
సాక్షి, న్యూఢిల్లీ : బోల్డ్ వీడియోలు, చిత్రాలతో సంచలనం రేపే మోడల్, నటి పూనం పాండే ప్రేమలో మునిగితేలుతున్నట్టు వెల్లడించింది. తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా తాను ప్రేమించే వ్యక్తినీ ఆమె వెల్లడించారు. తాను అమితంగా ఇష్టపడే బాయ్‌ఫ్రెండ్ శామ్‌బాంబేతో ఈ జన్మదినం అత్యుత్తమమని అతనితో కలిసున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పూనం పాండే మార్చి 11న బర్త్‌డే వేడుకలు జరుపుకుంది. బర్త్‌డే పార్టీ ఫోటోనే ఆమె సోషల్ మీడియాలో ఉంచినట్టుగా తెలుస్తోంది.
పూనం మదిదోచిన శామ్‌బాంబే బాలీవుడ్ దర్శక నిర్మాత కావడం గమనార్హం. అయితే ప్రియుడి పేరు మాత్రమే పేర్కొన్న పూనం అతని గురించిన వివరాలేమీ ప్రస్తావించలేదు. తన బాయ్‌ఫ్రెండ్ గురించి సోషల్ మీడియాలో ఆమె ప్రకటించడం ఇదే తొలిసారి. వివాదాస్పద ప్రకటనలు, వీడియోలు, ఫోటోలతో పూనం నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment