
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం 'లాకప్' అనే షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఈ షో రికార్డులు బద్దలు కొడుతుంది. పలు ఆసక్తికర , వివాదాస్పద అంశాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందీ షో. తాజాగా వివాదాస్పద నటి, మోడల్ పూనమ్ పాండే తన గతాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. సొంత కుటుంబమే తనని ఇంట్లోంచి గెంటేశారని ఎమోషనల్ అయ్యింది.
'3-4ఏళ్ల క్రితం వరకు కుటుంబంతో కలిసి ఉండేదాన్ని. అయితే ఫ్యామిలీ మొత్తం ఎలాంటి కారణం లేకుండానే నన్ను ఇంట్లోంచి గెంటేశారు. ఏం జరిగిందో కూడా చెప్పలేదు. వాళ్లు నన్ను కేవలం డబ్బు సంపాదించే మోషీన్‌గానే భావించారు' అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది.
అంతేకాదు..ప్రతి ఒక్కరూ తన గురించి చెడుగా అనుకుంటున్నారని, అలా మాట్లాడే ముందు, తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటూ కన్నీటి పర్యంతమయ్యింది. ఇక పూనమ్ గతేడాది శామ్ బాంబే అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులకే తనను హింసిస్తున్నాడంటూ గృహహింస కేసు పెట్టింది. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment