
పంజాబీ బ్యూటీ మీనాక్షీ చౌదరి బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పొచ్చు. ఈమె సినిమాలతో పాటు రీసెంట్‌గా వైద్య విద్యను పూర్తి చేశారు. అదే విధంగా సిమ్మింగ్, బాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. అంత కంటే పలు అందాల పోటీల్లో పాల్గొని రన్నర్‌గా నిలిచారు. చివరికి నటిగా స్థిరపడింది. తొలుత నటిగా బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసినా, ఆ తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అలా 2020లో ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే చిత్రంలో నటించి గుర్తింపు పొందారు. అయితే హిట్ ది సెకండ్ కేస్ చిత్రం ఈ బ్యూటీకి తొలి విజయానందాన్నిచ్చింది. అంతే కోలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చింది.
అక్కడ విజయ్ ఆంటోనితో కలిసి కొలై చిత్రంలో నటించారు. అది ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, విజయ్‌కి జంటగా గోట్ చిత్రంలో నటించి బాగా పాపులర్ అయ్యారు. దుల్కర్ సల్మాన్‌కు జంటగా లక్కీభాస్కర్ చిత్రంలో నటించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో సక్సెస్ బాటలో పయనిస్తున్నారు. తాజాగా ఈ అమ్మడి బాలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. ఇంతకు ముందు స్త్రీ, మిమీ తదితర హిట్ చిత్రాలను నిర్మించిన దినేశ్ విజయ్ తాజాగా నిర్మిస్తున్న చిత్రంలో మీనాక్షీ నాయకిగా నటించనున్నట్లు సమాచారం.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఇటీవల ఒక భేటీలో ఐపీఎల్ జట్లుల్లో మీకు నచ్చిన జట్టు ఏదని మీడియా అడిగిన ప్రశ్నకు తనకు ఐపీఎల్ జట్టులో ప్రత్యేకంగా నచ్చిన జట్లు అంటూ ఏమీ లేవన్నారు. అయితే ఎంఎస్.ధోని అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ఆయన ఏ జట్టులో ఉంటే ఆ జట్టే తనకు నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధోని అంటే ఇష్టం ఏర్పడిన తరువాతనే తాను క్రికెట్ క్రీడను చూడడం మొదలెట్టానని ఈ 33 ఏళ్ల సుందరి చెప్పుకొచ్చారు.