IndiGo
-
ఇండిగోకు రూ.115.86 కోట్ల జరిమానా
విదేశాలకు చెందిన తన కస్టమర్లకు ఎగుమతులుగా పరిగణించని సేవలను అందించినందుకు ఇండిగో(Indigo)పై జీఎస్టీ అధికారులు జరిమానా విధించారు. దాంతోపాటు 2018, 2019, 2020 ఆర్థిక సంవత్సరాలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను చెల్లించేందుకు నిరాకరించినందుకు ఇండిగో మొత్తం రూ.115.86 కోట్ల జరిమానా చెల్లించాలని తెలిపారు. ఇండిగో ప్రస్తుతం ఈ ఉత్తర్వులను అప్పిలేట్ అథారిటీ ముందు సవాలు చేస్తోంది.ఫిబ్రవరి 4, 2025న ప్రకటించిన జరిమానాలో విదేశాల్లోని సంస్థ సర్వీసులు పొందేవారికి సంబంధించిన రూ.113.02 కోట్లు ఉన్నాయి. వీటిని జీఎస్టీ అధికారులు ‘సేవల ఎగుమతి’గా వర్గీకరించలేదు. దీనికితోడు నిర్దిష్ట ఆర్థిక సంవత్సరాలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ చెల్లించేందుకు సంస్థ నిరాకరించింది. దాంతో రూ.2.84 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.115.86 కోట్లు ఫైన్ కట్టాలని అధికారులు తెలిపారు.ఇండిగో స్పందన..జీఎస్టీ(GST) విధించిన జరిమానాకు ప్రతిస్పందనగా ఇండిగో తన ఆర్థిక కార్యకలాపాలు లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని వాటాదారులకు హామీ ఇచ్చింది. తగిన చట్టపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇండిగో విమానయాన మార్కెట్ వాటా ఎక్కువగానే ఉంది. ఆర్థిక పనితీరు బలంగా ఉంది. కంపెనీ ఆదాయంలో క్రమంగా పెరుగుదల నమోదవుతోంది. -
Maha Kumbh 2025: పాల్గొన్న ఇండిగో సీఈవో.. మాటల్లో చెప్పలేని శాంతి..!
భారతదేశపు అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ఈ మహా కుంభమేళా. ఇందులో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 144 ఏళ్లకు ఒక్కసారి జరిగే ఈ వేడుకలో ఎందరో ప్రముఖులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. తాజాగా ఇండిగో సీఈవో డచ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆయన ఈ ఉత్సవాన్ని తిలకించి తన అధ్యాత్మిక అనుభవాల తోపాటు అందుకు సంబధించిన ఫోటోలను షేర్ చేసుకున్నారు.ఇండిగోIndiGo) సీఈవో పీటర్ ఎల్బర్స్(Pieter Elbers ) లింక్డ్ఇన్(LinkedIn)లో ఆ సందర్భం తాలుకా ఫోటోల తోపాటు తన అనుభవాన్ని కూడా షేర్ చేసుకున్నారు. ఈ డచ్ ఎగ్జిక్యూటివ్ తాను ఉదయం 5 గంటలకు త్రివేణి సంగమంలో స్నానం చేసి.. గందరగోళం నడుమ ఆధ్యాత్మిక శాంతిని పొందానన్నారు. ఈ ఏడాదిలో ఈ మహా కుంభమేళా అద్వితీయమైన ఘట్టంగా అభివర్ణించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు కేవలం 45 రోజుల్లోనే 450 మిలియన్ల మంది సందర్శకులను తరలివస్తారనేది అంచనా. 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకలో భూమిపై ఉండే యావత్తు మానవాళిలో అత్యధిక మంది ఈ అధ్యాత్మిక వేడుకలో చేరి గుమిగూడే సమయం ఇది. ఈ స్థాయిలో అసంఖ్యాక ప్రజలను చూడటం అనేది దాదాపు అసాధ్యం కూడా. ఇది యూరప్ జనాభాకు సమానం. పైగాయూఎస్ జనసాంద్రతకు మించి అని లింక్డ్ ఇన్ పోస్ట్‌లో రాసుకొచ్చారు ఎల్బర్స్. తాను గత వారంలోని గణతంత్ర దినోత్సవం నాడు భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత వారసత్వ సంగమాన్ని జరుపుకునే మహాకుంభమేళాలో పాల్గొన్నాను అని తెలిపారు. అంతేగాదు ఈ ప్రదేశానికి ఉన్న శక్తిని ఏ వాక్యం, ఏ పదం లేదా చిత్రాలు వర్ణించేందుకు సరిపోవు అని అన్నారు. తాను ఈ త్రివేణి సంగమంలో ఉదయ ఐదు గంటల సమయంలో పుణ్య స్నానాలు ఆచరించానని చెప్పారు. మంత్రాలు, ప్రార్థన, భక్తి, మానవత్వం ఐక్యతల నడుమ చుట్టుముట్టిన ఈ గందరగోళం మధ్య ఓ గొప్ప ఆధ్యాత్మిక శాంతిని అనుభవించే క్షణం దొరికిందని ఆనందంగా చెప్పారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే ఈ దివ్యమైన గొప్ప అనుభవంలో తాను భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు ఇండిగో సీఈవో. అంతేగాదు ఈ కార్యక్రమం కోసం అధికంగా వస్తున్న యాత్రికుల రద్దీని చక్కగా నిర్వహిస్తున్న తమ ఇండిగో బృందానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. ఈ మొదటి పదిరోజుల్లో పది కోట్లకు పైగా భక్తులు ఇప్పటికే సంగంలో స్నానాలు ఆచరించారు. అంటే ఈ 45 రోజుల పండుగ ముగిసే సమయానికి ఆ సంఖ్య కాస్తా 40 కోట్లకు చేరుతుందనేది అంచనా.(చదవండి: 'ది బిలియనీర్స్ డాటర్' ఆ ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్..!) -
Mahakumbh 2025: ప్రభుత్వ చొరవతో తగ్గిన విమానయాన ఛార్జీలు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో పలువురు విమానాల్లోనూ ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన పలు విమానయాన సంస్థలు విమానయాన ఛార్జీలను అమాంతం పెంచేశాయి.ప్రయాగ్‌రాజ్‌కు విమాన ఛార్జీల పెంపు పై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. మహా కుంభమేళా వేళ ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న విమానయాన సంస్థలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది. విమానయాన సంస్థలు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను కొనసాగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ నేపధ్యంలో ఇండిగో విమానయాన సంస్థ ప్రయాగ్‌రాజ్‌కు విమాన ఛార్జీలను 30 నుంచి 50 శాతం మేరకు తగ్గించింది.మహా కుంభమేళా సమయంలో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు పలు విమానయాన సంస్థలతో సమన్వయ సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశంలో, విమానయాన సంస్థల ప్రతినిధులు, డీజీసీఏ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి, దేశంలో వివిధ నగరాల నుంచి 132 విమానాలు ప్రయాగ్‌రాజ్‌కు సేవలు అందిస్తున్నాయి.ఇండిగో తన వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 16 వరకు ఢిల్లీ-ప్రయాగ్‌రాజ్ విమానాలకు టిక్కెట్ ధరలు రూ.13,500 కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయని తెలిపింది. జనవరి 31న ధరలు రూ.21,200 పైగా ఉన్నాయని పేర్కొంది. ఫిబ్రవరి 12కి ధరలు తగ్గి రూ.9 వేలకు చేరనున్నాయని తెలిపింది. అయితే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చొరవతో విమానయాన సంస్థలు టిక్కెట్ ఛార్జీలు తగ్గించనున్నట్లు ప్రకటించాయి. ఇది కూడా చదవండి; Mahakumbh 2025: ప్రతి భక్తుని రక్షణ బాధ్యత మాదే: సీఎం యోగి -
ఇండిగో సిబ్బంది ఓవరాక్షన్..: మంచు లక్ష్మి ఆగ్రహం
ఇండిగో విమానాయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో (IndiGo Airlines) సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారని మండిపడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఆ సంస్థను ట్యాగ్ చేసింది. నా లగేజ్ బ్యాగేజ్‌ను పక్కకు తోసేశారు. కనీసం నేను బ్యాగ్ ఓపెన్ చేసేందుకు కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పింది వినకపోతే నా బ్యాగును గోవాలోనే వదిలేస్తామన్నారు. ఇది చాలా దారుణం. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు.ఇండిగో సిబ్బంది వేధింపులుఒక్క మాటలో చెప్పాలంటే వేధించారు. చివరకు నా లగేజీకి సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ అందులో ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఇంత నిర్లక్ష్యంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు? అని ట్వీట్ చేసింది. తన బ్యాగుకు కనీసం లాక్ వేయలేదు, ట్యాగ్ కూడా వేయలేదని వీడియో సైతం షేర్ చేసింది. This is harassment @IndiGo6E 😭 after all that they did not even put a security tag in front of my eyes. In spite of insisting that they would do so if anything is missing, I doubt Indigo will take any responsibility. How is this even possible to run an airline like this?— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025My bag pulled aside and @IndiGo6E and they won’t let me open my bag. They insist to do it or else my bag will be left in Goa, someone help!!! Flt 6e585.. this is ridiculous, and the staff is being extremely rude— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025I rest my case @IndiGo6E 💔💔 pic.twitter.com/1AXPbumRm7— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025 చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడుకన్నడ బిగ్‌బాస్ విన్నర్‌గా 'రైతుబిడ్డ'.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..? -
ఇండిగో లాభం నేలచూపు
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 2,450 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా కరెన్సీ ఆటుపోట్లు లాభాలను దెబ్బతీశాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,998 కోట్లు ఆర్జించింది. అయితే ఇండిగో బ్రాండ్ విమాన సరీ్వసుల కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం రూ. 20,062 కోట్ల నుంచి రూ. 22,993 కోట్లకు ఎగసింది. కాగా.. ఇంధన వ్యయాలు తగ్గడానికితోడు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో రూ. 3,850 కోట్ల లాభం ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో 3.11 కోట్లమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసినట్లు వెల్లడించింది. బీఎస్ఈలో ఇండిగో షేరు 0.6 శాతం బలపడి రూ. 4,163 వద్ద ముగిసింది. -
36,000 అడుగుల ఎత్తులో ‘ఛాయ్.. ఛాయ్..’
‘ఛాయ్.. ఛాయ్.. టీ కావాలా మేడమ్.. సర్ ఛాయ్ ఇమ్మంటారా?’ సాధారణంగా బస్సు స్టాప్లోనో లేదా రైళ్లలోనూ ఇలా టీ సర్వ్ చేయడం చూస్తూంటారు. కానీ ఏకంగా 36,000 అడుగుల ఎత్తులో టీ సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది.. విమానంలో టీ సర్వ్ చేసి ఓ వ్యక్తి తోటి ప్రయాణికులను ఆశ్చర్యపరిచాడు. ఈమేరకు తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.ఇండిగో విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు తన సీటులో నుంచి లేచి ‘ఛాయ్.. ఛాయ్..’ అంటు తోటి ప్రయాణికులకు టీ సర్వ్ చేశాడు. అందుకు మరో ప్రయాణికుడు సాయం చేశాడు. డిస్పోజబుల్ గ్లాస్లో తోటి ప్యాసింజర్లకు టీను అందిస్తున్నట్లు తీసిన వీడియోను ఎయిర్‌క్రూ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by Aviation/CabinCrew's HUB 🇮🇳 (@aircrew.in)ఇదీ చదవండి: ఆన్లైన్ ఉన్నా చివరకు షోరూంలోనే..‘ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వారు టీ ఎలా తీసుకుళ్లుంటారు?’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘ఒక భారతీయుడు మాత్రమే టీని ఎప్పుడైనా ఎక్కడైనా సర్వ్ చేయగలడు’ అని మరో వ్యక్తి రిప్లై ఇచ్చాడు. -
కొత్త ఎలక్ట్రిక్ కారు.. పేరు మార్చేసిన మహీంద్రా: ఎందుకంటే..
మహీంద్రా ఎలక్ట్రిక్ కొత్తగా లాంచ్ చేసిన కారు పేరులో '6ఈ'ని ఉపయోగించడంపై.. భారత విమానయాన సంస్థ ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీంద్రా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఇండిగో అభ్యంతరాన్ని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా కంపెనీ తన బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారు పేరును 'బీఈ 6'గా మారుస్తున్నట్లు వెల్లడించింది. రెండు కంపెనీల మధ్య సంఘర్షణ అవసరం లేదు. కాబట్టే ఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంటే త్వరలో విక్రయానికి రానున్న మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు 'బీఈ 6'గా రానుంది.6ఈ పేరుతో ఇండిగో సేవలుఇండిగో సంస్థ తన బ్రాండింగ్ కోసం మాత్రమే కాకుండా.. ప్రయాణికులకు '6ఈ' పేరుతో సేవలందిస్తోంది. ఎయిర్‌లైన్ 6ఈ ప్రైమ్, 6ఈ ఫ్లెక్స్, బ్యాగేజ్ ఎంపికలు, లాంజ్ యాక్సెస్ వంటి వాటి కోసం కూడా 6ఈను ఉపయోగిస్తోంది. ఇప్పుడు మహీంద్రా '6ఈ'ను ఉపయోగించడం పట్ల ఇండిగో కోర్టును ఆశ్రయించింది. అయితే మహీంద్రా కంపెనీ తన కారు పేరును మార్చుకోవడంతో సమస్య సద్దుమణిగినట్లే అని స్పష్టమవుతోంది. -
ప్రపంచంలోనే చెత్త ఎయిర్‌లైన్స్.. ఇండిగో స్థానం ఇది!
విమానంలో ప్రయాణించాలంటే ఏ విమానయాన సంస్థ బెటర్ అనేది తెలుసుండాలి. అలాగే కేబిన్లు, సేవల నాణ్యత తోపాటు..విమానాలు ఎంత ఆలస్యంగా వస్తున్నాయన్నది కూడా అన్నింటికంటే ముఖ్యం. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీ ప్రతి ఏటా దీనికి సంబంధించి ప్రయాణికులకు అవగాహన కల్పించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది. ఏడాది మెత్తంలో ఎన్ని సార్లు ఆలస్యంగా కస్టమర్లను గమ్యస్థానాలకు చేర్చింది, సౌకర్యం, సేవలు, ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ వంటి అంశాల ఆధారంగా అత్యుత్తమమైనవి, చెత్త సర్వీస్ అందించిన ఎయిర్‌లైన్స్‌గా జాబితా చేసి ర్యాంకులు ఇస్తుంది. ఈ ఏడాది మాత్రం కస్టమర్ ఫీడ్‌బ్యాక్, కార్యచరణ సామర్థ్యం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్లైన్లకు ర్యాంకుల ఇచ్చింది.ఇందులో జనవరి నుంచి అక్టోబర్ వరకు గల డేటాను బేస్ చేసుకుని ఈ ర్యాంకులు ఇచ్చింది. ఇలా ర్యాంకులు ఎందుకంటే.. కేవలం ప్రయాణికుల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎయిర్‌లైన్స్‌ని ప్రోత్సహించడమేనని ఎయిర్ హెల్ప్ సీఈవో టామ్జ్ పౌల్జిన్ చెబుతున్నారు.2024 సంవత్త్సరానికి అత్యంత చెత్త విమానయాన సంస్థలు..100. స్కై ఎక్స్‌ప్రెస్101.ఎయిర్ మారిషస్102. తారోమ్103. ఇండిగో104. పెగాసస్ ఎయిర్‌లైన్స్105. ఎల్ అల్ ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్స్106. బల్గేరియా ఎయిర్107. నౌవెలైర్108. బజ్109. తునిసైర్2024 సంవత్సరానికి అత్యుత్తమ విమానయాన సంస్థలు..10. ఎయిర్ సెర్బియా9. వైడెరో8. ఎయిర్ అరేబియా7. లాట్ పోలిష్ ఎయిర్‌లైన్స్6. ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్5. ప్లే (ఐస్లాండ్)4. అమెరికన్ ఎయిర్‌లైన్స్3. యునైటెడ్ ఎయిర్‌లైన్స్2. ఖతార్ ఎయిర్వేస్1. బ్రస్సెల్స్ ఎయిర్లైన్స్ఈసారి బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్ 2018 నుంచి ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం చెలాయించి.. ఖతార్ ఎయిర్వేస్ను వెనక్కు నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఈ ఏడాది గణనీయమైన కార్యాచరణ అంతరాయాలను ఎదుర్కొన్నప్పటికీ..మంచి పనితీరును కొనసాగించి మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక కెనడియన్ క్యారియర్ ఎయిర్ ట్రాన్సాట్ 36వ స్థానంలో నిలవగా, డెల్టా ఎయిర్ లైన్స్ 17వ స్థానానికి పడిపోయింది. అలాగే జెట్‌బ్లూ, ఎయిర్ కెనడా దిగువ 50 స్థానాల్లో నిలిచాయి. అలాస్కా ఎయిర్‌లైన్స్ కూడా 88వ స్థానానికి పరిమతమయ్యింది.ఇండిగో స్పందన:భారత్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వే ఫలితాలపై స్పందించింది. సదరు గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హెల్ప్ ఇచ్చిన ర్యాంక్‌ని ఖండిచింది. తమ సంస్థ కస్టమర్లకు మంచి ప్రయాణ అనుభవాన్ని ఇస్తుందని స్పష్టం చేసింది. కస్టమర్ పిర్యాదులు కూడా తక్కువేనని పేర్కొంది ఇండిగో. భారత ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకారం..తొమ్మిది నెలల కాలంలో 7.25 కోట్లకు పైగా ప్రయాణికులను తీసుకెళ్లడమే గాక 61.3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. అంతేగాక నెలవారీగా కస్టమర్ పిర్యాదులను, సమయాపాలన డేటాను ప్రచురిస్తామని కూడా ఇండిగో స్పష్టం చేసింది. గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హెల్ప్ విశ్వసనీయత లేని విధంగా ర్యాంకులు ఇచ్చిందని, తమ విమానయాన సంస్థ డేటాని పరిగణలోనికి తీసుకుని ఇచ్చిన ర్యాంకు మాత్రం కాదని ఆరోపించింది. (చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక) -
కోర్టు మెట్లెక్కిన ఇండిగో: మహీంద్రా ఎలక్ట్రిక్‌పై దావా
దేశీయ వాహన తయారీ దిగ్గజం ఇటీవల 'బీఈ 6ఈ' ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. మహీంద్రా ఎలక్ట్రిక్ కొత్తగా లాంచ్ చేసిన కారు పేరులో '6ఈ'ని ఉపయోగించడంపై.. భారత విమానయాన సంస్థ ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. మహీంద్రా కంపెనీ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది.మంగళవారం ఈ కేసు జస్టిస్ 'అమిత్ బన్సల్' ముందుకు వచ్చింది. అయితే ఈయన ఈ కేసు నుంచి తప్పకున్నారు. కాబట్టి విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా పడింది. మహీంద్రా ఎలక్ట్రిక్ ఇండిగోతో సామరస్య పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇండిగో సంస్థ తన బ్రాండింగ్ కోసం మాత్రమే కాకుండా.. ప్రయాణికులకు '6ఈ' పేరుతో సేవలందిస్తోంది. ఎయిర్‌లైన్ 6ఈ ప్రైమ్, 6ఈ ఫ్లెక్స్, బ్యాగేజ్ ఎంపికలు, లాంజ్ యాక్సెస్ వంటి వాటి కోసం కూడా 6ఈను ఉపయోగిస్తోంది. ఇప్పుడు మహీంద్రా '6ఈ'ను ఉపయోగించడం పట్ల ఇండిగో కోర్టును ఆశ్రయించింది.నిజానికి మహీంద్రా ఎలక్ట్రిక్ నవంబర్ 25న 'బీఈ 6ఈ' నమోదు కోసం దరఖాస్తును చేసుకుంది. దీనిని రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్‌మార్క్ అంగీకరించింది. ద్విచక్ర వాహనాలను మినహాయించి, ఫోర్ వీలర్ వాహనాలకు '6E' హోదాను ఉపయోగించడానికి హక్కులను కంపెనీ సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు ఇండోగో అభ్యంతరం చెబుతోంది. దీనిపై తీర్పు త్వరలోనే వెల్లడవుతుంది. -
విద్యార్థులకు ఇండిగో స్పెషల్ ఆఫర్..
దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ 'ఇండిగో' విద్యార్థుల కోసం 'స్టూడెంట్ స్పెషల్' అనే ప్రత్యేకమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఇండిగో కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో విద్యార్థులకు ప్రత్యేక ఛార్జీలు, అదనపు ప్రయోజనాలు లభించనున్నట్లు ప్రకటించింది.విమాన టికెట్ మీద 6 శాతం రాయితీ కల్పించడం మాత్రమే కాకుండా.. 10 కేజీల వరకు అదనపు లగేజ్ తీసుకెళ్లడానికి ఇండిగో అనుమతించింది. విద్యార్థులు కోసం తీసుకొచ్చిన ఈ స్పెషల్ ఆఫర్ ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు అందుబాటులో ఉంటుందో.. స్పష్టంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశంఇండిగో ప్రకటించిన ఈ స్పెషల్ ఆఫర్ కేవలం హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా గోవా, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మొత్తం 80 రూట్లలో నడిచే విమాన సర్వీసుల్లో అందుబాటులో ఉంటుంది. 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న విద్యార్థులు తమ స్కూల్ లేదా యూనివర్సిటీకి సంబంధించిన ఐడీ కార్డును కలిగి ఉండాలి. ఐడీ కార్డు కలిగిన వారు మాత్రమే ఈ ఆఫర్ ఉపయోగించుకోవడానికి అర్హులు. -
రెండు సంస్థలదే ఆధిపత్యం!
దేశంలో మరిన్ని విమానయాన సంస్థలు కార్యకలాపాలు సాగించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం రెండు ప్రముఖ కంపెనీలే అధిక వ్యాపార వాటాను కలిగి ఉన్నాయని చెప్పారు. విమానయాన రంగంలో రెండు సంస్థలే ఆధిపత్యం కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈటీ ఇండియా అసెండ్స్ ఈవెంట్లో నాయుడు పాల్గొని మాట్లాడారు.‘ఏ పరిశ్రమలోనైనా పోటీ ఉండాలి. దాంతో వినియోగదారులకు తక్కువ ధరలకే సేవలందుతాయి. కానీ విమానయాన పరిశ్రమలో కేవలం రెండు సంస్థలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ రంగం ఈ సంస్థలకే పరిమితం కావడం సరైందికాదు. మరిన్ని కంపెనీలు ఈ విభాగంలో సేవలందించాలి. దాంతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందుతాయి. విమాన ప్రయాణం అందుబాటు ధరలో ఉండేలా ప్రభుత్వం టిక్కెట్ ధరలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నా ప్రభుత్వం విభిన్న పాలసీలను తయారుచేస్తోంది. ఈ రంగాన్ని మరింత ఉత్తమంగా ఎలా చేయగలమో ఆయా సంస్థలతో చర్చిస్తోంది. ఏదైనా విమానయాన సంస్థ దివాలా తీయడం లేదా పరిశ్రమను వదిలివేయడం మాకు ఇష్టం లేదు. ఈ పరిశ్రమలోకి కొత్త విమానయాన సంస్థలు ప్రవేశించేలా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రైవేట్ మూలధనం ద్వారా కార్యకలాపాలు సాగించే కొత్త కంపెనీలు దివాలా దిశగా వెళితే ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఎయిరిండియా గ్రూపులో ఇటీవల విస్తారా విలీనం అయింది. దాంతో దేశీయ విమానయాన మార్కెట్ వాటాలో 80 శాతం ఇండిగో, ఎయిరిండియాలే సొంతం చేసుకుంటున్నాయి. రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 2023లో మరో పదేళ్ల కాలంపాటు అంటే 2033 వరకు ఈ పథకాన్ని పొడిగించారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్(ఉడాన్) పథకంలో భాగంగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడం, విమానయానాన్ని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు
ఇండోనేషియా బాలీలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో బూడిద కమ్ముకుని పలు విమానాలు రద్దయ్యాయి. బాలీలోని ‘మౌంట్ లెవోటోబి లకీ-లకీ’ అనే అగ్నిపర్వతం రెండోసారి పేలడంతో దాదాపు 10 కిలోమీటర్ల(32,808 అడుగులు) ఎత్తులో దట్టంగా బూడిద కమ్ముకుందని అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రయాణాలు ప్రమాదకరమని చెప్పారు. దాంతో కొన్ని సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసినట్లు పేర్కొన్నారు.బాలీలోని ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో ఉన్న మౌంట్ లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం నవంబర్ 3న మొదట విస్ఫోటనం చెందింది. తిరిగి మంగళవారం పలుమార్లు భారీ స్థాయిలో బద్దలవ్వడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఇండిగో ప్రకటన విడుదల చేసింది. ‘బాలీలో ఇటీవలి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాంతో వాతావరణంలో భారీగా బూడిద మేఘాలు ఏర్పడ్డాయి. దానివల్ల ఆ ప్రాంతానికి వచ్చిపోయే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని తెలిపింది. ఇండిగో సంస్థ బెంగళూరు నుంచి ఇండోనేషియా బాలీకి రోజువారీ సర్వీసు నడుపుతోంది.ఢిల్లీ-ఇండోనేషియా మధ్య ప్రయాణించే రోజువారీ విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ధ్రువీకరించింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా బుధవారం ఇండోనేషియాకు ప్రయాణించే విమాన ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.ఇదీ చదవండి: గుడ్‌బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటనబాలీ నుంచి దాదాపు 800 కి.మీ దూరంలో ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో నవంబర్ 3న లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం మొదట విస్ఫోటనం చెందింది. దానివల్ల తొమ్మిది మంది మరణించారు. తాజాగా మంగళవారం మళ్లీ పలుమార్లు విస్ఫోటనం చెందింది. మొదటిసారి ఘటన జరిగిన సమయంలో నవంబర్ 4 నుంచి 12 వరకు సింగపూర్, హాంకాంగ్, కొన్ని ఆస్ట్రేలియన్ నగరాల నుంచి బాలీకి ప్రయాణించే 80 విమానాలు రద్దు చేశారు. -
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా ఇండిగో కో-ఫౌండర్
ఇండిగో కో-ఫౌండర్ 'రాకేష్ గంగ్వాల్' అమెరికాలోనే ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జులైలో బోర్డులో మెంబర్‌షిప్‌గా చేరిన గంగ్వాల్.. ఇటీవల 108 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 900 కోట్లు) విలువైన షేర్స్ కొనుగోలు చేశారు.కొత్త బోర్డు కమిటీ అధ్యక్షుల పేర్లతో పాటుగా గంగ్వాల్ స్వతంత్ర బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని ప్రకటించింది. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ తిరిగి బలమైన ఆర్థిక పనితీరుకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రెసిడెంట్, సీఈఓ బాబ్ జోర్డాన్ సహకారం కూడా ఉంటుందని గంగ్వాల్ పేర్కొన్నారు.సెప్టెంబరు 30, అక్టోబరు ప్రారంభంలో గంగ్వాల్ 3.6 మిలియన్ షేర్లను సౌత్‌వెస్ట్‌లో కొనుగోలు చేశారు. ఒక్కో షేరుకు 29 డాలర్ల నుంచి 30 డాలర్ల మధ్యలో ఉన్నాయి. మొత్తం పెట్టుబడి 108 మిలియన్ డాలర్లు. గంగ్వాల్ వరల్డ్‌స్పాన్ టెక్నాలజీస్‌కు చైర్మన్ & సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఈయన ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్ధి. 2022లో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీని స్థాపించారు. -
హైదరాబాద్ లో అలెర్ట్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు
-
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు
సాక్షి,హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ శుక్రవారం మధ్యాహ్నం అంగతకులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. అగంతకుల ఫోన్ కాల్‌తో ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. 130 ప్రయాణికులతో చండీగఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికుల్ని దించి సోదాలు నిర్వహించారు.గతకొన్ని రోజులగా విమానాలకు బాంబుల బెదిరింపుల బెదడ ఎక్కువైంది. ఈ బాంబు బెదిరింపులపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పందించారు. 9 రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. వాటిపై కేంద్రం దృష్టి సారించింది. విమానంలో బాంబ్ పెట్టామంటూ ఫేక్ కాల్ చేసిన బాలుడిని ముంబై పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికీ వస్తున్న బాంబు బెదిరింపులపైఫేక్ కాల్స్ లేదంటే ఉగ్రకోణం ఉందా? అనే దిశగా విచారణ చేపడుతున్నామని తెలిపారు. -
విమానం దారి మళ్లింపు.. కారణం..
ముంబై నుంచి ఫుకెట్ వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించినట్లు ఇండిగో శుక్రవారం తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను మలేషియాలోని పెనాంగ్‌కు మళ్లించినట్లు స్పష్టం చేసింది. విమాన మళ్లింపు వార్తను పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.‘ఫుకెట్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నాయని సమాచారం అందింది. దాంతో ప్రతిస్పందనగా ముంబై నుంచి ఫుకెట్‌కు వెళుతున్న ఫ్లైట్ నం 6E 1701 ఎయిర్‌క్రాఫ్ట్‌ను మార్గమధ్యలో దారి మళ్లించాం. ప్రతికూల వాతావరణానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే సమీప విమానాశ్రయమైన మలేషియాలోని పెనాంగ్‌లో దించాం. ఈమేరకు ప్రయాణికులకు సమాచారం అందించాం’ అని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఫుకెట్‌లోని వాతావరణ పరిస్థితిని సమీక్షించి తిరిగి ప్రయాణానికి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు.ఇదీ చదవండి: ‘అన్నీ అవాస్తవాలే’ఫుకెట్‌లో 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఆకాశం మేఘావృతమై ఉందని కొన్ని సంస్థల నివేదికల ద్వారా తెలిసింది. పశ్చిమం నుంచి గంటకు 15 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రతికూల వాతారణ పరిస్థితులు ఉన్నప్పుడు ముందస్తు సమాచారంతో విమానాలను దారి మళ్లించడం సర్వ సాధారణం. ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళనలు చెందకూడదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
కొండలు, లోయ ప్రాంతాల్లో సులువుగా నడిపేలా కొత్త టెక్నాలజీ
ఎత్తైన కొండలు, లోయ ప్రాంతాల్లోని ఎయిర్‌పోర్ట్‌ల్లో విమానాలను దించడం, టేకాఫ్ చేయడం సవాలుతో కూడుకున్న విషయం. ఈ సమస్యను అధిగమించేలా ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. నేపాల్ రాజధాని కాఠ్మాండూ లోయ చుట్టూ ఉన్న ప్రతికూల భౌగోళిక పరిస్థితులకు ధీటుగా విమానాన్ని నడిపేందుకు వీలుగా ఆర్ఎన్పీ ఏఆర్ టెక్నాలజీని వినియోగించింది.రిక్వైర్డ్ నేవిగేషన్ ఫర్‌ఫెర్మాన్స్ విత్ ఆథరైజేషన్ రిక్వయిర్డ్(ఆర్ఎన్పీ ఏఆర్)గా పిలువబడే ఈ టెక్నాలజీని విమానంలో వాడడం వల్ల ఎత్తు పల్లాలు వంటి ఎలాంటి భౌగోళిక పరిస్థితుల్లోనైనా విమానాన్ని నడపవచ్చని ఇండిగో తెలిపింది. ఎత్తైన ప్రాంతంపై ఉన్న కాఠ్మాండూ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (కేటీఎం) లాంటి విమానాశ్రయాల కోసం ప్రత్యేకంగా ఈ సాంకేతికతను తయారు చేసినట్లు పేర్కొంది. ఇటీవల ఇండిగో ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఈ ఆర్ఎన్పీ ఏఆర్ సాంకేతికను ఉపయోగించినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ‘డిస్కౌంట్ ధరకు హెల్మెట్’‘ఎత్తైన ప్రదేశంలోని ఉన్న కాఠ్మాండూ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (కేటీఎం) విమానాశ్రయం చుట్టూ హిమాలయాలు ఉన్నాయి. దాంతో ఎయిర్‌క్రాఫ్ట్‌ను దించడం, టేకాఫ్ చేయడం సవాలుగా మారుతుంది. ఆర్ఎన్పీ ఏఆర్ విధానం ద్వారా విమాన మార్గాన్ని ముందుగానే గుర్తించి అందుకు తగినట్లుగా పైలట్లు స్పందించే అవకాశం ఉంది. దాంతో ప్రమాదాలు తగ్గుతాయి. కొత్త సాంకేతికతతో ఎత్తు పల్లాల ప్రాంతాల్లో విమానాలను నడపడం సులువవుతుంది. అయితే ఈ టెక్నాలజీ వినియోగించాలంటే పైలట్లకు ప్రత్యేకంగా శిక్షణ అవసరం’ అని ఇండిగో తెలిపింది. -
లవ్ ఈజ్ ఇన్‌ద ఎయర్ : లవ్ ప్రపోజల్ వీడియో వైరల్
తాజ్‌మహల్ ముందే లవ్ ప్రపోజ్ చేయాలా ఏంటి? ఈఫిల్ టవర్ముందు నిలబడే ఐ లవ్ యూ చెప్పాలా? మంచి ఘడియ ముంచుకు రావాలే గానీ ఎక్కడైనా మనసులోని ప్రేమను వ్యక్తం చేయొచ్చు. అందుకే ఇండిగో విమానంలో తన ప్రియుడికి ప్రపోజ్ చేసిందో ప్రేయసి. లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ అన్నట్టున్న ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. "నేను గాలిలో ప్రపోజ్ చేశాను" అంటూ ప్రియురాలు ఐశ్వర్య బన్సల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ అందమైన ఈ వీడియో ప్రేమికుల మనసు దోచుకుంటోంది.బన్సల్, ప్రియుడు అమూల్య గోయల్ ఫ్లైట్ ఎక్కడంతో వీడియో ప్రారంభమవుతుంది. కొన్ని సెకన్ల తర్వాత, బన్సల్ తన బాయ్‌ఫ్రెండ్ వైపు నడుచుకుంటూ వెళ్లి మోకాళ్లపై నిలబడి తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దీంతో ప్రియుడు ఫుల్ ఖుష్ ఆగి ఆ క్షణంలోనే ఓకే చెప్పేసాడు. అంతే క్షణం ఆలస్యంగా తన బెటర్ హాఫ్ వేలికి ఉంగరాన్ని తొడిగింది. అంతేకాదు దీన్ని ఇండిగో కూడా సెలబ్రేట్ చేసింది. ఫ్లైట్ అటెండెంట్ మైక్రోఫోన్ తీసుకుని, ఇతర ప్రయాణీకుల దృష్టిని ఆకర్షిస్తూ ఈ పెళ్లి ప్రపోజ్ ప్రకటన చేయడం విశేషం. తన జీవితంలో ఎంతో అందమైన ఈ క్షణాలు చాలా ప్రత్యేకంగా ఉండాలని భావించాను. కానీ ఊహించిన దాని కంటే మించి ఇంత అందంగా ఉంటుందని అనుకోలేదు. సిబ్బంది ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డా.. అన్నీ అనుకున్నట్టుగాజరిగాయంటూ అంతులేని సంతోషాన్ని వ్యక్తం చేసింది బన్సల్. ఈ ప్రణయ పక్షుల వీడియోను మీరు కూడా చూసేయండి మరి! View this post on Instagram A post shared by Aishwarya Bansal (@aishwaryabansal_) -
ఆకాశ వీధిలో బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌దే హవా
దేశీయంగా చౌక విమానయాన సంస్థల (బడ్జెట్ ఎయిర్‌లైన్స్–ఎల్సీసీ) హవా కొనసాగుతోంది. అంతర్జాతీయ ట్రావెల్ డేటా సంస్థ ఓఏజీ తాజా గణాంకాల ప్రకారం ఎల్‌సీసీల మార్కెట్ వాటా అత్యధికంగా ఉన్న టాప్ 10 దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. మొత్తం సీట్ల సామర్థ్యంలో ఇండిగో సారథ్యంలోని ఎల్సీసీలకు ఏకంగా 71 శాతం వాటా ఉంది. అంతర్జాతీయంగా చూస్తే భారత్‌కు సమీప పోటీదారు ఇండోనేసియాలో ఇది 64 శాతమే. ఈ విషయంలో అంతర్జాతీయ సగటు 34 శాతంగానే ఉంది. ప్రపంచంలోనే టాప్‌లో ఉన్న నాలుగు విమానయాన సంస్థలు ఎల్సీసీలే కావడం గమనార్హం. సౌత్‌వెస్ట్, రయాన్ఎయిర్, ఇండిగో, ఈజీజెట్ ఈ లిస్టులో ఉన్నాయి. 2019 నుంచి అంతర్జాతీయంగా ఎల్‌సీసీల వాటా 13 శాతం మేర పెరిగింది. సంపన్న దేశాలు, చైనాలో ఎఫ్‌ఎస్‌సీలు .. ఇతర దేశాలను చూసినప్పుడు, అతి పెద్ద ఎయిర్‌లైన్స్ మార్కెట్లలో ఒకటైన చైనాలో ఫుల్ సరీ్వస్ ఎయిర్‌లైన్స్‌దే (ఎఫ్ఎస్సీ) హవా ఉంటోంది. అక్కడ ఎల్‌సీసీల మార్కెట్ వాటా కేవలం 12 శాతమే. ఇక బ్రిటన్ మార్కెట్లో పరిస్థితి కాస్త అటూ ఇటుగా ఉంది. ఎఫ్ఎస్సీలతో పోలిస్తే ఎల్సీసీలకు కాస్త మొగ్గు ఎక్కువగా ఉంది. రయాన్ఎయిర్, ఈజీజెట్, విజ్ ఎయిర్ వంటి ఎల్‌సీసీలు అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఎఫ్ఎస్సీలతో పోలిస్తే ఎల్‌సీసీల మార్కెట్ వాటా ఎక్కువగా ఉన్న దేశాలను పరిశీలిస్తే లాటిన్ అమెరికాలో బ్రెజిల్, యూరప్‌లో ఇటలీ, స్పెయిన్ మొదలైనవి ఉన్నాయి. అమెరికా, జర్మనీ, జపాన్ వంటి సంపన్న దేశాల్లో ఎఫ్ఎస్సీలదే ఆధిపత్యం ఉంటోంది. ఫుల్ సరీ్వస్ క్యారియర్లు ఇంకా కరోనా పూర్వ స్థాయికి కోలుకోవాల్సి ఉంది. ఇండిగో భారీగా విస్తరించడం భారత్‌లో ఎల్‌సీసీల మార్కెట్ వాటా వృద్ధికి దోహదపడింది. ఈ ఏడాది జూలై గణాంకాల ప్రకారం దేశీ ప్యాసింజర్ మార్కెట్లో ఇండిగో సంస్థకు 62 శాతం వాటా ఉంది. ఎల్సీసీ విభాగంలో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇతర ఆదాయంపరంగా సవాళ్లు.. మార్కెట్ వాటాను విస్తరించుకుంటున్నప్పటికీ దేశీయంగా ఎల్‌సీసీలు అనుబంధ ఆదాయాలను మాత్రం పెంచుకోలేకపోతున్నాయి. సీట్లను బట్టి ఫీజులు, ఆహారం, స్పెషల్ చెకిన్లు, సీట్ అప్గ్రేడ్లు, ఎక్స్ట్రా లగేజీ చార్జీలపరమైన ఆదాయం అంతంతే ఉంటోంది. దీన్ని పెంచుకునే అవకాశాలు పరిమితంగానే కనిపిస్తున్నాయి. 2022లో ఇండిగో మొత్తం ఆదాయంలో ఇతరత్రా అనుబంధ ఆదాయం వాటా 7.1 శాతమే. ఈ విషయంలో మొత్తం 64 ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో 54వ స్థానంలో ఉంది. అదే అంతర్జాతీయంగా టాప్ 10 ఎల్‌సీసీలను చూస్తే .. రయాన్ఎయిర్ గ్రూప్ ఆదాయాల్లో అనుబంధ ఆదాయం వాటా 35.7 శాతంగా ఉంది. అదే ఈజీజెట్ను చూస్తే ఇది 33.9 శాతంగా, సౌత్‌వెస్ట్ విషయంలో 24.9 శాతంగా ఉంది. ఈ విషయంలో ఇండిగో ఎక్కడో వెనకాల ఉండటం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
విమానంలోనే శిశువుకు జన్మనిచ్చిన గర్భిణి
విమానం గాల్లో ఉండగానే ఓ మహిళ శిశువుకు జన్మనిచ్చింది. సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ మార్గమధ్యలో మగబిడ్డకు జన్మనిచ్చారు.విజయవాడకు చెందిన దీప్తి సరసు వీర వెంకటరామన్(28) అనే గర్భిణి సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున విమానం గాల్లో ఉన్నప్పుడే పురిటి నొప్పులు మొదలయ్యాయి. విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే దీప్తి కూర్చున్న చోట చుట్టూ వస్త్రాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం అందించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఒక డాక్టర్, ఫ్లైట్ అటెండెంట్లు, మహిళా ప్రయాణికుల సహాయంతో గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇదీ చదవండి: సీప్లేన్ ఏరోడ్రోమ్ నిబంధనల సడలింపుపైలట్ అప్పటికే చెన్నై ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో ఉదయం 4:30కు ల్యాండ్ అయ్యే సమయానికి గ్రౌండ్ సిబ్బంది, వైద్యులు చేరుకుని వైద్య పరీక్షలు చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులు, సిబ్బంది, డాక్టర్‌ను పలువురు ప్రశంసించారు. అనంతరం తల్లి, బిడ్డలను అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
'క్యూట్ చార్జి' వసూలు చేసిన ఇండిగో.. నెటిజన్ల సెటైర్లు
ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్రయాణికుడి నుంచి టికెట్ చార్జీలతోపాటు ‘క్యూట్ ఫీజు’వసూలు చేయడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని సదరు ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వివాదం వైరల్‌గా మారింది. విమాన టికెట్ ధరకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేస్తూ.. ఇండిగోపై ప్రశ్నల వర్షం కురిపించాడు.ఈ పోస్టు ప్రకారం.. శ్రేయాన్ష్ సింగ్ అనే వ్యక్తి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతని వద్ద టికెట్ ధరతో పాటు క్యూట్ ఛార్జ్ కింద రూ.50, ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు కింద రూ.236, యూజర్ డెవలప్మెంట్ ఫీజు కింద రూ.1,003 ఎయిర్‌లైన్ వసూలు చేసినట్లుగా ఉంది. దీన్ని షేర్ చేస్తూ.. ‘‘ఏంటీ క్యూట్ ఫీజు? యూజర్లు అందంగా ఉన్నారని దీన్ని వసూలు చేస్తున్నారా? లేదా మీ విమానాలు క్యూట్‌గా ఉన్నాయని భావిస్తూ దానికి ఛార్జీ తీసుకుంటున్నారా?ఏంటీ యూజర్ డెవలప్మెంట్ ఫీజు? మీ విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నన్ను మీరు ఏవిధంగా డెవలప్ చేస్తారు? ఏంటీ ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు? ప్రయాణాల్లో నా భద్రత కోసం ప్రభుత్వానికి నేను పన్నులు కట్టట్లేదా? లేదా విమానాల్లో భద్రత కోసం పౌరవిమానయాన శాఖ ఔట్సోర్సింగ్ ఏమైనా ఇచ్చిందా?’’ అని ఆ ప్రయాణికుడు ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇప్పటికే 20లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు.అయితే దీనిపై ఇండిగో స్పందించింది. ఈ ఛార్జీలు ఎందుకో వివరణ ఇచ్చింది. ‘‘క్యూట్ అంటే కామన్ యూజర్ టర్మినల్ ఎక్విప్మెంట్ ఛార్జ్. సాధారణంగా ఎయిర్‌పోర్టుల్లో మెటల్ డిటెక్టింగ్ మెషిన్లు, ఎస్కలేటర్లు, ఇతర పరికరాలను ఉపయోగించినందుకు వీటిని వసూలు చేస్తాం. ఇక, యూజర్ డెవలప్మెంట్ ఫీజు అనేది.. ఎయిర్‌పోర్టులో మెయింటనెన్స్ కోసం ఛార్జ్ చేస్తున్నాం. సెక్యూరిటీ ఫీజు బుకింగ్‌కు సంబంధించినది’ అని ఎయిర్‌లైన్ వెల్లడించింది. -
స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు.. 77 మంది మహిళా పైలట్ల నియామకం
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇండిగో తన ఎయిర్‌బస్, ఏటీఆర్ విమానాల కోసం 77 మంది మహిళా పైలట్లను నియమించుకుంది. కొత్తగా చేరిన వారితో కలిపి సంస్థలోని మొత్తం మహిళా పైలట్ల సంఖ్య 800కు పెరిగింది.ఇండిగో సంస్థ నియమించుకున్న 77 మందిలో ఎయిర్‌బస్ ఫ్లీట్‌కు 72 మందిని, ఏటీఆర్ ఫ్లీట్‌కు 5 మంది మహిళా పైలట్లను విభజించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం పైలట్లలో మహిళలు సగటున 7-9 శాతంగా ఉన్నారని సంస్థ తెలిపింది. అదే ఇండిగోలోని మొత్తం పైలట్లలో మహిళా సిబ్బంది 14 శాతంగా ఉన్నారని సంస్థ ఫ్లైట్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ అషిమ్ మిత్రా పేర్కొన్నారు. మార్చి 31, 2024 నాటికి ఇండిగోలో 5,038 పైలట్లు, 9,363 క్యాబిన్ సిబ్బందితో సహా 36,860 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. సంస్థలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.ఇదీ చదవండి: ఖనిజాల వెలికితీతకు ప్రోత్సాహకాలు -
ఇండియా-బంగ్లాదేశ్ విమానాలు రద్దు
బంగ్లాదేశ్‌లో తీవ్ర నిరసనల మధ్య ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లారు. దాంతో స్థానికంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు ఆ దేశానికి నడిపే తమ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు ప్రయాణించే సర్వీసులను నిలిపేస్తున్నట్లు విమానయాన సంస్థలు చెప్పాయి. సోమవారం ముంబై నుంచి ఢాకాకు విమానాన్ని నడిపిన విస్తారా..తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. మంగళవారం పరిస్థితిని పర్యవేక్షించి నిర్ణయానికి వస్తామని పేర్కొంది. ఎయిరిండియా ఢిల్లీ నుంచి ఢాకాకు రోజువారీ రెండు విమానాలను నడుపుతుండగా వాటిని నిలిసేస్తున్నట్లు చెప్పింది.ఇదీ చదవండి: సైబర్ మోసాలు.. రూ.177 కోట్ల నష్టంఇండిగో సంస్థ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నుంచి ఢాకాకు విమానాలను నడుపుతుంది. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఢాకాకు బయలుదేరే విమానాలను రీషెడ్యూల్డ్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే అందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ‘మీ ప్రయాణ ప్రణాళికలకు కలిగిన అంతరాయానికి క్షమించాలి. బంగ్లాదేశ్‌లోని ఉద్రిక్తతలు కారణంగా విమానాలు రద్దు చేస్తున్నాం. తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. -
హైదరాబాద్ నుంచి ఇండిగో కొత్త సర్వీసులు
హైదరాబాద్-అహ్మదాబాద్ మధ్య విమానయాన సంస్థ ఇండిగో కొత్త, అదనపు సర్వీసులు నడుపుతామని ప్రకటించింది. హైదరాబాద్-హిరాసర్ మధ్య నూతన డెయిలీ సర్వీసును సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పింది.సెప్టెంబర్ ఒకటి నుంచి హైదరాబాద్-ఉదయ్‌పూర్ మధ్య వారంలో నాలుగు ఫ్లైట్స్, సెప్టెంబర్ మూడు నుంచి హైదరాబాద్-జోద్పూర్ మధ్య వారంలో మూడు సర్వీసులు తిరిగి మొదలు అవుతాయని చెప్పింది. కొత్త రూట్ల చేరికతో భాగ్యనగరి నుంచి 69 నగరాలకు ప్రతివారం డైరెక్ట్ ఫ్లైట్స్ సంఖ్య 1,220కి చేరనుంది. ఇక అహ్మదాబాద్ నుంచి అమృత్సర్, భువనేశ్వర్‌కు అదనపు ఫ్లైట్స్‌ను నడుపుతామని ఇండిగో పేర్కొంది.ఇదీ చదవండి: ధరలు తగ్గించిన ఏకైన దేశం ఇండియాప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెబుతున్నాయి. దాంతో కంపెనీలు తమ సర్వీసులు పెంచుతున్నాయి. మెట్రో నగరాలతోపాటు టైర్1, 2 సిటీలకు కూడా తమ సర్వీసులను పొడిగిస్తున్నాయి. దేశీయంగా నడిపే విమానాల సంఖ్యను పెంచుతున్నాయి. -
ఇండిగో విమానంలో మహిళ డ్యాన్స్.. వీడియో వైరల్
ఇండిగో విమానంలో ఇటీవల ఓ మహిళా ప్యాసింజర్ చేసిన డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలామంది ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం సాధరణమైందని ఈ వీడియో చూసిన వీక్షకులు కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇండిగో సంస్థ ఇలాంటి వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.సల్మాషేక్ అనే మహిళా ప్యాసింజర్ ఈ వీడియోలో నల్లటి చీర కట్టుకుని రజనీకాంత్ నటించిన ‘భాషా’ చిత్రంలోని ‘స్టైల్స్టైల్’ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్‌ను ఇప్పటికే 16 లక్షల మంది వీక్షించారు. View this post on Instagram A post shared by Salma Sheik (@salma.sheik.9216)ఇదిలాఉండగా, ఈ వీడియో చూసినవారు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఈ విమానం తన ప్రైవేట్ ఫ్లైట్ కాదు. ఇలా వ్యవహరించడం సరికాదు’ అంటూ ఒక వ్యక్తి కామెంట్ చేశారు. ‘ఈ వీడియో చాలా భయంకరంగా ఉంది. పబ్లిక్‌లో ఇలాంటివి చేయడానికి సిగ్గుపడాలి. ఆమె ధైర్యంగా ఉందని అభినందించాలో.. లేదా ఇలా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసినందుకు అసహనం వ్యక్తం చేయాలో తెలియడం లేదు’ అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. -
ఇండిగో కీలక ప్రకటన.. బెంగళూరు నుంచి అబుదాబి డైరెక్ట్ ఫ్లైట్
ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో.. అబుదాబీకి పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 1నుంచి బెంగళూరు - అబుదాబి మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.భారతీయ ప్రయాణికులకు సేవలందించడం మాత్రమే కాదు, అంతర్జాతీయ పర్యటనను కూడా సులభతరం చేయడానికి ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండిగో వారానికి ఆరు సార్లు బెంగళూరు నుంచి అబుదాబికి, అబుదాబి నుంచి బెంగళూరుకు ఫ్లైట్స్ నడపడానికి సిద్ధమైంది.బెంగళూరు నుంచి 6E 1438 విమానం మంగళవారం మినహా ప్రతి రోజూ రాత్రి 9:25 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 11:30 గంటలకు అబుదాబి చేరుకుంటుంది. అదే విధంగా బుధవారం మినహా అబుదాబి నుంచి అర్ధరాత్రి 12:30 గంటలకు బయలుదేరి 6E 1439 విమానం మరుసటి రోజు ఉదయం 5:45 గంటలకు కెంపెగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది.బెంగళూరు నుంచి అబుదాబి వెళ్లాలనుకునే వారికి ఇండిగో చేసిన ప్రకటన ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సంస్థ తన పరిధిని ఎప్పటికప్పుడు విస్తరిస్తూ.. ప్రజలకు తమదైన రీతిలో సేవలందిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రయాణికుల అవసరాలను బట్టి తన సర్వీసును మరింత పెంచనున్నట్లు సమాచారం. -
విమాన ప్రయాణం నాలుగు గంటలు ఆలస్యం..కారణం..
దిల్లీ నుంచి బాగ్డోగ్రాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం వాతావరణంలోని వేడిగాలుల వల్ల దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దిల్లీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల విమానప్రయాణాల్లో అంతరాయం ఏర్పడుతోందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం మధ్యాహ్నం 2:10 గంటలకు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి సమీపంలో ఉన్న బాగ్డోగ్రాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం సాయంత్రం 6:15గంటలకు బయలుదేరింది. దిల్లీలో వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. సోమవారం 45డిగ్రీల ఉష్ణోగ్రతతో గాలులు వీయడం వల్ల ప్రయాణంలో అంతరాయం ఏర్పడింది.ఈ సందర్భంగా ఇండిగో ప్రతినిధి మాట్లాడుతూ..‘అధిక ఉష్ణోగ్రతల వల్ల దిల్లీ నుంచి బాగ్డోగ్రాకు వెళ్లే ఇండిగో విమానం 6E 2521 ప్రయాణం ఆలస్యమైంది. ఇండిగో అన్నింటికంటే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వేడిగాలులతో కొన్నిసార్లు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాంతో ఆలస్యం అనివార్యమైంది. సంస్థ నిత్యం ప్రయాణికులకు సమాచారం అందిస్తుంది. ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని చెప్పారు.హీట్ వేవ్స్ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) ప్రకారం..వరుసగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ రోజులపాటు సగటు ఉష్ణోగ్రత కంటే గరిష్ఠ ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలు అధికంగా నమోదైతే దాన్ని హీట్‌వేవ్‌గా పరిగణిస్తారు. ప్రభావిత ప్రాంతం గరిష్ట ఉష్ణోగ్రత రెండు రోజుల పాటు వరుసగా 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే అది వేడి గాలులుగా మారే ప్రమాదముందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ఈ హీట్‌వేవ్‌ను ‘నిశ్శబ్ద విపత్తు’ అని కూడా పిలుస్తారు. భారత్‌లో హీట్‌వేవ్స్ సాధారణంగా మార్చి-జూన్ మధ్య, అరుదైన సందర్భాల్లో జులైలోనూ సంభవిస్తాయి. ఇటీవల దిల్లీలోని నరేలాతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు దిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. -
ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రత.. విమానంలో సాంకేతిక లోపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్డోగ్రా వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో విమానం బయలుదేరడం రెండు గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏసీ పనిచేయకపోవడంతో విమానంలో గాలి లేక కొందరు అస్వస్థతకు గురయ్యారు. విమానం డోర్ మూసివేయడంతో వేడి తీవ్రత ఎక్కువైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. ‘ప్రయాణికుల భద్రతకు ఇండిగో ప్రాధాన్యతనిస్తుంది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’అని తెలిపింది. -
ఒకే రన్‌వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?
ఎయిర్పోర్ట్ రన్‌వేపై దాదాపు నిమిషంలోపు రెండు విమానాలు ప్రయాణించడం సాధ్యమవుతుందా అంటే అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాతావరణంలో ఎలాంటి విజిబిలిటీ సమస్యలు లేవని నిర్ధారించుకుని షరతులకు లోబడి ఇది సాధ్యపడుతుందని నిబంధనలు చెబుతున్నాయి.ఒకే రన్‌వేపై రెండు విమానాలు ప్రయాణించేలా అనుమతులివ్వాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. ‘ఏటీసీ నియమాల ప్రకారం..వాతావరణంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవని నిర్ధారించుకోవాలి. విజిబిలిటీ సమస్యలు ఉండకూడదు. ప్రత్యేక షరతులకు లోబడి, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి మూడు నిమిషాలలోపు రెండు విమాన టేకాఫ్‌లు, రెండు ల్యాండింగ్లకు అనుమతించవచ్చు’అని పీటీఐ తెలిపింది.ముంబై ఎయిర్‌పోర్ట్‌లో..జూన్ 8న 6ఈ 6053 అనే ఇండిగో విమానం ఇందోర్ నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సి ఉంది. దాంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ను ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం అనుమతించాలని కోరారు. ఏటీసీ సూచనలను అనుసరించి ఇండిగో విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ఇదిలాఉండగా, ఎయిర్ఇండియాకు చెందిన ఏఐ657 అనే విమానం అదే సమయంలో ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఏటీసీ టేకాఫ్‌కోసం అనుమతించారు. దాంతో రెండు విమానాలు నిమిషం తేడాతో రన్‌వేపై ప్రయాణించాయి. ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల్లో ఇండిగో విమానం అదే రన్‌వేపై ల్యాండ్ అయింది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే రెండు విమానాల ప్రయాణికులకు తీవ్ర నష్టం జరిగేదని తోటి ప్యాసింజర్లు తెలిపారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ని విధుల్లో నుంచి తొలగించి విచారణ జరుపుతోంది.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్..!ఇదిలాఉండగా, విమానాశ్రయాల్లో అధిక జనసాంద్రత ఉన్నపుడు ఏటీసీలపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. ఏటీసీ, సంబంధిత పైలట్లు ఘటనకు సంబంధించి సరైన నిబంధనలు అనుసరించారా లేదా అనే అంశంపై డీజీసీఏ విచారణ జరుగుతుందని చెప్పారు. అధిక జనసాంద్రత కలిగిన విమానాశ్రయాల్లో ముంబై ఎయిర్పోర్ట్ ఒకటి. అక్కడ విమానాలరాకపోకలు ఎక్కువగా ఉంటాయి. విమానాశ్రయంలోని ఆర్డబ్ల్యూ27 అనే రన్‌వేపై గంటకు 46 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయని తెలిసింది.Serious security concern at @CSMIA_Official Mumbai Airport yesterday putting 100s of life at riskWhile @airindia ✈️ was in the process of take off, another 🛬 from @IndiGo6E was allowed to land on same runway@DGCAIndia takes action against #Mumbai ATC official responsible pic.twitter.com/nsJvHZrWTZ— Nikhil Lakhwani (@nikhil_lakhwani) June 9, 2024 -
ఒకే రన్‌వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
విమాన ప్రమాదమనగానే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఏదైనా విమాన ప్రమాదం తప్పిందని తెలియనే ఊపిరి పీల్చుకుంటాం. ఇటువంటి సందర్భాల్లో ఆయా విమానాల్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురవుతారు. తాజాగా ముంబైలో విమాన ప్రమాదం తృటిలో తప్పింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ముంబై విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలోని రన్‌వేపై నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతుండగా.. ఊహించని విధంగా అదే సమయంలో ఇండిగో విమానం ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో టేకాఫ్ అవుతున్న ఎయిరిండియా జెట్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగింది.ఈ ఘటనపై స్పందించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే డ్యూటీలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని సస్పెండ్ చేశారు. ఇక ఈ రెండు విమానాలు సమీపంగా వచ్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. Woh, this looks real close.@IndiGo6E lands just when @AirIndia was taking-off at Mumbai Airport.@DGCAIndia @FAANews @CSMIA_Official @MoCA_GoI pic.twitter.com/wRtFiTLKHE— Tarun Shukla (@shukla_tarun) June 9, 2024 -
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
-
100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలందించేలా ఇండిగో సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దానికోసం మూడు విమాన తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది.ఇండిగో సంస్థ ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. స్థానికంగా ప్రయాణికులకు రవాణా సేవలందించి లాభాలు పొందాలని యోచిస్తోంది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. అయితే వీటి తయారీకి ఏటీఆర్, ఎంబ్రాయిర్, ఎయిర్‌బస్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 50 విమానాలకు ఆర్డరు పెట్టి, తర్వాత మరో 50 విమానాలు కొనుగోలు చేయాలనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండిగో 45 ఏటీఆర్-72 విమానాలను నడుపుతోంది. అందులో ప్రతి విమానంలో 78 సీట్లు ఉంటాయి. ఈ ఏడాదిలో మరో 5 కొత్త విమానాలు కంపెనీలో చేరనున్నాయి.ఇదీ చదవండి: తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావంఏటీఆర్‌తోపాటు ఎయిర్‌బస్ ఏ220, ఎంబ్రేయర్ ఈ-175 రకం విమానాలను కంపెనీ పరిశీలిస్తోంది. ఇటీవల అంతర్జాతీయ మార్గాలను చేరుకునేందుకు వీలుగా ఏప్రిల్‌లో 30 ఎయిర్‌బస్ ఏ350-900 విమానాల కోసం ఆర్డర్ చేసింది. -
భారీ వర్షం.. నిలిచిన విమానాలు
ప్రపంచంలోనే రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌ల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో భారత్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఎయిర్ ఇండియా, ఇండిగో తమ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించాయి. దిల్లీ విమానాశ్రయంలో దుబాయ్‌కి వెళ్లే పది విమానాలు, దుబాయ్ నుంచి వచ్చే తొమ్మిది విమానాలను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. భారత్‌లోని వివిధ నగరాల నుంచి ఎయిరిండియా దుబాయ్‌కి వారానికి 72 విమానాలను నడుపుతోంది. #6ETravelAdvisory: Flights to/fro #Dubai stand canceled until 12 PM on Apr 18, due to Airport restrictions and operational challenges caused by bad weather and road blockages. Do explore our alternate flight options or request for a full refund by visiting https://t.co/xe8o6KQdpT — IndiGo (@IndiGo6E) April 17, 2024 ‘రాబోయే కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో విమానాలను నడిపేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం బాధిత ప్రయాణికులకు వసతి కల్పించడానికి కృషిచేస్తున్నాం. 16, 17 తేదీల్లో ప్రయాణాలకోసం టికెట్ బుక్చేసినవారు ఒకసారి తేదీ మార్చుకునేందుకు అవకాశం కల్పించనున్నాం. దాంతో వారు తమ గమ్యస్థానాలు చేరేలా ఏర్పాటు చేస్తున్నాం’అని ఒక ప్రతినిధి చెప్పారు. #TravelUpdate: SpiceJet flights to/from Dubai (DXB) are affected due to adverse weather conditions in Dubai. Please refer link https://t.co/rNJZcxc6Wo for an alternate flight, or a full refund. You may also get in touch with our 24/7 Customer Care Helpline Numbers at +91 (0)124… — SpiceJet (@flyspicejet) April 17, 2024 ఇదీ చదవండి: ఎన్పీసీఐ సమావేశం..గూగుల్‌పే, ఫోన్‌పేకు లేని ఆహ్వానం! ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఇండిగో, స్పైస్‌జెట్‌తో సహా ఇతర విమానయాన సంస్థలు దుబాయ్‌కి వెళ్లే మార్గంలో అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్‌కి వెళ్లే అన్ని సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రకటించింది. 2023 ఏడాదికిగాను ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండో విమానాశ్రయంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
తొలిసారి కుటుంబాన్ని ఫ్లైట్ ఎక్కించిన పైలట్.. తల్లి కంటతడి
విమానంలో ప్రయాణించడం ప్రతి ఒక్కరి కల. కొంతమందికి ఇది తేలికైన విషయమే కావచ్చు. కానీ ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనుకునే వారి సంఖ్య అనేకం. వీరిలో చాలామందికి ఈ ఆశ నిరాశగానే మిగిలిపోయిన సందర్బాలూ ఉన్నాయి. తాజాగా ఓ పైలట్ తన కుటుంబాన్ని మొదటిసారి విమానం ఎక్కించాడు. దీంతో ఆనందంతో తల్లి కంటతడి పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రదీప్ కృష్ణన్ అనే వ్యక్తి ఇండిగో విమానంలో పైలట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల తన కుటుంబాన్ని తొలిసారి విమానం ఎక్కించాడు. తన తల్లి, బామ్మ, తాతను చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న విమానం ఎక్కించి సర్ప్రైజ్ చేశాడు. ‘మావాళ్లు మొదటిసారి విమానంలో ప్రయాణిస్తున్నారు. ఇది నాకేంతో సంతోషంగా ఉంది. చిన్నప్పుడు తాత తన స్కూటర్‌పై నన్ను తిప్పేవాడు. ఇప్పుడు నా డ్రైవింగ్‌లో తాతను విమానంలో తీసుకెళ్తున్నా’ అంటూ టేకాఫ్‌కు ముందు విమానంలోని ప్రయాణికులకు ప్రత్యేక అనౌన్స్మెంట్ ద్వారా తన కుటుంబాన్ని పరిచయం చేశాడు. ఈ క్రమంలో పైలట్ తల్లి భావోద్వేగంతో కంటతడి పెట్టుకుంది. అనంతరం విమానంలో ప్రయాణికులందరూ చప్పట్లు కొట్టి ఆ కుంటుబానికి వెల్కమ్ చెప్పారు. View this post on Instagram A post shared by Pradeep Krishnan (@capt_pradeepkrishnan) -
విమానంలో సీట్ కుషనింగ్ మాయం! - ఏం జరిగిందంటే..
ఇటీవల ఓ మహిళకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. విమానంలోని కుషనింగ్ లేకుండా ఉన్న సీటు చూసి ఒక్కసారిగా షాకయింది. దీనికి సంబంధించిన ఫోటో తీసి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. యవనిక రాజ్ షా అనే మహిళ బెంగళూరు నుంచి భోపాల్‌కు వెళ్లే సమయంలో ఆమె ప్రయాణించే ఇండిగో 6E 6465 విమానంలో కుషనింగ్ లేని సీటు చూసి, ఫోటోను ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. బ్యూటిఫుల్ @IndiGo6E నేను సురక్షితంగా ల్యాండ్ అవుతానని ఆశిస్తున్నానని ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన ఇండిగో.. మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు అంటూ.. క్లీనింగ్ కోసం కుషన్లను మార్చామని, క్యాబిన్ సిబ్బందికి సమాచారం అందించినట్లు, శుభ్రమైన సీట్లను కేటాయించడంలో భాగంగా ఇలా జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు వావ్ మసాజ్ సీట్లు అని పేర్కొన్నారు. మరో వ్యక్తి బహుశా మునుపటి ప్రయాణికులు వాటిని తీసుకెళ్లిపోయారేమో అని అన్నారు. Beautiful @IndiGo6E — I do hope I land safely! :) This is your flight from Bengaluru to Bhopal 6E 6465. pic.twitter.com/DcPJTq3zka — Yavanika Raj Shah (@yavanika_shah) March 6, 2024 -
ఎకానమీ క్లాస్‌లో సూపర్ స్టార్.. వీడియో వైరల్!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల లాల్ సలామ్ సినిమాలో మెప్పించారు. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో కీ రోల్ పోషించారు. గతనెల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఆయన ప్రస్తుతం వెట్టైయాన్ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా తలైవా కడప ఎయిర్‌పోర్ట్‌లో మెరిశారు. ఓ సామాన్యుడిలా ఎకానమీ క్లాస్‌లో దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన తలైవా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దటీజ్ సూపర్ స్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఓ ప్రయాణికుడు ట్విటర్లో రాస్తూ.. నేను దేవుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నాను అంటూ పోస్ట్ చేశాడు. అదే ఫ్లైట్‌లో ఉన్న నటుడు జీవా కూడా ఉన్నారు. ఆ తర్వాత రజనీకాంత్ బస్సులో ప్రయాణిస్తున్న వీడియోను నటుడు జీవా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. రజనీకాంత్, జీవా బస్సులో నిలబడి ఉన్న ఫోటోలు, వీడియోలు కూడా వైరలయ్యాయి. సీసీఎల్ కోసం చెన్నై రైనోస్ టీమ్‌తో కలిసి వీరిద్దరు బస్సులో వెళ్లారు. View this post on Instagram A post shared by Jiiva (@actorjiiva) #Thalaivar at flight ❤️❤️❤️❤️#Rajinikanth | #Rajinikanth𓃵 | #SuperstarRajinikanth | #SuperStarRajinikanth𓃵 | #Jailer | #Thalaivar171 | #Jailer2 | #Vettaiyan | #superstar @rajinikanth pic.twitter.com/b443yrgcU0 — Suresh balaji (@surbalutwt) February 29, 2024 -
హైదరాబాద్–బ్యాంకాక్ మధ్య ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండిగో తాజాగా హైదరాబాద్–బ్యాంకాక్ మధ్య నేరుగా సరీ్వసులను సోమవారం ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఉదయం 3.55కు విమానం బయల్దేరి 9.05కు బ్యాంకాక్ చేరుకుంటుంది. ఇరు నగరాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ నడుపుతున్న భారతీయ తొలి విమానయాన సంస్థ తామేనని ఇండిగో ప్రకటించింది. భారత్–బ్యాంకాక్ మధ్య ఇండిగో ప్రతి వారం 37 సరీ్వసులు నడుపుతోంది. -
Indigo: పైలట్ కళ్లలోకి లేజర్ లైట్.. గాల్లో 171 మంది ప్రాణాలు
కోల్‌కతా: బెంగళూరు నుంచి కోల్‌కతా వచ్చిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కోల్‌కతాకు చేరుకుని ల్యాండింగ్‌కు సిద్ధమైన సమయంలో అప్రోచ్ ఫన్నెల్ నుంచి విమానం కాక్‌పిట్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు లేజర్ లైట్ వేశారు. ఈ కిరణాలు పైలట్ కళ్లలో పడ్డాయి. ఈ నెల 23న రాత్రి 7.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాసేపట్లో ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన ఆపరేషన్ చేస్తున్న సమయంలో పైలట్ కళ్లలో లేజర్ లైట్ పడటంతో అతడి కళ్లు కాసేపు కనిపించలేదు. దీంతో విమానం రన్ వే వైపు నిమిషానికి 1500 నుంచి 2000 అడుగుల వేగంతో కిందకు దూసుకువచ్చింది. ఈ సమయంలో విమానంలో 165 మంది ప్యాసింజర్లతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. చివరకు విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఇలాంటి ఘటనలు జరిగినపుడు విమానాన్ని ల్యాండ్ చేయకుండా మళ్లీ ఆకాశంలోకి తీసుకెళ్లి చక్కర్లు కొట్టాల్సి ఉంటుంది. ఈ ఘటనపై ఇండిగో సంస్థతో పాటు నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఎయిర్పోర్ట్ సిబ్బంది స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టేక్ఆఫ్, ల్యాండింగ్ సమయాల్లో పైలట్ల దృష్టి మరలితే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. గూడ్సు రైలు కలకలం.. డ్రైవర్ లేకుండానే ముందుకు వెళ్లి -
‘వాటే లాజిక్ .. వాటే లాజిక్’.. ఇండిగో!
ఇటీవల కాలంలో పలు విమాన సంస్థలు ప్రయాణికులకు అందించే సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆహారంలో బొద్దింకలు, రాళ్లు ప్రత్యక్షమవుతున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఆయా ఘటనలపై సదరు విమానయాన సంస్థలు క్షమాపణలు చెప్పడం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జరిమానాలు విధిస్తున్నాయి. కానీ విమానయాన సేవల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు కొనుగోలు చేసిన శాండ్విచ్లో స్క్రూ ప్రత్యక్షమవ్వడంతో నెవ్వెరపోయింది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. జ్యోతి రౌతేలా ఫిబ్రవరి 1న బెంగళూరు నుండి చెన్నైకి ఇండిగో ఫ్లైట్‌లో బయలుదేరింది. విమానంలోనే స్పినాచ్ కార్న్ చీజ్ శాండ్విచ్ను ఆర్డర్ పెట్టుకుంది. ఆ శాండ్ విచ్ను తినడకుండా అలాగే జర్నీ చేసింది. Got a screw in my sandwich byu/MacaroonIll3601 inbangalore సరిగ్గా చెన్నై విమానశ్రయంలో దిగిన తర్వాత జ్యోతి రౌతేలాను అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ భద్రతా తనిఖీల్లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇండిగో ఫ్లైట్‌లో ఆర్డర్ పెట్టిన శాండ్విచ్లో బోల్ట్ ఉండడం చూసి కంగుతిన్నది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. సంబంధిత విభాగంపై చర్యలు తీసుకోవాలని ఇండిగో అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇండిగో అధికారులు మాత్రం .. మీరు విమాన ప్రయాణంలో శాండ్ విచ్ తిని ఉంటే చర్యలు తీసుకోనే వాళ్లం. కానీ మీరు విమానం దిగిన తర్వాత శాండ్ విచ్లో బోల్ట్ ఉందని ఫిర్యాదు చేస్తే లాభం లేదని చెప్పడంతో నిర్ఘాంతపోయినట్లు చెప్పారు. ఈ విషయంపై నెటిజన్ల ఇండిగో తీరును విమర్శిస్తున్నారు. ప్రయాణికుల పట్ల ఇండిగో బాధ్యతా రహితంగా వ్యవహరించడం సరికాదని హితువు పలుకుతున్నారు. -
ఇండిగో, కోల్‌కతా ఎయిర్ పోర్ట్ నిర్వాకం: మహిళా పారా అథ్లెట్ ఆగ్రహం
బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఇండిగోకు సంబంధించి మరో అనుచిత ఘటన వివాదాన్ని రేపింది. అలాగే కోల్‌కతా విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది దివ్యాంగ మహిళ పట్ల అమానుషంగా వ్యవరించారు. దీనికి సంబంధించిన ఘటనను ఆమె ట్విటర్ షేర్ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్ సమయంలో వికలాంగురాలైన (వీల్‌చైర్ యూజర్ కూడా) తనను మూడుసార్లు లేచి నిలబడాలంటూ కోరారని న్యాయ విద్యార్థిని ఆరూషి సింగ్ ట్వీట్ చేశారు. మొదట ఆమె నన్ను లేచి కియోస్క్‌లోకి రెండు అడుగులు వేయమని చెప్పింది. పుట్టుకతోనే తనకు వైక్యల్యంఉందని తన వల్ల కాదని చెప్పినా. వినిపించుకోకుండా రెండు నిమిషాలే అయిపోతుంది అంటూ వేధించారని ఆమె ఆరోపించారు. దీంతో తాను భయంతో వణికి పోయానంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు 20 నిమిషాలు లేటైందని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి జరిగినా, ఇండిగోకు ఇంకా బుద్ధి రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కోల్‌కతా ఎయిర్‌పోర్టు అధికారులు వైకల్యం ఉన్న ప్రయాణీకుల పట్ల వ్యవహరించాల్సిన తీరును పునరాలోచించాల్సిన అవసరం ఉందని సింగ్ కోరారు. ఈ ఘటనపై సిఐఎస్ఎఫ్, కోల్‌కతా విమానాశ్రయం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయ లేదు. Yesterday evening during the security clearance at Kolkata airport, the officer asked me (a wheelchair user) to stand up, not once but thrice. First she asked me to get up and walk two steps into the kiosk. (1/1) — Arushi Singh (@singhharushi) February 1, 2024 ఇది ఇలా ఉంటే ఇండిగోకు సంబంధించి తాజా సంఘటన కలకలం రేపింది. వీల్ చెయిర్ విషయంలో ఇండిగో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారంటూ ఆసియా పారా గేమ్స్ పతక విజేత , పారా అథ్లెట్ సువర్ణ రాజ్ ఆరోపణలు గుప్పించారు. దివ్యాంగురాలైన తనకు విమానం డోర్ దగ్గర తన వీల్ చెయిర్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేశారని మండి పడుతూ తన అనుభవాన్ని ఏఎన్ఐతో షేర్ చేశారు. #WATCH | Chennai, Tamil Nadu: Indian para-athlete Suvarna Raj alleges that she was mistreated by IndiGo Airlines crew members while taking a flight from New Delhi to Chennai yesterday. "...I told them 10 times that I want my personal wheelchair at the aircraft door, but no… pic.twitter.com/avResgXHJ0 — ANI (@ANI) February 3, 2024 విమానం డోర్ వద్ద తనకు వ్యక్తిగత వీల్‌చైర్ గురించి సిబ్బంది స్పందించలేదని ఆరోపించారు. న్యూఢిల్లీనుంచి చెన్నైకి వెళ్తుండగా ఇండిగో సిబ్బంది తన పట్ల దారుణంగా ప్రవర్తించారని సువర్ణ తెలిపారు. ఇండిగో నిర్ల్యక్షం మూలంగా తన వ్యక్తిగత వీల్‌చైర్ పాడైందని, దాని రిపేర్‌కు రూ. 3 లక్షలు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. ఈ నష్టాన్ని ఇండిగోనే భరించాలన్నారు. వికలాంగులకు వీల్చైర్లు ప్రోటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సువర్ణ డిమాండ్ చేశారు. అంతేకాదు సింగ్ వ్యవహారంపై కూడా ఆమె స్పందించారు. వికలాంగుల సమస్యను అర్థం చేసుకొని వారి పట్ల సున్నితంగా వ్యవహరించాలని రాజ్ కోరారు. -
ఇండిగో లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 2,998 కోట్లను అధిగమించింది. వెరసి వరుసగా ఐదో త్రైమాసికంలోనూ లాభదాయక పనితీరును ప్రదర్శించింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 1,423 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 15,410 కోట్ల నుంచి రూ. 20,062 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 15.4 శాతం నికర లాభ మార్జిన్లు ఆర్జించినట్లు ఇండిగో బ్రాండు విమానయాన సేవల కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. వరుసగా ఐదు క్వార్టర్లపాటు లాభాలు సాధించడంతో కోవిడ్–19 కారణంగా నమోదైన నష్టాల నుంచి రికవర్ అయినట్లు తెలియజేశారు. సానుకూల నెట్‌వర్త్‌కు చేరినట్లు వెల్లడించారు. ఈ క్యూ3లో ప్రయాణికుల టికెట్ ఆదాయం 30 శాతంపైగా జంప్‌చేసి రూ. 17,157 కోట్లను తాకగా.. అనుబంధ విభాగాల నుంచి 24 శాతం అధికంగా రూ. 1,760 కోట్లు లభించినట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు బీఎస్ఈలో 2 శాతం పుంజుకుని రూ. 3,127 వద్ద ముగిసింది. -
రన్‌వేపైనే భోజనం.. ఇండిగోకు నోటీసులు
ముంబయి: ఇండిగో, ముంబయి విమానాశ్రయానికి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. విమానం ఆలస్యంతో ప్రయాణికులు రన్‌వైపై కూర్చుని భోజనం చేసిన వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. ఈ ఘటనకు ముంబయి విమానాశ్రయం, ఇండిగో రెండూ బాధ్యులుగా ఉన్నాయని నోటీసులో పేర్కొంది. విమానాశ్రయంలో అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించలేదని మండిపడింది. passengers of IndiGo Goa-Delhi who after 12 hours delayed flight got diverted to Mumbai having dinner just next to indigo plane pic.twitter.com/jGL3N82LNS — JΛYΣƧΉ (@baldwhiner) January 15, 2024 పొగమంచు కారణంగా ముంబయి విమానాశ్రయంలో ఇండిగో విమానం ఆలస్యం అయింది. దీంతో ప్రయాణిికులు రన్‌వేపైనే వేచి ఉన్నారు. అక్కడే భోజనం కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానాశ్రయంలో విశ్రాంతి గదులు, రిఫ్రెష్మెంట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులను రన్‌వేపైనే ఉంచడంపై కేంద్రం మంత్రిత్వ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. విమానం ఆలస్యం కావడంపై ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో కెప్టెన్‌పై ఓ ప్రయాణికుడు చేయిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర విమానయాన శాఖా మంత్రి సింథియా స్పందించారు. ప్రయాణికులు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని కోరారు. మంత్రిత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, విమానాల ఆలస్యంపై ప్రత్యేక నిబంధనలను విడుదల చేశారు. ఆ తర్వాత ముంబయి విమానాశ్రయంలో ప్రయాణికులు రన్‌వేపైనే కూర్చుని భోజనం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: కృష్ణ జన్మభూమి కేసు: మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే -
Video: విమానం ఆలస్యంపై ప్రకటన.. కెప్టెన్‌పై ప్రయాణికుని దాడి
ఢిల్లీ: ప్రయాణాల ఆలస్యం వివాదంపై ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఈ క్రమంలోనే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. విమానం ఆలస్యం గురించి ప్రకటిస్తున్న నేపథ్యంలో ఓ ప్రయాణికుడు కెప్టెన్‌పై దాడికి యత్నంచాడు. కెప్టెన్ చెంప చెల్లుమనిపించాడు. ఇంతలో ఇతర ప్రయాణికులు అడ్డుతగలడంతో వెనక్కి తగ్గాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. A passenger punched an Indigo capt in the aircraft as he was making delay announcement. The guy ran up from the last row and punched the new Capt who replaced the previous crew who crossed FDTL. Unbelievable ! @DGCAIndia @MoCA_GoI pic.twitter.com/SkdlpWbaDd — Capt_Ck (@Capt_Ck) January 14, 2024 వీడియోలో చూపిన విధంగా ఢిల్లీ విమానాశ్రయంలో 6E-2175 విమానాన్ని నిలిపి ఉంచారు. గోవా వెళ్లాల్సిన ఆ విమానం ఎప్పుడు గాల్లోకి ఎగురుతుందా? అన్నట్లు ప్రయాణికులంతా ఎదురుచూస్తున్నారు. ఇంతలో కెప్టెన్ లోనికి వచ్చాడు. పొగమంచు కారణంగా దాదాపు 13 గంటలు విమానం ఆలస్యం అవుతుందని ప్రకటిస్తున్నాడు. ఇంతలో పసుపు రంగు చొక్కా ధరించిన వ్యక్తి ముందుకు దూసుకొచ్చాడు. కెప్టెన్ చెంప చెల్లుమనిపించాడు. ఈ వీడియోను నటి రాధికా ఆప్టే ఎక్స్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. నిందితున్ని సాహిల్ కటారియాగా గుర్తించారు. అతనిపై ఇండిగో ఎయిర్‌లైన్స్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ సహా ఉత్తరాదిలో ఇటీవల తీవ్ర పొగమంచు వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైళ్లు సహా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పొగమంచు కారణంగా ఢిల్లీలో శనివారం 110 విమానాలు ఆలస్యంగా నడిచాయి. అటు 79 విమాన ప్రయాణాల్ని రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చదవండి: Makar Sankranti: గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? శ్రీరామునితో సంబంధం ఏమిటి? -
సీతారామలక్ష్మణ వేషధారణలో ఇండిగో సిబ్బంది: పులకించిన ప్రయాణీకులు
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రాణప్రతిష్ట ఈ నెల (జనవరి) 22నజరగనుంది.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ వేడుక ప్రముఖంగా మారనుంది. శ్రీరామ్ లల్లా దర్శనం చేసుకోసం భక్తులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు. ఈక్రమంలో ప్రముఖ విమానయాన సంస్థలు దేశంలోని వివిధ నగరాల నుంచి అయోధ్యకు విమాన సర్వీసులను కూడా నడపనున్నాయి. అయితే ఇండిగో విమాన సంస్థ వార్తల్లో నిలిచింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక నివాసంలో జరిగిన వర్చువల్ ఈవెంట్ ద్వారా విమాన సర్వీసును జనవరి 11, గురువారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు తొలి విమాన సర్వీసును ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రారంభించింది. తన ప్రారంభ విమానంలో దాని క్యాబిన్ సిబ్బంది శ్రీ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీత వేషధారణలో ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెటిజనులను ఆకట్టుకుంటోంది. విమాన సిబ్బంది ఒకరు రాముడిలా కిరీటంతో పాటు బంగారు రంగులో సాంప్రదాయ దుస్తులు, ఆభరణాలతో అలకరించుకుని మరీ బోర్డింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇక క్యాబిన్ సిబ్బంది రాముడు, లక్ష్మణుడు, సీత , హనుమంతుని వేషధారణలో ఆహ్వానం పలకడంతో ప్రయాణీకులంతా పులకించిపోయారు. ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేశారు. Indigo staff dressed as Shri Ram, Sita, Laxman for the inaugural flight from Ahmedabad to Ayodhya!pic.twitter.com/5tqkfThZBU — Anu Sehgal 🇮🇳 (@anusehgal) January 11, 2024 ఈ డైరెక్ట్ ఫ్లైట్‌తో అయోధ్య నేరుగా అహ్మదాబాద్‌కి కనెక్ట్ అయిందని, ఢిల్లీ తర్వాత అయోధ్యకు విమాన సర్వీసుల అనుసంధానమైన రెండో స్థానంలో అహ్మదాబాద్ ఉందని, జనవరి 15 నుంచి ఇతన విమాన సర్వీసులు కూడా ఉంటాయని సీఎం యోగి తెలిపారు. జనవరి 16న అయోధ్య-ముంబై, ఢిల్లీ-అయోధ్య మధ్య మరో విమాన సర్వీసు ప్రారంభం కానుందని, మెరుగైన విమాన సేవలు పర్యాటకం, వ్యాపార కార్యకలాపాలకు గణనీయంగా దోహదపడతాయని యోగి పేర్కొన్నారు. మరోవైపు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్, జనవరి 12, శుక్రవారం, జనవరి 21 న ఢిల్లీ నుండి అయోధ్యకు ప్రత్యేక విమాన సర్వీసులను ప్రకటించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. మరుసటి రోజు తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి, సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. మరుసటి రోజు రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే ప్రయాణీకులకు భోజనం అందించనుంది. -
అయ్యయ్యో ప్యాసింజర్లు : పాస్‌పోర్ట్ లేకుండానే ఢాకాకి
వాతావారణ పరిస్థితులు విమాన ప్రయాణాలకు చాలా కీలకం. దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణీకులు కూడా ఇబ్బందులు పడతారు. తాజాగా ఇండిగో విమానం అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కొంది. దీంతో ముంబై నుంచి గువాహటి వెళ్లాల్సిన ప్రయాణీకులు అనూహ్యంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ల్యాండ్ అయ్యారు. ఇండిగో ఎయిల్‌లైన్స్‌కు చెందిన 6ఈ 5319 విమానం ముంబై నుంచి గువాహటి బయల్దేరింది. కానీ అక్కడి వాతావరణం, పొగమంచు కారణంగా గువాహటి విమానాశ్రయంలో ల్యాండింగ్ కష్టంగా మారింది. దీంతో విమానాన్ని ఢాకాకు దారిమళ్లిచి ఢాకాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అయితే ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఇండిగో ప్రకటించింది. STORY | Guwahati-bound IndiGo flight from Mumbai diverted to Dhaka due to bad weather READ: https://t.co/nQPVWCfi2s VIDEO: (Source: Third Party) pic.twitter.com/NFuVYIxKPb — Press Trust of India (@PTI_News) January 13, 2024 అయితే ఈవిషయంపై ముంబై యూత్ కాంగ్రెస్ చీఫ్ సూరజ్ సింగ్ ఠాకూర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. విమానంలో ఉన్న తామంతా పాస్‌పోర్ట్ లేకుండానే దేశ సరిహద్దులు దాటాం అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న గువాహాటిని మంచుదుప్పటి కప్పేయడంతో ఢాకాలో ల్యాండ్ అయ్యామని తెలిపారు. 178 మంది ప్రయాణికులతో 9 గంటలుగా ఇబ్బందులు పడుతున్నాం. గౌహతి తిరిగి వెళ్లడానికి మరొక సిబ్బంది కోసం నాలుగు గంటలకు పైగా వేచి ఉన్నాం, దయచేసి వేగంగా స్పందించండి మరో ప్రయాణికుడు ట్విటర్ ద్వారా వేడుకున్నారు. I took @IndiGo6E flight 6E 5319 from Mumbai to Guwahati. But due to dense fog, the flight couldn't land in Guwahati. Instead, it landed in Dhaka. Now all the passengers are in Bangladesh without their passports, we are inside the plane.✈️ — Suraj Singh Thakur (@SurajThakurINC) January 13, 2024 దీంతో దీనిపై అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ఇండిగో స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని మళ్లించామని, ప్రయాణీకులకు వీలైనంత మేర సాయం చేస్తున్నాం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్ 24 ప్రకారం, ఇండిగో విమానం శుక్రవారం రాత్రి 8.20 గంటలకు ముంబై నుండి బయలుదేరి రాత్రి 11.10 గంటలకు గౌహతిలో దిగాల్సి ఉంది. -
ప్రయాణికులకు అలెర్ట్, పెరిగిన ఇండిగో విమాన సీట్ల ధరలు
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వినియోగదారులకు భారీ షాకిచ్చింది. విమానంలోని ఆయా సీట్ల ధరల్ని భారీగా పెంచింది. దీంతో ఫ్రంట్ రో విండో సీటుకు రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. ఇండిగో సీట్ల ఎంపిక ఛార్జ్ ఇండిగో అదనపు స్థలాన్ని అందించే ‘ఎక్స్ఎల్’ సీట్లు లెగ్‌రూమ్ ఆధారంగా వివిధ సీట్ల కేటగిరీల కింద ప్రయాణికులకు సీట్లను అందిస్తుంది. దీంతో పెంచిన మొదటి వరుస ఎక్స్ఎల్ సీట్ల ఛార్జీలు ఇప్పుడు రూ .1400 నుండి రూ .2000 వరకు పెరిగాయి. మిడిల్ సీట్లకు రూ.150 నుంచి రూ.2000 వరకు ధరల్ని సవరించింది. కాగా, గతంలో ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్నట్లు ఇండిగో ఇటీవల ప్రకటించింది. దీంతో టికెట్ ధరలు కనిష్టంగా రూ.300 మేర తగ్గగా.. దూర ప్రాంతాల్ని బట్టి ధర రూ.1000కి పెరిగాయి. అయితే ఇటీవల ఇంధన ధరలు తగ్గడంతో ఇంధన ఛార్జీలను ఉపసంహరించుకుంది. -
ప్రభాస్ హీరోయిన్‌కి చేదు అనుభవం.. అలా జరగడంతో!
సామాన్యుల ఎప్పుడూ ఉండేదే కానీ సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు చేదు అనుభవాలను ఎదుర్కొంటుంటారు. అలాంటప్పుడు అందుకు సంబంధించిన వ్యవస్థలపైనో, వ్యక్తులపైనో ఫైర్ అవుతుంటారు. తాజాగా యంగ్ హీరోయిన్ మాళవికా మోహన్ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. వాటి గురించి తన ట్విట్టర్లో రాసుకొచ్చింది. (ఇదీ చదవండి: పెళ్లి పీటలెక్కనున్న 'పల్సర్ బైక్' రమణ.. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్) వివరాల్లోకి వెళ్తే.. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్. తమిళంలో రజనీకాంత్ 'పేట' మూవీలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. దళపతి విజయ్ 'మాస్టర్'లో, ధనుష్ 'మారన్'లో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె నటించిన లేటెస్ట్ మూవీ 'తంగలాన్' త్వరలో రిలీజ్ కానుంది. అలానే ప్రభాస్-మారుతి కాంబోలో తీస్తున్న మూవీలోనూ ఓ హీరోయిన్గా చేస్తోంది. తాజాగా చైన్నె విమానాశ్రయంలో ఈమెకు చేదు అనుభవం ఎదురైంది. తాను జైపూర్ నుంచి ఇండిగో విమానంలో చైన్నెకి బుధవారం తిరిగొచ్చానని అయితే.. సోదాల పేరుతో విమాన సిబ్బంది తనతో చాలా అనుచితంగా ప్రవర్తించారని మాళవిక ఆవేదన వ్యక్తం చేసింది. వారి చర్యలు చాలా మొరటుగా ఉన్నాయని రాసుకొచ్చింది. దీనిపై పలువురు నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: టాలీవుడ్ సీనియర్ నటి ఇంట్లో శుభకార్యం.. హాజరైన మెగాస్టార్!) Very rude and bad service @IndiGo6E Jaipur. Bad staff behaviour — Malavika Mohanan (@MalavikaM_) January 3, 2024 -
ఇండిగో టికెట్ ధర తగ్గింపు.. కారణం ఇదే..
విమాన టికెట్లపై సంస్థలు ప్రత్యేకంగా ఫ్యూయెల్ ఛార్జీను వసూలు చేస్తూంటాయి. అయితే గత మూడునెలలుగా విమానాల్లో వాడే జెట్ ఇంధనం/ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధరను కేంద్రం తగ్గిస్తోంది. అందులో భాగంగా ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన వినియోగదారుల కోసం టికెట్లపై విధించే ఫ్యూయెల్ ఛార్జీలను తొలగించినట్లు ప్రకటించింది. గురువారం నుంచే తొలగింపు నిర్ణయం అమల్లోకి వచ్చిందని సంస్థ తెలిపింది. కేంద్ర తీసుకుంటున్న నిర్ణయంతో తన వినియోగదారులకు సైతం మేలు జరగాలని ప్రత్యేక ఛార్జీని తొలగించినట్లు ఇండిగో తెలిపింది. అయితే, ఏటీఎఫ్ ధరలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంది. కాబట్టి టికెట్ల ధరలనూ అందుకు అనువుగా సవరిస్తామని సంస్థ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: తీవ్ర ఒడిదుడుకుల్లో చమురు మార్కెట్లు విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరను ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు జనవరిలో 4 శాతం తగ్గించాయి. ఇప్పటి వరకు దిల్లీలో కిలోలీటరు ధర రూ.1,06,155.67 కాగా, రూ.4162.50 తగ్గించడంతో రూ.1,01,993.17కు చేరింది. -
అయోధ్య చేరుకోనున్న మొదటి ఫ్లైట్ ఇదే.. ఎప్పుడో తెలుసా?
అయోధ్య రామమందిరం ప్రారంభ ఏర్పాట్లతో పాటు ఎయిర్‌పోర్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 22న శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నట్లు ఇప్పటికే తెలిసింది. అంతకంటే ముందు అయోధ్య విమానాశ్రయంలో డిసెంబర్ 30న మొదటి విమానాన్ని నడపనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీ నుంచి అయోధ్య విమానాశ్రయానికి డిసెంబర్ 30న తొలి విమానాన్ని నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెలాఖరులోగా సిద్ధమవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల వెల్లడించారు. ఢిల్లీ - అయోధ్య మధ్య 2024 జనవరి 10 నుంచి ఇండిగో విమానాలు ఢిల్లీ నుంచి అయోధ్యకు ప్రతి రోజు తిరిగే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి ఉదయం 11:55 గంటలకు బయలుదేరి 1:15 గంటలకు అయోధ్యకు చేరుతుంది. ఆ తరువాత 1:45 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:00 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. ప్రతి రోజూ ఇదే షెడ్యూల్లో విమానాలు నడుస్తాయి. ఇదే చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా? ఢిల్లీ - అహ్మదాబాద్ మధ్య అహ్మదాబాద్ నుంచి మంగళవారం, గురువారం, శనివారం మాత్రమే విమానాలు అయోధ్యకు చేరుకుంటాయి. ఈ రోజుల్లో ఉదయం 9:10 గంటలకు బయలుదేరి 11:00 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. ఆ తరువాత 11:30 గంటలకు అయోధ్య నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 1:40 గంటలకు అహ్మదాబాద్ చేరుకునే అవకాశం ఉంది. Launching flights to #Ayodhya from #Ahmedabad and #Delhi starting 30th December 2023. Fares starting at ₹2,999. Book now https://t.co/kQiEKSPfat. #goIndiGo #NewDestination #IndiaByIndiGo pic.twitter.com/L4p1iMHm1R — IndiGo (@IndiGo6E) December 14, 2023 -
డ్యూటీలో కత్తి తీసుకెళ్తా: కోర్టుకెక్కిన ఇండిగో పైలట్
నాగ్‌పూర్: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే సిక్కు పైలట్ ఆనంద్‌సింగ్ డ్యూటీలో తన వెంట కిర్పన్(చిన్నకత్తి)ని తీసుకెళ్లేందుకు అనుమతివ్వాలని కోర్టుకెక్కారు. కిర్పన్‌ను క్యారీ చేయడం సిక్కు సంప్రదాయంలో ఒక భాగమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కింద కిర్పన్ తీసుకెళ్లడం తన ప్రాథమిక హక్కు అని నాగ్‌పూర్ హైకోర్టు బెంచ్ ముందు వేసిన పిటిషన్లో తెలిపారు. ఈ మేరకు తనకు అనుమతిచ్చేలా కేంద్రప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని పైలట్ కోరారు. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ నితిన్ సాంబ్రే, అభయ్ మంత్రిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేంద్రప్రభుత్వంతో పాటు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు నోటీసులు పంపింది. ‘విమానాల్లో కిర్పన్‌ను తీసుకెళ్లడానికి ప్రయాణికులకు అనుమతిస్తూ విమానయాన శాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఉద్యోగులకు మాత్రం కిర్పన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదని అందులో తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కి విరుద్ధం’ అని పైలట్ న్యాయవాది చెప్పారు. సంప్రదాయంలో భాగంగా సిక్కులు ధరించే వాటిలో కిర్పన్ కూడా అతి ముఖ్యమైనది. చిన్న సైజులో ఉన్న కిర్పన్‌ను సిక్కులు తమ వెంటే ఉంచుకుంటారు. ఇదీచదవండి..గణతంత్ర వేడుకలకు బైడెన్ దూరం.. కారణం అదేనా? -
ట్రాఫిక్‌లో పైలట్.. ఫ్లైట్ లేట్..! వీడియో వైరల్
ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో నిర్వహణను తప్పుపట్టారు. ఇందుకు సంబంధించి శర్మ తన ఎక్స్ ఖాతాలో తాజాగా జరిగిన సంఘటన గురించి షేర్ చేశారు. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. నవంబర్ 29న చెన్నై నుంచి ముంబయి వెళ్లాల్సిన 6ఈ 5149 నంబర్ ఇండిగో విమానం దాదాపు గంటకుపైగా ఆలస్యంగా బయలుదేరింది. ఇది షెడ్యూల్ ప్రకారం రాత్రి 8:00 గంటలకు చెన్నై నుంచి బయలుదేరి రాత్రి 9:55 గంటలకు ముంబై చేరుకోవాలి. అయితే గూగుల్ ఫ్లైట్స్ డేటా ప్రకారం దాదాపు నాలుగు గంటలు ఆలస్యం అవుతుందని సూచిస్తూ విమాన బయలుదేరే సమయం నవంబర్ 30 ఉదయం 12:10కు మారింది. అప్పటికే అందులో ఎక్కిన ప్రయాణికులు దాదాపు 180 మంది ఆందోళన చేపట్టారు. వెంటనే సమస్యకు చర్య తీసుకోవాలని కోరినా మేనేజ్మెంట్ సరిగా స్పందించలేదని ఆయన తెలిపారు. ఆ ప్రయాణికుల్లో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఉన్నారని చెప్పారు. అయితే వారిని వేరే విమానం ఎక్కిస్తామని నమ్మించి మళ్లీ సెక్యూరిటీ వింగ్‌కు తరలించినట్లు చెప్పారు. విమానం ఆలస్యం అయినందుకు కారణం అడుగుతున్న ప్రయాణికులకు సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పైలట్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడంటూ ఇండిగో సిబ్బంది సమర్థించుకునే ప్రయత్నం చేశారంటూ తెలిపారు. ఇండిగో సీనియర్ అధికారితో మాట్లాడాలని కోరుతూ ఎయిర్‌లైన్ గ్రౌండ్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగిన వీడియోలను శర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. Dear @IndiGo6E first you made us wait in the bus for 50 minz, and now your team is saying pilot is stuck in traffic, what ? Really ? we supposed to take off by 8 pm n it’s 9:20, still there is no pilot in cockpit, do you think these 180 passengers will fly in indigo again ? Never… — Kapil Sharma (@KapilSharmaK9) November 29, 2023 ఇదీ చదవండి: సెల్ఫ్‌మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ 2023 లిస్ట్ విడుదల.. ఆయనే టాప్.. ‘ప్రియమైన ఇండిగో, మీరు మమ్మల్ని బస్సులో 50 నిమిషాలు వేచి ఉండేలా చేశారు. ఇప్పుడు మీ సిబ్బంది.. పైలట్ ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడని అంటున్నారు. మేము రాత్రి 8 గంటలకు బయలుదేరాలి. ప్రస్తుతం రాత్రి 9:20 అవుతుంది. ఇప్పటికీ కాక్‌పిట్‌లో పైలట్ లేడు. ఈ 180 మంది ప్రయాణికులు మళ్లీ ఇండిగోలో ప్రయాణిస్తారని అనుకుంటున్నారా?’ అంటూ తన పోస్ట్‌లో తెలిపారు. Now they r de boarding all the passengers n saying we will send you in another aircraft but again we have to go back to terminal for security check 👏👏👏👏👏 #indigo👎 pic.twitter.com/NdqbG0xByt — Kapil Sharma (@KapilSharmaK9) November 29, 2023 People r suffering bcoz of you @IndiGo6E lying lying n lying, there r some old passengers on wheel chairs, not in a very good health condition. Shame on you #indigo 👎 pic.twitter.com/87OZGcUlPU — Kapil Sharma (@KapilSharmaK9) November 29, 2023 -
ఇండిగో నిర్వాకం: ఇక సీటు కుషన్‌కీ డబ్బులు అడుగుతారేమో?
ఇండిగో విమానంలో ఒక ప్యాసింజర్‌కి వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ప్రయాణీకులు తక్కువగా ఉన్నారని ప్రయాణికులను దించేసి వెళ్లి పోయిన ఘటన మరువకముందే విమానంలో సీటు కుషన్ మిస్ అయిన ఘటన నెటిజనుల ఆగ్రహానికి కారణమైంది. ఇండిగో ఫ్లైట్ 6E6798లో నాగపూర్‌కు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. అనుకున్న సమయనికి విమానం ఎక్కి, విండో సీట్ నెం 10A ఎంజాయ్ చేయాలన్న ఉత్సాహంతో దగ్గరికి వెళ్లి చూసి ఒక్కసారి షాక్ అయ్యారు. సీటులోని కుషన్ మిస్ అయింది. కేవలం స్టీల్ ఫ్రేమ్ మాత్రమే కనిపించింది. ఇండిగో విమానంలో పూణె నుంచి నాగ్ పూర్ వెళ్తున్న సాగరిక పట్నాయక్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. దీంతో వెంటనే క్యాబిన్ సిబ్బందిని సంప్రదించారు. సీటు కింద ఉంటుంది చూడండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అలా కూడా లేకపోవడంతో మళ్లీ సిబ్బందిని అడిగే అప్పుడు తీసుకొచ్చి కుషన్ అమర్చారు. అప్పటివరకు ఆమె నిలబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది. సాగరిక భర్త సుబ్రత్ పట్నాయక్ దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. లాభాలను పెంచుకునే మార్గం ఇదేనా.. చాలా దారుణం అంటూ ట్వీట్ చేశారు. బోర్డింగ్‌కు ముందు గ్రౌండ్ స్టాఫ్ , సిబ్బంది నిర్లక్ష్యాన్ని సుబ్రత్ ప్రశ్నించారు. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ట్రయల్ కావచ్చు. త్వరలోనే ఇండిగో సీట్ కుషన్ల కోసం 250-500 వసూలు చేస్తుందేమో అంటూ ఒకరు సెటైర్లు వేశారు. మరోవైపు దీనిపై ఇండిగో స్పందించింది. అసౌకర్యానికి చింతిస్తున్నాం. సీటు కుషన్ దాని వెల్క్రో నుండి కొట్టుకుపోతుంది.దాన్ని సిబ్బంది రీప్లేస్ చేస్తుంది. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలను అందిస్తామంటూ ఇండిగో ఎయిర్ లైల్స్ వివరణ ఇచ్చింది. #Indigo !! #Flight 6E 6798 !! Seat no 10A ! Pune to Nagpur!!! Today’s status … Best way to increase profit 😢😢…Pathetic … pic.twitter.com/tcXHOT6Dr5 — Subrat Patnaik (@Subu_0212) November 25, 2023 -
8 మందే ప్రయాణికులు.. విమానం దిగమని కోరిన సంస్థ
విమానం నుంచి ఎనిమిది మంది ప్రయాణికులను దించేసిన సంఘటన బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లోని ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నుంచి చెన్నైకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు ఎక్కారు. అయితే వారిని మరో విమానంలో ఎక్కిస్తామని హామీ ఇచ్చారు. దాంతో సదరు ప్రయాణికులు దిగిపోయారు. కేవలం ఎనిమిది మందితో ప్రయాణించేందుకు ఇండిగో నిరాకరించినట్లు తర్వాత ప్రయాణికులు గ్రహించినట్లు తెలిసింది. ఇండిగో విమానం 6E 478 ఆదివారం సాయంత్రం అమృత్సర్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి బయలుదేరింది. అయితే ఎనిమిది ప్రయాణికులు మినహా ఇతర ప్రయాణికులు బెంగళూరులోనే దిగిపోయారు. విమానంలో కేవలం ఎనిమిది మందే ఉండడంతో వారిని వేరే విమానంలో చెన్నై పంపిస్తామని కోరాగా వారు దిగిపోయారు. అయితే కేవలం 8 మందితో ప్రయాణించేందుకు ఇండిగో నిరాకరించిందని తెలిసింది. దాంతో ఆదివారం రాత్రి బెంగళూరులోనే ఉండి సోమవారం వెళ్లాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. తమ ప్రయాణానికి అడ్డంకి ఏర్పడినప్పటికీ విమానయాన సంస్థ వారి బసకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నారు. ‘నవంబర్ 19, 2023 రోజున ఫ్లైట్ 6E 478 అమృత్సర్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నై బయలుదేరింది. అమృత్సర్ నుంచి వచ్చే మరో ఎయిర్‌క్రాఫ్ట్ ఆలస్యం అయింది. దాంతో ఈ ఎనిమిది మంది చెన్నైకి వెళ్లే విమానం ఎక్కలేకపోయారు. ఇండిగో గ్రౌండ్ స్టాఫ్ ప్రయాణికులకు సహాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. రాత్రిపూట వసతితో పాటు తదుపరి విమానంలో ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. కానీ కొందరు ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లాంజ్‌లో ఉండాలనుకున్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’అని ఇండిగో ప్రకటన విడుదల చేసింది. -
ప్రయాణీకులు ఆరుగురే అని... దించేసి పోయారు!
చెన్నై: ఇండిగో విమానంలో ఆరుగురు ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కేవలం అరుగురు ప్రయాణికులే ఉన్నందున విమాన ప్రయాణాన్ని సిబ్బంది నిలిపివేశారు. మరో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని ప్రయాణికుల్ని సిబ్బంది తెలివిగా దించేశారు. అనంతరం ఎలాంటి ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండిగో 6E478 విమానం అమృత్సర్ నుంచి చెన్నై వెళుతుంది. మధ్య బెంగళూరు చేరుకునే సరికి రాత్రి 9:30 అయింది. కెంపెగౌడ విమానాశ్రయంలోనే ప్రయాణికులందరూ దిగిపోయారు. కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఆరుగురు ప్రయాణికుల కోసం బెంగళూరు నుంచి చెన్నై వరకు వెళ్లడం ఇష్టం లేని సిబ్బంది.. వారిని తెలివిగా కిందకు దించేశారు. రాత్రి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే ప్రయాణికులను గాలికి వదిలేశారు. 'కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకోగానే సిబ్బంది తమకు ఫోన్ చేసి మరో విమానం అందుబాటులో ఉందని చెప్పారు. బోర్డింగ్ పాస్ కూడా సిద్ధంగా ఉందని చెప్పి రాత్రి 9:30 సమయంలో విమానం కిందికి దించేశారు. కానీ రాత్రి ఎలాంటి ఏర్పాటు చేయలేదు' అని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరోమారు ఇలాంటి పరిస్థితి ఎదురవకూడదని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన యంత్రాంగం.. ఉదయాన్నే వారిని ఇతర విమానంలో చెన్నైకి పంపించామని తెలిపింది. ఇదీ చదవండి: PM Modi Met Team India Video: డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోదీ -
చరిత్ర సృష్టించిన ఇండిగో ఎయిర్‌లైన్స్
విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అందుకు తగినట్లు ఎయిర్ లైన్స్ సంస్థలు తమ ఫ్లైట్స్, రూట్ల సంఖ్యను పెంచుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో రోజూ రెండు వేల విమానాలు నడిపి భారత విమానయాన రంగంలో చరిత్ర సృష్టించింది. రోజుకు రెండు వేలకు పైగా విమానాలు నడిపి ఇండిగో సంస్థ కొత్త మైలురాయిని చేరింది. దాంతో దేశంలో ఈ ఘనత సాధించిన మొదటి ఎయిర్‌లైన్‌గా నిలిచింది. అక్టోబర్ 2023కి సంబంధించిన ఓఏజీ డేటా ప్రకారం.. ఫ్రీక్వెన్సీ, సీట్ కెపాసిటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో చోటు దక్కించుకుంది. 'ఇండిగో ఇప్పుడు ప్రణాళికబద్ధంగా రోజు రెండు వేలకు పైగా విమానాలను నడుపుతోంది. ఇందులో కార్గో ఆపరేషన్స్, సీఏపీఎఫ్, ఆర్మీ చార్టర్లు ఉన్నాయి. సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన 17 ఏళ్లలోనే ఈ ఘనత సాధించింది. ఆపరేషనల్ సామర్థ్యం, విశ్వసనీయత, కస్టమర్ ఓరియంటేషన్లో కొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేసింది' అని ఎయిర్‌లైన్ సీఈఓ పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. ఇది కేవలం సంఖ్యాపరమైన ఘనతేకాదని, కనెక్టివిటీతో పాటు ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచే అవకాశం కల్పించేదిగా భావిస్తున్నట్లు పీటర్ చెప్పారు. -
మళ్లీ లాభాల్లో ఇండిగో.. క్యూ2లో రూ. 189 కోట్లు
న్యూఢిల్లీ: ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్(క్యూ2)లో రూ. 189 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,583 కోట్ల నికర నష్టం ప్రకటించింది. సామర్థ్యం పెంపు, అధిక ట్రాఫిక్ ఇందుకు సహకరించాయి. వెరసి ఇండిగో బ్రాండు సరీ్వసుల కంపెనీ వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ లాభాలను ప్రకటించగలిగింది. అయితే ఈ కాలంలో విదేశీ మారక నష్టం రూ. 806 కోట్లను మినహాయించి లాభాలు ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం 21 శాతం జంప్‌చేసి రూ. 15,503 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 12,852 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ క్యూ2లో ప్రయాణికుల సంఖ్య 26.3 మిలియన్ల నుంచి 33.4 మిలియన్లకు ఎగసింది. సెపె్టంబర్‌కల్లా విమానాల సంఖ్య 334కు చేరగా.. రూ. 30,666 కోట్ల నగదు నిల్వలు కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు 1% బలపడి రూ. 2,509 వద్ద ముగిసింది. -
హైదరాబాద్ నుంచి నేరుగా సింగపూర్, కొలంబోలకు ఫ్లైట్స్: ఇండిగో
హైదరాబాద్ నుంచి ఇకపై నేరుగా సింగపూర్, కొలంబోకు వెళ్లేలా ఇండిగో సంస్థ విమాన సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రం నుంచి సింగపూర్, కొలంబోలను సందర్శించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం వల్లనే ఈ నూతన సర్వీసులను అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు ఇండిగో తెలిపింది. వీటిలో హైదరాబాద్-సింగపూర్ల మధ్య సర్వీసులు అక్టోబర్ 29 నుంచి అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నుంచి ఉదయం 2.50 గంటలకు బయలుదేరనున్న 6ఈ-1027 విమాన సర్వీసు సింగపూర్‌కు ఉదయం 10 గంటలకు(సింగపూర్ కాలమాన ప్రకారం) చేరుకోనుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో సింగపూర్‌లో రాత్రి 23.25 గంటలకు(సింగపూర్ కాలమాన ప్రకారం) బయలుదేరి హైదరాబాద్‌కు ఉదయం 1.30 గంటలకు చేరుకోనుంది. హైదరాబాద్-కొలంబోల మధ్య అలాగే నవంబర్ 3 నుంచి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసు అందుబాటులోకి రానుంది. 6ఈ-1181 విమాన సర్వీస్ హైదరాబాద్ నుంచి ఉదయం 11.50 గంటలకు బయలుదేరి కొలంబోకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో కొలంబోలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు సాయంత్రం 5 గంటలకు వస్తుంది. అయితే ఈ సర్వీస్ వారానికి నాలుగు రోజులు సోమ, మంగళ, శుక్ర, ఆదివారాల్లో మాత్రమే ఉంటుందని ఇండిగో తెలిపింది. -
ఇండిగో ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి పండగే..!
అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)ను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ తమ పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి వేతనాలను పెంచినట్లు ఒక నివేదిక తెలిపింది. వేతనాల పెంపుదల అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. గత ఏడాది ఇండిగో తమ సిబ్బందికి రెండు విడతల్లో 10 శాతానికిపైగా జీతాలను పెంచింది. ఈ విమానయాన సంస్థ పైలట్లకు నెలకు 70 గంటల చొప్పున స్థిరమైన వేతనాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 2023-24 మొదటి త్రైమాసికంలో ఇండిగో రికార్డు స్థాయిలో రూ. 3,090 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. భారతీయ విమానయాన సంస్థలు అంతర్జాతీయంగా, దేశీయంగా విస్తరించడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఉన్న పైలట్లు వెళ్లిపోకుండా చూసుకోవడంతోపాటు కొత్త పైలట్లను నియమించుకోవడానికి గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఇండిగో కార్యకలాపాలు ప్రారంభించి 17 ఏళ్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంస్థ 320కు పైగా విమానాలతో 1,900 రోజువారీ సర్వీసులు నిర్వహిస్తోంది. దేశీ విమానయాన మార్కెట్లో ఈ సంస్థకు 63 శాతం వాటా ఉంది. 32 అంతర్జాతీయ, 81 దేశీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. అయితే ఇటీవల పీఅండ్‌డబ్ల్యూ ఇంజన్లలో సమస్యల కారణంగా కొన్ని ఏ320 విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. దీన్ని అధిగమించేందుకు సంస్థ కొన్ని విమానాలను వెట్‌లీజ్ తీసుకుంది. -
ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌గా ఇండిగో
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే అద్భుతమైన, అధిక పోటీతో కూడిన ఏవియేషన్ మార్కెట్ అని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. ఇండిగో మరింత పెద్ద, మెరుగైన, ప్రపంచ స్థాయి సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించారు. తనకంటూ సొంతంగా అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను నిర్మించుకుంటున్నట్టు, ఇతర ఎయిర్‌లైన్ సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లోని పట్టణాల నుంచి విదేశీ గమ్యస్థానాలకు మార్గాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు ఎల్బర్స్ తెలిపారు. ఇండిగో కార్యకలాపాలు ప్రారంభించి 17 ఏళ్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంస్థ 320కు పైగా విమానాలతో 1,900 రోజువారీ సరీ్వసులు నిర్వహిస్తోంది. దేశీ విమానయాన మార్కెట్లో ఈ సంస్థకు 63 శాతం వాటా ఉంది. 32 అంతర్జాతీయ, 81 దేశీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. అయితే ఇటీవల పీఅండ్‌డబ్ల్యూ ఇంజన్లలో సమస్యల కారణంగా కొన్ని ఏ320 విమానాలను నిలిపివేయాల్సి వచి్చంది. దీన్ని అధిగమించేందుకు సంస్థ కొన్ని విమానాలను వెట్‌లీజ్ తీసుకుంది. టికెట్ ధరలు కీలకం.. విమానాల నిర్వహణ వ్యయాలు, టికెట్ ధరల మధ్య సహ సంబంధం ఉండాలని, లేకపోతే విమానయాన సంస్థలు మనుగడ సాగించలేవని ఎల్బర్స్ అభిప్రాయపడ్డారు. ఇండిగో అందుబాటు ధరలపైనే దృష్టి సారించినట్టు చెబుతూ, సీజన్ డిమాండ్‌కు అనుగుణంగా ఇవి పెరుగుతూ, తరుగుతూ ఉంటాయని వెల్లడించారు. ఇండిగో వృద్ధి దశలో ఉందన్నారు. అదే సమయంలో దేశంలో ఏవియేషన్ హబ్‌ల అవసరాన్ని ప్రస్తావించారు. సొంతంగా నెట్వర్క్ నిర్మించుకోవడంతోపాటు, ప్రస్తుత పట్టణాలను నూతన మార్గాలతో (భువనేశ్వర్–సింగపూర్ తరహా) అనుసంధానిస్తున్నట్టు పీటర్ ఎల్బర్స్ తెలిపారు. అలాగే, ఇతర ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యాలను కూడా పెంచుకుంటున్నట్టు వివరించారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌తో కోడ్õÙర్ భాగస్వామ్యాన్ని ఈ నెలలోనే ఇండిగో కుదుర్చుకోవడం గమనార్హం. -
దెబ్బకు దిగొచ్చిన ఇండిగో.. ఇక ఫ్రీగా..
దేశీయంగా విమాన ప్రయాణాలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల మధ్య విమానాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానాల్లో ఆహార పదార్థాలు, పానీయాల కోసం ప్రయాణికుల నుంచి అత్యధికంగా వసూలు చేస్తున్నాయంటూ మాజీ ఎంపీ ఫిర్యాదు చేయడంతో ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్ దిగొచ్చింది. ఇండిగో విమానంలో సాఫ్ట్ డ్రింక్ కావాల్సిన ప్రయాణికుతో బలవంతంగా స్నాక్స్ కొనిపిస్తున్నారని, విడిగా సాఫ్ట్ డ్రింక్స్ ఇవ్వడం లేదని బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ స్వపన్‌దాస్ గుప్తా ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. ఎక్స్‌ట్రాల పేరుతో ప్రయాణికులను పిండడం మానేయాలని ఆ విమానయాన సంస్థకు హితవు పలికారు. (ఇండిగో విమానం ఎక్కుతున్నారా? అయితే గుడ్‌న్యూస్!) ఈ నేపథ్యంలో ప్రయాణికులకు అందుబాటు ధరల్లో స్నాక్స్ అనుభవాన్ని అందించడానికి తమ సేవలను పునరుద్ధరించినట్లు ఇండిగో ప్రతినిధి తాజాగా తెలిపారు. ఇక క్యాన్లలో పానీయాలు విక్రయించడం నిలిపివేసినట్లు చెప్పారు. వేలాది క్యాన్ వ్యర్థాలను అరికట్టే తమ గో గ్రీన్ నిబద్ధతకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే విమానాలలో క్యాన్లలో పానీయాల విక్రయం ఎప్పటి నుంచి నిలిపివేసిందో ఇండిగో ఎయిర్‌లైన్ పేర్కొనలేదు. ఉచితంగా సాఫ్ట్ డ్రింక్ ఇండిగో ఎయిర్‌లైన్ ప్రకటన ప్రకారం.. కస్టమర్లు ఆన్‌బోర్డ్‌లో కొనుగోలు చేసిన ఏదైనా స్నాక్‌తో కాంప్లిమెంటరీ పానీయాన్ని (ఉచితంగా) ఆస్వాదించవచ్చు. దేశీయ విమానయాన మార్కెట్లో 63 శాతానికిపైగా వాటాతో ఇండిగో దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా కొనసాగుతోంది. -
విమానంలో వెర్రి వేషాలు, నిద్ర నటించిన మహిళ ఏం చేసిందంటే?
విమానయాన సంస్థ ఇండిగోలో తోటి ప్యాసెంజర్ పట్ల అభ్యంతరకంగా ప్రవర్తించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. విమానంలో మహిళా ప్రయాణికురాలి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ముంబై-గౌహతి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలికి ఈ చేదు అనుభవం ఎదురైంది. గత మూడు నెలల్లో ఇది అయిదో కేసు కావడం గమనార్హం. ఈ ప్రయాణంలో క్యాబిన్ లైట్లు ఆర్పింది మొదలు పక్క సీట్లో ఉన్న ప్రయాణికుడు ఉన్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. చేయి పెట్టుకోవడానికి ఉండే రెస్ట్ హ్యాండిల్ ను పైకి తోసేసి మరీ ఆమెన అభ్యంతరకరంగా తాకాడు. దీంతో సీట్ల మధ్యలోని హ్యాండిల్‌ను మరోసారి కిందకు దించేసింది. అయినా వాడి తీరు మారలేదు. అయితే మరికొంత టైం అతగాడిని పరీక్షిద్దామనుకున్న మహిళ ఆర్మ్‌రెస్ట్‌ని తిరిగి కిందకి దించి, నిద్రపోతున్నట్టుగా నటించి, వీడి సంగతేదో చూద్దామనుకుంటూ ఒక కన్నేసి ఉంచింది. (రిలయన్స్ ఇషా అంబానీ మరో భారీ డీల్: కేకేఆర్ పెట్టుబడులు) వంకర బుధ్దిని పోనిచ్చుకోని ఆ ప్రయాణికుడు ఆమె నిద్రించిందని భావించి, మళ్లీ తన చేతికి పని చెప్పాడు. ఇక్కడే ఆ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. కావాలనే చేస్తున్నాడని నిర్ధారించుకన్నా ఆ మహిళ, చిర్రెత్తుకొచ్చి ఒక్కసారిగా లైట్లు ఆన్ చేసి అరవడం ప్రారంభించింది. క్యాబిన్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో దిమ్మదిరిగి బొమ్మ కనపడిన అతగాడు చేసిన పనికి కాళ్లావేళ్లా పడి క్షమాపణ చెప్పడం ప్రారంభించాడని మహిళ తెలిపింది. (ఇన్ఫ్లేషన్ మండుతోంటే..ఈ డ్యాన్స్‌లేంటి? కమలా హ్యారిస్‌పై మండిపాటు ) కానీ బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని, దర్యాప్తులో సాయం అందిస్తామని ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది. -
‘... అయితే ఇండిగో ‘భాగో’ కానుందా?’... ‘ఇండియా vs భారత్’ తెగ నవ్విస్తున్న మీమ్స్!
త్వరలో జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక సమావేశంలో ఇండియా పేరును పూర్తిగా తొలగిస్తూ, దేశానికి ‘భారత్’ పేరు స్ధిరపరిచే ప్రస్తావన రానున్నదని అంటున్నారు. opposition named their alliance I.N.D.I.A government changes India's name to Bharat Opposition : pic.twitter.com/cTaigawSaF — coincasm | Meme Creator (@coincasmin) September 5, 2023 ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తరపున రాష్ట్రపతి భవనం అధికారులు జీ-20 సమావేశాలకు దేశంలోని నేతలకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని ఉండే చోటున ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉంది. #Bharat The names are like BIM, ABIMS,BIT,NBT pic.twitter.com/C4ioOR0sTk — Ashish (2nd edition) (@brb_memes17) September 5, 2023 దీనిని చూస్తుంటే దేశానికి ‘భారత్’ పేరును ఖాయం చేయనున్నారని వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో #Bharat ట్రెండ్ నడుస్తోంది. దీనిలో నెటిజన్లు వివిధ మీమ్స్ షేర్ చేస్తున్నారు. వీటిలో కొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి. Opposition names their alliance I.N.D.I.A Government proposes to change India's name to Bharat Opposition : pic.twitter.com/YsT9OCUrLo — SwatKat💃 (@swatic12) September 5, 2023 -
ఇండిగో విమానం ఎక్కుతున్నారా? అయితే గుడ్‌న్యూస్!
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ యాజమాన్యంలోని ఇండిగో ఎయిర్‌లైన్స్ దాని 'ఈట్స్ ఆన్-బోర్డ్' క్యాటరింగ్ సర్వీస్‌లో మార్పులు చేసింది. ప్రత్యేకంగా క్యూరేట్ చేసిన మెనూ నుంచి ప్రయాణికులు తమకు ఇష్టమైన ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకునే వీలు కల్పించింది. ఈ ప్రత్యేక మెనూను తమ అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలలో ప్రవేశపెట్టినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. రుచికరమైన ప్రాంతీయ వంటకాలతో మొదలుకొని స్ట్రీట్ ఫుడ్స్ వరకూ సరికొత్త ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. వీటన్నింటినీ ప్రయాణానికి ముందుగానే బుక్ చేసుకోవచ్చు. “ఇండియా ప్రముఖ క్యారియర్‌గా మా కస్టమర్ల కోసం సేవలను మెరుగుపరిచే మార్గాలను నిరంతరం పరిశీలిస్తున్నాం. కస్టమర్లు, క్యాబిన్ సిబ్బంది, సర్వీస్ పార్టనర్ల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా మా కొత్త 6ఈ ఈట్స్ మెనూ కొత్త ఆప్షన్లను అందిస్తుంది” అని ఇండిగో కస్టమర్ సర్వీసెస్, ఆపరేషన్స్ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రాందాస్ అన్నారు. ఇదీ చదవండి: పాన్‌కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్లో పడుతుందా? -
ఫ్లైట్‌లో ఇండియన్ చెస్ స్టార్.. క్యాబిన్ క్రూ వినూత్న అభినందనలు!
భారత చెస్ యువ సంచలనం, ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు అంతటా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ప్రపంచ కప్ ఫైనల్లో ఆడి భారత్‌కు పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చిన ప్రజ్ఞానందకు ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ వినూత్నంగా అభినందనలు తెలిపారు. ఇటీవల ఇండిగో విమానంలో తల్లితో కలిసి ప్రయాణించిన ప్రజ్ఞానందకు విమానంలో ఉన్న క్యాబిన్ సిబ్బంది ఒక నోట్ అందించారు. చెస్ స్టార్ ప్రజ్ఞానంద, అతని తల్లితో కలిసి క్యాబిన్ క్రూ మెంబర్ దిగిన ఫొటోతో పాటు సిబ్బంది స్వయంగా రాసిన అభినందన నోట్ చిత్రాన్ని ఇండిగో సంస్థ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేసింది. భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ మాస్టర్ ప్రజ్ఞానంద తమ ఫ్లైట్‌లో ప్రయాణించడం గౌరవంగా ఉందని, మొట్టమొదటి ప్రపంచ కప్ ఫైనలిస్ట్‌గా నిలిచిన యువ ఛాంపియన్‌కు అభినందనలు అంటూ ప్రశంసించింది. ప్రజ్ఞానందను విమానంలో ఆన్‌బోర్డ్ చేయడం తమకు నిజంగా గౌరవం, సంతోషాన్ని కలిగిస్తోందని, దేశానికి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన అందరికీ స్ఫూర్తి అంటూ క్యాబిన్ క్రూ స్వయంగా రాసి సంతకాలు చేసి ప్రజ్ఞానందకు అందించారు. అజర్బైజాన్లో జరిగిన ఫిడే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన ప్రజ్ఞానంద.. ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌తో తలపడి రన్నరప్‌గా నిలిచారు. దీంతో ప్రజ్ఞానందకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా అభినందించారు. అలాగే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా ప్రశంసించి మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని బహుమతిగా అందించారు. ✈️ Taking chess to new heights! 🏆 We were honored to have Indian chess grandmaster Master R Praggnanandhaa on board. Congratulations to the young champion on becoming the first-ever World Cup finalist!#goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/RmwcMjmy3H — IndiGo (@IndiGo6E) August 31, 2023 -
ఇండిగో విమానంలో ‘నేషనల్ హీరో’: ఎయిర్ హోస్టెస్ చేసిన పనికి...
ISRO Chief S Somanath: చంద్రయాన్ -3 సక్స్‌స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో ఇంజనీర్లను ప్రశంసలను దక్కించుకుంటున్నారు. చందమామ దక్షిణ ధృవంపై కాలిడిన తొలి దేశంగా భారత్న తన ప్రత్యేకతను చాటుకుంది. ఆగష్టు 23, చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ చంద్రుడి పరితలంపై ల్యాండ్ అయ్యి కొత్త చరితను లిఖించింది. చంద్రయాన్ -3 లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్‌లో మోస్ట్ వ్యూయడ్ రికార్డు దక్కించుకుందనే ఈ ప్రాజెక్ట్‌పై గ్లోబల్‌గా ఉన్న ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే దేశీయ విమానంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. వివరాలను పరిశీలిస్తే ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇండిగో విమానంలో పయనించారు. ఆయన విమానం ఎక్కగానే ఇండిగో సిబ్బంది,ప్రయాణీకుల నుండి అనూహ్యంగా ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా సోమనాథ్‌ను గుర్తుపట్టిన ఎయిర్ హోస్టెస్ నేషనల్ హీరోకి వెల్కం.. అందరూ ఆయనను ఆహ్వానించండి అంటూ గర్వంగా ప్రకటించింది. దీంతో ప్రయాణికులందరూ ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. ఇంతలో మరో ఫ్లైట్ ఎటెండెంట్ గూడీస్‌తో ఆయనను సత్కరించింది. ఈ విషయాన్ని పూజా షా తన సోషల్ మీడియాలో పోస్ట్‌చేశారు. ఇస్రో బృందాన్ని స్వాగతించే అవకాశం లభించినందుకు గర్విస్తున్నామంటూ ఆమె ఇన్‌స్టాలో పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈసందర్భంగా ఇస్రో టీంకు అభినందనలు తెలిపారు నెటిజన్లు. అలాగే అంతటి గొప్ప వ్యక్తి ఎంత నిరాడంబరంగా ఉన్నారుఅంటూ కొందరు కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pooja Shah (@freebird_pooja) -
30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ రాఖీ వేడుక: వీడియో వైరల్
రక్షా బంధన్ అనేది తోబుట్టువుల మధ్య ప్రత్యేకమైన బంధానికి సంబంధించిన వేడుక. ఈ శుభ సందర్భాన్ని దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే చాలా మంది సోదర సోదరీమణులు ఒకరికొకరు ఈ రోజు కలవడం కుదరకపోవచ్చు. వృత్తి పరమైన ఇబ్బందులతోపాటు అనేక కారణాల రీత్యా తమ సోదరులను మిస్ అవుతూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో ఈ పండుగ రోజున అనూహ్యంగా కలుసుకొని, రాఖీ వేడుక చేసుకుంటారు. అలాంటి సంఘటన ఒకటి ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ మెంబర్ అయిన శుభకు అలాంటి అదృష్టం వరించింది. ఇండిగో విమాన పైలట్‌గా ఉన్న తన సోదరుడు గౌరవ్‌తో కలిసి రక్షాబంధన వేడుక జరుపుకోవడం ముచ్చటగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. (రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో) విమానం టేకాఫ్‌కి ముందు ప్రయాణికులకు శుభ ప్రత్యేక ప్రకటనతో వీడియో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం పండుగలు, ప్రత్యేక క్షణాలను జరుపుకోవడం అన్ని సార్లూ సాధ్యపడదు. ముఖ్యంగా మాకు..ఎందుకంటే మీ ప్రియమైన వారితో కలిసి వేడుకు జరపుకునేలా మిమ్మల్ని ఇంటికి తిరిగి తీసుకెళ్లడం ముఖ్యం కాబట్టి అంటూ ఫ్లైట్ ఇంటర్‌ఫోన్ సిస్టమ్‌లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ రోజు నాకు అన్నకెప్టెన్ గౌరవ్‌కు చాలా ప్రత్యేకమైన రోజు, చాలా ఏళ్ల తర్వాత కలిసి రక్షా బంధన్ జరుపుకుంటున్నాం అని ప్రకటించారు. అందరి అన్నాచెల్లెళ్లలాగానే మేమూ కొట్టుకుంటాం,తిట్టుకుంటాం,నవ్వుకుంటాం..ఏడుస్తాం... కానీ నాకు మాత్రం నా అన్న రాక్, నా బెస్ట్ ఫ్రెండ్, నాకు పెద్ద ఆలంబన అంటూ అంటూ శుభ సోదరుడికి రాఖీ కట్టి, అన్న ఆశీర్వాదం తీసుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో ప్రయాణీకులు అందరూ ప్రయాణికులు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. 30వేల అడుగల ఎత్తున ఉన్నా, భూమి మీద ఉన్న ఎక్కడున్నా బ్రదర్ అండ్ సిస్టం బాండింగ్ స్పెషల్ అంటూ ఈ వీడియోను ఇండిగో చేసిన ట్వీట్ చేసింది. At 30,000 feet or on the ground, the bond of a brother and sister remains special. A heartwarming moment on board today as our Check Cabin Attendant Shubha celebrates Rakhi with her brother Capt. Gaurav. #HappyRakshaBandhan2023 #HappyRakhi #goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/WoLgx8XoIa — IndiGo (@IndiGo6E) August 30, 2023 -
నాన్న ముద్ద
పిల్లలు స్కూలుకెళ్లే హడావుడిలో ఉంటే అమ్మలు అన్నం ముద్ద కలిపి పెడతారు. ఇక్కడ కూతురు ఎయిర్‌హోస్టెస్‌గా డ్యూటీకి వెళ్లే హడావుడిలో ఉంటే నాన్న బతిమాలి అన్నం తినిపిస్తున్నాడు. ఇండిగో ఎయిర్‌హోస్టెస్ పూజా బిహాని పెట్టిన ఈ ΄ోస్టు క్షణాల్లో వైరల్‌గా మారి అందరి చేతా తల్లినో, తండ్రినో గుర్తుకు తెప్పిస్తోంది. ‘తల్లి బిడ్డ కడుపు చూస్తుంది’ అంటారు. తండ్రికి మాత్రం బిడ్డ ఆకలి పట్టదా? తల్లి కష్టపడ్డా, తండ్రి కష్టపడ్డా బిడ్డల కోసమే. జీవులకు లోకంలో అన్నింటి కంటే తృప్తినిచ్చేది తమ సంతానానికి ఆహారం అందించడమేనట. పిల్లలు తింటూ ఉంటే తల్లిదండ్రులకు ఆనందం. వారు ఖాళీ కడుపులతో ఉంటే బాధ. ముద్దుకోసమో మురిపెం కోసమో పిల్లలకు ఎన్నేళ్లొచ్చినా గోరుముద్దలు తినిపించే తల్లులు ఉంటారు. అయితే ఇక్కడ తండ్రి మార్కులు కొట్టేశాడు. ఇండిగోలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తున్న పూజా బిహాని డ్యూటీకి టైమయ్యి మేకప్ వేసుకుంటూ ఉంటే ఎక్కడ ఖాళీ కడుపుతో క్యాబ్ ఎక్కి తుర్రుమంటుందోనని ఆమె తండ్రి అన్నం తినిపించాడు. ఆ వీడియోను పూజా ఇన్‌స్టాలో ΄ోస్ట్ చేస్తే క్షణాల్లో 8.6 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి’ అని ఒకరంటే ‘తల్లిదండ్రులు మాత్రమే పిల్లల బాగోగుల గురించి పట్టించుకుంటారు’ అని మరొకరు అన్నారు. ‘నాన్న గుర్తొస్తున్నారు’ అని ఒకరంటే ‘ఆ రోజులు మళ్లీ రావు’ అని మరొకరు బాధ పడ్డారు. చిన్న చిన్న ఆనందాల జీవితం అంటే ఇదేనని అందరూ అన్నారు. -
భారీ లాభాల్లోకి ఇండిగో: ఆదాయంలోనూ కొత్త రికార్డ్
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఇండిగో బ్రాండు విమాన సర్వీసుల కంపెనీ ఏప్రిల్-జూన్(క్యూ1)లో టర్న్అరౌండ్ అయ్యింది. కొత్త రికార్డ్ సృష్టిస్తూ రూ. 3,091 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022-23) ఇదే కాలంలో రూ. 1,064 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఈ బాటలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 17,161 కోట్ల టర్నోవర్ అందుకుంది. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!) గత క్యూ1లో రూ. 13,019 కోట్ల ఆదాయం నమోదైంది. కాగా.. ఒక త్రైమాసికంలో రికార్డ్ సంఖ్యలో ప్రయాణికులను చేరవేయడం ద్వారా ఇండిగో చరిత్రలోనే అత్యధిక ఆదాయం, నికర లాభాలు సాధించినట్లు కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు.జూన్ చివరికల్లా మొత్తం నగదు నిల్వలు రూ. 27,400 కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. వెంచర్ క్యాపిటల్(వీసీ) పెట్టుబడుల సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తాజాగా పేర్కొంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. -
ఇండిగోకు భారీ షాక్: నిబంధనలు పాటించడం లేదని!
బడ్జెట్ కారియర్ ఇండిగోకు భారీ షాక్ తగిలింది. ల్యాండింగ్ సమయంలో తలెత్తిని సాంకేతిక ఇబ్బంది కారణంగా ఇండిగోపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో నాలుగు టెయిల్ స్ట్రైక్స్ చేసినందుకు ఇండిగోపై శుక్రవారం ఈ జరిమానా విధించింది. కార్యకలాపాలు, శిక్షణ , ఇంజినీరింగ్ విధానాలకు సంబంధించిన ఎయిర్‌లైన్ డాక్యుమెంటేషన్‌లో కొన్ని లోపాలను గుర్తించిన చోట పరిశోధనలు నిర్వహించినట్లు నియంత్రణ సంస్థ తెలిపింది. బెంగళూరు నుండి అహ్మదాబాద్‌కు వెళ్లే ఇండిగో విమానం టెయిల్ స్ట్రైక్‌ను ఎదుర్కొన్న పైలట్, కో-పైలట్ లైసెన్స్‌లను రెగ్యులేటర్ సస్పెండ్ చేసింది. ఘటన జరిగిన వెంటనే రెగ్యులేటర్ దర్యాప్తు ప్రారంభించింది. సిబ్బంది నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ల్యాండింగ్ చేసినట్లు తాము గుర్తించామని, ఆ తర్వాత పైలట్-ఇన్-కమాండ్ లైసెన్స్ మూడు నెలలు , కో-పైలట్ లైసెన్స్‌ను ఒక నెల పాటు సస్పెండ్ చేసినట్లు DGCA తెలిపింది. (క్రిప్టో బిలియనీర్ విషాదాంతం: సూట్‌కేసులో డెడ్‌బాడీ ముక్కలు) కాగా టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం టెయిల్ (తోకలాగా ఉండే వెనుక భాగం) తాకినప్పుడు లేదా రన్‌వేకి తాకినప్పుడు టెయిల్ స్ట్రైక్ సంభవిస్తుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ 2023 సంవత్సరంలో ఆరు నెలల వ్యవధిలో A321 విమానం ల్యాండింగ్ సమయంలో నాలుగు టెయిల్ స్ట్రైక్ సంఘటనలను ఎదుర్కొంది. దీనిపై రెగ్యులేటరీ ప్రత్యేక ఆడిట్‌ను నిర్వహించింది. దీనికి సంబంధించి నిర్ణీత వ్యవధిలోగా ప్రత్యుత్తరాన్ని సమర్పించాలని ఆదేశిస్తూ రెగ్యులేటర్ విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రత్యుత్తరాన్ని సమీక్షించిన తర్వాత, అవి సంతృప్తికరంగా లేవని డీజీసీఏ గుర్తించింది.దీంతో 30 లక్షల జరిమానాతో పాటు,నిబంధనలు, OEM మార్గదర్శకాలకు అనుగుణంగా పత్రాలు, విధానాలను సవరించాలని కూడా ఇండిగోను ఆదేశించింది. (ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) -
ఇంటర్‌గ్లోబ్ విలువ రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: ఇండిగో బ్రాండ్ విమానయాన సేవల కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలిసారి రూ. లక్ష కోట్లను తాకింది. వెరసి దేశీయంగా ఈ మైలురాయిని చేరిన తొలి ఎయిర్‌లైన్స్ కంపెనీగా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లడంతో కంపెనీ తాజా ఫీట్‌ను సాధించింది. ఇదే కాలంలో సెన్సెక్స్ 5 శాతమే బలపడటం గమనార్హం! బుధవారం స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఇండిగో షేరు 3.6 శాతం జంప్‌చేసింది. బీఎస్ఈలో రూ. 2,620కు చేరగా.. ఎన్ఎస్ఈలో రూ. 2,621 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 2,634 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. వెరసి కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,01,007 కోట్లను అధిగమించింది. సోమవారం ఎయిర్‌బస్ నుంచి 500 విమానాల కొనుగోలుకి ఆర్డర్ జారీ చేసింది. తద్వారా ఎయిర్‌బస్ చరిత్రలోనే భారీ కాంట్రాక్టుకు తెరతీసింది. దీర్ఘకాలిక వృద్ధిలో భాగంగా భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించడంతో ఇండిగో కౌంటర్ జోరందుకుంది. ఇందుకు సరికొత్త గరిష్టాలకు చేరిన స్టాక్ మార్కెట్లు సైతం దోహదపడినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశీయంగా అతిపెద్ద విమానయాన కంపెనీగా నిలుస్తున్న ఇండిగో అంతర్జాతీయంగా విస్తరించేందుకూ ప్రణాళికలు అమలు చేస్తోంది. దేశీయంగా కంపెనీ మార్కెట్ వాటా 61 శాతానికిపైగా నమోదుకావడం విశేషం! -
ఇండిగో విమానం ఇంజీన్ ఫెయిల్: అత్యవసర ల్యాండింగ్!
న్యూఢిలీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న ఇండిగో విమానం ఇంజన్ ఒకటి ఫెయిల్ కావడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజీన్ లోపాన్ని గుర్తించిన వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారమిచ్చిన పైలట్ అత్యవసర ల్యాండింగ్ అనుమతి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ టర్న్బ్యాక్కు కారణాన్ని ఇంకా ధృవీకరించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
వరల్డ్ టాప్ 100 ఎయిర్‌లైన్స్: మళ్లీ అదరగొట్టిన సంస్థ ఇదే!
ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 ఎయిర్‌లైన్స్ జాబితాలో రెండు భారతీయ విమానయాన సంస్థలు చోటు సంపాదించు కున్నాయి. విమానయాన సంస్థలు విస్తారా, ఇండిగో మాత్రమే ఈ లిస్ట్‌లో ఉండటం విశేషం. టాప్ 100లో 49వ ర్యాంకు సాధించిన ఇండిగో మూడవ ఉత్తమ తక్కువ-ధర విమానయాన సంస్థగా ఎంపికైంది. టాటా గ్రూపు నేతృత్వంలోని ఎయిరిండియా 10 అత్యంత మెరుగైన విమానయాన సంస్థల జాబితాలో 9వ స్థానంలో ఉంది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డుల ప్రకారం 2022లోని 20వ ప్లేస్నుంచి నాలుగు స్థానాలు ఎగబాకి మరీ విస్తారా 16వ స్థానానికి చేరింది.అటు ఇండిగో గత సంవత్సరం 45వ స్థానం నుండి రెండు స్థానాలు పెరిగి 43వ ర్యాంక్‌కు చేరుకుంది. టాప్ 100 ఎయిర్‌లైన్స్‌కు స్కైట్రాక్స్ ఈ అవార్డులను ఇచ్చింది. అలాగే 20 ‘ప్రపంచపు అత్యుత్తమ ఎయిర్‌లైన్ క్యాబిన్ క్రూ 2023’ జాబితాలో కూడా విస్తారా 19వ ప్లేస్ కొట్టేసింది. అంతేనా ఆసియాలోని టాప్ 10 ఎయిర్‌లైన్స్ జాబితాలో విస్తారా 8వ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. (రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ) ఎయిర్‌లైన్ స్కైట్రాక్స్ టాప్ 20 ఎయిర్‌లైన్స్ జాబితాలో వరుసగా రెండవ సారి స్థానం పొందింది విస్తారా.అలాగే వరుసగా మూడో ఏడాది కూడా 'బెస్ట్ ఎయిర్‌లైన్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా' అవార్డును, ఇండియా దక్షిణాసియాలో ఉత్తమ క్యాబిన్ క్రూ' గా వరుసగా ఐదవసారి, 'భారతదేశం, దక్షిణాసియాలో ఉత్తమ క్యాబిన్ క్రూ' మూడవసారి గెలుచుకుంది. దీంతోపాటు 'వరల్డ్స్ బెస్ట్ ఇన్‌ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ 2023' విభాగంలో 20వ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 100 దేశీల నుంచి వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్స్‌లో ఓటు వేయగా, మొత్తం 20.23 మిలియన్ల ప్రయాణికుల నుండి ఓట్లు వచ్చాయి.విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ కణ్ణన్ మాట్లాడుతూ ఈ అవార్డులు తమ సేవలు, కస్టమర్ల నమ్మకంతో పాటు వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో తమని మరింత ఉత్తేజితం చేస్తామన్నారు. తమ ఉద్యోగులు, ముఖ్యంగా ఫ్రంట్‌లైన్ టీమ్‌లు, ఎనిమిదేళ్ల ప్రస్థానంలో విశేష కృషికి గుర్తింపుగా నిలిచాయని పేర్కొన్నారు. ఇండియా సౌత్ఏసియాలో ఉత్తమ విమానయాన సిబ్బంది అవార్డును ఐదోసారి గెలుచుకోవడం గొప్ప విషయమని స్కైట్రాక్స్ సీఈవో ఎడ్వర్డ్ ప్లాస్టెడ్ అన్నారు. (రిలయన్స్ గ్రూప్‌లో కీలక పరిణామం: ప్రెసిడెంట్‌గా పారుల్ శర్మ) విస్తారా విస్తారా టాటా సన్స్ , సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్. ప్రస్తుతం ఇది 61 విమానాల సముదాయాన్ని కలిగి ఉంది, ఇందులో 46 ఎయిర్‌బస్ A320neo, 10 ఎయిర్‌బస్ A321, ఒక బోయింగ్ 737-800NG, నాలుగు బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ ఉన్నాయి. -
విమానంలో మరో అనుచిత ఘటన: 62 ఏళ్ల ప్రయాణికుడి వీరంగం
గత కొన్ని రొజులుగా విమానంలో చోటు చేసుకున్న ప్రయాణికుల అనుచిత ప్రవర్తనల గురించి వింటున్నాం. వారిపై ఎయిర్‌లైన్స్ అధికారలు చర్యలు తీసుకున్నప్పటికీ అలాంటి ఘటనలే చోటు చేసుకోవడం బాధకరం. అలాంటి అనుచిత ఘటనే మరోకటి జరిగింది. బ్యాంకాక్ నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో 62 ఏళ్ల ప్రయాణికుడు ఎయిర్ హోస్టస్, తోసహా ఇతర ప్రయాణికుల పట్ల చాలా అనుచితంగా ప్రరవ్తించాడు. తాగిన మత్తులో సదరు వ్యక్తి విమానంలో వీరంగం సృష్టించినట్లు సమాచారం. అతను భోజనం వడ్డిస్తున్న సమయంలో వెస్టబర్గ్ ఎయిర్‌హోస్టస్‌తో అనుచితంగా ప్రవర్తించడమే గాక ఆమె చేయి పట్టుకునే యత్నం చేశాడు. ఇతర ప్రయాణికుల ముందు ఆమెనే వేధింపులకు గురి చేశాడు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులను దుర్భాషలాడంటి వంటివి చేసినట్లు ఎయిర్ హోస్టస్ ఆరోపించింది. దీంతో విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోగానే సదరు నిందితుడిని స్వీడిష్‌కి చెందిన క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బర్గ్‌గా గుర్తించి, అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విమానంలో ప్రయాణికులు వరుస అనుచితత ఘటనల్లో ఇది ఎనిమిదోది. ఇటీవల వార్తల్లో నిలిచిన న్యూయార్క్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలోని వృద్ధురాలిపై మూత్ర విసర్జన ఘటన మరువుకే మునుపే అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకోవడం బాధకరం. (చదవండి: అరుదైన ఘటన: మొక్కల్లో వచ్చే శిలింద్ర వ్యాధి సోకిన వ్యక్తి) -
విమానంలో ప్రయాణికుడి రచ్చ.. ఫ్లోర్‌పైనే వాంతులు, మూత్ర విసర్జన
న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణికులు అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విమానంలో కొందరు ప్రయాణికుల పిచ్చి చేష్టలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన పలు సంఘటనలు మరవక ముందే తాజాగా మరొకటి వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి గాల్లోని విమానంలో హంగామా సృష్టించాడు. గువాహతి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు వాంతులు చేసుకున్నాడు. అంతేగాక టాయిలెట్ బయటే మల వి'ర్జన చేశాడు. తాగిన మైకంలో సదరు వ్యక్తి రెస్ట్రూమ్ నుంచి బయటకు వచ్చి ఫ్లోర్‌మీదే మూత్ర విసర్జన చేశాడు. ప్రయాణికుడు వ్యవహరించిన తీరుతో సీట్ల మధ్య నడిచే దారంతా అపరిశుభ్రంగా మారింది. తాగుబోతు ప్రవర్తనతో తోటి ప్రయాణికులందరూ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈ ఘటన మార్చి 26న ఇండిగో విమానం 6E 762లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం విమానంలోని మహిళా సిబ్బంది వెంటనే స్పందించి అక్కడంతా శుభ్రం చేయాల్సి వచ్చింది. ప్రయాణికుడు చేసిన రచ్చను మహిళ క్లీన్ చేస్తున్న దృశ్యాలను తోటి ప్రయాణికుడు భాస్కర్ దేవ్ కొన్వర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఫ్లోర్ క్లీన్ చేసిన మహిశా సిబ్బందిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ‘ఏ పరిస్థితినైనా మహిళలు చక్కగా నిర్వహించగలరు. సెల్యూట్ గాళ్ పవర్’ అంటూ కొనియాడుతున్నారు. మరోవైపు విమానంలో అనుచితంగా ప్రవర్తించిన అతడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Indigo 6E 762 : Guwahati to Delhi.Intoxicated passenger vomited on the aisle and defecated all around the toilet.Leading lady Shewta cleaned up all the mess and all the girls managed the situation exceptionally well.Salute girl power🙏#Indigo #girlpower #DGCA pic.twitter.com/iNelQs48Tc — Bhaskar Dev Konwar @BD (@bdkonwar) March 26, 2023 -
7 నెలల పసికూన: దిగ్గజాలను ఢీకొంటోంది!
సాక్షి ముంబై: ప్రముఖ స్టాక్‌మార్కెట్ పెట్టుబడిదారుడు, దివంగత రాకేష్ ఝన్‌ఝన్‌వాలా ఆవిష్కరించిన ఆకాశ ఎయిర్ విస్తరణలో దూసుకుపోతోంది. బడ్జెట్‌ధరల్లో విమాన టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలనే ఆశయంతో బిగ్ బుల్ లాంచ్ చేసిన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆకాశ ఎయిర్ ఇపుడు విస్తరణలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. భారత విమానయాన రంగంలో అడుగుపెట్టిన ఏడాదిలోపే .ఏడు నెలల్లోనే సంస్థ తనదైన ఘనతను సాదించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన ఫిబ్రవరి నెలవారీ గణాంకాల ప్రకారం.. ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 3 శాతానికి చేరుకుంది. మార్చి చివరి నాటికి 18 ఎయిర్‌క్రాఫ్ట్‌లను చేర్చాలని భావించిన ఎయిర్‌లైన్ సంస్థ ప్రస్తుతం 19 విమానాలను కలిగి ఉంది. ప్రస్తుతం దేశీయ విమానయానంలో అగ్రగామిగా ఉన్న ఇండిగో ఆగస్టు 4, 2006లో సేవలను ప్రారంభించగా, ఆగస్టు 7, 2022లో ఆకాశ ఎయిర్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మరోవైపు అప్పట్లో ఇండిగోలో స్టార్టప్ టీమ్‌లో భాగమై ఆదిత్య ఘోష్ ఇప్పుడు ఆకాశ ఎయిర్‌లో ఉండటం గమనార్హం. ఇండిగో మార్కెట్ వాటా కేవలం 2.6 శాతం. అలాగే ప్రస్తుతం 75కుపైగా దేశీయ గమ్యస్థానలకు, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 గమ్యస్థానాలకు తన విమానాలను నడుపుతోంది. 2016 నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ (ఎన్‌సిఎపి) అమలులోకి వచ్చే వరకు, విమానయాన సంస్థలు అంతర్జాతీయంగా ప్రయాణించడానికి ఐదేళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. అలాగే కనీసం 20 విమానాలను కలిగి ఉండాలి. మారిన నిబంధన ప్రకారం కార్యకలాపాల వ్యవధిపై ఎలాంటి ఎటువంటి పరిమితులు లేవు. దీని ప్రకారం మార్చి 2023 చివరి నాటికి ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ విమానాలను కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. 2024 చివరి నాటికి మొత్తం శ్రామికశక్తిని 3వేలకు చేరుకోనుంని సంస్థ దాదాపు 1,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనుందని ఇటీవలి ఆకాశ ఎయిర్ వినయ్ దూబే ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి ‘మూడు అంకెల ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్డర్’ చేయనున్నట్లు దూబే వెల్లడించారు. ఇప్పటికే ఆపరేషన్‌లో ఉన్న 19 బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్ క్రాఫ్ట్‌లతో పాటు, అకాశ ఎయిర్ మరో 72 విమానాలతొ విస్తరిస్తోందని, ఏప్రిల్‌లో ప్రారంభించిన తర్వాత 20వ బోయింగ్ 737 మ్యాక్స్ విదేశీ ఫంక్షన్లకు సిద్ధంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌లైన్ మరో తొమ్మిది విమానాలతో మొత్తం సంఖ్య 28కి చేరనుంది. అలాగే వేసవి చివరి నాటికి ప్రస్తుత 110 (17 దేశీయ మార్గాలలో) నుండి 150చేరనుందన. ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు లక్నోనుంచి గోవా, అహ్మదాబాద్‌లకు డైరెక్ట్ విమానాలను ప్రారంభించింది ఆకాశ ఎయిర్. నిరంతరాయమైన కనెక్టివిటీని అందించే లక్ష్యంతో, చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి ఈ రెండు డైరెక్ట్ విమానాలు ఆదివారం లాంచ్ చేసింది. -
విమానంలో తాగి రచ్చ చేసిన ప్యాసింజర్లు.. చివరకు..
దుబాయ్ నుంచి ముంబై వచ్చిన ఇండిగో విమానంలో తప్పతాగి రచ్చ రచ్చ చేశారు ఇద్దరు ప్యాసింజర్లు. తోటి ప్రయాణికులతో దరుసుగా ప్రవర్తించారు. మద్యం మత్తులో మితిమీరి రెచ్చిపోయారు. అడ్డుకోబోయిన విమాన సిబ్బందిని కూడా లెక్కచేయకుండా దుర్భాషలాడారు. మద్యం బాటిళ్లను వారి వద్ద నుంచి తీసేసేందుకు ప్రయత్నించగా.. గొడవకు దిగారు. బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ ప్యాసింజర్లను దత్తాత్రేయ బపార్డేకర్, జాన్ జార్జ్ డిసౌజాగా గుర్తించారు. యాజమాన్యం వీరిపై ఫిర్యాదు చేయడంతో విమానం ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఆ తర్వాత వారు బెయిల్‌పై విడుదల అయినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఇద్దరు గల్ప్ దేశంలో ఏడాదిగా పని చేసి ఇంటికి తిరిగి వస్తున్న సందర్భంగా మందుబాటిళ్లు కొనుగోలు చేసి విమానంలోనే పార్టీ చేసుకున్నారు. ఇబ్బందిగా ఉందని చెప్పిన తోటి ప్యాసింజర్లతో వాగ్వాదానికి దిగడంతో విమానంలో గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే విమానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఏడాదిలో ఏడోసారి కావడం గమనార్హం. ఈ నెల మొదట్లోనే లండన్-ముంబై విమానంలో సిగరెట్ తాగిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే జనవరిలో ఢిల్లీ నుంచి పట్నా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్యాసింజర్ మద్యం తాగి రచ్చ చేశాడు. గతేడాది డిసెంబర్లో కొంతమంది ప్యాసింజర్లు విమానంలోనే ఘర్షణకు దిగిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. చదవండి: ఆరేళ్లుగా కాపురం.. ఇద్దరు పిల్లలు.. భార్య తన సొంత చెల్లి అని తెలిసి భర్త షాక్..! -
IndiGo:ఎయిర్‌బస్ నుంచి 500 విమానాలు ఆర్డర్
సాక్షి,ముంబై: ఎయిరిండియా మెగా డీల్ తరువాత దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వేగం పెంచింది. ఐరోపాలో తన పరిధిని విస్తరించేందుకు టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో తన భాగస్వామ్యాన్ని శుక్రవారం ప్రకటించింది. ఇందుకోసం యూరోపియన్ దిగ్గజం ఎయిర్‌బస్ నుండి ఇప్పటికే ఆర్డర్ చేసిన 500 అదనపు విమానాలను అందుకోనున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. ఇండిగో ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా మాట్లాడుతూ, ఇండియానుంచి ఇస్తాంబుల్ ,ఐరోపాకు ప్రయాణీకుల సేవలను మెరుగుపరచడంలో తమ తాజా కొనుగోలు సాయపడుతుందని చెప్పారు. ఇండిగో ప్రస్తుతం రోజుకు 1,800 విమానాలను నడుపుతోందని, వాటిలో 10 శాతం అంతర్జాతీయ రూట్లలో నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యం ఇది మునుపెన్నడూ లేని విధంగా యూరప్‌లోకి చొచ్చుకుపోనున్నట్టు మల్హోత్రా అన్నారు. భారతదేశం లోపల లేదా విదేశాలకు వెళ్లాలని ఆకాంక్షించే ప్రయాణికులకు భారీ అవకాశం ఉంది. ప్రస్తుతం పాస్‌పోర్ట్ ఉన్నవారు దాదాపు 7.3 శాతం అంటే 100 మిలియన్ల కంటే తక్కువ మంది ఉన్నారు. భారతీయ ప్రజలు పాస్‌పోర్ట్‌ను పొందుతున్నందున వారు చేయాలనుకుంటున్న మొదటి పని విదేశాలకు విమానంలో ప్రయాణించడమే. ఈ నేపథ్యంలోవారి ఆకాంక్షల్ని తీర్చేందుకు సరియైన సమయమని భావిస్తున్నామన్నారు. -
ఎయిరిండియా బాటలో ఇతర ఎయిర్‌లైన్స్: ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు!
సాక్షి,ముంబై: టాటా గ్రూపు సొంతమైన విమానయాన సంస్థ ఎయిరిండియా చారిత్రాత్మక 840 ఎయిర్‌బస్, బోయింగ్ విమానాల డీల్ తరువాత మరో కీలక విషయం మీడియాలో చక్కర్లు కొడుతోంది. దేశంలోని ఇతర విమానయాన సంస్థలు రానున్న 24 నెలల్లో మరో 1,200 విమానాలను ఆర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయని తెలుస్తోంది. (ఎయిరిండియా మెగా డీల్: 2 లక్షలకు పైగా ఉద్యోగాలు) సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఇండియా (సీఏపీఏ ఇండియా) ప్రకారం, ఇండిగో మరో బిగ్‌డీల్ మొదలు అదనంగా 1,000-1,200 విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. దేశంలోని దాదాపు ప్రతి క్యారియర్, ఫ్లీట్ రీప్లేస్మెంట్, గ్రోత్ కోసం రాబోయే రెండేళ్లలో మరిన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆర్డర్ చేయనున్నాయని సీఏపీఏ అంచనా వేసింది. దీంతో ఎయిరిండియా మెగాడీల్‌తో దాదాపు 2 లక్షలకుపైగా ఉద్యోగాలు లభించనున్నాయనే పరిశ్రమ నిపుణుల అంచనాల మధ్య సీఏపీఏ నివేదిక నిజమైతే ఇక విమానయాన రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలోనే ఇండిగో సుమారు 300 విమానాల గణనీయమైన ఆర్డర్‌ను సిద్ధం చేసుకుంది. కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఇపుడు ఈ ప్రణాళికను అమలు చేయవచ్చని, నిజానికి గతంలో ఊహించిన దానికంటే దాదాపు 500 విమానాల వరకు కొనుగోలు చేయనుందని అభిప్రాయపడింది. ఇటీవలి నెలల్లో, ఎయిర్‌ఫ్రేమ్ సిద్ధంగా ఉన్న చోట ఎయిర్‌క్రాఫ్ట్ డెలివరీలు ఆలస్యం అవుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి, సరఫరా గొలుసు సమస్యల కారణంగా ఇంజిన్లు అందుబాటులో లేవు. 2023-2024 చివరి నాటికి ఇటువంటి కేసులు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే, సరఫరా సవాళ్లు పరిష్కారం తర్వాత కూడా, ఎయిర్‌క్రాఫ్ట్,ఇంజన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులకు (OEMలు) చాలా ముఖ్యమైన ఆర్డర్ల బ్యాక్‌లాగ్‌లు ఉంటాయని వీటిని పరిష్కరించడానికి సంవత్సరాలు పట్టవచ్చని నివేదిక పేర్కొంది. డిసెంబర్ 31, 2022 నాటికి ఎయిర్‌బస్ , బోయింగ్ సహా 12,669 ఆర్డర్లను డెలివరీ చేయలేకపోయాయనీ ఈ డెలివరీ స్లాట్లు కనీసం రాబోయే రెండేళ్ళ వరకు రావడం చాలా కష్టంమని పేర్కొంది. 2029 వరకు పరిస్థితి కఠినంగా ఉంటుందని సీఏపీఏ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కాగా యూరోపియన్ దిగ్గజం ఎయిర్‌బస్ ,యుఎస్ బోయింగ్ నుండి 840 కొనుగోలు హక్కులు ఉన్నాయని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్ (CCTO) నిపున్ అగర్వాల్ లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు. -
ఇండిగో దూకుడు
న్యూఢిల్లీ: ఇండిగో బ్రాండు విమానయాన సేవల దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 1,423 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 130 కోట్లు ఆర్జించింది. విదేశీమారక నష్టాలను మినహాయిస్తే రూ. 2,009 కోట్ల లాభం సాధించినట్లు కంపెనీ పేర్కొంది. విమానయానానికి ఊపందుకున్న డిమాండ్ ఇందుకు దోహదపడినట్లు కంపెనీ సీఈవో పీటర్ ఎల్బెర్స్ తెలియజేశారు. మొత్తం ఆదాయం సైతం రూ. 9,480 కోట్ల నుంచి రూ. 15,410 కోట్లకు ఎగసింది. ఒక క్వార్టర్‌కు ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికమని పీటర్ పేర్కొన్నారు. కంపెనీలో తీసుకున్న పలు చర్యలు ఫలితాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రయాణాలకు పెరిగిన డిమాండును ప్రతిఫలిస్తూ 26 శాతం అధికంగా 2.23 కోట్లమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు. సీట్ల ఆక్యుపెన్సీ 79.7 శాతం నుంచి 85.1 శాతానికి పుంజుకుంది. 300 ఆధునిక విమానాలతో సర్వీసులందిస్తున్నట్లు తెలియజేశారు. డీజీసీఏ గణాంకాల ప్రకారం దేశీయంగా 55.7 శాతం మారెŠక్ట్ వాటా కలిగి ఉన్నట్లు ప్రస్తావించారు. కంపెనీ రూ. 10,612 కోట్లు చేతిలో నగదుసహా రూ. 21,925 కోట్ల నగదు నిల్వలు కలిగి ఉంది. ఇదే సమయంలో రూ. 41,042 కోట్ల లీజ్ లయబిలిటీలతో కలిపి రూ. 44,475 కోట్ల రుణాలున్నాయి. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు బీఎస్ఈలో 1.2 శాతం నష్టంతో రూ. 2,100 వద్ద ముగిసింది. -
ప్రయాణికుడిని పాట్నాకు బదులు ఉదయ్‌పూర్ తీసుకెళ్లిన ఇండిగో..
న్యూఢిల్లీ: బిహార్ రాజధాని పాట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడ్ని రాజస్థాన్ ఉదయ్‌పూర్‌కు తీసుకెళ్లింది ఇండిగో విమానం. సిబ్బంది నిర్లక్ష్యంతో అతని వద్ద సరైన టికెట్, బోర్డింగ్ పాస్ ఉన్నప్పటికీ.. పాట్నా విమానానికి బదులు ఉదయ్‌పూర్ విమానంలో ఎక్కించారు. తీరా ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక పాట్నాలో ఉండాల్సిన తాను ఉదయ్‌పూర్‌లో ఉండటం చూసి ప్రయాణికుడు షాక్ అయ్యాడు. జనవరి 30న జరిగిన ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టనుంది. ఈ ప్రయాణికుడి పేరు అఫ్తార్ హుస్సేన్. జనవరి 30న పాట్నా వెళ్లేందుకు ఇండిగో విమానం 6E-214లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే పొరపాటున అతడ్ని 6E-319 ఇండిగో విమానంలో ఎక్కించారు సిబ్బంది. తీరా ఉదయ్‌పూర్‌లో దిగాక అతనికి అసలు విషయం తెలిసింది. ఈ విషయాన్ని ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు హుస్సేన్. వెంటనే ఆయన ఇండిగో సంస్థను అప్రమత్తం చేశారు. దీంతో సదరు సంస్థ హుస్సేన్‌ను మళ్లీ ఢిల్లీకి తీసుకెళ్లింది. ఆ మరునాడు అంటే జనవరి 31న అక్కడినుంచి పాట్నాకు తీసుకెళ్లింది. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎక్కడ జరిగిందని డీజీసీఏ దర్యాప్తు జరపనుంది. ప్రయాణికుడి బోర్డింగ్ పాసు స్కాన్ చేయకుండా విమానం ఎలా ఎక్కించారు? బోర్డింగ్‌కు ముందే రెండుసార్లు బోర్డింగ్ పాసులను స్కాన్ చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అతను వేరే విమానంలో ఎలా ఎక్కాడు? అని విచారణ జరపనున్నారు. అనంతరం విమాన సంస్థపై చర్యలు తీసుకోనున్నారు. చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగికి షాక్! అటు ఉద్యోగం, ఇటు పెళ్లి చేసుకునే పిల్లా? ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు!