అనుకోకుండా.. అప్పుడప్పుడు వచ్చే ఆలోచనలు కూడా గొప్పవాళ్లను చేసే సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'నీరజ్ కక్కర్' (Neeraj Kakkar). ఇంతకీ ఈయనెవరు? ఈయనకొచ్చిన అలాంటి ఆలోచన ఏంటి? అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం..
నీరజ్ కక్కర్ అమెరికాలోని వార్టన్ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి చేసిన తరువాత, 2009లో పేపర్ బోట్ కంపెనీని స్థాపించారు. అంతకంటే ముందు ఈయన కోకాకోలా కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పని చేశాడు. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన పేపర్ బోట్ కంపెనీ పుట్టడానికి కారణం ఓ ఉద్యోగి వాళ్ళ అమ్మ చేసిన జ్యూస్ తాగడమే అని తెలిపాడు.
ఆఫీసులో లంచ్ చేసే సమయంలో ఒక ఉద్యోగి కోసం వాళ్ళ అమ్మ జ్యూస్ తీసుకువచ్చిందని, దాన్ని తాగిన కక్కర్‌కు ఓ ఆలోచన తట్టింది. ఇలాంటి రుచితోనే జ్యూస్ చేస్తే బాగుంటుందని భావించి కంపెనీ పెట్టాలని.. పేపర్ బోట్ డ్రింక్స్ పేరుతో సంస్థ ప్రారంభించాడు. నేడు ఆ కంపెనీ వందల కోట్లు ఆర్జిస్తోంది.
ఇదీ చదవండి: గుజరాత్ సమ్మిట్‌లో కనిపించని 'ఇలాన్ మస్క్'.. టెస్లా ఫ్యూచర్ ఏంటి?
పేపర్ బోట్స్ అనగానే ఓ ప్రత్యేకమైన భారతీయ అభిరుచికి పేరుగాంచిన కంపెనీగా పేరు పొందింది. గత ఏడాది సంస్థ 50 మిలియన్ డాలర్లు సేకరించింది. బిజినెస్ చేయడానికి ఆహారమే అత్యుత్తమ రంగమని కక్కర్ వెల్లడించారు. అయితే ఏ రంగంలో అడుగుపెట్టినా కృషి, పట్టుదల ఉంటేనే సక్సెస్ వస్తుందని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment