ఫిట్‌నెస్ అంటే నాదే | Poonam Pandey Hot Kannada Item Song | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్ అంటే నాదే

Published Wed, Jun 25 2014 12:01 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Poonam Pandey Hot Kannada Item Song

 నాలాంటి ఫిట్‌నెస్ గల హీరోయిన్లు దక్షిణాదిలోనే లే రు అంటోంది బాలీవుడ్ బ్యూటీ పూనం పాండే. చాలామంది హీరోయిన్ల మాదిరిగానే ఈ అమ్మడి కన్ను ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమపై పడింది. ముఖ్యంగా తమిళ చిత్రాల్లో నటించాలనే ఆకాంక్షను ఈ భామ చెప్పకనే చెబుతోంది. ఇటీవల కన్నడ చిత్ర పరిశ్రమలోకి రంగ ప్రవేశం చేసిన పూనం పాండే ఐటమ్ సాంగ్ కోసం బెంగుళూరు వచ్చింది. ఈ బ్యూటీ మాట్లాడుతూ ఇలాంటి ఐటమ్‌సాంగ్స్ ఆడటం తనకిదే తొలిసారి అని వెల్లడించింది. అయితే తనకు బాలీవుడ్లో బికినీ భామ, స్విమ్ సూట్ బ్యూటీ అనే పేరు ఉందని పేర్కొంది.
 
 అయితే ఐటమ్‌సాంగ్‌లో నటించడం వినూత్న అనుభవం అని చెప్పుకొచ్చింది. తాను చిన్న వయసు నుంచే హిందీలోకి అనువాదం అయ్యే తమిళ, కన్నడ చిత్రాలను అధికంగా చూస్తుంటానని తెలిపింది. ఆయా చిత్రాల్లోని పాటల సన్నివేశాలను, పోరాట దృశ్యాలను ఇష్టంగా తిలకిస్తానని చెప్పింది. ముఖ్యంగా దక్షిణాది హీరోయిన్లంటే ప్రత్యేక అభిమానం అని అంది. అయితే తనలా డాన్స్ చేయడానికి ఫిట్ అయిన శరీరం లేకపోయినా వాళ్లు చాలా ఎనర్జీతో డాన్స్ చేస్తున్నారని చెప్పింది. తనకు ప్లస్‌పాయింట్ వ్యక్తిత్వమేనని, దాన్ని అభిమానులు ఆస్వాదిస్తున్నారని పూనంపాండే సొంత డబ్బా కొట్టుకుంటోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement