
పుష్ప2 విజయంతో అల్లు అర్జున్ ఇమేజ్ భారీగా పెరిగింది. ఈ సినిమా తర్వాత బన్నీ హీరోగా నటించనున్న కొత్త మూవీ ఏంటి..? అనే ప్రశ్నకు అధికారికంగా జవాబు లేదు. అయితే, ఈ ప్రాజెక్ట్ తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు అట్లీలతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఎవరితో ముందుగా మూవీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఈ విషయంలో సడెన్‌గా బన్నీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కాకుండా అట్లీతో సినిమా చేసేందుకు బన్నీ ఆసక్తిగా ఉన్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.

పుష్ప2 సమయంలోనే అల్లు అర్జున్‌కు అట్లీ కథ చెప్పాడట. అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాశారని తెలిసింది. ఆ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో సినిమా చేసేందుకు అట్లీ డీల్ సెట్ చేసుకున్నాడు.. ఆ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ కావడంతో అట్లీ టీమ్ కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్‌ను మరోసారి కలిసినట్లు టాక్ వస్తుంది. దీంతో అల్లు అర్జున్, అట్లీ సినిమా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అట్లీతో చేసే చిత్రం దాదాపు యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని నెట్టింట వైరల్ అవుతుంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

అల్లు అర్జున్‌తో ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ భారీ కాన్వాస్ ఉన్న వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు టాక్. శివుడి తనయుడైన కార్తికేయుడు యుద్ధ దేవుడిగా ఎలా మారాడు? తండ్రి అయిన శివుణ్ణి తిరిగి కలవడానికి కార్తికేయ బయలుదేరినప్పుడు అతని ప్రయాణం ఎలా సాగింది? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందట. సోషల్ మైథలాజికల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ కథని సిద్ధం చేస్తున్నారని టాక్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ నెలలోనే బన్నీ కొత్త సినిమా ప్రకటనపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

అట్లీతో సినిమా కోసం సాయి అభ్యంకర్ అనే కొత్త సంగీత దర్శకుడికి ఛాన్స్ ఇవ్వాలని ప్లాన్‌లో ఉన్నారట. స్టార్ సింగర్స్ టిప్పు, హరిణి దంపతుల కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి అభ్యంకర్.. తన టాలెంట్‌తో ప్రత్యేక గుర్తింపు పొందాడు. దర్శకుడు ఆర్జే బాలాజీ- సూర్య సినిమాకు అభయ్‌నే సంగీత దర్శకుడు కావడం విశేషం. హీరోయిన్ మీనాక్షి చౌదరితో ఆయన చేసిన ఒక సాంగ్ మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. లోకేశ్ కనగరాజ్ స్టోరీతో వస్తున్న బెంజ్ సినిమాకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు అల్లు అర్జున్ - అట్లీ మూవీలో ఛాన్స్ దక్కితే మరో కొత్త సంగీత దర్శకుడి పేరు సెన్సేషనల్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment