Poonam Pandey As Third Contestant In Kangana Lock Upp Show - Sakshi
Sakshi News home page

Poonam Pandey: 'లాకప్'​లో బాలీవుడ్​ బోల్డ్​ బ్యూటీ.. ఎందుకంటే ?

Published Fri, Feb 25 2022 6:58 PM | Last Updated on Fri, Feb 25 2022 7:43 PM

Poonam Pandey As Third Contestant In Kangana Lock Upp Show - Sakshi

Poonam Pandey As Third Contestant In Kangana Lock Upp Show: బీటౌన్​ ఫైర్ బ్రాండ్​, మోస్ట్​ డేరింగ్​ హీరోయిన్​ హోస్ట్​గా 'లాకప్'​ అనే రియాల్టీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్​ ఈ షోకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. మోస్ట్​ ఫియర్​లెస్​ షో అని ప్రచారం చేసిన 'లాకప్​' షో ఫిబ్రవరి 27 నుంచి ఆల్ట్​ బాలాజీ ఓటీటీ, ఎమ్​ఎక్స్​ ప్లేయర్​లలో స్ట్రీమింగ్​ కానుంది. దీంతో షో నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలను వరుసగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే మొదటి కంటెస్టెంట్​​గా నిషా రావల్​, రెండో కంటెస్టెంట్​గా కాంట్రవర్సీ కమెడియన్​ మునవర్​ ఫరూఖీని రివీల్​ చేశారు. 

తాజాగా ఈ షోలో మూడో పార్టిస్​పెంట్​గా బోల్డ్​ బ్యూటీ పూనమ్​ పాండేను పరిచయం చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన వీడియోను పూనమ్​ తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది. ఈ వీడియోకు 'నేను హాట్​గా ఉన్నందుకే లాకప్​ చేశారు.' అని రాసుకొచ్చింది పూనమ్​. పాండే షేర్ చేసిన ఈ టీజర్​ వీడియోలో పూనమ్​ ఆరెంజ్​ డ్రెస్​లో హాట్​గా కనిపించింది. ఈ వీడియోతోపాటు లాకప్​లో ఉన్న ఒక పిక్​ను కూడా షేర్​ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్​లు నెట్టింట వైరల్​గా మారాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement