ప్రియుడితో యానిమల్ బ్యూటీ చెట్టపట్టాల్.. నడిరోడ్డుపై..! | Bollywood actress Tripti Dimri Ride with Her Boy friend video viral | Sakshi
Sakshi News home page

Tripti Dimri: ప్రియుడితో యానిమల్ బ్యూటీ చక్కర్లు.. నడిరోడ్డుపై దొరికేసింది!

Published Thu, Feb 20 2025 6:34 PM | Last Updated on Thu, Feb 20 2025 6:44 PM

Bollywood actress Tripti Dimri Ride with Her Boy friend video viral

యానిమల్‌ మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ(Tripti Dimri). ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ ప్రియురాలి పాత్రలో అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాకుండా తన గ్లామర్‌తో కుర్రకారుకు పిచ్చెక్కించింది ముద్దుగుమ్మ. యానిమల్ తర్వాత ఈ బాలీవుడ్ భామకు ఒక్కసారిగా అవకాశాలు క్యూ కట్టాయి. పలు స్టార్ హీరోల సరసన వరుస చిత్రాల్లో నటించింది. ఈ సినిమా తర్వాత గతేడాది బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా-3, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ధడక్-2 చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది సరసన కనిపించనుంది.

ఇదిలా ఉంటే త్రిప్తి డిమ్రీ డేటింగ్‌లో ఉన్నట్లు చాలాసార్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తూనే ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన సామ్ మర్చంట్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందని తెలిసింది. ఇటీవల అతని బర్త్‌ డే సందర్భంగా తన ఇన్‌స్టాలో ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్‌డే సామ్ మర్చంట్, మీకు అందరి ప్రేమ, ఆనందాన్ని దక్కాలని కోరుకుంటున్నా " అని రాసుకొచ్చింది. ఈ విధంగా తన ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

అయితే తాజాగా మరోసారి తన బాయ్‌ఫ్రెండ్‌ సామ్ మర్చంట్‌తో కలిసి జంటగా కనిపించింది. వీరిద్దరు బైక్‌పై వెళ్తుండగా వీడియో తీసిన నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉందని నిజమేనంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఆ రూమర్స్ నిజమేనంటూ పోస్టులు పెడుతున్నారు.  అయితే తమ రిలేషన్‌పై వీరిద్దరు ఇప్పటివరకు స్పందించలేదు. పోనీ అలా వాటిని ఖండించలేదు కూడా. అందుకే ఈ తాజా వీడియో చూస్తే ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారని అర్థమవుతోంది.

(ఇది చదవండి: వ్యాపారవేత్తతో యానిమల్ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!)

సామ్ మర్చంట్ ఎవరంటే?

వాస్తవానికి సామ్ మర్చంట్ హోటల్ వ్యాపారం చేస్తున్నారు. హాస్పిటాలిటీ పరిశ్రమలోకి రాకముందు అతను మోడల్‌గా రాణించాడు. ఆ తర్వాత అతను గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్‌లు, హోటళ్ల బిజినెస్‌లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను వ్యాపారం చేయడంతో పాటు ట్రావెల్ బ్లాగర్‌గా రాణిస్తున్నారు. ఇక త్రిప్తి డిమ్రీ విషయానికొస్తే.. ఆమె చివరిగా భూల్ భూలయ్యా -3లో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి కనిపించింది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్  నటించిన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆమె తర్వాత షాహిద్ కపూర్‌తో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించబోయే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement