మనం ఇప్పటి వరకు చాలా సక్సెస్ స్టోరీలు చదువుకున్నాం. పేదరికం నుంచి కుబేరులైన వ్యక్తుల గురించి.. ఉన్నత చదువులు వదిలి సక్సెస్ సాధించినవారు గురించి ఇలా ఎన్నెన్నో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ కొడుకు వేల కోట్ల సామ్రాజ్యం సృష్టించి ఔరా అనిపించాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అతడు సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జన్మించిన 'విజయ్ శేఖర్ శర్మ' (Vijay Shekhar Sharma) స్కూల్ టీచర్ అయిన 'సులోమ్ ప్రకాష్' మూడవ కుమారుడు. చిన్నప్పుడు అలీఘర్ సమీపంలోని హర్దుగాంజ్ అనే చిన్న ప్రాంతంతో పాఠశాల విద్యను ప్రారంభించి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి బిటెక్ పూర్తి చేసాడు.
కంప్యూటర్ పట్ల ఆకర్షణ..
చదువుకునే రోజుల్లోనే విజయ్‌ను కంప్యూటర్ బాగా ఆకర్శించింది. దీంతో చాలా సమయం కంప్యూటర్లతోనే కాలం గడిపేవాడు. అయితే మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న టెక్నాలజీ అతన్ని ఎంతగానో ఆకర్శించింది. ఇది అతన్ని ఒక కొత్త ఆలోచనలోకి తీసుకెళ్లింది. తత్ఫలితంగా 'పేటీఎమ్' (Paytm) యాప్ సృష్టించి కోట్లు సంపాదించడం మొదలుపెట్టాడు.
ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభం..
అసాధారణ విజయాలన్నీ సాధారణ వ్యక్తుల నుంచి పుట్టుకొస్తాయనే మాట నిజం చేస్తూ.. విజయ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ఎన్నెన్నో ఆటంకాలు, అపజయాలు చవి చూసిన తరువాత ఈ రోజు గొప్ప స్థాయికి చేరినట్లు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
చదువు పూర్తయిన తరువాత తన క్లాస్‌మేట్‌తో కలిసి ఒక ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభించి దాన్ని అతి తక్కువ కాలంలోనే ఇతరులకు విక్రయించారు. ఆ తరువాత 'వన్97 కమ్యూనికేషన్' పోర్టల్ ప్రారంభించారు. ప్రారంభంలో ఇది క్రికెట్ రేటింగ్ వంటి సమాచారం అందించేది. ఈ వెబ్‌సైట్ అనుకున్నంత సక్సెస్ పొందలేకపోయింది. తద్వారా.. తీవ్ర నష్టాలను మిగిల్చింది. దెబ్బతో అప్పటి వరకు సంపాదించిన డబ్బు మొత్తం పోయింది.
(ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!)
రూ. 10 వేలకు ఉద్యోగం & పేటీఎమ్ స్థాపన..
అప్పటి వరకు సంపాదించిన మొత్తం డబ్బు పోవడంతో అప్పుడు చేయాల్సి వచ్చింది. రోజువారీ అవసరాలకు చిన్న చిన్న ఉద్యోగాలు రూ. 10 వేల జీతానికి పనిచేసినట్లు తెలిసింది. అయితే టెక్నాలజీని ఏ మాత్రం వదలకుండా 2011లో పేటీఎమ్ స్థాపించాడు. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఇది భారీ సక్సెస్ సాధించింది. కేవలం ఏడాది కాలంలో లక్షల సంఖ్యలో పేటీఎమ్ వ్యాలెట్స్ క్రియేట్ అయ్యాయి. అంతే కాకుండా మొదటి సారి జరిగిన పెద్ద నోట్ల ఈ యాప్‌కి మరింత గిరాకీ పెంచింది.
(ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన హ్యుందాయ్ ఎక్స్‌టర్ - టాటా పంచ్ ప్రత్యర్థిగా నిలుస్తుందా?)
కొన్ని నివేదికల ప్రకారం, భారతదేశంలో పేటీఎమ్ ఉపయోగిస్తున్న భారతీయులు సుమారు 30 కోట్లు కంటే ఎక్కువ. అంతే కాకుండా పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌కు కూడా విపరీతమైన ఆధారణ లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోన్ పే, గూగుల్ పే వంటి ఇతర యూపీఐ యాప్‌లతో పేటీఎమ్ పోటీ పడుతోంది. ఈ యాప్ స్థాపించిన తరువాత విజయ్ ఆస్తులు విలువ రూ. 8,222 కోట్లకి చేరినట్లు, సంస్థ విలువ రూ. 55 వేల కోట్లు అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment