Atlee Kumar
-
కలర్ఫుల్గా మెరిసిపోతున్న డైరెక్టర్ అట్లీ సతీమణి ప్రియా (ఫోటోలు)
-
టైగర్‌తో జైలర్.. సెట్ చేస్తున్న టాప్ డైరెక్టర్
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేసేందుకు కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీ భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది షారుఖ్ ఖాన్‌తో జవాన్ తీసి హిట్ కొట్టిన ఆయనకు బాలీవుడ్లో కూడా క్రేజ్ పెరిగింది. అయితే, ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఒక సినిమా తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ, ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో అట్లీ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.జవాన్ సినిమా తర్వాత మళ్లీ బాలీవుడ్లోనే ఒక భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు అట్లీ. ఈమేరకు వార్తలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్‌తో ఓ మల్టీస్టారర్ చేసేందుకు కథను కూడా ఆయన ఫిక్స్ చేశారట. అయితే, ఈ సినిమాలో సౌత్ ఇండియా టాప్ హీరోను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కథలో కీలకంగా ఉండే ఆ పాత్ర కోసం రజనీకాంత్‌ను ఎంపిక చేస్తే బాగుంటుందని అట్లీ కోరుతున్నాడట. ప్రస్తుతం ఈ విషయం గురించి రజనీతో కూడా ఆయన చర్చలు జరిపినట్లు తెలిసింది. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను దృష్టిలో పెట్టుకొని అట్లీ కథను రెడీ చేశారట. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయట. వచ్చే ఏడాదిలో సినిమాని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ ‘సికందర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడు. రజనీకాంత్ నటించిన 'వేట్టయాన్' విడుదలకు సిద్ధంగా ఉంటే.. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రానున్న 'కూలీ' చిత్రీకరణ ప్రారంభించుకోవాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ల తర్వాత అట్లీ సినిమా ప్రారంభం అవుతుందని సమాచారం. -
లిప్‌లాక్ సీన్ కోసం కీర్తి సురేష్‌కు కండిషన్
ఇండియన్ సినిమా పాశ్చాత్య సంస్కృతికి మారి చాలా కాలమే అయ్యింది. అయితే దక్షిణాదిలో సంప్రదాయ విలువలు కొనసాగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఇక్కడా వాటికీ కట్టలు తెంచుకుంటున్నాయి. ముఖ్యంగా లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి మన కథానాయకలు సంకోచించే వారు. అయితే ఇప్పుడు అలాంటి సన్నివేశాలు పుంకాను పుంకాలుగా చూస్తున్నాం. అదేమంటే అలా నటించడంలో తప్పేంటి అనే ప్రశ్న ఎదురవుతోంది. కాగా నటి కీర్తి సురేష్ విషయానికి వస్తే ఈమె తమిళంలో గానీ, తెలుగులో గానీ పరిమితులు దాటని పాత్రల్లో నటిస్తూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను తెచ్చుకున్నారు. ఇక మహానటి చిత్రంలో అయితే సంసృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నటించి ప్రశంసలు అందుకున్నారు.ఆ తరువాత గ్లామర్ పాత్రల్లో నటించినా హద్దులు దాటలేదు. అలాంటిది ఎప్పుడైతే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారో అప్పుడే పాశ్చాత్య సంసృతికి మారిపోయారని సమాచారం. ప్రస్తుతం ఈమె బేబీజాన్ అనే చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. వరుణ్ దావన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో లిప్‌లాక్ సన్నివేశంలో నటించాలని ముందుగానే కండిషన్ పెట్టారట. బాలీవుడ్లో రాణించాలంటే అలాంటి సన్నివేశాల్లో నటించడం తప్పదని భావించిన కీర్తి సురేష్ బేబీజాన్ చిత్ర దర్శక నిర్మాతలకు ఓకే చెప్పారట. అలా ఆమె ఆ చిత్రంలో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించారని తాజా సమాచారం. ఆ సన్నివేశాలు ఎంత కిక్ ఇస్తాయో చిత్రం విడుదలైన తరువాత తెలుస్తుంది. కాగా మరో విషయం ఏమిటంటే ఈమె ఇంతకు ముందు కోట్ల రూపాయలు ఇచ్చినా లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ విషయాన్ని ఇప్పుడు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల కీర్తి సురేష్ తరచూ వార్తల్లో ఉంటున్నారు. తాజాగా తను తలకిందులుగా వర్కౌట్స్ చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
అట్లీ నిర్మాతగా స్టార్ హీరోతో సినిమా ప్లాన్
భారతీయ సినీ పరిశ్రమలో మారుమోగుతున్న పేరు అట్లీ. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యువ దర్శకుడు నిర్మాతగానూ సక్సెస్‌పుల్ చిత్రాలను చేస్తున్నారు. రాజారాణీ చిత్రంతో తన దర్శక పయనాన్ని సక్సెస్‌పుల్‌గా మొదలుపెట్టిన అట్లీ ఆ తరువాత విజయ్ హీరోగా మెర్సిల్, తెరి, బిగిల్ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇక ఇటీవల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి షారూఖ్‌ఖాన్ 'జవాన్' సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టారు. నయనతార, దీపికాపడుకొనే హీరోయిన్లుగా నటించిన ఇందులో విజయ్‌సేతుపతి విలన్‌గా అదరగొట్టారు. ఈ చిత్రం రూ.వెయ్యి కోట్లు వసూలు చేసింది. కాగా ప్రస్తుతం దర్శకుడు అట్లీ టాలీవుడ్‌పై దృష్టి సారించారు. స్టార్ హీరో అల్లుఅర్జున్ హీరోగా పాన్ ఇండియా చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. ఇందులో నటి త్రిష ఒక నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జోరందుకుంది. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుందని, గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అల్లు అర్జున్ పుట్టిన రోజు అయిన ఈ నెల 8వ తేదీన వెల్లడించనున్నట్లు తాజా సమాచారం. కాగా దర్శకుడు అట్లీ ఏ ఫర్ యాపిల్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి, ఇంతకు ముందు నటుడు జీవా హీరోగా సంగిలి బుంగిలి కదవ తొర అనే విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. తాజాగా తన శిష్యుడు కలీస్‌కు దర్శకత్వం అవకాశం కల్పించి, హిందీలో బేబీజాన్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది తమిళ చిత్రం తెరి కి రీమేక్ అన్నది గమనార్హం. ఇందులో వరుణ్ దావన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నటి కీర్తీసురేష్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. కాగా తాజాగా తమిళంలో మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో నటుడు విజయ్‌సేతుపతి హీరోగా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి అట్లీ డైరెక్టర్ కాదట.. నిర్మాతగా మాత్రమే ఉండనున్నారట. దీనికి 'నడువుల కొంచెం కానోమ్' చిత్రం ఫేమ్ బాలాజీ ధరణీధరన్ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. కాగా దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. -
అల్లు అర్జున్ బర్త్‌డే నాడు సూపర్ హిట్ సినిమా రీ-రిలీజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8 కోసం ఆయన అభిమానులతో పాటు సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆరోజే ఆయన కొత్త చిత్రం 'పుష్ప 2' టీజర్ విడుదల కానుంది. ఈమేరకు ఇప్పటికే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. బన్నీ పుట్టినరోజున మరో కానుక కూడా ఉంది. తన కెరియర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన 'జులాయి' మళ్లీ మీ ముందుకు రానుంది. అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ బాణీల్లో రూపొందిన పాటలు కూడా భలేగా అలరించాయి. ఈ సినిమా వచ్చి ఇప్పటికి 12 ఏళ్లు దాటింది. అయినా కూడా పాటలు, మాటలతో మెప్పించిన ‘జులాయి’ని ఇప్పుడు చూసినా మంచి కిక్ ఇస్తుంది. అందుకే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న కొన్ని థియేటర్లలో మాత్రమే బన్నీ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 8న బన్నీ నుంచి మరో కానుక వచ్చే అవకాశం ఉంది. స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా ప్రకటన కూడా రానుందని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏప్రిల్ 8న రావచ్చిన తెలుస్తోంది. తాజాగా అట్లీ భార్య ప్రియా సైతం 'ఏ6' కథా చర్చలు అంటూ ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. -
ఆ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి నాకు ద్రోహం చేశారు: నటి
కోలీవుడ్‌లో ప్రముఖ డైరెక్టర్ అట్లీ బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కిస్తూ కోలీవుడ్‌లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. 'జవాన్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అట్లీకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. షారుక్ ఖాన్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం సుమారు రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటింది. రాజా రాణి సినిమాతో ఆయన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆర్య, నయనతార, నజ్రియా, జై తదితరులతో తెరెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అట్లీ మేకింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఆయనకు వెంటనే హీరో విజయ్‌తో 'తెరి' సినిమా ఛాన్స్ దక్కింది. అది కూడా హిట్ కొట్టడంతో ఆయనతో వరుసగా మెర్సిల్, బిగిల్ వంటి చిత్రాలను తెరకెక్కించే ఛాన్స్ దక్కింది. ఆపై ఆయనకు జవాన్‌తో బాలీవుడ్లో కూడా అవకాశం దక్కింది. తాజాగా అట్లీ డైరెక్ట్ చేసిన 'రాజా రాణి' చిత్రం గురించి హీరోయిన్ సాక్షి అగర్వాల్ వైరల్ కామెంట్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ' నేను బెంగుళూరులో ఉన్నప్పుడు రాజా రాణి సినిమా చేసే అవకాశం నాకు వచ్చింది. నేను అప్పుడు మోడలింగ్ చేస్తున్నాను. ఆ చిత్రానికి సంబంధించిన యూనిట్ నా కాస్టింగ్ ఏజెన్సీని సంప్రదించి రాజా రాణిలో నటించడం గురించి మాట్లాడారు. ఆ సినిమాలో ఆర్య హీరో అని కూడా చెప్పారు. ఆపై నువ్వు సెకండ్ హీరోయిన్ అని నాకు తెలిపారు. వారు చెప్పింది విని నేను కూడా నిజమని నమ్మాను. దీంతో వెంటనే ఓకే చెప్పాను. ఆ సమయంలో నాతో కొన్ని సీన్లు కూడా తీశారు. తర్వాత ఏమైందో తెలీయదు కానీ ఆ చిత్ర యూనిట్ నుంచి నాకు కాల్స్ రావడం ఆగిపోయాయి. కొద్దిరోజుల తర్వాత రాజా రాణి సినిమా విడుదలైంది. అవకాశం ఇచ్చినట్లే ఇచ్చే కొన్ని సీన్లకే నన్ను పరిమితం చేశారని తర్వాత అర్ధమయింది. అవి కూడా ఒక రెస్టారెంట్లో కాఫీ ఆర్డర్ చేసే పాత్రలో చూపించారు. నువ్వే సెకండ్ హీరోయిన్ అని చెప్పి చాలా చిన్న పాత్ర ఇచ్చారు. అందుకు కారణాలు ఎంటో నాకు ఇప్పటికీ తెలియదు. అదే సమయంలో దీని గురించి నేను దర్శకుడు అట్లీతో మాట్లాడి ఉండుంటే బాగుండేది. ఆయనతో మాట్లాడకపోవడం నా తప్పు అయింది. హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని చెప్పి వారు నాకు పెద్ద ద్రోహమే చేశారు. అని ఆమె తెలిపింది. మోడల్ అయిన సాక్షి అగర్వాల్‌కి తమిళంలో సరైన అవకాశాలు రాలేదు. ఆమె కొన్ని చిత్రాలలో కనిపించింది. కాలాలో రజనీకాంత్ కోడలుగా ఆమె మెప్పించింది. ఆపై బిగ్ బాస్‌లో కూడా పాల్గొని మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం కొన్ని కమర్షియల్ చిత్రాల్లో నటిస్తుండటం గమనార్హం. -
కమల్ హాసన్‌ను కలిసిన అట్లీ.. భారీ ప్రాజెక్ట్‌పై రివీల్
నాలుగవ చిత్రంతోనే పాన్ ఇండియా దర్శకుడు అయిపోయారు అట్లీ. దర్శకుడు శంకర్ శిష్యుడైన ఈయన రాజారాణి చిత్రంతో దర్శకుడిగా అవతారం ఎత్తారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత విజయ్ కథానాయకుడిగా మెర్సల్, బిగిల్ చిత్రాలు చేసి సూపర్ హిట్ కొట్టారు. ఇక నాలుగో చిత్రంతోనే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి బాద్షా షారుక్ ఖాన్ కథానాయకుడిగా జవాన్ చిత్రాన్ని తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఐదవ చిత్రం ఏంటన్నదాని గురించే చర్చ జరుగుతోంది. ఈయనతో చిత్రాల చేయడానికి కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు క్యూలో ఉన్నారని చెప్పవచ్చు. జవాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత షారుక్ ఖాన్ మళ్లీ అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అన్నారు. నటుడు విజయ్ కూడా షారుక్ ఖాన్ తో కలిసి నటించడానికి రెడీ అన్నారు. దీంతో వీరిద్దరిని కలిపి చిత్రం చేయడానికి కథను రెడీ చేస్తున్నట్లు అట్లీ ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. అలాంటిది అనూహ్యంగా ఈయన లోకనాయకుడు కమలహాసన్ కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నటుడు కమలహాసన్‌కు అట్లీ కథ చెప్పినట్లు ఆయన చాలా ఇంప్రెస్స్ అయినట్లు సమాచారం. అంతేకాకుండా కమలహాసన్ పారితోషికం తదితర విషయాలు గురించి చర్చ జరిగినట్లు, త్వరలోనే అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. కాగా షారుక్ ఖాన్, విజయ్ కలిసి నటించిన చిత్రంలో కమలహాసన్ నటించనున్నారా? లేక అట్లీ దర్శకత్వంలో హాలీవుడ్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో కమలహాసన్ నటించనున్నారా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే కాగా కమలహాసన్ ప్రస్తుతం బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో లో హోస్ట్ గా వ్యవహరిస్తూనే మరోపక్క చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇండియన్ 2 చిత్రాన్ని కంప్లీట్ చేసిన కమల్ ఇండియన్ –3 చిత్రానికి సిద్ధమవుతున్నారు. తెలుగులో నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి 2898ఏడీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఈయన ప్రతి నాయకుడిగా పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నట్లు టాక్ స్వెడ్ అయింది. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో అమితాబచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తన 233 చిత్రంలో, మణిరత్నం దర్శకత్వంలో తన 234వ చిత్రంలోనూ నటించడానికి సిద్ధమవుతున్నారు. కాగా అట్లీ దర్శకత్వంలో నటించే విషయం నిజమైతే అది కమలహాసన్ 235వ చిత్రం అవుతుంది. -
ఈ టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఎందుకు ఇంతలా కష్టపడుతుందంటే
నటి కీర్తి సురేష్ మహానటి చిత్రంతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఆ మధ్య వరుస ప్లాప్‌లతో కెరీర్ పరంగా కొంచెం తడబడినా, ఆ తర్వాత తెలుగులో నానితో జతకట్టిన దసరా, తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన నటించిన మామన్నన్ చిత్రాలతో విజయాల బాట పట్టింది. కాగా ప్రస్తుతం తమిళంలోనే నాలుగైదు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. అందులో రఘు తాత, రివాల్వర్ రీటా వంటి హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలతో పాటు జయం రవి సరసన నటిస్తున్న సైరన్ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కీర్తి సురేష్‌కు మరోసారి బాలీవుడ్ అవకాశం పలకరించింది. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) ఈమె ఇంతకుముందే హిందీ చిత్రంలో నటించాల్సి ఉంది. అజయ్ దేవగన్ కథానాయకుడిగా నటిస్తున్న మైదాన్ చిత్రంలో కీర్తి సురేష్‌నే మొదట హీరోయిన్గా ఎంపికైంది. ఆ చిత్రం కోసం బాగా వర్క్ అవుట్ లు కూడా చేసింది. అదే ఆమె ఆ చిత్రాన్ని కోల్పోవడానికి కారణమైంది. కీర్తి సురేష్ సన్నబడటంతో చిత్ర దర్శక నిర్మాతలు ఆమెను మైదాన్ చిత్రం నుంచి తొలగించారని ప్రచారం జరిగింది. కాగా తాజాగా మరో బాలీవుడ్ చిత్రం ఈ బ్యూటీని వరించింది. తమిళంలో విజయ్ కథానాయకుడిగా, సమంత, ఎమీ జాక్సన్ నాయకిలుగా అట్లీ దర్శకత్వం వహించిన చిత్రం తెరి. ఇది మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రంతో దర్శకుడు అట్లీ హిందీలో నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. ఈయన ఇప్పటికే దర్శకుడుగా షారుక్ ఖాన్, నయనతార, దీపికా పడుకొనే వంటి తారలతో జవాన్ చిత్రానికి దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు నిర్మాతగా ఎంట్రీ ఇస్తూ బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా తెరి చిత్రాన్ని, నటి కీర్తి సురేష్ బాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారు. తెరి తమిళ్ వెర్షన్లో సమంత నటించిన పాత్రను హిందీలలో కీర్తి సురేష్ పోషించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో మరింత ఫిట్నెస్గా కనిపించడానికి కీర్తి సురేష్ ఇప్పుడు తీవ్రంగా వర్కౌట్స్ చేస్తున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
ఆమెతో ప్రేమ-పెళ్లి.. 'జవాన్' డైరెక్టర్‌పై అలాంటి కామెంట్స్!
బాద్షా షారుక్ ఖాన్ లాంటి హీరోతో సినిమా చేయడమే గొప్ప. అలాంటిది తమిళం నుంచి బాలీవుడ్‌కి వెళ్లి మరీ దర్శకుడు అట్లీ 'జవాన్' తీశాడు. అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ రూ.1000 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించడం విశేషం. ఇప్పుడు అందరూ తెగ పొగిడేస్తున్న డైరెక్టర్ అట్లీ.. గతంలో తన రంగు విషయమై చాలా ట్రోల్స్ అనుభవించాడు. ఆ హీరోతో సినిమా వల్ల స్టార్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. 'రోబో', 'స్నేహితుడు' సినిమాలకు ఆయన దగ్గర పనిచేశాడు. 'రాజా రాణి' మూవీతో దర్శకుడు అయిపోయాడు. తమిళ, తెలుగులో ఈ మూవీ సూపర్‌హిట్ అయింది. దీని తర్వాత విజయ్‌తో తెరి (పోలీసోడు) అనే సినిమా తీశాడు. విజయ్ అంటే పడని కొందరు అట్లీని విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి చార్లీ!) కలర్ కామెంట్స్ అయితే 'తెరి' సినిమా చేస్తున్న సమయంలోనే నటి కృష్ణప్రియతో అట్లీకి పెళ్లయింది. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు కుటుంబం ఆమెది. సీరియల్స్‌లో హీరోయిన్గా నటిస్తూ పేరు తెచ్చుకున్న ఈమె.. సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే అట్లీకి పరిచయమైంది. అలా ఐదేళ్ల పాటు సాగిన వీళ్ల బంధం చివరకు పెళ్లి వరకు వెళ్లింది. అయితే పెద్దల్ని ఒప్పించి వీళ్లు పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుక తర్వాత సోషల్ మీడియాలో వీళ్ల ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో విజయ్ తో సినిమా చేస్తున్నాడని పడని కొందరు.. అట్లీ కలర్‌ని ఉద్దేశిస్తూ.. కృష్ణప్రియతో ఉన్న ఫొటోలపై కామెంట్స్ చేశారు. 'కాకి ముక్కుకు దొండపండు' అని ఎగతాళి చేశారు. మొన్న 'జవాన్' రిలీజ్ టైంలోనే ఈ తరహా విమర్శలు వచ్చాయి. కానీ వాటిని పెద్దగా మనసులో పెట్టుకోని అట్లీ.. నవ్వుతూ ముందుగు సాగిపోతున్నాడు. (ఇదీ చదవండి: నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నా: కమల్ హాసన్) -
ఒక్క సినిమాతో ఆ రేటింగ్స్‌నే మార్చేసిన నయనతార
సౌత్ ఇండియాలో తన అభినయం, అందంతో అభిమానులను సొంతం చేసుకున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార బాలీవుడ్ మూవీ జవాన్‌లో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌తో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాకు డైరెక్షన్ చేశాడు. గతంలో సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందిన నయనతార ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్‌ను వెనక్కి నెట్టి సోషల్ మీడియా ఫేమ్‌లో అగ్రస్థానానికి ఎగబాకింది. IMDb నివేదిక ప్రకారం ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో నయనతార నం.1 స్థానంలో ఉంది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ సోషల్ మీడియాలో అత్యధికంగా శోధించిన, ట్రెండింగ్ సినిమాలను గుర్తించడం ద్వారా ఈ రేటింగ్ ఇస్తుంది. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' దెబ్బతో రూట్ మార్చిన మెహర్ రమేష్) ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాను ఈ ఏడాది ప్రారంభం నుంచి IMDb విడుదల చేస్తుంది. వారానికోసారి విడుదలయ్యే ఈ జాబితాను ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా అభిమానులు శోధించారు. గ్లోబల్ ఇండియన్ సెలబ్రిటీ అభిమానులు కింగ్ ఖాన్ కంటే నయనతారపై ఎక్కువ ఆసక్తి చూపారు. IMDb షేర్ చేసిన తాజా జాబితాలో, జవాన్ సూపర్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ కంటే నయనతార ముందుంది. గత వారం జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, నయనతార 3వ స్థానంలో నిలిచింది. తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార IMDb ప్రముఖ భారతీయ ప్రముఖుల జాబితాలో ఎక్కువ మంది సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. నయనతార అగ్రస్థానంలో ఉండగా, కింగ్‌ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. జవాన్ దర్శకుడు అట్లీ కుమార్ గత వారం పదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకాడు. విష్నేష్ శివన్ రియాక్షన్ IMDb యొక్క ప్రముఖ భారతీయ ప్రముఖుల జాబితాలో నయనతార అగ్రస్థానంలో ఉండటంపై విఘ్నేష్ శివన్ స్పందించారు. నయనతార భర్త, చిత్రనిర్మాత విఘ్నేష్ శివన్ తన భార్య సాధించిన విజయాల గురించి తరచుగా ప్రశంసిస్తుంటారు. తాజాగా విఘ్నేష్ తన 'తంగమాయె' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొనియాడాడు. విఘ్నేష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'ప్రౌడ్ ఆఫ్ యు తంగమయ్య' అని రాసి తన భార్యను ట్యాగ్ చేశాడు. (ఇదీ చదవండి: సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మాతగా బిగ్‌బాస్ బ్యూటీ) -
కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్' రికార్డ్.. కోట్లు కొల్లగొట్టిన షారుక్
• నాలుగు రోజుల్లో 'జవాన్'కు రూ. 500 కోట్లు • ఆదివారం ఒక్కరోజే 28 లక్షలకు పైగా టికెట్లు • షారుక్ తర్వాతి సినిమా ఇదే ఈ ఏడాదిలో పఠాన్', జవాన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ వరుస భారీ బ్లాక్ బస్టర్లను బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అందుకున్నాడు. కొంతకాలం క్రితం బాలీవుడ్లో సరైన భారీ హిట్ సినిమాలు లేవు.. ఏ సినిమా వచ్చినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ సతమతమవుతున్న సమయంలో సౌత్ ఇండస్ట్రీ మాత్రం వరసు పాన్ ఇండియా సక్సెస్‌లను అందుకుంటూ బాలీవుడ్లో వందల కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది. సరిగ్గా అలాంటి సమయంలో ఐదేళ్ల పాటు గ్యాప్ ఇచ్చి పఠాన్‌తో వచ్చిన షారుక్ అక్కడి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఆ సినిమాతో ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లను సాధించి హిందీ పరిశ్రమకు పునఃవైభవాన్ని తీసుకొచ్చాడు. (ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి) దీంతో బాలీవుడ్ బాద్ షా తాను మాత్రమేనని నిరూపించాడు. ఇప్పుడు మళ్లీ ఏడు నెలల గ్యాప్‌లోనే సెప్టెంబర్ 7న జవాన్‌గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. కేవలం నాలుగు రోజుల్లోనే జవాన్ చిత్రం రూ. 500 కోట్లు కలెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. కొంత సమయంలో అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రూ. 500 కోట్ల క్లబ్లో చేరడంతో షారుక్ రికార్డుకెక్కాడు. కేవలం ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగగా జవాన్ సినిమా టికెట్లు 28 లక్షలు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదీ ఎవరూ అందుకోలేని రికార్డు అంటూ పలువురు తెలుపుతున్నారు. దీంతో లాంగ్ రన్ టైమ్‌లో జవాన్ రూ.1000 కోట్ల మార్క్‌ను పక్కాగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక షారుక్ చేతిలో మరో సినిమా మాత్రమే మిగిలి ఉంది. అదే 'డంకీ'. ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధిస్తే. షారుక్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నట్టే. Jawan creates HISTORY. Sold a RECORD 2⃣8⃣7⃣5⃣9⃣6⃣1⃣ tickets from tracked shows alone in India on the 4th day. Biggest ever for a bollywood film. ||#ShahRukhKhan|#Nayanthara|#Jawan|| Worldwide hits ₹500 cr gross club, making Shah Rukh Khan the only actor to achieve this feat… pic.twitter.com/CHeMFO7wmS — Manobala Vijayabalan (@ManobalaV) September 11, 2023 -
'జవాన్' సినిమాను నిలబెట్టిన ఈ ఆరుగురు.. ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఇవే
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయన్‌తార లీడ్ రోల్స్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. మొదటిరోజే భారత్‌లో రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల మార్క్‌ను దాటింది. 'జైలర్' సినిమాకు అనిరుధ్ బీజీఎం ఎంతగానో తోడ్పడింది. అలాగే జవాన్ సినిమాకు భారీ యాక్షన్ సీన్స్ ఊపిరి పోశాయి. ఇవే ఈ చిత్రానికి ప్రధానమైన బలం అని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: మరొకరితో భారత క్రికెటర్ భార్య.. లిప్‌లాక్ వీడియో వైరల్) ఇందులో ప్రతి యాక్షన్ సీన్ కూడా ప్రేక్షకుల చేత విజిల్స్ వేపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. జవాన్‌లో చిత్రంలో ఆస్పత్రి వద్ద జరిగే యాక్షన్ సీన్‌తో పాటు డబ్బును కంటైనర్‌లో తరలించే సమయంలో వచ్చే ఫైట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో ఊపిరి బిగపట్టించే కారు ఛేజ్‌లు, గగుర్పొడిచే బైక్ స్టంట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటంన్నిటి వెనుక ఆరుగురి శ్రమ ఉంది. అంతర్జాతీయంగా పేరున్న స్పిరో రజాటోస్, క్రెయిగ్ మాక్రే, యానిక్ బెన్, కిచా కఫడ్గీ, సునీల్ రోడ్రిగ్స్, అనల్ అరసు.. అనే ఆరుగురు స్టంట్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఆయా సీన్లను షూట్ చేశారు. (ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్) మాములుగా ఇండియాన్ సినిమాలకు ఒకరిద్దరు మాత్రమే యాక్షన్ సీన్లు కొరియోగ్రఫి చేస్తుంటారు. కానీ తొలిసారి జవాన్ సినిమాకు ఏకంగా ఆరగురు యాక్షన్ కొరియోగ్రఫర్స్ పనిచేశారు. అందుకే ఆ సీన్లన్నీ ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. ► ఫైట్ మాస్టర్ 'స్పిరో రజాటోస్' హాలీవుడ్ సినిమాల్లో ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస', కెప్టెన్ అమెరికా,' టీనేజ్ మ్యూటాంట్ నింజా తాబేళ్లు, మరియు మరిన్నింటికి ప్రసిద్ధి చెందాడు, ► యాక్షన్ సీన్స్‌లలో ఎంతో అనుభవజ్ఞుడైన పార్కర్ ట్యూటర్‌గా గుర్తింపు పొందిన 'యానిక్ బెన్' హాలీవుడ్ అంతటా పలు చిత్రాలతో పాటుగా తెలుగు, హిందీ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశాడు. షారుక్ రయీస్, టైగర్ జిందా హై, మహేశ్ బాబు నేనొక్కడినే, ట్రాన్స్పోర్టర్ 3, డన్కిర్క్ వంటి చిత్రాలకు ఫైట్ మాస్టర్‌గా పనిచేశాడు. ► 'క్రెయిగ్ మాక్రే' కూడా పలు హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశాడు. మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్, అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ సినిమాలకు మంచి గుర్తింపు దక్కింది. ► 'కిచా కఫడ్గీ' ఒక ఆంగ్ల స్టంట్ దర్శకుడు, అతను కన్నడ, మలయాళం, హిందీ, తమిళం, ఇంగ్లీష్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా సినిమాలకు పనిచేశాడు. తుపాకి, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, బాఘీ 2' వంటి బ్లాక్బస్టర్లలో తన యాక్షన్‌కు పేరుగాంచాడు. ► 'సునీల్ రోడ్రిగ్స్' యాక్షన్ సన్నివేశాలలో ఆయన కొత్తగా సృష్టించగలడు. సాంకేతిక రూపకల్పనతో పాటుగా దర్శకత్వం, నిర్మాణంలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. అతను షేర్షా, సూర్యవంశీ, పఠాన్ వంటి సూపర్హిట్లలో కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించాడు. ► 'అనల్ అరసు' ఒక భారతీయ ఫైట్ మాస్టర్/యాక్షన్ కొరియోగ్రాఫర్, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమలలో పని చేస్తున్నారు. కొన్ని హాలీవుడ్ వెబ్‌సీరిస్‌లకు కూడా ఆయన పనిచేశాడు. అతను సుల్తాన్, కత్తి,కిక్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు ప్రసిద్ధి చెందాడు. -
బంగ్లాదేశ్‌లో 'జవాన్' నిషేధం.. ఎందుకో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా 10 వేలకు పైగా స్క్రీన్లలో విడుదలైన షారుక్ ఖాన్ చిత్రం 'జవాన్' మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. సౌత్ డైరెక్టర్ అట్లీతో కలిసి షారుఖ్ ఖాన్ భారతీయ సినిమా మార్కెట్లో వసూళ్ల రికార్డును సృష్టించాడు. అదే సమయంలో షారుక్ ఖాన్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన షారుఖ్ ఖాన్ సినిమా 'జవాన్' పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో షెడ్యూల్ ప్రకారం విడుదల కాలేదు. గతంలో షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ కూడా అదే రోజు బంగ్లాదేశ్‌లో విడుదల కాలేదు. తాజాగా జవాన్ సినిమా కూడా బంగ్లాదేశ్‌లో విడుదల కాకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. బంగ్లాదేశ్‌లో జవాన్‌ను ఎందుకు విడుదల చేయలేదు.. విశేషమేమిటంటే, బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం అంతర్యుద్ధం లాంటి పరిస్థితిలో నెలకొని ఉన్నాయి. వచ్చే ఏడాది 2024లో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి ప్రజలు పలు చోట్ల ప్రభుత్వం పట్ల నిరసనలు వంటివి చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ, సామాజిక పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. కొన్ని చోట్ల కర్ఫ్యూ వాతావారణం నెలకొని ఉంది. దీంతో అక్కడ జవాన్ విడుదలను బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డ్ నిషేధించబడింది. దీంతో అక్కడ ఆయన ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఇప్పట్లో బంగ్లాదేశ్‌లో షారుఖ్ ఖాన్ సినిమా జవాన్‌కి థియేటర్లు ఎప్పుడు లభిస్తాయో చెప్పడం కష్టం. జవాన్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఓపెనింగ్ రోజున రచ్చ సృష్టించాడు. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే రూ. 125 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ముందు పఠాన్ రూ.55 కోట్లు, కేజీఎఫ్ చాప్టర్ 2 రూ. 54 కోట్లు,బాహుబలి రూ. 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా జవాన్ ఏకంగా మొదటి రోజు రూ. 75 కోట్లు రాబట్టి ఇండియన్ కలెక్షన్ కింగ్ షారుక్ ఖాన్ అని నిరూపించాడు. (ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్) -
మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్
గత నాలుగేళ్లుగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ 2023 సంవత్సరంలో తన సత్తా చాటుతున్నాడు. ఇదే ఏడాది ప్రారంభంలో విడుదలైన షారుఖ్ ఖాన్ చిత్రం 'పఠాన్' ఏకంగా రూ. 1000 కోట్లను కొల్లగొట్టింది. పఠాన్ తొలిరోజున భారత్‌లో రూ. 55 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు 'జవాన్'తో మరోసారి బాలీవుడ్ సింహాసనం తనదేనని 57 ఏళ్ల బాద్ షా నిరూపించాడు. సెప్టెంబర్ 7న విడుదలైన జవాన్ సినిమా తొలిరోజే సూపర్ హిట్ టాక్ రావడంతో షారుక్ తన విజయపతాకాన్ని ఎగురవేశాడు. ఈ సినిమా తొలిరోజే భారీ వసూళ్లను రాబడుతోంది. (ఇదీ చదవండి: Jawan Review: 'జవాన్' మూవీ రివ్యూ) జవాన్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఓపెనింగ్ రోజున రచ్చ సృష్టించాడు. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే రూ. 125 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ముందు పఠాన్ రూ.55 కోట్లు, కేజీఎఫ్ చాప్టర్ 2 రూ. 54 కోట్లు,బాహుబలి రూ. 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా జవాన్ ఏకంగా మొదటి రోజు రూ. 75 కోట్లు రాబట్టి ఇండియన్ కలెక్షన్ కింగ్ షారుక్ ఖాన్ అని నిరూపించాడు. షారుక్ ఖాన్ గత 5 సినిమాల మొదటిరోజు కలెక్షన్స్ ► 2016లో విడుదలైన 'ఫ్యాన్' సినిమాతో షారుఖ్ ఖాన్ రికార్డు క్రియేట్ చేశాడు. అప్పటికి వరుస ఫ్లాప్‌లతో ఉన్న ఆయనకు ఈ సినిమా భారీ విజయాన్ని ఇచ్చింది. ఈ చిత్రం తొలిరోజు రూ.19.10 కోట్లు వసూలు చేసింది. ► ఆ తర్వాతి సంవత్సరం 2017లో షారుఖ్ ఖాన్, పాకిస్థానీ నటి మహిరా ఖాన్ జంటగా నటించిన చిత్రం రయీస్.. షారుఖ్ ఖాన్‌కు అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా కలెక్ట్ చేయలేదు. ఈ సినిమా తొలిరోజే 20.40 కోట్లు రాబట్టింది. ► 2017లో 'జబ్ హ్యారీ మెట్ సెజల్' సినిమాతో షారుక్ ఖాన్, ఇంతియాజ్ అలీతో పని చేయడం ఇదే మొదటిసారి. 2017లో విడుదలైన ఈ సినిమా షారుఖ్, అనుష్కల 'రబ్ నే బనాదీ'ల హిట్ పెయిరింగ్ ఈ చిత్రంలో కనిపించింది. అయితే ఈ సినిమా తొలిరోజు మొత్తం 15.25 కోట్లు మాత్రమే రాబట్టింది. ► 2018 సంవత్సరంలో విడుదలైన 'జీరో' చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత, బాలీవుడ్లో షారుక్ ఖాన్ కెరీర్ ముగిసిందని భావించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. దీంతో షారుక్ ఖాన్ ఇంటికే పరిమితం అయ్యాడు. జీరో సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కేవలం 19.35 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ► షారుఖ్ ఖాన్ తన 30 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్లో 'జీరో' చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత ఇండస్ట్రీలో ఇదే చివరి సినిమాగా అని అందరూ భావించారు. 2018 నుంచి సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో 'పఠాన్'ని అభిమానులకు అందించాడు. ఈ సినిమా భారత్‌లో మొదటిరోజు ఏకంగా రూ. 55 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. దీంతో షారుఖ్ ఖాన్ స్టార్డమ్ ఏంటో ఇండస్ట్రీకి తెలిసింది. బాలీవుడ్లో అతనికి ఇంకా స్థానం ఉందని షారుక్ అప్పుడే అనుకున్నాడు. షారుక్ ఖాన్ కెరీర్లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం పఠాన్. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం జవాన్ కూడా రూ. 1000 కోట్లను సులభంగా దాటడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
'జవాన్' మూవీ రివ్యూ
టైటిల్: జవాన్ నటీనటులు: షారుక్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, మాన్య మల్హౌత్ర, దీపికా పదుకోన్, సంజయ్ దత్ నిర్మాణ సంస్థ: రెడ్ చిల్లీస్ నిర్మాతలు: గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ దర్శకత్వం: అట్లీ కుమార్ సంగీతం: అనిరుధ్ సినిమాటోగ్రఫీ: జీ.కే. విష్ణు విడుదల తేది: సెప్టెంబర్ 7, 2023 బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్- నయనతార నటించిన చిత్రం జవాన్. సౌత్ ఇండియా పాపులర్ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 7) విడుదల అయింది. బాలీవుడ్లో కొన్నేళ్లుగా బాద్ షాగా అలరిస్తున్నాడు కింగ్ ఖాన్ షారుక్ . తన డ్యాన్స్, యాక్టింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించాడు. పఠాన్‌కు ముందు సుమారు రెండేళ్ల పాటు బాలీవుడ్లో సరైన హిట్ లేకపోవడంతో అక్కడ సౌత్ సినిమాల హవా కొనసాగింది. అలాంటి సమయంలో పఠాన్ విడుదల కావడం. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసి బాలీవుడ్ కింగ్ అనిపించుకున్నాడు. అలా పఠాన్ సినిమాతో బాలీవుడ్‌కు మళ్లీ పూర్వ వైభవం తెచ్చిన షారుక్.. తాజాగా 'జవాన్'తో మరోసారి తన సత్తా చాటేందకు రెడీ అయ్యాడు. నయనతార, డైరెక్టర్ అట్లీ ఈ సినిమాతో హిట్ కొట్టి బాలీవుడ్లో తమ సత్తా నిరూపించుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్లో విడుదుల అయిన జవాన్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. ‘జవాన్’ కథేంటంటే.. కథ ప్రారంభంలో నీటి ప్రవాహంలో పూర్తి గాయాలతో షారుక్ ఖాన్ (విక్రమ్ రాథోడ్) కొట్టుకొని వస్తాడు. అటవీ ప్రాంతానికి చెందిన కొందరు ఆయన్ను గుర్తించి చికిత్స అందిస్తారు. కొద్దిరోజుల తర్వాత అదే గ్రామస్తులపై కొందరు దుండగులు దాడులు చేసేందుకు వస్తారు. నిస్సాహయ స్థితిలో ఉన్న వారిని షారుక్ రక్షిస్తాడు.. అలా కథ ముందుకు వెళ్తున్న సమయంలో ముంబై నగరంలో ఒక మెట్రోను షారుక్ ఖాన్ (విక్రమ్ రాథోడ్) అండ్ టీమ్ హైజాక్ చేస్తారు. ఆ టీమ్‌లో ప్రియమణి, మాన్య మల్హౌత్రతో పాటు మరో నలుగురు ఉంటారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఒక జవాన్ (షారుక్ ఖాన్) మెట్రోను ఎందుకు హైజాక్ చేశాడు. .? ఆ హైజాక్ సీన్లోకి ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇచ్చిన నయనతారకు (నర్మద) ఎలాంటి సంఘటనలు ఎదురౌతాయి..? విక్రమ్ రాథోడ్ కోసం ఆ అమ్మాయిలు ఎందుకు పనిచేశారు..? వెపన్స్ డీలర్‌గా ఉన్న విజయ్ సేతుపతితో ఆర్మీలో పని చేస్తున్న విక్రమ్ రాథోడ్‌కు ఎక్కడ విరోదం మొదలౌతుంది..? ఒక జవాన్‌పై దేశ ద్రోహి అనే ముద్ర పడటం వెనుక జరిగిన కథ ఏంటి..? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. యాక్షన్ రివేంజ్ సినిమాలు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అనేకం వచ్చాయి. కానీ ఇందులో మెసేజ్ ఓరియేంటేడ్ రివేంజ్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కించాడు. అన్ని సినిమాల మాదిరే దేశం కోసం ప్రాణాలు ఆర్పించే సైనికుడికే నష్టం జరిగితే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ కథకు మూలం. డైరెక్టర్ అట్లీ తమిళ హీరో విజయ్‌తో తెరి, మెర్సిల్, బిగిల్ వంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి బాలీవుడ్లో అవకాశం దక్కించుకున్నాడు. ఆ మూడు సినిమాల మాదిరే జవాన్‌లో కూడా మంచి మెసేజ్‌ను ఇచ్చాడు. ముఖ్యంగా ఇందులో సినిమా ప్రారంభంలో మెట్రో హైజాక్ సీన్ చాలా బాగుంటుంది. ఆ సీన్లో విక్రమ్ రాథోడ్‌తో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి మధ్య వచ్చే సీన్లు జవాన్‌కు ప్లస్ అవుతాయి. ఎందుకంటే కథలో మేజర్ సీన్లు ఇవే. ఫస్టాఫ్‌లో సినిమాకు ఇవే బలం. దేశంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు ఏంటో గుర్తు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఎలా ఉందో దర్శకుడు చెప్పిన విధానం ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుంది. ఇలాంటి పలు సోషియల్ ఇష్యూలతో జవాన్ మొదటి భాగం ఉంటుంది. అవన్నీ కూడా గతంలో పలు సినిమాల్లో చూసినట్లు అనిపిస్తున్నా... షారుక్ నటన, యాక్షన్స్ సీన్స్ ముందు అవన్నీ ఆడియన్స్ పెద్దగా పంటించుకోరు. మెట్రో హైజాక్ చేసింది విక్రమ్ రాథోడ్ అయితే.. ఈ విషయంలో జైలర్‌గా ఉన్న ఆజాద్‌ను నయనతార అరెస్ట్ చేయాలని భావిస్తుంది. ఆ సమయంలో విక్రమ్ రాథోడ్, ఆజాద్‌కు ఉన్న బంధాన్ని ప్రియమణి రివీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. ఇంటర్వెల్‌కు ముందు నుంచి జరిగే ఈ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. కానీ సెకండాఫ్‌లో కూడా మంచి యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అయినా తర్వాత కొంత నెమ్మదిస్తుంది. అక్కడక్కడా వచ్చే కొన్ని సీన్స్ అంతగా పండించవనే చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆజాద్ జైలర్ అయితే విక్రమ్ రాథోడ్ ఒక జవాన్ ఇద్దరూ కూడా దేశం కోసం పనిచేస్తున్నవారే.. కానీ ఒక 'జవాన్' తన ప్రాణాలకు తెగించి యుద్ద రంగంలో పాల్గొన్నప్పుడు.. శత్రువు కూడా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఎదురుదాడి చేస్తాడు. ఇలాంటి సమయంలో 'జవాన్' చేతిలో ఉన్న గన్ పనిచేయకపోతే ఏం జరుగుతుంది..? దేశం కోసం రణరంగంలోకి దిగిన 'జవాన్' ప్రాణాలు పోతాయి. సేమ్ 'జవాన్' సినిమాలో కూడా ఇదే జరుగుతుంది. ఈ సన్నివేశం తీసిన విధానం చాలా బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. విక్రమ్ రాథోడ్, ఆజాద్ పాత్రలో షారుక్ ఖాన్ దుమ్ములేపారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్క్రీన్ ప్రంజెంటేషన్కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. యాక్షన్ సీన్స్‌తో పాటు సెంటిమెంట్ సీన్స్ పండించడంలో షారుక్ ఎక్కడా తగ్గలేదు. జవాన్‌తో నయనతార బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆజాద్‌కు భార్యగా, మరో బిడ్డకు తల్లిగా, ఒక పోలీస్ ఆఫీసర్‌గా సూపర్బ్ అనిపించేలా తనదైన మార్క్ నటనతో మెప్పించింది. కానీ షారుక్ ఖాన్‌తో ఆమె జోడీ అంతగా హైలెట్ కాలేదు. విక్రమ్ రాథోడ్‌కు భార్యగా దీపికా పదుకోన్ కొంత సమయం పాటు కనిపించినా సినిమాకు ప్లస్ అయ్యేలా మెప్పిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కాళీ గైక్వాడ్‌గా విజయ్ సేతుపతి హవా ఎక్కువగా ఉంటుంది. జవాన్ అతనికి బాలీవుడ్లో రెండో సినిమా... ఈ సినిమాతో ఆయనకు అక్కడ మార్కెట్ పెరగడం ఖాయం. సినిమాలో విలన్ రోల్‌తో పాటు అక్కడక్కడ మంచి కామెడీ పంచ్‌లు కూడా ఆయన నుంచి ఉంటాయి. అవి ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తాయి. చివర్లో సంజయ్ దత్ కామియో రోల్లో కనిపించి మెప్పిస్తాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం డైరెక్టర్ అట్లీ స్క్రీన్‌ప్లే అని చెప్పవచ్చు కథ పాతదే అయినా తను రాసుకున్న కథ తీరు ఆడియన్స్‌ను ఎక్కడా బోర్ కొట్టిన ఫీల్ ఉండదు. విజువల్స్‌తో పాటు భారీ యాక్షన్ సీన్స్ హై రేంజ్లో ఉంటాయి. ఇందులో అనిరుధ్ అందించిన మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్ వరకు బాగున్నా ... హీరో ఎలివేషన్‌తో పాటు పలు సీన్స్‌లలో ఆయన నుంచి ఆశించినంత స్థాయిలో మ్యూజిక్ ఉండదు. ప్రతి సన్నివేశం రిచ్‌గా ఉండేలా కెమెరామెన్ పనితనం కనిపిస్తుంది. ఎడిటర్ పనితీరు కొంతమేరకు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి. -బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్ -
క్రికెట్ మ్యాచ్‌లో 'జవాన్' ప్లాన్: అట్లీ
ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం జవాన్. దీనికి కారణాలెన్నో. ముఖ్యంగా పఠాన్ వంటి సంచలన విజయం సాథించిన చిత్రం తరువాత తెరపైకి వస్తున్న చిత్రం ఇది కావడం. అదేవిధంగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ దీనికి దర్శకుడు కావడం. లేడీ సూపర్‌స్టార్ నయనతార జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం. క్రేజీ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం, తమిళ నటుడు విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం, దీపికా పదుకునే గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నేడు (సెప్టెంబర్ 7) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మీడియాతో ముచ్చటిస్తూ తాను బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఊహించలేదన్నారు. దీనికి కర్త, కర్మ, క్రియ బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్నేనని పేర్కొన్నారు. ఆయన నమ్మకమే జవాన్ చిత్రం అని పేర్కొన్నారు. ఒకసారి క్రికెట్ మ్యాచ్ చూడడానికి చైన్నె వచ్చినప్పుడు షారూఖ్‌ఖాన్ తన కార్యాలయాలనికి వచ్చారన్నారు. తామిద్దరం సుమారు మూడున్నర గంటలు మాట్లాడుకున్నామని చెప్పారు. అప్పుడే జవాన్ చిత్రానికి బీజం పడిందని చెప్పారు. రూ.350 కోట్లు బడ్జెట్లో చిత్రం చేయడానికి సిద్ధమయ్యామన్నారు. కరోనా కాలంలో షారూఖ్‌ఖాన్ ధైర్యం చేసి ఈ చిత్రాన్ని నిర్మించారని చెప్పారు. అయితే తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. అలా నటి నయనతార, విజయ్‌సేతుపతి, యోగిబాబు, సంగీత దర్శకుడు అనిరుధ్, ఎడిటర్ రూపన్ ఇలా అందరినీ తానే ఈ చిత్రంలోని తీసుకున్నానని చెప్పారు. అయితే చిత్రం అన్ని వర్గాలను అలరించే విధంగా రూపొందించాలన్నదే లక్ష్యంగా భావించామన్నారు. జవాన్ చిత్రం అందరికీ సంతృప్తికరంగా వచ్చిందన్నారు. పఠాన్ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత వస్తున్న చిత్రం కాబట్టి ఆ చిత్రాన్ని రీచ్ అవుతుందా? అన్న విషయం గురించి ఆలోచించలేదన్నారు. ఒక మంచి చిత్రం చేయాలన్న ధ్యేయంతోనే జవాన్ చిత్రం చేశామని అట్లీ చెప్పారు. -
తిరుమలలో షారుక్, నయనతార- విఘ్నేష్ శివన్ జంట
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో నేడు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని షారుక్ ఖాన్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ దర్శించుకున్నారు. వారితో పాటు హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు షారుక్ ఖాన్‌కు స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. జమ్మూలోని వైష్ణో దేవి ఆలయాన్ని కూడా ఈ మధ్యే షారుఖ్ దర్శించుకున్న విషయం తెలిసిందే.. తిరుమల ఆలయ సంప్రదాయ దుస్తుల్లో తెల్లటి పంచె, షర్ట్‌ను షారుఖ్ ధరించగా.. తన కూతురు సుహానా ఖాన్ కూడా తెల్లటి చుడీదార్లో మెరిశారు. అలాగే నటి నయనతార- విఘ్నేష్ శివన్ దంపతులు కూడా తెల్లటి దుస్తుల్లో ఉన్నారు. (ఇదీ చదవండి: బిగ్ బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా..?) OTT విడుదల వివరాలు షారుక్ ఖాన్ నటించిన జవాన్ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా 7 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోవడంతో సినిమాపై క్రేజ్ పెరిగింది. జవాన్ విడుదలకు మరో రెండు రోజుల సమయం ఉంది. ఇలా చిత్ర బృందం భారీ ప్రచారం చేస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 7 నుంచి OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయనున్నట్లు సమాచారం. బాహుబలి, కేజీఎఫ్ రికార్డులు బద్దలే... జవాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రీ-టికెట్ బుకింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించారు. టిక్కెట్లు కూడా భారీగా అమ్ముడుపోయాయి. అలాగే 'జవాన్' విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేయనుంది. మొదటి రోజు రూ. 70 నుంచి 75 కోట్ల రూపాయల బిజినెస్ చేయనుందని టాక్. దీని ద్వారా బాహుబలి 2 (రూ. 58 కోట్లు), కేజీఎఫ్ 2 (రూ. 61 కోట్లు), పఠాన్ (రూ. 55 కోట్లు) రికార్డులను అధిగమిస్తారు. #ShahRukhKhan visited #Tirumala for blessing of lord venkateswara before #Jawan Release.#Jawan7thSeptember2023 pic.twitter.com/IiTjBy2MYU — Film Blocks (@FilmBlocks) September 5, 2023 #WATCH | Andhra Pradesh: Actor Shah Rukh Khan, his daughter Suhana Khan and actress Nayanthara offered prayers at Sri Venkateshwara Swamy in Tirupati pic.twitter.com/KuN34HPfiv — ANI (@ANI) September 5, 2023 SRK , offered prayers at Sri Venkateshwara Swamy in Tirupati 🙏🏻❤️ The most secular man on this planet 🇮🇳🙏🏻#ShahRukhKhan pic.twitter.com/J1c01of5Qu — 𝐁𝐚𝐛𝐚 𝐘𝐚𝐠𝐚 (@yagaa__) September 5, 2023 -
నేనూ ఒకమ్మాయిని ప్రేమించాను.. ఇదే విషయం ఆమెకు చెప్తే..: విజయ్ సేతుపతి
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పఠాన్ చిత్రం తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం జవాన్. ఆయన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ దర్శకుడు అట్లీ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయకిగా నటించగా విజయ్ సేతుపతి, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు నటి దీపికా పడుకొనే అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న జవాన్ చిత్రం ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: kushi Twitter Review: ‘ఖుషి’ మూవీ ట్విటర్ రివ్యూ) ఈ సందర్భంగా జవాన్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రాన్ని ఎనిమిది నెలలు పూర్తి చేయాలని ప్రణాళికను సిద్ధం చేశామని అయితే కరోనా తదితర కారణాల వల్ల మూడేళ్లు పట్టిందని చెప్పారు. అదే సమయంలో చిత్రం మరింత బ్రహ్మాండంగా రూపొందిందని, ఖర్చు కూడా భారీగా పెరిగిందన్నారు. అందుకు షారుక్ ఖాన్ ఎంతగానో సహకరించారని అట్లీ చెప్పారు. షారుక్ ఖాన్‌తో కలిసి నటించడం మంచి అనుభవమని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. తాను పాఠశాలలో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించానని అయితే అది వన్ సైడ్ లవ్ అని చెప్పారు. ఆ అమ్మాయి మాత్రం తాను నటుడు షారుక్ ఖాన్ వీరాభిమానినని ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పిందన్నారు. అప్పటినుంచి తనకు షారుక్ ఖాన్‌పై పగ ఏర్పడిందన్నారు. ఆ పగను ఈ చిత్రంలో తీర్చుకున్నానని సరదాగా అన్నారు. (ఇదీ చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు రజనీకి మరో చెక్ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?) షారుక్ ఖాన్ మాట్లాడుతూ నటుడు విజయ్ సేతుపతి ఇంతకు ముందు చెప్పినట్లుగా తనపై ప్రతీకారం తీర్చుకోలేరని కారణం ఆయన తనకు అభిమాని అని పేర్కొన్నారు. జవాన్ చిత్రంలో నటించడంతో దక్షిణాది సినిమా గురించి చాలా నేర్చుకున్నానని షారుక్ ఖాన్ చెప్పారు. కాగా చైన్నెలో జవాన్ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పాల్గొనడానికి వచ్చిన షారుక్ ఖాన్‌కు నటుడు కమలహాసన్ వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. -
ఆస్పత్రిలో భార్య.. షూటింగ్ ఆపేయమన్న షారుక్: అట్లీ
ప్రపంచ వ్యాప్తంగా షారుక్ ఖాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం జవాన్. ఈ సినిమాను తమిళ హిట్ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కించాడు. దీంతో ఈ సినిమా కోసం బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. జవాన్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని లుక్‌లో ఈ సినిమాలో షారుక్ కనిపించనున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో కథానాయిక. విజయ్ సేతుపతి విలన్ రోల్ పోషిస్తుండగా, దీపికా పదుకొణె కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తోంది. (ఇదీ చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార ఎంట్రీ.. ఫాలో అయ్యేది ఆ ఐదుగురిని మాత్రమే) దర్శకుడు శంకర్‌తో కో-డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన అట్లీకి జవాన్ ఐదవ చిత్రం కానున్నడం విశేషం. 'రాజా రాణి'తో అట్లీ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాక దళపతి విజయ్‌తో వరుసగా మూడు చిత్రాలు థెరి, మెర్సల్, బిగిల్ భారీ విజయాలు సాధించాయి. దీని తర్వాత అట్లీ జవాన్‌ను ప్రకటించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో వేదికపై అట్లీ ప్రసంగం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. నటి ప్రియను వివాహం చేసుకున్న అట్లీ సుమారు ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. జవాన్ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న సమయంలో తన భార్య గర్భం దాల్చిన విషయాన్ని షారుక్ ఖాన్‌కు తెలిపినప్పుడు ఆయన ఎలా స్పందించాడో తాజాగ అట్లీ గుర్తుచేసుకున్నాడు. 'జవాన్ షూటింగ్ కోసం నేను అమెరికాకు చేరుకున్నాను. ఈలోపు తాను గర్భం దాల్చినట్లు ప్రియా ఫోన్ చేసి తెలిపింది. ఎనిమిదేళ్ల తర్వాత గర్భం దాల్చినందున మూడు నెలల పాటు ప్రయాణం చేయవద్దని వైద్యులు సూచించారు. పూర్తిగా బెడ్ రెస్ట్ అన్నారు. అప్పటికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి మూడు రోజులే అయింది. దీంతో ప్రియాను అమెరికాకు రమ్మని చెప్పలేకపోయాను ఏం చేయ్యాలో తెలియక ఈ విషయాన్ని షారుఖ్ ఖాన్‌కి చెప్పగా, వెంటనే షూటింగ్ ఆపేయమని, కొద్దిరోజులు వెయిట్ చేస్తానని చెప్పాడు. షారుక్ చెప్పిన మాటను ప్రియతో తెలుపగా.. షూటింగ్ ఆపవద్దని చెప్పడమే కాకుండా తన పనులు తానే చూసుకుంటానని చెప్పింది. అలాంటి కష్ట సమయంలో కూడా సినిమా పనులపై దృష్టి పెట్టమని ఆమె నన్ను ప్రోత్సహించింది. ప్రియా అందించిన ఆ సహకారమే నా విజయ రహస్యం' అని వేదికపై అట్లీ అన్నారు. తన కష్ట సమయంలో షారుక్ ఏంతో ధైర్యాన్ని ఇచ్చాడని, తండ్రి స్థానంలో షారుక్ ఎప్పుడూ తనవెంటే ఉన్నారని ఆట్లీ ఎమోషనల్ అయ్యాడు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ఆందోళన చెందనని అట్లీ తెలిపాడు. కాగా, గత జనవరిలో వీరికి మగబిడ్డ జన్మించాడు. అట్లీ, ప్రియా నవంబర్ 2014 లో వివాహం చేసుకున్నారు. ఇక అట్లీ భార్య ప్రియా కొన్ని తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రియా నటించి తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. నా పేరు శివ, యముడు లాంటి సినిమాల్లో ప్రియా నటించింది. 10years back , we were shooting near #ShahRukhKhan sir home , I stood near his gate and clicked a pic. Now his home gate opened for me and Shah Rukh sir stood at the gate to welcome me ! You are more than my father , my everything sir . #Atlee pic.twitter.com/ulmjyaSOzN — iamsrksneha (@iamsrkian000) August 30, 2023 -
పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత.. తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్
ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి ప్రియ మోహన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్చేస్తూ.. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రెగ్నెంట్. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి అంటూ ఇన్‌స్టాలో పోస్టును షేర్ చేసింది. ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న అట్లీ- ప్రియలు 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత అట్లీ దంపతులు పేరెంట్స్‌గా ప్రమోట్ కాబోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార, నాజ్రియా, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన రాజారాణి సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు అట్లీ. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో 'జవాన్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
షారుఖ్‌తో సినిమా.. ముంబైలో ఆఫీస్ వెతుకుతున్న డైరెక్టర్
‘జీరో’ సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ చేసే సినిమాకు దర్శకుడు ఎవరు? అంటే... తమిళ దర్శకుడు అట్లీ పేరు బాగా వినిపించింది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో ‘పఠాన్’ సినిమా ఆరంభించారు షారుఖ్. ఈ చిత్రం తర్వాత రాజ్‌కుమార్ హిరాణీ, రాజ్ అండ్ డీకే దర్శకత్వాల్లో సినిమాలు ఉంటాయనే కథనాలు బాలీవుడ్లో వినిపించాయి. దీంతో షారుఖ్ – అట్లీ కాంబినేషన్ సినిమా దాదాపు లేనట్లే అని చాలామంది అనుకున్నారు. అయితే ఆగస్టు నుంచి ఈ సినిమా ప్రారంభం కానుందనే వార్త తాజాగా ప్రచారంలోకొచ్చింది. అంతేకాదు... ఇకపై ఎలాంటి కన్ఫ్యూజన్, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని అట్లీ కూడా కొంతకాలం ముంబైలోనే ఉండాలని అనుకుంటున్నారట. ఇందుకోసం ఆఫీస్ వెతుకుతున్నారట. అయితే ఇంత సడన్‌గా వీరి సినిమా తెరపైకి రావడానికి కారణం దర్శకులు రాజ్‌కుమార్ హిరాణీ, రాజ్ అండ్ డీకేలతో షారుఖ్ సినిమాలు లేకపోవడమే అనే ప్రచారం బీ టౌన్లో వినిపిస్తోంది. మరి... ‘పఠాన్’ తర్వాత షారుఖ్ ఏ దర్శకుడితో సినిమాని పట్టాలెక్కిస్తారో చూడాలి. -
విజయ్ సినిమా షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం
అన్నానగర్: చెన్నైలో గురువారం నటుడు విజయ్ సినిమా షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం ఏర్పడింది. వివరాలు.. విజయ్ నటిస్తున్న 63వ సినిమాను డైరెక్టర్ అట్లి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా నయనతార నటిస్తోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నై మీనంబాక్కంలోని బిన్నిమిల్లు ప్రాంతంలో ఆలయం, ఆస్పత్రి, మెడికల్ దుకాణాలు, పాఠశాల సెట్ వేశారు. కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతూ వచ్చింది. ఈ స్థితిలో గురువారం మధ్యాహ్నం సమయంలో షూటింగ్ కోసం కొత్తగా సెట్ వేసే పనిలో కార్మికులు నిమగ్నమయ్యారు. ఇనుప కమ్మీలను వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు అక్కడున్న ఎండిన ఆకులపై పడి మంటలు వ్యాపించాయి. క్రమంగా మంటలు సెట్ అంతటా వ్యాపించాయి. వెంటనే కార్మికులు అక్కడినుంచి పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమండలంగా మారింది. దీనిపై సమాచారం అందుకున్న గిండి, తాంబరం, శానిటోరియం ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి సుమారు నాలుగు గంటల సేపు పోరాడి మంటలను అదుపుచేశారు. గురువారం సినిమా షూటింగ్ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. అగ్నిప్రమాదంలో రూ. లక్షల విలువైన సామగ్రి, సినిమా సెట్ కాలి బూడిదయ్యాయి. దీనిపై మీనంబాక్కం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
విజయ్ను వెంటాడుతున్న చోరీ కేసులు
పెరంబూరు: ఇళయదళపతి విజయ్ను విజయాలు వరిస్తున్నా, కథల చోరీ కేసులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన నటించిన కత్తి చిత్రం నుంచి నిన్నటి సర్కార్ వరకూ కథల చోరీ కేసులు, కోర్టులు, పంచాయితీలు జరుగుతూనే ఉన్నాయి. సర్కార్ చిత్ర కథ విషయంలో చోరీ జరిగిందని కథా రచయితల సంఘం అధ్యక్షుడు వెల్లడించడం పెద్ద వివాదానికే దారి తీసింది. అంతే కాదు ఆ చిత్ర దర్శకుడు మురుగదాస్ పిటీషన్‌దారుడికి కొంత మొత్తాన్ని చెల్లించుకోక తప్పలేదని కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. అంతకు ముందు కత్తి చిత్రం విషయంలోనూ కథ చోరీ ఆరోపణలు ఎదురయ్యాయి. తాజాగా విజయ్ నటిస్తున్న చిత్రం కూడా కథ చోరీ ఆరోపణలను ఎదుర్కొంటోంది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయకి. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్‌ను నిర్విరామంగా జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో సెల్వ అనే లఘు చిత్రాల దర్శకుడు విజయ్ నటిస్తున్న 63వ చిత్ర కథ తనదంటూ చెన్నై హైకోర్టుకెక్కారు. అందులో మహిళా ఫుట్‌బాల్ క్రీడ ఇతి వృత్తంతో కూడిన కథను తాను 265 పేజీలు రాసుకున్నానని తెలిపారు. ఆ కథను పలువురు నిర్మాతలకు వినిపించానని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు అట్లీ ఈ కథను నటుడు విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్నారన్న వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. చిత్ర షూటింగ్‌పై నిషేధం విధించాలని పిటీషన్లో కోరారు. ఈ కథ చోరీ కేసుపై ఈనెల 23వ తేదీన కోర్టులో విచారణ జరగనుంది. కాగా పిటీషన్‌దారుడు దర్శకుడు అట్లీని, నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థను, కథా రచయితల సంఘాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఈ పిటీషన్‌పై తగిన వివరణ ఇవ్వాల్సిందిగా ఏజీఎస్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. -
రాజా రాణి మూవీ స్టిల్స్
-
రాజా రాణి' ఆడియో ఆవిష్కరణ