ఓ సామాన్య వీధి టీ వ్యాపారి తన అసాధారణ టాలెంట్‌తో ఒక్కసారిగా స్టార్ చాయవాలాగా మారి శెభాష్ అనిపించుకున్నాడు. రోజు చూసే చిన్న వ్యాపారమైన కాస్త విభిన్నంగా చేస్తే అద్భుతాలు సృష్టించొచ్చని చాటి చెప్పాడు. ఒకప్పుడు వీధుల్లో ఏడు రూపాయల టీతో మొదలైన ప్రస్థానం నేడు ఏకంగా రూ. 5 లక్షలు వసూలు చేసే స్థాయికి చేరుకుందంటే..అది ఊహకే అందని విజయంగా చెప్పొచ్చు. ఇంతకీ ఎవరా ఆ స్టార్ చాయ్‌వాలా అంటే..?
అతడే డాలీ చాయ్‌వాలాగా పేరుగాంచిన సునీల్ పాటిల్. నాగ్‌పూర్ వీధుల్లో రూ. 7ల కప్పు చాయ్‌తో అతడి టీ వ్యాపారం మొదలయ్యింది. అయితే అందరూ చాయ్‌వాళ్లలా కాకుండా కాస్త విభిన్నంగా కస్టమర్లను ఆకర్షించేలా టీని తయారు చేయడం, సర్వ్ చేయడం అతడి స్పెషాల్టీ. వ్యాపారానికి కీలకమైన సూత్రం కూడా ఇదే.
దాన్నే మనోడు ఎలాంటి బిజినెస్ స్కూల్లో చదవకుండానే జీవన పోరాటంతో తెలుసుకున్నాడు. దాన్ని అప్లై చేసి తన టీ షాపు వద్దకే జనాలు వచ్చేలా చేసుకున్నాడు. దీంతోపాటు తన విలక్షణమైన టీ సర్వీంగ్‌కి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఫిబ్రవరి 2024లో మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ప్రసిద్ధ చాయ్ సర్వీంగ్ కోసం వచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా డాలీ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు.
ఆ ఒక్క వీడియో అతడి దశనే మార్చేసింది. ఏకంగా దుబాయ్‌లో కార్యాలయాన్ని తెరిచే స్థాయికి చేరుకున్నాడు. అతడు సర్వ్ చేసే విధానమే కాదు వేషధారణ కూడా అత్యంత విలక్షణంగా ఉంటుంది. అత్యంత స్టైలిష్‌గా..ఫంకీ గోల్డెన్ గాగుల్స్, గోల్డెన్ చైన్ తోపాటు వెరైటీ హెయిర్ స్టైల్‌తో ఫ్యాషన్ లుక్‌లో ఉంటాడు. ఒక రకంగా వ్యాపారాన్ని విజయవంతం చేసుకునేలా హంగు ఆర్భాటాలతో స్టైలిష్‌గా సర్వ్ చేస్తాడు.
అదే అతడిని ఫేమస్ అయ్యేలా చేసింది. ఇంత స్టార్‌డమ్ వచ్చిన తన మూలాలను మరిచిపోకుండా తన టీ స్టాల్ సామాన్యుడి వలే పనిచేస్తుండటం విశేషం. ప్రస్తుతం అతడు దుబాయ్ నుంచి కువైట్‌ల వరకు పలు ఈవెంట్‌లలో డాలీ టీ సర్వీస్ కోసం బుక్ చేసుకుంటారట. అందుకు చాయ్‌వాలా ఏకంగా రూ. 5 లక్షలు దాక వసూలు చేస్తున్నాడు. కానీ జనాలు కూడా లెక్క చేయకుండా అతడి సేవల కోసం ఎంత డభైన వెచ్చించడం విశేషం. ఇంత క్రేజ్ పెరిగినా డాలీ తన దుకాణం వద్ద మాత్రం టీని ఇంకా రూ. 7లకే కస్టమర్లకు అందిస్తుండటం గ్రేట్.
(చదవండి: క్వీన్ ఎలిజబెత్ II వెడ్డింగ్ గౌను వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ! యుద్ధం కారణంగా..)
Comments
Please login to add a commentAdd a comment