సాధారణంగా ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేవారికంటే కూడా సొంత వ్యాపారాలు చేస్తున్న వారు బాగా సంపాదిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు బెంగుళూరు చాయ్‌వాలా 'మునిస్వామి డేనియల్'. ఇంతకీ ఈయనెవరు, సంపాదన ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం బెంగళూరుకు చెందిన మునిస్వామి డేనియల్ నెలకు రూ. 3 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక టీ అమ్మే వ్యక్తి ఏమిటి? లక్షలు సంపాదించడం ఏమిటని చాలామందికి ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇది తప్పకుండా నమ్మాల్సిందే.
ఏడు సంవత్సరాలు డ్రైవర్‌గా
నాల్గవ తరగతి వరకు మాత్రమే చదివి ఆ తరువాత డ్రైవర్‌గా పనిచేసిన డేనియల్ ఇప్పుడు లక్షాధికారి. 'షారన్ టీ స్టాల్' పేరుతో మొదలైన ఈయన బిజినెస్ ఈ రోజు బెంగళూరులో మూడు బ్రాంచ్‌లుగా విస్తరించింది. అనుకున్న విధంగానే బాగా ఆర్జిస్తూ ఎంతోమందికి ఆదర్శమయ్యాడు.
నిజానికి నిరుపేద కుటుంబంలో జన్మించిన డేనియల్ ఆర్ధిక పరిస్థితుల వల్ల పెద్ద చదువులు చదువుకోలేకపోయాడు. కేవలం 10 సంవత్సరాల వయసులోనే పనిచేయడం ప్రారంభించాడు. కానీ ఏ పనిలోనూ అతడు సంతృప్తి చెందలేదు. ఆ తరువాత ఏడు సంవత్సరాలు డ్రైవర్‌గా పనిచేశాడు. ఇది కూడా నచ్చకపోవడంతో సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారభించాలనుకున్నాడు.
టీ వ్యాపారం
అనుకున్న విధంగానే 2007లో 'టీ' వ్యాపారం ప్రారంభించాడు. అనుభవం లేకున్నా.. చేయాలనే ఉత్సాహమే అతన్ని ముందుకు నడిపింది. అతడు కూడా ఉదయం నాలుగు గంటలకే దుకాణం ఓపెన్ చేసి వ్యాపారం చేసేవాడు. క్రమంగా అతని వ్యాపారం వృద్ధిలోకి వచ్చింది.
ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా యూజర్లకు షాక్!
అనుకుంటే ఏది అసాధ్యం కాదు, కానీ అనుకున్నంత సులభంగా సక్సెస్ చేతికి రాదు. దాని వెనుక గొప్ప కృషి, పట్టుదల ఉండాలి. ఇదే డేనియల్ నమ్మిన సూత్రం. అందరిలా ఒకే దగ్గర ఆగిపోకుండా కొత్త రుచులతో నాణ్యతను మరింత పెంచాడు. దీంతో వ్యాపారం బాగా పెరిగింది.
ఇదీ చదవండి: థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్.. విడుదలకు ముందే లీక్ - వివరాలు
ప్రస్తుతం బెంగళూరులో మాస్టర్ టీ సెల్లర్‌గా పాపులర్ అయిన ఇతడు వంద రకాల కంటే ఎక్కువ 'టీ'లను తయారు చేసి రోజుకి 1000 కప్పులకంటే ఎక్కువ అమ్ముతాడని, దీంతో అతని వార్షికాదాయం రూ. 40 లక్షల కంటే ఎక్కువని సమాచారం. ఇతని టీ షాపుల్లో ఏకంగా 30 మందికంటే ఎక్కువ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment