Transmission
-
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ రూ. 4.50 డివిడెండ్
న్యూఢిల్లీ: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి పనితీరు పరంగా రాణించింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని లాభం రూ.3,645 కోట్లతో పోల్చి చూసినప్పుడు 11 శాతం పెరిగి రూ.4,028 కోట్లకు చేరింది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.11,530 కోట్ల నుంచి రూ.11,820 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రూ.7,690 కోట్ల మూలధన వ్యయాలను వినియోగించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఆరు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్రాజెక్టులను బిడ్డింగ్‌లో గెలుచుకుంది. వీటి నిర్మాణ అంచనా వ్యయం రూ.20,479 కోట్లుగా ఉంది. డిసెంబర్ చివరికి పవర్‌గ్రిడ్ సంస్థ నిర్వహణలోని ట్రాన్స్మిషన్ ఆస్తుల నిడివి 1,76,530 సర్క్యూట్ కిలోమీటర్లుగా ఉంది. అలాగే, 276 సబ్ స్టేషన్లు, 5,17,860 మెగావోల్ట్ యాంపియర్స్ ట్రాన్స్ఫార్మేషన్ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రెండో మధ్యంతర డివిడెండ్ కింద రూ.4.50 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. -
అదానీ ట్రాన్స్మిషన్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ ట్రాన్స్మిషన్ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 8,500 కోట్లు సమకూర్చుకోనుంది. ఇందుకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారుల నుంచి అనుమతి పొందినట్లు కంపెనీ వెల్లడించింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(ప్లేస్మెంట్) ద్వారా పెట్టుబడులు సమీకరించనున్నట్లు పేర్కొంది. 2023 మే 15కల్లా ఈక్విటీ షేర్లు లేదా ఏ ఇతర అర్హతగల సెక్యూరిటీల జారీని చేపట్టనున్నట్లు తెలియజేసింది. గత నెల(మే) 13న నిధుల సమీకరణ ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేయగా.. వాటాదారుల నుంచి తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ను పొందినట్లు కంపెనీ వివరించింది. -
ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీలను ఎత్తేసిన కేంద్రం..
న్యూఢిల్లీ: ఆఫ్‌షోర్ పవన, గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ప్రాజెక్టులపై ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ చార్జీలను ఎత్తివేస్తూ 25 ఏళ్లపాటు ఉపశమనాన్ని కేంద్ర సర్కారు కల్పించింది. 2032 డిసెంబర్ 31 వరకు కార్యకలాపాలు ప్రారంభించే ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్/గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. కర్బన ఉద్గారాల నియంత్రణకు, పర్యావరణ అనుకూల ఇంధనాల తయారీకి మద్దతుగా కేంద్ర సర్కారు తీసుకుంటున్న ఎన్నో చర్యల్లో దీన్ని కూడా ఒక భాగంగా చూడొచ్చు. ఇదీ చదవండి: Electric Scooters: ఈరోజే కొంటే రూ.32 వేల వరకు ఆదా! రేపటి నుంచి పెరగనున్న ధరలు -
అదానీ పోర్ట్స్ లాభం ఫ్లాట్.. 30 శాతం పెరిగిన మొత్తం ఆదాయం
న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ సెజ్(ఏపీసెజ్) గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 1,141 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,112 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం మరింత అధికంగా 30 శాతం వృద్ధితో రూ. 6,179 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 4,739 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 3,497 కోట్ల నుంచి రూ. 3,994 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. పూర్తి ఏడాదికి సైతం మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఏపీసెజ్ దాదాపు 9 శాతం అధికంగా రూ. 5,393 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2021–22లో రూ. 4,953 కోట్ల లాభం నమోదైంది. ఫలితాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం నీరసించి రూ. 734 వద్ద ముగిసింది. అదానీ ట్రాన్స్మిషన్ లాభం జూమ్ అదానీ ట్రాన్స్మిషన్ చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 85 శాతం దూసుకెళ్లి రూ. 440 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 237 కోట్లు ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 3,165 కోట్ల నుంచి రూ. 3,495 కోట్లకు ఎగసింది. నికర లాభాల్లో ట్రాన్స్మిషన్ విభాగం నుంచి 11 శాతం వృద్ధితో రూ. 221 కోట్లు లభించగా.. పంపిణీ విభాగం వాటా 478 శాతం జంప్‌చేసి రూ. 218 కోట్లకు చేరింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి అదానీ ట్రాన్స్మిషన్ నికర లాభం రూ. 1,281 కోట్లకు స్వల్పంగా బలపడింది. 2021–22లో రూ. 1,236 కోట్ల లాభం ప్రకటించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 11,861 కోట్ల నుంచి రూ. 13,840 కోట్లకు జంప్ చేసింది. ఫలితాల నేపథ్యంలో అదానీ ట్రాన్స్మిషన్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం పతనమై రూ. 810 వద్ద ముగిసింది. -
ట్రాన్స్మిషన్ లైన్ల సామర్థ్యం పెంపు సక్సెస్
సాక్షి, హైదరాబాద్: జనసాంద్రత అధికంగా ఉండే హైదరాబాద్ వంటి నగర ప్రాంతాల్లో కొత్త విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాల లభ్యత ఉండదు. మరోవైపు ఏటా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంచుకోక తప్పని పరిస్థితి. కొత్తలైన్ల నిర్మాణానికి స్థలాలు లేకపోవడంతో ఉన్న ట్రాన్స్మిషన్ లైన్ల సరఫరా సామర్థ్యాన్ని కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పెంచుకోవడం ఒక్కటే పరిష్కారం మార్గం. ఈ కోవలో చేపట్టిన 132 కేవీ నుంచి 220 కేవీకి ట్రాన్స్మిషన్ లైన్ల సామర్థ్యం పెంపు (అప్‌గ్రెడేషన్)కు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ, ఎస్ఆర్పీసీ చైర్మన్ ప్రభాకర్‌రావు తెలిపారు. మహారాష్ట్రలోని పుణేలో శనివారం జరిగిన సదరన్ రీజియన్ పవర్ కమిటీ (ఎస్ఆర్పీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయోగాత్మకంగా రెండు టవర్ల మధ్య ప్రస్తుత విద్యుత్ తీగల (కండక్టర్ల)ను తొలగించి వాటి స్థానంలో ‘హై టెంపరేచర్ లోసాగ్ కండక్టర్స్ (హెచ్‌టీఎల్‌ఎస్) తీగలను ఏర్పాటు చేయడంతో ఈ మేరకు విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరిగిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో గచ్చిబౌలి నుంచి రామచంద్రాపురం వరకు 12 కి.మీ. పొడవునా 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ సామర్థ్యాన్ని 220 కేవీకి పెంచే ప్రాజెక్టును చేపట్టామన్నారు. అదనపు స్థలాలు అవసరం లేకుండానే హెచ్‌టీఎల్‌ఎస్ తీగలతో సరఫరా లైన్ల సామర్థ్యం పెంచుకోవచ్చని ప్రభాకర్‌రావు వివరించారు. హెచ్‌టీఎల్‌ఎస్ తీగలు 210 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను సైతం తట్టుకొని అధిక సామర్థ్యంతో విద్యుత్‌ను ప్రసారం చేయగలుగుతాయి. సంప్రదాయ తీగలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక కరిగిపోతాయి. ఎన్టీపీసీపై ఎస్ఆర్పీసీ అసంతృప్తి 2022 చివరిలోగా రామగుండంలోని 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి చేస్తామని ఆ సంస్థ చైర్మన్ హామీనిచ్చినా గడువులోగా పూర్తికాలేదని ప్రభాకర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థలు బయట నుంచి అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ నిర్మాణ పనులను సత్వరమే పూర్తిచేయాలని ఎస్ఆర్పీసీ చైర్మన్ హోదాలో ఆదేశించారు. -
సౌర విద్యుత్‌కు ట్రాన్స్మిషన్ లైన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం కొత్తగా అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు కానున్నాయి. కర్ణాటకతో పాటు ఏపీలోని మూడు సోలార్ ఎనర్జీ జోన్లలో ఈ లైన్లు ఏర్పాటు చేసేందుకు త్వరలో టెండర్ల ప్రక్రియ మొదలుకానుంది. బీదర్‌లోని సోలార్ ఎనర్జీ జోన్ 2.5 గిగావాట్లు, అనంతపురంలో 2.5 గిగావాట్లు, కర్నూలులోని సోలార్ ఎనర్జీ జోన్లో 1 గిగావాట్ సామర్థ్యంతో.. మొత్తం 6 గిగావాట్ల సామర్థ్యం గల లైన్ల నిర్మాణం చేపట్టాలని ఇటీవల ఢిల్లీలో జరిగిన నేషనల్ కమిటీ ఆన్ ట్రాన్స్మిషన్ (ఎన్సీటీ) సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో విండ్, సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టుల స్థాపన ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 29 ప్రాంతాల్లో 33,240 వేల మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్ట్‌లను నెలకొల్పడానికి ప్రణాళిక సిద్ధమైంది. మరో 10 వేల మినీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఇటీవల గుర్తించింది. మొత్తంగా 44,240 మెగావాట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వీటి కోసం కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 1.45 లక్షల ఎకరాల భూమితో టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ స్టడీస్ నిర్వహించింది. పెట్టుబడులు, పరికరాల తయారీ సౌకర్యాల ప్రాజెక్ట్ డెవలపర్ల కోసం సుమారు 5 లక్షల ఎకరాలను లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం భూమిని సమకూరుస్తోంది. తొలి దశలో వైఎస్సార్ జిల్లా గండికోట, అనంతపురం జిల్లా చిత్రావతి, నెల్లూరు జిల్లా సోమశిల, కర్నూలు జిల్లా ఓక్ రిజర్వాయర్, విజయనగరం జిల్లా కురుకూటి, కర్రివలస విశాఖపట్నం జిల్లా ఎర్రవరంలో 6,600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ఏడు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. వీటి నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ పంపిణీకి ఏపీ ట్రాన్స్‌కోకు సంబంధించిన 400 కేవీ సబ్ స్టేషన్లతో లైన్లను అనుసంధానం చేయనున్నారు. ఆరు జిల్లాల్లో 361.86 కిలోమీటర్ల విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఎగుమతి సోలార్ పవర్ పాలసీలో భాగంగా రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో కనీసం 5 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. సోలార్ పార్కులను అభివృద్ధి చేయడం, ఉత్పత్తిని ప్రోత్సహించడం, సౌరశక్తితో నడిచే వ్యవసాయ పంపుసెట్లను తీసుకురావడం, స్థానిక తయారీ సౌకర్యాలను ప్రోత్సహించడం వంటివి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడం ద్వారా రాష్ట్రంలో ఇంధన రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఆదాయాన్ని సృష్టించడం, స్థానిక ఉపాధిని కల్పించడం, రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధిని పెంచడం వంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ట్రాన్స్మిషన్ లైన్ల ఏర్పాటుతో పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వీలు కలుగుతుంది. అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపునివ్వడంతో ఆ మేరకు కూడా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరనుంది. -
హ్యాకర్ల కంట పడకుండా సమాచార ప్రసారం!
కాజీపేట అర్బన్: ప్రతి రంగంలోనూ సమాచార ప్రసారం, దాని భద్రత ఎంతో కీలకం. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీలతో ఈ సమాచారం హ్యాకర్ల చేతిలో పడుతోంది. హ్యాకర్లు ఆ సమాచారంతో తప్పుడు పనులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆన్లైన్లో సురక్షితంగా సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని తొలగించి రక్షణ కల్పించేందుకు వీలయ్యే సరికొత్త అల్గారిథమ్‌ను వరంగల్ నిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సురేశ్‌బాబు పేర్ల అభివృద్ధి చేశారు. ‘మోడల్ టు ఎన్హాన్స్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ ద ఫాల్ట్ టాలరెన్స్’అంశంపై పరిశోధన చేసి రూపొందించిన ఈ అల్గారిథమ్‌కు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు కూడా పొందినట్టు ఆయన వెల్లడించారు. గతంలో దేశంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ నెట్‌వర్క్‌లలో హ్యాకర్లు చొరబడి విద్యుత్ సరఫరాను స్తంభింప జేసిన ఘటనల నేపథ్యంలో ప్రత్యేక అల్గారిథమ్ రూపొందించినట్టు తెలిపారు. అన్ని రంగాల్లో వినియోగించవచ్చు ‘‘పవర్‌గ్రిడ్, టెలీ కమ్యూనికేషన్స్‌తోపాటు అన్ని రంగాల్లో సమాచారాన్ని పూర్తి రక్షణతో ప్రసారం చేసేందుకు నేను రూపొందించిన అల్గారిథమ్‌ను వినియోగించవచ్చు. ఇది సమాచార ప్రసారంలో హ్యాకర్లను గుర్తించి ఆ సమాచారం అందుకోకుండా ఆపుతుంది. సరైన వ్యక్తులను గుర్తించి సమాచారాన్ని ప్రసారం చేసేందుకు తోడ్పడుతుంది..’’అని సురేశ్‌బాబు తెలిపారు. -
విద్యుత్ రంగంలో అదానీ! ట్రాన్స్మిషన్ లైన్ల కోసం వేలకోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ దిగ్గజాలు అదానీ ట్రాన్స్మిషన్, ఎస్సార్ పవర్ లిమిటెడ్ మధ్య తాజాగా రూ. 1,913 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. డీల్‌లో భాగంగా ఎస్సార్ పవర్‌కు చెందిన విద్యుత్ ప్రసార లైన్లను అదానీ ట్రాన్స్మిషన్ కొనుగోలు చేయనుంది. దేశీ కార్పొరేట్ చరిత్రలోనే భారీ రుణ భారాన్ని తగ్గించుకుంటున్న ఎస్సార్ ఈ వ్యూహంలో భాగంగానే తాజా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గత మూడేళ్లలో కంపెనీ రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ. 1.8 లక్షల కోట్లకుపైగా చెల్లించింది. కాగా.. రెండు ట్రాన్స్మిషన్ లైన్ అనుబంధ సంస్థలలో ఒక కంపెనీని అదానీ ట్రాన్స్మిషన్కు విక్రయించేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఎస్సార్ పవర్ వెల్లడించింది. మహన్ నుంచి సైపట్ పూలింగ్ సబ్‌స్టేషన్ వరకూ 465 కిలోమీటర్లమేర మూడు రాష్ట్రాలలో విస్తరించిన ఎస్సార్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీని అదానీ ట్రాన్స్మిషన్కు బదిలీ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో అదానీ పవర్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం పతనమై రూ. 285 వద్ద ముగిసింది. -
వైద్యుల నిర్లక్ష్యం.. మహిళకు వేరే బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించారు.. కాసేపటికే
భువనేశ్వర్: రక్త హీనతతో బాధపడుతున్న ఓ మహిళకు వేరే బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఒడిశాలోని రూర్కీలా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కుట్ర బ్లాక్‌లోని బుడకట గ్రామానికి చెందిన సరోజిని కాకు గురువారం మధ్యాహ్నం రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రి (ఆర్‌జిహెచ్)లో చేరింది. రోగి సికిల్ సెల్ అనీమియా అనే వ్యాధితో బాధపడుతోంది. దీంతో ఆమెకు రక్తం ఎక్కించాలని వైద్యులు తెలిపారు. అయితే ఆమె బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ కాగా, B పాజిటివ్ రక్తం ఎక్కించారు. దీంతో ఆ మహిళ ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. మహిళకు వేరే గ్రూప్ రక్తం ఎక్కించారనీ, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కోసం మృతదేహాన్ని భద్రపరిచినట్లు తెలిపారు. విచారణకు కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (చదవండి: ఎద్దు వయసు మూడున్నరేళ్లు.. విలువ రూ. కోటి!) -
ఆందోళన అవసరం లేదు.. నీటి ద్వారా కరోనా వ్యాప్తి చెందదు
న్యూఢిల్లీ: బిహార్‌లోని గంగా నదిలో భారీ సంఖ్యలో కరోనా బాధితుల మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గంగా పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లక్షలాది మందికి గంగా నదే జీవనాధారం. ఈ నది నీటిని ఉపయోగిస్తే కరోనా వైరస్ సోకుతుందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. యమునా నదిలో కూడా కరోనా బాధితుల శవాలు బయటపడిన సంగతి తెలిసిందే. అయితే, ఆందోళన అవసరం లేదని, నీటి ద్వారా కరోనా వ్యాప్తి చెందదని ఐఐటీ–కాన్పూర్ ప్రొఫెసర్ సతీష్ తారే బుధవారం చెప్పారు. కరోనా సోకిన వారి మృతదేహాలను నదిలో వదిలేస్తే నీటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది అనడానికి గట్టి ఆధారాల్లేవని గుర్తుచేశారు. గంగా, దాని ఉప నదుల్లో శవాలను వదిలేయడం కొత్తేమీ కాదని, 10–15 ఏళ్లలో ఇది గణనీయంగా తగ్గిందని అన్నారు. నదిలో శవాలను వదిలేస్తే నదీ కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. నది నీటి ఉపయోగించుకునేవారు శుద్ధి చేసుకొని వాడుకోవాలని సూచించారు. నీటి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన అవసరం లేదని నీతి ఆయోగ్ (హెల్త్) వి.కె.పాల్, ప్రభుత్వ సాంకేతిక సలహాదారు కె.విజయ రాఘవన్ ఇప్పటికే స్పష్టం చేశారు. చదవండి: ('సెకండ్ వేవ్ ప్రభావం అప్పటి వరకు కొనసాగుతుంది') -
మోంగా ప్రకటనతో ఐఎంఏకు సంబంధం లేదు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో కోవిడ్-19 సామూహిక వ్యాప్తి దశకు చేరిందనే విషయంలో స్పష్టత కొరవడింది. వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) చైర్మన్ వీకే మోంగా ఆదివారం వెల్లడించారు. ఎవరికి ఎలా వైరస్ సోకుతున్నదనేది అంతుచిక్కట్లేదని ఆయన పేర్కొన్నారు. మోంగా ప్రకటనపై ఐఎంఏలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో గందరగోళం నెలకొంది. మోంగా ప్రకటనను ఐఎంఏ అధ్యక్షుడు, కార్యదర్శి ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మోంగా వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయమని ఐఎంఏకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కొన్ని నగరాలు, పట్టణాల్లోనే కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్నాయని ఐఎంఏ కార్యవర్గం పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశలో లేదని తెలిపింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 40, 421 తాజా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వైరస్ బారినపడి ఒక్కరోజులోనే 681 మంది మరణించారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043కి చేరుకుంది. మృతుల సంఖ్య 27,497కి పెరిగింది. ఇక కరోనా వైరస్ నుంచి ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 3,90,000 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చదవండి : కరోనా @11 లక్షలు -
కరోనా : దేశంలో సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి ఇంకా సామాజిక వ్యాప్తి( కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ) దశకు చేరుకోలేదని ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ మరోసారి స్పష్టం చేశారు. గురువారం 18వ ఉన్నత స్థాయి మంత్రులు, నిపుణుల సమీక్షలో పాల్గొన్న మంత్రి తాజా పరిస్థితులపై అధ్యయనంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ''కరోనా ప్రభావిత దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ గణాంకాలను సరైన కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే జానాభా పరంగా రెండో స్థానంలో ఉన్న మన దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు 538 కేసులే నమోదవుతున్నాయి. ప్రపంచ సగటు పరంగా 1453 కేసులు నమోదువుతుంటే భారత్‌లో ఈ సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ దేశ వ్యాప్తంగా చూస్తే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దశకు మనం ఇంకా చేరుకోలేదు'' అని హర్షవర్దన్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్, నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ఐసీఎంఆర్ డిజి డాక్టర్ బలరాబ్ భరగవ సహా పలువురు నిపుణులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే కరోనా సామాజిక వ్యాప్తికి ఇంకా చేరుకోలేదని నిపుణుల బృందం మరోసారి స్పష్టం చేసింది. (భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా! ) ఇక దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,67,29కు చేరుకోగా గడిచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 24,879 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, డిల్లీ, తెలంగాణ, యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లోనూ 75 శాతం ఈ రాష్ర్టాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌లో వరుసగా ఏడవరోజు కూడా 20వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతుండగా రికవరీ రేటు మాత్రం అధికంగానే ఉందని పేర్కొంది. ఇప్పటికే 4,76,377 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం 2,69,789 యాక్టివ్ కేసులే ఉన్నాయని వెల్లడించింది. (యూపీలో తక్కువ టెస్టులే.. అయినా మెరుగ్గానే! ) -
కోవిడ్-19 : ఇలా కూడా వ్యాపిస్తుంది!
న్యూయార్క్ : కోవిడ్-19 వ్యాప్తిపై శాస్త్రవేత్తలు కీలక సమాచారం వెల్లడించారు. గాలిలోని సూక్ష్మ రేణువుల ద్వారా కరోనా వైరస్ ప్రజలకు సంక్రమిస్తుందనేందుకు ఆధారాలున్నాయని వందలాది శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కరోనా మహమ్మారిపై సిఫార్సులను ఈ మేరకు సవరించాలని వారు డబ్ల్యూహెచ్ఓకు పిలుపు ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కరోనా వైరస్ ప్రధానంగా ఈ వ్యాధితో బాధపడే వ్యక్తి దగ్గడం, తుమ్మడం లేదా మాట్లాడినప్పుడు వెలువడే తుంపరల నుంచి వేరొకరికి వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతూవస్తోంది. అయితే గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనేందుకు ఆధారాలున్నాయని పేర్కొంటూ 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్ఓకు రాసిన లేఖలో వివరించారు. ఈ అంశాన్ని వచ్చే వారం సైంటిఫిక్ జర్నల్‌లో పరిశోధకులు ప్రచురించనున్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తి దగ్గినప్పుడు వెలువడే తుంపరల పరిమాణం ఎక్కువగా ఉంటే అవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతూ ప్రజలకు ఈ వ్యాధి సంక్రమిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేసినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కాగా వైరస్ గాలి ద్వారా సంక్రమిస్తుందనేందుకు చూపుతున్న ఆధారాలు ఆమోదయోగ్యంగా లేవని డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించింది. కరోనా వైరస్ గాలి ద్వారా సంక్రమించే అవకాశం లేకపోలేదని గత రెండు నెలలుగా తాము పలుమార్లు చెబుతూవచ్చామని అయితే దీనిపై స్పష్టమైన ఆధారాలు ఇంతవరకూ వెల్లడికాలేదని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డాక్టర్ బెనెడెటా అలెగ్రాంజీ పేర్కొన్నారు. చదవండి : కరోనా: తిరుగుతున్నారు..! -
కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదు
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. అధిక పాజిటివ్ కేసుల నమోదులో ముంబై మొదటి స్థానంలో ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్‌కి వచ్చిందని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే గురువారం స్పందించారు. రాష్ట్రంలో వైరస్‌కు సంబంధించి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదని స్పష్టం చేశారు. ఇక వైరస్ బారిన పడిన బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో, హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. (ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించిన కేజ్రీవాల్) అదే విధంగా కరోనా చికిత్సలో ప్లాస్మా థెరఫి కీలక పాత్ర పోషిస్తోందని రాజేష్ తోపే తెలిపారు. ఈ చికిత్సలో సుమారు 10 మంది కరోనా బాధితుల్లో 9 మంది కోలుకుంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 93 వేల మంది కరోనా పేషెంట్లు వ్యాధి నుంచి కోలుకున్నారని వెల్లడించారు. చాలామంది పాజిటివ్ బాధితుల హిస్టరీ గమనిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా కేంద్రాల్లో, హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైరస్ తీవ్రతను గమనిస్తే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్‌కి చేరలేదని వెల్లడించారు. ఇక రెమిడిసివిర్, ఫావిపిరవిర్ మందులు మరో రెండు రోజుల్లో అన్ని జిల్లాల్లో లభిస్తాయని తెలిపారు. ధనిక, పేద తేడాలు లేకుండా ప్రజలందరికీ ఈ మందులను అందుబాటులోకి తీసుకువస్తామని రాజేష్ తోపే చెప్పారు.(కరోనా : 30 రోజుల్లో 3,94,958 కేసులు ) -
కరోనా : గోవా సీఎం సంచలన వ్యాఖ్యలు
పనాజి : కరోనా తీవ్రతరం అయ్యిందని ఇప్పటికే రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి మొదలైందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సావంత్ మాట్లాడుతూ.. 'గోవా అంతటా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక రోగి నుంచి మరొకరికి వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ (సామాజికవ్యాప్తి) మొదలైందనే నిజాన్ని అంగీకరించక తప్పదు' అంటూ పేర్కొన్నారు. అయితే వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని కఠినమైన చర్యలు చేపడుతుందని అన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతున్న ఏకైక రాష్ట్రం గోవానే అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. (పంజాబ్ సీఎస్‌గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ ) రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి కఠిన నిబంధనలు అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా దానికి ప్రజలు కూడా అదే స్థాయిలో స్పందించాలని లేదంటే అధికారులు పడే కష్టమంతా వృధానే అని అన్నారు. ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. మే చివరి నాటికి కోవిడ్ ఫ్రీగా ఉన్న గోవా రాష్ట్రంలో క్రమంగా కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్కోలోని మాంగోర్ హిల్, సత్తారి తాలూకాలోని మోర్లెం ప్రాంతాలను కంటైనేషన్ జోన్లగా ప్రకటించగా,మరికొన్ని ప్రాంతాలను మినీ కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఒక్కరోజే 44 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 1,039 కాగా ప్రస్తుతం 667 యాక్టివ్ కేసులున్నాయని ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు మరణించిన ఇద్దరు మరణించినట్లు పేర్కొంది. వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం సిద్ధం చేసిందని ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణె అన్నారు. అవసరమైతే కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ఉత్తర గోవా జిల్లాల్లో ఈఎస్ఐ హాస్పిటల్ తరహాలో ప్రత్యేకంగా ఆసుపత్రి నిర్మాణం చేస్తామని తెలిపారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి అవరమైన అన్ని రకాల సౌకర్యాలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. (సోషల్ మీడియాలో టీచర్ల మార్ఫింగ్ ఫొటోలు ) -
ఏపీలో కరోనా సామూహిక వ్యాప్తి 8 శాతమే
సాక్షి, అమరావతి: అత్యధిక టెస్టులు నిర్వహించడం ద్వారా కోవిడ్–19 సోకిన వారిని త్వరగా గుర్తించి వైరస్ వ్యాప్తిని నిరోధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విధానం సత్ఫలితాలనిస్తోంది. కమ్యూనిటీ స్ప్రెడ్ (సామూహిక వ్యాప్తి) జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్న పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఇండియా డాట్ ఇన్ పిక్సెల్స్ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సమాచారాన్ని తీసుకొని కమ్యూనిటీ స్ప్రెడ్‌కు ఉన్న అవకాశాలను పరిశీలించి నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. మన రాష్ట్రంలో కోవిడ్–19 కమ్యూనిటీ స్ప్రెడ్‌కు 8 శాతం మాత్రమే అవకాశముంది. 7,000 కేసులు దాటిన రాష్ట్రాల్లో కమ్యూనిటీ స్ప్రెడ్ అత్యల్పంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. రాష్ట్రాల్లో నమోదైన కేసులు, కోలుకున్న వారు, క్వారంటైన్లో ఉన్న వారి వివరాల ద్వారా కమ్యూనిటీ స్ప్రెడ్ అవకాశాలకు ఒక ఫార్ములా రూపొందించారు. దీని ప్రకారం 100 శాతం దాటిన రాష్ట్రాల్లో కమ్యూనిటీ స్ప్రెడ్ తప్పనిసరి. ఇలా చూస్తే ఢిల్లీ 143 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, 122 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. గుజరాత్ 45 శాతం, మహారాష్ట్ర 65 శాతం, రాజస్తాన్, పశ్చిమబెంగాల్ 24 శాతం, తమిళనాడు 38 శాతాలతో కమ్యూనిటీ స్ప్రెడ్‌కు అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అత్యధిక టెస్టులు నిర్వహించడం ద్వారా కమ్యూనిటీ స్ప్రెడ్‌ను అరికట్టామంటూ పలువురు అధికారులు ట్వీట్ చేస్తున్నారు. 7 లక్షలకు చేరువలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు 7 లక్షలకు చేరుకోనున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 16,704 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 6,93,548కి చేరింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్న ప్రకారం కొత్తగా 443 మందికి వైరస్ సోకడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,372కు చేరింది. ఈ కేసుల్లో 1,584 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కాగా, 337 మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వారు. కొత్తగా 128 మందిని డిశ్చార్జి చేయడంతో మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,435కి చేరింది. కృష్ణా, కర్నూలు, అనంతపురం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 111కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,826కి చేరింది. ఇన్ఫెక్షన్ రేటు -1.35% రికవరీ రేటు -47.32% మరణాల రేటు -1.18% -
కరోనా: ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ లేదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశం లెఫ్ట్‌నెంట్ గవర్నర్, విపత్తు నిర్వాహణ శాఖ చైర్మన్ అనిల్ బైజాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరగడానికి కారణం కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ కాదంటూ కేంద్ర అధికారులు పేర్కొన్నారని వెల్లడించారు. గతవారం నుంచి పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ జరగలేదని అధికారులు తెలిపారని అన్నారు. జూలై నెల చివరికల్లా 5.5 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావచ్చని, కరోనా బాధితులకు వైద్యం అందిచడానికి 80 వేల బెడ్లు కావాలని పేర్కొన్నారు. (జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్) ఈ సమావేశానికి ముందు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. ఢిల్లీలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 50 శాతం మందికి వ్యాధి ఎలా సంక్రమిస్తోందో సరైన సమాచారం లేదని తెలిపారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ముందస్తుగానే సెల్ఫ్ ఐసోలేషన్‌కి పరిమితమయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీలో కొత్తగా 1007 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి ఇప్పటివరకు 874 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. (24 గంటల్లో 9,987 కేసులు, 331 మరణాలు) -
అమ్మో, ఆ జంతువులకు కూడా కరోనా వచ్చింది
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు అనేక మంది మరణించారు. ఇంకా చాలా మంది ఈ వైరస్ సోకి చికిత్స తీసుకుంటూ ఆసుపత్రిలో ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ భయపెడుతున్నాయి. అయితే కరోనా వైరస్ పిల్లులకు కూడా సోకుతుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. న్యూ లాబ్రేటోరి ఎక్స్పరిమెంట్ ప్రకారం కోవిడ్-19 వ్యాధిని కలిగించే సార్స్- కో వి-2 వైరస్ పిల్లులను కూడా ప్రభావితం చేస్తోందని పేర్కొంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసెన్‌లో ముద్రించబడిన స్టడీ ప్రకారం వైరస్ సోకిన పిల్లులలో లక్షణాలు ఏమి కనిపించడం లేదని పేర్కొన్నారు. తరువాత ఆ వైరస్ పోతుందని తెలిపారు. మనుషుల నుంచి మాత్రమే ఇప్పటి వరకు ఇతర మనుషులకు ఈ వైరస్ సోకుతుందని ఆ జర్నలో పేర్కొన్నారు. జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నట్లు ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు దొరకలేదన్నారు.పాతోబయోలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ యోషిహోరో కవోకా మాట్లాడుతూ వైరస్ సోకిన పిల్లులను మనుషుల నుంచి దూరంగా ఉంచామని, అయితే తరువాత రోజు మాత్రం వాటి నాశిక ద్వారా మరో రెండు పిల్లులకు వైరస్ సోకినట్లు పేర్కొన్నారు. తరువాత మూడు రోజులకి అక్కడ ఉన్న పిల్లులన్నింటికి ఈ వైరస్ సోకిందన్నారు. తరువాత వీటిని వేరే చోట ఉంచితే మొత్తం ఆరు రోజుల్లో అక్కడ ఉన్న పిల్లులన్నింటినికి కరోనా వైరస్ సోకింది. ఈ స్టడీ మాత్రమే కాకుండా వేరే పరిశీలనలకు కూడా పిల్లులు ద్వారా వైరస్ వ్యాపించి చెందుతుందని పేర్కొన్నాయి. అయితే కరోనా వైరస్ సోకి ఐసోలేషన్‌లో ఉన్న వారు కేవలం వారి కుటుంబ సభ్యలకు, ఇతర మానవులకు మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే పెంపుడు జంతువులకు కూడా దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. -
కరోనా : తల్లినుంచి నవజాత శిశువుకు వచ్చే ప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభణతో వణికిపోతున్న భారతావనికి మరో షాకింగ్ న్యూస్. గర్భిణీ తల్లి నుంచి గర్భంలో ఉండగానే, లేదా ప్రసవం ద్వారా శిశువుకు కరోనా వైరస్ సోకే ప్రమాదం వుందని భారతదేశ అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సోమవారం తెలిపింది. అయితే గర్భిణీలకు ఈ వ్యాధి సోకే అవకాశాలు, బిడ్డకు సంక్రమణ తీవ్రత ఏ మేరకు వుంటుందనేది ఇంకా గుర్తించలేదని ఐసీఎంఆర్ నొక్కి చెప్పింది. కరోనా పాజిటివ్ వచ్చిన తల్లి నుండి బిడ్డకు పుట్టుకకు ముందు లేదా ప్రసవించేటప్పుడు సంభవించే అవకాశం ఉంది. అయితే తల్లి పాలల్లో ప్రాణాంతక వైరస్ లక్షణాలున్నాయని నిరూపించడానికి ప్రస్తుతం శాస్త్రీయ ఆధారాలు లేవని ఐసీఎంఆర్ తెలిపింది. (కరోనా వ్యాక్సిన్ : రెండో దశ క్లినికల్ ట్రయల్స్) తల్లి నుండి బిడ్డకు డైరెక్టుగా (ప్రసూతి లేదా ఇంట్రాపార్టమ్) కోవిడ్-19 సోకినట్టుగా ఒక కేసులో సాక్ష్యాలున్నప్పటికీ, దీని తీవ్రతను ఇంకా నిర్ధారించలేకపోతున్నామని ఐసీఎంఆర్ వ్యాఖ్యానించింది. కానీ గర్భిణీలకు కరోనా సోకితే తీవ్రమైన సమస్యలకు ఎక్కువ అవకాశం ఉంది. కనుక కరోనా పాజిటివ్, న్యుమోనియాలాంటి శ్వాసకోశ వ్యాధి తీవ్రంగా వుంటే, పుట్టిన తరువాత బిడ్డను తల్లినుంచి తాత్కాలికంగా (వేర్వేరు గదుల్లో ఉంచడం) వేరు చేయడం ఉత్తమమని సూచించింది. దీంతోపాటు గుండె జబ్బుతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలు అత్యధిక ప్రమాదంలో ఉంటారని, ఎప్పటికంటే ఎక్కువగా వైద్యుల పర్యవేక్షణ అవసరమని పేర్కొంది. అలాగే కరోనా కారణంగా గర్భస్రావమయ్యే ప్రమాదం ఉందని నిరూపించే డేటా ఏదీ ప్రస్తుతం లేదని పరిశోధనా సంస్థ వ్యాఖ్యానించింది. (కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్ ) కరోనా వైరస్ గర్భిణీ స్త్రీల నిర్వహణకు సంబంధించి సోమవారం ఐసీఎంఆర్ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ వైరస్ టెరాటోజెనిక్ అనేందుకు ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవు కనుక దీర్ఘకాలిక డేటాకై ఎదురు చూస్తున్నట్టు పేర్కొంది. కోవిడ్ -19 సోకిన గర్భిణీలలో న్యుమోనియా లక్షణాలున్నప్పటికీ త్వరగా కోలుకున్నారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో గర్భధారణ సమయంలో కరోనా సోకిన మహిళలందరి జాబితాను నమోదు చేయాలని, ఫలితాలతో సహా తల్లీబిడ్డల ఆరోగ్య రికార్డులు వివరంగా నింపి, భవిష్యత్తు విశ్లేషణ కోసం భద్రపరచాలని సూచించింది. అలాగే కరోనా వైరస్ సోకినంత మాత్రాన గర్భ విచ్ఛిత్తి చేసుకోవాల్పిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) -
ఆటో మొబైల్ పరిశ్రమకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ ఆటో పరిశ్రమకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్పిడికి ఎలాంటి గడువు లేదని తేల్చి చెప్పారు. ఇ-వాహనాల పరివర్తన సహజంగా జరుగుతుందని స్పష్టం చేశారు. దాదాపు ఏడాది కాలంగా మందగమనంలో విలవిల్లాడుతూ, విక్రయాలు 19ఏళ్ల గరిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలుకు గడ్కరీ ప్రకటన భారీ ఊరటనివ్వనుంది. 2023 నుంచి 150 సీసీ లోపు ద్విచక్రవాహనాలు, 2025 నాటికి త్రిచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా పూర్తిగా మారాలని ప్రభుత్వ థింక్-ట్యాంక్ నీతి ఆయోగ్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్పందించాల్సిందిగా కేంద్రమంత్రిని కోరినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ వాహనాలను ఈ గడువులోగా నిషేధించాలనే గడువు లేదని, అలాంటిదేమైనా వుంటే సంబంధిత వర్గాలను సంప్రదించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి మాత్రం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. పరివర్తన సహజ ప్రక్రియగా జరుగుతుందన్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే ప్రయత్నంలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఇంజన్లను నిషేధించదని లోక్‌సభ సమావేశాల్లో కూడా గడ్కరీ ఆటోమొబైల్ పరిశ్రమకు హామీ ఇచ్చిన సంగతి గమనార్హం. ఈవీ వాహనాల పరివర్తన గడువుపై ఆటోమొబైల్ మేజర్స్ టీవీఎస్ మోటార్ బజాజ్ ఆటో కూడా ఇలాంటి ఆకస్మికంగా ఈ మార్పును సాధించలేమని టీవీఎస్ మోటార్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ ఇంతకుముందే వెల్లడించారు. ఈ విషయంలో దేశం, ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ రెండూ చాలా దూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఫలితంగా 4 మిలియన్ల ఉద్యోగాలను కల్పిస్తున్న ఆటోమొబైల్ పరిశ్రమ దెబ్బతింటుందని శ్రీనివాసన్ తెలిపారు. కాగా గత కొన్ని నెలలుగా ఆటో పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. డిమాండ్ క్షీణించి తో ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధిలో మందగమనంలో ఉందని, గత కొన్ని నెలలుగా ఆటో కాంపోనెంట్స్ రంగంలో లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని నివేదికలు వెలువడ్డాయి. అటు ఈ ధోరణి మరో మూడు నాలుగు నెలలు కొనసాగితే, 10లక్షలకు పైగా ఉద్యోగనష్టాలకు దారితీస్తుందని ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎసిఎంఎ) డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా వ్యాఖ్యానించారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల ప్రకారం, ఆటో పరిశ్రమ గత సంవత్సరంతో పోల్చితే 2019 లో అమ్మకాలలో 31శాతం తగ్గుదల నమోదైంది. -
మార్కెట్లోకి సరికొత్త బాలెనో
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ బాలెనో మోడల్లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధరలు రూ.5.4 లక్షల నుంచి రూ.8.77 లక్షల రేంజ్లో ఉంటాయని మారుతీ తెలిపింది. కొత్త బాలెనోలో రియర్ పార్కింగ్ కెమెరాతో కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, టూ టోన్ 16 అంగుళాల అలాయ్ వీల్స్, కారు డ్రైవింగ్ మరింత సౌకర్యవంతంగా ఉండేలా నావిగేషన్ విత్ లైవ్ ట్రాఫిక్, వెహికల్ ఇన్ఫర్మేషన్, స్క్రీన్‌పై ఎప్పటికప్పుడు అలర్ట్స్ అందటం వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్.కల్సి చెప్పారు. డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ రిస్ట్రెయింట్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి భద్రత ఫీచర్లు ఉన్నాయని వివరించారు. 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ (మాన్యువల్ ట్రాన్సిమిషన్) ధరలు రూ.5.4–7.45 లక్షల రేంజ్లో, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ధరలు రూ.7.48–8.77 లక్షల రేంజ్లో ఉన్నాయని తెలిపారు. 1.3 లీటర్ డీజిల్ వేరియంట్లో మాన్యువల్ ట్రాన్సిమిషన్ మోడల్ మాత్రమే లభిస్తుందని, దీని ధరలు రూ.6.6–8.6 లక్షల రేంజ్లో ఉన్నాయని వివరించారు. బాలెనో మోడల్ మైలేజీ ఒక్కో లీటర్‌కు పెట్రోల్ వేరియంట్‌కు 21.4 కి.మీ. డీజిల్ వేరియంట్ 27.4 కి.మీ. వస్తుందని అంచనా. -
ఆ దోమ కుట్టినా మలేరియా రాదట..
కాలిఫోర్నియా: ప్రాణాంతక మలేరియా వ్యాధి సంక్రమాన్ని నిరోధించేందుకు శాస్త్రవేత్తలు ఎన్నిరకాల మందులను కనిపెట్టినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. దోమల నుంచి సంక్రమించే ప్లాస్మోడియం పరాన్న జీవి వల్ల మానవులకు మలేరియా వ్యాధి వస్తోందన్న విషయం తెలిసిందే. అసలు ప్లాస్మోడియం పరాన్న జీవిని దోమలోనే చంపేస్తే అన్న ఆలోచన అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలకు వచ్చింది. అంతే...ఓ రకమైన దోమ డీఎన్ఏను జన్యు మార్పిడి పద్ధతి ద్వారా మార్చేసి ప్లాస్మోడియం పరాన్న జీవిని నియంత్రించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. అంటే దోమలోకి ప్లాస్మోడియం పరాన్న జీవి ప్రవేశించగానే దోమలో వచ్చిన జన్యు మార్పుల కారణంగా ఆ పరాన్న జీవి ఆదిలోనే చచ్చిపోతుంది. ఫలితంగా ఆ దోమ మానవులను కుట్టినప్పటికీ మలేరియా సోకే ప్రసక్తే లేదన్న మాట. జన్యు మార్పిడికి గురైన దోమకు పుట్టే పిల్ల దోమలకు కూడా ఈ పరాన్న జీవిని బతక్కుండా నిరోధించే శక్తి వస్తుంది. కనీసం మూడు తరాల వరకు దోమ జాతిలో జన్యుపరంగా ఈ శక్తి సంక్రమిస్తుందని పరిశోధక నిపుణుల బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ ఆంథోని జేమ్స్ వివరించారు. దోమ డీఎన్ఏ జన్యు మార్పిడి ప్రక్రియకు 'క్రిస్పర్' అని నామకరణం కూడా చేశారు. ఈ జన్యు మార్పిడి ప్రక్రియ కోసం భారత్‌లో కనిపించే 'అనోఫెలెస్ స్టెఫెన్సీ' జాతికి చెందిన దోమను ఎంపిక చేసుకున్నారు. ఇలా ప్రతి జాతికి చెందిన దోమలను ఎంపిక చేసి ల్యాబ్‌లో జన్యు మార్పిడి ద్వారా ప్లాస్మోడియం పరాన్న జీవిని ఎదుర్కొనే శక్తిని కలిగిస్తూ పోతే కొంతకాలానికి వాటి సంతానానికి కూడా ఈ శక్తిని ప్రసాదించవచ్చు. అలా చేసినట్టయితే కొంతకాలానికి ఏ రకమైన దోమలు మానవులను కుట్టినా మలేరియా వ్యాధి సంక్రమించదు. ఇదొక్కటే మలేరియాను సమూలంగా నిర్మూలించలేదని, ఇదొక మార్గం మాత్రమేనని డాక్టర్ ఆంథోని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, శక్తివంతమైన మందులను కనుగొనడం, మలేరియా సోకినప్పుడు వాటిని వాడడం తప్పనిసరని ఆయన చెప్పారు. ఎందుకంటే, దోమ జాతులన్నింటిలో డీఎన్ఏలో జన్యు మార్పిడి తీసుకరావడం అంత సులభం కాదు. ప్రపంచ వ్యాప్తంగా 320 కోట్ల మంది, అంటే దాదాపు ప్రపంచ జనాభాలో సగం మంది మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నారు. వారిలో ఏడాదికి 5,80,000 మంది మృత్యువాత పడుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అసలు ప్లాస్మోడియం పరాన్న జీవికి వాహకంగా పనిచేస్తున్న దోమ జాతినే నిర్మూలిస్తూ పోవడం శ్రేయస్కరంగదా! అన్న ఆలోచన శాస్త్రవేత్తలకు రాకపోలేదు. అలాంటి చర్యలు తీసుకున్నట్లయితే పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుందని, ఇప్పటికే దోమల ద్వారా నశించిపోతున్న ఇతర రకాల పరాన్న జీవులు మరోరకంగా విజృంభించే అవకాశం ఉందని కొంత మంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. -
ఆ చానళ్లను ప్రజలు కోరుకోవడం లేదు
తెలంగాణ ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి సూర్యాపేట: టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను ప్రజలు ప్రసారం చేయాలని కోరుకోవడం లేదని, వారు కోరుకుంటే ప్రసారం చేస్తామని తెలంగాణ ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణ సమీపంలోని సీతారామ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ రెండు చానళ్ల ప్రసారాలను నిలిపివేయడంలో ప్రభుత్వ పాత్ర, ఎంఎస్ఓల పాత్ర ఏమీ లేదన్నారు. వ్యాపార ఒప్పందాలు కొనసాగించే ఆలోచన ఆ రెండు యాజమాన్యాలకు లేదని చెప్పారు. ఉన్నత న్యాయస్థానాలు సైతం ఎంఎస్ఓలకు అనుకూలంగానే తీర్పు చెప్పాయని గుర్తు చేశారు. ఎంఎస్‌ఓలందరూ సమస్యల పట్ల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసికట్టుగా సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే హక్కులను సాధించుకోగలుగుతామని తెలిపారు. -
ఆరురోజుల్లో పునరుద్ధరిస్తాం:పీయూష్
సాక్షి, న్యూఢిల్లీ: నగరానికి అనుసంధానమయ్యే ట్రాన్స్మిషన్ లింకులను ఈ నెల 22వ తేదీకల్లా పునరుద్ధరిస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. నగరంలో విద్యుత్ సరఫరా స్థితిగతులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. కేంద్ర మంత్రితో భేటీ విద్యుత్ సంక్షోభం నగరానికి శాపంగా పరిణమిం చిన నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో బీజేపీ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ సమస్యపై చర్చిం చారు. గత నెల 30వ తేదీనాటి గాలిదుమారం త తర్వాత తలెత్తిన విద్యుత్ సంక్షోభం బీజేపీ తలనొప్పిగా పరిణమించింది. ఢిల్లీలో రాష్ట్రపతిపాలన ఉండడంతో ఈ విషయంలో కేంద్రాన్ని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో రెండు వారాల సమయం పడుతుం దని పీయూష్ వారం క్రితం ప్రకటించిన సంగతి విదితమే. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ శాసనసభ్యులు కేంద్ర మంత్రిని కలిసి ఈ సమస్యపై చర్చించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కాగా విద్యుత్ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు సోమవారం సీమాపురి, పట్పర్గంజ్ ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ దిష్టిబొమ్మలను తగులబెట్టడంతోపాటు 24వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను కాసేపు అడ్డుకున్నారు. -
వాటర్..బెటర్
జూలై వరకు మంచినీటికి ఢోకా లేదు.. సంతృప్తికరంగా జలాశయాల నీటి మట్టాలు ఖుషీ అవుతున్న జలమండలి అధికారులు సాక్షి,సిటీబ్యూరో: మహానగర వాసులకు శుభవార్త. వేసవిలో ఇక తాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పన్లేదు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు నగరానికి తాగునీటిని అందిస్తున్న జంటజలాశయాలు హిమాయత్‌సాగర్,ఉస్మాన్‌సాగర్(గండిపేట) సహా కృష్ణా,మంజీరా,సింగూరు జలాశయాల్లో నీటినిల్వలు సంతృప్తికరంగా ఉన్నాయి. దీంతో జూలై వరకు నీటికి ఇబ్బందులు ఉండవని, సరఫరా సక్రమంగా ఉంటుందని వాటర్‌బోర్డు ట్రాన్స్మిషన్ విభాగం చీఫ్ జనరల్మేనేజర్ (సీజీఎం) విజయ్‌కుమార్‌రెడ్డి గురువారం ‘సాక్షి’కి తెలిపారు. సాధారణంగా వేసవిలో నీరు ఆవిరికావడం, వాడకం ఎక్కువగా ఉండడంవల్ల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతాయని, కానీ ఈ ఏడాది అలాంటి ఇబ్బందుల్లేవని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నగరంలో రోజువారీగా 340 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. నీటినిల్వలు సంతృప్తికరంగా ఉన్న నేపథ్యంలో ఈ వేసవిలో జంటజలాశయాలు,సింగూరువద్ద అత్యవసర పంపింగ్ ఏర్పాట్లు అవసరం ఉండదని స్పష్టం చేశారు. జూలైలో సకాలంలో రుతుపవనాలు సమీపించి వరుణుడు కరుణిస్తే జలాశయాల్లో నీటి నిల్వలు మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం కరెంటు కోతల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అరకొరగా,ఆలస్యంగా మంచినీటి సరఫరా జరుగుతున్నా, సమస్యను పూర్తిగా అధిగమిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్‌లోనే వర్షాలు వచ్చి జలాశయాలు పూర్తిగా నిండితే అన్ని ప్రాంతాలకు సక్రమంగా తాగునీటిని సరఫరా చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.