
న్యూఢిల్లీ: బ్యాంకులకు రూ.1.75 లక్షల కోట్ల మేర రుణాలను ఎగవేసిన 12 ఎన్‌పీఏ ఖాతాలకు సంబంధించి ఆస్తుల బిడ్డింగ్ ప్రక్రియ ఈ నెలాఖరుకు ముగుస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. 12 కేసుల్లో ఆరింటికి ఎస్‌బీఐ లీడ్ బ్యాంకర్‌గా ఉంది. ‘‘ఎలక్ట్రోస్టీల్, మోనెత్ ఇస్పాత్‌కు సంబంధించిన ఫైనాన్షియల్ బిడ్లు ఇప్పటికే వచ్చేశాయి. మిగిలిన కేసుల్లోనూ బిడ్లు వస్తాయని ఆశిస్తున్నాం’’ అని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు.
ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ (ఐబీసీ) చట్టం కింద ఎన్‌సీఎల్‌టీ ముందు పెండింగ్‌లో ఉన్న ఇతర కేసుల్లో ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్, ల్యాంకో ఇన్‌ఫ్రా, అలోక్ ఇండస్ట్రీస్, ఆమ్టెక్ ఆటో, ఎరా ఇన్‌ఫ్రా, జేపీ ఇన్‌ఫ్రాటెక్, ఏబీజీ షిప్‌యార్డ్, జ్యోతి స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒక్కోటీ రూ.5,000 కోట్లకుపైగా రుణాలను ఎగవేసిన 12 భారీ ఎన్‌పీఏ కేసులను ఆర్‌బీఐ సలహా కమిటీ గతేడాది జూన్‌లో గుర్తించిన విషయం తెలిసిందే. దేశ బ్యాంకింగ్ రంగ ఎన్‌పీఏల్లో ఈ 12 ఖాతాల మొత్తమే 20–25 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment