
రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన చిత్రం యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్ల చేరువలో కలెక్షన్స్ సాధించింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సూపర్ హిట్ డైరెక్టర్ టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్‌ను కూడా ప్రకటించారు సందీప్. దీంతో ఈ చిత్రంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఎవరు కనిపించనున్నారనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే యానిమల్ చిత్రంతో ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ భామ రెబల్ స్టార్‌తో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే యానిమల్ చిత్రం ద్వారా రష్మిక కంటే ఎక్కువగా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రికే పాపులారిటీ దక్కింది. రణ్‌బీర్ కపూర్‌తో ఫుల్ రొమాంటిక్ సన్నివేశాల్లో మెప్పించింది. అంతే రణ్‌బీర్‌తో కెమిస్ట్రీ అదుర్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. మరో నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రి అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
యానిమల్ చిత్రంలో జోయా పాత్రలో కనిపించిన త్రిప్తి డిమ్రిపైనే ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. ఆమె ఫర్ఫామెన్స్‌కు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో సందీప్ రెడ్డి భారీ బడ్జెట్ చిత్రంలో ఆఫర్ దక్కించుకుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన అంటే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్‌తో నటించే ఛాన్స్ కొట్టేసిందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే స్పిరిట్‌లో ఆమె పాత్రపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. హీరోయిన్‌గా లేదా యానిమల్ చిత్రంలానే అనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
కాగా.. దాదాపు రూ400 కోట్ల భారీ బడ్జెట్‌తో స్పిరిట్ తెరకెక్కించునున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ నెలలోనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన సలార్ రిలీజ్ కానుంది. డిసెంబర్ 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment