విమాన ప్రమాదమనగానే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఏదైనా విమాన ప్రమాదం తప్పిందని తెలియనే ఊపిరి పీల్చుకుంటాం. ఇటువంటి సందర్భాల్లో ఆయా విమానాల్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురవుతారు. తాజాగా ముంబైలో విమాన ప్రమాదం తృటిలో తప్పింది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ముంబై విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలోని రన్‌వేపై నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతుండగా.. ఊహించని విధంగా అదే సమయంలో ఇండిగో విమానం ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో టేకాఫ్ అవుతున్న ఎయిరిండియా జెట్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగింది.
ఈ ఘటనపై స్పందించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే డ్యూటీలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని సస్పెండ్ చేశారు. ఇక ఈ రెండు విమానాలు సమీపంగా వచ్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
Woh, this looks real close.@IndiGo6E lands just when @AirIndia was taking-off at Mumbai Airport.@DGCAIndia @FAANews @CSMIA_Official @MoCA_GoI pic.twitter.com/wRtFiTLKHE
— Tarun Shukla (@shukla_tarun) June 9, 2024
Comments
Please login to add a commentAdd a comment