
విదేశాలకు చెందిన తన కస్టమర్లకు ఎగుమతులుగా పరిగణించని సేవలను అందించినందుకు ఇండిగో(Indigo)పై జీఎస్టీ అధికారులు జరిమానా విధించారు. దాంతోపాటు 2018, 2019, 2020 ఆర్థిక సంవత్సరాలకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్లను చెల్లించేందుకు నిరాకరించినందుకు ఇండిగో మొత్తం రూ.115.86 కోట్ల జరిమానా చెల్లించాలని తెలిపారు. ఇండిగో ప్రస్తుతం ఈ ఉత్తర్వులను అప్పిలేట్ అథారిటీ ముందు సవాలు చేస్తోంది.
ఫిబ్రవరి 4, 2025న ప్రకటించిన జరిమానాలో విదేశాల్లోని సంస్థ సర్వీసులు పొందేవారికి సంబంధించిన రూ.113.02 కోట్లు ఉన్నాయి. వీటిని జీఎస్టీ అధికారులు ‘సేవల ఎగుమతి’గా వర్గీకరించలేదు. దీనికితోడు నిర్దిష్ట ఆర్థిక సంవత్సరాలకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ చెల్లించేందుకు సంస్థ నిరాకరించింది. దాంతో రూ.2.84 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.115.86 కోట్లు ఫైన్ కట్టాలని అధికారులు తెలిపారు.
ఇండిగో స్పందన..
జీఎస్టీ(GST) విధించిన జరిమానాకు ప్రతిస్పందనగా ఇండిగో తన ఆర్థిక కార్యకలాపాలు లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని వాటాదారులకు హామీ ఇచ్చింది. తగిన చట్టపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇండిగో విమానయాన మార్కెట్ వాటా ఎక్కువగానే ఉంది. ఆర్థిక పనితీరు బలంగా ఉంది. కంపెనీ ఆదాయంలో క్రమంగా పెరుగుదల నమోదవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment