net worth
-
రూ.4.48 లక్షల కోట్లు: సంపాదనలో ఇతడే టాప్
ప్రపంచ కుబేరుడు ఎవరు అనగానే వినిపించే పేరు టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk). అయితే ఈ ఏడాది అత్యధికంగా సంపాదించినవారి జాబితాలో మాత్రం మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' స్థానం సంపాదించుకున్నారు.2024లో మార్క్ జుకర్‌బర్గ్ సంపద 54 బిలియన్ డాలర్లు పెరిగింది. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 4.48 లక్షల కోట్లు. ఈ ఒక్క సంవత్సరమే ఈయన సంపద 40 శాతం పెరిగి 182 బిలియన్ డాలర్లకు చేరింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో జుకర్‌బర్గ్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల లిస్టులో నాలుగో స్థానంలో ఉన్నారు. మెటా సీఈఓ కంటే 7 బిలియన్ డాలర్లు ఎక్కువ సంపాదనతో 'బెర్నార్డ్' మూడో స్థానంలో నిలిచారు.2024 ప్రారంభంలో ఎన్వీడియా కో-ఫౌండర్ అండ్ సీఈఓ 'జెన్సన్ హువాంగ్' షేర్స్ కూడా గత రెండు రోజులుగా భారీగా తగ్గాయి. దీంతో ఈయన ఏకంగా 11.5 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశారు. సంవత్సర ఆదాయం పరంగా హువాంగ్ 44 బిలియన్ డాలర్ల లాభాలను పొందారు. దీంతో ఈయన నికర విలువ 93 బిలియన్ డాలర్లకు పెరిగింది.ఇదీ చదవండి: ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ జుకర్‌బర్గ్ నాయకత్వంలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. మెటా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌లో భారీ పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడులు ఇన్వెస్టర్లను కొంత ఆందోళనకు గురి చేసింది. దీంతో 2021 సెప్టెంబర్ - 2022 నవంబర్ మధ్య మెటా స్టాక్ 75 శాతం కంపెనీ ఎక్కువ తగ్గిపోయింది.ఏఐ టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుండటంతో ఇన్వెస్టర్లకు కంపెనీ మీద విశ్వాసం ఏర్పడింది. ఫలితంగా మెటా షేర్లు మళ్ళీ రికార్డు స్థాయికి చేరాయి. దీంతో కంపెనీ విలువ ఏకంగా 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మెటాలో జుకర్‌బర్గ్ వాటా 13 శాతానికి చేరింది. 2022లో 35 బిలియన్ డాలర్ల సంపద మాత్రమే కలిగి ఉన్న జుకర్‌బర్గ్.. ఇప్పుడు 182 బిలియన్ డాలర్ల నికర విలువకు చేరారు. -
ఇద్దరు భార్యల ముద్దుల యూట్యూబర్ : మెకానిక్‌గా మొదలై రూ. 200 కోట్లకు
నేటి ప్రపంచంలో కంటెంట్ క్రియేటర్లుగా సోషల్ మీడియా కూడా అతిపెద్ద ఆదాయవనరుగా మారిపోయింది. అంతేకాదు నాగ్‌పూర్ చాయ్‌వాలా ఢిల్లీ వడా పావ్ గర్ల్, హైదరాబాద్ కుమారాంటీ సోషల్ మీడియా ఈ వ్యక్తులకు సెలబ్రిటీ హోదాను కూడా తెచ్చి పెడుతోంది. ఈ క్రమంలో మెకానిక్‌గా జీవితాన్ని మొదలు పెట్టి రూ. 200 కోట్లకు యజమానిగా మారిన యూట్యూబర్ అర్మాన్ మాలిక్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.యూట్యూబర్ అర్మాన్ మాలిక్ 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీల్లో ఒకడిగా పాపులర్. ఇటీవలి ఇంటర్వ్యూలో, అర్మాన్ మాలిక్ తన జీవితంలోని వివిధ అంశాలను ప్రస్తావించాడు. వివాదాస్పద జీవితం, ఇద్దరు భార్యలు, వందల కోట్ల సంపద లాంటి వివరాలను షేర్ చేశాడు.అర్మాన్ మాలిక్ 8వ తరగతిలో రెండుసార్లు ఫెయిల్ కావడంతో ఇంటి నుంచి పారిపోయాడు. నాలుగు రోజులకే ఇంటికి తిరిగి వచ్చి, తనకు చదువు ఇష్టం లేదని, కార్లంటే ఇష్టమని వర్క్‌షాప్‌లో పని చేయాలని తండ్రికి చెప్పాడు.అలా మెకానిక్‌గా పనిచేయడమే కాకుండా, మాన్యువల్ వర్కర్ లాంటి అనేక ఇతర ఉద్యోగాలు కూడా చేశాడు.యూట్యూబర్ తన వ్లాగ్‌లతో విపరీతమైన ప్రజాదరణ పొందాడు.జేబులో ఒక్క పైసా కూడా లేకుండా వ్లాగింగ్ జర్నీ ప్రారంభించాడు. ఆసక్తికరమైన కంటెంట్‌తో, అర్మాన్ చాలా తొందర్లోనే అటు ప్రజాదరణను ఇటు ధనాన్ని సంపాదించాడు. , యూట్యూబర్ తన వద్ద రూ. రూ. 200 కోట్ల నికర విలువ. అదీ 2.5 సంవత్సరాలలో యూట్యూబ్ ద్వారా సంపాదించాడట.అర్మాన్ ముందు చూపుతొలుత టిక్‌టాకర్ ఉన్న అర్మాన్ నెలకు 2 లక్షలు సంపదించాడు. కోవిడ్-19 సమయంలో అర్మాన్ వద్ద కేవలం రూ. 35వేలు మాత్రమే. ఆ తరువాత యూట్యూబ్ ఫేస్బుక్, ఇన్‌స్టాలో ఎంట్రీ ఇచ్చాడు. ఎవరీ అర్మాన్అర్మాన్ చిన్నపుడే తల్లి కేన్సర్‌తో పోరాడి మరణించింది. తండ్రి మద్యానికి బానిసకావడంతో అతను కూడా చాలా త్వరగా మరణించాడు. తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకునే సమయానికి అర్మాన్ వయసు కేవలం 19 ఏళ్లు. అర్మాన్‌కు ఒక అన్నయ్య, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. దీంతో కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకున్నాడు. కేవలం 2 వేల రూపాయలతో హర్యానా నుంచి ఢిల్లీకి బయలుదేరి బ్యాంకులో పని చేయడం ప్రారంభించాడు. అక్కడ పాయల్‌ను అనే అమ్మాయిని కలిశాడు. వీరిద్దరూ 2011లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2016లో ఈ దంపతులకు చిరయౌ అనే కుమారుడు జన్మించాడు.భార్య ఫ్రెండ్ కృతికతో ప్రేమ,పెళ్లిఆరు సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత, అర్మాన్ తన భార్య, పాయల్ బెస్ట్ ఫ్రెండ్ కృతికతో ప్రేమలో పడ్డాడు. కృతికను వివాహం చేసుకున్నాడు దీంతో పాయల్‌తో భర్తనుంచి విడిపోయింది. కానీ తరువాతి కాలంలో రాజీపడి ఇపుడు ఇద్దరూ కలిసే ఉంటున్నారు. దీంతో ఇద్దరు భార్యలు, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు అర్మాన్ మాలిక్. అర్మాన్ మాలిక్ భార్యలకు అనేకసార్లు గర్భస్రావాలు జరిగాయట. పాయల్, 2011లో ఒకసారి, మరోసారి గర్భస్రావం అయ్యింది. అలాగే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా, ఆమె ఫెలోపియన్ ట్యూబ్లలో ఫెలోపియన్ ట్యూబ్‌ను తొలగించాల్సి వచ్చింది. చివరకు 2016లో కొడుకు చిరయు పుట్టాడు. 2023లో, పాయల్ ఐవీఎఫ్ ద్వారా అయాన్,తుబా కవలలకు జన్మనిచ్చింది. 2018లో అర్మాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కృతికకు గర్భస్రావాలు అయ్యాయి. చివరికి నాల్గోసారి జైద్ (మగబిడ్డ)కు జన్మనిచ్చింది.అర్మాన్ మాలిక్ 10 ప్లాట్లు, వాటి కథకుటుంబసభ్యులకు ప్రేమగా చూసుకున్న అర్మాన్ మాలిక్ తన సిబ్బందిని కూడా తన కుటుంబంలానే చూసుకుంటాడు. అతనికి మొత్తం 10 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో నాలుగు భార్యలు, నలుగురు పిల్లల కోసం కేటాయించగా, మిగిలిన ఆరు సిబ్బందికి కేటాయించాడట. ఇందులో ఒకటి పూర్తిగా స్టూడియోగా ఉపయోగిస్తాడు. -
చిరంజీవి, షారుక్‌ను మించి.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ధనిక కుటుంబం వారిదే! (ఫొటోలు)
-
‘లోక్‌సభ’ పోరులో ఆరుగురు మాజీ సీఎంలు.. ఎవరి ఆస్తి ఎంత?
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి 400కు మించిన సీట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగింది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు బీజేపీ తన అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించింది. ఈ క్రమంలోనే ఈసారి వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులను లోక్‌సభ ఎన్నికల బరిలో నిలబెట్టింది. ఇప్పుడు అందరి దృష్టి ఈ మాజీ సీఎంలపైనే నిలిచింది. హర్యానా నుంచి మనోహర్‌లాల్, కర్ణాటక నుంచి బసవరాజ్ బొమ్మై, ఉత్తరాఖండ్ నుంచి త్రివేంద్రసింగ్ రావత్, త్రిపుర నుంచి బిప్లబ్ దేబ్, మధ్యప్రదేశ్ నుంచి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డిలకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. వీరంతా మాజీ సీఎంలు. వారిలో ఎవరు అత్యంత ధనవంతులు ఎవరో తెలుసుకుందాం. 1. మనోహర్ లాల్ మనోహర్ లాల్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి. మైనెటైన్ఫో తెలిపిన వివరాల ప్రకారం మనోహర్ లాల్ ఆస్తుల విలువ రూ.ఒక కోటి 27 లక్షలకు పైగా ఉంది. 2019లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన ఇచ్చిన అఫిడవిట్లో తన బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.2.5 లక్షలు ఉన్నట్లు తెలిపారు. 2019లో తాను సుమారు రూ. 5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నట్లు కూడా పేర్కొన్నారు. స్థిరాస్తి విషయానికొస్తే రూ.50 లక్షలకు పైగా విలువైన వ్యవసాయ భూమి ఆయన పేరిట ఉంది. దాదాపు రూ.3 లక్షల విలువైన ఇల్లు కూడా ఉంది. 2. బసవరాజ్ బొమ్మై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన బసవరాజ్ బొమ్మై అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం ఆయనకు రూ. 42.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇందులో హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన రూ. 19.2 కోట్లు ఉన్నాయి. 2022 మార్చి 26న ముఖ్యమంత్రి పదవిలో ఉండగా ఆయన తరిహాల గ్రామంలో మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2023 నాటి ఈ అఫిడవిట్ ప్రకారం బొమ్మైతో పాటు అతనిపై ఆధారపడిన వారి మొత్తం ఆస్తుల విలువ రూ. 52.12 కోట్లు. 3. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌కు నాలుగుసార్లు సీఎం అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ 2023 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్లో తన మొత్తం ఆస్తులు రూ. 3.21 కోట్లు కాగా, ఆయన భార్య సాధనా సింగ్ మొత్తం ఆస్తులు రూ. 5.41 కోట్లు. ఐదేళ్ల క్రితం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆస్తులు రూ.3.26 కోట్లు. శివరాజ్ చరాస్తులు రూ.1,11,20,282 కాగా, స్థిరాస్తులు రూ.2.10 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. అతని భార్య సాధనా సింగ్ చరాస్తులు రూ.1,09,14,644. సాధనా సింగ్ మొత్తం స్థిరాస్తులు రూ.4.32 కోట్లు. 4. కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి ఆస్తుల విలువ దాదాపు రూ.19 కోట్లు. ఆయనకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దాదాపు రూ.9 కోట్ల విలువైన బంగ్లా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర మారుతి, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా ఎక్స్‌యూవీ, ఫోక్స్‌వ్యాగన్ తదితర కార్లు ఉన్నాయి. 5. త్రివేంద్ర సింగ్ రావత్ ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఇటీవల సమర్పించిన అఫిడవిట్లో తన వద్ద రూ.56 వేలు, తన భార్య వద్ద రూ.32 వేల నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. అతని బ్యాంకు ఖాతాలో రూ.59 లక్షల 88 వేల 913, అతని భార్య బ్యాంకు ఖాతాలో రూ.94 లక్షల 80 వేల 261 ఉన్నట్లు పేర్కొన్నారు. త్రివేంద్ర సింగ్ రావత్ వద్ద 40 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ దాదాపు రూ.2 లక్షల 47 వేల 200. అతని భార్య వద్ద 110 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ సుమారు రూ.6 లక్షల 79 వేల 800. చరాస్తుల విషయానికి వస్తే త్రివేంద్ర సింగ్ రావత్‌కు రూ.62 లక్షల 92 వేల 113 విలువైన చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్యకు రూ. ఒక కోటి 1లక్ష 92వేల 61 విలువైన చరాస్తులు ఉన్నాయి. త్రివేంద్ర సింగ్ రావత్‌కు వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర, పూర్వీకుల ఆస్తులు కలిపి దాదాపు రూ. 4 కోట్ల ఒక లక్షా, 99 వేల 805 విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్యకు రూ. ఒక కోటీ 8లక్షల 68వేల 60 విలువైన స్థిరాస్తి ఉంది. త్రివేంద్ర సింగ్ బ్యాంకు నుంచి రూ.75 లక్షల రుణం తీసుకున్నారు. 6. బిప్లబ్ కుమార్ దేబ్ త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ ఇటీవల తన నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్లో తన వద్ద సుమారు రూ.52 వేల నగదు, తన భార్య వద్ద దాదాపు రూ.2400 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. బిప్లబ్ దేబ్‌కు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.92 లక్షల 78 వేల 838 ఉండగా, అతని భార్య బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ. ఒక కోటి ఏడు లక్షల 47 వేలు జమ అయ్యాయి. బిప్లబ్ దేబ్ వద్ద సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉండగా, ఆయన భార్య వద్ద దాదాపు రూ.9 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. బిప్లబ్ కుమార్ దేబ్ వద్ద నగలు, నగదు సహా రూ.95 లక్షల 78 వేల 838 విలువైన చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్యకు రూ. ఒక కోటి 16లక్షల 4వేల 729 విలువైన చరాస్తులు ఉన్నాయి. బిప్లబ్ కుమార్ దేబ్ అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం అతనికి సుమారు రూ. ఒక కోటి 89 లక్షల 17 వేల 755 విలువైన స్థిరాస్తి (వ్యవసాయ, వ్యవసాయేతర భూమి) ఉంది. అతని భార్యకు దాదాపు రూ.61 లక్షల విలువైన స్థిరాస్తి (వ్యవసాయ, వ్యవసాయేతర భూమి) ఉంది. -
స్టార్ హీరో సూర్య దంపతుల మొత్తం ఆస్తి అన్ని కోట్లా?
మన హీరోల్లో చాలామంది ఇప్పుడిప్పుడే తెలుగు కాకుండా ఇతర భాషల్లో క్రేజ్ సంపాదిస్తున్నారు. అలాంటిది చాలా ఏళ్ల క్రితం నుంచి తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ హీరోగా సూర్య ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హీరో, నిర్మాతగా బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాడు. ఇతడి భార్య జ్యోతిక కూడా రీఎంట్రీ ఇచ్చేసింది. దీంతో ఇద్దరూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే వీళ్ల ఆస్తుల వివరాలు ఇవేనంటూ కొన్ని నంబర్స్ బయటకొచ్చాయి. కెరీర్ ప్రారంభంలో చాలా విమర్శలు ఎదుర్కొన్న సూర్య.. గజిని, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, 'సింగం' సిరీస్ చిత్రాలతో తెలుగులో స్టార్ హీరోల మించిన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.25-30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడట. అలా ఇతడి ఆస్తి దాదాపు రూ.206 కోట్ల వరకు ఉందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?) సూర్యతోనే కెరీర్ మొదట్లో హీరోయిన్గా పలు సినిమాలు చేసిన జ్యోతిక.. పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లయింది. ప్రస్తుతం వాళ్లిద్దరూ పెరిగి పెద్దవడంతో నటిగా మళ్లీ జర్నీ షురూ చేసింది. రీసెంట్గా హిందీ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయని ముంబయికి షిప్ట్ అయిపోయింది. ఇకపోతే ఈమె ఆస్తి రూ.331 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే సూర్య-జ్యోతిక మొత్తం ఆస్తి దాదాపు రూ.537 కోట్ల మేర ఉందని తెలుస్తోంది. సూర్య-జ్యోతిక దంపతులకు చెన్నైలో ఓ ఖరీదైన ఇల్లు, ముంబయిలో రూ.70 కోట్లు విలువ చేసే బంగ్లా ఉన్నాయట. ఇక కార్ల విషయానికొస్తే.. రూ.1.38 కోట్లు విలువైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు, రూ.80 లక్షల ఆడీ క్యూ 7, రూ.61 లక్షల బెంజ్ కారు, రూ.1.10 కోట్ల విలువైన జాగ్వార్ కారు.. వీళ్ల దగ్గర ఉన్నాయని అంటున్నారు. తాజాగా ఈ ఆస్తుల వివరాలు బయటకొచ్చాయి. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: అభిమానితో దురుసు ప్రవర్తన? హీరో సూర్య తండ్రిపై విమర్శలు) -
సత్య నాదెళ్ల జీతం ఆస్తులు ఎంతో తెలుసా..?
-
సంపదలో మస్క్‌ను మించిన పెద్దాయన.. ప్రపంచ కుబేరుడిగా..
ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఇప్పుడు రెండవ స్థానానికి చేరుకున్నారు. మొదటి స్థానంలో గ్లోబల్ లగ్జరీ గూడ్స్ బ్రాండ్ కంపెనీ ఎల్వీఎంహెచ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అండ్ సీఈఓ 'బెర్నార్డ్ ఆర్నాల్ట్' (Bernard Arnault) నిలిచారు. ఫోర్బ్స్ ప్రకారం.. బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం నికర విలువ శుక్రవారం నాడు 23.6 బిలియన్ డాలర్లు పెరిగి, మొత్తం సంపద 207.8 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఆర్నాల్డ్ అత్యంత సంపన్నమైన వ్యక్తిగా మస్క్‌ను మించిపోయాడు. మరోవైపు మస్క్ సంపద 204.5 బిలియన్ డాలర్లుగా ఉంది. బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఇలాన్ మస్క్ మొదటి రెండు స్థానాల్లో నిలువగా.. జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్, మార్క్ జుకర్‌బర్గ్‌లు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇలాన్ మస్క్ టెస్లా షేర్లు గత గురువారం ఏకంగా 13 శాతం పతనమవ్వడంతో.. 18 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది. ఇదే సమయంలో ఆర్నాల్ట్ షేర్స్ బాగా పెరిగాయి. దీంతో మస్క్ ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ఇదీ చదవండి: ఆ వ్యాఖ్యలే కొంప ముంచాయా! ఒకేరోజు రూ.6.64 లక్షల కోట్లు లాస్.. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ 104.4 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో 11 వ స్థానం, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 75.7 బిలియన్ డాలర్ల సంపదతో 16వ స్థానం పొందినట్లు తెలుస్తోంది. -
ప్రపంచంలోకెల్లా సంపన్నురాలు.. ‘లో రియాల్’ వైస్ ప్రెసిడెంట్ రికార్డు
న్యూఢిల్లీ: కాస్మటిక్స్ దిగ్గజం లో రియాల్ వ్యాపార సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళగా చరిత్ర సృష్టించారు. అలాగే ఏకంగా 100 బిలియన్ డాలర్ల పై చిలుకు సంపదను ఆర్జించిన తొలి మహిళగా కూడా ఆమె నిలిచారు. అంతేగాక ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ, గౌతం అదానీ, అమానికో ఓర్టెగా వంటి వ్యాపార దిగ్గజాలను వెనక్కు నెడుతూ 12వ స్థానానికి ఎగబాకారని బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకటించింది. 70 ఏళ్ల మేయర్స్ 268 బిలియన్ డాలర్ల విలువైన లో రియాల్ వ్యాపార సామ్రాజ్యానికి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. ఆమె కుటుంబానికి కంపెనీలో 35 శాతం దాకా వాటాలున్నాయి. 2017లో మేయర్స్ తల్లి మరణానంతరం అపారమైన ఆస్తి, కంపెనీ వాటాలు ఆమెకు వారసత్వంగా దక్కాయి. తాజాగా కంపెనీ వాటాల విలువ ఒక్కసారిగా చుక్కలనంటడంతో మేయర్స్ సంపద బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. మీడియాకు దూరంగా రోజూ గంటల తరబడి పియానో వాయిస్తూ గడుపుతుంటారామె. -
బాలీవుడ్ రిచ్ మ్యాన్.. స్టార్ హీరోల కన్నా ఈయన సంపాదనే ఎక్కువ!
బిజినెస్ రియాలిటీ సిరీస్ సృష్టికర్తలను పరిచయం చేసే 'షార్క్ ట్యాంక్ ఇండియా' (Shark Tank India) మూడవ సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఇందులో అప్‌గ్రాడ్ కో-ఫౌండర్ వ్యవస్థాపకుడు అండ్ ఛైర్మన్ 'రోనీ స్క్రూవాలా' ప్యానెల్లో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బిజినెస్ మ్యాన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరీ రోనీ స్క్రూవాలా.. బాలీవుడ్లో అత్యంత ధనవంతుడైన రోనీ స్క్రూవాలా ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత. ప్రారంభంలో టూత్ బ్రష్ తయారీ కంపెనీ స్థాపించిన స్క్రూవాలా.. ఆ తరువాత కేబుల్ టీవీ రంగంలో అడుగుపెట్టాడు. ఇది అతి తక్కువ సమయంలోనే భారతదేశంలోని అనేక నగరాల్లో బాగా విస్తృతి చెందింది. 1990లో కేవలం రూ. 37000 పెట్టుబడితో స్క్రూవాలా స్థాపించిన UTV అనేక ప్రజాదరణ పొందిన కార్యక్రమాలను నిర్వహించి, టెలివిజన్ రంగంలో తనకు తానే సాటిగా నిరూపించుకుంది. ఆ తరువాత రోనీ స్క్రూవాలా.. జోధా అక్బర్, ఫ్యాషన్, బర్ఫీ, చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి ఎన్నో చిత్రాలకు ప్రొడ్యూసర్ అయ్యాడు. 2012లో రోనీ స్క్రూవాలా తన కంపెనీ వాటాను ఓకే బిలియన్ డాలర్లకు డిస్నీకి విక్రయించారు. ఆ తరువాత ఆర్ఎస్విపి మూవీస్ స్థాపించి ఉరి, కేదార్నాథ్ చిత్రాలను నిర్మించారు. స్క్రూవాలా రంగ్ దే బసంతికి మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు జాతీయ అవార్డును గెలుచుకున్నాడు ఇదీ చదవండి: 2500 యాప్స్ తొలగించిన గూగుల్ - లోక్‌సభలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన అప్‌గ్రాడ్ కంపెనీ స్క్రూవాలా కేవలం సినీ నిర్మాత మాత్రమే కాదు, అతడు UpGrad ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ కో-ఫౌండర్ కూడా. సుమారు 2.25 బిలియన్ డాలర్ల విలువైన ఈ కంపెనీని రోనీ స్క్రూవాలా.. మయాంక్ కుమార్, ఫాల్గం కొంపల్లి, రవిజోత్ చుగ్ వంటి వారితో జతకట్టి స్టార్ట్ చేశారు. ప్రస్తుతం రోనీ స్క్రూవాలా నికర విలువ రూ. 12800 కోట్లు ($1.55 బిలియన్) అని తెలుస్తోంది. -
రాయల్ లైఫ్, అంబానీ కంటే రిచ్ : ఇపుడు అద్దె ఇంట్లో దుర్భరంగా..!
కుటుంబ తగాదాలలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యాపారం కుటుంబం రేమాండ్ గ్రూపు. భారతీయ వస్త్ర పరిశ్రమలో రేమాండ్ అనే బ్రాండ్‌ను, దానికొక ఇమేజ్ను తీసుకొచ్చిన వ్యక్తి రేమండ్ వ్యవస్థాపకుడు, సంస్థ మాజీ ఛైర్మన్, దేశీయ కుబేరుల్లో ఒకరు విజయపత్ సింఘానియా. గార్మెంట్ అండ్ టెక్స్టైల్ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుని లక్షలాదిమంది భారతీయులకు చేరువయ్యారు. "ది కంప్లీట్ మ్యాన్", "ఫీల్స్ లైక్ హెవెన్..ఫీల్స్ లైక్ రేమాండ్" ట్యాగ్‌లైన్‌లతొ అద్బుతమైన దుస్తులను అందించిన ఘనత ఆయనదే. రూ.1200 కోట్ల సామ్రాజ్యం ప్రఖ్యాత ఏవియేటర్, సర్క్యూట్ రేసింగ్ లవర్ , సాహస క్రీడల ప్రేమికుడు విలాసవంతమైన జీవితాన్ని గడిపిన విజయ్‌పథ్ కొడుకు గౌతం సింఘానియా విబేధాలతో ఆయన జీవితం దుర్భరంగా మారిపోయింది. ఇంటి నుండి గెంటేయడంతో నానా కష్టాలు పడుతున్నారు. ఒకపుడు 12వేల కోట్ల రూపాయల నెట్‌వర్త్‌తో అంబానీలకు (రేమండ్ గ్రూప్ యజమానిగా ఉన్నప్పుడు ముఖేష్ అంబానీ చాలా చిన్నవాడు) మించిన ధనవంతుడిగా, దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఒక వెలుగు వెలిగిన ఆయన 85 ఏళ్ల వయసులో అద్దె ఇంట్లో జీవితాన్ని గడుపుతున్నారు. మానవ సంబంధాలు, కుటుంబంలోని కుటుంబ వివాదాల దుష్పరిణామాలకు రేమండ్ వ్యవహారం, ఒక రిమైండర్.. ఒక హెచ్చరిక లాంటిది . 1900లో వాడియా మిల్లు నుండి ప్రారంభమై రేమండ్ అతి తక్కువ కాలంలోనే కొత్త శిఖరాలకు చేరింది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక దుస్తుల కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. విమానయానంలో అతని విజయాలు అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ప్రపంచ రికార్డులను నెలకొల్పాయి. ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ ఆఫ్ హానర్ , లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కోసం టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. విజయ్‌పత్ పెద్ద కుమారుడు మధుపతి, కుటుంబానికి దూరంగా సింగపూర్‌లో స్థిరపడ్డాడు. రేమాండ్ వ్యాపార వ్యవహరాలను చూసుకుంటున్న రెండో కొడుకు గౌతమ్‌తో మధ్య ఆస్తి వివాదం కోర్టు కెక్కింది. సంబంధాలు దెబ్బతిన్నాయి. అనూహ్యంగా విజయపత్ సింఘానియాను చైర్పర్సన్-ఎమిరిటస్ పదవినుంచి తొలగించడం పరిశ్రమ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే గౌతమ్ భార్య నవాజ్‌మోడీతో విడాకుల వ్యవహారం రచ్చకెక్కింది. తన ప్రియమైన బిడ్డలు, గోప్యత అంటూ గౌతమ్ మౌనంగా తెరవెనుక ఉండిపోతుండగా, అతని భార్య నవాజ్మాత్రం తనను హింసించాడని ఆరోపించింది. గ్రూపు బోర్డులో ఉన్న తనకు గౌతమ్ ఆస్తిలో 75 శాతం భరణం కావాలని డిమాండ్ చేస్తోంది. 2015 ఫిబ్రవరి 15 నా జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజు. నాజీవితాన్ని శాశ్వతంగా మార్చేసే లేఖంపై సంతకం చేసిన రోజు. నా జీవితంలో చేసిన అత్యంత మూర్ఖపు తప్పు - విజయ్‌పత్ సింఘానియా రేమాండ్ కుప్పకూలుతోంది.. నా గుండె బద్దలవుతోంది ఇది ఇలా ఉంటే ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించిన విజయపత్ సింఘానియా సొంత కొడుకు గౌతమ్‌కు బదులుగా నవాజ్‌కు , ఆమె ఇద్దరు ఆడపిల్లలకు మద్దతుగా నిలవడం విశేషం. తన కుమారుడు గౌతమ్ కంపెనీని నాశనం చేస్తున్నాడని, ఇది చూసి తన గుండె బద్దలవుతోందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఏళ్ల తరబడి కష్టించి నిర్మించిన సామ్రాజ్యాన్ని కూల్చివేయడం బాధకలిగిస్తోందన్నారు. అలాగే హిందూ వివాహ చట్టం ప్రకారం, భర్త సంపదలో సగం స్వయంచాలకంగా విడిపోయిన భార్యకు వెళ్తుంది. మరి నవాజ్ 75 శాతం కోసం ఎందుకు పోరాడుతోందని అనేది తనకు అర్థం కాలేదని కానీ ? గౌతమ్ లొంగడని వ్యాఖ్యానించారు. విడాకుల వివాదంతో భారీ నష్టం రేమండ్ గ్రూప్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.10,985.33 కోట్లుగా ఉంది. ఇటీవలి కాలంలో రూ 11 వేల కోట్ల కంటే దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. రేమండ్ 64 సంవత్సరాలుగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కావడంతో పాటు చాలా స్ట్రాంగ్ స్టాక్‌గా ఉంది. సింఘానియా-మోడీ విడాకుల కథ స్టాక్ ధరను భారీగా దెబ్బతీసింది.నవంబర్ 23 నాటికి రేమండ్ స్టాక్ దాదాపు 5.15 శాతం నష్టపోయింది. ఫలితంగా గత 7 సెషన్లలో దాని మార్కెట్ క్యాప్‌లో దాదాపు రూ. 1,600 కోట్ల మేర నష్టపోయింది. -
రూ.1200 సంపాదనతో మొదలై.. రూ.9800 కోట్ల కంపెనీ నడిపిస్తోంది! ఎవరీ గజల్ అలఘ్..
ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమైన ఆడవాళ్లు ఈ రోజు అంతరిక్షానికి కూడా వెళ్లి వచ్చేస్తున్నారు. దీన్ని బట్టి మహిళలు ఎంతగా ఎదిగారనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఎంతోమంది స్త్రీలు తమ ఆలోచనలతో గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదిగారు. ఈ కోవకు చెందినవారిలో ఒకరు మామా ఎర్త్ కో ఫౌండర్ 'గజల్ అలఘ్' (Ghazal Alagh). ఈ కథనంలో గజల్ ఎవరు? ఆమె సాధించిన సక్సెస్ ఏంటి? నెట్ వర్త్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హర్యానాలో జన్మించిన ఈమె 2010లో పంజాబ్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్లో డిగ్రీ, 2013లో న్యూయార్క్ అకాడమీ ఆఫ్ ఆర్ట్‌లో డిజైన్ అండ్ అప్లైడ్ ఆర్ట్స్‌లో సమ్మర్ ఇంటెన్సివ్, మోడరన్ ఆర్ట్‌లో ఫిగరేటివ్ ఆర్ట్‌లో ఇంటెన్సివ్ కోర్సును పూర్తి చేసింది. మామా ఎర్త్ ప్రారంభం నిజానికి 2008 నుంచి 2010 వరకు ఎన్ఐఐటీ లిమిటెడ్‌లో కార్పొరేట్ ట్రైనర్‌గా పనిచేస్తూ.. కొందరికి సాఫ్ట్వేర్ అండ్ కోడింగ్ లాంగ్వేజ్‌లో ట్రైనింగ్ అందించింది. చదువు పూర్తయ్యి పెళ్లయిన తరువాత 2016లో తన భర్త 'వరుణ్ అలఘ్'తో కలిసి 'మామా ఎర్త్' ప్రారంభించింది. మామా ఎర్త్ ద్వారా గజల్ అలఘ్ చిన్న పిల్లలకు పర్యావరణ అనుకూలమైన వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులను రూపొందించడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే రాష్ క్రీమ్‌లు, లోషన్లు, షాంపులు, మసాజ్ ఆయిల్లు, బాడీ వాష్‌లు, డైపర్లను తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. ఈ ఉత్పత్తులు ఆనతి కాలంలోనే ప్రజాదరణ పొందగలిగాయి. రూ. 9800 కోట్లు గజల్ అలఘ్ ప్రస్తుతం మామా ఎర్త్ సంస్థ ద్వారా పిల్లల సంరక్షణలో ఉపయోగించే దాదాపు 500 వస్తువులను విక్రయిస్తూ.. ఆసియాలో సేఫ్ సర్టిఫైడ్ బ్రాండ్‌గా అవతరించింది. రూ. 25 లక్షలతో ప్రారంభమైన మామా ఎర్త్ సంపద రూ. 9,800 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఇదీ చదవండి: వేతనాల్లో ఇంత తేడానా? పదేళ్లలో పెరిగిన సీఈఓ, ఫ్రెషర్స్ శాలరీ రిపోర్ట్ వీకెండ్ కార్పోరేట్ ట్రైనర్‌గా మొదట సంపాదించిన డబ్బు కేవలం 1,200 రూపాయలు మాత్రమే, దాంతో మా అమ్మను షాపింగ్‌కి తీసుకెళ్ళడం ఎప్పటికి మరచిపోలేని అనుభూతిని మిగిల్చిందని ఎక్స్‌లో ఇటీవలి పోస్ట్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన గజల్ అలఘ్ 'షార్క్ ట్యాంక్ ఇండియా' రియాలిటీ షో ద్వారా ప్రసిద్ధి చెందింది. ఈమె మొత్తం ఆస్థి విలువ వంద కోట్లు కంటే ఎక్కువ ఉంటుంది. My first income was modest, earning Rs 1200/day as a weekend corporate trainer. I recall the joy of taking my mom shopping and sharing a memorable dinner. What about you? How did you use your first earnings? — Ghazal Alagh (@GhazalAlagh) October 16, 2023 -
రూ.5 వేలతో మొదలైన రూ.14000 కోట్ల కంపెనీ.. సామాన్యుడి సక్సెస్ స్టోరీ!
M P Ramachandran Success Story: సక్సెస్.. ఈ పదం వినటానికి లేదా చూడటానికి చాలా చిన్నదిగానే ఉండొచ్చు. కానీ సాధించాలంటే అహర్నిశలు కష్టపడాల్సి ఉంటుంది, ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అయితే సంకల్పం ఉంటే తప్పకుండా విజయం సొంతమవుతుందని ఇప్పటికే చాలా మంది నిరూపించారు, ఈ కోవకు చెందిన వారిలో ఒకరు జ్యోతి ల్యాబ్స్ ఫౌండర్ 'మూతేడత్ పంజన్ రామచంద్రన్' (M. P. Ramachandran). ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1983లో కేరళ త్రిస్సూర్‌లో జన్మించిన రామచంద్రన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ముంబైలో అకౌంటెంట్‌గా పనిచేయడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసిన తరువాత ఆ కంపెనీ మూసివేశారు. దీంతో ఏమి చేయాలో తోచక ఇంటికి వచేసాడు. లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్నర్ ఉజాలా ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపనతో ఉండే రామచంద్రన్.. అప్పట్లో తెలుపు రంగు దుస్తులకు సరైన లిక్విడ్ అందుబాటులో ఉండేది కాదు, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్నర్ 'ఉజాలా'ను తయారు చేసాడు. రామచంద్రన్ ఈ లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్నర్ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, సోదరుడి నుంచి రూ. 5000 తీసుకుని తమకున్న కొంత భూమిలోనే ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసాడు. దీనికి తన కూతురు జ్యోతి పేరు పెట్టాడు. ప్రారంభంలో అనుకున్న రీతిలో ఉజాలా అమ్మకాలు ముందుకు సాగలేదు, కానీ పట్టు వదలకుండా కొంతమంది సేల్స్ గర్ల్స్‌ని నియమించి ఆ ఏడాది రూ. 40000 ఆదాయం పొందాడు. ఇదీ చదవండి: బాలీవుడ్ బ్యూటీ 'కిమ్ శర్మ' కొత్త లగ్జరీ కారు.. ధర తెలిస్తే అవాక్కవుతారు! ఇతర ఉత్పత్తులు & వార్షిక ఆదాయం క్రమంగా తమ ప్రొడక్ట్ మీద నమ్మకం భారీగా పెరిగింది. దీంతో జ్యోతి లేబొరేటరీస్ మరిన్ని ఉత్పత్తులను తయారు చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఎక్సో, ప్రిల్, మిస్టర్ వైట్, మార్గో, మాక్సో వంటి అనేక ఉత్పతులు పుట్టుకొచ్చాయి. దెబ్బకు విదేశీ కంపెనీలు సైతం మూసుకోవాల్సి వచ్చింది. ప్రారంభంలో ఎన్నో ఆటంకాలు, ప్రత్యర్థులు జిత్తులను ఎదుర్కొని కంపెనీని దినదినాభివృద్ధి చెందించడంలో రామచంద్రన్ కృషి చేసాడు. కేవలం రూ. 5000తో ప్రారంభమైన జ్యోతి ల్యాబ్స్ వార్షికాదాయం నేడు ఏకంగా రూ. 14,000 కోట్లకు చేరినట్లు సమాచారం. -
మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా?
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబం ఏది అనగానే వెంటనే గుర్తొచ్చేది 'ముఖేష్ అంబానీ' ఫ్యామిలీ. అంటే ఇందులో చాలామందికి తెలిసిన పేర్లు నీతా, ఇషా, అనంత్ అండ్ ఆకాష్ అంబానీ మాత్రమే. కానీ వీరి కుటుంబానికి చెందిన మరో బిలినీయర్ 'అర్జున్ కొఠారి' (Arjun Kothari) ఒకరున్నారనే సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో అర్జున్ కొఠారి ఎవరు? ఈయన మొత్తం సంపద ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ సోదరి 'నీనా కొఠారి' కొడుకే ఈ అర్జున్ కొఠారి. అంటే ఈయన స్వయానా ముఖేష్ అంబానీ మేనల్లుడే. ఇతని మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ. 845 కోట్లు కావడం గమనార్హం. ఇంతపెద్ద మొత్తంలో ఆస్తులున్నప్పటికీ ఈయన గురించి చాలామందికి తెలియకపోవడం కొంత ఆశ్చర్యమనే చెప్పాలి. కొఠారీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉన్న అర్జున్ కొఠారి.. అమెరికాలోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ రొటేషన్ ప్రోగ్రామ్‌లో జనరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్‌తో సీనియర్ స్పెషలిస్ట్ హోదాను కలిగి ఉన్నాడు. ఇదీ చదవండి: I am not a robot: ఇది ఎందుకొస్తుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు! వ్యాపార లావేదేవాలను చూసుకోవడానికి ముందు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ నార్త్ఈస్టన్ యూనివర్సిటీ (Bachelor of Science at Northeastern University)లో పూర్తి చేసాడు. ఆ తరువాత కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టి గొప్ప వేగంగా అభివృద్ధి చెందాడు. ఆ తరువాత ప్రముఖ వ్యాపారవేత్తలైన అంజలి & రాజేన్ మరివాలా కుమార్తె ఆనందిత మరివాలాను వివాహం చేసుకున్నారు. -
ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు.. నయనతార ఆస్తుల విలువెంతో తెలుసా?
తమిళ సినిమా: ఇప్పుడు నయనతారను చూస్తుంటే ఆరంభంలో అవకాశాల కోసం బస్సులో కొచ్చి నుంచి చెన్నైకి వచ్చిన నటేనా అని ఆశ్చర్యం కలిగించకమానదు. కేరళా రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన నయనతార ఇప్పుడు కోట్లకు పడగెత్తి చెన్నైలో అధునాతనమైన భవనంలో సుఖ జీవితాన్ని అనుభవిస్తున్నారు. అదీ లక్ అంటే. కెరీర్ మొదట్లో సినీ రంగంలో ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్న నయనతార నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరువాత కూడా వ్యక్తిగత జీవితంలో పలుమార్లు చేదు అనుభవాలను చవి చూశారు. కాలం అన్నింటినీ అధిగమిస్తుందంటారు. అలా తన జీవితం నేర్పిన గుణపాఠాలతో రాటుదేలిన నయనతార అవరోధాలు, అవమానాలకు అందనంత ఉన్నత స్థాయి ఎదిగిపోయారు. ఎంతగా అంటే దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం డిమాండ్ చేసేంత స్థాయికి. ఈ లేడీ సూపర్ స్టార్ ఒక్కో చిత్రానికి రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లు పుచ్చుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన నయనతార ఈ చిత్రానికి అక్షరాలా రూ.10 కోట్లు పారితోషికం అందుకున్నట్లు సినీ వర్గాల భోగట్టా. కాగా స్టార్ హీరోయిన్ అంతస్తుకు చేరుకున్న తర్వాత కూడా వాణిజ్య ప్రకటనల్లో నటించడానికి దూరంగా ఉన్న నయనతార వివాహానంతరం ఆ ఆదాయానికి కూడా గేట్లు తెరిచేశారు. అందుకే అంటారు డబ్బెవరికి చేదు అని. ప్రస్తుతం నయనతార పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. ఇటీవల ఒక 50 సెకన్ల వాణిజ్య ప్రకటనలో నటించడానికి రూ.5 కోట్లు తీసుకుంటున్నారట. ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆమె ఇప్పటి వరకు కూడబెట్టిన ఆస్తులు ఎంతో తెలుసా? రూ. 300 కోట్లకు పై చిలుకేనని సమాచారం. నయనతార నటన, చిత్ర నిర్మాణం వంటి వాటితో పాటు ఇతర రంగాల్లోనూ వ్యాపారాలు చేస్తున్నారు. -
జవాన్ స్టార్ 'షారుఖ్ ఖాన్' ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా?
బాలీవుడ్ బాద్షా 'షారుఖ్ ఖాన్' (Shahrukh Khan) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పఠాన్‌తో దుమ్మురేపిన కింగ్ ఖాన్.. తాజాగా 'జవాన్' చిత్రంతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. మన దేశంలో అన్ని భాషలలో కలిపి రూ. 75 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో కథానాయకుడైన షారుఖ్ నెట్‌వర్త్, లగ్జరీ కార్లు వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఐదు పదుల వయసు దాటినా ఎంతో హుందాగా బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న షారుఖ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ పాలోయింగ్ కలిగి ఉన్నారు. ఈయన ఒక సినిమాకు రూ.130 నుంచి రూ.150 కోట్లు తీసుకుంటారని సమాచారం. ఇది మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్, వివిధ వ్యాపార సంస్థల నుంచి రూ. 100 కోట్లు కంటే ఎక్కువ తీసుకుంటున్నట్లు.. వార్షిక ఆదాయం మొత్తం రూ. 280 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే సినీ నిర్మాణ సంస్థ ద్వారా వీరు సంవత్సరానికి రూ.500 కోట్లు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని ఆయన భార్య గౌరీ ఖాన్ చూసుకుంటున్నట్లు సమాచారం. ఇవి కాకుండా దుబాయ్‌లో రూ.200 కోట్లు విలువ చేసే విల్లా, అమెరికాలో ఒక ఖరీదైన విల్లా ఉన్నట్లు చెబుతారు. ఇదీ చదవండి: ఇంజినీర్ జాబ్ వదిలి వ్యవసాయం - సంపాదన తెలిస్తే షాకవుతారు! కార్ కలెక్షన్స్.. షారుఖ్ ఖాన్ వద్ద ఉన్న కార్ల విషయానికి వస్తే.. వీరి వద్ద సుమారు రూ. 7 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూప్, బెంట్లీ కాంటినెంటల్ జిటి, బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, ఆడి ఏ8 ఎల్, బిఎమ్‌డబ్ల్యూ ఐ8, బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ కన్వర్టిబల్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, మిత్సుబిషి పజెరో, హ్యుందాయ్ క్రెటా మొదలైన కార్లు ఉన్నాయి. మొత్తం మీద అయన ఆస్తుల విలువ ఏకంగా రూ. 6300 కోట్లు కంటే ఎక్కువని సమాచారం. -
రోజుకు రూ. 64 లక్షలు: ఇన్స్పిరేషనల్ సంజయ్ సక్సెస్ స్టోరీ తెలుసా?
Sanjay Mehrotra భారతదేశంలోని గుజరాత్లో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి అమెరికా చిప్ దిగ్గజం మైక్రోన్ టెక్నాలజీ కమిట్మెంట్ను పునరుద్ఘాటించిన తర్వాత సంజయ్ మెహ్రోత్రా ఇటీవల వార్తల్లో నిలిచారు. ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ నేపథ్యంలో సంజయ్ మెహ్రోత్రా నెట్‌వర్త్, ఆయన సక్సెస్స్టోరీని ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన సంజయ్ మెహ్రోత్రా ప్రపంచ ఐటీ పరిశ్రమ దిగ్గజాల్లో ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా ఐటీ పరిశ్రమలో విశేష సేవలందించారు. బిట్స్ పిలానీ విద్యార్థి దేశాన్ని సెమీకండక్టర్ హబ్‌గా మార్చేలా దేశీయ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ముందంజలో ఉన్న వ్యాపార నాయకులలో ఒకరుగా ఉన్నారు ఐఐటీ, ఐఐఎం, టిపుల్ ఐటీ లాంటివి చదవకపోయినా టెక్నాలజీలో, ఐటీ ఇండస్ట్రీలో దిగ్గజంగా పేరు తెచ్చుకున్నారు సంజయ్ మెహ్రోత్రా. 1988లో ప్రముఖ బ్రాండ్ శాన్డిస్క్ని స్థాపించారు. 2011-2016 వరకు దానికి సీఈవోగా పనిచేశారు. తన సుదీర్ఘ కెరీర్లో ఇంటెల్, అట్మెల్ , ఇంటిగ్రేటెడ్ డివైస్ టెక్నాలజీ వంటి కంపెనీలతో కలిసి పనిచేశారు. మెహ్రోత్రా 2017లో మైక్రోన్ సీఈఓగా నియమితులయ్యారు. మైక్రాన్ టెక్నాలజీ ఇంక్ సీఈవో,ప్రెసిడెంట్‌గా ఉన్న సంజయ్ మెహ్రోత్రా ప్రస్తుత అంచనా నికర విలువ సుమారు 57.36 మిలియన్ డాలర్లుగా అంచనా. ఆయన రోజు సంపాదన రూ. 64 లక్షలు. మెహ్రోత్రా కాన్పూర్‌లో జన్మించినప్పటికీ, పెరిగింది మాత్రం ఢిల్లీలో BITS పిలానీ నుండి B.Tech పూర్తి చేసిన తర్వాత, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ,అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశారు.2009లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పట్టభద్రుడు. సంజయ్ మెహ్రోత్రా 1988లో ప్రముఖ బ్రాండ్ శాన్డిస్క్ని స్థాపించారు మరియు 2011 నుండి 2016 వరకు దాని CEOగా పనిచేశారు. తన సుదీర్ఘ కెరీర్లో ఇంటెల్, అట్మెల్ మరియు ఇంటిగ్రేటెడ్ డివైస్ టెక్నాలజీ వంటి కంపెనీలతో కలిసి పనిచేశారు. మీడియా కథనాల ప్రకారం అతని రోజువారీ జీతం రూ.64 లక్షలు. 2023 నాటికి, సంజయ్ మెహ్రోత్రా బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మైక్రోన్ టెక్నాలజీ, CDW, సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ , ఇంజనీరింగ్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ల బోర్డులో పనిచేస్తున్నారు. -
HBDMaheshBabu: మహేష్‌బాబు నెట్‌వర్త్, లగ్జరీ కార్లు,ఖరీదైన జెట్, ఈ విషయాలు తెలుసా?
సౌత్సూపర్ స్టార్, తెలుగు సినిమా దిగ్గజం మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు, అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ హీరోల్లో ఒకరు. టాలీవుడ్‌కి అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన మహేష్ బాబు బర్త్‌డే సందర్బంగా ఆయన లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లపై ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిసరాల్లో అద్భుతమైన, విలాసవంతమైన ఇంట్లో టాలీవుడ్ ప్రిన్స్ ,భార్య నమ్రతా శిరోద్కర్ , గౌతమ్ , సితారతో ఉంటాడు. ఈ ఇంట్లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్, హోమ్ జిమ్, బహుళ బెడ్రూమ్లతో పాటు విశాలమైన, ఖరీదైన పెరడు లాంటి పలు విధ సౌకర్యాలతో కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాదు తన సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ బ్యాక్‌యార్డ్‌లో ఎక్కువగా పార్టీలు ఇస్తూ ఉంటాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు దీని విలువ రూ. 28 కోట్లు. దీంతోపాటు ముంబై, బెంగళూరులో కూడా భారీ ఆస్తులే ఉన్నాయి. ప్రైవేట్ జెట్ విలాసవంతమైన ప్రైవేట్ జెట్ కూడా మహేష్ బాబు సొంతం. తరచుగా తన కుటుంబంతో కలిసి తన విమానంలోనే పర్యటిస్తారు. నమ్రతా శిరోద్కర్ తరచుగా వారి చార్టర్లో విహారయాత్ర చేస్తున్న చిత్రాలను పంచుకుంటారు. స్విట్జర్లాండ్, పారిస్ , దుబాయ్ , జపాన్ ఇలా అద్భుతమైన డెస్టినేషన్ ఏదైనాతరుచుగా ఈ జెట్లోనేఎగిరిపోతారు. లగ్జరీ కార్ల సముదాయం సెలబ్రిటీలకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మినహాయింపేమీ కాదు. టాలీవుడ్లోనే దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన మహేష్ బాబు చాలా ఖరీదైన నాలుగు చక్రాల వాహనాలను కలిగి ఉండటంలో ఆశ్చర్యం ఏముంది. సౌత్ సినిమా ఐకాన్ గ్యారేజీలో రూ. 1.19 కోట్ల విలువైన ది ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కార్, రూ. 2.26 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్ వంటి కార్లు ఉన్నాయి. ఇంకా BMW 730Ld, మెర్సిడెస్ GL క్లాస్ కూడా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే మహేష్ బాబు గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారు కొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కారు ఖరీదు రూ. 5.40 కోట్లు, ఇది మహేష్ బాబు కార్ కలెక్షన్లో అత్యంత ఖరీదైన కారిదే. మహేష్‌తో పాటు మోహన్‌లాల్, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖ స్టార్లు కూడా రేంజ్ రోవర్ ఎస్వీని కలిగి ఉన్నారు.అంతేకాదు హైదరాబాద్‌లో గోల్డ్ కలర్ రేంజ్ రోవర్‌ను కలిగి ఉన్న ఏకైక వ్యక్తి కూడా మహేష్. కొద్ది రోజుల క్రితం కేజీఎఫ్ స్టార్ యష్ కూడా రేంజ్ రోవర్ కారు కొన్నాడు. ఈ కారులో అనేక లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. కాగా కెరీర్లో వన్ నేనొక్కడినే, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, సర్కారు వారి పాట వంటి పలు సూపర్‌డూపర్ హిట్లను అందించిన టాలీవుడ్ సూపర్‌స్టార్ ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ రూ.80కోట్లకుపై మాటే. దీనికితోడు యాడ్స్, ఎండార్స్మెంట్లు కూడా భారీగానే ఉన్నాయి. మహేష్ బాబు 2022 లెక్కల ప్రకారం నికర విలువ దాదాపు రూ. 244 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లను పలకరించనున్న ఈ మూవీలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
వ్యాపార సామ్రాజ్యంలో మహిళా సారధులు - ఏం చదువుకున్నారో తెలుసా?
బిజినెస్ అనగానే సాధారణంగా పురుషులే గుర్తుకు వస్తారు. కానీ వ్యాపార రంగంలో మహిళలు కూడా తమదైన రీతిలో ముందుకు దూసుకెట్లున్నారన్న సంగతి చాలామంది విస్మరించి ఉండవచ్చు. మనం ఈ కథనంలో కోట్ల రూపాయల వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ మహిళల గురించి, వారు ఏం చదువుకున్నారు? ఏ కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధా మూర్తి (Sudhamurthy) భారతదేశంలో ఎంతో మందికి ఆదర్శప్రాయమైన 'సుధా మూర్తి' ప్రముఖ టెక్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ చైర్పర్సన్. ఈమె నారాయణ మూర్తిని వివాహం చేసుకోవడానికి ముందు బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. 2023లో పద్మశ్రీ పొందిన ఈమె నికర సంపద విలువ సుమారు రూ. 775 కోట్లు అని సమాచారం. రోష్ని నాడార్ (Roshni Nadar) శివ నాడార్ కుమార్తె 'రోష్ని నాడార్' ప్రస్తుతం హెచ్‌సిఎల్ కంపెనీ సీఈఓ. ఈమె వసంత్ వ్యాలీ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ రేడియో/టీవీ/ఫిల్మ్ వంటి వాటి మీద దృష్టి సారించి కమ్యూనికేషన్లో ప్రావీణ్యం సంపాదించింది. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. 2022 నాటికి ఆమె నికర సంపద విలువ రూ. 84,330 కోట్లని సమాచారం. నీతా అంబానీ (Nita Ambani) భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీ భార్య 'నీతా అంబానీ' ముంబైలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఈమె ప్రస్తుతం రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్. 2022 నాటికి ఈమె సంపద విలువ రూ. 84,330 కోట్లు అని తెలుస్తోంది. కిరణ్ మజుందార్-షా (Kiran Mazumdar-Shaw) కిరణ్ మజుందార్-షా బయోకాన్ లిమిటెడ్ అండ్ బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు & ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కూడా. ఈమె బెంగళూరు ఐఐఎం మాజీ చైర్మన్‌గా కూడా పనిచేసింది. మజుందార్-షా బెంగుళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత బెంగుళూరు యూనివర్శిటీలో జువాలజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఈమె నికర ఆస్తుల విలువ 18779 కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! స్మితా కృష్ణ-గోద్రెజ్ (Smita Crishna-Godrej) నావల్ గోద్రెజ్ కుమార్తె అయిన స్మితా కృష్ణ-గోద్రెజ్ ముంబైలో హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసింది. ఈమె థియేటర్ యాక్టర్ విజయ్ కృష్ణను వివాహం చేసుకుంది. ఈమె సంపద విలువ సుమారు 2.9 బిలియన్ డాలర్లు. ఇదీ చదవండి: 2030 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు.. ఈ రంగంలోని వారికి తిరుగులేదండోయ్! రేష్మా కేవల్రమణి (Reshma Kewalramani) డాక్టరుగా జీవితం మొదలుపెట్టిన రేష్మా కేవల్రమణి తరువాత కాలంలో వ్యాపారంలోకి అడుగుపెట్టి వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్‌తో కొత్త శిఖరాలకు అధిరోహించింది. ఈమె అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుంచి లిబరల్ ఆర్ట్స్/మెడికల్ సైన్స్‌లో ఏడేళ్ల కోర్సు చేసి ఆ తరువాత 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి జనరల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పొందింది. -
Ind Vs WI: విండీస్ విధ్వంసకర వీరుడు.. కోటీశ్వరుడు! ఖరీదైన కార్లు.. ఆస్తి?
Nicholas Pooran's Lavish Lifestyle: టెస్టు, వన్డే సిరీస్‌లలో టీమిండియా చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ట్రినిడాడ్‌లోని తరూబాలో గల బ్రియన్ లారా స్టేడియంలో గురువారం యువ భారత జట్టుతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఐదు టీ20ల సిరీస్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్న విండీస్‌కు విధ్వంసర ఆటగాడు నికోలస్ పూరన్‌తో పాటు జేసన్ హోల్డర్ రాక బలంగా మారింది. కాగా వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్.. మేజర్ లీగ్ క్రికెట్-2023 ఫైనల్లో ఆడిన సునామీ ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి చెందిన ఎంఐ న్యూయార్క్‌కు ప్రాతినిథ్య వహించిన పూరన్ ఏకంగా 10 ఫోర్లు, 13 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 55 బంతుల్లో 137 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజేతగా నిలిపాడు. కోటీశ్వరుడే! పూరన్ ఆట సంగతి ఇలా ఉంటే.. అతడి వ్యక్తిగత జీవితం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. కరేబియన్ దీవికి చెందిన ధనవంతులైన క్రికెటర్లలో పూరన్కూ చోటుంది. ఈ ఏడాది హయ్యస్ట్ పెయిడ్ విండీస్ క్రికెటర్ల జాబితాలో అతడు స్థానం సంపాదించాడు. ఐపీఎల్ ద్వారా అధికాదాయం ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ 2023 వేలంలో భాగంగా అత్యధికంగా ఈ హిట్టర్ కోసం ఏకంగా 16 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న సీపీఎల్, మేజర్ లీగ్ క్రికెట్ తదితర లీగ్‌లలో పూరన్ ఆడుతున్నాడు. అదే విధంగా.. పూమా, నైకీ తదితర ప్రముఖ బ్రాండ్లను ఎండార్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో నికోలస్ పూరన్ నెట్‌వర్త్ రూ. 25 కోట్లకు పైగానే ఉన్నట్లు వన్క్రికెట్ అంచనా వేసింది. చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడి బాల్య స్నేహితురాలు కాథెరినా మిగ్యూల్‌ను ప్రేమించిన నికోలస్ పూరన్ 2021 జూన్‌లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అలియారా అనే కూతురు ఉంది. కుటుంబాన్ని ప్రేమించే పూరన్ భార్యాబిడ్డలతో ఉన్న ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. ఖరీదైన కార్లు నికోలస్ పూరన్ వద్ద సుమారు రూ. 2.26 కోట్ల విలువైన BMW i8, 28 లక్షల ధర గల Hyundai Tucson కార్లు ఉన్నట్లు సమాచారం. ఫేవరెట్లు వీరే 27 ఏళ్ల నికోలస్ పూరన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిల్లియర్స్ రోల్‌మోడల్స్. ఈ వికెట్ కీపర్ బ్యాటర్లను పూరన్ ఆదర్శంగా భావిస్తాడు. కాగా ఎంఎల్‌సీలో విధ్వంసకర ఆట తీరుతో విరుచుకుపడిన పూరన్ టీమిండియాపై ఎలా ఆడతాడో చూడాలి! ఈ లెఫ్టాండర్ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడతాడా లేదంటే భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేస్తాడా అని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచి.. ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా! విండీస్‌తో టెస్టుల్లో విఫలం! ఖరీదైన కారు కొన్న టీమిండియా క్రికెటర్.. ధర ఎంతంటే! ᵗʰᵉ ᵒⁿˡʸ ᵗʰⁱⁿᵍ ᵍᵒⁱⁿᵍ ʳⁱᵍʰᵗ ᶠᵒʳ ˢᵉᵃᵗᵗˡᵉ 1⃣3⃣7⃣/3⃣ (12.2) pic.twitter.com/BZP6bYtwoa — Major League Cricket (@MLCricket) July 31, 2023 -
10 వేల కోట్ల ఆస్తులకు మహారాణి.. దివాలా దెబ్బ.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?
హీరోహీరోయిన్లకున్న డిమాండే వేరు! రెండు హిట్లు పడ్డాయంటే చాలు పారితోషికం అమాంతం పెంచేస్తారు. అదే వరుసగా ఫ్లాప్స్ వచ్చాయనుకో.. ఆ పారితోషికంలో హెచ్చుతగ్గులు లేకుండా అదే కంటిన్యూ చేస్తారు. సినిమా పీకల్లోతు నష్టాల్లో మునిగినప్పుడు మాత్రమే రెమ్యునరేషన్లో కొంత కట్ చేస్తారు.. అది కూడా ఎవరో ఒకరిద్దరు మాత్రమే! సినిమా బడ్జెట్లో పారితోషికానికే ఎక్కువగా ఖర్చవుతోంది. ఇప్పుడున్న అగ్రతారలంతా ఒక్కో సినిమాతో కోట్లు గడిస్తున్నారు. మూడు నిమిషాల పాటలో కనిపించినా కోటి వెనకేస్తున్నారు. అలాంటిది వారి ఆస్తులు ఎన్ని కోట్లుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 20 ఏళ్ల వయసులో వెండితెరపై ఎంట్రీ అయితే 30 ఏళ్ల క్రితమే బాలీవుడ్‌కు దూరమైన ఓ నటి వేల కోట్ల సామ్రాజ్యానికి మమారాణిగా మారింది. సినిమాలతో ఎంత సంపాదించిందో కానీ బిలియనీర్‌ను పెళ్లి చేసుకుని అంతకంటే ధనవంతురాలిగా మారిపోయింది. ఆమె మరెవరో కాదు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ భార్య, మాజీ నటి టీనా అంబాని. ఆమె అసలు పేరు టీనా మునిమ్. 20 ఏళ్ల వయసులో దేశ్ పర్దేశ్ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది. ఆమెను చూడగానే ఇటు ప్రేక్షకలోకం, అటు సినీలోకం పరవశించిపోయింది. రాజేశ్ ఖన్నా, రిషి కపూర్, అమల్ పాలేకర్ వంటి బాలీవుడ్ అగ్రహీరోలతో కలిసి నటించింది. మొదట్లో వరుస విజయాలతో దూకుడు చూపించిన ఆమె 80వ దశాబ్దం మధ్య కాలం నుంచి అపజయాలను మూటగట్టుకుంది. టీనా కోసం హీరోల మధ్య గొడవ 1987 తర్వాత ఆమె రెండే రెండు సినిమాలు చేసింది. 1991లో వచ్చిన జిగర్వాలా చిత్రంలో చివరిసారిగా కనిపించింది. సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందిన రోజుల్లో టీనా పలువురు హీరోలతో లవ్వాయణం నడిపిందని వార్తలు వచ్చేవి. అందులో రిషి కపూర్ పేరు కూడా ఉంది. అయితే అది నిజం కాదని రిషి కపూర్ తన ఆత్మకథలో స్పష్టం చేశాడు. ఈ పుకారు నిజమేననుకున్న మరో హీరో సంజయ్ దత్ తనతో గొడవ పడేందుకు నేరుగా ఇంటికే వచ్చాడని కూడా వెల్లడించాడు. అంటే అప్పట్లో టీనా క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం 1991 ఫిబ్రవరి 2న ఆమె అగ్ర వ్యాపారవేత్త అనిల్ అంబానీని పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె ఆస్తుల విలువ ఒకానొక దశలో రూ.10,000 కోట్లు. ఆమె భర్త అనిల్ అంబానీ (42 బిలియన్ డాలర్ల ఆస్తులతో) ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఆరవ వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. అయితే వరుసగా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ రావడంతో వీరి సంపాదన కొంత ఆవిరైపోయింది. దీంతో ప్రస్తుతం టీనా ఆస్తి విలువ రూ.2331 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: విమానంలో వెకిలి చేష్టలు.. బొక్కలిరగ్గొట్టిన బ్యూటీ -
ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!
Headspace Founder Story: వాస్తవ ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటనలు మనిషి జీవితాన్ని మార్చేస్తాయి. ఒకటి గొప్ప వాణ్ణి చేస్తుంది.. లేదా పనికిరాకుండా పోయేలా కూడా చేస్తుంది. కన్నీటి సంద్రం నుంచి బయటపడి కోట్లు సంపాదనకు తెర లేపిన ఒక సన్యాసి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఆత్మీయుల మరణం.. ఆండీ పూడికోంబే (Andy Puddicombe) అనే వ్యక్తి తాగి డ్రైవింగ్ చేసిన సంఘటనలో స్నేహితులను, సైక్లింగ్ ప్రమాదంలో అతని సోదరిని కోల్పోయి జీవితం మీద విరక్తి పొందాడు. దుఃఖంతో నిండిన యితడు కాలేజీకి స్వస్తి పలికి నేపాల్ చేరుకున్నాడు. బౌద్ధ సన్యాసం స్వీకరించి ఆసియా అంతటా ఒక దశాబ్దం పాటు సంపూర్ణత, ధ్యానం గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. హెడ్‌స్పేస్ మెడిటేషన్ యాప్.. ధ్యానంతో జీవితాన్ని ప్రశాంతంగా చేసుకోవచ్చనే సత్యాన్ని గ్రహించి అందరికి పంచాలనే ఉద్దేశ్యంతో 2005లో యూకే నుంచి తిరిగి వచ్చిన తరువాత లండన్‌లో ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఎప్పుడూ బిజీ లైఫ్ గడిపే ఎంతోమందికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఆ తర్వాత రిచర్డ్ పియర్సన్తో కలిసి 2010లో 'హెడ్‌స్పేస్' (Headspace) అనే మెడిటేషన్ యాప్ స్థాపించారు. ఈ యాప్ అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఇది ఎంతో మంది ప్రజలకు ధ్యానం ప్రయోజనాలను గురించి వెల్లడిస్తుంది. మానసిక ఆరోగ్యం పట్ల వైఖరిని మార్చడంలో హెడ్‌స్పేస్ విస్తృత ఆదరణ పొందింది. జీవితంలోని గందరగోళాల మధ్య ప్రశాంతమైన అభయారణ్యంగా మారింది, మానసిక క్షేమం కోరుకునే వినియోగదారులను ఎంతోమందిని ఈ యాప్ ఆకర్షిస్తుంది. (ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!) వేల కోట్ల సామ్రాజ్యం.. ఆధునిక కాలంలో నేడు ఈ యాప్ 4,00,000 మంది సబ్స్క్రైబర్లను 50 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని కలిగి ఉంది. కేవలం బౌద్ధ సన్యాసి అయినప్పటికీ 250 మిలియన్ డాలర్లు లేదా సుమారు రూ. 2040 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. కష్టతరమైన సమయాల్లో కూడా ఎలా విజయాలు అసాధించాలో తెలుసుకోవడానికి ఇదొక మంచి ఉదాహరణ. మొత్తం మీద వ్యక్తిగత విషాదం అతన్ని వేల కోట్లకు అధిపతిని చేసింది. -
20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్‌లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే!
Mohammed Siraj Net Worth: అద్దె ఇంట్లో.. ఆటో నడుపుతూ తండ్రి సంపాదించిన డబ్బుతో కాలం వెళ్లదీసిన స్థితి నుంచి నుంచి జూబ్లీహిల్స్‌లో ఖరీదైన బంగ్లా కొనే స్థాయికి ఎదిగాడు హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1గా నిలిచిన ఈ ఫాస్ట్ బౌలర్.. టీమిండియా ప్రధాన పేసర్‌గా ఎదుగుతున్నాడు. భారత జట్టులో కీలక బౌలర్‌గా సేవలు అందిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నాడు. ఆటగాడిగా అద్భుత ప్రదర్శనతో అందరి నీరాజనాలు అందుకుంటున్న సిరాజ్.. సంపాదనలోనూ తగ్గేదేలే అంటున్నాడు. మరి ఈ హైదరాబాదీ నెట్‌వర్త్, అతడి వద్దనున్న విలాసవంతమైన కార్ల గురించి తెలుసుకుందామా? 2017లో ‘కోటీశ్వరుడిగా’... దేశవాళీ క్రికెట్లో ప్రతిభ చాటుకున్న సిరాజ్‌ను ఐపీఎల్ రూపంలో అదృష్టం వరించింది. 2017లో అతడు రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి రాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ 2.6 కోట్ల భారీ ధరకు అతడిని కొనుగోలు చేసింది. దీంతో సిరాజ్ కోటీశ్వరుడియ్యాడు. ఇక ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిరాజ్‌ను సొంతం చేసుకోగా.. ఇప్పటికీ అదే జట్టుతో కొనసాగుతున్నాడు. 2017లోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సిరాజ్.. నాటి ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రోత్సాహంతో టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఇక ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో 2020లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ రైట్ ఆర్మ్ పేసర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ జట్టులో రెగ్యులర్ మెంబర్‌గా మారాడు. ఈ క్రమంలో అతడి సంపాదన కూడా పెరుగుతూ వస్తోంది. ఏడాదికి మూడు కోట్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో బీ గ్రేడ్‌లో ఉన్న సిరాజ్.. ఏడాదికి రూ. 3 కోట్లు ఆర్జిస్తున్నాడు. టీమిండియా తరఫున ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు 3 లక్షల రూపాయల చొప్పున ఫీజుగా అందుకుంటున్నాడు. ఆర్సీబీ కీలక బౌలర్‌గా.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఆర్సీబీ కీలక బౌలర్‌గా ఉన్న సిరాజ్‌ను ఐపీఎల్-2023 వేలానికి ముందు రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో రూ. 7 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో సిరాజ్ మియా నెట్‌వర్త్ సుమారు 48 కోట్లు ఉంటుందని క్రిక్బౌన్సర్ అంచనా వేసింది. కార్లు, బంగ్లా.. అద్దె ఇంట్లో కాలం గడిపిన సిరాజ్ తన కుటుంబం కోసం ఇటీవలే ఓ విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశాడు. జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్ ఏరియాలో ఖరీదైన ఇంటిని కొన్నాడు. ఐపీఎల్-2023 జరుగుతున్న సమయంలోనే గృహప్రవేశం చేయగా.. ఆర్సీబీ ఆటగాళ్లందరినీ తన ఇంటికి ఆహ్వానించాడు సిరాజ్. సిరాజ్ గ్యారేజ్‌లో బీఎండబ్ల్యూ సెడాన్‌తో పాటు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర బహుమతిగా అందించిన మహేంద్ర థార్ కూడా ఉంది. కాగా ఐపీఎల్లో అడుగుపెట్టిన తర్వాత తనకు వచ్చిన మొత్తంతో సిరాజ్ తొలుత టయోటా కరోలాను కొనుగోలు చేశాడు. ఇలా ఆటో డ్రైవర్ కొడుకు స్థాయి నుంచి ఖరీదైన కార్లు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగిన సిరాజ్ యువతకు ఆదర్శనీయమే కదా!! కాగా సిరాజ్ ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో ఆడాడు. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తంగా 5 వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 209 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. చదవండి: రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే.. శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా! టీమిండియా కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. ! Hyderabadi Biryani time! 🥳 The boys took a pitstop at Miyan's beautiful new house last night! 🏡#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/kEjtB1pQid — Royal Challengers Bangalore (@RCBTweets) May 16, 2023 -
కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే షాక్!.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! ఎలా సంపాదిస్తున్నాడంటే?
ప్రపంచంలోనే అత్యంత పాపులర్ క్రీడాకారుల్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఒకడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 252 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియాలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కోహ్లి కలిగి ఉన్నాడు. మైదానంలో రికార్డులు కొల్లగొట్టే కింగ్ కోహ్లి.. సంపాదనలో కూడా అదరగొడుతున్నాడు. విరాట్ ప్రస్తుత సంవత్సర ఆదాయం ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. స్టాక్ గ్రో రిపోర్ట్ ప్రకారం.. కోహ్లి నెట్‌వర్త్ విలువ 1,050 కోట్లు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో ఏ ఆటగాడు నెట్‌వర్త్ విలువ కూడా కోహ్లి అంత లేదు. కోహ్లి ఏయే రూపాలలో ఎంత అర్జిస్తున్నాడో ఓ లుక్కేద్దాం. అయితే విరాట్ కోహ్లి సంపాదనలో ప్రధాన భాగం తన సొంత వ్యాపార పెట్టుబడులు, ప్రచారకర్తగా చేసుకున్న ఒప్పందాల నుంచే వస్తోంది. భారత క్రికెట్ నుంచి ఎంతంటే? కోహ్లి ప్రస్తుతం బీసీసీఐ " ఏ ప్లస్" కాంట్రాక్ట్‌లో ఉన్నాడు. కాబట్టి ఏడాదికి రూ. 7 కోట్ల రూపాయలు టీమిండియా కాంట్రాక్ట్ రూపంలో లభిస్తోంది. అదే విధంగా అతడి మ్యాచ్ ఫీజుల విషయానికి వస్తే.. ప్రతీ టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు తీసుకుంటాడు. ఐపీఎల్లో ఎంతంటే? కోహ్లి ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడు ఆర్సీబీ నుంచి కాంట్రాక్ట్ రూపంలో ఏడాదికి రూ. 15 కోట్లు తీసుకుంటాడు. ప్రచారకర్తగా ఎంత తీసుకుంటున్నాడంటే? విరాట్ కోహ్లి వ్యాపార ప్రకటనల ద్వారా రోజు రూ.7.5 నుంచి 10 కోట్లు సంపాదిస్తున్నాడు. కోహ్లి 18 బ్రాండ్స్ పైగా ప్రచారకర్తగా ఉన్నాడు.వివో, మింత్రా, గ్రేట్ లర్నింగ్, నాయిస్, వ్రాగన్, బ్లూస్టార్, టూయమ్మీ, ఓలిని, లక్సర్, హెచ్ఎస్బీసీ, ఊబర్, టూత్సీ, స్టార్ స్పోర్ట్స్, అమెరికన్ టూరిస్టర్, ఎమ్‌ఆర్‌ఎప్, సింథాల్ సంస్థలకు కోహ్లి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. సోషల్‌మీడియా ద్వారా ఎంతంటే? సోషల్ మీడియాలో కూడా కోహ్లి బాగా సంపాదిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టును షేర్ చేసినందుకు రూ.8.9 కోట్లు, ట్విటర్లో రూ. 2.5 కోట్లు తీసుకుంటున్నాడు. కోహ్లి బిజినెస్‌లు.. అదే విధంగా బ్లూ ట్రైబ్, యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్, ఏంపీఎల్, స్పోర్ట్స్ కాన్వో వంటి స్పోర్ట్స్ కాన్వో వంటి ఏడు స్టార్టప్ బిజినెస్‌లలో కోహ్లి పెట్టుబడి పెట్టాడు. అంతేకాకుండా కోహ్లికి ముంబైలో రెండు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఫుట్‌బాల్ క్లబ్, టెన్నిస్ టీమ్, ప్రో రెజ్లింగ్ లీగ్‌ల్లో కూడా కోహ్లి భాగస్వామిగా ఉన్నాడు. కోహ్లి అస్తుల విలువ ఎంతంటే? ఇక కోహ్లి మొత్తం ప్రాపర్టీస్ విలువ రూ.110 కోట్లు. కోహ్లికి ముంబైలో రూ.34 కోట్లు విలువ చేసే ఇళ్లు ఉండగా.. గుర్‌గ్రామ్‌లో రూ.80 కోట్ల విలువ చేసే విల్లా ఉంది. అదే విధంగా కోహ్లి దగ్గర రూ.31 కోట్ల విలువైన కార్లు ఉన్నాయి. ఆడీ, రెంజ్రోవర్, ఫార్చూనర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. చదవండి: Ashes 2023: క్యాచ్ విడిచిపెట్టారు.. స్టంపింగ్ మిస్ చేశారు! ఇంగ్లండ్ జట్టుపై మాజీ కెప్టెన్ ఫైర్ -
ఓనర్ ఆస్తుల గురించి ఎవరికీ తెలియని విషయాలు..!
-
ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..!
-
సత్య నాదెళ్ల కంటే ఎక్కువ ఆస్తులున్న మహిళ గురించి తెలుసా?
Jayshree Ullal: ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరైన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురించి, ఆయన నికర ఆస్తులను గురించి గతంలోనే తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు సత్య నాదెళ్ల ఆస్తి కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఆస్తులు కలిగిన ఒక మహిళ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ సంతతికి చెందిన 'జయశ్రీ ఉల్లాల్' యూకేలో జన్మించినా ఢిల్లోలో పెరిగింది. కావున ఈమె ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత, ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్ళింది. అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఆ తరువాత శాంటా క్లారా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత ఆమె అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్‌లో ఉద్యోగ జీవితం ప్రారంభించి ఉంగర్మాన్ బాస్‌లో నాలుగు సంవత్సరాలు గడిపింది. ఆ తరువాత కొన్ని రోజులకే క్రెసెండో కమ్యూనికేషన్స్‌లో చేరింది. చివరికి సిస్కో ఉద్యోగిగా మారింది. 15 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో సిస్కో కంపెనీలో ఉన్నతమైన స్థానాన్ని పొందింది. (ఇదీ చదవండి: కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!) జయశ్రీ ఉల్లాల్ 2008 నుంచి అరిస్టా నెట్వర్క్స్కు ప్రెసిడెంట్‌గా మాత్రమే కాకుండా సీఈఓగా కూడా పనిచేశారు. వ్యక్తిగత సంపద విషయంలో ఈమె భారతదేశంలో అత్యంత ధనికురాలు. సంపద విషయంలో ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల కంటే ముందు ఉండటం గమనార్హం. జయశ్రీ ఉల్లాల్ సిబెడ్ సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ అయిన 'విజయ్ ఉల్లాల్'ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరు కాలిఫోర్నియాలో తమ ఇద్దరి కుమార్తెలతో ఉన్నారు. వీరి మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 3.4 లక్షల కోట్లు. ఇక మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల నికర విలువ రూ.6200 కోట్లు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
పరిణీతి చోప్రా ఫియాన్సీ ఆస్తి ఇంతేనా?
Raghav Chadha Net Worth: ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! బాలీవుడ్లో విజయవంతమైన చిత్రాలలో నటిస్తున్న పరిణీతి చోప్రా విలాసవంతమైన జీవనశైలి కలిగిన నటి. ఆమెకున్న బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఇతర ఆస్తులతో ఆమె నెట్‌వర్త్ రూ. 60 కోట్లు. అయితే ఆమెకు కాబోయే భర్త రాఘవ్ చద్దా ఆస్తుల గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. మై నేత డాట్ ఇన్ఫో ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 50 లక్షలు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా వయసు 34 ఏళ్లు. రాజ్యసభలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీ. కాబోయే భార్య పరిణీతి చోప్రాతో పోల్చితే రాఘవ్ చద్దా జీవనశైలి, నికర ఆస్తులు చాలా తక్కువ. చిన్న ఇల్లు, పాత కారు.. రాఘవ్ చద్దా ప్రకటించిన మొత్తం ఆస్తులు MyNeta.info ప్రకారం.. రూ. 50 లక్షలు. ఇందులో చరాస్తుల విలువ రూ. 36 లక్షలు. సొంత ఇల్లు ఉంది. దాని విలువ రూ.37 లక్షలు. ఇక కార్ల విషయానికి వస్తే.. రాఘవ్ చద్దా వద్ద ఉన్నది 2009 మోడల్ మారుతీ సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్ మాత్రమే. ఇది కాకుండా ఆయన వద్ద దాదాపు 90 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ రూ. 4.94 లక్షలు. పరిణీతి నెట్‌వర్త్ రూ. 60 కోట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం.. పరిణీతి చోప్రా నెట్‌వర్త్ రూ.60 కోట్లు. ఆమె సంపదలో ఎక్కువ భాగం సినిమా డీల్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్ల నుంచి వచ్చిందే. ఆమెకు ముంబైలో సముద్ర తీరాన లగ్జరీ విల్లా ఉంది. ఇక ఆమె దగ్గర ఆడీ A6, జాగ్వార్ XJL, ఆడీ Q5 వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by @parineetichopra ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! -
ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఆస్తులు సున్నా అంటున్నాడు..
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు 'అనిల్ అంబానీ' గురించి దాదాపు అందరికి తెలుసు. ఒకప్పుడు ఆసియాలోని ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన సంపాదన భారీగా పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ ఆయన సంపాదన పడిపోయిందా..లేదా ? ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎన్ని అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. అనిల్ అంబానీ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కోర్టులో తన ప్రస్తుత నికర విలువ రూ.0 అని వెల్లడించాడు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ రెండో రౌండ్ బిడ్డింగ్ వేలంలో హిందుజా గ్రూప్ అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. దివాళా తీసిన కంపెనీని రూ. 9650 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసింది. ముఖేష్ అంబానీ మాదిరిగా అపర కుబేరుడుగా ప్రపంచంలో ఉన్న ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్న అనిల్ అంబానీ 2020 ఫిబ్రవరిలో UK కోర్తులో హాజరైనప్పుడు తన నికర ఆస్తుల విలువ సున్నా అని చెప్పారు. నిజానికి ఆయన ఆస్తుల విలువ 13.7 బిలియన్ డాలర్లు అని నివేదికల ద్వారా తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ. 1.12 లక్షల కోట్లకంటే ఎక్కువ. అనిల్ అంబానీ తన ఆస్తులు సున్నా రూపాయలు అని కోర్టులు చెప్పినప్పటికీ.. ముంబైలో 17 అంతస్థుల భవంతి, రూ. 20 కోట్ల విలువైన కార్లు, అత్యంత ఖరీదైన బోట్స్, ప్రైవేట్ జెట్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. నికర ఆస్తుల విలువ భారీగా తగ్గినప్పటికీ, ప్రస్తుత ఆస్తులు రూ. 83 మిలియన్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: Matter Aera Electric Bike: ఈ బైక్ కావాలా? ఇదిగో ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోండి!) నిజానికి అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో ఒక శిఖరం, ఆసియాలో ఆరవ ధనవంతుగా ఎదిగాడు. కానీ కంపెనీ నిధులను స్వాహా చేసిన ఆరోపణలకు గానూ సెబీ మార్కెట్ నుంచి నిషేదించింది. ఆ తరువాత క్రమంగా ఆయన నికర ఆస్తులు పతనం కావడం ప్రారంభమైంది. -
క్రికెట్ దేవుడు సచిన్‌కు ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
క్రికెట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. కాబట్టి సచిన్ టెండూల్కర్ గురించి దాదాపు అందరికి తెలుసు. సచిన్ ఆటల్లో మాత్రమే కాదు ఆటో మోటివ్ ఔత్సాహికుడు కూడా అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు. ఈ రోజు క్రికెట్ గాడ్ సచిన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆస్తులు విలువ ఎంత? లగ్జరీ కార్లు ఎన్ని ఉన్నాయి వంటి విషయాలతో వాటితో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. క్రికెట్ తన ఊపిరిగా క్రికెట్ ద్వారానే ఉన్నత స్థాయికి ఎదిగిన సచిన్ నికర ఆస్తుల విలువ కొన్ని నివేదికల ప్రకారం సుమారు 165 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1350 కోట్ల కంటే ఎక్కువ. బెంగళూరులో రెండు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయని సమాచారం. (ఇదీ చదవండి: సత్య నాదెళ్ల లగ్జరీ హౌస్ చూసారా - రెండంతస్తుల లైబ్రరీ, హోమ్ థియేటర్ మరెన్నో..) 11 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించి ఎన్నో కష్టాలకు ఓర్చుకుని ఇప్పుడు క్రికెట్ గాడ్ అయ్యాడు. గుజరాతీ కుటుంబానికి చెందిన అంజలిని వివాహం చేసుకున్న సచిన్ ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నారు. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నారు. (ఇదీ చదవండి: 28 ఏళ్లకే తండ్రి మరణం.. ఇప్పుడు లక్షల కోట్లకు యజమాని) క్రికెట్ అంటే ప్రాణమిచ్చే సచిన్ మొదటి కారు మారుతి 800 కావడం గమనార్హం. ప్రస్తుతం అత్యంత ఖరీదైన బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ఇందులో బిఎండబ్ల్యూ 30 జహ్రే ఎమ్5, ఎమ్ 6 గ్రాన్ కూపే, 7 సిరీస్, నిస్సాన్ జిటి-ఆర్, ఐ8, ఫెరారీ-360-మొడెనా మొదలైనవి ఉన్నాయి. సచిన్ వద్ద ఉన్న కార్ల ఖరీదు రూ. 15 కోట్లకంటే ఎక్కువ. ఖరీదైన కార్లు, బంగ్లా కలిగి ఉన్న సచిన్ పెప్సి, అడిడాస్, టీవీఎస్, బ్రిటానియా, వీసా, బూస్ట్, ఎయిర్టెల్, కోకాకోలా, కోల్గేట్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. దీని ద్వారా వచ్చే వార్షిక ఆదాయం సుమారు రూ. 17 నుంచి 20 కోట్లు. -
నిహారిక కొణిదెల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు & ఇంకా..
మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి 'నిహారిక కొణిదెల' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లి తెరమీద, వెండి తెర మీద తనదైన రీతిలో ప్రేక్షలకులను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు పెళ్లి తరువాత వెబ్ సిరీస్ వంటివి చేస్తూ బాగానే సంపాదిస్తోంది. ఇంతకీ నిహారిక ఆస్తులు విలువ ఎంత? ఆమె ఎలాంటి కార్లను ఉపయోగిస్తుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. 1993 డిసెంబర్ 18 న జన్మించిన నిహారిక హైదరాబాద్ సెయింట్ మెరీన్ కాలేజీలో చదువుకుంది. చదువు పూర్తయిన తరువాత టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి ఢీ జూనియర్ వంటి వాటికి హోస్ట్‌గా వ్యవహరించి ఒక మనసు సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టింది. ఈమె తమిళ వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ అనే ప్రొడక్షన్ కంపెనీ కూడా ప్రారంభించింది. కొన్ని నివేదికల ప్రకారం ఈమె మొత్తం ఆస్తుల విలువ 2020 నాటికి 4 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 కోట్ల కంటే ఎక్కువ. ఈమె ఒక్కో సినిమాకి సుమారు రూ. 25 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేది కూడా చెబుతున్నారు. నిహారిక హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లో నివసించేది, ఆమెకు సొంతంగా జర్మన్ లగ్జరీ బ్రాండ్ ఆడి కారు కూడా ఉంది. అయితే ఈమె వివాహం 2020లో చైతన్య జొన్నల గడ్డతో రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన చైతన్య బిట్స్ పిలానీ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో గ్రాడ్యుయేషన్ & పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు. ఇతడు 2018లో 'ది హరికేన్స్' అనే సొంత కంపెనీని ప్రారంభించాడు. చైతన్య జొన్నల గడ్డ ప్రస్తుతం మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూనే నెస్లే, ఐబిఎమ్, ఎయిర్టెల్ అంటి అనేక ఇతర ప్రసిద్ధ భారతీయ కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు కూడా సమాచారం. వీటి కుటుంబ ఆస్తుల విలువ కూడా కోట్లలో ఉంది. కాగా ఇటీవల నిహారిక పింక్ ఎలిఫేంట్ అనే ప్రొడక్షన్ కోసం కొత్త ఆఫీస్ కూడా ప్రారంభించింది, ఈ ఆఫీస్ ప్రారంభానికి చైతన్య రాకపోవడం గమనార్హం. మొత్తం మీద బుల్లితెర నుంచి కోట్లు సంపాదించేవరకు ఎదిగింది కొణిదెల నిహారిక. -
Allu Arjun Assets: అల్లు అర్జున్‌కు అన్ని వందల కోట్ల ఆస్తులున్నాయా?
లెజండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య మనువడిగా, చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అల్లు అర్జున్. హీరోగా తెరంగేట్రం చేయడానికి ముందే బాలనటుడిగా నటించి మెప్పించాడు బన్నీ. మొదట్లో యానిమేటర్ని అవుదామనుకున్న అల్లు అర్జున్ సినిమా మీదున్న ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చాడు. 2003లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో వెనుతిరిగి చూడలేదు.. ఈ సినిమాతోనే బన్నీకి స్లైలిష్ స్టార్ అనే ట్యాగ్‌లైన్ వచ్చింది. ఆ తర్వాత హ్యాపీ, బన్నీ, పరుగు వంటి సినిమాలతో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాడు. దేశముదురు సినిమా బన్నీకి మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. రేసుగుర్రం, సరైనోడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, మొన్నటి పుష్ప సినిమా వరకు ప్రతి క్యారెక్టర్లో వైవిధ్యం, లుక్‌లో కొత్తదనం సహా తన ఇమేజ్ను అంతకంతకూ పెంచుకుంటూ పోయాడు.ఇక అల్లు అర్జున్ లైఫ్‌స్టైల్ కూడా రిచ్‌గా ఉంటుంది. ఖరీదైన వానిటీ వ్యాన్ దగ్గర్నుంచి ప్రైవేట్ జెట్ వరకు అల్లు అర్జున్ ఆస్తుల వివరాలపై ఓ లుక్కేద్దాం. AA వ్యానిటీ వ్యాన్.. ధరెంతో తెలుసా? అల్లు అర్జున్‌కు చెందిన అత్యంత ఖరీదైన వస్తువుల్లో వ్యానిటీ వ్యాన్ ఒకటి. టీవీ, ఫ్రిజ్, సౌకర్యవంతమైన రిక్లైనర్ సహా పలు విలాసవంతమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. తన అభిరుచికి తగ్గట్లు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఈ వ్యానిటీ వ్యాన్ ధర సుమారు రూ. 7కోట్లు. అల్లు అర్జున్‌కు హైదరాబాద్‌లో సుమారు వంద కోట్ల రూపాయల ఇల్లు ఉంది. ఇప్పటికీ తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నారు బన్నీ. స్విమ్మింగ్ పూల్, జిమ్, హోమ్ థియేటర్ సహా విలాసవంతంగా ఇంటిని ఇంటీరియర్ చేయించుకున్నారు. ఇక బన్నీకి కార్లంటే చాలా ఇష్టం. సొంతంగా లాంగ్ డ్రైవ్స్‌కు వెళ్లే అల్లు అర్జున్ వద్ద ఖరీదైన హమ్మర్ H2, రేంజ్రోవన్ వోగ్, జాగ్వార్ ఎక్స్జెఎల్ సహా BMW X6 M స్పోర్ట్ కార్లు కూడా ఉన్నాయి. సొంతంగా ప్రైవేట్ జెట్ ప్రైవేట్ జెట్ కలిగి ఉన్న అతికొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. అల్లు అర్జున్‌కు సొంతంగా ప్రైవేట్ జెట్ కూడా ఉంది. షూటింగ్స్ లేకపోతే ఎక్కువగా కుటుంబంతో గడిపే అల్లు అర్జున్ ఎక్కువగా ప్రైవేట్ జెట్స్‌లోనే ఫ్యామిలీని తీసుకొని వెకేషన్స్‌కు వెళ్తుంటారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటారు. వామ్మో.. ఒక్కో సినిమాకు అన్ని కోట్లా? ఒక ఒక్కో సినిమాకు రూ.40 కోట్లకు పైగా పారితోషకం అందుకుంటున్న అల్లు అర్జున్ పుష్ప సక్సెస్‌తో రెమ్యునరేషన్‌ను అమాంతం రూ. 100కోట్లకు పెంచేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు 'పుష్ప ది రూల్'తో పాటు సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న సినిమాకు సుమారు రూ. 100 - 120 కోట్ల వరకు బన్నీ చార్జ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. సినిమాలే కాకుండా పలు హైదరాబాద్‌లో పబ్స్, రెస్టారెంట్స్‌లలో ఆయనకు పలు షేర్స్ ఉన్నాయి. మొత్తంగా రూ. 400-500 కోట్లకు పైగానే ఆయన నికర ఆస్తుల విలువ ఉంటుందని సమాచారం. -
Keerthy Suresh: వామ్మో.. మహానటి ఆస్తులు అన్ని కోట్లా?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించిన హీరోయిన్స్‌లో కీర్తి సురేశ్ ఒకరు. నేను శైలజ సినిమాతో మొదలై మహానటి సినిమాతో తరువాతి తరాలు కూడా గుర్తుపెట్టుకునేంత పాపులారిటీ సంపాదించిందామె. ప్రస్తుతం నాని సరసన దసరా మూవీలో నటించింది కీర్తి. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కీర్తి సురేశ్ ఆస్తులు కూడా బాగానే కూడబెట్టింది. కొన్ని నివేదికల ప్రకారం ఈమె ఆస్తి విలువ సుమారు రూ. 35 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే కీర్తి దసరా సినిమా కోసం ఏకంగా 4 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ఉద్యోగుల పాలిట అమావాస్య.. విప్రో నుంచి 120 మంది అవుట్) కీర్తి సురేశ్ రిలయన్స్ ట్రెండ్స్, ఉషా ఇంటర్నేషనల్, జోస్ అలుక్కాస్ వంటి అనేక ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు 15 నుంచి 30 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమెకు చెన్నైలో ఒక విలాసవంతమైన ఇల్లు, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ పోష్ ఏరియాలో ఖరీదైన అపార్ట్మెంట్ కూడా ఉంది. కీర్తి సురేశ్ ఖరీదైన ఆస్తులలో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇందులో BMW X7 సిరీస్ ఒకటి. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 1.18 కోట్ల నుండి రూ. 1.78 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్, టొయోటా ఇన్నోవా క్రిస్టా వంటి కార్లను కూడా కలిగి ఉంది. -
Oscar Natu Natu-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ అక్షరాలా..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది అభిమానులు కలిగి ఉన్న హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలనటుడిగా పరిచయమై 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా మారి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ రోజు దక్షిణాది చిత్ర సీమలో ఎక్కువ సంపాదిస్తున్న నటులలో ఈయన ఒకరు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మొత్తం ఆస్తుల విలువ 70 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 571 కోట్లు. ఈయన నెలకు రూ. 3 కోట్లు వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. గతంలో ఒక్కో సినిమాకు రూ. 12 కోట్లు తీసుకునే వారని, ఆర్ఆర్ఆర్ మూవీకి 45 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు సినిమాలతో పాటు కొన్ని బ్రాండ్ ఎండార్స్మెంట్ కూడా సంపాదిస్తారు. ఇతర హీరోలతో పోలిస్తే అలాంటి సంపాదన ఎన్టీఆర్‌కి కొంత తక్కువనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమా విజయం తరువాత ఇప్పుడు తన రెమ్యునరేషన్ రూ. 60 నుంచి 80 కోట్లకు పెంచారు. టాలీవుడ్లో యంగ్ టైగర్‌గా పిలువబడే Jr NTR హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రూ. 25 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాలో తన కుటుంబముతో కలిసి నివసిస్తున్నారు. బెంగళూరులో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా హైదరాబాద్ శివార్లలోని గోపాలపురంలో 'బృందావనం' అనే ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారుని కలిగి ఉన్నారు. అంతే కాకుండా రేంజ్ రోవర్ వోగ్, పోర్స్చే 718 కేమాన్, బిఎండబ్ల్యు 720LD, మెర్సిడెస్ బెంజ్ జిఎస్ఎస్ 250డి, 4 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే ఎఫ్1తో పాటు ఖరీదైన వాచీలు, సుమారు రూ. 8 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నారు. -
ట్రెండ్ సెటర్ సీఈవో సరికొత్త చరిత్ర: గంటకు రూ.12 కోట్లు
వాషింగ్టన్: గంటకు 12 కోట్లు సంపాదించడం అంటే చిన్న విషయం కాదు కదా. కానీ అమెరికాలోని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్ సీఈవో స్టీఫెన్ స్క్వార్జ్మాన్ (76) ఈ ఫీట్ సాధించింది. 2022లో అత్యధిక సంపదను కూడబెట్టుకుని మరోసారి రికార్డు క్రియేట్ చేశారు. గత ఏడాది ఏకంగా 1.27 బిలియన్ డాలర్లు సంపాదించారు. 2021లో స్క్వార్జ్మాన్ వార్షిక ఆదాయం 1.1 బిలియన్ డాలర్లుగా ఉంది. తాజా నివేదికల ప్రకారం ఇన్వెస్టింగ్ టైటాన్ స్క్వార్జ్మాన్ 2022లో అతని సంపాదన గంటకు రూ. 12 కోట్లు. వాల్‌స్ట్రీట్‌లో ఆయనదే రికార్డు అని బిజినెస్ వర్గాలు తెలిపాయి. బ్లాక్‌స్టోన్ షేర్లలో దాదాపు 20శాతం ఉన్న ఆయనకు 1 బిలియన్ డాలర్ల డివిడెండ్, 253.1 మిలియన్ల డాలర్ల ఇతర ప్రయోజనాలను పొందారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బ్లాక్‌స్టోన్ సీఈవో నికర విలువ 30.6 బిలియన్ డాలర్లు. 2021లో ఏకంగా రూ.8,500 కోట్ల వేతనంతో వాల్‌స్ట్రీట్‌లో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా రికార్డు బద్దలు కొట్టారు. 2022లో ఎస్ అండ్ పీ 500 8.2 శాతం క్షీణించగా, బ్లాక్‌స్టోన్ షేర్ల నష్టాలు 1.5 శాతానికి పరిమితం కావడం విశేషం.స్టీఫెన్ వారసుడు బ్లాక్‌స్టోన్ ప్రెసిడెంట్ జోన్ గ్రే, 2022లో 479.2 మిలియన్ల డాలర్లు ఆర్జించాడు. బ్లాక్‌స్టోన్‌లో 3 శాతం వాటా, డివిడెండ్ ఆదాయం కలిపి 182.7 మిలియన్లు అతని నికర విలువకు చేరాయి. కాగా స్టీఫెన్ స్క్వార్జ్మాన్ ఫిబ్రవరి 14,1947న జన్మించారు. 1985లో ఏర్పాటైన బ్లాక్‌స్టోన్‌కు స్టీఫెన్ సహ వ్యవస్థాపకుడు. లెమాన్ బ్రదర్స్ మాజీ ఛైర్మన్, సీఈవో పీటర్సన్‌తో కలిసి 1985లో ది బ్లాక్‌స్టోన్ గ్రూప్ అనే గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థను స్థాపించారు స్క్వార్జ్మాన్ . -
అదానీ సెగ: ఎల్ఐసీలో రెండు రోజుల్లో వేల కోట్లు సంపద ఆవిరి
సాక్షి, ముంబై: అదానీ గ్రూపు-హిండెన్‌బర్గ్ వివాదం అదానీలో పెట్టుబడి పెట్టిన సంస్థలు, బ్యాంకులు, ఇతర పెట్టుబడిదారులను చుట్టుకుంది. గత మూడు రోజులుగా అదానీ గ్రూప్ స్టాక్స్ క్రాష్ కావడంతో దేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) భారీగా ప్రభావితమైంది. ఎల్ఐసీ కేవలం 2 రోజుల్లోనే రూ.18,000 కోట్లు నష్టాన్ని మూటగట్టకుంది. అటు అదానీ షేర్లలో అమ్మకాల కారణంగా స్టాక్‌మార్కెట్ శుక్రవారం భారీ పతనాన్ని నమోదు చేసింది. తాజా డేటా ప్రకారం అదానీ గ్రూప్ స్టాక్స్‌లో ఎల్ఐసీ సంయుక్త పెట్టుబడి జనవరి 24, 2023న రూ.81,268 కోట్లగా ఉండగా, జనవరి 27, 2023న రూ.62,621 కోట్లకు పడిపోయింది. అంటే రూ.18,647 కోట్ల మేర ఎల్ఐసీ నష్టపోయింది. కాగా అదానీ గ్రూపు కంపెనీల ఆర్థిక వ్యవహారాల్లో దశాబ్దాలుగా స్పష్టమైన స్టాక్ మ్యానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ హిండెన్ బర్గ్ నివేదికను విడుదల చేసింది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. గడిచిన మూడేళ్లలో ఏకంగా 100బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. ఏడు లిస్టెడ్ కంపెనీలు, 85 శాతం నష్టాన్ని, గణనీయమైన రుణాలను కలిగి ఉన్నాయని నివేదికలో పేర్కొంది. అయితే దీనిపై చట్టపరమైన చర్య తీసుకోనున్నట్టు అదానీ ప్రకటించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌ను దెబ్బతీసే ప్రధాన లక్ష్యంతో తమప్రతిష్టను దెబ్బతీయాలనే ఈ కుట్రపన్నారని పేర్కొంది. దీనిపై హిండెన్‌బర్గ్ కూడా స్పందించింది. తన నివేదికలోని అంశాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. -
దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి!
సాధారణంగా డబ్బులు సంపాదించేందుకు ప్రజలు రకరకాల పనులు చేస్తుంటారు. అయితే అందులో కొందరు మాత్రమే సంపన్నులుగా మారుతారు. ఇలా మారడానికి వారికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయితే మనుషులు ఓకే గానీ జంతువుల కూడా వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నాయని తెలిస్తే షాక్ అవుతారేమో! అవునండి ఇది నిజం. ప్రస్తుతం మనం వందల కోట్ల ఆస్తులు ఉన్న ఓ పెంపుడు పిల్లి గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలోని అత్యంత సంపన్న పెంపుడు జంతువుల జాబితాలో ఒలివియా బెన్సన్ అనే పెంపుడు పిల్లి మూడవ స్థానంలో ఉందట. అంత మొత్తం ఆ పిల్లి ఎలా సంపాదించిందని తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. విపరీతమైన క్రేజ్, ఒక్కో పోస్ట్‌కు లక్షలు ప్రఖ్యాత అమెరికన సింగర్ టేలర్ స్విఫ్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం పాటల పరంగానే కాకుండా ఇటు సోషల్‌మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 240 మిలియన్లు ఉండడమే అందుకు నిదర్శనం. టేలర్ తన ఇన్‌స్టా అకౌంట్లో తన ఫోటోలతో పాటు తరుచు తన పెంపుడు పిల్లి ఒలివియా బెన్సన్కు సంబంధించిన పోస్ట్‌లు పెడుతూ వచ్చేది. దీంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఆ పిల్లి వీడియోను చూడటంతో పాటు లైక్, షేర్ చేయడం చేయడం మొదలుపెట్టారు. ఈ నేఫథ్యంలో దానికి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అలా కాలక్రమేణ ఆ పిల్లి ఫోటోలు, వీడియోలు చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు. అలా దాని ఫోస్ట్లకు వచ్చిన వ్యూస్ బట్టి అది కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. రోలింగ్ స్టోన్స్ నివేదిక ప్రకారం ఆ పిల్లి సంపద అంచనా విలువ $97 మిలియన్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 800 కోట్లు). ఇన్స్టాగ్రామ్ డేటాను ఉపయోగించి ఒలివియా విలువను లెక్కించిన ఆల్ అబౌట్ క్యాట్స్ అనే వెబ్సైట్ ఈ జాబితాను రూపొందించింది. View this post on Instagram A post shared by Taylor Swift (@taylorswift) చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు! -
సంపన్నులకు కలిసిరాని 2022.. బిలియనీర్ క్లబ్ నుంచి 22 అవుట్!
న్యూఢిల్లీ: ఐశ్వర్యవంతులకు ఈ ఏడాది అచ్చిరాలేదు. మార్కెట్ల పతనంతో బిలియనీర్ల స్థానాలు చెల్లా చెదురయ్యాయి. బడా బిలియనీర్లు మరింత బలపడితే.. బిలియనీర్ క్లబ్ (కనీసం బిలియన్ డాలర్లు అంతకుమించి సంపద ఉన్నవారు)లో దిగువన ఉన్నవారు ఏకంగా ఆ హోదానే కోల్పోవాల్సి వచ్చింది. ఒక్క అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీకి 2022ను జాక్‌పాట్ సంవత్సరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే దేశ కుబేరుడిగా ఉన్న ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి, దేశంలోనే అత్యంత ఐశ్వర్యమంతుడిగా మొదటి స్థానానికి చేరుకోవడమే కాదు.. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి ఎగబాకారు. 2021 చివరికి అదానీ నెట్‌వర్త్ (సంపద విలువ) 80 బిలియన్ డాలర్లు ఉండగా, ఏడాది తిరిగేసరికి 70 శాతం పెరిగి 135.7 బిలియన్ డాలర్లకు చేరింది. బ్లూంబర్గ్ గణాంకాల ప్రకారం ఆసియాలోనూ అదానీయే నంబర్ 1గా ఉన్నారు. డాలర్ మారకంలో బిలియనీర్ ప్రమోటర్ల సంఖ్య ఈ ఏడాది 120కి తగ్గింది. 2021 చివరికి వీరి సంఖ్య 142గా ఉంది. అయితే 24 మంది ప్రమోటర్లు బిలియనీర్ క్లబ్లో స్థానం కోల్పోగా.. కొత్తగా ఐఐఎఫ్ఎల్ ప్రమోటర్లు ఇద్దరు ఉమ్మడిగా, క్యాప్రిగ్లోబల్ ప్రమోటర్ ఇందులోకి వచ్చి చేరారు. బిలియనీర్ల ఉమ్మడి సంపద సైతం ఈ ఏడాది కొంత కరిగిపోయింది. 8.8 శాతం క్షీణించి 685 బిలియన్ డాలర్లకు (రూ.56.62 లక్షల కోట్లు) పరిమితమైంది. 2021 చివరికి వీరి ఉమ్మడి సంపద విలువ 751.6 బిలియన్ డాలర్లుగా ఉండడాన్ని గమనించొచ్చు. దేశంలోని టాప్–10 సంపన్న పారిశ్రామికవేత్తల్లో ఈ ఏడాది గౌతమ్ అదానీతోపాటు, సన్ ఫార్మా దిలీప్ సంఘ్వి, భారతీ ఎయిర్టెల్ సునీల్ భారతీ మిట్టల్ మినహా మిగిలిన ఏడుగురి సంపద విలువ క్షీణించింది. ముకేశ్ సంపద 102 బిలియన్ డాలర్లు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్థానచలనం పొందారు. 2021 చివరికి జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, దీన్ని గౌతమ్ అదానీకి కోల్పోయి రెండో స్థానంలోకి వచ్చారు. ముకేశ్ అంబానీ కుటుంబ సంపద విలువ 2.5 శాతం క్షీణించి గతేడాది చివరికి ఉన్న 104.4 బిలియన్ డాలర్ల నుంచి 101.75 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం పెరుగుదల, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ప్రభావాలతో ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లు బలహీన పనితీరు చూపించడం, బిలియనీర్ల సంపద తగ్గడానికి గల కారణాల్లో ప్రధానమైనది. టెలికం రంగంలో చిన్నాచితకా కంపెనీలన్నీ మూతపడిపోవడం, చివరికి వొడాఫోన్ ఐడియా సైతం బక్కచిక్కడం, టారిఫ్‌లను గణనీయంగా పెంచడంతో ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ సంపద వృద్ధి చెందింది. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 తగ్గింపు.. త్వరపడాలి, అప్పటివరకే! -
వామ్మో.. లియోనల్ మెస్సీ ఆస్తుల చిట్టా వింటే ఆశ్చర్యపోవాల్సిందే!
మూడున్నర దశాబ్ధాల అర్జెంటీనా నిరీక్షణ ఫలించింది. ఆదివారం అంత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 4-2 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. జగజ్జేతగా మెస్సీ బృందం నిలిచింది. అలాంటి ఫుట్‌బాల్ మైదానంలో మెస్సీ కొదమ సింహంలా పోటీ పడుతుంటే స్టేడియంలో ప్రేక్షకులే కాదు, ప్రపంచం మొత్తాన్ని ఉగిపోయేలా చేసింది. అలాంటి ఫుట్‌బాల్ లెజెండ్‌లో వే(ఆ)టగాడే కాదు ఓ మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నాడు. ఫోర్బ్స్ కథనం ప్రకారం.. ►మెస్సీ గతేడాది ఆశ్చర్యంగా 75 మిలియన్లు సంపాదించాడు. ఈ సంపాదన భూమ్మిద ఉన్న ఇతర ఆటగాళ్ల కంటే ఎక్కువ ►ఫుట్ బాల్ టీమ్ పారిస్ సెయింట్-జర్మైన్ ఎఫ్‌సీ ఇచ్చే జీతం మాత్రమే సంవత్సరానికి 35 మిలియన్లు. అంటే మెస్సీ వారానికి 738,000 డాలర్లు , రోజుకు 105,000 , గంటకు 8,790 సంపాదిస్తారు. ►గత వేసవిలో అర్జెంటీనా ఫ్రెంచ్ జట్టు కోసం సైన్ చేసిన మెస్సీ ఏకంగా 25 మిలియన్లు సంపాదించారు. రోజర్ ఫెదర్తో సమానంగా ►గతేడాది మెస్సీ ఆఫ్ ఫీల్డ్ సంపాదన 55 మిలియన్లు ఉండగా..టెన్నిస్ ఐకాన్ రోజర్ ఫెదరర్, ఎన్బీఏ సూపర్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ మాత్రమే ఎక్కువ సంపాదించిన వారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ►క్రిప్టోకరెన్సీ ఫ్యాన్ టోకెన్ ప్లాట్‌ఫారమ్ సోషియోస్తో సంవత్సరానికి 20 మిలియన్ల భాగస్వామ్యంతో పాటు, 35 ఏళ్ల ఎండార్స్మెంట్ పోర్ట్‌ఫోలియోలో అడిడాస్, బడ్వైజర్,పెప్సికోతో ఒప్పందాలు ఉన్నాయి. ►గత జూన్‌లో, హార్డ్ రాక్ ఇంటర్నేషనల్ మొట్టమొదటి అథ్లెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా అవతరించాడు. 1 బిలియన్ కంటే ఎక్కువే ఫోర్బ్స్ ప్రకారం, మెస్సీ ఆటగాడిగా, ఇతర బిజినెస్‌లలో రాణిస్తూ 1.15 బిలియన్ల కంటే ఎక్కువ సంపాదించారు. ప్రస్తుతం లెబ్రాన్ జేమ్స్, క్రిస్టియానో రొనాల్డో, టైగర్ వుడ్స్ మాత్రమే సంపాదనలో ముందంజలో ఉన్నారు. పైన పేర్కొన్న వారి కంటే రోజర్ ఫెదరర్, ఫ్లాయిడ్ మేవెదర్ మాత్రమే కెరీర్ సంపాదనలో 1 బిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ సంపాదించారు. కార్లంటే మహా ఇష్టం మెస్సీ సంపాదనలో సగ భాగం కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు మెస్సీ వద్ద 2 మిలియన్ల ధర పలికే పగని జోండా ట్రైకలర్, ఫెరారీ ఎఫ్4 30 స్పైడర్, డాడ్జ్ ఛార్జర్ ఎస్ఆర్టీ8, మసెరటి గ్రాన్ టురిస్మో వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. 2016 అర్జెంటీనాలో 37 మిలియన్లకు 1957 ఫెరారీ 335 స్పోర్ట్ స్పైడర్ స్కాగ్లియెట్టి అనే ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు పుకారు వచ్చింది. అయితే, ఇదే నా కొత్త కారు అంటూ బొమ్మ కారును పట్టుకొని ఆ పుకార్లకు చెక్ పెట్టారు. విలాసవంత మైన భవనాలు మెస్సీ ఆస్తులలో అత్యంత విలాసవంతమైనది బార్సిలోనా శివార్లలో 7 మిలియన్ల భవనం. నో-ఫ్లై జోన్ సబర్బ్‌లో ఉన్న భవనంలో స్విమ్మింగ్ పూల్, ఇండోర్ జిమ్, థియేటర్, స్పా ఉన్నాయి. ఫుట్‌బాల్ పిచ్ కూడా మెస్సీకి ఇంద్ర భవనాన్ని తలపించాలే ఎకో-హౌస్ ఉంది. అర్జెంటీనాలోని తన సొంత పట్టణం రోసారియోలో ఒక భవనం, ఫ్లోరిడాలోని సెయింట్ ఐల్స్ బీచ్‌లోని ఒక విలాసవంతమైన కండోమినియంలు ఉన్నాయి. ఇందుకోసం గతేడాది 7.3 మిలియన్లు చెల్లించాడు. 2017 నుండి మెజెస్టిక్ హోటల్ గ్రూప్ నిర్వహించే ఇబిజా, మజోర్కా, బార్సిలోనాలో రిసార్ట్‌లతో పాటు , ఎంఐఎం పేరుతో ఉన్న హోటల్ చైన్లు సైతం మెస్సీకి చెందినవే. 2021లో మెస్సీ వింటర్ సీజన్లో విడిది కోసం అరన్ వ్యాలీలో పైరినీస్ నడిబొడ్డున రిసార్ట్‌ను ప్రారంభించారు. ఫోర్బ్స్ ప్రకారం..ఫోర్ స్టార్ హోటల్లో 141 గదులు ఉన్నాయి. స్పా, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ సెంటర్, మౌంటెన్ గైడ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. బాల్కనీ పెద్దగా ఉందని మెస్సీ 2017లో 35 మిలియన్లు పెట్టి ఓ భవనాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆ భవనంలో బాల్కనీ పెద్దగా ఉందని.. మొత్తాన్ని కూల్చేయించారు. కారణంగా బాల్కనీలను తీసివేయడానికి, తగ్గించడానికి ఏదైనా ప్రయత్నం చేసినా హోటల్ కూలిపోయే అవకాశం ఉంది. అందుకే ఆ సమస్యకు పరిష్కారం చూపించలేక మొత్తం పడగొట్టాల్సి వచ్చింది 15 మిలియన్ల ప్రైవేట్ జెట్ మెస్సీకి గల్ఫ్‌స్ట్రీమ్ వీ అనే ప్రైవేట్ ఉంది. అందులో రెండు కిచెన్లు, బాత్రూమ్లు ఉన్నాయి. గరిష్టంగా పదహారు మంది ప్రయాణికులు సేద తీరే సౌకర్యాలు ఉన్నాయి. దానంలో కలియుగ కర్ణుడు 2007లో యునిసెఫ్ భాగస్వామ్యంతో లియోనెల్ మెస్సీ ఫౌండేషన్ ప్రారంభమైంది.ఆ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో బలహీనంగా ఉన్న పిల్లలకు సహాయం చేస్తుంది. యునిసెఫ్ ప్రకారం..2017లో మెస్సీ సిరియాలో 1,600 మంది అనాథ పిల్లలకు తరగతి గదులను నిర్మించడంలో ఫౌండేషన్‌కు సహాయం చేయడానికి తన సొంత డబ్బును విరాళంగా ఇచ్చారు. 2019లో కెన్యా పౌరులకు ఆహారం, నీటిని అందించడానికి ఫౌండేషన్ $218,000 విరాళంగా అందించింది. చివరిగా కండోమినియం అంటే? అమ్మకం కోసం ఒక పెద్ద ఆస్తిని ఒకే యూనిట్లుగా విభజించినప్పుడు దానిని కండోమినియం కాంప్లెక్స్‌గా సూచిస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మాయదారి ట్విటర్..మంచులా కరిగిపోతున్న ఎలాన్ మస్క్ సంపద!
44 బిలియన్ డాలర్లతో ట్విటర్ కొనుగోలు, ఆ తరువాత సంస్థలో జరుగుతున్న వరుస పరిణామాలతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద మంచులా కరిగిపోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రోజు ఆయన సంపద నికర విలువ (net worth) 200 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ సంపద ప్రస్తుతం 194.8 బిలియన్ డాలర్లు ఉండగా... మార్కెట్ వ్యాల్యూ 622 బిలియన్ డాలర్లుగా ఉన్న టెస్లా సంస్థలో ఆయన వాటా 15 శాతం ఉంది. అయితే ఇప్పుడు టెస్లాలో ఉన్న మస్క్ వాటా తగ్గిపోతున్నట్లు యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) గణాంకాలు చెబుతున్నాయి. ట్విటర్ కొనుగోలు ఎలాన్ మస్క్‌కి ట్విటర్ అంటే ఇష్టం. నిజానికి ఎలాన్ మస్క్, ట్విటర్ల మధ్య వ్యవహారం మొదట్లో ఒక మూగ ప్రేమ కథలా ఉండేది. అందుకే ఒకానొక సమయంలో ట్విటర్‌కు ఉన్న అసాధారణ అవకాశాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలన్నది నా అభిష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జనవరి నుంచి ట్విటర్లో కొద్దికొద్దిగా షేర్లు కొనుక్కుంటూ వచ్చిన మస్క్ ...ఏప్రిల్ నాటికి 3 బిలియన్ డాలర్ల విలువ చేసే 9 శాతం పైగా వాటాలు దక్కించుకున్నారు. అదే నెలలో ట్విట్టర్‌ని కొనేందుకు బిడ్ వేశాడు. షేరు ఒక్కింటికి 54.20 డాలర్లు ఇచ్చి 44 బిలియన్ డాలర్లకు కంపెనీని కొనేస్తానంటూ ఆఫర్ ఇచ్చారు. ఆ నిర్ణయంతో టెస్లా కంపెనీ దాదాపు సగం మార్కెట్ విలువను కోల్పోయింది. అతని నికర విలువ 70 బిలియన్లకు పడిపోయింది. షేర్ల విక్రయం తాజాగా టెస్లాలో 4 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్‌ను మస్క్ విక్రయించారు. మంగళవారం ఎస్ఈసీ తన ఫైలింగ్‌లో 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన వారం రోజుల తర్వాత 4 బిలియన్ డాలర్ల స్టాక్‌ను అమ్మినట్లు చూపించింది. ట్విటర్ కొనుగోలులో 3.9 బిలియన్ల కంటే ఎక్కువ విలువైన 19 మిలియన్ షేర్లను అమ్మినట్లు స్పష్టం చేసింది. అయితే కొనుగోలు అనంతరం మస్క్ ట్విటర్‌పై దృష్టిసారించడం, టెస్లాను పట్టించుకోకపోవడంతో టెస్లాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఆందోళన గురయ్యారు. దీనికి తోడు ఈవీ మార్కెట్లో టెస్లాకు పోటీగా ఇతర ఆటోమొబైల్ కంపెనీలు ఈవీ కార్లను తయారు చేస్తుండడం వంటి భయాలతో మదుపర్లు టెస్లాలో పెట్టిన పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటున్నారు. వెరసీ మస్క్ సంపద మంచులా కరిపోతుంది కాగా ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఎలాన్ మస్క్ ఉండగా.. రెండో స్థానంలో లగ్జరీ గూడ్స్ కంపెనీ ఎల్వీఎంహెచ్ బెర్నార్డ్ అర్నాల్ట్ ఉన్నారు. ఆర్నాల్డ్ కంటే మస్క్ సంపద 40 బిలియన్ డాలర్లు ఎక్కువ. చదవండి👉 వేలాది మంది ఉద్యోగుల తొలగింపు, ‘యాపిల్ సంస్థను అమ్మేయండి’! -
కంపెనీలను మించిన వెంకన్న సంపద
న్యూఢిల్లీ: వడ్డీ కాసులవాడైన తిరుపతి గోవిందుడి సంపద .. ఇంతింతై .. అన్నట్లుగా ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వ్యాపార దిగ్గజ కంపెనీలను కూడా వెనక్కు నెట్టేస్తోంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే ఈ విషయంలో ఐటీ సేవల దిగ్గజం విప్రో, ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఓఎన్జీసీ, ఐవోసీ మొదలైనవి కూడా వెంకన్న ముందు దిగదుడుపే. టీటీడీ గణాంకాల ప్రకారం ఆయన సంపద విలువ రూ. 2.5 లక్షల కోట్లు. వీటిలో 10.25 టన్నుల బంగారం డిపాజిట్లు, 2.5 టన్నుల బంగారు ఆభరణాలు, రూ. 16,000 కోట్ల డిపాజిట్లు, దేశవ్యాప్తంగా 960 ప్రాపర్టీలు ఉన్నాయి. తిరుమల బాలాజీ సంపద నికర విలువ .. పలు దేశీ బ్లూ చిప్ కంపెనీల వేల్యుయేషన్ (ప్రస్తుత ట్రేడింగ్ ధరల ప్రకారం) కన్నా అధికం. స్టాక్ ఎక్ఛేంజీలో శుక్రవారం నాటి ముగింపు డేటా బట్టి చూస్తే విప్రో మార్కెట్ క్యాప్ రూ. 2.14 లక్షల కోట్లు కాగా అల్ట్రాటెక్ సిమెంట్‌ది రూ. 1.99 లక్షల కోట్లుగా ఉంది. స్విస్ బహుళజాతి దిగ్గజం నెస్లే భారత విభాగం మార్కెట్ విలువ రూ. 1.96 లక్షల కోట్లు. అటు ప్రభుత్వ రంగంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) విలువ కూడా బాలాజీ ట్రస్టు సంపద కన్నా తక్కువే. రెండు డజన్ల కంపెనీలకు మాత్రమే ఇంతకు మించిన మార్కెట్ వేల్యుయేషన్ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ. 17.53 లక్షల కోట్లు), టీసీఎస్ (రూ. 11.76 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ. 8.34 లక్షల కోట్లు), ఐటీసీ (రూ. 4.38 లక్షల కోట్లు) మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,100 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం బ్యాంకుల్లోని నగదు డిపాజిట్లపై రూ. 668 కోట్లు, హుండీ ఆదాయం రూ. 1,000 కోట్ల వరకూ ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. -
ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ గురువారం అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఓపెన్ శకంలో ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడిగా పేరు పొందిన ఫెదరర్ టెన్నిస్‌లో లెక్కలేనన్ని విజయాలు సాధించాడు. 20 గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ అందరికంటే ముందుగా సాధించింది రోజర్ ఫెదరర్రే. తన ఆటతో టెన్నిస్‌కు అందం తెచ్చిన ఫెదరర్.. సంపాదన విషయంలోనూ చాలా ముందుంటాడు. ప్రస్తుత తరంలో టెన్నిస్ దిగ్గజాలుగా పిలవబడుతున్న నాదల్, జొకోవిచ్‌లు వచ్చిన తర్వాత ఫెదరర్ హవా కాస్త తగ్గినప్పటికి.. సంపాదనలో మాత్రం ఫెదరర్ వెనకే ఉండడం విశేషం. 41 ఏళ్ల ఫెదరర్ తన కెరీర్లో ప్రైజ్‌మనీగా 13.1 కోట్ల డాలర్లు(సుమారు రూ.1042 కోట్లు) సంపాదించాడు. అయితే కోర్టు లోపల కంటే వెలేపలే అతని సంపాదన ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. ఎండార్స్మెంట్లు, ఇతర బిజినెస్‌లతో కలిపి ఫెదరర్ ఇప్పటి వరకూ 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.8 వేల కోట్లు)కుపైగా సంపాదించినట్లు ఫోర్బ్స్ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. ప్రతి ఏటా టెన్నిస్ కోర్టు బయట ఫెదరర్ సంపాదన 9 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు ఈ రిపోర్ట్ తెలిపింది. ఫెదరర్ తన కెరీర్లో ఏకంగా 17 ఏళ్ల పాటు అత్యధిక మొత్తం అందుకున్న టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. పన్నులు, ఏజెంట్ల ఫీజులు కలిపితే తన కెరీర్లో ఫెదరర్ మొత్తం సంపాదన 110 కోట్ల డాలర్లు. ఇది టెన్నిస్ కోర్టులో అతని ప్రధాన ప్రత్యర్థులైన నదాల్ (50 కోట్ల డాలర్లు), జోకొవిచ్ (47 కోట్ల డాలర్లు)ల కంటే రెట్టింపు కావడం విశేషం. స్విట్జర్లాండ్‌లోని రోజర్ ఫెదరర్‌కు చెందిన గ్లాస్ హౌస్ ప్రపంచంలో 100 కోట్ల డాలర్ల మైల్స్టోన్ అందుకున్న ఏడో క్రీడాకారుడు రోజర్ ఫెదరర్. జాబితాలో ఫెదరర్ కంటే (ముందు..ఆ తర్వాత) లెబ్రన్ జేమ్స్, ఫ్లాయిడ్ మేవెదర్, లియోనెల్ మెస్సీ, ఫిల్ మికెల్సన్, క్రిస్టియానో రొనాల్డో, టైగర్ వుడ్స్లు తమ కెరీర్లలో 100 కోట్ల డాలర్ల సంపాదన మార్క్‌ను అందుకున్నారు. ఇక 24 ఏళ్ల టెన్నిస్ కెరీర్లో రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, మొత్తంగా 103 సింగిల్స్ టైటిల్స్(ఓపెన్ శకంలో రెండో ఆటగాడు) సాధించాడు. ఖరీదైన రోలెక్స్ వాచ్‌తో ఫెదరర్ చదవండి: రోజర్ ఫెడరర్ వీడ్కోలు.. 'రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ' 'ఇలాంటి రోజు ఎప్పుడు రాకూడదని అనుకున్నా' -
ఈలాన్ మస్క్‌కు టెస్లా షాక్, ఆ క్లబ్‌నుంచి ఔట్..అయినా
టెస్లా సహ వ్యవస్థాపకుడు, సీఈవో ఈలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. ఎలైట్ 200 బిలియన్ డాలర్ల క్లబ్‌లోంచి తాజాగా కిందకి జారుకున్నాడు. మంగళవారం టెస్లా షేర్లు దాదాపు 7 శాతం కుప్పకూలడంతో మస్క్ సంపద కూడా అదే స్థాయిలో నష్టపోయింది. ఈలాన్ మస్క్ నికర విలువ 5.40 శాతం క్షీణించి 192.7 బిలియన్ల డాలర్లు చేరుకుంది. ఈ పరిణామం తరువాత మస్క్ సంపద 2021, ఆగస్టు స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. అయినా మస్క్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండటం విశేషం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 127.80 బిలియన్ల డాలర్ల సంపదతో రెండవ స్థానంలో నిలిచారు. గ్లోబల్ మార్కెట్లో కరెక్షన్తో దిగ్గజ కంపెనీలు నెట్ వాల్యూ బాగా క్షీణించింది. ముఖ్యంగా అమెజాన్ స్టాక్ ఈ ఏడాదిలో 35.4 శాతం నష్టపోగా, టెస్లా షేరు 36.1 క్షీణించింది. మస్క్ విలువ ఇప్పుడు 204 బిలియన్ డాలర్లు కాగా, బెజోస్ నికర విలువ 131 బిలియన్ డాలర్లుగా ఉంది. మార్చి 2022లో ఈలాన్ మస్క్ నికర విలువ 200 బిలియన్ డాలర్ల కిందికిపడిపోయింది. అయితే ఆ తరువాత నష్టాలనుంచి మార్కెట్లు బలంగా పుంజుకోవడంతో మస్క్ నికర విలువ తిరిగి ఎగిసి ఏప్రిల్ మాసంలో రికార్డు స్థాయిలో 288 బిలియన్ డాలర్లకు చేరింది. గ్లోబల్ రిచెస్ట్ మాన్‌గా అవతరించిన తరువాత ట్విటర్లో 9 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించాడు. కానీ ప్రస్తుతం ఈ డీల్ పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. -
రష్మిక మొత్తం ఆస్తి, ఏడాది సంపాదన ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే!
రష్మిక మందన్నా.. నిజానికి కన్నడ నటి. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మిక కిరిక్ పార్టీ చిత్రంతో కన్నడ సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఛలో సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘గీతగోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతో ఒక్కసారిగా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. ఇక అప్పటి నుంచి తగ్గేదే లే అంటూ స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. హిందీలో రెండు సినిమాలు చేస్తున్న రష్మిక ఏకంగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో నటించే చాన్స్ కొట్టేసింది. అలాగే తన క్యూట్ ఎక్స్ప్రెషన్, గ్లామర్‌తో నేషనల్ క్రష్‌గా కూడా గుర్తింపు పొందింది. ఇలా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతున్న ఆమె పుష్ప వంటి పాన్ ఇండియా చిత్రంతో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. పరిశ్రమలో ఆమె సక్సెస్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆమె సంపాదించిన ఆస్తులు, తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో పెరిగింది. దీంతో ఆమె నికర సంపాదన, రెమ్యునరేషన్ వివరాల గురించి నెటిజన్లు, ఫ్యాన్స్ సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ఒక్కో సినిమాకు 4 నుంచి 5 కోట్ల రూపాయలకు వరకు తీసుకుంటుందట. ఇక ఒక్కో ప్రకటనకి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట. అలా ఇప్పటికి వరకు ఆమె సంపాదించిన నికర ఆస్తుల విలువ రూ. 37 కోట్లు. ఇక ఏడాదికి ఆమె సుమారు రూ. 5 మిలియన్లు(అంటే రూ. 21కోట్ల 65 లక్షలు) ఆర్జిస్తోంది. దీనితో పాటు ఇటీవల ఆమె ఖరీదైన రేంజ్ రోవర్ బ్లాక్ లగ్జరీ కారు కొన్న సంగతి తెలిసిందే. దీని విలువ కోటికిపైనే ఉంటుందని టాక్. కాగా 1996 ఏప్రిల్‌లో పుట్టిన రష్మిక వయసు ప్రస్తుతం 25 ఏళ్లు. అతి తక్కువ కాలంలోనే నటిగా ఆమె ఇంత సంపాదించిందా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం రష్మిక పుష్ప పార్ట్ 2 షూటింగ్‌తో బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ మార్చి 4న విడుదలకు సిద్ధమవుతోంది. -
సంపద పెరిగింది.. సంతోషం తగ్గింది!
ముంబై: దేశీయంగా డాలర్ మిలియనీర్ల (రూ. 7 కోట్ల పైగా వ్యక్తిగత సంపద ఉన్న వారు) సంఖ్య 2021లో 4.58 లక్షల కుటుంబాల స్థాయికి చేరింది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. హురున్ రిపోర్ట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2026 నాటికి భారత్‌లో డాలర్ మిలియనీర్ల సంఖ్య 30 శాతం పెరిగి 6 లక్షల కుటుంబాల స్థాయికి చేరనుంది. ముంబైలో అత్యధికంగా 20,300 కుటుంబాలు, ఢిల్లీలో 17,400, కోల్‌కతాలో 10,500 కుటుంబాలు డాలర్ మిలియనీర్ల కేటగిరీలో ఉన్నాయి. మరోవైపు, ఇటు వ్యక్తిగత అటు వృత్తిగత జీవితాల్లో సంతోషంగా ఉన్న వారి సంఖ్య మాత్రం 72 శాతం నుంచి 66 శాతానికి తగ్గింది. ఈ అంశానికి సంబంధించి హురున్ నిర్వహించిన సర్వేలో 350 మంది డాలర్ మిలియనీర్లు పాల్గొన్నారు. ‘భారత మార్కెట్లో అడుగు పెట్టడానికి లేదా ఇప్పటికే ఉన్న తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడానికి లగ్జరీ బ్రాండ్లు, సర్వీస్ ప్రొవైడర్లకు వచ్చే దశాబ్ద కాలంలో ఎన్నో అర్థవంతమైన అవకాశాలు లభించగలవు‘ అని హురున్ ఇండియా ఎండీ, చీఫ్ రిసర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ చెప్పారు. 130 కోట్ల పైగా జనాభా గల దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో కుబేరులపై హురున్ నివేదికలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఇటీవలి నివేదిక ప్రకారం భారత్‌లోని టాప్ 100 మంది సంపన్నుల సంపద ఏకంగా 775 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021లో ప్రపంచం మొత్తం మీద కడు పేదరికంలోకి జారిపోయే వారి సంఖ్యలో దాదాపు సగభాగం (4.6 కోట్ల మంది) భారత్‌లోనే ఉంటారని ఆక్స్‌ఫామ్ అంచనా వేసింది. సర్వేలోని ఇతర విశేషాలు.. ► పన్నులు చెల్లించడమనేది తమ సామాజిక బాధ్యతకు నిదర్శనంగా భావించే వారి సంఖ్య.. సర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతుకన్నా తక్కువే ఉంది. ► సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అభిప్రాయపడిన వారి సంఖ్య కేవలం 19 శాతమే. ► మూడింట రెండొంతుల మంది తమ సంతానాన్ని ఉన్నత విద్య కోసం విదేశాలు పంపించేందుకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఫేవరెట్ గమ్యంగా అమెరికా ఉండగా, బ్రిటన్, న్యూజిలాండ్, జర్మనీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► ఇక వినియోగంపరమైన అంశాల విషయానికొస్తే.. నాలుగో వంతు మంది తమ కార్లను ప్రతి మూడేళ్లకోసారి మార్చేస్తున్నారు. చాలా మందికి మెర్సిడెస్ బెంజ్ కార్లు ఫేవరెట్‌గా ఉంటున్నాయి. ఇంకా మిలియనీర్లకు అత్యంత ఇష్టమైన హాబీల్లో.. వాచీల కలెక్షన్ కూడా ఉంది. సర్వేలో పాల్గొన్న మూడింట రెండొంతుల మంది.. తమ దగ్గర కనీసం నాలుగు వాచీలైనా ఉన్నట్లుగా తెలిపారు. మళ్లీ వీటిలో రోలెక్స్ అత్యంత ఇష్టమైన బ్రాండ్‌గా ఉంది. ► ఆతిథ్యానికి సంబంధించి అత్యధిక శాతం మంది ఇష్టపడే హోటల్‌గా ఇండియన్ హోటల్స్‌కి చెందిన తాజ్, ఫేవరెట్ ఆభరణాల రిటైలర్‌గా తనిష్క్ (రెండూ టాటా గ్రూప్‌నకు చెందివే) అగ్రస్థానంలో ఉన్నాయి. లగ్జరీ ఉత్పత్తుల బ్రాండ్ లూయి విటన్, ప్రైవేట్ జెట్ బ్రాండ్ గల్ఫ్‌స్ట్రీమ్.. అత్యధిక శాతం మంది డాలర్ మిలియనీర్లకు ఫేవరెట్‌గా ఉన్నాయి. ► చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగిస్తున్న డాలర్ మిలియనీర్ల సంఖ్య 2021లో రెట్టింపై 36 శాతానికి చేరింది. -
రూ. 200 కోట్లకు పైగా లతా ఆస్తులు ఎవరికి? వీలునామాలో ఏం ఉంది..
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లతాజీ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నివేల పాటలతో సంగీత ప్రియులను మైమరిపించిన ఆమె 92 ఏళ్ల వయసులో కన్నుమూసింది. అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఐదేళ్ల వయసు నుంచి పాడటం ప్రారంభించిన లతా మంగేష్కర్ ఇండియన్ నైటింగల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, మరాఠీ, తెలుగు సహా వివిధ భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడిన ఈ ఇండియన్ నైటింగల్ తన గొంతుతో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నారు. అలా చివరి వరకు స్టార్ గాయనిగా వెలుగువెలిగిన లతాజీ రెమ్యునరేషన్ కూడా అత్యధికంగానే తీసుకునేవారు. పెళ్లి కూడా చేసుకోని లతా మంగేష్కర్ ఆస్తుల చిట్టా చాలా పెద్దది. ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 200 కోట్లపైనే. సాధారణంగా మరణాంతరం వారి ఆస్తులు పిల్లలకు లేదా భర్తకు చెందుతాయి. కానీ చివరి వరకు బ్రహ్మచారినిగా ఉన్న లతాజీ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనేది ప్రశ్నగా మారింది. ఆమె చెల్లెల్లు ఆశా భోంస్లే, మీన ఖడికర్, ఉషా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్లకు దగ్గుతాయని అంటున్నారు. అలాగే తన తండ్రి పేరుపై కట్టించిన ట్రస్ట్‌కు కూడా లతా ఆస్తులు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె చెల్లెల్లు, సోదరుడు గాయకులుగా మంచి పోజిషన్లో ఉన్నారు. ఆస్తులు కూడా బాగానే సంపాదించుకున్నారు. వారంత ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. దీంతో లతా ఆస్తులు ట్రస్ట్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. చిన్నప్పటి నుంచి కూడా చదువు మానేసి మరీ తన జీవితం అంతా కుటుంబాన్ని పోషించడం కోసం కష్టపడింది. మరి ఆమె మరణాంతరం ఆస్తులు ఎవరి పేరుపై ఆమె రాశారనేది సస్పెన్స్‌లో ఉండిపోయాయి. మరి దీనిపై ఆమె లాయరు ఎలాంటి ప్రకటన ఇవ్వనున్నాడనేది కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా ఓ మీడియా రిపోర్టు ప్రకారం.. లతా మంగేష్కర్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు దాదాపు 200 కోట్లకు పైనే ఉంటాయని సమాచారం. ఆమె చివరి వరకు ప్రభు కుంజ్ అనే నివాసంలో ఉన్నారు. అంతేకాక ముంబై పెద్దర్ రోడ్లో మరో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఆమెకి పాటల ద్వారానే కాక రెంట్స్ రూపంలో కూడా సంపాదన వస్తుంది. ఆమె పాడిన పాటలకు రాయల్టీ ద్వారా సంవత్సరానికి దాదాపు 5 కోట్ల పైగానే ఆదాయం వస్తోందని తెలుస్తుంది. -
లతా మంగేష్కర్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లు? తొలి రెమ్యునరేషన్ ఎంతంటే..
Lata Mangeshkar Total Net Worth: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లతాజీ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నివేల పాటలతో సంగీత ప్రియులను మైమరిపించిన ఆమె 92ఏళ్ల వయసులో కన్నుమూసింది. అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఐదేళ్ల ప్రాయంలోనే గాయనిగా ప్రస్థానం ప్రారంభించిన లతా మంగేష్కర్ అతి తక్కువ కాలంలోనే విశేష గుర్తింపు సంపాదించుకున్నారు. హిందీ, మరాఠీ, తెలుగు సహా వివిధ భాషల్లో సుమారు 50వేల పైచిలుకు పైగా పాటలు పాడి శ్రోతలను విశేషంగా అలరించారు. అలా సుధీర్ఘమైన కెరీర్లో ఎన్నో వేల పాటలు పాడిన లతాజీ రెమ్యునరేషన్ కూడా అత్యధికంగానే తీసుకునేవారు. 1950ల కాలంలో ఒక్కో పాటకు సుమారు 500రూపాయల పారితోషికాన్ని అందుకునేవారట. అప్పట్లో ఆశా భోస్లే సహా పేరున్న సింగర్స్‌కి సైతం 150 రూపాయలు ఇచ్చేవారట. కానీ ఆ సమయంలో కూడా లతాజీకి అందరికంటే అత్యధికంటే రెమ్యునరేషన్ ఇచ్చేవారని స్వయంగా ఆశా భోస్లే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొదట్లో 25 రూపాయలతో ప్రారంభమైన లతా జీ సంపాదన. ఇప్పుడు వంద కోట్లకు పైగా చేరుకుంది. ఆమెకు ముంబై సహా పలు కొన్ని నగరాల్లో విలసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి. అలా చనిపోయే నాటికి లతా మంగేష్కర్ ఆస్తుల విలువ సుమారు రూ. 200 కోట్లకు పైగానే ఉందని సమాచారం. -
గుండు బాస్ ఖాతాలోకి లక్షా నలభై వేల కోట్లు!
ఆయన తల్చుకుంటే.. బోడిగుండుపైన జుట్టు మొలిపించుకోవడం ఎంత సేపు? కానీ, ఆయనకది ఇష్టం లేదు. ఎందుకంటే.. సక్సెస్ అనేది లుక్కులో కాదు.. లక్కులో, హార్డ్ వర్క్‌లో ఉందని నమ్ముతున్నాడాయన. అందుకే గుండ్ బాస్‌గా పాపులర్ అయ్యాడు. ఆయనే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. జెఫ్ బెజోస్(58).. అమెజాన్ అనే ఈ-కామర్స్ కంపెనీతో సంచలనాలకు నెలవయ్యాడు. అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి పక్కకు జరిగాక.. సొంత స్పేస్ కంపెనీ బ్లూఆరిజిన్ మీదే ఆయన ఫోకస్ ఉంటోంది. అయితే గత కొంతకాలంగా ఆయనకు కలిసి రావడం లేదు. పెద్దగా లాభాలు రాకపోవడంతో.. ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయారు ఆయన(ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం). ఈ తరుణంలో తాజా పరిణామాలు బెజోస్‌కి బాగా కలిసొచ్చాయి. అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ అమెజాన్ ఆమధ్య ఈవీ కంపెనీ రివియన్‌లో పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు ప్రైమ్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో షేర్ల ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. 15 శాతం పెరగ్గా.. అక్టోబర్ 2009 నుంచి ఇదే అధికం కావడం గమనార్హం. మరోవైపు అమెజాన్ కేవలం అడ్వర్టైజింగ్ బిజినెస్‌ల ద్వారా 31 బిలియన్ డాలర్లు సంపాదించుకోవడం గమనార్హం. ఈ దెబ్బతో బెజోస్ వ్యక్తిగత సంపద 20 బిలియన్ డాలర్లకు(మన కరెన్సీలో లక్షా నలభై వేల కోట్ల రూ.) పెరిగింది. ప్రస్తుతం ఈయన మొత్తం సంపద విలువ.. 164.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఒకవైపు ఫేస్బుక్ యూజర్ల ఎఫెక్ట్‌తో జుకర్‌బర్గ్ ఒక్కరోజులోనే 2.2 లక్షల కోట్ల రూపాయలు పొగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎఫెక్ట్‌తో రియల్ టైం బిలియనీర్ల జాబితాలో దిగజారిపోగా.. భారతీయ బిజినెస్ టైకూన్స్ ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీలు జుకర్‌బర్గ్ కంటే పైస్థానాల్లోకి ఎగబాకడం తెలిసిందే. చదవండి: అపర కుబేరుడి పెద్ద మనసు.. భారీగా సొమ్ము దానం! -
కొత్త ఏడాదిలో ఎలన్ మస్క్ జోరు.. గంటకు వేలకోట్ల సంపాదన!
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కొత్త ఏడాది 2022లో తన జోరును కొనసాగిస్తున్నారు. 2021లో టెస్లా సంస్థ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడైనట్లు బ్లూంబెర్గ్ తెలిపింది. ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో 2021లో సంవత్సరం 87శాతం వృద్దితో మొత్తం టెస్లా 936,000 కార్ల అమ్మకాలు జరిపింది. బ్లూమ్‌బెర్గ్ సర్వే చేసిన 13 మంది అనలిస్ట్‌లు క్యూ4 లో టెస్లా సంస్థ సగటున 263,000 వాహనాలను డెలివరీ చేసినట్లు అంచనా వేశారు. టెస్లా అమ్మకాలు భారీగా పెరగడంతో కంపెనీ సంపద కూడా అదే స్థాయిలో పెరిగింది. నాల్గవ త్రైమాసిక ఫలితాలు వచ్చిన తరువాత టెస్లా షేర్లు సోమవారం 13.5% పెరిగి $1,199.78కు చేరుకున్నాయి. దీంతో ఎలోన్ మస్క్ సంపద కూడా భారీగా పెరిగింది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. మస్క్ సంపద సోమవారం 33.8 బిలియన్ డాలర్లు పెరిగి 304.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే, గంటకు 1.4 బిలియన్ డాలర్లకు పైగా సంపాదన పెరిగింది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో రెండో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ సంపద 196 బిలియన్ డాలర్లుగా ఉంది. నవంబర్, డిసెంబర్ ప్రారంభంలో తగ్గిన కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ కంటే గత నెలలో కంపెనీ విలువ $1 ట్రిలియన్పెరిగింది. టెస్లాలో సుమారు 18% కలిగి ఉన్న మస్క్, సంస్థలో తన వాటాలో 10 శాతం అమ్మేస్తాను అని చెప్పినప్పుడు షేర్లు భారీగా కుప్పకూలాయి. మస్క్ నవంబర్ నుంచి ఇప్పటివరకు టెస్లాలోని 10 బిలియన్ డాలర్లు విలువైన వాటాలను విక్రయించాడు. (చదవండి: టెస్లా రికార్డులు, 3నెలల్లో 3లక్షలకు పైగా కార్ల అమ్మకాలు!) -
నిద్రపోతున్నా సరే అతడి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది
గాంధీ అనే యువకుడు (చిరంజీవి) ఓ నిరుద్యోగి. ఒక రోజు పేపర్లో ఉద్యోగ ప్రకటన చూసి ఇంటర్వ్యూకు వెళ్తాడు. అక్కడ యజమాని రామ్మోహన్ రావు (రావు గోపాలరావు) డబ్బు అహంకారంతో అతడిని అవమానిస్తాడు. దాంతో చిరంజీవి ఓ ఛాలెంజ్ చేస్తాడు. అది ఏంటంటే 'ఐదు సంవత్సరాలలో 50 లక్షల రూపాయలు సంపాదించి చూపిస్తానని ఆ తరువాత చట్టబద్దంగా 50 లక్షల రూపాయలు సంపాదించి చూపెడతాడు. ఓ మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపిస్తాడు. ఆ ఛాలెంజ్ నిలుపుకునే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు చిరంజీవి. ప్రతి నాయకుడి పాత్రలో రావు గోపాలరావు నటన మరచిపోలేం. సినిమాలోలా ఛాలెంజ్ లు, గట్రా కాకుండా చట్టబద్దంగా డబ్బులు సంపాదించవచ్చా'అంటే అవుననే అంటున్నాడు 27ఏళ్ల యువకుడు. అలా అనడమే కాదు. నిరూపిస్తున్నాడు కూడా. దిగ్గజ సంస్థల సీఈఓలకు వచ్చే వేతనాలకు సరిసమానంగా అర్జిస్తున్నాడు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగంతో పాటు ప్రత్యామ్నాయంగా డబ్బులు సంపాదించడం చాలా అవసరం. అందుకే టెక్నాలజీని ఉపయోగించి యూట్యూబ్ ద్వారా డబ్బు ఈజీగా సంపాదించవచ్చని నిరూపిస్తున్నాడు. అంతేందుకు తాను నిద్రపోతున్నా తన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుందని చెబుతున్నాడు. అయితే ఆ బ్యాంక్ లెక్కలతో పాటు ఈ 27 ఏళ్ల యువకుడి యూట్యూబ్ కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం. పదండి..! ట్రెడీషనల్ జాబ్స్‌ను సెలక్ట్ చేసుకోవడం, రిటైర్ అయ్యేదాకా అదే జాబ్‌లో కొనసాగే రోజులు పోయాయి. కంటెంట్ ఉంటే చాలు కటౌట్‌తో పనిలేకుండా యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రముఖ టెక్ కంపెనీల సీఈఓ'ల కంటే ఎక్కువగానే డబ్బులు సంపాదిస్తున్నారు. అంతేకాదు కోట్లాది మంది అభిమానులతో ఆన్లైన్ స్టార్స్‌గా కీర్తిప్రతిష్టలు సంపాదిస్తున్నారు. అలాంటి కోవకే చెందుతాడు 27 అమిత్ భదనా. ఇతనో యూట్యూబ్ క్రియేటర్. ఒక్క వీడియోతో లక్షలు సంపాదిస్తాడు. అతని ఆస్తులు కోట్లలో ఉన్నాయని యూట్యూబ్ లెక్కలు చెబుతున్నాయి. అమిత్ భదానా ఎవరు? అమిత్ భదానా 27 ఏళ్ల యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. సౌత్ ఢిల్లీకి చెందిన జోహ్రీపూర్ నివాసి. పాఠశాల విద్యను యమునా బీహార్ పాఠశాలలో, న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. ప్రస్తుతం అమిత్ 'అమిత్ భదానా' అనే యూట్యూబ్ ఛానెల్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్‌ను అప్లోడ్ చేస్తున్నాడు. అలా అప్లోడ్ చేసిన వీడియోలకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. వాటికి వచ్చే వ్యూస్, డిస్ప్లే అయ్యే యాడ్స్ కారణంగా భారీ మొత్తంలో డబ్బుల్ని సంపాదిస్తున్నాడు. 2017లో ప్రారంభం అమిత్ భదానా తన పేరుతోనే యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించాడు. అక్టోబర్ 24, 2012న ఛానెల్‌ని ప్రారంభించినా 2017వరకు ఎలాంటి వీడియోలు పెట్టలేదు. కానీ 'ఎగ్జామ్ బీ లైక్ బోర్డ్ ప్రిపరేషన్ బీ లైక్' పేరుతో తొలి వీడియోను 2017లో అప్లోడ్ చేశాడు. అలా ప్రారంభమైన ఛానల్‌కు ఇప్పుడు 23.5 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అమిత్ భదానా సంపాదన మీడియా నివేదికల ప్రకారం, అమిత్ భదానా తన యూట్యూబ్‌లో పోస్ట్ చేసే ప్రతి వీడియోకి రూ. 10 లక్షలు సంపాదిస్తాడు. అమిత్ తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా సంపాదిస్తున్నాడు. అమిత్ భదానా నికర ఆస్తి ఒక్కో వీడియోకి రూ.10 లక్షలకు పైగా సంపాదిస్తున్న అమిత్ భదానా నికర ఆస్తి కాకుండా, మొత్తం నికర ఆస్తి దాదాపు రూ. 52 కోట్లుగా ఉంది. చదవండి: ఇదేం యాపారం సామి..! జీన్స్ కొంటే ఫోన్ ఫ్రీ..టెక్ దిగ్గజం కొత్త ఐడియా -
కమల్ హాసన్‌కు ఎన్నికోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?
కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన నటనతో సినీ అభిమానులు మనసు దోచుకున్న గొప్ప వ్యక్తి ఆయన. ఆయన్ని పొగడని విమర్శకుడు లేడు. ఆయన పొందని ప్రశంస లేదు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించి.. ఈ ఏడాది జరిగిన తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. నేడు(నవంబర్ 7)కమల్ హాసన్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలను తెలుసుకుందాం. (చదవండి: కొత్తదనం కోసం తాపత్రయపడే నటతపస్వి.. కమల్ హాసన్) హీరోగా వందలాది చిత్రాల్లో నటించిన కమల్ హాసన్.. భారీగానే ఆస్తులను కూడబెట్టాడు. ఆయనకు 176 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కమల్ పోటీ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు నామినేషన్ వేయడానికి వచ్చినప్పడు తనకు మొత్తం రూ.176.93 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నాడు. అందులో స్థిరాస్తుల విలువ రూ.131.84కోట్లు కాగా, చరాస్తుల విలువ రూ.45.09కోట్లు ఉన్నట్లు తెలిపాడు. లండన్‌లో రూ.2.50 కోట్లు విలువ చేసే ఇల్లు.. రూ.2.7 కోట్ల లగ్జరీ కారు.. రూ. కోటి విలువైన బీఎండబ్యూ కారు ఉన్నట్టు కమల్ హాసన్ తెలిపారు. అంతేకాదు తనకు రూ.49.5 కోట్ల అప్పు ఉన్నట్లు వెల్లడించారు. ఇక చదువు విషయానికొస్తే.. తను కేవలం 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నట్లు అఫిడవిట్లో వెల్లడించాడు. -
రష్మిక ఆస్తుల లెక్క తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
Rashmika Mandanna Income: స్వీట్.. క్యూట్.. బ్యూటిఫుల్ హీరోయిన్ను చూపించండయ్యా అనగానే చాలామంది రష్మిక మందన్నా వైపు వేలు చూపిస్తారు. ఆమె అందాన్ని చూసి కుర్రకారు సైతం అబ్బబ్బా.. అమ్మాయెంత ముద్దుగున్నాదే... అంటూ సిగ్గుపడిపోతారు. ఒక్క తెలుగు ప్రేక్షకులనే కాదు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తూ అంతటా ప్రేక్షకులను బుట్టలో వేసుకుంటోందీ బ్యూటీ. తాజాగా ఈ హీరోయిన్ ఆస్తుల గురించి నెట్టింట ఓ కథనం చక్కర్లు కొడుతోంది. రష్మిక తన లైఫ్‌ను యువరాణిలా ఎంజాయ్ చేసేందుకు ఏమాత్రం వెనుకాడదట. తన అవసరాల కోసం ఎంతైనా ఖర్చు పెడుతుందట. ఆమెకు కార్లంటే కూడా బాగానే మోజున్నట్లు తెలుస్తోంది. రష్మిక గ్యారేజీలో ఆడి క్యూ 3, మెర్సిడిస్ బెంజ్ సీ క్లాస్, రేంజ్ రోవర్ ఎస్యూవీ, ఇన్నోవా క్రిస్టా, హ్యుండాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. తన ఇష్టాన్ని బట్టి ఎంచక్కా పండక్కో కారులో బయట షికారుకు వెళుతుందన్నమాట! ఇక బాలీవుడ్ మీద అలా ఫోకస్ పెట్టిందో లేదో అప్పుడే ముంబైలో సొంతంగా ఇల్లు కూడా కొనుక్కుంది. ఇప్పటికే బెంగళూరులోనూ ఓ పెద్ద బంగ్లా ఉండగా రూ.6-8 కోట్లు విలువ చేసే సొంత విల్లా సైతం ఉంది. రష్మికకు హ్యాండ్ బ్యాగ్స్ అంటేమక్కువ ఎక్కువ. వీటి కోసం ఆమె లక్షల్లోనే ఖర్చుపెడుతుంది. తన కాస్ట్యూమ్స్ కోసం కూడా బాగానే ఖర్చు చేస్తుందట. ప్రస్తుతం బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటిస్తున్న గుడ్‌బై సినిమా ఇంకా రిలీజవకముందే హిందీలో బోలెడు ఆఫర్లు వస్తున్నాయట. అక్కడి నిర్మాతలు రష్మిక కోసం ఒక్క సినిమాకే రూ.4-5 కోట్లు ఇవ్వడానికి కూడా సై అంటున్నట్లు సమాచారం. వాణిజ్య ప్రకటనల కోసం రూ.15 నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తోంది. నికరంగా ఆమె ఆస్తి రూ.35 - 40 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మనం ఊహించినదానికన్నా ఎక్కువ ఆస్తి ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు అభిమానులు. మొత్తానికి తక్కువ కాలంలోనే కోట్లు వెనకేసుకుంటూ లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను అనుభవిస్తోందీ హీరోయిన్! -
లక్ష్మీ విలాస్ షేరు పతనానికి కారణం?
ముంబై, సాక్షి: సుమారు మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రయివేట్ రంగ సంస్థ లక్ష్మీ విలాస్ బ్యాంకు(ఎల్వీబీ).. సింగపూర్ ప్రభుత్వ అనుబంధ సంస్థ డీబీఎస్ బ్యాంకులో విలీనమయ్యే అవకాశముంది. ఇందుకు వీలుగా ముసాయిదా ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మంగళవారం ప్రకటించింది. వెరసి ఆర్థికంగా పరిపుష్టమైన డీబీఎస్ బ్యాంకు ద్వారా ఎల్వీబీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశీయంగా కార్యకలాపాలు విస్తరించిన డీబీఎస్ బ్యాంకు ఇందుకు ఆసక్తిని వ్యక్తం చేయడంతోపాటు.. అవరసమైతే ఎల్వీబీని పటిష్టం చేసేందుకు అదనపు నిధులను వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎల్వీబీ ఖాతాదారులు, ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వాటాదారులకు నిల్ సాధారణంగా బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ ఆర్బీఐ నిబంధనల కారణంగా ఖాతాదారులకు పెద్దగా సమస్యలు ఎదురుకావని బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. అయితే బ్యాంకు షేర్లను కొనుగోలుచేసిన వాటాదారులపై ప్రభావం ఉంటుందని పేర్కొన్నాయి. సాధారణంగా బిజినెస్‌లు వృద్ధిలో ఉన్న సంస్థల షేర్లు లాభపడినట్లే.. నష్టాల బాట పట్టిన కౌంటర్లు పతనమవుతుంటాయని మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఇక లక్ష్మీ విలాస్ బ్యాంకు నెట్‌వర్త్ మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో వాటాదారులకు నష్టం వాటిల్లడం సహజమేనని వివరించారు. సెప్టెంబర్‌కల్లా బ్యాంకు కనీస పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) -2.85 శాతానికి చేరగా.. మార్చి నుంచి టైర్-1 క్యాపిటల్ ప్రతికూలంగా నమోదవుతోంది. ప్రస్తుతం -4.85 శాతానికి జారింది. సెప్టంబర్తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు రూ. 397 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఈ నేపథ్యంలో షేరు తాజాగా 20 శాతం కుప్పకూలి రూ. 12.5కు చేరింది. ఈ షేరు 2017 జూన్‌లో రూ. 187 స్థాయిలో ట్రేడ్‌కావడం ప్రస్తావించదగ్గ విషయం! వాటాదారుల జాబితా లక్ష్మీవిలాస్ బ్యాంకులో ఎన్బీఎఫ్సీ.. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 4.99 శాతం వాటాను కలిగి ఉంది. గతంలో ఎల్వీబీ విలీనానికి ఐబీ హౌసింగ్ ప్రయత్నించి విఫలమైన విషయం విదితమే. కాగా.. ఎల్‌వీబీలో శ్రేఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్‌కు 3.44 శాతం, కాప్రి గ్రూప్ హోల్డింగ్స్‌కు 3.82 శాతం వాటా, ఎల్ఐసీకి 1.6 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఇదేవిధంగా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు 1.83 శాతం, ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్‌కు 2.73 శాతం చొప్పున వాటా ఉంది. ప్రమోటర్ల వాటా 6.8 శాతానికి పరిమితమైనట్లు తెలుస్తోంది. -
అమెజాన్.. జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డ్
గ్లోబల్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఇప్పటికే ప్రపంచ కుబేరుల్లో తొలి స్థానంలో నిలుస్తున్న బెజోస్ వ్యక్తిగత సంపద బుధవారానికల్లా 200 బిలియన్ డాలర్లను దాటింది. తద్వారా తొలిసారి 200 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదను సాధించిన రికార్డును బెజోస్ సొంతం చేసుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ద్వితీయ ర్యాంకులో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సంపద 116.1 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా.. బెజోస్ సంపద 204.6 బిలియన్ డాలర్లకు చేరింది. బుధవారం అమెజాన్ షేరు దాదాపు 3 శాతం జంప్‌చేసి రూ. 3442 డాలర్ల వద్ద ముగిసింది. కాగా.. కోవిడ్-19లోనూ అమెజాన్ షేరు 2020లో ఇప్పటివరకూ ఏకంగా 80 శాతం దూసుకెళ్లడం విశేషం! దీంతో అమెజాన్‌లో 11 శాతం వాటా కలిగిన కంపెనీ ప్రమోటర్ జెఫ్ బెజోస్ తాజా ఫీట్‌ను సాధించగలిగారు. డాలరుతో రూపాయి మారకపు విలువను 74గా పరిగణిస్తే.. బెజోస్ సంపద రూ. 15 లక్షల కోట్లకుపైమాటే! ప్రస్థానమిలా.. సియాటెల్‌లో ఒక చిన్న గ్యారేజీలో పుస్తకాలను ఆన్లైన్లో విక్రయించేందుకు ప్రారంభమైన ఈకామర్స్ కంపెనీ అమెజాన్ తదుపరి పలు విభాగాలలో వివిధ రకాల ప్రొడక్టులకూ విస్తరించింది. వెరసి ప్రస్తుతం రిటైల్ స్టోర్ల దిగ్గజం వాల్‌మార్ట్, తదితరాలకు ధీటైన పోటీనిస్తోంది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు అమెరికన్ దినపత్రిక వాషింగ్టన్ పోస్ట్, వైమానిక కంపెనీ బ్లూ ఒరిజిన్ తదితరాలలో పెట్టుబడులున్నాయి. కాగా.. ట్రేడింగ్ ప్రణాళికలో భాగంగా ఈ ఆగస్ట్‌లో బెజోస్ 3.1 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. అయినప్పటికీ 200 బిలియన్ డాలర్ల సంపదను అందుకోగలగడం విశేషం! వ్యక్తిగత విషయానికివస్తే.. 2019లో 38 బిలియన్ డాలర్లతో భార్య మెకింజీతో చేసుకున్న విడాకుల సెటిల్మెంట్ అత్యంత ఖరీదైనదిగా నిలిచిన విషయం విదితమే. -
తొలిసారి 100 బిలియన్ డాలర్లకు సంపద
షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ రీల్స్(Reels)ను యూఎస్ మార్కెట్లో ప్రవేశపెట్టడంతో గురువారం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ షేరు జోరందుకుంది. ఏకంగా 6.5 శాతం జంప్‌చేసింది. 265 డాలర్ల ఎగువన ముగిసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. దీంతో ఫేస్బుక్లో 13 శాతం వాటా కలిగిన మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగత సంపద తొలిసారి 100 బిలియన్ డాలర్లను తాకింది. వెరసి 100 బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్ బెజోస్(అమెజాన్), బిల్‌గేట్స్(మైక్రోసాఫ్ట్) సరసన నిలిచారు. టిక్‌టాక్‌కు చెక్ ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన చైనీస్ యాప్ టిక్‌టాక్‌కు చెక్ పెడుతూ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ రీల్స్‌ను ఫేస్బుక్ బుధవారం యూఎస్ మార్కెట్లో విడుదల చేసింది. దీంతో గురువారం షేరు దూసుకెళ్లింది. కాగా.. ఈ ఏడాది అమెరికా స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్న సంగతి తెలిసిందే. గురువారం యూఎస్ మార్కెట్లలో తొలిసారి నాస్డాక్ 11,000 పాయింట్ల మార్క్‌ను దాటి ముగిసింది. ఇందుకు టెక్ దిగ్గజాలు దన్నుగా నిలుస్తున్నాయి. జోరు తీరిలా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, ఐఫోన్ల దిగ్గజం యాపిల్, ఆటో టెక్నాలజీ కంపెనీ టెస్లా తదితరాలు ఈ ఏడాది(2020) అనూహ్య ర్యాలీ చేస్తున్న విషయం విదితమే. దీంతో 2020లో ఇప్పటివరకూ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద 75 బిలియన్ డాలర్లకుపైగా ఎగసింది. ఈ బాటలో జుకర్‌బర్గ్ సంపద సైతం 22 బిలియన్ డాలర్లమేర బలపడింది. తద్వారా ఎలైట్ క్లబ్లో జుకర్‌బర్గ్ చోటు సాధించారు. కాగా.. ఇదే విధంగా దేశీ పారిశ్రామిక దిగ్గజం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద సైతం 22 బిలియన్ డాలర్లమేర పుంజుకోవడం గమనార్హం! దీంతో ముకేశ్ సంపద 80 బిలియన్ డాలర్లను అధిగమించింది. ఇందుకు ప్రధానంగా డిజిటల్, టెలికం విభాగం రిలయన్స్ జియోలోకి విదేశీ పెట్టుబడులు భారీగా ప్రవహించడం కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
సోనూసూద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?
వేసేది విలన్ పాత్రలు. బయట మాత్రం ఆయన రియల్ హీరో. కరోనా కారణంగా లాక్డౌన్ విధించినప్పుడు ఎక్కడివారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లు, డబ్బులు, తినడానికి తిండి అన్ని ఉన్నవారి పరిస్థితి ఆ టైంలో బాగానే ఉంది. కానీ పొట్టకూటి కోసం అయిన వారందరిని వదిలి ఎవరూ తెలియని చోటుకు వచ్చి బతికే వలస కూలీల పరిస్థితే అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం అందించే సాయం అందకా, రైళ్లు,బస్సులు లేక సొంత గూటికి చేరలేక, ఉన్నచోట తినడానికి తిండి, ఉండటానికి నీడలేక వారు పడిన బాధలు వర్ణనాతీతం. అలాంటి సమయంలో వారిని ఆదుకోవడానికి ఆ విలన్ హీరోలా ముందుకు వచ్చాడు. సినిమాలో హీరోలం అని చెప్పుకునే చాలా మంది చెయ్యలేని పనిని చేశాడు. రియల్ హీరో అని నిరూపించుకున్నాడు. మమల్ని ఎవరు ఆదుకుంటారా అని వలస కార్మికులందరూ ఎదురు చూస్తున్న క్రమంలో సోనూ సూద్ నేనున్నాను అంటూ వారిని సొంత గూటికి చేర్చాడు. వాళ్లందరిని బస్సులు, రైళ్లు ద్వారా అయినవారి చెంతకు చేర్చాడు. అప్పటి నుంచి ఎవరు ఏ సాయం అడిగిన అందిస్తూనే ఉన్నాడు. అక్కడి వారు, ఇక్కడి వారు అనే తేడా లేదు. ఎవరు కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్‌లో ఒక రైతుకు ట్రాక్టర్ కొనిచ్చి తన మానవత్వాన్ని మరోమారు చాటుకున్నాడు. చదవండి: రైతుకి సాయం ఇలా అందరికి సాయం చేస్తున్న సోనూసూద్ ఆస్తి ఎంత? ఎంత ఆస్తి ఉంటే అంతలా సాయం చేస్తున్నాడు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో సోనూ సూద్ పై తాజాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ అధ్యయనం చేయగా అతడి మొత్తం ఆస్తుల విలువ రూ. 130 కోట్లు అని తేలింది. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సోనూ సూద్ సినిమాల ద్వారానే ఆ డబ్బును సంపాదించినట్లు తెలుస్తోంది. నెగిటివ్ రోల్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న సోనూసూద్ ఎక్కువ రెమ్యూనిరేషన్ తీసుకునే విలన్లలో ఒకడు. సినిమాలలో సంపాదించిన డబ్బుతో ముంబైలో హోటళ్లు తెరిచాడు సోనూసూద్. 2020లో ఆయన ఆస్తి విలువ రూ. 130 కోట్లు ఉంటే ఇప్పటికే 10కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక ముందు కూడా ఎవరు సాయమన్న నేనుంటాను అంటున్నాడు సోనూసూద్. అందుకే చాలా మంది రీల్ హీరోలను కాదు రియల్ హీరోలను ఫాలో అవుదాం అంటూ సోనూను ఫాలో అవుతున్నారు ప్రేక్షకులు. చదవండి: శారదకు జాబ్ లెటర్: సోనూసూద్ -
కరోనా సంక్షోభం : ముకేశ్ అంబానీ నష్టం ఎంతంటే
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి ప్రకంపనలకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలవుతున్నాయి. కోవిడ్ -19 ను అడ్డుకునే క్రమంలో దేశంలో 21 రోజుల లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు ఆర్థిక కష్టాల్లోకి జారుకుంటున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు భారీగా ప్రభావితమవుతోంది. ఫలితంగా అటు ప్రపంచ స్టాక్ మార్కెట్లు, ఇటు దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేస్తున్నాయి. దేశీయ మార్కెట్లలో వచ్చిన ఈభారీ దిద్దుబాటు కారణంగా మార్చి 31 నాటికి భారతీయ కుబేరుడు, రిలయన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద భారీగా పడిపోయింది. అంబానీ నికర విలువ రెండు నెలల్లో 28 శాతం లేదా 300 మిలియన్ డాలర్లు తగ్గి 48 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఒక నివేదిక సోమవారం తెలిపింది. అతని సంపద 19 బిలియన్ డాలర్లు క్షీణించడంతో, ప్రపంచ ర్యాంకింగ్ లో ఎనిమిది స్థానాలు తగ్గి, 17 వ స్థానానికి పడిపోయారని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ తెలిపింది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ తాజా నివేదిక ప్రకారం.. కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలల్లో ముకేశ్ నికర విలువలో దాదాపు 19 బిలియన్ డాలర్లు (రూ.1.44 లక్షల కోట్లు) నష్టాన్ని మూటగట్టుకున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో రూ.1,400గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీ షేర్ల విలువ ఏప్రిల్ 3వ తేదీ నాటికి 1,077కి పడిపోయింది. కోవిడ్-19 సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నష్టపోయిన ధనికుల్లో అంబానీ రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం ఎఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నాడ్ అర్నౌల్ట్ ఉన్నారు. ఈయన సంపద 28 శాతం లేదా 30 బిలియన్ డాలర్లు తగ్గి 77 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక అమెజాన్ జెఫ్ బెజోస్ 131 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. గత రెండు నెలల్లో కేవలం 9 శాతం మాత్రమే పడిపోయింది. బిల్ గేట్స్ 91 బిలియన్ డాలర్ల (14 శాతం తగ్గింది)గా వుంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ నివేదిక ప్రకారం నికర విలువలో గౌతమ్ అదానీ 5 బిలియన్ డాలర్లు (37 శాతం) , హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్ నడార్ 5 బిలియన్ డాలర్లు (26 శాతం), ఉదయ్ కోటక్ 4 బిలియన్ డాలర్ల (28 శాతం) నష్టపోయారు. అంతేకాదు ఓయో రూమ్స్ రితేష్ అగర్వాల్ ఇకపై బిలియనీర్ కాదు అని రిచ్ లిస్ట్ తెలిపింది. గత రెండు నెలల్లో భారతదేశంలో వ్యాపారవేత్తలు స్టాక్‌మార్కెట్లలో దాదాపు 25శాతం నష్టాలు చవిచూశారు, అంతేకాక.. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 5.2శాతానికి పడిపోయింది. ముఖ్యంగా అంబానీకి ఇది గడ్డుకాలం.. ఆయన ఆస్తిలో దాదాపు 28శాతం నష్టం వచ్చిందని హురున్ ఎండీ అనస్ రహ్మన్ వెల్లడించారు. టాప్ 100 జాబితా నుంచి ముగ్గురు భారతీయులు తప్పుకోగా, ఈ జాబితాలో నిలిచిన ఏకైక భారతీయుడుగా అంబానీ నిలిచారు. బెర్క్‌షైర్ హాత్వేకు చెందిన వారెన్ బఫెట్ కూడా గత రెండు నెలల్లో 19 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. అయితే 19 శాతం వద్ద ఇది స్వల్ప పతనమని నివేదిక తెలిపింది. సంపదను కోల్పోయిన వారి టాప్ -10 జాబితాలో కార్లోస్ స్లిమ్, వారి కుటుంబం, బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ , మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ ఉన్నారు. గత రెండు నెలల్లో చైనా బిలియనీర్లు కొద్దిమంది లాభాలలో ఉన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ , పంది మాంసం ఉత్పత్తి చేసే సంస్థల ప్రమోటర్లు కూడా ఉన్నారు. టాప్ -100 ర్యాంకింగ్స్‌లో భారత్ మూడు ర్యాంకింగ్స్‌ను కోల్పోగా, ఆరుగురు చైనా బిలియనీర్లు ఈ జాబితాలో చేరడం విశేషం. చదవండి : రికార్డు కనిష్టానికి బంగారం దిగుమతులు దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్ -
అప్పులు చెల్లించలేను.. వైరాగ్యంలో అనిల్
లండన్: దేశంలోనే సంపన్నుడు, ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానంలో కొనసాగిన రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గత కొద్ది కాలంగా వ్యాపారంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఓ దావాను ఎదుర్కొంటున్న అనిల్, తాజాగా తన ఆస్తులు సున్నాకు పడిపోయాయని లండన్ కోర్టుకు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. అనిల్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి 2012లో 92.5 కోట్ల డాలర్ల రుణాన్ని తీసుకున్నారు. తీవ్ర నష్టాలతో ఆర్‌కామ్ దివాలా తీసి, చైనా బ్యాంకులకు రుణాన్ని చెల్లించలేకపోయారు. ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు తమకు రావాల్సిన 4,800 కోట్లు చెల్లించాలని కోర్టుకు వెళ్లాయి. రుణ ఒప్పందం కింద రూ.4,800 కోట్లు చెల్లించాలని బ్యాంకులు కోర్టులో దావా వేశాయి. వాదనలు విన్న జడ్జి రూ.700 కోట్లు చెల్లించాలని తీర్పు చెప్పారు. అయితే అనిల్ అంబానీ చెల్లించాల్సిన అప్పులను పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడాయన ఆస్తులు విలువ పూర్తిగా పడిపోయిందని, అనిల్ తరఫు న్యాయవాది రాబర్ట్ హోవే కోర్టుకు తెలిపారు. తండ్రి చనిపోయాక ముకేశ్ వ్యాపారంలో దూసుకెళ్తుంటే అనిల్ వ్యాపారాలు మాత్రం తీవ్ర నష్టాలను చవిచూశాయి. ముఖేశ్ చమురు, సహజ వాయువులకు సంబంధించిన వ్యాపారాలలో లాభాలను ఆర్జిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ -
అంబానీ కోడలు సంపదెంతో తెలుసా?
న్యూఢిల్లీ : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లోకి కొత్త కోడలు అడుగు పెట్టబోతోంది. ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాను త్వరలోనే పరిణయం ఆడబోతున్నారు. ఈ నేపథ్యంలో శ్లోకా మెహతా గురించి ఫినాప్ రిపోర్టు పలు ఆసక్తికర విషయాలను నివేదించింది. శ్లోకా మెహతా సంపద, ఆమె ఇప్పటి వరకు చేపట్టిన బాధ్యతలు అన్నింటితో ఒక రిపోర్టు నివేదించింది. ఈ రిపోర్టులో శ్లోకా మెహతాకు రూ.120 కోట్ల నికర సంపద ఉన్నట్టు తెలిపింది. ప్రపంచంలోనే బెస్ట్ లగ్జరీ కార్లను ఆమె కలిగి ఉన్నారని, వీటిలో మినీ కాపర్, మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ వంటి కార్లు ఉన్నాయని పేర్కొంది. ఇటీవలే ఆమె రూ.4 కోట్ల విలువైన బెంట్లీ లగ్జరీ కారును కొనుగోలు చేసిందని రిపోర్టు చేసింది. గత కొన్నేళ్లుగా శ్లోకా మెహతా సంపద 23 శాతానికి పైగా పెరిగినట్టు తెలిపింది. శ్లోకా మెహతా తండ్రి రస్సెల్ మెహతా, రోజీ బ్లూ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్. రోజి బ్లూ అనే సంస్థ డైమాండ్ కటింగ్, పాలిషింగ్, ట్రేడింగ్ కంపెనీ. భారత్‌లో ఈ కంపెనీ చాలా బలమైనదిగా ఉంది. భారత్‌తో పాటు రోజీ బ్లూ సంస్థ యూఏఈ, ఇజ్రాయిల్, బెల్జియం, అమెరికా, జపాన్, హాంకాంగ్, చైనాలలో కూడా తన కార్యకలాపాలను సాగిస్తోంది. 1960 నుంచి రస్సెల్ మెహతా కుటుంబం వజ్రాల వ్యాపారం చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సంస్థ క్లీన్ క్రెడిట్ హిస్టరీనే కలిగి ఉంది. శ్లోకా మెహతా రస్సెల్ మెహతా, మోనా మెహతాలకు చిన్న కూతురు. ఆమె సోదరుడు విరాజ్ నిషా సేథ్‌ను పెళ్లి చేసుకున్నారు. నిషా సేథ్ గ్రేట్ ఈస్టరన్ షిప్పింగ్ ఫ్యామిలీకి చెందిన ఆమె. సోదరి దియా ఆయుష్ జతియా, హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్ల కొడుకు అమిత్ జతియాను గతేడాది వివాహమాడారు. 2014లో శ్లోకా మెహతా రోజీ బ్లూ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇది రోజీ బ్లూ గ్రూప్ కంపెనీకి చెందిన దాతృత్వ సంస్థ. ఎన్జీఓలను, వాలంటీర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చే కనెక్ట్‌ఫర్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలు. పెళ్లి చేసుకోబోతున్న ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాలు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూలులో చదువుకున్నప్పటి నుంచే వీరిద్దరికి పరిచయం ఉంది. అంబానీ, మెహతా కుటుంబాల మధ్య కూడా అనుబంధం ఉంది. ఒకరి ఇంట్లో జరిగే వేడుకలకు మరొకరు హాజరయ్యేవారు. ఆ విధంగా నీతా, ముఖేష్ అంబానీలకు శ్లోకా నాలుగేళ్ల వయసున్నప్పటి నుంచి తెలుసు. చదువుల్లో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే శ్లోకా ఇంటర్లో 95 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ చదివారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ స్కూలు నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. -
పెళ్లికి ముందే విరుష్కల ఆస్తులెంతో చూడండి...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల వివాహం త్వరలో జరగనుందని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఓ వైపు లంకతో టెస్ట్ సిరీస్ తర్వాత కోహ్లీ విశ్రాంతి తీసుకోవడం ఇందుకు ఊతమిస్తోంది. విరుష్క (విరాట్-అనుష్క) జోడీ వివాహం ఈ నెల 12న ఇటలీలో కొందరు సన్నిహితుల మధ్య నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. నటి అనుష్క తరపున కొందరు సన్నిహితులకు ఆహ్వాన పత్రికలు అందినట్లు కూడా తెలుస్తోంది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వీరిద్దరికీ ఇప్పటి వరకు ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా అసలు. 'రబ్ నే బనా ది జోడీ'తో బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్న అనుష్క శర్మ, బ్యాండ్ బాజా భారత్ వంటి సినిమాలతో ఆమె కెరీర్ పైపైకే ఎగిసింది. ఇదే ఊపులో ఉన్న అనుష్క శర్మ, 2014లో తన సోదరుడితో కలిసి ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించింది. ఈ ప్రొడక్షన్ హౌజ్ కింద ఒక్కో సినిమాకు రూ.5 కోట్లను, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌కు రూ.4 కోట్లను తీసుకుంటోంది. తన వ్యక్తిగత పెట్టుబడులు రూ.36 కోట్ల మేర ఉన్నాయి. రూ.5 కోట్ల విలువ చేసే నాలుగు లగ్జరీ కార్లు.. ఇలా అనుష్క ఆస్తులు రూ.220 కోట్ల మేరకే ఉన్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. వచ్చే మూడేళ్లలో అనుష్క సంపద 30 శాతం మేర పెరిగే అవకాశముంటుందని తెలుస్తోంది. అదేవిధంగా క్రికెట్ లెజెండ్ అయిన విరాట్ కోహ్లికి కూడా భారీగానే సంపద ఉంది. ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ ఆయన అత్యధిక సంపద పొందుతున్నాడు. అంతేకాక ఐపీఎల్ మ్యాచ్‌ల్లో అత్యధిక చెల్లింపులు అందుకుంటున్న క్రీడాకారుడిల్లో విరాటే ముందంజలో ఉన్నాడు. రెండు నెలల ఈ సీజన్లో రూ.14 కోట్లను ఆర్జిస్తున్నాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ఈయనకు, పుమా, ఎంఆర్ఎఫ్ వంటి బ్రాండ్స్ భారీ ఎత్తున్న ఎండోర్స్మెంట్లు ఆఫర్ చేస్తున్నాయి. అత్యధిక బ్రాండు విలువ కలిగిన క్రీడాకారుల్లో ఫోర్బ్స్ జాబితాలో విరాట్ కోహ్లి ఏడవ స్థానంలో ఉన్నాడు. ఈయనకు రూ.42 కోట్లు విలువ చేసే ప్రాపర్టీలు, రూ.18 కోట్ల పెట్టుబడులు, రూ.9 కోట్ల విలువ చేసే ఆరు లగ్జరీ కార్లు... ఇలా విరాట్ మొత్తం రూ.390 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నాడు. -
రూ.8000 కోట్లు కోల్పోయిన అంబానీ
టెలికాం ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తూ దిగ్గజ కంపెనీ ఆదాయాలకు భారీగా గండికొడుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి భారీ షాక్ తగిలింది. తన ప్రముఖ రిలయన్స్ గ్యాస్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఆర్జీటీఐఎల్) 2016 సెప్టెంబర్ వరకు రూ.8000 కోట్ల మేర నికర ఆదాయాన్ని కోల్పోయింది. ఆర్ఐఎల్ క్రిష్ణా గోదావరి బేసిన్ ద్వారా తక్కువ గ్యాస్ సప్లై అవుతుండటంతో కంపెనీ ఈ నష్టాలను మూటకట్టుకుంది. క్రిష్ణా గోదావరి బేసిన్ నుంచి గుజరాత్‌కు కనెక్ట్ అయిన 1400 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్‌లైన్‌ను కంపెనీ కలిగిఉంది. ఆర్ఐఎల్ కేజీ బేసిన్లో ఉత్పత్తిచేసే గ్యాస్ ద్వారా కంపెనీ రెవెన్యూలను ఆర్జిస్తుంది. అయితే 2016 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర ఆదాయం రూ.2641 కోట్లు నెగిటివ్‌గా ఉన్నట్టు రిలయన్స్ గ్యాస్ ఫైలింగ్‌లో తెలిసింది. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ను పాటిస్తూ ఈ నికర ఆదాయాల ప్రకటనను తయారుచేశామని కంపెనీ చెప్పింది. 2010 నుంచి కంపెనీ ఒక్కసారి మాత్రమే లాభాలను ఆర్జించింది. ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా కంపెనీ రూ.4000 కోట్లను ఆర్జించాలని యోచిస్తోంది. -
ట్రంప్ రాకతో జుకర్‌బర్గ్ సంపద ఢమాల్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఊహించనిభరితంగా డొనాల్డ్ ట్రంప్ విజయం.. ఆ విజయంలో ఫేస్బుక్ పాత్రంటూ పలు ప్రచారాలు జరిగాయి. అయితే ట్రంప్ విజయంలో తమ ప్రమేయమేమీ లేదని ఆ వార్తలను ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఖండించారు. ఈ ఖండనలే మార్క్ జుకర్‌బర్గ్‌కు అసలు చిక్కు తెచ్చిపెట్టాయి. ట్రంప్ గెలిచినప్పటి నుంచి జుకర్‌బర్గ్ నికర సంపద దాదాపు 3.7 బిలియన్ డాలర్లు( రూ.24,939 కోట్లు) కిందకి పడిపోయిందట. ఇంతమొత్తంలో జుకర్‌బర్గ్ సంపద తుడిచిపెట్టుకుపోయినప్పటికీ, ఆయన ఇంకా ప్రపంచంలో ఐదో అతిపెద్ద ధనికుడిగానే పేరొందుతున్నారు. ఫోర్బ్స్ ప్రపంచ బిలినీయర్ల రియల్ టైమ్ ర్యాంకింగ్స్ ప్రకారం ఆయన సంపద 49 బిలియన్ డాలర్లు అంటే దేశీయ కరెన్సీ ప్రకారం రూ.3,30,137 కోట్లు. అయితే జుకర్‌బర్గ్‌కు భిన్నంగా ఇతర అమెరికన్ బిలీనియర్ల సంపద మాత్రం ట్రంప్ ఎన్నికైన దగ్గర్నుంచి విపరీతంగా ఎగిసింది. ట్రంప్ గెలుపు అనంతరం 14 మంది అమెరికన్ ధనికులు తమ నికరసంపదకు అదనంగా 9.4 బిలియన్ డాలర్లను చేర్చుకున్నట్టు తెలుస్తోంది. వారిలో ఎక్కువగా లబ్దిపొందింది వారెన్ బఫెటేనట. ఆయన అధినేతగా ఉన్న బెర్క్ షైర్ హాత్వే ఇన్వెస్ట్మెంట్ దిగ్గజ షేర్లు 8 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. నవంబర్ నెలలో ఆయన నికర సంపదలో మరో 7 బిలియన్ డాలర్లను పెంచుకున్నారట. ప్రస్తుతం వారెన్ బఫెట్, ప్రపంచ అత్యధిక ధనవంతుల్లో మూడో స్థానంలో ఉన్నారు. ట్రంప్ విజయం అనంతరం ఫేస్బుక్ కోల్పోతున్న స్టాక్ పతనం కేవలం ఫేక్ న్యూస్ వివాదం వల్ల మాత్రమే కాదని, అక్టోబర్‌లో ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన ఈ షేర్లు ఇటీవల పతనానికి గురవుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇతర టెక్ దిగ్గజాలు గూగుల్, అమెజాన్లు కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయట. ఏదైంతేనే ట్రంప్ విజయం జుకర్‌బర్గ్‌ను భారీగానే దెబ్బతీసిందని వాదిస్తున్న వాళ్లూ ఉన్నారు. -
జయ వదిలి వెళ్లిన సంపద ఎంతో తెలుసా?
-
జయ వదిలి వెళ్లిన సంపద ఎంతో తెలుసా?
తమిళనాట రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోతూ అసువులు బాసిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత వదిలి వెళ్లిన సంపద ప్రస్తుతం ఎవరికి దక్కుతుందో అంటే అందరికీ ప్రశ్నార్థకమే. ఎవరిపైనా ఆధారపడని అమ్మ ఇటు రాజకీయ వారసులను, అటు ఆస్తిపై హక్కులను ఎవరికీ కట్టబెట్టనున్నారో ఎన్నడూ వెల్లడించలేదు. జయలలిత మరణంతో పార్టీ పగ్గాలు ఆమె నెచ్చిలి శశికళకు, ముఖ్యమంత్రి పదవి జయమ్మ విధేయుడు పన్నీర్ సెల్వంకు అప్పజెప్పుతూ పార్టీ శ్రేణులు నిర్ణయించారు. కానీ ఆమె ఆస్తులకు ఎవరు వారసురాల్లో ఇంకా వెల్లడికాలేదు. అయితే ఆర్కె నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక సమయంలో అన్నాడీఎంకే అధినేత్రిగా జయలలిత పోటీ చేసేటప్పుడు 2015 జూన్ వరకు తనకు రూ.117.13 కోట్ల ఆస్తులున్నట్టు ఆమెనే ప్రకటించారు. ఆ ఆస్తులో పోయెస్ గార్డెన్‌లోని 24వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రూ.43.96 కోట్ల జయలలిత నివాస గృహం వేద విలాస్‌కు ప్రస్తుతం శశికళ వారసురాలు కాబోతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ ప్రాపర్టీని జయలలిత తల్లి సంధ్య 1967లో రూ.1.32 లక్షలకు కొనుగోలు చేసినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ఆమెకున్న ఇతర ఆస్తులు: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల గ్రామంలో 14.50 ఎకరాలు, తమిళనాడులో కంచీపురంలో 3.43 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. తెలంగాణలో ఉన్న ఈ ప్రాపర్టీని ఆమె తన తల్లి సంధ్యతో కలిసి 1968లో కొనుగోలు చేశారు. కాంచీపురం చెయూర్లోని ప్రాపర్టీని 1981లో కొనుగోలు చేశారు. జయలలితకు మొత్తం నాలుగు వాణిజ్య భవనాలున్నాయి. దానిలో ఒకటి హైదరాబాద్‌లో ఉంది. రిపోర్టుల ప్రకారం దీనిలో ఒక ప్రాపర్టీ తను దత్తత తీసుకున్న శశికళ అన్న కుమారుడు వీఎన్ సుధాకర్‌కు చెందుతున్నట్టు తెలుస్తోంది. కార్లు... రెండు టయోటా ప్రాడో ఎస్‌యూవీలు, టెంపో ట్రావెలర్, టెంపో ట్రాక్స్, మహింద్రా జీప్, 1980లో తయారు చేసిన అంబాసిడర్ కారు, మహింద్రా బోలెరో, స్వరాజ్ మ్యాక్సీ, 1990 మోడల్ కాంటెస్సాలు జయలలిత దగ్గరుండేవి. ఈ మొత్తం తొమ్మిది వాహనాల ఖరీదు రూ.42,25,000. ఆభరణాలు.... 21280.300 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలు తన దగ్గరున్నాయని తమిళనాడు సీఎంగా ఆమెనే ఓ సారి ప్రకటించారు. అక్రమాస్తుల కేసుల్లో ఇవి ప్రస్తుతం కర్నాటక ప్రభుత్వ ట్రెజరీలో ఉన్నాయని, ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా రూ.3,12,50,000 విలువ కలిగిన 1,250 కేజీల వెండి ఉన్నట్టు పేర్కొన్నారు. స్థిర, చరాస్తులు... 2016 ఎన్నికల్లో ఆర్కే నగర్ నియోజకవర్గ తరుఫున పోటీ చేసేటప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు ఆమె తనకు చరాస్తులుగా రూ.41.63 కోట్లున్నాయని, స్థిరాస్తులు రూ.72.09 కోట్లున్నట్టు ప్రకటించారు. పెట్టుబడులు, షేర్లు... అక్రమాస్తుల కేసుల ఆరోపణల నేపథ్యంలో ఆమెకు పలు కంపెనీల్లో ఉన్న డిపాజిట్లను, షేర్లను పోలీసులు సీజ్ చేశారు. 2004 స్పెషల్ సీ.సీ 208 ప్రకారం వాటిని కోర్టు కస్టడీకి తీసుకుంది. పార్టనర్‌గా ఆమె ఐదు సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. వాటి విలువ రూ.27.44 కోట్లు. ఆ ఐదు సంస్థలు శ్రీ జయ పబ్లికేషన్స్, శశి ఎంటర్ప్రైజెస్, కోదండ ఎస్టేట్, రాయల్ వ్యాలీ ఫ్లోరిటెక్ ఎక్స్‌పోర్ట్స్, గ్రీన్ టీ ఎస్టేట్. అయితే ఆమెకు ఎన్ఎస్ఎస్లో కాని, పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీలు వంటి వాటిలో కానీ ఎలాంటి పెట్టుబడులు లేవు. ఎలాంటి వ్యక్తిగత రుణాలు, అడ్వాన్స్‌లు ఎవరికీ, ఏ సంస్థకి జయలలిత ఇవ్వనేలేదట. ఈ విషయాలను ఆమెనే ఓసారి తన అఫిడవిట్లోనే పేర్కొన్నారు. 2015-16 ఏడాదికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌లను ఆమె దాఖలు చేశారు. 2013-14లో పన్ను చెల్లింపులన్నీ ఆమె పూర్తిచేశారు. చివరి డిక్లరేషన్ కింద ఆమె చేతిలో రూ.41,000 నగదు, రూ.2.04 కోట్ల ఆస్తిపాస్తులున్నట్టు ఆమె వెల్లడించారు. -
ఎలిజిబెత్ ఆస్తులు జీరోకి పడిపోయాయట
హెల్త్ టెక్నాలజీ కంపెనీ థెరానోస్ ఇంక్ వ్యవస్థాపకురాలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలిజిబెత్ నికర ఆస్తులు ఒక్కసారిగా జీరోకి పడిపోయాయట. గతేడాది రూ.30వేల కోట్లగా ఉన్న ఎలిజిబిత్ నికర ఆస్తులు ఈ ఏడాది జీరోగా ఉన్నాయని ఫోర్బ్స్ నివేదించింది. హోమ్స్ ..బ్లడ్ టెస్టింగ్ కంపెనీ నిర్వర్తించే రక్త పరీక్షల్లో నాణ్యత లేవని, కచ్చితమైన ఫలితాలు చూపించడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కంపెనీపై గత వారం కేసు కూడా నమోదైంది. ఈ కేసుపై వివిధ ఫెడరల్ అండ్ స్టేట్ ఏజెన్సీలు విచారణ కొనసాగిస్తున్నాయి. ప్రైవేట్ పెట్టుబడిదారులు థెరానోస్ లో దాదాపు 900 కోట్ల డాలర్ల వాల్యుయేషన్ మేర స్టాక్స్ కొనుగోలు చేశారని, అయితే ఇప్పుడు అవి 8000 లక్షల డాలర్లకు పడిపోయాయని ఫోర్బ్స్ నివేదించింది. కంపెనీ వాల్యుయేషన్ పడిపోవడంతో, హోమ్స్ స్టాక్ కు ఎలాంటి విలువ లేదని ఫోర్బ్స్ తెలిపింది. అయితే ఫోర్బ్స్ నివేదించిన ఈ రిపోర్టును థెరానోస్ అధికార ప్రతినిధి బ్రూక్ బుకానన్ ఖండించారు. రహస్యపూర్వకమైన ఆర్థిక సమాచారాన్ని ఫోర్బ్స్ కు సమర్పించకపోవడం వల్లే, ఈ తప్పుడు రిపోర్టు నివేదించిందని పేర్కొన్నారు. ఈ రిపోర్టు కేవలం ఊహించి రాసిన మాదిరిగా ఉందని, వాస్తవ రిపోర్టు కాదని తెలిపారు. 2015 అమెరికాలో స్వశక్తితో ఎదిగిన అత్యంత ధనికురాలిగా పేర్కొన్న ఫోర్బ్స్ నివేదిక, మరి ఈ రిపోర్టులో ఎందుకు హోమ్స్ విలువను అంత తగ్గించిందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఫోర్బ్స్ నివేదికపై హోమ్స్ ఇంకా స్పందించలేదు. ప్రజలకు ఏదైనా సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో, 2003లో హోమ్స్ థెరానోస్ ను స్థాపించారు. సులభపద్ధతిలో బ్లడ్ శాంపుల్స్ ను సేకరించి, బ్లడ్ టెస్టు నిర్వర్తించే పరికరాల ఆమె తీసుకొచ్చారు. వన్ డ్రాప్ బ్లడ్ తోనే వివిధ రకాల రక్త పరీక్ష ఫలితాలు హోమ్స్ బ్లడ్ టెస్టింగ్ కంపెనీ అందిస్తుంటోంది. అయితే ఈ ఫలితాలు పారదర్శకతతో లేవని, తప్పుడు ఫలితాలు చూపుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టులు నివేదించాయి. అప్పటినుంచి అమెరికా సెక్యురిటీ ఎక్సేంజ్ కమిషన్, స్టేట్ హెల్త్ డిపార్ట్ మెంట్స్, మెడికేర్, మెడికైడ్ సెంటర్లు, యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ లు హోమ్స్ కంపెనీపై విచారణ కొనసాగిస్తున్నాయి. -
షారుక్ ఆస్తి ఎంతో తెలుసా..?
ముంబయి: షారుక్ ఖాన్.. ఒక్క బాలీవుడ్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న నటుడు. ఒక్కసారి ఆయనకు సంబంధించిన సంక్షిప్త సమాచారం పరిశీలిస్తే.. షారుక్ ఖాన్ తల్లి దండ్రులు తాజ్ మహ్మద్ ఖాన్, తల్లి లతీఫ్ ఫాతిమా. 1965లో షారుక్ న్యూఢిల్లీలో జన్మించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. తొలుత సెయింట్ కొలంబియా పాఠశాలలో చదివిన షారుక్ అనంతరం ఢిల్లీలోనే హన్స్ రాజ్ కాలేజీలో, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో చదివాడు. అనంతరం 1991లో గౌరీని వివాహం చేసుకున్నాడు. ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చేయడంతోపాటు.. కమ్యునికేషన్, ఫిల్మ్ మేకింగ్ లో మాస్టర్ పూర్తి చేసిన షారుక్ తొలిసారి 1989తో ఓ టీవీ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చారు. ఫౌజీ అనే టీవీ సీరిస్ కార్యక్రమంలో కనిపించారు. ఆయన నటించిన తొలిసినిమా దీవానా 1992లో విడుదలైంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నెగెటివ్ రోల్స్ కూడా చేశారు. అందులో ఓ సైకో క్యారెక్టర్ కూడా ఉంది. అలా ప్రస్తానం మొదలుపెట్టిన షారుక్ ఇక తిరిగి వెనక్కి చూసుకోలేదు. ప్రస్తుతం ఆయనకు ముగ్గురు పిల్లలు. వారిలో ఒక పాప ఉంది. ఇంత ప్రస్తానం ఉన్న షారుక్ ఆస్తి విలువ ఎంతో తెలుసా.. దాదాపు 600 మిలియన్ డాలర్లు. అనగా, రూ.39,791,970,000. ప్రపంచ నటుల్లో అత్యధిక సంపన్నుల జాబితాలో షారుక్‌ది రెండో స్థానం. అందుకే షారుక్ బాలీవుడ్ లో రిచెస్ట్ యాక్టర్ అయ్యారు. -
రెట్రో ట్యాక్స్ కేసులపై ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: రెట్రోస్పెక్టివ్ పన్ను సవరణ (2012 ఏప్రిల్‌కు ముందునాటి ఒప్పందాలపైనా పన్ను వర్తింపు) కారణంగా వెలుగులోకివచ్చే ఆదాయపు పన్ను కేసులను పరిశీలించేందుకు వీలుగా ప్రభుత్వం గురువారం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నియమించిన ఈ నలుగురు సభ్యుల కమిటీకి సీబీడీటీకి చెందిన విదేశీ పన్నులు, పన్నుల పరిశోధన యూనిట్-1 జాయింట్ సెక్రటరీ నేతృత్వం వహించనున్నారు. అసెసింగ్ ఆఫీసర్(ఏఓ) నుంచి వచ్చే ఇలాంటి కేసులపై 60 రోజుల్లోగా ఈ కమిటీ తగిన పరిశీలనజరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీబీడీటీ విడుదల చేసిన నోటిఫికేషనలో పేర్కొంది. రెట్రో ట్యాక్స్ కేసులపై కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఇండియాలో హాంకాంగ్‌కు చెందిన హచిసన్ టెలికం వాటాను బ్రిటన్ సంస్థ వొడాఫోన్ కొనుగోలు చేసిన ఒప్పందానికి సంబంధించి ఆ కంపెనీకి ఐటీ శాఖ పన్ను నోటీసు ఇవ్వడం తెలిసిందే. దీనిపై వొడాఫోన్ సుప్రీం కోర్టులో న్యాయపోరాటంచేసి విజయం సాధించడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఐటీ చట్లాల్లో ఈ రెట్రోస్పెక్టివ్ పన్ను సవరణను తీసుకొచ్చింది. దీని ప్రకారం భారత్‌తో సంబంధం ఉన్న కంపెనీలకు సంబంధించి దేశీయంగా, లేదా విదేశాల్లో ఎక్కడ ఎలాంటి కొనుగోలు, అమ్మకం లావాదేవీలు జరిగినా దానిపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించేలా, పాత కేసులకూ వర్తింపజేస్తూ నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో వొడాఫోన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ రూ.11,217 కోట్ల పన్నుతో పాటు దీనిపై వడ్డీని కూడా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఇంకా వివాదం నడుస్తూనే ఉంది. కాగా, ఈ మొత్తం ఉదంతంపై విదేశీ, స్వదేశీ ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర విమర్శలు తలెత్తడంతో రెట్రో ట్యాక్స్ నిబంధనలను చాలా జాగ్రత్తగా అమలు చేస్తామని జైట్లీ బడ్జెట్లో చెప్పారు. -
రోజూ రూ.8 కోట్లు జేబులోకి...
ముంబై: బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా రోజూ రూ.8.40 కోట్లు ఆర్జిస్తున్నారు. ఏడాదికిపైగా ఆయన అలా సంపాదిస్తూనే ఉన్నారు. షేర్ మార్కెట్లో బుల్ రన్‌తో ఆయన ఆదాయం కూడా పెరిగిపోతూ ఉంది. ఆయన కుటుంబ సభ్యుల పోర్ట్‌ఫోలియో విలువ ఏడువేల కోట్ల రూపాయలు మించిపోయిందని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక రాసింది. 2008లో ముగిసిన బుల్ రన్లో ఝున్‌ఝున్‌వాలా బిలియనీర్ (బిలియన్ = 100 కోట్లు) అయ్యారు. తర్వాత మార్కెట్ల పతనం ప్రభావం అందరితోపాటే ఝున్ఝున్వాలాపైనా పడింది. 2009 మార్చి నాటికి ఝున్‌ఝున్‌వాలా వద్ద ఉన్న మొత్తం షేర్ల విలువ రూ.1,130 కోట్లకు క్షీణించింది. 2007 డిసెంబర్ నాటి విలువ రూ.3,461 కోట్లతో పోలిస్తే ఇది మూడోవంతే. అయితేనేం, ప్రస్తుత బుల్ రన్‌తో ఆయన ఆస్తులు దినదిన ప్రవర్థమానం అవుతున్నాయి. గతేడాదిలో పరిశీలిస్తే... ఆయన నెట్‌వర్త్ వారానికి రూ.59 కోట్లు, నెలకు రూ.256 కోట్ల చొప్పున పెరిగింది. జూన్ చివరి నాటికి ఝున్‌ఝున్‌వాలా, ఆయన కుటుంబ సభ్యుల మొత్తం నెట్‌వర్త్ రూ.7,261 కోట్లు. ఏడాది క్రితం ఇది కేవలం రూ.4,192 కోట్లు మాత్రమే. దేశీయ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన 5,463 కంపెనీల్లో దాదాపు 96% కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఝున్‌ఝున్‌వాలా కుటుంబ నెట్‌వర్తే అధికం. (ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి ఒక శాతం కంటే ఎక్కువ వాటా ఉన్న కంపెనీల్లోని హోల్డింగ్స్ ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించాం.) ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని టైటాన్, ల్యుపిన్, క్రిసిల్, ర్యాలీస్ ఇండియా, అరబిందో ఫార్మా, దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఫెడరల్ బ్యాంక్ వంటి కంపెనీల ఈక్విటీల ధర గత నెలలో ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. ఈ కంపెనీలన్నిటిలోనూ ఒక్కోదాంట్లో రూ.100 కోట్లకు మించిన విలువైన షేర్లు ఈ కుటుంబం వద్ద ఉన్నాయి. ఝున్‌ఝున్‌వాలా కుటుంబ నెట్‌వర్త్ కంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ప్రముఖ కంపెనీల్లో ఇండియన్ హోటల్స్ (మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,041 కోట్లు), ముత్తూట్ ఫైనాన్స్ (రూ.7,028 కోట్లు), యూనిటెక్ (రూ.6,837 కోట్లు), సుజ్లాన్ ఎనర్జీ (రూ.6,254 కోట్లు), డిష్ టీవీ ఇండియా (రూ.6,171 కోట్లు) ఉన్నాయి. ఏప్రిల్ - జూన్ క్వార్టర్లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, ఫెడరల్ బ్యాంక్, ఈడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రకాశ్ ఇండస్ట్రీస్, పొలారిస్ ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఓరియంట్ సిమెంట్, మెక్నల్లీ భారత్ ఇంజినీరింగ్ వంటి కంపెనీలు ఆయన పోర్ట్‌ఫోలియోలో చేరాయి. జూన్ క్వార్టర్‌లోనే ఆయన ఎంసీఎక్స్‌లో 1.45 వాటాను ఓపెన్ మార్కెట్లో కొన్నారు. తర్వాత ఒక్కో ఈక్విటీ రూ.664 ధరకు ఎంసీఎక్స్‌లో 1.96 శాతం వాటాను కొనుగోలు చేశారు. సోమవారం ఈ స్టాకు రూ.824 వద్ద క్లోజైంది. టైటాన్, ల్యుపిన్, క్రిసిల్, కరూర్ వైశ్యాబ్యాంక్, ఎ టూ జడ్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ సర్వీసెస్ కంపెనీల్లో హోల్డింగ్‌ను ఝున్‌ఝున్‌వాలా ఇటీవల తగ్గించుకున్నారు. కంపెనీల షేర్లే కాదు, ముంబైలో రూ.100 కోట్ల విలువైన ఆస్తులను ఆయన కొన్నారని సమాచారం. అంతేనా, కోట్ల విలువైన అనేక రేసు గుర్రాలు కూడా ఆయన వద్ద ఉన్నాయి. -
ఖరీదైన కారు కొంటే...ఐటీ కంట్లో పడినట్లే
న్యూఢిల్లీ: పన్ను పరిధిని పెంచడంతో పాటు అప్రకటిత ఆదాయానికి చెక్ పెట్టేందుకు ఆదాయ పన్ను (ఐటీ) విభాగం కొత్త వ్యూహాన్ని రూపొందించింది. ఆర్థికంగా వృద్ధిచెందుతున్న కొన్ని నగరాల్లో లగ్జరీ కార్ల కొనుగోలు, పెట్టుబడులపై వడ్డీ, వ్యక్తిగత వ్యయం, ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే మూలధన రాబడి (క్యాపిటల్ గెయిన్స్) తదితర లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణే, కొచ్చి, లక్నో, భోపాల్, గువాహటిల్లో ఈ మేరకు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాల్సిందిగా నిఘా, నేర పరిశోధన కార్యాలయం(డీఐసీఐ)ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశించింది. గువాహటిలో షాపింగ్ మాల్స్, ఇతర మార్కెట్లలో భారీగా చేసే వ్యక్తిగత ఖర్చులను, విద్యాసంస్థలకు చేసే చెల్లింపులను, భవనాల కొనుగోళ్లను అధికారులు విశ్లేషించనున్నారు. బెంగళూరులో కార్పొరేట్ బాండ్లు, సహకార రుణ సంఘాలు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పెట్టుబడులపై వ్యక్తులకు వచ్చే వడ్డీని అక్కడి ఐటీ అధికారులు పరిశీలించనున్నారు. తమిళనాడులో ఇసుక తవ్వకం, కలప దిగుమతుల్లోకి వచ్చే పెట్టుబడులపై చెన్నైలోని ఐటీ ఉద్యోగులు ఆరా తీయనున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన సీబీడీటీ, ఐటీ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐటీ ఈమెయిల్ ఐడీని భద్రంగా ఉంచుకోండి.. ఐటీ రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్ కోసం ట్యాక్స్‌పేయర్ల ఈమెయిల్ ఐడీలు, మొబైల్ ఫోన్ నంబర్లను ఇప్పటికే కోరిన ఐటీ విభాగం తాజాగా తమ ఈమెయిల్ ఐడీని సేఫ్ లిస్ట్‌లో భద్రపర్చుకోవాలని సూచించింది. పన్ను చెల్లింపుదారులు తమ ఇన్‌బాక్స్‌లోని వైట్/సేఫ్ లిస్ట్‌లో donotreply @incometax indiaefiling.gov.in అనే ఐడీని ఉంచాలనీ, తద్వారా స్పామ్, జంక్ ఫోల్డర్లోకి వెళ్లకుండా చూసుకోవాలనీ కోరింది. దీనివల్ల తాము పంపే మెయిళ్లు స్పామ్, జంక్ ఫోల్డర్లోకి వెళ్లకుండా ఉంటాయని తెలిపింది. -
వేదాంతాకు కెయిర్న్ ఇండియా భారీ రుణం
న్యూఢిల్లీ: మాతృ సంస్థ వేదాంతా గ్రూప్‌నకు 1.25 బిలియన్ డాలర్లను(రూ. 7,500 కోట్లు) కెయిర్న్ ఇండియా రుణంగా మంజూరు చేసింది. దీనిలో 80 కోట్ల డాలర్లను ఇప్పటికే విడుదల చేసింది. గతంలో సైతం తమదగ్గరున్న నగదు నిల్వలను మాతృ సంస్థ వాటా పెంచుకునేందుకు వినియోగించిన నేపథ్యంలో తాజా చర్య విమర్శలకు తెరలేపింది. దీంతో స్టాక్ మార్కెట్లో కెయిర్న్ ఇండియా షేరు గత ఐదేళ్లలోలేని విధంగా 7% పతనమైంది. బీఎస్ఈలో రూ. 323 వద్ద ముగిసింది. కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వల వినియోగంపై పలువురు విశ్లేషకులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కంపెనీ ప్రతినిధి వివరణ ఇస్తూ 3%పైగా ఫ్లోటింగ్ రేటుకి రుణాన్ని రెండేళ్లకు పొడిగించిన ట్లు చెప్పారు. ఇది ఫిక్స్డ్ డిపాజిట్కంటే అధికమని పేర్కొన్నారు. అయితే రుణ విషయంపై బోర్డు ఎప్పుడు నిర్ణయం తీసుకుందన్న అంశంతోపాటు, ఇందుకు వాటాదారుల అనుమతిని తీసుకోవలసి ఉన్నదా అన్న సందేహంపై స్పందించేందుకు కంపెనీ నిరాకరించింది. కెయిర్న్ ఇండియాలో వేదాంతాకు 59.90% వాటా ఉంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్లో కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్‌గా 64% క్షీణించడం కూడా షేరు పతనానికి కారణమని నిపుణులు చెప్పారు. అనుమతి తీసుకోవాలి: ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వచ్చిన కంపెనీల కొత్త చట్టం ప్రకారం ఇలాంటి లావాదేవీలకు వాటాదారుల అనుమతి తీసుకోవలసి ఉంది. కెయిర్న్ ఇండియా బుధవారం వాటాదారుల సమావేశాన్ని నిర్వహించినప్పటికీ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. మిగులు నిధుల వినియోగంలో కంపెనీలు చేపట్టే ఇలాంటి లావాదేవీలు సందేహాలకు తావిస్తాయని గోల్డ్‌మన్ శాక్స్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ వ్యాఖ్యానించింది. కాగా, జూన్ చివరికి తమవద్ద దాదాపు 3 బిలియన్ డాలర్ల(సుమారు రూ.18 వేల కోట్లు)నగదు నిల్వలున్నట్లు కెయిర్న్ ఇండియా బుధవారం తెలిపింది. -
బీమాలో 49% ఎఫ్‌డీఐకి ఓకే
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 26 నుంచి 49 శాతానికి పెంచే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. తద్వారా ఈ రంగంలోకి రూ.25 వేల కోట్ల విదేశీ నిధుల రాకకు మార్గం సుగమం చేసింది. బీమా రంగంలో ఎఫ్‌డీఐ పెంపు ప్రతిపాదన 2008 నుంచి పెండింగులో ఉంది. ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిందని విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ రంగంలో 26 శాతానికి మించిన పెట్టుబడి ప్రతిపాదనలకు విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు (ఎఫ్ఐపీబీ) అనుమతి అవసరమనీ, యాజమాన్య అజమాయిషీ మాత్రం భారతీయ ప్రమోటర్ల చేతుల్లోని ఉంటుందనీ పేర్కొన్నాయి. నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న తొలి ప్రధాన సంస్కరణ ఇదే. రక్షణ, రైల్వేల వంటి రంగాల్లోని ఎఫ్‌డీఐ పరిమితులను సడలిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేబినెట్ ఆమోదించిన బీమా చట్టాల (సవరణ) బిల్లును ఇక పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఇవే నిబంధనలు పెన్షన్ రంగానికి కూడా వర్తిస్తాయి. దేశంలో లైఫ్, నాన్ లైఫ్ రంగాల్లో ప్రస్తుతం రెండు డజన్లకు పైగా ప్రైవేట్ రంగ బీమా కంపెనీలు ఉన్నాయి. బీమా రంగానికి పెట్టుబడులు అవసరమనీ, కనుక ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచుతామనీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. సర్వత్రా హర్షం... యాజమాన్యాన్ని భారతీయుల చేతిలో ఉంచుతూనే ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచడంవల్ల ఈ రంగానికి అత్యంత అవసరమైన దీర్ఘకాలిక నిధులు వస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ నిర్ణయం బహుముఖ ప్రభావం చూపుతుంది. - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్ బీమా రంగ అభివృద్ధి పునరుద్ధరణకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. జీవిత బీమా, ఆరోగ్య బీమా కవరేజీ మెరుగుపడుతుంది. - అమితాబ్ చౌదరి, ఫిక్కీ ఇన్సూరెన్స్ కమిటీ చైర్మన్ బీమా రంగ సరళీకరణతో మోడీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి ఉందనే సందేశం గ్లోబల్ ఇన్వెస్టర్లకు వెళ్తుంది. దేశంలో ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంటు పునరుద్ధరణకు కూడా ఈ నిర్ణయం దోహదపడుతుంది. - రాణా కపూర్, అసోచామ్ అధ్యక్షుడు భారతీయ ప్రమోటర్ల యాజమాన్య అజమాయిషీపై తగినంత స్పష్టత రావాల్సి ఉంది. ఆ తర్వాత లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో మరో రూ.25 వేల కోట్ల వరకు అదనపు విదేశీ పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉంది. - శశ్వత్ శర్మ, కేపీఎంజీ (ఇండియా) భాగస్వామి పెట్టుబడుల సెంటిమెంటు పునరుద్ధరణకు ఎఫ్‌డీఐ పరిమితి పెంపు ఎంతగానో దోహదపడుతుంది. - శరద్ జైపురియా, పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు ఎఫ్‌డీఐ పెంపునకు కేబినెట్ ఆమోదముద్రతో బీమా రంగానికి ఎంతో అవసరమైన దీర్ఘకాలిక మూలధనం సమకూరుతుంది. - రాజేశ్ సూద్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈఓ -
రిలయన్స్ రికార్డు లాభం
క్యూ1లో రూ. 5,957 కోట్లు ఒక త్రైమాసికంలో బిలియన్ డాలర్లు ఆర్జించిన తొలి ప్రైవేట్ కంపెనీ అధిక రిఫైనింగ్ మార్జిన్లు, షేల్ గ్యాస్ వ్యాపారం ఊతం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయి నికర లాభాలు ఆర్జించాం. ప్రాంతీయంగా అంతటా రిఫైనింగ్ మార్జిన్లు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ.. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి దీన్ని సాధించగలిగాం. పెట్రోకెమికల్స్ విభాగం పనితీరు వ్యాపార వైవిధ్యంలో రిలయన్స్‌కి ఉన్న బలాన్ని తెలియజేస్తుంది. మరెన్నో కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతున్నాం. పోటీ సంస్థల కన్నా ముందుండేందుకు ఇవి తోడ్పడతాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్లతో పాటు కొత్త మార్కెట్లకూ రిటైల్ వ్యాపారాన్ని విస్తరించనున్నాం. - ముకేశ్ అంబానీ, సీఎండీ, ఆర్ఐఎల్ పెట్టుబడి ప్రణాళికలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 35,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు, ఇప్పటికే క్యూ1లో రూ. 8,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు రిలయన్స్ తెలిపింది. అలాగే, ఇంధన రిటైల్ వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో పునఃప్రారంభించేందుకు తగిన సమయం కోసం వేచిచూస్తున్నట్లు వివరించింది. తమ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కార్యకలాపాలను త్వరలో ప్రారంభించే దిశగా ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు, ఇప్పటికే పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపింది. న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రికార్డు లాభం ఆర్జించింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 13.7% వృద్ధితో రూ. 5,957 కోట్లు నమోదు చేసింది. తద్వారా ఒక త్రైమాసికంలో ఒక బిలియన్ డాలర్ల మేర ఆర్జించిన తొలి ప్రైవేట్ సంస్థగా నిల్చినట్లయిందని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లాభం రూ. 5,237 కోట్లు. షేరువారీగా చూస్తే లాభం రూ. 17.8 నుంచి రూ. 20.3కి చేరినట్లవుతుందని కంపెనీ తెలిపింది. మరోవైపు టర్నోవరు 7.2% వృద్ధితో రూ. 1,07,905 కోట్లకు చేరింది. అధిక రిఫైనింగ్ మార్జిన్లు, పెట్రోకెమికల్ వ్యాపార ఆదాయం పెరగడం, అమెరికాలో షేల్ గ్యాస్ వ్యాపారం పుంజుకోవడం రికార్డు ఫలితాలకు తోడ్పడ్డాయని సంస్థ చైర్మన్ ముకేశ్ తెలిపారు. 8.4 డాలర్లుగా జీఆర్ఎం.. ముడిచమురును శుద్ధి చేసి ఇంధనంగా మార్చినందుకు గాను కంపెనీకి ప్రతి బ్యారెల్‌పై లభించే స్థూల రిఫైనింగ్ మార్జిను (జీఆర్ఎం) 8.4 డాలర్ల నుంచి 8.7 డాలర్లకు పెరిగింది. అయితే, జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 9.3 డాలర్ల నుంచి తగ్గింది. మరోవైపు, రిఫైనరీ వ్యాపారం ఆదాయాలు 7.2%, పెట్రోకెమికల్ విభాగం ఆదాయాలు 9.3% మేర ఎగిశాయి. చమురు, గ్యాస్ ఉత్పత్తి విభాగం ఆదాయం అత్యధికంగా 27.3% మేర ఎగిసింది. అమెరికాలోని షేల్ గ్యాస్ వ్యాపారం పుంజుకోవడమే ఇందుకు కారణం. కాగా పెట్రోకెమికల్ వ్యాపారం నుంచి 25,398 కోట్లు. చమురు, గ్యాస్ వ్యాపార విభాగం ఆదాయాలు రూ. 3,178 కోట్లు వచ్చాయి. మరిన్ని విశేషాలు.. * 7.2 శాతం వృద్ధితో రూ. 98,081 కోట్లకు రిఫైనరీ వ్యాపార ఆదాయం. * జామ్‌నగర్ రిఫైనరీలో 16.7 మిలియన్ టన్నుల మేర చమురు ప్రాసెసింగ్ జరిగింది. * కేజీ-డీ6 క్షేత్రంలో 1 శాతం క్షీణించి 0.53 మిలియన్ బ్యారెళ్లకు తగ్గిన చమురు ఉత్పత్తి, 15 శాతం క్షీణించి 42 బిలియన్ ఘనపు అడుగులకు క్షీణించిన గ్యాస్ ఉత్పత్తి. * పన్నులకు ముందు రూ. 81 కోట్ల మేర లాభాలు నమోదు చేసిన రిటైల్ వ్యాపారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 148 నగరాల్లో 1,723 స్టోర్ల కార్యకలాపాలు. టర్నోవర్ 15శాతం వృద్ధితో రూ.3,999 కోట్లకు అప్. * కంపెనీ నగదు నిల్వలు రూ. 81,559 కోట్లు. * మార్చి 31 నాటితో పోలిస్తే రూ. 1,38,761 కోట్ల నుంచి జూన్ 30 నాటికి రూ. 1,35,769 కోట్లకు తగ్గిన రుణభారం. * దేశీయంగా చమురు, గ్యాస్ విభాగం నుంచి కంపెనీకి రూ. 1,557 కోట్లు మాత్రమే రాగా.. అమెరికా షేల్ గ్యాస్ ద్వారా అంతకన్నా ఎక్కువగా రూ. 1,617 కోట్లు వచ్చాయి. -
కొనసాగిన ఎగుమతుల జోరు
న్యూఢిల్లీ: భారత ఎగుమతులు 2014 జూన్‌లో (గత యేడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) 10.22 శాతం పెరిగాయి. ఈ విలువ 26.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతుల్లో వృద్ధి రెండంకెల్లో నమోదుకావడం వరుసగా ఇది రెండవనెల. అయితే వీటి వృద్ధి రేటు మేతో పోల్చితే (12.4 శాతం) తక్కువ కావడం గమనార్హం. ఇక దిగుమతులు ఇదే నెలలో 8.33 శాతం పెరిగి 38.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితంగా ఈ నెలలో ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 11 నెలల గరిష్ట స్థాయిలో 11.76 బిలియన్ డాలర్లుగా నిలిచింది. జూన్‌లో బంగారం దిగుమతులు పెరగడం కూడా వాణిజ్యలోటు ఎగయడానికి దారితీసింది. బుధవారం ఈ గణాంకాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసింది. రంగాల పరంగా చూస్తే... జౌళి (14.39% పెట్రోలియం ప్రొడక్ట్స్ (38.3%), ఇంజనీరింగ్ (21.57%), తోళ్లు (15%), సముద్ర ఉత్పత్తులు (27.49%), చమురు గింజలు (44.4%), పొగాకు (31%) ఎగుమతులు బాగున్నాయి. డిమాండ్ పెరగడం హర్షణీయం అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం వల్ల వృద్ధి రేటు రెండంకెల్లో నమోదయినట్లు ఎగుమతిదారుల సంస్థ ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అలాగే వర్థమాన దేశాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు గత ఏడాదికన్నా బాగుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ 312 బిలియన్ డాలర్లుగా ఉంది. 2014-15లో ఈ విలువ కనీసం 325 బిలియన్ డాలర్లను అధిగమించాలన్నది లక్ష్యం. క్యూ1లో వాణిజ్యలోటు సానుకూలమే జూన్‌లో వాణిజ్యలోటు పెరిగినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్)లో ఈ లోటు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 31 శాతం తగ్గింది. విలువ రూపంలో 33.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతులు పెరగడం, బంగారం దిగుమతులు భారీగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మూడు నెలల్లో ఎగుమతుల వృద్ధి రేటు 9.3 శాతంగా ఉంది. విలువ 80.11 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 6.92 శాతం వృద్ధితో 113.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
4% పెరగనున్న చక్కెర ఉత్పత్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది చెరకు సాగు రెండు శాతం తగ్గినా పంచదార ఉత్పత్తిలో మాత్రం నాలుగు శాతం వృద్ధి నమోదవుతుందని ఇండియన్ షుగర్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) ప్రాథమికంగా అంచనా వేసింది. 2014-15 (అక్టోబర్-సెప్టెంబర్) ఏడాదికి పంచదార ఉత్పత్తి నాలుగు శాతం పెరిగి 2.43 కోట్ల టన్నుల నుంచి 2.53 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనా. ఇప్పటికే 75 లక్షల టన్నుల చక్కెర నిల్వలు ఉండటం, ఉత్పత్తి పెరగనుండటంతో డిమాండ్‌కు ఇబ్బంది ఉండదని అంచనా వేసింది. దేశంలో ఈ ఏడాది 2.4 కోట్ల టన్నుల పంచదార అవసరమవుతుందని అంచనా. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాదిలో వర్షాలు సరిగా కురవకపోవడంతో చెరకు సాగు విస్తీర్ణం రెండు శాతం తగ్గే అవకాశం ఉందని ఐఎస్ఎంఏ చెపుతోంది. ఉపగ్రహ మ్యాప్‌లు ఆధారంగా చూస్తే గతేడాది కంటే రెండు శాతం తక్కువగా 52.3 లక్షల హెక్టార్లలో చెరకు సాగు అవుతుందని లెక్కకట్టింది. -
వృద్ధి, సంస్కరణలకు ఊతం
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలి బడ్జెట్.. వృద్ధి, సంస్కరణలకు ఊతమిచ్చే విధంగా ఉందని విదేశీ బ్రోకరేజి సంస్థల విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించిందని జపాన్‌కి చెందిన నొమురా సంస్థ ప్రెసిడెంట్ వికాశ్ శర్మ పేర్కొన్నారు. నిధుల కొరత వంటి పరిమితులు ఉన్నప్పటికీ.. మరిన్ని సంస్కరణలకు పునాది వేసే దిశగా మోడీ ప్రభుత్వపు తొలి బడ్జెట్ భారీ ప్రయత్నమే చేసినట్లుగా భావించవచ్చని బ్రిటన్ బ్రోకరేజి సంస్థ బార్క్లేస్ పేర్కొంది. దీర్ఘకాలికంగా ఎకానమీ వృద్ధి అవకాశాలను మెరుగుపర్చడంపై బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించారని ఆర్బీఎస్ ఇండియా సీనియర్ ఎకానమిస్టు గౌరవ్ కపూర్ తెలిపారు. పన్నుల విధానాల్లో పెద్దగా మార్పులు చేయకుండా.. ట్యాక్సులపరంగా స్పష్టతనిచ్చే ప్రయత్నాన్ని ఆర్థిక మంత్రి చేశారని ఆయన చెప్పారు. అయితే, బడ్జెట్ అంత గొప్పగా ఏమీ లేదని, చేయాల్సింది ఇంకా చాలా ఉందని బీఎన్పీ పారిబా వ్యాఖ్యానించింది. ఇందుకోసం ప్రస్తుత బడ్జెట్ పునాది వేసినట్లుగా భావించవచ్చని పేర్కొంది. ఇక, ద్రవ్య లోటును జీడీపీలో 4.1 శాతానికి తగ్గించుకోవాలన్నది చాలా పెద్ద లక్ష్యమేనని, ప్రస్తుత సబ్సిడీల వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని ఎస్బీఐ ఒక రీసెర్చ్ నివేదికలో తెలిపింది. బడ్జెట్లో విప్లవాత్మకమైన మార్పులేమీ లేకపోయినా .. సరైన దిశలో అర్థవంతమైన అడుగులతో ఆశలను సజీవంగా ఉంచగలిగిందని స్టాన్‌చార్ట్ అభిప్రాయపడింది. లక్ష్యాలు కష్టసాధ్యం: రేటింగ్ ఏజెన్సీలు ఓవైపు అంతంత మాత్రం ఆదాయం, మరోవైపు సబ్సిడీల భారం కారణంగా బడ్జెట్లో నిర్దేశించుకున్నట్లుగా ద్రవ్య లోటు కట్టడి వంటి లక్ష్యాలు కష్టసాధ్యమేనని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4.5 శాతాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది. ఆదాయం సమకూర్చుకోవడం, వ్యయాలు కట్టడి చేసుకోవడంపై బడ్జెట్లో స్పష్టత లేనందువల్ల భవిష్యత్‌లో ద్రవ్య లోటు లక్ష్యాలను ఏ విధంగా సాధించగలరన్నది అంచనా వేయడం కష్టసాధ్యంగా ఉంటుందని మూడీస్ ఒక నివేదికలో తెలిపింది. అయితే, ద్రవ్య లోటు తగ్గితే.. ప్రభుత్వానికి నిధులపరమైన ఊరట లభించడంతో పాటు దేశ సార్వభౌమ రేటింగ్ మెరుగుపడగలదని పేర్కొంది. -
బడ్జెట్... విశేషాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్ సుంకాల లక్ష్యాన్ని రూ.2,01,819 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. గతేడాది కస్టమ్స్ వసూళ్లు రూ.1,75,056 కోట్ల కంటే ఇది రూ.26,763 కోట్లు అధికం. ఎగుమతుల వృద్ధికి మిషన్ ... ఎగుమతుల అభివృద్ధి మిషన్‌ను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. కస్టమ్స్ అనుమతులను 24 గంటలూ ఇస్తుండే సౌకర్యాన్ని దేశంలోని మరో 13 విమానాశ్రయాలకు విస్తరిస్తామని తెలిపారు. ఈ-బిజ్ ప్లాట్‌ఫాంతో ప్రభుత్వ విభాగాల అనుసంధానం వ్యాపారవర్గాలు, ఇన్వెస్టర్లకు ప్రభుత్వ విభాగాలను మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ ఆఖరు నాటికల్లా కేంద్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, శాఖలు తమ సర్వీసులను ‘ఈ-బిజ్ ప్లాట్‌ఫాం’నకు అనుసంధానం చేయాలని ఆదేశించింది. ‘మినహాయింపు’ లేని పీఎఫ్ ట్రస్టులు పన్ను పరిధిలోకి? ఆదాయ పన్ను మినహాయింపు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ట్రస్టులు ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ పరిధిలోకి వచ్చే అవకాశముంది. ఈ ట్రస్టులు మినహాయింపు సర్టిఫికెట్ పొందేందుకు గడువును తాజా బడ్జెట్లో పొడిగించకపోవడమే ఇందుకు కారణం. బొగ్గు సమస్యల పరిష్కారానికి చర్యలు విద్యుత్ ప్లాంట్లకు కావాల్సిన స్థాయిలో బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు, నాణ్యతను మెరుగుపర్చేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తెలిపింది. విద్యుత్ కంపెనీలు, బొగ్గు సంస్థల మధ్య వివాదాల పరిష్కారిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.ఇనుప ఖనిజం సహా మైనింగ్ రంగంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జైట్లీ వివరించారు. సెజ్‌లకు పునరుజ్జీవం... ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌లు) పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని కేంద్రం స్పష్టంచేసింది. పారిశ్రామిక ఉత్పత్తి, ఆర్థిక ప్రగతి, ఎగుమతుల వృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కీలక సాధనాలుగా సెజ్‌లను తీర్చిదిద్దేందుకు గట్టి చర్యలు చేపడతామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. -
భారత్‌లోకి ‘చైనా యాపిల్’!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన షియోమి కంపెనీ భారత్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. చైనా యాపిల్‌గా ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీ ఎంఐ3 స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కు భారత్‌లో అందిస్తోంది. వచ్చేవారం నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమవుతాయని షియోమి వెబ్సైట్ పేర్కొంది. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ల విక్రయాలు జరిగే అవకాశాలున్నాయి. 86 సెకన్లలో లక్ష ఫోన్ల విక్రయాలు ఈ కంపెనీ ఎంఐయూఐ వీ5 పేరుతో ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ను కస్టమైజ్ చేసింది. ఎంఐయూఐ వీ5 ఓఎస్‌పై పనిచేసే ఈ ఎంఐ 3 స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల ఫుల్ హెచ్డీ 1080పి ఎల్సీడీ టచ్ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 800 2.3 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్, అడ్రెనో 330 450 మెగా హెర్ట్జ్ జీపీయూ, 2 జీబీ ర్యామ్, ఈఎంఎంసీ 4.5 ఫ్లాష్ మెమరీ, 16 జీబీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3050 ఎంఏహెచ్ లిథియమ్-ఐయాన్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ కంపెనీ ఉత్పత్తులకు చైనాలో ఎంత క్రేజ్ ఉందంటే, ఆన్లైన్లో ఎంఐ 3 ఫోన్లు 86 సెకన్లలోనే లక్ష అమ్ముడు కావడం విశేషం. ఆన్లైన్లోనే అమ్మకాలు షియోమి కంపెనీ ప్రపంచంలోనే ఆరవ, చైనాలో మూడో అతి పెద్ద మొబైల్ ఫోన్ల కంపెనీ. 2010లో ఈ కంపెనీని లీ జున్ ప్రారంభించారు. బీజింగ్ కేం ద్రంగా పనిచేసే ఈ కంపెనీ అనతికాలంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం ఈ సంస్థ ఇప్పటికే 1.7 కోట్ల హ్యాండ్సెట్లను విక్రయించింది. ఎంఐ 3, రెడ్మి, ఎంఐ వై-ఫై, ఎంఐ బాక్స్ తదితర హ్యాండ్సెట్లను అందిస్తోంది. ఈ కంపెనీ ఆన్లైన్లోనే తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. రిటైల్ స్టోర్స్‌లో ఎక్కడా తన ఫోన్లను విక్రయించదు. ఇక కంపెనీ మొత్తం ఆదాయంలో 1 శాతమే మార్కెటింగ్‌కు కేటాయిస్తోంది(శామ్సంగ్ కేటాయింపు 5.1%). ఇలా ఆదా చేసిన సొమ్ములతో నాణ్యమైన విడిభాగాలను కొనుగోలు చేసి అత్యంత ఆధునిక ఫీచర్లున్న ఫోన్లను తక్కువ ధరకే అందిస్తోంది. షియోమి కంపెనీ భారత కార్యకలాపాలను జబాంగ్ సహ వ్యవస్థాపకుడు మను కుమార్ జైన్ చూస్తారు. ఈ మేరకు షియోమి కం పెనీ ఆయనతో ఒప్పందం కుదుర్చుకుంది. హువాయి, జెడ్‌టీఈ, లెనొవొ, జియోని, అప్పో వంటి ఇతర చైనా కంపెనీలు ఇప్పటికే భారత్‌లో స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్నాయి. -
వృద్ధితో ద్రవ్యలోటు కట్టడి: జైట్లీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన తొలి బడ్జెట్ సమర్పణకు రెండు రోజుల ముందు ద్రవ్యలోటుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ద్రవ్యలోటును ఆమోదనీయ స్థాయిలో కట్టడి చేయడం అవసరమని ఉద్ఘాటించిన ఆయన, వృద్ధి, పన్నుల వసూళ్ల ద్వారా ఈ దిశలో ప్రభుత్వం ముందుకు కదులుతుందని అన్నారు. ద్రవ్యలోటు కట్టడికి వ్యయ నియంత్రణలు సరికాదన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం-చేసే వ్యయానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు జైట్లీ సమాధానమిస్తూ, ద్రవ్యలోటు గురించి వివరించారు. ద్రవ్యలోటు కట్టడికి ఆర్థిక వృద్ధే కీలకమని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (2014-15, ఏప్రిల్-మే) ద్రవ్యలోటు రూ.2.4 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఫిబ్రవరి 17న అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల్లో ఇది 45.6 శాతానికి సమానం. 2014-15లో మొత్తం ద్రవ్యలోటు రూ.5.28 లక్షల కోట్లకు కట్టడి చేయాలని చిదంబరం చివరి ఓటాన్ అకౌంట్ నిర్దేశించుకుంది. 2013-14 జీడీపీతో పోల్చిచూస్తే, ఆ యేడాది ద్రవ్యలోటు 4.5 శాతంగా ఉంది (రూ.5,08,149 కోట్లు). 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిమాణం 4.9 శాతం. 2016-17 నాటికి ఆర్థిక వృద్ధి ద్వారా జీడీపీలో ద్రవ్యలోటు శాతాన్ని 3 శాతానికి తగ్గించాలన్నది కేంద్రం లక్ష్యం. 2014-15 జీడీపీలో ద్రవ్యలోటు 4.1 శాతానికి కట్టడి చేయాలన్నది ఫిబ్రవరి 17 బడ్జెట్ లక్ష్యం. క్లెయిమ్ చేయని మొత్తం రూ.5వేల కోట్లు: కాగా రాజ్యసభ్యలో ఆర్థికశాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని మొత్తం నిధుల పరిమాణం 2013 డిసెంబర్ 31 నాటికి రూ.5,124 కోట్లని తెలిపారు. సంబంధిత డిపాజిటర్ల సమాచారాన్ని తెలుసుకోడానికి బ్యాంకింగ్ వ్యవస్థ తగిన చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా వెల్లడించారు. సంస్కరణలే వృద్ధికి బాట: కేంద్రం న్యూఢిల్లీ: సంస్కరణలతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఒక ప్రకటనలో కేంద్రప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్ ఆర్థికమంత్రి జార్జ్ ఆస్బోర్న్తో భారత్ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమావేశం అనంతరం ఈ మేరకు ఒక ప్రకటన వెలువడింది. సంస్కరణల అమలు ద్వారా రానున్న త్రైమాసికాల్లో వృద్ధి జోరందుకుంటున్న అభిప్రాయాన్ని ప్రకటన వ్యక్తం చేసింది. ఇటీవలి ప్రపంచ ఆర్థిక రికవరీ సంకేతాలు భారత్, బ్రిటన్లకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్లు పేర్కొంది. -
సిటీ గ్యాస్‌కు మంచిరోజులు!
న్యూఢిల్లీ: సహజవాయువు కేటాయింపు విధానంలో సమూల మార్పులకు మోడీ సర్కారు తెరతీయనుంది. ఇప్పటివరకూ ఉన్న ప్రాధాన్యత రంగాల్లో త్వరలోనే భారీ మార్పుచేర్పులు చోటుచేసుకోనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ కేటాయింపుల్లో యూరియాను తయారుచేసే ఎరువుల ప్లాంట్లకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆతర్వాత ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) ప్లాంట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాలు వరుసలో ఉన్నాయి. అయితే, ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్న సిటీ గ్యాస్ పంపిణీ(సీజీడీ) ప్రాజెక్టులకు మొట్టమొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. దీనిప్రకారం వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), అదేవిధంగా నగరాల్లో ఇళ్లకు నేరుగా పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ)ని సరఫరా చేసే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వంటి సీజీడీ కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఇక నుంచి ముందుగా గ్యాస్‌ను సరఫరా చేయాల్సి వస్తుంది. సీఎన్జీ, పీఎన్జీల వల్ల కాలుష్యం చాలావరకూ తగ్గుతుందని... అంతేకాకుండా సబ్సిడీతో విక్రయిస్తున్న డీజిల్, వంటగ్యాస్ల స్థానంలో వీటిని పెద్దమొత్తంలో అందించేందుకు వీలుందని ఆయావర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దేశీయంగా రోజుకు 77 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంసీఎండీ) గ్యాస్ సరఫరాల్లో ఐజీఎల్ వంటి సీజీడీ సంస్థలకు 8.32 ఎంసీఎండీల గ్యాస్ లభిస్తోంది. కొత్త నగరాల్లో కూడా సిటీ గ్యాస్ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ రంగం వృద్ధికి వీలుగా ప్రభుత్వం కేటాయింపుల్లో తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతిపాదిత కొత్త కేటాయింపుల విధానం ప్రకారం ఇప్పటివరకూ ప్రాధాన్య రంగాలకు కాకుండా ఇతర రంగాలకు చమురు శాఖ నిర్ణయించిన కేటాయింపుల నుంచి కోత విధించి సీజీడీకి అవసరమైన సరఫరాలకు మొదటి ప్రాధాన్యం కింద ఇవ్వనున్నారు. సహజవాయువు నుంచి అధికంగా ఉపఉత్పత్తులను సంగ్రహించే ప్లాంట్లకు రెండో స్థానం లభించనుంది. ఇక అణు ఇంధనం, అంతరిక్ష పరిశోధన వంటి వ్యూహాత్మక రంగాలకు గ్యాస్‌ను సరఫరా చేసే ప్లాంట్లకు కొత్త విధానంలో రెండో ప్రాధాన్య స్థానం దక్కనుంది. ఇక గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లకు నాలుగో స్థానం, విద్యుత్ ప్లాంట్లకు ఐదో ర్యాంక్ లభించనున్నాయి. ఉత్పత్తి పడిపోవడంతో... ప్రస్తుతం దేశీ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నిలిచిపోయిన నేపథ్యంలో సీజీడీ, ఎల్పీజీ రంగాలకు తప్ప ఇతర రంగాలన్నింటికీ కేటాయింపులను 2013-14 ఏడాదికి సరఫరా స్థాయిలవద్దే నిలిపేయాలని కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 2013-14లో ఎరువుల ప్లాంట్లకు 29.79 ఎంసీఎండీలు, విద్యుత్ ప్లాంట్లు 25.59, ఎల్పీజీ సంగ్రహణ ప్లాంట్లకు 1.83 ఎంసీఎండీలు, పెట్రోకెమికల్ ప్లాంట్లకు 3.32, రిఫైనరీలకు 1.89, స్టీల్ ప్లాంట్లకు 1.32 ఎంసీఎండీల చొప్పున గ్యాస్ లభించింది. కాగా, కేజీ-డీ6 తదితర నెల్ప్ బ్లాక్‌లు, గుజరాత స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్(జీఎస్పీసీ)కు చెందిన దీన్‌దయాళ్ గ్యాస్‌ల నుంచి భవిష్యత్తులో పెరగనున్న ఉత్పత్తిని గతేడాది ఆగస్టు 23న సాధికార మంత్రుల బృందం(ఈజీఓఎం) తీసుకున్న నిర్ణయం ప్రకారం విద్యుత్ ప్లాంట్లకు కేటాయించనున్నట్లు సమాచారం. అయితే, మోడీ సర్కారు ఈజీఓఎంల్‌ను రద్దు చేసిన నేపథ్యంలో కొత్త ప్రాధాన్య రంగాల జాబితాలను కార్యదర్శుల కమిటీ(సీఓఎస్) ఖరారు చేసి, త్వరలోనే తుది ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. -
జైట్లీకి ద్రవ్యలోటు గుబులు..?
న్యూఢిల్లీ: మోడీ సర్కారు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ద్రవ్యలోటు గుబులు వెంటాడుతోందా? తాజా పరిణామాలు... గణాంకాలు చూస్తే నిజమేనంటున్నారు నిపుణులు. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం లోటు లక్ష్యాన్ని అందుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఇప్పుడు జైట్లీ చేతులు కట్టేసేలా చేస్తున్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అందుకే సమయం చిక్కినప్పుడల్లా ఆర్థిక క్రమశిక్షణకే తమ తొలి ప్రాధాన్యతనీ... ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి గాడిలోపెట్టడానికి కొన్ని కఠిన చర్యలు తప్పవంటూ అటు మోడీ.. ఇటు జైట్లీ ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు కూడా. మతిలేని ప్రజాకర్షక పథకాల జోలికి తాము వెళ్లబోమని కూడా ఇటీవల జైట్లీ కుండబద్దలు కొట్టడానికి ద్రవ్యలోటు సెగే ప్రధాన కారణమని పరిశీలకులు చెబుతున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరిలో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో పోలిస్తే 4.1 శాతంగా నిర్ధేశించుకున్నారు. ఒక నిర్ధిష్ట సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, వ్యయాల మధ్య వ్యత్యాసాన్నే ద్రవ్యలోటుగా పేర్కొంటారు. అంటే చిదంబరం సుమారు రూ.5.28 లక్షల కోట్ల లోటును నిర్ధేశించారు. ఈ మొత్తాన్ని బాండ్ల జారీ ఇతరత్రా ప్రక్రియల్లో ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి వస్తుంది. అంతక్రితం ఏడాది(2013-14)లో ద్రవ్యలోటు సవరించిన అంచనా 4.6 శాతంకాగా, దీనికంటే తక్కువగానే 4.5 శాతంగా(రూ.5.08 లక్షల కోట్లు) నమోదైంది. అయితే, తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే(ఏప్రిల్, మే) రూ.2.4 లక్షల కోట్ల ద్రవ్యలోటు నమోదవడం కొత్త ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అంచనా వేసిన లోటులో 45.6 శాతం కావడం గమనార్హం. దీనిప్రకారం చూస్తే 4.1 శాతం లక్ష్యం నెరవేరడం అసాధ్యంగానే కనబడుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క, వర్షాభావ పరిస్థితులు కూడా లోటు కట్టడికి అడ్డంకిగా నిలవొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు తొలి రెండు నెలల్లోనే ఇంత లోటు ప్రధాన కారణం గత ప్రభుత్వం చెల్లింపులను వాయిదావేయడమే. వాస్తవానికి ప్రతి సంవత్సరం ఈ తంతు జరుగుతందని.. ఈ సారి కొద్దిగా మోతాదు ఎక్కువైందని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నివాస్ పేర్కొన్నారు. దీంతో జైట్లీకి చిదంబరం సగం ఖాళీ అయిన ఖజానాను అప్పగించినట్లయిందనేది పరిశీలకుల అభిప్రాయం. ఎందుకీ పరిస్థితి... తొలి రెండు నెలల్లోనే ద్రవ్యలోటు అంచనాల్లో సుమారు సగానికి చేరడానికి చెల్లింపులను కొత్త ఆర్థిక సంవత్సరంలోకి వాయిదా వేయడం ప్రధానంగా నిలిచింది. ఉదాహరణకు పెట్రోలియం శాఖనే తీసుకుంటే మొత్తం వార్షిక బడ్జెట్లో 39 శాతాన్ని ఏప్రిల్, మే నెలల్లోనే ఖర్చుకింద చూపింది. గతేడాది ఇదే నెలల్లో ఖర్చు నామమాత్రంగా ఉంది. అంటే గత ప్రభుత్వం చమురు కంపెనీలకు చెల్లించాల్సిన ఇంధన సబ్సిడీ చెల్లింపులను 2014-15లోకి వాయిదా వేసింది. ఈ ప్రభావంతో నిర్ధేశిత లోటు లక్ష్యాన్ని మించిపోయేలా వ్యయం వేగంగా ఎగబాకుతోంది. దీనివల్ల ఈ ఏడాది లోటు అంచనాలను అందుకోవడం కష్టసాధ్యంగా మారనుంది. గతేడాది ద్రవ్యలోటు లక్ష్యం కంటే తక్కువగా 4.5 శాతానికి కట్టడయ్యేందుకు ఈ వాయిదా మంత్రంతో పాటు ఆదాయపరంగా ప్రభుత్వ రంగ కంపెనీల నుంచి ఖజానాకు అధిక డివిడెండ్లు లభించడం కూడా ఒక కారణంగా నిలిచింది. బడ్జెట్లో అంచనా వేసినదానికంటే ప్రభుత్వ కంపెనీల నుంచి 44 శాతం డివిడెండ్ చెల్లింపులు పెరగడం విశేషం. అయితే, ఈ ఏడాది ఈ మొత్తం తగ్గుముఖం పట్టొచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఒక ఏడాది అధిక డివిడెండ్లను డిమాండ్ చేశాక వరుసగా రెండో సంవత్సరంకూడా ఆ విధంగా ఒత్తిడి చేయడం కష్టమేనన్నది నిపుణుల అభిప్రాయం. ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వ మొత్తం వ్యయం రూ.2.8 లక్షల కోట్లు(మొత్తం వార్షిక అంచనాల్లో 15.9 శాతం) కాగా.. ఆదాయం రూ.38,505 కోట్లు(వార్షిక అంచనాల్లో 3.3 శాతం) మాత్రమే వచ్చింది. కాగా, తాజా పరిస్థితులను గమనిస్తే.. ఈ ఏడాది ద్రవ్యలోటు 4.3-4.5 శాతంగా ఉండొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నెల 10న జైట్లీ ప్రవేశపెట్టనున్న మొట్టమొదటి బడ్జెట్లో మరి ద్రవ్య లోటు అంచనాలను తగ్గిస్తారో... లేదంటే సబ్సిడీల కోత ఇతరత్రా చర్యలతో కట్టడి చేస్తారో వేచిచూడాల్సిందే. ఏం చేయాల్సి వస్తుంది... ప్రభుత్వ వ్యయాలను అదుపులో పెట్టడం, అనవసర సబ్సిడీల కోతతో పాటు ఆదాయ మార్గాలను పెంచుకోవడం కూడా ద్రవ్యలోటు కట్టడికి చాలా కీలకం. అందుకే ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో వాటాల అమ్మకం(డిజిన్వెస్ట్‌మెంట్) ప్రక్రియను జైట్లీ మరింత వేగవంతం చేసే అవకాశాలున్నాయి. ఇంకా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ను వీలైనంత వేగంగా అమలు చేయడం, వృద్ధి రేటు పెంపు చర్యలు వంటివి ద్రవ్యలోటును కళ్లెం వేసేందుకు ఉపకరిస్తాయని క్రిసిల్ అభిప్రాయపడింది. ఇదిలాఉండగా.. జైట్లీ బడ్జెట్లో సంస్కరణల జోరు, ద్రవ్యలోటు కట్టడి చర్యలపైనే తమ భవిష్యత్తు రేటింగ్ అవుట్‌లుక్ ఆధారపడి ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలైన మూడీస్, ఎస్అండ్పీ చెప్పడం గమనార్హం. అసలే కొత్త ప్రభుత్వం, దీనికితోడు ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన నేపథ్యంలో వస్తూనే సబ్సిడీల కోత వంటివి అమలు చేయడం జైట్లీకి కత్తిమీదసామే. అయితే, ఇప్పటికే రైల్వే చార్జీల భారీ పెంపుతో మోడీ కఠిన చర్యల తొలి సంకేతాలొచ్చాయి. మరి బడ్జెట్లో మరెన్ని చేదుగుళికలు ఉంటాయో కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. -
ఆదాయం ఓకే.. మార్జిన్లు డీలా!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో ఐటీ కంపెనీల ఆదాయాలు పుంజుకుంటాయని నిపుణులు అంచనా వేశారు. దేశీయంగా, అభివృద్ధి చెందిన మార్కెట్లలోనూ సాఫ్ట్వేర్ సేవలకు కనిపిస్తున్న డిమాండ్ ఇందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అయితే సిబ్బంది జీతాల పెంపు నేపథ్యంలో లాభదాయకత(మార్జిన్లు) తగ్గవచ్చునని అభిప్రాయపడ్డారు. తొలి క్వార్టర్ కీలకం... సాధారణంగా ఐటీ, బీపీవో రంగానికి తొలి క్వార్టర్(క్యూ1) కీలకంగా నిలుస్తుంది. క్లయింట్ల బడ్జెట్లు మొదలయ్యే కారణంగా సాఫ్ట్వేర్ సేవల కంపెనీల ఆదాయాలు మెరుగ్గా నమోదవుతాయి. దేశీ ఐటీ, బీపీవో పరిశ్రమ విలువ 118 బిలియన్ డాలర్ల స్థాయికి ఎదిగిన నేపథ్యంలో కంపెనీల ఆదాయాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెచ్ దీపేన్ షా చెప్పారు. అభివృద్ధి చెందిన మార్కెట్ల నుంచి ఐటీ సేవలకు పటిష్ట డిమాండ్ కనిపిస్తున్న నేపథ్యంలో డాలర్ల రూపేణా ఆదాయంలో వృద్ధి కనిపిస్తుందని అంచనా వేశారు. క్రాస్ కరెన్సీ ప్రయోజనాలవల్ల 30-40 బేసిస్ పాయింట్లమేర అధిక ఆదాయం నమోదుకాగలదని చెప్పారు. అయితే త్రైమాసిక ప్రాతిపదికన చాలావరకూ కంపెనీల మార్జిన్లు ఒత్తిడిలో పడే అవకాశముందన్నారు. ఇందుకు సిబ్బంది జీతాల పెంపు, అధిక వీసా వ్యయాలు, రూపాయి పుంజుకోవడం వంటి అంశాలను పేర్కొన్నారు. ఈ మూడు అంశాల వల్ల నిర్వహణ లాభాలు 1.3-2.3% మధ్య మార్జిన్లు క్షీణించే అవకాశముందని ఎంకే తెలిపింది. 11న ఇన్ఫీతో షురూ: ఇన్ఫోసిస్‌తో ఐటీ కంపెనీల ఫలితాల సీజన్ మొదలుకానుంది. ఈ నెల 11న ఇన్ఫోసిస్ క్యూ1 పనితీరును వెల్లడించనుంది. 17న టీసీఎస్, 24న విప్రో ఫలితాలు ప్రకటించనున్నాయి. మొత్తంగా యూఎస్, యూరప్‌లలో సాఫ్ట్వేర్ సేవలకు పటిష్ట డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని కంపెనీలు ప్రకటించనున్న అంచనాల(గెడైన్స్) ద్వారా వెల్లడికానుందని ఆనంద్ రాఠీ పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన డాలర్ల రూపంలో ఐటీ కంపెనీల ఆదాయం సగటున 3.4% వృద్ధిని సాధించవచ్చునని నోమురా అంచనా వేసింది. -
మార్కెట్ల ట్రెండ్ నిర్దేశానికి చాన్స్
ఇకపై స్టాక్ మార్కెట్ల దిశను నిర్దేశించే పలు కీ లక పరిణామాలు ఈ వారం చోటుచేసుకోనున్నట్లు నిపుణులు తెలిపారు. సామాన్యుడి దగ్గర్నుంచీ సంపన్నుల వరకూ, ఇటు రిటైల్ ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి అటు మార్కెట్ వర్గాల వరకూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర వార్షిక బడ్జెట్ గురువారం(10న) వెలువడనుంది. అంతకుముందే మోడీ ప్రభుత్వం లోక్‌సభలో మంగళవారం(8న) రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆపై బుధవారం(9న) ఆర్థిక సర్వే వెల్లడికానుంది. ఇవికాకుండా శుక్రవారం సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఏడాది తొలి క్వార్టర్(2013-14, ఏప్రిల్-జూన్) ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. ఇదే రోజున మే నెలకుగాను పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ఇలాంటి పలు అంశాల నేపథ్యంలో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు అత్యంత కీలకంగా నిలవనున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితాల సీజన్ షురూ! ఇన్ఫోసిస్ ఫలితాలతో ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ1 ఫలితాల సీజన్ మొదలుకానుంది. కార్పొరేట్ల ఫలితాలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపనున్నప్పటికీ గురువారం వెలువడనున్న సాధారణ బ డ్జెట్పైనే దేశ, విదేశీ ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థ పురోగతికి సహాయపడే చర్యలుంటాయని భావిస్తున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. దీంతో మార్కెట్లు పటిష్టంగా ట్రేడయ్యే అవకాశముందని అంచనా వేశారు. అయితే పలు గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఈ వారం మార్కెట్లలో భారీ హెచ్చుతగ్గులకు అవకాశంలేకపోలేదని వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు రిస్క్‌మేనేజ్‌మెంట్ నిబంధనలను అనుసరించడం మేలు చేకూరుస్తుందని సలహా ఇచ్చారు. ర్యాలీ కొనసాగుతుంది... ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌పై మార్కెట్ వర్గాలలో గరిష్టస్థాయిలో అంచనాలున్నాయని, దీంతో గడిచిన వారంలో కనిపించిన ర్యాలీ మరింత జోరందుకోవచ్చునని అత్యధిక శాతంమంది నిపుణులు అంచనా వేశారు. వృద్ధి, సంస్కరణలపై మోడీ ప్రభుత్వం చూపుతున్న ఆసక్తి ఇందుకు దోహదపడుతుందని తెలిపారు. మార్కెట్లలో నెలకొన్న భారీ అంచనాల నేపథ్యంలో బడ్జెట్ తరువాత కూడా ర్యాలీ కొనసాగేందుకు అవకాశముందని యాంప్లస్ కన్సల్టింగ్ ఎండీ ప్రవీణ్ నిగమ్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా హెల్త్‌కేర్, ఇన్ఫ్రా, రక్షణ రంగాలు వెలుగులో నిలిచే వీలుందని పేర్కొన్నారు. రుతుపవనాల ఎఫెక్ట్ బడ్జెట్, ఫలితాలు, ఐఐపీ గణాంకాలకుతోడు రుతుపవనాల గమనం కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు వివరించారు. కాగా, సోమవారం(7) నుంచీ మార్కెట్లు మరింత పుంజుకుంటాయని జయంత్ అంచనా వేశారు. గడిచిన వారం మార్కెట్లు 3.5% ర్యాలీ చేయడం ద్వారా కొత్త రికార్డులను నమోదు చేశాయి. మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 862 పాయింట్లు లాభపడి కొత్త గరిష్టం 25,962 వద్ద నిలవగా, ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం 243 పాయింట్లు పురోగమించి 7,752 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఫండ్స్ పెట్టుబడులు 3,300 కోట్లు ఈక్విటీలలో దేశీ మ్యూచువల్ ఫండ్స్ జూన్ నెలలో రూ. 3,300 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. తద్వారా మార్కెట్లలో కనిపిస్తున్న పటిష్ట ర్యాలీ నేపథ్యంలో వరుసగా రెండో నెలలోనూ నికర పెట్టుబడిదారులుగా నిలిచాయి. అంతక్రితం మే నెలలో నికరంగా ఈక్విటీలలో రూ. 105 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. కాగా, మరోవైపు డెట్ మార్కెట్లో ఫండ్స్ మరింత అధికంగా ఇన్వెస్ట్చేయడం గమనార్హం. గడిచిన నెలలో ఫండ్స్ నికరంగా రూ. 68,000 కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశాయి. నిజానికి దేశీ మ్యూచువల్ ఫండ్స్ గతేడాది సెప్టెంబర్ నుంచీ ఈక్విటీలలో నికర అమ్మకందారులుగా నిలుస్తూ వచ్చాయి. తొలిసారి ఈ బాటను వీడి మే నెలలో నికర కొనుగోలుదారులుగా నిలవడం విశేషం. కొనసాగుతున్న ఎఫ్ఐఐల జోరు.. దేశీ క్యాపిటల్ మార్కెట్లో ఈ క్యాలెండర్ ఏడాది తొలి అర్ధభాగంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు 20.4 బిలియన్ డాలర్లకు(రూ. 1.23 లక్షల కోట్లు) చేరాయి. జనవరి-జూన్ కాలంలో ఎఫ్ఐఐలు నికరంగా ఈక్విటీలలో 9.96 బిలియన్ డాలర్లను(రూ. 59,795 కోట్లు), డెట్ మార్కెట్లో 10.42 బిలియన్ డాలర్లను(రూ. 62,834 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం, సంస్కరణలు, వృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టడం వంటి అంశాలు విదేశీ పెట్టుబడులకు కారణంగా నిలుస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తొలి ఆరు నెలల్లో మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 20% దూసుకెళ్లింది. -
దయతో బెయిల్ ఇవ్వండి
న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా తీహార్ జైలులో నిర్బంధంలో ఉన్న తనకు ‘దయతో’ తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని సహారా చీఫ్ సుబ్రతారాయ్ శుక్రవారం సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తద్వారా గ్రూప్ ఆస్తులను విక్రయించి రెగ్యులర్ బెయిల్‌కు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్- సెబీ వద్ద డిపాజిట్ చేయాల్సిన రూ.10,000 కోట్ల సమీకరించడానికి వీలుకలుగుతుందని వివరించారు. దీనిపై న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తన ఉత్తర్వులను రిజర్వ్ చేసుకుంది. ఐటీ అఫిడవిట్‌కు 2 వారాల గడువు... కాగా కేసుకు సంబంధించి గ్రూప్ కంపెనీలు తనకూ రూ.7,000 కోట్ల పన్ను చెల్లింపులు జరపాల్సి ఉందని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ వివరాలు తెలుపుతూ రెండు వారాల్లో ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. -
స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘వివిధ దేశాల నుంచి వస్తూత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. దీంతో దేశీయ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమ కుదేలవుతోంది. ఈ రంగంలో ఆధారపడ్డ లక్షలాది మంది భవిష్యత్ ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. భార త సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమ నిలబడాలంటే దిగుమతుల కట్టడి ఒక్కటే పరిష్కారమని అసోసియేషన్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్(ఏఎస్‌ఎస్‌ఐ) కేంద్రానికి స్పష్టం చేసింది. వివిధ దేశాలతో ఉన్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రాను ఢిల్లీలో కలిసి విన్నవించినట్టు ఏఎస్‌ఎస్‌ఐ కన్వీనర్ రాజ మహేందర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇన్స్పెక్టర్ రాజ్ వ్యవస్థకు స్వస్తి పలకాలని కోరినట్టు చెప్పారు. పాత కంపెనీలకూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కంపెనీలకు ఇవ్వబోయే ప్రయోజనాలను పాత కంపెనీలకూ వర్తింపజేయాలని మంత్రిని కోరామని ఫెడరేషన్ ఆఫ్ స్మాల్, మీడియం ఎంటర్ప్రైసెస్ ప్రెసిడెంట్ ఏపీకే రెడ్డి చెప్పారు. ‘ప్రభుత్వానికి చెల్లించిన పెనాల్టీలను తిరిగి కంపెనీలకు చెల్లించాలి. పెట్టుబడి పరిమితి విషయంలో రూ.1 కోటి వరకు సూక్ష్మ స్థాయి కంపెనీగా పరిగణించాలి. రూ.1-10 కోట్ల మధ్య చిన్నతరహా, రూ.10-25 కోట్ల మధ్య పెట్టుబడిని మధ్యతరహా కంపెనీగా పరిగణించాలి. రూ.5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టిన కంపెనీకి ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలి. పెట్టుబడి సబ్సిడీని ప్రస్తుతమున్న రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచాలి’ అని మంత్రికి విన్నవించామన్నారు. రూరల్ క్లస్టర్లు.. ఉపాధిని పెంచేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలను స్థాపించాలని పారిశ్రామిక సంఘాలకు మంత్రి కల్రాజ్ మిశ్రా పిలుపునిచ్చారు. పరిశ్రమ డిమాండ్లను నెరవేరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో క్లస్టర్ల స్థాపనకు తాము సిద్ధమేనని మంత్రికి చెప్పామని రాజ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆగస్టులో హైదరాబాద్‌లో జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే విధాన నిర్ణయాల్లో తమనూ భాగస్వాములను చేయాలని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.సుధీర్‌రెడ్డి మంత్రిని కోరారు. మంత్రిని కలిసినవారిలో ఫ్యాప్సీ, ప్లాస్టిక్, ఫౌండ్రీ అసోసియేషన్లు, అలీప్ తదితర పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు. -
ఇన్ఫీ ఆదాయాన్ని మూర్తి పెంచారు: కామత్
విశాల్ మరింత వృద్ధి సాధిస్తారని వ్యాఖ్య న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ఆదాయాన్ని పెంచడంలో కంపెనీ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సఫలీకృత ం అయ్యారని నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కేవీ కామత్ పేర్కొన్నారు. కొత్త సీఈవోగా ఎంపికైన విశాల్ శిక్కా భవిష్యత్‌లో కంపెనీని మరింత వృద్ధిబాటన నడిపిస్తారని అభిప్రాయపడ్డారు. ఇన్ఫోసిస్ ప్రస్తుత సీఈవో శిబూలాల్ నుంచి శిక్కా ఆగస్ట్‌లో బాధ్యతలను స్వీకరించనున్నారు. కంపెనీ వ్యవస్థాపకులు లేదా ఎగ్జిక్యూటివ్‌ల నుంచి కాకుండా ఇతర సంస్థలో బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిని ఇన్ఫోసిస్ సీఈవోగా ఎంపిక చేయడం ఇదే తొలిసారికావడం గమనార్హం. కాగా, ఇన్ఫీని గాడిలో పెట్టేందుకు రెండోసారి అత్యున్నత పదవీ బాధ్యతలు చేపట్టిన నారాయణమూర్తి అమ్మకాలు పెంచడంపై దృష్టిపెట్టారని, ఇకపై శిక్కా ఈ ఎజెండాను ముందుకు తీసుకువెళతారని కామత్ వ్యాఖ్యానించారు. గతేడాది జూన్‌లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మూర్తి పదవీ బాధ్యతలను చేపట్టిన విషయం విదితమే. సానుకూల ధృక్పథంతోనే విజయాలను సాధించగలమని, ఇన్ఫోసిస్‌ను తాను ఈ దృష్టితోనే చూస్తానని చెప్పారు. నారాయణమూర్తి ఈ నెల 14న ఇన్ఫోసిస్‌ను వీడారు. 1981లో ఆవిర్భవించిన ఇన్ఫోసిస్ 8 బిలియన్ డాలర్ల(రూ. 48,000 కోట్లు) కంపెనీగా నిలిచింది. -
పోంజీ ఆర్డినెన్సుకు త్వరలో చట్ట రూపం
సెబీ చైర్మన్ సిన్హా ఆశాభావం న్యూఢిల్లీ: స్వల్ప కాలంలో అధిక ఆదాయాన్ని ఆశచూపి అక్రమ పద్ధతుల్లో పెట్టుబడులను ఆకర్షించే (పోంజీ) స్కీముల నిరోధానికి జారీ చేసిన ఆర్డినెన్సు త్వరలోనే చట్ట రూపం దాలుస్తుందని సెబీ చైర్మన్ యు.కె.సిన్హా ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆయన ప్రసంగించారు. మదుపర్లను మోసగిస్తూ అక్రమ పద్ధతుల్లో డిపాజిట్ల సేకరణ ఇప్పటికీ భారీగా కొనసాగుతోందని పేర్కొన్నారు. పోంజీ వ్యతిరేక ఆర్డినెన్సును గతేడాది నుంచి ఇప్పటికి 3 సార్లు జారీ చేశా రు. వచ్చే నెలలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదిస్తే చట్టరూపం దాలుస్తుంది. పన్ను ప్రయోజనాలపై స్పష్టత.. క్యాపిటల్ మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల (ఆర్ఈఐటీ) వంటి కొత్త ప్రొడక్టులపై పన్ను ప్రయోజనాలకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని సిన్హా కోరారు. ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు, డెబిట్ సెక్యూరిటీలకు ట్యాక్స్ బెనిఫిట్లపైనా స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఆర్‌ఈఐటీలకు సంబంధించిన నిబంధనలను సెబీ త్వరలోనే ఖరారు చేస్తుందనీ, అయితే పన్ను సంబంధ అంశాల్లో స్పష్టత కోసం ఎదురుచూస్తున్నామనీ తెలిపారు. ఏకరీతి పన్నులు అవసరం.. బాండ్ మార్కెట్లో లోటుపాట్ల తొలగింపునకు ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించాల్సి ఉందని సెబీ చైర్మన్ పేర్కొన్నారు. ప్రస్తుతం బాండ్లలో పెట్టుబడులు చేసే సంస్థలపై పన్ను రేట్లు భిన్న రకాలుగా ఉన్నాయని చెప్పారు. లోటుపాట్లున్నంత కాలం వీటిలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు సందేహిస్తారని అన్నారు. ఇన్వెస్టర్లందరిపైనా పన్నులు ఒకే రకంగా ఉండాలని తెలిపారు. -
గ్యాస్ ధరపై త్వరగా నిర్ణయం
పెట్రోలియం మంత్రిని కోరిన బీపీ చీఫ్ మాస్కో: కృష్ణా గోదావరి బేసిన్‌లోని కేజీ డీ6 క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తి పెంపునకు గ్యాస్ ధర సవరణ, చట్ట సంబంధ అనుమతులు అవరోధాలుగా మారిన నేపథ్యంలో బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డూబ్లే భారత పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. మాస్కోలో మంగళవారం ప్రపంచ పెట్రోలియం సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాన్‌ను ఆయన కలుసుకున్నారు. గ్యాస్ ధరల పెంపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా డూబ్లే కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేజీ డీ6తో సహా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన 21 చమురు, గ్యాస్ బ్లాకుల్లో 30 శాతం వాటాను బీపీ 2011లో 720 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కేజీ డీ6లో నానాటికీ క్షీణిస్తున్న ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ అనుమతులు జాప్యం కావడం బీపీకి నిరాశ కలిగించింది. గ్యాస్ ధరను గత ఏప్రిల్ 1 నుంచి పెంచాల్సి ఉన్నప్పటికీ పెంచలేదనే విషయాన్ని మంత్రి దృష్టికి డూబ్లే తెచ్చారు. కేజీ డీ6లో ప్రస్తుతం రోజుకు 13 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. మూడేళ్ల కిందటి ఉత్పత్తితో పోలిస్తే ఇది కేవలం ఐదో వంతే. ధరల పెంపుపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే తమ పెట్టుబడుల నిర్ణయాలు కొలిక్కి వస్తాయని బీపీ చెబుతోంది. -
ధరల కట్టడే లక్ష్యం...
ఇరాక్ సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొంటాం తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయ్... క్యాడ్ కూడా భారీగా దిగొచ్చింది... ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడి ముంబై: ధరల పెరుగుదలకు కళ్లెం వేయడమే తమ ప్రధాన కర్తవ్యమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. రానున్న కొద్ది త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా తమ చర్యలు కొనసాగుతాయని... దీనిపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో అధిక ధరలకు అడ్డుకట్టవేయాలంటే ప్రభుత్వం ఆహారోత్పత్తులకు సంబంధించి తగిన నిర్వహణ విధానాలను అమలు చేయాల్సి ఉంటుందని రాజన్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణ పరిస్థితులను ఆర్బీఐ, ప్రభుత్వం నిశితంగా గమనిస్తున్నాయని, గత రెండు మూడు నెలలుగా ఆహార ధరలు మళ్లీ పుంజుకుంటున్నట్లు ఆయన చెప్పారు. మంగళవారమిక్కడ ఎస్బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మే నెలలో టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణంరేటు ఐదు నెలల గరిష్టానికి(6.01%) ఎగబాకిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ఈ రేటు 5.2%. ఆహారోత్పత్తులు, నిత్యావసరాల రేట్లు ఎగబాకడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. కాగా, ఎల్ నినోతో ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవచ్చని... దీంతో ద్రవ్యోల్బణం మరింత ఎగబాకే ప్రమాదం పొంచిఉందన్న ఆందోళనలు అధికమవుతున్నాయి. కాగా, రాజన్ తాజా వ్యాఖ్యలతో ఇప్పట్లో పాలసీ వడ్డీరేట్ల తగ్గింపు ఉండబోదన్న సంకేతాలు బలపడుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇరాక్ అనిశ్చితిపై... ఇరాక్‌లో అంతర్యుద్ధం కారణంగా నెలకొన్న సంక్షోభం సహా ఎలాంటి పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కోగల సత్తా భారత్‌కు ఉందని రాజన్ పేర్కొన్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకోవడంలో మనం మరింత మెరుగైన స్థితిలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘దేశంలో తగినన్ని విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు ఉన్నాయి. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా భారీగా దిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఇరాక్ సహా ఇతరత్రా ఎలాంటి అంతర్జాతీయ సంక్షోభాలు ఎదురైనా మనకు ముప్పేమీ లేదు. ఇరాక్‌లో చమురు నిల్వలన్నీ దక్షిణ ప్రాంతంలోనే ఉన్నాథ యి. అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధం ఆ దేశ క్రూడ్ బిజినెస్‌పై పెద్దగా ప్రభావమేమీ చూపకపోవచ్చు. అయినప్పటికీ ఈ అంశం కొంత ఆందోళనకరమైనదే. అక్కడి సంక్షోభాన్ని నిశితంగా గమనిస్తున్నాం’ అని రాజన్ పేర్కొన్నారు. బంగారం ఇతరత్రా దిగుమతులు దిగిరావడంతో గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో క్యాడ్ జీడీపీలో 1.7 శాతానికి(32.4 బిలియన్ డాలర్లు) తగ్గడం రూపాయిపై కొంత ఒత్తిడి తగ్గించింది. అంతేకాదు ఆఖరి త్రైమాసికంలో అయితే, ఈ లోటు ఏకంగా 0.2 శాతానికి(1.2 బిలియన్ డాలర్లు) పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టమైన 4.7 శాతానికి(87.8 బిలియన్ డాలర్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే. ఇరాక్ ప్రభుత్వంపై సున్నీ తీవ్రవాదుల భీకర దాడులు... చాలా ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో చమురు ధరలకు రెక్కలు రావడం తెలిసిందే. ఈ సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలోనూ తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి కూడా. దీంతో డాలరుతో రూపాయి మారకం విలువ కూడా మళ్లీ 60 దిగువకు పడిపోవడం గమనార్హం. క్రూడ్ రేట్ల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం కూడా ఎగబాకే ప్రమాదం పొంచిఉంది. కాగా, చమురు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్న భారత్‌కు క్రూడ్ రేట్ల పెరుగుదల ఇబ్బందికర అంశమే. -
చివర్లో లాభాల గోల్
331 పాయింట్ల హైజంప్ 25,521కు ఎగసిన సెన్సెక్స్ నిఫ్టీ 98 పాయింట్లు ప్లస్ రెండు వారాల్లో గరిష్ట లాభం ఇరాక్ యుద్ధ భయాలు కొనసాగుతున్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. చివరి గంటన్నరలో ఊపందుకున్న కొనుగోళ్లతో హైజంప్ చేశాయి. వెరసి సెన్సెక్స్ 331 పాయింట్లు ఎగసి 25,521 వద్ద నిలిచింది. ఇది గత రెండు వారాల్లోనే అత్యధిక లాభంకాగా, నిఫ్టీ కూడా 98 పాయింట్లు పుంజుకుని 7,632 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంతక్రితం ఈ నెల 6న మాత్రమే ఈ స్థాయిలో 377 పాయింట్లు లాభపడింది. గత రెండు రోజుల నష్టాలను తలపిస్తూ తొలుత అమ్మకాలు కొనసాగాయి. దీంతో సెన్సెక్స్ మిడ్ సెషన్లో 25,104 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. ఆపై నెమ్మదిగా కోలుకుంటూ వచ్చింది. మధ్యాహ్నం రెండు తరువాత అన్ని వర్గాల నుంచీ కొనుగోళ్లు పెరగడంతో భారీ లాభాలతో దూసుకెళ్లింది. ఒక దశలో గరిష్టంగా 25,546 పాయింట్ల వరకూ ఎగసింది. చివరికి అదే స్థాయిలో స్ధిరపడింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 386 పాయింట్లు పతనమైన విషయం విదితమే. బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడగా ఆయిల్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, పవర్, మెటల్ 3-1.5% మధ్య పురోగమించాయి. ఆయిల్ షేర్ల జోష్ అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గడంతో ఆయిల్ షేర్లు ఓఎన్జీసీ, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, గెయిల్, ఆర్ఐఎల్ 4-2.5% మధ్య పుంజుకున్నాయి. బ్యాంకింగ్ ఓకే బ్యాంకింగ్ దిగ్గజాలు యాక్సిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ 4-2.5% మధ్యలో పురోగమించగా, ఫెడరల్ బ్యాంక్, బీవోఐ, పీఎన్బీ, ఇండస్ఇండ్, బీవోబీ, కెనరా, యస్ బ్యాంక్ సైతం 5-3% మధ్య ఎగశాయి. బ్లూచిప్స్ జోరు ఇతర బ్లూచిప్స్‌లో కోల్ ఇండియా, భెల్, సెసాస్టెరిలైట్, టాటా మోటార్స్, ఎల్అండ్టీ, భారతీ, మారుతీ 3-2% మధ్య లాభపడ్డాయి. ఆరు మాత్రమే : సెన్సెక్స్లోఎంఅండ్ఎం, హీరోమోటో, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో 1.5-0.5% మధ్య క్షీణించగా, సిప్లా నామమాత్రంగా నష్టపోయింది. చిన్న షేర్ల దూకుడు సెంటిమెంట్‌కు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2% స్థాయిలో ఎగశాయి. ట్రేడైన షేర్లలో ఏకంగా 2,046 లాభపడితే, 953 మాత్రమే నష్టపోయాయి. బీఎస్ఈ-500 పరుగు బీఎస్ఈ-500లో భాగమైన జేపీ ఇన్ఫ్రా, సియట్, హెచ్ఎంటీ, వ్యాబ్కో, చంబల్, సింటెక్స్, ఆర్సీఎఫ్, స్టెరిలైట్ టెక్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్, మోతీలాల్ ఓస్వాల్, ఎంటీఎన్ఎల్, జేకే లక్ష్మీ సిమెంట్, ఐఆర్బీ ఇన్ఫ్రా, గృహ్ ఫైనాన్స్ తదితరాలు 13-7% మధ్య దూసుకెళ్లాయి. -
ఉత్పాదకత, ఉన్నత ఆలోచనలు
వీటిపై దృష్టిపెట్టి సాహసోపేతంగావ్యవహరించండి * ఉద్యోగులకు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఉద్బోధ * ఇన్ఫీకి మరోసారి గుడ్‌బై బెంగళూరు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నెగ్గుకురావాలంటే వ్యక్తిగత ఉత్పాదకతపైనా, ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్‌పైనా మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సంస్థ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి సూచించారు. ప్రతి ఇన్ఫోసియన్ (ఇన్ఫోసిస్ ఉద్యోగి) గొప్పగా ఆలోచించాలని, సాహసోపేతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కంపెనీ సీఈవో పగ్గాలను విశాల్ సిక్కాకి అప్పగించిన నేపథ్యంలో నారాయణమూర్తి శనివారం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి మరోసారి వైదొలిగారు. 33వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా షేర్హోల్డర్లు, ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వీడ్కోలు ప్రసంగంలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. గడచిన ఏడాది కాలంగా తాను చేపట్టిన చర్యలతో కంపెనీ వ్యయాలు, రిస్కులు తగ్గగలవని, అమ్మకాలు మెరుగుపడగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్లు వైదొలగడంపై.. ఇటీవలి కాలంలో సీనియర్ల వలసకు కారణాలపై స్పందిస్తూ.. కొందరు ఉన్నత లక్ష్యాల సాధన కోసం వెళ్లగా, మరికొందరు సమర్థమైన పనితీరు కనపర్చలేక వైదొలిగారని మూర్తి వ్యాఖ్యానించారు. ‘దాగి ఉన్న ఆణిముత్యాలను వెలికితీసి సంస్థను నిలబెట్టే అవకాశాన్ని వారికి కల్పించాలని, పనితీరు సరిగ్గా లేని వారిని.. వారు ఉండాల్సిన చోటుకి మార్చాలనే లక్ష్యంతో నేను ముందుకు సాగాను’ అని చెప్పారు. యోగ్యులైన వారిని లీడర్లుగా తీర్చిదిద్దేందుకు, అత్యుత్తమ పనితీరు కనపర్చే వారిని ప్రోత్సహించేందుకు త్వరలో ఫాస్ట్ ట్రాక్ కెరియర్ ప్రోగ్రామ్‌లు ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా మూర్తి తెలిపారు. రోహన్ మూర్తిపై.. ‘కొత్త ఆలోచనలు గలవారు, యథాతథ స్థితిని అంగీకరించని వారు, తెలివైనవారు నాకు సహాయంగా ఉండాలనుకున్నాను. అందుకే రోహన్‌ను వెంట తెచ్చుకున్నాను. టెక్నాలజీ ఊతంతో మార్కెట్లో ఇన్ఫోసిస్ విభిన్నంగా ఉండగలిగేలా.. చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టే బాధ్యతను అతనికి అప్పగించాను’ అంటూ కుమారుడు రోహన్ మూర్తిపై నారాయణ మూర్తి వివరణ ఇచ్చారు. మూర్తి సహాయకుడిగా రోహన్ మూర్తి పదవీ కాలం కూడా శనివారంతో ముగిసింది. అనుబంధ సంస్థకు ప్రొడక్టుల వ్యాపారం.. ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్, సొల్యూషన్స్ (పీపీఎస్) వ్యాపారాన్ని దాదాపు రూ. 480 కోట్లకు తమ అనుబంధ సంస్థ ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్‌కి బదలాయించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. అయితే, ఇందులో బ్యాంకింగ్ సర్వీసుల సాఫ్ట్వేర్ పినాకిల్ ఉండదని సంస్థ పేర్కొంది. కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ఎడ్జ్వెర్వ్ను ఇన్ఫీ ఫిబ్రవరిలో ఏర్పాటు చేసింది. మూడేళ్లలో రెండోసారి వీడ్కోలు.. మూడు దశాబ్దాల క్రితం స్థాపించిన ఇన్ఫోసిస్ నుంచి మూర్తి 2011 ఆగస్టులో వైదొలిగిన సంగతి తెలిసిందే. 65 ఏళ్లు నిండటంతో కంపెనీ నిబంధనల ప్రకారం ఆయన తప్పుకున్నారు. అయితే, ఆ తర్వాత ఇన్ఫీ పనితీరు అంతంత మాత్రంగా మారుతుండటంతో కంపెనీ బోర్డు ఒత్తిడి మేరకు గతేడాది జూన్ 1న మూర్తి మరోసారి సంస్థ పగ్గాలు చేపట్టారు. సహకరించేందుకు తన కుమారుడు రోహన్ మూర్తిని కూడా ఆయన వెంట తెచ్చుకోవడం వివాదాస్పదమైంది. తాజాగా ప్రముఖ టెక్నోక్రాట్ విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈవోగా నియమితులైన నేపథ్యంలో కంపెనీ నుంచి వైదొలగాలని మూర్తి నిర్ణయించుకున్నారు. దీంతో మూడేళ్లలో రెండోసారి ఇన్ఫీకి గుడ్‌బై చెప్పినట్లయింది. వాస్తవానికి ఆయన 2013 జూన్ 1 నుంచి అయిదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కొనసాగాల్సి ఉంది. ‘కొత్త మేనేజ్మెంట్కి బాధ్యతల బదలాయింపు సులభంగా జరిగేందుకు, టెక్నాలజీ రంగంలో ఇన్ఫోసిస్‌ను దిగ్గజంగా తీర్చిదిద్దే క్రమంలో సిక్కాకు స్వేచ్ఛనిచ్చే ఉద్దేశంతో నేను ముందుగానే వైదొలుగుతున్నాను’ అని ఏజీఎంలో నారాయణ మూర్తి చెప్పారు. అక్టోబర్ 10 దాకా ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. ఆ తర్వాత నుంచి చైర్మన్ ఎమెరిటస్‌గా కొనసాగుతారు. -
ఇన్ఫీ కొత్త సారధి..విశాల్ సిక్కా
ఆగస్టు 1 నుంచి సీఈఓ, ఎండీగా బాధ్యతలు * తొలిసారి కంపెనీ బయటివ్యక్తికి పగ్గాలు * పదవి నుంచి రేపు వైదొలగనున్న * ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణమూర్తి టెక్నాలజీ పరిశ్రమ మార్గదర్శకులు నెలకొల్పిన ఇన్ఫోసిస్‌కు సారథ్యం వహించడం నాకు గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన ఇన్ఫీ ఉద్యోగులతో కలసి పనిచేయాలని, వారి నుంచి నేర్చుకోవాలని ఎదురుచూస్తున్నాను. కంప్యూటింగ్ టెక్నాలజీ అన్ని పరిశ్రమల తీరుతెన్నులను మారుస్తోంది. మా ఖాతాదారులు, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, వాటాదారుల విలువను మరింత ఇనుమడింపచేసేలా బ్రేక్‌త్రూ సొల్యూషన్స్‌ను అందించే అరుదైన అవకాశం మాకు లభించింది. - ఇన్ఫోసిస్ కొత్త సీఈఓ, ఎండీగా ఎంపికైన తర్వాత విశాల్ సిక్కా వ్యాఖ్యలు బెంగళూరు: వరుసగా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నిష్ర్కమణతో సతమతమవుతున్న సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంస్థ సీఈఓ, ఎండీగా విశాల్ సిక్కా(47) నియమితులయ్యారు. ఆగస్టు 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సంస్థ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి శనివారం పదవి వీడనున్నారు. మరో సహ వ్యవస్థాపకుడు, వైస్ చైర్మన్ ఎస్.గోపాలకృష్ణన్ కూడా అదే రోజు తప్పుకోనున్నారు. ఈ విషయాలను ఇన్ఫోసిస్ గురువారం వెల్లడించింది. కాగా, అసలు ఇన్ఫోసిస్‌కు సంబంధం లేని బయటవ్యక్తి కంపెనీకి సారథ్యం వహించడం తొలిసారి కావడం గమనార్హం. అంతేకాదు, కంపెనీ వ్యవస్థాపకుల్లో లేనివ్యక్తి సీఈఓ కావడం కూడా ఇదే మొట్టమొదటిసారి. జర్మన్ సాఫ్ట్వేర్ సంస్థ శాప్ ఏజీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మాజీ సభ్యుడైన సిక్కా ఇన్ఫీ పూర్తికాల డెరైక్టర్‌గా శనివారం చేరనున్నారు. ఇప్పటివరకు ఇన్ఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న ఎస్.డి.శిబూలాల్ వచ్చే మార్చిలో రిటైర్ కావాల్సి ఉన్నప్పటికీ ముందుగానే పదవీ విరమణ చేస్తానని చెప్పడంతో ఆయన వారసుడిని ఎంపిక చేయాల్సి వచ్చింది. కాగా, ఇన్ఫోసిస్‌లోకి నారాయణ మూర్తి గతేడాది జూన్‌లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా రెండో ఇన్నింగ్ ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటిదాకా 11 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్‌బై చెప్పడం తెలిసిందే. అక్టోబర్ వరకు నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా... గతంలో ఇన్ఫీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న నారాయణ మూర్తి, కంపెనీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గతేడాది జూన్ 1న మళ్లీ పగ్గాలు చేపట్టారు. మూర్తి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, గోపాలకృష్ణన్ నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా వచ్చే అక్టోబర్ 10 వరకు కొనసాగుతారు. ఇన్ఫీ బోర్డు ఎక్స్టర్నల్ డెరైక్టర్ కె.వి.కామత్ అక్టోబర్ 11 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవుతారు. ‘సంస్థ పురోగతికి అందించిన సేవలకు గుర్తింపుగా అక్టోబర్ 11 నుంచి మూర్తి గౌరవ చైర్మన్ (చైర్మన్ ఎమిరిటస్)గా వ్యవహరిస్తారు..’ అని ఇన్ఫీ ప్రకటన తెలిపింది. 14 నుంచి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫీసు రద్దు... ఇన్ఫీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ (నారాయణ మూర్తి) కార్యాలయం ఈ నెల 14 నుంచి రద్దు కానుంది. మూర్తి కుమారుడు, ఆయన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రోహన్ పదవీకాలం మూర్తితో పాటే ముగియనుంది. అంటే, రోహన్ శనివారం నుంచే కంపెనీని వీడనున్నారు. కంపెనీలో సీనియర్ ఉద్యోగులైన పన్నెండు మందికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా పదోన్నతి ఇవ్వడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించారు. ‘సంస్థ కొత్త సీఈఓగా సిక్కాను ఎంపికచేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. గ్లోబల్ కార్పొరేషన్ సారథిగా పనిచేసిన ఆయన తన విలువైన అనుభవాన్ని ఇన్ఫీ అభివృద్ధికి వినియోగిస్తారు. శాప్‌లో విశేష విజయాలు సాధించిన సిక్కాను ఇన్ఫీ అత్యున్నత పదవికి ఎంపికచేయడం ఆదర్శనీయం..’ అని మూర్తి తెలిపారు. నేనూ టీచర్ కుమారుడినే: విశాల్ పంజాబీ కుటుంబంలో జన్మించిన విశాల్ సిక్కా విద్యాభ్యాసం గుజరాత్లో కొనసాగింది. ఆయన తండ్రి రైల్వే ఇంజనీరు. వడోదరలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌ను సిక్కా పూర్తి చేశారు. న్యూయార్క్‌లోని సైరాక్యూస్ యూనివర్సిటీలో ఎంఎస్(కంప్యూటర్ సైన్స్) చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి 1996లో పీహెచ్డీ పొందారు. దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల కంపెనీ ఇన్ఫీ సీఈఓ పదవి ఆయన్ను వరించడానికి కారణం ఆయన విజ్ఞాన తృష్ణే. పలువురు సీనియర్ లెవల్ అధికారులు ఇటీవల ఇన్ఫీకి గుడ్‌బై చెప్పారు. మరోపక్క టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ నుంచి ఇన్ఫీకి పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్ఫీ సారథ్యాన్ని చేపట్టడం సవాలు వంటిదే. ‘కొత్త బాధ్యతలను నేను సంతోషంగా, వినయంగా స్వీకరిస్తున్నాను. నారాయణ మూర్తిలానే నేను కూడా ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టాను. మా అమ్మ రాజ్‌కోట్ (గుజరాత్)లో టీచరుగా పనిచేశారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇన్ఫీ ఇస్తున్న ప్రాధాన్యత నన్ను సంభ్రమానికి గురిచేసింది..’ అని విశాల్ తెలిపారు. చదువు పూర్తయిన తర్వాత జెరాక్స్ రీసెర్చ్ ల్యాబ్‌లో కొంతకాలం పనిచేసిన ఆయన ఆ తర్వాత సోదరునితో కలసి ఐబ్రెయిన్ పేరుతో తొలి కంపెనీని స్థాపించారు. ఐబ్రెయిన్ను ఆ తర్వాత పాటెర్న్ ఆర్ఎక్స్ టేకోవర్ చేసింది. తదనంతరం నెలకొల్పిన బోధ.కామ్‌ను పెరిగ్రైన్ సిస్టమ్స్ కొనుగోలు చేసింది. అందులో కొంతకాలం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన సిక్కా, 2002లో శాప్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ గ్రూప్ హెడ్‌గా చేరారు. ఐదేళ్లలోనే కంపెనీ సీటీఓ స్థాయికి ఎదిగారు. గేమ్ చేంజింగ్ ‘హానా’ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన ఘనత విశాల్‌దే. -
ఈ ఏడాది వృద్ధి 6.2%: ఈ అండ్ వై
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) 6.2% ఉంటుందని ట్యాక్స్ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈ అండ్ వై) తాజాగా అంచనావేసింది. రానున్న మూడేళ్లలో వృద్ధి 8 శాతాన్ని అందుకోగలదని కూడా పేర్కొంది. మారుతున్న దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ఇందుకు దోహదపడతాయని విశ్లేషించింది. 2013-14లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 4.7%. వరుసగా రెండవ యేడాది 5% దిగువన జీడీపీ కొనసాగింది. రూ. 4 లక్షలకు ఐటీ పరిమితి పెంచాలి... కాగా వృద్ధికి ఊపునిచ్చే క్రమంలో భాగంగా ఆదాయపు పన్ను (ఐటీ) పరిమితిని రూ. 4 లక్షలకు పెంచాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి సంస్థ విజ్ఞప్తి చేసింది. అలాగే జూలైలో రానున్న బడ్జెట్లో చిన్న ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చడానికి అదనపు పన్ను ప్రయోజనాలను కల్పించాలని కోరుతున్నట్లు సంస్థ విధాన వ్యవహారాల ప్రధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. మూలధన వ్యయాలను పెంచి తద్వారా డిమాండ్‌కు ఊతం ఇవ్వాలని కోరారు. చిన్న పొదుపులకు ప్రోత్సాహం, జీఎస్టీ, ప్రత్యక్ష పన్నుల విభాగాల్లో సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రోత్సాహం, ప్రభుత్వ వ్యయాల్లో పునర్వ్యవస్థీకరణ కూడా అవసరమని సూచించారు. సీఎస్‌ఆర్‌పై భారీ వ్యయం: కొత్త కంపెనీల చట్టంలోని నిబంధనలు అమలులోకి వస్తే, భారత్ కార్పొరేట్ రంగం వార్షికంగా తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతల(సీఎస్ఆర్) కింద రూ.22,000 కోట్లు వెచ్చించాల్సి రావచ్చని ఈ అండ్ వై అంచనావేసింది. వార్షిక నికర లాభంలో 2 శాతం సీఎస్ఆర్ కార్యకలాపాలపై వెచ్చించాల్సిన పరిధిలో దేశంలో దాదాపు 16,500 కంపెనీలు ఉన్నట్లు పేర్కొంది -
ఏఐ ప్రైవేటీకరణకు తొందరపడం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (ఏఐ) ప్రైవేటీకరణపై తొందరపాటు నిర్ణయం తీసుకోబోమని పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు సూచనప్రాయంగా వెల్లడించారు. మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఏఐ ప్రైవేటీకరణపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికీ రాలేదనీ, దీనికి సంబంధించిన అన్ని అంశాలనూ అధ్యయనం చేస్తామనీ చెప్పారు. ‘వివిధ దేశాల్లోని అనేక ప్రభుత్వ రంగ కంపెనీలు సమర్థంగా పనిచేస్తున్నాయి. కారణం ఏదైనా మనదగ్గర అలా జరగలేదు. కానీ, ఈ అంశాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించాల్సి ఉంది. ఎయిర్ ఇండియా ప్రభుత్వ అధీనంలో ఉంది. ఆ సంస్థకు కొన్ని సానుకూల అంశాలు, ప్రతికూల అంశాలున్నాయి. ఎయిర్ ఇండియాను ఎలా అభివృద్ధి చేయగలమో ఆలోచించాలి..’ అని ఆయన తెలిపారు. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ పునఃసమీక్షిస్తారా అని ప్రశ్నించగా, పోస్ట్‌మార్టమ్ వల్ల లాభం ఉండదని బదులిచ్చారు. మునుపటి ప్రభుత్వం అనేక రంగాలకు పలు హామీలిచ్చింది... వాటన్నిటినీ అమలు చేయాలంటే ప్రభుత్వంలో మార్పు ఉండకూడదని వ్యాఖ్యానించారు. విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువచేసే చర్యలు చేపడతామని తెలిపారు. -
ఒరిగేదేమీ లేదు: బీజేపీ
ముంబై: గురువారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణతో కాంగ్రెస్-ఎన్సీపీల నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదని బీజేపీ విమర్శించింది. మంత్రులను మార్చినంతమాత్రాన ఎన్నికల్లో విజయావకాశాలు మెరుగుపడతాయనడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ ముంబై విభాగం అధ్యక్షుడు ఆశిష్ శేలార్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసిందో ప్రజలకు తెలుసని, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కొత్తగా వైద్యవిద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన జితేంద్ర అవ్హాడ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి బీజేపీ, శివసేనలు ఎందుకు హాజరు కాలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు శేలార్ సమాధానమిస్తూ... ప్రతిపక్షాల తరఫున తాను హాజరయ్యానని చెప్పారు. తమ పార్టీ నేతలు పర్యటనల్లో ఉన్నందున కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని, అయితే అంతా శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండు, ఎన్సీపీకి నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం వరించింది. మిగతా నలభై స్థానాల్లో ఆ పార్టీలు ఘోర పరాభవాన్ని చవిచూశాయి. మళ్లీ అదే తరహా ఫలితాలు పునరావృతమవుతాయని ప్రతిపక్ష బీజేపీ, శివసేనలు చెబుతున్నాయి. -
ఇన్ఫీలో మరో వికెట్ డౌన్...
బెంగళూరు: భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో మరో వికెట్ పడింది. కంపెనీని ఒక స్థాయికి తీసుకొచ్చిన సీనియర్లు వరుసగా సంస్థను వీడుతున్నారు. తాజాగా కంపెనీ ప్రెసిడెంట్, బోర్డ్ సభ్యుడు కూడా అయిన బి.జి.శ్రీనివాస్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా వచ్చే నెల 10 నుంచి అమల్లోకి వస్తుందని ఇన్ఫోసిస్ పేర్కొంది. ప్రస్తుత సీఈఓ ఎస్.డి. శిబులాల్ తర్వాత కంపెనీ సీఈవో రేసులో ఉన్న శ్రీనివాస్ రాజీనామా చేయడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది జనవరిలో కొత్తగా ప్రెసిడెంట్ పదవిని సృష్టించి, దానిని శ్రీనివాస్‌కు కట్టబెట్టారు. సీఈవో ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు కారణాలను కంపెనీ కానీ శ్రీనివాస్ కానీ వెల్లడించలేదు. మరో వైపు ఇన్ఫోసిస్ తనకు అద్భుతమైన అవకాశాన్నిచ్చిందని శ్రీనివాస్ కృత జ్ఞతలు వ్యక్తం చేశారు. కాగా గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలోనే అత్యధిక వేతనం (రూ.7.52 కోట్లు) పొందిన శ్రీనివాస్ త్వరలో మరో ఐటీ సేవల కంపెనీకి సీఈవో, ఎండీ కానున్నట్లు సమాచారం. 10 మంది ఔట్... శ్రీనివాస్ రాజీనామా పట్ల ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి స్పందించారు. కంపెనీ వృద్ధిలో శ్రీనివాస్ పాత్ర ఎంతో ముఖ్యమైనది, కీలకమైనదని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో శ్రీనివాస్ చేపట్టే అన్ని ప్రయత్నాల్లో ఆయనను విజయం వరించాలని మూర్తి ఆకాంక్షించారు. 2013, జూన్ 1న మూర్తి ఇన్ఫోసిస్‌లో మళ్లీ ప్రవేశించారు. తన తనయుడు, రోహన్ మూర్తిని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా నియమించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్ఫోసిస్ నుంచి 10 మంది సీనియర్లు వైదొలిగారు. కాగా శ్రీనివాస్ రాజీనామా ఇన్ఫోసిస్ షేర్‌పై స్వల్పకాలంలో ప్రతికూల ప్రభా వం చూపించగలదని పలు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. బుధవారం రాత్రి నాస్డాక్లో ఇన్ఫోసిస్ ఏడీఆర్ 4% పైగా క్షీణించింది. -
ఫోర్బ్స్ శక్తివంత మహిళల జాబితా..
న్యూయార్క్: ప్రపంచంలోని అత్యంత శక్తివంతులైన 100 మంది మహిళల జాబితాలో ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ చందా కొచర్లకు స్థానం లభించింది. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో ఉన్న ఈ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలకు చోటుదక్కింది. భట్టాచార్యకు 36వ ర్యాంకు, కొచర్‌కు 43వ ర్యాంకు లభించాయి. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్‌షా 92వ స్థానంలో నిలిచారు. పెప్సీకో చీఫ్ ఇంద్రా నూయి 13వ స్థానంలో, సిస్కో చీఫ్ టెక్నాలజీ, స్ట్రాటజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్ 71వ స్థానంలో ఉన్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ ఎల్లెన్ (రెండో స్థానం), మానవతావాది మెలిండా గేట్స్ (3), హిల్లరీ క్లింటన్ (6), జనరల్ మోటార్స్ తొలి మహిళా సీఈఓ మేరీ బారా (7), అమెరికా తొలి మహిళ మిషెల్ ఒబామా, ఫేస్బుక్ సీఓఓ షెరిల్ శాండ్‌బెర్గ్(9) తొలి పది స్థానాలో ఉన్నారు. దాదాపు 38 వేల కోట్ల డాలర్ల ఆస్తులు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథిగా భట్టాచార్య ఆసియా ఉపఖండంలోనే అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్నారని ఫోర్బ్స్ ప్రశంసించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్, ట్రెజరీ, రిటైల్ ఆపరేషన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి వివిధ రంగాల్లో ఆమె విశేష సేవలందించారని తెలి పింది. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన 12,500 కోట్ల డాలర్ల ఆస్తులను చందా కొచర్ పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఇక్కట్లను ఎదుర్కొన్న ఐసీఐసీఐ బ్యాంకును ఆమె గాడిన పెట్టారని తెలిపింది. -
ఎక్కడి రేట్లు అక్కడేనా
బెంగళూరు: ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగుతూ ఆర్థిక కార్యకలాపాలు మందకొడిగా ఉన్న నేపథ్యంలో జూన్ 3న నిర్వహించనున్న ద్రవ్య విధాన సమీక్షలో కీలక రేట్లను రిజర్వు బ్యాంకు యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని రాయిటర్స్ పోల్‌లో ఆర్థిక నిపుణులు తెలిపారు. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రఘురామ్ రాజన్ గత సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ద్రవ్యోల్బణం కట్టడికి మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచారు. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షపాతం సగటు కంటే తక్కువగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో 52 మంది ఆర్థికవేత్తలతో ఈ నెల 15-27 తేదీల మధ్య నిర్వహించిన పోలింగ్‌లో ముగ్గురు మాత్రమే పాలసీ రేట్లను మారుస్తారని అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకరు 25 బేసిస్ పాయింట్లు పెంచుతారని చెప్పగా, మిగిలిన ఇద్దరూ రేటును తగ్గిస్తారని పేర్కొన్నారు. రెపో రేటును 8.00 శాతం వద్దే కనీసం జనవరి వరకు కొనసాగిస్తారని ఆర్థిక నిపుణుల అంచనా. ఆర్థిక వృద్ధికి చర్యలను పరిశీలించే ముందు ద్రవ్యోల్బణంపై ముమ్మర నిఘాను రిజర్వు బ్యాంకు కొనసాగిస్తుందని విశ్వసిస్తున్నట్లు వీనస్ క్యాపిటల్ మేనేజింగ్ డెరైక్టర్ కె.కె.మిట్టల్ చెప్పారు. తయారీ, గనుల రంగాలు నేటికీ బలహీనంగానే కొనసాగుతున్నందువల్ల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఓ మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నట్లు బార్ల్కేస్కు చెందిన ఆర్థిక నిపుణుడు రాహుజ్ బజోరియా తెలిపారు. నరేంద్ర మోడీ సారథ్యంలోని వాణిజ్య మిత్ర ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటుందనీ, వచ్చే ఏడాదిన్నరలో వృద్ధి రేటు పుంజుకుంటుందనీ చెప్పారు. డిమాండ్ కొరవడడంతో గత నెలలో దేశీయ ఉత్పాదకరంగం ఏ మాత్రం పురోగతి సాధించలేదు. సేవల రంగం వరుసగా పదో నెలలో కూడా కుచించుకుపోయింది. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించింది. దీంతో షేర్లలోనూ, రూపాయి మారకం విలువలోనూ ర్యాలీ నెలకొంది. బడ్జెట్, అభివృద్ధి, కరెంటు అకౌంటు లోటు, ద్రవ్య నిర్వహణలు ప్రధాన సమస్యలనీ, దేశీయ వాణిజ్య, పారిశ్రామిక రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల పరి ష్కారానికి మోడీ అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చనీ మిట్టల్ వ్యాఖ్యానించారు. కీలక వడ్డీరేట్లను మార్చకపోవచ్చు: డీబీఎస్ వచ్చేనెల మూడో తేదీన ఆర్బీఐ నిర్వహించనున్న ద్రవ్య విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశముందని డీబీఎస్ ఓ నివేదికలో తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలుసుకుని ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూ అభివృద్ధికి దోహదపడే చర్యలను రిజర్వు బ్యాంకు చేపడుతోందని వివరించిన విషయాన్ని నివేదికలో ప్రస్తావించారు. రెపో రేటులో ఎలాంటి మార్పు ఉండదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వం, ఆర్బీఐ వచ్చే కొన్ని నెలల్లో సంఘటితంగా కృషిచేసే అవకాశముందని డీబీఎస్ తెలిపింది. 2013-14లో దేశ ఆర్థిక వృద్ధిరేటు మందగించి 4.9 శాతానికి చేరింది. -
ఆ అవసరం లేదు!
సాక్షి, ముంబై: వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం మార్చాల్సిన అవసరం లేదని మాజీ కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్ షిండే అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత షిండే మొదటిసారిగా షోలాపూర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నేతృత్వం మారిస్తే పార్టీకి మరింత నష్టం తప్పదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిననంత మాత్రాన శాసనసభ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని భావించడం సరైన అభిప్రాయం కాదన్నారు. శాసనసభ ఎన్నికల్లో 1974 నుంచి శాసనసభ, రాజ్యసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేశానని, పోటీచేసిన ప్రతిసారీ తనను విజయం వరించిందన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభంజనం ఉన్నప్పటికీ షోలాపూర్ వాసులు తనకు భారీగా ఓట్లు వేశారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవం గురించి మాట్లాడుతూ... ఆ రోజు జరిగిన ఉత్సవానికి సార్క్ దేశాల ప్రముఖులను ఆహ్వానించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇలా ఆహ్వానించడంవల్ల వివిధ దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయని, అంతర్జాతీయ స్థాయిలో మన భారత్ పేరు మార్మోగుతుందన్నారు. అలా ఆహ్వానించడం ఆయన గొప్పతనమని కొనియాడారు. మోడీ ప్రమాణస్వీకార ముహూర్తాన్ని ఆలస్యంగా వెల్లడించడంతోనే తాను కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని, అయితే మోడీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపానన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తలెత్తిన పరిస్థితిపై మాట్లాడుతూ... ‘లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వర్గీయుల నుంచి ముప్పు పొంచి ఉందని నాకు ముందే సమాచారం అందింది. దీంతో అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశాను. చిన్న చిన్న సభలు, సమావేశాలు నిర్వహించాను. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎన్నికల సమయంలో రెండు రోజులకు మించి ఎప్పుడూ బస చేయలేదు. కానీ మొదటిసారి 12 రోజులు షోలాపూర్ నియోజకవర్గంలోనే మకాం వేశాను. అయినప్పటికీ పార్టీ వర్గీయులు మోసం చేయడంవల్ల మొదటిసారి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింద’ని షిండే ఆవేదన వ్యక్తం చేశారు. -
‘రియల్’ లాభాలు కావాలంటే..
భారత్ వంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులపరంగా రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇల్లు, షాపు, అభివృద్ధి చేయని భూమి... దేని లాభాలు దానికున్నాయి. వీటిని కొనుగోలు చేసే వారు ఓ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అధిక ధరకు తిరిగి అమ్మడం ద్వారా లాభం (క్యాపిటల్ గెయిన్స్) పొందడానికి కొంటున్నారా లేక వీటిని అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని పొందడానికి కొనుగోలు చేస్తున్నారా అనే అంశంలో ఇన్వెస్టర్లకు స్పష్టత ఉండాలి. బాండ్లు, ఈక్విటీల వంటి ఆస్తులకు భిన్నమైనది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో అపార్ట్మెంటు లేదా కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నపుడు ఆ ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ ఉన్నాయా అనేది పరిశీలించాలి. బిల్డర్ ట్రాక్ రికార్డును తెలుసుకోవాలి. ఇంకా పొందాల్సిన పర్మిట్లు ఉన్నాయేమో తెలుసుకోవాలి. సదరు ఆస్తిపై మీ పెట్టుబడిని, ఎంత ఆదాయం వస్తుందన్న అంశాలను గమనించాలి. పోర్టుఫోలియోలో ప్రాధాన్యతలు... భూమిని కొంటున్నట్లయితే నిర్వహణ వ్యయం ఎంతవుతుందో లెక్కించాలి. ఆక్రమణలను నివారిం చడానికి ఆ భూమిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో తాజా పరిణామాలతోపాటు స్థిరాస్తి కొనదలుచుకున్న ప్రాంతంలో పరిస్థితులను గమనిస్తుండాలి. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలు, బంగారం, సెక్యూరిటీలకు ప్రాధాన్యతను పరిస్థితులకు అనుగుణంగా మారుస్తుండాలి. ఆదాయ సామర్థ్యం దృష్ట్యా రియల్ ఎస్టేట్ రంగం ధనికులకు అత్యంత ఆకర్షణీయమైనది. క్యాపిటల్ గెయిన్స్‌తో పాటు స్థిరాదాయం కూడా ఇస్తుంది. షేర్లయినా, రియల్ ఎస్టేట్ అయినా అన్ని అంశాలనూ పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టాలి. నిర్దిష్ట ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలి. -
ఓఎన్జీసీలోని కొన్ని శక్తుల పనే ఇది: ఆర్ఐఎల్
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ చోరీకి పాల్పడి ఉండవచ్చంటూ ఓఎన్జీసీ చేసిన ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఘాటుగా స్పందించింది. పదమూడేళ్లుగా కనుగొన్న నిక్షేపాలను అభివృద్ధి చేయడంలో విఫలమైన ఓఎన్జీసీలోని కొన్ని శక్తులు సంస్థ సీఎండీ కె.సరాఫ్‌ను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి ఆరోపణలు చేసి ఉండవచ్చని వ్యాఖ్యానించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన కేజీ డీ6 బ్లాకు పక్కనే ఉన్న తమ క్షేత్రం నుంచి వేలాది కోట్ల రూపాయల విలువైన గ్యాస్‌ను ముకేశ్ అంబానీ సంస్థ చోరీ చేసి ఉండవచ్చని ఆరోపిస్తూ ఓఎన్జీసీ ఈ నెల 15న ఢిల్లీ హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ‘ఈ ఆరోపణలను మేం ఖండిస్తున్నాం. ఓఎన్జీసీలోని కొన్ని శక్తులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ఉద్దేశంతో సంస్థ సీఎండీని తప్పుదోవ పట్టించడానికి చేసిన ప్రయత్నమే ఇదని భావిస్తున్నాం..’ అని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. సరాఫ్‌ను తప్పుదోవ పట్టించిన శక్తుల పేర్లను రిలయన్స్ వెల్లడించలేదు. ఈ వ్యవహారంపై ఓఎన్జీసీ గతేడాది ఆగస్టులో తమను సంప్రదించిన నాటి నుంచీ స్వతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు జరిపించడానికి తాము యత్నిస్తున్నామని తెలిపింది. -
నోకియా ‘ఎక్స్ఎల్’ పెద్ద స్క్రీన్ మొబైల్
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ డివెసైస్ కంపెనీ నోకియా ఎక్స్ సిరీస్‌లో అతి పెద్ద స్క్రీన్ ఉన్న మొబైల్, నోకియా ఎక్స్ఎల్ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.11,489. ఈ ఎక్స్ఎల్ మొబైల్లో 5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1 గిగా హెట్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 768 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఆన్‌బోర్డ్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. ఫేస్బుక్, లైన్, పిస్కర్ట్, ప్లాంట్స్ వర్సెస్ జొంబీస్ 2, రియల్ ఫుట్‌బాల్ 2014, స్కైప్, స్పోటీఫై, స్విఫ్ట్ కీ, ట్విట్టర్, వైబర్, వైన్, విచాట్ వంటి యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. గతంలో తామందించిన నోకియా ఎక్స్ మొబైల్ ఫోన్‌కు మంచి స్పందన లభించిందని, ఆ ఉత్సాహాంతో ఈ నోకియా ఎక్స్ఎల్ను అందిస్తున్నామని నోకియా ఇండియా డెరైక్టర్ (సేల్స్) రఘువేష్ సరూప్ చెప్పారు. వివిధ ధరల్లో నోకియా ఎక్స్ మొబైల్ ఫోన్లను అందించనున్నామని వివరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా నోకియా ఎక్స్ ఫోన్లకు బ్లాక్బెర్రిమెసేజింగ్(బీబీఎం)ను యాక్సెస్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎయిర్‌టెల్‌తో కూడిన అవగాహన మేరకు ఈ ఫోన్ కొనుగోలుపై 500 ఎంబీ వరకూ డేటాను ఉచితంగా ఆఫర్ చేస్తున్నామని, నోకియా స్టోర్, వన్ మొబైల్ స్టోర్ నుంచి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. కాగా నోకియా ఎక్స్ సిరీస్‌లో నోకియా ఎక్స్ మొబైల్ ధర రూ.8,599(విడుదల నాటి ధర), నోకియా ఎక్స్ ప్లస్ ధర రూ.8,399 గా ఉన్నాయి. -
భారత్ భవిత బంగారం!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం భారత్ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని విశ్లేషణా సంస్థలు అంచనా వేస్తున్నాయి. దేశం ఆర్థిక సవాళ్లను అధిగమించవచ్చని రేటింగ్ సంస్థ మూడీస్ సోమవారం పేర్కొంది. వచ్చే రెండేళ్లలో దేశాభివృద్ధి 6.8 శాతం ఉంటుందని బ్యాంకింగ్ సేవల దిగ్గజ సంస్థ తాజాగా మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. ఈ మేరకు ఆయా సంస్థలు విడుదల చేసిన విశ్లేషణా పత్రాలను వేర్వేరుగా పరిశీలిస్తే- క్రెడిట్ పాజిటివ్: మూడీస్ ఎన్నికల ఫలితాలు సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తుందని మూడీస్ పేర్కొంది. స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ఈ పరిణామం దోహదపడే అవకాశాలు ఉన్నాయని మూడీస్ వివరించింది. ఇది భారత్‌కు ‘క్రెడిట్ పాజిటివ్’అని సంస్థ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ప్రస్తుతం దేశానికి మూడీస్ ‘బీఏఏ3’ రేటింగ్ ఉంది. స్టేబుల్ అవుట్‌లుక్‌తో కొంత క్రెడిట్ రిస్క్ ఉన్నట్లు ఈ రేటింగ్ సూచిస్తుంది. అటు ప్రభుత్వానికి, ఇటు కార్పొరేట్ రంగానికి ఈ విజయం క్రెడిట్ పాజిటివ్ అని వివరించింది. బ్యాంకింగ్ రంగానికి సైతం ఇది శుభసూచకమని అభిప్రాయపడింది. చిదంబరం తన తాత్కాలిక బడ్జెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేటాయించిన మూలధన పెట్టుబడులను మోడీ సర్కారు పెంచవచ్చని విశ్లేషించింది. ఇది బ్యాంకుల క్రెడిట్ పాజిటివ్‌కు దోహదపడుతుందని వివరించింది. ఇన్వెస్టర్ సెంటిమెంట్ తక్షణం మెరుగుదలకు ఇది దోహపదడిందని వివరించింది. కార్పొరేట్, మౌలిక రంగాల విషయంలో నిలిచిపోయిన విధానాల పునరుద్ధరణకు ఈ ఫలితాలు దోహదపడతాయని మూడీస్ వైస్‌ప్రెసిడెంట్, సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ వికాశ్ హలాన్ అన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సన్నిహిత సహకారం వల్ల పెట్టుబడుల్లో ప్రస్తుతం ఉన్న నిరుత్సాహ ధోరణి తొలగిపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కొత్త ప్రభుత్వం సహజ వాయువు ధరలను పెంచే అవకాశం కూడా ఉన్నట్లు వివరించింది. ఇదే జరిగితే ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి అప్‌స్ట్రీమ్ ఆయిల్, గ్యాస్ కంపెనీలకు లాభదాయకమని పేర్కొంది. దీర్ఘకాలంలో పెట్టుబడులకు ఇది ఊతమిచ్చే అంశంగా దీనిని విశ్లేషించింది. ఏప్రిల్‌లోనే గ్యాస్ ధరలు పెరగాల్సి ఉన్నా, దీనిపై నిర్ణయాన్ని ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పక్కనబెట్టింది. మోర్గాన్ స్టాన్లీ ఇలా... వచ్చే కొద్ది త్రైమాసికాల్లో దేశం స్టాగ్ఫ్లేషన్ నుంచి బైటపడుతుంది. వృద్ధి కనిష్ట స్థాయి వద్ద కొనసాగుతూ, ధరల పెరుగుదల తీవ్రంగా ఉండే పరిస్థితిని స్టాగ్‌ఫ్లేషన్‌గా వ్యవహరిస్తాం. ఈక్విటీ మార్కెట్ ఊపుమీదుంటుంది. 2015 జూన్ నాటికి మోర్గాన్ స్టాన్లీ సెన్సెక్స్ టార్గెట్ 26,300. దీనికి సంబంధించి క్రితం టార్గెట్ 21,280 పాయింట్లు. భారత్ వృద్ధికి సంబంధించి ఎన్నికల ఫలితాలు కీలకమైనవి. వచ్చే రెండేళ్లలో జీడీపీ వృద్ధి 6.8 శాతానికి పెరగవచ్చు. ద్రవ్యోల్బణం 6 శాతం దిశగా కిందకుదిగే అవకాశం ఉంది. భారత్ సంస్థాగత అంశాలు ఇప్పటికే పటిష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం వృద్ధికి ఊతం ఇస్తూ, సంస్కరణల ప్రక్రియ వేగం పెంచవచ్చు. వ్యాపార సెంటిమెంట్‌కు ఫలితాలు ఊపిరులూదాయి. కార్పొరేట్ రంగ లాభదాయకతకు, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరగడానికి ఈ ఫలితాలు దోహదపడే అవకాశం ఉంది. ఫలితాలు దేశాభివృద్ధికి సంబంధించి మా విశ్వాసాన్ని పెంచాయి. రానున్న పదేళ్లలో జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతానికి పైగా నమోదవుతుంది. జీడీపీ విలువ ప్రస్తుత 1.9 ట్రిలియన్ డాలర్ల నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చు. ఇబ్బందులూ ఉన్నాయ్ దేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లూ పొంచి ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ నివేదిక విశ్లేషించింది. రానున్న 12 నెలల్లో ఎల్నీనో, ఎగుమతుల స్పీడ్ తగ్గుదల వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. మధ్యకాలికంగా ఎదురయ్యే సవాళ్లలో ప్రపంచ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఒకటి. సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేయడం మరొకటి. -
మళ్లీ ఐపీవోలవైపు కంపెనీల చూపు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకెళుతున్న నేపథ్యంలో దేశీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు క్యూకట్టే అవకాశముంది. ఎన్డీఏ నేతృత్వంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానున్న కారణంగా ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులను కుమ్మరిస్తున్నారు. వెరసి మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 24,000 పాయింట్లను అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పింది. దీంతో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు సమాయత్తంకాగలవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐపీవోలను నిర్వహించే మర్చంట్ బ్యాంకర్ల సమాచారంమేరకు కనీసం 12 సంస్థలు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రైమ్ డేటాబేస్ నివేదిక ప్రకారం 14 సంస్థలు రూ. 2,796 కోట్ల సమీకరణకు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మార్కెట్లు మందగించడంతో గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14)లో ఐపీవోల ద్వారా కంపెనీలు రూ. 1,205 కోట్లను మాత్రమే సమీకరించిన విషయం విదితమే. -
మోడీ వస్తే చిన్న ర్యాలీ... రాకపోతే భారీ పతనమే!
మరి ఈసారో?... సగటు ఎగ్జిట్ పోల్స్‌ను పరిగణనలోకి తీసుకొని మార్కెట్ వర్గాలు మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 250-270 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఇప్పటికే మార్కెట్లు పరుగులు తీశాయి. గత 5 రోజుల్లో సెన్సెక్స్ 1,600 పాయింట్లకుపైగా పెరిగింది. ఇప్పటికే మార్కెట్లు భారీగా పెరగడంతో అప్పర్ సర్క్యూట్‌కి(20% పెరగడం) అవకాశాల్లేవని, ఫలితాలు అంచనాలకు భిన్నంగా ఉంటే లోయర్ సర్క్యూట్‌ను (20% తగ్గడం) తాకొచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్ గరిష్టంగా 20% పెరగడం లేదా తగ్గడం జరిగితే, ఆ రోజుకి ఇక ట్రేడింగ్ ఆపేస్తారు. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్నికల ఫలితాలు వెలువడనున్న శుక్రవారం స్టాక్ మార్కెట్ కదలికలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. 2004, 2009 సంవత్సరాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం సూచీలు 15 శాతానికి పైగా పెరగడం కానీ నష్టపోవడం కానీ జరిగింది. ఈ సారి కూడా అదే విధంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో 20% కదలికలకు మార్కెట్లు సిద్ధం చేసుకుంటున్నట్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా వెల్లడిస్తున్నది. ప్రస్తుతం నిఫ్టీ 7,100 స్థాయి వద్ద ఉంటే పెరిగితే 8,000-8,500 స్థాయి వరకు వెళ్ళొచ్చన్న నమ్మకంతో ట్రేడర్లు కాల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా ఉంటే 6,000-5,500 స్థాయి వరకు పడొచ్చన్న ఉద్దేశ్యంతో ట్రేడర్లు పుట్ ఆప్షన్స్ కొనుగోలు చేస్తున్నారు. ర్యాలీ జరిపితే కాల్ ఆప్షన్ కొన్నవారికి, తగ్గితే పుట్ ఆప్షన్ కొన్నవారికి లాభం వస్తుంది. ఎగ్జిట్ పోల్ ప్రభావం ఎంత? గత రెండు ఎన్నికల ఫలితాలు మార్కెట్ అంచనాలకు భిన్నంగా వచ్చాయి. 2004లో అందరూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్ అంచనాలు వస్తే దానికి భిన్నంగా వామపక్షాల మద్దతుతో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అలాగే 2009లో యూపీఏ కూటమి తిరిగి అధికారంలోకి రాదని, థర్డ్ ఫ్రంట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ ఘోషించాయి. కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వామపక్షాల మద్దతు అవసరం లేకుండానే యూపీఏ కూటమి అధికారం నిలబెట్టుకుంది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా పరుగులు తీశాయి. కాని ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికర విషయం ఇంకోటుంది. 2004 ఫలితాల తర్వాత సూచీలు కుప్పకూలినా.. ఆ తర్వాతి కాలంలో ఎన్నడూ ఊహించనంత లాభాలందించాయి. 2009 లో స్వల్పకాలానికి పెరిగినా ఆ తర్వాత కుప్పకూలి పరిమిత శ్రేణిలో కదిలాయి. అప్పర్ సర్క్యూట్ చాన్స్ తక్కువే ఎన్నికల ఫలితాల లెక్కింపు 8 గంటలకే ప్రారంభం కానుండటంతో 9.15కల్లా ఫలితాల సరళిపై కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మార్కెట్లు ప్రారంభంలోనే కొద్దిగా గానప్ అప్ లేదా గ్యాప్ డౌన్‌తో ప్రారంభం కావచ్చని ఎస్ఎంసీ గ్లోబల్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తూనుగుంట్ల అంచనా వేస్తున్నారు. ఎన్డీఏకి 280 వరకు సీట్లు వస్తాయని అంచనాతో మార్కెట్లు ఇప్పటికే పెరగడంతో వాస్తవ ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాసరే మార్కెట్లు పెద్దగా పెరగకపోవచ్చన్నారు. ఒకవేళ ఎన్డీఏ కూటమి 220-240 దగ్గరకొచ్చి ఆగిపోతే భారీ పతనం తప్పకపోవచ్చన్నారు. ఫలితాలు ఏకపక్షంగా ఉండకుండా, చివరివరకూ ఊగిసలాట ధోరణిలో ఉంటే మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతాయన్నారు. రేపటి ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఎన్ని, బీజేపీఒంటిరిగా ఎన్ని సీట్లు సాధిస్తున్నది అన్న అంశాలను పరిశీలించాలంటున్నారు జెన్ మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి. ఎన్డీఏ కూటమి 300 సీట్లు దాటితే 10% వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. కేవలం బీజేపీ సీట్లు 220 లోపునకు పరిమితం అయినా, ఎన్డీఏ కూటమి 230లోపు ఆగినా, థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నా సూచీలు లోయర్ సర్క్యూట్ తాకుతాయని సతీష్ పేర్కొన్నారు. స్వల్ప మెజార్టీతో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెన్సెక్స్ కేవలం 150 నుంచి 200 పాయింట్లు పెరుగుతుందని, అదే ఫలితాలు భిన్నంగా ఉంటే 2,000 వరకు నష్టపోయే ప్రమాదం ఉందని ఎడల్విస్ ఫైనాన్షియల్ మేనేజింగ్ పార్టనర్ అంబరీష్ బాలిగ పేర్కొన్నారు. స్థిరమైన ప్రభుత్వం వస్తే రానున్న 12-18 నెలల్లో నిఫ్టీ 8,700 వరకు పెరుగుతుందని, అదే థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే సూచీలు 15-20% నష్టపోయి 3-6 నెలల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి దిశ తీసుకుంటుందనేది కార్వీ స్టాక్ బ్రోకింగ్ అంచనా. ఎన్నికల తర్వాత... సంవత్సరం రెండు రోజుల్లో 1999 6.05% 2004 -16.56% 2009 17.34% -
ఎల్బీటీ రద్దు యోచనలో సర్కార్!
ముంబై: రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర స్థానిక సంస్థల పన్ను(ఎల్బీటీ)ని పూర్తిగా రద్దు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా ఏర్పడే లోటును విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను పెంచడం ద్వారా పూడ్చుకోవాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. ముంబై మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అక్ట్రాయ్ను రద్దు చేస్తూ దశల వారీగా ఎల్బీటీ పన్నును విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎల్బీటీపై వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్దమొత్తంలో ఆందోళనలు చేపట్టారు. రోజుల తరబడి బంద్ పాటించి, దుకాణాలను తెరవకుండా నిరసన తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా ఎల్బీటీని వసూలు చేసింది. 2010 నుంచి కొనసాగుతున్న ఈ ప్రక్రియకు ముగింపు పలకాలని, వ్యాపారులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఎల్బీటీని పూర్తిగా రద్దు చేసి, వ్యాట్‌ను పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. పన్నుభారం నేరుగా ప్రజలపైనే... రాష్ట్రంలో వ్యాట్ అమల్లో ఉండగా ఎల్బీటీని విధించడంపై వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆర్థికంగా భారమైన ఈ పన్ను విధానాన్ని రద్దు చేయాలని, ఈ పన్ను విధానం వల్ల అధికారుల ఒత్తిడి తమపై పెరుగుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలే చేశారు. కావాలనుకుంటే వ్యాట్‌ను పెంచుకోండంటూ ప్రభుత్వానికి వినతిపత్రాలు కూడా సమర్పించారు. వ్యాట్‌ను పెంచడం ద్వారా సమకూరే ఆదాయాన్ని స్థానిక సంస్థలకు గ్రాంటు రూపంలో ఇవ్వాలని, తద్వారా స్థానిక సంస్థల ఆర్థిక అవసరాలకు ఎటువంటి సమస్య ఉండదంటూ పలువురి చేసిన సూచన లను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఇలా వ్యాట్‌ను పెంచడం ద్వారా దాని ప్రభావం నేరుగా వినియోగదారులపైనే పడే అవకాశముందని సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
ఐటీ సేవల మార్కెట్ అంతంతే
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల మార్కెట్ ఆశించిన దానికంటే తక్కువ వృద్ధిని సాధిస్తోందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ పేర్కొంది. గత ఏడాది జూలై-డిసెంబర్ కాలానికి భారత ఐటీ సర్వీసుల మార్కెట్ 6.5 శాతం వృద్ధితో రూ.2.56 లక్షల కోట్లకు పెరిగిందని ఈ సంస్థ వెల్లడించింది. మౌలిక రంగంపై ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు తక్కువగా వ్యయం చేయడం, వివిధ వాణిజ్య సంస్థలు టెక్నాలజీ బడ్జెట్‌పై ఆచి తూచి వ్యవహరించడం దీనికి ప్రధాన కారణాలని వివరించింది. ఐడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం... గత ఏడాది రెండో అర్థ భాగంలో సపోర్ట్ సర్వీసులు 5.5 % వృద్ధి సాధించాయి. వివిధ కంపెనీలు వ్యయ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల తక్కువ స్థాయి వృద్ధి నమోదైంది. సిస్టమ్ ఇంటిగ్రేషన్ 6.8 శాతం, ఐటీ కన్సల్టింగ్ సర్వీసులు 6.3 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. గత ఏడాది జనవరి-జూన్ కాలం వృద్ధితో పోల్చితే ఇది తక్కువే. అవుట్ సోర్సింగ్ సర్వీసుల మార్కెట్ వృద్ధి స్వల్పంగా తగ్గి 7.1 శాతానికే పరిమితమైంది. మేనేజ్డ్ సర్వీసుల మార్కెట్ స్వల్పంగా వృద్ధి సాధించింది. ఐటీ సర్వీసుల మార్కెట్లో 12 శాతం వాటాతో ఐబీఎం మొదటి స్థానంలో నిలిచింది. 7.4 శాతం మార్కెట్ వాటాతో విప్రో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది జూలై-డిసెంబర్ కాలంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, తయారీ, టెలికాం, ప్రభుత్వ రంగాలు... ఐటీ సర్వీసులపై పెద్ద ఎత్తున దృష్టి సారించాయి. -
రతన్ టాటాకు బ్రిటన్ పురస్కారం
న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ అధినేత రతన్ టాటాకు యునెటైడ్ కింగ్డమ్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. స్వాతంత్య్రానంతరం ఈ అవార్డును పొందిన తొలి భారతీయుడు ఈయనే. ‘నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (జీబీఈ)’ పేరు కలిగిన ఈ పురస్కారాన్ని క్వీన్ ఎలిజబెత్-2 తరఫున భారత్‌లోని బ్రిటిష్ హై కమిషనర్ జేమ్స్ బెవాన్... రతన్ టాటాకు ప్రదానం చేశారు. దైపాక్షిక సంబంధాలు, బ్రిటన్‌లో భారత పెట్టుబడుల వృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు రతన్ టాటా చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డు అందించినట్లు బ్రిటిష్ హైకమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఫ్లైట్ ఆలస్యమైతే గిఫ్ట్ వోచర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రయాణం ఆలస్యమైనా, విమానం రద్దు అయినా ఇక నుంచి స్పైస్‌జెట్ ప్రయాణికులు గిఫ్ట్ వోచర్లు అందుకోవచ్చు. ఆన్ టైమ్ గ్యారంటీ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమానికి స్పైస్‌జెట్ శ్రీకారం చుట్టింది. 60 నిముషాలపైన విమానం ఆలస్యమైతే రూ.500 వోచర్‌ను ఇస్తారు. అది కూడా మరోసారి ప్రయాణించినప్పుడు ఇస్తారు. విమానం రద్దు అయినా, 120 నిమిషాలపైన ఆలస్యమైనా రూ.1,000 వోచర్ అందుకోవచ్చు. నేటి నుంచే ఇది అమలులోకి వస్తుంది. ఇక్కడ ఒక నిబంధన ఉందండోయ్.. వాతావరణం అనుకూలించక పోయినా, ఎయిర్ ట్రాఫిక్ రద్దీ కారణంగా విమానం రద్దు, ఆలస్యమైనా వోచర్ ఇవ్వరు. సంస్థ వల్ల జరిగిన ఆలస్యానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వోచర్ వివరాలు, వినియోగించే విధానాన్ని ప్రయాణికులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా తెలుపుతారు. గత కొన్ని నెలలుగా సరైన సమయానికి సర్వీసులను నడుపుతున్నట్టు కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కానేశ్వరణ్ అవిలి ఈ సందర్భంగా తెలిపారు. తమ విమానాలు ఆలస్యం కావని హామీ ఇస్తున్నామని చెప్పారు. -
డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంటు ఉల్లంఘన కేసు
హైదరాబాద్: ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంటు ఉల్లంఘన కేసు నమోదైంది. పేటెం టున్న ఔషధమైన వాసెపాకు జనరిక్ వెర్షన్‌ను తీసుకొచ్చే పనిలో రెడ్డీస్ నిమగ్నమైందంటూ డబ్లిన్‌కు చెందిన అమరిన్ ఫార్మా అమెరికా కోర్టును ఆశ్రయించింది. రెడ్డీస్ ఏఎన్‌డీఏ 16 కౌంట్లలో వాసెపా ఔషధాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. రెడ్డీస్, అనుబంధ కంపెనీ, ఇతర విభాగాలుగానీ ఈ ఔషధం తయారీ, వాడకం, విక్రయం, అమ్మజూపడం, కొనుగోలును శాశ్వతంగా నిషేధించాలని కోర్టుకు విన్నవించింది. హ్యాచ్-వాక్స్మన్ యాక్టు కింద అమరిన్ ఫార్మా ఈ దావా వేసింది. శరీరంలో ఒక రకమైన కొవ్వును (ట్రైగ్లిసెరైడ్స్) తగ్గించేందుకు ఈ ఔష దం దోహదం చేస్తుంది. వాసెపా ఔషధం పేటెం ట్లు చాలామటుకు 2030లో ముగియనున్నాయి. -
కొత్త ప్రభుత్వ విధానాలపై భవిష్యత్ వృద్ధి
న్యూఢిల్లీ: ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వ విధానాలపై దేశ భవిష్యత్ వృద్ధి ఆధారపడి ఉంటుందని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) ఆర్థికాభివృద్ధి బాగుంటుందని ప్రతిఒక్కరూ భావిస్తున్నారని, అయితే ప్రభుత్వం అనుసరించే కొత్త విధానాల ప్రాతిపదికపై ఇది ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ప్రణాళికా సంఘం పూర్తి సమయపు సభ్యుల సమావేశం అనంతరం మాంటెక్ విలేకరులతో మాట్లాడారు. 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (2012-17) సగటు 8% వృద్ధి లక్ష్యాల సవరణ విషయం గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, రాబోయో కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. గడచిన రెండు సంవత్సరాల కాలంలో వృద్ధి సానుకూలంగా లేని సంగతి తెలిసిందే. 2012-13లో ఈ రేటు 4.5%గా ఉంటే, 2013-14లో ఈ పరిమాణం 4.9%గా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5.5% దాటబోదని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 12వ ప్రణాళికలో 8 శాతం వృద్ధి కష్టమన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ ప్రణాళికా సంఘం మదింపు జరుపుతోందని (ప్రణాళిక మధ్యంతర మదింపు- ఎంటీఏ), కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే తాజా సంఘం ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకువెళుతుందని మాంటెక్ వెల్లడించారు. అక్టోబర్‌లో ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. -
ఎయిర్‌టెల్‌లాభం హైజంప్
న్యూఢిల్లీ: కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14) జనవరి-మార్చి(క్యూ4) కాలంలో 89% అధికంగా రూ. 962 కోట్ల నికర లాభాన్ని పొందింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ. 509 కోట్లను మాత్రమే ఆర్జించింది. కాల్ చార్జీలు పెరగడం, డేటా బిజినెస్ నుంచి ఆదాయం పుంజుకోవడం వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. కన్సాలిడేటెడ్ మొబైల్ డేటా ఆదాయం 93%పైగా ఎగసి రూ. 1,900 కోట్లను తాకడం పనితీరు మెరుగుకు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. ఇక మొత్తం ఆదాయం 13%పైగా వృద్ధితో రూ. 22,219 కోట్లకు చేరింది. గతంలో రూ. 19,582 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ కాలంలో వాయిస్ సర్వీసులపై నిమిషానికి 37.07 పైసలు లభించినట్లు కంపెనీ తెలిపింది. ఇది 2.08 పైసలు అధికంకాగా, నెట్వర్క్ వినియోగం 4.6% పెరిగి 264.8 బిలియన్ నిమిషాలను తాకినట్లు వెల్లడించింది. కాగా, క్యూ4లో అంతర్జాతీయ ఆదాయం(ఆఫ్రికా, దక్షిణాసియా) 3% వృద్ధితో 121 కోట్ల డాలర్లకు(దాదాపు రూ. 7,300 కోట్లు) చేరింది. ఆఫ్రికా కార్యకలాపాలపై 12.4 కోట్ల డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 1.80 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రతిపాదించింది. పూర్తి ఏడాదికి సైతం... పూర్తి ఏడాదికి ఎయిర్టెల్ నికర లాభం దాదాపు 22% వృద్ధితో రూ. 2,773 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది రూ. 2,276 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఇక ఆదాయం సైతం 11%పైగా పెరిగి రూ. 85,746 కోట్లకు చేరింది. గడిచిన ఏడాదిలో కంపెనీ పనితీరు సంతృప్తినిచ్చినట్లు భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ఇతర ముఖ్యాంశాలివీ... ఇండియాలో మొబైల్ డేటా ఆదాయం 89% ఎగసి రూ. 1,325 కోట్లకు చేరింది. మార్చి చివరికి మొబైల్ డేటా కస్టమర్ల సంఖ్య 33.5% పెరిగి 58.1 మిలియన్లకు చేరింది. 3జీ కస్టమర్ల సంఖ్య 10 మిలియన్లుగా నమోదైంది. ఇండియాలో ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 196. క్యూ4లో డేటా ఏఆర్పీయూ 43%పైగా పుంజుకుని రూ. 79కు చేరింది. మార్చి చివరికల్లా కంపెనీ రుణాలు రూ. 60,542 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎయిర్టెల్ షేరు 1% నష్టంతో రూ. 335 వద్ద ముగిసింది. -
4 నెలల్లో 10 బిలియన్ డాలర్లు ఇన్
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లపట్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. వెరసి 2014 తొలి నాలుగు నెలల్లో ఇటు ఈక్విటీలలో 5 బిలియన్ డాలర్లు, అటు రుణ పత్రాల(డెట్ సెక్యూరిటీస్)లో మరో 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. దీంతో జనవరి నుంచీ ఎఫ్ఐఐల పెట్టుబడులు 10 బిలియన్ డాలర్లను(రూ. 60,000 కోట్లు) తాకాయి. ఫలితంగా దేశంలోకి ఇప్పటివరకూ ప్రవహించిన ఎఫ్ఐఐల పెట్టుబడుల మొత్తం విలువను 200 బిలియన్ డాలర్లకు చేరింది. సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. అయితే ఏప్రిల్ నెలలో ఇప్పటివరకూ ఎఫ్ఐఐలు ఈక్విటీలలో రూ. 8,500 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, డెట్ మార్కెట్ల నుంచి రూ. 7,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం. -
రూ. 8,400 కోట్ల నష్టపరిహారం రావాల్సిందే: జీఎంఆర్
న్యూఢిల్లీ: విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు విషయంలో తలెత్తిన వివాదంలో మాల్దీవుల ప్రభుత్వం నుంచి తమకు 1.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,400 కోట్లు) నష్ట పరిహారం రావాల్సిందేనని జీఎంఆర్ స్పష్టం చేస్తోంది. ‘తమ ప్రభుత్వం భారతీయ కంపెనీకి పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. అయితే చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. న్యాయ సమ్మతమైనంత మొత్తానికి దీనిని కుదిస్తాం’ అంటూ మల్దీవుల అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ గయూం చేసిన ప్రకటన నేపథ్యంలో జీఎంఆర్ పై విధంగా స్పందించింది. పరిహారం చెల్లిస్తామని మాల్దీవుల ప్రభుత్వం తొలిసారిగా ప్రకటించడం విశేషం. మరోవైపు చట్టబద్ద కాంట్రాక్టు రద్దు చేసినందున నష్ట పరిహారం 1.4 బిలియన్ డాలర్లను చెల్లించాల్సిందేనని జీఎంఆర్ పట్టుబడుతోంది. కోర్టు వెలుపల పరిష్కారం కోసం మాల్దీవుల ప్రభుత్వం యత్నిస్తోందన్న వార్తలను జీఎంఆర్ ఖండించింది. కాగా, మాలె విమానాశ్రయ కాంట్రాక్టు రద్దు వివాద కేసు సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టులో నడుస్తోంది. గత వారం ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. ఇరువాదనలు విని కాంట్రాక్టు చట్టబద్దమా కాదా అన్నది విచారణ తొలిదశలో తేలుస్తారు. మే చివరి కల్లా ఈ ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాత ఎంత నష్ట పరిహారం చెల్లించాలో నిర్ణయమవుతుంది. -
భారతీ ఇన్ఫ్రాటెల్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: టెలికం టవర్ల సంస్థ భారతీ ఇన్ఫ్రాటెల్ జనవరి-మార్చి(క్యూ4) కాలానికి ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 64% జంప్‌చేసి రూ. 472 కోట్లను తాకింది. గతేడాది ఇదే కాలానికి రూ. 287 కోట్లను మాత్రమే ఆర్జించింది. కంపెనీలో మొబైల్ టెలికం సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు 80% వాటా ఉంది. ఇదే కాలానికి ఆదాయం 4% పెరిగి రూ. 2,790 కోట్లకు చేరింది. గతంలో రూ. 2,674 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ కాలంలో 5% అధికంగా రూ. 144.5 కోట్ల ఇతర ఆదాయం లభించింది. పూర్తి ఏడాదికి...: పూర్తి ఏడాదికి(2013-14) భారతీ ఇన్ఫ్రాటెల్ నికర లాభం రూ. 1,003 కోట్ల నుంచి రూ. 1,518 కోట్లకు ఎగసింది. ఆదాయం 5% పుంజుకుని రూ. 10,827 కోట్లయ్యింది. గతంలో రూ. 10,272 కోట్ల ఆదాయం నమోదైంది. టెలికం ఆపరేటర్ కంపెనీలు భారీ పెట్టుబడులను పెడుతున్నాయని, ప్రధానంగా డేటా నెట్‌వర్క్‌లపై దృష్టి పెడుతున్నాయని భారతీ ఇన్ఫ్రాటెల్ చైర్మన్ అఖిల్ గుప్తా చెప్పారు. దీంతో టవర్ కంపెనీల ఆదాయాలు భారీగా మెరుగుపడే అవకాశమున్నదని తెలిపారు. ఇండియాలో డేటా విభాగం వేగంగా వృద్ధి చెందుతున్నదని, టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్‌పై ఇప్పటికే రూ. 1,80,000 కోట్లను ఇన్వెస్ట్చేశాయని చెప్పారు. రిలయన్స్ జియోతో ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కుదుర్చుకున్న ఒప్పం దంలో భాగంగా తొలి దశ ఆర్డర్లు లభిస్తున్నాయని తెలిపారు. 2013-14లో రూ. 1,527 కోట్ల పెట్టుబడులను వెచ్చించామని, ఈ ఏడాది(2014-15) ఆర్డర్ల స్థాయిని బట్టి రూ. 2,000 కోట్ల వరకూ వ్యయాలుండవచ్చునని వెల్లడించారు. -
వైర్లెస్ నెట్‌కు ఇక కనీస స్పీడ్!
న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదార్లకు కనీస డేటా డౌన్లోడ్ స్పీడ్‌పై టెలికం కంపెనీల నుంచి త్వరలో స్పష్టమైన, కచ్చితమైన హామీ లభించనుంది. ఈ మేరకు త్వరలో టెల్కోలకు నింయత్రణ సంస్థ ట్రాయ్ మార్గదర్శకాలను జారీచేసేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో 2జీ లేదా 3జీ ఏ మొబైల్ సేవలకైనా ఇంటర్నెట్ద్వారా కనీస డౌన్లోడ్ స్పీడ్ ఎంతనే వివరాలను టెల్కోలు తప్పనిసరిగా తమ కస్టమర్లకు వెల్లడించాల్సి ఉంటుంది. తమ మొబైల్స్‌లో ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటుందని యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ట్రాయ్ దీనిపై దృష్టిసారించింది. తాజాగా విడుదల చేసిన చర్చాపత్రంలో పలు ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం టెల్కోలకు వైర్లెస్ డేటా సేవలకు సంబంధించి కనీస స్పీడ్‌ను అందించే విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. దీంతో కొన్ని కంపెనీలు సెకనుకు 7.2 మెగాబైట్స్(ఎంబీపీఎస్), మరికొన్ని 21 ఎంబీపీఎస్ అంటూ అధిక డేటా స్పీడ్ లతో కస్టమర్లకు ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. తీరా వాడకానికొస్తే డౌన్లోడింగ్ సమయంలో తగిన స్పీడ్ లేక యూజర్లు ఉసూరుమనాల్సిన పరిస్థితి నెలకొంది. హైస్పీడ్ 3జీ నెట్‌వర్క్‌లో కనీస డౌన్లోడ్ స్పీడ్ ప్రస్తుతం 399 కేబీపీఎస్ నుంచి 2.48 ఎంబీపీఎస్‌గా స్థాయిలో ఉంది. కాగా, 3జీ, సీడీఎంఏ(ఈవీడీఓ డాంగిల్) సేవల్లో కనీస డౌన్లోడ్ స్పీడ్ 1 ఎంబీపీఎస్‌గా(95% కచ్చితత్వం) నిర్ణయించాలని ట్రాయ్ ప్రతిపాదించింది. అదేవిధంగా జీఎస్ఎం, సీడీఎంఏ 2జీ సేవలకు కనీస డౌన్లోడ్ స్పీడ్ 56 కేబీపీఎస్‌గా, సీడీఎంఏ హైస్పీడ్ డేటా సేవలకు 512 కేబీపీఎస్‌గా చేయాలనుకుంటోంది. అంతేకాదు ప్రతి టారిఫ్ ప్లాన్‌కు సంబంధించి కనీస డౌన్లోడ్ స్పీడ్‌ను రీచార్జ్ వోచర్లు, వెబ్సైట్లు, యాడ్లలో కూడా కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ చర్చాపత్రంపై అన్నివర్గాలు అభిప్రాయలు తెలిపేందుకు మే 5 వరకు గడువుఇచ్చింది. -
జూలై నుంచి పీఎఫ్ బదిలీలు ఆన్లైన్లో
న్యూఢిల్లీ: ప్రైవేట్ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ట్రస్టుల పరిధిలోని సంఘటిత రంగ కార్మికులు వచ్చే జూలై నుంచి తమ పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్లో బదిలీ చేసుకోవచ్చు. దేశంలో ఇలాంటి ట్రస్టులు 3 వేలకు పైగా ఉన్నాయి. ఇవి తమ పరిధిలోని కార్మికుల రిటైర్మెంట్ ఫండ్‌ను, అకౌంట్లను నిర్వహిస్తుంటాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అజమాయిషీలో ఈ ట్రస్టులు ఉంటాయి. పీఎఫ్ రిటర్నులు దాఖలు చేసే అన్-ఎగ్జెంప్టెడ్ ఫర్మ్‌లు, ప్రైవేట్ ట్రస్టుల మధ్య పీఎఫ్ అకౌంట్ల బదిలీకి ఆన్లైన్ సౌకర్యం కల్పించాలని ఈపీఎఫ్ఓ భావించింది (తమ కార్మికుల పీఎఫ్ ఖాతాలను ఈపీఎఫ్ఓతో కలసి నిర్వహించే కంపెనీలే అన్-ఎగ్జెంప్టెడ్ ఫర్మ్‌లు). జూన్ చివరిలోగా ఆన్లైన్ సౌకర్యానికి తగిన సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసే యత్నాల్లో ఈపీఎఫ్ఓ నిమగ్నమైంది. -
రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం 5,631 కోట్లు
Reliance Industries Q4 PAT up 2.3% at Rs 5630 crore, in line with estimates Read more at: http://economictimes.indiatimes.com/articleshow/33913963.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst గత ఆర్థిక సంవత్సరం రిలయన్స్‌కు కు చాలా సంతృప్తికరంగా సాగింది. జీఆర్‌ఎంలు భారీగా పుంజుకోవడంతో రిఫైనింగ్ వ్యాపారంలో ఎన్నడూలేనంత అత్యధికస్థాయి లాభాలను ఆర్జించగలిగాం. పాలిమర్స్, వీటి ఉత్పత్తుల అమ్మకం మార్జిన్లు పెరగడంతో పెట్రోకెమికల్స్లో లాభాలు కూడా భారీగా వృద్ధిచెందాయి. దేశీయంగా చమురు-గ్యాస్ ఉత్పత్తిలో కొన్ని సాంకేతికపరమైన సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ.. అమెరికాలోని షేల్ గ్యాస్ వ్యాపారం గణనీయమైన వృద్ధిని నమోదుచేసుకుంది. రిటైల్ వ్యాపారం విషయానికొస్తే దేశంలోనే అతిపెద్ద రిటైల్ చైన్‌గా ఆవిర్భవించాం. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతోకూడిన 4జీ టెలికం సేవలను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు కసరత్తును వేగవంతం చేశాం. - ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ సీఎండీ న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గడచిన రెండేళ్లకు పైగా కాలంలో అత్యధిక స్థాయిలో త్రైమాసిక లాభాన్ని ఆర్జించింది. గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2013-14, జనవరి-మార్చి-క్యూ4)లో రూ.5,631 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,589 కోట్లతో పోలిస్తే లాభం నామమాత్రంగానే(0.8 శాతం) వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం క్యూ4లో 13 శాతం పెరుగుదలతో రూ.97,807 కోట్లకు ఎగసింది. కాగా, 2012-13 క్యూ4లో డాలరుతో రూపాయి మారకం విలువ 54.2 స్థాయిలో ఉండగా.. 2013-14 క్యూ4లో రూపాయి సగటు విలువ 61.8గా ఉంది. రూపాయి భారీ క్షీణత కూడా కంపెనీ రాబడులు పుంజుకోవడానికి దోహదం చేసింది. జీఆర్ఎంల జోరు... మార్చి క్వార్టర్లో స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం-ఒక్కో బ్యారెల్ ముడిచమురును శుద్ధిచేయడం ద్వారా వచ్చే రాబడి) మెరుగైన రీతిలో 9.3 డాలర్లుగా నమోదైంది. అంతక్రితం క్వార్టర్(క్యూ3)లో 7.6 డాలర్లతో పోలిస్తే 1.7 డాలర్లు(22 శాతం) ఎగబాకింది. అయితే, క్రితం ఏడాది క్యూ4లో నమోదైన 10.1 డాలర్లతో పోలిస్తే మాత్రం తగ్గుముఖం పట్టడం విశేషం. సీక్వెన్షియల్‌గా చూస్తే... 2013-14 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో నమోదైన రూ.5,511 కోట్ల నికర లాభంతో పోలిస్తే(సీక్వెన్షియల్ ప్రాతిపదికన) క్యూ4లో లాభం 2.2 శాతం మేర పెరిగింది. అయితే, మొత్తం ఆదాయం మాత్రం రూ.1.03 లక్షలతో పోలిస్తే 8 శాతం తగ్గింది. పూర్తి ఏడాదికి ఇలా...: గతేడాది(2013-14) రిలయన్స్ నికర లాభం రూ.21,984 కోట్లుగా నమోదైంది. దేశంలోని ఒక ప్రైవేటు రంగ కంపెనీ ఒక ఏడాదిలో ఆర్జించిన అత్యధిక లాభంగా నిలిచింది. 2012-13 ఏడాదిలో ఆర్జించిన రూ.21,003 కోట్లతో పోలిస్తే 4.7% పెరిగింది. మొత్తం ఆదాయం కూడా పూర్తి ఏడాదికి 8.1% పెరుగుదలతో రూ.4,01,302 కోట్లకు వృద్ధి చెందింది. ఇది కూడా రికార్డు గరిష్టస్థాయి. అంతక్రితం ఏడాదిలో ఆదాయం రూ.3,71,119 కోట్లు. అతిపెద్ద రిటైల్ చైన్‌గా ఆవిర్భావం.. రిలయన్స్ రిటైల్... దేశంలో అతిపెద్ద రిటైల్ చైన్‌గా ఆవిర్భవించిందని ఆర్ఐఎల్ ప్రకటించింది. 2013-14 పూర్తి ఏడాదికి రిటైల్ వ్యాపార విభాగం రూ.363 కోట్ల పన్ను ముందు(ఎబిటా) లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.14,496 కోట్లకు ఎగబాకింది. గతేడాది అన్ని విభాగాల్లో కలిపి కొత్తగా 225 రిటైల్ సోర్లను కంపెనీ ఏర్పాటు చేసింది. దీంతో మార్చి చివరినాటికి రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 146 నగరాల్లో 1,691కి చేరింది. కాగా, మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో సంస్థ ఆదాయం 19.27% వృద్ధితో రూ.3,051 కోట్ల నుంచి రూ.3,639 కోట్లకు పెరిగింది. ఇతర ముఖ్యాంశాలివీ... పెట్రో కెమికల్స్ వ్యాపార విభాగం లాభం క్యూ4లో రూ.2,096 కోట్లకు పెరిగింది. అంతక్రిత ఏడాది ఇదే కాలంలో రూ.1,895 కోట్లతో పోలిస్తే 10.6 శాతం ఎగసింది. చమురుశుద్ధి(రిఫైనింగ్) విభాగం లాభం రూ.3,520 కోట్ల నుంచి రూ.3,954 కోట్లకు చేరింది. 12.3 శాతం పెరిగింది. అయితే, చమురు-గ్యాస్ ఉత్పత్తి విభాగం లాభం మాత్రం 17.8 శాతం దిగజారి రూ.460 కోట్ల నుంచి రూ.378 కోట్లకు పడిపోయింది. ఆదాయం కూడా రూ.1,597 కోట్ల నుంచి రూ.1,417 కోట్లకు క్షీణించింది. అంటే 11.2 శాతం తగ్గింది. ప్రధానంగా కేజీ-డీ6 బ్లాక్‌లో గ్యాస్ ఉత్పత్తి భారీగా దిగజారడమే దీనికి కారణంగా నిలిచింది. భౌగోళికపరమైన అడ్డంకులతోపాటు అంచనాకంటే బావుల్లోకి అధికంగా నీరుచేరడం ఇతరత్రా సమస్యలు గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోయేలా చేస్తున్నాయని కంపెనీ పేర్కొంది. క్యూ4లో షేరు వారీ ఆర్జన(ఈపీఎస్) రూ.17.3 నుంచి స్వల్పంగా రూ.17.4కు చేరింది. పూర్తి ఏడాదికి చూస్తే... రూ.65.8 నుంచి రూ.68కి వృద్ధి చెందింది. ఇతర ఆదాయం క్యూ4లో రూ.2,040 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఇది రూ.2,240 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో జామ్‌నగర్‌లోని జంట రిఫైనరీల నుంచి 41.1 బిలియన్ డాలర్ల పెట్రో ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అంతక్రితం ఏడాది ఇది 39.3 బిలియన్ డాలర్లు. మార్చి చివరి నాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.89,968 కోట్లకు పెరిగిపోయింది. క్రితం ఏడాది మార్చి ఆఖరికి రూ. 72,427 కోట్లు మాత్రమే రుణభారం ఉండటం గమనార్హం. ఇక మార్చి చివరికల్లా రిలయన్స్ వద్ద మొత్తం రూ.88,190 కోట్ల నగదు తత్సంబంధ నిల్వలు ఉన్నాయి. ఒక్కో షేరుకి రూ.9.50 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీ షేరు ధర గురువారం(శుక్రవారం స్టాక్ మార్కెట్ టేడ్రింగ్ సెలవు) 1.88 శాతం పెరిగి రూ.959 వద్ద ముగిసింది. -
హెచ్‌సీఎల్ టెక్ భేష్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ జవనరి-మార్చి(క్యూ3)లో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. నికర లాభం 59% ఎగసి రూ. 1,624 కోట్లను తాకింది. గతేడాది క్యూ3లో రూ. 1,021 కోట్లను మాత్రమే ఆర్జించింది. కంపెనీ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. ఇక ఇదే కాలానికి ఆదాయం కూడా దాదాపు 30% పుంజుకుని రూ. 8,349 కోట్లకు చేరింది. గతంలో రూ. 6,430 కోట్లు నమోదైంది. ఇక డాలర్ల రూపేణా చూస్తే... నికర లాభం 40% వృద్ధితో 26.42 కోట్ల డాలర్లకు చేరగా, 14% అధికంగా 136 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. కాగా, త్రైమాసిక ప్రాతిపదికన కూడా 3% స్థాయిలో వృద్ధిని చూపగలిగినట్లు హెచ్‌సీఎల్ టెక్ ప్రెసిడెంట్ అనంత్ గుప్తా చెప్పారు. వరుసగా 10వ క్వార్టర్లో మార్జిన ్లను పెంచుకోగలిగినట్లు తెలిపారు. అక్టోబర్-డిసెంబర్(క్యూ2) కాలంతో పోలిస్తే క్యూ3లో నికర లాభం 8.5% పుంజుకోగా, ఆదాయం 2% వృద్ధిని సాధించినట్లు వివరించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సేవలను అందించడం ద్వారా కాంట్రాక్ట్‌లను పెంచుకున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో అనిల్ చనానా చెప్పారు. సాధారణ, పాలనా సంబంధ వ్యయాలను కట్టడి చేయడం ద్వారా మార్జిన్లను 15.9% నుంచి 19.4%కు మెరుగుపరచుకున్నట్లు తెలిపారు. ఇతర విశేషాలివీ... వాటాదారులకు షేరుకి రూ. 4 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. క్యూ3లో స్థూలంగా 8,291 మందికి ఉద్యోగాలను కల్పించగా, నికరంగా 1,858 మంది మిగిలారు. మార్చి చివరికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 90,190గా నమోదైంది. 50 మిలియన్ డాలర్లు, 30 మిలియన్ డాలర్ల విభాగంలో కొత్తగా ఇద్దరేసి చొప్పున క్లయింట్లను పొందింది. నగదు, తత్సమాన నిల్వల విలువ దాదాపు రూ. 1,046 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ఇంట్రాడేలో 3% ఎగసి గరిష్టంగా రూ.1,455ను తాకింది. చివరికి 1% లాభంతో రూ. 1,424 వద్ద ముగిసింది. -
విప్రో ఫలితాలు ఓకే
బెంగళూరు: దేశీ ఐటీ దిగ్గజం విప్రో ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2013-14, క్యూ4)లో రూ.2,227 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 1,729 కోట్ల లాభంతో పోలిస్తే(వార్షిక ప్రాతిపదికన) 29 శాతం వృద్ధి నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా వార్షికంగా 21.7 శాతం పెరుగుదలతో రూ.11,704 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.9,613 కోట్లుగా ఉంది. పరిశ్రమ విశ్లేషకులు, మార్కెట్ నిపుణులు క్యూ4లో కంపెనీ నికర లాభం రూ.2,106 కోట్లుగా, ఆదాయాన్ని రూ.10,541 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికంలో ఐటీ సేవల విభాగం ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)ను అంతంతమాత్రంగానే విప్రో ప్రకటించింది. డాలర్ రూపంలో 1.715-1.755 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని పేర్కొంది. డాలరుతో రూపాయి మారకం విలువన 61.62గా పరిగణించి ఈ గెడైన్స్‌ను ఇచ్చింది. కాగా, క్యూ4లో ఆదాయం డాలర్ రూపంలో 1.72 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం గమనార్హం. సీక్వెన్షియల్‌గా 2.5 శాతం, వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం పెరిగింది. యూరప్‌లో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, అమెరికాలో పటిష్టమైన వృద్ధి, మెరుగైన వ్యయ నిర్వహణ వంటివి ఫలితాల జోరుకు కారణాలుగా నిలిచాయి. సీక్వెన్షియల్‌గా: గతేడాది డిసెంబర్ క్వార్టర్లో నికర లాభం రూ.2,015 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్‌గా) మార్చి క్వార్టర్లో లాభం 10.5 శాతం వృద్ధి చెందింది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా 11,327 కోట్ల నుంచి 3.3 శాతం సీక్వెన్షియల్ వృద్ధిని నమోదు చేసుకుంది. పూర్తి ఏడాదికి ఇలా: 2013-14 పూర్తి ఏడాదిలో విప్రో నికర లాభం రూ,7,797 కోట్లకు ఎగబాకింది. 2012-13లో రూ.6,636 కోట్లతో పోలిస్తే 17.5% వృద్ధిచెందింది. మొత్తం ఆదాయం రూ.33,685 కోట్ల నుంచి రూ.43,755 కోట్లకు పెరిగింది. 16% వృద్ధి నమోదైంది. ఉత్పాదకత పెంపునకు అనుసరించిన మెరుగైన వ్యూహాలు, కాంట్రాక్టుల అమలు గడువును తగ్గించుకోవడంపై దృష్టిపెట్టడం ద్వారా పటిష్టమైన ఫలితాలను సాధించగలిగామని విప్రో సీఈఓ టీకే కురియన్ చెప్పారు. ఇతర ముఖ్యాంశాలు.. ఐటీ సేవల విభాగం ఆదాయం క్యూ4లో రూ.10,619 కోట్లుగా కంపెనీ వెల్లడించింది. సీక్వెన్షియల్‌గా 2.5 శాతం, వార్షిక ప్రాతిపదికన 24% చొప్పున పెరిగింది. పూర్తి ఏడాదికి ఈ విభాగం మొత్తం ఆదాయం 18% వృద్ధితో రూ.39,950 కోట్లకు ఎగసింది. క్యూ4లో కొత్తగా 59 మంది క్లయింట్లు జతయ్యారు. ఇందులో 5 మెగా డీల్స్ కూడా ఉన్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీ రూ.2 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.5 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. పూర్తి ఏడాదికి డివిడెండ్ మొత్తం రూ. 8కి చేరింది. మార్చి చివరినాటికి విప్రో ఐటీ సేవల వ్యాపారంలో సిబ్బంది సంఖ్య 1,46,053 మందిగా నమోదైంది. ఆఫ్‌షోర్ సిబ్బందికి 6-8 శాతం, ఆన్సైట్ ఉద్యోగులకు 2-3 శాతం పెంపుదలకు అవకాశం ఉందని విప్రో సీనియర్ వైస్ ప్రెసిడెంట్(హెచ్ఆర్) సౌరభ్ గోవిల్ చెప్పారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర గురువారం బీఎస్ఈలో 2.39 శాతం ఎగబాకి రూ.586 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లో టేడింగ్ ముగిశాక కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. -
కొత్త సీఈఓ అన్వేషణలో ఇన్ఫోసిస్
బెంగళూరు: ఇన్ఫోసిస్ సారథ్య బాధ్యతలను ఎన్.ఆర్.నారాయణ మూర్తి గతేడాది తిరిగి చేపట్టిన తర్వాత కంపెనీకి గుడ్‌బై చెబుతున్న ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు డెరైక్టర్లతో సహా తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్‌లు వివిధ కారణాలతో వైదొలిగారు. తాజాగా, కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎస్.డి.శిబులాల్ అదే బాటపట్టారు. శిబులాల్ వారసుడి కోసం అన్వేషిస్తున్నట్లు కంపెనీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే పదవి నుంచి వైదొలగుతానని శిబులాల్ (59) చెప్పడమే ఇందుకు కారణమని తెలిపింది. కేరళలోని అలెప్పీలో జన్మించిన ఆయనకు వచ్చే ఏడాది మార్చి 1వ తేదీకి 60 ఏళ్ల నిండనున్నాయి. తన పదవీ కాలం పూర్తి కావడానికి (మార్చి 2015) ముందు, లేదా కొత్త వ్యక్తి ఈ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమైనపుడు తాను తప్పుకుంటానని శిబులాల్ గతంలోనే వెల్లడించారని కంపెనీ పేర్కొంది. శిబులాల్ వారసుడి కోసం డెరైక్టర్ల బోర్టులోని నామినేషన్ల కమిటీ అన్వేషణ ప్రారంభించిందని ఇన్ఫోసిస్ తెలిపింది. సంస్థలో ఈ పదవికి అర్హత కలిగిన వారిని నామినేషన్ల కమిటీ షార్ట్‌లిస్ట్ చేస్తుందనీ, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల శక్తి సామర్థ్యాలను అంచనా వేయడంలో పేరొందిన డెవలప్మెంట్ డెమైన్షన్స్ ఇంటర్నేషనల్ సహాయం తీసుకుంటామనీ పేర్కొంది. ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వారిలో తగిన వారిని గుర్తించడంలో కమిటీకి సహకరించేందుకు ఎగాన్ జెండర్ అనే ఎగ్జిక్యూటివ్ సెర్చ్ కంపెనీని ఇన్ఫోసిస్ నియమించింది. ముందుగానే రిటైర్ కావాలని శిబులాల్ ఎందుకు కోరుకుంటున్నారన్న ప్రశ్నకు కంపెనీ ప్రతినిధి జవాబు నిరాకరించారు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ (జనవరి - మార్చి) ఆర్థిక ఫలితాలను త్వరలో (ఈ నెల 15న) ప్రకటించనున్నందున ప్రస్తుతం మౌనం పాటిస్తున్నామని ఆయన చెప్పారు. ఇన్ఫోసిస్‌లో ఉన్నతమైన సీఈఓ పీఠం కోసం కంపెనీ అధ్యక్షులిద్దరూ (బి.జి.శ్రీనివాస్, యు.బి.ప్రవీణ్ రావు) రేసులో ఉన్నారని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి గత జనవరిలోనే సూచనప్రాయంగా వెల్లడించారు. అధ్యక్షులుగా శ్రీనివాస్, ప్రవీణ్ రావులు మూడు నెలల క్రితమే ప్రమోట్ అయ్యారు. -
కొపాక్సోన్పై నాట్కో ఫార్మాకి దెబ్బ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొపాక్సొన్ జెనరిక్ వెర్షన్‌ను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసి అధికాదాయం పొందుదామనుకున్న నాట్కో ఫార్మా ఆశలపై టెవా ఫార్మా నీళ్లు జల్లింది. నాడీ సంబంధిత వ్యాధుల నివారణకు వినియోగించే కొపొక్సొన్ పేటెంట్ హక్కులపై టెవా ఫార్మా లేవనెత్తిన వాదనలు వినడానికి అమెరికా సుప్రీంకోర్టు సమ్మతించింది. వచ్చే రెండు నెలల్లో మార్కెట్లోకి విడుదల చేయడానికి నాట్కో ఫార్మా రంగం సిద్ధం చేసుకుంటుండగా ఇప్పుడు టెవా సుప్రీంకోర్టుకు ఎక్కడంతో జాప్యం తప్పకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ గత ఏడాది అమెరికాలోని కింది కోర్టు ఇతర కంపెనీలతో కలిసి ఈ ఔషధాన్ని విక్రయించడానికి నాట్కోకి అనుమతి మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది మే నెలలో కొపాక్జోన్ను మార్కెట్లోకి విడుదల చేయడానికి నాట్కో ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ప్రపంచ జెనరిక్ ఔషధ కంపెనీల్లో మొదటి స్థానంలో ఉన్న టెవా వ్యాపారంలో 20 శాతం కొపాక్జోన్ నుంచి వస్తుండటమే కాకుండా, లాభాల్లో 50 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది అమెరికాలో కొపాక్సొన్ అమ్మకాల విలువ రూ. 25,200 కోట్లుగా నమోదయ్యింది. నమ్మకం ఉంది టెవాకి చెందిన 808 పేటెంట్ చెల్లదన్న నమ్మకాన్ని నాట్కో ఫార్మా వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. మైలాన్, మొమెంటా ఫార్మాస్యూటికల్స్‌తో కలిసి కొపాక్సొన్ను అమెరికాలో విక్రయించడానికి నాట్కోకి గతేడాది అనుమతి లభించింది. ప్రస్తుత వార్తల నేపథ్యంలో మంగళవారం నాట్కో ఫార్మా షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో 14శాతం నష్టపోయి రూ.685 వద్ద ముగి సింది. కొపాక్సొన్ జెనరిక్ వెర్షన్‌పై నాట్కో హక్కులు పొందినప్పటి నుంచి ఆదాయం బాగా పెరుగుతుం దన్న అంచనాతో నాట్కో ఫార్మా షేరు దూసుకుపోయింది. ఇప్పుడు ఈ అంశం తిరిగి కోర్టు పరిధిలోకి వెళ్ళడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారని, ప్రస్తుత స్థాయి నుంచి 10 శాతం మించి పతనం అయ్యే అవకాశాలు కనిపించడం లేదని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి అభిప్రాయపడ్డారు. -
ప్రస్తుత ధరకే రిలయన్స్ కేజీ డీ6 గ్యాస్ విక్రయం
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం నాచురల్ గ్యాస్ ధరల సవరణపై నిర్ణయం తీసుకునేంత వరకు కేజీ డీ6 క్షేత్రంలో ఉత్పత్తయ్యే గ్యాస్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత రేటుకే విక్రయించనుంది. ప్రస్తుతం మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్లకు (ఎంబీటీయూ) 4.2 డాలర్లుగా ఉన్న ధరను ఏప్రిల్ 1 నుంచి 8 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించిన సంగతి విదితమే. అయితే, ఎన్నికల సంఘం సలహా మేరకు, మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ధరల పెంపును వాయిదా వేయాలని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ నిర్ణయించారని అధికార వర్గాలు తెలిపాయి. ఓఎన్జీసీ వంటి సంస్థలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు గ్యాస్‌ను 4.2 డాలర్ల ధరకే అమ్ముతాయి. అయితే, కేజీ డీ6 గ్యాస్‌పై రిలయన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకోవాలంటే ఇరు పక్షాలూ సంతకాలు చేయాల్సి ఉంది. నూతన విక్రయ ఒప్పందాలకు సంబంధించిన అనేక అంశాలను రిలయన్స్ - కేజీ డీ6 గ్యాస్ కొనుగోలుదారుల సమావేశంలో పరిష్కరించుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత గ్యాస్ అమ్మకం, కొనుగోలు ఒప్పందం (జీఎస్‌పీఏ) మాదిరే కొత్త జీఎస్‌పీఏ కూడా ఐదేళ్లపాటు అమల్లో ఉండడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అంగీకరించిందని ఆవర్గాలు పేర్కొన్నాయి. -
ఈ-ఫైలింగ్ ప్రక్రియ మరింత సరళతరం
న్యూఢిల్లీ: ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులను ఈ-ఫైలింగ్ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నట్లు ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ఆర్కే తివారి తెలిపారు. ఆన్లైన్ పద్ధతిలో రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో నిబంధనలను సరళతరం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. గత ఆర్థిక సంవత్సరం మార్చ్ 22 నాటికి 1.80 కోట్ల మేర ఈ-రిటర్నులు రాగా ఈసారి 40 శాతం పెరిగి 2.56 కోట్ల దాకా వచ్చాయని తివారీ చెప్పారు. బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) నెలకు 2.80 లక్షల రిటర్నులను ప్రాసెస్ చేస్తోందని తెలిపారు. ఈ-రిటర్నుల ప్రాసెసింగ్‌కి పట్టే సమయం కూడా 70 రోజుల నుంచి 61 రోజులకు తగ్గిందని తివారీ చెప్పారు. మరోవైపు, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ వివాదాలను నివారించడానికి మార్చ్ 31లోగా మరిన్ని బహుళ జాతి సంస్థలతో అడ్వాన్స్ ప్రైసింగ్ ఒప్పందాలు (ఏపీఏ) కుదుర్చుకోనున్నట్లు తివారీ తెలిపారు. భవిష్యత్‌లో కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించి అనుసరించే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ విధానం గురించి పన్నుల శాఖతో కంపెనీలు ఈ ఏపీఏ ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఒకే గ్రూప్‌లోని రెండు సంస్థల మధ్య జరిగే లావాదేవీల విషయంలో సదరు గ్రూప్ పాటించే ధరల విధానాన్ని ట్రాన్స్ఫర్ ప్రైసింగ్‌గా పరిగణిస్తారు. చాలా మటుకు బహుళ జాతి కంపెనీలు దీన్ని అడ్డం పెట్టుకుని తమ లాభాలన్నీ .. తక్కువ పన్నులు ఉండే దేశాల్లోకి మళ్లిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వివాదాలను తగ్గించే ఉద్దేశంతో ఏపీఏలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధిస్తాం.. ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధిస్తామన్న విశ్వాసాన్ని తివారీ వ్యక్తం చేశారు. ఇక్కడ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో తివారీ మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ.6.36 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని పెట్టుకుంది. మార్చి 22 వరకూ వీటిలో రూ.5.82 లక్షల కోట్ల వసూళ్లు జరిగినట్లు తివారీ తెలిపారు. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఇది 13.6 శాతం అధికం. ముందస్తు పన్ను వసూళ్లు మొత్తంగా చూస్తే మార్చి 22తో ముగిసిన యేడాదికాలంలో 8.7 శాతం వృద్ధితో రూ.2,90,323 కోట్లుగా ఉన్నట్లు తివారీ వివరించారు. -
ఏటీఎంలకు ‘ఎక్స్పీ’ గండం...
న్యూఢిల్లీ: విండోస్ ఎక్స్పీ నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లోని చాలా పర్సనల్ కంప్యూటర్లు, ఏటీఎంలను ఆప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని అమెరికా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఇలా చేయని పక్షంలో ఈ పీసీలకు, ఏటీఎంలకు సెక్యురిటీ రిస్క్‌లు తప్పకపోవచ్చని వివరించింది. ఈ కంపెనీ విండోస్ ఎక్స్‌పీని 2001, ఆక్టోబర్‌లో విడుదల చేసింది. ప్రస్తుతమున్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8తో పోల్చితే విండోస్ ఎక్స్పీ మూడు జనరేషన్లు వెనకబడి ఉంది. వచ్చే నెల 8 నుంచి విండోస్ ఎక్స్‌పీకి సపోర్ట్ సర్వీసులందించడం ఆపేస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో లక్ష వరకూ ఏటీఎంలు ఉంటాయని, వీటిల్లో అధిక భాగం విండోస్ ఎక్స్‌పీపైనే పనిచేస్తున్నాయని మైక్రోసాఫ్ట్ ఇండియా జీఎం(విండోస్ బిజినెస్) అమ్రిష్ గోయెల్ పేర్కొన్నారు. అయితే కేవలం కొన్ని పాత ఏటీఎంలకు మాత్రమే సమస్య ఉంటుందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎం.వి. టంకసాలె పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సపోర్ట్ సర్వీసులు ఆగిపోతే సమస్యలు పెరుగుతాయని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని గత వారంలోనే భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కూడా హెచ్చరించింది. -
ఇన్ఫోసిస్‌కు మరో ఉన్నతాధికారి గుడ్‌బై
బెంగళూరు: ఇన్ఫోసిస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు చంద్రశేఖర్ కాకాల్ తన పదవికి రాజీనామా సమర్పించారు. ఏప్రిల్ 18 నుంచి రాజీనామా అమల్లోకి రానుంది. ఇన్ఫోసిస్ సారథ్య బాధ్యతలను నారాయణమూర్తి తిరిగి చేపట్టిన నాటినుంచి వైదొలగిన ఉన్నతాధికారుల్లో కాకాల్ తొమ్మిదో వారు. కాకాల్ బుధవారం రాజీనామా సమర్పించగా, ఈ విషయాన్ని కంపెనీ గురువారం వెల్లడించింది. ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్లుగా బి.జి.శ్రీనివాస్, ప్రవీణ్ రావులకు పదోన్నతి ఇచ్చిన సందర్భంలో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి కాకాల్ పోటీపడే అవకాశముందనే వాదనలు విన్పించాయి. 1999లో ఇన్ఫోసిస్‌లో చేరిన కాకాల్... అప్లికేషన్, టెస్టింగ్, ఇన్ఫ్రా డెవలప్మెంట్ సర్వీసెస్, కన్సల్టింగ్, మార్కెటింగ్ వంటి వివిధ విభాగాల్లో సేవలందించారు. కంపెనీ డెలివరీ కేపబిలిటీస్లో దాదాపు 95 శాతాన్ని ప్రవీణ్ రావుకు అప్పగించడంతో తనను చిన్నచూపు చూశారని కాకాల్ భావించి, రాజీనామా చేసి ఉండవచ్చని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఆయన సొంత కంపెనీ స్థాపించే ఆలోచనలో ఉన్నారనీ, అందుకోసమే ఫండ్ కంపెనీలతో చర్చిస్తున్నారనే వదంతులు రెండు మూడు వారాల క్రితం విన్పించాయి. -
ఆర్థిక స్వేచ్ఛలో రాష్ట్రానిది మూడో స్థానం
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి సానుకూలంగా మరో నివేదిక వెలువడింది. ఆయన సీఎంగా ఉన్న గుజరాత్ రాష్ట్రం.. ఆర్థికాంశాల స్వేచ్ఛకు సంబంధించి రాష్ట్రాల వారీ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. ఇదే విషయంలో అత్యంత వేగంగా స్కోరును మెరుగుపర్చుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిల్చింది. ప్రముఖ ఆర్థిక వేత్తలు అశోక్ గులాటీ, బిబేక్ దేబ్రాయ్, లవీష్ భండారీ, జర్నలిస్టు స్వామినాథన్ అయ్యర్ రూపొందించిన ఈఎఫ్‌ఎస్‌ఐ-2013 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పాలనాయంత్రాంగం పరిమాణం, న్యాయ వ్యవస్థ, ప్రాపర్టీ హక్కులకు భద్రత, వ్యాపార.. కార్మిక చట్టాల అమలు మొదలైన అంశాల ప్రాతిపదికగా దీన్ని రూపొందించారు. దీని ప్రకారం 2005లో అయిదో స్థానంలో ఉన్న గుజరాత్ ఆర్థిక స్వేచ్ఛతో పాటు వేగంగా పరిస్థితులను మెరుగుపర్చుకునే విషయంలో కూడా అగ్రస్థానం దక్కించుకుంది. 0-1.0 స్కేలుపై 0.65 స్కోరు సాధించింది. ఓవరాల్‌గా తమిళనాడు రెండో స్థానంలో (0.54 స్కోరు), ఆంధ్రప్రదేశ్ (0.50 స్కోరు) మూడో స్థానంలో ఉన్నాయి. బీహార్ 0.31 స్కోరుతో ఎప్పట్లాగానే అట్టడుగున ఉంది. మావోయిస్టులు వంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ.. జార్ఖండ్‌తో పోలిస్తే చత్తీస్‌గఢ్ మెరుగైన స్కోరుతో 16వ స్థానం నుంచి 8వ స్థానానికి ఎగబాకింది. -
డాట్సన్ మళ్లీ వచ్చెన్..
న్యూఢిల్లీ: జపాన్ వాహన దిగ్గజం, నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్‌ను మరలా అంతర్జాతీయ మార్కెట్లోకి తెచ్చింది. డాట్సన్ బ్రాండ్‌లో ఎంట్రీ లెవల్ కార్, డాట్సన్ గోను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. భారత్ తర్వాత ఇండోనేషియా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ కార్లను నిస్సాన్ కంపెనీ విడుదల చేయనున్నది. ఈ కారు ధరలు రూ.3.12 లక్షల నుంచి రూ.3.70 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. దాదాపు 30 సంవత్సరాల తర్వాత డాట్సన్ బ్రాండ్‌ను నిస్సాన్ కంపెనీ మార్కెట్లోకి తెస్తోంది. నిస్సాన్ కంపెనీ 1980ల్లో డాట్సన్ బ్రాండ్ కార్లను విక్రయించడం ఆపేసింది. అప్పటికి 80 ఏళ్లుగా 190 దేశాల్లో 2 కోట్లకు పైగా డాట్సన్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ డాట్సన్ గో కారు రాకతో చిన్న కార్ల సెగ్మెంట్లో పోటీ తీవ్రం కానున్నదని నిపుణులంటున్నారు. ఈ కారు మారుతీ సుజుకి కంపెనీ ఆల్టో 800(రూ.2.37లక్షలు-రూ.3.52 లక్షలు), ఆల్టో కే10(రూ.3.15 లక్షలు-రూ.3.31 లక్షలు), హ్యుందాయ్ ఈఆన్(రూ.2.83 లక్షలు-రూ.3.85 లక్షలు)లకు గట్టి పోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్లలో మూడు మోడళ్లు.. భారత కార్ల మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉన్న చిన్న కార్ల సెగ్మెంట్లోకి డాట్సన్ బ్రాండ్‌తో ప్రవేశిస్తున్నామని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో కెనిచిరో యోముర చెప్పారు. నిస్సాన్ కంపెనీ మొత్తం భవిష్యత్తు అమ్మకాల్లో డాట్సన్ అమ్మకాలు సగం నుంచి మూడో వంతు వరకూ ఉంటాయని ఆయన అంచనా వేస్తున్నారు. రెండేళ్లలో మూడు డాట్సన్ మోడళ్లను అందించనున్నామని, త్వరలో రెండో మోడల్ డాట్సన్ గో ప్లస్‌ను తేనున్నామని పేర్కొన్నారు. భారత్, రష్యా, బ్రెజిల్ వంటి అధిక వృద్ధి ఉన్న దేశాల్లో తొలిసారిగా కార్లను కొనుగోలు చేసే వినియోగదారుల కారణంగా కొత్త కార్లకు డిమాండ్ పెరుగుతోందని డాట్సన్ గ్లోబల్ ప్రోగ్రామ్ డెరైక్టర్ అశ్విని గుప్తా చెప్పారు. అందుకే తొలిసారిగా కార్లు కొనే వినియోగదారులు లక్ష్యంగా ఈ కారును అందిస్తున్నామని వివరించారు. కారు ప్రత్యేకతలు... ఐదు డోర్ల ఫ్రంట్ వీల్ డ్రైవ్ డాట్సన్ గో కారులో 1.2 లీటర్ల ఇంజిన్, 5 గేర్లు(మాన్యువల్), టిల్ట్ ఎడ్జెస్ట్‌మెంట్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోలు, మొబైల్ డాకింగ్ స్టేషన్, 4 ఏసీ వెంట్లు, ఫాలో మి హెడ్‌ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. పెట్రోల్ మోడల్ డాట్సన్ గో కారు డి, ఏ, టీ... మూడు వేరియంట్లలో నాలుగు రంగుల్లో లభ్యమవుతుంది. నిస్సాన్ మైక్రా ఇంజిన్నే దీంట్లోనూ వాడారు. 0-100 కి.మీ వేగాన్ని 15-16 సెకన్లలో అందుకోగల ఈ కారు 20.64 కిమీ మైలేజీనిస్తుందని కంపెనీ అంటోంది. ఈ సెగ్మెంట్ హ్యాచ్‌బాక్ కార్లలో విశాలమైన స్పేస్ (బూట్ స్పేస్ 296 లీటర్లు)ఉన్న కారు ఇదని కంపెనీ పేర్కొంది. ముందు సీట్లు కలిసి ఉండడం వల్ల స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఏబీఎస్, ఎయిర్‌బ్యాగ్స్ వంటి భద్రతా ఫీచర్లు మాత్రం లేవు. -
మారుతీ నిర్ణయాన్ని వ్యతిరేకించమంటాం
న్యూఢిల్లీ: గుజరాత్ ప్రాజెక్ట్‌ను మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించమంటూ మైనారిటీ వాటాదారులకు సలహా ఇవ్వనున్నట్లు అడ్వయిజరీ సంస్థలు తెలిపాయి. గుజరాత్లో ఏర్పాటు చేయతలపెట్టిన భారీ తయారీ ప్రాజె క్ట్ను మొత్తంగా జపనీస్ మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ బోర్డు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సుజుకీ పూర్తి అనుబంధ కంపెనీ ద్వారా గుజరాత్ ప్లాంట్‌పై 100% పెట్టుబడులను వెచ్చించేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయం కారణంగా తదుపరి దశలో మారుతీ కేవలం పంపిణీ సంస్థగా మిగిలే అవకాశముండటంతో కంపెనీలో వాటాలున్న 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో మారుతీ ప్రతిపాదనపై వ్యతిరేకంగా ఓటు చేయాల్సిందిగా మైనారిటీ వాటాదారులకు సలహా ఇవ్వనున్నట్లు ఇన్‌గవర్న్ రీసెర్చ్ సర్వీసెస్ వ్యవ స్థాపకుడు శ్రీరాం సుబ్రమణ్యన్ చెప్పారు. ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకోవడంకాకుండా మారుతీలో పెట్టుబడుల ద్వారా సుజుకీ తన వాటాను పెంచుకోవాలని సూచించారు. ఈ అంశంపై మరో అడ్వైయిజరీ సంస్థ ఐఐఏఎస్ స్పందిస్తూ గుజరాత్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన నిధులను మారుతీ కలిగి ఉన్నదని, వెరసి ప్రాజెక్ట్‌ను సుజుకీకి అప్పగించాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించింది. మారుతీ ఆర్‌వోసీఈ 15%గా ఉంటే, ఇన్వెస్ట్మెంట్ ఈల్డ్ మాత్రం 7-8% ఉన్నదని, కనుక మారుతీ గుజరాత్ ప్రాజెక్ట్‌పై పెట్టుబడులను వెచ్చించడమే మేలని వివరించింది. అయితే ఎస్ఈఎస్ సంస్థ మాత్రం మారుతీ కొత్త ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించమంటూ వాటాదారులకు సూచించనున్నట్లు తెలిపింది. ఎఫ్ఐఐల దారెటు?: ప్రయివేట్ రంగ మ్యూచువల్ ఫండ్స్‌తోపాటు, సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు మారుతీ సుజుకీ నిర్ణయాన్ని ఇప్పటికే వ్యతిరేకించాయి. మారుతీలో దాదాపు 7% వాటా కలిగిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ సైతం గుజరాత్ ప్రాజెక్ట్ బదిలీపై ఇప్పటికే మారుతీ వివరణ కోరింది కూడా. అయితే ఈ విషయంలో కీలక పాత్ర పోషించగల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) ఆలోచన ఏమిటన్నది ఇంతవరకూ వెల్లడికాకపోవడం గమనార్హం. మారుతీలో ఎఫ్ఐఐలకు 21.5% వాటా ఉంది. కాగా, కంపెనీలో వాటాలు కలిగిన మొత్తం 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఈ అంశంపై సెబీకి ఫిర్యాదు కూడా చేశాయి. ఈ వ్యతిరేకత నేపథ్యంలో గుజరాత్ ప్రాజెక్ట్ నిర్ణయంపై మైనారిటీ వాటాదారుల అనుమతిని కోరనున్నట్లు మారుతీ ప్రకటించింది. దీంతో 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు కంపెనీ తాజా నిర్ణయాన్ని స్వాగతించాయి. అంతేకాకుండా సవరణలతో కంపెనీ తీసుకురానున్న తాజా ప్రతిపాదనను చూశాక తగిన విధంగా స్పందించాలని నిర్ణయించుకున్నాయి. వాటాదారుల వివరాలివీ... మారుతీలో సుజుకీ కార్పొరేషన్‌కు 56% వాటా ఉంది. మిగిలిన 44% వాటాలో ఎల్ఐసీకి 7%, దేశీయ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు మరో 7% చొప్పున వాటా ఉంది. హెచ్ఎస్బీసీ, క్రెడిట్ సూసీ, నార్వే ప్రభుత్వ పెన్షన్ ఫండ్ తదితర ఎఫ్ఐఐ సంస్థలు 21.5% వాటా కలిగి ఉన్నాయి. ఇక కార్పొరేట్ బాడీస్, రిటైల్ ఇన్వెస్టర్లకు 8%పైగా వాటా ఉంది. -
ఎస్బీఐ రూ. 5,000 కోట్ల మొండిబకాయిల సేల్!
ముంబై: పెరిగిపోతున్న మొండి బకాయిల (ఎన్పీఏ) భారాన్ని తగ్గించుకునే దిశగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చకాచకా అడుగులు వేస్తోంది. రెండు వందల సంవత్సరాల చరిత్రలో మొదటిసారి దాదాపు రూ. 5,000 కోట్ల ఎన్పీఏలను అసెట్ రీకన్స్ట్రక్షన్ సంస్థలకు (ఏఆర్సీ-ఆర్క్స్) విక్రయించనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినెల మార్చిఆఖరునాటికే ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో ఎస్బీఐ మొత్తం రూ. 11,39,326 కోట్ల అసెట్స్‌లో (బ్యాంకు ఇచ్చిన రుణాల్లో) స్థూల ఎన్పీఏలు 5.73 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. విలువ రూపంలో ఎన్పీఏల పరిమాణం దాదాపు రూ.67,799 కోట్లు. ఏప్రిల్ నుంచి ప్రొవిజనింగ్ నిబంధనల (నిర్వహణా లాభాల నుంచి ఎన్పీఏలకు జరిగే కేటాయింపు) కఠినతరం అవుతున్న నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. పునర్వ్యవస్థీకరణ రుణాలకు ప్రొవిజనింగ్ ప్రస్తుత 2 శాతం నుంచి 5 శాతానికి పెరగనుంది. ‘‘ప్రస్తుతం 14 ఏఆర్‌సీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మా మొండిబకాయిల మొత్తాల్లో దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ఎన్పీఏలను విక్రయించడానికి వీటిలో (ఏఆర్సీ) పలు సంస్థలను ఆహ్వానించాం. అధిక బిడ్డర్లకు ఎన్‌పీఏల్లో అధిక మొత్తాలను విక్రయించడానికి సిద్ధమవుతున్నాం. ఈ నెలాఖరుకే ప్రక్రియను పూర్తిచేయాలన్న నిశ్చయంలో ఉన్నాం’’ అని సీనియర్ ఎస్బీఐ అధికారి వెల్లడించారు. వాస్తవానికి ఈ విషయాన్ని బ్యాంక్ చీఫ్ అరుంధతీ భట్టాచార్య మార్చి 8వ తేదీనే ప్రకటించారు. అయితే నిర్దిష్టంగా ఎంతమొత్తమన్న విషయాన్ని వెల్లడించలేదు. కొనుగోలు చేస్తున్న మొండిబకాయిల్లో 5 నుంచి 10 శాతం వరకూ నగదు రూపంలో తక్షణం ఏఆర్‌సీలు చెల్లిస్తాయి. మిగిలిన మొత్తాలు సెక్యూరిటీ రిసిట్స్(ఎస్ఆర్) రూపంలో ఉంటాయని ఇంతక్రితం ఎస్బీఐ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి. -
బంగారం దిగుమతి టారిఫ్ పెంపు
న్యూఢిల్లీ: దేశంలో బంగారం దిగుమతికి సంబంధించిన టారిఫ్ విలువ పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాములకు 433 డాలర్లుగా ఉన్న టారిఫ్‌ను 445 డాలర్లకు పెంచుతున్నట్లు కేంద్రీయ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ బోర్డు(సీబీఈసీ) నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రధానంగా దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుం టుంది. తద్వారా విలువను తక్కువచేసి చూపేందుకు(అండర్ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే ప్రధానోద్దేశం. అంతర్జాతీయంగా బంగారం ధరల ధోరణికి అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఈ టారిఫ్ విలువలో మార్పులను ప్రభుత్వం చేపడుతుంది. కాగా, వెండి దిగుమతి టారిఫ్ విలువను మాత్రం కేజీకి ఇప్పుడున్న 699 డాలర్ల నుంచి 694 డాలర్లకు తగ్గించారు. దేశంలో బంగారం దిగుమతులను అడ్డుకట్టకోసం కస్టమ్స్ సుంకాన్ని 10 శాతానికి పెంచడం, ఇతరత్రా ఆంక్షలు విధించడం తెలిసిందే. వీటి ఫలితంగా 2013-14లో పుత్తడి దిగుమతులు 550 టన్నులకు మించబోవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. క్రితం ఏడాది దిగుతులు 845 టన్నులు. -
హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ : రూ. 47,250
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ కంపెనీ అంతా కొత్తదైన స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఐ3ఎస్ టెక్నాలజీతో రూపొందించిన ఈ బైక్ ధర రూ.47,250(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, సేల్స్) అనిల్ దువా పేర్కొన్నారు. గత నెలలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ బైక్‌ను ప్రదర్శించామని, 100 సీసీ సెగ్మెంట్లో తమ అగ్రస్థానం మరింత పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా ఈ బైక్‌ను తెస్తున్నామని పేర్కొన్నారు. ఇతర మోడళ్లలోనూ ఐ3ఎస్ టెక్నాలజీ ఇంటెలిజెంట్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌గా వ్యవహరించే ఐ3ఎస్ టెక్నాలజీ కారణంగా ట్రాఫిక్‌లో బండి ఆగగానే ఇంజిన్ ఆటోమాటిక్‌గా ఆఫ్ అయిపోతుందని, క్లచ్ నొక్కగానే స్టార్ట్ అవుతుందని అనిల్ దువా పేర్కొన్నారు. ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులున్న నగరాల్లో కూడా మంచి మైలేజీ (70 కిమీ మైలేజీ వస్తుందని అంచనా)వస్తుందని వివరించారు. ఈ టెక్నాలజీకి పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని, ఇతర బైక్‌ల్లో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తామని వివరించారు. 100-సీసీ ఎయిర్-కూల్డ్, 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో రూపొందిన ఈ బైక్‌లో సూపర్ స్ప్లెండర్‌లో ఉన్న త్రీ-టోన్ పెయింట్ ఆప్షన్, అల్యూమినియంతో కూడిన ఫుట్-పెగ్స్ కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్-స్టాండ్ డౌన్ ఇండికేటర్ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. చాలా వరకూ స్ప్లెండర్ ఎన్‌ఎక్స్‌జీని పోలిన ఈ బైక్ నాలుగు కొత్త రంగుల్లో లభ్యమవుతుందని వివరించారు. ఈ కంపెనీ గత నెలలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కొత్త బైక్‌లను ప్రదర్శనకు ఉంచింది. వీటిల్లో 620 సీసీ హస్టర్, 250సీసీ స్పోర్ట్స్ బైక్ హెచ్ఎక్స్ 250ఆర్, హైబ్రిడ్ స్కూటర్ లీప్, 150 సీసీ స్కూటర్ జిర్‌లో రెండు మోడళ్లు, 125 సీసీ డేర్, 110 సీసీ స్కూటర్ డాష్‌లను కూడా ఈ కంపెనీ ఆటో ఎక్స్‌పోలో డిస్ప్లే చేసింది. ఇక ఈ నెలలోనే ప్లెజర్, ఎక్స్ట్రీమ్, జడ్ఎంఆర్ మోడళ్లలో కొత్త వేరియంట్లను అందిస్తామని అనిల్ దువా వెల్లడించారు. -
‘పులి’తో ఆటలొద్దు!
ముంబై: పులిని ఎవరూ బెదిరించలేరు...మా సత్తా ఏంటో మాకు తెలుసు...కొత్త పొత్తుల కోసం పాత మిత్రులను దూరం చేసుకోవాలని చూస్తే ఖబడ్దార్...అంటూ శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే బీజేపీపై మండిపడ్డారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)తో బీజేపీ వైఖరేంటో స్పష్టం చేయాలని ఉద్ధవ్ గురువారం మీడియాతో అన్నారు. మహాకూటమిలో విభేదాలు సృష్టించేలా వ్యవహరిస్తున్న కొంత మంది నేతలను ఇప్పటికైనా బీజేపీ నియంత్రించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ‘ఐదు పార్టీలు ఉన్న మహాకూటమినిబ్రేక్ చేయం. ఇప్పటికీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. మాకు అనుకూల వాతావరణం ఉంది. కేంద్రం, రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తాం. అందులో ఎలాంటి సందేహం లేద’ని అన్నారు. కూటమిలో అసమ్మతి రేగేలా వ్యవహరిస్తున్న నాయకులను ఆ పార్టీ నాయకత్వం అదుపు చేయాల్సిన అవసరముందని బీజేపీకి హెచ్చరికలు పంపారు. మమ్మల్ని ఎవరూ వంచించలేరని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేకంగా అభ్యర్థులను దింపొద్దని రాజ్‌ఠాక్రేను నితిన్ గడ్కారీ కలిసి కోరడంపై మండిపడ్డారు. రాష్ట్ర వ్యవహారాల్లో పార్టీ అధినాయకత్వం తీసుకునే వ్యవహారాన్ని ఒక్క వ్యక్తే ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. నిన్న బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారని, తమ పార్టీ సమావేశాలు జరిగాక మరో రెండు రోజుల్లో ఫోన్‌కాల్ చేస్తానని తెలిపారని వివరించారు. ఎన్డీఏ కూటమిలోకి ఏ కొత్త భాగస్వామిని తీసుకోమని హామీ ఇచ్చారని వివరించారు. ఎన్డీఏను అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు తాను కృషి చేస్తున్నానని వెల్లడించారు. అయితే కొంత మంది తమ స్పీడ్‌కు బ్రేక్‌లు వేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సామ్నా సంపాదకీయంలోను విసుర్లు ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేతో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ భేటీ అనంతరం జరిగిన పరిణామాలపై శివసేన ఇప్పటికే అసంతృప్తితోనే ఉంది. దీనిపై ఇప్పటికే పార్టీ నాయకులు ఉద్ధవ్ ఠాక్రేను కలిసి బుజ్జగించారు. అయినప్పటికీ మరోసారి ఆయన సామ్నా పత్రిక సంపాదకీయంలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. మీకు ఏ మిత్రులైతే వెన్నంటి మద్దతిస్తున్నారో.. వారిని పక్కనబెట్టాలని చూస్తే, ప్రజల మనస్సులో ఏర్పడే అవిశ్వాసమనే రాళ్లు మీ తలపై పడుతాయని పరోక్షంగా బీజేపీని హెచ్చరించారు. ఈ విధంగా ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై పరోక్షంగా అవిశ్వాసానికి పాల్పడేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. తాము ఒంటరిగా పోరాడేందుకు కూడా సమర్థులమని హెచ్చరించారు. ప్రత్యర్థులపై కొట్టాల్సిన లాఠీని తమ తలపై కొట్టుకుని తలపై బొడుపు (బొడుసు)లు తెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలోని మా మిత్రపక్షమైన బీజేపీకి బొడుపు వచ్చిందా..? వస్తే ఎవరు బాధ్యులని పరోక్షంగా ఎమ్మెన్నెస్ సాన్నిహిత్యంపై చురకలంటించారు. మిత్రుడు ఉండగానే ప్రత్యర్థునితో దొడ్డిదారిన చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తే ఇలాగే ఉంటుందన్నారు. మహాకూటమిలో అసమ్మతి మొదలైంది ముంబై: ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే వల్ల బీజేపీ, శివసేనల మధ్య ప్రారంభమైన వివాదం ముదిరిందని ఎన్సీపీ పేర్కొంది. ప్రస్తుతం శివసేన, బీజేపీల మధ్య యుద్ధం జరుగుతోందని, ఆ తర్వాత మహాకూటమిలో ఉన్న మిగతా పార్టీలకి అసమ్మతి సెగ తాకుతుందని రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు భాస్కర్ జాదవ్ గురువారం మీడియాకు తెలిపారు. మండలి ఎన్నికల నుంచి నామినేషన్ వెనక్కి తీసుకున్న నార్వేకర్‌ను అభినందించారు. రైతులను ఆదుకోండి: ఉద్ధవ్ ముంబై: రాష్ట్రంలో ఇటీవల కురిసిక అకాల వర్షాలు ధాటికి పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పార్టీల నాయకులు ముందుకు రావాలని ఆయన గురువారం మీడియాతో అన్నారు. తక్షణమే ప్రభుత్వం బాధితులకు ఆర్థిక సహాకారం అందించాలని తెలిపారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంటే ప్రభుత్వం నుంచి రైతులకు ఆర్థిక సహాయం అందించడం సులువవుతుందన్నారు. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అగ్ర నేతలు ఏకతాటిపైకి వచ్చి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 12 లక్షలకు పైగా హెక్టార్లలో పంట ధ్వంసమైంది. -
పారిశ్రామిక ఉత్పత్తి.. స్వల్ప ఊరట
న్యూఢిల్లీ: కొంచెం ఊరటనిస్తూ... జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిబాటలోకి ప్రవేశిం చింది. మూడు నెలలపాటు అసలు వృద్ధిలేకపోగా, క్షీణతలో ఉన్న ఈ సూచీ 2014 జనవరిలో స్వల్పంగా 0.1% వృద్ధిని (2013 జనవరితో పోల్చితే) నమోదుచేసుకుంది. విద్యుత్, మైనింగ్ రంగాలు ఈ సానుకూల ఫలితానికి కొంత కారణం. కాగా మొత్తం సూచీలో 75% వాటా ఉన్న తయారీ రంగం మాత్రం ఇంకా నీరసంగానే ఉంది. రంగాల వారీగా ... విద్యుత్ ఉత్పత్తి రంగం జనవరిలో 6.5% వృద్ధిని నమోదుచేసుకుంది. 2013 జనవరిలో ఈ రేటు 6.4%. మొత్తం ఐఐపీలో 14% వాటా కలిగిన మైనింగ్ రంగం జనవరిలో (-) 1.8% క్షీణబాట నుంచి 0.7% వృద్ధిలోకి మళ్లింది. తయారీ రంగం 2.7 శాతం వృద్ధి నుంచి 0.7 క్షీణతలోకి జారింది. వినియోగ వస్తువుల రంగం 2.5 శాతం వృద్ధి నుంచి 0.6 శాతం క్షీణతలోకి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ రంగంలో క్షీణత మరింత పెరిగింది. ఇది -2.5 శాతం క్షీణత నుంచి - 4.2 క్షీణతలోకి జారింది. ఊహించిన విధంగానే... తాజా గణాంకాలపై ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ సీ రంగరాజన్ మాట్లాడుతూ, ఐఐపీ తాజా గణాంకాలు ఊహించిన విధంగానే ఉన్నాయన్నారు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో తయారీ రంగం క్రియాశీలత మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు. -
ఎస్బీఐ ఉద్యోగులకు తక్కువ రేటుకే షేర్లు!
కోల్‌కతా: తమ ఉద్యోగులందరికీ మార్కెట్ ధరకంటే తక్కువ(డిస్కౌంట్)లో షేర్ల విక్రయాన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ పేర్కొంది. తద్వారా రూ. 1,200 కోట్ల వరకూ సమీకరించనున్నట్లు బ్యాంక్ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. అయితే ఇది ఇసాప్(ఈఎస్వోపీ) వంటిదికాదని తెలిపారు. బ్యాంక్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఇక్కడకు విచ్చేసిన అరుంధతి ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఉద్యోగులకు జారీచేయబోయే షేరు ధర తదితర వివరాలను వెల్లడించలేనంటూ అశక్తతను వ్యక్తం చేశారు. బ్యాంకు ఉద్యోగులందరికీ షేర్ల కొనుగోలు అవకాశాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. అన్ని అనుమతులు లభించాక వచ్చే ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఉద్యోగులకు షేర్ల విక్రయాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఇక్కడ రాజహాట్లోని టాటా మెడికల్ సెంటర్‌కు స్కానింగ్ పరికరం కొనుగోలు కోసం బ్యాంకు రూ. 6 కోట్లను డొనేట్ చేసిన సందర్భంగా అరుంధతి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా షేర్ల విక్రయ విషయాలను వెల్లడించారు. డిసెంబర్ చివరికి బ్యాంకు 2.23 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. -
స్వల్పంగా పెరిగిన హీరో అమ్మకాలు
న్యూఢిల్లీ/చెన్నై: హీరో మోటోకార్ప్ ఫిబ్రవరి అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 5,01,271 వాహనాలు విక్రయించామని, ప్రస్తుతం 5,04,181 వాహనాలు అమ్మామని కంపెనీ పేర్కొంది. త్వరలో ప్లెజర్, ఎక్స్ట్రీమ్, కరిజ్మా, జడ్ఎంఆర్ మోడళ్లలో కొత్త వేరియంట్లను అందించనున్నట్లు తెలిపింది. బజాజ్ ఆటో: మరో వాహన కంపెనీ బజాజ్ ఆటో మోటార్ బైక్‌ల విక్రయాలు ఫిబ్రవరిలో 6% తగ్గాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 2,91,297 మోటార్ బైక్‌లను విక్రయించగా, ఈ ఏడాది ఇదే నెలలో 2,73,323 మోటార్‌బైక్‌లను అమ్మామని కంపెనీ పేర్కొంది. వాణిజ్య వాహనాలతో సహా మొత్తం అమ్మకాలు 3,32,387 నుంచి 3,13,294కు క్షీణించాయని వివరించింది. ఎగుమతులు మాత్రం 1,35,149 నుంచి 5% వృద్ధితో 1,35,149కు పెరిగాయని పేర్కొంది. అశోక్ లేలాండ్: అశోక్ లేలాండ్ ఫిబ్రవరి అమ్మకాలు 21 శాతం క్షీణించాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 10,046 వాహనాలు విక్రయించగా, ఈ ఏడాది ఇదే నెలలో 7.915 వాహనాలు అమ్మామని కంపెనీ తెలిపింది. భారీ, మధ్య తరహా వాణిజ్య వాహనాల అమ్మకాలు 7,045 నుంచి 21 శాతం క్షీణించి 5,576కు, తేలిక రకం వాణిజ్య వాహనాలు 3,001 నుంచి 2,339కు తగ్గాయని పేర్కొంది. ఇక 2013 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ మొత్తం 79,056 వాహనాలను విక్రయించామని వివరించింది. 2012 ఏప్రిల్ నుంచి 2013 ఫిబ్రవరి అమ్మకాలు(1,00,592)తో పోల్చితే అమ్మకాలు 21 శాతం పడిపోయాయని పేర్కొంది. అలాగే భారీ, మధ్య తరహా వాణిజ్య వాహనాల అమ్మకాలు 70,000 నుంచి 52,624కు, తేలిక రకం వాణిజ్య వాహనాల విక్రయాలు 30,592 నుంచి 26,432కు తగ్గాయని వివరించింది. -
కుబేరుల ఖిల్లా.. భారత్!
-
కుబేరుల ఖిల్లా.. భారత్!
న్యూఢిల్లీ: భారత్‌లో సంపన్నుల సంఖ్య అంతకంతకూ ఎగబాకుతోంది. ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంఖ్య పరంగా భారత్ అయిదోస్థానాన్ని చేజిక్కించుకుంది. దేశంలో మొత్తం 70 మంది బిలియనీర్లు లెక్కతేలారు. చైనాకు చెందిన రీసెర్చ్ సంస్థ హురున్... ప్రపంచ సంపన్నుల జాబితా-2014లో ఈ వివరాలను వెల్లడించింది. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీయే ఈసారి కూడా భారత్‌లో అత్యంత ధనిక వ్యక్తిగా నిలిచినట్లు తెలిపింది. ఆయన వ్యక్తిగత సంపద 18 బిలియన్ డాలర్లు(దాదాపు 1.12 లక్షల కోట్లు)గా అంచనా. కాగా, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఆయన 41వ ర్యాంక్‌లో నిలిచారు. నంబర్ వన్ స్థానం బిల్‌గేట్స్‌కు దక్కింది. ఆయన సంపద 68 బిలియన్ డాలర్లు(సుమారు రూ.4.22 లక్షల కోట్లు). భారత్‌లో జోరు... ప్రపంచ టాప్ బిలియనీర్లలో భారత్ నుంచి చోటు దక్కించుకున్నవారిలో ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ 49 ర్యాంక్‌లో ఉన్నారు. ఆయన వ్యక్తిగత సంపద 17 బిలియన్ డాలర్లు. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు, ఎండీ అయిన దిలీప్ సంఘ్వీ, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీలు సంయుక్తంగా 77వ స్థానంలో నిలిచారు. వీళ్లిద్దరి సంపద చెరో 13.5 బిలియన్ డాలర్లుగా అంచనా. కాగా, టాటా సన్స్‌కు చెందిన పల్లోంజీ మిస్త్రీ(12 బిలియన్ డాలర్లు), హిందూజా గ్రూప్‌నకు చెందిన ఎస్పీ హిందుజా కుటుంబం(12 బిలియన్ డాలర్లు) కూడా 93 ర్యాంక్‌లో ఉన్నారు. గడిచిన ఏడాది వ్యవధిలో డాలరుతో రూపాయి మారకం విలువ 12 శాతం పైగా క్షీణించడంతో బిలియనీర్ల ర్యాంకింగ్స్‌లో భారతీయులు కొంత వెనుకబడటానికి కారణమైందని హురున్ పేర్కొంది. అయినప్పటికీ.. 2013తో పోలిస్తే 17 మంది కుబేరులు పెరిగినట్లు వెల్లడించింది. జర్మనీ, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్, జపాన్ల కంటే భారత్‌లోనే బిలియనీర్లు అధికంగా ఉండటం విశేషం. కాగా, మొత్తం 70 మంది భారతీయ కుబేరుల సంపద విలువ 390 బిలియన్ డాలర్లుగా అంచనా. హురున్ జాబితాలో ఇతర ముఖ్యాంశాలివీ... గేట్స్ తర్వాత బెర్క్‌షైర్ హ్యాత్వే అధిపతి వారెన్ బఫెట్ 64 బిలియన్ డాలర్ల సంపదతో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. స్పెయిన్‌కు చెందిన ఇండిటెక్స్ గ్రూప్ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు అమన్షియో ఒర్టెగా 3వ ర్యాంక్‌లో నిలిచారు. ఆయన సంపద 62 బిలియన్ డాలర్లు. నాలుగో స్థానంలో మెక్సికో టెలికం దిగ్గజం కార్లోస్ స్లిమ్ హెలూ కుటుంబం(60 బిలియన్ డాలర్లు), ఐదో ర్యాంక్‌లో ఒరాకిల్ సీఈఓ లారీ ఎలిసన్(60 బిలియన్ డాలర్లు) నిలిచారు. కుబేరుల సంఖ్య పరంగా 481 మందితో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానంలో చైనా(358 మంది బిలియనీర్లు) నిలిచింది. ప్రపంచ కుబేరుల్లో సగం మంది ఈ రెండు దేశాల్లోనే ఉన్నారు. ముంబైలో 33 మంది బిలియనీర్లు ఉన్నారు. అత్యధిక సంపన్నులున్న ప్రపంచ నగరాల్లో ఆరో స్థానం. న్యూయార్క్ నగరం 84 మంది కుబేరులతో ప్రపంచ బిలియనీర్ల రాజధానిగా నంబర్ వన్ ర్యాం క్‌ను చేజిక్కించుకుంది. గతేడాది ఈ సంఖ్య 70. అమెరికా డాలర్లలో సంపదను లెక్కించారు. ఈ ఏడాది జనవరి 17 నాటి గణాంకాల ఆధారంగా జాబితాను రూపొందించారు. మొత్తం ఈ సూపర్ రిచ్ లిస్ట్‌లో 68 దేశాల నుంచి 1,867 మంది బిలియనీర్లు లెక్కతేలారు. వీళ్ల మొత్తం సంపద కళ్లు చెదిరేరీతిలో 6.9 లక్షల కోట్లు. ఈ ఏడాది లిస్ట్‌లో ప్రతి 9 మందిలో ఒకరు మహిళ కావడం గమనార్హం. 2013లో ప్రతి పది మందిలో ఒక మహిళా బిలియనీర్ ఉన్నారు. -
ఫార్చూన్ ప్రశంసనీయ కంపెనీల్లో...టాటా స్టీల్, ఓఎన్జీసీ
న్యూయార్క్: ప్రపంచ అత్యంత ప్రశంసనీయ కంపెనీల జాబితాలో రెండు భారతీయ కంపెనీలు-టాటా స్టీల్, ఓఎన్‌జీసీలకు చోటు లభించింది. ఫార్చూన్ మ్యాగజైన్ 350 గ్లోబల్ కంపెనీలతో ఈ జాబితాను రూపొందించింది. వరుసగా ఏడో ఏడాది కూడా యాపిల్ కంపెనీయే ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా టాటా స్టీల్, ఓఎన్జీసీలు టాప్ 50లో చోటు సంపాదించలేకపోయాయి. అగ్రశ్రేణి మెటల్ కంపెనీల జాబితాలో నాలుగో స్థానంలో టాటా స్టీల్ నిలిచింది. గత ఏడాది జాబితాలో ఈ కంపెనీ ఆరో స్థానంలో నిలిచింది. గతేడాది మైనింగ్, ముడి చమురు ఉత్పత్తి కేటగిరిలో పదో స్థానంలో నిలిచిన ఓఎన్జీసీ ఈ ఏడాది ఏడో స్థానానికి ఎగబాకింది. అంతర్జాతీయ అగ్రశ్రేణి ప్రశంసనీయ కంపెనీల జాబితాలో రెండో స్థానంలో ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ డాట్‌కామ్ నిలిచింది. ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ 3వ స్థానం, వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్వే నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ (5వ స్థానం), కోకకోలా(6)లు ఉన్నాయి. ఈ జాబితాలో చోటు సాధించిన ఇతర కంపెనీలు, నైక్ (13వ స్థానం), ఐబీఎం(16), మైక్రోసాఫ్ట్(24), వాల్‌మార్ట్(28), జేపీ మోర్గాన్ చేజ్(30), గోల్డ్‌మాన్ శాచ్స్(34), ఫేస్బుక్(38), పెప్సికో(42వ స్థానం). -
స్టీల్ ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: మార్చి నుంచి స్టీల్ ధరలు పెరగనున్నాయ్. ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్)తో పాటు, ప్రయివేట్ రంగ సంస్థ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సైతం ధరల్ని పెంచుతున్నాయి. మార్చి 1 నుంచి స్టీల్ ధరలను టన్నుకి రూ. 1,000 వరకూ పెంచనున్నట్లు వైజాగ్ స్టీల్ వెల్లడించింది. ఇక జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఇప్పటికే టన్ను ధరపై రూ.750 వరకూ వడ్డించనున్నట్లు తెలిపింది. ముడిఇనుము ధరలతోపాటు, రవాణా చార్జీలు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా వైజాగ్ స్టీల్ పేర్కొంది. వెరసి వివిధ రకాల ఉత్పత్తులపై టన్నుకి కనిష్టంగా రూ. 750, గరిష్టంగా రూ. 1,000ను పెంచుతున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ బాటలో ఎస్సార్ స్టీల్ కూడా వచ్చే నెల నుంచి టన్నుకి రూ. 1,000 వరకూ స్టీల్ ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉక్కు తయారీ వ్యయాలు పెరగడానికితోడు డిసెంబర్ క్వార్టర్లో స్టీల్‌కు కొంత డిమాండ్ పుంజుకోవడం కూడా ధరల పెంపుకు కారణమైనట్లు ఆ వర్గాలు వివరించాయి. మూడోసారి ఈ ఏడాది ఇప్పటివరకూ స్టీల్ ధరలు రెండు సార్లు పెరిగాయి. ప్రస్తుత ప్రతిపాదనల నేపథ్యంలో స్టీల్ ధరలు మూడోసారి హెచ్చనున్నాయి. దేశీయ స్టీల్ తయారీ సంస్థలు ఇప్పటికే జనవరి-ఫిబ్రవరిలో టన్నుకి రూ. 2,500-3,000 స్థాయిలో ధరలను పెంచాయి. ఇందుకు ముడిసరుకుల ధరలు, రవాణా వ్యయాలే కారణమైనప్పటికీ ఇటీవల స్టీల్‌కు డిమాండ్ పుంజుకోవడం కూడా దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. విదేశాలకు స్టీల్ ఎగుమతులు వృద్ధి చెందుతుండటంతో దేశీయంగా అధిక సరఫరాకు చెక్ పెట్టేందుకు కంపెనీలకు వీలు చిక్కుతోంది. ఇది మరోవైపు ఉత్పత్తుల ధరలు పెంచేందుకు కూడా దారి చూపుతోంది. అయితే ధరల పెంపును మార్కెట్లు పూర్తిస్థాయిలో గ్రహించే అవకాశాలు తక్కువేనని పరిశ్రమ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతానికి స్టీల్ వినియోగం అంత ప్రోత్సాహకరంగా ఏమీలేదని, ఈ నేపథ్యంలో ధరల పెంపు కొనసాగేదీ లేనిదీ చూడాల్సి ఉన్నదని జయంత్ రాయ్ వ్యాఖ్యానించారు. రేటింగ్ దిగ్గజం ఇక్రాకు చెందిన కార్పొరేట్ రంగ విభాగానికి సీనియర్ వైస్‌ప్రెసిడెంట్‌గా జయంత్ పనిచేస్తున్నారు. ఇదీ ధరల తీరు: నిర్మాణ రంగంలో వినియోగించే టీఎంటీ బార్లు, స్ట్రక్చర్లు వంటి లాంగ్ ప్రొడక్ట్‌ల ధరలు ప్రస్తుతం టన్నుకి రూ. 37,000-39,000 స్థాయిలో ఉన్నాయి. ఇక ఆటోమొబైల్, వినియోగ వస్తు రంగాలు కొనుగోలు చేసే హెచ్ఆర్ క్వాయిల్, సీఆర్ క్వాయిల్ వంటి ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తుల ధరలైతే టన్నుకి రూ. 39,500-43,500 మధ్య పలుకుతున్నాయి. -
ఎయిరిండియాలో మరో భారీ స్కామ్
న్యూఢిల్లీ: అసలే తీవ్ర ఆర్థిక సమస్యలతో నెట్టుకొస్తున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియా.. ఇంటిదొంగల చేతివాటంతో మరింత కుదేలవుతోంది. ఇటీవలే ఎల్టీసీ కుంభకోణంతో కుదుపునకు గురైన సంస్థలో మరో భారీ స్కామ్ బయటపడింది. సిబ్బంది కుటుంబ సభ్యులకు ప్రయాణ ఛార్జీల స్కీమ్(ఎఫ్ఎఫ్ఎస్)కు సంబంధించి... కోట్లాది రూపాయల మోసం జరిగినట్లు విజిలెన్స్ విభాగం దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలు... ఇతర ప్రభుత్వ రంగ, ప్రైవేటు ఏజెన్సీలతో ముడిపడిఉన్నందున సీబీఐ విచారణకు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎఫ్ఎఫ్ఎస్ కింద ఎయిరిండియా ఉద్యోగులు తమ కుటుంబసభ్యులను ఏడాదికోసారి దేశీయంగా ఎక్కడికైనా సంస్థ విమానాల్లో రాయితీ చార్జీల్లో తీసుకెళ్లేందుకు అవకాశం ఉంది. ఈ స్కీమ్‌లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఎయిరిండియా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీబీఓ) బీకే మౌర్య ధ్రువీకరించారు. ఒక అనుమానిత ట్రావెల్ ఏజెన్సీ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ను దుర్వినియోగం చేయడంలో కీలకపాత్ర పోషించినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని.. దీనివల్ల దాదాపు రూ.6 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఇంకా చాలా ట్రావెల్ ఏజెన్సీలకు పాత్ర ఉండొచ్చనే అనుమానిస్తున్నామని.. దీనివల్ల నష్టం కూడా భారీగా ఉండొచ్చన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకే సీబీఐ విచారణ జరపాలని తాము కోరినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు ఎయిరిండియా అధికార ప్రతినిధులెవరూ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. తవ్వినకొద్దీ అక్రమాలు... ఈ స్కామ్‌పై సీబీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ... కంపెనీ విజిలెన్స్ బృందం అంతర్గత దర్యాప్తులో 2007 నుంచి రికార్డులను పరిశీలించినట్లు వెల్లడించారు. ఒక్క సెక్టార్లోనే ఈ స్కీమ్ కింద 5,916 టిక్కెట్లలో అవకతవకలు బయటపడినట్లు తెలిపారు. ఆడిట్ కూపన్లో పేర్కొన్న ప్రయాణ చార్జీ కంటే... ప్రయాణించిన టిక్కెట్(ఫ్లైట్) కూపన్లలో చార్జీ మొత్తాన్ని అధికంగా చూపించడం ద్వారా ఒక ట్రావెల్ ఆపరేటర్ మోసానికి పాల్పడినట్లు తేలింది. విజిలెన్స్ దర్యాప్తు నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారని సీబీఐ అధికారి చెప్పారు. ఈ చార్జీల మధ్య వ్యత్యాసాన్ని సొమ్ముచేసుకున్నారని వెల్లడించారు. నిబంధనలకు తూట్లు... అంతేకాకుండా స్కీమ్‌ను దుర్వినియోగం చేయకుండా.. టిక్కెట్లలో కుటుంబ సభ్యులందరూ కలిసే ప్రయణిస్తున్నట్లు తప్పనిసరిగా ముద్రించాల్సి ఉంటుంది. అయితే, చాలా టిక్కెట్లలో ఈ నిబంధనలను తుంగలోతొక్కినట్లు విజిలెన్స్ నివేదిక తేల్చింది. ఈ స్కామ్‌లో మోసగాళ్లతో తమ సొంత సిబ్బంది కూడా చేతులుకలిపి ఉండొచ్చని ఎయిరిండియా అనుమానిస్తున్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. చెన్నై-పోర్ట్‌బ్లెయిర్, కోల్‌కతా-పోర్ట్‌బ్లెయిర్ సెక్టార్లో టిక్కెట్లపై విజిలెన్స్ విచారణ జరిపినట్లు తెలుస్తోంది. గతంలో సిబ్బంది లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) స్కీమ్‌లో కుంభకోణాన్ని కూడా విజిలెన్స్ విభాగమే బయటపెట్టింది. దీనిపైన కూడా ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది. -
మొండిబకాయిల పాపం ఇన్ఫీ సాఫ్ట్‌వేర్‌దే: యునెటైడ్ బ్యాంక్
న్యూఢిల్లీ: నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) మొత్తం భారీగా పెరిగినట్లుగా కనిపించడానికి లోపభూయిష్టమైన ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేరే కారణమని యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఆరోపించింది. కొన్ని విభాగాల్లో ఆస్తులను వర్గీకరించడంలో ఈ సాఫ్ట్వేర్ విఫలమవుతోందని పేర్కొంది. కోర్ బ్యాంకింగ్ సేవల కోసం తమతో పాటు పలు బ్యాంకులు ఇన్ఫోసిస్ రూపొందించిన ఫినాకిల్ సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తున్నాయని స్టాక్ ఎక్స్చేంజీ బీఎస్ఈకి యూబీఐ తెలిపింది. అయితే, పునర్వ్యవస్థీకరించిన ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్లు తదితర విభాగాల వివరాలను వర్గీకరించడంలో ఈ సాఫ్ట్వేర్ పొరపాట్లు చేస్తోందని వివరించింది. ఇలాంటి పొరపాట్ల వల్లే భేషుగ్గా ఉన్న ఖాతాలను ఎన్పీఏలుగాను, ఎన్పీఏలను మంచి ఖాతాలుగానూ చూపించిందని యూబీఐ తెలిపింది. వివిధ త్రైమాసికాల్లో ఎన్పీఏలు భారీగా ఎగియడంపై సందేహాలు వ్యక్తం చేసిన ఆర్బీఐ.. యునెటైడ్ బ్యాంక్ ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్‌కి ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు, తమ సాఫ్ట్‌వేర్‌లో ఎటువంటి లోపాలు లేవని, ఆర్బీఐ నిర్దేశాలకు అనుగుణంగానే అది పనిచేస్తుందని ఇన్ఫోసిస్ వర్గాలు స్పష్టం చేశాయి. -
విలువైన బ్రాండ్ టాటా
లండన్: భారత దేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ అవతరించింది. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన ఈ గ్లోబల్ టాప్ 500 బ్రాండ్ జాబితాలో 2,110 కోట్ల డాలర్ల విలువతో టాటా గ్రూప్ తన అగ్రస్థానాన్ని(భారత్ వరకూ) ఈ ఏడాది కూడా నిలుపుకుంది. గత ఏడాది 39వ స్థానంలో ఉన్న టాటా బ్రాండ్ ఈ ఏడాది 34వ స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో భారత కంపెనీలు గత ఏడాది ఆరు ఉండగా, ఈ ఏడాది ఈ సంఖ్య 5కు పడిపోయింది. ఒక్క టాటా మినహా మిగిలిన నాలుగు సంస్థల ర్యాంక్‌లు ఈ ఏడాది తగ్గాయి. అంతర్జాతీయ జాబితాలోని ఇతర భారత కంపెనీలు ఎస్బీఐ (347వ స్థానం), ఎయిర్టెల్(381), రిలయన్స్ ఇండస్ట్రీస్(413), ఇండియన్ ఆయిల్(474), ఈ జాబితాలో ఈ ఏడాది చోటు దక్కించుకోలేని కంపెనీగా ఐటీసీ నిలిచింది. మూడోసారీ యాపిలే ఇక ఈ జాబితాలో 10,500 కోట్ల డాలర్లతో యాపిల్ బ్రాండ్ మొదటి స్థానాన్ని చేజిక్కించుకుంది. అగ్రస్థానంలో యాపిల్ నిలవడం ఇది వరుసగా మూడో ఏడాది. 7,900 కోట్ల డాలర్లతో శామ్సంగ్ రెండో స్థానం సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, వెరిజాన్, జీఈ, ఏటీఅండ్‌టీ, అమెజాన్, వాల్‌మార్ట్, ఐబీఎంలు నిలిచాయి. ఇక అత్యంత శక్తివంతమైన అంతర్జాతీయ బ్రాండ్‌గా ఫెరారి నిలిచింది. ఈ గ్లోబల్ జాబితాలో అమెరికా బ్రాండ్లు ఎక్కువగా(185) ఉన్నాయి. -
మహీంద్రా రేవా ఈ2ఓ కారు ధర కట్
న్యూఢిల్లీ: మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ తన ఎలక్ట్రిక్ కారు ఈ2ఓ ధర రూ.1.7 లక్షల వరకూ తగ్గే ఒక కొత్త స్కీమ్‌ను మంగళవారం ప్రకటించింది. గుడ్‌బై ఫ్యూయల్, హెలో ఎలక్ట్రిక్ పేరుతో వినూత్నమైన ఈ బ్యాటరీ రెంటల్ స్కీమ్‌ను అందిస్తున్నామని మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ సీఈవో చేతన్ మైణి చెప్పారు. చార్జింగ్ బ్యాటరీని కొనుగోలు చేయకుండా నెలకు రూ.2,599 చొప్పున ఐదేళ్లు చెల్లించే ఈ బ్యాటరీ రెంటల్ స్కీమ్ కారణంగా రూ. 6.69 లక్షల ధర ఉండే ఈ2ఓ కారును ఇప్పుడు రూ. 4.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చని వివరించారు. ఈ లిథియమ్ అయాన్ బ్యాటరీ నెలకు 800 కిమీ. చొప్పున(సగటున)ఐదేళ్లకు 50 వేల కిమీ. దూరం ప్రయాణిస్తుందని వివరించారు. బ్యాటరీ రెంటల్‌తో పాటు ఎలక్ట్రిసిటీ కంజప్షన్ చార్జీని కూడా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందని, అయితే ఇది చాలా స్వల్పంగానే ఉండగలదని ఆయన వివరించారు. 24 గంటలూ రిపేర్ సేవలు అందుబాటులో ఉంటాయని, బ్యాటరీ రిపేర్ కాలంలో మరో కారును సమకూరుస్తామని పేర్కొన్నారు. కొత్త స్మార్ట్ పోర్ట్ టెక్నాలజీతో క్విక్2చార్జ్ డీసీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ఈ కంపెనీ ప్రారంభించింది. దీంతో ఈ2ఓ కారును ఒక్క గంటలోనే పూర్తిగా చార్జ్ చేయవచ్చు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టోల్-ఫ్రీ సేవలు
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీసులో ఆరు ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలను ఖాతాదారులు నిర్వహించుకోవచ్చని బ్యాంక్ హెడ్(డిజిటల్ బ్యాంకింగ్) నితిన్ చుగ్ చెప్పారు. మినీ స్టేట్మెంట్, బ్యా లెన్స్ ఎంక్వైరీ సమాచారాన్ని ఎస్ఎం ఎస్‌ల ద్వారా ఖాతాదారులకు అందిస్తామని చెప్పారు. మొబైల్ బ్యాంకింగ్ యాప్ డౌన్లోడ్, చెక్‌బుక్ రిక్వెస్ట్, అకౌంట్ స్టేట్మెంట్, ఈ మెయిల్ స్టేట్మెంట్ వంటి మరో 4 సర్వీసులను పొందవచ్చన్నారు. ఈ సర్వీస్ ఉచితమని, ఎలాంటి చార్జీలు లేవని చెప్పారు. బేసిక్ మొబైల్ హ్యాండ్సెట్ ద్వారానైనా ఈ సర్వీసును రాత్రీ, పగలు ఎప్పుడైనా పొందవచ్చని పేర్కొన్నారు. ఎస్ఎంఎస్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా లేదా సమీపంలోని బ్యాంక్ బ్రాం చీలో నమోదు చేసుకోవడం ద్వారా కానీ ఈ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీస్‌ను పొందవచ్చని తెలిపారు. -
సెకండ్ హ్యాండ్..పుల్ డిమాండ్!
దేశంలోనే నంబర్ వన్ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ ఒకప్పటి చీఫ్ జగదీశ్ ఖట్టర్ ఇప్పుడేకారు నడుపుతుంటారో? ఏ టాప్ఎండ్ ఎస్యూవీనో లేదంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీకారో అనుకుంటున్నారా... అబ్బే ఆయన షి‘కారు’ చేసేది కేవలం సెకండ్హ్యాండ్లలో! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. అంతేకాదు, ఇప్పుడు ఆయన వ్యాపారం కూడా ఇదే. వాడినకార్లను కొనడం.. అమ్మడం... సర్వీసింగ్. ఇందుకోసం ఆయన అయిదేళ్ల క్రితం ప్రారంభించిన కార్నేషన్ ఆటో అనే సంస్థ ఈ సెకండ్‌హ్యాండ్ కార్ల మార్కెట్లో తనదైనముద్రతో దూసుకెళ్తోంది. దీనంతటికీ దేశంలో ఈ మార్కెట్ పుంజుకుంటుండటమే కారణం. ఒకపక్క, ఆటోమొబైల్ మార్కెట్లో మందగమనం నెలకొన్నప్పటికీ ఈ యూజ్డ్ కార్ల వ్యాపారం మాత్రం టాప్‌గేర్‌లో దూసుకెళ్తుండటం విశేషం. ‘ధనిక కస్టమర్లు కొత్తకార్లు కొంటారు.. తెలివైనవాళ్లు సెకండ్‌హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తారు’ ఇదీ ఖట్టర్ ఫిలాసఫీ! పెద్ద కంపెనీల ప్రవేశంతో.. ఒపప్పుడు చిన్నాచితకా సంస్థలు, డీలర్లకే పరిమితమైన ఈ సెకండ్‌హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి దిగ్గజాలు ప్రవేశించడంతో వ్యవస్థీకృత రూపుదాల్చుతోంది. మారుతీ సుజుకీ ‘ట్రూ వేల్యూ’ పేరుతో, మహీంద్రా అండ్ మహీంద్రా.. ‘ఫస్ట్ చాయిస్’, జగదీశ్ ఖట్టర్ నెలకొల్పిన కార్నేషన్ ఆటో వంటివి ఈ రంగంలో వేళ్లూనుకుంటున్నాయి. ప్రస్తుతం మల్టీబ్రాండ్ యూజ్డ్ కార్ల మార్కెట్లో ఈ సంస్థాగత కంపెనీల వాటా దాదాపు 15%. బడా కంపెనీలు ప్రవేశించినా.. ఇప్పటికీ చిన్న చిన్న డీలర్ల(ఆన్ఆర్గనైజ్డ్)దే ఈ మార్కెట్లో మెజారిటీ వాటా. అయితే, పెద్ద కంపెనీల ప్రవేశంతో తమ మార్జిన్లు, అమ్మకాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయనేది చిన్న డీలర్ల వాదన. బడా సంస్థలు వారంటీ ఇతర త్రా ఆఫర్ చేస్తుండటమే దీనికి కారణంగా చెబుతున్నారు. విస్తరణ జోరు... ఆటోమొబైల్ పరిశ్రమకు గడ్డుకాలం కొనసాగుతున్నప్పటికీ సెకండ్‌హ్యాండ్ కార్ల కంపెనీలు విస్తరణతో దూసుకెళ్తున్నాయి. దీనికి పటిష్ట డిమాం డే కారణం. గతేడాది ఏప్రిల్ నుం చి ఇప్పటిదాకా మహీంద్రా ఫస్ట్ చాయిస్ 100 కొత్త డీలర్షిప్ సోర్లను దేశ్యాప్తంగా తెరిచింది. ఈ వ్యవధిలో తాము 60 వేల సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించామని.. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 40% అధిమని మహీంద్రా ఫస్ట్ చాయిస్ సీఈఓ నాగేంద్ర పల్లె పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకూ విస్తరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక మారుతీ ట్రూ వేల్యూ కూడా విస్తరణతో ఉరకలేస్తోంది. గతేడాది డిసెంబర్ నాటికి కంపెనీ అవుట్లెట్ల సంఖ్య మొత్తం 309 నగరాల్లో 507కు చేరింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌కు 245 నగరాల్లో 429 అవుట్లెట్లు ఉన్నాయి. ఇక ఖట్టర్‌కు చెందిన కార్‌నేషన్‌కు ప్రస్తుతం 40 డీలర్షిప్ అవుట్లెట్లు ఉండగా.. మరో మూడేళ్లలో 150-200కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘సెకండ్‌హ్యాండ్’ పదానికి బదులు ఇప్పుడు ‘యూజ్డ్’ కార్లు లేదా ‘ప్రీఓన్డ్’ కార్లు అనేవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. మార్కెట్ ఎంత? అధికారికంగా గణాంకాలు అందుబాటులో లేనప్పటికీ.. దేశంలో వార్షికంగా 30 లక్షల యూజ్డ్ కార్లు అమ్ముడవుతున్నట్లు అంచనా. 2013లో దేశీయంగా 18.07 లక్షల కొత్త కార్లు అమ్ముడైనట్లు సియామ్ అంచనా(2012లో దాదాపు 20 లక్షల కార్లతో పోలిస్తే 9.5 శాతం తగ్గాయి). క్రిసిల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2016-17 నాటికి వార్షికంగా యూజ్డ్కార్ల అమ్మకాల సంఖ్య దాదాపు మూడింతలకు.. అంటే 80 లక్షల స్థాయికి చేరొచ్చని అంచనా. మొత్తం మార్కెట్ విలువ రూ.1.5 లక్షల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. కాగా, అమెరికాలోలో గతేడాది దాదాపు 4 కోట్ల యూజ్డ్ కార్లు అమ్ముడవగా.. చైనాలో ఈ సంఖ్య 48 లక్షలు కావడం గమనార్హం. డిమాండ్‌కు కారణమేంటి? పేరున్న కార్ల బ్రాండ్లు ఈ మార్కెట్లోకి అడుగుపెట్టడంతో కస్టమర్లలో నమ్మకం పెరిగేందుకు దోహ దం చేస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు, సెకండ్‌హ్యాండ్ వాహనాలను నడిపేందుకు ఇష్టపడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండటం కూడా యూజ్డ్ కార్లకు డిమాండ్‌ను సృష్టిస్తోంది. ఈ విధమైన ధోరణికి మనోళ్లు బాగానే అలవాటుపడుతుండటం మరో కీలకమైన అంశం. యూజ్డ్ కారుతో కొన్నాళ్లు నడిపించి.. ఆ తర్వాత కొత్తకారు సొంతంచేసుకోవాలనుకునే ట్రెండ్ ఇటీవల ఊపందుకుంటోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. విదేశీ లగ్జరీకార్ల నుంచి దేశీ కంపెనీల ప్రఖ్యాత కార్ల మోడళ్లు ఇలా అన్నీ అందుబాటు ధరల్లో ఊరిస్తుండటం కూడా కొందరు కస్టమర్లను యూజ్డ్ కార్లవైపు నడిపిస్తోందని చెబుతున్నారు. పదేపదే కార్లను మార్చే కస్టమర్లు దేశంలో పెరుగుతుండడం, రుణాల లభ్యత వంటివి సెకండ్‌హ్యాండ్ కార్ల మార్కెట్‌కు వరంగా మారుతున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. మరోపక్క, రోజుకో కొత్త మోడల్ కారు మార్కెట్లోకి విడుదలవుతుండడం కూడా ఈ మార్కెట్ పురోగతికి దోహదం చేస్తోంది. -
టాప్‌గేర్‌లో టాటామోటార్స్
ముంబై: దేశీ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 3 రెట్లు ఎగసి రూ.4,805 కోట్లను తాకింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో రూ.1,628 కోట్లు మాత్రమే ఆర్జించింది. బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) అమ్మకాలు పురోగమించడం ఇందుకు దోహదపడినట్లు కంపెనీ సీఎఫ్‌వో సి.రామకృష్ణన్ చెప్పారు. దీనికితోడు పెట్టుబడుల విక్రయం ద్వారా రూ.1,250 కోట్ల ఇతర ఆదాయాన్ని కంపెనీ అందుకోగా, రూ.630 కోట్లమేర ట్యాక్స్ క్రెడిట్‌ను పొందింది. ఇక ఈ కాలంలో అమ్మకాలు సైతం 39% ఎగసి రూ.63,536 కోట్లను తాకాయి. అంతక్రితం ఇదే కాలంలో అమ్మకాలు రూ.45,821 కోట్లుగా ఉన్నాయి. బ్రిటిష్ సంస్థ సహ కారం డిసెంబర్ క్వార్టర్‌కు జేఎల్ఆర్ నికర లాభం 29.6 కోట్ల పౌండ్ల నుంచి 61.9 కోట్ల పౌండ్లకు ఎగసింది. నష్టాలతో కుదేలైన జేఎల్ఆర్ను టాటా మోటార్స్ 2008లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై వరుసగా ఎనిమిదో క్వార్టర్లో సైతం కంపెనీ మంచి పనితీరును చూపడం విశేషం! ఇక ప్రస్తుత సమీక్షా కాలంలో ఆదాయం కూడా 40% పుంజుకుని 532.8 కోట్ల పౌండ్లను చేరింది. గతంలో 380.4 కోట్ల పౌండ్ల ఆదాయం నమోదైంది. వాహన అమ్మకాలు 23% వృద్ధితో 1,16,357 యూనిట్లను తాకాయి. ఇందుకు రేంజ్ రోవర్ స్పోర్ట్, జాగ్వార్ ఎఫ్‌టైప్, ఎక్స్ఎఫ్, ఎక్స్‌జే వంటి కొత్త మోడళ్లు సహకరించినట్లు కంపెనీ పేర్కొంది. కాగా, స్టాండ్అలోన్ ప్రాతిపదికన డిసెంబర్ క్వార్టర్లో రూ.1,251 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ఆర్జించింది. ఆదాయం మాత్రం రూ. 10,630 కోట్ల నుంచి రూ. 7,770 కోట్లకు క్షీణించింది. గతేడాది ఇదే కాలంలో రూ. 458.5 కోట్ల నికర నష్టం నమోదైంది. వాహన విక్రయాలు కూడా 36% వరకూ తగ్గి 1,32,087 యూనిట్లకు పరిమితమయ్యాయి. బీఎస్ఈలో షేరు ధర 1% లాభంతో రూ. 364 వద్ద ముగిసింది. -
ఈసారి రికార్డే
నాగపూర్: ఈ ఏడాది 263.2 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని భారత్ సాధిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది రెండేళ్ల క్రితం చేరుకున్న 259 మిలియన్ టన్నుల కంటే అధికమని అన్నారు. నగరంలో కృషి వసంత్-2014 జాతీయ వ్యవసాయ ప్రదర్శనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం చేరుకున్న 259 మిలియన్ టన్నుల కంటే ఈసారి నాలుగు మిలియన్ టన్నులు అధికంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంటుందన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు వల్ల గతేడాది 255.36 మిలియన్ టన్నులకు మాత్రమే ఆహార ధాన్య ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ఈసారి ఆశించినమేర కన్నా అధికంగ వర్షాలు కురవడంతో పాటు ఖరీఫ్, రబీ పంట సేద్యం పెరిగిందని పవార్ అన్నారు. దీనివల్ల ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే బియ్యం ఎగుమతుల్లో భారత్ తొలిస్థానంలో ఉంద ని, గోధుమ, పత్తిలో రెండో స్థానంలో ఉందని ఆయన వివరించారు. పాలు, ఉద్యానవన పంటల ఉత్పత్తిలోనూ భారత్ అగ్రస్థానంలో ఉందని తెలి పారు. 92 మంది విజయవంతమైన రైతులు ప్రదర్శనను మెచ్చిన పవార్, వీరితో మిగతా రైతు లు కూడా పంటల ఉత్పత్తిలో పోటీపడాలని పిలుపునిచ్చారు. కాగా, కేంద్ర గణాంకాల కార్యాలయం(సీఎస్‌వో) ఇటీవల విడుదల చేసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర ముందస్తు అంచనాల ప్క్రారం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో 4.6 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది. ఐదు రోజుల పాటు ప్రదర్శన పారిశ్రామిక విభాగం సీఐఐ సహకారంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కృషి వసంత్ జాతీయ వ్యవసాయ ప్రదర్శనను ఆదివారం నుంచి ఐదు రోజులు పాటు నిర్వహిస్తోంది. గత వందేళ్లలో ఐసీఏఆర్ సాధించిన విజయాలతో పాటు వ్యవసాయ పరిశోధన చరిత్ర ను కూడా ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శనకు సుమారు ఐదు లక్షల మంది రైతులు సందర్శించే అవకాశముందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అగ్రి వెబ్ ద్వారా ప్రసారం చేస్తోందని తెలిపారు. శిక్షణకు రాని రైతు లు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
టెక్నాలజీ ‘ఎవరెస్ట్’ పై... తెలుగోడు
బిల్ గేట్స్... స్టీవ్ బామర్... తరవాతి పేరు మన వాడిదే. తెలుగువాడు సత్య నాదెళ్లదే. 39 ఏళ్ల చరిత్ర ఉన్న మైక్రోసాఫ్ట్‌కు మూడో సీఈఓగా హైదరాబాదీ సత్య నాదెళ్ల ఎంపికయ్యాడు. మణిపాల్, విస్కాన్సిన్ మీదుగా హైదరాబాద్ నుంచి రెడ్మండ్ చేరిన ఈ సత్య... తన కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండటంతో అలాంటి పిల్లల కోసం హైదరాబాద్‌లో ఏకంగా స్కూలే పెట్టారు. ప్రతి భారతీయుడికీ ఆయన ప్రస్థానం స్ఫూర్తినిచ్చేదే. న్యూయార్క్: నిన్న మొన్నటిదాకా ఊహగానాలకి పరిమితమైనది మొత్తానికి వాస్తవరూపం దాల్చింది. మరో అమెరికన్ దిగ్గజానికి మన ఇండియన్ సారథ్యం వహించనున్నారు. 78 బిలియన్ డాలర్ల టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కి సీఈవోగా మన తెలుగువాడు సత్య నాదెళ్ల నియమితులయ్యారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో.. సత్యను సీఈవోగా నియమిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. బిల్‌గేట్స్ నెలకొల్పిన మైక్రోసాఫ్ట్ 39 ఏళ్ల చరిత్రలో మన సత్య నాదెళ్ల (47) ముచ్చటగా మూడో సీఈవో. తనతో పోటీపడిన గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుందర్ పిచ్చయ్యను తోసిరాజని సత్య దీన్ని దక్కించుకున్నారు. క్రికెట్ అంటే ఇష్టపడే సత్య.. 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. ప్రస్తుత సీఈవో స్టీవ్ బామర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇండిపెండెంట్ డెరైక్టర్ జాన్ థాంప్సన్ తాజాగా చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ బిల్ గేట్స్ ఇకపై టెక్నాలజీ అడ్వైజర్‌గా వ్యవహరిస్తారు. కంపెనీ ఉత్పత్తులు, టెక్నాలజీల రూపకల్పనకు దిశానిర్దేశం చేయడంపై దృష్టి పెడతారు. ఒకవైపు విండోస్, ఆఫీస్ వ్యాపార విభాగాలు క్షీణిస్తుండటం మరోవైపు.. డివైజ్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొంగొత్త రంగాల్లోకి మైక్రోసాఫ్ట్ విస్తరిస్తున్న తరుణంలో సత్య సీఈవోగా బాధ్యతలు చేపడుతుండటం గమనార్హం. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 31,400 కోట్ల డాలర్లు. మైక్రోసాఫ్ట్‌కి తగిన సారథి.. కంపెనీ కొత్త మార్పులకు లోనవుతున్న తరుణంలో .. సంస్థను ముందుంచి నడిపేందుకు సత్యను మించి మరొకరు లేరంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. అత్యుత్తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, అందర్నీ ఏకతాటిపైకి తేగలిగే సత్తా గల నాయకుడిగా సత్య తన సామర్థ్యాన్ని నిరంతరం నిరూపించుకుంటూనే ఉన్నారంటూ గేట్స్ ప్రశంసించారు. మరోవైపు, మైక్రోసాఫ్ట్‌కి సరైన సారథి సత్య అని స్టీవ్ బామర్ పేర్కొన్నారు. ఆయనతో 20 ఏళ్లకుపైగా కలసి పనిచేశానని, మైక్రోసాఫ్ట్‌కి సరైన సమయంలో సరైన నాయకుడు లభించారన్నారు. అసాధ్యాలను సాధ్యం చేయగలం.. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజున ఉద్యోగులకు రాసిన ఈమెయిల్లో సత్య.. ‘అసాధ్యాలను సాధ్యం చేయగలమని నమ్మాలి.. అసంభవమన్న భ్రమలను తొలగించగలగాలి’ అంటూ ప్రసిద్ధ రచయిత ఆస్కార్ వైల్డ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. సాఫ్ట్వేర్ శక్తిని పూర్తి స్థాయిలో వెలికి తీసుకురాగలగడంతో పాటు డివైజ్‌ల ద్వారా, సర్వీసుల ద్వారా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థా సాధికారత సాధించగలిగేలా చూడగలగడం తమ వల్లే సాధ్యపడుతుందని సత్య పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ ముందు అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు మరింత వేగంగా స్పందించడంతో పాటు మరిం తగా కష్టపడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సత్య వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో ప్రపంచాన్నే మార్చేసిన అరుదైన కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్‌కి సీఈవో బాధ్యతలు చేపట్టడం తనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో సంప్రదాయానికన్నా.. నవకల్పనలకే పెద్దపీట దక్కుతుందని సత్య చెప్పారు. సత్య... మిస్టర్ నైస్ గై పూర్తి పేరు: నాదెళ్ల సత్యనారాయణ చౌదరి స్వస్థలం: అనంతపురం జిల్లా, యల్లనూరు మండలం, బుక్కాపురం పుట్టిన సంవత్సరం: 1967, హైదరాబాద్‌లో వయసు: 47 కుటుంబం: భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. తండ్రి బీఎన్ యుగంధర్ నాయుడు మాజీ ఐఏఎస్ అధికారి. నివాసం: వాషింగ్టన్లో. చదువు: బేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌తో మొదలు డిగ్రీలు: మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అమెరికా మిల్వాకీలోని విస్కాన్సిన్ వర్సిటీ నుంచి ఎంఎస్. షికాగో యూనివర్సిటీ నుంచి ఎంబీఏ. ఉద్యోగ ప్రస్థానం: తొలుత సన్మైక్రోసిస్టమ్స్లో చేరారు. తరవాత 1992 నుంచీ మైక్రోసాఫ్ట్‌లో. {పస్తుత స్థానం: క్లౌడ్ కంప్యూటింగ్ హెడ్ వేతనం: 76 లక్షల డాలర్లు (2012-13) కలిసొచ్చినవివే... స్టీవ్ బామర్ కన్నా సత్యకు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ. విస్తృతమైన ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్. 1992లో మైక్రోసాఫ్ట్ సంస్థలో చేరాక... క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ప్రైజ్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేశారు. ఈయనను ‘క్లౌడ్ గురు’గా పిలుస్తారు మైక్రోసాఫ్ట్‌కు చెందిన 2000 కోట్ల డాలర్ల సర్వర్ అండ్ టూల్స్ బిజినెస్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. దీనికి ముందు ఆన్లైన్ సర్వీసెస్ డివిజన్‌కు చెందిన ఆర్ అండ్ డీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, మైక్రో సాఫ్ట్ బిజినెస్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా సేవలందించారు. ఆఫీస్ 365 ప్రోగ్రామ్ విజయం వెనక ఆయన కృషి ఎంతో ఉంది. ‘క్లౌడ్ ఓఎస్’ ఘనత సత్యదే.. మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన ఘనత సత్య నాదెళ్లదే. మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్నెట్ స్కేల్ క్లౌడ్ సేవలను దీనిమీదే నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ కంపెనీల అధునాతన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ల నిర్వహణకూ ఇదే కీలకం అయింది. అంతేగాక మైక్రోసాఫ్ట్‌లో 20 బిలియన్ డాలర్ల వ్యాపారమైన సర్వర్ అండ్ టూల్స్ విభాగానికి అధిపతిగా ఆయన దాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. ఆన్లైన్ సర్వీసెస్ డివిజన్, బిజినెస్ డివిజన్లలో ఆయన గతంలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 38 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌ను నెలకొల్పిన బిల్‌గేట్స్, స్టీవ్ బామర్‌లే ఇంతవరకూ సీఈవోలుగా పనిచేశారు. ఇప్పుడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు మూడో సీఈవో. క్రికెట్ ఎన్నో నేర్పింది... కవితలన్నా, క్రికెటన్నా సత్య నాదెళ్లకు చాలా ఇష్టం. క్రికెట్ వల్లే టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలు అలవడ్డాయని సీఈవోగా తన నియామకం ఖరారైన అనంతరం ఆయన చెప్పారు. అత్యంత సుదీర్ఘంగా సాగే టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టమని, ఆసక్తికరమైన మలుపులు తిరిగే మ్యాచ్‌ను చూస్తుంటే.. రష్యన్ నవల చదువుతున్నట్లుగా ఉంటుందని చెప్పారాయన. కవితలైతే రహస్య సంకేతాల్లా అనిపిస్తాయన్నారు. ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన సాధనాలను మైక్రోసాఫ్ట్ అందిస్తోందని, అది చూశాకే ఆ కంపెనీలో చేరానని చెప్పారాయన. ‘నేను నిర్మించడాన్ని, నిరంతరం నేర్చుకోవడాన్ని ఇష్టపడతా. ఇప్పటికీ తరచు బోలెడన్ని ఆన్లైన్ కోర్సులు చేస్తుంటా. అప్పట్లో మాస్టర్స్ డిగ్రీ చదివేటప్పుడు ప్రతి శుక్రవారం రాత్రి షికాగోకి వెళ్లేవాణ్ణి. శనివారాలు క్లాసులకు హాజరయ్యి.. మళ్లీ సోమవారానికల్లా రెడ్మండ్ (మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉన్న చోటు)కి వచ్చేసేవాణ్ని. దాదాపు రెండున్నరేళ్లు పట్టింది కానీ... మొత్తానికి మాస్టర్స్ డిగ్రీ అలా పూర్తి చేసేశా. కొత్తవి నేర్చుకోవటం ఆపేస్తే మనం ఉపయోగకరమైన పనులు చేయడం మానేసినట్లేనన్నది నా ఉద్దేశం’’ సన్నిహితుల సంతోషం... హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ బాస్‌గా సత్య నాదెళ్ల నియామకం గురించి తెలియటంతో ఆయన కుటుంబం, బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు తెలిపేందుకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆయన తల్లిదండ్రులుంటున్న నివాసానికి సన్నిహితులు, విలేకరులు వెల్లువెత్తారు. అయితే, సత్య తండ్రి , మాజీ ఐఏఎస్ అధికారి బి.ఎస్.యుగంధర్ మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఆయన స్పందన కోసం మొబైల్ ఫోన్‌కు మెసేజ్‌లు పంపినా స్పందించలేదు. మరోవైపు, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌పీఎస్ సొసైటీ కార్యదర్శి ఫయాజ్ ఖాన్ వెల్లడించారు. హెచ్‌పీఎస్‌లో చదివిన సత్యకి.. ఫయాజ్ సహాధ్యాయి. తగిన సమయం చూసుకుని సత్యను స్కూలుకు ఆహ్వానిస్తామని ఖాన్ చెప్పారు. సత్య సారథ్యంలో మైక్రోసాఫ్ట్ కొత్త శిఖరాలను అధిరోహించగలదని మరో సహాధ్యాయి, నగరానికి చెందిన టెక్నాలజీ సంస్థ మాజీ సీఈవో అయిన ఎం.చంద్రశేఖర్ ఆకాంక్షించారు. ప్రపంచంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక భారతీయుడు సీఈవో కావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఇంజనీరింగ్ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ సీఎండీ బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు. సత్య నియామకంపై హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థి, అపోలో హాస్పిటల్స్ సీఈవో హరి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. -
టెలికంకు ‘టాటా’..!
ముంబై: విదేశాల్లో భారీ టేకోవర్లతో దూసుకెళ్లిన టాటా గ్రూప్... స్వదేశంలో మాత్రం కీలకమైన టెలికం రంగం నుంచి వైదొలగనుందా? మార్కెట్ వర్గాలు, మీడియాలో ఇప్పుడు ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాటా గ్రూప్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తిచేసుకున్న సైరస్ మిస్త్రీ... గ్రూప్‌లో భారీ వ్యూహాత్మక మార్పులకు తెరతీస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా టెలికం వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాటా టెలీసర్వీసెస్, టాటా కమ్యూనికేషన్స్ పేరుతో టాటా గ్రూప్ మెజారిటీ వాటాదారుగా టెలికం సేవలను అందిస్తోంది. అయితే, ఈ రెండు కంపెనీల్లో తమకున్న వాటాను బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్‌కు విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయని ఒక బిజినెస్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ డీల్‌కు సంబంధించిన సంప్రతింపులు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయని కూడా వెల్లడించింది. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్‌దాకా అనేక ఉత్పత్తులు, సేవలకు సంబంధించి 100కు పైగా కంపెనీలు టాటా గ్రూప్‌లో ఉన్నాయి. డీల్ సంక్టిష్టమే... టాటా గ్రూప్ టెలికం వ్యాపారాన్ని వొడాఫోన్‌కు విక్రయించడం అంత సులువేమీ కాదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే టాటా టెలీ, టాటా కమ్యూనికేషన్స్ రెండింటిలోనూ బోర్డు నిర్ణయాలను శాసించేస్థాయిలో అనేక మంది వాటాదార్లు ఉన్నారు. దీంతో డీల్ పూర్తవ్వాలంటే అనేక అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. టాటా టెలీలో జపాన్ కంపెనీ ఎన్టీటీ డొకోమోకు 26% వాటా ఉంది. 2008లో సుమారు 2.1 బిలియన్ డాలర్లకు ఈ వాటాను కొనుగోలు చేసింది. మరోపక్క, అంతర్జాతీయస్థాయిలో మొబైల్ డేటా సేవలందిస్తున్న టాటా కమ్యూనికేషన్స్‌లో కేంద్ర ప్రభుత్వానికి 26% వాటా ఉండటం గమనార్హం. ప్రభుత్వం రంగంలోని వీఎస్‌ఎన్‌ఎల్‌ను డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా టాటా గ్రూప్ చేజిక్కించుకుని టాటా కమ్యూనికేషన్స్‌గా పేరు మార్చడం తెలిసిందే. కాగా, ముందుగాా ఈ 26 శాతం ప్రభుత్వ వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేసి... ఆతర్వాత మొత్తం కంపెనీ(మెజారిటీ వాటా)ని వొడాఫోన్‌కు విక్రయించే విధంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రభుత్వం, టాటా గ్రూప్ మధ్య సంప్రతింపులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా... టాటా కమ్యూనికేషన్స్‌కు ఆఫ్రికాలో ఉన్న టెలికం సంస్థ నియోటెల్‌లో మెజారిటీ వాటాను వొడాఫోన్‌కు చెందిన వొడాకామ్‌కు విక్రయించే ప్రయత్నాల్లో ఉందని వార్తలొస్తున్నాయి. కాగా, ఇవన్నీ ఊహాగానాలంటూ టాటా సన్స్ ప్రతినిధి కొట్టిపారేశారు. వొడాఫోన్ ప్రతినిధి కూడా ‘నో కామెంట్’ అనడం గమనార్హం. షేరు ధరలు ఇలా... ప్రస్తుతం టాటా టెలీసర్వీసెస్ లిమిటెడ్‌లో భాగమైన టాటా టెలీ(మహారాష్ట్ర) లిమిటెడ్(టీటీఎంఎల్) స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉంది. ముంబై, గోవా సర్కిళ్లలో ఇది మొబైల్ సేవలందిస్తోంది. బుధవారం బీఎస్ఈలో ఈ షేరు ధర 2.49 శాతం లాభపడి రూ.7.40 వద్ద స్థిరపడింది. ఇక టాటా కమ్యూనికేషన్స్ షేరు కూడా 2.26% పెరిగి రూ.281 వద్ద స్థిరపడింది. -
‘సాక్ష్యాలు లేనందునే నిరాకరించా’
న్యూఢిల్లీ: ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో మాజీ సీఎం ఆశోక్ చవాన్ పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలను సీబీఐ చూపించలేకపోయిందని రాష్ట్ర గవర్నర్ కె.శంకర నారాయణన్ అన్నారు. ఈ సొసైటీలో రాజకీయ నాయకులకు కూడా అవకాశం కల్పించేలా రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి హోదాలో అశోక్ చవాన్ ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలపై సాక్ష్యాన్ని సీబీఐ సేకరించలేకపోయిందని న్యూఢిల్లీలో బుధవారం విలేకరులతో అన్నారు. దీన్ని ఆధారంగానే చేసుకునే చవాన్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతించలేదని వివరించారు. 2000వ సంవత్సరంలో ఫ్లాట్ల కేటాయింపులో చవాన్ క్రిడ్ ప్రో కోకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయని, అయితే 2004లో జూన్ 18న చవాన్ వదిన చేసుకున్న దరఖాస్తును తిరస్కరణకు గురైందన్నారు. 2000 సమావేశానికి, 2004 దరఖాస్తుకు చాలా కాలం వ్యత్యాసముందన్నారు. చివరగా 2008, నవంబర్ 10న ఆమెకు సభ్యత్వం ఇచ్చారని తెలిపారు. అయితే ఆ సమయంలో చవాన్ రెవెన్యూ శాఖ మంత్రి కానీ, సీఎం హోదాలో కానీ లేరని తెలిపారు. సీఆర్పీసీ 197 సెక్షన్ కింద మాత్రమే చవాన్‌ను విచారించేందుకు సీబీఐ అనుమతి కోరిందని, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19 కింద కాదని చెప్పారు. తన వద్దకు వచ్చిన అన్ని పత్రాలను పరిశీలించాకే సీబీఐ విచారణకు అనుమతించలేదని వివరించారు. గతంలో ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు రావడంతో సీఎం పదవికి అశోక్ చవాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కుంభకోణం నుంచి చవాన్ పేరును తప్పించాలంటూ ఇటీవల బాంబే హైకోర్టుకు వెళ్లిన సీబీఐకి చుక్కెదురైంది. -
మారుతీ ఇక ఇండియాది కాదా!
న్యూఢిల్లీ: విస్తరణలో భాగంగా గుజరాత్లో ఏర్పాటు చేయతలపెట్టిన తయారీ ప్లాంట్‌ను మాతృ సంస్థ సుజుకీ మోటార్(జపాన్)కు అప్పగించేందుకు మంగళవారం సమావేశమైన మారుతీ సుజుకీ బోర్డు నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సుజుకీ గుజరాత్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థను సుజుకీ మోటార్ ఏర్పాటు చేయనుంది. తొలి దశలో భాగంగా ఏడాదికి లక్ష కార్ల తయారీ సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సుజుకీ మోటార్ కార్పొరేషన్ చైర్మన్ ఒసాము సుజుకీ చెప్పారు. ఆపై సామర్థ్యాన్ని 2.5 లక్షలకు పెంచనున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంలో 7.5 లక్షల వాహన తయారీ సామర్థ్యాన్ని అందుకోనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్‌లోగా సుజుకీ గుజరాత్‌ను ఏర్పాటు చేస్తామని, ఇది అన్‌లిస్టెడ్ కంపెనీగా ఉంటుందని తెలిపారు. లాభదాయకం! గుజరాత్లో సామర్థ్య విస్తరణ కోసం మారుతీ 2011లో మేసానాకు దగ్గర్లో 700 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 250 కోట్లను వెచ్చించింది. ఇక్కడ రూ. 4,000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు 2012లో ప్రణాళికలు వేసింది. అయితే మార్కెట్ పరిస్థితులు అనుకూలించక ప్లాంట్ యోచనను వాయిదా వేసింది. కాగా, సుజుకీ మోటార్... ఇటీవల 100% అనుబంధ కంపెనీ ద్వారా ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడంతో మారుతీ బోర్డు ఇందుకు అంగీకరించింది. స్థలాన్ని లీజుకి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ప్లాంట్‌లో మారుతీ కోసమే సుజుకీ గుజరాత్ సంస్థ వాహనాలను తయారు చేసి, తయారీ ధరకే మారుతీకి విక్రయిస్తుందని ఒసాము వివరించారు. దీంతో కంపెనీకి ఆర్థికపరమైన లబ్ది చేకూరుతుందని మారుతీ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. తద్వారా అమ్మకాలు, మార్కెటింగ్, పరిశోధన, అభివృద్ధి వంటి కార్యకలాపాలను పటిష్టపరచుకునేందుకు వీలు చిక్కుతుందని చెప్పారు. మార్కెట్లకు నచ్చలేదు... క్యూ3 ఫలితాల తరువాత బీఎస్ఈలో మారుతీ షేరు ధర 2.5% పుంజుకుని రూ. 1,750కు చేరింది. అయితే గుజరాత్ ప్లాంట్ విషయాన్ని కంపెనీ వెల్లడించాక ఒక్కసారిగా 8%(రూ. 138) పతనమై రూ. 1,563 వద్ద ముగిసింది. ఒక దశలో కనిష్టంగా రూ. 1,541ను తాకింది. నికర లాభం 36% అప్ మారుతీ సుజుకీ నికర లాభం క్యూ3లో 36% ఎగసి రూ. 681 కోట్లను తాకింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో రూ. 501 కోట్లను మాత్రమే ఆర్జించింది. అత్యధిక శాతం విడిభాగాలను స్థానికంగా తయారు చేయడం, విదే శీ మారక లాభాలు, వ్యయాల అదుపు లాభాల వృద్ధికి దోహదపడినట్లు కంపెనీ తెలిపింది. ఆదాయం మాత్రం 3% క్షీణించి రూ. 10,620 కోట్లకు చేరింది.