No Interstate Transmission Fee For Offshore Wind Green Hydrogen Projects - Sakshi
Sakshi News home page

ఇంటర్‌స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ చార్జీలను ఎత్తేసిన కేంద్రం..

Published Wed, May 31 2023 1:34 PM | Last Updated on Wed, May 31 2023 3:26 PM

No interstate transmission fee for offshore wind green Hidrogen projects - Sakshi

న్యూఢిల్లీ: ఆఫ్‌షోర్‌ పవన, గ్రీన్‌ హైడ్రోజన్, అమ్మోనియా ప్రాజెక్టులపై ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ చార్జీలను ఎత్తివేస్తూ 25 ఏళ్లపాటు ఉపశమనాన్ని కేంద్ర సర్కారు కల్పించింది. 2032 డిసెంబర్‌ 31 వరకు కార్యకలాపాలు ప్రారంభించే ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది.

ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆఫ్‌షోర్‌ విండ్‌ ఎనర్జీ ప్రాజెక్టులు,  గ్రీన్‌ హైడ్రోజన్‌/గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. కర్బన ఉద్గారాల నియంత్రణకు, పర్యావరణ అనుకూల ఇంధనాల తయారీకి మద్దతుగా కేంద్ర సర్కారు తీసుకుంటున్న ఎన్నో చర్యల్లో దీన్ని కూడా ఒక భాగంగా చూడొచ్చు.

ఇదీ చదవండి: Electric Scooters: ఈరోజే కొంటే రూ.32 వేల వరకు ఆదా! రేపటి నుంచి పెరగనున్న ధరలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement