Poonam Pandey
-
Poonam Pandey కాంట్రోవర్సీ క్వీన్ పూనమ్ పాండేకు మరో భారీ షాక్
ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పూనం పాండేను ప్రచార కర్తగా నియమించనుందన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. సర్వైకల్ కేన్సర్‌పై అవగాహనకు గాను ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా పరిగణించే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పాండే సర్వైకల్ కేన్సర్‌పై అవగాహనకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందని, ఈమేరకు చర్చలు జరుగుతున్నాయన్న ఆమె, ఆమె టీం చేస్తున్న ప్రచారం నేపథ్యంలో మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాయని వర్గాలు స్పష్టత నిచ్చాయి. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి కేన్సర్ రోగులు, వారి బంధువులతో పాటు ఇతరులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసిందంటూ కోల్‌కతాకు చెందిన అమిత్ రాయ్ పూనమ్ పాండేకు లీగల్ నోటీసులు పంపారు. చనిపోయానని ప్రకటించడం ఎంతో తీవ్రమైన అంశం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సర్వైకల్ కేన్సర్‌తో బాధపడుతూ నటి పూనం పాండే చనిపోయిందంటూ ఆమె అధికారిక ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు, పలువురిని దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే ఆ మరునాడే తాను బతికే ఉన్నానని, సర్వైకల్ కేన్సర్ ప్రమాదకరంగా మారుతున్న నేపత్యంలో కేవలం దీనిపై అవగాహన కల్పించేందుకే ఈ ప్రకటన అంటూ ఒక వీడియో రిలీజ్ చేయండం వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. -
ఇన్ స్టా వేదికగా పూనమ్ పాండే మరో వీడియో
-
నేను జీవించే ఉన్నాను!
‘‘సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్) కారణంగా నేను చనిపోలేదు... బతికే ఉన్నాను. దురదృష్టం ఏంటంటే.. అనేక మంది మహిళలకు ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్ల వారు వారి జీవితాలను కోల్పోతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ మిగతా క్యాన్సర్ల మాదిరి కాదు. ఇందుకు మెరుగైన చికిత్స ఉంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్, వైద్య పరీక్షలతో వెంటనే ఈ క్యాన్సర్‌ను గుర్తించి, చికిత్స తీసుకోవడం వంటి చర్యలతో ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధితో ఎవరూ ్రపాణాలు కోల్పోకుండా ఉండేందుకు మార్గాలు ఉన్నాయి. వాటిపై అవగాహన కల్పిద్దాం’’ అని పేర్కొన్నారు నటి, మోడల్ పూనమ్ పాండే. ఫిబ్రవరి 2న సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ఆమె మరణించినట్లు ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఓపోస్ట్ షేర్ అయింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు మరణ విషయాన్ని ధృవీకరించలేదు. అలాగే కాన్పూర్పోలీసులకు, అక్కడి మీడియాకు పూనమ్ పాండే మరణంపై సరైన స్పష్టత లేదు. దీంతో పూనమ్ జీవించే ఉన్నారని, పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలా తాను మృతి చెందినట్లు ఫేక్ చేశారనే వార్తలు కూడా వినిపించాయి. ఫైనల్‌గా ఇదే నిజమైంది. సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించే ప్రక్రియలో భాగంగానే తన చావును ఫేక్ చేసినట్లుగా పూనమ్ సోషల్ మీడియా మాద్యమాల ద్వారా వీడియోలు షేర్ చేశారు. నేడు (ఫిబ్రవరి 4) వరల్డ్ క్యాన్సర్ డే. ఈ సందర్భంగానే పూనమ్ ఇలా చేశారని తెలుస్తోంది. అయితే పూనమ్ ఈ విధంగా చేయడం వివాదాస్పదంగా మారడంతో మరికొన్ని వీడియోలను కూడా ఆమె షేర్ చేశారు. ‘‘అవును.. నా చావును ఫేక్ చేశాను. కానీ సడన్‌గా అందరూ సర్వైకల్ క్యాన్సర్ గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. సైలెంట్‌గా జీవితాలను ముగించే వ్యాధి అది. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాల్సి ఉంది. నా చావు వార్త సర్వైకల్ క్యాన్సర్ గురించిన చర్చను పైకి తెచ్చినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. ఓ సెలబ్రిటీ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయిందన్న వార్త దేశవ్యాప్తంగా ఆ క్యాన్సర్ గురించి మాట్లాడుకునేలా చేసింది. నేను చేయాలనుకున్నది ఇదే. నేను ఎవర్నైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’ అంటూ వీడియోలు షేర్ చేశారు పూనమ్. -
నేను చనిపోలేదు, బతికే ఉన్నా: పూనమ్ పాండే
బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే మరణించిందనే షాకింగ్ న్యూస్ శుక్రవారం నుంచి వైరల్ అవుతుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పీఆర్ టీమ్ షేర్ చేసిన నోట్ నిజమా కాదా అని అభిమానులు అభిప్రాయపడుతున్న సమయంలో తాజాగా ఆమె నుంచి ఒక షాకింగ్ మెసేజ్ వచ్చింది. తాను బతికే ఉన్నానంటూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని పేర్కొంది. సర్వైకల్(గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్) గురించి అవగాహన కల్పించడం కోసమే అలా చేశానని పూనమ్ సోషల్ మీడియాలో ఓ వీడియోని రిలీజ్ చేసింది. పూనమ్ పాండే మరణించినట్లు వస్తున్న వార్తలపై ఆమె ఇలా వివరణ ఇచ్చింది. 'మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని నేను భావిస్తున్నాను.- నేను బతికే ఉన్నాను. గర్భాశయ క్యాన్సర్‌తో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు. కానీ విషాదకరంగా, ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవటం వల్ల వేలాది మంది మహిళల నేడు దేశంలో ప్రాణాలను వదులుతున్నారు. కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా.. సరైన చికిత్స తీసుకుంటే గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించదగినది. (ఇదీ చదవండి: ఆ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి నాకు ద్రోహం చేశారు: నటి) HPV వ్యాక్సిన్‌ను ముందస్తుగా తీసుకుంటే దీనిని ఎదుర్కొనవచ్చు . ఈ వ్యాధితో ఎవరూ తమ ప్రాణాలను కోల్పోకుండా చూసుకునే మార్గాలు నేడు వ్యైద్యశాస్త్రంలో ఉన్నాయి. గర్భాశయ క్యాన్సర్ విషయంలో ప్రతి మహిళ తీసుకోవలసిన చర్యల గురించి అందరికీ తెలిసేలా చేద్దాం.' అని పూనమ్ పాండే తెలిపింది. తన మరణవార్త విషయంలో అందరూ క్షమించాలని పూనమ్ పాండే కోరింది. మహిళలలో ఎంతో నిశ్శబ్ధంగా వ్యాపిస్తున్న గర్భాశయ క్యాన్సర్ గురించి అందరికీ తెలిసేలా చేయడమే ప్రధాన ఉద్దేశ్యమని ఆమె తెలిపింది. ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే కావడంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పూనమ్ ఇలాంటి చర్యకు పాల్పడిందని చెప్పవచ్చు. దీంతో ఆమెపై సోషల్ మీడియా నుంచి వ్యతిరేఖత కూడా వస్తుంది. ఇంతదానికి మరణించినట్లు పోస్ట్ చేయడం ఏంటి అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. View this post on Instagram A post shared by HAUTERRFLY | A Fork Media Group Co. (@hauterrfly) -
పూనమ్ ఇంట్లో అంతా బాగానే ఉందే!: నటి బాడీగార్డు
బాలీవుడ్ నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో మరణించింది. ఆమె మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పూనమ్ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు. పూనమ్ దగ్గర 11 ఏళ్లుగా బాడీగార్డుగా పని చేస్తున్న ఆమిన్ ఖాన్ నటి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అతడు మాట్లాడుతూ.. పూనమ్ మరణించారన్న వార్తను నేను నమ్మను. ఆమె సోదరితో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ తను స్పందించడం లేదు. నటి ఇక లేరన్న విషయాన్ని మీడియాలో చూసే తెలుసుకున్నాను. ఆమె రిప్లై ఇవ్వట్లేదు జనవరి 31 వరకు ఆమెతోనే ఉన్నాను. ఒక మాల్లో ఫోటోషూట్ కూడా చేశాం. తను ఎప్పుడూ ఫిట్‌గా ఉండేది. ఆరోగ్యంగా కనిపించేది. తన అనారోగ్య సమస్య గురించి ఎన్నడూ బయటకు చెప్పలేదు. తనకు ఏదో ఆరోగ్య సమస్య ఉందని కూడా ఎప్పుడూ అనిపించలేదు. అసలు నిజమేంటో తెలియాల్సి ఉంది. తన సోదరి రిప్లై కోసం ఎదురుచూస్తున్నాను. పూనమ్ ఈ మధ్య తన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మద్యపానం అలవాటు కూడా మానేసింది. నేను తన ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు అన్నీ సాధారణంగా ఉన్నట్లే అనిపించాయి' అని చెప్పుకొచ్చాడు. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు కాగా మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన పూనమ్ నటిగానూ కొన్ని సినిమాలు చేసింది. అయితే ఎప్పుడూ ఏదో ఒకరకంగా నిత్యం ఆమె పేరు వార్తల్లో నానుతూ ఉండేది. అశ్లీల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉండేది. గతంలో ప్రియుడిని పెళ్లాడిన కొద్ది రోజులకే అతడిపై గృహహింస కేసు పెట్టింది. తర్వాత ఇద్దరూ కలిసిపోయారు, కానీ ఎక్కువకాలం కలిసి కొనసాగలేకపోయారు. పూనమ్ లాకప్ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది. చదవండి: పూనమ్ పాండే: చనిపోయేంత వరకు విమర్శలు, వివాదాలే! సౌందర్య టూ పూనమ్ పాండే... చిన్న వయసులో తనువు చాలించిన తారలు వీళ్లే! -
అనారోగ్యంతో బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి
-
Poonam Pandey: ఎంతకు తెగించావ్ పూనమ్? ఇక మారవా?
బాలీవుడ్ సంచలన నటి పూనమ్ పాండే(32) గర్భాశయ క్యాన్సర్‌తో కన్నుమూసిందంటూ మొదట్లో ఓ వార్త బయటకు వచ్చింది. పూనమ్ సొంత ఖాతాలోనే ఆమె మరణ వార్తను తెలియజేస్తూ పోస్ట్ ఉండటంతో అది నిజమే అనుకున్నారంతా! ఇంత చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండాయా? అని అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. సెలబ్రిటీలు నివాళులు అర్పించారు. కానీ అంతలోనే అందరికీ పెద్ద ఝలక్ ఇచ్చింది పూనమ్. కాంట్రవర్సీలు మనకు కొత్త కాదన్నట్లుగా బతికే ఉన్నానని చెప్పింది. క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం కోసం ఈ డ్రామా ఆడినట్లు తెలిపింది. అందరినీ బకరా చేసిన పూనమ్ జీవితంలోని విమర్శలు, వివాదాలు ఈ కథనంలో చూద్దాం.. వరల్డ్ కప్ సమయంలో మార్మోగిపోయిన పేరు పూనమ్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించింది. మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. ప్రతిభకు ఆత్మస్థైర్యం తోడవడంతో మోడలింగ్‌లో రాణించింది. తక్కువ కాలంలోనే ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీలో మెరిసింది. కానీ టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వాలనుకుందో ఏమో కానీ 2011లో సంచలన ప్రకటన చేసింది. వరల్డ్ కప్‌లో టీమిండియా గెలిస్తే మైదానంలో ఒంటి మీద దుస్తుల్లేకుండా తిరుగుతానని ప్రకటించింది. ఈ మాట విని ఆమెను తల్లి చితకబాదింది. అటు భారత్ వరల్డ్ కప్ సాధించింది.. కానీ ఆమె అలా బట్టల్లేకుండా తిరిగేందుకు బీసీసీఐ అనుమతించలేదు. మాట నిలబెట్టుకోవడం కోసం.. అయినప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కొన్ని వారాల తర్వాత వాంఖడే స్టేడియంలో దుస్తుల్లేకుండా తిరిగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాతి ఏడాది కూడా ఇలాంటి పిచ్చి పనే చేసి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈమె తనకంటూ సొంతంగా ఓ యాప్ కూడా తయారు చేయించుకుంది. కానీ గూగుల్ దాన్ని బ్యాన్ చేసింది. తన ప్రేమ వ్యవహారం కూడా వివాదాలతోనే నడిచింది. ప్రియుడు సామ్‌బాంబే సన్నిహితంగా మెదిలిన క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో పూనమ్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో సదరు వీడియోను ఆమె డిలీట్ చేయక తప్పలేదు. భర్తతో గొడవలు, విడాకులు 2020 సెప్టెంబర్ 1న సామ్ బాంబేను పెళ్లాడింది పూనమ్. అప్పుడు కరోనా టెన్షన్ వల్ల ఈ వివాహాన్ని సింపుల్‌గా జరిపించారు. కానీ పెళ్లయిన పది రోజులకే పూనమ్.. భర్తపై గృహహింస కేసు పెట్టింది. అత్యాచార వేధింపులు, బెదిరింపుల కింద అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే భార్యాభర్తలిద్దరూ కలిసిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా ఎన్నోసార్లు గొడవలు, కలిసిపోవడాలు తర్వాత చివరకు విడాకులు తీసుకున్నారు. అదే ఏడాదిలో పోలీసులు పూనమ్నూ అరెస్ట్ చేశారు. గోవాలోని ప్రభుత్వ స్థలంలో అశ్లీల వీడియో చిత్రీకరించినందుకుగానూ జైల్లో పెట్టారు. పోర్నోగ్రఫీ కేసులో కూడా ఈమె పేరు ప్రధానంగా వినిపించింది. సినిమాలు.. రియల్ లైఫ్‌లో బోల్డ్‌గా ఉండే పూనమ్ సినిమాలు కూడా ఆ జానర్లోనే చేసేది. అలా నషా సినిమాలో ఓ విద్యార్థితో సంబంధం పెట్టుకునే టీచర్లా కనిపించింది. పోస్టర్లలో అసభ్యత శృతి మించడంతో పెద్ద రచ్చే జరిగింది. హిందీలోనే కాకుండా భోజ్‌పురి, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో మాలిని అండ్ కో అనే మూవీ చేసింది. 'పెళ్లి చేసుకున్నాక టార్చర్ చూశాను. తల్లిదండ్రులూ ఏ కారణం లేకుండానే ఇంట్లో నుంచి గెంటేశారు. అందరూ కేవలం నన్ను డబ్బు సంపాదించే యంత్రంగానే చూశారు. నన్ను తిట్టుకునేముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి' అని లాకప్ షోలో కన్నీటిపర్యంతమైంది నటి. కానీ ఇలా ఏకంగా చనిపోయానంటూ డ్రామాలాడితే ఎవరు మాత్రం తిట్టుకోరంటున్నారు జనాలు. చదవండి: అనారోగ్యంతో బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి -
సర్వైకల్ కేన్సర్.. మహిళలకు ఓ శాపం!
కేన్సర్ అంటేనే హడలిపోతాం. ఎందుకంటే ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా వచ్చేస్తుంది. దాని స్టేజ్‌ని బట్టి సులభంగా ఆ వ్యాధి నుంచి బయటపడగలం లేదంటే ఇక అంతే సంగతులు. ఆ కేన్సర్లలో మహిళలకు వచ్చే గర్భాశయ కేన్సర్(సెర్వికల్) మరింత ప్రమాదకరమైంది. బాలీవుడ్ ప్రముఖ నటీ పూనమ్ పాండ్ మృతికి కారణమైంది కూడా ఈ కేన్సరే. దీనికి చికిత్సా విధానం కూడా కాస్త క్రిటికలే. లక్షణాలను ముందుగా గుర్తిస్తే మెరుగైన చికిత్స ద్వారా పరిస్థితిని అదుపు చేయవచ్చు కానీ.. ఒక దశ దాటిన తరువాత చికిత్సలతో లాభం తక్కువే. అందువల్లే ఏటా కొన్ని వేలమంది మహిళలు ఈ కేన్సర్ బారిన పడే చనిపోతున్నారు. అసలు ఎందుకు వస్తుంది? ముందుగా ఎలా గుర్తించాలి? సెర్వికల్ కేన్సర్ ఎందుకు వస్తుందంటే.. ఈ కేన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) కారణంగా వస్తుంది. తక్కువ వయస్సులో వివాహం చేయడం, విచ్చలవిడి లైంగిక సంబంధాలు, స్త్రీ, పురుషులిద్దరికీ బహుళ లైంగిక భాగస్వాములుగా ఉండటం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ కేన్సర్ రావడానికి కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ప్రధానంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సుగల స్త్రీలకు ఈ రకమైన కేన్సర్ సోకే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు ఇవీ.. మొదటి దశ సర్వైకల్ కేన్సర్ ఎటువంటి లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరితే... కలయిక తర్వాత, పీరియడ్స్ మధ్య, మెనోపాజ్ తర్వాత యోని రక్తస్రావం దుర్వాసనతో కూడిన నీటి, రక్తపు యోని ద్రవాలు కలయిక సమయంలో పెల్విక్ నొప్పి సర్వైకల్ కేన్సర్‌లో రకాలు: పొలుసుల కణ కేన్సర్.. ఈ సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయం బయటి భాగాన్ని కప్పి ఉంచే సన్నని, చదునైన కణాలలో పొలుసుల కణాలు ప్రారంభమవుతాయి. ఇది యోనిలోకి ప్రవేశిస్తుంది. చాలా గర్భాశయ కేన్సర్లు పొలుసుల కణ క్యాన్సర్. అడెనోకార్సినోమా. . ఈ గర్భాశయ క్యాన్సర్ కాలమ్ ఆకారపు గ్రంధి కణాలలో ప్రారంభమవుతుంది. కారణాలు.. గర్భాశయ ముఖద్వారంలోని ఆరోగ్యకరమైన కణాలు వాటి డీఎన్ఏలో మార్పులు (మ్యుటేషన్లు) జరిగినప్పుడు గర్భాశయ కేన్సర్ ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన కణాలు నిర్ణీత రేటుతో పెరుగుతాయి. కొద్ది సమయంలో చనిపోతాయి. కేన్సర్ కణాలు దీనికి భిన్నం. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతూనే ఉంటాయి. పేరుకుపోయిన అసాధారణ కణాలు ఒక కణితిని ఏర్పరుస్తాయి. కేన్సర్ కణాలు సమీపంలోని కణజాలాలపై దాడి చేస్తాయి. శరీరంలోని ఇతర చోట్ల వ్యాప్తి చెందడానికి కణితి నుంచి విడిపోతాయి. గర్భాశయ కేన్సర్‌కు కారణమేంటో స్పష్టంగా తెలియదు, కానీ హెచ్‌పీవీ పాత్ర పోషిస్తుంది. హెచ్‌పీవీ చాలా సాధారణం. ఈ వైరస్ ఉన్న ప్రతి ఒక్కరికి కేన్సర్ రాదు. లైఫ్‌స్టైల్, ఇతర కారకాల కారణంగా వచ్చే అవకాశం ఉంది. చికిత్స.. నయం కాని గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు ల్యాప్రోస్కోపి పరికరం ద్వారా ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స చేయవచ్చు. దీనివల్ల కోత, కుట్టు ఉండదు. త్వరగా ఎవరి పనులు వారు చేసుకోవచ్చు. హెరి్నయా వచ్చే అవకాశం కూడా ఉండదు. సాధారణంగా వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్‌గా మారుతుంది. దీనివల్ల వివాహం అయిన మహిళలు ప్రతి సంవత్సరం పాప్‌స్మియర్ టెస్ట్ చేయించుకుంటే, క్యాన్సర్‌ను ప్రాథమికంగా గుర్తించగలిగితే నయం చేసుకోవచ్చు. దీనికితోడు కౌమారదశ బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయడం వల్ల వారికి 70 నుంచి 80శాతం వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా చేస్తే నివారణ సాధ్యం.. 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ క్యాన్సర్ నిర్మూలన కోసం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికను అందించింది. దీనికింద 2030 నాటికి 90 శాతం కౌమార బాలికలకు 15 సంవత్సరాల వయస్సులోపు హెచ్‌పీవీ వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి. 70శాతం మహిళలు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సుగల కలిగిన వారికి కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి. గర్భాశయ పూర్వ క్యాన్సర్‌తో బాధపడుతున్న 90 శాతం మహిళలకు తగిన చికిత్స అందించాలి. (చదవండి: ముక్కు లేకుండానే జన్మ..ఇప్పుడెలా ఉన్నాడంటే?) -
బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి
బాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ పాండే (32) మృతి చెందారు. గత రాత్రి మరణించినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ఆమె అనుచరులు ఒక పోస్ట్ చేశారు. ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన పోస్ట్‌లో ఆమె మరణ వార్త మొదటగా వెల్లడైంది. ఆమె మరణ వార్త గురించి పూనమ్ పాండే పీఆర్ టీమ్ ఇలా తెలిపింది. 'ఈ ఉదయం మాకెంతో చాలా కఠినమైనది. మా ప్రియమైన పూనమ్ పాండేను కోల్పోయాం. సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్‌తో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఆమెతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిపట్ల స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయతలను పంచారు. ఈ దుఃఖ సమయంలో, ఈ విషయాన్ని మేము షేర్ చేసేందుకు ఎంతో చింతిస్తున్నాము. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటాం.' అని అందులో ఉంది. పూనమ్ ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పూనమ్ మరణ వార్తను ఆమె పీఆర్ టీమ్ మాత్రమే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. త్వరలోనే అన్ని విషయాలు చెబుతామని వారు తెలిపారు. పూనమ్ పాండే ప్రముఖ మోడల్‌గా గుర్తింపు పొందారు. 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు ఒక వీడియో సందేశంలో భారత్ ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే తన దుస్తులు తొలగిస్తానని ఆమె కామెంట్ చేసి వైరల్ అయ్యారు. 2013లో 'నాషా' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పూనమ్ తెలుగులో 'మాలిని అండ్ కో'లో నటించింది. సినిమాల కంటే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఢిల్లీలో జన్మించిన పూనమ్. అక్కడే పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఇంటర్మీడియట్ తర్వాత మోడలింగ్ చేయసాగింది. 2010లో గ్లాడ్‌రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీలో తొలి 8 మందిలో ఆమె నిలిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అక్కడ పాపులారిటీ రావడంతో ఎక్కువగా అర్ధనగ్న ఫోటోలు షేర్ చేస్తూ వివాదాస్పద నటిగా మిగిలింది. ఆమె వైవాహిక జీవితం చుట్టూ కూడా అనేక గొడవలు జరిగాయి. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ అప్పట్లో పోలీసులను ఆశ్రయించడమే కాకుండా అతని నుంచి విడాకులు కూడా తీసుకుంది. అప్పటి నుంచి ఒంటరిగానే పూనమ్ జీవిస్తుంది. (పూనమ్ పాండే అరుదైన చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) -
చిక్కుల్లో నటి పూనమ్ పాండే
ముంబై: మోడల్, నటి పూనం పాండే మళ్లీ చిక్కుల్లో పడ్డారు. పూనంతో పాటు ఆమె మాజీ భర్త శాం బాంబేపై కెనకొనా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. కెనకొనా ప్రాంతంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని చాపోలి డ్యామ్ వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేసినందుకు గాను వారిపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు పోలీసుల తెలిపారు. 2020లో కనకొనా ప్రాంతంలో ఆమె న్యూడ్ పోటోషూట్లో పాల్గొన్నారని కొందరు పాండేపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చార్జిషీట్ పేర్కొన్నారు.అశ్లీల వీడియోగ్రఫీ, అందరిముందే అభ్యంతరకర నృత్యాలు, పాటల పాడారని వారిపై అభియోగాలు మోపారు. ఇక 2021లో పాండే ఆమె భర్తకు మధ్య విభేదాలు రావడంతో అప్పటి నుంచి వారిద్దరూ దూరంగా ఉంటున్నారు. తనను శారీరకంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో శాంబాంబేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: Salman Khan: సింగర్ సిద్ధూ హత్య.. సల్మాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ వార్నింగ్.. అప్రమత్తమైన పోలీసులు -
ఫ్యాన్స్‌కు పూనమ్ పాండే ఆఫర్
Lock Upp: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ సో ‘లాకప్’. ఇందులో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ షోలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలంటే కంటెస్టెంట్స్ ఓ పెద్ద సీక్రెట్ బయట పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ నుంచి సంచలన రహస్యాలను బయటకు వస్తున్నాయి. అది విని నోళ్లు వెళ్లబెట్టడం ప్రేక్షకుల వంతు అవుతోంది. ఈ సీక్రెట్స్ పలువురు బాలీవుడ్ టీవీ, సినిమా నటినటులకు సంబంధించినవి కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ రియాలిటీ షోలో బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూనమ్ ఈ షోలో తన వ్యక్తిగత, వైవాహిక జీవితానికి సంబంధించిన చేదు అనుభవాలను బయటపెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్ ప్రేక్షకులకు సంచలన ఆఫర్ ఇచ్చింది. తనని నామినేషన్స్ నుంచి కాపాడితే బంపర్ ఆఫరిస్తానంటూ ప్రామిస్ చేసింది. ఈ వారం తనని చార్జ్ షీట్లోకి వెళ్లకుండా ఓటింగ్‌తో కాపాడాలని ప్రేక్షకులను కోరుతూ.. ఒకవేళ అలా చేస్తే తాను లైవ్‌లో టీ షర్ట్‌ను తొలగిస్తానని కామెంట్స్ చేసింది. చదవండి: రష్మికకు బంపర్ ఆఫర్, ఐటెం సాంగ్ కాదు.. ఏకంగా హీరోయిన్ చాన్స్.. కాగా ఈసారి పూనమ్‌తో పాటు మునావర్, అజంలి, అజ్మా, అలీ మర్చంట్, వినీత్ కాకర్ పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె పూనమ్ కెమెరాలతో ‘ఇప్పుడు నన్ను చూస్తున్న వారిని నేను కోరేది ఒక్కటే. ఈ వారం చార్జ్‌షీట్ నుంచి నన్ను బయటపడేయండి. నేను మీకు కెమెరా ముందు పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను’ అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రకటన విన్న సహా కంటెస్టెంట్స్‌లో ఆసక్తి నెలకొంది. దీంతో ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకునేందుకు ఉత్సుకత చూపించారు. అంతేకాదు తన ఆఫర్ ఏంటో ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు చెప్పాలంటూ ఆమెకు సవాలు విసిరిరారు. దీనికి పూనమ్ అది సర్ప్రైజ్ అని, లైవ్‌లోనే చెప్తానని అనడంతో పోటీదారుల్లో ఒకడైన వినీత్ కాకర్.. ఆమె చెప్పేవన్ని ఒట్టి మాటలే అంటూ విమర్శించాడు. దీనికి పూనమ్ స్పందిస్తూ.. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని, ఒకవేళ నన్ను నామినేషన్స్ నుంచి రక్షిస్తే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తెలిపింది. దీంతో ఆమె కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. మరి దీనిపై హోస్ట్ కంగనా ఎలా రియాక్ట్ అవుతుంది, మరి ప్రేక్షకులు ఆమెను రక్షిస్తారో లేదో వీకెండ్ లైవ్ షో వరకు వేచి చూడాల్సిందే. చదవండి: సర్కారు వారి పాట.. మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్డేట్.. -
మీరు చాలా హాట్‌గా ఉన్నారు.. మాకు కోచింగ్ ఇవ్వండి: కంటెస్టెంట్‌తో కంగనా
Kangana Ranaut Praises Poonam Pandey For Seductress Task: బీటౌన్ బ్యూటీ, ఫైర్ బ్రాండ్, కాంట్రవర్సీ క్వీన్ కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో 'లాకప్'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ షోలో కంటెస్టెంట్లు ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి వారి రహస్యాలు బయటపెట్టారు. అవి విన్న ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అయితే లాకప్‌లోని జడ్జిమెంట్ డే ఎపిసోడ్లు సాధారణంగా వివాదాలతో , ఆసక్తికరంగా సాగుతాయి. ఈసారి కూడా కంగానా జడ్జిమెంట్ ఎపిసోడ్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ షో ఇదివరకు ఎపిసోడ్లో కంటెస్టెంట్లకు విభిన్నమైన టాస్క్‌లు ఇచ్చారు. అందులో హాట్ బ్యూటీ పూనమ్ పాండేకు 'సమ్మోహనురాలు (సెడక్ట్రస్/సెడ్యూస్)' అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో పూనమ్ అదరగొట్టిందని కంగనా ప్రశంసలు కురిపించింది. టాస్క్‌కు తన బెస్ట్ ఇచ్చిందని పొగడ్తలతో ముంచెత్తింది. చదవండి: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాను.. 4 కేసులు కూడా ఉన్నాయి: లాకప్ కంటెస్టెంట్ 'పూనమ్ మీరు చాలా బాగా ఆడారు. నిజంగా చాలా హాట్‌గా కవ్వించి అదరగొట్టారు. నాకే హాట్‌గా అనిపించింది అంటే మీరు ఎంతలా యాక్ట్ చేశారో అర్థమవుతుంది. సెడక్షన్ అనేది ఒక కళ. 64 కళల్లో సమ్మోహన కళ కూడా ఒకటి. మీరు అందులో ఒక మంచి కళాకారిణి. ఇతర మహిళలకు సమ్మోహన కళను నేర్పించేందుకు ఒక పాఠశాలను తెరవండి. మాకు కూడా ఆ కళలో కోచింగ్ ఇవ్వండి.' అంటూ పూనమ్ పాండేను ప్రశంసలతో ముంచెత్తింది కంగనా రనౌత్. ఆమె పొగడ్తలు విని సిగ్గు పడుతూ నవ్వింది పూనమ్. ఇతర కంటెస్టెంట్లు కూడా ఆసక్తిగా ఈ సంభాషణను విన్నారు. ఈ రియాలిటీ షోలో కరణ్వీర్ బోహ్రా, నిషా రావల్, మునావర్ ఫరూఖీ, సారా ఖాన్, అలీ మర్చంట్, సైషా షిండే, పాయల్ రోహత్గీ, బబిదా ఫోగట్, అంజలి అరోరా మిగతా కంటెస్టెంట్లు. చదవండి: 'లాకప్'లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. ఎందుకంటే ? -
హనీమూన్‌లో అత్యాచారం చేశానట, ఆమె చెప్పేదంతా చెత్త!
బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఎవరికీ ఓ పట్టాన అర్థం కాదు. సెన్సేషనల్ కామెంట్లతో నిత్యం వార్తల్లో ఉండే ఆమె, అందరి చూపు తనవైపు తిప్పుకోవడానికే అలా ప్రవర్తించానని ఇటీవల క్లారిటీ ఇచ్చింది. సామ్ బాంబేను పెళ్లాడిన ఆమె వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగలేదు. గొడవలు, కొట్లాటలతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వీళ్లు చివరికి ఇద్దరూ విడివిడిగా బతుకుతున్నారు. ప్రస్తుతం పూనమ్.. కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న వివాదాస్పద షో 'లాకప్'లో కంటస్టెంట్గా పాల్గొంది. చదవండి: హీరో సూర్యను కలిసిన షణ్ముఖ్ జశ్వంత్ ఈ సందర్భంగా షోలో పూనమ్ మాట్లాడుతూ.. 'నాలుగంతస్థులు ఉండే మా ఇంట్లో ప్రైవేట్ గార్డెన్, టెర్రస్.. ఇలా అన్నీ ఉండేవి. ఎప్పుడైనా నేను ఒంటరిగా ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్లినా, నాతో నేను టైం స్పెండ్ చేద్దామనుకున్నా అతడు ఒప్పుకునేవాడే కాదు. ఒక్కదానివే ఏం చేస్తున్నావ్ అంటూ తన వెంటే ఉండమనేవాడు. కనీసం నా ఫోన్ కూడా ముట్టుకోనిచ్చేవాడు కాదు. కుక్కపిల్లలను నాతో పడుకోబెట్టుకుంటే నన్ను కొట్టేవాడు. నన్ను హింసించడం, మందు తాగడం వంటివి నాకు అస్సలు నచ్చకపోయేది ' అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలపై సామ్ బాంబే తీవ్రంగా స్పందించాడు. 'నాలుగేళ్ల నుంచి నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇప్పుడు పెదవి విప్పాల్సిన అవసరం వచ్చింది. నిజానికి మా పెళ్లి మర్చిపోలేని మధురమైన అనుభూతి. సాధారణంగా ఏ రిలేషన్లో అయినా పది శాతం గొడవలు, మనస్పర్థలు వంటివి ఉంటాయి. కానీ అందరూ వాటినే ఎక్కువ ఫోకస్ చేస్తారు. మా విషయంలోనూ అదే జరిగింది. పూనమ్ చెప్పేదంతా పనికిరాని చెత్త. ఆమె ఎప్పుడూ వార్తల్లో ఉండాలని ఇదంతా చేస్తోంది! గృహ హింస పేరుతో అమాయకులైన ఎంతోమంది మగవాళ్లను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మహిళ ఒక్క ఫోన్ కాల్ కొట్టిందంటే చాలు పోలీసులు వచ్చి ఆమె భర్తను తీసుకెళ్లి కస్టడీలో ఉంచుతున్నారు. నన్ను అలా సుమారు 20 సార్లు పోలీసులు పట్టుకెళ్లారు, కానీ ఏమీ చేయలేకపోయారు. అంటే మీరే అర్థం చేసుకోండి. అంతదాకా ఎందుకు? మేము హనీమూన్‌కు వెళ్లినప్పుడు కూడా మాలిస్టేషన్ (అత్యాచారం) చేశానని, లైంగిక వేధింపులకు పాల్పడ్డానని ఫిర్యాదు చేసింది. అది కూడా పెళ్లైన వారం రోజులకే! హనీమూన్‌లో ఉన్నప్పుడు భర్త అత్యాచారం చేశాడని ఎలా అంటారో నాకైతే అర్థం కాదు. ఆ తర్వాత ఆమె తప్పు తెలుసుకుని మాలిస్టేషన్ అంటే ఏంటో కూడా తెలీదని చెప్తూ ఫిర్యాదును వెనక్కు తీసుకుంది. కానీ మగవాడి మాటలను ఎవరూ పట్టించుకోరు. అతడు చెప్పేది నిజమైనా సరే, ఎవరూ నమ్మరు' అని సామ్ బాంబే చెప్పుకొచ్చాడు. -
'లాకప్'లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. ఎందుకంటే ?
Poonam Pandey As Third Contestant In Kangana Lock Upp Show: బీటౌన్ ఫైర్ బ్రాండ్, మోస్ట్ డేరింగ్ హీరోయిన్ హోస్ట్‌గా 'లాకప్' అనే రియాల్టీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఈ షోకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. మోస్ట్ ఫియర్లెస్ షో అని ప్రచారం చేసిన 'లాకప్' షో ఫిబ్రవరి 27 నుంచి ఆల్ట్ బాలాజీ ఓటీటీ, ఎమ్ఎక్స్ ప్లేయర్లలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో షో నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలను వరుసగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే మొదటి కంటెస్టెంట్‌గా నిషా రావల్, రెండో కంటెస్టెంట్‌గా కాంట్రవర్సీ కమెడియన్ మునవర్ ఫరూఖీని రివీల్ చేశారు. తాజాగా ఈ షోలో మూడో పార్టిస్పెంట్గా బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండేను పరిచయం చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన వీడియోను పూనమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోకు 'నేను హాట్‌గా ఉన్నందుకే లాకప్ చేశారు.' అని రాసుకొచ్చింది పూనమ్. పాండే షేర్ చేసిన ఈ టీజర్ వీడియోలో పూనమ్ ఆరెంజ్ డ్రెస్‌లో హాట్‌గా కనిపించింది. ఈ వీడియోతోపాటు లాకప్‌లో ఉన్న ఒక పిక్‌ను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) -
'పెళ్లయ్యాక ఏమైందో చూశారుగా, ఏ అమ్మాయికీ ఇలాంటి పరిస్థితి రావొద్దు'
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి పూనమ్ పాండే కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరించనున్న సెన్సేషనల్ షో లాకప్‌లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్ వైవాహిక జీవితంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 'పెళ్లి తర్వాత ఇన్ని ఇబ్బందులు రావడం నా దురదృష్టం. ఏ అమ్మాయికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు. నేను సామ్ బాంబేను పెళ్లాడాక ఏమైందో చూశారుగా. ఇది అనుకోకుండా జరిగిపోయింది. ప్రస్తుతం నేను సింగిల్‌గా ఉన్నాను. నాకిప్పుడు ఏ భాగస్వామి తోడు అవసరం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా గతంలోనూ పూనమ్.. తనను భర్త కొడుతున్నాడని గృహహింస కేసు పెట్టిన విషయం తెలిసిందే! ఇదిలా ఉంటే వీరిద్దరూ 2000వ సంవత్సరంలో సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత సామ్ తనను కొట్టడం ప్రారంభించాడని, ఒకసారైతే హత్య చేసినంత పని చేశాడని తీవ్ర ఆరోపణలు గుప్పించింది. కానీ అంతలోనే వైవాహిక జీవితమన్నాక చిన్నచిన్నగొడవలు జరుగుతూనే ఉంటాయని మళ్లీ ఇద్దరూ కలిసిపోయారు. ఆ మరుసటి ఏడాదే సామ్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ పూనమ్ గృహహింస కేసు పెట్టగా సామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. -
అదంతా పబ్లిసిటీ స్టంట్, ఇప్పుడు బాధపడుతున్నా: వివాదాస్పద నటి
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే పూనమ్ పాండే తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రతి ఒక్కరినీ తనవైపుకు తిప్పుకునేందుకు బోల్డ్ స్టేట్మెంట్స్ చేశానని, అదంతా పబ్లిసిటీ స్టంట్ అని తెలియజేసింది. అలా ప్రవర్తించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పుకొచ్చింది. సుమారు 17 ఏళ్ల వయసులోనే బాలీవుడ్లో అడుగుపెట్టిన పూనమ్ ఆ సమయంలో ఇండస్ట్రీ గురించి ఎలాంటి అవగాహన లేదంది. అందరికంటే విభిన్నంగా ఉండేందుకు, మీడియాను తనవైపు తిప్పుకోవడం కోసం చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశానంది. ఆ స్టేట్మెంట్స్ చేసినందుకు ప్రస్తుతం బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది తన కెరీర్ పట్ల పేరెంట్స్ కూడా సంతోషంగా లేరని తెలిపింది. కొన్నిసార్లు తను చేస్తున్న పాత్రల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఆమెను కొట్టారని పేర్కొంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చాలాకాలానికి మంచి అవకాశాలు వస్తున్నాయన్న పూనమ్ ఇప్పుడిక పని మీదే దృష్టి పెడతానని స్పష్టం చేసింది. తనను తాను అక్షయ్ కుమార్లా ఊహించుకుంటున్నట్లు వివరించింది. ఇండస్ట్రీలో కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారికి ఓ సలహా కూడా ఇచ్చింది. చిత్రపరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని చెప్పింది. -
భర్తతో గొడవలు..మరోసారి డేటింగ్ చేస్తారా? నటి రిప్లై ఏంటంటే
భర్త సామ్ బాంబే టార్చర్ పెడుతున్నాడంటూ ఆ మధ్య వార్తల్లో నిలిచిన నటి పూనమ్ పాండే తాజాగా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది. 'సామ్ బాంబే గురించి నేనిప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. ప్రస్తుతం ఓ థెరపిస్ట్ దగ్గర చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. ఎవరితోనైనా డేటింగ్ చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఛాన్సే లేదని కుండ బద్ధలు కొట్టింది. ఐదేళ్ల వరకు అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోనని స్పష్టం చేసింది. కాగా పూనమ్.. దర్శకుడు సామ్ బాంబేను 2019 సెప్టెంబర్ 1న పెళ్లాడింది. కానీ పెళ్లైన నెల రోజులకే భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ అతడిపై గృహహింస కేసు పెట్టింది. మళ్లీ అంతలోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ వైవాహిక బంధంలో ఇలాంటి ఆటుపోట్లు సాధారణమని చెప్తూ తామిద్దరం కలిసిపోయామని చెప్పింది. ఆ తర్వాత మరోసారి సామ్ తన మీద చేయి చేసుకున్నాడని పూనమ్ ఆరోపించిన విషయం తెలిసిందే! ఈ గొడవ తర్వాత ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. -
భర్త అరెస్ట్.. హాస్పిటల్లో నటి పూనమ్ పాండే
Poonam Pandeys Husband Sam Bombay Arrested: బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై భర్త సామ్ బాంబే అరెస్ట్ అయ్యాడు. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం..సామ్‌బాంబే తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడుతుండటంపై ఇద్దరికి వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో కోపంతో ఊగిపోయిన సామ్ బాంబే..పూనమ్‌ను జుట్టు పట్టుకొని తలను గోడకు కొట్టాడు. విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పూనమ్ ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలపాలైన పూనమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా రెండేళ్లు సహజీవనం అనంతరం గతేడాది సెప్టెంబర్1న పూనమ్-శామ్ బాంబే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శామ్ బాంబే.. పూనమ్‌పై చేయి చేసుకోవడంతో పాటు విచక్షణరహితంగా దాడి చేయడంతో ఆమె గృహహింస కేసు పెట్టింది.అనంతరం భర్త క్షమాపణలు చెప్పి రాజీకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి సామ్ బాంబే చేసిన దాడిలో పూనమ్ తీవ్ర గాయాలపాలైంది. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. 'ఇది మొదటి సారి జరిగింది కాదు. ప్రతిసారి సామ్ నన్ను కొట్టడం..ఆ తర్వాత ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో నేను కరిగిపోయేదాన్ని. ఈసారి మాత్రం నన్ను చావబాదాడు. దాదాపు సగం హత్య చేసినంత దారుణంగా హింసించాడు. దీని వల్ల ఎన్ని రోజులు నేను హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందో నాకే తెలియదు' అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. -
Raj Kundra: ఈజీ మనీ కోసం కక్కుర్తి!
Raj Kundra Arrest: పెగాసస్ వివాదం కుదిపేస్తున్న టైంలో.. ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ ఫైనాన్సర్ రాజ్ కుంద్ర(46) పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. వాళ్లతో అడల్ట్ చిత్రాలు తీస్తున్నాడన్న ఆరోపణలపై రాజ్ కుంద్రాను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ముంబై పోలీసులు ఇప్పటిదాకా ఆసక్తికరమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ముంబై: లండన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెబ్ సిరీస్‌ల పేరుతో పోర్న్, సెమీ పోర్న్ కంటెంట్‌ను తీయడంతో పాటు వాటిని కొన్ని యాప్‌ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడంటూ ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం విచారణ పేరిట బైకుల్లాలోని తమ ఆఫీస్‌కు రప్పించుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. అటు నుంచి అటే కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఈ మొత్తం పోర్న్ మాఫియాకు రాజ్ కుంద్రానే సూత్రధారి అని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత నగ్రాలే నిర్ధారించారు. ఆ లింక్‌తో.. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఉత్తర ముంబై మలాద్‌లో మదా ఐల్యాండ్‌లోని ఓ భవనంలో బూతు సినిమాలు తీస్తున్న ఓ ముఠాను ముంబై ప్రాపర్టీ సెల్(స్పెషల్ పోలీస్) అరెస్ట్ చేసింది. మొత్తం 9 మందిలో నటి కమ్ మోడల్స్ గెహానా వశిష్ఠ్, రోవా ఖాన్ కూడా ఉన్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో యూకే ప్రొడక్షన్ కంపెనీ కెన్రిన్ ఉండడం, దానికి ఉమేశ్ కామత్ హెడ్ కావడం, ఉమేశ్ ఇదివరకు కుంద్రా దగ్గర పని చేయడంతో ప్రాపర్టీ సెల్ విభాగం ఇన్స్పెక్టర్ కేదార్ పవార్, కుంద్రాపై దృష్టిసారించాడు. ఈ క్రమంలో గతంలో ఓసారి కుంద్రాని పోలీసులు ప్రశ్నించారు కూడా. ఈ మేరకు పక్కా ఆధారాలు సేకరించాకే రాజ్ కుంద్రాని సోమవారం అరెస్ట్ చేసినట్లు ముంబై కమిషనర్ తెలిపారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం కుంద్రాను జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. Actress Shilpa Shetty's husband & businessman Raj Kundra has been taken for medical examination at JJ hospital by Property Cell of Mumbai Police's Crime Branch.He was later taken to Mumbai Police Commissioner's office.#shilpashettykundra #RajKundraArrest pic.twitter.com/KeM346ZUzd — MBC TV ODISHA (@MBCTVODISHA) July 20, 2021 ఈజీ మనీ కోసం.. లైవ్ స్రీ్టమింగ్ యాప్‌లు, ఐపీఎల్‌లు పెద్దగాకలిసి రాకపోవడంతో తప్పుడు దారిలో సంపాదన కోసమే ఆయన ఈ పని చేసినట్లు ముంబై పోలీసులు నిర్ధారించుకున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి రాజ్ కుంద్రా యువతులను తన మీడియేటర్ల ద్వారా ట్రాప్‌లోకి దించాడని తెలుస్తోంది. ఈ మేరకు తమతో అగ్రిమెంట్లు చేయించుకున్నాక బలవంతంగా పోర్న్ సినిమాలు తీయించినట్లు బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. హాట్‌షాట్స్, హాట్హిట్మూవీస్ లాంటి బీ, సీ గ్రేడ్ యాప్స్ కొన్నింటిలో ఆ వీడియోలను అప్లోడ్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్లలో సైతం వాటిని పోస్ట్ చేయాలని సదరు నటీమణులను ఒత్తిడి చేయడం, ట్విటర్ పేజీలతో ప్రమోట్ చేయడం ద్వారా భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీసులు నిర్ధారించారు. శాలువా బిజినెస్ నుంచి.. పంజాబీ కుటుంబానికి చెందిన రాజ్ కుంద్రా స్వస్థలం లూథియానా. చిన్నతనంలోనే అతని ఫ్యామిలీ లండన్‌కు వలస వెళ్లింది. కుంద్రా తండ్రి అక్కడ బస్సు కండక్టర్‌గా, తల్లి ఓ చిన్నషాపులో పని చేసేది. 18 వయసులో దుబాయ్ అక్కడి నుంచి నేపాల్ వెళ్లిన కుంద్రా.. శాలువాల బిజినెస్ చేశాడు. అయితే కొన్నేళ్ల తర్వాత తెలివిగా వాటిని బ్రిటన్‌కు చెందిన ఫ్యాషన్ హౌజ్ కంపెనీలకు విక్రయించి కోట్లు సంపాదించాడు. 2004లో బ్రిటిష్-ఏషియన్ రిచ్చెస్ట్ పర్సన్ లిస్ట్‌లో 198వ ర్యాంక్ దక్కించుకున్నాడు కూడా. 2007కి తిరిగి దుబాయ్‌కు వెళ్లి.. కన్ స్ట్రక్షన్ ట్రేడింగ్‌లో అడుగుపెట్టాడు. ఆ టైంలోనే బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్సింగ్ మొదలుపెట్టాడు. సంజయ్ దత్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ల పరిచయాలతో పలు స్పోర్ట్స్ బిజినెస్, లైవ్-బ్రాడ్కాస్ట్, గేమింగ్ సంబంధిత వ్యవహారాలతో లెక్కలేనంత సంపాదించాడు. 2009లో నటి శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నాడు(కుంద్రాకు రెండో వివాహం). ఆపై ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ, అటుపై బెట్టింగ్-వివాదాల వ్యహారంతో కుదేలు అయ్యాడు. 2019లో రాజ్ కుంద్రాకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద అవార్డు కూడా దక్కింది. ఇక తనకు సంబంధించిన న్యూడ్ ఫొటోలు, వీడియోలను తన అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ నటి, మోడల్ పూనమ్ పాండే సైతం రాజ్ కుంద్రాపై ఓ దావా వేయగా, ఆ కేసు బాంబే హైకోర్టులో నడుస్తోంది కూడా. -
WTC Final: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన పూనమ్ పాండే
2011 ప్రపంచ కప్ సమయంలో బాలీవుడ్ నటి పూనమ్ పాండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. భారత్ జట్టు గెలిస్తే బట్టలు విప్పి మైదానమంతా తిరుగుతానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేసి మరోసారి పూనమ్ వార్తల్లో నిలిచింది. అయితే ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుతున్న సంగతి తెలిసిందే. సౌథాంప్టన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌పై తన అభిప్రాయం చెప్పాల్సిందిగా తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ అడగ్గా ఆమె స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు పూనమ్ మాట్లాడుతూ.. ‘క్రికెట్ మొదలైందా? జనం క్రికెట్ ఆడుతున్నారా? ఈసారి కూడా భారత జట్టు గెలిస్తే బట్టలు విప్పేస్తానని మళ్లీ చెప్పాలా? అయితే.. ఈ మ్యాచ్ గురించి నాకు తెలియదు’ అంటూ వ్యాఖ్యానించింది. ఇక ఆమె వ్యాఖ్యలపై పూనమ్ భర్త సామ్ బాంబే స్పందిస్తూ.. తనకు బదులుగా ఈ సారి తాను నగ్న ప్రదర్శన చేస్తానని సమధానం ఇచ్చాడు. దానికి ‘వద్దులే నువ్వు చేస్తే ఇండియా ఓడిపోతుంది’ అంటూ పూనమ్ చమత్కారంగా బుదులిచ్చింది. చివరకు తను ఇండియా గెలవాని కోరుకుంటున్నానని పేర్కొంది. కాగా తెలుగులో పూనమ్ ‘మాలిని అండ్ కంపెనీ’ అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసిన ఆమె గతేడాది సెప్టెంబర్ 1న దర్శకుడు సామ్ బాంబేను పెళ్లాడింది. కానీ పెళ్లైన నెల రోజులకే భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ అతడిపై గృహహింస కేసు పెట్టింది. మళ్లీ అంతలోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ వైవాహిక బంధంలో ఇలాంటి ఆటుపోట్లు సాధారణమని చెప్తూ తామిద్దరం కలిసిపోయామని చెప్పింది. చదవండి: గర్భం దాల్చడం నా విషయంలో బాధాకర వార్త: పూనమ్ -
ప్రెగ్నెన్సీ రూమర్లు: నన్ను అడగండి అంటున్న నటి
అమ్మా అని పిలిపించుకోవాలని పెళ్లైన ప్రతి మహిళా కోరుకుంటుంది. పొత్తిళ్లలో పాపాయిని పడుకోబెట్టి ఆడించాలని తెగ ఉవ్విళ్లూరుతుంటుంది. గర్భవతి అయ్యానన్న విషయం తెలిసినప్పటి నుంచి ఆమె ఆనందం చెప్పతరం కాదనుకోండి. కానీ తనకు మాత్రం గర్భం దాల్చానని తెలుసుకోవడం బాధించే వార్త అంటోంది బాలీవుడ్ నటి పూనమ్ పాండే. పూనమ్-సామ్ బాంబే దంపతులు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన నటి ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ తప్పుడు కథనాల ద్వారా తనను అనవసరంగా గర్భవతిని చేసేయకండి అని వ్యాఖ్యానించింది. ప్రెగ్నెంట్ అని తెలియగానే ప్రతి మహిళ సంబరపడుతుంది కానీ తన విషయంలో అలా జరగడం లేదని ఎందుకంటే ఇప్పుడు తాను గర్భవతిని కాదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటివి రాసేముందు కనీసం ఒక మాటైనా తనను అడగమని కోరింది. తన జీవితం తెరిచిన పుస్తకం అన్న పూనమ్ నిజంగా గర్భం దాల్చిన రోజు మిఠాయిలు పంచుతానని పేర్కొంది. కాగా పూనమ్.. దర్శకుడు సామ్ బాంబేను గతేడాది సెప్టెంబర్ 1న పెళ్లాడింది. కానీ పెళ్లైన నెల రోజులకే భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ అతడిపై గృహహింస కేసు పెట్టింది. మళ్లీ అంతలోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ వైవాహిక బంధంలో ఇలాంటి ఆటుపోట్లు సాధారణమని చెప్తూ తామిద్దరం కలిసిపోయామని చెప్పింది. చదవండి: ఎక్కువ కాలం హీరోయిన్గా ఉండాలంటే సమంతలా రాణించాల్సిందే -
మిలింద్ సోమన్ అరెస్ట్, వారు శాంతించారు!
పనాజీ: మోడల్, యాక్టర్ మిలింద్ సోమన్ మీద అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారు అనే ఆరోపణలతో గోవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. బుధవారం నాడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన ఫిట్నెస్ను ప్రపంచానికి చూపించడం కోసం బీచ్‌లో బట్టులు లేకుండా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా మిలింద్ షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోటోలో మిలింద్ ఫిట్నెస్ను చూసి నెటిజన్లందరూ వావ్ అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ మిలింద్ అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని గోవా సురక్షా మంచ్ ఆయన మీద ఫిర్యాదు చేసింది. దీంతో గోవా పోలీస్ స్టేషన్లో ఆయన మీద సెక్షన్ 294( పబ్లిక్ ప్లేస్‌లో అశ్లీలంగా ప్రవర్తించడం), ఐటీ యాక్ట్ 67 కింద ఆయన మీద కేసు నమోదయ్యింది. ఇదిలా వుండగా మిలింగ్ తన న్యూడ్ ఫోటోలను షేర్ చేసినప్పుడు పూనమ్ పాండే గవర్నమెంట్ ఆస్తులలో ఆశ్లీలమైన ఫోటో షూట్లో పాల్గొందని ఆమెపై కేసు నమోదయ్యింది. అనంతరం చాలా మంది ఆమె అభిమానులు పాండేకు ఒక న్యాయం, మిలింద్కు ఒక న్యాయమా? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇప్పుడు మిలింద్ మీద కూడా కేసు నమోదు కావడంతో దీనికి సంబంధించి మీమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మిలింద్ ఫోటో పెట్టి సమానమంటే సమానమే అని కొందరు మీమ్స్ క్రియేట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు పూనమ్‌కు మద్దతుగా నిలిచిన వారి మనసు ఇప్పుడు చల్లబడి ఉంటుందని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: బర్త్‌డే స్పెషల్.. బీచ్‌లో బట్టలు లేకుండా.. -
అశ్లీల వీడియో షూట్.. పూనమ్ పాండే అరెస్ట్
హాట్ మోడల్, వివాదస్పద నటి పూనమ్ పాండేను గోవా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పూనమ్ ఇటీవల గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించిందని ఆరోపిస్తూ ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఆమెపై ఫిర్యాదు చేసింది. దీనికి తోడు పూనమ్ పాండేపై అసభ్యకరమైన వీడియోను చిత్రీకరించినందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తిపై మరో కేసు నమోదైంది. గోవా సంస్కృతి, చపోలీ డ్యామ్ పవిత్రతను దెబ్బ తీసేలా ప్రవర్తించినందుకే కేసు పెట్టామని గోవా ఫార్వర్డ్ మహిళా విభాగం పేర్కొంది. ఫార్వర్డ్ పార్టీ ఫిర్యాదు మేరకు పూనమ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వీడియో షూట్‌కు అనుమతి ఇచ్చినందుకు ఇద్దరు పోలీసులపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. కాగా, గతంలో పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబే పై దక్షిణ గోవాలోని కెనకోనా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం తెలిసిందే.సామ్ అహ్మద్ తనపై దాడి చేసి, చెంపదెబ్బ కొట్టినట్లు పూనమ్ ఆరోపించింది. ఆ తర్వాత సామ్ బాంబే బెయిల్ పై విడుదలయ్యాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే పూనమ్ మనసు మార్చుకొని భర్తతో కలిసిపోయి అందరినీ ఆశ్చర్య పరిచింది. -
అశ్లీల వీడియో: పూనమ్ పాండేపై కేసు
పనాజి: హాట్ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరోసారి వార్తల్లో నిలిచారు. నిత్యం వివాదాల్లో నానుతూ ఉండే ఆమెపై తాజాగా కేసు నమోదైంది. గోవాలోని చపోలీ డ్యామ్ వద్ద పూనమ్ అశ్లీల వీడియోను చిత్రీకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీడియో చిత్రీకరించిన వ్యక్తితో సహా పూనమ్పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గోవా సంస్కృతి, చపోలీ డ్యామ్ పవిత్రతను దెబ్బ తీసేలా ప్రవర్తించినందుకే కేసు పెట్టామని గోవా ఫార్వర్డ్ మహిళా విభాగం పేర్కొంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పోర్న్ వీడియో గోవాలో వైరల్‌గా మారింది. (చదవండి: టైటిల్లో మార్పులు.. కొత్త పోస్టర్ విడుదల) కాగా పూనమ్ లాక్డౌన్లో తన ప్రియుడు సామ్‌బాంబేను పెళ్లి చేసుకున్నారు. సెప్టెంబర్ 1న వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టిన ఆమె భర్త వేధిస్తున్నాడంటూ అదే నెలలో కేసు పెట్టారు. దీంతో గోవా పోలీసులు సెప్టెంబర్ 22న సామ్‌బాంబేను అరెస్టు చేయగా మరుసటి రోజే అతడికి బెయిల్ మంజూరైంది. ఇది జరిగిన వారం రోజులకే పూనమ్ మనసు మార్చుకున్నారు. మేమిద్దరం పిచ్చి ప్రేమలో ఉన్నామంటూ మళ్లీ భర్తతో కలిసిపోయి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. (చదవండి: భర్త గురించి భయంకర విషయాలు చెప్పిన పూనమ్) -
మరో ట్విస్ట్ ఇచ్చిన పూనమ్ పాండే
ముంబై : మోడల్, నటి పూనమ్ పాండే వైవాహిక జీవితం ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకు సాగిపోతోంది. తన భర్త సామ్ బాంబే వేధిస్తున్నాడంటూ కేసు పెట్టిన ఆమె వారం రోజుల్లోనే మనసు మార్చుకుంది. భర్తతో కలిసిపోయి వైవాహిక జీవితాన్ని మళ్లీ కొనసాగించాలని భావిస్తోంది. ఈ మేరకు శనివారం రాత్రి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అంతేకాకుండా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌తో ఆమె మాట్లాడుతూ..‘‘మా మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకున్నాం. మళ్లీ కలిసి ఉండబోతున్నాం. మీకు తెలుసా? మేమిద్దం ఒకరిని ఒకరం చాలా ప్రేమించుకుంటున్నాం. మేమిద్దరం పిచ్చి ప్రేమలో ఉన్నాం. వైవాహిక జీవితంలోని హెచ్చు, తగ్గులు మమ్మల్ని ఆపలేవ’’ని తెలిపారు. సామ్ బాంబే కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇద్దరూ కలిసి ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు.( ముఖంపై పిడికిలితో గుద్దాడు.. జుట్టు పట్టుకొని! ) కాగా, గత కొన్ని సంవత్సరాలుగా సామ్ అహ్మద్ బాంబే అనే దర్శకుడితో ప్రేమలో ఉన్న ఆమె ఈ నెల 1వ తేదీన అతడ్ని పెళ్లాడింది. పెళ్లయి నెల కూడా తిరగకుండానే సామ్ తనను శారీరకంగా హింసిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ నెల 22వ తేదీన సామ్ బాంబే బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. (పూనమ్ భర్తకు బెయిల్ మంజూరు)