
బిడ్డకు 4 నుంచి 6 నెలల వయసప్పటి నుంచి తల్లిపాలతో పాటు ఘనాహారం ఇవ్వడం మొదలుపెట్టాలి. ఇలా ఘనాహారం ఇవ్వడాన్ని వీనింగ్ అంటారు. వీనింగ్ మొదలు పెట్టబోతున్న తల్లుల కోసం కొన్ని సూచనలు.
►మెత్తగా వండిన అన్నాన్నీ, పప్పునూ గుజ్జులా కలిపి నేతితో కలిపి పెట్టడం సాధాణంగా ఘనాహారం అలవాటు చేయడానికి మనం చేసే పని. అయితే అరటిపండు కూడా పెట్టవచ్చు. కూరగాయలూ మెత్తగా వండి అన్నంతో గుజ్జులా చేసి కూడా బిడ్డకు పెట్టవచ్చు. వీనింగ్ మొదలుపెట్టే సమయంలో బిడ్డకు ఎంత ఆహారం పెట్టాలన్నది ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి ఇవ్వడం మేలు.
►బిడ్డకు ఇచ్చే ఆహారంలో మెత్తటి అన్నం, ఆకుకూరలు, నెయ్యి, పప్పు, గుడ్డు... లాంటి ఆహార పదార్థాలు గుజ్జులా కలిపి ఇవ్వచ్చు.
►బిడ్డకు ఇంట్లోనే తయారు చేసిన ఆహారాన్ని పెట్టడం ఎప్పుడూ మంచిది.
►బిడ్డ తినే దాన్ని బట్టి ఒక రోజు పెట్టింది మళ్లీ పెట్టకుండా 15 రోజుల వ్యవధి ఇస్తూ రకరకాల ఆహార పదార్థాలు పెట్టాలి. ఏదైనా ఆహార పదార్థాన్ని బిడ్డ ఇష్టపడకపోతే దాన్ని తాత్కాలికంగా ఇవ్వడం ఆపి... కొద్దిరోజుల తర్వాత మళ్లీ ప్రయత్నించి చూడాలి.
► తినేలా అలవాటు చేయాలి.
►పిల్లలు తినేదానికంటే ఎక్కువ పెట్టద్దు.
►పిల్లలను ఎత్తుకుని అటూ ఇటూ తిప్పుతూ తినిపించకూడదు.
Comments
Please login to add a commentAdd a comment