
ఇంతవరకూ ఎవరూ టచ్ చేయలేదు
సంచలన తార పూనమ్ పాండే ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘నషా’, తెలుగులో ‘తేరా నషా’గా అనువాదమవుతోంది. నిర్మాత ఈవీఎన్ చారి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘జిస్మ్’ ఫేమ్ అమిత్ సక్సేనా ఈ సినిమాకు దర్శకుడు. ఈవీఎన్ చారి మాట్లాడుతూ -‘‘ఈ తరహా కథాంశాన్ని ఇంతవరకూ ఎవరూ టచ్ చేయలేదు. పూనమ్ పాండే తన అందచందాల్ని ఆవిష్కరించడంతో పాటు చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. సంగీత్-సిద్దార్థ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. హిందీలో విజయం సాధించినట్టుగానే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం’’ అని చెప్పారు.