
ట్రక్‌లోనే పదేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. తినడం పడుకోవడం అన్ని అందులోనే. ఇలా ఎందుకు చేస్తున్నాడో వింటే విస్తుపోతారు. బడుగు జీవులు వెతలు ఇలానే ఉంటాయోమో కథ అనిపిస్తుంది.
అసలేం జరిగిందంటే..నాగ్‌పూర్ బుల్ధానా జిల్లాలోని సింద్‌ఖేడ్ రాజా తాలూకాలోని జానునా గ్రామానికి చెందిన ఏక్‌నాథ్ తుకారాం పవార్, అతని భార్య లలితా పవార్ గత పదేళ్లుగా తమ కుటుంబంతో కలిసి ట్రక్కులో ప్రయాణించడం, నివశించడం వంటివి చేస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు.
అయితే ఒక కుమార్తె మాత్రం గామ్రంలో బంధువుల వద్ద ఉంటున్నట్లు తెలిపాడు పవార్. విశేషం ఏంటంటే అతని భార్య కూడా ట్రక్కు నడపడంలో సహాయపడుతుంది. ఆ దంపతులు పూణే-నాగ్‌పూర్ మధ్య వస్తువులను రవాణా చేస్తుంది. కానీ ఆ ఆదాయంలో సగం డబ్బులు RTO, ట్రాఫిక్ పోలీసులకు ముట్టచెప్పాల్సిందే. అందువల్లే పవార్ కుటుంబం ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నట్లు వాపోయాడు పవార్.
తన కుటుంబానికి రోజుకు రెండు పూటలా భోజనం కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు వెల్లడించాడు పవార్. ఇక తాను ఈ ట్రక్‌ని 2023లో మహీంద్రా నుంచి రుణంపై కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఇక ఆ రుణం నిమిత్తం ప్రతి నెల రూ. 68,500 దాక చెల్లించాల్సి ఉందని, అవన్నీ పోగా మిగిలేది ఏం ఉండదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ నేపథ్యంలోనే తాను ఇలా ట్రక్‌లోనే నివాసం ఏర్పరుచుకున్నట్లు బాధగా చెప్పుకొచ్చాడు. దీనివల్ల కొద్దో గొప్పో డబ్బు ఆదా అవుతుందని చెప్పుకొచ్చాడు పవార్.
(చదవండి: ఢిల్లీ మాజీ సీఎం లవ్ స్టోరీ..! కాబోయే అత్తగారి అంగీకారం కోసం..)
Comments
Please login to add a commentAdd a comment