touch
-
టీన్ప్రెన్యూర్స్: తల్లిదండ్రుల సంరక్షణలో పెరగకపోయినా..!
‘ఆర్ఎమ్పి ఫ్లవర్స్’ అధినేత 14 ఏళ్ల పూజిత. ఆర్డీవై ఫ్రేమర్స్ యజమాని యశస్వి. ఎకో ఫ్రెండ్లీ షాంపూ తయారీతో ఎంటర్ప్రెన్యూర్ కావాలనే ఆలోచనలో ఉన్నాడు మహబూబ్. వీళ్లందరూ స్కూల్ విద్యార్థులే. వీళ్లలో ఎవరూ సంపన్నులు కాదు. పారిశ్రామికవేత్త కావాలనే ఆలోచనే వారి మూలధనం. మరో విషయం... వీళ్లెవరూ తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతున్న పిల్లలు కాదు. హైదరాబాద్‌లోని టచ్ ఫౌండేషన్ ఆర్ఫనేజ్‌లో పెరుగుతున్న అనాథ పిల్లలు.పూజిత తొమ్మిదవ తరగతి. ఆమె తల్లిని, ఒక చెల్లిని తండ్రి పాశవికంగా హతమార్చాడు. ఆ సంఘటనతో పూజిత చెల్లితోపాటు టచ్ ఫౌండేషన్‌కు వచ్చింది. ఆర్ఫనేజ్‌కు వచ్చిన తర్వాత కూడా మిగిలిన పిల్లలతో కలవకుండా విచారంగా, కోపంగా ఉండేది. ఒంటరిగా గడిపేదని తెలియచేశారు నిర్వహకులు విజయ్‌కుమార్. అలాంటి పూజిత ఈ రోజు ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కాళ్ల మీద నేను నిలబడగలననే ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’ అని చెబుతోంది. ఆశ్రమం ఆవరణలో ఉన్న పూలు, ఆకులతో బొకేలు చేసి అమ్మవచ్చని స్నేహితులకు చెప్పి వారిని ప్రోత్సహించింది పూజిత. అలా ఓ చిన్నపాటి వ్యాపారవేత్తగా మారింది. ఇక యశస్వి విషయానికి వస్తే... ‘హైదరాబాద్‌లో జరిగిన 2024 స్టార్టప్ ఫెస్టివల్లో ఐదు ఫొటోఫ్రేములు అమ్మగలిగాను. ఈ నంబర్ చిన్నదే కావచ్చు. ఈ ఈవెంట్లో పాల్గొనడం వల్ల వచ్చిన ఆత్మవిశ్వాసం చాలా పెద్దది. నా ఉత్పత్తుల గురించి కస్టమర్‌కి ప్రెజెంటేషన్ ఇవ్వడం ద్వారా నేర్చుకున్న మెళకువలను అమలు చేయడం తెలుసుకున్నాను’ అంటోంది.ఆమె తల్లిదండ్రులను కోవిడ్ పొట్టన పెట్టుకుంది. బంధువులు యశస్విని, ఆమె సోదరుడిని ఆర్ఫనేజ్‌కు తీసుకువచ్చారు. రీ యూజ్డ్ మెటీరియల్‌తో ఫొటోఫ్రేములను చేస్తోంది యశస్వి. స్నేహితులతో కలిసి పేపర్, కార్డ్బోర్డ్, రాళ్లు వంటి తమకు అందుబాటులో ఉన్న వస్తువులకు తమ క్రియేటివిటీ జోడించి ఫొటోఫ్రేములను తయారుచేస్తోంది. మహమ్మద్ మహబూబ్ పదవ తరగతి విద్యార్థి. అతడు తామున్న హోమ్ ఆవరణలో ఉన్న కుంకుడు కాయలతో ఎకోఫ్రెండ్లీ షాంపూ తయారు చేసి సమీపంలో ఉన్న దుకాణాలకు సప్లయ్ చేయాలనుకుంటున్నాడు. పిల్లల్లో వ్యాపారవేత్త కావాలనే ఆలోచనను ప్రోత్సహించడానికి ‘యంగ్ టింకర్ ఫౌండేషన్’ ఒక్కో స్టూడెంట్‌కి వెయ్యి రూపాయలిస్తోంది. ఆ డబ్బుతో ఏం చేయాలి, ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి తిరిగి మరింత డబ్బు సంపాదించడం ఎలా? ఇందుకోసం వారి బుర్రల్లో ఎలాంటి ఆలోచనలు ఆవిష్కరిస్తాయనే అంశాలను పిల్లలకే వదిలేస్తారు. ఈ ప్రయత్నంలోనే పూజితకు ఫ్లవర్ బొకే ఆలోచన వచ్చింది. యశస్వికి ఫొటో ఫ్రేములు చేయాలనిపించింది. మహబూబ్ షాంపూ తయారు చేయాలనుకున్నాడు. పిల్లలకు అవకాశం ఇస్తే వారి మెదళ్లు ఎంత చురుగ్గా ఆలోచిస్తాయో తెలియచేసే గొప్ప నిదర్శనం ఇది. (చదవండి: కళనే లాభదాయకమైన వృత్తిగా మలిచింది! హాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీకే..) -
'వెనకవైపు నుంచి అనుచితంగా తాకాడు'.. టాలీవుడ్ హీరోయిన్!
ఉయ్యాలా జంపాలా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మెప్పించింది. ఆ తర్వాత లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడికీ పోతావు చిన్నవాడా, రాజుగారి గది-3 సినిమాలతో మెప్పించింది. గతేడాది వధువు అనే వెబ్ సిరీస్‌తో అలరించింది. బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు) సిరీయల్ గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్.. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. ఆమె ప్రస్తుతం బ్లడీ ఇష్క్‌లో అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ ఒక ఈవెంట్లో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. తాను వేదికపై వెళ్లే క్రమంలో వెనకవైపున అసభ్యంగా తాకాడని తెలిపింది. తిరిగి చూస్తే అక్కడ కేవలం తన బాడీగార్డ్ మాత్రమే ఉన్నారని వెల్లడించింది. అతను సారీ చెప్పడంతో ఆ సంగతి వదిలేశానని చెప్పుకొచ్చింది.అయితే ఇదే సంఘటన రెండోసారి కూడా జరిగిందని అవికా గోర్ తెలిపింది. అయితే ఈసారి నన్ను పట్టుకోకముందే బాడీగార్డ్ చేయి పట్టుకున్నానని అవికా పేర్కొంది. అసలేం ఏం చేస్తున్నావ్ గట్టిగా నిలదీయడంచో క్షమాపణలు చెప్పాడని వెల్లడించింది. దీంతో అతన్ని వదిలిపెట్టాటని వివరించింది. అలాంటి వ్యక్తులను ఎదుర్కోవడానికి ధైర్యం ఉండాలని ఆమె అన్నారు. నాకే గనుక ధైర్యం ఉంటే ఈపాటికి చాలా మందిని తిరిగి కొట్టేదానినని అవికా గోర్ నవ్వుతూ చెప్పింది. -
ఒకే రన్‌వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
విమాన ప్రమాదమనగానే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఏదైనా విమాన ప్రమాదం తప్పిందని తెలియనే ఊపిరి పీల్చుకుంటాం. ఇటువంటి సందర్భాల్లో ఆయా విమానాల్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురవుతారు. తాజాగా ముంబైలో విమాన ప్రమాదం తృటిలో తప్పింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ముంబై విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలోని రన్‌వేపై నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతుండగా.. ఊహించని విధంగా అదే సమయంలో ఇండిగో విమానం ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో టేకాఫ్ అవుతున్న ఎయిరిండియా జెట్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగింది.ఈ ఘటనపై స్పందించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే డ్యూటీలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని సస్పెండ్ చేశారు. ఇక ఈ రెండు విమానాలు సమీపంగా వచ్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. Woh, this looks real close.@IndiGo6E lands just when @AirIndia was taking-off at Mumbai Airport.@DGCAIndia @FAANews @CSMIA_Official @MoCA_GoI pic.twitter.com/wRtFiTLKHE— Tarun Shukla (@shukla_tarun) June 9, 2024 -
మీ అమ్మాయికి చెప్పండి!
మీ ఇంట్లో, మీ పక్కింట్లో, ఎదురింట్లో, పొరుగింట్లో కూతుళ్లు ఉండే ఉంటారు. నవ్వుతూ తుళ్లుతూ స్కూళ్లకు వెళుతుంటారు. కొన్ని కళ్లు చూపులతోనూ, మరికొన్ని చేతలతోనూ ఆ నవ్వులను చిదిమేయడానికి పొంచి ఉంటాయి. ఆమెకు చెప్పండి ‘గుడ్ టచ్ బ్యాడ్ టచ్’ అంటే ఏమిటో...జాగ్రత్తగా ఎందుకు ఉండాలో. ‘మీ పక్కింట్లో, ఎదురింట్లో, పొరుగింట్లో, వెనకింట్లో ఉన్న అమ్మలు ఒక్కటవ్వండి. పరువు పరదాల మాటున పసిపిల్లలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయండి..’అని చెబుతున్నారు హైదరాబాద్ వాసులైన మమత, శైలజ, జయవర్ధని, పుష్పలత, లక్ష్మి. ఆడపిల్లల భవిత బాగుండాలంటే వారు ఈ రోజు సుర క్షితంగా ఉండాలి. చెడు చేతల బారిన పడకుండా ‘గుడ్ టచ్– బ్యాడ్ టచ్’ గురించి బడులు, మురికివాడలు, అపార్ట్మెంట్లు.. మొదలైన ప్రాంతాల్లో మమత, శైలజ, జయవర్ధిని, పుష్పలత, లక్ష్మి.. లు ‘అభయ భవిత’ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వీరు చేసే ఈ అవగాహన కార్యక్రమం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా తెలుగు రాష్ట్రాలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోకీ తీసుకెళుతున్నామని తెలియజేశారు. పిల్లల భావాలను గ్రహించండి.. మూడు నుంచి పదేళ్లలోపు పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని జాతీయ, అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.‘ఆ పై వయసు పిల్లలు కూడా ఎదురు చెప్పలేని, ఎదుర్కోలేని స్థితిలో ఉన్నారని గమనిస్తున్నాం’ అంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు. పిల్లల్లో ఆకలి తగ్గిపోవడం, ఎవరితో కలవకపోవడం, నిద్రలో ఉలిక్కిపడి లేవడం, ప్రతి విషయానికి చికాకు పడటం, చదువులో వెనకబడిపోవడం .. వంటి సమస్యలన్నీ చెడు స్పర్శకు గురైన పిల్లల్లో చూస్తుంటాం. ఈ ప్రభావం వారి భవిష్యత్తును దెబ్బతీయకుండా ఉండాలంటే పిల్లల్లో ఇలాంటి భావాలేమైనా ఉంటే వాటిని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. అబ్బాయిలనూ చెడు స్పర్శ సమస్య వెంటాడుతుంది. కాబట్టి, ఈ సమస్య అమ్మాయిలది మాత్రమే అని అనుకోవద్దు. పిల్లల ప్రవర్తనలో తేడాలు గమనించడం, నిపుణులు సాయం తీసుకోవడం సముచితం’ అని తెలియజేస్తున్నారు. తల్లిదండ్రులుగా మీరేం చేయాలంటే.. ఎవరైనా అమ్మాయిల తలపై, వీపుపై తట్టడం .. వంటి స్పర్శ వారిపై చూపించే శ్రద్ధగానే అనిపిస్తుంది. కానీ, వారి శరీరంలోని ప్రైవేట్ పార్ట్‌లను తడమడం, తాకడం, కొట్టడం.. వంటివి పిల్లల భావాలపై తీవ్రమైన చెడు ప్రభావం చూపుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, అపరిచిత వ్యక్తులు ఎవరైనా సరే వారు స్పర్శించిన తీరు నచ్చకపోతే వెంటనే ‘నో’ చెప్పాలనే విషయాన్ని పిల్లలకు తెలియజేయాలి. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తే .. ∙అప్రమత్తంగా ఉండమని చెప్పండి ∙భద్రత కోసం ఏదైనా వస్తువును ఉపయోగించమనండి ∙ఎవరినైనా సాయం కోరమనండి ∙గట్టిగా అరవమనండి చెడు స్పర్శ వద్దే వద్దు అని చెప్పండి. ∙నిర్భయంగా ఉండమనండి ∙నీలో ఎంతో శక్తి ఉంది అది గ్రహించు అని చెప్పండి ∙సంఘటనను బట్టి వెంటనే ప్రతిఘటించమనండి ∙ఎలాంటి బాధ అయినా పంచుకోమని చెప్పండి. ఎవరికీ చెప్పుకోలేని సమస్య ఎదురైతే వెంటనే హెల్ప్‌లైన్ 1098 లేదా 100కు ఫోన్ చేయమనండి. – నిర్మలారెడ్డి బోర్డుపైన బొమ్మలు వేయించి పదేళ్లుగా సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాను. పిల్లల ఆరోగ్యం గురించి, మహిళలకు స్కిల్ ట్రైనింగ్ చేస్తుండేవాళ్లం. ఇప్పుడు పిల్లలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ మీద అవగాహన కల్పిస్తున్నాను. బళ్లారిలోని గవర్నమెంట్ స్కూల్లో ఇద్దరు అమ్మాయిలను నిలబెట్టి మిగతా అందరికీ అర్థమయ్యేలా వివరించాం. పిల్లల చేతనే బోర్డు మీద బాడీలో ఏయే పార్ట్స్ తాకితే బ్యాడ్ టచ్ అనే విషయాలను బొమ్మలు వేయించి, రాయించి తెలియజేశాను. ఈ కార్యక్రమంలో పిల్లలు వాళ్ల ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకోవడం, తాము ఎలా ప్రతిస్పందించాలో ఒకటొకటిగా చెబుతుంటే ఆనందంగా అనిపించింది. – పుష్పలత సమాచారం ఉన్నా అవగాహన లేదు బిజినెస్ ఉమన్‌గా నా పనులు చేసుకుంటూనే స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటుంటాను. కార్పొరేట్ స్కూళ్లలో మా ఫ్రెండ్ వాళ్లు స్టూడెంట్స్‌కు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేస్తుంటారు. ఒక్కో కార్యక్రమానికి స్కూల్ నుంచి కొంత మొత్తం తీసుకుంటారు. కానీ, గవర్నమెంట్, ఇతర కాన్వెంట్ స్కూళ్లకు ఆ అవగాహన కల్పించేవారు తక్కువగా ఉన్నారు. మేము భవిత ప్రోగ్రామ్ ద్వారా ఉచితంగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటీవల హన్మకొండ జిల్లా వంగరలోని స్కూల్ పిల్లలకు గుడ్‌టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇందుకు సంబంధించిన సమాచారం ఇప్పుడు చాలామంది దగ్గర ఉన్నప్పటికీ ఈ విషయంపై పిల్లలకు ఎంతవరకు అవగాహన కల్పిస్తున్నారు అనేది తెలియడం లేదు. ఒకసారి చెప్పి వదిలేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ సమస్యకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడూ ఇస్తూ ఉండాలి. – జయవర్ధని రక్షించుకోవాలనే ఆలోచన కలగాలి ఖమ్మంలో నా ఫ్రెండ్ డాక్టర్ ప్రశాంతితో కలిసి నిన్ననే ఒక స్కూల్ విద్యార్థులను కలిశాం. టీచర్‌గా, చైల్డ్ సైకాలజిస్ట్‌గా పిల్లలను ధైర్యవంతులను ఎలా చేయాలి అనే అంశాలపై చర్చించుకుంటూ ఉంటాం. పిల్లల మీద దాడులు జరిగినప్పుడు పెద్దలు ఆ విషయాలను బయటకు రానివ్వరు. ఎప్పుడో ఒకటో రెండో సంఘటనలు బయటకు వస్తాయి. ఈ కారణంగా చిన్నవయసులోనే పిల్లలు గర్భవతులు అవడం, ఆసుపత్రుల పాలవడం కూడా చూశాం. మేం చేసే ఈ కార్యక్రమం ద్వారా సమస్యను కొంతవరకైనా తగ్గించగలుగుతాం అనే ఆలోచనతో మొదలుపెట్టాం. కరోనాకు ముందు స్కూల్, కాలేజీలలో దాదాపు పదివేల మంది పిల్లలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి వివరించాం. ఇది పిల్లలున్న ప్రతి ఇంట్లో అవసరమైన టాపిక్. ఒక కథ లాగా చెప్పడం, తాము ఎవరి సమక్షంలో అయినా ఉన్నప్పుడు సురక్షితంగా అనిపించకపోతే గట్టిగా అరవడం, కొరకడం, నెట్టేయడం.. వంటివి చేయడం గురించి చెప్పాం. కరోనా టైమ్‌లో చాలామంది పిల్లలు ఈ విధానం వల్ల రక్షింపబడ్డారని వారి పేరెంట్స్ వచ్చి చెప్పినప్పుడు చాలా ఆనందం అనిపించింది. అనాథాశ్రమాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంటాం. తమని తాము ఎలా రక్షించుకోవాలనే ఆలోచనను పిల్లల్లో కలిగించడానికి వీలైనన్ని కాన్సెప్ట్స్ ఇస్తుంటాం. అభయ భవిత కార్యక్రమం ద్వారా వీలైనంత మందిమి గ్రూప్‌గా అవుతున్నాం. స్లమ్స్, ఇండ్లలోని వారిని కూడా కలుస్తున్నాం. తమ తమ ప్రాంతాల్లోనే ఉంటూ ఎవరైనా ఆడపిల్లల రక్షణ కోసం అవగాహన కల్పించవచ్చు. – ఏలూరి మమత పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి పోక్సో అండ్ పోష్ రెండూ సర్టిఫికేషన్ చేశాను. వీటిలో శిక్షణ తీసుకున్నాను. పిల్లలపై జరిగే అకృత్యాలు, దాడులకు సంబంధించిన చట్టాలు, ఎలా నియంత్రించవచ్చు... అనే దానిపై వర్క్ చేస్తుంటాను. మా ఫ్రెండ్ ఎన్జీవో నుంచి వాలంటీర్‌గా పిల్లలకు స్వీయరక్షణ కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్స్‌ను కలిసి, పిల్లలకు శిక్షణ తీసుకుంటూ ఉంటాను. ఇటీవల గోల్కొండ ప్రాంతంలోని గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్లినప్పుడు 9వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి గురించి తెలిసింది. ఆ అమ్మాయి మొదట్లో చాలా చురుకుగా ఉండేది. ఇప్పుడు మానసికంగా చాలా దెబ్బతింది. తనతో మాట్లాడితే హాస్టల్లో లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసింది. ఎప్పుడూ ముభావంగా ఉండటం, సరిగా చదవకపోవడం, చిరాకు పడటం.. వంటివన్నీ ఉన్నాయి. లైంగిక వేధింపుల కారణంగా మానసికంగా దెబ్బతిన్న పిల్లలను చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. – శైలజ యడవల్లి ఎదుర్కోవడానికి సిద్ధం చేయాలి మేం ఉంటున్న ఉప్పల్ ప్రాంతంలోనే ఉన్న కాన్వెంట్ స్కూల్‌కి వెళ్లి అక్కడి ప్రిన్సిపల్ అనుమతితో స్కూల్ అమ్మాయిలతో కలిసి, మాట్లాడాను. పిల్లల చేతనే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చిన్న చిన్న స్కిట్స్ చేయించాను. తోటి పిల్లల్లో ఎవరైనా ఎవ్వరితోనూ మాట్లాడకుండా, ముభావంగా ఉంటూ, సరిగ్గా చదవకుండా ఉన్నట్టు గమనిస్తే సమస్యను తెలుసుకుని టీచర్లకు తెలియజేయండి అని వివరించాను. పిల్లలు బాగా స్పందించారు. రెండు గంటలపాటు చేసిన ఈ కార్యక్రమంలో పిల్లలు ఆత్మరక్షణతో ప్రతిరోజూ ఎలా ఉండాలో, ఏదైనా చెడు సంఘటన జరుగబోతోందని అర్థమయిన వెంటనే ఎలా ఎదుర్కోవాలో వివరించాను. పదవతరగతి లోపు పిల్లలందరికీ ఎలాంటి చెడు సంఘటన ఎదురు కాకుండా ఉంటే ఆ తర్వాత వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్థం చేసుకోగలరు. లేదంటే, వారి భవిష్యత్తుకు ప్రమాదం అవుతుంది. ఈ విషయం గుర్తించి అవగాహన కల్పిస్తున్నాను. – లక్ష్మి -
ఆ నిచ్చెనంటే ఎందుకు భయం? జెరూసలేంలో 273 ఏళ్లుగా ఏం జరుగుతోంది?
హమాస్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ నిత్యం వార్తల్లో కనిపిస్తోంది. దీంతో చాలామంది ఈ చిన్న దేశం గురించి, అక్కడి పౌరుల గురించి, అంటే యూదుల జీవన విధానానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఆ వివరాలతో పాటు ఇక్కడి జెరూసలేంలో ఉన్న ఒక విచిత్రమైన నిచ్చెన గురించి తెలుసుకుందాం. ఆ నిచ్చెన 273 ఏళ్లుగా ఒక్క అంగుళం కూడా పక్కకు కదలలేదట. అందుకే దీని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఏదేనా వివాదాస్పద స్థలం గురించి చర్చ జరిగినప్పుడు జెరూసలేం పేరు కూడా వినిపిస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్ దీనిని తమ రాజధానిగా చెబుతుండగా, మరోవైపు పాలస్తీనా ఇది తమదేనని వాదిస్తుంటుంది. ఈ నగరం కోసం కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈ స్థలం ఎందుకు అంత ముఖ్యమైనదనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది. నిజానికి ఈ ప్రదేశం నుండే ప్రపంచంలోని మూడు ప్రధాన మతాలైన క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం స్థాపితమయ్యాయని చెబుతారు. జెరూసలేం నగరంలో ‘చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్’ అనే క్రైస్తవ చర్చి ఉంది. ఏసుక్రీస్తుకు ఇక్కడే శిలువ వేశారని, తర్వాత ఇక్కడే తిరిగి అవతరించారని క్రైస్తవులు నమ్ముతారు. అయితే ఈ చర్చిలో క్రైస్తవ మతంలోని వివిధ వర్గాల సంప్రదాయరీతులు నడుస్తుంటాయి. క్రైస్తవ మతంలోని ఆరు వర్గాలు సంయుక్తంగా ఈ చర్చిని పర్యవేక్షిస్తున్నాయి. అయితే ఈ చర్చిలో ఒక ప్రత్యేకమైన నిచ్చెన మెట్లు ఉన్నాయి. ఇవి వివాదాస్పదంగా నిలిచాయని చెబుతారు. ‘ది హోలీ సెపల్చర్ చర్చి’లోని ఒక ప్రాంతంలో 1750 నుంచి ఈ నిచ్చెన ఉంది. ఇప్పటి వరకు ఈ నిచ్చెనను ఒక్క అంగుళం కూడా కదపడానికి ఎవరూ సాహసించలేదు. దీనిని కదిపితే వివిధ వర్గాల మధ్య వివాదం తలెత్తవచ్చనే భావనతో దీనిని ఎవరూ ఇంతవరకూ ముట్టుకోలేదట. నేటికీ చర్చిలో ఎటువంటి మరమ్మతులు చేపట్టినా ఈ నిచ్చెనను ఈ స్థలం నుంచి కదపకపోవడం విశేషం. ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలపై యూనియన్ జాక్ ఎందుకు? -
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని చంద్రుని ఉపరితలం..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. రోవర్ ప్రగ్యాన్ ఇప్పటికే బయటకు వచ్చింది. ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉందని ఇస్రో తెలిపింది. అన్ని ప్రక్రియలు అనుకున్న ప్రకారమే షెడ్యూల్లో పూర్తి అయ్యాయని స్పష్టం చేసింది. రోవర్ కదలికలు ప్రారంభమయ్యాయని తెలిపింది. అయితే.. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగేప్పుడు చివరి క్షణంలో తీసిన జాబిల్లి వీడియోను షేర్ చేసింది. Chandrayaan-3 Mission: All activities are on schedule. All systems are normal. 🔸Lander Module payloads ILSA, RAMBHA and ChaSTE are turned ON today. 🔸Rover mobility operations have commenced. 🔸SHAPE payload on the Propulsion Module was turned ON on Sunday. — ISRO (@isro) August 24, 2023 దక్షిణ ధృవంపైనే ఎందుకు..? చంద్రయాన్ 3 దిగ్విజయంగా జాబిల్లిపై కాలు మోపింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అయితే.. దక్షిణ ధృవాన్ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నపై ఇస్రో చీఫ్ సోమనాథ్ సమాధానమిచ్చారు. 'చంద్రుని దక్షిణ ధృవంపై సూర్మరశ్మి పడే అవకాశాలు లేవు. నీరు, ఖనిజాలకు సంబంధించిన వివరాలు లభించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా చంద్రుని నివాసానికి సంబంధించిన వివరాలు కూడా దక్షిణ ధృవం వద్ద లభిస్తాయి. అందుకే ఈ ధృవం వైపే అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడానికి పలు దేశాలు ప్రయత్నించాయి' అని తెలిపారు. 'చంద్రయాన్ 2 ప్రయత్నంలో విఫలమైన తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమయ్యాం. ఓ ఏడాది చంద్రయాన్ 2లో జరిగిన తప్పిదాలపైనే అధ్యయనం చేశాం. మరో ఏడాది ఆ తప్పులను సరిచేయడంపైనే పనిచేశాం. మరో ఏడాది వాటిని పరీక్షించి చూసుకున్నాం. చివరగా నాలుగేళ్లకు చంద్రయాన్ 3ని ప్రయోగించాం.' అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై ల్యాండ్ అయింది. ఇప్పటికే ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. మరో 14 రోజులపాటు చంద్రునిపై పనిచేయనుంది. ఇదీ చదవండి: జాబిల్లిపై మూడు సింహాల అడుగులు.. రోవర్‌కు సారనాథ్ అశోక చిహ్నం.. -
ల్యాండర్ కాలుమోపగానే.. చంద్రయాన్ 3 ఫస్ట్ మెసేజ్..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా ముగిసింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగు పెట్టగానే మొదటి మెసేజ్ ఇస్రో పంపించింది. Chandrayaan-3 Mission: 'India🇮🇳, I reached my destination and you too!' : Chandrayaan-3 Chandrayaan-3 has successfully soft-landed on the moon 🌖!. Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3 — ISRO (@isro) August 23, 2023 'ఇండియా అంటే నేను లక్ష్యాన్ని చేరాను. మీరు కూడా. చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యాం. శుభాకాంక్షలు.' చంద్రయాన్ 3 అంటూ పోస్టులో పేర్కొంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపే అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు బ్రాడ్కాస్ట్ సౌకర్యం 5:20 నుంచే ప్రారంభమైంది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసి.. ల్యాండింగ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇదీ చదవండి: 'సరికొత్త చరిత్రను లిఖించాం..' చంద్రయాన్ 3 సక్సెస్‌పై పీఎం మోదీ.. -
మోదీకి పాదాభివందనం చేసిన ఆ దేశ ప్రధాని..
-
ఏది గుడ్.. ఏది బ్యాడ్?.. అరవండి.. పరుగెత్తండి.. చెప్పండి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అభంశుభం తెలియని చిన్నారులపై కామాంధుల కళ్లు పడుతున్నాయి. చాలా సందర్భాల్లో తెలిసిన వారే దుశ్చర్యకు ఒడిగడుతున్నారు. ఈ తప్పు జరగకుండా ఉండాలంటే, మన పిల్లలకు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్.. అన్నది చెప్పాలి. తాకకూడని చోట ఎవరైనా తడిమితే, భయపడకుండా ‘డోంట్ టచ్ మీ’ అని గట్టిగా అరవాలి.. అక్కడి నుంచి పరుగెత్తాలి.. ఎవరికైనా జరిగిన విషయాన్ని చెప్పాలి.. దీనిపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. చదవండి: రేటు ఎంతైనా.. రుచి చూడాల్సిందే! బాలికలపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. లైంగిక వేధింపులు, బాలల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగేలా జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. హైకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ, మహిళాభివృద్ధి శిశు, సంక్షేమం, ఫోరమ్ ఫర్ చైల్డ్ లైన్, పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రత్యేక నినాదాలతో అవగాహన ♦తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ‘అరవండి.. పరుగెత్తండి.. చెప్పండి’ (షౌట్.. రన్.. టెల్) నినాదాలతో ఆపదలో ఉన్న పిల్లలకు తెలిసే విధంగా ప్రచార పోస్టర్లను తయారు చేశారు. ♦వీటిని జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, ఎంపీడీఓ, తహసీల్దార్, గ్రామ, వార్డు సచివాలయాలు, వసతి గృహాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్, ప్రముఖ కూడళ్ల వద్ద శాశ్వతంగా ఉండేలా ప్రదర్శించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ♦ఆయా పోస్టర్లపై చైల్డ్ లైన్ 1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181, పోలీస్ హైల్ప్ లైన్ 100 నంబర్లను ఉంచారు. ♦పాఠశాలలో నిర్వహించే అసెంబ్లీలో లైంగిక వేధింపులు, బాలల హక్కులపై చర్చించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ♦గుడ్, బ్యాడ్ టచ్ మధ్య వ్యత్యాసంపై ఎనిమిది నిమిషాల నిడివితో వీడియో క్లిప్ రూపొందించారు. ♦దీనిలో ఎవరైనా శరీర రహస్య భాగాలను తాకినా వెంటనే నిలువరించేందుకు వీలుగా బిగ్గరగా ‘అరవటం’.. వారి నుంచి సాధ్యమైనంత దూరంగా ‘పరుగెత్తడం’.. ♦తల్లిదండ్రులకు/పెద్దవారికి తెలిసేలా ‘చెప్పండి’ వంటి వాటితో అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన సదస్సులు.. జిల్లాలోని లా అండ్ ఆర్డర్ పోలీసులు, దిశ అధికారులు, చైల్డ్ లైన్ సహకారంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బాలికలపై లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నివారించేందుకు వీలుగా ప్రజలకు అవగాహన కల్పించి, నేరాలను అరికట్టాలనే భావనతో ముందుకు వెళ్తున్నారు. పిల్లలకు గుడ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అన్న విషయాలను ఏ విధంగా చెప్పాలి. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు, బాల్య వివాహాలు చేసిన వారిపై ఎటువంటి శిక్షలు ఉంటాయనే దానిపైన సదస్సుల్లో వివరిస్తున్నారు. బాలికలకు అవగాహన కల్పిస్తున్నాం.. లైంగిక వేధింపులు, బాలల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆపదలో ఉన్న పిల్లలకు తెలిసే విధంగా ప్రత్యేక పోస్టర్లను తయారు చేసి, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నాం. బ్యాడ్, గుడ్ టచ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసంపై విద్యార్థులకు అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. హెల్ప్‌లైన్ నంబర్లపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్రంలోనే తొలిసారిగా పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. – ఎస్. ఢిల్లీరావు, కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా బాలలపై నేరాలను అరికట్టే విధంగా చర్యలు జిల్లాలో బాలలపై జరుగుతున్న నేరాలను అరికట్టే విధంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఆపదలో ఉన్న వారు హెల్ప్ లైన్ నంబర్లు వినియోగించుకొనేలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. – టి.కె. రాణా, పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా -
టచ్ చేయక్కర్లేదు.. కంటి చూపు చాలు.. గూగుల్ కొత్త టెక్నాలజీ
ఒకప్పుడు మొబైల్ ఫోన్ ఆపరేట్ చేయాలంటే అందులోని బటన్లను గట్టిగా నొక్కాల్సి వచ్చేది, స్మార్ట్ఫోన్లు వచ్చిన తర్వాత ఇలా టచ్ చేస్తే చాలు పని జరిగిపోతుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి టచ్ చేయకుండా కేవలం ముఖ కవళికలు, సంజ్ఞలతోనే ఫోన్లను ఆపరేట్ చేసేలా సరికొత్త ఆప్షన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. గూగుల్ నుంచి త్వరలో రాబోతున్న ఆండ్రాయిడ్ 12 (స్నో కోన్) ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. గూగుల్ ఆండ్రాయిడ్ 12లో యాక్సెసిబిలిటీ ఫీచర్‌ను పొందు పరుస్తున్నారు. దీని సాయంతో సంజ్ఞలతోనే ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. అయితే ఈ కమాండ్స్‌ను ఫోన్ గుర్తించాలటే కెమెరా అన్ని వేళలా ఆన్‌లో ఉంటుంది. ఈ మేరకు కెమెరా స్విచెస్ ఫీచర్‌ని ఆండ్రాయిడ్ 12 వెర్షన్లో గూగుల్ డెవలప్ చేస్తోంది. ఆండ్రాయిడ్ 12 అందుబాటులోకి వస్తే ద్వారా ముఖ కవళికలతోనే స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే.. నోరు తెరవడం, కుడిఎడమలకు, కిందికి పైకి చూడడం వంటి గెశ్చర్స్తోనే హోమ్‌పేజీకి వెళ్లడం, వెనుకకు, ముందుకు స్క్రోల్ చేయడం, సెలక్ట్ చేసుకోవడం వంటివి పనులు చేయవచ్చు. చదవండి : Facebook: ఫేస్బుక్లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్ -
ఎన్నిసార్లు ముఖాన్ని తాకుతామో తెలిస్తే..
యావత్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కోవిడ్ -19 (కరోనా వైరస్) నివారణకు ప్రస్తుతానికి కచ్చితమైన మందు ఏదీ అందుబాటులో లేదు. నివారణ ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలోనే మాస్క్ లు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో వుంటూ ఈ వైరస్ విస్తరణను అడ్డుకోవాలని అటు వైద్య నిపుణులు, ఇటు ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చేతులు శానిటైజర్ తో కడుక్కోవాలని కోరుతున్నారు. ముఖంలోని ముక్కు, కళ్లు, చెవులు, నోటిని తాకడం ద్వారా మాత్రమే ప్రాణాంతకమైన ఈ వైరస్ మానవుని శరీరంలోకి ప్రవేశిస్తుందని, అప్రతమత్తంగా వుండాలని చెబుతున్నారు. అయితే మనం రోజులో ఎన్నిసార్లు మన ముఖాన్ని చేతితో తాకుతామో తెలుసా? పోనీ గంటలో ఎన్నిసార్లు ముఖాన్ని, ముఖంలో ఇతర భాగాలను ముట్టుకుంటామో తెలుసా? కొన్ని అధ్యయనాలు తేల్చిన విషయాలను గమనిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ అంశంపై పరిమితమైన రచనలు, చాలా తక్కువ పరిశోధనలు ఉన్న క్రమంలో, సెల్ప్ ఐసోలేషన్ లో ఉన్నపుడు, ఇతర సాధారణ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నిరోధించే క్రమంలో దీనిపై గతంలో జరిగిన అధ్యయన ఫలితాలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి. 2015లో ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో 26 మంది వైద్య విద్యార్థులపై ఈ స్టడీ నిర్వహించారు. వీడియో టేప్ రికార్డింగ్ ద్వారా ముఖాన్ని ఎన్నిసార్లు ముట్టుకుంటారనే దాన్ని విశ్లేషించారు. 26 మంది విద్యార్థులలో అందరూ ప్రతి గంటకు సగటున 23 సార్లు వారి ముఖాన్ని తాకారు. ఇందులో దాదాపు సగానికిపైగా సార్లు ముక్కు, కళ్లు, నోటిని తాకారట. 2008లో నిర్వహించిన మరో స్టడీలో ఇంకోఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఆఫీసు వాతావరణంలో ఉద్యోగులు గంటకు 16 సార్లు ముఖాన్ని టచ్ చేస్తారని హ్యాండ్ టూ ఫేస్ సంబంధంపై నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 10 మందిని మూడు గంటలపై నిర్వహించిన స్టడీలో గంటకు సగటున 16 సార్లు ముఖంలోని భాగాలను తాకారని అధ్యయనం తెలిపింది. 2014లో నిర్వహించిన మరో అధ్యయనం ఏం చెబుతోంటే.. వైద్య వృత్తిలో ఉన్నవారు గంటకు 19 సార్లు ముఖాన్ని ముట్టుకున్నారట. అంటే వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారో ఆయా భాగాలనే ఎక్కువగా తాకారన్న మాట. అందుకే ముఖాన్ని, ముఖంలోని ఈ ముఖ్య భాగాలను స్పర్శించే ముందు తప్పకుండా చేతిని శుభ్రంగా కడుక్కోవాలి. స్వీయ పరిశుభ్రత, నియంత్రణ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే సైకిల్ ను విచ్ఛిన్నం చేయాలి. ఇదే అతి సులువైన, చవకైన నివారణ పద్ధతి. లేదంటే భారీ మూల్యం తప్పదు. వరల్డ్ ఎకానమిక్ ఫోరం అందించిన సమాచారం ప్రకారం గంటకు మూడుసార్లు కంటిని, ఒకసారి చెవిని, నోటిని నాలుగుసార్లు తాకుతాం. ప్రతీ గంటకు నాలుగుసార్లు జుట్టుని ముట్టుకుంటాం. అలాగే బుగ్గల్ని నాలుగుసార్లు, మెడను ఒకసారి, గడ్డాన్ని నాలుగు సార్లు తాకుతాం. ఈ విషయాలను నమ్మబుద్ధి కావడంలేదా.. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్త లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమై ఉన్న మీలో ఎవరైనా సరదాకా ఈ స్టడీ చేయండి. మీ అమ్మా నాన్న, తోబుట్టువులు, లేదంటే పెద్ద, చిన్న, ఇలా వారు గంటలో ఎన్నిసార్లు, ముక్కును తాకుతున్నారు. నోట్లో వేళ్లు పెట్టుకుంటున్నారు.. కళ్లను నులుముకుంటున్నారో పరిశీలించండి. -
పాయల్ విత్ ఫ్యాన్స్
-
కొత్త సెక్యూరిటీతో ‘ఐఫోన్లు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన మొబైల్ ఫోన్లుగా ప్రసిద్ధి చెందిన ‘ఐఫోన్లు’ మరింత భద్రతతో వినియోగదారుల ముందుకు రాబోతున్నాయి. ‘అండర్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్’ సెన్సార్లతో ఐఫోన్లు 2021 నాటికి మార్కెట్లోకి వస్తున్నాయని ప్రముఖ పారిశ్రామిక విశ్లేషకుడు మింగ్ చీ కూ తెలిపారు. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు ఐఫోన్ల యాజమాన్యం 2017లోనే పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి అడపా దడపా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఐఫోన్ల భద్రతకు ఇంతకుముందు ‘టచ్ఐడీ’ పద్ధతి ఉండేది. స్క్రీన్కు దిగువన సెట్పైన ఫింగర్ ప్రింట్ ద్వారా ఫోన్‌ను లాక్, అన్‌లాక్ చేసే వెసులుబాటు ఉండేది. ఆ తర్వాత ఐఫోన్లతో ‘ఫేస్ఐడీ’ పద్ధతి వచ్చింది. ఆ తర్వాత 8 ప్లస్ సిరీస్ నుంచి ఈ ఫింగర్ ఐడీని తీసివేసి ఒక్క పేస్‌ఐడితో ఐఫోన్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ‘ఇన్‌స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఐడీ (స్క్రీన్ మీద వేలి ముద్రను రిజిస్టర్ చేయడం ద్వారా)’ సౌకర్యంతో ఐఫోన్లు వస్తున్నాయట. ఈ పద్ధతిని చైనా సంస్థ అప్పో ‘రెనో హాండ్ సెట్’ను ఇదే సౌకర్యంతో తీసుకొచ్చింది. ఆ తర్వాత శ్యామ్‌సంగ్, షావోమీ, హూవీ కంపెనీలు తీసుకొచ్చాయి. -
ఆత్మీయ స్పర్శతో ఒత్తిడి దూరం
విపరీతమైన ఒత్తిడితో ఉన్నప్పుడు ఆప్తులెవరైనా కాసేపు మన చేతులు పట్టుకున్నారనుకోండి. ఏమనిపిస్తుంది? ఒత్తిడి తాలూకూ ఇబ్బంది ఎంతో కొంత తగ్గినట్టు అనిపిస్తుంది కదూ! అందులో వాస్తవం లేకపోలేదు అంటున్నారు గోథెన్బర్గ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని తాము ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నామని అంటున్నారు వారు. ఆత్మీయ స్పర్శతో ఒత్తిడి తగ్గుతుందని ఇప్పటికే తెలిసినప్పటికీ ఎందుకు? ఎలా? జరుగుతుందన్న విషయాలు మాత్రం ఇప్పటివరకూ తెలియవు. ఈ నేపథ్యంలో ఛంటాల్ ట్రిస్కోలీ అనే శాస్త్రవేత్త 125 మందిపై కొన్ని ప్రయోగాలు చేశారు. దీర్ఘకాలపు స్పర్శతో శరీరంలో ఒత్తిడికి కారణమని భావిస్తున్న హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా గుండె కొట్టుకునే వేగం కూడా మందగిస్తున్నట్లు తెలుసుకోగలిగారు. ఒక రకమైన మానసిక తృప్తి ఏర్పడటం వల్ల ఇలా జరుగుతున్నట్లు ఇప్పటివరకూ అనుకునేవారని.. తమ ప్రయోగాల్లో దీనికి భిన్నమైన కారణాలు తెలిసాయని ఛంటాల్ చెప్పారు. ఈ ప్రయోగ ఫలితాల ఆధారంగా ఒత్తిడికి మరింత మెరుగైన చికిత్స అందించవచ్చునని అంటున్నారు. -
కొనసాగుతున్న రిలయన్స్ దూకుడు
ముంబై: జియో సేవల ఎంట్రీతో తన పూర్వ వైభవాన్ని సంతరించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తన హవాను కొనసాగిస్తోంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ నుంచీ జియో 4జీ సేవలు వాణిజ్య రూపాన్ని సంతరించుకోనుండటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్ దూకుడుగా ఉంది. తాజాగా ఆర్ ఐఎల్ షేరు ధర రూ .1300 మార్క్‌ని దాటి మరోసారి 52 వారాల గరిష్ఠానికి చేరింది. గత వారమే 9ఏళ్ల గరిష్టాన్ని తాకిన 3.5 శాతానిపై పైగా లాభపడుతోంది. గత వారం, పరిశోధన సంస్థ మోర్గాన్ స్టాన్లీ రిలయన్స్ షేరుకు రూ 1,506 టార్గెట్‌ను నిర్దేశించింది. మయాంక్ మహేశ్వరీ, రాకేష్ సేథియా, అమృతా పబాల్కర్ మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు ఆర్ ఐ ఎల్ మరింత దూసుకుపోనుందని అంచనావేశారు. అటు విదేశీ బ్రోకింగ్ సంస్థలు సీఎల్ఎస్ఏ, బీవోఎఫ్‌ఏ-ఎంఎల్ ఏడాది కాలానికి ఆర్ఐఎల్ షేరు టార్గెట్ ధరను వరుసగా రూ. 1,500, 1375గా అంచనా వేయగా.. క్రెడిట్స్వీస్ సైతం షేరు టార్గెట్ ధరను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ పాజిటివ్ అంచనాల నేపథ్యంలో కొత్త టార్గెట్ ను చేధించే దిశగా పరుగులు తీస్తోంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ(కేపిటలైజేషన్) రూ. 4.22 లక్షల కోట్లను అధిగమించింది. తద్వారా అత్యంత విలువైన మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీలలో టీసీఎస్ తదుపరి స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం టీసీఎస్ రూ. 4.87 లక్షల కోట్ల విలువతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫిబ్రవరి 21, 2017 నాటి ప్రకటన కంపెనీ షేర్లు కేవలం రెండు వారాల్లో దాదాపు 30శాతం రాబడిని సాధించడం విశేషం. -
ఆ ‘టచ్’ పిల్లలకు చెప్పాలి!
‘‘పిల్లలకు పెద్ద పెద్ద విషయాలు చెప్పకూడదు అనేది ఒకప్పటి మాట. సమాజంలో చెడు పెరిగిపోయింది కాబట్టి, కొన్నైనా పెద్ద విషయాలు చెప్పాలి’’ అంటున్నారు నమిత. చెన్నైలో ఓ వేడుకలో పాల్గొన్న ఈ బ్యూటీ పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల్ని ప్రస్తావిస్తూ, ‘‘ఎదుగుతున్న ఆడపిల్లలకు తల్లితండ్రులు కొన్ని సలహాలూ, సూచనలూ ఇవ్వాలి. అవతలి వ్యక్తి ‘టచ్’ చేస్తే, ఆ టచ్ వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకోగలిగేలా వాళ్లకు అవగాహన కలిగించాలి. దురుద్దేశంతో ‘టచ్’ చేస్తే ఎలా ఎదుర్కో వాలో చెప్పాలి. పిల్లల దగ్గర ఇలాంటి విషయాలు ఎలా మాట్లా డాలని మొహమాటపడకూదు. ఎంత ఓపెన్‌గా మాట్లాడితే వాళ్ల జీవితం అంత బాగుంటుంది’’ అన్నారు. -
ఆ జువైనల్ కు ఐఎస్ తో అనుబంధం?
నిర్భయ కేసులో దోషిగా ఉన్న బాల నేరస్థుడుపై మరిన్ని అభియోగాలు వెలుగు చూస్తున్నాయి. అతడు సంక్షేమ గృహంలో ఉన్నపుడు కాశ్మీర్ జిహాదీల్లో చేరే ఆలోచనలో ఉన్నట్లుగా అనుమానించిన నిఘా వర్గాలు... తాజాగా అతడికి ఐసిస్ తో అనుబంధాలు ఉన్నట్లు చెప్తున్నాయి. ఢిల్లీలో మెడికల్ విద్యార్థినిపై బస్సులో అతి క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డ బాల నేరస్థుడికి జిహాదీలతో సంబంధాలు ఉన్నట్లుగా ఇంటిలిజెన్స్ వర్గాలు మరోమారు అనుమానిస్తున్నాయి. కేసులో మూడు సంవత్సరాల నిర్బంధ శిక్ష అనంతరం అతని విడుదల విషయంలో అనేక అభ్యంతరాలు వెల్లడైన విషయం తెలిసిందే. అతడు తిరిగి సమాజానికి ఎటువంటి హాని తలపెట్టడని హామీ ఇవ్వాలంటూ విడుదలకు ముందు కోర్టుకు అభ్యర్థనలూ వెల్లువెత్తాయి. అదే నేపథ్యంలో స్పందించిన కేద్రం ఢిల్లీ హైకోర్టుకు ఇంటిలిజెన్స్ రిపోర్టును సమర్పించింది. జువైనల్.. సంక్షేమ గృహంలో ఉన్నపుడు జిహాదీల్లో చేరేందుకు యోచించినట్లు హోం వ్యవహారాల శాఖ కూడ నివేదిక ఇచ్చింది. చివరికి 2015 డిసెంబర్ లో జువైనల్ సంక్షేమ గృహంనుంచీ అతడు విడుదలయ్యాడు. కాగా ప్రస్తుతం ఆ నేరస్థుడు కొన్ని ప్రత్యేక నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించి, అధికారులను అప్రమత్తం చేశాయి. అతడిపై ప్రత్యేక దృష్టి సారించాలని హెచ్చరించాయి. కానీ అతడిగురించిన ఏ ఇతర వివరాలనూ వెల్లడించలేదు. ఉత్తర ప్రదేశ్ లోని నిఘా వర్గాల ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిర్భయ గ్యాంగ్ రేప్ నేరస్థుడి కదలికలను నిఘానేత్రంతో గమనిస్తున్నారు. కాశ్మీరీ యువత.. సదరు జువైనల్ ను జిహాదీల్లో చేరాలని ప్రేరేపిస్తున్నట్లుగా తెలుసుకున్నారు. రాష్ట్రంలోని బదౌన్ జిల్లాకు చెందిన 21 ఏళ్ళ ఆ నేరస్థుడిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆర్నెల్లక్రితం రిఫార్మ్ హోమ్ లో మూడేళ్ళ శిక్షను పూర్తి చేసుకొని బయటపడ్డ అతడు మరో ఐదుగురితో కలసి అతి క్రూరంగా గ్యాంగ్ రేప్ జరిపిన (నిర్భయ) కేసు... 2012 లో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలను రేపింది. అంతేకాదు ఇండియాలో మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ప్రపంచం దృష్టి పడేలా చేసింది. -
స్పర్శను గుర్తించే ‘పేపర్ స్కిన్’
రియాద్: మన శరీరంపై ఉండే చర్మం స్పర్శ, వేడి, తడి, ఒత్తిడి, కదలికలను ఏక కాలంలో గుర్తిసుంది. ఇదేమీ అద్భుతం కాదు. మన ఇంట్లో దొరికే అతి చౌకైన వస్తువులతో చర్మం లాగే అన్ని ప్రక్రియలను ఏకకాలంలో గుర్తించి స్పందించి కృత్రిమ చర్మం లేదా స్మార్ట్ స్కిన్‌ను తయారు చేయడం అద్భుతం. సౌదీ అరేబియాలోని ‘కింగ్ అబ్బుల్లా సైన్స్ అండ్ టెక్నాలజీ’ యూనివర్శిటీలో ఇంటీగ్రేటెడ్ నానో టెక్నాలోజీ లేబరేటరీకి అధిపతిగా పనిచేస్తున్న శాస్త్రవేత్త ముహమ్మద్ ముస్తఫా హుస్సేన్ టీమ్ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ స్కిన్‌ను తయారు చేసేందుకు ఆయన ఉపయోగించిన వస్తువులు ఇంట్లో దొరికే స్పాంజ్, సిల్వర్ ఫాయిల్, సిల్వర్ ఇంక్, గ్రాఫైట్ పెన్సిల్, చర్మానికి అతుక్కునే ఓ గమ్మీ గుడ్డ. ఒత్తిడి గుర్తించేందుకు స్పాంజ్ ముక్కలు, కదలికలను గుర్తించేందుకు సిల్వర్ ఫాయిల్, తేమ గుర్తించేందుకు గ మ్మీ గుడ్డ, వేడి, అసిడిటీని గుర్తించేందుకు సిల్వర్ ఇంక్, గ్రాఫైట్ పెన్సిల్‌ను ఉపయోగించారు. వీటన్నంటికి అయ్యే ఖర్చు 120 రూపాయలు కూడా దాటదని ఆయన చెప్పారు. చర్మానికి కాలిన గాయాలు అయినప్పుడు, గాయం ఉన్న చోట చర్మం స్పర్శను కోల్పోతుందని, వారికి ఈ స్మార్ట్ స్కిన్ ఎంతో ఉపయోగపడుతోందని, దానికి తాము పేపర్ స్కిన్ అని నామకరణం చేసినట్లు ముస్తఫా హుస్సేన్ వివరించారు. ఇతర కృత్రిమ చర్మంలో లాగా కార్బన్ ట్యూబ్స్‌ను వాడడానికి తానేమి వ్యతిరేకిని కాదని, అయితే అవి చాలా ఖరీదని హుస్సేన్ తెలిపారు. మానవ కృత్రిమ చర్మం సృష్టించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఇప్పటికీ జరగుతున్నాయి. చర్మంలా పనిచేసే ప్రొస్టేట్ తొడుగులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రోబోలకు స్మర్శ తెప్పించేందుకు కూడా ఈ తొడుగులను వాడుతున్నారు. కార్బన్ ట్యూబ్ టెక్నాలజీతో తయారు చేసే ఇవి చాలా ఖరీదైనవి. వీటిలోనూ ఆధునికత కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాలు రేపు ఎప్పుడో ఫలించి చౌకైన రేటుకు అందుబాటులోకి రావచ్చుగానీ, నేను మాత్రం రేపుకాస్త నేడు కావాలనే వ్యక్తినని, అందుకని తన ఈ పేపర్ స్కిన్‌కు ప్రాచుర్యం కల్పిస్తే రెండేళ్లలో ఇవి మార్కెట్లోకి వస్తాయని హుస్సేన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రతి ఇంట్లో అందుబాటులో దొరికే వస్తువులతో నేను పేపర్ స్కిన్‌ను తయారు చేయడం ప్రస్తుతం అందరికి నవ్వులాటలాగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
చేతినే కాదు.. స్పర్శనూ ఇచ్చారు
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి పదేళ్ల కింద ఓ ప్రమాదం వల్ల పక్షవాతం వచ్చింది. వెన్నుపూస దెబ్బతిని చెయ్యి పడిపోయింది. ఆ చెయ్యిని కదిలించలేడు, స్పర్శ జ్ఞానం కూడా లేదు. కానీ ఇప్పుడా వ్యక్తి వస్తువులను పట్టుకోగలుగుతున్నాడు, అవి ఎలా ఉన్నాయో (మెత్తగా, గట్టిగా, వేడిగా.. ఇలా) ముట్టుకుని తెలుసుకోగలుతున్నాడు. కానీ ఇది తన చేతితో కాదు.. ఒక కృత్రిమ చెయ్యితో..! ఈ కృత్రిమ చెయ్యిని నేరుగా అతని మెదడుకు అనుసంధానించడం ద్వారా ఇది సాధ్యమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా డిఫెన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (డార్పా) ఈ విప్లవాత్మకమైన విజయాన్ని సాధించింది. ప్రమాదాల్లోనో, ఇతర కారణాలవల్లో కాళ్లూ, చేతులు పోగొట్టుకున్నవారికి కృత్రిమ అవయవాలు అమర్చడం సాధారణమే. కాలుగానీ, చెయ్యిగానీ లేని లోటును ఈ కృత్రిమ అవయవాలు కొంత వరకూ తీర్చగలవు. కానీ వాటితో వస్తువులను ముట్టుకున్నప్పుడు ఆ స్పర్శ అనుభూతిని మాత్రం ఇవ్వలేవు. ఇది అతిపెద్ద లోటు. ఈ లోటును తీర్చడం ద్వారా జీవ సాంకేతిక రంగంలో డార్పా శాస్త్రవేత్తలు అద్భుతమైన ముందడుగు వేశారు. డార్పా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ విధానం ద్వారా వ్యక్తులు తమకు అమర్చిన కృత్రిమ అవయవాలను నేరుగా మెదడు ద్వారానే నియంత్రించడంతోపాటు, వాటిని స్పర్శించిన అనుభూతిని పొందుతారని డార్పా ప్రోగ్రామ్ మేనేజర్ జస్టిన్ సాంచెజ్ చెప్పారు. తద్వారా సహజమైన అవయవాలు ఉన్న భావన వస్తుందన్నారు. పక్షవాతానికి గురైన ఒక వ్యక్తి మెదడులోని గ్రాహక ప్రాంతాని (మోటార్ కార్టెక్స్)కి కృత్రిమ చెయ్యి నుంచి సంకేతాలు అందించే ఎలక్ట్రోడ్లను అమర్చామని చెప్పారు. జాన్హాప్కిన్స్ వర్సిటీకి చెందిన అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ ఈ కృత్రిమ చెయ్యిని రూపొందించిందని.. దీని వేళ్లకు ఒత్తిడిని, స్పర్శను గుర్తించే సెన్సర్లను అమర్చారని తెలిపారు. అనంతరం ఆ వ్యక్తి కళ్లకు గంతలు కట్టి కృత్రిమ చేతులను తమ చేతులతో, వివిధ వస్తువులతో తాకి చూశామని... వీటన్నింటినీ అతను గుర్తించగలిగాడని సాంచెజ్ వెల్లడించారు. దాదాపుగా సహజమైన చెయ్యిలా అనుభూతిని పొంది నట్లు ఆ వ్యక్తి వెల్లడించాడని తెలిపారు. -
ఇంతవరకూ ఎవరూ టచ్ చేయలేదు
సంచలన తార పూనమ్ పాండే ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘నషా’, తెలుగులో ‘తేరా నషా’గా అనువాదమవుతోంది. నిర్మాత ఈవీఎన్ చారి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘జిస్మ్’ ఫేమ్ అమిత్ సక్సేనా ఈ సినిమాకు దర్శకుడు. ఈవీఎన్ చారి మాట్లాడుతూ -‘‘ఈ తరహా కథాంశాన్ని ఇంతవరకూ ఎవరూ టచ్ చేయలేదు. పూనమ్ పాండే తన అందచందాల్ని ఆవిష్కరించడంతో పాటు చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. సంగీత్-సిద్దార్థ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. హిందీలో విజయం సాధించినట్టుగానే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం’’ అని చెప్పారు.