
పెళ్లి మాట ఎత్తితేనే భయపడుతోంది బోల్డ్ బ్యూటీ, నటి పూనమ్ పాండే (Poonam Pandey). విడాకుల తర్వాత తన జీవితం సంతోషంగా సాగుతోందని, మళ్లీ ఎవర్నైనా నమ్మాలంటే భయంగా ఉందని చెప్తోంది. పూనమ్ పాండే 2020లో ప్రియుడు సామ్ బాంబేను పెళ్లి చేసుకుంది. అతడితో గోవాకు హనీమూన్‌కు కూడా వెళ్లింది. ఆ సమయంలో సామ్ తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతడిని అరెస్టు కూడా చేశారు. అదే సమయంలో పూనమ్ కళ్లు, ముఖంపై గాయాలతో ఆస్పత్రిలో చేరింది.

రెండేళ్లుగా ఒంటరిగానే..
అవన్నీ గుర్తు చేసుకుంటేనే భయపడిపోతోంది పూనమ్ పాండే. రెండేళ్లుగా ఒంటరిగా ఉన్నాను. ఈ సమయంలో చాలా సంతోషంగా ఉన్నాను. వైవాహిక జీవితం నాకు కలిసిరాదేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడైతే హాయిగా జీవిస్తున్నాను. నాకు అందమైన కుటుంబం, మంచి కెరీర్ ఉంది. ఈ రెండింటితో నేను సంతృప్తిగా ఉన్నాను. మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉందని. ఎవరేంటో తెలుసుకోలేకపోతున్నాను. ఎవర్నీ నమ్మలేకున్నాను అని చెప్పుకొచ్చింది.
వివాదాలతో సావాసం..
గతేడాది గర్భాయ ముఖద్వార క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఏకంగా తాను చనిపోయినట్లు ప్రచారం చేసుకుంది. ఆ వార్తలు వైరలయ్యాక తాను బతికే ఉన్నానని, క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకే అలాంటి ప్రాంక్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. 2011లో వరల్డ్‌కప్‌లో టీమిండియా గెలిస్తే మైదానంలో ఒంటి మీద నూలుపోగులేకుండా తిరుగుతానని ప్రకటించింది. ఇలాంటి సంచలన కామెంట్లు, డ్రామాలతోనే పూనమ్ ఎక్కువ పాపులర్ అయింది.
చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా
Comments
Please login to add a commentAdd a comment