![Mumbai: Poonam Pandey Sam Bombay Goa Police File Charge Sheet Obscene Video Case - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/31/Untitled-12.jpg.webp?itok=-Mox93rx)
ముంబై: మోడల్, నటి పూనం పాండే మళ్లీ చిక్కుల్లో పడ్డారు. పూనంతో పాటు ఆమె మాజీ భర్త శాం బాంబేపై కెనకొనా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. కెనకొనా ప్రాంతంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని చాపోలి డ్యామ్ వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేసినందుకు గాను వారిపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు పోలీసుల తెలిపారు.
2020లో కనకొనా ప్రాంతంలో ఆమె న్యూడ్ పోటోషూట్‌లో పాల్గొన్నారని కొందరు పాండేపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చార్జిషీట్ పేర్కొన్నారు.అశ్లీల వీడియోగ్రఫీ, అందరిముందే అభ్యంతరకర నృత్యాలు, పాటల పాడారని వారిపై అభియోగాలు మోపారు.
ఇక 2021లో పాండే ఆమె భర్తకు మధ్య విభేదాలు రావడంతో అప్పటి నుంచి వారిద్దరూ దూరంగా ఉంటున్నారు. తనను శారీరకంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో శాంబాంబేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment