Chaiwala
-
వీధి వ్యాపారి కాస్త స్టార్ చాయ్‌వాలాగా మారి ఏకంగా ..!
ఓ సామాన్య వీధి టీ వ్యాపారి తన అసాధారణ టాలెంట్‌తో ఒక్కసారిగా స్టార్ చాయవాలాగా మారి శెభాష్ అనిపించుకున్నాడు. రోజు చూసే చిన్న వ్యాపారమైన కాస్త విభిన్నంగా చేస్తే అద్భుతాలు సృష్టించొచ్చని చాటి చెప్పాడు. ఒకప్పుడు వీధుల్లో ఏడు రూపాయల టీతో మొదలైన ప్రస్థానం నేడు ఏకంగా రూ. 5 లక్షలు వసూలు చేసే స్థాయికి చేరుకుందంటే..అది ఊహకే అందని విజయంగా చెప్పొచ్చు. ఇంతకీ ఎవరా ఆ స్టార్ చాయ్‌వాలా అంటే..?అతడే డాలీ చాయ్‌వాలాగా పేరుగాంచిన సునీల్ పాటిల్. నాగ్‌పూర్ వీధుల్లో రూ. 7ల కప్పు చాయ్‌తో అతడి టీ వ్యాపారం మొదలయ్యింది. అయితే అందరూ చాయ్వాళ్లలా కాకుండా కాస్త విభిన్నంగా కస్టమర్లను ఆకర్షించేలా టీని తయారు చేయడం, సర్వ్ చేయడం అతడి స్పెషాల్టీ. వ్యాపారానికి కీలకమైన సూత్రం కూడా ఇదే. దాన్నే మనోడు ఎలాంటి బిజినెస్ స్కూల్లో చదవకుండానే జీవన పోరాటంతో తెలుసుకున్నాడు. దాన్ని అప్లై చేసి తన టీ షాపు వద్దకే జనాలు వచ్చేలా చేసుకున్నాడు. దీంతోపాటు తన విలక్షణమైన టీ సర్వీంగ్కి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఫిబ్రవరి 2024లో మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ప్రసిద్ధ చాయ్ సర్వీంగ్ కోసం వచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా డాలీ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఆ ఒక్క వీడియో అతడి దశనే మార్చేసింది. ఏకంగా దుబాయ్‌లో కార్యాలయాన్ని తెరిచే స్థాయికి చేరుకున్నాడు. అతడు సర్వ్ చేసే విధానమే కాదు వేషధారణ కూడా అత్యంత విలక్షణంగా ఉంటుంది. అత్యంత స్టైలిష్‌గా..ఫంకీ గోల్డెన్ గాగుల్స్, గోల్డెన్ చైన్ తోపాటు వెరైటీ హెయిర్ స్టైల్‌తో ఫ్యాషన్ లుక్‌లో ఉంటాడు. ఒక రకంగా వ్యాపారాన్ని విజయవంతం చేసుకునేలా హంగు ఆర్భాటాలతో స్టైలిష్‌గా సర్వ్ చేస్తాడు. అదే అతడిని ఫేమస్ అయ్యేలా చేసింది. ఇంత స్టార్డమ్ వచ్చిన తన మూలాలను మరిచిపోకుండా తన టీ స్టాల్ సామాన్యుడి వలే పనిచేస్తుండటం విశేషం. ప్రస్తుతం అతడు దుబాయ్ నుంచి కువైట్ల వరకు పలు ఈవెంట్లలో డాలీ టీ సర్వీస్ కోసం బుక్ చేసుకుంటారట. అందుకు చాయ్‌వాలా ఏకంగా రూ. 5 లక్షలు దాక వసూలు చేస్తున్నాడు. కానీ జనాలు కూడా లెక్క చేయకుండా అతడి సేవల కోసం ఎంత డభైన వెచ్చించడం విశేషం. ఇంత క్రేజ్ పెరిగినా డాలీ తన దుకాణం వద్ద మాత్రం టీని ఇంకా రూ. 7లకే కస్టమర్లకు అందిస్తుండటం గ్రేట్. View this post on Instagram A post shared by Dolly Ki Tapri Nagpur (@dolly_ki_tapri_nagpur) (చదవండి: క్వీన్ ఎలిజబెత్ II వెడ్డింగ్ గౌను వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ! యుద్ధం కారణంగా..) -
పాకిస్తాన్ చాయ్‌వాలాకు భారీ ఫండింగ్: ఏకంగా..
పాకిస్తాన్ చాయ్‌వాలా 'అర్షద్ ఖాన్' షార్క్ ట్యాంక్ పాకిస్తాన్ తాజా ఎపిసోడ్లో తన కేఫ్ బ్రాండ్ చాయ్‌వాలా & కో కోసం కోటి రూపాయలు (పాకిస్తాన్ కరెన్సీ) పెట్టుబడిన పొందాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.చాలా సంవత్సరాలు కేఫ్ నడుపుతూ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్న.. అర్షద్ ఖాన్ ఇటీవల షార్క్ ట్యాంక్ పాకిస్తాన్ ఎపిసోడ్లో పాల్గొని, అక్కడి వ్యాపారవేత్తలను తన వ్యాపారం గురించి వివరిస్తూ ఎంతగానో ఆకట్టుకున్నాడు. దీంతో వారు ఈ భారీ పెట్టుబడిన ఆఫర్ చేశారు. దీంతో అర్షద్.. చాయ్‌వాలా & కో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి సిద్దమవుతున్నాడు.వ్యాపార వేత్తల నుంచి కోటి రూపాయల ఆఫర్ అందుకున్న తరువాత.. ఈ విషయాన్ని అర్షద్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా తనకు మద్దతు తెలిపిన అందరికీ కూడా అతడు ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఒప్పందం తన జీవితంలోనే కీలక మైలురాయి అని పేర్కొన్నాడు.అర్షద్ ఖాన్ చాయ్ కేఫ్ ఇస్లామాబాద్‌లో ప్రారంభమైంది. ఇదే ఇప్పుడు అక్కడ బాగా ఫేమస్ అయింది. ఇక్కడ కేవలం చాయ్ మాత్రమే కాకుండా.. స్నాక్స్, బర్గర్స్, పాస్తా, శాండ్విచ్ వంటివి కూడా లభిస్తున్నాయి. ఇప్పుడు షార్క్ ట్యాంక్ ఫండింగ్ గెలుచుకున్న అర్షద్ తన వ్యాపారాన్ని పెంచడానికి సన్నద్ధమవుతున్నారు. View this post on Instagram A post shared by Arshad Khan (@arshadchaiwala1) -
‘టీ’పాట
‘చాయ్ హోటల్‌కు ఎందుకు వెళతారు?’ అనే ప్రశ్నకు–‘చాయ్ కోసమే వెళతారు’ అనే జవాబు మాత్రమే వినిపిస్తుంది. అయితే సూరత్‌లోని విజయ్భాయి పటేల్ అలియాస్ డాలీ చాయ్‌వాలా అలియాస్ సింగింగ్ చాయ్‌వాలా హోటల్‌కు ‘పాట’ కోసం వెళతారు. డాలీ చాయ్‌వాలా కస్టమర్లకు వేడి వేడి టీ అందిస్తూనే, మైక్రోఫోన్లో అద్భుతంగా పాడుతుంటాడు. ఆయన గానం వింటూ ‘మరో చాయ్’ అనే మాట కస్టమర్ల నోటి నుంచి వినిపించడం అక్కడ సాధారణ దృశ్యం. ఈ ‘సింగింగ్ చాయ్‌వాలా’కు సంబంధించిన వీడియో క్లిప్‌ను ముంబైలోని సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ బయాని ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేస్తే వైరల్ అయింది. -
ఆయన పీఎం అయితే నేను ఎమ్మెల్యే కాలేనా?
పూరీ (ఒడిశా): ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో ఒడిశాకు చెందిన ఓ ఛాయ్‌వాలా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు. టీ అమ్ముతూ జీవనం గడుపుతున్న 26 ఏళ్ల సుకాంత ఘడాయ్ పూరీ జిల్లాలోని బ్రహ్మగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.కరీంపూర్ గ్రామానికి చెందిన ఘడాయ్ తనకు స్థిర, చర ఆస్తులు ఏమీ లేవని తన నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఘడాయ్ తనకు ప్రధాని నరేంద్ర మోదీనే స్ఫూర్తి అని, ఆయన ప్రధాని కాగలిగితే, తోటి ఛాయ్‌వాలా అయిన తాను ఎమ్మెల్యే కాలేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు.ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే లంచాల సంస్కృతిని అరికట్టి నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతానని, అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడాన్ని పరిష్కరిస్తానని తన ప్రణాళికను ప్రకటించారు. తాను సైకిల్‌పై తిరుగుతూ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా సుకాంత ఘడాయ్ చెబుతన్నారు.కాగా బ్రహ్మగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార బీజేడీ అభ్యర్థి ఉమాకాంత సామంతరాయ్, బీజేపీకి చెందిన ఉపాస్నా మహపాత్ర, కాంగ్రెస్ అభ్యర్థిగా మిత్రభాను మోహపాత్ర పోటీ చేస్తున్నారు. ఇక్కడ మే 25న పోలింగ్ జరగనుంది. -
బిల్‌గేట్స్‌కు చాయ్, ప్రధాని మోదీకి కూడా చాయ్ : డాలీ చాయ్‌వాలా
భారత్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్ సోషల్ మీడియా స్టార్, డాలీ చాయ్‌వాలా వద్దకు వెళ్లి చాయ్ తాగిన వీడియో వైరల్ అయింది. దీంతో మరోసారి మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన సునీల్ పాటిల్ వార్తల్లోకి వచ్చేశాడు. ఈ సందర్భంగా చాయ్‌వాలా చేసిన కమెంట్స్ విశషంగా నిలుస్తున్నాయి. బిల్ గేట్స్ డాలీ చాయ్‌వాలా మీట్‌పై మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. విదేశం నుంచి వ్యక్తి అని మాత్రం అనుకున్నా.. కానీ ఆయన బిట్ గేట్స్ అని అస్సలు తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. అందరికీ ఇచ్చినట్టే అతనికీ టీ ఇచ్చాను. తరువాత నాగ్‌పూర్‌కి తిరిగి వచ్చాక తాను ఎవరకి టీ ఇచ్చిందీ గుర్తించానని తెలిపాడు. బిల్ గేట్స్ తన దగ్గరికి వచ్చి 'వావ్, డాలీకి చాయ్' అన్నారని గుర్తు చేసుకున్నారు. పనిలో బిజీగా ఉండి, ఆయన తన పక్కనే ఉన్నా, తాను అస్సలు మాట్లాడలేక పోయానని చెప్పాడు. దక్షిణాది సినిమాలు చూస్తా.. వాటినుంచే స్టైల్స్ నేర్చుకున్నా.. వెరైటీ టీ అందిస్తూ ‘నాగ్‌పూర్ కా డాలీ చాయ్‌గా మారా’ అంటూ తన స్టయిల్ గురించి వెల్లడించాడు. అంతేకాదు 'భవిష్యత్తులో ప్రధాని నరేంద్రమోదీకి కూడా టీ అందించాలనుకుంటున్నా అంటూ తన మనసులోని కోరికను బైట పెట్టాడు. కాగా సునీల్ పాటిల్ టీస్టాల్‌తో ఉపాధిని వెదుక్కోవడమే కాదు, తన డ్రెస్సింగ్ స్టైల్, టీ తయారీలోనూ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను అనుకరిస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ‘డాలీ చాయ్ వాలా’ పేరుతో ఇన్ స్టాగ్రామ్‌లో కూడాసెలబ్రెటీగా మారిపోయిన సంగతి తెలిసిందే. #WATCH | Nagpur (Maharashtra): Microsoft Co-founder Bill Gates posted a video, in which he can be seen enjoying Dolly's tea. Dolly Chaiwala says, "I was not aware at all I thought that he was a guy from a foreign country so I should serve him tea. The next day when I came back… pic.twitter.com/hicI3vY31y — ANI (@ANI) February 29, 2024 -
డాలీ చాయ్వాలాతో బిల్ గేట్స్: ఏఐ వీడియోనా? ఇంటర్నెట్ ఫిదా
మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్‌గేట్స్ భారత పర్యటనలో మరోసారి తన స్పెషాల్టీని చాటుకున్నారు. భారత దేశ ఆవిష్కరణలపై ఎప్పటిలాగానే ప్రశంసలు కురిపించారు. పాపులర్ నాగ్‌పూర్ డాలీ చాయ్ వాలా టీ స్టాల్‌ను సందర్శించిన ఆయన ఇక్కడి టీకి ఫాదా అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన డాలీ చాయ్ వాలా ‘వన్ చాయ్ ప్లీజ్’ అంటూ బిల్‌గేట్స్ టీ అడిగి మరీ తాగారు. అంతే చాయ్‌వాలా టీకి బిల్ గేట్స్ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో ‘‘ఇండియాలో ఎక్కడికెళ్లినా అక్కడ ఆవిష్కరణలను కనుగొనవచ్చు- సాధారణ కప్పు టీ తయారీలో కూడా!’’ అంటూ ఒక వీడియోషేర్ చేశారు. బిల్‌గేట్స్ సింప్లిసిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇది ఏఐ సృష్టి కాదు కదా అని ఒక యూజర్, "ఇది డీప్‌ఫేకా’’ అని కూడా ఒక వినియోగదారు ఆశ్చర్యపోవడం విశేషం. దీనికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా సరదాగా కమెంట్ చేశాయి. జొమాటో బిల్ గేట్స్‌కి స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చేసింది. అలాగే బిల్ ఎంత స్విగ్గీ స్పందించింది. నాగ్‌పూర్‌లో వెరైటీ, స్టయిలిష్ టీతో డాలీ చాయ్‌వాలా బాగా ఫ్యామస్. 10వేల మందికి పైగా ఫాలోవర్లున్నారంటేఈ చాయ్‌వాలా స్పెషల్ ఎంటో అర్థం చేసుకోవచ్చు. కాగా బిల్ గేట్స్ తన పర్యటనలో భాగంగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఇండియా డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా సందర్శించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) -
ఛాయ్‌వాలా పీఎం.. ఆటోవాలా సీఎం: మిలింద్ దేవరా
ముంబయి: కాంగ్రెస్‌ను వీడి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిన సీనియర్ నేత మిలింద్ దేవరా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజకీయాల్లో ప్రస్తుత మార్పులు సమానత్వ విలువల్ని కోరుకుంటున్నాయని చెప్పారు. టీ అమ్మేవారు ప్రధానమంత్రి స్థానంలో.. రిక్షా నడిపే వ్యక్తి మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని అన్నారు. ఈ మార్పు భారత రాజకీయాల్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ఏక్నాథ్ షిండ్ సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందని మిలింద్ దేవరా అన్నారు. ఆయన సారథ్యంలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని చెప్పారు. "దేశంలోని అత్యంత కష్టపడి పనిచేసే, అందుబాటులో ఉండే సీఎంలలో ఏక్నాథ్ షిండే ఒకరు. మహారాష్ట్రలో అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న అవగాహన, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి ఆయన చేసిన కృషి అభినందనీయం" అని ఆయన స్పష్టం చేశారు. "మహారాష్ట్రుల సంపన్నమైన భవిష్యత్తు కోసం షిండే ప్రయత్నాలతో ప్రేరణ పొందాను. ఆయన కృషికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను. భారతదేశం కోసం నరేంద్ర మోదీ, అమిత్ షాల దూరదృష్టి నన్ను ఆకర్షించాయి." అని మిలింద్ దేవరా అన్నారు. "సృజనాత్మక ఆలోచనలకు విలువనిచ్చి, నా సామర్థ్యాలను గుర్తించే నాయకుడితో నేను పని చేయాలనుకుంటున్నాను. ఏక్నాథ్ షిండే నా సామర్థ్యాలను నమ్ముతారు." అని దేవరా అన్నారు. కష్టపడి పనిచేయడం వల్ల అసాధ్యమైన విషయాలు కూడా సాధ్యమవుతాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కీలక నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరిపోయారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన దేవరా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి: ‘ఏక్ భారత్...’కు ప్రతిబింబం పొంగల్: మోదీ -
చిన్నప్పుడే చదువుకు స్వస్తి.. నమ్మిన సూత్రంతో లక్షలు సంపాదిస్తున్న చాయ్‌వాలా..!!
సాధారణంగా ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేవారికంటే కూడా సొంత వ్యాపారాలు చేస్తున్న వారు బాగా సంపాదిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు బెంగుళూరు చాయ్‌వాలా 'మునిస్వామి డేనియల్'. ఇంతకీ ఈయనెవరు, సంపాదన ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం బెంగళూరుకు చెందిన మునిస్వామి డేనియల్ నెలకు రూ. 3 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక టీ అమ్మే వ్యక్తి ఏమిటి? లక్షలు సంపాదించడం ఏమిటని చాలామందికి ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇది తప్పకుండా నమ్మాల్సిందే. ఏడు సంవత్సరాలు డ్రైవర్‌గా నాల్గవ తరగతి వరకు మాత్రమే చదివి ఆ తరువాత డ్రైవర్‌గా పనిచేసిన డేనియల్ ఇప్పుడు లక్షాధికారి. 'షారన్ టీ స్టాల్' పేరుతో మొదలైన ఈయన బిజినెస్ ఈ రోజు బెంగళూరులో మూడు బ్రాంచ్‌లుగా విస్తరించింది. అనుకున్న విధంగానే బాగా ఆర్జిస్తూ ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. నిజానికి నిరుపేద కుటుంబంలో జన్మించిన డేనియల్ ఆర్ధిక పరిస్థితుల వల్ల పెద్ద చదువులు చదువుకోలేకపోయాడు. కేవలం 10 సంవత్సరాల వయసులోనే పనిచేయడం ప్రారంభించాడు. కానీ ఏ పనిలోనూ అతడు సంతృప్తి చెందలేదు. ఆ తరువాత ఏడు సంవత్సరాలు డ్రైవర్‌గా పనిచేశాడు. ఇది కూడా నచ్చకపోవడంతో సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారభించాలనుకున్నాడు. టీ వ్యాపారం అనుకున్న విధంగానే 2007లో 'టీ' వ్యాపారం ప్రారంభించాడు. అనుభవం లేకున్నా.. చేయాలనే ఉత్సాహమే అతన్ని ముందుకు నడిపింది. అతడు కూడా ఉదయం నాలుగు గంటలకే దుకాణం ఓపెన్ చేసి వ్యాపారం చేసేవాడు. క్రమంగా అతని వ్యాపారం వృద్ధిలోకి వచ్చింది. ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. ఫేస్బుక్, ఇన్‌స్టా యూజర్లకు షాక్! అనుకుంటే ఏది అసాధ్యం కాదు, కానీ అనుకున్నంత సులభంగా సక్సెస్ చేతికి రాదు. దాని వెనుక గొప్ప కృషి, పట్టుదల ఉండాలి. ఇదే డేనియల్ నమ్మిన సూత్రం. అందరిలా ఒకే దగ్గర ఆగిపోకుండా కొత్త రుచులతో నాణ్యతను మరింత పెంచాడు. దీంతో వ్యాపారం బాగా పెరిగింది. ఇదీ చదవండి: థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్.. విడుదలకు ముందే లీక్ - వివరాలు ప్రస్తుతం బెంగళూరులో మాస్టర్ టీ సెల్లర్‌గా పాపులర్ అయిన ఇతడు వంద రకాల కంటే ఎక్కువ 'టీ'లను తయారు చేసి రోజుకి 1000 కప్పులకంటే ఎక్కువ అమ్ముతాడని, దీంతో అతని వార్షికాదాయం రూ. 40 లక్షల కంటే ఎక్కువని సమాచారం. ఇతని టీ షాపుల్లో ఏకంగా 30 మందికంటే ఎక్కువ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. -
మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో?
న్యూఢిల్లీ: భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3పై అనుచిత వ్యాఖ్యలు చేసి నవ్వులపాలైన సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అయినా కూడా ప్రకాష్ రాజ్ తన తప్పును ఒప్పుకోలేదు సరికదా దానిని సమర్ధించుకున్నాడు. ప్రకాష్ రాజ్ చంద్రయాన్-3 పై చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. జులై 14న భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తూ చంద్రుడిపై కాలు మోపడానికి సిద్ధంగా ఉన్న చంద్రయాన్-3 పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్)లో టీ వడపోస్తున్న ఒక వ్యక్తి ఫోటో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెటిజన్లు ప్రకాష్ రాజ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ తన తప్పును ఒప్పుకోకపోగా తాను పోస్ట్ చేసిన దానిని సమర్ధించుకున్నాడు. ద్వేషించే వారికి అంతా ద్వేషమే కనిపిస్తుంది.. అది ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్.. అది అర్ధం చేసుకోకుండా ఎవరికి వారు విమర్శిస్తే ఎట్లా? నేను కేరళ చాయ్‌వాలాని ఉద్దేశించి పోస్ట్ చేశాను.. మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో..? అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. చంద్రయాన్-3 పార్టీలకతీతంగా ప్రతి భారతీయుడు గర్వించాల్సిన ప్రయోగమని.. ఎవ్వరైనా ఆ వ్యత్యాసాన్ని గ్రహించి ప్రవర్తించాలని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఇది కూడా చదవండి: నా భర్త రాజకీయ జీవితం కిరాతకంగా ముగిసింది.. సోనియా -
ఆ నీలి కళ్ల చాయ్‌వాలా.. మోడలింగ్ తర్వాత లండన్‌లో మొదలెడుతున్న పని ఇదే..
తన ప్రత్యేకమైన నీలి కళ్లతో జనం మనసులు దోచుకున్న ఆ పాకిస్తాన్ చాయ్‌వాలాను ఎవరూ మరచిపోలేరు. ఇంటర్నెట్లో తన ఫొటోతో అందరినీ కట్టిపడేసిన ఆ కుర్రాడి పేరు అర్షద్ ఖాన్. ఫొటోగ్రాఫర్ జియా అలీ తన కెమెరాతో అర్షద్‌కు ఫొటో తీసి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పట్లో ఈ ఫొటో సంచలనాలు నమోదు చేసింది. ఈ ఒక్క ఫొటోతో అతని జీవితమే మారిపోయింది. ఇక జీవితంలో దేనికీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అర్షద్‌కు ఏర్పడలేదు. ఈ నేపధ్యంలో 2020లో అర్షద్ పాక్‌లోని ఇస్లామాబాద్‌లో సొంతంగా టీ కెఫే ప్రారంభించారు. ఆ తరువాత రెండు కెఫేలను లాహోర్‌లో ఒక కెఫెను మురీలో తెరిచారు. తాజాగా అర్షద్ ఏకంగా లండన్‌లో ఒక కెఫె ప్రారంభించనున్నారు. మీడియాతో అర్షద్ మాట్లాడుతూ ‘నా లండన్ ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నన్ను అభిమానించేవారి కోసం టీ తయారుచేయడాన్ని నేను ఇష్టపడతాను. లండన్ రావాలంటూ నాకు రిక్వెస్ట్ వచ్చింది. నా తొలి అంతర్జాతీయ టీ దుకాణం లండన్‌లోని ఇల్ఫోయీ లేన్‌లో ప్రారంభం కానుంది. ఇల్ఫోయి లేన్‌లో పెద్ద సంఖ్యలో పాకిస్తానీయులు, భారతీయుల ఇళ్లు ఉన్నాయి. వారంతా చాయ్‌ని అమితంగా ఇష్టపడతారు’ అని తెలిపారు. లండన్‌లో ప్రారంభించే కెఫే కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో హర్షద్ chaiwalauk_ak పేరుతో ఒక అకౌంట్ తెరిచారు. దీనిలో తన కెఫేకు సంబంధించిన అప్డేట్ అందిస్తున్నారు. అర్షద్ తొలి ఫొటో వైరల్ అయినప్పుడు అతనికి మోడలింగ్‌లో అనేక అవకాశాలు లభించాయి. యూకే బేస్డ్ కంపెనీకి అర్షద్ మోడలింగ్ చేశారు. ఇప్పుడు అర్షద్ లండన్‌లో తన నూతన టీ దుకాణం ప్రారంభంతో మరోమారు చర్చల్లో నిలిచారు. ఇది కూడా చదవండి: ఇంటి గేటు దగ్గర ఎర్రని గుర్తులు.. నెటిజన్ల వివరణలకు మహిళ హడల్! -
ఎలానూ... ఇలా అయినవేంది!!
ఏఐ ఆర్టిస్ట్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు... అన్నట్లుగా తయారైంది పరిస్థితి. సదరు నౌఫాల్ ఆనే ఏఐ ఆర్టిస్ట్ తన ఆర్ట్‌తో బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను అమెరికా నుంచి ముంబైకి తీసుకువచ్చి ఛాయ్‌వాలాగా మార్చాడు. ఈ ‘చాయివాలా–ఎలాన్ మస్క్’ ఇమేజ్ అంతర్జాల లోకంలో తెగ వైరల్ అయింది. ట్విట్టర్లో వేగంగా రెండు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంతర్జాల లోకవాసులు ఒకరిని మించి ఒకరు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ‘ఎలాన్... ఏమైనా చేయగలడు!’, ‘ఏఐ టెక్నాలజీతో గరం ఛాయ్ తయారుచేస్తున్నాడు!’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. మరో ఏఐ ఆర్టిస్ట్ ఎలాన్‌ను ఏకంగా బేబీగా మార్చేశాడు. ‘బ్రేకింగ్న్యూస్: ఎలాన్ మస్క్ యాంటీ ఏజీంగ్ ఫార్ములాపై పనిచేస్తున్నాడు. దాని ఫలితమే ఈ ఫొటో’ అనే కాప్షన్ ఆకట్టుకుంటోంది. ‘మార్స్ పైకి వెళ్లడానికి మస్క్‌కు ఇప్పుడు బోలెడు సమయం దొరికింది’... అని ఒకరు కామెంట్ పెట్టారు. -
‘ఆడి చాయ్‌వాలా’ ఏమైంది భయ్యా? వైరల్ వీడియో
సాక్షి, ముంబై: మనం ఇప్పటివరకు టీ అమ్ముతూ రూ.4 కోట్ల టర్నోవర్ సాధించిన ఎంబీయే చాయ్‌వాలా, బీటెక్ అమ్మాయి..బుల్లెట్ బండిపై పానీ పూరీ అమ్మిన స్టోరీలు చదివాం కదా. తాజాగా 'ఆడి చాయ్‌వాలా' హాట్‌టాపిక్‌గా నిలిచాడు.విలాసవంతమైన కారులో రోడ్డు పక్కన టీ అమ్ముతున్న వ్యక్తికి చెందిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆశిష్ త్రివేది అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో లగ్జరీ వైట్ ఆడి కారులో టీ అమ్ముతున్న వ్యక్తిని చూడవచ్చు.కస్టమర్ల దృష్టిని ఆకర్షించడానికి ఇదో స్మార్ట్ పద్ధతి అనుకున్నాడో ఏమోకానీ ఖరీదైన కారులో టీ అమ్మడం విశేషంగా మారింది. అయితే ఆడి చాయ్‌వాలా ఇన్వెంటివ్ మార్కెటింగ్ వ్యూహం అంటూ యూజర్ల కమెంట్ చేశారు. ఇంకొంత మంది ఈఎంఐ కవర్ చేయడానికి టీ విక్రయిస్తున్నాడని ఒకరు, టీ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో మెర్సిడెస్-బెంజ్ జీ వాగన్‌ను కొనాలకి ఇంకొకరు, టీ అమ్మి ఆడి కారును కొనుగోలు చేశారా? లేక ఆడి కారు కొన్నాక టీ అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందా అని మరికొందరు, చాయ్ అమ్మి దేశ ప్రధానమంత్రి అయిపోవాలనుకుంటున్నాడు అంటూ వ్యాఖ్యానించడం విశేషం. ఈ వీడియోకు ఇప్పటివరకు సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్, 3,లక్షల 72 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by A S H I S H T R I V E D I (@ashishtrivedii_24) -
MBA Chai Wala: అపుడు టీ బిజినెస్‌తో కోట్లు, ఇపుడు మళ్లీ వార్తల్లోకి..విషయం ఏమిటంటే..!
సాక్షి, ముంబై: కష్టపడి పనిచేసేవారు బాగుపడటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే అది ఏ రంగంలో అయినా కావచ్చు, నీకున్న నిబద్దత నిన్ను తప్పకుండా గొప్పవాడిగా ఎదిగేలా చేస్తుంది అనటానికి 'ప్రఫుల్ బిల్లోర్' అలియాస్ 'MBA చాయ్ వాలా' మంచి ఉదాహరణ. ప్రఫుల్ బిల్లోర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ 'ఎంబీయే చాయ్ వాలా' అంటే మాత్రం ఎక్కువ మందికి తెలుసు. MBA మధ్యలోనే ఆపేసి IIM అహ్మదాబాద్ వెలుపల ఎనిమిది వేల రూపాయలతో టీ స్టాల్ ప్రారంభించి ఈ రోజు రూ. 90 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన లగ్జరీ కార్ కొనుగోలు చేసే స్థాయికి ఎదిగాడు. అసలు ఎవరీ MBA చాయ్ వాలా మధ్యప్రదేశ్‌లో బీకామ్ పూర్తి చేసిన 'ప్రఫుల్ బిల్లోర్' ఎంబీఏ చేయాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ మంచి ర్యాంక్ రాకపోవడంతో ఉపాధికోసం అంట్లు తోమే పనిలో చేరాడు. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే పట్టుదల అతణ్ణి నిద్ర పోనీయలేదు. అంతే...తాను ఎంబీఏ చేయాలనుకున్న క్యాంపస్ పక్కెనే టీ స్టాల్ ప్రారంభించి అంచలంచెలుగా ఎదుగుతూ కోట్ల బిజినెస్‌ను సాధించాడు. తనలాంటివారికి ఎంతోమంది స్ఫూర్తిగా నిలిచాడు. అలా చిన్న టీ స్టాల్ తో ప్రారంభమైన ప్రఫుల్ దేశవ్యాప్తంగా ‘ఎంబీయే చాయ్ వాలా’ పేరుతో పాపులర్ అయ్యాడు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు కోట్లలో టర్నోవర్ సాధిస్తున్నాడు. అంతేకాదు ఎంబీఏ చాయ్‌వాలా అకాడమీని ప్రారంభించి ఆంట్రప్రెన్యూర్షిప్లో స్పెషల్ కోర్స్ అందిస్తూ.. పెద్ద పెద్ద కాలేజీల్లో స్టూడెంట్స్‌కి సైతం క్లాసులు కూడా చెబుతున్నాడు. అలాగే మోటివేషనల్ స్పీకర్‌గా కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. తాజాగా అతను ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. కేవలం ఎనిమిది వేలతో ప్రారంభమైన ప్రఫుల్ ప్రయాణం ఈ రోజు మెర్సిడెస్ బెంజ్ GLE 300డి కొనుగోలు చేసే స్థాయికి చేరింది. GLE 300d అనేది బ్రాండ్ హై-ఎండ్ మోడల్, ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కారులోని 2.0-లీటర్, ఫోర్ సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 245 పిఎస్ పవర్ & 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 7.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగాన్ని అందుకుంటుంది. View this post on Instagram A post shared by Prafull Billore (@prafullmbachaiwala) -
విదేశాలలో చదువు మానేసి.. కాఫీలు, టీలు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న తెలుగోడు!
జీవితం ఎప్పుడు ఏ మలుపుకు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. మనం చేసే కొన్ని పనులు ఆ క్షణంలో చూసేవారికి తప్పుగా అనిపించినా, కాలమే వారికి సమాధానం చెప్తుంది. ఈ వాఖ్యాలు ఆస్ట్రేలియాలోని ఓ ఆంధ్రా విద్యార్థికి సరిగ్గా సరిపోతాయి. విదేశాలలో ఓ యూనివర్సిటీలో చదివి ఆపై లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో విమానం ఎక్కాడు. కానీ అక్కడకి వెళ్లాక ఏం జరిగిందో గానీ చదువుని మధ్యలోనే పక్కన పెట్టాడు. చివరికి అదే అతని జీవితాన్ని ములుపు తిప్పింది. కేవలం ఏడాది వ్యవధిలోనే మిలియన్ డాలర్ల కంపెనీకి యజమానిగా మార్చేసింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే? వివరాల్లోకి వెళితే.. అందరిలానే ఎన్నో కలలతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన కొండా సంజిత్ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువు కోసం ఆస్ట్రేలియా విమానం ఎక్కాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నప్పటికీ మధ్యలో అకస్మాత్తుగా అతను తన చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి కాలేజ్ డ్రాప్ అవుట్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతను ఉంటున్న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం కాఫీకి ప్రసిద్ధి. చిన్నప్పటి తనకీ కూడా టీ అంటే మక్కువ ఎక్కువ. ఈ రెంటిని జత కలుపుతూ ఒక ఐడియా అతని మెదడులో మెదిలింది. అప్పుడే‘డ్రాప్‌అవుట్ చాయ్‌వాలా’కు పునాది పడింది. అయితే మొదట్లో టీ షాపు అనగానే తన తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి లోనైనా, సొంత వ్యాపారం పెడుతున్నానని వారికి నచ్చజెప్పాడు. తన సంకల్పానికి తోడుగా అస్రార్ అనే ఒక ఎన్ఆర్ఐ తన ప్రాజెక్టుపై నమ్మకం ఉంచి.. ఏంజెల్ ఇన్వెస్టర్‌గా మారడానికి ఒప్పుకున్నారు. అలా ‘డ్రాప్‌అవుట్ చాయ్‌వాలా’ పేరుతో వ్యాపారం మొదలుపెట్టాడు. అందులో అన్ని రకాల కాఫీలు, టీలు సమోసాలు అందుబాటులో ఉంచాడు. అక్కడి రుచులకు భారతీయులతో పాటు ఆస్ట్రేలియన్లు సైతం ఫిదా అయ్యారు. అక్కడి భారతీయులకు ‘బాంబే కటింగ్’ టీ అంటే ఇష్టపడుతుండగా, ఆస్ట్రేలియన్లు ‘మసాలా చాయ్’, పకోడాలంటే ఆసక్తి చూపుతున్నారు. వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుంది. ఆదాయం పన్నులు పోగా 1 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల ( భారత కరెన్నీ ప్రకారం దాదాపు రూ.5.2 కోట్లు)కు చేరనుంది. చదవండి: Snapchat కొత్త ఫీచర్: వారికి గుడ్ న్యూస్, నెలకు రూ. 2 లక్షలు -
ఈ చాయ్‌వాలా ఎవరో తెలియదు కానీ అందరికీ ఫ్రీగా టీ!
ఈ చాయ్‌వాలా ఎవరో తెలియదు కానీ రెండ్రోజుల నుండి అందరికీ ఫ్రీగా చాయ్‌లు ఇచ్చి వెళుతున్నాడు! -
ఉపరాష్ట్రపతి ఎన్నిక.. చాయ్‌వాలా నామినేషన్
న్యూఢిల్లీ: ఆగస్ట్ 6వ తేదీన జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మొదటి రోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం నామినేషన్ వేసిన ఐదుగురిలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఆనంద్ సింగ్ కుష్వాహా అలియాస్ రామాయణి చాయ్‌వాలా కూడా ఉన్నారు. ఈయన నామినేషన్‌ను స్వీకరించినప్పటికీ రూ.15 వేల సెక్యూరిటీ డిపాజిట్ అందజేయలేదని అధికారులు తెలిపారు. తమిళనాడుకు చెందిన శ్రీముఖలింగం నామినేషన్ పత్రాలతోపాటు ఓటర్ జాబితాలో పేరున్నట్లు తెలిపే సర్టిఫికెట్ ఇవ్వనందున తిరస్కరించామన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన కె పద్మరాజన్, అహ్మదాబాద్‌కు చెందిన పరేష్‌కుమార్ నానుభాయ్ ములానీ, బెంగళూరు నివాసి హోస్మత్ విజయానంద్ నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, రామాయణి చాయ్‌వాలా.. రాష్ట్రపతి ఎన్నికలతో పాటు లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లోనూ పలుమార్లు నామినేషన్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. 24 పర్యాయాలు ఆయన ఎన్నికల్లో పోటీకి నిలిచినట్టు తెలుస్తోంది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 19 ఆఖరు తేదీ. జూలై 20న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 22 చివరి తేదీ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. నామినేటెడ్ సభ్యులతో సహా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఓటు వేయడానికి అర్హులు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది. తదుపరి ఉపరాష్ట్రపతి ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటివరకు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్ మాజీ ముఖ్యంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ప్రకటించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. (క్లిక్: కేంద్రంపై కోర్టుకెక్కిన ట్విట్టర్) -
Tuktuki Das: ఎం.ఏ ఇంగ్లిష్ చాయ్వాలీ
ఎం.ఏ ఇంగ్లిష్ చదివిన అమ్మాయిలు టీచర్ అవుతారు. లెక్చరర్లు కావాలని ప్రయత్నిస్తారు. ప్రయివేటు ఉద్యోగాలు అన్వేషిస్తారు. కాని టుక్టుకీ దాస్ అలా కాదు. ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’ పేరుతో టీకొట్టు తెరిచింది. నేను ఉపాధి వెతుక్కోవడం కాదు. వ్యాపార రంగంలో ఎదిగి నలుగురికీ ఉపాధి ఇస్తాను అంటోంది. కుతూహలం రేపుతున్న ఈ పోస్ట్‌గ్రాడ్యుయేట్ కథ ఏంటి? ‘ఐయామ్ హ్యాపిలీ సేయింగ్ దట్ ఐయామ్ బిజీ’ అంటుంది 26 ఏళ్ల టుక్టుకీదాస్. ఎంత బిజీ ఆ అమ్మాయి? ఉదయం ఐదు గంటలకు లేచి సైకిల్ మీద తన ఇంటికి రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న రైల్వేస్టేషన్‌కు వెళుతుంది. అప్పటికే ఆమె టీ కోసం కస్టమర్లు వెయిట్ చేస్తుంటారు. అప్పటి నుంచి రాత్రి 10 వరకూ తన టీకొట్టులోనే ఉంటుంది. వచ్చిన వారందరికీ టీ ఇస్తుంది. వారితో కబుర్లు చెబుతుంది. టీ అన్నీ చోట్లా ఉంటుంది. మరి ఎందుకు ఆమె దగ్గరికే వచ్చి కొంటారు అనంటే ఆమె టీకొట్టు పేరు ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’. ఎం.ఏ ఇంగ్లిష్ చేసిన ఒక అమ్మాయి తయారు చేసి అమ్ముతున్న టీ కనుక ఇప్పుడు ఈ క్రేజ్. బెంగాల్ అమ్మాయి టుక్టుకీదాస్ది పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణ జిల్లాలోని హాబ్రా. ముగ్గురు పిల్లల్లో తను పెద్దది. తండ్రి వ్యాన్ డ్రైవర్. తల్లికి చిన్న కిరాణాషాపు ఉంది. ‘అందరు ఆడపిల్లల్లాగే నేను కూడా రెండు విషయాలు వింటూ పెరిగి పెద్దదాన్నయ్యా. ఒకటి:గవర్నమెంట్ ఉద్యోగం, రెండు: పెళ్లి’ అంటుంది టుక్టుకీ దాస్. 2020లో రవీంద్రభారతి యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశాక కొన్నాళ్లు ట్యూషన్ చెప్పింది. ‘నాకు టీచింగ్ అంటే ఇష్టమే కాని అది ఒకేచోట ఆపేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఇంకా ఏదో సాధించాలి. నా కాళ్ల మీద నేను నిలబడాలి’ అంటుంది టుక్టుకీ దాస్. ఎం.బి.ఏ చాయ్‌వాలా స్ఫూర్తి ఎం.బి.ఏ చాయ్‌వాలా పేరుతో ప్రఫుల్ బిల్లోర్ అనే ఎంబిఏ కేండిడేట్ తెరిచిన వరుస టీకొట్లు హిట్ అయ్యాయి. అలాగే ఆస్ట్రేలియాలో ఉప్మా విర్ది అనే ఆమె చాయ్వాలీ పేరుతో టీ అమ్ముతూ ఫేమస్ అయ్యింది. ‘నేను కూడా వారిలాగే చాయ్ దుకాణం తెరుద్దామని అనుకున్నాను. నేను ఎం.ఏ ఇంగ్లిష్ చదివాను కనుక ఎం.ఏ ఇంగ్లిష్ చాయ్వాలీ పేరుతో టీకొట్టు తెరిచాను. దీనికి ముందు ఎక్కడ టీకొట్టు పెట్టాలా అని ఆలోచిస్తే కాలేజీల వద్ద, హాస్పిటల్స్ వల్ల లేదా రైల్వే స్టేషన్లో అనే ఆప్షన్స్ కనిపించాయి. కాలేజీలు కరోనా వల్ల సరిగ్గా నడవడం లేదు. హాస్పిటల్స్ దగ్గర మనుషులు తాగడం లేదు. అందుకని రైల్వేస్టేషన్‌ను ఎంచుకున్నాను’ అంటుంది టుక్టుకీ దాస్. ఆ షాపు తెరవడానికి గత సంవత్సరం ట్యూషన్ చెప్పి దాచుకున్న 10 వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. ‘అమ్మా నాన్నలకు నేను చాయ్ దుకాణం పెడతానని చెప్తే వద్దనలేదు కాని ఆశ్చర్యపోయారు. పైగా రైల్వేస్టేషన్ అనేసరికి ఎలా ఉంటుందో అనుకున్నారు. కాని వారి మద్దతుతో ముందుకే వెళ్లాను’ అంటుందామె. మొదటిరోజే ఉచితంగా నవంబర్ 1, 2021న హాబ్రా రైల్వేస్టేషన్లో కొంతమంది మిత్రుల మధ్య, మైక్‌లో వినిపిస్తున్న అనౌన్స్మెంట్ల మధ్య ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’ దుకాణాన్ని తెరిచింది టుక్టుకీదాస్. దానికి ముందు నుంచే ఆమె బ్లాగింగ్ కూడా చేస్తుండటం వల్ల తన రోజువారీ అనుభవాలను కూడా వీడియో తీసి బ్లాగ్‌లో ఉంచడం మొదలెట్టింది. ఈ పేరు కొత్తగా ఉండటం, ఫేస్బుక్లో ఆమె రోజూ వీడియోలు పెడుతుండటంతో వెంటనే గుర్తింపు వచ్చేసింది. జనం కుతూహలంతో ఆమె షాపుకు వచ్చి టీ తాగడం మొదలెట్టారు. ‘అక్కా.. టీ ఇవ్వు. అలాగే ఒక సెల్ఫీ కూడా’ అని కాలేజీ పిల్లలు అడగడం మొదలైంది. మొదటి రోజు రెండు గంటల పాటు కస్టమర్లను ఆకర్షించడానికి ఉచితంగా టీ ఇచ్చింది టుక్టుకీ దాస్. ఆ తర్వాత డబ్బులు అవే గల్లాపెట్టెలో పడటం మొదలయ్యాయి. ఏదీ తక్కువ కాదు రైల్వే స్టేషన్లో టీ అమ్మే అమ్మాయిని చూసి అక్కడి పోర్టర్లే మొదట చులకనగా చూశారు టుక్టుకీ దాస్‌ని. ‘ఏ పనైనా గౌరవప్రదమైనదే అని మన దేశంలో గ్రహించరు. అమ్మాయిలు శ్రమ చేసి తమ కాళ్ల మీద తాము నిలబడటాన్ని చూసి హర్షించాలి’ అంటుంది టుక్టుకీ దాస్. అయితే ఇప్పుడు అందరూ ఆమెను ప్రశంసాపూర్వకంగా చూస్తున్నారు. సాయం వద్దు టుక్టుకీ దాస్ చాయ్ దుకాణం పాపులర్ అయ్యేసరికి కొంతమంది పెద్దలు వచ్చి సాయం చేస్తామన్నారు. ‘నేను సున్నితంగా వారించాను. నేను పైకి వస్తే నా వల్లే రావాలి తప్ప వేరొకరి సాయంతో కాదు. నేను ఇప్పుడు నా చాయ్ దుకాణంతో సంతోషంగా ఉన్నాను. ఇంకా నేను ఈ బ్రాండ్‌తో కోల్కటాలో దుకాణాలు తెరవాలి. కాని ఈ దుకాణం మాత్రం మూసేయను. ఇది మొదటిది. నా సెంటిమెంట్‘ అంటుంది టుక్టుకీ దాస్. టుక్టుకీ దాస్ రోజూ చాలా బిజీగా ఉంటోంది. చాలామంది ఫుడ్బ్లాగర్స్ ఆమెతో వీడియోలు చేస్తున్నారు. ఒక అమ్మాయి ఆత్మవిశ్వాసంతో టీ అమ్ముతూ ఉండటం సంతోషంగా ఉండటం అందరికీ ఎందుకు నచ్చదు. భిన్నంగా ఆలోచిస్తే మామూలు టీ కూడా ఇలా బ్రాండ్ అయి కూచుంటుంది. -
ఈ టీ ఖరీదు రూ.15 లక్షలు.. అయినా ఎగబడ్డ జనం
కోల్‌కతా: రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడానికి కొందరు ప్రత్యేక దారిని ఎంచుకుంటారు. అదే తరహాలో టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్ర ప్రధానిని టార్గెట్ చేస్తూ ఏకంగా చాయ్ వాలా అవతారం ఎత్తారు. తన అభిమానులు, ప్రజలకు టీ ఇచ్చారు. దాని ధర రూ.15 లక్షలు అని చెప్పారు. అందరూ ఆ టీ తీసుకుని ఆనందంగా తాగారు. ఆ తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన దైన శైలిలో సెటైర్స్ వేశారు. మిత్ర మాట్లాడుతూ.. మా తృణమూల్ కాంగ్రెస్సే కాదు, ఇతర విపక్షాలు కూడా బీజేపీ ప్రభుత్వం 2014లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలుచేస్తాయో అని ఎదురుచూస్తూనే ఉన్నాం. ప్రతి పౌరుడి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోదీ అప్పట్లో మాట ఇచ్చారు. మరి ఏళ్లు గడుస్తున్న ఆ రోజు ఇంకా రాలేదని, ఇది ఎప్పుడు నెరవేరనుందోనని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెటిజన్లలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ కమర్హతి ఎమ్మెల్యే, కోల్‌కతాలోని భువానిపూర్ ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులకు టీ అందిస్తూ.. "ఇది ఒక ప్రత్యేకమైన టీ. మోదీజీ రైల్వే స్టేషన్లలో చాయ్ వాలాగా ఉన్నప్పుడు చేసిన టీ రుచికి సరిపోతుందని నేను అనుకుంటున్నాను. దీన్ని ఉచితంగా అందిస్తున్నాను. కానీ మీరు ధర అడిగితే మాత్రం, ఒక కప్పు ధరను రూ .15 లక్షలుగా చెప్తాను ఎందుకంటే ఇది మోదీ వాగ్దానం చేసిన మొత్తం కూడా 15 లక్షలే కనుక అంటూ విమర్శలు గుప్పించారు. @AITCofficial MLA, Madan Mitra: A cup of tea costs 15 lakh rupees, the name of the ‘seller’ is Madan Mitra! An innovative campaign by @madanmitraoff 🙏 pic.twitter.com/ggT6bWIEbP — Satyaki Sengupta (@satyaki_sngupta) August 1, 2021 -
చాయ్‌వాలా ఫీట్లు : పోలీసు ఉన్నతాధికారి ఫిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి మహిళలు, చిన్నారుల భద్రతపైన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలపై ఎంత చురుగ్గా ఉంటారో.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు. తమ శాఖ అందిస్తున్న సేవలపై నిరంతరం ట్విటర్లో అప్డేట్ చేస్తూ, అనేక సలహాలను ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో నిరంతరం తలమునకలై ఉండే ఆమె తాజాగా ఒక ఫన్నీ వీడియోను ట్విటర్లో షేర్ చేయడం విశేషం. ఛాయ్ వాలా నైపుణ్యాన్ని చూసి ముచ్చటపడుతూ నవ్వుకుంటున్న సుమతి వీడియో ప్రస్తుతం పలువురిని ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌లో ఇరానీ చాయ్అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగే డీఐజీ సుమతి కూడా ఒక షాపులో ఇరానీ టీ తాగేందుకు ఆగారు. ఆమె టీ కప్ తీసుకోవటానికి యత్నిస్తున్నపుడే అసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ చాయ్ వాలా ఆ కప్పును ఆమెకు దొరక్కుండా చేస్తూ..ఫన్నీ ఫీట్లతో అలరించారు. సాక్షాత్తూ పోలీసు ఉన్నతాధికారినే ఫిదా చేసిన ఈ ఫీట్లు చూస్తే మీరు కూడా వావ్ అంటారు. -
కేఫ్‌ను లాంచ్ చేసిన పాక్ 'వైరల్' చాయ్‌వాలా!
ఇస్లామాబాద్: ఒక్కఫొటోతో రాత్రికిరాత్రే స్టార్‌గా మారిన నీలి కళ్ల 'చాయ్‌వాలా' అర్షద్ ఖాన్ గుర్తున్నాడా? పాకిస్తాన్లో దాదాపు నాలుగేళ్ల క్రితం జియా అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో క్రేజీగా వైరల్ అవడంతో అర్షద్ ఏకంగా మోడల్‌గా మారిపోయాడు. 'చాయ్‌వాలా ఆఫ్ పాకిస్తాన్'గా విపరీతమైన పాపులారిటీతోపాటు డబ్బు సంపాదించాడు. ఇప్పుడు సొంతంగా ఇస్లామాబాద్‌లో ఓ అధునాతన కేఫ్‌ను ప్రారంభించాడు. ఓ చిన్న దుకాణంలో టీ కాచుకునే అర్షద్ నాలుగేళ్లు గిర్రున తిరిగేసరికి ఓ భారీ కేఫ్‌కు యజమానిగా మారిపోయాడు. 'కేఫ్ చాయ్‌వాలా రూఫ్ టాప్' పేరుతో ప్రారంభించిన ఈ కేఫ్ గురించి అర్షద్ ఖాన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. 'కేఫ్ పేరులోని చాయ్‌వాలా అనే పదాన్ని తొలగిస్తే మేలని చాలా మంది సలహాలిచ్చారు. కానీ నేను ఎవరి మాటా వినలేదు. ఆ చాయ్‌వాలా అనే పదమే నాకు ఇంతటి గుర్తింపును తీసుకొచ్చింది' అని అర్షద్ చెప్పాడు. కేఫ్ పేరు మోడర్న్‌గా ఉన్నా లోపల ఇంటీరియర్స్‌ను మాత్రం సంప్రదాయం ఉట్టిపడేలా తీర్చిదిద్దామని ఆయన తెలిపాడు. వివిధ వెరైటీల కాఫీ, టీలతోపాటు 20 రకాల డిషెస్ తమ హోటల్లో లభిస్తాయని చెప్పాడు. కేఫ్‌ను ప్రారంభించినప్పటి నుంచి అర్షద్‌ఖాన్‌ను నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడని, లుక్స్‌తోపాటు మాటతీరులోనూ పరిణితి సాధించాడని ప్రశంసిస్తున్నారు. (చదవండి: పాక్ పావురాన్ని విడిచి పెట్టిన భారత్) -
సుచిన్..షోజే..చీవాలా!!
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగం విషయంలో బాగానే ప్రిపేరయినట్లున్నారు. ఎందుకంటే దీన్లో ఆయన బోలెడన్ని భారతీయ పేర్లు, పండుగలు, హిందీ సినిమాలను కూడా జొప్పించారు. కాకపోతే వాటిని పలకటంలో మాత్రం తడబడ్డారు. నరేంద్రమోదీని ఛాయ్ వాలాగా సంభోదించబోయి ‘చీవాలా’ అన్నారు. ఇక వేదాలను వేస్టాస్గా... స్వామి వివేకానంద పేరును వివేకాముందగా... సచిన్ టెండూల్కర్‌ను సుచిన్ టెండూల్కర్‌గా పేర్కొన్నారు. దీంతో పాటు షోలే సినిమాను షోజే అని అన్నారు. దిల్వాలే దుల్హనియా లేజాయెంగే సినిమా పేరును షార్ట్‌కట్‌లో చక్కగా డీడీఎల్జే అని పలికేశారు. ఈ తప్పులపై ట్విటర్లో ట్రోలింగ్ బాగానే జరిగింది. కాకపోతే ఇన్ని పేర్లను పలకటానికి ట్రంప్ బాగానే హోమ్ వర్క్ చేసి ఉంటారంటూ చాలామంది వీటిని తేలిగ్గానే తీసుకున్నారు. ఇక సచిన్ టెండూల్కర్ పేరును సుచిన్ టెండూల్కర్‌గా పలికినందుకు ట్రంప్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ట్విట్టర్ వేదికగా విమర్శించింది. అయినా అమెరికాలో సగం మంది క్రికెట్ అంటేనే... ‘అదేం ఆట?’ అని అడిగే పరిస్థితి ఉంది. అలాంటిది ట్రంప్ ఏకంగా సచిన్ పేరునే బట్టీపట్టినందుకు ప్రశంసించాలంటూ కొందరు పేర్కొనటం కొసమెరుపు!!. ట్రంప్ తొలిరోజు పర్యటన సాగిందిలా ► ఉదయం 11.40కి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రంప్ దంపతులు చేరుకున్నారు. ► 12.10: సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు ► 12.50: మొటెరా స్టేడియంకు వెళ్లారు ► 1.15: ట్రంప్ ప్రసంగం ప్రారంభించారు. ► 2.50: అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ► 4.15: ఆగ్రా ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ► 4.50: తాజ్‌మహల్ సందర్శనకు వచ్చారు ► 6.45: తిరిగి ఆగ్రా ఎయిర్ బేస్‌కు వెళ్లారు ► 7.40: ఢిల్లీలోని పాలమ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు ► 8.00: మౌర్య హోటల్లో రాత్రి బస -
చాయ్‌వాలాలను మర్చిపోతున్నారు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చౌకీదార్లను గుర్తు చేసుకుంటూ తన తోటి చాయ్‌వాలాలను మర్చిపోతున్నారని, తదుపరి రాజకీయ ప్రయోజనాల కోసం మరొకరిని గుర్తు చేసుకుంటూ చౌకీదార్లను మర్చిపోతారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఎద్దేవా చేశారు. ప్రధాని ‘మై భీ చౌకీదార్’ ప్రచారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ‘చౌకీదార్ చోర్ హై’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోందని ఆయన చెప్పారు. ‘గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, ఉరి, బారాముల్లా, పుల్వామాల్లో ఉగ్రదాడులు జరిగినప్పుడు చౌకీదార్ (మోదీ) ఏం చేస్తున్నారు. నిద్రపోతున్నారా? అప్పుడు ‘మై భీ చౌకీదార్’ నినాదం ఏమైంది?’ అని కపిల్ సిబల్ పీటీఐకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు. బాలాకోట్‌లో జరిపిన వైమానిక దాడులను మోదీ రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘బీజేపీ బహిరంగ ప్రకటనలు చేయడం ద్వారా వైమానిక దాడులను రాజకీయం చేయడంలో ముందే ఉంటుంది. ప్రధాని ప్రసంగాలు ఇచ్చే సమయంలో వెనుక అమర వీరుల ఫొటోలుంటాయి. పదే పదే తన ప్రసంగాల్లో వైమానిక దాడులను ప్రస్తావిస్తూ ప్రజల్లో కూడా అదే భావన ఉందంటున్నారు’ అని సిబల్ విమర్శించారు. వ్యవసాయ సంక్షోభం, విద్య, ఆరోగ్యం, ఆకలి వంటి సగటు మనిషి జీవితానికి సంబంధించిన విషయాల్లో బీజేపీ ప్రభుత్వానికి కనీస ఆందోళన లేదని ఆరోపించారు. అలాగే నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ వంటి వారు దేశం విడిచి పారిపోయి నప్పుడు చౌకీదార్ ఉద్యమం ఏమైందని ఎద్దేవా చేశారు. ‘బాలాకోట్‌పై వైమానిక దాడులు చేయడం తప్పేమీ కాదు దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే దాన్ని రాజకీయం చేయడమే సరికాదు’ అని అన్నారు. -
ఆయన ప్రధాని అవుతారని ఎవరైనా ఊహించారా..?
ఒక చాయ్‌వాలా ప్రధాని పదవిని అధిరోహిస్తాడని ఎవరైనా ఊహించగలరా? అసాధ్యమనుకుంటాం. కానీ అదే చాయ్వాలాకి దేశంలోనే అత్యున్నత పదవిని అప్పగించి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అసాధ్యమైనదేదీ లేదని రుజువు చేశారు ఈ దేశ ప్రజానీకం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కాదు ఈ దేశ రాజకీయచరిత్రనే మలుపుతిప్పిన అసాధ్యుడు నరేంద్రమోదీ. నమో మంత్రంతో జనంమదిని మెప్పించి, సరికొత్త నినాదాలతో కుర్రకారుని ఒప్పించి, స్వచ్ఛభారత్ ఆచరణతో సరికొత్త భారత్‌ని ఆవిష్కరించి గత ఎన్నికలకు ముందే మోదీ తనదైన మార్కుతో యువతరం గుండెల్లో చెరగని జ్ఞాపకంగా మారారు. టీ కొట్టులో గ్లాసులు కడిగే దగ్గర్నుంచి దేశంలో అవినీతిని తరిమికొట్టేవరకూ మోదీ ప్రస్థానం ఎల్లలు దాటింది. చాయ్ వాలా నుంచి పుల్వామా వరకూ ఆయనకు అన్నీ కలిసొచ్చిన అంశాలే. ఆయన జీవన ప్రస్థానంలో అనేకానేక అపశృతులూ లేకపోలేదు. గుజరాత్ మతకల్లోలం, గోద్రా అల్లర్లూ, దళితులపై దాడులూ ఆయన పాలనపై చీకటి ముద్రలే. అయినప్పటికీ ఆయన అభివృద్ధిమంత్రం, దేశభక్తి తంత్రంతో ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు. వ్యక్తిగత జీవితానికీ, రాజకీయజీవితానికి మధ్య అనేక అసమతుల్యతలున్నా, కట్టుకున్న యశోదా బెన్ని విడిచిపెట్టి రాజకీయ జీవితాన్నెంచుకునేలా చేశాయి. వైవాహిక బంధాన్ని కాదనుకున్నా రక్తసంబంధానికి తలొగ్గారు మోదీ. తల్లి హీరాబెన్ పాదాభివందనంతో భారతీయ తల్లుల ప్రేమను గెలుచుకున్నారు. యోగాని ఒక ఆసనంగా కాక భారతీయ సాంప్రదాయక సాహసంగా తీర్చి దిద్ది ప్రపంచప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆహారం, ఆరోగ్యంపైనే కాదు ఆహార్యంపై సైతం ఆయనకు ఎనలేని శ్రద్ధ. వేదికపై నుంచుంటే ఆయన మాటే మంత్రమౌతుంది. వేదిక దిగితే ఆయన జనసంద్రంగా మారతాడు. సెల్ఫీల ప్రపంచంలో యువతరాన్నే తోసిరాజనే మోదీ గురించి... గుజరాత్లో వాదానగర్ అనే చిన్న ఊర్లో 1950, సెప్టెంబర్ 16న మోదీ జన్మించారు. అత్యంత వెనుకబడిన ఘాంచి కులంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన మోదీ చిన్నతనంలో పొట్ట కూటికోసం టీ అమ్మేవారు. పాఠశాల విద్య పూర్తయ్యాక ఆయన ఇల్లు విడిచిపెట్టి దేశపర్యటన చేశారు. అదే ఆయనకి జీవితాన్ని బోధించింది. ఈ దేశ భిన్న సంస్కృతిని అర్థం చేసుకునేలా చేసింది. రిషికేష్, హిమాలయాలు, రామకృష్ణ మిషన్, ఈశాన్య రాష్ట్రాల సందర్శన ఆయన వ్యక్తిత్వంపై ఎనలేని ప్రభావం చూపింది. రెండేళ్ల పాటు ఊరూరూ తిరిగిన ఆయన 1971లో అహ్మదాబాద్‌లో ఆరెస్సెస్ ప్రచారక్‌గా చేరారు. 1975–77లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించి, పోలీసుల కన్నుగప్పి అందరికీ పంచిపెట్టినప్పుడే ఆయనలో నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. 1985లో బీజేపీ గూటికి చేరి, 1987లో గుజరాత్ రాష్ట్ర శాఖ సంస్థాగత కార్యదర్శిగా పనిచేశారు. అద్వానీ రథయాత్రకు అడ్డంకులు రాకుండా వెన్నంటి ఉన్నప్పుడు ఆయనలో శక్తి సామర్థ్యాలు ఎంతటివో పార్టీ అధిష్టానానికి తెలిసివచ్చింది. 2002లో తొలిసారిగా గుజరాత్ సీఎం అయ్యారు. అదే సంవత్సరంలో జరిగిన గోద్రా అల్లర్లు ఆయన ప్రభుత్వానికి మాయని మచ్చలా మారాయి. ఆ అల్లర్లను తెరవెనుక నుంచి ప్రభుత్వమే ప్రేరేపించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మోదీ ముఖ్యమంత్రిగా గద్దె దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయ భేరి మోగించిన మోదీ ప్రజల్లో తనకు వ్యతిరేకత లేదని నిరూపించుకున్నారు. తర్వాత సుప్రీంకోర్టు కూడా మోదీ సర్కార్‌కి క్లీన్ చిట్ ఇచ్చింది. అప్పట్నుంచి వరసగా పదిహేనేళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. ఎన్నో రాష్ట్రాలకు గుజరాత్ ఆదర్శంగా నిలిచింది. అయితే మానవాభివృద్ధిలో రాష్ట్రం వెనుకబడే ఉందని కొన్ని సర్వేలు నిందించాయి. మోదీ తన వాగ్ధాటితో ప్రజల్ని అమితంగా ఆకర్షించారు. అప్పట్లోనే సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుని కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి ప్రధాని పీఠం అధిష్టించారు. ప్రధానమంత్రి హోదాలో గత అయిదేళ్లలో అమెరికా సహా 59 దేశాలు చుట్టేశారు. ఇందుకోసం ఆయన చేసిన ఖర్చు రూ. 2,201 కోట్లు. ప్రధాని పదవిలోకి వచ్చాక దసరా సమయంలో తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లారు. దేవి భక్తుడైన మోదీ ప్రధానిగౌరవార్థం అమెరికా ఇచ్చిన విందుని కూడా కాదనుకుని, కేవలం నిమ్మరసం మాత్రమే తీసుకుని ఉపవాసాన్ని కొనసాగించారు. నరేంద్ర మోదీ నాయకత్వ ప్రతిభపై నమ్మకంతో 2014లో బీజేపీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. అదే ఆ పార్టీకి అన్ని విధాలా కలిసొచ్చిన అంశం. ఐదేళ్ల పాలనలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, నిరుద్యోగాన్ని అరికట్టలేకపోవడం, రైతు సమస్యలు వంటివి మోదీ ప్రతిభను మసకబార్చాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పాక్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు ఆయన నాయకత్వాన్ని అపారంగా విశ్వసించేలా చేశాయి. ఇప్పుడు దేశభద్రత అంశం కలిసొస్తుందన్న ఆశతో మోదీ ఉన్నారు. -
210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్లెట్స్ దానం
భువనేశ్వర్: పెద్దల అదుపాజ్ఞలు లేక కుంటుపడిన తన విద్యాభ్యాసంలా.. నేటి తరం బాలలు విద్యకు దూరం కాకూడదనే ‘పెద్ద మనసు’ ఆయనను సంఘ సేవలోకి అడుగిడేలా చేసింది.. పసి హృదయాల్లో ప్రాథమిక విద్యాభ్యాసంపై మక్కువ పెంపొందించి విద్యార్జనకు పునాది వేసే ‘ఆశా ఓ ఆశ్వాసన్’ సంస్థను స్థాపించేలా ప్రేరేపించింది. స్వీయ జీవితంలోని తప్పిదాలు భావితరాలకు పునరావృతం కాకూడదనే సదభిప్రాయమే ఆయనకు మన దేశపు ప్రతిష్టాత్మక పురస్కారం ‘పద్మశ్రీ’ తెచ్చిపెట్టింది. ఆయనే ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి వలస వచ్చి కటక్ మహానగరంలోని బక్షిబజార్ (మురికివాడ)లో స్థిరపడిన దేవరపల్లి ప్రకాశరావు. ఆయన వయసిప్పుడు 59 సంవత్సరాలు. తాత, ముత్తాతల కాలం నుంచి అదే ప్రాంతంలో స్థిరపడ్డారు. అర్ధాంతరంగా ఆయన చదువు అటకెక్కడంతో.. తండ్రి పెట్టిన టీ కొట్టునే జీవనాధారం చేసుకున్నారు. తనలా మరెవరూ విద్యకు దూరం కాకూడదనే సత్సంకల్పంతో తనకున్న రెండు గదుల ఇంటిలోనే ఓ గదిని చిన్న స్కూల్‌గా మార్చేశారు. ఇప్పుడు ఆ స్కూల్లో సుమారు 80 మంది విద్యనభ్యసిస్తున్నారు. విద్యాదానమే కాదు... ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ ప్రకాశరావుది పెద్ద చెయ్యే. ఒకానొక సందర్భంలో తనకు రక్తదానం చేసి.. ప్రాణాలు కాపాడిన ఓ అపరిచిత వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకున్న ఆయన.. 1976 నుంచి ఇప్పటి వరకు 210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్లెట్స్ దానం చేశారు. ప్రతి రోజూ ప్రభుత్వాస్పుత్రిలోని పేద రోగులకు పాలు, బిస్కెట్లు, పండ్లు దానం చేస్తుంటారు. విద్యాధికుడు కాకున్నా జీవన స్రవంతిలో దైనందిన మనుగడ కోసం ఆయన 8 భాషల్లో మాటామంతీ చేయగల సమర్థుడు. ప్రభుత్వం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం తరహాలోనే చదువుపై బాలల్లో మక్కువ పెంపొందించేందుకు పాలు, బిస్కెట్లు, బన్ వంటి తినుబండారాలు నిత్యం ఉచితంగా ఇస్తూ ఆదరిస్తున్నారు. పిల్లలకు యూనిఫాం, చెప్పులు కూడా ఉచితంగా ఇస్తారు. ప్రస్తుతం 4 నుంచి 9 ఏళ్ల లోపు సుమారు 80 మంది బాలలు ఆయన ఆధ్వర్యంలో అక్షరాలు నేర్చుకుంటున్నారు. చిట్ట చివరగా ఆయన మరణానంతరం కూడా మానవాళి మనుగడకు ఎంతో కొంత దోహదపడాలనే తపనతో అవయవ దానం చేసేందుకు ఇప్పటికే అంగీకార పత్రం ఇచ్చారు. ఆయన ఆర్జించిన దానిలో సింహ భాగం సంఘసేవకే వెచ్చిస్తుంటారు. కాగా నిజ జీవితంలో ఎదురైన కష్ట నష్టాలు తోటి వారిలో తిరిగి చూడరాదనే భావమే సంఘ సేవకు ప్రేరేపించి నేడు తనను ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీతగా నిలిపిందని ‘సాక్షి’తో దేవరపల్లి ప్రకాశరావు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు ప్రకాశరావు సంఘసేవ గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోదీ గత ఏడాది మే నెలలో ఒడిశా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా దేవరపల్లి ప్రకాశరావుతో భేటీ అయ్యారు. ఆయన నిర్వహిస్తున్న సంస్థను సందర్శించి ముచ్చటపడ్డారు. ఆయన సేవలు అనన్యమని అభినందించారు. అనంతరం మన్ కీ బాత్ ప్రసార కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రకాశరావు సంఘసేవలో తలమునకలై నిరంతరం కొనసాగించడం అభినందనీయమని.. ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించడం విశేషం. ప్రకాశరావును పద్మశ్రీ వరించినందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆయనకు అభినందనలు తెలియజేశారు. -
చాయ్‌వాలా వ్యాఖ్యలపై షిండే ఫైర్
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ తరచూ తనకు తాను చాయ్‌వాలాగా చెప్పుకోవడాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆక్షేపించారు. మోదీ ప్రధాని కావడం మన దేశ రాజ్యాంగం ఘనతేనని స్పష్టం చేశారు. తాను గతంలో షోలాపూర్ జిల్లా కోర్టులో ప్యూన్‌గా పనిచేశానని, తాను అత్యున్నత స్ధానానికి ఎదగడం మన రాజ్యాంగం చలవేనని నమ్ముతానని చెప్పుకొచ్చారు. తాను ఉన్నత స్థితికి చేరుకోవడంలో తన ఘనతేమీ లేదనే తాను భావిస్తుంటానన్నారు. పార్టీ తనకు అప్పగించిన అత్యున్నత పదవులను చేపట్టడం తన బాధ్యతగా భావించానన్నారు. ప్రజాస్వామ్యంలో పరిణితితో వ్యవహరించడం అవసరమని, సొంతడబ్బా కొట్టుకోవడం తగదని మహారాష్ట్ర సీఎంగా కూడా వ్యవహరించిన షిండే హితవు పలికారు. నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యులు నాలుగు తరాల పాటు దేశాన్ని పాలించిన అనంతరం ఓ చాయ్‌వాలా దేశ ప్రధానిగా ఎలా అయ్యాడని వారు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా ఏ వృత్తీ చిన్నది కాదని, ప్రధాని తరచూ చాయ్‌వాలా అంటూ వారిని తక్కువగా చూసే సంకేతాలు పంపడం సరైంది కాదని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు.