Tripti Dimri
-
ప్రియుడితో యానిమల్ బ్యూటీ చెట్టపట్టాల్.. నడిరోడ్డుపై..!
యానిమల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ(Tripti Dimri). ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ ప్రియురాలి పాత్రలో అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాకుండా తన గ్లామర్‌తో కుర్రకారుకు పిచ్చెక్కించింది ముద్దుగుమ్మ. యానిమల్ తర్వాత ఈ బాలీవుడ్ భామకు ఒక్కసారిగా అవకాశాలు క్యూ కట్టాయి. పలు స్టార్ హీరోల సరసన వరుస చిత్రాల్లో నటించింది. ఈ సినిమా తర్వాత గతేడాది బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా-3, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ధడక్-2 చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది సరసన కనిపించనుంది.ఇదిలా ఉంటే త్రిప్తి డిమ్రీ డేటింగ్లో ఉన్నట్లు చాలాసార్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తూనే ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన సామ్ మర్చంట్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందని తెలిసింది. ఇటీవల అతని బర్త్ డే సందర్భంగా తన ఇన్‌స్టాలో ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్‌డే సామ్ మర్చంట్, మీకు అందరి ప్రేమ, ఆనందాన్ని దక్కాలని కోరుకుంటున్నా " అని రాసుకొచ్చింది. ఈ విధంగా తన ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.అయితే తాజాగా మరోసారి తన బాయ్‌ఫ్రెండ్ సామ్ మర్చంట్‌తో కలిసి జంటగా కనిపించింది. వీరిద్దరు బైక్‌పై వెళ్తుండగా వీడియో తీసిన నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉందని నిజమేనంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఆ రూమర్స్ నిజమేనంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే తమ రిలేషన్‌పై వీరిద్దరు ఇప్పటివరకు స్పందించలేదు. పోనీ అలా వాటిని ఖండించలేదు కూడా. అందుకే ఈ తాజా వీడియో చూస్తే ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారని అర్థమవుతోంది.(ఇది చదవండి: వ్యాపారవేత్తతో యానిమల్ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!)సామ్ మర్చంట్ ఎవరంటే?వాస్తవానికి సామ్ మర్చంట్ హోటల్ వ్యాపారం చేస్తున్నారు. హాస్పిటాలిటీ పరిశ్రమలోకి రాకముందు అతను మోడల్‌గా రాణించాడు. ఆ తర్వాత అతను గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్‌లు, హోటళ్ల బిజినెస్‌లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను వ్యాపారం చేయడంతో పాటు ట్రావెల్ బ్లాగర్‌గా రాణిస్తున్నారు. ఇక త్రిప్తి డిమ్రీ విషయానికొస్తే.. ఆమె చివరిగా భూల్ భూలయ్యా -3లో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి కనిపించింది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆమె తర్వాత షాహిద్ కపూర్‌తో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించబోయే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. #TriptiiDimri was seen on a bike with rumoured beau #SamMerchant.🫶🏻#FilmfareLens pic.twitter.com/FvH0s70F7Z— Filmfare (@filmfare) February 19, 2025 -
చంద్రకాంత రంగు చీరలో..మురిపిస్తున్న ట్రెండింగ్ గర్ల్ ఫోటోస్
-
భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న యానిమల్ బ్యూటీ.. డైరెక్టర్ ఏమన్నారంటే?
యానిమల్ మూవీతో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో ఫేమస్ అయింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీ తర్వాత త్రిప్తి డిమ్రికి ఆఫర్లు వెతక్కుంటూ వచ్చాయి. బాలీవుడ్లో వరుసగా సినిమాలతో అలరించింది ముద్దుగుమ్మ.అయితే ఇటీవల త్రిప్తి డిమ్రీ రొమాంటిక్ హిట్ సిరీస్ ఆషికి-3లో ఆఫర్ కూడా దక్కించుకుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. కానీ ఊహించని విధంగా ఆమె ఈ ప్రాజెక్ట్ తప్పుకుంది. దీంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వదంతులు మొదలయ్యాయి. ఆమెకున్న బోల్డ్ ఇమేజ్ వల్లే నిర్మాతలు త్రిప్తి ఎంపికపై నిర్ణయాన్ని మార్చుకున్నారని ఊహగానాలొచ్చాయి.తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి త్రిప్తి డిమ్రీ తప్పుకోవడంపై ఈ మూవీ డైరెక్టర్ అనురాగ్ బసు స్పందించారు. ఆమె ఎందుకు తప్పుకుందో తననే అడగాలని అన్నారు. నా సినిమాలో చేయకపోయినా ఎప్పటికీ తను నా బెస్ట్ ఫ్రెండ్ అని.. నటిగా ఆమె అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం తేదీలే సమస్య అయి ఉండవచ్చని అన్నారు. ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నామని.. త్రిప్తి ప్రస్తుతం దర్శకుడు విశాల్ భరద్వాజ్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మా సినిమాకు టైటిల్ పేరేంటో నాకు తెలియదు.. మేము హీరోయిన్ను ఇంకా ఖరారు చేయలేదని.. వారం రోజుల్లో ప్రకటిస్తామని అనురాగ్ బసు పేర్కొన్నారు. కాగా.. అనురాగ్ బసు బాలీవుడ్లో గ్యాంగ్‌స్టర్, బర్ఫీ, లైఫ్ ఇన్ ఎ మెట్రో చిత్రాలకు ఫేమస్ అయ్యారు. -
వ్యాపారవేత్తతో యానిమల్ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!
యానిమల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరెకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించారు. అతని సరసన పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించింది. 2023లో వచ్చిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉండగా.. గతేడాది బ్యాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో కనిపించిన త్రిప్తి డిమ్రీ ప్రస్తుతం ధడక్-2లో నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది సరసన కనిపించనుంది. ఇదిలా ఉండగా యానిమల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ తన ఇన్‌స్టాలో స్టోరీస్ బర్త్ డే విషెల్ చెబుతూ పోస్ట్ చేసింది. "హ్యాపీ బర్త్‌డే సామ్ మర్చంట్, మీకు అందరి ప్రేమ, ఆనందాన్ని దక్కాలని కోరుకుంటున్నా " అని రాసుకొచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త సామ్ మర్చంట్‌కు ఇన్‌స్టా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అతనితో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు త్రిప్తి డేటింగ్లో ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల కొంతకాలంగా సామ్ మర్చంట్, త్రిప్తి డిమ్రీ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇవాళ అతని బర్త్ డే రోజును విష్ చేయడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా నోరు విప్పలేదు.సామ్ మర్చంట్ ఎవరంటే?వాస్తవానికి సామ్ మర్చంట్ హోటల్ వ్యాపారం చేస్తున్నారు. హాస్పిటాలిటీ పరిశ్రమలోకి రాకముందు అతను మోడల్‌గా రాణించాడు. ఆ తర్వాత అతను గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్‌లు, హోటళ్ల బిజినెస్‌లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను వ్యాపారం చేయడంతో పాటు ట్రావెల్ బ్లాగర్‌గా రాణిస్తున్నారు.ఇక త్రిప్తి డిమ్రీ విషయానికొస్తే.. ఆమె చివరిగా భూల్ భూలయ్యా -3లో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి కనిపించింది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆమె తర్వాత షాహిద్ కపూర్‌తో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించబోయే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. -
హిట్ సినిమా సీక్వెల్లో మాజీ సీఎం మనవరాలికి ఛాన్స్
బాలీవుడ్లో ‘ఆషికీ’ మూవీ ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఉంది. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘ఆషికీ, ఆషికీ 2’ చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ రెండు సినిమాలను టీ సిరీస్, వినేష్ ఫిల్మ్స్ నిర్మించాయి. హిట్ ఫ్రాంచైజీ కావడంతో ‘ఆషికీ 3’ని కూడా మేకర్స్ ప్రకటించారు. అయితే ‘ఆషికీ 3’ని 2022లో అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ ఏడాదిలో సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా, దర్శకుడిగా అనురాగ్ బసును అనుకుంటున్నారట మేకర్స్.తృప్తి డిమ్రికి చెక్కానీ ఇప్పుడు టీ సిరీస్–వినేష్ ఫిల్మ్స్ ప్రతినిధుల మధ్యలో ‘ఆషికీ 3’ గురించి విభేదాలు తలెత్తాయని టాక్. దీంతో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి మరికొంత సమయం పడుతుందని బాలీవుడ్లో ప్రచారమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్గా త్రిప్తీ దిమ్రీ (Tripti Dimri)ని కూడా తప్పించారని సమాచారం. ఈ ప్లేస్‌ను బాలీవుడ్ యంగ్ బ్యూటీ శార్వరీ (Sharvari) భర్తీ చేశారని భోగట్టా. తృప్తి డిమ్రిని తప్పించడానికి ప్రధాన కారణం తను యానిమల్ సినిమాలో బోల్డ్, ఇంటిమేట్ సీన్లలో నటించిడమేనని తెలుస్తోంది. దీంతో ఆషికి-3లో హీరోయిన్ పాత్రకు ఆమె సెట్ కాదని మేకర్స్ అభిప్రాయపడ్డారట. ఆ ఛాన్స్ ఇప్పుడు యంగ్ బ్యూటీ శార్వరీకి దక్కింది. ఆమె ఇప్పటి వరకు బాజీరావ్ మస్తానీ,ముంజ్యా,మహారాజ్,వేద వంటి మరో రెండు సినిమాలు మాత్రమే చేసింది. మాజీ ముఖ్యమంత్రి మనవరాలికి ఛాన్స్పదేళ్లుగా ఆమె ఇండస్ట్రీలో ఉన్నా పెద్దగా మెప్పించింది లేదు. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా మూడు సినిమాలకు పనిచేశారు. ఇంతకీ శార్వరీ ఎవరో తెలుస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆమె మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోకసభ స్పీకర్ మనోహర్ జోషి సొంత మనవరాలు. నేటి రాజకీయ నాయకుల కుటుంబాల నుంచి హీరోయిన్లుగా నటించేందుకు పెద్దగా ఎవరూ రారు. కానీ, శార్వరీ మాత్రం గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమలోనే కొనసాగడం విశేషం. ‘ఆషికీ 3’లో శార్వరీ భాగం అయ్యారా? ఈ సినిమా ఈ ఏడాదే సెట్స్‌కు వెళ్తుందా? అనే విష యాలపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి ఉండాల్సిందే. ఈ ప్రాజెక్టు కోసం కార్తిక్ ఆర్యన్ సరసన నటించడానికి కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, రష్మిక మందన్న, ఆకాంక్ష శర్మ లాంటి హీరోయిన్ల పేర్లను మేకర్స్ పరిశీలించారు. కానీ ఆయనతో ఇంతకు ముందు కలిసి పనిచేయని సరికొత్త నటి కోసం వెతుకున్న సమయంలో శార్వరీ పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అయితే, చివర వరకు రేసులో ఆకాంక్ష పేరు కూడు ఉందని తెలుస్తోంది.12వ ముఖ్యమంత్రిగా మనోహర్ జోషిమహారాష్ట్రకు 12వ ముఖ్యమంత్రిగా మనోహర్ జోషి పనిచేశారు. గతేడాదిలో ఆయన మరణించారు. శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్ జోషి 1995 నుంచి 1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్‌సభ స్పీకర్‌గానూ వ్యవహరించారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో నమ్రత కుమార్తెనే ఈ శార్వరీ. View this post on Instagram A post shared by Sharvari 🐯 (@sharvari) -
ఓటీటీలో భయపెడుతూ నవ్వించే సినిమా
సాధారణంగా సినిమాలలో ఓ రెండింటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకటి హ్యూమర్ అయితే మరొకటి హారర్ జోనర్. కానీ ఆ రెండూ కలిపి సినిమా తీస్తే అదే ఈ సినిమా ‘భూల్ భులయ్యా 3’(Bhool Bhulaiyaa 3). ఇది ‘భూల్ భులయ్యా’ సిరీస్‌లో వచ్చిన మూడవ సినిమా. నిజానికి మొదటి భాగానికి, మిగతా రెండు భాగాలకి కథతో పాటు పాత్రధారులలో కూడా తేడా ఉంది. ‘భూల్ భులయ్యా’ మొదటి భాగం ‘చంద్రముఖి’ సినిమా ఆధారంగా తీసింది. కానీ మిగతా రెండు భాగాలను మాత్రం అదే థీమ్‌తో కాస్త విభిన్నంగా రూపొందించారు. ఇప్పుడు ‘భూల్ భులయ్యా 3’ సినిమా కథ విషయానికి వస్తే... 200 సంవత్సరాల క్రితం రక్తఘాట్ రాజ్యంలో జరిగిన కథ. అప్పటి రాజ కుటుంబం వల్ల జరిగిన సంఘటనలో మంజులిక అనే ఓ దెయ్యం కనిపిస్తుంది. ఈ దెయ్యాన్ని అదే రాజ్యంలోని అంతఃపుర గదిలో భద్రంగా బందిస్తారు ఆ రాజ్యానికి చెందిన రాజగురువు. 2024లో వారసత్వ సంపదగా ఆ అంతఃపురాన్ని ఓ హోటల్‌గా మార్చాలని రాజకుటుంబం వారసులు ప్రయత్నించగా బందీగా ఉన్న మంజులిక దెయ్యం బయటపడి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ విషయం చూసే ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిస్తుంది. ఈ మంజులికను కట్టడి చేయడానికి ఫేక్ మాంత్రికుడైన రూహాన్ను ఆ రాజ్యానికి తెప్పించుకుంటారు. రూహాన్ రక్తఘాట్కు వచ్చినప్పటి నుండి కథ అనేక మలుపులు తిరగుతూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. అందులో మొదటగా హీరో రోల్ వేసిన కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan)... తన ఈజ్ ఆఫ్ యాక్టింగ్‌తో హారర్ ఎమోషన్ని కూడా హ్యూమర్ ఎమోషన్‌తో చక్కగా పలికించాడు. ఇక విశేష పాత్రలలో నటించిన నాటి తార మాధురీ దీక్షిత్(Madhuri Dixit), నేటి వర్ధమాన తార విద్యాబాలన్(Vidya Balan) వారి నటనతోనే కాదు అద్భుత నాట్యంతోనూ సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. దర్శకుడు అనీస్ ఈ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా ఓ పక్క భయపెడుతూ మరో పక్క గిలిగింతలు పెడుతూ ప్రేక్షకులను కదలనివ్వకుండా స్క్రీన్‌ప్లే నడిపించాాడు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ ‘భూల్ భులయ్యా 3’ వీకెండ్ వాచబుల్ మూవీ. – ఇంటూరు హరికృష్ణ -
మెరిసిపోతున్న సితార ఘట్టమనేని.. అక్కినేని కోడలు శోభిత న్యూ లుక్..!
సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ స్టన్నింగ్ లుక్..అక్కినేని కోడలు శోభిత న్యూ హెయిల్ స్టైల్..ధగధగ మెరిసిపోతున్న సితార ఘట్టమనేని..మంచు లక్ష్మి లేటేస్ట్ పిక్స్..థాయ్‌లాండ్‌లో చిల్ అవుతోన్న ఆలియా భట్..ఎల్లో డ్రెస్‌లో నా సామిరంగ హీరోయిన్..ఫోటో షూట్లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
ఓటీటీలో 'హారర్ థ్రిల్లింగ్' సినిమా స్ట్రీమింగ్
బాలీవుడ్లో సూపర్ హిట్ ఫ్రాంఛైజీ భూల్ భులయ్యా నుంచి విడుదలైన మూడో సినిమా 'భూల్ భులయ్యా 3'. హారర్, కామెడీ, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. కార్తీక్ ఆర్యన్, తృప్తి డిమ్రి,విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ మూవీ నవంబర్ 1న విడుదలైంది. అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.భూల్ భూలయ్యా 3 ప్రాజెక్ట్‌లోకి విద్యాబాలన్ రీఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో థియేటర్స్‌లలో చూడని వారు తమ ఇంట్లోనే చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. అందుకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భూల్ భూలయ్యా 3 ఓటీటీ ప్రకటన విషయాలను పలు వీడియోలతో నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే షేర్ చేసిన విషయం తెలిసిందే.రూహ్ బాబా పాత్ర పోషించిన కార్తీక్ ఆర్యన్‌పై అభిమానులు ప్రశంసలు కురిపించారు. హారర్ కామెడీ జానర్లో 2024లో విడుదులై హిట్ కొట్టిన సినిమాల జాబితాలో భూల్ భూలయ్యా 3 టాప్‌లో ఉంటుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు విజువల్ వండర్లా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఊహకు కూడా అందవని చెప్పవచ్చు. హీరో ఎంట్రీ సాంగ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. సుమారు 1000 మంది డ్యాన్సర్లతో తెరకెక్కిన ఎంట్రీ సాంగ్ సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. సుమారు రూ. 150 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 450 కోట్లు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. -
christmas2024 ప్రియుడితో యానిమల్ బ్యూటీ చెట్టాపట్టాల్ (ఫొటోలు)
-
బాలీవుడ్ ఎంట్రీ
ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. హిందీలో ‘జబ్ వియ్ మెట్, లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, హైవే’ వంటి సినిమాలను తీసిన ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించనున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా నటించనున్నారు. కాగా ఈ సినిమాకు ‘ఇడియట్స్ ఆఫ్ ఇస్తాంబుల్’అనే టైటిల్‌ను మేకర్స్ అనుకుంటున్నారని బాలీవుడ్ టాక్.అంతేకాదు.. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలుకానుందని, వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఇంతియాజ్ అలీ సన్నాహాలు చేస్తున్నారట. మలయాళ నటుడిగా ఫాహద్ ఫాజిల్ హిందీ ప్రేక్షకులకు తెలుసు. అయితే ‘పుష్ప’ ఫ్రాంచైజీ సినిమాతో ఫాహద్ క్రేజ్ బాగా పెరిగింది. మరి.. ఆయన హిందీలో చేయబోయే తొలి సినిమా ఎలా ఉండ బోతుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. -
మరింత హాట్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. ఫోటోలు
-
సమంతను దాటేసిన శోభిత ధూళిపాళ్ల.. టాప్ ర్యాంక్‌లో ఎవరంటే?
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఈ ఏడాది సినీతారల ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. 2024లో మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఊహించని విధంగా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. సందీప్ రెడ్డి వంగా తర్వాత వరుసగా బాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ భూలయ్యా -3 సినిమాల్లో నటించింది. దీంతో దీపికా పదుకొణె, షారూఖ్ ఖాన్ లాంటి స్టార్స్‌ను అధిగమించింది.ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ప్రభాస్, సమంత, శోభిత ధూళిపాళ్ల మాత్రమే చోటు దక్కించుకున్నారు. శోభిత టాప్-5లో నిలవగా.. సమంత 8, ప్రభాస్ పదోస్థానంలో నిలిచారు. ఈ ఏడాది కల్కి మూవీతో అలరించిన దీపికా పదుకొణె రెండో స్థానంతో సరిపెట్టుకుంది. టాప్ ప్లేస్ దక్కడం పట్ల త్రిప్తిడ డిమ్రీ ఆనందం వ్యక్తం చేసింది. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవమని.. నా అభిమానుల మద్దతు వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది.కాగా.. ఏడాది నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ది పర్ఫెక్ట్ కపుల్లో నటించిన ఇషాన్ ఖట్టర్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అక్కినేని వారి కోడలు శోభిత ధూళిపాళ్ల ఐదోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మంకీ మ్యాన్ మూవీతో శోభిత అలరించారు. ఆ తర్వాత వరుసగా శార్వరి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, సమంత, అలియా భట్, ప్రభాస్ నిలిచారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ స్టార్స్- ఐఎండీబీ -2024ట్రిప్తి డిమ్రీదీపికా పదుకొణెఇషాన్ ఖట్టర్షారుఖ్ ఖాన్శోభితా ధూళిపాళ్లశార్వరిఐశ్వర్యరాయ్ బచ్చన్సమంతఅలియా భట్ప్రభాస్ -
బిగ్‌బాస్ దివి బైక్ రైడ్.. శోభిత మంగళస్నాన వేడుకలో సమంత సందడి!
బిగ్‌బాస్ బ్యూటీ దివి బైక్ రైడ్..ముంబయిలో మెరిసిన మహేశ్ బాబు కూతురు సితార..శోభిత మంగళస్నానం వేడుకలో సోదరి సమంత సందడి...కూతురితో సండే చిల్ అవుతోన్న ప్రణీత సుభాష్..కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి స్మైలీ లుక్స్..యానిమల్ రోజులను గుర్తు చేసుకున్న త్రిప్తి డిమ్రీ.. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Samanta Dhulipala (@dr.samantad) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
బ్లాక్ డ్రెస్‌లో యానిమల్ బ్యూటీ.. మతి పొగోట్టేస్తోందిగా!
-
రెడ్ హాట్ చాక్లెట్లా తృప్తి దిమ్రి.. మరీ ఇంత అందమా? (ఫొటోలు)
-
ఎంత ఘోరంగా స్టెప్పులేసిందో! డ్యాన్స్ క్లాసులకు వెళ్లాల్సింది: ఉర్ఫీ
చిత్రవిచిత్ర వేషధారణతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది ఉర్ఫీ జావెద్. ఈ బుల్లితెర నటి ఇటీవలే ఫాలో కర్లో యార్ అనే సిరీస్‌లో మెరిసింది. ఇందులో ఉర్ఫీ పడ్డ కష్టాలను, తన జర్నీని, సోషల్ మీడియా సెన్సేషన్‌గా ఎలా ఎదిగిందన్నదీ చూపించారు.ఆ స్టెప్పయితే ఘోరంఇకపోతే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఉర్ఫీ జావెద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ తృప్తి డిమ్రికి డ్యాన్స్ రాదనేసింది. ఉర్ఫీ మాట్లాడుతూ.. తృప్తి మంచి నటి.. అందులో సందేహమే లేదు. కానీ డ్యాన్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం తను చాలా వీక్. ఎందుకు తృప్తి ఇలా చేశావ్? మేరే మెహబూబ్ పాటలో ఆ ఫ్లోర్ స్టెప్పయితే అస్సలు బాగోలేదు. నువ్వు డ్యాన్స్ క్లాసులకు వెళ్లి ఉండాల్సింది అని విమర్శించింది. నిజమే..ఈ కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉర్ఫీ చెప్తోంది నిజమే.. నాకు తృప్తి అంటే చాలా ఇష్టం. కానీ ఆమెకు సరిగా డ్యాన్స్ చేయరాదు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఆమె నటి.. డ్యాన్సర్ కాదు, మరొకరి గురించి చెప్పేముందు నువ్వు సరిగ్గా దుస్తులు ధరించడం నేర్చుకో అని కౌంటర్లు ఇస్తున్నారు.సినిమాకాగా యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన తృప్తి డిమ్రి గత నెలలో 'విక్కీ విద్యాకో వో వాలా వీడియో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రాజ్ కుమార్ రావు హీరోగా నటించాడు. ఈ మూవీలోని మేరే మెహబూబ్ పాటలో రాజ్ కుమార్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌కు మంచి మార్కులు పడగా.. తృప్తి వేసిన స్టెప్పులకుగానూ ట్రోలింగ్‌కు గురైంది.చదవండి: Vijay Devarakonda: కిందపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్! -
ఎర్రచీరలో 'యానిమల్' బ్యూటీ.. చూపు తిప్పగలరా? (ఫొటోలు)
-
కన్ను కొట్టిన బుట్టబొమ్మ... ఫ్లవర్ డిజైన్ చీరలో తృప్తి!
ప్రకృతి ఒడిలో పూజా హెగ్డే పుట్టినరోజు వేడుకలుచీరలో అందాలన్నీ చూపించేస్తున్న తృప్తి దిమ్రిహాట్ బ్యూటీ ఆయేషా ఖాన్ చుడీదార్ లుక్గ్లామర్తో చంపేసేలా సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్గర్ల్స్ నైట్ అవుట్లో నిహారిక-వితిక షేరు-మహాతల్లిఎక్స్ప్రెషన్స్తో నవ్వించేస్తున్న కావ్య కల్యాణ్ రామ్జీన్ షర్ట్‌లో వయ్యారంగా చూస్తున్న పూజిత పొన్నాడ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Shweta Tiwari (@shweta.tiwari) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Meghaa Shetty (@meghashetty_officiall) View this post on Instagram A post shared by Asmita Sood (@asmita_s) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit) View this post on Instagram A post shared by KiKo (@kiaankokken) View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Samyuktha Viola Viswanathan (@samyukthaviswanathan) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Parul Gulati 🤍 (@gulati06) View this post on Instagram A post shared by Rathika RavindeR (@rathikaravinder) -
చీరలో తృప్తి దిమ్రి గ్లామర్ ట్రీట్.. గోల్డెన్ అవర్‌లో అలా (ఫొటోలు)
-
బ్లాక్ శారీలో త్రిప్తి డిమ్రీ.. దుర్గామాత పూజలో శ్రద్ధాదాస్
దుర్గామాత పూజలో హీరోయిన్ శ్రద్దాదాస్ బ్లాక్ శారీలో యానిమల్ బ్యూటీ హోయలు.. స్టన్నింగ్ అవుట్ ఫిట్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. శారీలో కీర్తి సురేశ్ అందాలు.. బతుకమ్మ సంబురాల్లో అనన్య నాగళ్ల.. View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
యానిమల్ రిలీజ్ తర్వాత మూడు రోజులు ఏడ్చా: తృప్తి
సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలపై ట్రోలింగ్ చాలా ఎక్కువైపోయింది. లుక్ బాలేకున్నా, సినిమాలో పాత్ర అటూఇటుగా ఉన్నా, ఏం చేసినా, చేయకపోయినా సరే నోరు పారేసుకుంటున్నారు. అలా యానిమల్ మూవీలోని తన పాత్ర వల్ల చాలామంది ట్రోల్ చేశారంటోంది హీరోయిన్ తృప్తి డిమ్రి.ట్రోలింగ్ అంటేనే తెలీదుతాజాగా ఓ ఇంటర్వ్యూలో తృప్తి డిమ్రి మాట్లాడుతూ.. 'యానిమల్ సినిమాకు ముందు విమర్శలనేవే తెలియదు. కానీ ఈ సినిమా వచ్చాక చాలా ట్రోల్ చేశారు. మెయిన్ స్ట్రీమ్‌లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. బుల్బుల్, కాలా సినిమాల సమయంలో ఎవరూ విమర్శించలేదు. ఏ పోస్ట్ కింద చూసినా మంచి కామెంట్లే ఉండేవి. ఓపక్క అలా.. మరోపక్క ఇలా..కానీ యానిమల్ సినిమాకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. కామెంట్లు చూస్తే పిచ్చెక్కిపోయింది. నేను నా డ్యూటీ చేశాను. ఏ తప్పు చేశానని ఇలా తిడుతున్నారని బాధపడ్డాను. ఇంత నెగెటివిటీ ఎందుకు చూపిస్తున్నారో అసలు అర్థం కాలేదు. ఓపక్క సగంమంది నన్ను మెచ్చుకుంటున్నారు. మరో పక్క మిగతా సగం మంది నన్ను కిందకు లాగడానికి ప్రయత్నిస్తున్నారు.చాలా ఏడ్చా..యానిమల్ రిలీజయ్యాక రెండుమూడురోజులపాటు చాలా ఏడ్చాను. ఇంత ట్రోలింగ్ ఉంటుందని ఊహించలేదు. నేను చాలా సెన్సిటివ్. ఎవరితోనైనా ఫైట్ చేయాల్సి వస్తే నా గదిలోకి వెళ్లి తాళం వేసుకుంటాను. అలాంటిదాన్ని. ఆ సమయంలో విపరీతమైన ట్రోల్స్ చూశాక వర్క్‌పై కూడా శ్రద్ధ పెట్టలేకపోయాను' అని చెప్పుకొచ్చింది.కాగా తృప్తి.. మామ్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. లైలా మజ్ను, బుల్బుల్, కాలా చిత్రాల్లో నటించింది. యానిమల్ మూవీతో నేషనల్ క్రష్‌గా మారింది. ఈ బ్యూటీ ఇటీవలే బ్యాడ్ న్యూస్ సినిమాలో నటించింది.చదవండి: దమ్ములాగిన విష్ణు.. సోనియా చెప్పింది ఈమె గురించేనా? -
అనసూయ వయ్యారాలు.. తెల్ల చీరలో దేవకన్యలా కేతిక!
తెల్ల చీరలో కేతిక శర్మ అందాల విందుచిట్టి పొట్టి దుస్తుల్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్దుబాయిలో చిల్ అవుతున్న బిగ్‌బాస్ అరియానాబ్లాక్ శారీలో గ్లామర్‌తో కేక పుట్టిస్తున్న మీనాక్షి చౌదరిడిఫరెంట్ హెయిర్ స్టైల్లో అనసూయ ఆహా పోజులుబిగ్బాస్ 8 నైనిక గ్లామర్ ట్రీట్.. ఒక్కసారిగా ఛేంజ్'యానిమల్' బ్యూటీ తృప్తి దిమ్రి.. గ్లామరస్ లుక్హీరోయిన్ కీర్తి సురేశ్ ట్రెండీ లుక్స్.. వావ్ అనాల్సిందే View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nainika Anasuru🦋 (@_.nainikadances) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Sujatha P (@jordarsujatha) View this post on Instagram A post shared by Nyla Usha (@nyla_usha) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by K sow (@saarya_laxman) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Meera Nandhaa (@nandan_meera) View this post on Instagram A post shared by Ashi Singh (@i_ashisinghh) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Aarna ☀️ (@aarnavohra7) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
యానిమల్ బ్యూటీపై ఆరోపణలు.. ఆమె టీమ్ ఏమన్నారంటే?
యానిమల్ మూవీతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ తృప్తి డిమ్రీ. రణ్‌బీర్ కపూర్ ప్రియురాలిగా ఈ సినిమాలో అలరించింది. తృప్తి గ్లామర్‌కు ఆడియన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. ఈ మూవీ తర్వాత ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్స్ కొట్టేసింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ భామ ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆమెపై ఆరోపణలొచ్చాయి. ఈవెంట్‌కు వచ్చేందుకు వారి నుంచి దాదాపు రూ.5.5 లక్షలు తీసుకుందని నిర్వాహకులు చెబుతున్నారు.తాజాగా తృప్తి డిమ్రీపై వస్తున్న ఆరోపణలపై ఆమె టీమ్ స్పందించింది. ఆమె కేవలం షెడ్యూల్ ప్రకారమే ఈవెంట్స్‌కు హాజరవుతారని వెల్లడించింది. సినిమా ప్రమోషన్స్ మినహాయించి వ్యక్తిగతంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదని తెలిపింది. ఎలాంటి కార్యక్రమాలకు డబ్బులు తీసుకోవడం, చెల్లింపులను ఆమోదించడం లాంటిది జరగలేదని స్పష్టం చేసింది. ఆమె ప్రస్తుతం తన రాబోయే చిత్రం విక్కీ విద్య కా వో వాలా వీడియో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారని ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది.కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే తృప్తి చివరిసారిగా బ్యాడ్ న్యూజ్‌లో కనిపించింది. ప్రస్తుతం విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత భూల్ భూలయ్యా-3, ధడక్-2 లో నటించనుంది.అసలేం జరిగిందంటే..?జైపుర్‌కి చెందిన మహిళా వ్యాపారవేత్తలు ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ఇది జరిగింది. అయితే ఈవెంట్‌కు హాజరవుతానని చెప్పి తృప్తి డిమ్రీ రూ.5.5 లక్షలు తీసుకుంది. ఈవెంట్ మొదలవడానికి ఐదు నిమిషాల ముందు వరకు వచ్చేస్తానని చెప్పిందట. తీరా రాకపోయేసరికి నిర్వాహకులు, మహిళ వ్యాపారవేత్తలు తృప్తిపై నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఫొటోపై నల్లని పెయింట్ రాశారు. ఈక్రమంలోనే ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది.Muh Kaal Karo 😱 #TriptiDimri skips event after taking 5 Lacs; Women group blackened her poster #MovieTalkies pic.twitter.com/45spP3LrMa— $@M (@SAMTHEBESTEST_) October 1, 2024 -
మోసం చేసిన 'యానిమల్' హీరోయిన్.. డబ్బులు తీసుకుని
'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన నటి తృప్తి దిమ్రి. అంతకు ముందు పలు హిందీ చిత్రాల్లో నటించింది. కానీ ఈ మూవీతో స్టార్డమ్ సొంతం చేసుకుంది. దీంతో సినిమా ఛాన్సులు, యాడ్స్, ఈవెంట్స్‌తో కాస్త బిజీ అయిపోయింది. అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు ఓ ఈవెంట్‌కి హాజరవుతానని చెప్పి లక్షల తీసుకుని మోసం చేయడం హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: సోనియాలా మారిపోతున్న యష్మీ.. బక్వాస్ గేమ్ అని చాడీలు) ఇంతకీ ఏమైంది?జైపుర్‌కి చెందిన మహిళా వ్యాపారవేత్తలు ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ఇది జరిగింది. అయితే దీనికి హాజరవుతానని చెప్పి తృప్తి రూ.5.5 లక్షలు తీసుకుంది. ఈవెంట్ మొదలవడానికి ఐదు నిమిషాల ముందు వరకు వచ్చేస్తానని చెప్పిందట. తీరా రాకపోయేసరికి నిర్వహకులు, మహిళ వ్యాపారవేత్తలు తృప్తిపై నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఫొటోపై నల్లని పెయింట్ రాశారు.ఇక ఈ ఘటనపై స్పందించిన నిర్వహకురాలు.. తృప్తి బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిందని, ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. జైపుర్‌లో ఆమె సినిమాలని బ్యాన్ చేస్తామని, ఆమె తమని మోసం చేసిందని చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ విషయంలో తృప్తి ఎలా స్పందిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిందే!)Tripti Dimri skips event after pocketing ₹5 lakhs; women’s group protests by blackening her poster pic.twitter.com/Ih2bLKzWcG— WarpaintJournal.in (@WarpaintJ) October 1, 2024 -
'భూల్ భులయ్యా 3' నుంచి టీజర్..
కార్తీక్ ఆర్యన్, తృప్తి డిమ్రి నటించిన ‘భూల్ భులయ్యా 3’ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. హారర్, కామెడీ, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా విడుదల కానుంది. గతంలో విడుదలైన భూల్ భులయ్యా ప్రాంఛైజీలో భాగంగా పార్ట్-3 ప్రేక్షకుల ముందుకు రానుంది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నిటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అనీస్ బజ్మీ తెరకెక్కిస్తున్నారు.భూల్ భూలయ్యా 3 ప్రాజెక్ట్‌లోకి విద్యాబాలన్ రీఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. హారర్,సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సమ్మేళనానికి ఆమె పాత్ర చాలా కీలకం. ఆత్మలతో సంభాషించగలిగే పాత్రలో కార్తీక్ ఆర్యన్ నటించనున్నారు. దీపావళి సందర్భంగా ‘భూల్ భులయ్యా 3’ విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ను పంచుకున్నారు. -
మా అమ్మానాన్నను భయపెట్టారు!
‘‘నేను నటి కావాలనుకున్నప్పుడు మా కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. అయితే మా బంధువులు, ఇరుగు పోరుగు వాళ్లు సినిమా ఇండస్ట్రీ మంచిది కాదు. అక్కడికి వెళితే చెడు అలవాట్లకు బానిసవుతుంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు’ అంటూ ఏవేవో చెప్పి మా అమ్మానాన్నను భయపెట్టారు’’ అన్నారు త్రిప్తీ దిమ్రి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ (2023) సినిమాలో చేసిన కీలక పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు త్రిప్తి. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారామె. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిప్తీ దిమ్రి మాట్లాడుతూ– ‘‘చిన్నతనం నుంచే నాకు నటనంటే ఆసక్తి. నటి కావాలనుకున్నప్పుడు ఇంట్లో వాళ్లు కొంచెం కంగారుపడ్డారు. ఆ తర్వాత ధైర్యం చేసి ముంబై వచ్చాను.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. అవకాశాల్లేక బాధపడిన క్షణాలున్నాయి. కొన్ని సందర్భాల్లో నమ్మకం కోల్పోయాను. చివరకు హీరోయిన్గా ‘లైలా మజ్ను’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాను. నా విషయంలో నా ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ’’ అని పేర్కొన్నారు. -
పూల చీరలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ బ్యూటిఫుల్ లుక్స్..! (ఫొటోలు)
-
ఉచితంగానే త్రిప్తి డిమ్రీ 'బ్యాడ్ న్యూజ్' చూసేయండి
యానిమల్ మూవీతో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఈ సినిమా తర్వాత ఆమె 'బ్యాడ్ న్యూజ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్కీ కౌశల్, అమీ ఆర్క్, నేహా ధూపియా తదితరులు నటించిన ఈ సినిమా జులై 19న విడుదలైంది. అనంతరం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్కు వచ్చేసింది. కానీ, సబ్స్క్రిప్షన్ ఫీజ్ చెల్లించిన వారికే సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది. అయితే, తాజాగా సబ్స్క్రిప్షన్ ఫీజ్‌ను ఆ ఓటీటీ సంస్థ తొలగించింది.బ్యాడ్ న్యూజ్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, మూవీని చూడాలంటే రూ. 349 చెల్లించాల్సి వచ్చింది. తాజాగా అమెజాన్ దానిని తొలగించింది. అదనంగా ఎలాంటి రుసుము చెల్లించకుండానే బ్యాడ్ న్యూజ్ చిత్రాన్ని చూడొచ్చు అంటూ తెలిపింది. హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు. దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 120 కోట్ల గ్రాస్ రాబట్టింది. -
ఓటీటీకి వచ్చేసిన కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యానిమల్ మూవీతో ఊహించని క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఇందులో రణ్‌బీర్ ప్రియురాలి పాత్రలో మెప్పించింది. ఈ సినిమాలో తన గ్లామర్‌తో ఏకంగా పాన్ ఇండియాలో రేంజ్లో ఫేమస్ అయిపోయింది. దీంతో ఈ భామకు ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కడుతున్నాయి. యానిమల్ తర్వాత విక్కీ కౌశల్, త్రిప్తి డిమ్రీ నటించిన చిత్రం బ్యాడ్ న్యూజ్. గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ యూత్‌ను బాగానే మెప్పిచింది. తాజాగా ఈ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం అద్దె ప్రాతిపదికన మాత్రమే అందుబాటులో ఉంది. రూ.349 చెల్లించి ఈ మూవీని కుటుంబసమేతంగా ఓటీటీలో చూసేయొచ్చు. ఈ సినిమాలో అమీ ఆర్క్, నేహా ధూపియా ప్రధాన పాత్రలు పోషించారు. -
రష్మికా, త్రిప్తి డిమ్రికి షాక్.. నయా నేషన్ క్రష్ గా భాగ్యశ్రీ బొర్సే..
-
అలాంటి లుక్‌లో సంయుక్త మీనన్.. మెరిసిపోతున్న శివం భజే హీరోయిన్!
డిఫరెంట్ స్టైల్స్‌తో కనిపించిన యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ సెలూన్లో సందడి చేసిన బిగ్‌బాస్ దివి.. వైట్ శారీలో బుల్లితెర భామ మౌనీరాయ్... మెరిసిపోతున్న శివం భజే హీరోయిన్ దిగాంగన సూర్యవన్షి.. అలాంటి అవుట్‌ఫిట్‌లో సంయుక్త మీనన్ లుక్స్.. View this post on Instagram A post shared by Nikita Kapoor (@nikitashak) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) -
మరింత అందంగా ప్రణీత.. సన్నజాజిలా రకుల్ ప్రీత్
ఆరెంజ్ కలర్ డ్రస్సులో శ్రీముఖి కిల్లర్ లుక్స్వైట్ ఔట్ఫిట్లో దేవకన్యలా మెరిసిపోతున్న తృప్తి దిమ్రిబికినీలో కేక పుట్టించేస్తున్న హాట్ బ్యూటీ సాక్షి అగర్వాల్బాడీని విల్లులా వంచేస్తున్న యూట్యూబర్ దీప్తి సునైనానిగనిగా మెరిసిపోతున్న 'అత్తారింటికి దారేది' బ్యూటీ ప్రణీతక్లాస్ లుక్‌లో క్యూట్‌గా చూస్తూ చాందినీ చౌదరిబీచ్ ఒడ్డున మత్తెక్కించే సోయగాలతో మౌనీరాయ్ View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
కెమెరాలకు కూడా దొరకని అందంతో తృప్తి డిమ్రి (ఫోటోలు)
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (ఫొటోలు)
-
'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?
'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన తృప్తి దిమ్రి.. హీరోయిన్గా వరస అవకాశాలు దక్కించుకుంటోంది. అలా చేసిన ఓ మూవీనే 'బ్యాడ్ న్యూజ్'. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఫన్నీ ఎంటర్టైనర్ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? తెలుగోళ్లకు నచ్చుతుందా లేదా అనేది చూద్దాం.కథేంటి?చెఫ్‌గా ఇంటర్నేషనల్ లెవల్లో అవార్డ్ తెచ్చుకోవాలనే లక్ష్యమున్న సలోని (తృప్తి దిమ్రి).. కుటుంబ సభ్యుల తాకిడి తట్టుకోలేక అఖిల్ చద్దా (విక్కీ కౌశల్)ని పెళ్లి చేసుకుంటుంది. హనీమూన్‌కి వెళ్తారు గానీ అక్కడ గొడవ జరగడంతో విడాకులు తీసుకునేందుకు రెడీ అయిపోతారు. పనిలో భాగంగా ముస్సోరికి వెళ్లిన సలోని.. గుర్బీర్ పన్ను(అమీ విర్క్)తో కాస్త దగ్గరవుతుంది. దీంతో ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే సలోని కడుపులో అఖిల్, గుర్బీర్‌కి చెందిన కవలలు ఉన్నారని డాక్టర్స్ చెబుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రులిద్దరూ ఏం చేశారనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)ఎలా ఉందంటే?వినగానే స్టోరీ పాయింట్ కాస్త వింతగా ఉన్నప్పటికీ.. కామెడీ కోసమే అన్నట్లు సినిమా తీశారు. కాకపోతే స్క్రీన్ ప్లేతోపాటు నవ్వించాల్సిన సీన్స్ సరిగా వర్కౌట్ కాలేదు. మరీ ముఖ్యంగా తృప్తి దిమ్రి ఓకే అనిపించే యాక్టింగ్ చేసింది. నటన పరంగా ఈమె ఇంకా చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. సెకండాఫ్‌లో ప్రధాన పాత్రధారులు ఇద్దరూ కలుసుకునే సీన్స్ చాలా సాగదీశారు. దీంతో అప్పటివరకు కాస్తోకూస్తో ఎంటర్టైన్ చేసిన సినిమా బోర్ కొట్టేస్తుంది. 'బ్యాడ్ న్యూజ్'లో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది విక్కీ కౌశల్ మాత్రమే. తన వంతు చాలా కష్టపడ్డాడు.'కల్కి' రిలీజై నాలుగు వారాలు అయిపోతున్నప్పటికీ చాలాచోట్ల ఇంకా దీని హవానే నడుస్తోంది. గత వారం 'భారతీయుడు 2' వచ్చింది గానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. తెలుగులోనూ 'డార్లింగ్', 'పేకమేడలు' పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కానీ ఏ మేరకు నిలబడతాయనేది చూడాలి. ఇక 'బ్యాడ్ న్యూజ్' కూడా బాలీవుడ్ ఆడియెన్స్‌కి నచ్చొచ్చు ఏమో గానీ మరీ ఎగబడి వెళ్లేంత అయితే ఈ మూవీలో ఏం లేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చని అంటున్నారు.(ఇదీ చదవండి: 'ద బర్త్ డే బాయ్' మూవీ రివ్యూ) -
తృప్తి డిమ్రి, విక్కీ కౌశల్.. సెన్సార్ అభ్యంతరం
విక్కీ కౌశల్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్యాడ్‌న్యూజ్'. సినిమా టైటిల్‌కు తగ్గుట్టాగానే ఒక వర్గం ప్రేక్షకులకు ఇదీ ‘బ్యాడ్ న్యూస్’ అని చెప్పవచ్చు. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ కామెడీ ఎంటర్టైనర్ని ఆనంద్ తివారీ తెరకెక్కించారు. జులై 19న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలక్టివ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.'బ్యాడ్‌న్యూజ్' సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే, ఇందులో విక్కీ కౌశల్, తృప్తి డిమ్రి మద్య ఉన్న మూడు ఇంటిమేట్ సీన్స్‌ను CBFC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) తొలగించింది. వారిద్దరి మధ్య ఇంటిమేట్ సీన్లు కాస్త మితిమీరినట్లు తెలుస్తోంది. అందుకే వాటికి సెన్సార్ అభ్యంతరం చెప్పింది. కానీ వారిద్దరి కెమిస్ట్రీని కొందరు ప్రశంసించగా, మరికొందరు అభ్యంతరంగా ఉన్నాయిని భావించారు. సెన్సార్ కట్ లిస్ట్ ప్రకారం.. మూడు సన్నివేశాలలో ఒకటి 9 సెకన్లు, రెండవది 10 సెకన్లు, మూడవది 8 సెకన్లు మొత్తంగా 27 సెకన్ల లిప్‌లాక్ సీన్లను CBFC మార్పులు చేసింది. ఈ మార్పుల తర్వాత, బాడ్ న్యూజ్ సినిమాకు CBFC నుండి U/A సర్టిఫికేట్ దక్కింది. సెన్సార్ సర్టిఫికేట్లో సూచించిన విధంగా సినిమా నిడివి 142 నిమిషాలు, ఇది 2 గంటల 22 నిమిషాలకు సమానం. -
నీ ప్రేమలో..!
రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’లో జోయా పాత్రలో గ్లామరస్‌గా నటించి బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ త్రిప్తీ దిమ్రి. ‘యూనిమల్’ సినిమా కూడా బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలో రాజ్‌కుమార్ రావుతో ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’, కార్తీక్ ఆర్యన్‌తో ‘భూల్ భూలయ్యా 3’, సిద్ధాంత్ చతుర్వేదితో ‘ధడక్ 2’ సినిమాల్లో హీరోయిన్గా చాన్స్‌లు దక్కించుకున్నారు త్రిప్తి. ఈ బ్యూటీకి మరో హిందీ సినిమా ఆఫర్ దక్కిందని టాక్. ‘రాంఝణా’, ‘అత్రంగి రే’ చిత్రాల తర్వాత హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కనుంది. ప్రేమకథ నేపథ్యంలో ‘తేరే ఇష్క్ మే’ (నీ ప్రేమలో) టైటిల్‌తో ఈ సినిమా చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ను అక్టోబరులో ్రపారంభించాలనుకుంటున్నారు. హీరోయిన్ పాత్రకు త్రిప్తీ దిమ్రిని సంప్రదించారనే ప్రచారం బాలీవుడ్లో జరుగుతోంది. మరి... ‘తేరే ఇష్క్ మే’ అంటూ ధనుష్‌తో త్రిప్తిæజోడీ కడతారా? అనేది త్వరలో తెలిసి΄ోతుంది. -
ట్రెండింగ్‌లో తృప్తి డిమ్రి ‘బ్యాడ్ న్యూజ్’
యానిమల్ సినిమాతో తృప్తి డిమ్రి యూత్ ఫేవరెట్ క్రష్ అయిపోయింది. తన అందంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ బ్యూటీకి భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఒక్క సినిమాతో తన జీవితమే మారిపోయిందని చెప్పవచ్చు. యానిమల్ సినిమా వల్ల అవకాశాలు క్యూ కట్టేశాయ్. దీంతో ముంబైలో కొత్తిల్లు కూడా కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆమె నుంచి ఏ సినిమా వచ్చినా భారీ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో విక్కీ కౌశల్‌కు జంటగా ఆమె నటించిన ‘బ్యాడ్ న్యూజ్’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అమీ విర్క్ ఇందులో మరో ప్రధాన పాత్రలో నటించాడు.వాస్తవిక సంఘటనల ఆధారంగా రానున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ని ఆనంద్ తివారీ తెరకెక్కిస్తున్నారు. ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలక్టివ్ సంయుక్తంగా ‘బ్యాడ్ న్యూజ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 3 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. జులై 19న సినిమా విడుదల కానుంది. -
Triptii Dimri: యానిమల్ బ్యూటీ గ్లామర్ షో (ఫోటోలు)
-
యానిమల్ బ్యూటీ ధరించిన పొట్టి డ్రెస్.. లక్షల్లోనే!
బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి యానిమల్ సినిమాతో యూత్ ఫేవరెట్‌గా మారిపోయింది. ఈ మూవీ తర్వాత అందరూ ఆమెను నేషనల్ క్రష్ అని పిలవడం మొదలుపెట్టారు. అలా పిలుస్తున్నందుకు తెగ మురిసిపోతోందీ అమ్మడు. తన అభిమానులను అలరిస్తూ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తోంది.స్పెషల్ అట్రాక్షన్‌గా..ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్యాడ్ న్యూస్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో విక్కీ కౌశల్, అమ్మీ విర్క్ హాజరయ్యారు. అందరిలోనూ స్పెషల్‌గా ఉండాలని ఆరాటపడే తృప్తి ఈ ఈవెంట్లోనూ అందంగా ముస్తాబై సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలబడింది.చిన్న డ్రెస్‌కు అంత ఖరీదా?పొట్టి డ్రెస్ కనిపించి కనువిందు చేసింది. మోకాలిపై వరకే ఉన్న ఈ బ్లాక్ డ్రెస్ ధర వేలల్లో కాదు లక్షల్లోనే ఉంది. వెర్సేస్ అనే బ్రాండ్‌కు చెందిన ఈ మినీడ్రెస్ ఏకంగా రూ.4,06,234గా ఉంది. దీని ధర చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత చిన్న అవుట్‌ఫిట్‌కు అన్ని లక్షలా అని ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే బ్యూటీ భూల్ భులాయా 3 మూవీలోనూ నటిస్తోంది. View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) చదవండి: బచ్చలమల్లి గ్లింప్స్: ఊర మాస్ లుక్‌లో అల్లరి నరేశ్ -
ఇటలీ హాలిడే టూర్లో యానిమల్ బ్యూటీ, స్టన్నింగ్ ఫోటోలు
-
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
యానిమల్ సినిమాతో తృప్తి డిమ్రి యూత్ ఫేవరెట్ క్రష్ అయిపోయింది. అందంతో, నటనతో కట్టిపడేసిన ఈ బ్యూటీ అంతకుముందు కూడా విభిన్న పాత్రలతో ఆకట్టుకుంది. కానీ యానిమల్ చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ ముంబైలో కొత్తిల్లు కొనుగోలు చేసింది.ముంబైలో కొత్తిల్లుసెలబ్రిటీలు నివాసముండే బాంద్రాలోనే తనకంటూ ఓ ఇంటిని సంపాదించుకుంది. ఇది రెండంతస్థుల ఇల్లని, సుమారు 247 గజాల విస్తీర్ణంలో ఉందని తెలుస్తోంది. రూ.14 కోట్లు పెట్టి దీన్ని సొంతం చేసుకుందట! ఇప్పటికే స్టాంప్ డ్యూటీ కింద రూ.70 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.30,000 చెల్లించిందట. మొత్తానికి తృప్తి.. షారుక్ ఖాన్, సల్మాన్, రేఖ, రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్.. వంటి స్టార్స్ ఉండే స్థలానికి త్వరలోనే మకాం మార్చనుందన్నమాట!ఆ సినిమాతో పాపులారిటీతృప్తి డిమ్రి.. ఉత్తరాఖండ్ వాసి. మామ్, పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను వంటి చిత్రాల్లో నటించింది. తన కెరీర్ టర్న్ అయింది మాత్రం బుల్బుల్ చిత్రంతోనే! కాలా చిత్రంతో మరింత ఫేమ్ రాగా యానిమల్ మూవీతో ఆ క్రేజ్ పీక్స్‌కు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' అనే సినిమాలో నటిస్తోంది. అలాగే సూపర్ హిట్ హారర్ మూవీ 'భూల్ భులాయా'కు సీక్వెల్‌గా వస్తున్న 'భూల్ భులాయా 3'లో నటిస్తోంది. వీటితో పాటు 'బ్యాడ్ న్యూస్', 'ధడక్ 2' చిత్రాల్లో భాగమైంది.చదవండి: తమ్ముడి ప్రేమ కోసం యువతి కుటుంబాన్ని ఒప్పించిన యోగి బాబు -
ఊ అన్నావా భామా..!
‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావ....’ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ ప్రత్యేక పాటలో అల్లు అర్జున్‌తో కలిసి హాట్ హాట్ స్టెప్పులేశారు సమంత. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్’లో కూడా ఇలాంటి ఓ ప్రత్యేక పాట ఉందని సమాచారం. ఈ పాటకు అల్లు అర్జున్‌తో కలిసి బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి కాలు కదపనున్నారని సమాచారం.రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’లో చేసిన ఓ పాత్రతో త్రిప్తి బాగా పాపులర్ అయ్యారు. ఈ చిత్రం తర్వాత త్రిప్తీకి హిందీలో అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు ‘పుష్ప: ది రూల్’ పాటకు ఆమెను తీసుకున్నారనే వార్త ప్రచారంలోకి రావడంతో ‘ఊ అన్నావా భామా...!’ అని అభిమానులు సరదాగా అంటున్నారు. మరి.. ప్రచారంలో ఉన్నట్లు ఈ పాటతో త్రిప్తి తెలుగుకి పరిచయం అవుతారా? వేచి చూడాల్సిందే.29న అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే...‘పుష్ప: ది రూల్’ సినిమా నుంచి ఈ నెల 1న ‘పుష్ప..పుష్ప’ అంటూ సాగే పాట విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి ‘సూసికి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ సాగే మరో పాట లిరికల్ వీడియోను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఈ పాట విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు స్వరకర్త. అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘పుష్ప: ది రూల్’ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. -
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
ఐస్‌లా కూల్ లుక్‌తో హాట్ బ్యూటీ అషూరెడ్డిటైట్ ఫిట్ డ్రస్సులో మెంటలెక్కిస్తున్న రితికఓరకంట చూస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన తృప్తి దిమ్రితెగ కష్టపడుతున్న సీరియల్ బ్యూటీ జ్యోతి రాయ్వంగి మరీ అందాల విందు చేస్తున్న అనన్య పాండేబుక్ చదువుతూ వయ్యారాలు ఒలకబోస్తున్న మాళవిక View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by சாய் தன்ஷிகா (@saidhanshika) View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
నాభి అందాలతో రాశీ.. చాన్నాళ్ల తర్వాత అలా కనిపించిన తృప్తి!
భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న కృతి సనన్ మత్తెక్కించేలా చూస్తూ కాక రేపుతున్న 'యానిమల్' బ్యూటీ తృప్తి బాయ్ ఫ్రెండ్ తో 'రానా నాయుడు' బ్యూటీ క్యూట్ పోజులు షాకింగ్ లుక్స్ తో ఆశ్చర్యపరుస్తున్న మెగాడాటర్ నిహారిక చూస్తేనే మతిపోయేల్లాంటి స్టిల్స్ తో ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్ View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Jasnya Jayadeesh (@jasnya_k_jayadeesh) View this post on Instagram A post shared by prateik patil babbar (@_prat) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
మాటలు రావడం లేదు!
‘‘అమర్‌సింగ్ చంకీల’ సినిమా అద్భుతంగా ఉంది. అమర్‌సింగ్ పాత్రలో దిల్జిత్ దొసాంజ్ ఒదిగిపోయారు. ఎంత అద్భుతంగా నటించారో చెప్పడానికి మాటలు రావడం లేదు’’ అన్నారు ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తి దిమ్రి. పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చంకీల(27 ఏళ్లకే హత్య చేయబడ్డారు) బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘అమర్‌సింగ్ చంకీల’. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పరిణితీ చోప్రా, దిల్జిత్ దొసాంజ్ లీడ్ రోల్స్ చేశారు. ఈ నెల 12న నెట్‌ఫ్లిక్స్‌లో ‘అమర్‌సింగ్ చంకీల’ విడుదలైంది. అయితే బాలీవుడ్ సినీతారల కోసం ముంబయ్‌లో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం త్రిప్తి దిమ్రి మాట్లాడుతూ–‘‘చాలా రోజుల తర్వాత నేను చూసిన ఉత్తమ చిత్రమిది. అమర్ జ్యోత్ పాత్రకి పరిణీతి చక్కగా సరిపోయారు. ఇలాంటి మంచి సినిమాని మాకు అందించినందుకు ఇంతియాజ్‌కి థ్యాంక్స్’’ అన్నారు. -
నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఆమెనే: యానిమల్ బ్యూటీ కామెంట్స్
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్తో ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ ప్రియురాలి పాత్రలో కనిపించి మెప్పించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. దీంతో యానిమల్ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా-3 చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమెలా ఉండడం చాలా గొప్ప అంటూ ప్రశంసలు కురిపించింది. త్రిప్తి మాట్లాడుతూ..' మరో దేశానికి వెళ్లి కెరీర్ ప్రారంభించాలంటే ధైర్యం ఉండాలి. ప్రియాంకకు ధైర్యంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువే. హాలీవుడ్‌కు వెళ్లి సక్సెస్‌ను సాధించింది. ఆమె నాలాంటి వారికి స్ఫూర్తి. అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ప్రియాంక మూవీ బర్ఫీ మొదటిసారి చూసినప్పుడు ఆమెను గుర్తుపట్టలేదు. యాక్టర్స్‌కు ఉండాల్సిన మొదటి లక్షణమదే. ఏ పాత్ర చేస్తున్నా మనం కనిపించకూడదు. కేవలం మన నటన మాత్రమే కనిపించాలి. ఆ పాత్రతోనే మనల్ని పిలుస్తుంటే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు’ అని అన్నారు. ప్రియాంక తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి అని త్రిప్తి కొనియాడారు. -
Tripti Dimri HD Photos: బ్లాక్ డ్రెస్ లో ‘యానిమల్’ హాట్ బ్యూటీ (ఫోటోలు)
-
యానిమల్ హీరోయిన్‌తో డేటింగ్ చేయాలనుంది: నటుడు షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం యానిమల్. రణ్‌బీర్‌కపూర్, రష్మిక జంటగా నటించిన బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పలువురు ప్రముఖుల నుంచి విమర్శలు ఎదురైనప్పటికీ భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో రష్మిక లీడ్ రోల్లో కనిపించగా.. బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది. రణ్‌బీర్ కపూర్ ప్రియురాలిగా జోయా పాత్రలో మెప్పించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. యానిమల్తో త్రిప్తి డిమ్రీకి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో మరో నటుడు సిద్ధాంత్ కర్నిక్ కీలక పాత్ర పోషించారు. రణబీర్ కపూర్ బావగా వరుణ్ ప్రతాప్ మల్హోత్రా అనే పాత్రను పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిద్ధాంత్.. త్రిప్తి డిమ్మీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెతో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు తన మనసులో మాటను సిద్ధాంత్ వెల్లడించారు. రీల్ లైఫ్ నుంచి నిజ జీవితాన్ని వేరుగా చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాగా.. సిద్ధాంత్ కర్నిక్ యానిమల్తో పాటు మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, అమయా, తప్పడ్, ఆదిపురుష్ లాంటి చిత్రాల్లో కనిపించారు. మాహి వే, యే హై ఆషికి, ఏక్ థా రాజా ఏక్ థీ రాణి లాంటి సీరియల్స్‌లో నటించారు. -
కరణ్ జోహార్ ఇంట్లో కనిపించిన త్రిప్తి దిమ్రీ
-
'యానిమల్' బ్యూటీ రెమ్యునరేషన్ అంత తక్కువ..?
సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ చిత్రం గతేడాదిలో విడుదలయి సూపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలోని నటీనటులకూ మంచి గుర్తింపు వచ్చింది. వారిలో త్రిప్తి డిమ్రి బాగా హైలెట్ అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆమె పేరు సోషల్ మీడియాలో నేషనల్ క్రష్‌గా కూడా తెగ చక్కర్లు కొట్టింది. సినిమా వచ్చి చాలా రోజులే అయినా.. ప్రస్తుతం ఆమె రెమ్యునరేషన్ గురించి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో ఇంటిమేట్ సీన్లో నటించి యూత్‌కు దగ్గరైంది త్రిప్తి. యానిమల్ సినిమాలో నటించినందుకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే పారితోషకం కింద ఇచ్చారట. ఈ సినిమా చేస్తున్న సమయంలో ఆమె ఎవరో ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అంతే కాకుండా సినిమాలో కూడా ఆమె కొంత సమయం మాత్రమే కనిపిస్తుంది. అందువల్ల ఆమె తక్కువ పారితోషకానికే యానిమల్కు ఒప్పుకుంది. కానీ యానిమల్ చిత్రం బిగ్గెస్ట్ హిట్ కావడంతో త్రిప్తి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె ఒప్పుకుంటున్న సినిమాలకు భారీగానే డిమాండ్ ఉంది. తాజాగా ఆమె 'భూల్ భులయా'లో చిత్రంలో నటిస్తుంది. అందులో స్పెషల్ రోల్ నటిస్తున్నందుకు ఆమె కోటి రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుంటుందట. ఈ సినిమా హిట్ అయితే త్రిప్తి డుమ్రి మరో కోటి పెంచడం ఖాయం అని చెప్పవచ్చు. మేరే మెహబూబ్ మేరే సనమ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరిల స్పై థ్రిల్లర్‌లో త్రిప్తి నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసినట్లు టాక్. View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) -
వ్యాపారవేత్త ప్రేమలో త్రిప్తి డిమ్రి.. ఫోటోలు షేర్ చేసిన ప్రియుడు
'యానిమల్' సినిమాతో టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు త్రిప్తి డిమ్రి . ఆ సినిమాలో తన నటనతో యువ హృదయాలను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. 'జోయ' పాత్రలో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఐఎండీబీ (ఇండియన్ మూవీ డేటాబేస్) ఇటీవల విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలోనూ ఆమె మొదటి స్థానంలో నిలిచింది. అంతలా యానిమల్ సినిమాతో ఆమె కిక్ ఇచ్చింది. ఆమెకు బాలీవుడ్, టాలీవుడ్‌లలో వరుస అవకాశాలు వస్తున్నాయనే వార్తలు కూడా వైరలవుతున్నాయి. ఫిబ్రవరి 23న త్రిప్తి డిమ్రి 30వ వసంతంలోకి అడుగుపెట్టింది. తన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు సామ్ మర్చంట్ కూడా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపాడు. త్రిప్తితో తీసుకున్న ఒక సెల్ఫీని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ విష్ చేశాడు. 'నా ప్రియమైన త్రిప్తికి శుభాకాంక్షలు’ అంటూ తెలిపాడు సామ్ మర్చంట్. ప్రస్తుతం వీరిద్దరి సెల్ఫీ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో త్రిప్తి ప్రేమ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ సామ్ మర్చంట్ ఎవరు ? అంటూ వివరాల కోసం త్రిప్తి ఫ్యాన్స్ గూగుల్‌లో వెతుకుతున్నారు. సామ్మర్చంట్ తొలుత మోడల్‌గా పనిచేసి ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. గోవాలో అతనికి బీచ్ క్లబ్స్‌తో పాటు పలు హోటల్స్ ఉన్నాయని తెలిసింది. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి అధికారికంగా ఇద్దరూ ఇప్పటి వరకు తెలుపలేదు. -
'యానిమల్' బ్యూటీ కొత్త బాయ్‌ఫ్రెండ్.. అలా తెలిసిపోయింది!
'యానిమల్' సినిమాలో ఒక్కొక్కరికి ఒక్కో విషయం నచ్చింది. కొందరికి రణ్‌బీర్ యాక్టింగ్ నచ్చితే మరికొందరికి యాక్షన్ సీన్స్ నచ్చాయి. మిగతా చాలామందికి మాత్రం జోయ పాత్ర చేసిన నటి తెగ నచ్చేసింది. దీంతో ఆమె ఎవరా అని ఆరా తీసి, ఆమె గురించి తెలుసుకుని మొత్తానికి తృప్తిని ఫేమస్ చేసి పడేశారు. దీంతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ గురించి బయటపడింది. (ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్) తృప్తి దిమ్రి చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది. 2017లో మామ్, పోస్టర్ బాయ్స్ చిత్రాల్లో నటించింది. బుల్ బుల్, కాలా తదితర చిత్రాల్లో బాగా చేసిందని పేరయితే తెచ్చుకుంది గానీ గుర్తింపు రాలేదు. కానీ 'యానిమల్' మూవీతో రాత్రికి రాత్రి ఈమె ఫేట్ మారిపోయింది. కుర్రాళ్లకు పాన్ ఇండియా క్రష్ అయిపోయింది. గతంలో ఈమె.. అనుష్క శర్మ తమ్ముడు కర్నేశ్ శర్మతో రిలేషన్ ఉందని అన్నారు గానీ కొన్నాళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయినట్లు కూడా మాట్లాడుకున్నారు. ప్రస్తుతానికైతే 'యానిమల్' బ్యూటీ తృప్తి సింగిల్‌గానే ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఈమెకు ఆల్రెడీ ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని టాక్. సామ్ మర్చంట్ అనే యంగ్ బిజినెస్‌మ్యాన్.. తాజాగా తృప్తి పుట్టినరోజు సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ తృప్తి' అని ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఒకవేళ సీక్రెట్ రిలేషన్షిప్ లాంటిది ఏమైనా ఉంటే త్వరలోనే ఓ క్లారిటీ వచ్చేయొచ్చని కూడా మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) -
Bhool Bhulaiyaa 3: ఆమె కళ్లు వేటాడతాయి!
బాలీవుడ్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో ‘భూల్ భూలయ్యా’ ఒకటి. 2007లో విడుదలైన ‘భూల్ భూలయ్యా’, 2022లో విడుదలైన ‘భూల్ భూలయ్యా 2’ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ‘భూల్ భూలయ్యా 3’ చిత్రీకరణ జరుగుతోంది. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ‘భూల్ భూలయ్యా’ ఫ్యామిలీలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ చేరారు. ‘‘ఆమె నవ్వు భయం పుట్టిస్తుంది. ఆమె కళ్లు వేటాడతాయి... అలాగే !భయపెడతాయి. మిస్టరీ గాళ్’’ అంటూ ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ పాత్రను వివరించారు మేకర్స్. -
మల్లెపూలతో రొమాంటిక్‌గా శ్రీముఖి.. 'యానిమల్' బ్యూటీ తృప్తి ఏకంగా అలా!
మల్లెపూలతో నా సామి రంగ అనిపిస్తున్న శ్రీముఖి చీరలో వయ్యారాలు పోతున్న హీరోయిన్ రష్మిక బ్లర్ ఫొటోలే కానీ తృప్తి దెబ్బకు జిగేలుమంటున్నాయ్ అందాల గేట్లు ఎత్తేసిన 'హాయ్ నాన్న' మృణాల్ ఠాకుర్ మత్తెక్కించే సోయగాలతో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన రితికా సింగ్ మెడలో నెక్లెస్‌తో హీరోయిన్ రకుల్ ప్రీత్ క్యూట్ పోజులు చుడీదార్‌తో చూడచక్కగా కనిపిస్తున్న యాంకర్ వర్షిణి చీరలో సంప్రదాయబద్ధంగా తమిళ యంగ్ హీరోయిన్ భవానిశ్రీ కురచ దుస్తులతో టాప్ లేపేస్తున్న సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్ View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Banita Sandhu (@banitasandhu) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు.. వాడినే పెళ్లి చేసుకుంటా: త్రిప్తి డిమ్రి
'యానిమల్' సినిమాతో ఒక్కసారిగా ట్రెండింగ్ స్టార్ అయింది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయర్స్ పెరిగిపోయారు. ఇప్పుడు యానిమల్ సినిమా ఓటీటీలోకి వచ్చాక ఆమె మళ్లీ భారీగా వైరల్ అవుతుంది. సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి కీలకపాత్ర పోషించింది. జోయా అనే పాత్రలో స్క్రీన్‌పై కనిపించింది కొద్ది సమయమే అయినప్పటికీ ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా రణ్‌బీర్ - త్రిప్తి మధ్య వచ్చే సన్నివేశాలు వైరల్‌గా మారాయి. దీంతో ఎందరో ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. త్వరలో ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కనుందని వార్తలు నెట్టింట భారీగానే వైరల్ అయ్యాయి. ఇప్పటికే డేటింగ్లో ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. పెళ్లి రూమర్స్‌పై ఓ ఇటర్వ్యూలో త్రిప్తి డిమ్రి క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న పెళ్లి వార్తలపై ఆమెను ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా, ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమి లేదని, ఇప్పటికైతే తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టానంటూ తృప్తి క్లారిటీ ఇచ్చింది. కానీ తనకు కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పింది. అతనికి డబ్బు, పాపులారిటీ వంటివి లేకున్నా ఫర్వాలేదు కానీ మంచి మనసున్న వ్యక్తి అయితే చాలు అని కాబోయే భర్తపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. యానిమల్’ కంటే ముందే త్రిప్తి డిమ్రి పలు ఓటీటీలలో నటించింది. ప్రస్తుతం సినిమా ఛాన్సులు వస్తున్నా కూడా ఓటీటీని మాత్రం నిర్లక్ష్యం చేయనని తెలిపింది. త్రిప్తి డిమ్రికి తెలుగులోనూ వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరిల స్పై థ్రిల్లర్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెకు ఛాన్స్ దక్కినట్లు సమాచారం. -
విజయ కొత్త సినిమాలో..జోడిగా యానిమల్ బ్యూటీ ?
-
విజయ్‌కి జోడీగా 'యానిమల్' బ్యూటీ
రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ చిత్రంలోని జోయా పాత్రతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు హీరోయిన్ త్రిప్తి దిమ్రి. ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ముందు శ్రీలీలను తీసుకున్నారు. కొన్ని కారణాలతో శ్రీలీల ఈప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, ఈ స్థానంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తారనే టాక్ వినిపించింది. తాజాగా త్రిప్తి దిమ్రి, రుక్మిణీ వసంత్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి.. ఈ ఇద్దర్లో ఎవరు విజయ్ దేవరకొండతో జోడీ కడతారు? లేక మరో హీరోయిన్ ఎవరైనా ఈ అవకాశాన్ని దక్కించుకుంటారా? అనేది చూడాలి. ఈ సినిమా షూటింగ్‌ను మార్చిలోప్రారంభించాలనుకుంటున్నారు. సో.. రెండు నెలల్లో కథానాయిక విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. -
షాకింగ్ లుక్‌లో 'సలార్' బ్యూటీ.. తృప్తిని ఇలా చూస్తే అంతే!
పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్న హీరోయిన్ హన్సిక రెట్రో లుక్‌లో వయ్యారాలు పోతున్న యాంకర్ శ్రీముఖి రెడ్ కలర్ డ్రస్‌లో అందంగా కనిపిస్తున్న మీనాక్షి చౌదరి నాన్న మహేశ్ పాటకు కూతురు సితార క్యూట్ డ్యాన్స్ క్లాస్ లుక్‌తో మాయ చేస్తున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ చీరలో మహాలక్ష్మిలా మెప్పిస్తున్న అదితీ రావ్ హైదరీ పబ్‌లో చిల్ అయిపోతున్న హాట్ బ్యూటీ రీతూ చౌదరి మత్తెక్కించే పోజుల్లో 'ఆదిపురుష్' భామ కృతిసనన్ View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Komalee (@komaleeprasad) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by HELLO! India (@hellomagindia) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
నిద్రలేని రాత్రులు గడుపుతున్నా!
‘యానిమల్’ సినిమాతో ఒక్కసారిగా ట్రెండింగ్ స్టార్ అయ్యారు బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయర్స్ పెరిగిపోయారు. ఈ సడన్ స్టార్డమ్ గురించి త్రిప్తి దిమ్రీ స్పందిస్తూ– ‘‘ప్రేక్షకులు, అభిమానుల నుంచి నాకు లభిస్తున్న ప్రేమ ఆనందాన్నిస్తోంది. ఈ అనుభూతి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. చెప్పాలంటే నా మొబైల్ ఫోన్ మెసేజ్‌లతో మోగుతూనే ఉంది. చివరికి ఈ మెసేజ్‌ల వల్ల నేను నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తోంది. అన్ని వస్తున్నాయి. అవి చదువుతూ రాత్రి సమయాన్ని గడిపేస్తున్నాను. కానీ ఇది బాగుంది. ఇక రణ్‌బీర్ కపూర్ అమేజింగ్ యాక్టర్. చాలా సపోర్టివ్. రష్మికా మందన్నా కూడా చాలా కో–ఆపరేటివ్’’ అని చెప్పుకొచ్చారు. రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా, త్రిప్తి దిమ్రీ, బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’ సినిమా ఈ నెల 1న విడుదలైన విషయం తెలిసిందే. సూపర్ హిట్ టాక్‌తో ఈ చిత్రం దూసుకెళుతోంది. -
'యానిమల్' బ్యూటీ సరికొత్త లుక్.. మరింత అందంగా ఆ తెలుగు హీరోయిన్!
సిల్క్ చీరలో కేక పుట్టించేస్తున్న 'యానిమల్' బ్యూటీ తృప్తి 'టైగర్ నాగేశ్వరరావు' బ్యూటీ గాయత్రి మత్తెక్కించే పోజులు బికినీలో రెచ్చిపోయిన 'బిగ్‌బాస్' తెలుగు ఫేమ్ అరియానా క్యూట్ లుక్స్‌తో మెల్ట్ చేసేస్తున్న హీరోయిన్ నభా నటేశ్ ఉప్పొంగే అందాలతో తెలుగు హీరోయిన్ అమైరా దస్తూర్ టైట్ ఫిట్ డ్రస్‌తో కాక రేపుతున్న హీరోయిన్ రుహానీ శర్మ గ్లామర్ గేట్లు తెరిచిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఇయర్ రౌండప్ గ్లామర్ వీడియో షేర్ చేసిన శ్రియ శరణ్ View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Gayatri Bhardwaj (@gayatribhardwaj__) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Nitya Naresh (@nityanaresh) View this post on Instagram A post shared by Kaali (@meerachopra) View this post on Instagram A post shared by Komalee (@komaleeprasad) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam | Actor | influencer (@aditigautamofficial) -
నిద్రలేని రాత్రులు గడిపా.. ఆ తెలుగు హీరోతో చేయాలనుంది: యానిమల్ బ్యూటీ
యానిమల్ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న నటి త్రిప్తి డిమ్రీ. ఈ చిత్రంలో ఆమె నటనకు బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రంలో జోయా పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో త్రిప్తి ఒక్కసారిగా ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. అంతే కాకుండా రణ్‌బీర్ కపూర్‌తో కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కొందరైతే ఏకంగా మీరే మాకు నేషనల్ క్రష్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతలా ఫేమ్ తెచ్చుకున్న భామ తర్వాత ఏ ప్రాజెక్ట్‌లో చేయనుందన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సౌత్ సినిమాల్లో నటించనున్నట్లు వస్తోన్న వార్తలపై తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. త్రిప్తి మాట్లాడుతూ.. 'నేను ఇప్పటిదాకా సౌత్‌లో ఏ సినిమాకు సంతకం చేయలేదు. నాకు ఇక్కడ కూడా అవకాశాలు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. దక్షిణాదిలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించాలని ఉంది' అంటూ మనసులో మాటను బయట పెట్టేసింది ముద్దుగుమ్మ. అని తెలిపారు. ఆ తర్వాత యానిమల్ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. యానిమల్ విడుదలకు ముందు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లు చెప్పుకొచ్చింది. నా ప్రతిభకు ప్రశంసలు దక్కడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా యానిమల్ తర్వాత త్రిప్తికి ఇన్‌స్టాలో ఫాలోయింగ్ భారీగా పెరిగింది. కాగా.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే సినిమాలో త్రిప్తి డిమ్రీని ఎంపిక చేయాలంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
ఆ అత్యాచార సీన్‌తో పోలిస్తే ఇదెంత?: యానిమల్ బ్యూటీ
యానిమల్ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించింది తృప్తి డిమ్రి. ఈ పాత్రతో బోలెడంత క్రేజ్ సంపాదించింది. సినిమాలో క్లిష్టమైన సన్నివేశాల్లోనూ ఏమాత్రం బెరుకు లేకుండా నటించింది. ఈమె అందం, అభినయం చూసిన కుర్రకారు త్రిప్తిని తమ ఫేవరెట్ క్రష్ జాబితాలో చేర్చుకున్నారు. తాజాగా ఈ బ్యూటీ యానిమల్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. బెడ్రూమ్ సీన్.. దానితో పోలిస్తే ఇదెంత? 'నేను నటించిన జోయా పాత్రకు ఇంత ఆదరణ వస్తుందనుకోలేదు. అయితే చాలామంది హీరో రణ్‌బీర్ కపూర్‌తో నటించిన బెడ్రూమ్ సీన్ గురించే మాట్లాడుతున్నారు. నిజానికి ఈ సీన్ కంటే కూడా బుల్బుల్ సినిమాలోని అత్యాచార సన్నివేశం చాలా కష్టమైనది. ఇది నేను నటిగా కాకుండా ఒక అమ్మాయిగా చెప్తున్నాను. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అంతా ఇచ్చేయడం అనేది చాలా కష్టం. దానితో పోలిస్తే యానిమల్‌లో నేను చేసింది పెద్ద విషయమే కాదు. ఒక నటిగా నా పాత్రకు నేను న్యాయం చేయాలి. అలాంటప్పుడు దుస్తులు లేకుండా ఆ సీన్లో నటించడం తప్పేమీ కాదు. ఆ రోజు సెట్లో నలుగురే.. ఆ రోజు ఆ సన్నివేశం చిత్రీకరించేటప్పుడు సెట్లో నలుగురే ఉన్నారు. నేను, రణ్‌బీర్, సందీప్ రెడ్డి, కెమెరామన్ మాత్రమే ఉన్నాం. ఇంకెవరూ లేరు. ప్రతి ఐదు నిమిషాలకు వారు నా గురించి అడుగుతూనే ఉన్నారు. నువ్వు ఓకేనా? కంఫర్ట్‌గానే ఉన్నావా? ఏదైనా ఇబ్బందా? అని తరచూ ఆరా తీశారు. చాలా సపోర్ట్ చేశారు. కానీ రణ్‌బీర్‌తో నటించే సీన్ కావడంతో కొంత కంగారుపడ్డాను. అది అర్థం చేసుకున్న అతడు.. చాలా బాగా మాట్లాడి నేను ఫ్రీ అయ్యేలా చేశాడు. ముందు ఎవరి సీన్ కావాలంటే వారిది చేద్దాం అని స్వీట్‌గా మాట్లాడుతూ నా కంగారు పోగొట్టాడు' అని చెప్పుకొచ్చింది తృప్తి డిమ్రి. చదవండి: షాకింగ్ న్యూస్.. అస్సలు నమ్మలేకపోతున్నాను.. ఇంత త్వరగా వెళ్లిపోతావనుకోలేదు.. సిమ్రాన్ భావోద్వేగం -
యానిమల్ మూవీ నటి.. నక్క తోక తొక్కినట్టుందే!
రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన చిత్రం యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్ల చేరువలో కలెక్షన్స్ సాధించింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సూపర్ హిట్ డైరెక్టర్ టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్‌ను కూడా ప్రకటించారు సందీప్. దీంతో ఈ చిత్రంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఎవరు కనిపించనున్నారనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే యానిమల్ చిత్రంతో ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ భామ రెబల్ స్టార్‌తో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే యానిమల్ చిత్రం ద్వారా రష్మిక కంటే ఎక్కువగా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రికే పాపులారిటీ దక్కింది. రణ్‌బీర్ కపూర్‌తో ఫుల్ రొమాంటిక్ సన్నివేశాల్లో మెప్పించింది. అంతే రణ్‌బీర్‌తో కెమిస్ట్రీ అదుర్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. మరో నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రి అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. యానిమల్ చిత్రంలో జోయా పాత్రలో కనిపించిన త్రిప్తి డిమ్రిపైనే ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. ఆమె ఫర్ఫామెన్స్‌కు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో సందీప్ రెడ్డి భారీ బడ్జెట్ చిత్రంలో ఆఫర్ దక్కించుకుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన అంటే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్‌తో నటించే ఛాన్స్ కొట్టేసిందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే స్పిరిట్‌లో ఆమె పాత్రపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. హీరోయిన్గా లేదా యానిమల్ చిత్రంలానే అనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా.. దాదాపు రూ400 కోట్ల భారీ బడ్జెట్‌తో స్పిరిట్ తెరకెక్కించునున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ నెలలోనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ నటించిన సలార్ రిలీజ్ కానుంది. డిసెంబర్ 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?
గత నాలుగైదు రోజుల నుంచి ఎక్కడ చూసినా 'యానిమల్' గురించే డిస్కషన్. ఈ సినిమాలోని బిట్ సాంగ్స్, ఫైట్స్.. ఇలా అన్నింటి గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అలానే రెండో హీరోయిన్గా చేసిన తృప్తి దిమ్రి గురించి కాసింత ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఆమె సింగిల్ కాదని, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ బావతో ప్రేమలో ఉందనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దిల్లీలో పుట్టిపెరిగిన తృప్తి.. 2017లో వచ్చిన శ్రీదేవి 'మామ్' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను, బుల్బుల్, కాలా తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఈ మూవీస్‌తో హిందీలో మంచి పాపులారిటీ సంపాదించింది. 'యానిమల్' చిత్రంలో జోయ అనే పాత్రలో నటించడం ఈమె ఫేట్ మార్చేసిందని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా) ఎందుకంటే డిసెంబరు 1న సినిమా రిలీజైన దగ్గర నుంచి హీరో రణ్‌బీర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ఎంతలా మాట్లాడుకుంటున్నారో.. సెకండ్ హీరోయిన్గా నటించిన తృప్తి దిమ్రి గురించి అంతకంటే ఎక్కువగానే మాట్లాడుకుంటున్నారు. మూవీ విడుదలైనప్పుడు 6 లక్షల వరకు ఇన్ స్టాలో ఫాలోవర్స్ ఉండగా.. ఇప్పుడు ఏకంగా 20 లక్షలు దాటేసింది. సరే సినిమా సంగతులన్నీ పక్కనబెడితే తృప్తి.. విరాట్ కోహ్లీ బావ, అదేనండి అనుష్క శర్మ అన్నతో ప్రేమలో ఉందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తృప్తి నటించిన 'బుల్బుల్' సినిమాకు కర్నేశ్ శర్మ నిర్మాత. ఇతడు అనుష్క శర్మకి సొంత అన్నయ్య. అయితే ఈ మూవీ చేస్తున్న టైంలోనే తృప్తి-కర్నేశ్ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల పాటు రిలేషన్లో ఉన్నారు. అయితే కొన్ని నెలల ముందు ఇద్దరు ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటు ఫొటోల్ని కూడా డిలీట్ చేశారు. దీంతో వీరిద్దరికీ బ్రేకప్ అయినట్లే అని అంతా అనుకుంటున్నారు. 'యానిమల్' మూవీ పుణ్యాన.. ఈ లవ్వు, బ్రేకప్ టాపిక్ మరోసారి డిస్కషన్‌లోకి వచ్చింది అంతే! (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) -
యానిమల్ సక్సెస్.. క్రేజీ ట్యాగ్ కోల్పోయిన రష్మిక!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆ ఒక్క పేరే దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే తెగ ట్రెండ్ అవుతోంది. అదేనండీ మన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీ. రిలీజైన మొదటి రోజే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌పై కొందరు తప్పుపడుతున్నారు. ఇలాంటి సినిమాలను ఎలా ప్రోత్సహిస్తారంటూ ఇటీవలే టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ మండిపడ్డారు. మరోవైపు ఈ చిత్రంపై ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇదంతా పక్కన పెడితే బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ ఆమె పేరే వినిపిస్తోంది. ఈ చిత్రంలో జోయా పాత్రలో నటించిన బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రి. హీరోయిన్ రష్మిక కంటే ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని రణ్‌బీర్ కపూర్‌తో త్రిప్తి రొమాంటిక్ సీన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రణ్‌బీర్, రష్మిక కెమిస్ట్రీ కంటే.. త్రిప్తి దిమ్రి కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. త్రిప్తినే అసలైన నేషనల్ క్రష్ అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో త్రిప్తి ఓవర్‌నైట్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుందని అంటున్నారు. రణబీర్ కపూర్, తృప్తి దిమ్రీల జోడీ భవిష్యత్తులోనూ తెరపై చూడాలనుకుంటున్నట్లు పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఫిబ్రవరి 23, 1994న ఉత్తరాఖండ్‌లో జన్మించిన తృప్తి డిమ్రీ యానిమల్ చిత్రం కంటే ముందే చాలా సినిమాల్లో నటించింది. 'పోస్టర్ బాయ్స్ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 'కాలా', బుల్ బుల్ లాంటి చిత్రాలకు ప్రశంసలు అందుకుంది. తాజాగా రణబీర్ కపూర్ బ్లాక్ బస్టర్ యానిమల్‌లో చేసిన చిన్న పాత్రతో ఒక్కసారిగా ఫేట్ మారిపోయింది. The New National Crush 💘#TriptiDimri pic.twitter.com/J8je1gfKji — RANVIJAY 🦁 (@EddyTweetzBro) December 4, 2023 Loving their Chemistry. ❤️🔥 Ft. Fitoor Song#RanbirKapoor𓃵 #RanbirKapoor #TriptiDimri #AnimalTheFilm pic.twitter.com/89k6Ad8jtu — Ayan Sanger (@I_Ranbir_Fan) December 4, 2023 #TriptiDimri stole the show 🥵 pic.twitter.com/IEbv4ckVMz — Sia⋆ (@siappaa_) December 4, 2023