అట్లీ నిర్మాతగా స్టార్‌ హీరోతో సినిమా ప్లాన్‌ | Atlee Kumar And Vijay Sethupathi Movie Plan | Sakshi
Sakshi News home page

అట్లీ నిర్మాతగా స్టార్‌ హీరోతో సినిమా ప్లాన్‌

Published Fri, Apr 5 2024 11:27 AM | Last Updated on Fri, Apr 5 2024 11:39 AM

Atlee Kumar And Vijay Sethupathi Movie plan - Sakshi

భారతీయ సినీ పరిశ్రమలో మారుమోగుతున్న పేరు అట్లీ. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యువ దర్శకుడు నిర్మాతగానూ సక్సెస్‌పుల్‌ చిత్రాలను చేస్తున్నారు. రాజారాణీ చిత్రంతో తన దర్శక పయనాన్ని సక్సెస్‌పుల్‌గా మొదలుపెట్టిన అట్లీ ఆ తరువాత విజయ్‌ హీరోగా మెర్సిల్‌, తెరి, బిగిల్‌ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించారు. ఇక ఇటీవల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి షారూఖ్‌ఖాన్‌ 'జవాన్‌' సినిమాతో సెన్సేషనల్‌ హిట్‌ కొట్టారు. నయనతార, దీపికాపడుకొనే హీరోయిన్లుగా నటించిన ఇందులో విజయ్‌సేతుపతి విలన్‌గా అదరగొట్టారు. ఈ చిత్రం రూ.వెయ్యి కోట్లు వసూలు చేసింది.

కాగా ప్రస్తుతం దర్శకుడు అట్లీ టాలీవుడ్‌పై దృష్టి సారించారు. స్టార్‌ హీరో అల్లుఅర్జున్‌ హీరోగా పాన్‌ ఇండియా చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. ఇందులో నటి త్రిష ఒక నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జోరందుకుంది. దీన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుందని, గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మాణంలో భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అల్లు అర్జున్‌ పుట్టిన రోజు అయిన ఈ నెల 8వ తేదీన వెల్లడించనున్నట్లు తాజా సమాచారం.

కాగా దర్శకుడు అట్లీ ఏ ఫర్‌ యాపిల్‌ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి, ఇంతకు ముందు నటుడు జీవా హీరోగా సంగిలి బుంగిలి కదవ తొర అనే విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. తాజాగా తన శిష్యుడు కలీస్‌కు దర్శకత్వం అవకాశం కల్పించి, హిందీలో బేబీజాన్‌ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది తమిళ చిత్రం తెరి కి రీమేక్‌ అన్నది గమనార్హం. ఇందులో వరుణ్‌ దావన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నటి కీర్తీసురేష్‌ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు.

కాగా తాజాగా తమిళంలో మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో నటుడు విజయ్‌సేతుపతి హీరోగా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి అట్లీ డైరెక్టర్‌ కాదట.. నిర్మాతగా మాత్రమే ఉండనున్నారట. దీనికి 'నడువుల కొంచెం కానోమ్‌' చిత్రం ఫేమ్‌ బాలాజీ ధరణీధరన్‌ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. కాగా దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement