Offshore
-
తీవ్ర తుపానుగా మిచాంగ్
సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో కొన సాగుతున్న మిచాంగ్ తుపాను సోమవారం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరగా కొనసాగుతోంది. క్రమంగా బలపడుతూ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కదులుతూ.. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దాని ప్రభావంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశా యని తెలిపింది. మంగళ, బుధవారాల్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. పలుచోట్ల భారీ వర్షాలు మంగళవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు.. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు, గంటకు 30 నుండి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు లు వీస్తాయని తెలి పింది. ఇక బుధవారం రోజున పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ తాయని.. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చని వివరించింది. ఉష్ణోగ్రతలు తగ్గే చాన్స్ సోమవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా రామగుండంలో 33.1 డిగ్రీల గరిష్టఉష్ణోగ్రత.. అత్యల్పంగా మెదక్, ఆదిలాబాద్‌లలో 18.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది. మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశంఉందని తెలిపింది. -
ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీలను ఎత్తేసిన కేంద్రం..
న్యూఢిల్లీ: ఆఫ్‌షోర్ పవన, గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ప్రాజెక్టులపై ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ చార్జీలను ఎత్తివేస్తూ 25 ఏళ్లపాటు ఉపశమనాన్ని కేంద్ర సర్కారు కల్పించింది. 2032 డిసెంబర్ 31 వరకు కార్యకలాపాలు ప్రారంభించే ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్/గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. కర్బన ఉద్గారాల నియంత్రణకు, పర్యావరణ అనుకూల ఇంధనాల తయారీకి మద్దతుగా కేంద్ర సర్కారు తీసుకుంటున్న ఎన్నో చర్యల్లో దీన్ని కూడా ఒక భాగంగా చూడొచ్చు. ఇదీ చదవండి: Electric Scooters: ఈరోజే కొంటే రూ.32 వేల వరకు ఆదా! రేపటి నుంచి పెరగనున్న ధరలు -
నెలకు రూ.4 లక్షలు: రెండేళ్లు కష్టపడితే, కోటి...కానీ..!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలతో గ్లోబల్‌గా ఉద్యోగాలు ఊడిపోతున్న తరుణంలో ఒక ఆసక్తికర పరిణామం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. అదేంటి అంటే.. నెలకు నాలుగు లక్షల రూపాయల వేతనాన్ని ఆఫర్ చేస్తున్నా అబెర్డీన్ తీరంలో ఉత్తర సముద్రంలో ఆఫ్‌షోర్ రిగ్గర్ ఉద్యోగానికి అప్లయ్ చేసుకునే నాధుడే దాదాపు కనిపించడం లేదట. విషయం ఏమిటంటే స్కాట్లాండ్లో ఈ ఉద్యోగం. అబెర్డీన్లోని నార్త్ సీ తీరంలో పనిచేయాల్సి ఉంటుంది సముద్రంలోని నిర్దిష్ట ప్రాంతంలో ఏర్పాటైన రిగ్‌లో ఆఫ్‌షోర్ రిగ్గర్ అభ్యర్థి సముద్రగర్భం నుంచి ఖనిజ నిల్వలను అన్వేషించడం, వెలికితీయడం, ఆయిల్ వెలికితీయడం వంటివి చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా టెక్నికల్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. BOSIET (బేసిక్ ఆఫ్‌షోర్ సేఫ్టీ ఇండక్షన్ అండ్ ఎమర్జెన్సీ ట్రెనింగ్), FOET (ఫర్దర్ ఆఫ్‌షోర్ ఎమర్జెన్సీ ట్రెనింగ్), CA-EBS (కంప్రెస్డ్ ఎయిర్ ఎమర్జెన్సీ బ్రీతింగ్ సిస్టమ్), OGUK మెడికల్ ట్రైనింగ్ వంటివి శిక్షణ పొంది ఉండాలి. ఉద్యోగికి సెలెక్ట్ అయితే రోజుకు 12 గంటల పని. రోజుకు రూ.36 వేల చొప్పున నెలకు రూ.4 లక్షలు జీతం చెల్లిస్తారు. ఒక షిప్ట్ ఒకటి నుండి ఆరు నెలల వరకు ఉంటుంది. కంపెనీ పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలు,సెలవులు కూడా ఉంటాయి. వారం రోజులు సీక్ లీవ్ కూడా ఉంది. అభ్యర్థి రెండేళ్ల పాటు ఉద్యోగంలో ఉండి, 6-6 నెలల 2 షిఫ్ట్‌లను పూర్తి చేస్తే, అప్పుడు జీతం £95,420 (రూ. 1 కోటి)కి చేరుకుంటుంది. ఇంత భారీ ప్యాకేజీతో మొత్తం 5 ఖాళీలకుగాను 24 రోజుల క్రితం నోటిఫికేషన్ ప్రకటించగా అప్లయ్ చేసుకున్న వారి సంఖ్య చాలా తక్కువట. తన ఖచ్చితమైన గుర్తింపును వెల్లడించకుండానే ఎనర్జీ మార్కెట్లో పెద్ద కంపెనీగా చెప్పుకున్న సంస్థ ఈ ప్రకటన ఇచ్చింది. -
విదేశీ ఫండ్స్‌పై భారీగా తగ్గిన పెట్టుబడుల ప్రవాహం
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్‌పై దృష్టిపెట్టే ఆఫ్‌షోర్ విభాగంలోని ఫండ్స్, ఎక్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు) నుంచి మరోసారి పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. ఈ కేలండర్ ఏడాది(2021) రెండో త్రైమాసికం(ఏప్రిల్– జూన్)లో నికరంగా 1.55 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 11,500 కోట్లు) ఔట్‌ఫ్లో నమోదైంది. వెరసి వరుసగా 13వ త్రైమాసికంలోనూ ఈ ఫండ్స్ నుంచి విత్‌డ్రాయల్స్ చోటుచేసుకున్నట్లు మార్నింగ్‌స్టార్ తాజా నివేదిక పేర్కొంది. కాగా.. 2021 క్యూ1(జనవరి–మార్చి)లో నమోదైన 37.6 కోట్ల డాలర్ల(రూ. 2,790 కోట్లు)తో పోలిస్తే పెట్టుబడులు భారీ స్థాయిలో వెనక్కి మళ్లడం గమనించదగ్గ అంశం! 2020 అక్టోబర్–డిసెంబర్‌లోనూ 98.6 కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల దృష్టి దేశీయంగా ఈక్విటీ మార్కెట్లలో ప్రధానంగా ఆఫ్‌షోర్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే జూన్ క్వార్టర్లో ఆఫ్‌షోర్ ఫండ్ విభాగంలో 1.7 బిలియన్ డాలర్ల అమ్మకాలు నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో ఇవి 1.1 బిలియన్ డాలర్లు మాత్రమే. కాగా.. 37 నెలల ఔట్‌ఫ్లో తదుపరి మార్చిలో 3.32 కోట్ల డాలర్ల పెట్టుబడులు రావడం గమనార్హం. అయితే కోవిడ్–19 సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ట్రెండ్‌కు వెంటనే బ్రేక్ పడింది. ఇక మరోవైపు సానుకూల పరిస్థితులను కొనసాగిస్తూ వరుసగా మూడో క్వార్టర్లోనూ ఆఫ్‌షోర్ ఈటీఎఫ్‌లకు నికరంగా పెట్టుబడులు తరలివచ్చాయి. జూన్ త్రైమాసికంలో 15.3 కోట్ల డాలర్ల ఇన్‌ఫ్లో నమోదైంది. మార్చి త్రైమాసికంలో నమోదైన 76.7 కోట్ల డాలర్లతో పోలిస్తే మాత్రం భారీగా తగ్గాయి. 2020 అక్టోబర్–డిసెంబర్‌లోనూ 88.2 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలానికి..: సాధారణంగా ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో పెట్టుబడులు దీర్ఘకాలానికి సంబంధించినవికాగా.. ఆఫ్‌షోర్ ఈటీఎఫ్‌ల ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పకాలిక ధృక్పథంతో ఇన్వెస్ట్ చేస్తుంటారు. 2018 ఫిబ్రవరి మొదలు ఈ రెండు ఫండ్స్ నుంచి నిరవధికంగా పెట్టుబడులు తరలిపోతూ వస్తున్నాయి. ఈ ట్రెండ్ 2020 మార్చికల్లా గరిష్టానికి చేరింది. దాదాపు 5 బిలియన్ డాలర్ల అమ్మకాలు నమోదయ్యాయి. వెరసి ఒక త్రైమాసికంలో అత్యధిక స్థాయి ఔట్ఫ్లోస్గా రికార్డు నమోదైంది. ఈ బాటలో 2021 జూన్‌కల్లా ఆఫ్‌షోర్ ఫండ్స్ నుంచి 20.8 బిలియన్ డాలర్లు, ఆఫ్‌షోర్ ఈటీఎఫ్‌ల నుంచి 2.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. జూన్ క్వార్టర్లో పెట్టుబడులు తరిగిపోయినప్పటికీ ఈ ఫండ్స్ ఆస్తుల విలువ మార్చి త్రైమాసికంతో పోలిస్తే 4 శాతం బలపడి 46.3 బిలియన్ డాలర్లకు చేరడం విశేషం! చదవండి : రష్యాలో ప్రాజెక్టులు,15 బిలియన్ డాలర్లు దాటిన భారత్ పెట్టుబడులు -
ఓటుపై ‘ఇంటెన్సివ్’ వేటు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతు కావడంతో శుక్రవారం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో లక్షలాది మంది ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. వేలాదిమంది ప్రజలు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ‘నా ఓటు ఏమైంది’ (#whereismyvote) అని ప్రశ్నిస్తూ ప్రచారోద్యమం నిర్వహించారు. జాబితాలో పేర్లు గల్లంతైన వేలాదిమంది ఈ హ్యాష్ ట్యాగ్‌ను వినియోగించి తమ నిరసన తెలియజేయడంతో ట్విట్టర్లో టాప్ ట్రెండ్స్‌లో ఒకటిగా శుక్రవారం ఈ ప్రచారోద్యమం నిలిచింది. 2014 సాధారణ ఎన్నికలు, 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నామని, తాజా శాసనసభ ఎన్నికల్లో తమ ఓటు హక్కు గల్లంతైందని చాలామంది జంట నగరాల ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారు. ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ (ఐఆర్‌ఈఆర్) పేరుతో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2017లో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమమే ఇందుకు కారణం. బూత్‌స్థాయి అధికారుల (బీఎల్వో)కు ట్యాబ్లెట్ పీసీలు చేతికిచ్చి ఈ 36 నియోజకవర్గాల్లో ఇంటింటికీ సర్వే నిర్వహించారు. ఈ స్థానాల్లో మొత్తం 1,09,44,968 ఓట్లు ఉండగా సర్వే అనంతరం ఏకంగా 24,20,244(22.11శాతం) ఓట్లను తొలగించారు. మరో 29,93,777(27.35 శాతం) ఓటర్లు తమ ఓట్లను కొత్త చిరునామాలకు బదిలీ చేసుకున్నారు. సర్వే తర్వాత 55,30,947 (50.53శాతం) ఓట్లు మాత్రమే ఉన్న చిరునామా ల్లోనే మిగిలాయి. ఈ సర్వేలోనే కొత్తగా 5,82,138 (6.4శాతం) ఓట్లను చేర్చారు. ఈ సర్వే ముగిసిన తర్వాత చివరికి 91,06,862 ఓట్లు జాబితాలో మిగిలాయి . ఈ వివరాలను నాటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) అనూప్‌సింగ్ 2017 డిసెంబర్ 5న విలేకరుల సమావేశంలో ప్రకటించారు. విచారణ జరపని ఎన్నికల సంఘం ప్రధానంగా నగర, పట్టణ ప్రాంతాలు కలిగిన ఆదిలాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, పటాన్చెరు, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, మలక్‌పేట్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాక త్పుర, బహదూర్‌పుర, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మహబూబ్‌నగర్, నల్లగొండ, స్టేషన్ ఘన్పూర్, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, ఖమ్మం, పాలేరు సెగ్మెంట్లలో ఈ సర్వే జరిగింది. ఈ 36 నియోజకవర్గాల తుది ఓటరు జాబితాను గత జనవరి 20న ప్రకటించారు. ఐఆర్‌ఈఆర్ పేరుతో నిర్వహించిన ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా దొంగ ఓట్ల పేరుతో సరైన విచారణ లేకుండానే అడ్డగోలుగా ఓట్లను తొలగించినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించకుండానే ఓట్లను తొలగించినట్లు విమర్శలున్నాయి. అయినా, తొలగించిన ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం విచారణ నిర్వహించకపోవడంతో తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో లక్షలమంది ఓట్లు గల్లంతు అయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. ఓటర్ల జాబితాలోని లోపాలపట్ల చాలా రోజులుగా చర్చ జరుగుతున్నా ఎన్నికల సంఘం ముందు నుంచి మొండిగా వ్యవహరించిందని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘నగరం’ విస్ఫోటంతో 240 కోట్ల ఆదాయానికి గండి
సాక్షి, రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామం వద్ద గెయిల్ గ్యాస్‌పైప్ లైన్ విస్ఫోటం నేపథ్యంలో.. బావులను మూసివేయడం తదితర కారణాల వల్ల తమ సంస్థ ఆదాయానికి రూ.240 కోట్ల మేర గండి పడిందని ఓఎన్జీసీ సీఎండీ డీకే షరాఫ్ తెలిపారు. ఈ ప్రమాదంలో వాటిల్లిన ఆర్థిక నష్టంకన్నా ప్రాణాతలు పోవడమే తమకు చాలా బాధ కలిగిస్తోందన్నారు. ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని రాజమండ్రి ఓఎన్జీసీ కార్యాలయంలో షరాఫ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గోల్ఫ్ కోర్ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరం పేలుడు అనంతరం బలహీనంగా ఉన్న పైప్లైన్ల మార్పును వేగవంతం చేశామని షరాఫ్ చెప్పారు. కేజీ బేసిన్లో మొత్తం 860 కిలో మీటర్ల పైప్లైన్లు ఉండగా అందులో ఇప్పటికే 50 శాతం మార్పు చేసినట్లు తెలిపారు. ఆఫ్‌షోర్, ఆన్‌షోర్‌ల్లో ఉత్పత్తికి సన్నాహాలు ఆఫ్‌షోర్‌లో కాకినాడ నుంచి సముద్రంలో 65 కిలోమీటర్ల దూరంలో డి-6 బావి సమీపంలో ఉన్న కేజీ 98/2 బావి నుంచి 2018 నాటికి చమురు ఉత్పత్తి ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధమైందని షరాఫ్ అన్నారు. ఇక్కడ నుంచి 2021లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావించామని, కానీ ముందుగానే ప్రారంభించేందుకు ఎక్స్పర్ట్ అసెట్ మేనేజర్ ప్రతిపాదించారని తెలిపారు. ఓఎన్జీసీ 51 శాతం, కెయిర్న్ ఇండియా 49 శాతం భాగస్వామ్యంతో ఆన్‌షోర్‌లో 2017నాటికి నాగాయలంక వద్ద సహజ వాయువు ఉత్పత్తికి యత్నిస్తున్నామన్నారు. ఈ ప్లాంట్ నుంచి 2019 నాటికి పూర్తిస్థాయి ఉత్పత్తి జరిగే అవకాశాలు ఉన్నాయని, ఇందుకు ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు. ఓఎన్జీసీ ద్వారా ప్రస్తుతం సుమారు 3 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోందన్నారు. ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా దేశవ్యాప్తంగా బాలికల పాఠశాలల్లో రూ.100.85 కోట్లతో 2,500 మరుగుదొడ్లు నిర్మిస్తున్నామన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో జిల్లాకు 12 చొప్పున ఈ మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. విలేకర్ల సమావేశంలో సమావేశంలో ఆన్‌షోర్ డెరైక్టర్ అశోక్‌వర్మ, రాజమండ్రి అసెట్ మేనేజర్ దేబశిష్ సన్యాల్ పాల్గొన్నారు. -
ఉద్యమాలతో ఉపాధి..భద్రతకు సమాధి
కాకినాడ : పచ్చని కోనసీమ ఇలా భగ్గుమన్నప్పుడల్లా ఉద్యమాలు పుట్టుకొస్తాయి. కానీ అవి నీటి మీద బుడగల్లా చల్లారిపోతుంటాయి. స్వచ్ఛంద సంస్థలు.. సామాజికవేత్తలు చిత్తశుద్ధితో ఉద్యమాలు చేసినా.. వాటికి సరైన రాజకీయ మద్దతు లభించకఎక్కడికక్కడ నీరుగారిపోతున్నాయి. ఇక కొందరు రాజకీయ నాయకులు చేసే ఉద్యమాల కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవన్నీ సూట్‌కేస్ ఉద్యమాలుగానే సాగుతున్నాయి తప్ప ఏనాడూ ఈ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ కోసం జరగలేదు. అందువల్లనే తమకీ దుస్థితి దాపురించిందని కోనసీమవాసులు గగ్గోలు పెడుతున్నారు. కోనసీమ భూగర్భంలో పుష్కలంగా సహజవనరులున్నాయని 1983లోనే గుర్తించారు. కానీ 1990 దశకంలోనే వీటి వెలికితీత కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆఫ్‌షోర్, ఆన్షోర్లలో సిస్మిక్ సర్వేలు ఎక్కువయ్యాయి. చమురు సంస్థలన్నీ ఈ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి పెట్టాయి. కేజీ బేసిన్ పరిధిలో 20 వేల చదరపు కిలోమీటర్లు, ఆఫ్‌షోర్‌లో 31 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చమురు, సహజవాయు నిక్షేపాలున్నాయని గుర్తించారు. వీటి వెలికితీతవల్ల తమ ప్రాంతం అన్ని రంగాల్లోనూ ఎంతో అభివృద్ధి చెందుతుందని కోనసీమ వాసులు ఎన్నో కలలుగన్నారు. 1995లోనే ఉద్యమాలకు శ్రీకారం వేల కోట్ల రూపాయలతో చమురు, సహజవాయువు ఆధారిత పరిశ్రమలు ఇక్కడ ఏర్పడతాయని, తద్వారా ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి సాధించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని ఆశించారు. కానీ వెలికితీత కార్యకలాపాలు ప్రారంభమైన కొద్ది నెలలకే తాము కాళ్లకిందే మందుపాతరలు పెట్టుకొని జీవిస్తున్నామని గుర్తించారు. దీంతో తమకీ దుర్భర జీవితాలు వద్దంటూ కోనసీమవాసులు 1995 నుంచే ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత జనవిజ్ఞాన వేదికతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అనేక దశల్లో ఉద్యమాలు చేపట్టాయి. కేజీ బేసిన్ పరిధిలోని ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జనవిజ్ఞాన వేదిక జీపుజాతాలు నిర్వహించి ప్రజల్ని చైతన్యపరచింది. తర్వాత కేజీ బేసిన్ పరిరక్షణ సమితి, కోనసీమ పరిరక్షణ సమితి వంటి ఎన్నో సంస్థలు ఈ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎన్నో ఉద్యమాలు చేశాయి. కానీ వీటికి సరైన రాజకీయ మద్దతు లభించకపోవడంతో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. సొమ్ము చేసుకున్న రాజకీయ నాయకులు కోనసీమవాసుల బలహీనతలను మాత్రం కొంతమంది రాజకీయ నాయకులు ఉద్యమాల పేరుతో క్యాష్ చేసుకున్నారు. గత రెండు దశాబ్దాల్లో కనీసం పలుమార్లు బ్లో అవుట్లు, పేలుళ్లు, విస్ఫోటాలతో పాటు వందలాది సార్లు గ్యాస్, ముడిచమురు లీకేజిలు ఏర్పడి వందలాది ఎకరాల్లో పచ్చని పంటపొలాలతో పాటు కొబ్బరితోటలు బుగ్గిపాలయ్యాయి. ఇటువంటి సంఘటనలు జరిగిన ప్రతిసారీ రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాలు చేసి సొమ్ము చేసుకోవడం ఇక్కడ పరిపాటిగా మారిపోయింది. చీకటిమాటున మారే సూట్‌కేసుల కోసమే తప్ప ఈ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేపట్టిన దాఖలాలే లేవు. ముఖ్యంగా పదేళ్లుగా రాజకీయ ఉద్యమాలు మరీ శృతి మించిపోయాయి. చమురు సంస్థలపై ఉద్యమాలు చేసిన ప్రతిసారీ పరిహారం లేదా సాయం కోసం తప్ప ప్రజల భద్రత గురించి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఏనాడూ పట్టించుకోలేదు. వారు నిజంగా ‘వాచ్డాగ్’ పాత్ర పోషించి ఉంటే చిత్తశుద్ధితో ప్రజల తరఫున ఉద్యమాలు చేసి ఉంటే కచ్చితంగా చమురుసంస్థలు భద్రతా చర్యలు పాటించేవన్న వాదన బలంగా వినిపిస్తోంది. పదేళ్లపాటు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ఒక ఎంపీ అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా రోడ్డెక్కడం.. ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయడం.. చమురు సంస్థలకు అల్టిమేటమ్‌లు ఇవ్వడం.. ఆనక మిన్నకుండిపోవడం సాధారణమై పోయింది. రెండేళ్ల క్రితం మన గ్యాస్ మనహక్కు అంటూ ఉద్యమించి ఓట్ల రాజకీయాలు చేయడం తప్ప ఏనాడూ చిత్తశుద్ధితో ఉద్యమించిన దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన ఒక్కరే కాదు ఇదే ప్రాంతానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి తన గురువు ప్రోద్బలంతో జీఎస్పీసీ సంస్థపై వేలాదిమంది మత్స్యకారులతో ఉద్యమించారు. ఆఫ్‌షోర్‌లో రిగ్‌ను కూడా ముట్టడించారు. జ్ఛరు కూడా పరిహారం కోసమే తప్ప ఈ ప్రాంత భద్రత కోసం ఉద్యమించలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో ఈ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ, ప్రజల భద్రత కోసం ఉద్యమించాలని కోరుతున్నారు. -
కేజీ బేసిన్లో కొత్త బావులపై ఓఎన్జీసీ దృష్టి
40 బావుల్లో వెయ్యి ఎంఎంసీఎండీ నిక్షేపాలు రూ. 440 కోట్లతో డ్రిల్లింగ్కు ప్రణాళిక సాక్షి ప్రతినిధి, కాకినాడ : కృష్ణా, గోదావరి బేసిన్లో కొత్తగా ఆఫ్‌షోర్ నుంచి చమురు, సహజవాయువు నిక్షేపాలను వెలికితీయవచ్చని ఓఎన్జీసీ గుర్తించింది. మూడు జిల్లాల్లో విస్తరించిన ఈ బేసిన్ పరిధిలో 40 కొత్త బావులను ఎంపిక చేసి, వాటి డ్రిల్లింగ్ ద్వారా రోజుకు వెయ్యి మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంసీఎండీ) ఆయిల్ లేదా చమురుతో కూడిన సహజ వాయువు లభిస్తుందని ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ డ్రిల్లింగ్ కోసం రూ.440 కోట్లు వెచ్చించాలనే నిర్ణయానికి వచ్చింది. గత కొంతకాలంగా ఈ బేసిన్లో నిర్వహిస్తున్న సెస్మిక్ సర్వే ఫలితాలను బట్టి అదనపు ఉత్పత్తి సాధ్యమవుతుందనే అంచనాకు వచ్చింది. డ్రిల్లింగ్ చేపట్టేందుకు పర్యావరణ అనుమతి కోసం శుక్రవారం రాజోలులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది. ఆ ప్రక్రియ పూర్తి కాగానే ఈ బేసిన్లో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధప్రాతిపదికన డ్రిల్లింగ్ నిర్వ హించనుంది. ఎకడెక్కడ ఎన్ని బావులు.. కృష్ణా జిల్లాలో ఐదు, తూర్పుగోదావరి జిల్లాలో 22, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 బావుల్లో నిక్షేపాలు ఉన్నట్టుగా ఓఎన్జీసీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. కృష్ణా జిల్లా కైకలూరులో మూడు, ముదినేపల్లి మండలం పెద్దకామనపల్లిలో ఒకటి, బంటుమిల్లి మండలం ముంజులూరులో ఒకటి, పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఏలేటిపాడులో రెండు, పెనుగొండ మండలం చిన్నంవారిపాలెంలో ఎనిమిది, అదే మండలం సిద్ధాంతంలో ఒకటి, నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరంలో ఒకటి, పెరవలి మండలం పి.వేమవరంలో ఒకటి, తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో మూడు, మండపేటలో ఐదు, సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఒకటి, మలికిపురం మండలం కేశనపల్లి వెస్ట్ పరిధిలో ఐదు, రాజోలు మండలం శివకోడు కమ్మపాలెం పరిధిలో ఏడు, అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరంలో ఒక బావిలో ఆయిల్, గ్యాస్ ఉన్నట్టు గుర్తించారు. గతంలో ఫలించిన అంచనాలు తూర్పు గోదావరిలో 22 బావుల్లో డ్రిల్లింగ్ కోసం రూ.242 కోట్లు, కృష్ణా జిల్లాలో ఐదు బావులకు రూ.55 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 13 బావులకు రూ.143 కోట్లు కేటాయించారు. 40 బావుల ద్వారా వెయ్యి మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు లేదా ఆయిల్‌తో కూడిన గ్యాస్ లభిస్తుందని ఓఎన్జీసీ అంచనా. ఇదే మాదిరి రెండేళ్ల క్రితం కేజీ బేసిన్ పరిధిలోని మూడు జిల్లాల్లో డ్రిల్లింగ్ చేపట్టగా అంచనాలు నిజమయ్యాయి. అప్పట్లో ఆ బావుల్లో రోజుకు 840 టన్నుల ఆయిల్, 3.8 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు గ్యాస్ లభిస్తుందనే అంచనాలు ఫలించాయి. ఈ సారి కూడా అదే స్థాయిలో చమురు, సహజవాయువు నిక్షేపాలు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. భూ సేకరణ కోసం... ఓఎన్జీసీ డ్రిల్లింగ్ కార్యక్రలాపాలు నిర్వహించేందుకు ప్రతి బావి కోసం ఐదు నుంచి ఆరు ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఆయా జిల్లాల యంత్రాంగాలకు ఓఎన్జీసీ ప్రతిపాదనలు పంపింది. పూర్తిస్థాయిలో చమురు అన్వేషణ చేపట్టి మూడు నుంచి నాలుగు నెలల్లో డ్రిల్లింగ్ పూర్తి చేయాలని భావిస్తోంది.