
ఆమె అందమే హైలైట్!
పూనమ్‌పాండే కథానాయికగా అమిత్ సక్సేనా దర్శకత్వంలో బాలీవుడ్‌లో రూపొందిన చిత్రం ‘నషా’. ఈ చిత్రం ‘తేరా నషా’గా తెలుగులో విడుదల కానుంది. ఇ.వి.ఎన్.చారి ఈ అనువాద చిత్రానికి నిర్మాత. ఈ సినిమా ప్రచార చిత్రాలను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ప్రతాని రామకృష్ణగౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మోహన్‌గౌడ్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. పూనమ్‌పాండే అందం, అభినయం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, ఈ శనివారం చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.