Headspace Founder Story: వాస్తవ ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటనలు మనిషి జీవితాన్ని మార్చేస్తాయి. ఒకటి గొప్ప వాణ్ణి చేస్తుంది.. లేదా పనికిరాకుండా పోయేలా కూడా చేస్తుంది. కన్నీటి సంద్రం నుంచి బయటపడి కోట్లు సంపాదనకు తెర లేపిన ఒక సన్యాసి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆత్మీయుల మరణం..
ఆండీ పూడికోంబే (Andy Puddicombe) అనే వ్యక్తి తాగి డ్రైవింగ్ చేసిన సంఘటనలో స్నేహితులను, సైక్లింగ్ ప్రమాదంలో అతని సోదరిని కోల్పోయి జీవితం మీద విరక్తి పొందాడు. దుఃఖంతో నిండిన యితడు కాలేజీకి స్వస్తి పలికి నేపాల్ చేరుకున్నాడు. బౌద్ధ సన్యాసం స్వీకరించి ఆసియా అంతటా ఒక దశాబ్దం పాటు సంపూర్ణత, ధ్యానం గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది.
హెడ్‌స్పేస్ మెడిటేషన్ యాప్..
ధ్యానంతో జీవితాన్ని ప్రశాంతంగా చేసుకోవచ్చనే సత్యాన్ని గ్రహించి అందరికి పంచాలనే ఉద్దేశ్యంతో 2005లో యూకే నుంచి తిరిగి వచ్చిన తరువాత లండన్‌లో ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఎప్పుడూ బిజీ లైఫ్ గడిపే ఎంతోమందికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఆ తర్వాత రిచర్డ్ పియర్సన్‌తో కలిసి 2010లో 'హెడ్‌స్పేస్' (Headspace) అనే మెడిటేషన్ యాప్ స్థాపించారు.
ఈ యాప్ అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఇది ఎంతో మంది ప్రజలకు ధ్యానం ప్రయోజనాలను గురించి వెల్లడిస్తుంది. మానసిక ఆరోగ్యం పట్ల వైఖరిని మార్చడంలో హెడ్‌స్పేస్ విస్తృత ఆదరణ పొందింది. జీవితంలోని గందరగోళాల మధ్య ప్రశాంతమైన అభయారణ్యంగా మారింది, మానసిక క్షేమం కోరుకునే వినియోగదారులను ఎంతోమందిని ఈ యాప్ ఆకర్షిస్తుంది.
(ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!)
వేల కోట్ల సామ్రాజ్యం..
ఆధునిక కాలంలో నేడు ఈ యాప్ 4,00,000 మంది సబ్‌స్క్రైబర్లను 50 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని కలిగి ఉంది. కేవలం బౌద్ధ సన్యాసి అయినప్పటికీ 250 మిలియన్ డాలర్లు లేదా సుమారు రూ. 2040 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. కష్టతరమైన సమయాల్లో కూడా ఎలా విజయాలు అసాధించాలో తెలుసుకోవడానికి ఇదొక మంచి ఉదాహరణ. మొత్తం మీద వ్యక్తిగత విషాదం అతన్ని వేల కోట్లకు అధిపతిని చేసింది.
Comments
Please login to add a commentAdd a comment