Bidding
-
3 జలాశయాల్లో పూడిక తీతకు పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: కడెం, మిడ్‌మానేరు, లోయర్ మానేరు జలాశయాల్లో పైలట్ ప్రాజెక్టు కింద పూడిక తొలగింపునకు టెండర్లను ఆహ్వానించడానికి రా ష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిoది. ఇందులోని నిబంధనల మేరకు పూడిక తొలగింపుతో లభ్యమయ్యే ఇసుకను కాంట్రాక్టర్లు అమ్ముకోవచ్చు. ఈ నేపథ్యంలో మెట్రిక్ టన్ను ఇసుకకు రూ.406.64ను కనీస బిడ్డింగ్ ధరగా ప్రభుత్వం నిర్ధారించింది. ఈ ధరను ఎప్పటికప్పుడు సవరిస్తామని స్పష్టం చేసింది. కాంట్రాక్టర్లు తాము కోట్ చేసిన ధర ఆధారంగా ఎంత ఇసుకను తవ్వితే ఆ మేరకు ప్రభుత్వానికి చెల్లింపు లు చేయాల్సి ఉంటుంది. పూడిక తొలగింపు ద్వారా వచ్చే ఆదాయాన్ని తెలంగాణ వాటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీడబ్ల్యూఆర్డీసీ) ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. కాంట్రాక్టర్లు ఇసుక నిల్వలను స్టాక్‌యార్డులో నిర్వహించాల్సి ఉంటుంది. నీటిపారుదల శాఖ, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ)లు దీనిని పర్యవేక్షించనున్నాయి. ఈ మేరకు పూడిక తొలగింపునకు టెండర్లను ఆహ్వానించాలని కరీంనగర్ ఈఎన్సీని ఆదేశిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పేరుకుపోయిన పూడిక రాష్ట్రంలో మొత్తం 929 టీఎంసీల సామర్థ్యం కలిగిన 159 జలాశయాలున్నాయి. కాగా, ఇందులో సగానికి పైగా జలాశయాలు 25 ఏళ్లకు పైబడినవే కావడంతో పూడిక పెరిగి క్రమంగా నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. తద్వారా ఆయకట్టుకు అవసరమై న సాగునీటికి లోటు ఏర్పడుతోంది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భా గంగా 220 టీఎంసీల సామర్థ్యం కలిగిన 14 ప్రాజెక్టులపై అధ్యయనం జరపగా, పూడికతో అవి 35 టీఎంసీల (16 శాతం) నిల్వ సామర్థ్యాన్ని కోల్పో యినట్టు తేలింది. దేశంలో పీఎం కిసాన్ సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) మార్గదర్శకాల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన కొత్త జలాశయాన్ని నిర్మించాలంటే రూ.162 కోట్లు కావాల్సి ఉంటుంది. కాగా, పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మూడు జలాశయాల్లో భారీగా పూడిక పేరుకుపోయింది. సర్కారుకు ఖర్చు లేకుండా.. జలాశయాల్లో పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జాతీయ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. పూడికతీత కోసం రాజస్తాన్, మహారాష్ట్రల తరహాలో ఆదాయ ఆర్జన విధానంలో భారీ యంత్రాలతో తవ్వకాలు (మెకానికల్ డ్రెడ్జింగ్) నిర్వ హించనున్నారు. దీనికోసం ప్రభు త్వం ఎలాంటి ఖ ర్చు చేయదు. అత్యధిక ధర కోట్ చేసిన బిడ్డర్లు పన్నులు, సెస్, జీఎస్టీ, రాయల్టీని చెల్లించి తవి్వన మట్టి, ఇసుకను విక్రయించుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర జలాశయాల్లో సైతం పూడిక తొలగింపున కు ఇదే విధానాన్ని అనుసరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తదుపరిగా అనుమతి ఇవ్వనుంది. పూడిక తొలగింపు గడువు 20 ఏళ్లు! జలాశయాల్లో భారీగా ఉన్న పూడికను ఇప్పటికిప్పుడు తొలగించడం సాధ్యం కాదు. పూడిక తొలగింపునకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లు కాంట్రాక్టర్లతో 20 ఏళ్ల గడువుతో ఒప్పందా లు చేసుకోగా, మరో ఐదేళ్ల గడువు పొడిగింపునకు వెసులుబాటు కల్పించాయి. రాష్ట్రంలో సైతం ఇదే రీతిలో 20 ఏళ్ల గడువు విధించి, ఆ తర్వాత గరిష్టంగా 5 ఏళ్ల గడువు పొడిగింపునకు వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. -
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ రూ. 4.50 డివిడెండ్
న్యూఢిల్లీ: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి పనితీరు పరంగా రాణించింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని లాభం రూ.3,645 కోట్లతో పోల్చి చూసినప్పుడు 11 శాతం పెరిగి రూ.4,028 కోట్లకు చేరింది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.11,530 కోట్ల నుంచి రూ.11,820 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రూ.7,690 కోట్ల మూలధన వ్యయాలను వినియోగించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఆరు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్రాజెక్టులను బిడ్డింగ్‌లో గెలుచుకుంది. వీటి నిర్మాణ అంచనా వ్యయం రూ.20,479 కోట్లుగా ఉంది. డిసెంబర్ చివరికి పవర్‌గ్రిడ్ సంస్థ నిర్వహణలోని ట్రాన్స్మిషన్ ఆస్తుల నిడివి 1,76,530 సర్క్యూట్ కిలోమీటర్లుగా ఉంది. అలాగే, 276 సబ్ స్టేషన్లు, 5,17,860 మెగావోల్ట్ యాంపియర్స్ ట్రాన్స్ఫార్మేషన్ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రెండో మధ్యంతర డివిడెండ్ కింద రూ.4.50 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. -
ట్యుటికోరిన్ కోల్ బిడ్డింగ్‌పై జిందాల్ పవర్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ట్యుటికోరిన్ కోల్ టెర్మినల్ (టీసీటీ) బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అనుమతించాలంటూ జిందాల్ పవర్ (జేపీఎల్) చేసిన విజ్ఞప్తిని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తిరస్కరించింది. నిబంధనల ప్రకారం పరిష్కార ప్రక్రియను సమర్పించేందుకు జేపీఎల్‌కు అర్హత లేదంటూ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఇచి్చన ఉత్తర్వులను సమర్ధించింది. కంపెనీకి గరిష్ట విలువను రాబట్టడమే దివాలా కోడ్ (ఐబీసీ) లక్ష్యం అయినప్పటికీ .. దరఖాస్తుదారుల తుది జాబితాలో లేని కంపెనీలకు మధ్యలో ప్రవేశం కలి్పంచడానికి నిబంధనలు అంగీకరించవని పేర్కొంది. తుది జాబితాలోని సీపోల్ సమర్పించిన బిడ్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ పరిష్కార నిపుణుడు (ఆర్పీ), రుణదాతల కమిటీ (సీవోసీ)కి ఎన్సీఎల్ఏటీ సూచించింది. రుణ పరిష్కార ప్రక్రియలో భాగంగా టీసీటీని కొనుగోలు చేసేందుకు సీపోల్ గతేడాది ఫిబ్రవరి 18న ప్రణాళిక సమరి్పంచింది. దాన్ని రుణదాతల కమిటీ (సీవోసీ) పరిశీలిస్తుండగానే దాదాపు అదే సమయంలో బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు తమకు కూడా అవకాశం కలి్పంచాలంటూ జూలై 12న జేపీఎల్ కోరింది. అయితే, బిడ్డింగ్‌కు అనుమతిస్తూనే.. సీఐఆర్‌పీ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉంటాయంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తెలిపింది. దీనిపై సందిగ్ధత నెలకొనడంతో స్పష్టతనివ్వాలంటూ ఆర్పీ కోరారు. దీంతో జేపీఎల్‌కు అర్హత ఉండదంటూ ఎన్సీఎల్టీ స్పష్టతనిచ్చింది. ఈ ఉత్తర్వులనే సవాలు చేస్తూ ఎన్సీఎల్ఏటీని జేపీఎల్ ఆశ్రయించింది. -
ఐడీబీఐ బ్యాంక్ వేల్యుయర్ బిడ్డింగ్ ప్రక్రియ రద్దు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు విలువను మదింపు చేసే అసెట్ వేల్యుయర్ ఎంపికకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియను కేంద్రం రద్దు చేసింది. బిడ్డింగ్‌కు అంతగా స్పందన లభించకపోవడమే ఇందుకు కారణం. బిడ్డర్లను ఆకర్షించే విధంగా బిడ్డింగ్ నిబంధనలను మెరుగుపర్చి, త్వరలోనే కొత్త ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్)ని జారీ చేయనున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) పేర్కొంది. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీకి 94.72 శాతం వాటాలు ఉన్నాయి. వ్యూహాత్మకంగా, రెండు కలిసి సుమారు 61 శాతం వాటాలను విక్రయించే యోచనలో ఉన్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే ఐడీబీఐ బ్యాంకు విలువను మదింపు చేసేందుకు అసెట్ వేల్యుయర్‌ను నియమించడానికి సెప్టెంబర్ 1న దీపమ్ .. బిడ్లను ఆహ్వానించింది. బిడ్ల సమర్పణకు అక్టోబర్ 9 గడువు అయినప్పటికీ అక్టోబర్ 30 వరకు పొడిగించారు. అయినప్పటికీ ఒకే ఒక్క బిడ్ దాఖలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఆర్ఎఫ్పీని జారీ చేయాలని దీపమ్ నిర్ణయించుకున్నట్లు వివరించాయి. వాటాల విక్రయం తర్వాత బ్యాంకులో ప్రభుత్వానికి 15 శాతం, ఎల్ఐసీకి 19 శాతం వాటాలు ఉండనున్నాయి. -
ఎయిర్‌పోర్టు మెట్రోకు యమ క్రేజ్.. పోటీలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ నిర్మాణానికి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. బిడ్డింగ్ గడువు సమీపిస్తుండడంతో పలు నిర్మాణసంస్థల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ సంస్థ టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సుమారు రూ.6 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, మరో ఐదు రోజులే మిగిలి ఉన్నందువల్ల మరిన్ని సంస్థలు బిడ్లను దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్లలో మెట్రో అందుబాటులోకి వచ్చిన తరువాత హైదరాబాద్ ముఖచిత్రం మారింది. వ్యాపార, వాణిజ్య రంగాలు, రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టాయి. దీంతో నగరంలో మెట్రో రైలును నిర్మాణ సంస్థలు లాభదాయకమైన ప్రాజెక్టుగా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐటీ, రియల్ రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిన రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ కారిడార్‌ను దక్కించుకొనేందుకు గ్లోబల్‌స్థాయిలో పోటీ పెరిగింది. నిర్మాణ సంస్థలు ఈ కారిడార్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించడమే ఇందుకు కారణమని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో ఇప్పటికే ఎల్అండ్టీ, ఆల్స్టామ్, సీమెన్స్, టాటా ప్రాజెక్ట్స్, ఐఆర్సీఓఎన్, ఆర్వీఎన్ఎల్, బీఈఎంఎల్, పీఏఎన్డీఆర్ఓఎల్ రహీ టెక్నాలజీస్ తదితర జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన కంపెనీలు పోటీలో ఉండగా, గడువు ముగిసేనాటికి మరిన్ని సంస్థలు పోటీలో నిలిచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. రెండేళ్లలో పూర్తి... మరోవైపు ఈ మార్గాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ 2026 నాటికి పూర్తి చేసేవిధంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ కార్యాచరణ చేపట్టింది. తాము విధించిన నిబంధనలు, షరతులకు అనుగుణంగానే నిర్మాణ సంస్థలు తమ బిడ్లను దాఖలు చేయాలని గతంలోనే అధికారులు స్పష్టం చేశారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరంలో అందుబాటులోకి రానున్న ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ కోసం ఇప్పటి వరకు సర్వే, పెగ్‌మార్కింగ్, అలైన్మెంట్ తదితర పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో 29.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కాగా, 1.7 కిలోమీటర్ల వరకు భూగర్భమార్గంలో ట్రాక్ నిర్మాణం చేపట్టవలసి ఉంటుంది. ఎయిర్‌పోర్టు టర్మినల్ సమీపంలో ఒక భూగర్భ మెట్రో స్టేషన్‌తో పాటు మొత్తం 9 మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఈ ప్రాజెక్టు వ్యయంలో హెచ్ఎండీఏ, జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు 10 శాతం చొప్పున భరిస్తుండగా, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. మొదట 11 రైళ్లతో ప్రారంభం.. రాయదుర్గం –ఎయిర్‌పోర్టు మార్గంలో మొదట 11 రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి మెట్రోకు 3 కోచ్‌లు ఉంటాయి. మొత్తం 33 కోచ్‌లతో సర్వీసులను అందుబాటులోకి తెస్తారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా కోచ్‌ల సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌మెట్రో 6 కోచ్‌లు, చైన్నె ఎయిర్పోర్ట్ మెట్రో 4 కోచ్‌లతో నడుస్తోంది. మొదట్లో రద్దీ సమయంలో ప్రతి 8 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయాల్లో ప్రతి 10 నిమిషాలకు ఒక ట్రైన్ చొప్పున నడుపుతారు. ఆ తరువాత రద్దీ వేళల్లో ప్రతి 3 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయాల్లో ప్రతి 5 నిమిషాలకు ఒకటి చొప్పున నడిపే విధంగా ప్రణాళికలను రూపొందించినట్లు తెలిసింది. నగరం పడమటి వైపు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా కేవలం ఎయిర్‌పోర్టు ప్రయాణికులే కాకుండా అన్ని వర్గాల ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్ మెట్రో సేవలను వినియోగించుకొనే అవకాశం ఉంది. దీంతో రైళ్లు, సర్వీసుల సంఖ్య భారీగా పెరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా 9 స్టేషన్లను ఖరారు చేసినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో మరిన్ని స్టేషన్లకు కూడా డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. -
ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఆస్తులు సున్నా అంటున్నాడు..
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు 'అనిల్ అంబానీ' గురించి దాదాపు అందరికి తెలుసు. ఒకప్పుడు ఆసియాలోని ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన సంపాదన భారీగా పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ ఆయన సంపాదన పడిపోయిందా..లేదా ? ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎన్ని అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. అనిల్ అంబానీ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కోర్టులో తన ప్రస్తుత నికర విలువ రూ.0 అని వెల్లడించాడు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ రెండో రౌండ్ బిడ్డింగ్ వేలంలో హిందుజా గ్రూప్ అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. దివాళా తీసిన కంపెనీని రూ. 9650 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసింది. ముఖేష్ అంబానీ మాదిరిగా అపర కుబేరుడుగా ప్రపంచంలో ఉన్న ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్న అనిల్ అంబానీ 2020 ఫిబ్రవరిలో UK కోర్తులో హాజరైనప్పుడు తన నికర ఆస్తుల విలువ సున్నా అని చెప్పారు. నిజానికి ఆయన ఆస్తుల విలువ 13.7 బిలియన్ డాలర్లు అని నివేదికల ద్వారా తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ. 1.12 లక్షల కోట్లకంటే ఎక్కువ. అనిల్ అంబానీ తన ఆస్తులు సున్నా రూపాయలు అని కోర్టులు చెప్పినప్పటికీ.. ముంబైలో 17 అంతస్థుల భవంతి, రూ. 20 కోట్ల విలువైన కార్లు, అత్యంత ఖరీదైన బోట్స్, ప్రైవేట్ జెట్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. నికర ఆస్తుల విలువ భారీగా తగ్గినప్పటికీ, ప్రస్తుత ఆస్తులు రూ. 83 మిలియన్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: Matter Aera Electric Bike: ఈ బైక్ కావాలా? ఇదిగో ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోండి!) నిజానికి అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో ఒక శిఖరం, ఆసియాలో ఆరవ ధనవంతుగా ఎదిగాడు. కానీ కంపెనీ నిధులను స్వాహా చేసిన ఆరోపణలకు గానూ సెబీ మార్కెట్ నుంచి నిషేదించింది. ఆ తరువాత క్రమంగా ఆయన నికర ఆస్తులు పతనం కావడం ప్రారంభమైంది. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐకు అనూహ్య స్పందన
-
ఫ్యూచర్ గ్రూప్ ఎవరిదో.. రేసులో రిలయన్స్, అదానీ సంస్థలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో ఉన్న ఫ్యూచర్ రిటైల్‌ను సొంతం చేసుకునేందుకు తీవ్ర పోటీ నెలకొంది. రేసులో రిలయన్స్, అదానీ, జిందాల్ తదితర పలు గ్రూప్‌లు, సంస్థలు పోటీపడుతున్నాయి. వెరసి కంపెనీ ఆస్తుల కొనుగోలుకి ఆసక్తిని వ్యక్తం చేస్తూ(ఈవోఐ) 49 బిడ్స్ దాఖలయ్యాయి. ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియలో భాగమైన ఫ్యూచర్ రిటైల్ ఆస్తులను ఐదు క్లస్టర్స్‌గా విడదీశాక రుణదాతలు ఈవోఐ బిడ్స్‌కు ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. -
ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు
హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల లాంగ్ లీజుకు ఇవ్వడానికి 'హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ' (HMDA) ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే ఈ కాంట్రాక్టును కైవసం చేసుకునేందుకు నాలుగు కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీని కోసం బిడ్డింగ్ సుమారు రూ. 8,000 కోట్లు వరకు ఉంటుంది. ఈ రేసులో ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్, దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, గవార్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ కంపెనీలు తమ బిడ్లను ఇప్పటికే హెచ్ఎండీఏకి సమర్పించాయి. ఈ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎల్‌అండ్‌టి, క్యూబ్ హైవేస్ వంటి సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం, కానీ బిడ్లలో ఈ సంస్థలు పాల్గొనలేదు. బిడ్డింగ్‌లో పాల్గొనడానికి అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి టోలింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్, ట్రాన్స్పోర్ట్ కోసం హెచ్ఎండీఏ టెండర్లను పిలిచింది. ఇందులో ఎక్కువ సంస్థలు పాల్గొనటానికి గడువు కూడా రెండు రోజులు పొడిగించింది. కొంతమంది వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ప్రీ-బిడ్ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే టెక్నీకల్ కమిటీ మంగళవారం నుంచి టెక్నికల్ బిడ్లను మూల్యాంకనం (Evaluating) చేయడం ప్రారంభించింది. త్వరలోనే ఫైనాన్సియల్ బిడ్ ప్రారంభమవుతుంది. దీనికోసం పోటీ గట్టిగానే ఉంటుందని భావిస్తున్నారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి & ఓఆర్ఆర్ టోల్ డిమాండ్‌పై ఉన్న సందేహాల వల్ల ఇప్పటికి కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే బిడ్డింగ్‌లో పాల్గొనటానికి ఆసక్తి చూపాయి. అయితే ఈ బీడ్ సొంతం చేసుకునే కంపెనీ నాలుగు నెలల్లో మొత్తం డబ్బుని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. బిడ్లలో అవసరమైన మొత్తం రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రీ-టెండర్ ప్రకటించే అవకాశం ఉంటుందని కొందరు హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి హెచ్ఎండీఏ ఈగిల్ ఇన్ఫ్రా సంస్థ నుంచి టోల్ ఫీజు సంవత్సరానికి రూ. 415 కోట్లు వసూలు చేస్తోంది. ఓఆర్ఆర్ ని టోల్ ఆపరేట్ ట్రాన్స్పర్పై 30 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నట్లయితే, బిడ్డర్ నుంచి మొత్తం డబ్బుని పొందుతుంది. అయితే ORRని నిర్వహించడానికి హెచ్ఎండీఏపై ఎటువంటి భారం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తమ రోడ్లు, ఇతర ఎక్స్‌ప్రెస్‌వేల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా లాంగ్ లీజుపై 'టోల్ ఆపరేట్ ట్రాన్స్పోర్ట్' (TOT)ని స్వీకరించింది. -
జెట్ స్పీడ్‌లో బుల్లెట్ ట్రెయిన్ నిర్మాణ పనులు..రూ.3,681 కోట్లతో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హిందుస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ (హెచ్‌సీసీ), మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) సంయుక్తంగా బుల్లెట్ ట్రెయిన్ స్టేషన్ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకున్నాయి. ప్రాజెక్ట్ విలువ రూ.3,681 కోట్లు. నేషనల్ హై–స్పీడ్ రైల్ కార్పొరేషన్ నుంచి ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాయి. 508.17 కిలోమీటర్ల ముంబై–అహ్మదాబాద్ హై–స్పీడ్ రైల్లో భాగంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్‌ను హెచ్‌సీసీ, ఎంఈఐఎల్ నిర్మిస్తాయి. ఆరు ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేస్తారు. 16 కోచ్‌లు ఉన్న బుల్లెట్ ట్రెయిన్ నడవడానికి వీలుగా ఒక్కొక్కటి 414 మీటర్ల పొడవులో ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మిస్తారు. మెట్రో, రోడ్డు మార్గాలకు అనుసంధానంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్ ఉంటుందని హెచ్‌సీసీ తెలిపింది. ముంబై–అహ్మదాబాద్ హై–స్పీడ్ రైల్ మార్గంలో భూగర్భంలో ఉండే ఏకైక స్టేషన్ ఇదే. నేల నుంచి 24 మీటర్ల లోపల ఏర్పాటు చేస్తారు. మూడు అంతస్తుల్లో స్టేషన్ ఉంటుంది. -
డివ్జీ టార్క్ ఇష్యూ @ రూ. 560–590
న్యూఢిల్లీ: ఆటోమోటివ్ విడిభాగాల కంపెనీ డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ మార్చి 1న ప్రారంభంకానుంది. 3న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 560–590గా నిర్ణయించింది. తద్వారా రూ. 412 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ నేడు(28న) ప్రారంభంకానుంది. ఐపీవోలో భాగంగా రూ. 180 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 39.34 లక్షల షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, తయారీ సౌకర్యాల పరికరాల కొనుగోలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 25 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. కంపెనీ ప్రధానంగా సిస్టమ్ లెవెల్ ట్రాన్స్ఫర్ కేస్, టార్క్ కప్లర్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సొల్యూషన్లు అందిస్తోంది. క్లయింట్ల జాబితాలో ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ ఆటో పార్ట్స్ తదితరాలున్నాయి. మార్చి 14న కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అయ్యే వీలుంది. -
AP: ఈనామ్ బిడ్డింగ్‌లో మనదే రికార్డ్..
సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈనామ్) బిడ్డింగ్‌లలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. రికార్డుస్థాయిలో వ్యాపార లావాదేవీలు నిర్వహించడమే కాదు బిడ్డింగ్ల్లో కూడా రికార్డులు తిరగరాస్తోంది. కోటి బిడ్డింగ్లతో ఆదోని మార్కెట్ యార్డు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 45.63 లక్షల బిడ్స్‌తో కర్నూలు యార్డు రెండోస్థానంలో ఉంది. 2017–18లో ప్రారంభమైన ఈనామ్ దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా మండీ (మార్కెట్ యార్డు)ల్లో అమలవుతోంది. మన రాష్ట్రంలో 33 యార్డులు ఈనామ్ పరిధిలో ఉన్నాయి. రాష్ట్రంలో 14.49 లక్షలమంది రైతులు, 3,532 మంది వ్యాపారులు, 2,302 మంది ఏజెంట్లు ఈనామ్‌లో రిజిస్టరయ్యారు. 203 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా ఈనామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర పరిధిలో రూ.35 వేలకోట్ల విలువైన 58.74 లక్షల టన్నుల క్రయవిక్రయాలు ఈనామ్ ద్వారా జరిగాయి. ప్రధానంగా మిరప, పత్తి, పసుపు, నిమ్మ, టమాటా, బెల్లం, ఆముదం, ఉల్లి, వివిధరకాల పండ్లు, కూరగాయలను జాతీయస్థాయిలో రైతులు అమ్ముకుంటున్నారు. నాణ్యత పరీక్ష యంత్రాల ద్వారా ర్యాండమ్‌గా లాట్స్ నాణ్యతను పరీక్షించి ఆన్లైన్లోనే పరిమాణంతో సహా ప్రదర్శిస్తారు. విక్రయించిన రైతుల ఖాతాల్లో సొమ్ము నేరుగా జమ అవుతోంది. ఆదోని యార్డు పరిధిలో ఇప్పటివరకు రూ.3,607.28 కోట్ల క్రయవిక్రయాలు ఆదోని యార్డు పరిధిలో మూడులక్షల మంది రైతులు, 503 మంది వ్యాపారులు, 429 మంది కమీషన్ ఏజెంట్లు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా పత్తి, వేరుశనగ, ఆముదం, పూలవిత్తనాల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఆదోని పరిధిలో 50కి పైగా స్పిన్నింగ్ మిల్స్ ఉండడంతో వ్యాపారులు ఆదోని మార్కెట్ యార్డులో ఈనామ్ టెండర్లో పాల్గొని పత్తికి పోటీపడి బిడ్డింగ్‌లు నమోదు చేస్తుంటారు. ఈనామ్ ప్రారంభించినప్పటి నుంచి నేటివరకు రాష్ట్రంలో ఈనామ్ పరిధిలో ఉన్న 33 మార్కెట్ యార్డుల్లో 64.29 లక్షల లాట్స్ మార్కెట్‌కు వచ్చాయి. వీటిలో ఒక్క ఆదోనిలోనే 11.34 లక్షల లాట్స్ ఉన్నాయి. ఈ సరుకు కోసం 300 మంది వ్యాపారులు పోటీపడగా, కోటి బిడ్డింగ్‌లు నమోదయ్యాయి. అత్యధికంగా 2020–21లో 2.26 లక్షల లాట్స్ కోసం 18.39 లక్షల బిడ్డింగ్స్ నమోదయ్యాయి. యార్డు పరిధిలో ఇప్పటివరకు రూ.3,607.28 కోట్ల విలువైన 6.97లక్షల టన్నుల వ్యవసాయోత్పత్తుల క్రయవిక్రయాలు జరిగాయి. రెండో స్థానంలో నిలిచిన కర్నూలు ఏఎంసీలో ఇప్పటివరకు 45.63 లక్షల బిడ్స్ నమోదయ్యాయి. ఈ యార్డు పరిధిలో రూ.1,536 కోట్ల విలువైన 3.89 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరిగాయి. దేశంలో మూడోస్థానంలో నిలిచిన రాజస్థాన్‌లోని కోట మండీలో 36 లక్షల బిడ్స్ నమోదయ్యాయి. అరుదైన రికార్డు కోటి బిడ్డింగ్‌లను అధిగమించడం అరుదైన రికార్డు. అనతికాలంలోనే ఈ ఫీట్‌ను సాధించిన తొలి యార్డుగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో యార్డు పరిధిలో కల్పించిన మౌలిక వసతుల వలన పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుండడంతోపాటు వ్యాపారులకు నాణ్యమైన సరుకు లభిస్తోంది. – బి.శ్రీకాంత్‌రెడ్డి, కార్యదర్శి, ఆదోని మార్కెట్ యార్డు -
పాక్ ఆర్థిక కష్టాలు.. అమ్మకానికి అమెరికాలోని ఎంబసీ ఆస్తులు
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పాకిస్థాన్. చేసిన అప్పులు తీర్చేందుకు, ఉద్యోగులకు జీతాలు సైతం ఇచ్చేందుకు ఇబ్బందులు పడుతూ ఆస్తులు అమ్ముకుంటోంది. తమకు సాయం చేయాలని అంతర్జాతీయ సంస్థలతో పాటు వివిధ దేశాలను వేడుకుంటోంది. ఈ క్రమంలోనే అమెరికాలోని ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టింది. వాషింగ్టన్‌లోని పాత ఎంబసీ బిల్డింగ్‌ను అమ్మకానికి పెట్టగా కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు పాకిస్థాన్ స్థానిక మీడియా వెల్లడించింది. భారత సంస్థ బిడ్.. వాషింగ్టన్‌లోని పాక్ ఎంబసీ భవనాన్ని కొనుగోలు చేసేందుకు అత్యధికంగా 6.8 మిలియన్ డాలర్లకు జువిష్ సంస్థ బిడ్ దాఖలు చేసింది. ఆ భవనం స్థానంలో ప్రార్థనా మందిరం నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత రెండోస్థానంలో భారత్‌కు చెందిన ఓ రియాల్టీ సంస్థ బిడ్ వేసింది. 5 మిలియన్ డాలర్లకు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చింది. అలాగే.. పాకిస్థాన్‌కు చెందిన రియాల్టీ సంస్థ 4 మిలియన్ డాలర్లకు కోట్ చేసినట్లు పాక్ డాన్ పత్రిక వెల్లడించింది. మరోవైపు.. ప్రైవేటీకరణపై ఏర్పడిన పాకిస్థాన్ కేబినెట్ కమిటీ ఆర్థిక మంత్రి ఇషాక్ డార్ నేతృత్వం సోమవారం భేటీ అయింది. న్యూయార్క్‌లోని రూసెవెల్త్ హోటల్ సైట్‌ను లీజుకు ఇచ్చేందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను నియమించాలని ప్రైవేటీకరణ కమిషన్‌కు సూచించినట్లు డాన్ పత్రిక తెలిపింది. పాకిస్థాన్‌కు వాషింగ్టన్లో రెండు ప్రాంతాల్లో రాయబార కార్యాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి పాతది కాగా మరొకటి కొత్తది. ఆర్ స్ట్రీట్‌లో ఉన్న భవనాన్ని 1956లో కొనుగోలు చేశారు. 2000 వరకు అందులో కార్యకలాపాలు సాగాయి. పాత భవనాన్ని అలాగే అమ్మేయాలా? లేక పునరుద్ధరణ పనులు చేయించి విక్రయించాలా? అనే అంశంపై ఎంబసీ అధికారులు చర్చిస్తున్నట్లు పాక్ పత్రిక పేర్కొంది. ఇదీ చదవండి: ‘ఏ దోస్త్ మేమున్నాం’.. పాకిస్థాన్‌కు జిన్‌పింగ్ భరోసా -
ఫ్యూచర్ రిటైల్: అంబానీ, అదానీకి పోటీగా కంపెనీలు నువ్వా? నేనా?
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) కొనుగోలు రేసులో మొత్తం 13 కంపెనీలు నిల్చాయి. దీనికి సంబంధించి రూపొందించిన తుది జాబితాలో ముఖేశ్ అంబానీ రిలయన్స్ రిటైల్, అదానీ గ్రూప్ జాయింట్ వెంచర్ సంస్థ ఏప్రిల్ మూన్ రిటైల్‌తో పాటు మరో 11 కంపెనీలు ఉన్నాయి. నవంబర్ 10న విడుదల చేసిన ప్రొవిజనల్ లిస్టుపై రుణ దాతల నుండి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఆయా కంపెనీలను తుది జాబితాలోనూ చేర్చినట్లు ఎఫ్ఆర్ఎల్ పరిష్కార నిపుణుడు (ఆర్పీ) వెల్లడించారు. (బీమా కంపెనీలకు ఐఆర్డీఏఐ కీలక ఆదేశాలు) ఎఫ్ఆర్ఎల్ రుణ భారం రూ. 24,713 కోట్ల పైచిలుకు ఉంది. ఇందులో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సినది రూ. 21,433 కోట్లు కాగా, ఆపరేషనల్ క్రెడిటర్లకు రూ. 2,464 కోట్ల మేర కట్టాలి. రుణాల చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా .. ఎఫ్‌ఆర్‌ఎల్‌పై దివాలా పిటీషన్ వేసింది. ఎఫ్ఆర్ఎల్ సహా 19 ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల టేకోవర్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నించినా.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సాధ్యపడలేదు. (Bisleri చైర్మన్ సంచలన నిర్ణయం: రూ. 7 వేల కోట్ల డీల్) -
బీపీసీఎల్ 'ఫర్ సేల్' ..కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!
నిర్ణీత సమయంలో పరిస్థితిని సమీక్షించిన తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) వాటా విక్రయ ప్రక్రియను తిరిగి ప్రారంభించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కిషన్రావ్ కరాద్ లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి, ఇంధన ధరల అనిశ్చితి, భౌగోళిక–రాజకీయ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలను ప్రభావితం చేశాయని మంత్రి పేర్కొంటూ, ఇందులో చమురు, గ్యాస్ పరిశ్రమ ప్రధానమైనదని తెలిపారు. ఆ పరిస్థితుల ప్రభావంతోనే బీపీసీఎల్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ (మెజారిటీ వాటా) కోసం ప్రస్తుత ఈఓఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) ప్రక్రియను నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బీపీసీఎల్‌లో 52.98 శాతం వాటాలను విక్రయించడానికి సంబంధించిన ఆఫర్‌ను ప్రభుత్వం మేలో ఉపసంహరించింది. బీపీసీఎల్ వ్యూహాత్మక వాటా విక్రయానికి 2020లో బిడ్డర్ల నుంచి ఈఓఐలను ఆహ్వానించడం జరిగింది. 2020 నవంబర్ నాటికి మూడు బిడ్స్ దాఖలయ్యాయి. ఇంధన ధరలపై అస్పష్టత తత్సంబంధ అంశాల నేపథ్యంలో తదనంతరం ఇరువురు బిడ్స్ ఉపసంహరించుకున్నారు. దీనితో మొత్తం బిడ్డింగ్ పక్రియను కేంద్రం వెనక్కు తీసుకుంది. అప్పట్లో బిడ్స్ వేసిన సంస్థల్లో మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్, యుఎస్ వెంచర్ ఫండ్స్ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఇంక్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఉన్నాయి. -
కమర్షియల్ బొగ్గు గనుల వేలం..బిడ్స్ దాఖలు చేసిన 31 సంస్థలు!
న్యూఢిల్లీ: కమర్షియల్ బొగ్గు గనుల వేలంలో 31 సంస్థలు బిడ్స్ దాఖలు చేసినట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 24 గనులకు సంబంధించి బిడ్లను అందించిన సంస్థల్లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, వేదాంత, ఎన్ఎల్సీ ఇండియా, జిందాల్ పవర్, భారత్ అల్యూమినియం, బిర్లా కార్పొరేషన్, జైప్రకాష్ పవర్ వెంచర్స్, రుంగ్తా మెటల్స్, గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ కంపెనీలు ఉన్నాయి. ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్గాల్లో జరిగిన మూడు రౌండ్ల వేలంలో మొత్తం 31 సంస్థలు 38 బిడ్స్ సమర్పించినట్లు బొగ్గు మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కమర్షియల్ మైనింగ్ కోసం 41 బొగ్గు గనుల వేలాన్ని 2020లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారత్‌లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నందున గనుల వేలం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పటివరకు, ప్రభుత్వం దాదాపు 47 బొగ్గు గనులను ప్రైవేట్ కంపెనీలకు వేలం వేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయి 777 మిలియన్ టన్నులను తాకింది. వార్షికంగా 8.55 శాతం వృద్ధిని సాధించింది. -
IPL: అమెజాన్ అవుట్
న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్ అంబానీ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా ప్రసార హక్కుల పోటీ రసవత్తరం అవుతుందనుకుంటే... మరోకటి జరిగింది. ఈ రేసు నుంచి ఓటీటీ సంస్థ అమెజాన్ తప్పుకుంది. దీంతో రిలయన్స్‌కు చెందిన ‘వయాకామ్ 18’ మిగతా మూడు సంస్థలతో రేసులో నిలిచింది. అమెజాన్ సహా డిస్నీ స్టార్, వయాకామ్–18, సోనీ, జీ సంస్థలు ప్రాథమిక బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. అయితే శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వైదొలగడంతో ఇప్పుడు టీవీ, డిజిటల్ హక్కుల పోటీ ప్రధానంగా నాలుగు సంస్థల మధ్యే నెలకొనే అవకాశముంది. నిజానికి అపర కుబేరుడికి చెందిన అమెజాన్ పోటీలో ఉన్నంతసేపూ ఈసారి ఐపీఎల్ మీడియా హక్కులకు ఎవరూ ఊహించని విధంగా రూ. 70 వేల కోట్ల మొత్తం రావొచ్చని బ్రాడ్‌కాస్టింగ్ వర్గాలు భావించాయి. కానీ కారణం లేకుండానే అమెజాన్ తప్పుకోవడంతో ముందనుకున్న అంచనాలు తప్పే అవకాశముంది. ‘అవును అమెజాన్ ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల ప్రక్రియ నుంచి వైదొలగింది. బిడ్ వేసేందుకు డాక్యుమెంట్లు తీసుకుంది. కానీ శుక్రవారం కీలకమైన సాంకేతిక బిడ్డింగ్‌లో వాటిని దరఖాస్తు చేయలేదు. గూగుల్‌కు చెందిన యుట్యూబ్ వాళ్లు కూడా డాక్యుమెంట్ కొనుగోలు చేశారు. కానీ వారు కూడా దరఖాస్తు సమర్పించలేదు. అయితే నాలుగు ప్రధాన టెలివిజన్, స్ట్రీమింగ్కు చెందిన మొత్తం 10 సంస్థలు పోటీలో ఉన్నాయి. ఆదివారం మొదలయ్యే ఇ–వేలం రెండు రోజులపాటు జరిగే అవకాశ ముంది.’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నిజమా... రూ. 45 వేల కోట్లా? అమెజాన్ వైదొలగినప్పటికీ... పోటీలో ఉన్న సంస్థలన్నీ పెద్ద మొత్తం చెల్లించేందుకు సై అంటున్నాయి. ఐదారేళ్ల క్రితంతో పోల్చుకుంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు అందరి ‘అరచేతి’ లో ఉండటమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిడ్ ప్రారంభ ధరే రూ. 32 వేల కోట్లు ఖాయమంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఇదే జరిగితే పోటాపోటీలో అక్షరాలా 45 వేల కోట్ల రూపాయాలు ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రావొచ్చని అంచనా. అంటే గత మొత్తం రూ. 16,347.50 కోట్లకు రెండున్నర రెట్లు అధిక మొత్తం ఈసారి గ్యారంటీ! ఇ–వేలం సంగతేంటి? బీసీసీఐ టెండర్ల ప్రక్రియతో గత హక్కు లు కట్టబెట్టింది. ఇప్పుడు ఇ–ఆక్షన్ (ఎలక్ట్రానిక్ వేలం) నిర్వహించనుంది. ఆదివారం మొదలయ్యే ఈ ఇ–ఆక్షన్‌లో పోటీదారులంతా ఆన్లైన్ పోర్టల్‌లో బిడ్లు వేస్తారు. స్క్రీన్‌లో ఎక్కువ మొత్తం పెరుగుతున్న కొద్దీ పోటీలో ఉన్న సంస్థలు తప్పుకుంటాయి. చివరకు మిగిలిన సంస్థ విజేతగా నిలుస్తుంది. అయితే ఎంత మొత్తమో కనబడుతుంది కానీ ఎవరు వేసింది అనేది స్క్రీన్‌లో కనపడదు. ఎందుకంటే పలా నా సంస్థ వేసిందంటే దానికి ధీటుగా వేయా లని ఇతర సంస్థలు నిర్ణయించుకుంటాయి. నాలుగు ‘ప్యాకేజీ’లు నాలుగు ప్యాకేజీల్లో ఎ, బి, సి పూర్తిగా భారత ఉపఖండానికి సంబంధించినవి. ‘ఎ’ టీవీ హక్కులు, ‘బి’ డిజిటల్ రైట్స్. ‘సి’ ప్లే–ఆఫ్స్ సహా కొన్ని ప్రత్యేక మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్ రైట్స్. ఇక ‘డి’ ఉపఖండం మినహా మొత్తం ప్రపంచానికి సంబంధించిన ఉమ్మడి టీవీ, డిజిటల్ రైట్స్. కొత్తగా ‘ప్రత్యేక’ హక్కులేంటంటే... సీజన్లో ఒక్కోసారి మ్యాచ్‌లు పెరిగితే దానికి సంబంధించిన ప్యాకేజీ అన్నమాట. ఒక సీజన్లో 74 ఉండొచ్చు. ఇవి మరో సీజన్లలో 84 లేదంటే 94కు పెరగొచ్చు. ఇవీ ప్రారంభ ధరలు... ‘ఎ’ టీవీ ప్యాకేజి కోసం ఒక్కో మ్యాచ్‌కు రూ. 49 కోట్లు ప్రారంభ బిడ్డింగ్ ధర కాగా... ‘బి’ డిజిటల్ కోసం మ్యాచ్‌కు రూ. 33 కోట్లు, ‘సి’లో ప్రాథమిక ధర రూ. 11 కోట్లు, ‘డి’లో రూ. 3 కోట్లకు తక్కువ కాకుండా బిడ్ వేయాల్సి ఉంటుంది. ఒక సంస్థ ఒకదానికే పరిమితమన్న నిబంధన లేదు. నాలుగు ప్యాకేజీలకూ ఒకే సంస్థ పోటీ పడొచ్చు. అయితే గతంలో ఏక మొత్తంలో ఒకే సంస్థకు కట్టబెట్టినట్లుగా కాకుండా ఈసారి ప్రతీ ప్యాకేజీలో ఎవరు ఎక్కువకు కోట్ చేస్తే వాళ్లకే హక్కులిస్తారు. గతంలో టీవీ హక్కులకు భారీ మొత్తం కోట్ చేసిన స్టార్ నెట్వర్క్ డిజిటల్‌కు తక్కువ కోట్ చేసింది. ఫేస్బుక్ డిజిటల్ కోసం రూ.3,900 కోట్లు కోట్ చేసినా... ఓవరాల్‌గా గరిష్ట మొత్తాన్ని పరిగణించి స్టార్‌కు హక్కులిచ్చారు. ఈసారి డిజిటల్ విభాగంలో టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ఆసియా, డ్రీమ్11, ఫ్యాన్‌కోడ్... ఉపఖండం ఆవల హక్కుల కోసం స్కై స్పోర్ట్స్ (ఇంగ్లండ్), సూపర్‌స్పోర్ట్ (దక్షిణాఫ్రికా) కూడా బరిలో ఉన్నాయి. -
మేఘాకు 12 ‘సిటీ గ్యాస్’ ఏరియాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) ప్రాజెక్టు 11వ రౌండు బిడ్డింగ్‌లో ఇన్ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) 12 జాగ్రఫికల్ ఏరియాలను (జీఏ)దక్కించుకుంది. వీటిలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లోని ఏరియాలు ఉన్నాయి. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నియంత్రణ బోర్డు (పీఎన్జీఆర్బీ) శుక్రవారం ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం 65 జీఏలకు బిడ్స్ ఆహ్వానించగా 61 ఏరియాలకు బిడ్స్ వచ్చాయి. వీటిలో 52 ఏరియాల ఫలితాలను ప్రకటించారు. ఎన్నికల కారణంగా 9 ప్రాంతాల ఫలితాలను ప్రకటించలేదు. వీటిల్లోనూ మరికొన్నింటిని ఎంఈఐఎల్ దక్కించుకునే అవకాశం ఉంది. తెలంగాణా విషయానికొస్తే జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తిలో సీజీడీ ప్రాజెక్టులో భాగంగా సిటీ గేట్ స్టేషన్, గ్యాస్ సప్లై పైప్లైన్లు.. సిఎన్జీ స్టేషన్లను నిర్మించి, ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు సంబంధించి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పైప్‌లైన్ నిర్మించడంతో పాటు 32 సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఈఐఎల్ పేర్కొంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాతో పాటు కర్ణాటకలో తుముకూరు, బెల్గావి జిల్లాల్లో మేఘా గ్యాస్ పేరిట గృహ, పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన గ్యాస్‌తో పాటు వాహనాలకు సీఎన్జీని కూడా అందిస్తున్నట్లు వివరించింది. -
సొంతగూటికి ఎయిరిండియా!!
పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ సుదీర్ఘ నిరీక్షణకు, ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియ కథకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. తొమ్మిది దశాబ్దాల క్రితం తాము నెలకొలి్పన విమానయాన దిగ్గజం ఎయిరిండియాను దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్ తిరిగి దక్కించుకుంది. బిడ్డింగ్‌లో పోటీ సంస్థ స్పైస్‌జెట్‌ను పక్కకు నెట్టి, రూ. 18,000 కోట్లు వెచి్చంచి కొనుగోలు చేసింది. దీనిపై టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆనందం వ్యక్తం చేయగా, ప్రభుత్వ .. పరిశ్రమ వర్గాలు అభినందనలు తెలియజేశాయి. తిరిగి టాటా గ్రూప్ గూటికి చేరడంపై ఎయిరిండియా ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. న్యూఢిల్లీ: పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియలో, ప్రభుత్వ రంగ ఎయిరిండియాను అత్యధికంగా రూ. 18,000 కోట్ల బిడ్‌తో టాటా గ్రూప్ దక్కించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఎయిరిండియాకు సంబంధించి రూ. 15,300 కోట్ల రుణభారాన్ని తీసుకోవడంతో పాటు రూ. 2,700 కోట్లు నగదు చెల్లించేలా టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫర్ చేసినట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. డిసెంబర్ ఆఖరు నాటికి లావాదేవీ పూర్తి కాగలదని ఆయన తెలిపారు. 2020 డిసెంబర్ నాటికి ఏడు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) వచ్చాయని, కానీ రెండే అర్హత పొందాయని పాండే తెలిపారు. హోం మంత్రి అమిత్ షా సారథ్యంలోని నిర్దిష్ట ఎయిరిండియా ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఐఎస్ఏఎం) అక్టోబర్ 4నే టాటా గ్రూప్ బిడ్‌కు ఆమోద ముద్ర వేసిందని ఆయన చెప్పారు. అయితే, దీన్ని అప్పుడే ప్రకటించకపోవడానికి గల కారణాలను వెల్లడించలేదు. ‘‘డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి లావాదేవీ పూర్తి కావచ్చని భావిస్తున్నాం’’ అని పాండే పేర్కొన్నారు. ఇక తర్వాత దశలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) జారీ చేయడం, వాటాల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేయడం మొదలైనవి ఉంటాయని ఆయన తెలిపారు. ఎయిరిండియాకు రిజర్వ్ ధర రూ. 12,906 కోట్లుగా కేంద్రం నిర్ణయించగా .. ప్రైవేట్ రంగ విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ సారథ్యంలోని కన్సార్షియం రూ. 15,100 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. మరోవైపు, ఎయిరిండియా తిరిగి టాటా గ్రూప్‌నకు చేరడంతో కంపెనీకి కొత్త శకం ప్రారంభమైందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్విటర్లో వ్యాఖ్యానించారు. కొత్త మేనేజ్మెంట్కు అభినందనలు తెలిపారు. రెండో పెద్ద ఎయిర్‌లైన్స్ గ్రూప్‌గా టాటా.. బిడ్డింగ్‌లో టాటా గ్రూప్ విజేతగా నిలి్చన వార్త వచి్చన కాస్సేపటికి, కంపెనీ మాజీ చైర్మన్ జేఆర్డీ టాటా గతంలో ఎయిరిండియా విమానం నుంచి దిగుతున్న పాత చిత్రాన్ని టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ట్వీట్ చేశారు. నిర్దిష్ట రంగాల్లో ప్రైవేట్ సంస్థలకు చోటు కలి్పంచడం హర్షణీయమని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తాజా పరిణామంతో 1953లో జాతీయం చేశాక, దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఎయిరిండియా సొంత గూటికి చేరినట్లయింది. ఎయిరిండియాను దక్కించుకోవడంతో టాటా గ్రూప్‌లో మూడో ఎయిర్‌లైన్ బ్రాండ్ చేరినట్లవుతుంది. టాటా గ్రూప్ ఇప్పటికే ఎయిర్ఏషియా, విస్తార (సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి) విమానయాన సంస్థలను నిర్వహిస్తోంది. ఎయిరిండియా, విస్తార, ఎయిర్‌ఏíÙయాలకు మొత్తం 26.9 శాతం మార్కెట్ వాటా ఉంటుంది. ఈ మూడు సంస్థల కన్సాలిడేషన్ ప్రక్రియ గానీ పూర్తయితే దేశీయంగా ఇండిగో తర్వాత రెండో అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌గా టాటా గ్రూప్ ఆవిర్భవించనుంది. డీల్ స్వరూపం ఇలా.. ఆగస్టు 31 నాటికి ఎయిరిండియా దాని అనుబంధ కంపెనీల మొత్తం రుణభారం రూ. 61,562 కోట్లుగా ఉంది. ఇందులో టాటా గ్రూప్ రూ. 15,300 కోట్ల రుణాన్ని తీసుకోనుంది. మిగతా రూ. 46,262 కోట్లు స్పెషల్ పర్పస్ వెహికల్ అయిన ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ (ఏఐఏహెచ్ఎల్)కు బదలాయిస్తారు. ఎయిరిండియాకు చెందిన స్థలాలు, భవంతులు వంటి ప్రధానయేతర అసెట్స్ ఈ డీల్‌లో భాగంగా ఉండవు. వీటిని ఏఐఏహెచ్‌ఎల్‌కు కేంద్రం బదలాయిస్తుంది. వీటి విలువ సుమారు రూ. 14,718 కోట్లు. ఎయిరిండియా బ్రాండ్ లేదా లోగోను అయిదేళ్ల దాకా టాటా గ్రూప్ మరెవరికీ బదలాయించడానికి వీల్లేదు. ఆ తర్వాత ఒకవేళ బదలాయించినా భారతీయ సంస్థకే ఇవ్వాల్సి ఉంటుంది. ఎయిరిండియాకు 4,400 పైచిలుకు దేశీయ, 1,800 అంతర్జాతీయ విమాన సరీ్వసుల ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్లు ఉన్నాయి. అలాగే విదేశీ ఎయిర్‌పోర్టుల్లో 900 స్లాట్లు ఉన్నాయి. ఇవి ఇక టాటా గ్రూప్‌నకు దక్కుతాయి. ఎయిరిండియాకు చెందిన 117 విమానాలు, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 24 విమానాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఏడాది దాకా ఉద్యోగులను తీసేయొద్దు.. బిడ్డింగ్ నిబంధనల ప్రకారం లావాదేవీ పూర్తయిన నాటి నుంచి ఏడాది పాటు ఎయిరిండియా ఉద్యోగులందరినీ టాటా గ్రూప్ కొనసాగించాలని విమానయాన శాఖ కార్య దర్శి రాజీవ్ బన్సల్ తెలిపారు. రెండో ఏడాదిలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఆఫర్ చేయవచ్చు. ఎయిరిండియాలో 12,085 మంది ఉద్యోగులు (8,084 మంది పర్మనెంట్, 4,001 మంది కాంట్రాక్ట్) ఉన్నారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 1,434 మంది సిబ్బంది ఉన్నారు. వెల్కం బ్యాక్ ఎయిరిండియా.. ‘ఎయిరిండియాకు పునఃస్వాగతం. ఎయిరిండియాను టాటా గ్రూప్ దక్కించుకుందన్న వార్త అద్భుతం. ఎయిరిండియాను పునర్నిర్మించడానికి గణనీయంగా కృషి చేయాల్సి ఉంటుంది. అయితే, ఏవియేషన్ మార్కెట్లో టాటా గ్రూప్ మరింత పటిష్టంగా ఎదిగేందుకు దోహదపడగలదు. జేఆర్డీ టాటా సారథ్యంలో అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా ఎయిరిండియా వెలుగొందింది. జేఆర్డీ నేడు మన మధ్యలో ఉంటే ఎంతగానో ఆనందించేవారు‘ – రతన్ టాటా, గౌరవ చైర్మన్, టాటా సన్స్ టాటా గ్రూప్‌నకు అభినందనలు ఎయిరిండియా బిడ్డింగ్‌లో గెలుపొందిన టాటా గ్రూప్‌నకు అభినందనలు. ఎయిరిండియాకు టాటా గ్రూప్ పూర్వ వైభవం తీసుకురాగలదు. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వానికి కూడా అభినందనలు‘ – అజయ్ సింగ్, సీఎండీ, స్పైస్‌జెట్ జేఆర్డీ టాటా మానసపుత్రిక.. ఇంత భారీ మొత్తం వెచ్చించి ఎయిరిండియాను టాటా గ్రూప్ దక్కించుకోవడానికి ఆ సంస్థతో గల బలమైన అనుబంధమే కారణం. అప్పట్లో గ్రూప్ చైర్మన్ జేఆర్డీ టాటా దీన్ని నెలకొల్పారు. ఆయనకు దీనిపై ఎంతో మమకారం ఉండేది. 1932 అక్టోబర్‌లో కరాచీ నుంచి బాంబేకు తొలి ఎయిర్‌మెయిల్ సరీ్వస్ విమానాన్ని ఆయనే స్వయంగా నడిపారు. 1953లో ఎయిరిండియాను జాతీయం చేయడాన్ని జేఆర్డీ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఆయన మాట నెగ్గలేదు. అయితే, ఎయిరిండియా జాతీయం అయిన తర్వాత కూడా 25 ఏళ్ల పాటు దానికి జేఆర్‌డీనే చైర్మన్‌గా ప్రభుత్వం కొనసాగించింది. ఇటు టాటా గ్రూప్‌ను అటు ఎయిరిండియాకు సారథ్యం వహించినప్పుడూ ఆయన టాటా గ్రూప్కన్నా ఎయిరిండియా గురించే ఎక్కువగా ఆలోచించేవారం టూ పేరుండేది. అయితే, ఎయిరిండియా బాధ్యతలను ఆయన కష్టంగా కాకుండా ఎంతో ఇష్టంగా నిర్వర్తించేవారు. జేఆర్డీ టాటా -
ఐపీఎల్ టీం... ఇప్పుడు మరింత కాస్ట్లీ గురు!
మోస్ట్ పాపులర్ స్పోర్టింగ్ ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పాలిట కామధేనువులా మారింది. పుష్కరకాలంగా కాసుల వర్షం కురిపిస్తోంది. రాబోయే 2022 సీజన్‌కి రెండు కొత్త జట్ల రాకతో బీసీసీఐ ఆదాయానికి అదనంగా రూ. 5000 కోట్లు వచ్చి చేరతాయని అంచనా. పెరగనున్న బేస్ ప్రైస్ ? ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎనిమిది జట్లు ఉన్నాయి. వచ్చే సీజన్‌కి ఈ సంఖ్యను పది జట్లకు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ రెండు జట్లు సొంతం చేసుకునేందుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి బిడ్లను స్వీకరించనుంది బీసీసీఐ. అయితే ఇంతకు ముందు కొత్తగా ఒక జట్టును సొంతం చేసుకోవాలంటే కనీస ధరగా రూ. 1700 కోట్లుగా నిర్ణయించింది. ‘అయితే ప్రస్తుతం బీసీసీఐ యాక్షన్ ప్లాన్‌లో మార్పులు చోటు చేసుకున్నాయని, ఒక్కో జట్టుకు బేస్ ప్రైస్‌గా రూ. 2000 కోట్లను నిర్ణయించబోతున్నట్టు’ పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీసీసీఐ ప్రతినిధి పీఐటీ వార్త సంస్థకు తెలియజేశారు. ఈ మార్పుతో బీసీసీఐకి కనీసం రూ.5000 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. టర్నోవర్ రూ. 3000 కోట్లు దాటితేనే కొత్త జట్లను సొంతం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా అనేక కార్పొరేట్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే బీసీసీఐ నిబంధనలు వీరికి అడ్డుగా ఉన్నాయి.ఐపీఎల్ జట్టును సొంతం చేసుకోవాలనుకునే కంపెనీ వార్షిక టర్నోవరు కనీసం రూ.3000 కోట్లు దాటి ఉండాలని బీసీసీఐ పేర్కొంటోంది. ఐపీఎల్ బిడ్డింగ్ పత్రాలను రూ. 75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కన్సార్టియంలకు అవకాశం బ్రాండ్ ప్రచారానికి విపరీతమైన హైప్ తెచ్చిపెట్టే ఐపీఎల్ జట్టును కొనేందుకు ఎక్కువ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నా బేస్ ప్రైస్ ఎక్కువగా ఉండటం ఇబ్బందిగా మారింది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు రెండు లేదా మూడు కంపెనీలు కలిసి కన్సార్టియంగా ఏర్పడి బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. అయితే గరిష్టంగా మూడు కంపెనీలకే అవకాశం కల్పించాలని యోచిస్తోంది. కొత్తగా ఇక్కడేనా ? అహ్మదాబాద్, లక్నో, పుణే ఈ మూడింటిలో రెండింటికి కొత్తగా టీమ్‌లు వచ్చే అవకాశం ఉంది. ఇందులో పుణే, గుజరాత్ల పేరుతో గతంలో ఐపీఎల్ టీమ్‌లు కొనసాగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లో అందుబాటులోకి రావడంతో అహ్మదాబాద్‌కి అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు సమాచారం. ఇక లక్నో ఎక్నా స్టేడియం కెపాసిటీ కూడా ఎక్కువే. అదాని, ఆర్పీజీ సంజీవ్ గోయెంకా గ్రూప్‌లతో పాటు ప్రముఖ ఫార్మా, బ్యాంకింగ్ కంపెనీలు ఐపీఎల్ జట్టును సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. చదవండి : Zomato: యాడ్ల దుమారం, మండిపడుతున్న నెటిజనులు -
వైజాగ్ స్టీల్ ’అడ్వైజర్ల’ బిడ్డింగ్‌కు గడువు పొడిగింపు
ఉక్కునగరం (గాజువాక): వైజాగ్ స్టీల్ (ఆర్ఐఎన్ఎల్) ప్రైవేటీకరణ ప్రక్రియ నిర్వహణకు సంబంధించిన లావాదేవీ సలహాదారుల (అడ్వైజర్లు) బిడ్డింగ్‌కు గడువును ఆగస్టు 26 వరకూ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు పొడిగించడం ఇది రెండోసారి. వాస్తవానికి జూలై 28కి గడువు ముగియాల్సి ఉండగా దాన్ని తర్వాత ఆగస్టు 17కి, అటుపైన తాజాగా ఆగస్టు 26కి పొడిగించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం వాటాల విక్రయానికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి లావాదేవీ సలహాదారుల నియామకం కోసం పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) జూలై 7న బిడ్లు (ఆర్ఎఫ్పీ) ఆహ్వానించింది. -
‘కోకాపేట’కు కోట్లకు కోట్లు: ఒక్క ఎకరం రూ.60 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కోకాపేటలోని సర్కారు భూముల వేలం సరికొత్త రికార్డులు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కోకాపేటలోని 49.949 ఎకరాల భూములకు ఆన్లైన్ ద్వారా వేలం నిర్వహించగా, ఓ ప్లాట్‌లో ఎకరం ఏకంగా రూ.60.2 కోట్ల గరిష్ట బిడ్డింగ్ ధర పలికింది. అతి తక్కువ ధర రూ.31.2 కోట్లుగా నమోదైంది. మొత్తం 49.949 ఎకరాలకుగాను, ఒక్కో ఎకరం సగటున రూ.40.05 కోట్ల ధరకు అమ్ముడు బోయింది. ప్రభుత్వం ఎకరానికి రూ.25 కోట్ల కనీస ధర (అప్సెట్ ప్రైస్)ను ఖరారు చేయగా, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కళ్లు చెదిరే భారీ ధరలతో ప్లాట్లు అమ్ముడుబో యాయి. ఈ ప్లాట్లన్నీ రియల్ ఎస్టేట్ సంస్థలే కొనుగోలు చేయడం గమనార్హం. కాగా కోకాపేట హాట్‌కేక్ అనే విషయం ఈ వేలం స్పష్టం చేసింది. అప్పుడు మిగిలిపోయిన ప్లాట్ కోకాపేట భూములకు హెచ్ఎండీఏ గురువారం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ వేదికగా ఈ–వేలం నిర్వహించింది. ఇందులో ఏడు ప్లాట్లు నియోపోలీస్ లేఅవుట్‌వి కాగా ఒక ప్లాట్ గోల్డెన్ మైల్ ప్రాజెక్టుకు సంబంధించినది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 30.778 ఎకరాలతో కూడిన 4 ప్లాట్లు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిగిలిన 19.171 ఎకరాల 4 ప్లాట్లకు వేలం జరిగింది. గోల్డెన్ మైల్ ప్రాజెక్టుకు చెందిన ‘2/పీ వెస్ట్ పార్ట్’ ప్లాట్ నంబర్లో 1.65 ఎకరాలుండగా, ఎకరానికి రూ.60.2 కోట్ల గరిష్ట బిడ్డింగ్ ధరను కోట్ చేసి, మొత్తం రూ.99.33 కోట్ల ధరతో ‘రాజపుష్ప రియాల్టీ ఎల్ఎల్పీ’ అనే స్థిరాస్తి వ్యాపార సంస్థ ఆ ప్లాట్‌ను దక్కించుకుంది. గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో 2007లో నాటి ప్రభుత్వం కోకాపేటలోని ప్రభుత్వ భూములకు వేలం నిర్వహించగా, అప్పట్లో మిగిలిపోయిన ఈ ప్లాట్‌కు తాజాగా నిర్వహించిన వేలంలో రికార్డు ధర పలకడం గమనార్హం. వేలంలో ఎకరాకు రూ.31.2 కోట్ల అతి తక్కువ బిడ్డింగ్ ధరతో ప్లాట్ నంబర్–‘ఏ’ లోని ఎకరం భూమిని హైమ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. కనీస బిడ్డింగ్ ఇంక్రిమెంట్ ధర ఎకరానికి రూ.20 లక్షల లెక్కన బిడ్డర్లు భూముల ధరలు పెంచుతూ పోయారు. ఆలస్యమైనా కాసుల వర్షం హెచ్ఎండీఏకు కోకాపేటలో ఉన్న 634 ఎకరాల్లో 167 ఎకరాలను గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో 100 ఎకరాలను, ఎంపైర్–1, ఎంపైర్–2 పేరుతో 67 ఎకరాలను 2007లో వేలం ద్వారా విక్రయించారు. అప్పుడు కూడా ఎకరానికి అత్యధికంగా రూ.14.25 కోట్ల ధర పలికింది. అయితే ఈ భూముల విషయంలో వివాదం నెలకొని చాలా ఏళ్ల పాటు సాగింది. 2017లో కోకాపేటలోని భూములన్నీ హెచ్‌ఎండీఏవేనని, వాటిని విక్రయించే హక్కు దానికే ఉందని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో వివాదం సమసింది. అయితే 2007లో వేలం వేసిన 167 ఎకరాలు పోనూ ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్‌కు 110 ఎకరాలు, వివిధ కులసంఘాలకు 55 ఎకరాలు కేటాయించారు. మిగిలిన దాదాపు 300 ఎకరాల స్థలంలో అభివృద్ధి చేసిన సువిశాల రోడ్లు పోనూ మిగిలిన 110 ఎకరాల్లో.. తాజాగా 49.94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లను విక్రయించారు. కోర్టు వివాదంతో ఇన్నాళ్లూ ఆలస్యమైనా భారీగా రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు అంటున్నారు. ఎప్పటికప్పుడు సీఎంవోకు.. కోకాపేట భూముల ఆన్లైన్ వేలానికి వచ్చిన స్పందనను ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు తెలుసుకుంది. అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఎంఎస్టీసీ-ఈ కామర్స్ టెక్నికల్ విభాగ సిబ్బంది నిర్వహించిన ఈ ప్రక్రియను సంస్థ కమిషనర్, పురపాలక శా>ఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ పర్యవేక్షించారు. వేలానికి వచ్చిన స్పందనను ఎప్పటికప్పుడు సీఎంవోకు నివేదించారు. కోకాపేట భూములను వేలంలో దక్కించుకోవడానికి దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలతో పాటు ప్రవాస భారతీయులు ఆసక్తి చూపారు. పెట్టుబడులకు కేంద్రంగా మారిన హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని తాజాగా నిర్వహించిన కోకాపేట భూముల వేలం రుజువు చేసింది. దాదాపు 60 మంది బిడ్డర్లు దేశ విదేశాల నుంచి ఈ వేలంలో పాల్గొన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. -
దివాలా తీసిన డీహెచ్ఎఫ్ఎల్, ఇక పిరమల్ గ్రూపే దిక్కా?!
ముంబై: దివాలా తీసిన డీహెచ్ఎఫ్ఎల్ కొనుగోలుకు పిరమల్ గ్రూప్ వేసిన బిడ్డింగ్ సోమవారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం పొందింది. అయితే కొన్ని షరతులకు లోబడి ఈ ఆమోదం ఉంటుందని హెచ్‌పీ చతుర్వేది, రవికుమార్ దురైస్వామిలతో కూడిన ట్రిబ్యునల్ ముంబై బెంచ్ స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చే తుది తీర్పునకు అలాగే డీహెచ్ఎఫ్ఎల్ ఒకప్పటి ప్రమోటర్ కపిల్ వాధ్వాన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం రూలింగ్‌కు లోబడి తమ రూలింగ్ ఉంటుందని ఎన్సీఎల్టీ డివిజినల్ బెంచ్ స్పష్టం చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ కొనుగోలు ప్రతిపాదనలకు పిరమల్ గ్రూప్‌నకు ఈ ఫిబ్రవరిలో ఆర్బీఐ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. కాంపిటీషన్ కమిషన్ నుంచి ఏప్రిల్‌లో అనుమతి లభించింది. సీఓసీకి సూచన: కాగా ఆమోదిత పరిష్కార ప్రణాళిక (రిజల్యూషన్ ప్లాన్) కింద చిన్న స్థాయి స్థిర డిపాజిట్ హోల్డర్లకు మరింత డబ్బును ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని డీహెచ్ఎఫ్ఎల్ రుణదాతల కమిటీ (సీఓసీ)కి ఎన్సీఎల్టీ బెంచ్ తన ఉత్తర్వుల్లో సూచించింది. రిజల్యూషన్ ప్రణాళి కా ప్రతిని తనకు అందించాలన్న కపిల్ వాధ్వాన్ విజ్ఞప్తిని సైతం ఎన్సీఎల్టీ తిరస్కరించింది. పూర్వాపరాల్లోకి వెళితే... వాధ్వాన్ ఇచ్చిన ఆఫర్‌ను పరిశీలించాలని డీహెచ్ఎఫ్ఎల్ రుణ గ్రహీతలకు ఎన్సీఎల్టీ ఇచ్చిన ఆదేశాలపై మే 25న ఎన్సీఎల్ఏటీ స్టే ఇచ్చింది. రుణదాతల కమిటీ తరఫున యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన అప్పీలేట్ ట్రిబ్యునల్ ఈ రూలింగ్ ఇచ్చింది. అయితే సీఓసీల పరిష్కార ప్రణాళికను ఆమోదించడంపై ఎన్సీఎల్టీ నిర్ణయానికి అడ్డురాబోమని స్పష్టం చేసింది. దీనిపై వాధ్వాన్ దాఖలు చేసిన అప్పీల్ సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెండింగులో ఉంది. వాధ్వాన్ గతేడాది స్వయంగా రుణ దాతల కమిటీకి సెటిల్మెంట్ ఆఫర్ ఇచ్చారు. అయితే దీనికి విశ్వసనీయత లేదని సీఓసీ ఈ ఆఫర్‌ను తిరస్కరించింది. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్‌సహా కంపెలో పలువురు స్థిర డిపాజిట్ హోల్డర్లకు డీహెచ్ఎఫ్ఎల్ దాదాపు రూ.90,000 కోట్లు చెల్లించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. డీలిస్టింగ్‌కు అవకాశం! కాగా పిరమల్ గ్రూప్ కొనుగోళ్ల ప్రక్రియ అనంతరం డీహెచ్ఎఫ్ఎల్ మార్కెట్ల నుంచి డీలిస్టయ్యే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాలు, ఐబీసీ నిబంధనల ప్రకారం పిరమల్ గ్రూప్ గూటికి చేరిన తర్వాత డీహెచ్ఎఫ్ఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి డీలిస్టయ్యే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వార్తలతో డీహెచ్ఎఫ్ఎల్ షేరు ఎన్ఎస్ఈలో 10% జంప్‌చేసి రూ. 20.80 వద్ద ముగిసింది. చదవండి : బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ -
కేజీ–డీ6 గ్యాస్ కోసం గట్టి పోటీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బీపీకి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌లో ఉత్పత్తి చేసే గ్యాస్ కోసం ఇటీవల నిర్వహించిన వేలంలో బిడ్డింగ్ తీవ్ర స్థాయిలో జరిగింది. దాదాపు 14 సంస్థలు సుమారు ఏడున్నర గంటల పాటు బిడ్డింగ్‌లో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గెయిల్ గ్యాస్, అదానీ టోటల్, టోరెంట్ గ్యాస్, షెల్, ఐజీఎస్ తదితర సంస్థలతో పాటు రిలయన్స్‌కి చెందిన ఓ2సీ వ్యాపార విభాగం వీటిలో ఉన్నాయి. కేజీ–డీ6 బ్లాక్‌లోని కొత్త క్షేత్రాల నుంచి అదనంగా ఉత్పత్తి చేసే సహజ వాయువుకు సంబంధించి మే 5న ఈ వేలం నిర్వహించారు. 3–5 ఏళ్ల పాటు రోజుకు 5.5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ను వేలం వేశారు. అంతిమంగా రిలయన్స్ ఓ2సీ అత్యధికంగా 3.2 ఎంసీఎండీ గ్యాస్‌ను దక్కించుకుంది. రిలయన్స్–బీపీ జాయింట్ వెంచర్ సంస్థ ఐజీఎస్ 1 ఎంసీఎండీ, అదానీ గ్యాస్ 0.15 ఎంసీఎండీ, ఐఆర్ఎం ఎనర్జీ 0.10 ఎంసీఎండీ, గెయిల్ (రోజుకు 30,000 ఘనపు మీటర్లు), టోరెంట్ గ్యాస్ (రోజుకు 20,000 ఘనపు మీటర్లు) మిగతా సహజ వాయువును దక్కించుకున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) ఆమోదించిన థర్డ్ పార్టీ స్వతంత్ర ప్లాట్‌ఫాంపై రిలయన్స్–బీపీ గ్యాస్ వేలం నిర్వహించడం ఇది మూడోసారి. క్రిసిల్ రిస్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ (క్రిస్) రూపొందించిన ఈ ఆన్లైన్ బిడ్డింగ్ ప్లాట్‌ఫాంను ఈ ఏడాది ఫిబ్రవరితో పాటు 2019లో నిర్వహించిన వేలానికి కూడా ఉపయోగించారు. కేజీ–డీ6 బ్లాక్‌లోని కొత్త క్షేత్రాలకు సంబంధించి 3 విడతలుగా నిర్వహించిన వేలంలో రిలయన్స్–బీపీ మొత్తం 18 ఎంసీఎండీ గ్యాస్ విక్రయించింది. -
స్పెక్ట్రం బిడ్డింగ్‌కు రూ. 13,475 కోట్ల డిపాజిట్
న్యూఢిల్లీ: రాబోయే విడత స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు టెలికం సంస్థలు మొత్తం రూ. 13,475 కోట్ల డిపాజిట్ (ఈఎండీ) సమర్పించాయి. రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 10,000 కోట్లు, భారతి ఎయిర్టెల్ రూ. 3,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 475 కోట్ల ఈఎండీ ఇచ్చాయి. టెలికం శాఖ (డాట్) గురువారం ఈ వివరాలు వెల్లడించింది. మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే స్పెక్ట్రం వేలం నిబంధనల ప్రకారం దీని ఆధారంగానే నిర్దిష్ట పరిమాణం స్పెక్ట్రం కోసం పోటీపడేందుకు అనుమతిస్తారు. మొత్తం అన్ని స్పెక్ట్రం బ్లాకుల కోసం బిడ్ చేయాలంటే రూ. 48,141 కోట్ల ఈఎండీ చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే వేలంలో పెద్దయెత్తున స్పెక్ట్రం అమ్ముడు కాకపోవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
ఎయిరిండియాపై టాటా గురి..
న్యూఢిల్లీ: ఆర్థిక భారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్, ఎయిరిండియా ఉద్యోగులు బరిలోకి దిగారు. బిడ్డింగ్‌కు ఆఖరు తేదీ అయిన సోమవారం నాడు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) సమర్పించారు. దశాబ్దాల క్రితం తాము వదులుకోవాల్సిన వచ్చిన ఎయిరిండియాను దక్కించుకోవాలని భావిస్తున్న టాటా గ్రూప్.. తమకు మెజారిటీ వాటాలు ఉన్న మరో విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియా ద్వారా ఈవోఐ దాఖలు చేసినట్లు సమాచారం. అయితే, టాటా గ్రూప్ స్వంతంగా బిడ్ చేసిందా లేక కన్సార్షియం తరఫున చేసిందా అన్నది వెల్లడి కాలేదు. దీనిపై స్పందించడానికి టాటా గ్రూప్ నిరాకరించింది. మరోవైపు, ఎయిరిండియాకు చెందిన సుమారు 219 మంది ఉద్యోగుల బృందం.. అమెరికాకు చెందిన ఇంటరప్స్ అనే ఫండ్‌తో కలిసి కన్సార్షియంగా ఏర్పడి ఈవోఐ దాఖలు చేసింది. ఉద్యోగులు తలో రూ. 1 లక్ష వేసుకుని కన్సార్షియంలో 51 శాతం వాటా తీసుకోగా, మిగతా 49 శాతం వాటా ఇంటరప్స్‌కి ఉంది. అర్హత పొందిన బిడ్డర్లకు జనవరి 6 లోగా సమాచారం ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆయా సంస్థలు ఆర్థిక బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ‘‘ఎయిరిండియాలో వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించి పలు ఈవోఐలు దాఖలయ్యాయి. ఇక రెండో దశ మొదలవుతుంది’’ అని పెట్టుబడులు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అయితే, ఎన్ని బిడ్లు వచ్చాయి, ఏయే సంస్థలు దాఖలు చేశాయన్నది మాత్రం వెల్లడించలేదు. ఎయిర్ఏషియా ద్వారా ఎందుకంటే... టాటా గ్రూప్ ప్రస్తుతం రెండు విదేశీ సంస్థలతో కలిసి రెండు విమానయాన సంస్థలను నిర్వహిస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తార, మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియాతో కలిసి ఎయిర్ఏషియా ఇండియాను నడుపుతోంది. తమ ఆర్థిక సమస్యల కారణంగా మరిన్ని నిధులు పెట్టలేమంటూ ఎయిర్ఏషియా చేతులెత్తేయడంతో ఎయిర్ఏషియా ఇండియాలో టాటా గ్రూప్ ఇటీవలే తన వాటాలను 51 శాతానికి పెంచుకుంది. ఇక కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో భారీగా నష్టపోయిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ .. సొంత కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రస్తుతం నిధులు సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. తామే సంక్షోభ పరిస్థితుల్లో ఉండగా.. మరింత సంక్షోభంలో ఉన్న ఎయిరిండియాపై ఇన్వెస్ట్ చేసేందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆసక్తి చూపలేదు. దీంతో ఎయిర్ఏషియా ఇండియా ద్వారా టాటా గ్రూప్ ఈవోఐ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా విక్రయానికి మూడేళ్లుగా యత్నాలు.. 2007లో దేశీయంగా సేవలు అందించే ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో విలీనం అయినప్పట్నుంచీ ఎయిరిండియా నష్టాల్లోనే కొనసాగుతోంది. తీవ్ర ఆర్థిక భారంతో కుంగుతున్న ఎయిరిండియాను విక్రయించేందుకు 2017 నుంచి కేంద్రం ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యపడటం లేదు. 2019 మార్చి 31 నాటికి ఎయిరిండియా రుణభారం రూ. 60,074 కోట్లుగా ఉంది. ఇప్పటిదాకా నిర్వహించిన బిడ్డింగ్ ప్రతిపాదనల ప్రకారం చూస్తే .. ఎయిరిండియాను కొనుగోలు చేసిన సంస్థ దాదాపు రూ. 23,286 కోట్ల రుణభారాన్నీ తీసుకోవాల్సి వచ్చేది. మిగతాదాన్ని ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్స్ (ఏఐఏహెచ్ఎల్) అనే స్పెషల్ పర్పస్ సంస్థకు బదలాయించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టింది. అయితే, కొనుగోలుదారులెవరూ దీనిపై ఆసక్తి చూపలేదు. దీంతో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100% వాటాలు, ఎయిరిండియా ఎస్ఏటీఎస్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో 50% వాటా విక్రయ ప్రతిపాదనతో బిడ్లు ఆహ్వానించింది. టాటా ఎయిర్‌లైన్స్ నుంచి ఎయిరిండియాగా.. టాటా గ్రూప్ 1932 అక్టోబర్‌లో టాటా ఎయిర్‌లైన్స్‌ను ఏర్పాటు చేసింది. పారిశ్రామిక దిగ్గజం జేఆర్డీ టాటా దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1946లో దీని పేరు ఎయిరిండియాగా మారింది. 1953లో ప్రభుత్వం ఈ సంస్థను జాతీయం చేయడంతో టాటా గ్రూప్ చేజారింది. అయితే, 1977 దాకా జేఆర్డీ టాటానే చైర్మన్‌గా కొనసాగారు. ఆ తర్వాత టాటా సన్స్ పలుమార్లు విమానయాన సంస్థను ప్రారంభించేందుకు ప్రయత్నించింది. 1995లో సాధ్యపడలేదు. అటుపైన 2001లో ఎయిరిండియా కోసం బిడ్ చేసినా .. ప్రభుత్వం విక్రయించకూడదని నిర్ణయించుకోవడంతో కుదరలేదు. ఈ పరిణామాలతో 2013లో టాటా గ్రూప్ విదేశీ సంస్థలతో కలిసి విస్తార, ఎయిర్ఏషియా ఇండియా ఏర్పాటు చేసింది. తాజాగా తాము ఆరంభించిన కంపెనీని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
ఐపీఎల్ కొత్త స్పాన్సర్ డ్రీమ్ 11
ముంబై : ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించి స్పాన్సర్షిప్ హక్కుల నుంచి వివో తప్పుకున్నప్పటి నుంచి తరువాతి స్పాన్సర్ ఎవరా అన్న విషయంపై ఉత్కంఠ వీడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్‌కు సంబంధించి స్పాన్సర్షిప్ హక్కులను 250 కోట్ల రూపాయలకు డ్రీమ్ 11 కంపెనీ దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే డ్రీమ్ 11తో పాటు అన్ అకాడమీ(రూ. 210 కోట్లు), టాటాసన్స్ (రూ. 180 కోట్లు), బైజూస్ (రూ. 125 కోట్ల)తో బిడ్ వేసి పోటీ పడగా.. 250 కోట్ల రూపాయలతో డ్రీమ్11 ఐపీఎల్ 2020కి సంబంధించి స్పాన్సర్షిప్ హక్కులను పొందింది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది. చదవండి : ‘సచిన్‌లానే.. ధోనికి వీడ్కోలు ఉంటుంది’ 2018-22 ఏళ్ల మధ్య ఐదేళ్ల కాలానికి గానూ వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే గల్వాన్ ఘర్షణ అనంతరం చైనాకు చెందిన వస్తువులను బహిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం తెలపడంతో చైనాకు చెందిన వివో ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగింది. దీంతో ఐపీఎల్ 2020కి సంబంధించి కొత్త స్పాన్సర్ ఎవరు వస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. స్పాన్సర్షిప్ హక్కుల కోసం రిలయన్స్ జియో, బైజూస్, టాటాసన్స్, అన్ అకాడమీ, డ్రీమ్ 11 వంటి పెద్ద సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు 250 కోట్ల రూపాయలతో డ్రీమ్11 మూడు నెలల కాలానికి గానూ ఐపీఎల్ 2020 స్పాన్సర్షిప్ హక్కులను పొందింది. కాగా ఇదే డ్రీమ్ 11కు గతంలో 2018లో టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. కాగా దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 13వ సీజన్ షురూ కానుంది. -
ఎయిర్ఇండియా దక్కేది వీరికే..?
సాక్షి, న్యూఢిల్లీ : నష్టాలతో సతమతమవుతున్న ఎయిర్ఇండియాలో నూరు శాతం వాటా విక్రయానికి ఇన్వెస్టర్ల నుంచి ప్రభుత్వం సోమవారం ప్రిలిమినరీ బిడ్లను ఆహ్వానిస్తుండటంతో ఎయిర్‌లైన్‌ను ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎయిర్ఇండియాను కొనుగోలుకు మొగ్గుచూపే బయ్యర్లు ఈ ఏడాది మార్చి 17 నాటికి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)కు స్పందించాల్సి ఉంటుంది. ఎయిర్ఇండియాను చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్, హిందూజాలు, ఇండిగో, స్పైస్‌జెట్ సహా కొన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు పోటీ పడవచ్చని భావిస్తున్నారు. మరోవైపు దేశీ విమానయాన సంస్థలతో కలిసి కొన్ని విదేశీ ఎయిర్‌లైన్స్ కూడా సంయుక్త బిడ్ల ద్వారా బిడ్డింగ్ ప్రక్రియలో పాలుపంచుకునే అవకాశం ఉంది. ఎయిర్ఇండియా పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోవడంతో పాటు ఆర్థిక మందగమనం వంటి ప్రతికూల పరిస్థితులున్నా ఎయిర్ఇండియాకు విస్తృతంగా ఉన్న దేశీ, విదేశీ నెట్వర్క్..లండన్, దుబాయ్ వంటి కీలక విదేశీ విమానాశ్రయాల్లో ట్రాఫిక్ రైట్స్, స్లాట్లు, సాంకేతిక సిబ్బంది కలిగి ఉండటం, పెద్ద సంఖ్యలో విమానాలు ఉండటంతో కొనుగోలుదారులు టేకోవర్‌కు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎయిర్‌లైన్ వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోవాలని భావిస్తుండటంతో కొనుగోలుదారులు లేవనెత్తే డిమాండ్లను అంగీకరించి విక్రయ ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు పంపుతోందని ఖతార్ ఎయిర్వేస్ ఇండియా మాజీ చీఫ్ రాజన్ మెహ్రా పేర్కొన్నారు. కాగా ఎయిర్ఇండియా ప్రస్తుతం రోజుకు సగటును రూ 20-25 కోట్ల నష్టంతో నడుస్తోంది. చదవండి : బీపీసీఎల్, ఎయిరిండియా విక్రయం -
‘బొగ్గు’లో సంస్కరణల బాజా
న్యూఢిల్లీ: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచడంతో పాటు మరింతగా పెట్టుబడులు ఆకర్షించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంది. గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957, బొగ్గు గనులు (స్పెషల్ ప్రొవిజన్స్) చట్టం 2015లో సవరణలను సవరిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం.. బొగ్గుయేతర సంస్థలు కూడా బొగ్గు గనుల బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. అలాగే, అంతిమంగా బొగ్గు వినియోగంపైనా ఆంక్షలు ఉండవు. కేంద్ర క్యాబినెట్ భేటీ అనంతరం బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయాలు వెల్లడించారు. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా కనీస అర్హత గల ఏ కంపెనీ అయినా బొగ్గు గనుల వేలంలో పాల్గొనవచ్చు. ఈ కొత్త నిబంధనల కింద జనవరిలోనే తొలి విడత వేలం నిర్వహించనున్నట్లు బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ జైన్ చెప్పారు. మొదటి విడతలో 40 బొగ్గు బ్లాకుల దాకా వేలం వేయనున్నట్లు వివరించారు. మరోవైపు, మార్చి 31తో మైనింగ్ లీజు ముగిసిపోయే ముడి ఇనుము, ఇతర ఖనిజాల గనుల వేలాన్ని గడువులోగా నిర్వహించే ప్రతిపాదనకు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. కోల్ ఇండియాకూ మద్దతు ఉంటుంది.. అవకతవకల ఆరోపణల కారణంగా.. 2014లో సుప్రీం కోర్టు 204 బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేసింది. అయితే, అంతిమంగా వినియోగించే అంశానికి సంబంధించి పరిమితుల కారణంగా వాటిలో కేవలం 29 బ్లాకులను మాత్రమే వేలం వేయడం జరిగింది. తాజాగా ఆంక్షలను ఎత్తివేయడంతో మిగతా బ్లాకుల వేలానికీ మార్గం సుగమం అవుతుందని జోషి చెప్పారు. ఈ రంగంలో పోటీని పెంచేందుకు, బొగ్గు దిగుమతులను తగ్గించుకునేందుకు, ప్రభుత్వ రంగ కోల్ ఇండియా గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు కూడా ఈ చర్యలు ఉపయోగపడనున్నట్లు జైన్ చెప్పారు. అలాగని కోల్ ఇండియా ప్రాధాన్యాన్ని తగ్గించే యోచనేదీ లేదని, దాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. 2023 నాటికి 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు దానికి తగినన్ని బ్లాక్‌లు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు, 334 నాన్–క్యాప్టివ్ ఖనిజ గనుల లీజు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిపోనుంది. ఇవి మూతబడితే దాదాపు 60 మిలియన్ టన్నుల ముడి ఇనుము కొరత ఏర్పడవచ్చని జోషి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉత్పత్తికి కోత పడకుండా గడువులోగా ఖనిజాల గనుల వేలాన్ని కూడా నిర్వహించాలని.. బిడ్డింగ్‌లో గెలుపొందిన సంస్థకు ఇతరత్రా అటవీ, పర్యావరణ అనుమతులు కూడా బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. దీని వల్ల రెండేళ్ల సమయం ఆదా అవుతుందని, ఎలాంటి అవరోధాలు లేకుండా ఉత్పత్తి యథాప్రకారంగా కొనసాగుతుందని చెప్పారు. అత్యంత భారీ సంస్కరణలు: ప్రధాన్ వాణిజ్య అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తి చేసేందుకు 2018లో ప్రైవేట్ కంపెనీలకూ అనుమతినిచ్చినప్పటికీ.. బొగ్గుపరిశ్రమయేతర సంస్థలను వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించలేదు. తాజా మార్పుచేర్పులు బొగ్గు పరిశ్రమలో అత్యంత భారీ సంస్కరణలని చమురు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు. కేంద్ర నిర్ణయాన్ని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ స్వాగతించారు. ‘ఏటా 15 బిలియన్ డాలర్లకు పైగా ఉంటున్న బొగ్గు దిగుమతులను తగ్గించుకోవడానికి గణనీయంగా ఉపయోగపడుతుంది. చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుల తరుణంలో.. ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధికి తోడ్పడుతుంది‘ అని జిందాల్ చెప్పారు. అంతిమ వినియోగంపై ఆంక్షల ఎత్తివేత నిర్ణయం.. దేశీయంగా బొగ్గు నిల్వల వెలికితీతకు, మరిన్ని విదేశీ సంస్థలు ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పడగలదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ చెప్పారు. బొగ్గు మైనింగ్ ఆర్డినెన్స్‌ను ఉక్కు పరిశ్రమ స్వాగతించింది. బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది తోడ్పడగలదని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ పేర్కొంది. ఈ సంస్కరణల ఊతంతో దేశీ ఉక్కు పరిశ్రమ .. అంతర్జాతీయ స్థాయిలో మరింతగా పోటీపడగలదని తెలిపింది. నీలాచల్ ఇస్పాత్ విక్రయానికీ గ్రీన్‌సిగ్నల్.. ఉక్కు సంస్థ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ (ఎన్ఐఎన్ఎల్)లో ఆరు ప్రభుత్వ రంగ సంస్థల వాటాల వ్యూహాత్మక విక్రయానికి కూడా కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ విషయాన్ని తెలిపారు. ఎన్ఐఎన్ఎల్లో ఎంఎంటీసీ, ఎన్ఎండీసీ, బీహెచ్ఈఎల్, ఎంఈసీవోఎన్, ఐపీఐసీవోఎల్, ఒడిషా మైనింగ్ కార్పొరేషన్లకు వాటాలు ఉన్నాయి. మరోవైపు, నీలాచల్ ఇస్పాత్‌లో వాటాల విక్రయ ప్రతిపాదనను ఉక్కు రంగ కార్మికుల సమాఖ్య ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ ఖండించింది. భూషణ్ స్టీల్, ఆధునిక్ స్టీల్ వంటి ప్రైవేట్ రంగ సంస్థలు మూతబడుతుంటే ప్రభుత్వ రంగంలోని సంస్థలు మెరుగ్గానే పనిచేస్తున్నాయని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.కె. దాస్ చెప్పారు. వాటాల విక్రయ ప్రతిపాదనలను ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే కార్మికులు సమ్మెకు దిగేందుకు సిద్ధమని తెలిపారు. -
మంచిరోజులు వస్తాయంటున్న జెట్ ఫౌండర్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంతో మూసివేత అంచుకు చేరిన జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసే బిడ్డర్ మరికొన్ని రోజుల్లో ముందుకొస్తారని జెట్ ఎయిర్వేస్ వ్యవస్ధాపకుడు నరేష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. బిడ్డింగ్‌కు తుదిగడువు ఈనెల 10న ముగుస్తుండగా వచ్చే వారంలోనే బిడ్డర్‌ను బ్యాంకులు ఖరారు చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జెట్ ఎయిర్వేస్ 26వ వార్షికోత్సవమైన మే 5 (ఆదివారం) తన జీవితంలో అత్యంత విచారకరమైన రోజని ఆయన సంస్థ ఉద్యోగులు రాసిన లేఖలో పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా మే 5 సంస్థ ఉద్యోగుల్లో ప్రత్యేక స్ధానం ఏర్పరచుకుందని, అయితే ఈ ఏడాది మాత్రం అది అత్యంత విచారకరమైన రోజుగా గడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు 1993, ఏప్రిల్ 18న తాము ముంబైలో తొలి విమానాన్ని అందుకోగా, ఈ ఏడాది ఏప్రిల్ 18న తాము అమృత్సర్ నుంచి ముంబైకి చివరి విమానం నడపడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. జెట్ ఎయిర్వేస్ను కాపాడేందుకు తాను తన భార్య నీతా చివరినిమిషం వరకూ ప్రయత్నించామని, మార్చి 25న బోర్డు నుంచి వైదొలగడంతో పాటు తన కంపెనీల్లో ఒక కంపెనీ నుంచి రూ 250 కోట్లు సమకూర్చానని, ఎయిర్‌లైన్‌లో తన షేర్లను తనఖా పెట్టానని ఆయన చెప్పుకొచ్చారు. కాగా జెట్ ఎయిర్వేస్ను దక్కించుకునేందుకు ఎతిహాద్ ఎయిర్వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్టనర్స్, ఎన్ఐఐఎఫ్ ఆసక్తి కనబరుస్తున్నాయి. -
జెట్‌కు ఐబీసీ వెలుపలే పరిష్కారం
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ బిడ్డింగ్ ప్రక్రియ సఫలం కాకపోతే, ఈ సమస్యను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)కు వెలుపలే పరిష్కరించుకోవాలన్న యోచనతో బ్యాంకులు ఉన్నాయి. జెట్‌కు రూ.8,500 కోట్లకు పైగా రుణాలు ఇచ్చి, వాటి వసూలు కోసం సంస్థను అధీనంలోకి తీసుకున్న ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ... సంస్థను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. సంస్థకు అత్యవసంగా అవసరమైన నిధులను సైతం సమకూర్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో మొత్తం కార్యకలాపాలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియ విజయవంతం అవుతుందని బ్యాంకులు ఎంతో ఆశతో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ బిడ్డింగ్ ప్రక్రియ సఫలం కాకపోతే ప్లాన్ బి (ఐబీసీ వెలుపల పరిష్కారం) దిశగా పనిచేయనున్నట్టు పేర్కొన్నాయి. ఐబీసీ కింద అయితే పరిష్కారానికి ఎన్సీఎల్టీ ఆమోదం అవసరం. పైగా ఈ ప్రక్రియ మార్కెట్ స్పందనపై ఆధారపడి, సమయం తీసుకుంటుంది. జెట్‌కు ఉన్న విమానాలు, ఇతర ఆస్తులను విక్రయించడమే ప్లాన్ బిగా పేర్కొన్నాయి. ఎతిహాద్ ఎయిర్వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్నర్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ జెట్ ఎయిర్వేస్లో వాటాల పట్ల ఆసక్తి ప్రదర్శించినట్టు సమాచారం. అయితే, బిడ్డర్ల సమాచారం మే 10న అధికారికంగా తెలియనుంది. జెట్ ఆగిపోవడం ఓ స్కామ్: ఆనంద్‌శర్మ జెట్‌ఎయిర్‌వేస్ కూలిపోవడం ఓ స్కామ్‌గా కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్‌శర్మ ఆరోపించారు. ఎన్నికల ముందు ఇది చోటు చేసుకోవడంతో ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇదో పెద్ద స్కామ్‌గా నాకు అనిపిస్తోంది. ఎన్నికల సమయంలో దీన్ని అమలు చేశారు. దీంతో ఎవరూ ప్రశ్నించరు’’ అని శర్మ అన్నారు. ఎయిర్‌లైన్స్‌కు కావాల్సిన అత్యవసర నిధులను అందించేందుకు రుణదాతల కమిటీ తిరస్కరించడంపై సందేహాలు వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ పరిష్కారం కాదు: ఏఐ ఉద్యోగులు ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని ఎయిర్ ఇండియా ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రైవేటు రంగంలోని జెట్ ఎయిర్వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడిన ఘటనలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొంది. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తన ప్రణాళికలపై తక్షణమే పునరాలోచన చేయాలని ఎయిర్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏసీఈయూ) సీనియర్ అధికారి పేర్కొన్నారు. జెట్‌ఎయిర్‌వేస్ 20,000 మంది ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడుతూ... ప్రభుత్వ విధానాలు విమానయాన పరిశ్రమలో సంక్షోభానికి, ఉద్యోగాల నష్టానికి కారణమవుతున్న నేపథ్యంలో వీటిపై పునఃపరిశీలన అవసరమని సూచించారు. ‘‘మొదట కింగ్‌ఫిషర్, ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ప్రైవేటీకరణ కార్యక్రమం వల్ల అర్థం చేసుకోవాల్సినది ఏమంటే... జాతీయీకరణను తొలగించడం ఒక్కటే లాభాలు, సామర్థ్యాన్ని తెచ్చిపెట్టలేవు’’అని ఆ అధికారి పేర్కొన్నారు. -
జెట్‌కు త్వరలోనే కొత్త ఇన్వెస్టర్!
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్లో వాటాల విక్రయానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ విజయవంతమవుతుందని రుణాలిచ్చిన సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ‘సంస్థ విలువను సముచితంగా, పారదర్శకంగా మదింపు చేసేలా బిడ్ ప్రక్రియ విజయవంతం అవుతుందని రుణదాతలు ఆశావహంగా ఉన్నారు’ అని బ్యాంకర్ల కన్సార్షియం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. దాదాపు రూ. 8,000 కోట్ల పైగా రుణభారంతో కుంగుతున్న జెట్‌కు ఊపిరినిచ్చేలా అత్యవసరంగా రూ. 400 కోట్లు సమకూర్చడానికి బ్యాంకులు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం రాత్రి నుంచి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. జెట్ యాజమాన్యాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న 26 బ్యాంకుల కన్సార్షియం.. 75 శాతం దాకా వాటాలను విక్రయించేందుకు బిడ్లను పిలిచింది. ఎతిహాద్ ఎయిర్వేస్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ, ఎన్ఐఐఎఫ్, ఇండిగో పార్ట్నర్స్ సంస్థలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. ఇవి మే 10 లోగా తుది బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. భారీగా పతనమైన జెట్ షేరు... కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో గురువారం జెట్ ఎయిర్వేస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఏకంగా 32 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో 32.23 శాతం క్షీణతతో రూ. 163.90 వద్ద జెట్ షేరు క్లోజయ్యింది. ఒక దశలో 34.62 శాతం దాకా తగ్గి రూ. 158.10 (52 వారాల కనిష్టం) స్థాయికి కూడా పడిపోయింది. మరోవైపు ఎన్ఎస్ఈలో జెట్ షేర్లు 31 శాతం క్షీణించి రూ. 165.75 వద్ద క్లోజయ్యాయి. బీఎస్ఈలో 60.41 లక్షలు, ఎన్ఎస్?లో 5 కోట్ల షేర్లు చేతులు మారాయి. రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,111 కోట్ల మేర క్షీణించి రూ. 1,862 కోట్లకు పడిపోయింది. 5 విమానాలు లీజుకు తీసుకుంటాం: ఎయిరిండియా జెట్ ఎయిర్వేస్కి చెందిన అయిదు విమానాలను లీజుకు తీసుకోవాలని యోచిస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌కు ప్రభుత్వ రంగ ఎయిరిండియా సీఎండీ అశ్వని లొహానీ లేఖ రాశారు. జెట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించే ఉద్దేశంతో.. వీటిని లండన్, దుబాయ్, సింగపూర్ రూట్లలో నడపాలని భావిస్తున్నట్లు ఏప్రిల్ 17న రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. బోయింగ్ 777 రకానికి చెందిన అయిదు విమానాలను పరస్పరం ఆమోదయోగ్యమైన షరతులు బట్టి లీజుకు తీసుకోవాలని భావిస్తున్నట్లు లొహానీ తెలిపారు. విమాన సర్వీసుల రద్దుతో విదేశాల్లో నిల్చిపోయిన జెట్ ఎయిర్వేస్ ప్రయాణికుల సౌకర్యార్థం సాధారణ చార్జీలు కాకుండా ప్రత్యేక చార్జీలను వర్తింప చేస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. ఇతర సంస్థలకు జెట్ స్లాట్స్.. జెట్ విమానాల రద్దు కారణంగా ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో నిరుపయోగంగా మారిన 440 స్లాట్స్‌ను తాత్కాలికంగా ఇతర ఎయిర్‌లైన్స్‌కు కేటాయించనున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆయా విమానాశ్రయాల అధికారులతో కూడిన కమిటీ కేటాయింపులను నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ వ్యవధి మూడు నెలల పాటు ఉంటుందన్నారు. ముంబైలో 280 స్లాట్స్, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 160 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయని వివరించారు. వచ్చే మూడు నెలల్లో ఇతర ఎయిర్‌లైన్స్ మరో 30 విమానాలను సమకూర్చుకుంటున్నాయని ఖరోలా చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: ఉద్యోగ యూనియన్ల విజ్ఞప్తి కింగ్‌ఫిషర్ తరహాలో జెట్ ఎయిర్వేస్ కూడా మూతబడకుండా చూసేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని జెట్ అధికారులు, ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. కంపెనీలో చోటు చేసుకున్న పరిణామాల వెనుక దురుద్దేశాలు ఉన్నాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎన్సీపీ పార్టీ శాసనసభ్యుడు కిరణ్ పవాస్కర్ డిమాండ్ చేశారు. 16,000 మంది పర్మనెంట్ ఉద్యోగులపై ప్రభావం పడుతోందని, సర్వీసులను రద్దు చేసే ముందుగా వారి జీతాల బకాయిలను ఎందుకు చెల్లించలేదో కంపెనీ వివరణ ఇవ్వాలన్నారు. -
ఎయిర్‌పోర్ట్‌ల ప్రైవేటీకరణ ప్రక్రియ ముమ్మరం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలో ఉన్న ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతమైంది. వీటి నిర్వహణ కోసం పది కంపెనీల నుంచి మొత్తం 32 సాంకేతిక బిడ్స్‌ను ఏఏఐ స్వీకరించింది. గౌహతి, తిరువనంతపురం, లక్నో, మంగళూర్, అహ్మదాబాద్, జైపూర్ విమానాశ్రయాల నిర్వహణ, ఆపరేషన్స్, అభివృద్ధి కోసం అంతర్జాతీయ బహిరంగ బిడ్డింగ్ ప్రక్రియ కింద బిడ్లను ఆహ్వానించింది. ఈ ఆరు విమానాశ్రయాల నిర్వహణ కోసం మొత్తం పది కంపెనీల నుంచి 32 సాంకేతిక బిడ్స్ అందాయని ఏఏఐ వర్గాలు వెల్లడించాయి. సాంకేతిక బిడ్స్‌కు ఈ నెల 14 ఆఖరు తేదీ కాగా, ఈనెల 28న ఫైనాన్షియల్ బిడ్స్‌ను ఏఏఐ తెరవనుంది. గెలుపొందిన బిడ్డర్ల వివరాలను ఈనెల 28న ఏఏఐ వెల్లడిస్తుంది. ప్రయాణీకులు సహా వివిధ భాగస్వాములకు అంతర్జాతీయ మౌలిక వసతులు కల్పించేందుకు ఈ ఆరు విమానాశ్రయాలను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో అభివృద్ధిపరచేందుకు ఏఏఐ ఈ చర్యలు చేపట్టింది. -
వేలానికి ‘2.ఓ’
ఒక చిత్రాన్ని వేలంలో కొనుగోలు చేయడం అన్నది అరుదైన విషయం. ఇంతకు అలా ఒకటి రెండు చిత్రాలకు జరిగింది. తాజాగా ఆ పరిస్థితి సూపర్‌స్టార్ చిత్రానికి నెలకొందని తెలుస్తోంది. రజనీకాంత్ చిత్రం అంటేనే యమ క్రేజ్ ఉంటుంది. దానికి స్టార్ దర్శకుడు శంకర్ తోడైతే ఆ చిత్రం స్థాయే వేరుగా ఉంటుంది. ఇక నిర్మాణంలో భారీ స్థాయికి మారు పేరుగా నిలిచిన లైకా సంస్థ నిర్మాణం అయితే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయని చెప్పనవసరం లేదు. ఆ చిత్రమే 2.ఓ. రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్, నటి ఎమిజాక్సన్, ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న చిత్రం 2.ఓ. దర్శకుడు శంకర్ అద్భుత ప్రతిభకు నిదర్శనంగా నిలవనున్న చిత్రం ఇది. సుమారు రూ.500 కోట్ల అత్యంత భారీ బడ్జెట్లో ఇండియాలోనే తొలి భారీ బడ్జెట్ చిత్రంగా 2.ఓ నమోదు కానుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వంటి సాంకేతిక పరిజ్ఙానం హాలీవుడ్ చిత్రాలను తలదన్నేవిధంగా ఉంటుందంటున్నారు. చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలకు అధిక ప్రాముఖ్యత ఉంటుందని, ప్రతి సన్నివేశం ప్రేక్షకులు అబ్బురపడేలా ఉంటుందని చిత్ర వర్గాలంటున్నారు. కాగా చిత్రాన్ని నవంబర్ 29న విడుదల చేయనున్నట్లు లైకా సంస్థ నిర్వాహకులు ఇది వరకే వెల్లడించారు. తాజాగా చిత్ర దర్శకుడు శంకర్ కూడా ఆ తేదీని ఖరారు చేస్తూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పుడి వరకూ 2.ఓ చిత్రంపై రకరకాల ప్రచారం జరుగుతూ వచ్చింది. తాజాగా చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఏరియాకు 10 మంది చొప్పున బయ్యర్లు పోటీ పడుతున్నారని సమాచారం. దీంతో చిత్ర వర్గాలు 2.ఓ చిత్రాన్ని వేలం పద్ధతిలో అమ్మకాలు జరపడానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. కాగా రజనీకాంత్ నటిస్తున్న మరో చిత్రం పేట కూడా శుక్రవారంతో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష తొలిసారిగా రజనీకాంత్‌తో జతకడుతున్న చిత్రం పేట. దీన్ని వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్ తదుపరి ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్నారనే ప్రచారం జోరందుకుంది. -
ఎయిరిండియా బిడ్డింగ్‌కు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో వాటాల విక్రయానికి సంబంధించిన బిడ్డింగ్ తుది గడువును కేంద్రం మే 31 దాకా పొడిగించింది. వాటాల విక్రయానికి సంబంధించిన సందేహాలు నివృత్తి చేస్తూ వివరణలిచ్చింది. ఎయిర్‌లైన్ ఉద్యోగులతో పాటు ఇతరత్రా ఎవరూ వ్యక్తిగత స్థాయిలో బిడ్ చేయడానికి లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) దాఖలు చేసేందుకు మే 14 ఆఖరు తేదీ. తాజా సవరణల ప్రకారం ఆర్హత పొందిన బిడ్డర్ల పేర్లను మే 29న కాకుండా జూన్ 15న ప్రకటిస్తారు. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిరిండియాలో 76 శాతం వాటాలతో పాటు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, సింగపూర్‌కి చెందిన శాట్స్‌తో జాయింట్ వెంచర్ సంస్థ ఏఐ శాట్స్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
నెలాఖరుకు 12 ఎన్పీఏ ఆస్తులకు బిడ్డింగ్: ఎస్బీఐ
న్యూఢిల్లీ: బ్యాంకులకు రూ.1.75 లక్షల కోట్ల మేర రుణాలను ఎగవేసిన 12 ఎన్పీఏ ఖాతాలకు సంబంధించి ఆస్తుల బిడ్డింగ్ ప్రక్రియ ఈ నెలాఖరుకు ముగుస్తుందని ఎస్బీఐ తెలిపింది. 12 కేసుల్లో ఆరింటికి ఎస్బీఐ లీడ్ బ్యాంకర్‌గా ఉంది. ‘‘ఎలక్ట్రోస్టీల్, మోనెత్ ఇస్పాత్‌కు సంబంధించిన ఫైనాన్షియల్ బిడ్లు ఇప్పటికే వచ్చేశాయి. మిగిలిన కేసుల్లోనూ బిడ్లు వస్తాయని ఆశిస్తున్నాం’’ అని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ (ఐబీసీ) చట్టం కింద ఎన్సీఎల్టీ ముందు పెండింగ్‌లో ఉన్న ఇతర కేసుల్లో ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్, ల్యాంకో ఇన్ఫ్రా, అలోక్ ఇండస్ట్రీస్, ఆమ్టెక్ ఆటో, ఎరా ఇన్ఫ్రా, జేపీ ఇన్ఫ్రాటెక్, ఏబీజీ షిప్‌యార్డ్, జ్యోతి స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒక్కోటీ రూ.5,000 కోట్లకుపైగా రుణాలను ఎగవేసిన 12 భారీ ఎన్పీఏ కేసులను ఆర్బీఐ సలహా కమిటీ గతేడాది జూన్‌లో గుర్తించిన విషయం తెలిసిందే. దేశ బ్యాంకింగ్ రంగ ఎన్‌పీఏల్లో ఈ 12 ఖాతాల మొత్తమే 20–25 శాతంగా ఉంది. -
1996 కారు.. రూ. 97 లక్షలు..
మన ఇళ్లలో పాత వస్తువులను చూసిచూసి చెత్తలో పారేయాలంటే మనసొప్పదు.. ఊరికే పారేయలేక ఎంతోకొంత రేటు వస్తే దాన్ని అమ్మడానికి చూస్తారు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా పాత వస్తువులను అమ్మగా చేతికి ముట్టిన కొద్ది సొమ్ముతో సంతోషంగానే ఉంటారు. కానీ అనుకున్నదాని కంటే ఊహించని రీతిలో రేటు పలికితే ఎగిరి గంతేస్తాం కదా! సరిగ్గా అలాగే అమెరికా లాస్‌ఏంజెలిస్‌లోని ఒక అబ్బాయి అదే పనిచేశాడు. 21 ఏళ్ల తన ప్రియురాలి హోండా ఆకార్డ్ కారును అమ్మకానికి పెట్టాడు. అంత పాత కారును ఎవరైనా సహజంగా తీసుకోవడానికి వెనుకాడుతారు. కానీ విచిత్రంగా చాలామంది ఆ కారు కోసం ఎగబడ్డారు. దీనికోసం అతను చేసిందల్లా కాస్తా హాస్యాస్పదంగా అందరినీ ఆకట్టుకునేలా ఒక వాణిజ్య యాడ్‌ను రూపొందించడమే! ఆ వాహనానికి ‘గ్రీనీ’ అని ముద్దు పేరు పెట్టి ఈ–కామర్స్ వెబ్సైట్ ‘ఈబే’లో అమ్మకానికి పెట్టాడు. ఆ యాడ్ వీడియోను సుమారు 40 లక్షల మంది వీక్షించారు. గ్రీనీకి అత్యధికంగా రూ. 97.41 లక్షల రేటు పలికింది. అయితే ఇంత రేటు ఊహించని ఈబే అక్రమ బిడ్డింగ్‌గా పేర్కొంటూ ఆ కారు వేలంను మూసేసింది. 1996 మోడల్‌కి చెందిన ఈ హోండా ఆకార్డ్ కారు ఇప్పటివరకు 1,41,095 మైళ్లు తిరగడం గమనార్హం.. అంత దూరం తిరిగినా అత్యధిక రేటు పలకడం ఆశ్చర్యమే కదా!!! -
బినామీలు బలే!
► మద్యం టెండర్లల్లో భారీగా పేదలు ► కూలి పనికి వెళ్లే వారి చేత ఐటీ రిటర్న్స్ దాఖలు ► రేషన్ కార్డు, ఇతర సంక్షేమ పథకాలు రద్దయ్యే అవకాశం ప్రొద్దుటూరు క్రైం: మద్యం టెండర్లలో ఈసారి బినామీల హవా ఎక్కువగా ఉంది. చాలా మంది మద్యం వ్యాపారులు తమ బినామీల పేర్ల మీద టెండర్లు వేయించారు. భారీ ఎత్తున పోటీ నెలకొనడంతో మద్యం వ్యాపారులు, సిండికేట్లు ఎలాగైనా తమ షాపులను నిలబెట్టుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలోపనిగా తమ వద్ద పనిచేసే పనివార్ల పేరుతో దరఖాస్తులు భారీగా దాఖలు చేయించారు. ఇదే ఇప్పుడు వారి కొంప ముంచనుంది. వివరాల్లోకి వెళితే..జిల్లాలో 255 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా 29వ తేదీ సాయంత్రం వరకు 1,900 దరఖాస్తులు వచ్చాయి. 30వ తేదీ (గురువారం) సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇచ్చిన గడువును మరో మూడు గంటలుపెంచి 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో గడువులోగా 3,654 దరఖాస్తులు అందాయి. 31 మధ్యాహ్నం 2 గంటల నుంచి జెడ్పీ ఆవరణంలో కలెక్టర్ సమక్షంలో లక్కీ డిప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయిస్తారు. కూలి పనికి వెళ్లే వారి చేత ఐటీ రిటర్న్స్ దాఖలు: ఈసారి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలనే నిబంధన వస్తుందని పసిగట్టిన కొందరు వ్యాపారులు తమ అనుమాయులకు పాన్‌కార్డులను ఇప్పించారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న 12-15 రోజుల్లోనే పాన్‌కార్డు జారీ చేస్తున్నారు. వీరిలో చాలామంది కూలి పనికి వెళ్తున్న వారు ఉన్నట్లు సమాచారం. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునే వారు ఈఎండీ కింద రూ.3 లక్షలు డీడీ తీయాల్సి ఉంది. ఒకరి పేరు మీదనే ఎక్కువ మొత్తంలో డీడీ తీస్తే ఐటీశాఖతో సమస్య వస్తుందని భావించిన మద్యం వ్యాపారులు తమ ఇళ్లల్లో పనిచేసే వారు, బంధువుల పేరు మీద దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. గత రెండు మూడు రోజుల నుంచి ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి వ్యాపారులు పెద్దఎత్తున వస్తున్నారు. వీరిలో కూలి పనికి వెళ్లేవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రూ.లక్షల్లో వీరు ఆదాయం చూపించడంతో భవిష్యత్తులో వారి రేషన్‌కార్డు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈపాస్‌తో పాటు ఆధార్‌కార్డు కూడా నమోదు చేస్తుండటంతో వారికి దక్కే ప్రభుత్వ లబ్ధి పూర్తిగా రద్దు అయ్యే అవకాశం ఉందని తెలియడంతో బినామీలు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారిపై ఐటీ అధికారులు కూడా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో వారి చిట్టా బయటికి తీసే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు: ఒక్క ప్రొద్దుటూరు ఎక్సైజ్ డివిజన్ పరిధిలో సుమారు 105 మద్యం షాపులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు ఉన్న మద్యం షాపులను తొలగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నూతన మద్యం విధానంతో టెండర్లకు శ్రీకారం చుట్టింది. 105 షాపుల్లో 90 శాతం 500 మీటర్లలోపు ఉన్నాయి. జిల్లాలో ప్రొద్దుటూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపులకు మంచి డిమాండు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ 22 మద్యం షాపులు, 8 బార్లు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపునకు సుమారు 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. రాజుపాళెం, చాపాడు మండలాల్లోని దుకాణాలకు ఎక్కువ డిమాండు ఉన్నట్లు సమాచారం. 22 షాపులకు 450 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. -
2022 కామన్వెల్త్ గేమ్స్ బిడ్డింగ్‌కు దూరం
న్యూఢిల్లీ: 2022 కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు బిడ్డింగ్ వేసే ఆలోచన లేదని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా దేశాలు గేమ్స్ నిర్వహణకు ఆసక్తి చూపుతున్నాయని, ఈ సమయంలో ప్రతిపాదనలు పంపడం కూడా సరికాదని అన్నారు. వాస్తవానికి ఈ గేమ్స్ దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో జరగాల్సి ఉన్నా ఆర్థిక కారణాలతో తాము నిర్వహించలేమని చేతులెత్తేశారు. ‘2022 గేమ్స్ కోసం చాలా దేశాలే వరుసలో ఉన్నాయి. అయినా డర్బన్ అశక్తత వ్యక్తం చేసినా ఇంకా అధికారికంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించలేదు. ఇప్పటికీ కామన్వెల్త్ గేమ్స్ కమిటీ దక్షిణాఫ్రికాతో చర్చలు జరుపుతోంది. లండన్, మాంచెస్టర్, బర్మింగ్హమ్లో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఇంగ్లం డ్ చెబుతోంది. ఇలాంటి చివరి దశలో ఐఓఏ బిడ్డింగ్‌కు ప్రతిపా దిండం ఆమోదయోగ్యం కాదు’ అని కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్‌ను కలిసిన అనంతరం రామచంద్రన్ తెలి పారు. మల్టీ స్పోర్ట్స్ ఈవెం ట్స్‌ను నిర్వహించేందుకు మాత్రం బిడ్ వేసే ఆలోచన ఉందని చెప్పారు. 90 రోజుల వ్యవధిలోనే శాఫ్ గేమ్స్ నిర్వహించి విజయవంతమయ్యామని ఆయ న గుర్తుచేశారు. మరోవైపు ఈనెల 25 నుంచి 31 వరకు ఢిల్లీ గ్రామీణ్ ఖేల్ మహోత్సవ్ క్రీడలు జరుగుతాయని మంత్రి విజయ్ గోయల్ తెలిపారు. -
గ్రీస్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు రేసులో జీఎంఆర్
• ప్రాజెక్టు విలువ సుమారు • 850 మిలియన్ యూరోలు • గ్రీస్ సంస్థతో కలసి బిడ్డింగ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ గ్రూప్ తాజాగా గ్రీస్‌లోని క్రీట్లో కొత్త విమానాశ్రయ ప్రాజెక్టు దక్కించుకోవడంపై దృష్టి పెట్టింది. గ్రీస్‌కు చెందిన జీఈకే టెర్నా సంస్థతో కలసి కన్సార్షియంగా ఏర్పడి బిడ్ వేసినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా వెల్లడించింది. గ్రీస్ మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం ప్రాజెక్టు విలువ సుమారు 850 మిలియన్ యూరోలని (దాదాపు రూ. 6,120 కోట్లు) వివరించింది. కాంట్రాక్టు కింద క్రీట్లోని హెరాక్లియోన్ నగరంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయ డిజైన్, అభివృద్ధి, నిర్వహణ, తత్సంబంధిత రహదారుల ఏర్పాటు మొదలైన అంశాలు ఉంటాయి. ఒప్పందం 35 ఏళ్ల పాటు ఉంటుంది. దీనికి దాఖలైన ఏకైక బిడ్ తమదేనని భావిస్తున్నట్లు జీఎంఆర్ తెలిపింది. ప్రాజెక్టు దక్కిన పక్షంలో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సంస్థ విమానాశ్రయ ఆపరేటరుగా ఉంటుంది. ఏటా 2.4 కోట్ల మంది టూరిస్టులు గ్రీస్‌ను సందర్శిస్తారని అంచనా. గ్రీస్‌లోనే అతి పెద్ద దీవి అయిన క్రీట్‌ను సందర్శించే వారి సంఖ్య భారీగా ఉంటుంది. ఇక్కడి హెరాక్లియోన్ విమానాశ్రయం గ్రీస్‌లో రెండో పెద్ద ఎయిర్‌పోర్టు. అయితే, సామర్థ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నందున ప్రభుత్వం మరో విమానాశ్రయాన్ని తలపెట్టింది. కొత్త ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుత విమానాశ్రయాన్ని మూసివేయనున్నారని జీఎంఆర్ వర్గాలు తెలిపాయి. జీఎంఆర్ గ్రూప్ ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది. ఇటీవలే గోవాలోని మోపా ఎయిరోడ్రోమ్ అభివృద్ధి, నిర్వహణ ప్రాజెక్టు దక్కించుకుంది. అఉట మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్‌తో కలసి ఫిలిప్పీన్స్‌లోని మక్టాన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. మరోవైపు, గ్రీస్‌లోని రెండు దిగ్గజ నిర్మాణ కంపెనీలైన జీఈకే, టెర్నాల విలీనంతో జీఈకే టెర్నా గ్రూప్ ఏర్పడింది. నిర్మాణం, ఇంధన ఉత్పత్తి, మైనింగ్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి. -
రూ. 3 లక్షల కోట్లు!
అంచనాలు మించుతున్న బొగ్గు, స్పెక్ట్రం వేలం ఆదాయం - 32 బొగ్గు బ్లాకులతో రూ. 2 లక్షల కోట్లు - స్పెక్ట్రం వేలంతో మరో రూ. 1 లక్ష కోట్లు న్యూఢిల్లీ: ఒకవైపు బొగ్గు బ్లాకులు వేలం, మరోవైపు టెలికం స్పెక్ట్రం వేలం అంచనాలను మించే స్థాయిలో సాగుతున్నాయి. వీటితో ఇప్పటిదాకా ప్రభుత్వానికి ఏకంగా రూ. 3 లక్షల కోట్ల పైచిలుకు మొత్తం సమకూరినట్లయింది. బొగ్గు, స్పెక్ట్రం కుంభకోణాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గతంలో వేసిన లెక్కలకు మించి ఇది ఉండటం గమనార్హం. ఈ రెండింటి వేలం ఇంకా కొనసాగుతోంది. టెలికం స్పెక్ట్రం వేలానికి సంబంధించి బిడ్లు సోమవారం నాటికి రూ. 94,000 కోట్లకు చేరుకున్నాయి. అటు రెండో విడత బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించి అయిదో రోజున మరో రెండు బ్లాకులు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ. 11,000 కోట్లు రానున్నాయి. దీంతో బొగ్గు బ్లాకుల వేలం ద్వారా రాయల్టీలు, చెల్లింపులు మొదలైన వాటి రూపంలో రూ. 2.07 లక్షల కోట్లు వచ్చినట్లవుతుంది. యూపీఏ హయాంలో బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా కేటాయించడం వల్ల ప్రభుత్వానికి రూ. 1.86 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గతంలో అంచనా వేసిన దానికంటే తాజా వేలంలో ఖజానాకు మరింత అధికంగా ఆదాయం రానుండటం గమనార్హం. కుంభకోణానికి కేంద్ర బిందువులైన 204 బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీం కోర్టు కొన్నాళ్ల క్రితం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కేవలం 32 బ్లాకులను విక్రయిస్తేనే ఏకంగా రూ. 2.07 లక్షల కోట్లు వ స్తున్నాయని బొగ్గు శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. దీని వల్ల విద్యుత్ చార్జీలు తగ్గడంతో పాటు ఒడిషా తదితర రాష్ట్రాలకు లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం రాగలదన్నారు. ఇక స్పెక్ట్రం వేలానికి సంబంధించి సోమవారం నాడు ఏడు రౌండ్లు జరిగాయి. దీంతో మొత్తం 31 రౌండ్లు పూర్తయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ముంబై, ఢిల్లీ సర్కిళ్లలో 3జీ స్పెక్ట్రం వేలానికి ఇప్పటిదాకా బిడ్డింగ్ రాలేదు. -
తూకంలో తిరకాసు!
కందుకూరు రూరల్ : పామూరు రోడ్డులో ఉన్న 27వ పొగాకు వేలం కేంద్రంలో కాటాలో భారీ వ్యత్యాసాలు వస్తున్నాయి. సోమవారం వలేటివారిపాలెం చుండి క్లస్టర్‌కు చెందిన రైతులు పొగాకు బేళ్లను వేలానికి తెచ్చారు. కొందరు రైతులు ఇళ్ల వద్ద బేళ్లను కాటా వేసుకుని తీసుకొచ్చారు. వేలం కేంద్రం వద్ద కాటా వేసి బిడ్డింగ్‌లో పెడతారు. కాటా వేసిన బేళ్లను పరిశీలించిన రైతులు తూకంలో తేడా వచ్చినట్లు గుర్తించారు. 147 కిలోలు ఉండాల్సిన బేలు వేలం కేంద్రం వద్ద కాటాలో 131 కిలోలు మాత్రమే తూగింది. గమనించిన రైతులు తిరిగి కాటా వేయించాలని ముఠా కూలీలపై ఒత్తిడి తెచ్చారు. రైతులందరూ ఈ విషయంపై పట్టుబట్టారు. దీంతో వేలం నిర్వహణాధికారి శ్రీనివాసులనాయుడు బేళ్లను మళ్లీ కాటా వేయించారు. ముగ్గురు రైతులకు సంబంధించిన బేళ్లలో తేడాలు కనిపించాయి. ఆగ్రహించిన రైతులు ఇలా ఎన్ని బేళ్లలో తేడాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలా రోజూ జరుగుతోందా అని అధికారులను నిలదీశారు. అధికారులు, ముఠా కూలీలు, సిబ్బంది కుమ్మక్కై ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఎలక్ట్రానిక్ కాటా కావడంతో రైతులు తూకంలో తేడాను కనిపెట్టలేకపోతున్నారని, దీనిని ఆసరాగా చేసుకుని సిబ్బంది మోసాలకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ కాటాలో తేడా : శ్రీనివాసులనాయుడు, వేలం నిర్వహణాధికారి ఎలక్ట్రానిక్ కాటాలో తేడా వల్ల ఇలా జరిగింది. విధుల్లో అశ్రద్ధగా ఉండే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. రైతులకు ఎలాంటి నష్టం జరగదు. తూకంలో భారీ తేడా వచ్చింది : కామినేని నరసింహం, రైతు, చుండి ఒక బేలు తూకం 131 కిలోలు వచ్చింది. అనుమానం వచ్చి తిరిగి కాటా వేయిస్తే 147 కిలోలు ఉంది. ఈ విషయమై ఎవరిని ప్రశ్నించినా మాకు తెలియదంటున్నారు. రైతులను మోసం చేస్తున్నారు : ఎం.రాఘవయ్య, రైతు ఒక బేలు 139 కిలోలు ఉంటే 103 కిలోలు మాత్రమే చూపించారు. రైతులను మోసం చేయడం అన్యాయం. దీనిపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. -
2జీ స్పెక్ట్రం వేలం నేటి నుంచే
బిడ్డింగ్ బరిలో 8 టెలికం కంపెనీలు న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం వేలం నేటి నుంచి (సోమవారం) షురూ కానుంది. 1,800; 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్‌లలో స్పెక్ట్రం వేలాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది టెలికం కంపెనీలు... భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో, ఐడియా, టెలీవింగ్స్ (యూనినార్), ఆర్‌కామ్, టాటా టెలీసర్వీసెస్, ఎయిర్‌సెల్‌లు బిడ్డింగ్‌లో పోటీపడనున్నాయి. వేలం ద్వారా ఖజానాకు కనీసం 11,300 కోట్లు లభించవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో మొత్తం 10 సర్కిళ్లలో తొలుత 403 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం వేలానికి ప్రతిపాదించగా.. దీన్ని ప్రస్తుతం 385 మెగాహెర్ట్జ్‌కు తగ్గించారు. కాగా, 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 46 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను వేలానికి పెట్టనున్నారు. 2జీ స్కామ్ కారణంగా 2012 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు మొత్తం 122 స్పెక్ట్రం లెసైన్స్‌లను రద్దు చేసి మళ్లీ వేలం నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి 2 సార్లు 2జీ వేలం జరిగింది. తాజా వేలం మూడోది. 2012 నవంబర్‌లో రూ.28,000 కోట్ల విలువైన స్పెక్ట్రంను వేలానికి పెట్టగా.. కేవలం 9,407 కోట్లే ప్రభుత్వానికి లభించాయి. ఇక గతేడాది మార్చిలో జీఎస్ఎం టెల్కోలు వేలంలోనే పాల్గొనలేదు. సీడీఎంఏ ఆపరేటర్ సిస్టెమా శ్యామ్ 8 సర్కిళ్లలో రూ.3,800 కోట్లకు స్పెక్ట్రంను దక్కించుకుంది. వేలం ఆరంభ ధరలు ఇలా... 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో దేశవ్యాప్త లెసైన్స్‌కు ఒక్కో మెగాహెర్ట్జ్‌కు ఆరంభ(బేస్) ధరను ప్రభుత్వం 1,765 కోట్లుగా నిర్దేశించింది. ఇది మార్చిలో జరిగిన వేలం బేస్ ప్రైస్‌తో పోలిస్తే 26% తక్కువ. ఇక 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో కూడా 53% తక్కువగా రేట్లను ఖరారు చేశారు. ఢిల్లీలో ఒక్కో మెగాహెర్ట్జ్‌కు రూ.360 కోట్లు, ముంబైలో రూ.328 కోట్లు, కోల్‌కతాలో రూ.125 కోట్ల చొప్పున బేస్ రేట్లను నిర్ణయించారు. రానున్న వేలంలో దక్కించుకునే స్పెక్ట్రంకు వార్షిక వాడకం చార్జీని టెల్కోల స్థూల ఆదాయంలో 5%గా ప్రభుత్వం ఖాయం చేయడం తెలిసిందే. ట స్టే ఇచ్చేందుకు సుప్రీం నో ప్రభుత్వం చేపట్టనున్న స్పెక్ట్రం వేలాన్ని నిలిపేసేలా స్టే ఇవ్వాలన్న టెల్కోల వాదనలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. వేలంపై స్టేతోపాటు మరో పదేళ్లు తమ లెసైన్స్‌లను పొడిగించాలంటూ భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, లూప్, ఐడియాలు దాఖలు చేసిన పిటిషన్లను టెలికం ట్రిబ్యునల్(టీడీశాట్) గత నెల 31న కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ వొడాఫోన్, ఎయిర్‌టెల్‌లు సుప్రీంను ఆశ్రయించాయి. ఆదివారం అత్యవసరంగా దీన్ని విచారించిన జస్టిస్ ఏఆర్ దవే, ఎస్ఏ బాబ్డేల ధర్మాసనం టీడీశాట్ తీర్పుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.