయారు చేసే చెఫ్‌లు కొన్నేళ్లపాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వంటకంలో చేప మెదడు, చర్మం, కళ్లు, బీజకోశాలు, కాలేయం, పేగులు లేకుండా మిగతా అవయవాలతో పుగు వండుతారు. ఈ చేపను వండడానికి ప్రత్యేకంగా డిగ్రీ ఉంది. దీనిని పూర్తి చేసిన వ్యక్తులు మాత్రమే దీన్ని వండుతారు. – డి. శాయి ప్రమోద్ -
కరోనా సమయంలో పెరిగిన ఆరోగ్య జాగ్రత్తలు
-
మన తిండి మారిపోతోంది!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రజల జీవన విధానం, ఆహార అభిరుచుల్లో భారీగా మార్పులు తెచి్చంది. గతంలో మన ఆలోచనా విధానాన్ని బట్టి అంతగా ఉపయోగించని వాటిని ఇప్పుడు అనివార్యంగా అలవాటు చేసుకోక తప్పడం లేదు. కొత్త జీవనశైలిని, అలవాట్లను ఆహా్వనించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్డౌన్ కారణంగా గతేడాదిలో ఎక్కువ భాగం నిత్యావసర సరుకులు, వర్క్‌ఫ్రంహోం పని విధానానికి అవసరమైన వస్తువులకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే క్రమంగా కరోనాని ఎదుర్కొనేందుకు పరిశుభ్రతా చర్యలు, జాగ్రత్తల పట్ల ప్రజల్లో అప్రమత్తత పెరిగింది. ‘రెడీ టు ఈట్’డిమాండ్ 200 శాతం.. పెద్దగా శ్రమ పడకుండానే తాము కోరుకున్న ఆహారపదార్థాలు తయారు చేసుకునేందుకు ఉద్దేశించిన ‘రెడీ టు ఈట్ మీల్స్’కు డిమాండ్ దాదాపు 200 శాతం పెరిగింది. ఇవేకాకుండా రోజువారి ఉపయోగించే వివిధ నిత్యావసర వస్తువులు, కాస్త ఆకలి అనిపించగానే లేదా ఏదైనా లైట్‌గా తినేందుకు వీలుగా వివిధ రకాల స్నాక్స్ ఐటెమ్స్‌కు డిమాండ్ పెరిగింది. బేకింగ్, ఇంట్లోనే పిజ్జా తయారీ, ఇతర చిరుతిండికి కావాల్సిన వస్తువుల అమ్మకాలు ఎన్నో రెట్లు పెరిగాయి. పౌష్టికాహారంపై కూడా ప్రజల్లో ధ్యాస పెరిగింది. రోగనిరోధకశక్తి పెంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. రుచి, పోషకాలు.. రెండింటిపై దృష్టి.. బ్రాండెడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ సేఫ్ అనే అభిప్రాయంతో ప్రజలున్నారు. మనరాష్ట్రంలో రెడీ టు కుక్ సెగ్మెంట్ అనేది బాగా పెరుగుతోంది. సులభంగా తయారు చేసుకోవడంతో పాటు అనేక రకాల రుచులు అందుబాటులోకి వచ్చాయి. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇళ్లలోనే ఇష్టమైన ఆహారం తయారు చేసుకునే అవకాశంతో పాటు శుభ్రత, రక్షణకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. మెంతికూర చపాతీ, రాగి చపాతీ, మునగాకు చపాతీ (మొరింగా), హోల్ వీట్ పూరీ, మసాలా పరోటా వంటి వాటిపై మేము ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము. ఫైబర్ రిచ్, ఆయిల్ తక్కువ పీల్చే ప్రొడక్ట్‌లకు డిమాండ్ ఉంది. భౌతిక దూరం పాటించడంకోసం ఆన్లైన్ ఆర్డర్లపై వినియోగదారులు ఆధారపడుతున్నారు. ఆన్లైన్ సెగ్మెంట్‌తో పాటు రెడీ టు కుక్ ప్రొడక్ట్స్‌కు డిమాండ్ పెరిగింది. – ప్రతిమ విశ్వనాథ్, ఎండీ, మంగమ్మ ఫుడ్స్ నాన్ వెజ్ ఫుడ్‌కు భారీ డిమాండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్‌కు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. బిర్యానీ, పలావ్, చికెన్ కర్రీ ఇతర వేరియెంట్లను జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మా ప్రొడక్ట్ లైనప్‌లో బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా దాల్ కిచిడీ, పొంగల్, రవ్వ ఉప్మా వంటివి ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. దీంతో పాటు హైదరాబాద్‌లో ‘రెడీ టు ఈట్’ఫుడ్ ఐటెమ్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. కేవలం వేడి నీటిలో ఉడకపెడితే ఫుడ్ రెడీ అయిపోయేలా మేము తయారు చేసిన రెడీ టు ఈట్ ఆహార ఉత్పత్తులపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాత మేం మార్కెట్లోకి వచ్చినప్పటికీ మా అమ్మకాల పెరుగుదల, డిమాండ్‌ను బట్టి రెడీ టూ ఈట్ కేటగిరీ ప్రొడక్ట్స్‌ను మనవాళ్లు ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. మార్కెట్లో రిటైలర్లు, బిజినెస్మెన్ల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ కూడా ఇదే. శుభ్రత, రుచి, నాణ్యతా ప్రమాణాలు ఇప్పుడు కీలకంగా మారాయి. బయటి ఫుడ్ ఆరోగ్యానికి మంచికాదన్న భయాల నుంచి మంచి రెడీ టు ఈట్ ఫుడ్ బ్రాండ్స్‌పై మొగ్గుచూపుతున్నారు. – రాజు వానపాల, ఫౌండర్ అండ్ సీఈవో, ద టేస్ట్ కంపెనీ -
‘ఇడ్లీ’ రెండక్షరాలు.. వెరైటీలు వెయ్యి రకాలు!
ఆబాలగోపాలానికి ఇడ్లీ ఇష్టమైన ఫుడ్. రుచి విషయంలోనే కాదు సులభంగా జీర్ణమయ్యే ఈ అద్భుత వంటకం ఆరోగ్యానికి అదనపు బలం. మన ఆల్‌టైమ్ ఫేవరెట్ ఇడ్లీ గురించి కొన్ని విషయాలు...బటన్ ఇడ్లీ, తల్లే ఇడ్లీ, సాంబర్ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ...ఇలా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి రకాల వెరైటీ ఇడ్లీలు ఉన్నాయి. లాంగ్ లాంగ్ ఎగో, వన్స్ ఆపాన్ ఏ టైమ్ ‘ఇడ్లీ’ ఇండోనేషియా నుంచి ఇక్కడికి వచ్చిందని ఫుడ్ హిస్టారియన్ కె.జె.ఆచార్య పరిశోధనాత్మకంగా తెలియజేశారు. వారి ‘కెడ్లీ’నే మన ‘ఇడ్లీ’ అంటారు ఆచార్య. లిజి కొలింగమ్ అనే మరో ఫుడ్ హిస్టారియన్ మాత్రం అలనాడు అరబ్ వ్యాపారులు సముద్రతీర ప్రాంత ప్రజలకు ఇడ్లీని పరిచయం చేశారని అంటారు. ‘ఇడ్డలిగె’ అనే కన్నడ పదం నుంచి ‘ఇడ్లీ’ వచ్చింది అంటారు. కొందరు మాత్రం 12వ శతాబ్దానికి చెందిన సంస్కృత పదం ‘ఇడ్డరిక’ నుంచి వచ్చింది అంటారు. మరికొందరు సౌరాష్ట్ర (గుజరాత్) ప్రాంతానికి చెందిన నేతకార్మికులు ఉపయోగించే ‘ఇడడ’ నుంచి వచ్చింది అంటారు.‘రామసేరి ఇడ్లీ’ అనేది ఇడ్లీలలో ప్రత్యేకత సంతరించుకుంది. సదరు ఈ ఇడ్లీ మనం రోజూ చూసే ఇడ్లీ సైజులో కాకుండా ఏకంగా దోసె సైజ్‌లో ఉంటుంది. డిఫెన్స్ ఫుడ్ రిసెర్చి లెబోరేటరి(డీఎఫ్ఆర్ఎల్) ఆస్ట్రోనాట్స్ కోసం ‘స్పేస్ ఇడ్లీ’తో పాటు పౌడర్ చెట్నీ కూడా తయారు చేసింది. చెన్నైకి చెందిన ఎనియవన్ అనే వ్యక్తి ఇడ్లీకి ఈరాభిమాని. ఇడ్లీకి ఒకరోజు ఉండాలంటూ ‘వరల్డ్ ఇడ్లీ డే’ మొదలుపెట్టాడు. ఫుడ్వరల్డ్లో ఇదొక ట్రెండ్‌గా మారింది.