అట్లీతో సినిమా ఇప్పట్లో లేదు.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో | Salman Khan Comments On Director Atlee Movie, Is Atlee And Allu Arjun Movie Update Will Reveal Soon? | Sakshi
Sakshi News home page

అట్లీతో సినిమా ఇప్పట్లో లేదు.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో

Published Thu, Mar 27 2025 7:47 AM | Last Updated on Thu, Mar 27 2025 9:46 AM

Salman Khan Comments On Director Atlee Movie

హిందీలో షారుక్‌ ఖాన్‌తో ‘జవాన్‌’ తీసి, బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ ( Atlee Kumar). ‘జవాన్‌’ సినిమా బాక్సాఫీస్‌ వసూళ్లు రూ. వెయ్యి కోట్లకు పైగా దాటాయి. ఈ క్రమంలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న తదుపరి చిత్రం ఏంటి..? అనే చర్చలు చాలారోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్‌(Allu Arjun), సల్మాన్‌ ఖాన్‌లలో ఒకరితో ఆయన సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) కాంబినేషన్‌లోనే అట్లీ  సినిమా దాదాపు ఖరారైనట్లే అనే టాక్‌ బాలీవుడ్‌లో బలంగా వినిపించింది. ఈ సినిమాను దక్షిణాదిలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్‌ పిక్చర్స్‌ నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్‌ వైరల్‌ అయింది. అయితే, తాజాగా ఈ విషయంపై సల్మాన్‌ ఖాన్‌ క్లారిటీ ఇచ్చారు. అట్లీతో సినిమా ఇప్పట్లో ఉండదని ఆయన తేల్చేశారు.  ఇది భారీ బడ్జెట్‌ చిత్రం కావడంతోనే కాస్త వాయిదా వేస్తున్నట్లు సల్మాన్‌ ప్రకటించారు. అయితే, అట్లీతో సినిమా ఉంటుందని మాత్రం ఆయన చెప్పుకొచ్చారు.

బన్నీ- అట్లీ లైన్‌ క్లియర్‌
బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలతో అల్లు అర్జున్- అట్లీ మూవీ దాదాపు ఖరారైపోయిందని చెప్పవచ్చు. 'పుష్ప 2' తర్వాత లెక్క ప్రకారం త్రివిక్రమ్‌తో బన్నీ మూవీ చేయాలి. కానీ ఇది భారీ బడ్జెట్‌తో తీసే మైథలాజికల్ కావడంతో ప్రీ ప్రొడక్షన్‌కే చాలా సమయం పట్టే అవకాశముంది. దీంతో ఈ గ్యాప్‌లో మరో మూవీ చేయాలని బన్నీ అనుకున్నాడట. ఈ క్రమంలోనే అట్లీ లైనులోకి వచ్చాడు. ఈ ప్రాజెక్టుని బన్నీ పుట్టినరోజు అంటే ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
 

Sticky for cinema

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement