న్యూఢిల్లీ: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి పనితీరు పరంగా రాణించింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని లాభం రూ.3,645 కోట్లతో పోల్చి చూసినప్పుడు 11 శాతం పెరిగి రూ.4,028 కోట్లకు చేరింది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.11,530 కోట్ల నుంచి రూ.11,820 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రూ.7,690 కోట్ల మూలధన వ్యయాలను వినియోగించింది.
డిసెంబర్ త్రైమాసికంలో ఆరు అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ప్రాజెక్టులను బిడ్డింగ్‌లో గెలుచుకుంది. వీటి నిర్మాణ అంచనా వ్యయం రూ.20,479 కోట్లుగా ఉంది. డిసెంబర్ చివరికి పవర్‌గ్రిడ్ సంస్థ నిర్వహణలోని ట్రాన్స్‌మిషన్ ఆస్తుల నిడివి 1,76,530 సర్క్యూట్ కిలోమీటర్లుగా ఉంది. అలాగే, 276 సబ్ స్టేషన్లు, 5,17,860 మెగావోల్ట్ యాంపియర్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రెండో మధ్యంతర డివిడెండ్ కింద రూ.4.50 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment