భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు 'అనిల్ అంబానీ' గురించి దాదాపు అందరికి తెలుసు. ఒకప్పుడు ఆసియాలోని ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన సంపాదన భారీగా పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ ఆయన సంపాదన పడిపోయిందా..లేదా ? ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎన్ని అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
అనిల్ అంబానీ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కోర్టులో తన ప్రస్తుత నికర విలువ రూ.0 అని వెల్లడించాడు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ రెండో రౌండ్ బిడ్డింగ్ వేలంలో హిందుజా గ్రూప్ అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. దివాళా తీసిన కంపెనీని రూ. 9650 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసింది.
ముఖేష్ అంబానీ మాదిరిగా అపర కుబేరుడుగా ప్రపంచంలో ఉన్న ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్న అనిల్ అంబానీ 2020 ఫిబ్రవరిలో UK కోర్తులో హాజరైనప్పుడు తన నికర ఆస్తుల విలువ సున్నా అని చెప్పారు. నిజానికి ఆయన ఆస్తుల విలువ 13.7 బిలియన్ డాలర్లు అని నివేదికల ద్వారా తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ. 1.12 లక్షల కోట్లకంటే ఎక్కువ.
అనిల్ అంబానీ తన ఆస్తులు సున్నా రూపాయలు అని కోర్టులు చెప్పినప్పటికీ.. ముంబైలో 17 అంతస్థుల భవంతి, రూ. 20 కోట్ల విలువైన కార్లు, అత్యంత ఖరీదైన బోట్స్, ప్రైవేట్ జెట్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. నికర ఆస్తుల విలువ భారీగా తగ్గినప్పటికీ, ప్రస్తుత ఆస్తులు రూ. 83 మిలియన్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: Matter Aera Electric Bike: ఈ బైక్ కావాలా? ఇదిగో ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోండి!)
నిజానికి అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో ఒక శిఖరం, ఆసియాలో ఆరవ ధనవంతుగా ఎదిగాడు. కానీ కంపెనీ నిధులను స్వాహా చేసిన ఆరోపణలకు గానూ సెబీ మార్కెట్ నుంచి నిషేదించింది. ఆ తరువాత క్రమంగా ఆయన నికర ఆస్తులు పతనం కావడం ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment