
యానిమల్ మూవీతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ తృప్తి డిమ్రీ. రణ్‌బీర్ కపూర్ ప్రియురాలిగా ఈ సినిమాలో అలరించింది. తృప్తి గ్లామర్‌కు ఆడియన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. ఈ మూవీ తర్వాత ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్స్ కొట్టేసింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ భామ ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆమెపై ఆరోపణలొచ్చాయి. ఈవెంట్‌కు వచ్చేందుకు వారి నుంచి దాదాపు రూ.5.5 లక్షలు తీసుకుందని నిర్వాహకులు చెబుతున్నారు.
తాజాగా తృప్తి డిమ్రీపై వస్తున్న ఆరోపణలపై ఆమె టీమ్ స్పందించింది. ఆమె కేవలం షెడ్యూల్ ప్రకారమే ఈవెంట్స్‌కు హాజరవుతారని వెల్లడించింది. సినిమా ప్రమోషన్స్ మినహాయించి వ్యక్తిగతంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదని తెలిపింది. ఎలాంటి కార్యక్రమాలకు డబ్బులు తీసుకోవడం, చెల్లింపులను ఆమోదించడం లాంటిది జరగలేదని స్పష్టం చేసింది. ఆమె ప్రస్తుతం తన రాబోయే చిత్రం విక్కీ విద్య కా వో వాలా వీడియో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారని ఒక స్టేట్‌మెంట్ కూడా రిలీజ్ చేసింది.

కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే తృప్తి చివరిసారిగా బ్యాడ్ న్యూజ్‌లో కనిపించింది. ప్రస్తుతం విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత భూల్ భూలయ్యా-3, ధడక్-2 లో నటించనుంది.
అసలేం జరిగిందంటే..?
జైపుర్‌కి చెందిన మహిళా వ్యాపారవేత్తలు ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ఇది జరిగింది. అయితే ఈవెంట్‌కు హాజరవుతానని చెప్పి తృప్తి డిమ్రీ రూ.5.5 లక్షలు తీసుకుంది. ఈవెంట్ మొదలవడానికి ఐదు నిమిషాల ముందు వరకు వచ్చేస్తానని చెప్పిందట. తీరా రాకపోయేసరికి నిర్వాహకులు, మహిళ వ్యాపారవేత్తలు తృప్తిపై నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఫొటోపై నల్లని పెయింట్ రాశారు. ఈక్రమంలోనే ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది.
Muh Kaal Karo 😱 #TriptiDimri skips event after taking 5 Lacs; Women group blackened her poster #MovieTalkies pic.twitter.com/45spP3LrMa
— $@M (@SAMTHEBESTEST_) October 1, 2024