Poonam Pandey కాంట్రోవర్సీ క్వీన్‌ పూనమ్​ పాండేకు మరో భారీ షాక్‌ | Poonam Pandey Is Not Centre's Ambassador For Cervical Cancer Awareness: Officials | Sakshi
Sakshi News home page

కాంట్రోవర్సీ క్వీన్‌ పూనమ్​ పాండేకు మరో భారీ షాక్‌

Published Thu, Feb 8 2024 10:08 AM | Last Updated on Thu, Feb 8 2024 10:29 AM

Poonam Pandey Is Not Centre Ambassador For Cervical Cancer Awareness Officials - Sakshi

 గర్భాశయ ముఖద్వార కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు  బాలీవుడ్ నటి పూనమ్ పాండేను బ్రాండ్ అంబాసిడర్‌గా  పరిగణిండం లేదు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 

ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు  మరో ఎదురు దెబ్బ తగిలింది.   గర్భాశయ ముఖద్వార కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు  పూనం పాండేను  ప్రచార కర్తగా నియమించనుందన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. సర్వైకల్ కేన్సర్‌పై అవగాహనకు గాను ఆమెను  బ్రాండ్ అంబాసిడర్‌గా  పరిగణించే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు  స్పష్టం చేశారు.

పాండే  సర్వైకల్ కేన్సర్‌పై అవగాహనకు సంబంధించిన  బ్రాండ్‌ అంబాసిడర్‌గా  ఎంపికయ్యే అవకాశం ఉందని, ఈమేరకు చర్చలు జరుగుతున్నాయన్న  ఆమె, ఆమె టీం  చేస్తున్న ప్రచారం నేపథ్యంలో  మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాయని వర్గాలు స్పష్టత నిచ్చాయి.  ఇది ఇలా ఉంటే  సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి కేన్సర్‌ రోగులు, వారి బంధువులతో  పాటు ఇతరులను కూడా  తీవ్ర ఆందోళనకు గురి చేసిందంటూ  కోల్‌కతాకు చెందిన  అమిత్‌ రాయ్‌   పూనమ్ పాండేకు  లీగల్‌ నోటీసులు పంపారు.  చనిపోయానని ప్రకటించడం ఎంతో తీవ్రమైన అంశం  అంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా  సర్వైకల్ కేన్సర్‌తో బాధపడుతూ నటి పూనం పాండే చనిపోయిందంటూ ఆమె  అధికారిక ఇన్‌స్టాలో  చేసిన పోస్ట్‌ ఇండస్ట్రీ వర్గాలతో పాటు, పలువురిని దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే ఆ  మరునాడే  తాను బతికే ఉన్నానని, సర్వైకల్  కేన్సర్‌ ప్రమాదకరంగా మారుతున్న నేపత్యంలో కేవలం దీనిపై అవగాహన కల్పించేందుకే ఈ ప్రకటన అంటూ ఒక వీడియో  రిలీజ్‌  చేయండం వివాదాన్ని రేపిన  సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement