Poonam Panday
-
'పూనమ్ మరణవార్త తెలిసినా ఫీలవ్వలేదు'.. భర్త షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ భామ, మోడల్ పూనమ్ పాండే ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. కొందరైతే ఇంకా ఆ షాక్ నుంచి తెరుకోలేదు కూడా. అయితే ఆమె చేసిన పనికి పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై ఆమె భర్త సామ్ బాంబే స్పందించారు. ఆమె మరణవార్త విన్నాక నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదని అన్నారు. ఇలాంటిది జరిగి ఉండదని నేను భావించానని ఆయన వెల్లడించారు. అంతే కాకుండా తాము చట్టబద్ధంగానే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. తామిద్దరం ఇంకా విడాకులు తీసుకోలేదని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. సామ్ బాంబే మాట్లాడుతూ.. 'ఈ వార్త విన్నప్పుడు నా హృదయంలో ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. నాకైతే ఎలాంటి నష్టం అనిపించలేదు. నేను ఇది జరిగి ఉండదని భావించా. ఎందుకంటే ఎవరితోనైనా మీరు కనెక్ట్ అయి ఉంటే ప్రతి విషయంలో ఎక్కువగా ఫీలవుతారు. నేను ప్రతిరోజూ ఆమె గురించి ఆలోచిస్తా. అంతే కాదు ఆమె కోసం ప్రార్థిస్తాను కూడా. ఏదైనా తప్పు జరిగితే నాకు కచ్చితంగా తెలుస్తుంది. ఆమె ఇంకా బతికే ఉన్నందుకు సంతోషంగా ఉంది.'అని అన్నారు. అంతే కాకుండా ఆమె ధైర్యవంతురాలైన భారతీయ మహిళ అని సామ్ బాంబే ప్రశంసించారు. ఎవరైనా తమ కీర్తి, ప్రతిష్టను పూర్తిగా విస్మరించి ఒక సమస్యపై అవగాహన పెంచుకుంటే ప్రజలు గౌరవించాలని ఆయన సూచించారు. కాగా.. పూనమ్, సామ్ బాంబే 2020లో వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహబంధం ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయారు. హనీమూన్ తర్వాత భర్త భౌతికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సామ్ బాంబేను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ జంట విడివిడిగానే ఉంటున్నారు. -
'పూనమ్ పాండే' డ్రామా.. 19 ఏళ్ల వయసులోనే ఆ స్టేట్మెంట్తో వైరల్
బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే సర్వైకల్(గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్) మరణించిందనే షాకింగ్ న్యూస్ వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలతో పాటు ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇండస్ట్రీలో మహా నటిగా గుర్తింపు పొందకపోయినప్పటకి ఒక శృంగార తారగా గుర్తింపు పొందింది. ఒక వ్యాధితో ఆమె మరణించినట్లు వార్త రాగానే చాలామందిలో ఆందోళన నెలకొంది. నేడు తాను బతికే ఉన్నానని, ఇదంతా ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే కావడంతో ప్రజల్లో అవగాహన కోసం చేసినట్లు తెలిపి సింపుల్‌గా క్షమించమని కోరింది. ఈ విషయంపై నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేఖత వస్తుంది. క్యాన్సర్ గురించి అందరికీ అవగాహన కల్పించాలనే క్రమంలో ఆమె తనను తాను చంపుకున్నట్లు కొందరు తెలుపుతున్నా ఎక్కువ మంది ఆమె ఆలోచనా తీరును తప్పుబడుతున్నారు. క్యాన్సర్ నివారణ గురించి ప్రచారంలోకి తీసుకురావాలంటే ఎన్నో దారులు ఉన్నాయి కానీ ఇలా ప్రజల ఉద్వేగాలతో ఆటలాడటం ఏంటని తప్పుబడుతున్నారు. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలనే క్రమంలో పూనమ్ పాండే చేసిన పని ఎంతమాత్రం కరెక్ట్ కాదని దుమ్మెత్తిపోస్తున్నారు. చాలా రోజుల నుంచి ఆమె పేరు వెలుగులో లేకుండా పోయింది. చేతిలో సినిమా ఛాన్సులు లేవు. దీంతో ఎలాగైనా తను వైరల్ కావాలని క్యాన్సర్ పేరుతో చనిపోయినట్లు నాటకం ఆడిందని విమర్శలు వస్తున్నాయి. పూనమ్ పబ్లిసిటీ స్టంట్ కోసం తన మరణ వార్తను ఎంతగానో ఎంజాయ్ చేస్తోందని విమర్శలు వచ్చాయి. పూనమ్ చేసిన ఆ ఒక్క ప్రకటన దేశంలోని అందరినీ నమ్మించగలిగింది. ఆమె మరణించిందని వినగానే కంగనా రనౌత్, సింగర్ చిన్మయి వంటి ఎందరో స్టార్స్ దిగ్భ్రాంతి చెందారు. ఆపై చాలామంది బాలీవుడ్ నటీనటులు సంతాపాన్ని కూడా తెలియచేశారు. (ఇదీ చదవండి: బతికే ఉన్నానని ట్విస్ట్ ఇచ్చిన పూనమ్ పాండే.. ఇదంతా ఎందుకు చేసిందంటే?) ఆమె కేవలం సెన్సేషన్ కోసమే ఇలాంటి నాటకం ఆడిందని దీనిని ఘోరమైన నేరంగా పరిగణించాల్సి వుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఎంతో సున్నితమైన అంశం. ఇలాంటి విషయంలో పరాచికలాడటం ఏంటని తప్పుబడుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్‌తో నిజంగానే బాధపడుతున్న ఎందరో మహిళలు పూనమ్ మరణవార్త తెలియగానే ఎంతగానో మదనపడి ఉంటారు. ఇంతటి సున్నితమైన అంశాన్ని తన పబ్లిసిటీ కోసం ఉపయోగించడం ఏంటి..? అంటూ ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని వాదన వినిపిస్తోంది. డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కామెంట్ సర్వైకల్ క్యాన్సర్ సమస్యపై నువ్వు (పూనమ్) చేసిన పని అందరికీ రీచ్ అయి ఉంటుంది. కానీ మీరు అవలంబించిన ఇలాంటి పద్ధతి కొంత విమర్శలకు దారితీయవచ్చు, కానీ మీ ఉద్దేశాన్ని లేదా ఇలాంటి బూటకంతో మీరు ఏమి సాధించారు అని ఎవరూ ప్రశ్నించలేరు .. సర్వైకల్ క్యాన్సర్‌పై చర్చ ఇప్పుడు దేశం అంతటా ట్రెండింగ్‌లో ఉంది. మీ మాదిరే మీ ఆత్మ చాలా అందంగా ఉంది. మీరు చాలా సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను.' అని వర్మ తన ఎక్స్ పేజీలో రాసుకొచ్చారు. పబ్లిసిటీ కోసం 19 ఏళ్ల వయసులోనే ఇలాంటి పనితో .. 2011లో పూనమ్ పాండే క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే తాను టీమ్ ఇండియా కోసం గ్రౌండ్లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించి వార్తల్లో నిలిచింది. అది నిజం కావడంతో ఆమె తన మాట నిలబెట్టుకోవాలని చేసిన ప్రయత్నాన్ని బీసీసీఐ అడ్డుకుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు. ఆ తర్వాత సంవత్సరం తనకు ఎంతో ఇష్టమైన IPL జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటో పోస్టు చేసి సంచలనం రేపింది. అలా ఎప్పుడూ ఆమె నెట్టింట తన పేరు ఉండాలని తాపాత్రయ పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబే నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు కూడా కావాలనే చేసినట్లు వార్తలు వచ్చాయి. 2017లో పూనమ్ పాండే 'పాండే యాప్' ప్రారంభించింది. కానీ అందులోని కంటెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ గూగుల్ ఒక గంటలోపే ప్లే స్టోర్ నుంచి యాప్‌ను తొలగించేసింది. పూనమ్ పాండే తన ప్రేమికుడి సామ్ బాంబేతో కొద్దిరోజుల పాటు డేటింగ్ చేసి వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్లారు. అయితే పెళ్లైన 13 రోజులకే.. సామ్‌బాంబే తనని శారీరకంగా హింసిస్తున్నారని పనాజీ పోలీసులను ఆమె ఆశ్రయించి వైరల్ అయింది. ఆమె ఫిర్యాదు మేరకు సామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. -
నేను బతికే ఉన్నా: పూనం పాండే
-
పూనమ్ ఇంట్లో అంతా బాగానే ఉందే!: నటి బాడీగార్డు
బాలీవుడ్ నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో మరణించింది. ఆమె మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పూనమ్ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు. పూనమ్ దగ్గర 11 ఏళ్లుగా బాడీగార్డుగా పని చేస్తున్న ఆమిన్ ఖాన్ నటి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అతడు మాట్లాడుతూ.. పూనమ్ మరణించారన్న వార్తను నేను నమ్మను. ఆమె సోదరితో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ తను స్పందించడం లేదు. నటి ఇక లేరన్న విషయాన్ని మీడియాలో చూసే తెలుసుకున్నాను. ఆమె రిప్లై ఇవ్వట్లేదు జనవరి 31 వరకు ఆమెతోనే ఉన్నాను. ఒక మాల్లో ఫోటోషూట్ కూడా చేశాం. తను ఎప్పుడూ ఫిట్‌గా ఉండేది. ఆరోగ్యంగా కనిపించేది. తన అనారోగ్య సమస్య గురించి ఎన్నడూ బయటకు చెప్పలేదు. తనకు ఏదో ఆరోగ్య సమస్య ఉందని కూడా ఎప్పుడూ అనిపించలేదు. అసలు నిజమేంటో తెలియాల్సి ఉంది. తన సోదరి రిప్లై కోసం ఎదురుచూస్తున్నాను. పూనమ్ ఈ మధ్య తన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మద్యపానం అలవాటు కూడా మానేసింది. నేను తన ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు అన్నీ సాధారణంగా ఉన్నట్లే అనిపించాయి' అని చెప్పుకొచ్చాడు. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు కాగా మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన పూనమ్ నటిగానూ కొన్ని సినిమాలు చేసింది. అయితే ఎప్పుడూ ఏదో ఒకరకంగా నిత్యం ఆమె పేరు వార్తల్లో నానుతూ ఉండేది. అశ్లీల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉండేది. గతంలో ప్రియుడిని పెళ్లాడిన కొద్ది రోజులకే అతడిపై గృహహింస కేసు పెట్టింది. తర్వాత ఇద్దరూ కలిసిపోయారు, కానీ ఎక్కువకాలం కలిసి కొనసాగలేకపోయారు. పూనమ్ లాకప్ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది. చదవండి: పూనమ్ పాండే: చనిపోయేంత వరకు విమర్శలు, వివాదాలే! సౌందర్య టూ పూనమ్ పాండే... చిన్న వయసులో తనువు చాలించిన తారలు వీళ్లే! -
స్టార్స్‌గా ఎదిగారు.. చిన్న వయసులోనే కెరీర్‌ను ముగించారు!
సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇకపోతే సినిమాల్లో హీరోయిన్ల పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలా చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన తారలు చాలామందే ఉన్నారు. కానీ కాల కలిసిరాక కొందరు కాలగర్భంలో కలిసిపోయారు. తాజాగా ఇవాళ చిన్న వయసులోనే నటి, మోడల్ పూనమ్ పాండే క్యాన్సర్‌తో కన్నుమూసింది. 32 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాదంతో బాలీవుడ్, సినీ ప్రియులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొద్ది రోజుల్లోనే స్టార్స్‌గా ఎదిగిన తారలు చాలామందే ఉన్నారు. కానీ కొందరు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరేమో వ్యక్తిగత జీవితంలో కారణాలతో చిన్న వయసులోనే తనువు చాలించి వెండితెరకు దూరమయ్యారు. అలా చిన్న వయసులో కన్నుమూసిన నటీమణుల్లో తెలుగు హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్.. టాలీవుడ్ అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న హీరోయిన్ ఆర్తి అగర్వాల్. అమెరికాలో జన్మించిన బ్యూటీ 31 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో పరిచయమైన ఆర్తి జూన్ 6, 2015లో కన్నుమూసింది. బరువు తగ్గడం కోసం ఆపరేషన్ చేయించుకోగా.. అది వికటించడంతో తుదిశ్వాస విడిచింది. యువనటి భార్గవి కన్నుమూత.. అనుమానాస్పద రీతిలో కన్నుమూసిన మరో నటి 'భార్గవి'. అష్టాచెమ్మా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఊహించని విధంగా హత్యకు గురైంది. డిసెంబర్ 16న, 2008లో 23 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. గుంటూరు జిల్లా గోరంట్లలో జన్మించిన భార్గవి వైవీఎస్ చౌదరి చిత్రం దేవదాసుతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అంతకుముందు టీవీ సీరియల్స్‌లో పనిచేసింది ప్రత్యూష మృతి.. తెలుగులో రాయుడు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నటి ప్రత్యూష. భువనగిరికి చెందిన ప్రత్యూష తెలుగుతో పాటు తమిళంలోనూ నటించింది. చిన్న వయసులోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకొచ్చిన ప్రత్యూష చిన్న వయసులోనే 23 ఫిబ్రవరి 2002న 20 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. స్టార్ హీరోయిన్ సౌందర్య తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ సౌందర్య. కన్నడకు చెందిన ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే 2004 ఎన్నికల్లో భాజపా తరఫున ప్రచారానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. ఆమె మృతితో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సిల్క్ స్మిత సూసైడ్ అప్పట్లోనే వెండితెరను ఓ ఊపు ఊపేసిన నటి సిల్క్ స్మిత. ప్రత్యేక గీతాలతో తెలుగు సినిమాల్లో మెప్పించింది. అయితే వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సమస్యలతో చిన్న వయసులోనే సూసైడ్‌కు పాల్పడింది. ఏపీకి చెందిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి 23 సెప్టెంబర్ 1996లో 35 ఏళ్లకే కన్నుమూసింది. 19 ఏళ్లకే దివ్య భారతి ముంబైలో జన్మించిన దివ్య భారతి తెలుగు, హిందీ చిత్రాల్లో మెరిసింది. బొబ్బిలి రాజా సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత అత్యధిక పారితోషికం పొందిన హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. తన కెరీర్లో ఫిల్మ్ ఫేర్‌తో పాటు నంది అవార్డులను గెలుచుకుంది. కానీ ఊహించని విధంగా 19 ఏళ్ల వయసులోనే 5 ఏప్రిల్ 1993 కన్నుమూసింది. ఆమె మృతితో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఫటాఫట్ జయలక్ష్మి.. ఏపీకి చెందిన జయలక్ష్మి తెలుగు, తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో ఆమెకు ముద్దుగా ఫటాఫట్ జయలక్ష్మిగా అభిమానులు పిలిచేవారు. మలయాళ సినిమాల్లో ఆమెను సుప్రియ అని పిలిచేవారు. ఆమె తన కెరీర్ సాగిన పదేళ్లలోనే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 66 సినిమాల్లో నటించింది. అంతులేని కథ సినిమాలో ఫటాఫట్ అంటూ సంచలనం సృష్టించింది. కానీ అప్పట్లో ఓ బడా హీరో కుమారుడితో వివాదం కారణంగా కేవలం 22 ఏళ్లకే ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించింది. బాలీవుడ్ నటి జియా ఖాన్.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన నిశ్శబ్ద్ సినిమాతో బాలీవుడ్లో పాపులర్ అయిన హీరోయిన్ జియా ఖాన్. ఆ తర్వాత డిప్రెషన్ కారణంగా తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 1988లో అమెరికాలో జన్మించిన బ్యూటీ 25 ఏళ్ల వయసులోనే జూన్ 3,2013లో కన్నుమూసింది. తమ టాలెంట్‌లో కలల ప్రపంచంలోకి అడుగుపెట్టిన సినీ తారలు అర్ధాంతరంగా కెరీర్‌ను ముగించారు. అలా ఇచ్చి.. ఇలా వెళ్లిపోయి అభిమానులకు షాకిచ్చారు. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ కాలం కలిసిరాకపోవడంతో వెండితెరతో పాటు ఏకంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. చిన్న వయసులోనే స్టార్స్‌గా ఎదిగినా.. చివరికీ విషాదంతో తమ జీవితాలను ముగించారు. -
ఆ కేసులో రాజ్‌కుంద్రాకు ముందస్తు బెయిల్.. వారిద్దరికీ కూడా..!
పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఊరట లభించింది. రాజ్ కుంద్రాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రాజ్ కుంద్రా, పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాలకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అశ్లీల విడియోలు తీసి అప్ లోడ్ చేశానన్న నేరారోపణలతో వీరిపై కేసు నమోదైంది. దీంతో వారికి ఊరట లభించింది. గతంలోనూ రాజ్ కుంద్రా అరెస్ట్ కాకుండా సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. ఈ కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం నిందితులు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. ( ఇది చదవండి: Raj Kundra Case: ఈ కేసులో నన్ను బలి పశువుని చేశారు: కోర్టులో రాజ్‌కుంద్రా వాదన) ఈ కేసులో రాజ్ కుంద్రా జూలై 2021లో ఈ కేసులో అరెస్టయ్యాడు. ఏడాది తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనపై ఒక మహిళ ఆరోపణలు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేయగా.. ఎఫ్ఐఆర్లో షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండేలను సహ నిందితులుగా పేర్కొన్నారు. -
నా కుటుంబమే నన్ను ఇంట్లోంచి గెంటేసింది : నటి
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం 'లాకప్' అనే షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఈ షో రికార్డులు బద్దలు కొడుతుంది. పలు ఆసక్తికర , వివాదాస్పద అంశాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందీ షో. తాజాగా వివాదాస్పద నటి, మోడల్ పూనమ్ పాండే తన గతాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. సొంత కుటుంబమే తనని ఇంట్లోంచి గెంటేశారని ఎమోషనల్ అయ్యింది. '3-4ఏళ్ల క్రితం వరకు కుటుంబంతో కలిసి ఉండేదాన్ని. అయితే ఫ్యామిలీ మొత్తం ఎలాంటి కారణం లేకుండానే నన్ను ఇంట్లోంచి గెంటేశారు. ఏం జరిగిందో కూడా చెప్పలేదు. వాళ్లు నన్ను కేవలం డబ్బు సంపాదించే మోషీన్గానే భావించారు' అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. అంతేకాదు..ప్రతి ఒక్కరూ తన గురించి చెడుగా అనుకుంటున్నారని, అలా మాట్లాడే ముందు, తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటూ కన్నీటి పర్యంతమయ్యింది. ఇక పూనమ్ గతేడాది శామ్ బాంబే అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులకే తనను హింసిస్తున్నాడంటూ గృహహింస కేసు పెట్టింది. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) -
భర్త అరెస్ట్.. హాస్పిటల్లో నటి పూనమ్ పాండే
Poonam Pandeys Husband Sam Bombay Arrested: బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై భర్త సామ్ బాంబే అరెస్ట్ అయ్యాడు. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం..సామ్‌బాంబే తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడుతుండటంపై ఇద్దరికి వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో కోపంతో ఊగిపోయిన సామ్ బాంబే..పూనమ్‌ను జుట్టు పట్టుకొని తలను గోడకు కొట్టాడు. విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పూనమ్ ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలపాలైన పూనమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా రెండేళ్లు సహజీవనం అనంతరం గతేడాది సెప్టెంబర్1న పూనమ్-శామ్ బాంబే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శామ్ బాంబే.. పూనమ్‌పై చేయి చేసుకోవడంతో పాటు విచక్షణరహితంగా దాడి చేయడంతో ఆమె గృహహింస కేసు పెట్టింది.అనంతరం భర్త క్షమాపణలు చెప్పి రాజీకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి సామ్ బాంబే చేసిన దాడిలో పూనమ్ తీవ్ర గాయాలపాలైంది. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. 'ఇది మొదటి సారి జరిగింది కాదు. ప్రతిసారి సామ్ నన్ను కొట్టడం..ఆ తర్వాత ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో నేను కరిగిపోయేదాన్ని. ఈసారి మాత్రం నన్ను చావబాదాడు. దాదాపు సగం హత్య చేసినంత దారుణంగా హింసించాడు. దీని వల్ల ఎన్ని రోజులు నేను హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందో నాకే తెలియదు' అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. -
భర్తపై ప్రముఖ నటి ఫిర్యాదు, అరెస్ట్
పనాజీ : వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే నటి పూనం పాండే మరో వివాదంతో ముందుకొచ్చారు. తన భర్త తనను లైంగికంగా వేధిస్తున్నారని, బెదిరింపులకు గురిచేస్తున్నారని పూనం ఇచ్చిన ఫిర్యాదుపై ఆమె భర్త సామ్ బాంబేను గోవాలో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పూనం ప్రస్తుతం దక్షిణ గోవాలోని కనకోనా గ్రామంలో జరుగుతున్న షూటింగ్లో పాల్గొంటున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా ప్రేమిస్తున్న తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను ఈ నెల 1న పూనమ్ పాండే పెళ్లి చేసుకున్నారు. తన భర్త సాం బాంబే తనను వేధిస్తున్నారని, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారని పూనం పాండే సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారని, వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశామని కనకోనా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ తుకారాం చవాన్ చెప్పారు. కేసు నమోదు చేసి బాధితురాలిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. మోడల్ నుంచి నటిగా ఎదిగిన పూనం ఈనెల 10న తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మిస్టర్ అండ్ మిసెస్ బాంబే అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చిన పూనం ఇంతలోనే భర్తపై ఫిర్యాదు చేయడం, శాం బాంబేను పోలీసులు అరెస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఇక మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ 2013లో నాషాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. దీని కారణంగానే సోషల్ మీడియాలో మంచి ఇమేజ్ సంపాదించారు. జూలై 27న బాయ్‌ప్రెండ్ సామ్‌తో పూనమ్ నిశ్చితార్థం చేసుకున్నారు. చదవండి : ఏడడుగులు వేసిన వేళ -
పూనం బాయ్‌ఫ్రెండ్ ఇతనే..
సాక్షి, న్యూఢిల్లీ : బోల్డ్ వీడియోలు, చిత్రాలతో సంచలనం రేపే మోడల్, నటి పూనం పాండే ప్రేమలో మునిగితేలుతున్నట్టు వెల్లడించింది. తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా తాను ప్రేమించే వ్యక్తినీ ఆమె వెల్లడించారు. తాను అమితంగా ఇష్టపడే బాయ్‌ఫ్రెండ్ శామ్బాంబేతో ఈ జన్మదినం అత్యుత్తమమని అతనితో కలిసున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పూనం పాండే మార్చి 11న బర్త్‌డే వేడుకలు జరుపుకుంది. బర్త్‌డే పార్టీ ఫోటోనే ఆమె సోషల్ మీడియాలో ఉంచినట్టుగా తెలుస్తోంది. పూనం మదిదోచిన శామ్బాంబే బాలీవుడ్ దర్శక నిర్మాత కావడం గమనార్హం. అయితే ప్రియుడి పేరు మాత్రమే పేర్కొన్న పూనం అతని గురించిన వివరాలేమీ ప్రస్తావించలేదు. తన బాయ్‌ఫ్రెండ్ గురించి సోషల్ మీడియాలో ఆమె ప్రకటించడం ఇదే తొలిసారి. వివాదాస్పద ప్రకటనలు, వీడియోలు, ఫోటోలతో పూనం నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. -
ఒక్క పాటకు అరవై లక్షలు!
సంచలన వ్యాఖ్యలు చేసి, వివాదాలకు గురవ్వడం పూనమ్ పాండేకి అలవాటు. నిర్మొహమాటంగా మాట్లాడే పూనమ్ దుస్తుల విషయంలో కూడా ఎలాంటి మొహమాటాలు పాటించదు. చాలా పొదుపుగా వాడుతుంటుంది. ‘నషా’ చిత్రంలో ఎక్స్పోజింగ్ విషయంలో ఈ హాట్‌గాళ్ హద్దులు దాటేసింది. ఇప్పుడు దక్షిణాది తెరపై విజృంభించడానికి రెడీ అయ్యింది. కన్నడ చిత్రం ‘లవ్ ఈజ్ పాయిజన్’లో ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరించింది పూనమ్. మరో నాలుగైదు రోజుల్లో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ చిత్రీకరణకు పూనమ్ తీసుకుంటున్న పారితోషికం 60 లక్షలని సమాచారం. ఇప్పటికే శాండిల్‌వుడ్‌లో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యిందట. ఎందుకంటే, అక్కడ స్టార్ హీరోయిన్ తీసుకునే పారితోషికం అరకోటి లోపేనట. అలాంటిది ఒక్క పాటకు అరవై లక్షలా? అని చర్చించుకుంటున్నారని వినికిడి.